tv actress
-
Sunandha Mala Setti: స్వర్ణగిరిని సందర్శించిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మాకు బాబు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న దేవోలీనా భట్టాచార్జీ తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. డిసెంబర్ 2022లో తన జిమ్ ట్రైనర్ షానవాజ్ షేక్‌ను వివాహం చేసుకుంది.బాలీవుడ్లో దేవోలీనా భట్టాఛార్జీ పలు సీరియల్స్‌లో నటించింది. తాను చివరిసారిగా 'కూకి' అనే సీరియల్లో కనిపించింది. అంతకుముందు హిందీ బిగ్‌బాస్ సీజన్-2006లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. హిందీలో సాత్ నిబానా సాథియా అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు దేవోలీనా. ఆ తర్వాత యో హై మోహబ్బతీన్, స్వీట్ లై, చంద్రకాంత, తేరే షహర్ మే, శుభ్ వివాహ్ లాంటి సీరియల్స్‌లో నటించారు. View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
చీరలో చూడముచ్చటగా సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫోటోలు)
-
కోలీవుడ్ బుల్లితెర నటి మణి మేఘలాయి నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
నా ప్రపంచంలో నాకు నేనే రాణి : అంకిత లోఖండే (ఫోటోలు)
-
గ్లామర్ డాల్‌లా విష్ణుప్రియ.. భలే క్యూట్ (ఫొటోలు)
-
బుల్లితెర నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?
కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శోభిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికి తరలించనున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. కాగా.. అంతకుముందు కన్నడ నటి శోభిత తాను నివాసముంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. అయితే గతేడాది హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను పెళ్లాడింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్‌లో ఆమె నివాసముంటున్నారు. అయితే శోభిత పెళ్లి తర్వాతే సినిమాలకు, సిరీయల్స్‌కు దూరమైంది. సూసైడ్ నోట్ స్వాధీనం..శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్‌ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్‌కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం..
-
విషాదం.. అనుమానాస్పదస్థితిలో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. పలు కన్నడ సీరియల్స్‌లో నటించిన ఆమె సూసైడ్‌కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం శోభిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.(ఇది చదవండి: నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్)కన్నడ సీరియల్స్‌లో నటిస్తోన్న శోభిత తన భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. అయితే శోభిత మృతిపై కారణాలను ఆమె కుటుంబసభ్యులు వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి తర్వాత సినిమాలకు, సీరియల్స్‌కు శోభిత. దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శోభిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బ్రహ్మగంతు సీరియల్‌తో గుర్తింపు శాండల్‌వుడ్‌లో బ్రహ్మగంతు సీరియల్ ద్వారా శోభిత శివన్న పాపులారిటీ తెచ్చుకుంది. గతేడాది మే 22న పెళ్లి చేసుకున్న శోభిత ఆ తర్వాత బుల్లితెరకు దూరమైంది. అయితే తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.కర్ణాటకలోని సకలేష్‌పూర్‌కి చెందిన శోభిత మొదట్లో రాజ్ మ్యూజిక్ ఛానల్లో వీజేగా పనిచేసింది. ఆ తర్వాత మంచి ఆర్టిస్ట్‌గా సినిమాలతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. కన్నడ సీరియల్ బ్రహ్మగంతులో విలన్ పాత్రలో మెరిసిన శోభిత.. నీనిదలే అనే సీరియల్లో కూడా నటించింది. అంతేకాకుండా ఇతర భాషా సీరియల్స్‌లో కూడా కనిపించింది. బుల్లితెరతో పాటు అటెంప్ట్ టు మర్డర్, జాక్‌పాట్ సినిమాల్లోనూ నటించింది. కన్నడలో శతభిషే అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు షాకింగ్‌కు గురయ్యారు. -
సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా!
బుల్లితెర నటి రూపాలీ గంగూలీ.. తమను రాచిరంపాన పెట్టిందని ఆరోపించింది ఆమె సవతి కూతురు ఈషా. తండ్రిని తమకు కాకుండా చేయడమే కాకుండా తల్లిని, తమను మానసిక క్షోభకు గురి చేసిందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలా బాహాటంగా తనపై విమర్శలు చేసినందుకుగానూ రూపాలీ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసింది. అది తనను మరింత బాధించిందంటోంది ఈషా.నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ఈ మేరకు సుదీర్ఘ పోస్టుల్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ నెల ప్రారంభంలో నా వ్యక్తిగత స్టోరీని మీతో పంచుకున్నాను. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కానీ ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్.. ఎందుకంటే ఏళ్లుగా నాలో గూడుకట్టుకున్న బాధను మీతో పంచుకున్నాకే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికింది. స్వేచ్ఛ లభించినట్లయింది.నటి రూపాలీ గంగూలీ, సవతి కూతురు ఈషానా అనుభవాన్ని చెప్పాఎవరికో ఇబ్బంది తలపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అనుభవాలు నన్నెలా మార్చాయన్నదే చెప్పాలనుకున్నాను. నిజాయితీగా ఉన్నదున్నట్లు మాట్లాడాను. 2013 ఫిబ్రవరిలో రూపాలీ.. మా నాన్నను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో కొడుకును కన్నది. అప్పుడు మీడియా వీళ్ల గురించి కథలు కథలుగా రాసింది కానీ నేనెక్కడా మాట్లాడలేదే. ఇప్పుడు నేను కేవలం నా అనుభవాన్ని చెప్పాను.నిజం మాట్లాడితే శిక్షిస్తారా?అయినా నిజం మాట్లాడితే శిక్షిస్తారా? వాళ్ల రియాక్షన్ చూసి ఎంతో బాధపడ్డాను. మీ ప్రవర్తనతో మరోసారి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నా ఫ్యామిలీ వివాదం గురించి ఇకపై మాట్లాడాను. ఏ ఇంటర్వ్యూలోనూ పాల్గొనను. ఇక నా జీవితం గురించే నేను ఆలోచిస్తాను అని ఈషా రాసుకొచ్చింది.చదవండి: హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్‌తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్‌లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
యంగ్ హీరోతో రీతూ చౌదరి 'న్యూ బిగినింగ్' (ఫొటోలు)
-
క్యాస్టింగ్ కౌచ్.. 16 ఏళ్ల వయసులోనే చేదు అనుభవం: నటి
నీకు ఛాన్సిస్తే నాకేంటి? అన్న ధోరణి ఎప్పటినుంచో ఉంది. కెమెరా ముందు నటించాలని కలలు గన్న ఎంతోమందికి ఎప్పుడో ఓసారి ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. కొందరు అలాంటి డిమాండ్లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తే మరికొందరు తమ కల కోసం తల వంచేందుకు మొగ్గుచూపుతారు.16 ఏళ్ల వయసులో చేదు అనుభవంఅయితే 16 ఏళ్ల వయసులో తనకూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైందంటోంది బిగ్‌బాస్ బ్యూటీ రష్మీ దేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్.. ఒకానొక సమయంలో నేనూ ఫేస్ చేశాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. ఆడిషన్ ఉందని పిలిస్తే వెళ్లాను. అక్కడున్న వ్యక్తి నేను స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్నాఅప్పటికే నాకు అక్కడంతా అసౌకర్యంగా అనిపించడంతో ఎలాగోలా ఆ గది నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాను. కొన్ని గంటల తర్వాత జరిగిందంతా అమ్మకు చెప్పాను. ఆ మర్నాడు అమ్మతో కలిసి అతడి దగ్గరకు వెళ్లాను. అమ్మ అతడి చెంప చెళ్లుమనిపించి గుణపాఠం చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే ఉంది. ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా మంచీచెడు రెండూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది.సీరియల్స్‌తో ఫేమస్కాగా రష్మీ దేశాయ్.. కన్యాదాన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కబ్ హోయ్ గవ్నా హమర్ చిత్రంతో భోజ్‌పురి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఉత్తరన్, దిల్సే దిల్ తక్ సీరియల్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఖత్రోన్ కె ఖిలాడీ, నాచ్ బలియే 7, ద ఖత్ర ఖత్ర షో, బిగ్‌బాస్ 13, బిగ్‌బాస్ 15వ సీజన్లలోనూ పాల్గొంది. -
బుల్లితెర నటిపై తీవ్ర ఆరోపణలు.. దెబ్బకు వీడియో డిలీట్!
బాలీవుడ్లో బుల్లితెర స్టార్ రూపాలీ గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్స్ చేసింది. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈషా కామెంట్స్‌పై నటి రూపాలీ గంగూలీ పరువునష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ రూ.50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు)డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ..'ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్లిద్దరే రౌడీలు. వారు నేను ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు.. నన్ను బాధపెట్టాలని చూశారు. వారు నన్ను విమర్శించడానికి నా బలహీనతలను ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని" మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కాగా.. అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి రుహి చతుర్వేది ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. కుండలి భాగ్య సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న రుహి చతుర్వేది నటుడు శివేంద్ర ఓం సాయినియోల్ను పెళ్లాడింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. వీరికి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత గర్భం ధరించినట్లు వెల్లడించారు.రుహి చతుర్వేది తన ఇన్‌స్టాలో రాస్తూ..' మా అందమైన కుటుంబం ఇంకాస్త పెద్దగా అవుతోంది. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. రుహి చతుర్వేది, సైనియోల్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు.కాగా.. ఆమె కుండలి భాగ్య సీరియల్లో షెర్లిన్ ఖురానా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు రుహి మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2010 పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత 2012లో ఆలాప్ అనే సినిమాతో నటనలో ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా ఖత్రోన్ కే కిలాడీ సీజన్-13లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. మరోవైపు ఆమె భర్త శివేంద్ర చోటి సర్దానీ అనే సీరియల్లో నటించారు. View this post on Instagram A post shared by Ruhi Chaturvedi (@ruhiiiiiiiiii) -
ఆధ్యాత్మిక శోభ : భర్తతో కలిసి బిగ్‌బాస్ నటి సంప్రదాయపూజలు
-
మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.పేరెంట్స్ బెడ్రూమ్లో తిష్టఅప్పటికీ మా నాన్న ఎక్స్(ట్విటర్)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్న బెడ్‌పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.సీరియల్లో హీరోయిన్.. బయట విలన్నాన్న-రూపాలీ ఎఫైర్ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలుబలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Esha Verma (@eshav.official) చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మాళవిక, తేజస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీపై పోస్టులు పెడుతూనే ఉంటోంది. బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా.. మాళివిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
పట్టు చీరలో అందమే అసూయపడేలా తేజస్విని గౌడ (ఫొటోలు)
-
లేటు వయసులో పెళ్లి.. 'తండ్రి దొరికినందుకు పిల్లలు హ్యాపీ'
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్‌తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్‌లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి నటించారు.ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.ఇద్దరూ నటులేకాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది. -
ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోని ఓ రిసార్ట్‌లో వివాభ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.ఎవరీ సురభి జ్యోతి?పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్బాజ్, కోయి లౌట్కే ఆయా హై సీరియల్స్‌లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్‌లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేశాడు.అప్పటి నుంచే లవ్సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) చదవండి: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ -
ప్రియుడితో నటి నిశ్చితార్థం, పెళ్లెప్పుడంటే?
కన్నడ బుల్లితెర నటి మాన్సీ జోషి శుభవార్త చెప్పింది. త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రియుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆదివారం (అక్టోబర్ 20న) నిశ్చితార్థం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలిపారు.ఇకపోతే ఈ బ్యూటీ దేవత సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్ నుంచి నటి వైష్ణవి తప్పుకోగా.. ఆ స్థానాన్ని మాన్సీ భర్తీ చేసింది. ఈమె ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలో పారు, రాధా రమణ వంటి సీరియల్స్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) -
గ్రీన్ డ్రెస్‌లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించిన బుల్లితెర నటి
బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది ఆశా నేగి. పదేళ్లుగా టీవీ ఇండస్ట్రీలోనే రాణిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో కోఆర్డినేటర్స్ ఉండేవాళ్లు. ఏదైనా అవకాశాలున్నాయంటే వీళ్లే చెప్పేవాళ్లు. అలా ఓ వ్యక్తి నాకు తారసపడ్డాడు. కొన్నింటికి ఓకే చెప్పాలంటూ..తనతో మీటింగ్ కూడా అయింది. అప్పుడు నాకు ఇరవై ఏళ్లు. టెలివిజన్ ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది.. ఇక్కడ కొన్నింటికి ఓకే చెప్పాల్సి వస్తుంది. అప్పుడే నీకు ఎదుగుదల ఉంటుంది. పెద్ద పెద్ద టీవీ స్టార్లు కూడా ఈ పద్ధతిలోనే పాపులారిటీ తెచ్చుకున్నారు అన్నాడు. అతడి ఉద్దేశం ఏంటో అర్థమైంది. ఆసక్తి లేదన్నాతను చెప్పినట్లే చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందీ అంటే అలాంటి కెరీర్ నాకు వద్దే వద్దనుకున్నాను. నాకు ఏమాత్రం ఆసక్తి లేదని అతడి ముఖం మీదే చెప్పాను. ఈ సంఘటనను నా ఫ్రెండ్‌తో షేర్ చేసుకున్నా.. ఇలాంటివి సర్వసాధారణం అని చాలా సింపుల్‌గా అనేశాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఆశా నేగి పవిత్ర రిష్తా సీరియల్లో పూర్వీ దేశ్‌ముఖ్‌గా పేరు తెచ్చుకుంది. బారిష్, హనీమూన్ ఫోటోగ్రాఫర్ వెబ్ సిరీస్‌లలోనూ నటించింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బుల్లితెర నటికి చికెన్ గున్యా
బుల్లితెర నటి మహి వీజ్ అనారోగ్యం పాలైంది. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకు చికెన్ గున్యా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈమేరకు హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.లైఫ్‌లోనే కఠినమైన రోజులు..కాగా కొద్ది రోజుల క్రితం నటి.. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని పేర్కొంది. ఈమేరకు ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. ఈ పది రోజులు నా జీవితంలోనే ఎంతో కఠినతరమైనవి. నాకన్నీ చేసిపెట్టే నాన్న ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వీలైనంతవరకు నేను తనతోనే ఉంటున్నాను. అతడు తిరిగి మామూలుగా నడిచేందుకు ఎంకరేజ్ చేస్తున్నాను. తెలుగులో హీరోయిన్గా..పేరెంట్స్‌కు పిల్లలను చూస్తేనే సగం జబ్బు నయమైపోతుంది. నా తండ్రి కోసం నెలల తరబడి ఆయన వెన్నంటే ఉంటున్నందుకు గర్వంగా ఉంది. నీ వెంట నేనున్నాను నాన్నా.. లవ్యూ అని రాసుకొచ్చింది. మహి వీజ్.. తెలుగులో తపన అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలికా వధు, లాగి తుజ్సే సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. 2011లో జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు పుట్టింది. అలాగే రాజ్వీర్ అనే బాబును పెంచుకుంటున్నారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: ఆదిత్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వాళ్ల కంటే ఎక్కువే!