
సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ కష్టాన్ని కూడా పంచుకున్నవారే అసలైన ఆప్తులు. ఈ విషయంలో తాను చాలా లక్కీ అంటోంది బుల్లితెర నటి హీనా ఖాన్ (Hina Khan). క్యాన్సర్‌తో పోరాడుతున్న తనను ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal) చంటిపాపలా చూసుకుంటున్నాడని చెప్తోంది. తినిపించడం, టాబ్లెట్స్ వేయడం, నడిపించడం.. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాడంది. ఇలాంటి ప్రేమికుడు దొరికినందుకు పొంగిపోతోంది.
మాటలు సరిపోవు
రొమ్ము క్యాన్సర్ (స్టేజ్ 3)తో పోరాడుతున్న హీనా ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. అతడి పేరెత్తినప్పుడు తన గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. నాకోసం ఎంతో చేశాడు. ఎల్లప్పుడూ చేయి పట్టుకునే నడిపించాడు. తనెప్పుడూ అంతే.. నాకోసమే ఆలోచిస్తాడు. ఎంత మంచి మనిషో కదా! తనను తలుచుకుంటేనే సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ప్రతి అమ్మాయికి ఇలాంటి అబ్బాయి దొరకాలి.
అతడు ప్రేమించినంతగా నేను ప్రేమించలేను
రాకీ నాకు 12 ఏళ్లుగా తెలుసు. నా ఫస్ట్ షోలో తొలిసారి అతడిని కలిశాను. ఏడునెలలపాటు ఫ్రెండ్స్‌గా ఉన్నాం. తర్వాత మాది స్నేహం కాదని ప్రేమని తెలుసుకున్నాం. మేము ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు. కానీ ఓ రోజు ఆత్మీయంగా హగ్ ఇచ్చుకున్నప్పుడు మా మధ్య ఉన్న బంధం బలపడిందని అర్థం చేసుకున్నాం. మేము జంటగా ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్లం. నా క్యాన్సర్ అతడిని ఎంతో బాధించింది. నేనెప్పుడూ అతడికి ఒకటే చెప్తుంటాను.. నువ్వు ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేను అని! దానికి అతడు గర్వంగా ఫీలవడు, కనీసం అవునని కూడా ఒప్పుకోడు. నేను ఎక్కువగా ఏం చేశానని? అని అమాయకంగా అడుగుతుంటాడు అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది.
చదవండి: ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి
Comments
Please login to add a commentAdd a comment