వెర్రి వేయిరకాలంటారు. ముఖ్యంగా కొందరు వీరాభిమానుల ప్రవర్తన వెర్రితనంలాగే కనిపిస్తుంది. అందుకు హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ చెప్పిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం హీనా ఖాన్ నటించిన నామాకూల్ అనే వెబ్ సిరీస్ అమెజాన్ మినీటీవీలో ప్రసారమవుతోంది. అందులో అందరూ ఇష్టపడే టీచర్ పాత్రను పోషించింది.
కన్నార్పకుండా చూసేది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఇబ్బందికర సంఘటనను పంచుకుంది. ఓ ప్రాజెక్ట్ కోసం ఉత్తరాఖండ్ షూటింగ్‌లో పాల్గొన్నాను. అది జనాలు తిరుగుతూ ఉండే ప్రదేశం. ఒక అమ్మాయి రోజూ అక్కడికి వచ్చి నన్ను కన్నార్పకుండా చూస్తుండేది. తనను గమనించి పిలిచి మాట్లాడాను. తనతో కాసేపు కాలక్షేపం చేశాను. కానీ కొద్దిరోజులకు తను అలాగే చూస్తూ ఉండటం నాకు కొంత అసౌకర్యంగా అనిపించింది.
ఇబ్బందిపడ్డా..
పూర్తిగా నా మీదే దృష్టి పెట్టకుండా కాస్త చుట్టుపక్కల కూడా చూడమని నా టీమ్‌తో చెప్పించాను. నేను ఇబ్బందిపడుతున్నానని అర్థమవడంతో వెంటనే వెళ్లిపోయింది. కానీ మర్నాడే సెట్‌కు వచ్చింది. ఆరోజు నేను బాధాకరమైన సీన్‌లో నటించాలి. ఏడుస్తూ ఉన్నాను. కాసేపటికి టిష్యూతో కళ్లు తుడుచుకుని దాన్ని చెత్తబుట్టలో పడేశాను. వెంటనే ఆ అమ్మాయి డస్ట్‌బిన్ అంతా వెతకడం మొదలుపెట్టింది.
భయపడిపోయా
నేను వాడిన టిష్యూను అందులో నుంచి తీసుకుని జాగ్రత్తగా తన వద్ద పెట్టుకుంది. ఆమె అలా చేయడం చూసి నేను షాకయ్యాను.. చెప్పాలంటే భయపడ్డాను కూడా! అభిమానం ఉండొచ్చు, కానీ దానికి కూడా హద్దులుండాలి అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. కాగా యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో గుర్తింపు పొందిన హీనా ఖాన్ కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్‌లోనూ అలరించింది.
చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్‌గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ
Comments
Please login to add a commentAdd a comment