Hina Khan
-
క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు
సంపద, సంతోషం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ కష్టాలు, బాధలో ఉన్నప్పుడే అయినవాళ్లెవరో, కానివాళ్లెవరో తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాళ్లు చాలా తక్కువమంది. కానీ హీనా ఖాన్‌కు.. ఆమె కష్టాన్ని తన కష్టంగా భావించే ప్రియుడు దొరికాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న నటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.నాకోసం గుండు కొట్టించుకున్నావ్..ఇంత మంచి భాగస్వామి దొరకడం నా అదృష్టం అంటూ ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal)ను పొగుడుతూ ఓ పోస్ట్ షేర్ చేసింది హీనా ఖాన్ (Hina Khan). నాకు తెలిసిన మంచి వ్యక్తి ఇతడే! ట్రీట్మెంట్లో భాగంగా నేను గుండు చేయించుకున్నప్పుడూ అతడూ గుండు కొట్టించుకున్నాడు. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడే తన జుట్టు పెరగనిస్తానన్నాడు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వంద కారణాలు చెప్పి వెళ్లిపోయే అవకాశం ఉన్నా నాతోనే ఉన్నాడు. నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. జీవితకాలమంత అనుభవాన్ని మేము ఇప్పటికే పోగు చేసుకున్నాం.కరోనా సమయంలోనూ నాతో..సంతోషకర, బాధాకర సందర్భాల్లో కలిసున్నాం. మా తండ్రుల్ని కోల్పోయినప్పుడు ఇద్దరమూ ఏడ్చాం. ఒకరినొకరం ఓదార్చుకున్నాం. కరోనా సమయంలోనూ కలిసే ఉన్నాం. అప్పుడు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతడికి వైరస్ సోకకపోయినా నాతోపాటే కలిసున్నాడు. మూడు మాస్కులు ధరించి నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. క్యాన్సర్ బారిన పడ్డప్పుడు కూడా నా చేయి వదల్లేదు. అన్నీ వదిలేసి నాతోనే ఉంటున్నాడు.(చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్)సరైన దారిలోనే వెళ్తున్నా..ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల్ని అడగాలి.. ఇలా అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలా అతడు సూచించిన కరెక్ట్ డైరెక్షన్లోనే నేను అడుగులు వేస్తున్నాను. కీమో థెరపీ ప్రారంభించినప్పటి నుంచి నా బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. నాకు డ్రెస్సింగ్ చేయడం, తినిపించడం.. ఇలా అన్నీ తనే చేస్తున్నాడు. నా చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించాడు. గడిచిన రెండు నెలలు నాకెంతో నేర్పాయి.బాధపెట్టి ఉంటే క్షమించునా జీవితంలో నువ్వు నాకు దొరికిన అద్భుతానివి. నన్ను ధైర్యంగా నిలబడమన్నావ్.. నన్ను నేను ప్రేమించుకోమన్నావ్.. ఆందోళనను వదిలేసి ప్రశాంతంగా శ్వాస తీసుకోమన్నావ్.. నీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నేను నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు. మనం కలిసి నవ్వుకునేవాళ్లం, ఏడ్చేవాళ్లం, ఒకరి కన్నీటిని మరొకరు తుడిచేవాళ్లం.. అప్పటికీ, ఇప్పటికీ ఇదే జరిగింది. భవిష్యత్తులో కూడా మన మధ్య ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.గతేడాది క్యాన్సర్ బారిన పడ్డ నటిఇతడు దేవుడు పంపిన ఆశీర్వాదం అని హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి మంచి వ్యక్తి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీరు ఎప్పటికీ ఇలాగే కలిసుండాలని కామెంట్లు చేస్తున్నారు. టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కెరీర్లో పుంజుకుంటున్న సమయంలో క్యాన్సర్ హీనా ఖాన్‌పై దాడి చేసింది. గతేడాది నుంచి మూడో దశ బ్రెస్ట్ క్యాన్సర్‌తో నటి పోరాడుతోంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: పెళ్లిరోజు నాడే గుడ్‌న్యూస్.. తల్లిదండ్రులైన టాలీవుడ్ జంట -
‘సానుకూల శక్తి’కి నిలువెత్తు నిదర్శనం ఆమె..!
చెడు కాలం చెప్పి రాదు. కెరీర్లో బిజీగా ఉన్న టైమ్‌లో అలాంటి కాలం ఒకటి బాలీవుడ్ నటి హీనాఖాన్‌కు వచ్చింది. అయితే అది చెడు కాలం అని ఆమె అనుకోలేదు. ‘ఇది పరీక్ష కాలం’ అని మాత్రమే అనుకుంది. పరీక్షకు నిలబడాలంటే ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహమే శక్తి అవుతుంది. ఉత్సాహం దండిగా ఉన్న హీనాఖాన్ ఆ పరీక్షను తట్టుకొని నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ గ్లోబల్ లిస్ట్–2024’లో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల్లో హీనాఖాన్ 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎంతో మంది ఖాన్‌ను అభినందిస్తున్నారు. ఆమె మాత్రం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘చాలా మంది నన్ను అభినందించడం చూస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఇది విజయం, గర్వించదగిన విషయం అనుకోవడం లేదు’ అని రాసింది. ఆరోగ్య సవాళ్ల కంటే వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పింది ఖాన్.‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ అనే సీరియల్లో అక్షర పాత్రలో నటించి పాపులారిటీని పెంచుకున్న ఖాన్ బిగ్ బాస్, ఖత్రోస్ కే ఖిలాడీలాంటి రియాలిటీ షోలలో పాల్గొని పాపులారిటీని మరింత పెంచుకుంది. జూన్ 2024లో రొమ్ము క్యాన్సర్ గురించి బహిరంగంగా వెల్లడించింది హీనాఖాన్. ‘ఇది సవాలుతో కూడినది అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. చికిత్స ఇప్పటికే మొదలైంది. దీని నుంచి మరింత బలంగా బయటపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్న ఖాన్ తన చికిత్స గురించి, తన ఛాలెంజింగ్ జర్నీ గురించి ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో అప్డేట్స్ పంచుకుంటోంది. వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలని హీనాఖాన్ కోరుకుంటున్నప్పటికీ క్లిష్టమైన సమయాల్లో ఆమె చూపిన ధైర్యానికి ఎంతో మంది అభిమానులు అయ్యారు. సినిమా కష్టాలు ఖాన్‌కు నిజంగానే వచ్చినప్పటికీ సానుకూల శక్తితో పెదవులపై చిరునవ్వు కోల్పోలేదు.గుండెలో ధైర్యం కోల్పోలేదు.అందుకే నటిగానే కాదు ‘సానుకూల శక్తి’ విషయంలోనూ హీనాఖాన్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘హీనాఖాన్ అసాధారణ ధైర్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. కారుచీకట్లో కూడా కాంతిని కనుగొనే సామర్థ్యం ఆమెలో ఉంది’ అంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు.ఎంత బిజీగా ఉంటే అంత సంతోషంగా ఉంటాను!మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయి. మంచి రోజుల్లో ఎలా ఉన్నా చెడు రోజుల్లో మాత్రం ఉత్సాహంగా ఉండాలి. ఆ ఉత్సాహమే సానుకూల శక్తి ఇస్తుంది. సానుభూతి మాటలు విని బేలగా మారిపోకూడదు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. నాకు ఖాళీగా కూర్చోవడం కంటే పని చేయడం, బిజీగా ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది.– హీనాఖాన్ (చదవండి: భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!) -
అందం, ఆత్మవిశ్వాసం కలగలిసిన నటి హీనాఖాన్ (ఫోటోలు)
-
క్యాన్సర్‌తో నటి పోరాటం.. ఇప్పుడు తినడానికి కూడా కష్టంగా..!
క్యాన్సర్‌తో పోరాడటం అంత ఈజీ కాదు. అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ మహమ్మారిని జయించే దిశగా పోరాడుతోంది హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్. ప్రస్తుతం తనకు రొమ్ము క్యాన్సర్ మూడో స్టేజీలో ఉండటంతో వెంటనే కీమో థెరపీ ప్రారంభించారు.సైడ్ ఎఫెక్ట్స్అయితే వరుస కీమోథెరపీల వల్ల తన శరీరంపై కాలిన మచ్చలు ఏర్పడటంతో పాటు తాజాగా మ్యుకోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. కీమో థెరపీ చేయించుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టే మ్యుకోసైటిస్. వైద్యుల సూచన మేరకు దానికి కూడా చికిత్స తీసుకుంటున్నాను. మీలో ఎవరికైనా దీన్ని ఎలా నివారించాలో తెలిస్తే దయచేసి నాకు సాయం చేయండి. సలహా ఇవ్వండిఎందుకంటే భోజనం కూడా చేయలేకపోవడం చాలా కష్టం కదా! మీరు ఇచ్చే సలహాలు నాకెంతో మేలు చేస్తాయి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వైద్యుల చికిత్సనే ఫాలో అయిపో.. పొరపాటున సొంత ప్రయోగం వికటించిందంటే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది అని కొందరు హెచ్చరించారు.మ్యుకోసైటిస్ అంటే..కీమోథెరపీ దుష్ప్రభావాల్లో మ్యుకోసైటిస్ అనేది ఒకటి. దీనివల్ల గొంతు, నోరు, అన్నవాహిక, కడుపు, పేగుల్లో ఉండే శ్లేష్మపొరలు వాచిపోతాయి. నోటిలో అల్సర్లు కూడా కనిపిస్తాయి. దీనివల్ల ఆహారం తినలేరు, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు. కొందరికైతే నోటి నుంచి రక్తం కూడా వస్తుంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న 'డాన్' దర్శకుడు -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్‌కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్‌ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్‌ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్‌స్టా్రగామ్ ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్‌లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్‌ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్‌ను లేదా ఫ్రిస్బీ ప్లేట్‌ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
తనే నిజ జీవితంలో ఒక సూపర్ పవర్: బుల్లితెర నటి ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. హీనా ఖాన్‌కు ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీ ఉండడంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. ఇటీవలే ఆమెకు కీమోథెరపీ కూడా చేశారు. ఇలాంటి సమయంలో అమ్మ ప్రేమ తనపై చూపించిన ప్రేమను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.హీనా ఖాన్ తన ఇన్‌స్టాలో.. 'మనకు ఏదైనా జరిగిన తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో నాకు అర్థమైంది. తన పిల్లలకు ప్రేమ, సాంత్వన అందించడానికి ఎంత బాధనైనా భరిస్తుంది. నా రోగం గురించి తెలుసుకున్న రోజు ఆమె అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. కానీ ఆమెనే నన్ను పట్టుకుని తన బాధను మరచిపోయేందుకు యత్నించింది. తల్లులే ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక సూపర్ పవర్. ఆమె ముందు ప్రపంచం కూడా చిన్నదే. ఆమె తన చేతుల్లో నన్న ఓదార్చి నాకు బలాన్ని ఇవ్వడానికి ఎంతో తపన పడింది' అంటూ పోస్ట్ చేసింది. తల్లి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.కాగా.. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో ఫేమస్ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ మెప్పించింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) -
క్యాన్సర్‌తో పోరాటం.. మీకు ఈ కాలిన మచ్చలే కనిపిస్తున్నాయా?: నటి
బుల్లితెర నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. కానీ కూతురికి క్యాన్సర్ రావడాన్ని తట్టుకోలేని ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్‌కు ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీలో ఉంది. దీంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. కీమోథెరపీ చేశారు. ఇందుకోసం జుట్టు కత్తిరించారు.శరీరంపై గాయాలుఫస్ట్ కీమోథెరపీ అయిపోయిందంటూ నటి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. అందులో హీనా చేతి కింద, మెడపైన కాలిన మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'ఈ ఫోటోలో మీకు నా శరీరంపై ఉన్న మచ్చలు కనిపిస్తున్నాయా? లేదా నా కళ్లలోని ఆత్మవిశ్వాసం కనిపిస్తోందా? ఈ కాలిన మచ్చలను చూసి నేనేం బాధపడటం లేదు. నువ్వు ఒక ఫైటర్ఎందుకంటే చికిత్స విజయవంతంగా ముందుకు సాగుతుందనడానికి ఇదే నిదర్శనం. నా కళ్ల ద్వారా విజయకాంతిరేఖలను చూడగలుగుతున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వొక ఫైటర్‌వి.. జాగ్రత్తగా ఉండు హీనా అని కామెంట్లు చేస్తున్నారు.కెరీర్..కాగా హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో ఫేమస్ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ మెప్పించింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: ఓటీటీలో రియల్‌స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ -
హీనా ఖాన్ ధైర్యంగా ఉండు.. నువ్వో వారియర్‌వి: సమంత
బాలీవుడ్ ప్రముఖ నటి హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా హీనా ఖానే ఓ వీడియోలో పేర్కొంది. దీంతో ఇండస్ట్రీలోని పెద్దలు ఆమెకు ధైర్యాన్ని అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా హీనాఖాన్‌కు మానసిక ధైర్యాన్ని అందించింది.(చదవండి: ప్రభాస్‌కి చాలా సిగ్గు.. టికెట్ కొనిచ్చి థియేటర్‌కి పంపాడు: హంసనందిని) ‘నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా ఉండు’ అంటూ హీనా ఖాన్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘వారియర్’ అనే హ్యాస్ ట్యాగ్‌ని జోడించింది. సమంత పోస్ట్‌కు హీనా రిప్లై ఇచ్చింది. ‘సమంత మీరు అన్నిట్లోనూ స్టార్. జీవితంలో వచ్చే సవాళ్లను మీరు ఎదుర్కొనే తీరు అద్భుతం. మీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమ, ఆశీర్వచనాలకు ధన్యవాదాలు’ అని హీనా ఖాన్ రాసుకొచ్చింది.కాగా, సమంత కూడా ఆ మధ్య అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి.. ఇటీవల కోలుకుంది. తనకొచ్చిన వ్యాధిని దాచి పెట్టకుండా.. అందరికి తెలియజేసి..అవగాహన కలిపించింది. అంతేకాదు ఎంతో ధైర్యంగా ఉండి.. మంచి చికిత్స తీసుకోవడం కారణంగానే త్వరగా కోలుకుంది. సామ్ బాటలోనే హీనా ఖాన్ కూడా తనకొచ్చి వ్యాధి గురించి ధైర్యంగా బయటి ప్రపంచానికి తెలియజేసింది. మానసికంగా దృఢంగా ఉంటూ త్వరలోనే వ్యాధిని జయిస్తానని, ఈ కష్ట సమయంలో అందరు తోడుగా ఉండాలని కోరింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) -
నటికి ఎంత కష్టమొచ్చింది.. క్యాన్సర్ మూడో స్టేజ్! (ఫోటోలు)
-
క్యాన్సర్ బారిన పడిన ప్రముఖ నటి.. ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ హిందీ నటి హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడింది. మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో ప్రస్తుతం తాను బాధపడుతున్నానని బయటపెట్టింది. అలానే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుని తిరిగి మామూలు మనిషి అవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఈమె ఇన్ స్టాలో ఇప్పుడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె?(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో)జమ్ము కశ్మీర్లో పుట్టి పెరిగిన హీనా ఖాన్.. 2009 నుంచి నటిగా కొనసాగుతోంది. 'హే రిస్తా క్యా ఖేల్తా హై' సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టింది. దీని తర్వాత ఫియర్ ఖత్రోంకి ఖిలాడీ 8, బిగ్ బాస్ 11 రియాలిటీ షోల్లో పాల్గొంది. నాగిన్ 5, షద్యంత్రా తదితర సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి ఆకట్టుకుంది. పలు సీరియల్స్‌లో అతిథి పాత్రలు చేసింది. ఓ అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీసులు కూడా చేసింది.సీరియల్ నటిగా కొనసాగుతున్న టైంలోనే ప్రొడ్యూసర్ రాకీ జైశ్వాల్‌ని ప్రేమించి అతడిని 2014లో పెళ్లి చేసుకుంది. ఇకపోతే తనకు ఆస్తమా ఉన్నట్లు ఓ షోలో బయటపెట్టింది. ఇప్పుడు తాను మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు రివీల్ చేసింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరలో పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగొస్తానని చెప్పుకొచ్చింది. దీంతో ఈమె త్వరగా కోలుకోవాలని సహా నటీనటులు కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?) View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) -
నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి
వెర్రి వేయిరకాలంటారు. ముఖ్యంగా కొందరు వీరాభిమానుల ప్రవర్తన వెర్రితనంలాగే కనిపిస్తుంది. అందుకు హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ చెప్పిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం హీనా ఖాన్ నటించిన నామాకూల్ అనే వెబ్ సిరీస్ అమెజాన్ మినీటీవీలో ప్రసారమవుతోంది. అందులో అందరూ ఇష్టపడే టీచర్ పాత్రను పోషించింది.కన్నార్పకుండా చూసేదితాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఇబ్బందికర సంఘటనను పంచుకుంది. ఓ ప్రాజెక్ట్ కోసం ఉత్తరాఖండ్ షూటింగ్లో పాల్గొన్నాను. అది జనాలు తిరుగుతూ ఉండే ప్రదేశం. ఒక అమ్మాయి రోజూ అక్కడికి వచ్చి నన్ను కన్నార్పకుండా చూస్తుండేది. తనను గమనించి పిలిచి మాట్లాడాను. తనతో కాసేపు కాలక్షేపం చేశాను. కానీ కొద్దిరోజులకు తను అలాగే చూస్తూ ఉండటం నాకు కొంత అసౌకర్యంగా అనిపించింది. ఇబ్బందిపడ్డా..పూర్తిగా నా మీదే దృష్టి పెట్టకుండా కాస్త చుట్టుపక్కల కూడా చూడమని నా టీమ్‌తో చెప్పించాను. నేను ఇబ్బందిపడుతున్నానని అర్థమవడంతో వెంటనే వెళ్లిపోయింది. కానీ మర్నాడే సెట్‌కు వచ్చింది. ఆరోజు నేను బాధాకరమైన సీన్లో నటించాలి. ఏడుస్తూ ఉన్నాను. కాసేపటికి టిష్యూతో కళ్లు తుడుచుకుని దాన్ని చెత్తబుట్టలో పడేశాను. వెంటనే ఆ అమ్మాయి డస్ట్‌బిన్ అంతా వెతకడం మొదలుపెట్టింది. భయపడిపోయానేను వాడిన టిష్యూను అందులో నుంచి తీసుకుని జాగ్రత్తగా తన వద్ద పెట్టుకుంది. ఆమె అలా చేయడం చూసి నేను షాకయ్యాను.. చెప్పాలంటే భయపడ్డాను కూడా! అభిమానం ఉండొచ్చు, కానీ దానికి కూడా హద్దులుండాలి అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. కాగా యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో గుర్తింపు పొందిన హీనా ఖాన్ కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్‌లోనూ అలరించింది.చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్‌గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ -
చిల్లర లేదన్న నటి.. యాచకుడి మాటలకు షాక్!
అమ్మా.. ధర్మం చేయండమ్మా.. బాబూ, దానం చేయండయ్యా.. అంటూ ప్లేటు పట్టుకుని తిరిగే యాచకులు ఎందరో! చిల్లర లేదని చెప్పినా సరే కొందరు వినిపించుకోకుండా డబ్బులివ్వమని పట్టుపడతారు. ఇచ్చేవరకు వదిలిపెట్టరు. అయితే బిగ్‌బాస్ బ్యూటీ, నటి హీనా ఖాన్‌కు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైందట. డబ్బులివ్వమన్నాడు 'నేను కారులో వెళ్తున్నప్పుడు ఓ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ వ్యక్తి నా కారు విండో తట్టాడు. డబ్బులివ్వమని అడిగాడు. అయ్యో, నా దగ్గర క్యాష్ లేదని బదులిచ్చాను. అతడు వెంటనే.. ఈరోజు ఉదయం నుంచి బోణీ కాలేదు.. ఇంట్లో తమ్ముడు, చెల్లె ఉన్నారు అంటూ అభ్యర్థించాడు. నిజంగానే నా దగ్గర డబ్బుల్లేవు.. అంటూ సారీ కూడా చెప్పాను. అతడు వెంటనే గూగుల్ పే చేయండంటూ తన నెంబర్ ఇచ్చాడు. నేను ఒక్కసారిగా షాకయ్యాను. వారానికి సరిపడా ఒక వారం రేషన్‌కు సరిపడా డబ్బులు పంపమని చెప్పాడు. వెంటనే అతడికి అవసరమయ్యేంత డబ్బు యూపీఐ ద్వారా పంపించాను. కానీ నిజంగానే సర్ప్రైజ్ కదా.. డిజిటల్ ఇండియా అంటే ఇదేనేమో!' అని చెప్పుకొచ్చింది. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో గుర్తింపు పొందింది. ఖత్రాన్ కె ఖిలాడీ 8వ సీజన్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. చదవండి: పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్‌పై పరువునష్టం దావా! -
బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో బాలీవుడ్ నటులైన హుమా ఖురేషి, కపిల్ శర్మ, హీనా ఖాన్లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షుల హోదాలో ముగ్గురు నటులను విచారించనున్నట్లు సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమాచారం ప్రకారం వీరు ముగ్గురూ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వీరు డబ్బును కూడా స్వీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహానికి కూడా కపిల్ శర్మ హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు) గడువు కోరిన రణ్‌బీర్ కపూర్! అయితే ఇప్పటికే అక్టోబర్ 6న అధికారుల ముందు హాజరు కావాలని నటుడు రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అయితే హాజరయ్యేందుకు రెండు వారాల మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది. అతని అభ్యర్థనపై ఈడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహదేవ్ యాప్‌కి సంబంధించిన ప్రమోషన్ల కోసం అతను అందుకున్న మొత్తం... అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల గురించి వివరణ కోరాలని ఈడీ భావిస్తోంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఏంటి? మహాదేవ్ బుక్ యాప్ అనేది ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా.. ఈ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరి 2023లో దుబాయ్‌లో తన వివాహ వేడుక కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత విలాసవంతంగా ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, అతీఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, కృష్ణ, అభిషేక్ సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. కాగా.. చంద్రాకర్.. మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌తో కలిసి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ముసుగులో బినామీ ఖాతాల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. (ఇది చదవండి: రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?) ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources (file pics) pic.twitter.com/rKXxUgtucl — ANI (@ANI) October 5, 2023 -
పబ్లిక్‌లో ఇలాంటి పనులా?.. నటిపై నెటిజన్స్ ట్రోల్స్
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న ముద్దుగుమ్మ ముంబయి విమానాశ్రయంలో హల్చల్ చేసింది. సమావేశాల అనంతరం ముంబయి చేరుకున్న భామకు బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికాడు. అదే సమయంలో ఈ జంట లిప్లాకక్తో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. (ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్) అంత త్వరగా ముద్దుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు రాస్తూ పబ్లిక్ ముందు ఇలా చేసినందుకు సిగ్గుపడండి అంటూ రాసుకొచ్చారు. వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. పబ్లిక్ ఇలాంటి పనులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కాగా.. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్‌పై బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఆమె మాట్లాడింది. గతంలో ఈ జంట బ్రేకప్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను హీనా ఖాన్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) హీనా ఖాన్ బాలీవుడ్ బుల్లితెర నటిగా ఫేమ్ తెచ్చుకుంది. యే రిష్తా క్యా కెహ్లతా హైలో అక్షరా, కసౌతి జిందగీ కే 2లో కొమొలికా పాత్రలో ఆమెకు గుర్తింపు దక్కింది. ఖత్రోన్ కీ కిలాడీ, బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోస్‌లో రన్నరప్‌గా నిలిచింది. #HinaKhan spotted at Mumbai Airport Rocky came to pick her 🧿💕❤️ @eyehinakhan @JJROCKXX #HiRo #HinaKhan #rRockyJaiswal #NachBaliye #NachBaliye10 #CoupleGoals #Couple #Love #Mumbai #Airport #MumbaiAirport #AirportFashion #Bollywood #BollywoodActress pic.twitter.com/hgECADd84t — hina_khanfc (@Mohamme37896951) May 24, 2023 -
బాయ్‌ఫ్రెండ్‌తో ప్రముఖ నటి బ్రేకప్.. క్లారిటీ ఇదే..!
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఆమె ప్రియుడితో బ్రేకప్ చేసుకుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది. సోషల్ మీడియాలో అభిమానులు పెద్దఎత్తున కామెంట్స్ చేయడంతో రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ప్రియుడు రాకీతో బ్రేకప్‌పై హీనా ఖాన్ స్పందిస్తూ.. ' బ్రేకప్ గురించి కొన్ని కథనాలు విన్నా. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మేం ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడు మా పట్ల దయతో ఉన్నారు. కానీ ఇది విని నా స్నేహితులు చాలా భయపడ్డారు. రాకీ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఇలాంటి వాటిని పట్టించుకోడు. నా స్నేహితులు చాలామంది ఈ విషయంపై ఆరా తీశారు.' అని అన్నారు. హీనా ఖాన్, చిత్రనిర్మాత రాకీ చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 'శడ్యంత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ షో ప్రమోషన్లలో భాగంగా ఇదంతా ప్రచారంలో వ్యూహమని నటి తెలిపింది. వీరిద్దరు యే రిష్తా క్యా కెహ్లతా హై షూటింగ్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. -
అలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి: ఆసక్తిగా హీరోయిన్ ట్వీట్
సినీ సెలబ్రెటీలు తమకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తి విషయాలను తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అంతేకాదు తమ హాట్‌హాట్, గ్లామరస్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ను కనువిందు చేస్తుంటారు. అలాగే ప్రముఖ బుల్లితెర నటి, బాలీవుడ్ హీరోయిన్ హీనా ఖాన్ సైతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలతో అలరించే ఆమె రీసెంట్గా చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. అయితే ఇందులో ఆమె ఎవరికో గట్టి వార్కింగ్ ఇచ్చింది. కానీ వారి పేరు, ఎవరన్నది మాత్రం ప్రస్తావించలేదు. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన దీంతో ఈ కామెంట్స్ ఎవురిని ఉద్దేశించి చేసిందో తెలియక ఆమె ఫాలోవర్స్ ఆలోచనలో పడ్డారు. ఇంతకి ఆ ట్వీట్ హీనా ఏం రాసుకొచ్చిందంటే.. ‘కొంచెం కూడా సున్నితత్వం, సభ్యత, మర్యాద లేని మనుషులు ఎన్నో విధాలుగా సరిహద్దులు తెలియకుండా మన జీవితంలోకి వచ్చేస్తుంటారు. వారు అవసరం లేకున్నా నీ పనిలో కలగజేసుకొని, నువ్వు బాధపడేలా చేస్తుంటారు. వారికంటూ లిమిట్ ఏం పెట్టుకోకుండా పక్కవారి జీవితాన్ని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారికి మనమే సరిహద్దు పెట్టాలి. వారికి దూరంగా ఉండాలి. సరిహద్దులు అనేవి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి’ అని పేర్కొంది. చదవండి: ‘నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు’ అయితే ఉన్నట్టుండి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇంతకి హీనా వార్కింగ్ ఎవరికి ఇచ్చింది? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా బుల్లితెర నటిగా సత్తా చాటిన ఆమె వెండితెరపై హీరోయిన్గా కూడా రాణిస్తోంది. అంతేకాదు పలు రియాలిటీ షో కంటెస్టెంట్ అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఆమె డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. పలు వెబ్ సిరీస్, చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తూ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. కాగా హీనా ఖాన్ గత కొంకాలంగా నిర్మాత రాఖీ జైస్వాల్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్లో కంటెస్టెంట్‌గా వెళ్లిన హీనాకు గెస్ట్ ఎపోసోడ్లో భాగంగా హౌజ్‌లోకి వచ్చిన రాఖీ జైస్వాల్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. Insensitive, rude, disrespectful people come in all forms and don’t know boundaries.. They are intrusive in your business and will say anything to hurt you..So my dear, set boundaries and get rid of those who cross the line..Boundaries protect your mental health you see 🤗 #Peace — Hina Khan (@eyehinakhan) June 8, 2022 -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్‌లో ఫిక్సయితే.. బ్లైండ్‌గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్‌తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. ఆంధ్ర ప్రదేశ్‌లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్‌గా రాజ్‌కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్‌ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్‌గా సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్‌తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్‌కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్‌లాంటి పాత్రలతో బాక్సాఫీస్‌పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
బుల్లితెర నటి కుటుంబం మొత్తానికి కరోనా!
హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి హీనా ఖాన్ కుటుంబం కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఆమె తరచూ మాస్కులు ధరించడం వల్ల తన ముఖంపై వచ్చిన ఎర్రటి మచ్చలు కనిపించేలా ఫొటో షేర్ చేసింది. 'ఈ రోజుల్లో జీవితం అన్నా ఇన్స్టాగ్రామ్ అన్నా.. ఏదైనా మంచి ఫొటోలు సమకూర్చుకోవడమే, దానికి అందరమైన విజువల్స్ యాడ్ చేయడమే. కానీ అది 2022కి వచ్చేసరికి పరిస్థితులు 2020 కంటే కూడా క్లిష్టంగా మారిపోయాయి' 'ఇంట్లో మీ ఒక్కరు మినహా ప్రతి ఒక్కరూ వైరస్ బారిన పడినప్పుడు మీరు నిరంతరం మాస్కు పెట్టుకునే ఉండి 24 గంటలు సానిటైజర్ వాడుతూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అలా రోజంతా మాస్కు పెట్టుకునే ఉండటంతో ముఖంపై ఇలా మచ్చలు వచ్చాయి' అని హీనా ఖాన్ పేర్కొంది. కోవిడ్‌ను నియంత్రించడానికి ఒక వారియర్‌లా పోరాడుతూనే ఉండాలని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్‌లో హీనాఖాన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
‘మా బంధం చెక్కు చెదరదు.. పెళ్లికి ఇంకా సమయం ఉంది’
ముంబై: తమ మనసులు ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటాయని, సమాజం కోసం హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నాడు రాకీ జైస్వాల్. నటి, బిగ్‌బాస్-11 రన్నరప్ హీనాఖాన్తో తనది చెక్కు చెదరని బంధమని, తామిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని పేర్కొన్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాకీ జైస్వాల్ సినీ రంగం మీద ఆసక్తితో ముంబైకి వచ్చి.. బుల్లితెర సీరియళ్లకు సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ‘‘యే రిష్తా క్యా కహెలాతా హై’’ (తెలుగు డబ్బింగ్- పెళ్లంటే నూరేళ్ల పంట) షూటింగ్ సమయంలో ఆ సీరియల్ హీరోయిన్ హీనా ఖాన్‌తో ప్రేమలో పడ్డాడు. బిగ్‌బాస్-11 సమయంలో రాకీ ప్రేమ ప్రతిపాదనకు ఆమె ఓకే చెప్పడంతో అప్పటి నుంచి ఇద్దరూ రిలేషన్షిప్లో కొనసాగుతున్నారు. ఇరువురి కుటుంబాలు సైతం సఖ్యతగా మెలగడంతో త్వరలోనే వీరి పెళ్లి బాజాలు మోగడం ఖాయమని బీ-టౌన్లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై స్పందించిన రాకీ జైస్వాల్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘‘చాలా ఏళ్లుగా మేం ప్రేమలో ఉన్నాం. పెళ్లి తర్వాత చాలా జంటలకు ఎదురయ్యే ఇబ్బందులు ఇప్పటికే మేం చవిచూశాం. మానసికంగా మేం ఒక్కటే. సమాజం దృష్టిలో అధికారికంగా భార్యాభర్తలమనే ట్యాగ్ కోసం హడావుడిగా పెళ్లి చేసుకోవడంలో అర్థం లేదు. పెళ్లి తర్వాత కూడా చాలా మందిలో అన్యోన్యత ఉండదు. పైకి మాత్రం అంతా బాగున్నట్లు చూపిస్తారు. మేం అలా కాదు. మా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. కెరీర్లో ముందుకు వెళ్లేలా పరస్పరం సహకరించుకుంటాం. వివాహానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి కెరీర్‌పై దృష్టి సారించాం’’ అని చెప్పుకొచ్చాడు. పలు హిందీ హిట్ సీరియళ్లలో నటించిన హీనా ఖాన్, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది. లైన్స్ మూవీతో హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకుంది. కాగా హీనా తండ్రి ఇటీవల మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ వీడియో షేర్ చేసిన హీనా భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: Neeraj Chopra: తను ఒలింపియన్ అయితే కావొచ్చు.. కానీ View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
హల్చల్ : సోహేల్‌ను ఎత్తుకున్న మెహబూబ్..పద్ధతి అంటున్న నిఖిల్
♦ స్వీట్ వాయిస్‌తో అలరిస్తోన్న హారిక ♦ బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్‌లో మహాతల్లి ♦ పద్ధతిగా అంటోన్న యూట్యూబర్ నిఖిల్ ♦ భార్యకు ప్రేమతో బర్త్‌డే విషెస్ తెలిపిన శేఖర్ మాస్టర్ ♦ సోహేల్‌ను ఎత్తుకున్న మెహబూబ్ ♦ భర్తను త్వరగా కోలుకోమంటున్న హీరోయిన్ నిత్య ♦ వీకెండ్‌కి రెడీ అంటోన్న అంకితా View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by NIKHIL VIJAYENDRA (@nikhiluuuuuuuuu) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by MsNegi (@ashanegi) View this post on Instagram A post shared by Nititaybawa (@nititaylor) View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) -
అమలాపాల్ సొగసులు, షనయా అందాలు..వణికిపోతున్న హీనా
♦ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న పూర్ణ ♦ సన్‌ఫ్లవర్ నేనే అంటున్న ఈషా రెబ్బ ♦ సన్ కిస్సింగ్ అంటున్న శివాత్మిక ♦ మంచులో వణికిపోతున్న హీనా ఖాన్ ♦ చూపులతో కవ్విస్తోన్న షనయా కపూర్ ♦ యోగా నేర్పుతానంటున్న శిల్పా శెట్టి ♦ గుడ్ల గూబల్ని చీరలో బంధించిన రష్మీ ♦ న్యూలుక్లో మతి పోగొడుతున్న అమలాపాల్ ♦ త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) View this post on Instagram A post shared by Shanaya Kapoor 🤎 (@shanayakapoor02) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
మీ అందరి ప్రార్థనలు నాకు ఎంతో అవసరం : నటి
ముంబై : హిందీ టెలివిజన్ నటి హీనా ఖాన్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. గత వారం క్రితమే గుండెపోటుతో ఆమె తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా హీనా ఖాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నాకు, నా కుటుంబ సభ్యులకు ఇది అత్యంత కష్టతరమైన సమయం. ఇలాంటి టైంలో నాకు కరోనా వచ్చిందని తేలింది. ఇంట్లోనే హాం క్వారంటైన్లో డాక్టర్ల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. ఇప్పుడు నాకు మీ అందరి ప్రార్థనలు ఎంతో అవసరం అంటూ పోస్ట్ చేసింది. ఇక తండ్రి మరణంతో కొన్ని రోజుల పాట సోషల్ మీడియాకు దూరంగా ఉన్న హీనా ఖాన్..తాజాగా ఈ కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఇక ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్. తొలి సీరియల్‌తోనే హీనా ఖాన్‌కు స్టార్ ఇమేజ్ దక్కింది. ఈ సీరియల్లో అక్షర పాత్రతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోతో మరింత ప్రచారం పొందారు. బిగ్‌బాస్11 సీజన్లో పాల్గొని రన్నరప్ నిలిచి సత్తా చాటారు. ఇక హీనా ఖాన్ నటించిన తొలి చిత్రం లైన్స్..కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by HK (@realhinakhan) చదవండి : తండ్రి మరణంతో ముంబైకు చేరుకున్న హీనా ఖాన్ సీనియర్ నటి భర్త, ప్రముఖ నిర్మాత మృతి -
టీవీ నటి హీనా ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం
ముంబై : ప్రముఖ టెలివిజన్ నటి హీనా ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హీనా ఖాన్ తండ్రి గుండెపోటుతో ఏప్రిల్ 20న కన్నుమూశారు. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే కశ్మీర్లో జరుగుతున్న షూటింగ్‌ను రద్దు చేసుకున్న హీనా ఖాన్ వెంటనే హుటాహుటిన ముంబైకు చేరుకుంది. హీనాఖాన్ తండ్రి మరణంపై పలువురు సన్నిహితులు, స్నేహితులు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ఇక ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్. తొలి సీరియల్‌తోనే హీనా ఖాన్‌కు స్టార్ ఇమేజ్ దక్కింది. ఈ సీరియల్లో అక్షర పాత్రతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోతో మరింత ప్రచారం పొందారు. బిగ్‌బాస్11 సీజన్లో పాల్గొని రన్నరప్ నిలిచి సత్తా చాటారు. ఇక హీనా ఖాన్ నటించిన తొలి చిత్రం లైన్స్..కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. చదవండి : ‘ముద్దు సీన్ గురించి అమ్మతో చర్చించాకే..’ ‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ -
‘ముద్దు సీన్ గురించి అమ్మతో చర్చించాకే..’
బాలీవుడ్ నటి హీనా ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 11 ఏళ్ల క్రితం ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్. ఆ తర్వాత బిగ్‌బాస్ షోతో మరింత ప్రచారం పొందారు. ఇక ఆమె నటించిన తొలి చిత్రం కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సత్తా చాటారు హీనా ఖాన్. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో తన ప్రయాణం గురించి హ్యూమన్స్ బాంబేతో పంచుకున్నారు హీనా ఖాన్. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నేను సనాతన కాశ్మీరీ కుటుంబం నుంచి వచ్చాను, అక్కడ నటన అనే మాట నిషిద్ధం. కాలేజీ చదువుల నిమిత్తం నన్ను ఢిల్లీ పంపేందుకు నా తల్లిదండ్రులు సందేహించారు. కానీ నాన్నను ఒప్పించి ఢిల్లీ వచ్చాను. ఆ సమయంలో ఓ స్నేహితురాలు సీరియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. నువ్వు వెళ్లు అని చెప్పింది. నేను నో చెప్పాను. కానీ తను వదలలేదు. అలా తన బలవంతం మీద నేను ఆడిషన్‌కి వెళ్లాను. తర్వాతి రోజే నేను సెలక్ట్ అయినట్లు కాల్ వచ్చింది’ అన్నారు. ‘అలా 20 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లాను. ఇల్లు వెతుక్కొవడంలో ప్రొడక్షన్ వాళ్లు నాకు ఎంతో సాయం చేశారు. ఇక నేను నటిస్తున్నాననే విషయం గురించి నాన్నతో చెప్పడానికి నాకు కొన్ని వారాలు పట్టింది. విషయం వినగానే ఆయన షాక్ అయ్యారు. అమ్మ స్నేహితులు, బంధువులు మా కుటుంబంతో బంధాలు తెంచుకున్నారు. కానీ నా సీరియల్ పాపులర్ అయ్యింది. కొన్నేళ్లపాటు టాప్‌లో కొనసాగింది. ఇక నాన్న కూడా అంగీకరించారు. కానీ చదువు కూడా కొనసాగించాలని కండిషన్ పెట్టారు. దాంతో బ్రేక్ టైంలో వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. అమ్మవాళ్లు ముంబైకి మారారు’ అన్నారు. (చదవండి: ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా) బిగ్‌బాస్ ఎంట్రీతో మొత్తం మారిపోయింది ‘అలా ఎనిమిది సంవత్సరాల పాటు సీరియల్లో కొనసాగాను. ఇలా ఉండగానే 2017లో బిగ్‌బాస్ 11 ఆఫర్ వచ్చింది. అయితే సీరియల్స్‌లో నటించే సమయంలో నేను ‘షార్ట్స్ వేసుకోను.. అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించనని’ కండిషన్స్ పెట్టాను. కానీ బిగ్‌బాస్ ఆఫర్ వచ్చేనాటికి నా సొంత నియమాలు రూపొందించుకున్నాను. ఇక మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూడ్డం ప్రారంభించారు. దాంతో నేను రాకీ గురించి వారికి చెప్పాను. ఇది విని కుటుంబంలో అందరు షాక్ అయ్యారు. కానీ చివరకు ఒప్పుకున్నారు. ఇప్పుడు మా అమ్మనాన్న నా కంటే ఎక్కువ తననే ప్రేమిస్తారు’ అని తెలిపారు. (చదవండి: పదేళ్లుగా డేటింగ్.. ఇప్పుడు బ్రేకప్) సినిమాల్లోకి వెళ్లే రిస్క్ చేశాను ‘ఇక టీవీ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న వేళ నేను ధైర్యం చేసి సినిమాల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాను. ఇక నా మొదటి చిత్రం గతేడాది జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికయ్యింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఆ తర్వాత ఓటీటీలోకి ప్రవేశించాను. ఇక స్క్రిప్ట్‌లో భాగంగా ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది. దీని గురించి అమ్మనాన్నలకు చెప్పి.. వారు అర్థం చేసుకుని అంగీకరించిన తర్వతే ఆ సీన్‌కి ఎస్ చెప్పాను. ఆ చిత్రం ఇప్పుడు ఆన్లైన్లో అత్యధిక మంది చూసిన చిత్రాల జాబితాలో చేరింది. నేను మొట్టమొదట కెమెరాను ఎదుర్కొని 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. శ్రీనగర్‌లో పుట్టిన చిన్నారి కేన్స్ వరకు వెళ్లడం గురించి నిజంగా ఊహించలేదు. కానీ కష్టమైన ఎంపికల శ్రేణి నన్ను ఇక్కడ వరకు నడిపించింది. శ్రీనగర్ నుంచి ముంబై వరకు చేరిన నా ప్రయాణంలో నా కుటుంబంలో.. మొదటి నటి నుంచి వేరే సమాజానికి చెందిన వారితో డేటింగ్ చేయడం వరకు నా స్వంత మార్గాన్ని నేనే ఏర్పాటు చేసుకున్నాను అని గర్వంగా చెప్పగలను’ అన్నారు హీనా ఖాన్. -
రియాపై వ్యాఖ్యలు: నాకైతే భయం లేదు!
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తికి తోటి నటీమణుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ కేసులో నిజానిజాలు తేలకముందే రియాను నిందితురాలిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బోల్డ్ నటి స్వరా భాస్కర్, టాలీవుడ్ సెలబ్రిటీ లక్ష్మీ మంచు, హీరోయిన్ తాప్సీ పన్ను తదితరులు రియాకు మద్దతుగా నిలబడుతున్నారు. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ కొనసాగుతున్న వేళ మీడియా కూడా సమాంతర విచారణ జరుపుతూ రియాను వేధింపులకు గురిచేయడం సరికాదంటూ హితవు పలికారు. తాజాగా టీవీ నటి హీనా ఖాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: సుశాంత్ జీవితం స్ఫూర్తిదాయకం: హీనా ఖాన్) ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘‘సీబీఐ విచారణ పూర్తి చేసి ఒక ముగింపునకు రానివ్వండి. ఇలాంటి నిందల వల్ల ఆమె కెరీర్ నాశనమయ్యే అవకాశం ఉంది. మీ కారణంగా తను ఎదుటివారికి ముఖం కూడా చూపించుకోలేని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’అని ఘాటు విమర్శలు చేశారు. ఇక అప్పటి నుంచి షరా మామూలుగానే హీనా ఖాన్ నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. సుశాంత్ మరణానికి కారణమైన రియాను ఎలా వెనకేసుకు వస్తారంటూ ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. (చదవండి: సుశాంత్ అనారోగ్యం గురించి ముందే తెలుసు) అంతేగాక హీనా అభిమానులు సైతం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన హీనా ఖాన్.. ‘‘నేనెప్పుడూ నిజం వైపే నిలబడతాను. నా అభిమానులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. నాతో కలిసి వస్తారని ఆశిస్తున్నా! మనం ఒక్కటిగా ఉంటే ట్రోల్స్‌కి భయపడాల్సిన అవసరం లేదు. నాకైతే ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఆ సత్యమే మనం ధైర్యంగా నిలబడే శక్తిని ఇస్తుంది!. జై హింద్’’ సుతిమెత్తగానే కౌంటర్ ఇచ్చారు. కాగా ‘యే రిష్తా క్యా కహెలాతా హై’ సీరియల్(తెలుగు డబ్బింగ్- పెళ్లంటే నూరేళ్లపంట)ల్లో అక్షరగా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న హీనా.. సినిమాల్లోకి రాకముందే కాన్స్ ఫెస్టివల్లో హొయలొలికించే గౌరవం దక్కించుకున్న నటిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. (చదవండి: రియాకు న్యాయం జరగాలి: మంచు లక్ష్మి) I always stand by the truth and want my fans to stand with me for the truth, together! If we believe each other we shall never fear these trolls or bots. I had, have and will always have my point of view. Without fear. Because truth gives you that power! Jai Hind https://t.co/r11GEEyPUi — Hina Khan (@eyehinakhan) August 31, 2020 -
‘మీరు నా ప్రేరణ’
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియాంక నేటి (జూలై 18)తో 38వ వసతంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ కరీనా కపూర్ ప్రియాంకతో దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ప్రపంచంలో ప్రేరణ కలిగించటాన్ని కొనసాగించండి’ అని కామెంట్ జతచేశారు. View this post on Instagram Happy birthday @priyankachopra... May you continue to inspire the world ❤❤❤💯💯💯🎈🎈🎈 Hugs from across the globe... A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on Jul 17, 2020 at 10:07pm PDT అదేవిధంగా టీవీ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హీనా ఖాన్ సోషల్ మీడియాలో ప్రియాంకకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంకతో దిగిన ఓ త్రోబ్యాక్(పాత) ఫొటోను హీనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి బర్త్‌డే విషెష్ తెలిపారు. ‘ మీరు నా ప్రేరణ, నాకు మ్యాజిక్ మీద నమ్మకం కలిగించారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని నాకు మ్యాజిక్‌లా అనిపిస్తుంది. మీరు జన్మించిన స్వర్గానికి ధన్యవాదాలు. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని కామెంట్ జతచేశారు. (ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్) ప్రియాంక, హీనా గతేడాది కేన్స్ చిత్రోత్సవ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. ఈ చిత్రోత్సవంలో వీరితోపాటు హుమా ఖురేషి, డయానా పెంటీ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా హీరో ఫర్హాన్ అక్తర్, అనుష్క శర్మ, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్ ప్రియంకకు బర్త్‌డే విషెష్ తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా, హీరో రాజ్‌కుమార్‌రావుతో కలిసి నటించిన ‘ది వైట్ టైగర్’ను నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హీరో చిత్రం ‘వి కెన్ బీ హీరోస్’లో కూడా ప్రియాంక నటిస్తున్నారు. -
కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి: నటి
‘‘ఎక్కడా సమానత్వం లేదు. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు... అన్నిచోట్లా బంధుప్రీతి ఉంది. మీరు ఓ స్టార్ అయితే మీ కొడుకు లేదా కూతురిని సినిమాల్లోకి తీసుకువస్తారు. అది సరైందే. అయితే ఇండస్ట్రీ బయటి వ్యక్తులకు కూడా సమానంగా అవకాశాలు ఇవ్వకపోవడమే సరైంది కాదు. టీవీ నటులు బాలీవుడ్లో అడుగుపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు సరైన అవకాశం రాకపోవడం వల్లే ఇదంతా. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి కనీసం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వొచ్చు కదా’’ అంటూ హిందీ టీవీ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హీనా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. వెండితెరపై ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి అవకాశాలు ఇవ్వాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.(‘సుశాంత్‌ను ఆ సినిమాల్లో నుంచి తప్పించాను’) కాగా బుల్లితెరపై ప్రస్థానం ప్రారంభించి నుంచి బాలీవుడ్ హీరోగా ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజం మరోసారి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ వంటి పలువురు సినీ ప్రముఖులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి, ఇండస్ట్రీలో ఎదిగిన తీరు గురించి పంచుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ మీడియాతో మాట్లాడిన హీనా ఖాన్.. సుశాంత్ సినీ ప్రయాణం తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ‘‘ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. కఠిన శ్రమకోర్చి ఉన్నతస్థాయికి ఎదిగాడు. మేం బయటివాళ్లం. మాకు గాడ్ఫాదర్లు ఉండరు. కాస్త గుర్తింపు, కొద్దిపాటి గౌరవం మాత్రమే మేం కోరుకుంటాం. కాబట్టి అందరినీ సమానంగా చూస్తే ఇలాంటివి జరగవు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.(ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!) ఇక ‘యే రిష్తా క్యా కహెలాతా హై’ సీరియల్(తెలుగు డబ్బింగ్- పెళ్లంటే నూరేళ్లపంట)ల్లో అక్షరగా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న హీనా.. సినిమాల్లోకి రాకముందే కాన్స్ ఫెస్టివల్లో హొయలొలికించే గౌరవం దక్కించుకున్న నటిగా గుర్తింపు పొందారు. ఆ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న హీనా ఖాన్.. కాన్స్ ఫెస్టివల్లో పాల్గొనే సమయంలో టీవీ యాక్టర్ అవడం వల్ల భారతీయ ఫ్యాషన్ ప్రముఖులు తన పట్ల వివక్ష చూపారని.. అయితే ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు తనకు సాయంగా నిలబడ్డారని పేర్కొన్నారు. కాగా హుస్సేన్‌ఖాన్ దర్శకత్వంలో ‘లైన్స్’ అనే సినిమాతో హీనాఖాన్ బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధం కాగా.. ఆ సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. కాగా ఆమె తాజాగా నటించిన ‘అన్‌లాక్’ అనే డిజిటల్ ఫిల్మ్ జీ5లో స్ట్రీమ్ అవుతోంది. -
ఇంటి పని చేస్తూ ఏడ్చేసిన నటి
ఇటు బుల్లితెర, అటు వెండితెర, వీలు చిక్కితే మ్యూజిక్ ఆల్బమ్స్ అంటూ అన్నింట్లో అడుగుపెట్టింది హీనా ఖాన్. అంతేకాక హిందీ బిగ్‌బాస్ 11 సీజన్లోనూ పార్టిసిపేట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. కాగా ఓవైపు దేశం లాక్డౌన్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చచ్చినట్లు ఇంట్లో ఉండాల్సిందే. లేదని కాలు బయటపెడితే పోలీసు లాఠీ దెబ్బలు రుచి చూడాల్సిందే. ఒకరోజు, రెండు రోజులు.. ఇలా ఎన్నిరోజులని ఇంట్లో నుంచి కదలకుండా ఉండగలం. కొత్త సినిమా ఊసే లేదు, పోనీ సీరియల్స్ అయినా చూద్దామా అంటే.. షూటింగ్‌లు ఆగిపోవడంతో అరిగిన టేప్ రికార్డర్‌లా పాత ఎపిసోడ్లనే మళ్లీ వేస్తున్నారు. అయితే బోర్ కట్టకుండా ఎంటర్టైన్ చేయడానికి నేనున్నానంటూ అభిమానులకు అభయమిస్తోంది నటి హీనా ఖాన్. స్వీయ నిర్బంధం పాటిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. మరేం భయపడకండి.. అది నిజమైన ఏడుపు కాదు. ఇంట్లో హీనా వాళ్ల అమ్మ డోర్‌మ్యాట్ ఉతకమని ఆదేశించింది. చెయ్యనని కరాఖండిగా చెప్పలేక, అలా అని ఉతకలేక మధ్యలో నలిగిపోయింది. కానీ చివరికి మాత్రం ఉతకడానికి రెడీ యింది. చేస్తున్న కష్టాన్ని మర్చిపోయేందుకు పాటలు పెట్టుకుని దానికి తగ్గట్టుగా పెదాలు ఆడించడమే కాక హావభావాలు ఒలికించింది. చివర్లో ఈ పని నా వల్ల కావట్లేదు బాబోయ్ అంటూ ఏడుపు లంకించుకుంది. గతంలో మాస్క్ ఎలా కట్టుకోవాలో సైతం చూపిస్తూ వీడియో షేర్ చేసింది. View this post on Instagram #HinaKhan on cleaning duty at home during quarantine 📷 #StayHomeStaySafe #LOL A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) on Mar 30, 2020 at 8:36am PDT -
‘వరల్డ్ స్టార్ నుంచి ఊహించని ఆహ్వానం’
ప్రతిభ, అందం, ప్రొఫెషనలిజం, గ్లామర్ ఇలా అన్నింటిలోనూ టీవీ ఆరిస్టులు కూడా సినిమా వాళ్లకు ఏమాత్రం తీసిపోరని నటి హీనాఖాన్ పేర్కొన్నారు. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఆమె ‘లైన్స్’ అనే సినిమా ద్వారా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఫ్రెంచ్ రివెరా నదీ తీరాన జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తొలిసారిగా పాల్గొన్న హీనాఖాన్.. పొడవాటి గౌన్లతో ఎర్ర తివాచీ హొయలొలికించారు. ఇక అక్కడే తన తెరంగేట్రానికి సంబంధించిన లుక్‌ను విడుదల చేసి మరిన్ని మధుర ఙ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్‌లతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా... ‘వరల్డ్ స్టార్ నుంచి ఊహించని ఆహ్వానం. వావ్. ఇది నిజమేనన్న స్పృహలోకి వచ్చాక అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాను. అక్కడికి తను చేరుకునేదాకా అవుట్ సైడర్గానే ఫీలయ్యాను. కానీ తను వచ్చిన తర్వాత వెంటనే నా చేయి పట్టుకుని ఒక్క క్షణం కూడా వదల్లేదు. అక్కడున్న వాళ్లందరికీ పరిచయం చేసింది. బహుశా నా జీవితంలో ఎన్నటికీ వాళ్లను కనీసం దగ్గరి నుంచి కూడా చూసేదాన్ని కాదు. అలాంటి వాళ్లకు నా చిన్నపాటి కెరీర్, టీవీ నుంచి కేన్స్ వరకు చేరుకోవడంలో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పింది. ఇక లైన్స్ అనే సినిమా ద్వారా ప్రతిభకు, ప్రసార మాధ్యమాలకు ఉన్న అంతరాలను చెరిపేసేందుకు సిద్ధమయ్యాను. ఇక నాలాంటి వర్ధమాన నటులను ప్రోత్సహించడంలో తను ఎప్పుడూ ముందే ఉంటుంది’ అంటూ ప్రియాంక చోప్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram An unexpected invitation by a world star.. personally, after I gained consciousness and prepared my self to finally make it, I was still an outsider but only until you arrived. You didn’t need to, but still never left my hand for a second, introduced me to the people I probably wouldn’t have met and I felt as if all the achievements of my little career happening in fast forward as you present me as a star to each one of them. You somehow know everything ..as you mentioned my debut film and praised me for my hard work and appreciated me for the risks I have taken in my choices. Yes I have taken risks and I am still taking them, whr I almost have everything in my television career ..position,power,money everything.. But someone has to start somewhere I believe.. I always wanted to break the stereotypes and prove it to the world that television actors have it all.. Give us the opportunity our fare share and we will kill it..Not easy at all I know.. But ya I will keep trying keep working hard and make it possible.. I REPEAT TELEVISION HAS IT ALL.. Talent, Glamour, Elegance, Beauty, Grace, Right attitude , and Professionalism.. I am taking baby steps, And I will keep doing that no matter how much criticism one has to face and I will make my own place I promise.. we will face it and win over it as long as we are together.. Hearfelt Gratitude to each one of you for standing by me🙏 WE HAVE IT ALL GUYS.. With my first debut film called LINES, I am trying hard very hard to erase the lines created between talents and mediums 🙏And coming back to @priyankachopra your inclusiveness surpasses my ability of comprehension. Your deliberate attempt to lift up people around you not for their backgrounds but their talent is one of a kind. You are a walking inspiration! When a human being is a personification of an idea of self belief, Grace , humility, substance and greatness, that person can only be you priyanka Chopra You are already the best version of my dream self in the future I want and I believe thousands others like me do too. This is the Priyanka Chopra who believes in lifting others and growing together🙏 you are a sweetheart @nickjonas #AnOutsider #FromTelevisonToCannes A post shared by Hina Khan (@realhinakhan) on May 19, 2019 at 3:02pm PDT -
భావోద్వేగాల్లో అస్సలు మార్పు ఉండదు!
బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించిన నటి హీనాఖాన్ త్వరలోనే బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. సీరియళ్లతో పాటు బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన హీనా ప్రస్తుతం.. కాన్స్ ఫెస్టివల్లో బిజీగా గడుపుతున్నారు. ఫ్రెంచ్ రివెరా నదీ తీరాన జరుగుతున్న ఈ మెగా సినీ ఈవెంట్లో తొలిసారిగా పాల్గొన్న ఆమె.. పొడవాటి గౌన్లతో ఎర్ర తివాచీ హొయలొలికిస్తున్నారు. అంతేకాక సినిమాల్లోకి రాకముందే ఈ గౌరవం దక్కించుకున్న నటిగా గుర్తింపు పొందారు. ఇక అక్కడే తన తెరంగేట్రానికి సంబంధించిన లుక్‌ను విడుదల చేసి మరిన్ని మధుర ఙ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. కాగా హుస్సేన్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైన్స్ సినిమాతో హీనాఖాన్ బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. కేన్స్ ఫెస్టివల్లో భాగంగా ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆమె ఆవిష్కరించారు. ఇందుకు సబంధించిన ఫొటోను షేర్ చేసిన హీనా..‘ సరిహద్దుల్లో జీవించినంత మాత్రాన భావోద్వేగాలు మారవు. సగటు అమ్మాయి ఎదుర్కొనే సవాళ్లకు నజియా జీవితంలోనూ ఉంటాయి. అయితే అవి అంత తేలికైనవి కావు. లైన్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా. ఈ సినిమాకు మీ అందరి ఆశ్వీరాదాలు ఉంటాయని ఆశిస్తున్నా’ అంటూ తన పాత్ర విశేషాలను వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా హీనాపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ఇక ‘పెళ్లంటే నూరేళ్లపంట’ సీరియల్లో అక్షరగా హీనా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Emotions don’t change because of the borders in between, the life and plight of #Nazia is a simple portrayal of any girl who faces the magnitude of ordinary challenges in a not so ordinary story. #Lines is my debut in films. I hope you all love it as much we loved it. This is the first look launched at @festivaldecannes and an official poster which depicts more than a poster can! @rahatkazmi @tariq_khana @zebasajid2 @rockyj1 @rishi_bhutani @husseinkhan72 @pinkuchauhan8 @d.avaniish #cannes2019 A post shared by Hina Khan (@realhinakhan) on May 17, 2019 at 9:32am PDT -
జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన నటి..?
‘బిగ్ బాస్ 11’ మాజీ కంటెస్టెంట్ హీనా ఖాన్ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ‘బిగ్ బాస్ హౌస్’లో ‘మిస్ రైట్’గా పిలుచుకునే హీనా ఖాన్ గురించి ఇప్పుడు ఒక తప్పుడు వార్త న్యూస్ చానళ్లలో ప్రచారం అవుతుందంట. ఒక బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్, ప్రకటన షూటింగ్ అనంతరం బంగారు ఆభరణాలను కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుందంట. ఇందుకు గాను సదరు కంపెనీ హీనా ఖాన్‌కు లీగల్ నోటీసులు కూడా పంపారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయం గురించి హీనాను అడగ్గా ఆమె దీన్ని ఖండించారు. అనంతరం తన ట్విటర్లో ‘లీగల్ నోటీస్‌లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్‌కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ’ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ‘నా శత్రువులు నన్ను క్షమించాలి. మీ ఈ ఉపాయం పని చేయలేదు. మరి కాస్తా కొత్తగా ట్రై చెయ్యండి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని తెలిపారు. కానీ న్యూస్ చానల్ వారు మాత్రం హీనా ఖాన్ అడ్రస్‌తో ఉన్న లీగల్ నోటీసులను ప్రచారం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా హీనా ఖాన్ మ్యూజిక్ వీడియో ‘భసూది’ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ మ్యూజిక్ వీడియోను ఇప్పటికే 8 లక్షల మంది వీక్షించారు. -
పోర్న్క్లిప్ లీక్ అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!
సాక్షి, ముంబై : బిగ్‌బాస్ 11వ సీజన్ పలు వివాదాలకు కారణమైంది. ముఖ్యంగా బుల్లితెర నటి శిల్పా షిండే, హీనాఖాన్ల మధ్య గొడవ రోజురోజుకు ముదురుతోంది. బిగ్‌బాస్ 11వ సీజన్ విజేతగా శిల్పా షిండే నిలవగా, ఆమె ప్రత్యర్థి, ఫైనలిస్ట్ హీనా ఖాన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో వీరి మధ్య వాగ్వివాదం మొదలై సోషల్ మీడియాలో వీరి అభిమానుల మధ్య వివాదంగా మారింది. ఎంతగా ఉంటే.. నగ్న వీడియోలు బయటపెడతానంటూ ఒకరి అభిమాని మరో నటిని బెదిరింపులకు పాల్పడుతూ.. వేధింపుల పర్వం కొనసాగేలా పరిస్థితి తయారైంది. తాజాగా అదే వివాదం.. ఇటీవల తమ అభిమాన నటి శిల్పాషిండే అశ్లీల వీడియో లీక్ చేస్తామంటూ హీనా ఫ్యాన్స్ బెదిరించడంతో శిల్పా అభిమానులు అలర్ట్ అయ్యారు. అడల్ట్ వెబ్సైట్ నుంచి హీనాఖాన్ వీడియో డౌన్లోడ్ చేశామని, మంచిపాట జతచేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తామంటూ బెదరింపులకు పాల్పడుతున్నారు. హీనా ఫ్యాన్స్ అంటే ఆమె క్లైయింట్స్ అని తెలుసుకోండి అంటూ శృతి అనే నెటిజన్ పోస్ట్ చేయడం మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. This is bad 😡.. pls don't do this 🙏 Take this off right away.. pic.twitter.com/GgWxCFNfqi — Ashutosh Shinde (@ShindeAshutosh) 24 April 2018 ఇటీవల శిల్పా షిండే పోర్న్క్లిప్ అంటూ హీనా ఖాన్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. దీంతో వీరి మధ్య అంతరం మరింత పెరిగింది. దీనిపై శిల్పా స్పందిస్తూ.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, కొందరు వ్యక్తులు పగతో ఇలాంటివి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రియల్ లైఫ్.. రియాల్టీ షో కాదు.. సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సాధారణంగా జరుగుతుంది. మనపై కామెంట్లు చేస్తే కొన్ని లక్షల మందికి ఆ విషయం తెలుస్తోంది. అందుకు రియల్ లైఫ్.. రియాల్టీ షో కాదని గుర్తుంచుకుని మెలగడం ఉత్తమమని హీనాఖాన్ ట్వీట్ చేశారు. -
‘నా మాటలు వక్రీకరించారు’
ముంబై: గెలుపు కంటే గౌరవం పొందడం ముఖ్యమని ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ 11వ సీజన్లో రన్నరప్‌గా నిలిచిన హినా ఖాన్ పేర్కొన్నారు. బిగ్‌బాస్ షో ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఫైనల్ వరకు వస్తానని ఊహించలేదని, మధ్యలోనే ఎలిమినేట్ అవుతానని అనుకున్నానని తెలిపారు. ‘పోటీలో చివరి వరకు ఉంటానని అనుకోలేదు. టాప్-5కు చేరాలని మాత్రమే అనుకునేదాన్ని. పోటీ చాలా ఎక్కువగా ఉంది. కొంత మంది బాగా ఆడి గట్టి పోటీ ఇచ్చారు. ఓటమి, గెలుపు అనేది కాదు. హౌస్ లోపల ఉంటూ పోటీపడటం అనేదే పెద్ద విషయం. నేను టాప్2లో నిలవడం గొప్ప ఘనతగా భావిస్తున్నాను. మధ్యలోనే వెళ్లిపోతాననుకున్న నాకు ఇది గర్వించే విషయం. అందుకే నాకు నేను అభినందించుకుంటున్నా’ని హినా ఖాన్ అన్నారు. చివరివరకు పోరాడాలని బిగ్‌బాస్ షో ద్వారా నేర్చుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఎటువంటి విచారం లేదని, అయితే కొన్నిసార్లు తన మాటలను వక్రీకరించారని వెల్లడించారు. పోటీలో గెలుపోటములు సహజమని, ఎలా ఆడామన్నదే ముఖ్యమని హినా ఖాన్ వ్యాఖ్యానించారు. 19 మంది పోటీదారులతో 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ 11వ సీజన్లో బుల్లితెర నటి శిల్పా షిండే(40) విజేతగా నిలిచారు.