బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియాంక నేటి (జూలై 18)తో 38వ వసతంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ కరీనా కపూర్ ప్రియాంకతో దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ప్రపంచంలో ప్రేరణ కలిగించటాన్ని కొనసాగించండి’ అని కామెంట్ జతచేశారు.
అదేవిధంగా టీవీ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హీనా ఖాన్ సోషల్ మీడియాలో ప్రియాంకకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంకతో దిగిన ఓ త్రోబ్యాక్(పాత) ఫొటోను హీనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి బర్త్‌డే విషెష్ తెలిపారు. ‘ మీరు నా ప్రేరణ, నాకు మ్యాజిక్ మీద నమ్మకం కలిగించారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని నాకు మ్యాజిక్‌లా అనిపిస్తుంది. మీరు జన్మించిన స్వర్గానికి ధన్యవాదాలు. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని కామెంట్ జతచేశారు. (ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్)
ప్రియాంక, హీనా గతేడాది కేన్స్ చిత్రోత్సవ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. ఈ చిత్రోత్సవంలో వీరితోపాటు హుమా ఖురేషి, డయానా పెంటీ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా హీరో ఫర్హాన్ అక్తర్, అనుష్క శర్మ, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్ ప్రియంకకు బర్త్‌డే విషెష్ తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా, హీరో రాజ్‌కుమార్‌రావుతో కలిసి నటించిన ‘ది వైట్ టైగర్’ను నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హీరో చిత్రం ‘వి కెన్ బీ హీరోస్’లో కూడా ప్రియాంక నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment