మన దేశంలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా | Priyanka Chopra Sold Mumbai Plots For Crores | Sakshi

Priyanka Chopra: ఓవైపు రాజమౌళితో సినిమా.. మరోవైపు ఆస్తులు సేల్

Mar 7 2025 5:54 PM | Updated on Mar 7 2025 6:54 PM

Priyanka Chopra Sold Mumbai Plots For Crores

పేరుకే హిందీ నటి గానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఓవైపు మూవీ చేస్తూనే మరోవైపు ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేస్తోంది. రీసెంట్ గా అలా కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు ఇండెక్స్‌ ట్యాప్‌ తెలిపింది.

ముంబైలోని అంధేరిలో ఉన్న ఒబెరాయ్ స్క్రై గార్డెన్ లో ప్రియాంకకు నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటినే ఏకంగా రూ.16.17 కోట్లకు విక్రయించింది. 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్, 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్ విక్రయించిన వాటిలో ఉన్నాయి.

(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))

గతంలోనూ ప్రియాంక.. మన దేశంలోని ఆస్తుల్ని విక్రయించింది. 2021లో వెర్సోవాలోని రెండు ఇళ్లను, 2023లో లోఖండ్ వాలాలోని రెండు పెంట్ హౌసులని అమ్మేసింది. ప్రస్తుతం ఈమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ లో సొంత భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం కూతురు, భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో ఉంటోంది.

ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. కొన్నాళ్ల క్రితం 'సిటాడెల్' అమెరికన్ వెర్షన్ లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం రాజమౌళి మూవీలో ప్రతినాయక పాత్రలో నటిస్తోందని సమాచారం. దీని షూటింగ్ ఇప్పుడు ఒడిశాలో జరుగుతోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement