
చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. బాల్యంలో మన చిలిపి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని చూసినప్పుడు.. అసలు అక్కడ నేనేనా అన్నంతలా ఉంటాయి. ఒక్కసారి ఆ బాల్యంలోకి తిరిగి వెళ్తే బాగుంటుందని అనుకోరు ఉండరేమో. ఆ చిన్ననాటి రోజులే బాగుండేవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్లమని ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటూనే ఉంటాం. అంతటి అద్భుతమైన క్షణాలు ఆ బాల్యపు రోజులు. ఆ రోజులనే మరోసారి గుర్తు చేసుకుంది మన స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ తీపి గుర్తులను మీరు కూడా చూసేయండి.
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్‌గా కనిపించింది. చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..
మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్‌లో ఇదే ఆమె చివరి సినిమా కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment