childhood
-
ఈ గుండు పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. బాల్యంలో మన చిలిపి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని చూసినప్పుడు.. అసలు అక్కడ నేనేనా అన్నంతలా ఉంటాయి. ఒక్కసారి ఆ బాల్యంలోకి తిరిగి వెళ్తే బాగుంటుందని అనుకోరు ఉండరేమో. ఆ చిన్ననాటి రోజులే బాగుండేవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్లమని ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటూనే ఉంటాం. అంతటి అద్భుతమైన క్షణాలు ఆ బాల్యపు రోజులు. ఆ రోజులనే మరోసారి గుర్తు చేసుకుంది మన స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ తీపి గుర్తులను మీరు కూడా చూసేయండి.బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్‌గా కనిపించింది. చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
మోదీ మెచ్చిన పాపులర్ గేమర్ పెళ్లి సందడి (ఫోటోలు)
-
3 నెలల వయసులో కిడ్నాపై... 26 సంవత్సరాలకు తల్లిదండ్రులను చేరి..
బాల్యంలో తప్పిపోవడం లేదా కిడ్నాప్‌కు గురవ్వడం.. పెద్దయ్యాక సంపన్నులైన తల్లిదండ్రులను కలవడం... ఎన్నో సినిమాల్లో మనం చూసిన కథే. కానీ ఆ సినిమా కథలను మించిన జీవిత కథ చైనాలో జరిగింది. మూడు నెలల వయసులో కిడ్నాప్‌కు గురైన పసిబాలుడు.. యువకుడిగా తల్లిదండ్రులను చేరాడు. ఆ తరువాత కథ మాత్రం సినిమాలను మించి పోయింది. అదేంటో చూద్దాం! ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న షి కిన్షుయ్ మూడు నెలల వయసులో కిడ్నాపయ్యాడు. తల్లిదండ్రులు దశాబ్దాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ తెలుసుకోవడానికి ఆ కుటుంబం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. రెండున్నర దశాబ్దాల తరువాత.. ఎట్టకేలకు ఆచూకీ కనుగొన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. డిసెంబర్ 1న కొడుకును ఇంటికి తీసుకొచ్చారు. ఆ సందర్భాన్ని ఘనమైన వేడుకలా చేసుకున్నారు. అంతేకాదు తమ ఐశ్వర్యాన్నంతా ముందు పెట్టారు. అనేక భవనాలు.. లగ్జరీ కార్లు.. విలాసవంతమైన బహుమతులెన్నో అందించారు. కానీ.. ఇక్కడే పెద్ద ట్విస్ట్. అప్పటిదాకా అనాథలా పెరిగిన షి.. ఆస్తులకు వారసత్వాన్ని పొందడానికి ఇష్టపడలేదు. తన భార్యతో కలిసి జీవించడానికి ఒక్క ఫ్లాట్‌ను మాత్రం తీసుకున్నాడు. ప్రస్తుతం తన లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న షి... తన సంపాదనతోనే జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కోట్ల ఆస్తులను వదులుకుని నిరాడంబరుడిగా మిగిలిపోవాలనుకున్న అతని వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతని విలువలను కొందరు ప్రశంసిస్తుంటే.. సానుభూతి కోరుకుంటున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్న షి నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాగ చైతన్య మరదలినే పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా!
-
బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..
కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అది వారిని సత్ప్రవర్తన వైపుకి మళ్లించకపోగా..చిన్న వయసులోనే తట్టుకోలేని బాధలకు లోనవ్వుతారు. అందరూ ఒకలా తీసుకోరు. ఒక్కో పిల్లవాడి ఆలోచనా తీరు వేరుగా ఉంటుంది. చెడు అలవాట్ల బారిన పడకూడదని కొంతమంది తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చిన్నారులను తిట్టడం, కొట్టడం వంటివి చేస్తారు. వాళ్లు మంచిగా మారడం అటుంచి ఇంటి నుంచి పారిపోయి.. ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఇలా తానుకూడా బాల్యంలో వేధింపులకు గురయ్యానని బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. అంతపెద్ద స్టార్ కూడా ఒక్కసారిగా బాల్యం అనగానే వేధింపులే గుర్తుకొచ్చాయి. అంటే అవి నీలి నీడల్లా ఆయన్ను ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇలా చిన్నారుల బాల్యం చేదు జ్ఞాపకంగా మారకూడదంటే..నటుడు ఆయుష్మాన్ ఖురాన్ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తండ్రి తనని బెల్టులు, చెప్పులతో దారుణంగా కొట్టేవాడనంటూ.. చిన్నతనంలో తాను అనుభవించిన బాధను చెప్పుకొచ్చారు. చిన్ననాటి ఆ గాయం తానింకా మర్చిపోలేదన్నారు. అయితే తాను మాత్రం తన పిల్లలకు అలాంటి తండ్రిని కానని, చాలా భిన్నంగా ఉంటానని అన్నారు. ఆయుష్మాన్‌కి ఇద్దరు పిల్లలు. తన బాల్యంలా వేధనాభరితంగా గడిచిపోకూడదని వారితో ఫ్రెండ్లీ ఫాదర్‌గా ఉంటానన్నారు. ఇక్కడ ఆయుష్మాన్ తన బాల్యంలో కలిగిన చేదు జ్ఞాపకాలు అతడి మనుసులో చాలా బలంగా నాటుకుపోయాయి. కానీ ఆయన తాను మంచి తండ్రిగా ఉండాలని భావించడం హర్షణీయం. ఎందుకంటే తనలా తన పిల్లలు కాకూదని అనుకోవడమే గాక ఎవరి బాల్యం అలా గాయాలతో నిండిపోకూడదని కోరుకున్నారు ఆయుష్మాన్. ఇలా అందరూ సానుకూలంగా తీసుకునే యత్నం చేయరు.చిన్నారుల సైకాలజీ ప్రకారం..బాల్యంలో జరిగే ప్రతిదీ వారి మనుసులో బలంగా నాటుకుంటుంది. వారు ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే వాతావరణం, పరిచయమై కొత్త వ్యక్తులు అంతా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈజీగా చెడు అలవాట్లు లేదా వ్యసనాల బారినపడే అవకాశం ఉంది. దీన్ని తల్లిదండ్రులు ఓ స్నేహితుడి మాదిరిగా దగ్గరకు తీసుకుని వివరించి..వాటి వల్ల ఎదురయ్యే నష్టాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతే తప్ప భయబ్రాంతులకు గురిచేసేలా కొట్టడం, తిట్టడం, లేదా పనిష్మెంట్లు ఇవ్వడం చేయకూడదు. ఇలా ప్రపంచమంతటా బాల్యంలో వేధింపులకు గురైన వారెందరో ఉన్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.అలాంటి పిల్లలను వారి సన్నిహితులో, బంధువులో లేక తల్లిదండ్రులో ఎవరో ఒకరైనా దగ్గరకు తీసుకోవాలి. లేదంటే వారు నిరాశ నిస్ప్రుహలకు లోనై ఎందుకు పనికరాని వారుగా లేదా ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోతారని చెబుతున్నారు నిపుణులు. వేధింపులకు గురయ్యే చిన్నారుల తీరు..చదువులో వెనుకబడటంచురుగ్గా లేకపోవడంఆత్మవిశ్వాసం లేకపోవడంవేలు నోట్లో పెట్టుకోవడం లేదా పక్కతడిపే అలవాటు వారి ముఖం ఆందోళన, బాధతో ఉండటంఏకాగ్రత లోపించటంనలుగురితో కలవకపోవడంతదితర లక్షణాలు కనిపంచగానే వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అక్కడ వారికి ఆత్మవిశ్వాసం పెరిగేలే థెరపీలు ఇవ్వడం వంటివి చేస్తారు నిపుణులు. ఇక్కడ చిన్నారులు తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ఎవ్వరి వల్ల అయినా వేధింపులకు గురైతే.. వెంటనే తన తల్లిదండ్రులు లేదా తనను ప్రేమగా చూసేవారి వద్ద మనసు విప్పి మాట్లాడేలా చేయడం తదితర విషయాలను నేర్పించడమే గాక తల్లిదండ్రులతో పిల్లలకు సాన్నిహిత్యం ఏర్పడేలా ఇరువురు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తారు. అలాగే మొండిగా ఉండే పిల్లలను కూడా దారిలో పెట్టాలని కొట్టడం చెయ్యకూడదు. ఓపికతో వ్యవహరించడం లేదా మానసిక నిపుణులను సంప్రదించి సరైన మార్గంలో పయనించేలా చేయాలి తల్లిదండ్రులు. అంతే తప్ప బాల్యం అంటే భారంగా గడిపిన బాధకరమైన క్షణాలుగా మిగలకూడదని అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!) -
ఊరికే ఇచ్చే డబ్బు వద్దంటూ.. గంగానదిని ఈదాడు
పిల్లలూ! మీరెప్పుడూ అందరూ మెచ్చుకునే స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరూ మీ మీద జాలి పడే స్థితిలో ఉండకూడదు. ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఈ సంఘటన తెలుసుకోండి.అనగనగా ఓ పిల్లవాడు తన తోటివారితో కలిసి గంగానది అవతలి ఒడ్డున జరిగే జాతర చూసేందుకు వెళ్లాడు. అతనిది పేద కుటుంబం. తండ్రి మరణించడంతో బంధువుల వద్ద ఉంటూ తల్లి అతణ్ని పెంచుతోంది. పడవ ఖర్చుల కోసం ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. దాన్ని అతను జాతరలో ఖర్చుపెట్టాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కేందుకు అతని వద్ద డబ్బు లేదు. మేమిస్తామని స్నేహితులు అతనికి చెప్పారు. కానీ ఆత్మగౌరవం కలిగిన అతను ఆ డబ్బు తీసుకోలేదు. స్నేహితులను పడవలో వెళ్లమని చెప్పి, తనొక్కడే నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చూశారా! ఎవరి వద్దా ఊరికే డబ్బు తీసుకోకూడదని అతనికెంత పట్టుదలో! ఆ పిల్లాడెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదం ఆయన ఇచ్చిందే. అయితే మీరు ఇలాంటి సాహసాలు చేయొద్దు. బాగా ఈత వచ్చిన వారే ఇలాంటివి చేయాలి. స్ఫూర్తిని గ్రహిస్తే చాలు.ఇదీ చదవండి : మెగా మ్యూజియం గురించి తెలుసా? -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్‌లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
ఇంతకు తెగించిన చిన్ననాటి స్నేహితుడు
-
మరి ఆ రోజుల్లో... అలా.. మేడమీద చదువులు
రాత్రి భోజనాల తరువాత మా చదువు మొదలయ్యేది. అప్పుడప్పుడూ ఆదివారాలు మధ్యాహ్నాలు కూడా. మధ్యాహ్నాలు పర్లేదు వెలుతురయ్య ఎల్లడై ఉన్న సమయం అది. రాత్రి సమయపు లెక్కలు వేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో అనవసరమైనది, అవసరానికి మించినదీ ఏది ఉండేది కాదు. రాత్రి చదువుకు వెలుతురు కావాలి అంటే దానికి బల్బు కావాలి, కరెంటు లాగడానికి వైర్ కావాలి, బల్బ్‌కు హోల్డర్ కావాలి, వైరుకు ప్లగ్గు కావాలి, ఒక స్విచ్చు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి. ఉన్న నలుగురైదుగురం తలా ఇంత అని వేసుకుని అవన్నీ కొనుక్కుని తెచ్చుకుని బిగించుకుని చదువుకు సిద్దం అయ్యేవాళ్ళం. పుల్లయ్యగాడు వాడి వాటాకు డబ్బులు కాక ఇంటినుండి కరెంటు గుంజి తెచ్చేవాడు. బల్బు వెలిగేదిఆ విధంగా కాంచిపురముననొకడు కాంచనగుప్తుడను వైశ్యుడి దగ్గరి నుండి, వాటర్లూ యుద్దాలు, చిరపుంజిలో వర్షపాతము, గర్జించే నలభైలు, తళ్ళికోట చరిత్ర, గణిత సూత్రాలు, బీజీయ సమాసాలు, ఐ లే ఇన్ సారో డీప్ డిస్ట్రెస్స్డ్, మై గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హర్డ్, హిజ్ లుక్స్ వర్ కోల్డ్, హి గేవ్ మీ గోల్డ్… అనే శబ్ద పాండిత్యాన్ని బట్టీప్రవాహంలా ఒకళ్ళమీదికి ఒకళ్ళము ప్రవహింపజేసుకునేవాళ్ళము.ఉదయం ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీదకి చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు. మాకు అప్పటికి అంతగా తెలియని పరకాయ ప్రవేశవిద్య ఒకటి వారు సాధన చేస్తూ ఉండేవారు. దానివలన చదువు భంగం అయ్యేది. విశ్వామిత్రుడికీ దూర్వాసుడికీ కూడా ఎదురవ్వని అనుభవాలు మావిఅన్వర్, సాక్షి -
World Health Day: ఏయే వయసుల్లో.. ఏయే వ్యాక్సిన్లు! ఏయే వైద్య పరీక్షలు..?
ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చికిత్స కంటే నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు (వ్యాక్సిన్లు). రెండో అంశం.. లక్షణాలు కనిపించగానే చేయించాల్సిన వైద్యపరీక్షలు. నేడు ‘వరల్డ్ హెల్త్ డే’. ఈ సందర్భంగా ఏ వయసులో. వారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కోసం ఈ కథనం. టీకాలు.. చిన్నారి పుట్టిన వెంటనే.. ఓపీవీ, బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లో ఇస్తారు). ఆరు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా ఫస్ట్ డోస్ హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా ఫస్ట్ డోస్ ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా ఫస్ట్ డోస్ పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) ఫస్ట్ డోస్ రొటావైరస్ టీకా మొదటి డోస్ (ఇది నోటిద్వారా ఇస్తారు) హెపటైటిస్–బి వ్యాక్సిన్ రెండో డోస్. పది వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా రెండో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా రెండో మోతాదు ఐపీవీ / ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా రెండోడోస్ పీసీవీ 13 రెండో మోతాదు నోటిద్వారా ఇచ్చే రొటావైరస్ టీకా రెండో డోస్ హెపటైటిస్–బి మూడో డోస్. పద్నాలుగు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా మూడో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా మూడోమోతాదు ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా మూడో మోతాదు పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) మూడో మోతాదు రొటావైరస్ టీకా మూడో డోస్ (ఇది నోటిద్వారా ఇచ్చే డోస్) హెపటైటిస్–బి వ్యాక్సిన్ నాలుగో మోతాదు. ఆరు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా మొదటి మోతాదు ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) మొదటి మోతాదు ఏడు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా రెండో మోతాదు తొమ్మిది నెలల వయసప్పుడు: ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) రెండో మోతాదు ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఫస్ట్ డోస్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. పన్నెండు నుంచి 15 నెలల వయసప్పుడు: ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా రెండో మోతాదు వారిసెల్లా (చికెన్‌పాక్స్) టీకా మొదటి మోతాదు హెపటైటిస్–ఏ టీకా మొదటి మోతాదు (దీని రెండో డోస్ సాధారణంగా 18 నెలలప్పుడు ఇస్తారు) పీసీవీ (ప్యాక్డ్ సెల్ వాల్యూమ్) బూస్టర్. పద్దెనిమిది నెలల వయసప్పుడు: డీట్యాప్ టీకా మొదటి బూస్టర్ డోస్ హెచ్ఐబీ (హిబ్) టీకా మొదటి బూస్టర్ డోస్ ఐపీవీ లేదా ఓపీవీ టీకా హెపటైటిస్–ఏ రెండో డోస్. మూడేళ్ల వయసప్పుడు: వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా. ఐదేళ్లప్పుడు: డీ–ట్యాప్ టీకా రెండో బూస్టర్ ఐపీవీ టీకా ∙ఎమ్ఎమ్ఆర్ టీకా మూడో డోస్. పది నుంచి పన్నెండేళ్ల వయసప్పుడు: హెచ్‌పీవీ టీకా మొదటి డోస్ (దీని రెండు, మూడు డోసులు 9 నుంచి 18 ఏళ్ల వయసప్పుడు) టీడ్యాప్ టీకా బూస్టర్ డోస్ ∙మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ (దీని బూస్టర్ 16 ఏళ్ల వయసప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది). పదిహేను నుంచి 16 ఏళ్ల వయసప్పుడు: మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్ టీడీ / డీటీ టీకా. 18 నుంచి 65 ఏళ్ల వరకు: ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతం లో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే... డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ గుర్తులేనప్పుడు డాక్టర్‌కు ఆ విషయం చెబితే... వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ నిర్ధారించి అవసరమైతే ఇస్తారు. 65 ఏళ్లు పైబడిన వారికి: ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను, మరికొన్ని అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీసీవీ–13 అండ్ పీపీఎస్వీ 23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్స్‌లు. ఇందులో తొలుత పీసీవీ–13 ఇస్తారు. ఆ తర్వాత రెండు నెలలకు పీపీఎస్వీ–23 ఇస్తారు టీ–డ్యాప్ వ్యాక్సిన్: చిన్నప్పుడు తీసుకున్న టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి పదేళ్లకోమారు తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ బీవీఎస్ అపూర్వ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. పరీక్షలు.. ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించడం వల్ల కొన్ని వ్యాధుల్ని కనుగొని సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యాధికి సుదీర్ఘమైన ముందస్తు వ్యవధి ఉంటుంది. అంటే అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందునుంచే ‘ప్రీ–సర్వైకల్ పీరియడ్’ ఉంటుంది. పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా వ్యాధి రాబోయే దశాబ్దకాలం ముందుగానే దాన్ని కనుగొనవచ్చు. క్యాన్సర్ ను ఎంత త్వరగా కనుగొంటే అంత తేలికగా నయమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ముందస్తుగా ఏయే వయసుల్లో ఏయే వైద్యపరీక్షలు ఉపకరిస్తాయో తెలుసుకుందాం. 0 – 10 ఏళ్ల వయసులో: ఈ వయసులో అవసరం అయితే తప్ప పెద్దగా వైద్యపరీక్షలు అవసరం లేదు. 11 – 20 ఏళ్లు: ఇది యుక్తవయసులోకి మారే దశ. నిర్దిష్టంగా ఏవైనా వైద్యసమస్యలు ఉండటం లేదా లక్షణాలు కనిపించడం వంటి సమయాల్లో తప్ప... ఈ వయసులోనూ పెద్దగా వైద్యపరీక్షలు అవసరం పడవు. 20 – 30 ఏళ్లు: ఈ వయసులో కొన్ని లైంగిక సాంక్రమిక వ్యాధులు (ఎస్టీఐ’స్) కోసం మరీ ముఖ్యంగా హెపటైటిస్–బీ నిర్ధారణ పరీక్షలు చేయించి హెచ్‌బీఐజీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలైతే పాప్‌స్మియర్ వంటి గైనిక్ పరీక్ష లు చేయించుకుని, 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకాలంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరం. 30 నుంచి 40 ఏళ్లు: ఈ వయసు నుంచి డయాబెటిస్ కోసం హెచ్‌బీఏ1సీ అనే రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా తేడాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ, టూ డీ ఎకో, అవసరాన్ని బట్టి ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ మంచిదే. మహిళలైతే డాక్టర్ సలహా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. 40 – 50 ఏళ్లు: ఈ వయసు నుంచి దేహంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో పరీక్షలు తరచూ చేయిస్తుండటం మేలు. రక్తపోటును తెలుసుకోవడం కోసం సిస్టోల్, డయాస్టోల్ ప్రెషర్స్, రక్తలో చక్కెర మోతాదుల కోసం హెచ్‌బీఏ1సీతో పాటు అవసరమైతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), పొద్దున్నే పరగడుపున, ఏదైనా తిన్న తర్వాత చేసే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ్రపాండియల్ వైద్య పరీక్షలతోపాటు అవసరాన్ని బట్టి కొన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు చేయించడం మంచిది. అలాగే మహిళలైతే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ డెన్సిటీ పరీక్ష చేయించాలి. దాంతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో చేయించాలి. ఇక పురుషులైతే ఈ వయసు నుంచి ్రపోస్టేట్ స్పెసిఫిక్ ఏంటీజెన్... సంక్షిప్తంగా పీఎస్ఏ అనే పరీక్షను డాక్టర్లు చెప్పిన వ్యవధుల్లో చేయించుకుంటూ ఉండాలి. 50 – 60 ఏళ్లు: చాలామంది 50 ఏళ్ల వరకు ఎలాంటి పరీక్షలు చేయించకపోవచ్చు. అయితే అలాంటివాళ్లంతా ఈ 50 – 60 ఏళ్ల మధ్యవయసులో తప్పక వైద్యపరీక్షలు చేయించాల్సిన అవసరం తప్పక వస్తుంది. ముందు నుంచి పరీక్షలు చేయించని వాళ్లతోపాటు ఈ వయసులోని అందరూ ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండె జబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతో పాటు లక్షణాలను బట్టి ఇతర వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. మహిళలకు 50 ఏళ్ల వయసు తర్వాత మెనోపాజ్ రావడంతో గుండెకు ఉండే ఒక సహజ రక్షణ తొలగిపోతుంది. అందువల్ల గతంలో చేయించినా, చేయించక పోయినా ఈ వయసు నుంచి మహిళలు గుండెకు సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. 60 నుంచి 70 ఏళ్లు: ఈ వయసులో వాళ్లనే సీనియర్ సిటిజెన్‌గా పరిగణిస్తుంటారు. పురుషులూ మహిళలు అన్న తేడాలేకుండా... ఈ వయసు నుంచి అందరూ... ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండెజబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతోపాటు లక్షణాలను బట్టి మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవసరమవుతాయి. 70+ పైబడ్డాక.. ఆపైన కూడా.. ఈ వయసు నుంచి లక్షణాలను బట్టి ఓ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన పేర్కొన్న వైద్యపరీక్షలతో పాటు కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని మందులు తీసుకోవాలి. ఒకవేళ పోషకాహార లోపం ఉంటే, తగిన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు అవసరం అయితే మరికొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్. ఇవి చదవండి: మన తెలుగువాడి బయోపిక్ -
ఈమె ఫ్లాప్ హీరోయిన్.. తల్లి స్టార్ హీరోయిన్.. చిన్నారిని గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
కన్నా!.. యుద్ధమేనా నీకు జోలపాట?
కన్నా! యుద్ధమేనా నీకు జోలపాట? అమ్మ లేదు, నాన్న కనపడడు. ఆకాశంలో వెలుతురు కక్కుతూ కనిపించేది నక్షత్రం కాదు. చెవులు చిల్లులు పడే మోత బడిగంట కాదు.గాలిలో గంధకం వాసన...శిథిలాలలో చిక్కుకున్నఇష్టమైన ఆటబొమ్మ. ఏడుపు ఊరికూరికే వస్తుంది. ఎవరూ నవ్వరు, ముద్దు చేయరు. శోకం పాటలానే ఉంటుంది కానీ అది అమ్మ జోలపాటలా ఉండదు. ఏం జరుగుతోంది? ఈ పెద్దవాళ్లు ఆడుకోవడానికి ఆటబొమ్మలే లేవా? మాతోనే ఆడుకోవాలా? 'ప్రతి యుద్ధం పిల్లలకు వ్యతిరేకమైనదే'. కులం తెలియదు. మతం తెలియదు. జాతి తెలియదు. దేశం తెలియదు. సరిహద్దు తెలియదు. ఆయుధాలూ తెలియవు. మబ్బును చూస్తే నవ్వుతారు. పిట్టను చూస్తే గెంతుతారు. తూనీగతో కబుర్లు చెబుతారు. అఆలు రాయడానికి ఆపసోపాలు పడతారు. పాలబువ్వ తింటూ తింటూండగానే కునుకు తీస్తారు. మట్టితో జత కడతారు. బుజ్జి ఆశలకు మారాము చేస్తారు. బెదిరితే అమ్మ వెనుక దాక్కుంటారు. తమను చూసే ప్రకృతి ఈ పెద్దవాళ్ల ముఖాన నాలుగు చినుకులను చిలకరించి, నాలుగు గింజలు పండించి, నాలుగు నదులను పారిస్తుందని తెలియకనే బుల్లి బుల్లి నడకలతో చిన్నారి దేవతలై తిరుగాడుతారు. ఇటువంటి దేవదూతల కళ్లల్లో రక్తం చిమ్మించే, వీరి ఊపిరి తీయాలని చూసే, యుద్ధం చేసే నేతలను ఏం చేయాలి? శత్రువును ద్వేషించే దాని కన్నా పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తే యుద్ధాలే ఉండవు కొట్టుకోవడం మనుషుల స్వభావంలో ఉన్న అల్ప లక్షణం. మానవచరిత్ర పొడవునా గుంపులుగా కొట్టుకున్నారు. చిన్న చిన్న రాజ్యాలుగా కూడి కొట్టుకున్నారు. దేశాలుగా ఎదిగి కొట్టుకున్నారు. ఇంత నాగరికులం అయ్యామని విర్రవీగుతూ కూడా కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సుశిక్షితమైన సైన్యాలు లేవు. అశ్వికదళం అంటూ ఒకటి అడుగుపెట్టింది కూడా మూడువేల సంవత్సరాల క్రితం ఇనపయుగంలోనే. యుద్ధాల చరిత్రతోపాటు ఆయుధాల పరిణామక్రమం చూస్తే.. రాతి గదల నుంచి విల్లమ్ములు, తుపాకులు, శతఘ్నులు, యుద్ధశకటాలు, నిప్పులు కురిపించే విమానాలు, చివరికి అణ్వస్త్రాల వరకు ఆయుధపాటవం అంచెలంచెలుగా పెరిగి.. యుద్ధాన్ని విద్యగానూ, కళగానూ, వ్యూహనైపుణ్యానికి గీటురాయిగానూ మార్చివేయడం కనిపిస్తుంది. దేశం ఎదగడం అంటే గొప్ప సైనిక శక్తిగా ఎదగడమే. అందుకే ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒక మూలన యుద్ధ సైరన్‌ను మోగిస్తూనే ఉంటోంది. "పిల్లలు యుద్ధాన్ని మొదలెట్టరు. కాని ఏ యుద్ధంలో అయినా వారే ఎక్కువగా నష్టపోతారు" యుద్ధం రెండు దేశాల మధ్య, ఆ దేశాలకు చెందిన సైన్యాల మధ్య.. సాధారణ జనానికి సుదూరంగా ఎక్కడో సరిహద్దుల్లో జరుగుతుందని అనుకుంటాం కానీ యుద్ధమనేది యుద్ధక్షేత్రాన్ని దాటి ఎప్పుడో జనజీవనక్షేత్రంలోకి వచ్చేసింది. ఏ క్షణంలోనైనా శత్రు విమానాలు నేరుగా పౌరుల నెత్తి మీదే బాంబులు కురిపించవచ్చు. బాలలు, స్త్రీలు, వృద్ధులతో సహా ఎవరైనా యుద్ధాగ్నిలో సమిధలు కావచ్చు. ఆసుపత్రులు, స్కూళ్లు వేటినీ వదలరు. ఆధునిక కాలానికి వస్తున్నకొద్దీ పౌర మరణాల దామాషాలో బాలలు కడతేరడమూ పెరిగిపోయిందని చరిత్ర చెబుతోంది. 20 శతాబ్దపు తొలినాటికి యుద్ధ మృతులలో సగం మంది పౌరులైతే, 1980నాటికి అది 90 శాతానికి పెరిగింది. వీరిలో బాలలది ప్రధాన భాగం. గత రెండు దశాబ్దాల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో ఇరవై లక్షలమంది బాలలు చనిపోయారనీ, నలభై నుంచి యాభై లక్షలమంది క్షతగాత్రులయ్యారనీ, కోటీ ఇరవై లక్షలమంది నిరాశ్రయులయ్యారనీ, పది లక్షల మంది అనాథలయ్యారనీ ఐక్యరాజ్యసమితి బాలల నిధి సంస్థ చెబుతోంది. యుద్ధమనేది ఒక్కసారిగా అలా భగ్గుమని, కొన్ని రోజులపాటు కొనసాగి ఆ తర్వాత చల్లారే ఒక విడి ఘటనగా భావిస్తాం. కానీ దాని ప్రభావం బాలలు, స్త్రీలు, క్షతగాత్రులు సహా ఆ తర్వాత అనేకమందికి జీవితకాలమంతటికీ వ్యాపించి సంపూర్ణ జీవనవిధ్వంసంగా మారుతుంది. ఆ విధంగా ఒకే ఘటన అనేక గొలుసుకట్టు ఘటనల కూర్పుగా పరిణమిస్తుంది. యుద్ధం ఒక తాత్కాలిక అవాంతరమనీ, అది తొలగిపోగానే యథాప్రకారం శాంతి నెలకొని స్థిరంగా కొనసాగుతుందనే భ్రమలో కూడా మనం ఉంటాం. కానీ యుద్ధాల చరిత్రను తిరగేస్తే, యుద్ధపరిస్థితే స్థిరంగా ఉంటుందనీ.. శాంతి మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే అతిథి మాత్రమేననే చేదునిజం మన ఊహల్ని చరచి చెబుతుంది. "యుద్ధాలు జరుగుతున్నంత సేపు పిల్లలను ఆకాశంలో దాచి పెట్టేయాలి " – ఒక కవి మనం శాంతికాముకులమా? నిజమేనా? మనం ఇప్పటికీ యుద్ధాన్ని ప్రేమిస్తూ వీరత్వాన్ని ఆరాధిస్తాం. మతాల గాథలలో శౌర్యాన్ని దండిగా నింపుకుంటాం. ప్రతి వాఙ్మయంలోనూ వీరుల చుట్టూ స్తుతిగేయాలే! వీరుడంటే? యుద్ధం చేసేవాడు. శత్రువును చంపడం, వీర మరణాన్ని పొందడం దేశభక్తి. యుద్ధం పవిత్రమైన యజ్ఞంగా రూపుకట్టింది. రోగమొచ్చి చావడం కన్నా, యుద్ధంలో చావడం కీర్తికీ, జీవనసార్థక్యానికీ సంకేతమైంది. బాల్యం నుంచి వీరరసాన్ని ఉగ్గుపాలలో రంగరించి పోయడం పరిపాటి అయింది. యుద్ధంలో నీతి, అవినీతులు.. ధర్మాధర్మాలు.. అన్నీ తలకిందులవుతాయి. నిరాయుధులు, యుద్ధరంగంలో లేనివారు అయిన బాలలను, స్త్రీలను, వృద్ధులను వధించరాదన్న నీతికి పౌరాణిక, చారిత్రకకాలంలోనే కాలదోషం పట్టింది. శత్రురాజ్యాన్ని జయించడంతో ఊరుకోకుండా, శత్రునగరాన్ని దగ్ధంచేసి బూడిద కుప్పగా మార్చడం ఇప్పుడు యుద్ధనీతి. రెండువైపులా జరిగిన సైనికనష్టం, ధననష్టం గురించిన ఆరా తప్ప ఆ మంటల్లో పడి మాడి మసైన బాల్యాల లెక్కలూ, తల్లుల కడుపుకోతల కటికశోకాల సమాచారమూ చిట్టాలకెక్కవు. బతికి బయటపడినా బతుకు అస్తవ్యస్తమై జీవితాంతమూ పెనుభారమైన విషాదకథనాలు వెలుగులోకి రావు. యుద్ధం బాల్యాన్ని చిదిమేసి శేషజీవితాన్ని శవప్రాయంగా మార్చుతుంది. యుద్ధాలలో జీవన్మృతుల సంఖ్యే మృతుల సంఖ్యను ఎన్నో రెట్లు మించి ఉంటుంది. 'యుద్ధంలో గెలిచిన సంపద మొత్తం పసిపిల్లల బోసినవ్వుకు సరిసాటి కాదు' కురుక్షేత్రంలో ఎంత ప్రాణనష్టం జరిగినా అభిమన్యుడు మరణించినప్పుడు ఎక్కువ బాధ కలుగుతుంది. ఎందుకంటే అభిమన్యుడు ఇంకా పసివాడు. ఎంతో భవిష్యత్తు ఉండాల్సిన వాడు. కురుక్షేత్ర యుద్ధం పెట్టిన కడుపుచిచ్చు కన్నతల్లుల వేడికన్నీరుగా ఉబికి ధారకట్టిన వైనాన్ని మహాభారతంలోని స్త్రీపర్వం కడు దయనీయంగా చిత్రించింది. యుద్ధకారకులు ఎవరూ తల్లుల శాపం నుంచి తప్పించుకోలేకపోయారు. అయినా మనిషి గుణపాఠం నేర్చుకోలేదు. రాజ్యాల మధ్య, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే, విజేతలను ఆకాశానికెత్తి, విజితుల భంగపాటును ఎత్తిచూపడమే తప్ప యుద్ధాలు చిదిమేసిన పసిమొగ్గల గురించి, మృతుల కుటుంబాలు ఎదుర్కొన్న కల్లోలం గురించి, విద్యా, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం సహా సమస్తరంగాలనూ.. అంగాలనూ యుద్ధం ఛిద్రం చేసి సమాజాన్ని వెనుకదారి పట్టించడం గురించి చెప్పిన వాఙ్మయాలు అంతగా కనిపించవు. రెండో ప్రపంచయుద్ధాన్నే తీసుకుంటే మృత్యువు తన కర్కశరూపాన్ని ప్రదర్శించిన ఇలాంటి యుద్ధసందర్భం అంతవరకు ప్రపంచ చరిత్రలోనే లేదంటారు. 1940నాటి ప్రపంచ జనాభా 230 కోట్లు అయితే, రెండో ప్రపంచయుద్ధంలో ఏడుకోట్ల నుంచి ఎనిమిదిన్నర కోట్లమంది నాశనమయ్యారు. సైనికులు, పౌరులు సహా నేరుగా యుద్ధంలో అయిదు నుంచి అయిదున్నర కోట్లమంది మరణించారు. యుద్ధకారణంగా వ్యాపించిన రోగాలవల్ల, కరవుకాటకాల వల్ల మరణించిన పౌరుల సంఖ్య అయిదు నుంచి అయిదున్నర కోట్లకు పెరిగి మరణించిన సైనికుల సంఖ్యతో సమానమైంది. బాలల విషయానికే వస్తే, ఈ యుద్ధంలో అంతకుముందు మరే యుద్ధంలోనూ లేనంత పెద్దసంఖ్యలో మృతులవడమో, అనాథలుగా మిగలడమో జరిగింది. నాజీ జర్మన్ నరహంతకులు కోటీ యాభై లక్షలమంది యూదు బాలల ఉసురు తీశారు. వేల సంఖ్యలో రొమానీ (జీప్సీ) బాలలను అంతమొందించారు. అయిదువేల నుంచి ఏడువేల మంది జర్మన్ బాలలు శారీరక, మానసిక వైకల్యాలతో ఆవాసకేంద్రాలకు చేరి ఆహ్లాదకర, ఆశావహ బాల్యాన్ని కోల్పోయి అకాల వృద్ధులుగా గడిపారు. ఏన్ మేరీ ఫ్రాంక్ అనే యూదు బాలిక రాసిన డైరీ బాలల జీవితంలో యుద్ధం కలిగించే కల్లోలానికి అక్షరరూపమిచ్చి చిరస్థాయిగా మిగిలింది. అయినా కనువిప్పు కలగలేదు. యుద్ధాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. బాల్యాలు బేలవై బిక్కచూపులు చూస్తూనే ఉన్నాయి. 'రష్యా పిల్లలైనా, ఉక్రెయిన్ పసికందులైనా, ఇజ్రాయిల్ శిశువులైనా, గాజా చిన్నారులైనా అమ్మ పాలే తాగుతారు' వర్తమానానికి వస్తే.. అటు రష్యా– ఉక్రెయిన్ల నుంచి ఇటు ఇజ్రాయిల్–పాలస్తీనాల వరకు యుద్ధక్షేత్రాలు వ్యాపించి కన్నీటితో చావుపంటలు నిరవధికంగా పండిస్తూనే ఉన్నాయి. శాంతి, సామరస్యాల స్థాపనకు నెలకొల్పిన అంతర్జాతీయ సంస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఉక్రెయిన్ పట్ల రష్యా సాగిస్తున్న మారణకాండ దరిమిలా, గత ఏడాది కాలంగా బాలలు హింసావిలయంలో, భయబీభత్సాల వలయంలో జీవిస్తున్నారు. యుద్ధం ప్రభావితం చేయని వారి జీవనపార్శ్వం ఒక్కటీ లేదు. ఈ యుద్ధం ఇంతవరకు పొట్టన పెట్టుకున్న వెయ్యి మంది పౌరులలో మరణించిన, గాయపడిన బాలలూ అధికసంఖ్యలో ఉన్నారు. మరోవైపు పదిహేను లక్షలమంది బాలలు ఇంటికి, భద్రతకు, చదువుకు, ఆటపాటలకు దూరమై మానసిక, శారీరక అనారోగ్యాలతో ఆందోళనతో నిరాశానిస్పృహల మధ్య గడుపుతున్నారు. తల్లిదండ్రుల వెచ్చని ప్రేమాదరాల కింద గడపాల్సిన పచ్చని బాల్యాన్ని, బంగారుభవితను యుద్ధరాకాసి గుటుక్కున మింగి తేన్చింది. రష్యా–ఉక్రెయిన్ల మధ్య చూస్తున్నది, రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లోనే అతిపెద్ద మారణహోమంగా చెబుతున్నారు. అయితే, నేడు ఇజ్రాయిల్ –పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం దానిని మించిపోయి వర్తమాన యుద్ధచరిత్రను తిరగరాస్తున్నట్టు కనిపిస్తోంది. 2017 నుంచి జరిగిన ఏ ఘర్షణలతో పోల్చి చూసినా గాజా భూఖండంలో జరిగిన పౌరమరణాలు అసాధారణాలూ, కనీవినీ ఎరుగనివీ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరోస్ అంటున్నారు. తాజా ఘర్షణల్లో అటూ ఇటూ కూడా వేలాదిమంది అసువులు వీడారు. వీరిలో బాలలు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇజ్రాయిల్ వైపు పౌరులతో సహా 1300 మంది బాలలు హతమారితే.. పాలస్తీనావైపు 6వేల మంది బాలలుచ 4 వేల మంది మహిళలతో సహా 15వేల మంది నిహతులయ్యారు. నాజీ జర్మనీ రూపంలోని జాతి ఉన్మాదపు కాలసర్పం కాటు తిని, చిత్రహింసా శిబిరాలలో నలిగి నుజ్జయి ప్రపంచం సానుభూతిని చూరగొన్నవారే పాలస్తీనావారిపై అంతకుమించిన హింసకు, ప్రతిహింసకు పాల్పడుతున్నారు. ఆసుపత్రులను సైతం దాడులకు లక్ష్యం చేసుకుని పసిపిల్లలను, రోగులను హతమార్చడం నాజీ అమానుషాలను తలదన్నేదే కానీ తీసిపోయేది కాదు. అప్పుడే పుట్టిన శిశువులను కూడా బాలింతలు అరచేతుల్లో ఉంచుకుని సురక్షితప్రాంతాలకు పరుగుదీయాల్సిన పరిస్థితిని కల్పించడం వెనుక యుగయుగాలుగా ప్రోది చేసుకుంటూ వచ్చిన మంచినీ, మానవత్వాన్నీ కాలరాసే క్రౌర్యమూ కుత్సితమూ ఉన్నాయి. ఆహారంతో సహా అన్ని రకాల నిత్యావసరాల సరఫరానూ అటకాయించే దిగ్బంధమే పది యుద్ధాల పెట్టు. ఒక్కసారిగా కాకుండా అనునిత్యం ఎదుర్కొనే అనేకానేక చావులకు సమానం. 2006 నుంచీ గాజాపౌరులపైన ఇజ్రాయిల్ అలాంటి దిగ్బంధాన్ని అమలు చేస్తోంది. దాంతో గాజా ఆర్థికత దారుణంగా అడుగంటిపోయింది. స్థూలజాతీయోత్పత్తి 30 శాతం పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. 81శాతం జనం దారిద్య్రరేఖకు దిగువున జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది. వైద్యం కోసం కూడా రోగుల్ని బయటకు వెళ్లనివ్వకుండా దిగ్బంధాన్ని అమలు చేయడం జరుగుతోంది. దిగ్బంధమంటే ఒక ప్రాంతాన్నే విశాలమైన చెరసాలగా మార్చి అసంఖ్యాక జనాన్ని బందీలుగా ఉంచడమే! ఆ చెరలో బాలలు, స్త్రీలు, వృద్ధులతో సహా అందరూ బందీలవుతారు. అది బాల్యానికి చెర. వారి చదువుసంధ్యలకు, వారి భవిష్యత్తుకు, వారి శారీరక, మానసిక వికాసానికి ఉరి. ఎదిగే లేతమొక్క లాంటి వారి జీవితాలపై బండ. యుద్ధోన్మాదులందరూ ఒకే జాతి, ఒకే మతం. అందులో జయాపజయాలు, బలాబలాల తేడాలు తప్ప ఇతరేతర భేదాలు ఉండవు. దాని ఫలితమే రెండువైపులా దాడులు, విచక్షణారహితమైన ఊచకోతలు, బాలల బతుకుల్ని బుగ్గి చేసే నొసటి రాతలు. 'ఈ భూమి మోసే అన్ని భారాల్లోకెల్లా అత్యధిక భారం ఏమిటో తెలుసా? పసిపిల్లల శవపేటిక' విజ్ఞత, వివేకం, విచక్షణ సహా అన్నింటినీ మింగేసే అనకొండ యుద్ధం. మనిషి నడవడికి దిక్సూచులుగా నిఘంటువులకెక్కిన ప్రతి ఒక్క మంచిమాటనూ తన రక్తపు వేళ్ళతో చెరిపేసి తన పేరు రాసుకునే మాటే యుద్ధం. పసి చేతులకు ఆయుధాలు అందించి మసి చేయడానికి అది వెనుకాడే ప్రశ్న లేదు. పద్దెనిమిదేళ్ళ లోపు బాలలను యుద్ధాల బరిలోకి లాగడం మధ్యయుగాల నుంచీ, అలనాటి ఫ్రెంచి సైనికశాసకుడు నెపోలియన్ కాలం నుంచీ ఉందని చరిత్రకారులు అంటారు. అమెరికా అంతర్యుద్ధంలో కూడా బాలలు పాల్గొనడం కనిపిస్తుంది. రెండో ప్రపంచయుద్ధంలో బాలలు పాల్గొనడమే కాదు.. నాజీ జర్మనీలో ‘హిట్లర్ యువత’ పేరుతో ‘యుద్ధసేవలు’ అందించారు. నేటి కాలానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాలలోని యుద్ధక్షేత్రాలలో దాదాపు పాతిక కోట్లమంది బాలలు ఉండగా, వారిలో మూడులక్షలమంది సైనికవిధులు నిర్వహిస్తున్నట్టు, వారిలో నలభైశాతం మంది బాలికలున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మంట మిడతలదండును ఆకర్షించినట్టుగా యుద్ధం వయోభేదం లేకుండా అందరినీ ఆకర్షిస్తుంది. యుద్ధవాదులు దానిని అలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. యుద్ధానికీ, శాంతికీ మధ్య విభజనరేఖ చెరిగిపోయి.. అటు నుంచి ఇటూ.. ఇటు నుంచి అటూ నిరంతర చంక్రమణం చేసే పరిస్థితిని లియో తొల్స్తాయ్ ‘యుద్ధం – శాంతి’ నవలలో అనితరసాధ్యంగా చిత్రిస్తాడు. జీవించడమూ, సంపూర్ణంగా జీవితాన్ని ఆనందించి ఆస్వాదించడమే ప్రతి ప్రాణికి ప్రకృతి కల్పించిన సహజాతం. అలాంటిది, యుద్ధపరిస్థితిలో చావే జీవితంగా ఎలా మారిపోతుందో తొల్స్తోయ్ కళ్ళకు కట్టిస్తాడు. రేపటి జీవితం గురించి కమ్మని కలలు కంటూ కంటూనే యువకులు యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టి చావుతోనూ, చావు పరిస్థితులతోనూ ఎలా సహజీవనం చేస్తారో రూపు కడతాడు. ఫ్రెంచి సేనల ముట్టడిలో మాస్కో నగరం దగ్ధమవుతున్నప్పుడు మంటలను తప్పించుకుని ప్రాణాలు దక్కించుకోడానికి తట్టాబుట్టతో వీథిన పడ్డ కుటుంబాల గురించి, సైనికులు చేసిన నిలువుదోపిడీల గురించి, మంటల్లో చిక్కుకున్న తన పసిబిడ్డ కోసం తల్లి పెడుతున్న శోకాలకు కరిగి పియర్ అనే యువకుడు మంటల్లోకి దూకి ఆ పసిపాపను రక్షించడం గురించి రాస్తాడు. పేత్యా అనే పదిహేడేళ్ళ యువకుడు ఉరకలేసే ఉత్సాహంతో యుద్ధంలోకి దూకి కోరి కోరి మృత్యువును కావిలించుకున్నప్పుడు తల్లి కంట వరద కట్టిన దుఃఖాన్ని అక్షరాలకెత్తుతాడు. 'మంచి యూనిఫామ్, తినదగ్గ చాక్లెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు.. పిల్లలకు యుద్ధం లేని నేలను ఇవ్వండి' యుద్ధం బాలల బతుకుపై కలిగించే దుష్ప్రభావాల గురించి అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. యుద్ధప్రభావం పెద్దలపై కన్నా బాలలపై అనేక రెట్లు ఉంటుందన్న సంగతి సాధారణంగా మన ఊహకెక్కదు. యుద్ధ దుష్పరిణామాలతో పెద్దలకన్నా బాలలు ఎక్కువ కాలం జీవించవలసివస్తుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలవుతారు, ప్రేమాదరాల చలవపందిరి కింద గడపవలసిన వయసులో అనా«థాశ్రమాలకు చేరి లేత వయసులోనే పది జీవితాల పెనుభారం కింద అణగిపోతారు. శేషజీవితం వారి ముందు కత్తులబాటలా మారి సుదీర్ఘంగా పరచుకుంటూనే ఉంటుంది. యుద్ధగాయాలు, రోగాలు, మానసిక వైకల్యాలు జీవితాంతమూ వారిని వెంటాడుతూనే ఉంటాయి. జీవితం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని వయసులో ఎదుర్కొనే మానసికమైన ఒత్తిడులను, ఆందోళనలను, భయబీభత్సాలను ఇంకొకరితో పంచుకోలేని మూగలవుతారు. నిర్బంధశ్రమకు గురవడమే కాదు.. బాలికలు మానభంగాలకు ఎరవుతారు. ఒక తరం మొత్తం విద్యా, విజ్ఞానాలకు, గౌరవప్రదమైన జీవితానికి దూరమైనప్పుడు దాని ప్రభావం ఎన్ని తరాలపై పడుతుందో ఊహించుకోగలం. అయినా మనలో వివేకం మేలుకోవడం లేదు. యుద్ధదేవతకు ఎంత విధ్వంసాన్ని, ఎన్ని ప్రాణాలను, భావిజీవితం చుట్టూ పేర్చుకునే ఎన్నెన్ని అందమైన కలల ఛిద్రాలను నైవేద్యం చేస్తున్నామన్న ఎరుక లేదు. ఎన్ని పసిదనాలు వసివాడిపోయి రేపటి ప్రపంచమనే పూదోట మన కళ్ళముందే ఎలా వల్లకాడుగా మారిపోతోందోనన్న విజ్ఞత లేదు. సకల రకాల యుద్ధాలకూ వ్యతిరేకంగా మానవాళి ఇప్పటికీ ఒక్కపెట్టున గళం ఎత్తడంలేదు. యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఈ నిర్విరామ యుద్ధంలో శాంతి గెలిచేదెప్పుడు? బాలల జీవితాలు వేయి రేకుల కలువల్లా విప్పారి కాంతులను నింపేదెప్పుడు? కె.భాస్కరం (చదవండి: ఎన్నికల సీన్ ఎక్కడైనా సేమ్ టు సేమ్! ఆకాశాన్ని తాకే వాగ్దానాలు.. తారలతో తోరణాలు..) -
పిల్లల పెరుగుదల: సరైన పోషకాల స్వీకరణ, ప్రాముఖ్యత
పిల్లల్లో పోషకాహార లోపం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రజారోగ్య సమస్య. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. బాల్యం వేగవంతమైన వృద్ధి దశలో పిల్లల ఎత్తు బరువు వంటి కీలక మైలురాళ్లు. పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ, వివిధ జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. స్టన్నింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం) అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువులేకపోవడం) వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు తక్కువ) లాంటివి కీలక అంశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 149 మిలియన్ల మంది పిల్లలు వయసు తగ్గ ఎత్తు ఎదగలేదు. భారతదేశంలో వీరి వాటా దాదాపు మూడింట ఒక వంతు. ఐదేళ్లలోపు వయస్సున్న 40.6 మిలియన్ల మంది పిల్లలు స్టన్నింగ్ కేటగిరీలో నమోదైనారు. సరియైన విజ్ఞానం లేకపోవడం, విద్యాపరమైన విజయాలు, ఉత్పాదకత కోల్పోవడం లాంటివి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలతో పాటు, ఎదుగుదలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఇది పిల్లల జీవితంలో వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది. పోషకాహార లోపాలు రోగనిరోధక శక్తి క్షీణించడం, ప్రవర్తనా సమస్యలు, ఎముకల ఆరోగ్యం క్షీణించడం, కండరాల్లో శక్తి లేకపోవడం లాంటి ప్రమాదాలకు దారితీయవచ్చు. పిల్లలు ఎదగడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి సరైన పోషకాహారం అవసరమైన పునాదులేస్తాయి. పిల్లలకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వుతో పాటు కాల్షియం, విటమిన్ D, విటమిన్ K, అర్జినిన్ వంటి సూక్ష్మపోషకాలతో సహా సరైన మొత్తంలో మాక్రోన్యూట్రియెంట్లు అవసరం. పిల్లల వృద్ధి, ఎగుదలలో పోషకాహార జోక్యం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ గణేష్ కధే, మెడికల్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్, అబోట్ న్యూట్రిషన్ బిజినెస్ తెలిపారు. తల్లిదండ్రులు వివిధ స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలతో కూడిన సమతుల్య పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అబాట్, పోషకాహార లోపం పరిష్కారాల కోసం అబాట్ సెంటర్‌ను ప్రారంభించడంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేయనుంది. నిపుణులు, భాగస్వాముల సహకారంతో, పిల్లలతో సహా, ఇతర జనాభా కోసం పోషకాహార లోపాన్ని గుర్తించడం, చికిత్స , నివారించడంపై దృష్టి ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ పెడ్రో అలార్కోన్ దీనిపై మరిన్ని వివరాలు అందిస్తూ స్టంటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహారం పాత్రను అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఓవర్ నూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. పోషకాహార సప్లిమెంట్ పానీయాలను సేవించడం ద్వారా పోషకాహార లోపాన్ని పూరించు కోవచ్చు. అవసరమైన విటమిన్లు, ఖనిజాల స్వీకరణలో కూడా దోహద పడతాయి. ఇది పోషకాల స్వీకరణ సామర్థ్యాన్ని పెంచడం లాంటిదే. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని పిల్లల శరీరాలు సంపూర్ణంగా స్వీకరిస్తాయని వివరించారు. పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు మినరల్స్ కీలకం, అయితే కొన్నిసార్లు కాల్షియం, ఐరన్ జింక్ వంటి 50శాతం పోషకాలు మాత్రమే పిల్లవాడు తినే ఆహారం నుండి లభిస్తాయి. కనుక ఈ విషయంలో పోషకాహార సప్లిమెంట్లు ద్వంద్వ పాత్రను పోషిస్తాయి. ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇటీవలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 33.8శాతం మంది పిల్లలు ఉన్నారని తేలిందని సికింద్రాబాద్, యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ విభాగాధిపతి DNB పీడియాట్రిక్స్ ప్రోగ్రాం హెడ్ డాక్టర్ డీరమేష్ తెలిపారు. గ్రామీణ తెలంగాణలో 33 శాతం మంది సరైన ఎదుగుదలకు తోడ్పడటానికి, పిల్లలకు ఐదు ఆహార సమూహాల నుండి వచ్చే స్థూల మరియు సూక్ష్మ పోషకాల మంచి మిశ్రమం కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, పాల ఉత్పత్తులు, ఇంకా తృణధాన్యాలు వల్ల ఆరోగ్యకరమైన సంపూర్ణ ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పిల్లలకు అందేలా తల్లిదండ్రులు ఆహారాన్ని అందించాలి. సమతుల్య ఆహారం, అవసరమైనప్పుడు పోషకాహార సప్లిమెంట్ డ్రింక్స్ లాంటి ఆకర్షణీయమైన కలయికతో పిల్లల అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం తోపాటు, పూర్తి సామర్థ్యాన్ని స్వీకరించే శక్తినిస్తుందని పేర్కొన్నారు. -
చెత్త ఏరుకునే స్థాయి నుంచి హోటల్లో చెఫ్ వరకు..
తల్లిదండ్రులు చనిపోయారు.బంధువులు దూరం జరిగారు. తనకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా కన్నీళ్లు, కష్టాలు మాత్రం కచ్చితంగా ఉండేవి. అయినా సరే ఆ చిన్నారి ఎప్పుడూ నిరాశపడలేదు. చెత్త ఏరుకునే స్థాయి నుంచి దిల్లీలోని ప్రముఖ హోటల్లో చెఫ్ వరకు ఎదిగి, కష్టాల చీకటిని ఛేదిస్తూ రెయిన్బోగా వెలిగి ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది లిలిమా ఖాన్... దిల్లీ వసంత్‌కుంజ్‌లోని లె క్యాంటిన్ రెస్టారెంట్లో లిలిమాఖాన్ చెఫ్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారింది. కడుపు నింపుకోవడం కోసం చెత్త ఏరింది. ఇటుకలు మోసింది. ఇండ్లలో పనిచేసింది... ఒకటా రెండా... పొట్టనింపుకోవడానికి ఎన్నెన్నో పనులు చేసింది. డబ్బులు లేని సమయంలో ఆకలి తట్టుకోలేక చెత్తబుట్టల్లో నుంచి మెతుకులు ఏరుకుని తిన్న సందర్భాలూ ఉన్నాయి. ఆకలి తీర్చుకోవడం ఒక ఒక పనైతే పోకిరీలు, రౌడీల నుంచి తనను తాను రక్షించుకోవడం మరో పెద్ద పనిగా మారింది. కష్టాల కత్తుల వంతెనపై నడుస్తున్న ఖాన్‌కు ‘కిల్కరి రెయిన్బో హోమ్’ రూపంలో దివ్యమైన దారి దొరికింది.‘ఇక్కడ నాకు ఆహారం, ప్రేమతో పాటు ఎన్నో దొరికాయి. అందులో చదువు ఒకటి’ అంటుంది ఖాన్. కుటుంబంలేని తనకు ‘రెయిన్బో’ అనే స్వచ్ఛందసంస్థ పెద్ద కుటుంబమై ప్రేమను పంచింది. ‘రెయిన్బో’లో ఖాన్‌కు ఇష్టమైన ప్రదేశం... వంటగది. వంటచేస్తున్న వాళ్లకు చిన్న చిన్న పనులలో సహాయపడేది. చదువు పూర్తయిన తరువాత ‘రెయిన్బో’ సహాయంతో ఖాన్ కుకింగ్‌లో అప్రెంటిస్‌షిప్ చేసింది. శిక్షణ పూర్తయిన తరువాత దిల్లీలోని ఇటాలియన్ రెస్టారెంట్లో స్టాఫ్ కుక్‌గా ఖాన్‌కు అవకాశం వచ్చింది. ఆ తరువాత లె క్యాంటీన్లో చేరింది.‘ఇంత పెద్ద హోటల్లో నేను పనిచేయగలనా అని మొదట్లో భయపడ్డాను. కొన్ని రోజులకు ఆ భయం దూరమైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ అంటుంది ఖాన్. ‘స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉండని ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకున్నారు’ అనేది ఖాన్‌కు తరచుగా ఎదురయ్యే ప్రశ్న. ‘చెఫ్ జూలియాకు ఇండస్ట్రీలో పెద్ద పేరు ఉంది. ఆమె నాకు ఆదర్శం. ప్రతిభ ఉంటే జెండర్ అనేది అడ్డంకి కాదు’ అంటుంది ఖాన్. ఒకరోజు హోటల్‌కు తనను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. ‘ఈ అమ్మాయికి నాతో పనేమిటి’ అనుకుంది మనసులో. ఆ అమ్మాయి మాత్రం మనసు విప్పి మాట్లాడింది. ‘పరీక్షలో ఫెయిల్ అయిన నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి. ఆ సమయంలో మీ గురించి చదివాను. నా సమస్య చాలా చిన్నదిగా అనిపించింది. ఎన్నో కష్టాలను తట్టుకొని మీరు సక్సెస్ అయ్యారు. మీ స్ఫూర్తితో నేను కూడా విజయం సాధించాలకుంటున్నాను’ అని చెప్పింది. ‘కష్టాలలో నలిగినా వెనకడుగు వేయకుండా సాధించిన విజయాలు మనకు మాత్రమే పరిమితం కావు. అవి పదిమందికీ స్ఫూర్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి అని నేను విన్న మాట ఆ సమయంలో గుర్తుకు వచ్చింది’ అంటుంది లిలిమాఖాన్. -
దిగ్గజ పారిశ్రామికవేత్తలు చిన్నవారైపోతే, ఇలా ఉంటారా? (ఫోటోలు)
-
ఆ ఫోటోలోని క్యూట్ బేబీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
బాల్యంలోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస సినిమాలతో అదరగొట్టింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పై ఫోటోలో తన తండ్రి చేతిలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఆ చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరో మీరు గుర్తు పట్టారా? (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) ఆ ఫోటోలోని క్యూట్ చిన్నారి ఎవరంటే.. మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్. నేచురల్ స్టార్ నాని జెంటిల్మెన్ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత నిన్నుకోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా శాకిని డాకిని లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతకుముందే ఓరుతే వేరు భార్య చిత్రంలో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. తమిళంలోనూ చాలా సినిమాల్లో నటించింది. (ఇది చదవండి: అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!) కాగా.. ఈ ఏడాది ‘ఎంతడా సాజి’ అనే మలయాళ మూవీలో కనిపించిన భామ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
'ఎక్కడ తగ్గాలో తెలిసినోడు'.. చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కి
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి ఏం చేసినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. గౌతమ్ గంభీర్‌తో గొడవ కోహ్లి తాను ఎంత అగ్రెసివ్ అనేది మరోసారి నిరూపించింది. అయితే తాను అగ్రెసివ్ మాత్రమే కాదని.. మంచి మనసు కూడా దాగుందని కోహ్లి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలుసుకొని కాళ్లు మొక్కడం వైరల్‌గా మారింది. తన క్రికెట్లో ఓనమాలు నేర్పిన గురువును చూడగానే కోహ్లీ చేస్తున్న ప్రాక్టీసును ఆపేశాడు. నేరుగా రాజ్ కుమార్ శర్మ వద్దకు చేరుకుని వినయంగా పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విధేయత పట్ల ఎంతో సంతోషించిన ఆయన శిష్యుడి వీపు తట్టి దీవెనలు అందించాడు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగుల స్కోరు వద్ద ఐపీఎల్లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. A wholesome meet & greet 🤗@imVkohli catches up with his childhood coach 👌🏻👌🏻#TATAIPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/YHifXeN6PE — IndianPremierLeague (@IPL) May 6, 2023 చదవండి: 'కింగ్' కోహ్లి చరిత్ర.. ఐపీఎల్లో తొలి బ్యాటర్‌గా -
ఆ ఇద్దరిలో ఒకరు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తుంటారు. ఇక సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు. అలాగే తమ జీవితంలోని ప్రతి సందర్భాన్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడం ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలు కనిపిస్తున్న ఇద్దరిలో ఓ పాప స్టార్ హీరోయిన్. దక్షిణాదిలో పలువురు అగ్ర హీరోలతో నటించింది. తనదైన నటనతో మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకు ఆ పాలబుగ్గల పసిపాప ఎవరో మీకు గుర్తొచ్చిందా? మరెవరో కాదు.. సావిత్రి బయోపిక్‌లో మహానటి సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకున్న నటి కీర్తి సురేశ్. నేను శైలజా సినిమాతో టాలీవుడ్లో ఫేమ్ సాధించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆమె తన ఇన్‌స్టాలో ఆ ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది కీర్తి సురేశ్. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తాజాగా కీర్తి సురేశ్ తన అక్క రేవతి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తనతో దిగిన చిన్నప్పటి ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. కాగా.. కీర్తి సురేశ్ అక్క రేవతి కూడా విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్‌లో ఆమె పనిచేశారు. కీర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అక్కా నీ పుట్టినరోజు సందర్భంగా నా గ్యాలరీ నుంచి అందమైన జ్ఞాపకాలు ఇవీ. వీటి ద్వారా ప్రేమ, కౌగిలింతలతో కూడిన శుభాకాంక్షలు పంపుతున్నా. ఈ ఏడాదిలో ఇంతకుముందు లేని విధంగా ప్రత్యేకంగా ఉండనివ్వండి’అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం నానితో కలిసి దసరా చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కనిపించనున్నారు. -
బాల్యంలో నిమోనియా బారిన పడితే... భయంపుట్టిస్తున్న స్టడీ వివరాలు..
లండన్: బాల్యంలో నిమోనియా వంటివాటి బారిన పడ్డవారికి పెద్దయ్యాక శ్వాసపరమైన ఇన్ఫెక్షన్ల ముప్పు అధికమని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా 26 నుంచి 73 ఏళ్ల మధ్య వయసులో శ్వాస సంబంధిత సమస్యలతో మరణించే ప్రమాదమూ ఎక్కువేనని అది తేల్చింది. ‘‘రెండేళ్లు, అంతకంటే తక్కువ వయసులో బ్రాంకైటిస్, నిమోనియా వంటివాటి బారిన పడేవారిలో పెద్దయ్యాక శ్వాస సంబంధిత వ్యాధులతో అకాల మరణం సంభవించే ఆస్కారం ఇతరులతో పోలిస్తే 93 శాతం ఎక్కువ’’ అని వివరించింది. దీర్ఘకాలిక శ్వాస సమస్యలు పెద్ద ఆరోగ్య సమస్యగా మారాయి. వీటివల్ల 2017లో ప్రపంచవ్యాప్తంగా 39 లక్షల మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో చాలా మరణాలకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) కారణమని అధ్యయనం పేర్కొంది. అందుకే శ్వాస సంబంధిత సమస్యలను చిన్నతనంలోనే సంపూర్ణంగా నయం చేయడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉందని అధ్యయనానికి సారథ్యం వహించిన ఇంపీరియల్కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన జేమ్స్ అలిన్సన్ అభిప్రాయపడ్డారు. దీని ఫలితాలు ద లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
8 ఏళ్లప్పుడు మా నాన్న లైంగికంగా వేధించాడు
చెన్నై/జైపూర్: నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రే తనను లైంగికంగా వేధించారని చెప్పారు! ‘మోజో స్టోరీ’ డిజిటల్ వార్తా చానల్ ఇటీవల జైపూర్‌లో నిర్వహించిన ‘వుయ్ ది విమెన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు. లైంగికంగా వేధించేవాడు. ఒక మగవాడిగా దాన్ని జన్మహక్కుగా భావించేవాడు. నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని గుర్తు చేసుక్నున్నారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైతే అది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. -
ఒక్క సినిమాతో స్టార్డమ్.. ఆ చిన్నారిని గుర్తు పట్టగలరా?
కేవలం ఒక్క సినిమాతోనే తన సత్తా చాటింది. ఓకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు తెలుగు.. ఇటు తమిళ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే ఇన్ని అద్భుతాలు సృష్టించింది. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. ఒక్క సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక్క సినిమాతోనే ఇన్ని అద్భుతాలు సృష్టించిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లవ్ టుడే హీరోయిన్ ఇవానా. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నప్పటి ఫొటోల్లోనూ ముద్దు ముద్దుగా ఉంది హీరోయిన్. ‘లవ్ టుడే’ సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకుల పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ ఇవానా. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ్లో చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్లో రిలీజ్ చేశారు. నవంబర్ 25న టాలీవుడ్లో విడుదలైన ఈచిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.2.35 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. గతంలో ఓ తెలుగు ఛానల్‌తో మాట్లాడుతూ ఓ తెలుగు స్టార్ హీరో ఫ్యాన్‌ని అంటూ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. తెలుగులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని.. ఆయన సినిమాలను తప్పకుండా చూస్తానని తెలిపింది. కాగా.. ప్రస్తుతం ఇవానా టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మించనున్న కొత్త ప్రాజెక్టులో నటించనున్నట్లు తెలుస్తోంది. ధోనీ ఎంటర్టైన్మెంట్ లెట్స్ గెడ్ మ్యారిడ్ సినిమాలో ఇవానా నటించనుంది. ఈ చిత్రానికి తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జనవరి 27న ప్రారంభమైంది. -
ఫోటోలో ఉన్న పాలబుగ్గల పసివాడు ఎవరో తెలుసా?
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? చాలా క్యూట్‌గా కనిపిస్తున్న పాల బుగ్గల ఆ పసివాడు ఎవరో తెలుసా? సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు అని మీకు తెలుసా? అమాయకంగా కనిపిస్తున్న ఈ బుడ్డోడు అందరి కలల రాకుమారుడిగా ఎదిగాడు. చలనచిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ స్టార్ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. ఆ పాలబుగ్గల చిన్నారి మరెవరో కాదు. ప్రస్తుతం బాక్సాఫీస్‌ను ఓ ఆటాడుకుంటున్న బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. ఆయన నటించిన చిత్రం పఠాన్ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా ఆయన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొణేతో కలిసి నటించిన స్పై థ్రిల్లర్ మూవీ పఠాన్ థియేటర్లను షేక్ చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.550 కోట్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో మరో హీరో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సందర్భంగా స్టార్ హీరో చిన్ననాటి ఫోటోలు వైరల్‌గా మారాయి. -
అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక
అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి రష్మిక మందన్నా. కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుని ఇటీవల బాలీవుడ్‌కు పరిచయమైంది. అక్కడ నటించిన గుడ్ బై చిత్రం నటిగా ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టినా ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్న మరో రెండు చిత్రాలపైనే ఈ భామ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే తెలుగులో నటించనున్న పుష్ప-2 మినహా మరో చిత్రం లేదు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం! ఇక కోలీవుడ్ లోనూ విజయ్‌తో జతకడుతున్న వారీసు చిత్రం ఈమెకు చాలా కీలకం. ఇక్కడ ఈ చిత్రం విజయం రషి్మకకు చాలా అవసరం. కారణం కోలీవుడ్‌లో కార్తీకి జంటగా పరిచయం అయిన సుల్తాన్ చిత్రం ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఆర్థికంగా ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. తండ్రి కూడా వ్యాపార రంగంలో సంపాదిస్తున్నారు. ఆ మధ్య ఆయన ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు కూడా జరిగాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే రష్మిక మందన్నా జీవితంలో పేదరికం అనే మరో కోణం కూడా ఉందట. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు మాతృభాష (కన్నడం)లో కిరిక్ పార్టీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన రష్మిక బాల్యం భారంగానే సాగిందట. ఆదిలో కుటుంబ జీవితం కష్టంగా ఉండేదట. ఈ విషయాన్ని రష్మికే స్వయంగా చెప్పింది. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె తన బాల్యం రోజులను గుర్తు చేసుకుంది. తన చిన్నతనంలో కుటుంబం చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొందని, నాన్న ఆదాయం లేక చాలా కష్టాలు అనుభవించినట్లు చెప్పింది. ఇంటి అద్దె చెల్లించలేక రెండు నెలలకొకసారి ఇల్లు మారాల్సిన దుస్థితి ఉండేదని తెలిపింది. నాన్న తనకు ఒక బొమ్మను కూడా కొనివ్వలేకపోయారని తన బాల్య పేదరికాన్ని గుర్తు చేసుకుంది. -
పరిణతి... జీవన సాఫల్యం
బాల్యదశ తరువాత మనలో శారీరకంగా వచ్చే మార్పు, ఎదుగుదలే పరిణతి. ఇది భౌతికమైనదే కాదు, మానసికమైనదీ కూడ. మన ఆలోచనలలో, ఆలోచనా రీతిలో వచ్చిన, వస్తున్న తేడాను చూపుతుంది. అంటే మన మనోవికాసాన్ని, దాని స్థాయిని సూచిస్తుంది. మనం వయసు రీత్యా ఎదిగే క్రమంలో మన భాషలో, అభివ్యక్తిలో, ఎదుటివారిని అర్ధం చేసుకునే తీరులో, మన స్పందనలో వెరసి మన ప్రవర్తనలో వచ్చే క్రమానుగతమైన మార్పే పరిణతి. కొంతమందిలో వారి శారీరక వయసు కన్నా పరిణతి వయసు ఎక్కువ. మరికొందరిలో దీనికి భిన్నమూ కావచ్చు. వయసులో పెద్దవారైనా తగిన పరిణతి లేకపోవచ్చు. అలాగే వయసులో చాలా చిన్నవారైనా కొంతమందిలో ఎంతో మానసిక పరిణతి కనిపిస్తుంటుంది. కాబట్టి మన వయసు మన మానసిక ఎదుగుదలకు దర్పణం కావచ్చు. కాకపోవచ్చు. అందువల్లనే పరిణతికి వయసు లేదని, వయసు రీత్యా నిర్ధారించలేమని విజ్ఞులు చెపుతారు. పరిణతికి ఛాయార్థాలు చాలా ఉన్నా పరిపక్వత అన్న అర్థంలో ఎక్కువగా వాడతారు. ప్రవర్తన గురించి చెప్పటానికి తరచూ వాడే మాట. పరిణతి అన్న నాలుగు అక్షరాలలో ఎంతో విశేషమైన, లోతైన, విస్తృతార్థముంది. పరిణతంటే సంక్షిప్తంగా చెప్పాలంటే భావోద్వేగాల మీద గట్టి పట్టు, నియంత్రణే పరిణతి. విచక్షణ, వివేచన, సంయమనం, సహనం, క్షమాగుణం, ఉచిత సంభాషాణ తీరు, దూరదృష్టి, విభేదాలు మరచి అందరిని కలుపుకుని ముందుకు సాగే వైఖరి. ఇక్కడ ఉదాహరించినవి కొన్నే అయినా ఈ పరిణతి ఇంకా ఎన్నో లక్షణాలను దానిలో పొదవుకుంది. మన పుట్టుకకు లక్ష్యం జీవితాన్ని మెరుగుపరుచుకోవటం. మనలోని దుర్గుణాలను తొలగించుకుంటూ, మంచిని పెంచుకుంటూ ఇతరులను కలుపుకుని మనలోని మానవీయ శక్తులను బలపరచుకుంటూ ముందుకుసాగాలి. అదే జీవిత సార్థకత. ఉత్తమమైన, ఉన్నతమైన పథంలో పయనించగలగాలి. అప్పుడే కదా మానవులు బుద్ధిజీవులన్న మాటకు మరింత ఊతాన్నిచ్చినట్టు! ఇది మనసు లో నిలుపుకుని మానవుడే మహనీయుడు అన్న మాటను సుసాధ్యం చేయాలనుకునే వారికి.. పరిణితి ఎందుకు సాధ్యం కాదు? అన్న ఆలోచన వస్తుంది. దీన్ని సాధించి తీరాలన్న పట్టుదల వస్తుంది. అటువంటి వారికి ఇంత గొప్ప పరిణితి సాధించటం అసాధ్యం కాదు. అంటే దీనర్థం పరిణతికున్న అర్ధ పార్శా్వలన్నిటిపై వారికి ఓ పట్టు వచ్చి వారి వ్యక్తిత్వంలో ఒక భాగమైపోతుంది. మన జీవనక్రమంలో అనేకమందితో కలసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణం కొందరితో కొంతకాలం, మరికొందరితో జీవితాంతం సాగుతుంది. వీరందరితోనూ సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవలసిన ఆవశ్యకత ఉంది. దీనికి గొప్ప మానసిక పరిణతి కావాలి. ఇంతటి ఉన్నత పరిపక్వత సాధించే గలిగే వారు వేళ్ళమీద లెక్కించగల సంఖ్యలోనే ఉంటారు. వాళ్లు వయసులో పెద్దవారైనా చిన్నవారైనా గొప్పవారే, ఆదర్శనీయులే, నమస్కరించ తగినవారే. ఒక విషయాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో మన దృష్టి ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇక్కడ దృష్టి అంటే మన వైఖరి. సమగ్రమైన అవగావన రావాలంటే దానికి చుట్టుకొని ఉన్న అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అపుడే దానిమీద సాధికారంగా మాట్లాడగలం. ఈ దృష్టి, విశ్లేషణా శక్తి, అవగాహనా తీరునే పరిణతి అంటాం. స్థాయిలో పరిణితి సాధ్యమా? అన్న ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. గట్టి ప్రయత్నం చేయగలిగితే కనక ఇది సాధ్యమే.. ఇది మన దృఢ నిశ్చయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ ప్రయత్నించినా ఇది ఏ కొందరికో మాత్రమే పట్టుబడే శక్తి. ఈ పరిణితికి ఆవృతమైన అనేక లక్షణాలలో కొందరికి కొన్ని బాగా అలవడచ్చు. అందుకే దీనికి స్థాయీభేదం ఉంటుంది. ప్రతి ఒక్కరి వయసు పెరుగుతూ ఉంటుంది. ఇది భౌతికమైనది. దీనికి అదే నిష్పత్తిలో మానసిక ఎదుగుదల ఉందా? మనలో ఎంతమంది వయసుకు తగిన విధంగా సమయోచితంగా ప్రవర్తిస్తున్నాం!? ఈ రెండిటి మధ్య ఒక సమతౌల్యత పరిణతే కదా! మనం కొన్ని విషయాల్లో కొందరితో విభేదిస్తాం. అంతమాత్రాన బద్ధశత్రువులం కానవసరంలేదు. ఓ భావపరమైన, సిద్ధాంతపరమైన విషయాల వరకు మాత్రమే దానిని పరిమితి చేయాలి. అలాగే చంపదగ్గ శత్రువు మన చేత చిక్కినా వాడిని చంపకుండా తగిన మేలు చేసి విడిచిపెట్టాలని వేమన చెప్పిన దానిలోనూ, మనకు అపకారం చేసిన వారికి కూడ వారి తప్పులను ఎంచకుండా ఉపకారం చేయాలని బద్దెన చెప్పిన దానిలో గోచరించేది పరిణతే. పరిణతి ఓ ధైర్యం. నిశ్చలత, స్థిత ప్రజ్ఞత. చక్కని శ్రుతి లయలతో, ఆరోహణ అవరోహణలతో, భావయుక్తంగా అటు శాస్త్రీయత ఇటు మాధుర్యం రెండిటి సమాన నిష్పత్తిలో అద్భుతంగా సంగీతకచేరి చేస్తున్నాడో యువ సంగీత కళాకారుడు. ఆ రాగ జగత్తులో, ఆ భావనాజగత్తులో విహరిస్తూ తాదాత్మ్యతతో పాడుతున్న అతడి గానం పండిత, పామర రంజితంగా సాగింది. తన సంగీత ప్రవాహంలో ఊయలలూగించిన ఆ కళాకారుడు అంధుడు. కచేరి అనంతరం అతణ్ణి ఆ ఊళ్ళో అతనికి చిన్నప్పుడు సరళీ స్వరాలు నేర్పుతూ అసలు ఈ గుడ్డివాడికి ఆ విద్య అలవడనే అలవడదని తరిమేసిన అతని గురువు దగ్గరకు తీసుకు వెళ్లారు నిర్వాహకులు. ఆ శిష్యుడు ఆయనకు పాదాభివందనం చేసి‘ఇదంతా మీరు పెట్టిన భిక్షే’ అని వినయంగా ఆయన పక్కన నిలబడ్డాడు. అంతే! ఆ గురువుకు తను చేసిన చర్య మనసులో కదిలి, సిగ్గుపడ్డాడు. అటు సంగీతంలోనే కాకుండా ప్రవర్తనలోనూ ఎంతో పరిణతి సాధించిన శిష్యుణ్ణి చూస్తూ ఆనందాశ్రువులు రాలుస్తూ మనసారా అతణ్ణి ఆశీర్వదించాడు. శారీరక వయసు కన్నా పరిణతి వయస్సు ఎక్కువని చెప్పటానికి ఇది చక్కని ఉదాహరణ. పరిణతి పొందటానికి అత్యంత అవసరమైనది అవేశాన్ని వీడటం. దానికి ఎంత దూరమైతే మానసిక పరిపక్వతకు అంత దగ్గరవుతాం. ఆవేశంలో ఆలోచనా శక్తిని కోల్పోతాం. వివేకం నశిస్తుంది. ఆ స్థితిలో మన మనసు తుఫానులో చిక్కుకున్న కల్లోలిత సంద్రమే. ఈ ఆవేశహంకారాలే విశ్వామిత్రుణ్ణి రాజర్షి స్థాయి నుండి మహర్షి, బ్రహ్మర్షి స్థాయికి చేర్చటానికి అభేద్యమైన అవరోధమైంది. ఆయన జీవితంలో సింహభాగాన్ని ధార పోసేటట్టు చేసింది. – లలితా వాసంతి -
బాల్యం నుదుట అక్షరం ఆమె
బాల్యాన్ని అక్షరానికి దూరం చేస్తున్నది ఎవరు? పేదరికమా? తల్లిదండ్రుల అమాయకత్వమా? పిల్లలు పనికి పోతే పేదరికం పోతుందా? పేదరికం అల్లుకున్న జీవితాల్లో ఇది బదుల్లేని ప్రశ్న! శాంతాసిన్హా ను ఆలోచింప చేసిన ప్రశ్న కూడా! ఇది... మన రాష్ట్రాల్లో ఎనభైల నాటి సామాజిక చిత్రం. మరి... పేదరికం పోయేదెలాగ? బడికి పోతే పోతుందా! పనికి పోతే పోతుందా!! బాలలను కార్మికులుగా మారుస్తున్న ధోరణి ఏమిటి? పిల్లలకు హక్కులుంటాయి... ఆ హక్కులను పరిరక్షించేదెలా? వీటన్నింటికీ పరిష్కారాలను సూచించారామె. చట్టాల రూపకల్పనలో ‘అక్షరం’గా మారారామె. ప్రొఫెసర్ శాంతాసిన్హా బాలల హక్కుల కార్యకర్త. ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు పట్టణం. ఆమె బాల్యం, విద్యాభ్యాసం స్థిరనివాసం హైదరాబాద్‌లో. ఉస్మానియాలో ఎం.ఎ చేసిన తర్వాత ఢిల్లీ జేఎన్‌యూలో పీహెచ్డీ చేసి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తర్వాత శ్రామిక్ విద్యాపీఠం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టు ఆమెలో ఓ లక్ష్యానికి బీజం వేసింది. అది మొలకెత్తి మహావృక్షంలా విస్తరించింది. బాలలకు హక్కులుంటాయనే స్పృహను సమాజానికి కల్పించింది. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రూపకల్పనలో ముసాయిదా సంఘ సభ్యురాలిగా విధివిధానాలకు అక్షరం రూపమిచ్చే వరకు కొనసాగింది. ఇటీవల గీతం యూనివర్సిటీ ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం... ఆమె సేవలను మరోసారి ఈ తరానికి గుర్తు చేసినట్లయింది. ఈ సందర్భంగా శాంతాసిన్హా సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు. షేరింగ్... షేరింగ్!! ‘‘మాది ఉమ్మడి కుటుంబం. తాతగారి నుంచి పెదనాన్న పిల్లలం, మేము... చిన్న పెద్ద అంతా కలిసి ఓ ముప్పై మంది ఉండేవాళ్లం. ఒక ఇంట్లో అంతమంది కలిసి జీవించడం ఈ తరానికి ఊహకు కూడా అందదు. అలా కలిసి పెరగడంతో షేరింగ్ బాగా ఉండేది. ఇంట్లో వస్తువులను అందరూ ఉపయోగించుకోవడం వంటి భౌతికమైన షేరింగ్ మాత్రమే కాదు, అభిప్రాయాలను పంచుకోవడం, భావాలను చెప్పగలగడం వరకు అన్నమాట. ఇంట్లో ఉదారవాద భావజాలం, అభ్యుదయ చర్చలు ఉండేవి. ఏదో ఒక టాపిక్ మీద డిబేట్ అన్నమాట. ఆ వాతావరణంలో పెరగడంతో సమాజం పట్ల కొంత అవగాహన ఉండేది. కాలేజ్ రోజుల్లో మా స్టూడెంట్స్ మధ్య వియత్నాం యుద్ధం గురించిన చర్చలుండేవి. ఉద్యమాలు, ఆందోళనల్లో పాల్గొనలేదు. కానీ, సామాజిక చైతన్యంతోనే పెరిగాను. ఆ నేపథ్యం నన్ను శ్రామిక్ విద్యాపీఠ్ ప్రాజెక్ట్ కోసం అంకితమై పని చేయడానికి దోహదం చేసింది. శ్రామికుల పిల్లలను విద్యావంతులను చేసే ప్రయత్నం ఆ ప్రాజెక్టు ఉద్దేశం. మూడేళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తయింది కానీ నేను పని అంతటితో ఆపలేకపోయాను. అప్పటికే మా తాతగారు మామిడిపూడి వెంకట రంగయ్య పేరుతో ఎమ్వీ ఫౌండేషన్ ఉంది. పేద పిల్లలకు పుస్తకాలు, పరీక్ష ఫీజుకు సహాయం చేస్తుండేది. చిన్న పిల్లల కోసం ఏదో చేయాలని, మొదలు పెట్టిన పనిని సగంలో ఆపకూడదనే నా ఆసక్తిని గమనించి మా ఇంట్లో వాళ్లు ‘మన ఫౌండేషన్ వేదికగా నువ్వు చేయాలనుకున్నది చేయవచ్చు కదా’ అని సూచించారు. యూనివర్సిటీలో పాఠాలు చెప్తూనే ‘పిల్లలను పంపించాల్సింది పనికి కాదు, బడికి’ అనే ఉద్యమాన్ని నిశ్శబ్దంగా విస్తరింపచేశాను. గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న శాంతాసిన్హా అప్పటి చట్టాలు అలా ఉండేవి! అప్పట్లో ‘బాల కార్మిక వ్యవస్థ’ అనే పదం వినిపించేది కాదు. చట్టాలు కూడా పిల్లల చేత ప్రాణాపాయానికి దారి తీసే ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేయించరాదని మాత్రమే చెప్పేవి. వ్యవసాయ పనులు, ఇళ్లలో (సంపన్నుల ఇళ్లలో జీతానికి) పనులు చేయడం మీద ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు. ఆ పనులకు సామాజిక అంగీకారం మెండుగా ఉండేది. పనులు చేసే పిల్లల కోసం ప్రభుత్వం రాత్రి బడులు నిర్వహించేది. ఈ పరిస్థితుల్లో నేను ‘పిల్లలకు హక్కులుంటాయి. వాటిని పరిరక్షించాలి. వాళ్ల చేత పనులు చేయించరాదు’ అని ఎలుగెత్తి చాటాల్సి వచ్చింది. అన్నింటికీ సమాధానంగా ఒకటే పదం వినిపించేది... పేదరికం. పిల్లల చేత పని చేయిస్తే పేదరికం పోతుందా? అంటే... సమాధానం మౌనమే. ‘అక్షరం ఆలోచనను పెంచుతుంది. ఆలోచన వివేచననిస్తుంది. వివేకానికి విజ్ఞానం తోడైతే జీవితం సుఖమయం అవుతుంది’ అని తల్లిదండ్రులకు పాఠం చెప్పినట్లు చెప్పాల్సి వచ్చేది. మా యూనివర్సిటీ చుట్టు పక్కల గ్రామాలతోపాటు దాదాపుగా తెలంగాణ జిల్లాలన్నీ తిరిగాను. ‘బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలందరూ బాలకార్మికులే, బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి, పనిలో కాదు’ అనే నిర్వచనాన్ని అధికారికంగా తీసుకువచ్చేసరికి 2016 వచ్చింది. బ్రిడ్జి వేశారు! నా ఈ సామాజికోద్యమంలో మొదటి దశ బాలలు కార్మికులు కాకూడదు. రెండవది బాలలకు హక్కులుంటాయి, వాటిని పరిరక్షించాలి. మూడవది పాఠశాలలన్నీ రెగ్యులర్ స్కూళ్లే అయి ఉండాలి తప్ప నైట్ స్కూల్ విధానం వద్దు. ఇక నాలుగవది బ్రిడ్జి కోర్సు. బాల కార్మికులను గుర్తించి వారి చేత పని మాన్పించిన తర్వాత బడిలో చేర్చాలంటే ఏ క్లాసులో చేర్చాలనేది ప్రధాన సమస్య అయింది. అప్పటికే పన్నెండు– పదమూడేళ్లుంటాయి. ఒకటో తరగతిలో చేర్చినా క్లాసులో కలవలేరు. అలాంటి పిల్లలకు ఏడాది–రెండేళ్ల పాటు ప్రత్యేకశిక్షణనిచ్చి సెవెన్త్ క్లాస్ పరీక్ష రాయించడం, అందులో పాసైన తర్వాత ఎనిమిదో తరగతిలో రెగ్యులర్ స్కూల్లో చేర్చడం బ్రిడ్జి స్కూల్ ఉద్దేశం. ‘రైట్ టు ఎడ్యుకేషన్’ చట్టం రావడానికి వెనుక మా లాంటి ఎంతోమంది సేవలున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం నాకు ఆ చట్టానికి ముసాయిదా సంఘ సభ్యురాలిగా విధివిధానాలు రూపొందించడంలో ఉపయోగపడింది. ఎన్సీపీసీఆర్(నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) చైర్‌పర్సన్‌గా ఆరేళ్లు ఢిల్లీలో విధులు నిర్వర్తించాను. ప్రతీకాత్మక చిత్రం మంచి మార్పు వచ్చింది! సంతోషం ఏమిటంటే... ఇన్ని దశాబ్దాలపాటు చేసిన ఉద్యమం ద్వారా సమాజంలో మంచి మార్పునే చూస్తున్నాను. తల్లిదండ్రుల్లో చైతన్యం వచ్చింది. తమ పిల్లలను చదివించాలనే ఆసక్తి మాత్రమే కాదు, చాలా తపన పడుతున్నారు. ఆర్థికంగా అనేక సర్దుబాట్లు చేసుకుంటూ కూడా పిల్లలను చదివిస్తున్నారు. అయితే సమాజంలో వచ్చిన చైతన్యానికి తగినన్ని సౌకర్యాల కల్పనలో ప్రభుత్వాల వెనుకబాటుతనం కూడా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు నా దృష్టి కౌమార దశలో ఉన్న వారి మీద ఉంది. ముఖ్యంగా 14–18 ఏళ్ల అమ్మాయిలు ఎదుర్కొంటున్న లైంగిక వివక్ష, విద్య గురించి వాళ్లకు రక్షణ కల్పించే చట్టాలు లేవు. పాలసీలు బలహీనంగా ఉన్నాయి. పటిష్టమైన చట్టాల రూపకల్పన జరగాలనేది నా ఆశయం. అందుకోసం నా సామాజికోద్యమం కొనసాగుతోంది’’ అని చెప్పారు ప్రొఫెసర్ శాంతా సిన్హా.. ఆమె పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పద్మశ్రీ (1999), రామన్ మెగసెసె అవార్డు (2003) గౌరవాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు వచ్చిన మరో డాక్టరేట్ కరోనాతో వచ్చిన స్తబ్ధతను తొలగించి బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు ప్రొఫెసర్ గారు నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది: దీప్తి నావల్
‘నీ ఇవాళ్టి స్థానానికి నిన్నటి నీ బాల్యమే కారణం’. ‘అప్పుడు ఏవి నీ మీద ప్రభావాలు చూపుతాయో అవే నిన్ను తీర్చిదిద్దుతాయి’. ‘బాల్యాన్ని తరచి చూసుకుంటే ఎక్కడ బయలుదేరామో తెలుస్తుంది. ఎక్కడకు వెళుతున్నామో కూడా’... అంటుంది దీప్తి నావల్. అమృత్‌సర్‌లో గడిచిన తన బాల్యం, యవ్వనపు తొలి రోజుల జ్ఞాపకాలను ఆమె ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. ‘నావల్’ అని ఇంటి పేరు రావడంతో మొదలు ఒక రాత్రి ఇంటి నుంచి పారిపోవడం వరకు ఆమె అనేక సంగతులను వెల్లడి చేసింది. దీప్తి నావల్‌కు దేశమంతా అభిమానులు ఉన్నారు. ఆమె పోస్టర్‌ను గోడలకు అంటించుకున్న ఆరాధకులు 1980లలో 90లలో చాలామంది ఉన్నారు. ‘జునూన్’, ‘కథ’, ‘చష్మేబద్దూర్’, ‘సాథ్సాథ్’, ‘ఏక్ బార్ ఫిర్’ వంటి సినిమాలతో ఆమె ఒక కాలపు సినిమాలో గొప్ప ప్రభావం చూపగలిగింది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్‌తో పాటు దీప్తి నావల్ కూడా పార్లల్ సినిమాకు ఊతం ఇచ్చింది. అయితే మిగిలిన ఇద్దరితో పోల్చితే ఆమె చేయవలసినన్ని సినిమాలు చేయలేదు. అయితే ఇప్పటికీ ఆమె సినిమాలలో నటిస్తూ రచన, చిత్రకళలో కృషి చేస్తోంది. తాజాగా తన బాల్య జ్ఞాపకాల సంచయం ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. 70 ఏళ్ల వయసులో... దీప్తి నావల్ 1952లో పుట్టింది. అంటే నేటికి 70 ఏళ్లు. కాని ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఆమె నిమగ్నమై ఉంటుంది. ఆమె పెయింటింగ్స్ వేస్తుంది. ఫొటోగ్రఫీ చేస్తుంది. కథలు, కవిత్వం రాస్తుంది. గతంలో ‘లమ్హా లమ్హా’, ‘బ్లాక్ విండ్’ అనే కవితల పుస్తకాలు వెలువడ్డాయి. ఆమె రాసిన కథల సంపుటి పేరు ‘ది మ్యాడ్ డిబెటిన్’. ఇప్పుడు వచ్చింది ఆమె నాలుగో పుస్తకం. ఈ పుస్తకం అమృత్‌సర్‌లో గడిచిన నా బాల్యం గురించి మా అమ్మమ్మ గురించి అమ్మ గురించి ముఖ్యంగా అమృత్‌సర్‌తో ముడిపడ్డ నా జ్ఞాపకాల గురించి చెబుతుంది అంటుంది దీప్తి. ఇంటి పేరు మార్పు దీప్తి నావల్ కుటుంబం రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మా నుంచి అస్సాంకు వలస వచ్చింది. ఆ తర్వాత అమృత్సర్ చేరింది. ఆ కాలంలో పేరు చివర ‘శర్మ’ చాలామందికి ఉండేది. అందుకని ఆమె తండ్రి ఉదయ్ శర్మ తన పేరు చివర ‘నావల్’ను ఎంచుకున్నాడు. ‘నావల్’ అంటే ‘నవీనమైనది’ అని అర్థం. అలా దీప్తి పేరు దీప్తి నావల్ అయ్యింది. ‘మా నాన్న చాలా ప్రాక్టికల్ మనిషి. మా అమ్మ కళాభిరుచి ఉన్న మహిళ. ఆమె బొమ్మలు వేసేది. కథలు చెప్పేది. ఆ కళ నాకు వచ్చింది. అమృత్‌సర్‌లోని హాల్ బజార్లో ఖైరుద్దీన్ మసీదు పక్కన ఉండే మా ఇంట్లో మేడ మీద ఎక్కి వీధుల్లో చూసేవాళ్లం. దేశ విభజన గురించి, వలస కాలంలో జరిగిన విషాదాల గురించి నేను పెద్దల మాటల్లో వినేదాన్ని. జలియన్ వాలా బాగ్ మా అందరికీ ఒక తాజా గాయంగా అనిపించేది. నాకు 13 ఏళ్లు వచ్చినప్పుడు (1965) ఇండో పాక్ యుద్ధం వచ్చింది. విమానాలు గాల్లోకి ఎగురుతూ భయపెట్టేవి. చిన్నదాన్ని కావడంతో అదంతా ఉత్సాహంగా అనిపించేది. కాని మా నాన్న ఒకరోజు బార్డర్‌కు తీసుకెళ్లి చూపించాడు. ‘యుద్ధం అసలు రూపం పిల్లలకు తెలియాలి’ అని నాకూ అక్కకూ చూపించాడు. అక్కడకు వెళితే గాలి అంతా మందుగుండు వాసన. శవాలు పడి ఉన్నాయి. కాకులు కూడా చడీ చప్పుడు చేయకుండా ఉండటం చూశాను. ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది’ అని రాసింది దీప్తి నావల్. 20 ఏళ్ల కృషి దీప్తి నావల్ పర్ఫెక్షనిస్ట్. తన బాల్యం, యవ్వనపు రోజులను అథెంటిక్‌గా చెప్పేందుకు ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ కోసం దాదాపు 20 ఏళ్ల సమయం తీసుకుంది. కొన్ని తనకు తెలుసు. కొన్ని బంధువుల నుంచి, తెలిసిన వారి నుంచి రాబట్టాల్సి వచ్చింది. ‘అమృత్సర్ స్వర్ణదేవాలయ ఘటన, జలియన్ వాలా బాగ్ స్థలం నాపై ఏర్పరిచిన ప్రభావం గురించి రాయడానికి సమయం పట్టింది. స్వర్ణదేవాలయం ఆధునీకరించడం నాకు అభ్యంతరం లేదు. కాని జలియన్ వాలా బాగ్‌ను బాగా తీర్చిదిద్ది అదొక సెల్ఫీ పాయింట్లా చేశారు. అది సెలబ్రేట్ చేసుకునే స్థలం కాదు. జాతి త్యాగాలను తలచుకుని బాధ పడాల్సిన సమయం. దానిని అప్పటికాలంలో ఎలా ఉండేదో అలాగే ఉంచేస్తే బాగుండేది. జపాన్‌లో హిరోషిమాను అలాగే ఉంచేశారు’ అందామె. తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లాక తాను అమెరికాలో చదవడం, అక్కడ రేడియో అనౌన్సర్‌గా పని చేస్తూ రాజ్ కపూర్‌ను ఇంటర్వ్యూ చేయడం... ఇలాంటి జ్ఞాపకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘నేను కథక్ డాన్సర్‌ని. కాని నాకు డాన్సులు చేసే కమర్షియల్ వేషాలే రాలేదు’ అని నవ్వుతుంది ఆమె. సుదీర్ఘ కాలం కలిసి జీవించిన తల్లిదండ్రులు డెబ్బయిల వయసులో విడిపోవడం ఆమెకు ఒక షాక్. ఇలాంటి విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీప్తి నావల్ దర్శకుడు ప్రకాష్ ఝాను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఒక కుమార్తెను దత్తత చేసుకుంది. ఆమెకు ముంబైలో కాకుండా ‘కులూ’లో ఒక ఇల్లు ఉంది. రాబోయే రోజుల్లో తన సినిమా కెరీర్‌కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా పుస్తకంగా తేవాలనుకుంటోంది. ఆమె అభిమానులకు అదీ ఒక మంచి కబురే. -
బరువుగా పెంచకండి
కొంతమంది తల్లులు పిల్లల మీద ప్రేమతో వారు వద్దంటున్నా వినకుండా కొసరి కొసరి తినిపిస్తారు. తల్లులతోపాటు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యల వంటి వారు కూడా లేకలేక పుట్టారనో, బోలెడంత మంది ఆడపిల్లల్లో ఒక్కగానొక్క మగపిల్లాడని లేదా అందరు మగపిల్లల మధ్య మహాలక్ష్మి లా ఒకే ఆడపిల్ల అనో అతిగా గారం చేసి వారికి అతిగా తినిపిస్తారు. దాంతో పిల్లలు విపరీతంగా బరువు పెరిగిపోతారు. బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటారు కానీ, క్రమేణా ఆ బొద్దుతనం కాస్తా ఊబకాయంగా మారిపోతుంది. ఫలితంగా పెద్దయ్యేకొద్దీ రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. దేనినైనా చేతులు దాటకముందే పరిష్కరించుకోవాలి లేదంటే డాక్టర్ల దాకా వెళ్లాల్సి వస్తుంది. పిల్లలు బొద్దుగా ఉండటం కాదు... ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. లావుగా ఉండే పిల్లల ఆహారపుటలవాట్లలో, జీవనశైలి లో చిన్నచిన్న మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా పెరుగుతారు. దీనిపై అవగాహన కోసం... కొంతమంది పిల్లలు లావుగా ఉన్నప్పటికీ, టీనేజీకొచ్చేసరికి సన్నబడిపోతారు. కానీ ఒక్కోసారి అలా జరగకపోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం 5.5 ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 60 శాతం మంది 20 ఏళ్ల వయస్సులో కూడా బరువు ఎక్కువే ఉన్నారు. రెండున్నర ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 44 శాతం మంది 16 ఏళ్ల వయస్సులో కూడా ఎక్కువ బరువే ఉన్నారు. ఎందుకంటే, వయసు పెరిగిన కొద్దీ, కాస్తో కూస్తో లావెక్కడం సహజం. అలాగని చిన్నప్పుడు సన్నగా ఉన్నవారు పెద్దయ్యాక లావెక్కరని కాదు. చిన్నప్పటినుంచి ఉన్న బరువు అలాగే కొనసాగడం వల్ల వారు రకరకాలయిన ఇబ్బందులు పడతారు. స్కూల్లో, కాలేజీలో తోటిపిల్లలు వారికి పేర్లు పెడతారు. అదేవిధంగా తమకు నచ్చిన దుస్తులు ధరించలేరు. పిల్లలు టీనేజీలోకి వచ్చాక సామాజికంగా వారే తెలుసుకుని తాము తగ్గాలో పెరగాలో అనేది వారే డిసైడ్ చేసుకుంటే అది ఒక రకం కానీ, పెద్దల గారం మూలంగా బరువు పెరిగిన పిల్లలు పెద్దయ్యాక స్థూలకాయులుగా తయారు కాకుండా ఏం చేయాలో చూద్దాం. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి: చాక్లెట్లు, స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ఫుడ్స్ వంటివి అలవాటు చెయ్యకుండా ఉండడం అత్యవసరం. బరువు పెంచే లక్షణాలు వాటిలోనే అధికంగా ఉంటాయి. పైగా ఆయా పదార్థాల రుచిని పెంచడం కొరకు అజీనమోటో వంటి హానికర రసాయన పదార్థాలు కలుపుతారు. అవి పిల్లల శారీరక ఎదుగుదలతోపాటు మెదడులోని నరాల ఎదుగుదలను దెబ్బతీస్తాయి కాబట్టి అటువంటి వాటిని అతిగా ఇవ్వకుండా అప్పుడప్పుడు మాత్రమే తినిపించాలి. ఇక ఇంట్లో చేసిన ఆహారపదార్థాలలో కూడా రుచి కోసం విపరీతంగా నూనెపోసి చేసే వేపుడు కూరలు, మసాలాలు, నెయ్యితో తయారు చేసిన స్వీట్లు కూడా పరిమితికి మించి తినిపించకూడదు. అవి తినకుండా ఉండలేని స్థితికి తీసుకుని రాకూడదు. అంత అతిగా అలవాటు చెయ్యకూడదు. పిల్లలు స్కూల్‌కు వెళ్ళే సమయంలో స్నాక్స్ కావాలని మారాం చెయ్యడం సహజం. అటువంటి సందర్భాల్లో చాక్లెట్లు, చిప్స్ వంటి వాటి బదులు ఇంటిలో చేసిన పల్లీపట్టీలు, బెల్లం వేరుశనగ ఉండలు, మినప సున్నిఉండలు, నువ్వుల ఉండలు, ఇంట్లోనే చేసిన బూందీ, కారా వంటివి ఇవ్వడం ఉత్తమం. పిల్లలు ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? జంక్ ఫుడ్ నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? బిడ్డకు ఊబకాయం వచ్చేసిన తరవాత తల్లిదండ్రులు చెయ్యగలింగింది ఎక్కువ ఉండదు. అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మన్యూనతాభావం: బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులు, మాటలకు దూరంగా ఉండటం ఉత్తమం. పొట్టమాడ్చకూడదు: పిల్లలు లావు అవుతున్నారు కదా అని ఒక్కసారిగా తిండి తగ్గించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఆలా చేస్తే వారి పసిమనసుకు తప్పుడు సంకేతాలు వెళతాయి. మెల్లి మెల్లిగా తగ్గించాలి. తక్కువ క్యాలరీలుండే మరమరాలు, అటుకులు, పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు వంటి వాటిని ఎక్కువ అలవాటు చెయ్యాలి. వ్యాయామం: శారీరక శ్రమను ప్రోత్సహించండి. వారి చేత గార్డెనింగ్ చేయించడం, చిన్న చిన్న దూరాలు నడిపించడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లెక్కేలా చేయడం వంటివి. మానసిక ఆరోగ్యం: బిడ్డ ఎక్కువ తినటానికి కారణం వత్తిడి, ఆందోళన, అభద్రతా భావం కావచ్చును. సందర్భాన్ని బట్టి నిపుణులను సంప్రదించండి. జీవనశైలి: ఏవైనా మార్పులు ఎల్లకాలం పాటించగలిగేలా ఉండాలి. రోజూ స్నానం చేసినట్లు, లేదా పళ్ళు తోముకున్నట్లు. మార్పులు జీవనశైలిలో భాగం కావాలి. అంతేకానీ, జబ్బుకన్నా మందు కష్టం కాకూడదు. నిరంతరం బరువు తగ్గటం లేదన్న భావనతో బాధ పడటం కన్నా ఊబకాయంతో బాధపడటం కొంతలో కొంత మేలు. -
చిన్ననాటి పుస్తకాలనే చిన్నారులకు వినిపిస్తున్నారు
న్యూఢిల్లీ: భారతీయ తల్లిదండ్రుల్లో చాలామంది తాము చిన్నతనంలో చదివిన పుస్తకాలనే తమ పిల్లలకు చదివి వినిపిస్తారట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) చేసిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు కలిసి గడపడం, భాష ప్రాముఖ్యతను చాటడంతో పాటు పఠనాసక్తిని ప్రోత్సహించేందుకు ఓయూపీ ప్రయత్నించింది. అందులో భాగంగా ‘గిఫ్ట్ ఆఫ్ వర్డ్స్’ పేరుతో భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాల్లో ఇటీవల ఓ సర్వే చేసింది. అందులో పాల్గొన్న తల్లిదండ్రుల్లో దాదాపు సగం మంది తాము చిన్ననాడు చదివిన పుస్తకాలనే పిల్లలకు చదివి విన్పిస్తుంటామని చెప్పారు. తమ పిల్లలు కూడా దాన్నే ఇష్టపడతారని 56% మంది వెల్లడించారు. 48% మందేమో చిన్నప్పుడు తాము చదివిన పుస్తకాలనే చదివేందుకు తమ పిల్లలు ఇష్టపడుతున్నారని చెప్పారు. తాజాగా వచ్చే పుస్తకాలను ఎలా కనుక్కోవాలో 37% మందికి తెలియదని తేలింది. ఆన్లైన్, ఆడియో బుక్స్ కంటే ముద్రిత ప్రతులను చదివేందుకే ఇష్టపడతామని 70% మంది భారతీయ తల్లిదండ్రులు చెప్పారు. ఇలా పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించడం ద్వారా వారితో తమ బంధం మరింత గట్టిపడుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించేందుకు తమకు మరింత సమయం అందుబాటులో ఉంటే బాగుండేదని 85 శాతం మంది బాధపడుతున్నారట! పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ది పైరేట్ మమ్స్, ది పర్ఫెక్ట్ ఫిట్, స్టెల్లా అండ్ ది సీగల్, ఎ సాంగ్ ఇన్ ది మిస్ట్, ఎవ్రీబడీ హాజ్ ఫీలింగ్స్, మ్యాక్స్ టేక్స్ ఎ స్టాండ్, ది సూప్ మూమెంట్, బేర్ షేప్డ్, ఎవ్రీబడీ వర్సీస్ వంటి ఆసక్తికరమైన పుస్తకాలను ఓయూపీ సూచించింది. -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
దేశంలో దొంగలు పడ్డారు
వీధి చివర మొగలో ఏడు పెంకులాట ఆడే పిల్లలు కనిపిస్తున్నారా? మండు వేసవిలో మిట్టమధ్యాహ్నం ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని అల్టిమేటం జారీచేసే అమ్మానాన్నల కళ్లు గప్పి ఆరుబయటకు వచ్చి జోరీ బాల్ ఆడే కుర్రాళ్లు కనిపిస్తున్నారా? బంతీ బ్యాటూ లేకపోతే రంగు రంగుల గోళీకాయలతో వీధుల్లో అంతర్జాతీయ మ్యాచులు ఆడే బాలలు కనిపిస్తున్నారా? ఎర్ర గోళీని పచ్చగోళీతో కొట్టేసి గెలిచిన ఆనందంలో కేరింతలు కొట్టేవాళ్లనీ, ఓడిపోయి గోళీ పోగొట్టుకుని రాజ్యం కోల్పోయిన రాజులా బెంగపడే వాళ్లనీ చూశారా? ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు పోగు చేసి వాటితో బొమ్మ గడియారాలు తయారు చేసే చిన్ని చిన్ని కళాకారులు కనిపిస్తున్నారా? సిగరెట్ ప్యాకెట్లనే చించి బచ్చాలాట ఆడుకునే బచ్చాల్ని ఈ మధ్య ఎక్కడైనా చూశారా? ఏ వెంకన్న కాపు పొలంలోనో... కాపరి లేని సమయం చూసి మామిడి చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడే అబ్బాయిలు మురిపిస్తున్నారా? ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అంటూ దాక్కున్న వాళ్లని పట్టుకోడానికి నానా తంటాలు పడే పిల్లల ఒలింపిక్స్ క్రీడ ఇప్పటికీ ఉందా? గూటీ బిళ్ల లేదా గిల్లీ దండా ఆటతో వీధిలో అటూ ఇటూ పోయే వాళ్లని భయపెడుతూ తమాషా చూసే పిల్లల ఆనందాన్ని చూశారా? ఇంట్లో పెద్దలు మరీ చండ శాసనుల్లా బయటకు వెళ్ళనీయకుండా ఆపేస్తే ఇళ్ల అరుగుల మీదే పులీ మేక ఆడే పిల్లలు ఇంకా ఆడుతున్నారా? మంచి ఎండలో ఏ మధ్యాహ్నమో ఐస్ ఫ్రూట్ అబ్బాయి ‘ఐస్... పాలైస్’ అంటూ అరుచుకుంటూ వస్తే అమాంతం నిద్ర నటనలోంచి బయటపడి ఐస్ కొని పెట్టమని పెద్దాళ్లను బతిమాలే పిల్లల ఆరాటం చూశారా? (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) ఇళ్ల లోగిళ్లలో రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు తొక్కుడు బిళ్ల ఆటలు ఆడుతున్నారా? తాటి ముంజెలను మూడు చక్రాల బళ్లుగా తయారు చేసుకుని వాటినే మెర్సిడెస్ బెంజ్ కారులా సంబరపడిపోయే పిల్ల ఇంజినీర్ల బాలానందాన్ని చూశారా? నదీ తీరాల్లో ఇసుకతో ఇళ్లు కట్టేసి గర్వంగా నవ్వుకునే బుల్లి సివిల్ ఇంజనీర్లు కొత్త వెంచర్లు వేస్తున్నారా లేదా? నెమలి పింఛాన్ని పుస్తకం మధ్యలో పెట్టుకుని కొబ్బరి మట్టపై నూగును తురిమి, పింఛానికి ఆహారంగా పెట్టి ప్రతీ రోజూ పింఛం ఎంత పెరిగిందో పరీక్షించుకునే అమాయక బాల్యంలోని అందాన్ని చూశారా? (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) వేసవిలో పూడిక తీతల పనుల కోసం కాలువలు బంద్ చేసే సమయంలో నడుం లోతు ఉన్న నీళ్లల్లో రోజూ దొంగచాటుగా ఈత కొట్టి తడిసిన జుట్టుతో ఇంట్లో డిటెక్టివ్లకు దొరికిపోయి వీపు మీద విమానం మోత మోగగానే గుక్కపెట్టి ఏడ్చే బాల్యాన్ని చూశారా? చిల్ల పెంకును కాలువ నీళ్లపై విసిరి అది ఎన్ని ఎక్కువ గంతులు వేస్తూ ముందుకు పోతే అంత గొప్ప అని పోటీలు పడి ఆడుకునే కుర్రాళ్లు ఇంకా ఉన్నారా? (చదవండి: ఋతు ఘోష) ఏవీ కనపడ్డం లేదు కదూ! మన ఆటలు మన ఆనందాలు రేపటి తరపు మధుర జ్ఞాపకాలు అన్నీ కూడా ఎత్తుకుపోయారు. మన నుండి మన ఆత్మను దోచుకుపోయారు. మన జీవితాల నుండి వెలుగులను దోచుకుపోయారు. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే మన దేశంలో అడుగు పెట్టాయో అప్పుడే కార్పొరేట్ దొంగలు అవతరించారు. వారే మన ఊళ్లల్లోని చేతి వృత్తులను ఎత్తుకుపోయారు. మన పేదల ఉపాధి అవకాశాలు ఎత్తుకుపోయారు. ఊళ్లల్లో జీవాన్ని, బాలల్లో ఆనందాన్ని, మనుషుల్లో మానవత్వాన్ని... అన్నింటినీ ఎత్తుకుపోయారు. అన్నీ దోచుకుపోయిన ఘరానా దొంగలను పట్టుకోండని ఎవరికి చెప్పాలి? ఒక్కసారి మళ్లీ బాల్యంలోకి రివైండ్ అయిపోయి గత కాలపు ఆటలు మరోసారి ఆడుకుంటే బాగుండునని అనిపిస్తోంది కదూ! కార్పొరేట్ ప్రపంచంలో ఈ కల బహుశా ఇక ఎప్పటికీ నెరవేరదేమో? పగటి కలలోనే ఇక ఈ ఆటలు ఆడుకోవాలేమో? – సి.ఎన్.ఎస్.యాజులు -
వర్తమానమే భవితకు ప్రాణం
బాలల వర్తమానం నలిపి, భవిష్యత్తును భగ్నం చేస్తే మానవవనరు పరంగా ఇక మిగిలేదేమీ ఉండదు! విరుగుడు లేని శాపమౌతుంది. ఇది ఒక తరం మనుగడకు సంబంధించిన మౌలికాంశం. కరొనా మహమ్మారికి దారుణంగా ప్రభావితమైన మానవ దశల్లో బాల్యమొకటి. గత 18 మాసాలుగా బాలలు నలిగినంతగా మరే వర్గం నలతకు గురికాలేదు. ఇది విశ్వవ్యాప్తం. దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఉన్న సమస్యే! బడులు మూతపడి, చదువుకు దూరమై, మానసికంగా కృంగి, శారీరకంగా నిస్సత్తువ ఆవహించి పిల్లల సమగ్రాభివృద్ది కుంటుపడింది. ఏడాదిన్నర మించిన ఈ వైకల్యం ఇంకా కొనసాగితే... బాలల భవిష్యత్ విద్యార్జన ప్రక్రియ ప్రతికూలంగా ప్రభావితమయ్యే ప్రమాద హెచ్చరికలున్నాయ్! పేదరికం తాండవిస్తున్న చాలా చోట్ల బడుల మూతతో బాల్యం పనిప్రదేశాల బాట పట్టింది. బాలకార్మిక వ్యవస్థ మళ్లీ బలపడుతోంది. కొన్ని సామాజిక వర్గాలు, ఆర్థిక సమాజాల్లో పిల్లలు, ముఖ్యంగా బాలికలు తిరిగి బడులకు రాలేనంతగా బాల్యంపై కోవిడ్ దెబ్బకొట్టింది. పరోక్ష పద్ధతిన నిర్వహించిన ఆన్లైన్ తరగతుల ప్రక్రియ సరైన ప్రత్యామ్నాయం కాలేకపోయింది. భారత్ వంటి దేశాల్లో ఉన్నవారు–లేనివారి మధ్య అంతరాన్ని ఇది గగనసీమల దాకా ఎత్తి చూపింది. మహమ్మారి సృష్టించిన విలయ పదఘట్టనల్లో నలుగుతున్న మనకు, ఆ సడి వినిపించనేలేదు. స్మార్ట్ ఫోన్లు లేక, నెట్ సదుపాయం అందక, నిరంతర విద్యుత్ దొరక్క, ఎక్కువ మంది పిల్లలున్న ఇళ్లల్లో సదుపాయాలు చాలక, ‘యాప్’లు, సాంకేతిక వినియోగంపై నైపుణ్యం–అవగాహన కొరబడ్డ వారంతా బాధితులే! ఆన్లైన్ విద్యాబోధన వల్ల 60 శాతం మంది విద్యార్థులకు కనీస న్యాయం జరుగలేదన్నది తేలిన సత్యం! ఇలా తలెత్తిన ‘సాంకేతికత విభజన’ (డిజిటల్ డివిజన్) పేద, బడుగు–బలహీన, అల్పాదాయ, గ్రామీణ వర్గాల పిల్లల్ని తీవ్రంగా నష్టపరచినట్టు అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంతో పాటు దాదాపు అన్ని అధ్యయనాలు ఆధారాలతో నిరూపించాయి. ఏదైతేనేం, మొత్తమ్మీద బాల్యం, వారి విద్యార్జన ప్రక్రియపై బలమైన దెబ్బ పడింది. సత్వరం దాన్నుంచి కోలుకోకుంటే అపార నష్టం తప్పదని నిపుణులు, మేధావులు చెవినిల్లు కట్టుకొని చెబుతున్నారు. వెంటనే బడులు తెరచుకోవాలని వస్తున్న సూచనలు, సలహాలు, ఒత్తిళ్లకు ప్రభావితమైన ప్రభుత్వాలు క్రమంగా బడిని తెరుస్తున్నాయి. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఇదే చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా గుజరాత్, పంజాబ్, ఛత్తిస్ఘడ్ తదితర రాష్ట్రాల్లో బడులు ఇప్పటికే తెరచుకున్నాయి. కర్ణాటకలోనూ పాక్షికంగా తెరిచారు. సెప్టెంబరు ఒకటి నుంచి చాలా రాష్ట్రాల్లో తెరచుకుంటున్నాయి. ఏడాదిన్నర కష్టకాలంలో ఇదొక ఆశావహ నిర్ణయం. ఆహ్వానించదగ్గ పరిణామం! ఇల్లలుకగానే పండుగయినట్టు కాదు. ఇది పలు సమస్యలు, సవాళ్లతో ముడివడిన అంశం! ఒకవైపు బడులు తెరచుకుంటున్నా... కోవిడ్–19 రెండో అల చప్పబడుతూ, మూడో అల ముంచుకువస్తున్న సంధి కాలమిది! బడులు తెరవడం తప్పా, ఒప్పా అన్న మీమాంస, చర్చ కొనసాగుతూనే ఉంది. అనుకోని ఉపద్రవం వస్తే, బడులే వ్యాధి వ్యాప్తికి కేంద్రాలైతే, విద్యార్థులే వైరస్ వాహకులైతే... ఏమిటి పరిస్థితి? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఒకవైపు చదువుల కోసం బడులు తెరుస్తూనే మరోవైపు కోవిడ్ వైరస్–వ్యాధి వ్యాప్తికి ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. పిల్లల బతుకు–బతుకుతెరువూ, రెంటినీ సమన్వయ పరచుకుంటూ ముందుకు వెళ్లాలి. అవసరమైతే కొంత బడుల్లో, మరికొంత ఆన్లైన్ పద్దతిలో ‘సంకర (హైబ్రిడ్) విధానం’ పాటించైనా చదువులు సాగేలా చూడాలి. శాస్త్రీయ ఆధారం లేకపోయినా, కోవిడ్–19 మూడో అల పిల్లలపై తీవ్రప్రభావం చూపుతుందనే ప్రచారం ఉంది. వారికిప్పుడిప్పుడే టీకా లభించే అవకాశం లేదు. దేశ వ్యాప్తంగా టీకా ప్రక్రియ మరింత వేగం పుంజుకోవాల్సి ఉంది. బ్రిటన్, అమెరికాల్లో కూడా రెండు డోసుల టీకా ఇచ్చిన, ఇవ్వని ప్రాంతాల పిల్లల్లో... కరోనా వ్యాధి–ఇన్ఫెక్షన్ అదే నిష్పత్తి హెచ్చుతగ్గులతో ఉన్నట్టు వెల్లడైంది. మన దేశంలోనూ ఈ వ్యత్యాసాలున్నాయి. వీటి దృష్ట్యా, ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని బడుల నిర్వహణ ఉండాలి. ఈ వాతావరణంలో బడులు తెరుస్తున్నందున, కోవిడ్ ముందు జాగ్రత్తలపై పిల్లలతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది, పిల్లల తలిదండ్రులు, ప్రయివేటు విద్యా సంస్థల నిర్వాహకులు, ప్రభుత్వ యంత్రాంగానికి సమగ్ర అవగాహన పెంపొందించాలి. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో జాగ్రత్త వహించకుంటే విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయే ప్రమాదముంది. విద్యా ప్రమాణాలు కాపాడుతూనే మరోవైపు కోవిడ్ వైరస్ వ్యాప్తి, వ్యాధి విస్తృతిని అరికట్టాలి. ‘కోవిడ్ సముచిత ప్రవర్తన’ (సీఏబి) చాలా ముఖ్యం! నాణ్యమైన మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవడం విధిగా అనుసరించాలి. బడుల భౌతిక స్వరూపం, నిర్వహణలో వీలయిన మేర మార్పు తీసుకురావాలి. తరగతి గదికి పరిమిత సంఖ్యలో విద్యార్థుల్ని అనుమతించాలి. గదుల్లోకి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేట్టు చూసుకోవాలి. వీలయితే ఆరుబయట చెట్ల నీడల్లో బహిరంగ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కేసులు తలెత్తిన చోట ఆయా బడుల్ని మూసి, తగు నివారణ చర్యలు చేపట్టాలి. మొత్తమ్మీద చదువుల ప్రక్రియను పునరుద్ధరించాలి. రేపటి పౌరుల నేటి బాల్యాన్ని కాపాడాలి. -
పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఇవే.. వాటి లక్షణాలు, రకాలు తెలుసుకోండి!
పిల్లలది అభం, శుభం తెలియని అమాయకత్వం. వాళ్లది ఆటలాడుకునే పసిప్రాయం. వాళ్లకసలు క్యాన్సర్ అనే పదానికి అర్థమే తెలియదు. కానీ క్యాన్సర్‌కు అవేమీ పట్టవు. పెద్దవారిలో వచ్చే అన్ని క్యాన్సర్లూ పిల్లల్లోనూ వచ్చినప్పటికీ... కొన్ని రకాలు పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. లుకేమియా (రక్త సంబంధిత క్యాన్సర్లూ), మెదడులో వచ్చే కణుతులు (బ్రెయిన్ ట్యూమర్స్), లింఫోమా, సాఫ్ట్ టిష్యూ సార్కోమా వంటివి పిల్లల్లో ఎలాంటి లక్షణాలూ చూపకుండానే అకస్మాత్తుగా వచ్చే జ్వరం వంటి లక్షణాలతో బయట పడవచ్చు. ఒకరినో ఇద్దరినో కని, ఆ సంతానాన్ని అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు తమ చిన్నారికి క్యాన్సర్ అనగానే తల్లడిల్లిపోతారు. అయితే అదృష్టవశాత్తూ పిల్లల్లో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు పూర్తిగా నయం చేయదగినవే. వాళ్లలో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు ఇప్పుడు చికిత్సకు లొంగిపోతుండటం విశేషం. చాలామంది సెలబ్రిటీస్, సినీతారలు, ఇతరత్రా రంగాల్లో నిపుణులు చిన్నప్పుడు క్యాన్సర్‌కు గురైనప్పటికీ, చికిత్స తీసుకుని, ఇప్పుడు అందరిలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ల రంగాల్లో ముందుకెళ్తున్నవారు చాలామందే ఉన్నారు. మనదేశంలో ప్రతీ ఏడాదీ దాదాపు 45,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీళ్లలో 70 శాతం మందికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే 30 శాతం మందిలో వారి జీవితకాలంలో అది ఎప్పుడో ఒకప్పుడు తిరగబెట్టే ప్రమాదం ఉంది. చిన్నప్పుడు 20 ‘గ్రే’ల కంటే ఎక్కువగా రేడియేషన్‌కు గురైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ‘గ్రే’అంటే శరీరం గ్రహించిన రేడియేషన్ అని అర్థం. మామోగ్రామ్ వంటి పరీక్షలు మరీ చిన్నవయసులో చేయించడమూ అంత మంచిది కాదు. 30 ఏళ్లు పైబడ్డాక డాక్టర్ సలహా మేరకు చేయించుకుంటేనే మంచిది. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు చాలావరకు కీమో, రేడియేషన్‌కు స్పందిస్తాయి. పిల్లలు రేడియేషన్ తీసుకునేటప్పడు ఒంటరిగా ఉండటానికి భయపడి చికిత్సకు సహకరించకపోతే కొన్ని సందర్భాల్లో వారికి మత్తు ఇస్తారు. 12 ఏళ్లు పైబడ్డాక అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ క్యాన్సర్ చికిత్స వల్ల పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం పడుతుందనుకుంటే... అలాంటిప్పడు ముందుగానే వారి నుంచి అండాలను, వీర్యకణాలను సేకరించి భద్రపరుస్తుంటారు. పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ లుకేమియా. మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడే తెల్లరక్తకణాలు అపరిమితంగా పెరిగిపోవడమే లుకేమియా. ఇలా అధికంగా పెరిగిన తెల్లరక్తకణాలు ఎర్రరక్తకణాలను అడ్డుకుని రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వవు. ఇలా ఒక్కసారిగా జరగడం కానీ లేదా దీర్ఘకాలికంగా గానీ జరగవచ్చు. చాలావరకు నయం చేయగలిగే ఈ చికిత్సలో కీమో, రేడియో ధెరపీలు ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు ఈ క్యాన్సర్‌కు బాగా పనిచేస్తాయి. మొదటి బిడ్డకు రక్తసంబంధిత క్యాన్సర్ ఉంటే రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. పిల్లలు పాలిపోయినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలుమచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లుకేమియాను అనుమానించాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి తీసిన మూలగ (బోన్‌మ్యారో)ను పరీక్షించడం ద్వారా ఈ క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు. పెద్దవాళ్లలో కంటే పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువని చెప్పవచ్చు. పొద్దున్నే లేవగానే తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తించే తీరుమారడం, ఆందోళన, ఫిట్స్, చూపు/మాట మందగించడంవంటి లక్షణాలను మెదడు కణితిగా అనుమానించాల్సి ఉంటుంది. అది క్యాన్సర్ కణితి అయినా, కాకపోయినా రెండూ ప్రమాదకరమే. మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి సర్జరీతో దాన్ని తొలగించడమా లేక ఇతర చికిత్స ప్రక్రియలు అనుసరించడం మంచిదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్సను నిర్ణయిస్తారు. ఒక్కోసారి మెదడు కణితిని రేడియోసర్జరీతో తొలగిస్తారు. రోగనిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే లింఫ్నాళాలకు సంబంధించిన క్యాన్సర్‌లో హాడ్జ్కిన్స్, నాన్‌హాడ్జ్‌కిన్స్ అనే రకాలుంటాయి. మెడ, చంకల్లో, గజ్జల్లో లింఫ్‌నాళాలు వాయడం, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రిళ్లు చెమటలు, దగ్గు, ఊపిరితీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలతో లింఫోమాలు బయటపడుతుంటాయి. ఇతర టిష్యూలను కలిపే సాఫ్ట్ టిష్యూలలో వచ్చే క్యాన్సర్స్‌ను సాఫ్ట్టిష్యూ సార్కోమా అంటారు. ఎముకలను, కండరాలను కలిపే ఈ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ లక్షణాలు... వచ్చిన ప్రదేశం మీద ఆధారపడి ఉంటాయి. ఈ టిష్యూలకు సాగే గుణం ఉండటం వల్ల తొలిదశలో లక్షణాలు బయటపడవు. సాఫ్ట్‌టిష్యూలలో వచ్చే క్యాన్సర్స్‌కు ప్రధానంగా సర్జరీ, అవసరాన్ని బట్టి దానికంటే ముందు లేదా తర్వాత రేడియో, కీమో థెరపీలుంటాయి. అండాల్లో, టెస్టిస్‌లో వచ్చే జెర్మ్‌సెల్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో ఎక్కువ. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అడ్రినల్గ్రంథిలో, మెడ, ఛాతీ, పొట్ట, పెల్విస్‌లలో వచ్చే కణుతులు (న్యూరో)బ్లాస్టోమాలు, ఎముకలు, టిష్యూలలో వచ్చే ఈవింగ్ సర్కోమా, కిడ్నీల్లో వచ్చే నెఫ్రోబ్లాస్టోమా వంటివి పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు. పిల్లల్లో పూర్తిగా నయం చేయగలిగిన ఈ క్యాన్సర్స్ పెద్దవాళ్లలో కనిపిస్తే మాత్రం అంతే తేలిగ్గా నయం కాకపోవచ్చు. పిల్లల్లో అరుదుగా కనిపించే మిగతా క్యాన్సర్స్ అదుపులోకి రావడం కొంత కష్టం కావచ్చు లేదా ఎంతగా ప్రయత్నించినా చికిత్సకు లొంగకపోవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యుసంబంధంమైన కారణాలు పిల్లల్లో క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి ముందు పుట్టిన బిడ్డకు క్యాన్సర్ ఉంటే రెండోబిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండటం, లక్షణాలు గుర్తించి సరైన చికిత్స అందించడం, పోషకాహార లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, చికిత్స తర్వాత కూడా డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. -
జ్ఞాపకాల వాన
రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలను చీల్చుకుంటూ, భగ భగమని మండే గ్రీష్మతాపాన్ని వెక్కిరిస్తూ, నల్లటి మబ్బులు ఆకాశమంతా పహారా కాసే దృశ్యం ఓ అద్భుతం. ఎండవేడికి ఎడారిలా మారిన నేలతల్లిని ఆకాశం చూరు నుండి జారిపడ్డ వాన నీటి బొట్టు ముద్దాడే వేళ... గతజన్మను గుర్తు చేసే మట్టి పరిమళం.. ఎండాకాలపు కష్టాలన్నింటినుండీ విముక్తం చేసే ప్రకృతి మంత్రం. ఆకాశపు జల్లెడ నుండి కురిసే వర్షపు నీటి ధారలు చూస్తుండగానే పిల్లకాలువలై, ఏటి వాగులై, నదీ నదాలై... పరుగులు పెట్టే చల్లదనపు ప్రవాహం వర్షాకాలపు తొలి సంతకం. వాన చినుకు పడితే చాలు... ఈ రోజు బడికి సెలవిచ్చే స్తారన్న ఆనందాన్ని అనుభవించని బాల్యం ఉంటుందా అసలు? మాస్టార్ ఇచ్చిన హోమ్ వర్క్ చేయని రోజున ఈ ఒక్కరోజుకు వర్షం పడితే బాగుండునని దేవుడికి కోటి మొక్కులు మొక్కే చిన్నారుల ఆకాంక్షలు మేఘాలూ వింటాయి. విని చల్లటి వానతో మురిపించి బడికి సెల విప్పించిన వానాకాలపు చదువురోజులు అనుభవంలోకి రానివారెంతమంది? బడికెళ్లేటపుడు వాన లేకపోయినా, బడికెళ్లిన వెంటనే తరగతి గదిలో ఏ అప్పారావు మాస్టారో సుమతీ శతకపు పద్యాన్ని వల్లెవేయించేటపుడు పెంకుటింటి బడి పైకప్పుపై అమాంతం పెద్ద వాన పడి... పిల్లల పుస్తకాలపై వాన నీటి బొట్లు టపటపా రాలి పడుతుంటే.. అవే ముత్యాలుగా ఏరుకుని సెలవు పిలుపు ప్రకటించే బడిగంట కోసం ఆత్రుతగా ఎదురు చూసే చిన్ని చెవుల్లో ఇక పద్యాలు వినపడని హాయిని అందరూ చూసిన వాళ్లమే కదా. సెలవిచ్చి ఇంటికి రాగానే ఇంటి చూరు నుంచి నయాగరా జలపాతాల్లా జారిపడే వర్షపు నీటి చప్పుడుకు లయబద్ధంగా దానికి కోరస్ పాడే కప్పల బెక బెక కచేరీలను ఆలకిస్తూ... లోకాన్ని మర్చిపోవడం ఎంత గొప్ప జ్ఞాపకం. వాన నీటి కాలువలో... కాగితపు పడవలు వేసి అవి వేగంగా దూసుకుపోతూ ఉంటే... టైటానిక్ షిప్ యజమానుల వలే గర్వంగా నవ్వుకునే బాల్యం ఆనందాన్ని ఎవరైనా కొలవగలరా అసలు? అలా గమ్యం తెలియని తీరానికి వెళ్లే పడవ కాస్తా ఏ బుల్లి సుడిగుండంలోనో చిక్కుకుని మునిగి పోతే... మనసంతా బాధతో నిండిపోయి... ఏడుపొచ్చేసి కంటి చూరు నుంచి జారిపడే కన్నీటి బొట్లు బుగ్గలను ఓదారుస్తూ కిందకి జారిపోయే తియ్యటి బాధలు మళ్లీ మళ్లీ వస్తే బాగుండునని అనుకునే ఉంటారు కదా. వర్షం తగ్గాక ఇంటి కెదురుగా మోకాల్లోతు నీటిలో ఆడుతూ పాడుతూ తిరగడం ఎంత ఆనందం? ఆ తర్వాత ఇంట్లో అమ్మో నాన్నో చూసి వీపు విమానం మోత మోగిస్తే... ఉక్రోషంతోనూ... తమ రాజ్యం నుంచి తమని బలవంతంగా గెంటివేసిన శత్రుసైన్యంలా అమ్మానాన్నలపై మనసులోనే కోపంతో రగిలిపోయే ఆక్రోశం గుర్తొస్తే ఇపుడు నవ్వొస్తుంది కదూ. వానలో తడిసి ముదై్ద తల సరిగ్గా తుడుచుకోక ముతక వాసన వేయడం.. తడిసిన తల సరదాగా జలుబు తెచ్చి పెట్టడం.. ముక్కు కారుతూ ఉంటే ఎగపీల్పులతో... వర్షంతో పోటీ పడ్డం పిల్లలకు ఓ ఆటే. కానీ పెద్దాళ్లకు మాత్రం... వెధవా చెబితే విన్నావు కాదు... అంటూ ఓ టెంకిజెల్ల ఇచ్చుకుని... బల వంతంగా పొగలు కక్కే మిరియాల కషాయంతో పనిష్ మెంట్ ఇచ్చే చేదు జ్ఞాపకాలకూ కొదవుండదు. కషాయం తాగించడం కోసమే బెల్లం ముక్క తాయిలాన్నీ చేతిలో పెట్టుకునే పెద్దాళ్ల గడుసుతనం... ఆ బెల్లం ముక్క తీపిని ఊహించుకుంటూనే కారపు కషాయాన్ని అమాంతం గుటకేసి తాగేసే బాల్యం... ఇంటింటా ఓ అద్భుత చిత్రమే. ఎక్కడో శత్రు సేనలు గొడవ పడుతున్నట్లుగా వర్షా కాలంలో ఉరుములు చేసే బీభత్సం... మెరుపులు సృష్టించే భయానక వాతావరణం... కాసేపు భయపెట్టినా.. వాన చిను కులు పడుతుండగానే మళ్లీ ప్రత్యక్షమయ్యే ఎండను వాన ముద్దాడినపుడు ఆకాశంపై ఈ మూల నుండి ఆ మూలకి వయ్యారంగా వంగి మెరిసే ఏడురంగుల ఇంద్రధనుస్సు ఏ దేవుడు గీసిన రంగుల బొమ్మో? లేదా ఏ చిత్రకారుడు నేలపై కోపంతో ఆకాశంపై గీసిన చిత్రకళాఖండమో? తేల్చుకోవడం కష్టమే. ఆకుపచ్చ దనాన్నీ, హాయిదనాన్నీ అందరికీ అందించే ప్రకృతి ఖజానా ...వాన. వానాకాలపు జ్ఞాపకాలు ఎవరి జీవితంలోనైనా మధురంగానే ఉంటాయి. ప్రతీ వాన చుక్కకీ ఓ అనుభవం. నైరుతీ చుట్టాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హుషారుగా తిరిగేస్తున్నారు. వానాకాలం చల్లగా వచ్చేసింది. దాన్ని సాదరంగా స్వాగతించి... ఈ వానాకాలమంతా ఎన్నో జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారనే ఈ పాత జ్ఞాపకాల వానను మీ ముందుంచింది. – సి.ఎన్.ఎస్. యాజులు -
వీళ్లకి కరోనా అంటే భయం లేదు..
సాక్షి, హైదరాబాద్ (గాంధీఆస్పత్రి): కరోన వైరస్ తాకిడికి ప్రపంచం మొత్తం మాస్క్‌లు వేసుకుని భౌతిక దూరం పాటిస్తూ తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపధ్యంలో ఎటువంటి అదురు, బెదురు లేకుండా ఊయల ఊగుతూ భయమనేది తెలియకుండా బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ చిన్నారులు. తెలంగాణ కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ముందు నుంచి వెల్లేందుకే జంకుతున్న క్రమంలో గాంధీఆస్పత్రి ప్రధాన ద్వారం సమీపంలో మాస్క్‌లు ధరించకుండా ఎటువంటి భయం లేకుండా చిన్నారులు ఆటలాడుకుంటున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. బాల్యానికి మించిన మధురస్మృతి లేదంటారు. చదవండి: యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో -
అమ్మో.. టీన్మార్!
కౌమారం అందరికీ వస్తుంది. కిక్కిస్తుంది, కిక్కెక్కిస్తుంది! ఇది ప్రకృతి పిల్లలకు ఇచ్చే బహుమానం. ఇది సుగుణాలకు దారివేయాలి. అవగుణాల నుంచి దూరంగా ఉంచాలి. పేరెంట్స్‌గా అది మీ చేతుల్లోనే ఉంది. లేకపోతే... అమ్మో.. టీన్మార్! బాల్యం, కౌమారం, యౌవనం, మధ్యవయస్సు, వృద్ధాప్యం... ఇవీ మనిషి తన జీవితంలో అనుభవించే దశలు. పుట్టినప్పటి నుంచి 12 ఏళ్లు వచ్చే వరకు గడిచే బాల్యం చాలా మధురమైనది. 18 ఏళ్లు నిండిన నాటి నుంచి 40లలోకి ప్రవేశించే వరకు యౌవనం కూడా జీవితంలో మంచిదశే. ఈ దశలోప్రతి వ్యక్తీ జీవితంలో తాను అనుకున్నది సాధించడానికి అవసరమైన శక్తియుక్తులు కలిగి ఉంటాడు. ఇక 40 నుంచి 65-70ల వరకు ఇక తాను గడించిన అనుభవంతో అలా దాదాపుగా అలవోకగా జీవితాన్ని వెళ్లదీస్తాడు. ఇలా సాగిపోయే దశే... మధ్యవయస్సు. ఇవన్నీ గడిచిపోయాక జీవితం చివరి భాగంలో 75-90 ల వరకు ఉండేది వృద్ధాప్యం అనుకోవచ్చు. ఈ దశలో ప్రతి ఒక్కరూ దాదాపుగా పూర్తిస్థాయి విశ్రాంత జీవితం గడుపుతుంటారు. కానీ 12 ఏళ్ల నుంచి 19 వరకు ఉండే టీనేజీ చాలా చిత్రమైన దశ. ఈ సమయంలో మనం చేసేవన్నీ కరెక్ట్ అనిపిస్తుంది. ఈ దశలోనే మన వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. మనకు అభిరుచులు ఏర్పడి... టీనేజీ దాటాక అవి హాబీలుగా స్థిరపడతాయి. టీన్స్లోని కొత్తహార్మోన్ల ప్రభావంతో పిల్లలు తాము కోపంగా ఉన్నా, దురుసుగా వ్యవహరించినా, ఆగ్రహంతో ఊగిపోయినా... మనకు అదంతా సబబే అనిపిస్తుంది. మధ్యవయసుకు చేరాక ఆలోచిస్తే... అప్పుడెంత దుందుడుకుగా వ్యవహరించామా అంటూ మన ప్రవర్తన పట్ల మనకే సిగ్గుగానూ, బిడియంగానూ ఉంటుంది. అందుకే ఇలాంటి కౌమార (టీన్స్) దశలో వారి ప్రవర్తనల్లో వచ్చే మార్పులు... ఆ ప్రవర్తనకు కారణమయ్యే రకరకాల భావోద్వేగాలు.. అందుకు కారణాలు, పెద్దలు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మేనేజ్ చేయాలి వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. ‘టీన్’ అంటే బాలబాలికలు పదమూడు దాటిననాటి నుంచి పందొమ్మిదవ ఏటి వరకు ఉండే దశ అన్నది అందరికీ తెలిసిందే. థర్‘టీన్’ అంటూ మొదలై... నైన్‘టీన్’ వరకు గడిచే సంవత్సరాలను ఆయా సంఖ్యల పేర్ల చివరన ఉండే ‘టీన్’ అనే పదంతో సూచిస్తుంటారు. అయితే పిల్లలందరిలోనూ టీన్స్‌లో ఉండే ఆ ఉద్వేగాలన్నీ... గంటకొట్టినట్టుగా సరిగ్గా పన్నెండో ఏడు దాటిన మరుక్షణం నుంచే మొదలవ్వాలని ఏమీ లేదు. అమ్మాయిల్లో టీన్స్ తాలూకు పరిణతి 10-11 నుంచే ప్రారంభం కావడం మొదలవుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం కాస్తంత ఆలస్యంగా అంటే... 12వ ఏటి తర్వాతే ఈ పరిణతి ప్రారంభమవుతుంది. పిల్లలు తమ బాల్యం వీడి క్రమంగా పెద్దలుగా రూపొందడానికి మధ్యన ఉండే ఈ సంధి (ట్రాన్సిషన్) దశలో వారి ప్రవర్తనలో ఎన్నో మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) చోటు చేసుకుంటాయి. ఆ మార్పులతో వారెన్నో అయోమయాలకు గురవుతుంటారు. అంతేకాదు.. తమ ప్రవర్తనతో తమకూ, తమ పెద్దలకు సైతం సమస్యలూ, చిక్కులూ తెచ్చిపెడుతుంటారు. హార్మోన్లే ప్రధాన కారణం టీనేజీ పిల్లల ప్రవర్తనల్లో అంతకు మునుపెన్నడూ లేని మార్పు కనిపించడానికి వారిలో కొత్తగా స్రవించే కొన్ని హార్మోన్లే ప్రధాన కారణం. అవి వారిని నిలకడగా, స్థిరంగా, కుదురుగా ఉండనివ్వవు. టీన్స్‌లో వారు కొత్తదనం కోరుకుంటుంటారు. స్వేచ్ఛను ఆకాంక్షిస్తుంటారు. ఉత్సాహాలు, ఉద్రేకాలు పొంగిపొరలుతుంటాయి. తమ కోరికలు తక్షణం తీరకపోతే వెంటనే వారిలో రకరకాల ఉద్వేగాలు చెలరేగుతుంటాయి. మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్రవించడం మొదలవుతుంది. దాంతో మీసాలూ, గడ్డాలు వంటి సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్ కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ హార్మోన్సాహ ప్రవృత్తినీ పెంచుతుంది. కాస్తంత స్వేచ్ఛగా సంచరించేలా, తమకూ తమ ఆపోజిట్ జెండర్‌కూ మధ్యన ఆకర్షణను పెంచేలా చేస్తుంది. ఆ హార్మోన్ ప్రభావం వల్ల సమకూరే కొత్త ఉత్సాహాల కారణంగా తాము స్వేచ్ఛను అనుభవించాలన్న కాంక్షతో కొన్ని పనులు చేయడం మొదలుపెడతారు. ఉదాహరణకు సమాజంలో సిగరెట్ తాగడం, మద్యం సేవించడం, వేగంగా వాహనం నడపడం వంటి కొన్ని అంశాలపై ఆంక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. తమ సాహసప్రవృత్తిని తీర్చుకోడానికి వారు సమాజంలో ఆంక్షలున్న అంశాలను కాస్త తెంపరితనంతోనో లేదా దొంగతనంగానో చేయాలనుకుంటారు. ఆ పనులు చేసినప్పుడు అవి వారికి మంచి లేదా హాయిగా అనిపించే (ఫీల్‌గుడ్) భావనను కలగజేస్తే... అవే పనులు మాటిమాటికీ చేసి అలవాట్లనూ, వ్యసనాలనూ అభివృద్ధి చేసుకుంటారు. ఇక్కడ మెదడులో స్రవించే మరికొన్ని హార్మోన్లు సైతం రంగంలోకి వస్తాయి. ఉదాహరణకు మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు అందులోని నికోటిన్ ప్రభావం వల్ల మెదడులో డోపమైన్ వంటి సంతోష రసాయనాలు స్రవిస్తే... ఆ ఆనందభావనను మాటిమాటికీ పొందడం కోసం టీనేజీ పిల్లాడు మళ్లీ మళ్లీ సిగరెట్ తాగాలనుకుంటాడు. అలాగే మద్యం, పేకాట, దురలవాట్లు శ్రుతిమించితే డ్రగ్స్... ఇవన్నీ కూడా అలా అలవాటయ్యేవే. మంచీ చెడుల కలగలుపు.. మన హార్మోన్లతో టీనేజ్‌లో కలిగే సాహసధోరణీ, సంతోష రసాయనాలూ రెండూ కలగలసి మంచీ-చెడూ... ఈ రెండు రకాల అభిరుచులూ వృద్ధి అవుతాయి. ఉదాహరణకు టీనేజ్‌లో కొత్తగా బైక్ నేర్చుకోవాలనే ధోరణి అందరిలో కలగడం ఓ మంచి భావన. భవిష్యత్తులో తాము జీవితాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలనే తపన అందులో ఉంటుంది. అయితే బైక్ నేర్చుకున్న తర్వాత దాని ముందు చక్రాన్ని పైకెత్తి నడపడం, చాలా వేగంగా డ్రైవ్ చేయడం వంటివి చేస్తున్న టీనేజీ పిల్లలను మనం రోడ్లపై నిత్యం చూస్తుంటాం. దీనికి కారణం ఆ వయసులో వారిలో కలిగే సాహసప్రవృత్తి. దానికి తోడుగా తమ కాన్షియస్ ఎఫర్ట్స్‌తో వారు తమ బైక్ నైపుణ్యాలను మరింత వృద్ధిపరచుకొని సాహసకార్యాలు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లోనైతే హింసాత్మక ప్రవృత్తితో చాలా క్రూరంగానూ వ్యవహరిస్తారు. అయితే పిల్లల్లో ఇలా వ్యక్తిత్వ రూపకల్పన, అభిరుచులు ఏర్పడే సమయంలో... వారినీ, వారి ఆలోచనలనూ, వారి అలవాట్లనూ ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. టీనేజ్‌లో మన ప్రవర్తన రూపొందడానికీ, అభివృద్ధి్ద చెండానికి కారణాలివే... జన్యుపరమైన అంశాలు: టీనేజీ పిల్లల్లోని ప్రవర్తనలకు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. సాధారణంగా తల్లిదండ్రులనుంచి వచ్చే జన్యువుల పైనే వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం చాలా ఎక్కువనుకోండి. వారిని చూసిన పిల్లలు సైతం తామూ అలాగే ధైర్యంగా ఉండటాన్ని అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రుల్లో ఏదైనా కొత్తగా చేసే పనుల విషయంలో భయపడే గుణం... అంటే ‘పర్ఫార్మెన్స్ యాంగై్జటీ’ ఉంటే పిల్లల ప్రవర్తనలోనూ చాలా వరకు అవే గుణగణాలు (ట్రెయిట్స్) వస్తాయి. కాన్షియస్ ఎఫర్ట్స్ : వీటికి కూడా చాలా వరకు తల్లిదండ్రులతో పాటు కొన్ని సామాజిక అంశాలూ కారణమవుతాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఏ డాక్టర్లో, ఐఏఎస్లుగానో పనిచేస్తున్నారనుకోండి. వాళ్లను గమనించే పిల్లలు... తాము కూడా అలాంటి వృత్తిలోకే వెళ్లాలనీ, అలాంటి గౌరవమే పొందాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే విషయం పెయింటర్లు, డాన్సర్లు, రచయితలకూ వర్తిస్తుంటుంది. కొన్ని మినహాయింపులున్నా సాధారణంగా తల్లిదండ్రుల ప్రభావం కారణంగానూ, తమ కాన్షియస్ ఎఫర్ట్స్తోనూ కలగలిసిన ప్రభావంతో తమ కెరియర్ను నిర్మించుకుంటుంటారు. ప్రవర్తనపై సామాజిక అంశాల ప్రభావం ఇలా... పిల్లలను తమ చుట్టూ ఉన్న సమాజంలోని అనేక అంశాలను నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వాటినుంచి కూడా తాము నేర్చుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా తమ పరిసరాలు, తాము చూసే సినిమాల వంటి మాస్‌మీడియా ప్రభావాలు, తాము చదివే పుస్తకాల వంటి అనేక సామాజిక అంశాలూ టీనేజీ పిల్లల ప్రవర్తనను నిర్దేశిస్తుంటాయి. నిర్ణాయాత్మక భూమికను పోపిస్తుంటాయి. పరిసరాల ప్రభావం:ఉదాహరణకు తమ ఇంటికి సమీపంలో ఏ పోలీస్ ఉద్యోగో ఉన్నాడు. అతడి ధీరత్వం, అతడి హుందాతనం, అతడు ప్రవర్తిస్తున్న తీరుతో స్ఫూర్తి పొందుతుంటాడు. అలాంటి వారి వల్ల ప్రభావితమైన కుర్రాడు తానూ అలాంటి వృత్తిలోకే వెళ్లాలని ఆశిస్తాడు. అందుకు అనుగుణంగా మళ్లీ తన కాన్షియస్ ఎఫర్ట్స్ మొదలుపెడతాడు. కొద్దిమేరకు జన్యుపరమైన అంశాలతో పాటు... చాలావరకు ఈ కాన్షియస్ ఎఫర్ట్స్ కారణంగానే పిల్లల కెరియర్, వారి భవిష్యత్తు నిర్ణయమవుతుంది. అలాగే నిత్యం కీచులాడుకునే తల్లిదండ్రులూ, పరిసరాల్లో ఎప్పుడూ గొడవలకు దిగే ప్రవృత్తి ఉన్నవారు ఉన్నారనుకోండి.... అవే అంశాలు పిల్లలనూ ప్రభావితం చేస్తాయి. దాంతో వారు నిత్యం తగాదాలు పెట్టుకునే తంపులమార్లుగా, పోకిరీలూ, జులాయిలుగా తయారయ్యే అవకాశాలూ ఉంటాయి. టీవీలు, సినిమాల, డిజిటల్ వంటి మాస్ మీడియా : సాధారణంగా టీనేజ్ దశలో చూసే సినిమాలు, అందులో కథానాయకుడి లక్షణాలు పిల్లలను చాలావరకు ప్రభావితం చేస్తుంటాయి. ఉదాహరణకు శంకరాభరణం సినిమా తర్వాత చాలా మంది టీనేజీ పిల్లలు సంగీతం వైపునకు ఆకర్షితులయ్యారు. అలాగే సాగరసంగమం సినిమా వచ్చాక చాలా మంది డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇక ‘ద్రోహి’ (హిందీలో ద్రోహకాల్) అనే సినిమా చూసిన కొంతమంది పోలీస్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ తీసుకొని ఆ వృత్తిలోకి వెళ్లారు. స్ఫూర్తిదాయక కథనాలు, సాహిత్యం: కింది స్థాయినుంచి జీవితాన్ని ప్రారంభించి, తాము మంచి కెరియర్‌నూ, మంచి పేరునూ సంపాదించిన వారి కథనాలూ చదవడం, సాహిత్యంతోనూ చాలామంది టీనేజీ పిల్లలు ప్రభావితమవుతుంటారు. పాపులర్ సైన్స్ పుస్తకాలు చదివి సైన్స్ పట్ల అభిరుచి పెంచుకోవడం, డబ్బు సంపాదన గురించిన కథనాలు చదివి జీవితంలో తామూ పారిశ్రామికవేత్తలుగా రూపొందిన ఉదాహరణలు సైతం చాలానే ఉన్నాయి. ఇంగ్లిష్‌లో స్టీఫెన్ హాకింగ్స్ వంటివారి పుస్తకాలు చదవడం, తెలుగులో నండూరి రామమోహన్‌రావు ‘విశ్వరూపం’, ‘నరావతారం’, యాకొవ్ పెరల్మాన్ రాసిన ‘నిత్యజీవితంలో భౌతికశాస్త్రం’ వంటి పుస్తకాలూ, మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి వారి రచనలు చదివి సైన్స్ పట్ల అభిరుచి పెంచుకొని సైంటిస్టులుగా మారినవారూ ఉన్నారు. అవే అంశాలతో దురలవాట్లు సైతం... మనం పైన చెప్పుకున్న అంశాల నుంచే దురలవాట్లు అబ్బుతాయి. ఉదాహరణకు పరిసరాల్లో నేరప్రవృత్తి ఉన్నవారి నుంచి, సినిమాల్లోని కొన్ని దుస్సాహస ధోరణుల నుంచి, పేరుమోసిన నేరగాళ్ల నుంచి ప్రేరణ పొంది చెడుదారుల్లో నడవడం, ఆల్కహాల్‌కూ, డ్రగ్స్‌కూ అలవాటు కావడం వంటి ధోరణులు సైతం చోటు చేసుకునేందుకు టీనేజీలోనే బీజం పడటం జరుగుతుంటుంది. ఇవన్నీ చేశాక కూడా టీనేజీ పిల్లల్లో ప్రవర్తన పూర్వకమైన మార్పుల వల్ల ఇటు పెద్దలకూ అటు వారికీ ఇబ్బందులు కలుగుతుంటే సైకియాట్రిస్ట్‌ల వంటి ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవడం చాలా వరకు మేలు చేస్తుంది. సైకియాట్రిస్ట్‌లు కౌన్సెలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) వంటి ప్రక్రియలతో వారి టీనేజీ ప్రవర్తనలను చక్కదిద్దుతారు. ఒకవేళ ఈ ఈడు పిల్లలు దుష్ప్రవర్తనతో ఉంటే... వాటి కారణంగా వచ్చే దుష్పరిణామాలకు చాలావరకు అడ్డుకట్ట వేస్తారు. చక్కదిద్దడం ఎలా... టీనేజ్‌లోకి రాగానే పిల్లల్లో కనిపించే ప్రవర్తను మార్పులను చక్కగా గాడిలో పెట్టడం (ఛానలైజ్ చేయడం) ద్వారా వారిని ప్రయోజనాత్మకమైన మంచి పౌరులుగా రూపొందేలా చేయవచ్చు. అందుకు తల్లిదండ్రులు అనుసరించాల్సిన కొన్ని అంశాలివే. ఆదర్శప్రాయంగా ఉండటం: టీనేజీ పిల్లలు తమ చాలా ప్రవర్తనలను పెద్దల నుంచే నేర్చుకుంటారని చెప్పుకున్నాం కదా. ఉదాహరణకు తాము మంచివృత్తుల్లో ఉండాలన్న భావనలూ, తాము సైతం తమ తల్లిదండ్రుల్లా సంగీత సాధన, మంచి రచనలు చేయాలని అనుకోవడానికి తల్లిదండ్రుల ఆదర్శ ప్రవర్తనే కారణమవుతుంది. మంచి జీవన శైలి అలవాటు చేయడం: మన జీవనశైలి ఆరోగ్యకరంగానూ, క్రమశిక్షణతోనూ ఉండేలా టీనేజీలోనే పిల్లలకు అలవాటు చేయాలి. ఆ వయసులో ఏర్పడ్డ అలవాట్లు జీవితాంతం కొనసాగుతాయి. క్రమబద్ధంగా ఉండటం అలవాటు చేసుకుంటే అది జీవితంలో వచ్చే ఎన్నో అడ్డంకులు, సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ కలిగి ఉండటం అన్నది జీవితంలో శ్రమపడటాన్నీ నేర్పుతుంది. పటిష్టమైన కుటుంబ సబంధాలు: తల్లిదండ్రులు తమ పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం, వారిపట్ల ప్రేమతో వ్యవహరించడం ద్వారా టీనేజీలో సైతం పిల్లలు అయోమయానికి గురికాకుండా స్పష్టంగా వ్యవహరించేలా చేయవచ్చు. పిల్లలు తమను నమ్మి అన్ని విషయాలూ తమతో చర్చించేలా బలమైన, పటిష్టమైన కుటుంబ సంబంధాలు ఉన్నప్పుడు ఆ పిల్లలు టీనేజీ అయోమయాలను తేలిగ్గా అధిగమించగలుగుతారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా చూడటం: వ్యసనాలన్నీ పిల్లలను కబళించేందుకు టీనేజీలోనే పొంచి ఉంటాయి. వారి సాహసధోరణీ, తాత్కాలిక సంతోషాన్ని కలిగించే అంశాలు వ్యసనాలకు బానిస చేస్తాయి. అందుకే అవెంత ప్రమాదకరమో పిల్లలకు అన్యాపదేశంగా ఎప్పుడూ చెబుతూ ఉండటం ద్వారా వాటి జోలికి వెళ్లకుండా చేయాలి. మంచి అభిరుచుల వృద్ధి కూడా... టీన్స్ దశలోనే పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణం ప్రారంభం అవుతుందనీ, అభిరుచులూ పెంపొందుతుంటాయని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ దశలో తమకు సంతోషాన్నిచ్చే వ్యక్తిత్వాన్నీ, అభిరుచులను పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. ఆ సమయంలో కూడా మళ్లీ వాళ్ల మెదడుల్లో సంతోషాన్నీ, హాయినీ ఇచ్చే డోపమైన్, సెరిటోనిన్, ఎండార్ఫిన్ లాంటి రసాయనాలు స్రవిస్తాయి. ఉదాహరణకు ఒక టీనేజ్ అబ్బాయి చక్కటి డ్రాయింగ్ వేస్తాడు. మరొక అమ్మాయి మంచి రచన చేస్తుంది. ఇంకొకరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు. ఇలా సృజనాత్మకమైన చర్య (యాక్టివిటీ) వల్ల తాము పొందిన ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందడం కోసం... తమలోని ఆ సృజనాసామర్థ్యాన్ని (టాలెంట్‌ను) అభివృద్ధి చేసుకుంటారు. ఇందుకోసం చేసే ప్రాక్టీస్‌ను ‘కాన్షియస్ ఎఫర్ట్’ అని అంటారు. - డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,లూసిడ్ డయాగ్నస్టిక్స్,బంజారాహిల్స్,హైదరాబాద్. -
అమ్మా.. నీకు నచ్చినట్లే ఉండు
‘‘ఇక్కడ ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించకు. అయినా మా స్కూలుకొచ్చేటప్పుడు మంచి దుస్తులు వేసుకుని రావచ్చు కదా, మరీ ఇలా వచ్చావేంటి? నా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంబరాసింగ్‌గా ఉంటుంది’’... ఇలా పిల్లలు నిర్దయగా, కర్కశంగా మాట్లాడినా సరే... గాయపడకుండా ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మాత్రమే. గాయపడినా క్షమించగలిగింది తల్లి మాత్రమే. ఆధునిక, నాగరిక పొరలన్నీ తల్లి మనసు ముందు దిగదుడుపే. అమ్మ ఎలా ఉంటే అలాగే ఉండాలి. ఆమెను అలాగే ఉండనివ్వాలి. ఆమె ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనివ్వాలి. ఆమెకు ఎందులో సంతోషం ఉంటే ఆ సంతోషంలో ఆమెను జీవించనివ్వాలి. ఆమె నాగరకంగా ఉన్నా అనాగరకంగా ఉన్నా అమ్మే. మనకు ప్రపంచాన్ని తెలియచెప్పింది ఆమే. ఆమె నుంచి నేర్చుకున్న జ్ఞానంతోనే మన బాల్యం ఎదిగింది. ఇప్పుడు మనలో రెక్కలు విచ్చుకున్న విజ్ఞానం ఆమెలో తప్పులు వెతకడానికి కాదు. ఆమె తన పిల్లల తప్పుల్ని కూడా ఆనందంగా స్వీకరించింది, క్షమించింది. ఆమె ఆమెగా జీవించే క్రమంలో ఆమెలో కనిపిస్తున్న తప్పులను పిల్లలు స్వీకరించాల్సిందే. అమ్మకు అండగా ఆమె పక్కన నిలవాల్సిందే... అలా నిలబడే విజ్ఞతను మనలో నింపింది కూడా ఆమె పెంపకమే..’’ అంటూ ఆశువుగా ఓ కవిత రాశారు అనామిక.అనామికది జైపూర్. మదర్స్‌డే రోజున (మే నెల 12వ తేదీ) ఆమె స్నేహితులు నిర్వహించిన సాహిత్య సదస్సుకు హాజరయ్యారు. తల్లి గురించి చిన్న కవితలు, కథలు చదివి వినిపించవలసిందిగా ఆ కార్యక్రమానికి వచ్చిన తల్లులందరినీ... కోరారు నిర్వహకులు. పది నిమిషాల్లో అందరూ కవితలు రాశారు. చదివారు.అనామిక రాసిన కవిత అక్కడికి వచ్చినవారందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో సంచలనాన్ని సృష్టించింది. యూ బ్యూబ్లో ఎనిమిది లక్షల మంది వీక్షించారు. ఫేస్బుక్లో వ్యూస్ నంబర్ అయితే ఏకంగా ఎనిమిది మిలియన్లను దాటి పోయింది. ఈ కవితను విన్న తల్లులు, తండ్రులు వాళ్ల పిల్లలకు షేర్ చేస్తున్నారు. పిల్లలు వాళ్ల పేరెంట్స్‌కు చూపిస్తున్నారు. ఓ యువతి అయితే నేరుగా అనామిక దగ్గరకు వచ్చి ‘అమ్మను అమ్మలా ఉంచడానికి మీ కవిత నాకు ఎంతగానో ప్రోత్సాహం కలిగించింది’ అని చెప్పింది. అనామిక ఇలాంటి సంతోషకరమైన అనుభవాలను పంచుకుంటూ ‘‘నా గుండెల్లోంచి నేరుగా అక్షరాల రూపంలో బయటకు వచ్చిన భావం అది. విన్న వాళ్లందరినీ అంతే హృద్యంగా గుండెలోతుల్ని తాకుతుంది. ఎందుకంటే అమ్మ గురించిన భావన ఎవరినైనా కదిలించి తీరుతుంది’’ అన్నారు. పిల్లలకు దుఃఖం వస్తే భుజమిచ్చే ఆసరా అమ్మ. అలాంటి అమ్మ పట్ల పిల్లలు చూపించాల్సిన ప్రేమకు కూడా కొలతలు , కొలమానాలు ఉండకూడదు. తల్లి మీద ఓవర్ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, ఆమె ట్రెండ్‌కు తగ్గట్టుగా మారాలని ఆశించి, ఎలా ఉండాలో నిర్దేశిస్తూ ఆమె మీద ఒత్తిడి తీసుకురాకూడదు’’ అన్నారు అనామిక. – మంజీర అనామిక కవిత ఆమె తల్లి, ఆమెలో తప్పు ఎందుకుంటుంది?ఆమె నిన్ను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి శ్రమించింది.నీ బాక్సులో ఎప్పుడూ రుచికరమైన మంచి ఆహారాన్ని పెట్టింది. నీ దుస్తుల్ని శుభ్రంగా ఉతికి పెట్టింది. నిన్ను మరకలు లేకుండా సమాజానికి చూపించింది.ఆమె తల్లి, ఆమెలో తప్పు ఎందుకుంటుంది?ఆమె పని చేయడానికి బయటికెళ్తే వద్దని ఆపేస్తారు పిల్లలు.ఆమె ఇంట్లోనే ఉండి అందరికీ అన్నీఅమరుస్తుంటే ఆమెని వెక్కిరిస్తారు. నేనూ ఓ తల్లినే. తల్లిగా నేనూ తప్పు కాకూడదు.అమ్మా నిన్ను బాధించి ఉంటే నన్ను క్షమించు. ఒట్టు... ఇక ఎప్పుడూ నీ వెంటే ఉంటాను.అమ్మా! నువ్వెప్పుడూ తప్పు కాదు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి.ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు.మా అనుమతి నీకు అక్కర్లేదు. -
వికసించని బాల్యానికి విహంగాల నైపుణ్యం!
అంబిక శారీరంగా, మానసికంగా ఆరోగ్యవంతమైన పిల్లలు ఇంట్లో ఇద్దరికి మించి ఉన్నారంటే ఆ అల్లరి అంతా ఇంతా కాదు. అలాంటిది బుద్ధిమాంద్య, మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఉంటే.. వారిని చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు. పదిహేనేళ్ల వయస్సు వచ్చినా ఆకలేస్తే అన్నం తినాలనే ఆలోచన ఉండదు. అత్యవసరాలకు వెళ్లాలన్నా చెప్పడం రాదు. అలాంటి మనో, దేహ అసహాయతలను జయించడానికి అవసరమైన బాటలను చిన్నారుల బాల్యం నుంచే వేస్తోంది కర్నూలులోని అంబికా శిశు కేంద్రం. ఈ కేంద్రంలో వైకల్యంతో మాటలు రాని పిల్లలకు ఫిజియోథెరపి, స్పీచ్ థెరపి లాంటి అత్యవసరమైన చికిత్సలతోపాటు అనునిత్యం పాఠాలు, ఆటలు, పాటలు నేర్పిస్తున్నారు. ఎటువంటి విరాళాలూ సేకరించకుండా, ఆర్థిక సహకారాలు పొందకుండా గత ఇరవై మూడేళ్లుగా ఉచిత సేవలు అందిస్తోంది అంబికా శిశు కేంద్రం. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో అంబికా శిశు కేంద్రం 1995లో ఆవిర్భవించింది. హేమ్‌చంద్ దేవ్చంద్ చారిటబుల్ ట్రస్ట్ (హెచ్‌డీసీ ట్రస్ట్) ఆధ్వర్యంలో.. బహుళ వైకల్యాలు కలిగిన పిల్లలకు జీవన నైపుణ్యాలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కేవలం ఇద్దరితో ప్రారంభమైన ఈ కేంద్రంలో ప్రస్తుతం నూటఎనభై మంది సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవడం, వీలైనంత తక్కువగా ఇతరుల సేవలను ఉపయోగించుకోవడం నేర్పుతారు. అలాగే చేయగల, చేసుకోగల సాధారణ పనులు నేర్పుతారు. సమాజంలో ఎలా మసులుకోవాలి, షాపులకు వెళ్తే కావాల్సిన వస్తువులను ఎలా కొనుగోలు చేయాలి, పొదుపు, సురక్షిత జీవనం, ప్రమాదం ఉందనుకున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, తప్పిపోయినప్పుడు తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సమీపంలో ఉన్న వాళ్లకు ఇచ్చి సమాచారం ఇవ్వమని చెప్పడం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా సమాజంలో అవహేళనకు గురి కాకుండా ఉండేలా సూచనలిస్తారు.హేమ్‌చంద్ దేవ్చంద్ చారిటబుల్ ట్రస్ట్ 1968లో ఏర్పడింది. ప్రస్తుతం కాంతిలాల్ షా మేనేజింగ్ ట్రస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యాపారం రంగంలో రాణిస్తున్న కాంతిలాల్ షా సొదరులు సమాజ సేవా చేయాలన్న లక్ష్యంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 1971లో హెచ్డీసీటీ (సేuŠ‡ హాస్పిటల్) పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలందించేందుకు శ్రీకారం చుట్టారు. మెడికల్ క్యాంప్‌ల నిర్వహణ, ఉచిత మందులు, కంటి పరీక్షల క్యాంప్‌లు, ఉచిత కళ్ల అద్దాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో బుద్ధిమాంద్య, మానసిక, బహుళ వైకల్యం కలిగిన పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్ని చూపును తొలిగించేందుకు అంబికా శిశుకేంద్రం ఏర్పాటు చేశారు. ప్రసుత్తం నాలుగు అంతస్తుల సొంత భవనంలో కేంద్రాన్ని నడుపుతూ సేవలందిస్తున్నారు. ప్రత్యేక వైద్యసేవలు, శిక్షణతో పాటు చదువు, స్వయం ఉపాధి పనులు వంటి ముఖ్య అంశాలతో అంబికా శిశుకేంద్రం పని చేస్తోంది. వివిధ వ్యాపారాలలో నిత్యం తీరిక లేకుండా ఉన్నా సేవా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ట్రస్టు వ్యవస్థాపకులు. అంబికా శిశు కేంద్రంలో అరవై రెండు మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉండగా వారి జీత భత్యాలు, శిక్షణ, కేంద్రం నిర్వాహణకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఎస్.పి. యూసుఫ్, సాక్షి, కర్నూలు ఫోటోలు: డి. హుసేన్ నాన్న ఇచ్చిన స్ఫూర్తి మా నాన్న హేమ్‌చంద్ దేవ్చంద్ 1943లో చెన్నై నుంచి కర్నూలుకు వచ్చారు. వంట నూనె తయారి, అమ్మకాలు చేపట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. క్రమంగా రైస్‌మిల్, దాల్మిల్, రిఫైనరీ, సబ్బుల ఫ్యాక్టరీలను నెలకొల్పాం. ‘మనకు అన్నం పెట్టే ఊరి ప్రజల కోసం చేతనైనంత చేయాలి’ అని నాన్న చెప్పేవారు. ఆ మాట ఇచ్చిన స్ఫూర్తితో అంబికా శిశు కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నాం. కేంద్రం నిర్వహణలో మా కోడలు, ఇతర కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, సహకారం ఉంది. కాంతిలాల్ షా, మేనేజింగ్ ట్రస్ట్ డిగ్రీ చదువుతున్నా నాకు సెరిబ్రల్ పాల్సీ (మెదడుకు సంబంధించిన ఓ వ్యాధి) అని డాక్టర్లు నిర్ధారించారు. 1995లో నన్ను అంబికా శిశు కేంద్రంలో చేర్పించారు. అక్కడ శిక్షణ, చదువు నేర్చుకొని 2009లో టెన్త్ పూర్తి చేశా. ఇంటర్ చేసి ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నా. ఇక్కడ చేరిన వాళ్లకు కంప్యూటర్ చేర్పించేందుకు ఇక్కడే ట్రైనీ ఉద్యోగంలో చేరాను. కిరణ్, సెరిబ్రల్ పాల్సీ విద్యార్థి -
బాల్యం వారికిద్దాం బరువు మనం మోద్దాం
పెద్దవాళ్లు ట్రిమ్ చేస్తుంటే తీర్చిదిద్దినట్లు క్రోటన్ మొక్కల్లా పెరుగుతున్న పిల్లలు సహజమైన వికాస పరిమళాలను మాత్రం వెదజల్లలేకపోతున్నారు. ఇప్పుడొస్తున్న వాణిజ్య ప్రకటనలు ఈ పరిస్థితిని మార్చి పిల్లల్ని అర్థం చేసుకునేలా పెద్దల్నే తీర్చిదిద్దుతుండడం ఒక ఆరోగ్యకరమైన పరిణామం. నెస్లే.. మ్యాగీ నూడుల్స్‌ను ఇండియాలో మార్కెట్ చేయడానికి ఇక్కడి టీమ్ చాలానే కసరత్తు చేసిందట. అప్పటి దాకా మన దగ్గర నిమిషాల్లో అయిపోయే స్నాక్స్ ఏవీ లేవు. నూడుల్స్ వంటి చైనీస్ ఫుడ్ మనింట్లో ఘుమఘుమలాడించిన దాఖలా అంతకన్నా లేదు. అలాంటి సంప్రదాయంలో మ్యాగీని ఎలా ఇమడ్చాలి? ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎలా తయారు చేయాలి? ‘‘పిల్లలు... యెస్ వాళ్లను టార్గెట్ చేస్తే..?’’ అనుకున్నారు నెస్లే ఇండియా అప్పటి మార్కెటింగ్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ సంగీతా తల్వార్. పిల్లలకు ఏదైనా ఆటే. తినడం కూడా! స్పూన్‌తో తీసుకుంటూ ఉంటే నూడుల్స్ జారిపోతూ ఉండడం.. మళ్లీ వాటిని ఫోర్క్‌కు చుట్టుకోవడం నోట్లో పెట్టుకుని చివరి నూడుల్‌ను లోపలికి పీల్చుకోవడం.. పిల్లలు ఎంజాయ్ చేస్తారని అనిపించింది. పైగా అప్పుడు పిల్లల్ని ఏ యాడ్ ఏజెన్సీలూ పెద్దగా పట్టించుకోవడంలేదు.. పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే వాళ్లను పెట్టుకుని రెండు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీని మార్కెట్ చేసి ఇప్పుడు పెద్దవాళ్లకూ ఫేవరేట్ అయ్యేంత ప్రాచుర్యంలోకి తెచ్చింది. మింగేస్తున్నాం పిల్లలు నిన్నమొన్నటిదాకా నెగ్లెక్టెడ్ కేటగిరీయే. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఇష్టాఇష్టాలు, వాళ్లవే అయిన ఆటలుపాటలు, వాళ్ల పరిశీలనలు, ఆసక్తులు, అభిరుచులను పట్టించుకుంటున్న పెద్దలు నేటికీ తక్కువే. వాళ్లు ఆడినా.. పాడినా.. అబ్బురపడేలా చేసినా.. వెనక పెద్దవాళ్ల బలవంతమే. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ల బాల్యాన్ని స్కెచ్ చేస్తున్నది పేరెంట్సే. క్లచెస్లో పెద్దవాళ్లకు నచ్చిన ఆకృతిలో పెరుగుతున్న క్రోటాన్ మొక్కలు. ఎప్పటికప్పుడు కొమ్మలు, రెమ్మలు కోతకు గురవుతూ చక్కటి తీరులో బాల్యం పెరుగుతోంది.. సహజ పరిమళాలను కోల్పోతూ! ఇక మన పెద్దవాళ్లం.. పిల్లలను ఊరించే మ్యాగీ పెద్దవాళ్లకూ ఆహారమైనట్టు పిల్లల కోసం ఏమీ మిగల్చకుండా వాళ్ల హక్కులను హరించేస్తున్నాం. మన అభిరుచులను వాళ్ల మీద రుద్దుతూ.. వారి బాల్యాన్నీ లాక్కుంటున్నాం. భావితరాల కోసం కించిత్తయినా చింతిస్తున్నామా? చింతన చేస్తున్నామా? ఇవి కావాలి ప్రకటనలకు చాలా ప్రభావం ఉంటుంది! మనమెలా ఉండాలో.. ఏం తినాలో.. ఎలా మసులుకోవాలో కూడా మార్కెటే నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే యాడ్స్. ఇప్పుడు అవి మానవసంబంధాలనూ వాడుకుంటున్నాయి. తప్పులేదు.. కమాడిటీతోపాటు ఓ విలువనూ సేల్ చేసే కమర్షియల్స్ ఇప్పుడు అవసరమే. క్యాడ్బరీ చాక్లెట్ యాడ్‌లా! అన్న హోంవర్క్ చేసుకుంటుంటాడు.. దగ్గర్లోనే తమ్ముడు.. టీపాయ్ మీద అయిపోయిన చాక్లెట్ రాపర్ పెట్టి కళ్లుమూసుకుని దేవుడికి దండంపెట్టుకుంటుంటాడు.. ‘‘దేవుడా.. ఇది తీసుకొని కొత్త చాక్లెట్ ఇవ్వూ’’ అని. కళ్లు తెరిచి చూస్తే ఖాళీ రాపరే కనిపిస్తుంది వెక్కిరిస్తున్నట్టుగా. ఏడుపు మొహం పెట్టుకొని మళ్లీ కళ్లు మూసుకుని వేడుకుంటాడు దేవుడిని. కళ్లు తెరుస్తాడు. చాక్లెట్. తమ్ముడి కళ్లు మెరుస్తాయి. అన్న దగ్గరకు పరిగెత్తుకెళ్లి.. దేవుడు చాక్లెట్ ఇచ్చాడు అని చెప్తాడు. ‘‘ఒక్కటేనా? నా కోసం కూడా ఎందుకడగలేదురా?’’ అంటాడు అన్న. ‘‘అయ్యో.. నెక్స్›్ట టైమ్’’ అని తుర్రుమంటాడు తమ్ముడు. అన్న మొహంలో నవ్వు. అప్పుడు వాళ్లమ్మ వచ్చి అడుగుతుంది.. ఆ ఖాళీ రాపర్ నన్ను పడేయమంటావా? నువ్వు పడేస్తావా?’’ అని. అన్న అమ్మను చూస్తాడు. తమ్ముడి కోసం అన్న చేసిన త్యాగం. అమ్మానాన్న నేర్పిన ప్రేమ. ఒకరికోసం ఒకరనే భావన! ముందు ఇంట్లో సిబ్లింగ్ రైవల్రీ లేకపోతే భారతీయులంతా సోదరసోదరీమణులే.. ద్వేషమంటే తెలియకుండా పెరుగుతారు కాబట్టి. ఈ విషయాన్ని పెద్దవాళ్లకూ చెప్పాలి. పేరెంటింగ్ నేర్పాలి. క్యాడ్బరీ యాడ్ అదే చేసింది. ఫస్ట్ కాదు బెస్ట్ ఇది క్లాస్మేట్ కంపాస్బాక్స్ యాడ్. లెక్కల్లో తక్కువ మార్కులు వస్తాయి పాపకు. ఫస్ట్ మార్క్స్ వస్తే చాక్లెట్ కేక్ చేస్తానని ప్రామిస్ చేస్తుంది అమ్మ. అందుకే కేక్ చేయొద్దులే మార్కులు రాలేదు అంటుంది కూతురు స్కూల్నుంచి వస్తూనే నిస్సత్తువగా. అమ్మ రాత్రి అమ్మాయి అసైన్మెంట్ బుక్ చూస్తుంది. ప్రతిసారీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతూంటాయి. తెల్లవారి పాప బడికెళ్లే టైమ్‌కల్లా చాక్లెట్ కేక్ డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంటుంది. బిడ్డ కళ్లు విప్పారుతాయి సంతోషంగా. అంతలోకే మొహం ముడుచుకుపోతుంది. ఫస్ట్ రాలేదు కదా కేక్ ఎందుకూ? అని అడుగుతుంది. బెస్ట్‌గా ఉన్నందుకు అంటుంది అమ్మ. లైఫ్‌లో ఫస్ట్ కాదు బెస్ట్‌గా ఉండాలన్న సందేశం ఆ యాడ్దే. అదీ అమ్మానాన్నల నోటి నుంచి రావాలి. మార్కులు, ర్యాంకుల్లో కాదు మానవత్వంలో ముందుండాలి. బెస్ట్ హ్యూమన్ బీయింగ్‌గా బతికేలా పిల్లలకు నేర్పాలనే స్పిరిట్‌ను చాటే యాడ్ అది. పిల్లలు భవిష్యత్ తరాల బాగును ఆలోచించే రేపటి పౌరులుగా తయారు కావాలి. ఆ బాధ్యత పెద్దలుగా మనం ఇప్పుడు నిర్వర్తించాలి. బాల్యాన్ని వాళ్లకిద్దాం. బరువును మనం మోద్దాం. సమాజంలో పిల్లలు నెగ్లెక్ట్ అవకూడదు. వాళ్ల స్పేస్‌ను పెద్దలు ఆక్రమించకూడదు! ఈ విషయాన్నే ఇప్పుడొస్తున్న యాడ్స్ చక్కగా, మనసుకు హత్తుకునేలా చెబుతున్నాయి. – సరస్వతి రమ -
భద్రత లేని బాల్యం
బాల్యం బాగుంటేనే భవిష్యత్తులో పౌరులు బాగుంటారు. లేకుంటే ఆరోగ్యపరంగా, విద్యాప రంగా వెనుకబడిన పౌరులతో దేశం మొత్తం బల హీనంగా తయారౌతుందని అందరికీ తెలుసు కానీ ఈ బాల్యానికి భద్రత అనేది మాత్రం అందని ద్రాక్షలాగానే తయారైంది. ఈ బాధ్యత ఇక్కడ, అక్కడ అని కాకుండా తల్లి ఒడి నుంచి పాఠశాలల దాకా అవసరం కానీ మన చిన్నా రులకు తల్లి గర్భం నుండే భద్రత కరువౌతున్న వాదనకు రెండు తెలుగు రాష్ట్రాలలో బయటపడ్డ సరోగసీ రాకెట్, పిల్లల అక్రమ రవాణా కేసుల్లో ఈ రెండు రాష్ట్రాలు మొదటి, రెండు స్థానాల్లో నిలుస్తున్నాయని కేంద్ర నివేదికనే చెప్పింది. అలాగే యాదాద్రి ఘటన, హైదరాబాద్‌లో పాఠశాలలు కూలి పిల్లలు మృతి చెందడం, వీధి కుక్కల బారిన పడటం, పాఠశాల బస్సు ప్రమా దాల్లో మృతి చెందటం, బాల కార్మిక వ్యవస్థ మొదలగు అవలక్షణాలు ఓ వైపైతే, మైనర్‌గా ఉండి గర్భం రావ డమో, నమ్మినవాడు మోసం చేయ డమో, కట్టుకున్న వాడు గెంటేయ డమో ఇత్యాది కారణాలతో తల్లులు పసిబిడ్డలను మురికి కాలువల్లో, ముళ్ల పొదల్లో వేస్తుండటం మరో అవలక్షణం. అనాథలందరినీ అక్కున చేర్చుకోవడానికి ‘ఊయల’ పథకం ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు.. తెలంగాణ రాష్ట్రంలో 455 అనాథ పిల్లల పునరావాస కేంద్రాలున్నాయనీ 15,500 మంది పిల్లలు తలదాచుకుంటున్నారని తెలియజెప్పిన అధికారులు అనధికారికంగా రెండు వేలకు పైగా ఉన్న అనాథాశ్రమాల విధి, విధానాలన్నీ పక్కన బెట్టి వాటి జాడే మాకు తెలియదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమశాఖ కనీసం కాకి లెక్కలైనా ఇచ్చిందిగానీ, ఏపీ ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు కూడా లేవు. అనాథాశ్రమాల్లో పిల్లలతో బిచ్చం ఎత్తిం చడం, వ్యభిచార కలాపాలకు తరలించడం, కనీస వసతులు కల్పించకపోవడం యథేచ్ఛగా సాగు తుంటే ఆ ఆశ్రమ నిర్వాహకులకు అయినవారి అండదండలు ఉండటంతో పిల్లలకన్నా ఓటర్లు ముఖ్యమనే భావనతో పిల్లలందరినీ ప్రభు త్వాలు, అధికారులు గాలికి వదిలేశారు. ఇక విద్యారంగంలో చూస్తే, సేవా రంగంలో ఉండాల్సిన విద్యారంగం వ్యాపార రంగంగా మారిపోతే చదువు చెప్పకపోయినా పర్వాలేదు చంపకుంటే చాలు అనే భావన తల్లిదండ్రుల్లో కలి గినా విద్యాశాఖలు కార్పొరేటు విద్యాసంస్థల దరువుకు నృత్యం చేస్తున్నాయేగానీ ప్రభుత్వ నిబంధనలు అమలులో పెట్టడం లేదు. రెండు పేరొందిన కార్పొరేట్ పాఠశాలల్లో విరివిగా ఆత్మ హత్యలు, హత్యలు జరుగుతుంటే అధికారులు రక్షణ– పరిరక్షణ చట్టాన్ని ఎందుకు అమలు పరచడం లేదు? ఆ చట్టం తెలియకున్నా ఆ చట్టాన్ని అమలుచేసి ఆ సంస్థలను మూసివేస్తే అమాత్యులవారు ఆగ్రహి స్తారనా? ఈ విషయంలో స్పష్టత లేదు. ఆ పాఠశాలలతో ఆంధ్ర రాష్ట్ర అధినేత కుమ్మక్కైనారని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు అంటుంటే ఆ నేత ఎందుకు నోరు మెదపడం లేదు. మౌనం అంగీకారంగా భావించాలా? లేక నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని సరిపెట్టుకుంటున్నారా? అన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది. మొత్తం ముఖ చిత్రం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు భద్రత కరువై, చదువు, పౌష్టికా హారం, కనీసం రక్షిత మంచినీరు సైతం లేకుండా ఎక్కడా, ఎప్పుడూ, ఎలాంటి భద్రత లేకుండా బిచ్చగాళ్లుగా, వ్యభిచార గృహాల్లో, బాల కార్మికు లుగా, మాఫియా ముఠా చేతుల్లో, ఎప్పుడు ఎలా మృత్యువు ముంచుకొస్తుందో తెలియక దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లాగా అభద్రతలో బతు కీడుస్తుంటే ప్రభుత్వం, అధికారులు మాత్రం పిల్లల భద్రత ఏంటో? అన్నది తమకు తెలి యదన్నట్లు దీనమైన ముఖం వేసి కేవలం ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా– గతమెంతో ఘన కీర్తి కలవాడా’ అని గతాన్ని నెమరేసుకుంటూ రోజులు గడుపుతున్నారు. అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం (93910 24242) -
మంచి దొంగ
అతనో అనాథ. ఆలనాపాలనా పట్టించుకునేవారుగానీ, ఆదరించేవారు గానీ లేరు. దాంతో పొట్టపోసుకోవడం కోసం చిన్నప్పటినుంచి చిన్నాచితకా దొంగతనాలు చేస్తుండేవాడు. ఒకరోజు రాత్రిపూట అతను పొరుగూరిలోని ఒక తోటకు వెళ్లాడు. అక్కడ చెరువులో చేపలు పట్టుకుందామని వల వేశాడు. చేపలు పడలేదుగాని, ఆ అలికిడికి తోట యజమాని లేచి, తన సేవకులను అప్రమత్తం చేశాడు. అందరూ కలిసి కాగడాలు Ðð లిగించుకుంటూ తోటంతా గాలిస్తున్నారు. ఈలోగా దొంగ, తన ఒంటి మీదున్న దుస్తులను తీసివేసి, మొలకు గోచి మాత్రమే ఉంచుకుని, ఒంటినిండా బూడిద పూసుకుని, తోటలో ఒక చెట్టుకింద కూర్చుని కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. దొంగకోసం వెతుకుతున్న వారికి చెట్టుకింద ధ్యానంలో మునిగి ఉన్న సాధువు తప్పితే ఎవరూ కనిపించలేదు. దాంతో వాళ్లు తమ చేతులలో ఉన్న కత్తులు, కర్రలు కింద పడేసి, తోటలో చెట్టుకున్న కాయలు కొన్ని కోసి, మూటకట్టి, సాధువు ముందుంచి, భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొందరపడి లేస్తే ఎవరైనా గమనిస్తారేమోనన్న భయంతో దొంగ కళ్లూ నోరూ తెరవకుండా సమాధి స్థితిలో ఉన్నట్లు అలాగే ఉండిపోయాడు. తెల్లారింది. ఊళ్లో అందరికీ తోటలో చెట్టుకింద ఉన్న సాధువు సంగతి తెలిసింది. అన్ని దిక్కుల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చారు. పళ్లు తెచ్చిన వారు కొందరు, చెంబులతో పాలు తెచ్చిన వారు కొందరు... వెండినాణేలే సమర్పించుకున్నవారు ఇంకొందరు, ఉన్నదానిలోనే కొంతయినా సాధువుకు సమర్పించుకుని ఆశీస్సులు అందుకుందామని మరికొందరు... ఇలా ఎవరికి తోచింది వాళ్లు స్వామికి చెల్లించుకున్నారు. ఇదంతా గమనిస్తున్న దొంగ, ‘ఎంత మంచివాళ్లు వీళ్లంతా! కల్లాకపటం తెలియని వాళ్లు. నేను దొంగిలించవలసింది వీరి మంచితనాన్నే కానీ, డబ్బూ, నగలూ, మరోటీ కాదు. వీరిలోని మంచిని దోచుకుని, దానిని పదిమందికీ పంచిపెడితే, ఇక అప్పుడు నాలాగా దొంగతనం చేయవలసిన అవసరం బహుశా ఎవరికీ రాదేమో! అని ఆలోచించి, వైరాగ్యభావనలు తెచ్చుకుని, నిజమైన సాధువుగా పరివర్తన చెందాడు. – డి.వి.ఆర్. -
బాల్యం..బలహీనం..
సాక్షి, హైదరాబాద్ : రేపటి పౌరుల ఆరోగ్యం సంకటంలో పడుతోంది. సరైన పౌష్టికాహారం అందక సతమతమవుతోంది. వయసుకు తగిన ఆహారం లేక చిన్నారులు బక్కచిక్కిపోతున్నారు. చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గత నెలలో చేపట్టిన అధ్యయనంలో సగం మంది చిన్నారులు పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో పావు శాతం మంది ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండగా.. 10 శాతం మంది తీవ్ర పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఆరోగ్యంగా 51 శాతం మందే.. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 16,72,812 మంది ఉండగా.. 8,09,600 మంది ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేశారు. వీరిలో 4,14,225 మందే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. 1,81,200 మంది (22%) వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మరో 10% మంది పిల్లల్లో పౌష్టికాహార సమస్య తీవ్రంగా ఉండగా.. 16% చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు లేకున్నా ఎత్తుకు తగ్గ బరువు లేనట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 51% మంది చిన్నారులు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. తక్కువ బరువుతోనే సగం జననాలు అప్పుడే పుట్టిన శిశువు బరువు కనీసం 2.4 కిలోలు ఉండాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. కానీ రాష్ట్రంలో సగం వరకు జననాలు తక్కువ బరువుతోనే నమోదవుతున్నాయి. గర్భస్థ సమయంలో తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కొందరు మూడు పూటలు ఆహారం తీసుకుంటున్నా.. ఒకే రకం పోషక విలువలున్న పదార్థాలు తీసుకుంటుండటంతో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం ఉంటోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతి 100 జననాల్లో 49 మంది పిల్లలు తక్కువ బరువుతోనే పుడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వెయ్యి జననాల్లో 39 మంది శిశువులు.. లక్ష ప్రసవాల్లో 95 మంది తల్లులు మృతి చెందుతున్నారు. -
కామాంధుడికి మరణశిక్ష .
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో నాలుగు నెలల చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో దోషిగా తేలిన నవీన్ గడ్కే(26)కు ఇండోర్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసును విచారించిన అదనపు సెషన్స్ జడ్జి వర్షా శర్మ రికార్డుస్థాయిలో 23 రోజుల్లోనే నవీన్‌ను దోషిగా నిర్ధారిస్తూ శనివారం తీర్పు ఇచ్చారు. పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నవీన్ దోషిగా తేలినట్లు న్యాయమూర్తి శర్మ తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శర్మ 51 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ‘ఇలాంటి హేయమైన, క్రూరమైన చర్యలకు పాల్పడే వ్యక్తి సమాజానికి పట్టిన చీడ లాంటివాడు. రోగి శరీరంలో కుళ్లిపోయిన భాగాలను ఆపరేషన్ ద్వారా డాక్టర్లు తొలగించినట్లే.. ఇలాంటి నేరస్తులను సమాజం నుంచి దూరంగా ఉంచాలి. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం’ అని వ్యాఖ్యానించారు. ఏడ్వడం తప్ప మరొకటి తెలియని చిన్నారితో నేరస్తుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్‌లోని రజ్వాడా ప్రాంతంలో తల్లిదండ్రులతో నిద్రపోతున్న చిన్నారిని ఏప్రిల్ 20న కిడ్నాప్ చేసిన నవీన్.. ఓ వాణిజ్య భవనం బేస్మెంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చిన్నారి ఏడుస్తుండటంతో ఆమె తలను నేలపై మోది కిరాతకంగా హత్యచేశాడు. -
వన్.. టు.. త్రీ.. గో!
లైఫ్ ఈజ్ ఎ ఛాయిస్! స్వేచ్ఛ ఉంటుంది. నిగూఢంగా.. సంకోచాల మధ్య దాగి ఉంటుంది. సంకోచాలు పొరల్లాంటివి.ఆత్మగౌరవాన్ని, జీవితాన్ని, ధైర్యాన్ని కప్పేస్తాయి! జీవిత బంధం అందమైనదే... నిర్బంధం కానంత వరకు. నిర్బంధం అనిపించనంత వరకు. నిజానికి.. బంధం ఎవరితోనో కాదు.. ముందు మనకు మనతో ఉండాలి. మనల్ని మనం నిర్బంధించుకోకూడదు. అనుమానం, అవమానం, అన్యాయాల నుంచి.. వన్.. టు.. త్రీ.. గో! బాల్యంలో, యవ్వనంలో, వైవాహిక జీవితంలో, వృద్ధాప్యంలో.. ఏ దశలోనూ స్త్రీకి ఛాయిస్ ఉండదు. అమ్మానాన్న చెప్పినట్లో, సమాజం నిర్దేశించినట్లో, భర్త ఆదేశించినట్లో, బిడ్డలు ఆశించినట్లో ఆమె జీవితం ఆమె ప్రమేయం లేకుండా సాగిపోతుంది. ఇష్టాలు, అభిప్రాయాలు, ఆశయాలు, నిర్ణయాలు ఇవేవీ స్త్రీ జీవితంలో ఉండవు. అసలు తను జీవిస్తున్నది తన కోసమే కాదన్నంతగా ఆమె తన చుట్టూ ఉన్న బంధాల నిర్బంధనాలలో.. ముళ్లకంపపై చీరలా పరుచుకుంటుంది. ఎక్కడో కొందరు స్త్రీమూర్తులు మాత్రమే ఆ ముళ్లను విడిపించుకుని బయటికి వచ్చే ధైర్యం చేస్తారు. ‘హర్ఛాయిస్’ పేరుతో బీబీసీ భారతీయ భాషల విభాగం తాజాగా రూపొందించిన పన్నెండు నిజజీవిత కథలు.. అలా ముళ్లను విడిపించుకున్న మహిళలవే! వాటిలోని మూడు కథలివి. మై బిగ్ సీక్రెట్ పశువులా మీద పడటానికి వచ్చిన ప్రతిసారీ నా భర్తకు నేను ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసేదాన్ని. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట.. ఏదో ఒక అబద్ధం. ‘అయితే నాకేంటి?’ అని మీద పడేవాడు! అలా నా 20వ యేటకే నలుగురు పిల్లల్ని కన్నాను. పనేమీ చేసేవాడు కాదు. తాగొచ్చేవాడు. కొట్టేవాడు. మీద పడేవాడు. అదే పని. అమ్మకు చెబితే, ‘ప్రతి ఇంట్లోనూ ఉండే ముదనష్టమే’ అని బాధపడింది. భర్తను మాత్రం వదిలెయ్యొద్దంది. నేను ఒకరింట్లో పనిచేసేదాన్ని. నా గురించి ఆమెకు తెలుసు. ‘మళ్లీ గర్భం వస్తుందేమోనమ్మా..’ అని తరచూ నేను ఆమె దగ్గర అంటుండేదాన్ని.‘‘నేను చెప్పినట్లు చేస్తావా?’’ అన్నారు ఓరోజు ఆవిడ.. నా బాధను, భయాన్ని చూసి. చేస్తానన్నాను. ఏం చెయ్యాలో చెప్పారు ఆవిడ. ‘‘నా భర్తకు తెలిస్తే చంపేస్తాడేమోనమ్మా’’ అన్నాను. ‘‘నువ్వు చెబితేనే కదా తెలిసేది’’ అన్నారు. ఆవిడ చెప్పిన దాని గురించి చాలారోజులు ఆలోచించాను. నా భర్తకు తెలిస్తే ఏమౌతుంది? ఇంకా తాగుతాడు. ఇంకా కొడతాడు. అప్పటికి అయిపోతుంది. మళ్లీ మళ్లీ పిల్లల్ని కంటూ ఉండే నరకం తప్పుతుంది కదా అనుకున్నాను. ఒక నిర్ణయానికి వచ్చాను. పదేళ్లయింది ఇప్పటికి. నా భర్తకు తెలీదు, నా పిల్లలకూ తెలీదు.. నేను ఆపరేషన్ చేయించుకున్నానని. ఆ రహస్యం నాలోనే ఉండిపోయింది. నా భర్త ఇప్పటికీ తాగొస్తాడు. ఇప్పటికీ మీద పడతాడు. కానీ నాకొక ధీమా. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదని. నాకొక గర్వం. నా దేహం నా చెప్పుచేతల్లోనే ఉందని. ఓ పెద్ద రహస్యాన్ని నేను కడుపులో మోస్తున్నాను. ఆ రహస్యానికి నేనెప్పటికీ జన్మనివ్వను. బార్న్ అగైన్ అది మా ఫస్ట్‌నైట్. నా వయసు 35 ఏళ్లు. నేను కన్యను. అయితే ఆ ఫస్ట్‌నైట్ తర్వాత కూడా కన్యగానే ఉండబోతున్నానని నాకు తెలియదు. గదిలోకి వెళ్లాను. నా భర్త నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడని, నాపై ముద్దులు కురిపిస్తాడని ఎదురుచూస్తున్నాను. అటు తిరిగి పడుకున్నాడు! నిద్రపోయాడు! అయితే అది వచ్చిన నిద్ర కాదని, తెప్పించుకుంటున్న నిద్ర అని కొన్నాళ్ల తర్వాత నాకు తెలిసింది. ఫస్ట్‌నైట్ తెల్లారే అడిగాను. ఒంట్లో బాగోలేదన్నాడు. రెండో రాత్రి, మూడో రాత్రి, ఆ తర్వాతి రాత్రులన్నిట్లో అతడికి ఒంట్లో బాగోలేదు. సెక్స్ ఒక్కటే నా సమస్య కాదు. కనీసం అతడు నన్ను టచ్ చెయ్యడం లేదు! మాట్లాడ్డం లేదు. నా అనుమానం నిజమైంది. ఆ నిజాన్ని మా అత్తమామలు దాచిపెట్టి నా గొంతు కోసారు. దుఃఖం వేసింది. గది తలుపులు వేసుకుని బోరున ఏడ్చారు. మావాళ్ల దగ్గర కూడా. ‘‘ఊర్కో. ఏమీ జరగనట్లే ఉండు. నీ కర్మింతే అని సరిపెట్టుకో’’ అని సలహా ఇచ్చారు. నేను సరిపెట్టుకోలేక పోయాను. అర్థంలేని రిలేషన్ అది. మెడలో తాళి ఉన్నా, మదిలో మొగుడు లేని రిలేషన్ అది. పిచ్చి రిలేషన్. అతడిని వదిలేయాలని నిర్ణయించుకున్నాను. భర్తని వదిలేస్తే తప్పు ఈ సమాజంలో. కానీ అతడు భర్తకూడా కాదే! వదిలేయొచ్చు. అమ్మకీ, నాన్నకీ చెప్పాను. ‘‘భర్తకు విడాకులిస్తే, నిన్ను ఇంటి గడప కూడా తొక్కనివ్వం’’ అన్నారు అమ్మానాన్న!నాకిక ఏ గడపా అక్కర్లేదనుకున్నాను. మెట్టినింటికి, పుట్టింటికి దూరంగా వచ్చేశాను. ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఉమెన్స్ హాస్టల్లో చేరాను. ఉద్యోగం వెతుక్కున్నాను. విడాకులకు ఫైల్ చేశాను. నా భర్త, అత్తమామలు నన్ను దూషించారు. పరాయి పురుషులతో సంబంధాలను అంటగట్టారు. నేనేం బాధపడలేదు.ఇంపొటెంట్ భర్తతో ఏ సంబంధమూ లేకుండా ఒకే ఇంట్లో ఉండటం అంతకంటే పెద్ద బాధ. విడాకులు రావడానికి మూడేళ్లు పట్టింది. విడాకుల పత్రాలు చేతికి వచ్చినప్పుడు నేను మా అమ్మ కడుపులోంచి మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఫ్రెష్‌గా. ఎవ్రీథింగ్ విల్బి ఆల్రైట్ ముస్తఫాతో నేను ప్రేమలో పడినప్పుడు ముస్తఫాది ఏ దేశమో, ముస్తఫాది ఏ మతమో, ముస్తఫాది ఏ కులమో నేను చూసుకోలేదు. ప్రేమించానంతే. నేను క్రిస్టియన్ని. నార్త్ ఈస్ట్‌లో మాది చిన్న ఊరు. ముస్తఫా ముస్లిం. ఆఫ్రికన్. ఇద్దరం కలిసున్నాం. అయితే కొన్నాళ్లే! మమ్మల్ని కలిపి ఉంచగల ఏ సామాజిక శక్తీ మాకోసం రాలేకపోయింది. అడ్డు మరి. కులం అడ్డు. మతం అడ్డు. దేశం అడ్డు. మా సహజీవనం తెగిపోయేనాటికి నాకు 21 ఏళ్లు. నా కడుపులో అతడి బిడ్డ. ‘తీయించుకో’ ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. ‘ఉంచుకుంటాను’ అన్నాను. ‘ఎందుకా దరిద్రం!’ అన్నట్లు చూశారు. అంతకన్నా బాధించే మాట.. ముస్తఫా అన్నాడు! ‘నీ లోపల ఉన్నది నా బిడ్డే అని నమ్మకం ఏంటి? అని. ఆ క్షణమే అతడితో విడిపోయి వచ్చేశాను. కూతురు జీవితం ఇలా అయిపోయిందేమిటని నా తల్లిదండ్రులు బాధపడలేదు. ఈ భూమ్మీదకి తమది కాని వారసత్వాన్ని ఎక్కడ మోసుకొస్తానోనని భయపడ్డారు. కూతురికి నల్లటి ఆఫ్రికా శిశువు పుట్టబోతున్నాడంటేనే వాళ్లకు కంపరంగా ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు నన్ను వెలివేశారు. నేను, నాకు పుట్టబోయే బిడ్డ.. ఇద్దరమే ఒకరికొకరం తోడుగా ఈ మనుషుల మధ్య నిలబడిపోయాం. చేరదీసేవారు లేరు. గ్లాసు నీళ్లతో సేదతీర్చేవారూ లేరు. నాకొక మంచి ఉద్యోగం కూడా లేదు. ఒక్క ఫ్రెండు మాత్రం మిగిలింది. ‘జాగ్రత్తే’ అంది. తన మీద తలవాల్చి ఏడ్చేశాను. నొప్పులొచ్చే వరకు ఆ ఫ్రెండే నాకు తల్లి అయింది. దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లింది. మగ బిడ్డ పుట్టాడు. వాణ్ణి చూడగానే నా మనసు తేలికయింది. ఇప్పుడు నా వయసు 29 ఏళ్లు. నా బిడ్డ వయసు ఆరేళ్లు. ఈ ఆరేళ్లు నేను లోకానికి ఎదురీదాను. బలంగా తయారయ్యాను. నా బిడ్డకు బలాన్ని ఇవ్వాలంటే ఈ మాత్రం బలం నాకు ఉండాలి కదా. త్రీ స్టోరీస్: దివ్య ఆర్య, ఐశ్వర్య రవిశంకర్, సింధువాణి త్రిపాఠీ. / ఇలస్ట్రేషన్స్ : గోపాల్ శూన్య -
యుద్ధభూమిలో బాల్యం
పాఠశాలల్లో, ఆట మైదానాల్లో హాయిగా గడవాల్సిన బాల్యం కొన్ని దేశాల్లో యుద్ధోన్మాదుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతోంది. ఉద్రిక్తతలు ఉండే కొన్ని ప్రాంతాల్లోని చిన్నారులు యుద్ధ సమస్యల్లో చిక్కుకుని నలిగిపోతున్నారు. తీవ్రవాదులు, సైనిక పక్షాలు పిల్లలను బాల సైనికులుగా, ఆత్మాహుతిదళ సభ్యులుగా, మానవకవచాలుగా మారుస్తున్నాయి. ఆడపిల్లలు తీవ్రమైన లైంగిక దాడులను, పీడనను ఎదుర్కొంటు న్నారు. చిన్నవయసులోనే వారంతా లైంగిక బానిసలుగా మారుతున్నారు. ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారు. యుద్ధ ఛాయలు కనిపిస్తున్న మరికొన్ని ప్రదేశాల్లోని చిన్నారులు తిండి, నీళ్లు, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలకు నోచుకోక పోషకాహార లోపంతో రోగాల బారిన పడుతున్నారు. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది. అంతర్జాతీయ మానవ తా విలువలు, పిల్లల హక్కులకు ఏమాత్రం విలువనివ్వ కుండా ఒకవైపు సైన్యం, మరోవైపు సాయుధ సైనిక ముఠాలు వ్యవహరిస్తున్న తీరును యూనిసెఫ్ తప్పుబట్టింది. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాదాపు మూడుకోట్ల మంది పిల్లలు బలవంతంగా బడులకు దూరమైనట్లు తెలిపింది. ‘ఈ దేశాల్లోని పిల్లలు ఇళ్లు, పాఠశాలలు, ఆటస్థలాలు ఇలా అన్ని చోట్ల దాడులకు, క్రూరమైన హింసకు గురవుతున్నారు. ప్రతి ఏడాదీ ఈ దాడులు పెరగడం. ఇది ఎంతమాత్రం మంచిది కాదు’ అని యూనిసెఫ్ అత్యవసర కార్యక్రమా ల డైరెక్టర్ మాన్యువల్ చెప్పారు. దారుణాలివీ... ► నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న ‘బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది. ► తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు. ► కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు. ► సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు. ► మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ► ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు ► రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గృహ హింస గుప్పిట్లో బాల్యం
♦ పిల్లలను బాదేస్తున్న తల్లిదండ్రులు ♦ తమ ఒత్తిళ్లు, ఆక్రోశాన్ని బాలలపైకి మళ్లింపు ♦ వేదనతో రుగ్మతల పాలవుతున్న పసిమొగ్గలు ♦ నిమ్హాన్స్ సర్వేలో చేదు నిజాలు రెండువారాల కిందట బెంగళూరు జేపీ నగర ప్రాంతంలో ఉన్న ఒక బెంగాలీ మహిళ అపార్ట్మెంట్ నుంచి తన ఏడేళ్ల కూతురిని తోసేసి చంపేసింది. అందుకు ఆ తల్లి చెప్పిన కారణం... ఆ పాప ఏడేళ్లొచ్చినా సరిగ్గా మాట్లాడలేకపోతోందనే విసుగుతోనే అలా చేసిందట. ఈ కేసును పరిశీలించిన మానసిక శాస్త్రవేత్తలు... నిందితురాలి వైవాహిక జీవితం సరిగా లేకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైందని, ఆ ఆక్రోశంతో తన బిడ్డనే చంపుకుందని విశ్లేషించారు. ఇలా ఐటీ సిటీలో బాల్యం కూడా గృహహింసకు గురవుతోంది. ఇది నిజం. సాక్షి, బెంగళూరు : నగర జీవితంలో ప్రతి క్షణం ఒత్తిళ్లే. ఇక ఇంట్లో మహిళలు కూడా ఇలాంటి ఒత్తిళ్లనే ఎదుర్కొంటుంటారు. భర్త, అత్తమామల నుంచి ఎదురయ్యే శారీరక, మానసిక హింస కారణంగా తీవ్ర ఆవేదనకు లోనవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇలాంటి వారు ఆ ఆక్రోశాన్నంతా ఇంట్లో ఉన్న పిల్లలపై చూపిస్తున్నారు. కంటికి రెప్పలా పసిపిల్లలను తల్లిదండ్రులు తమ కోపాలకు బలి చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఇంట్లో కూడా చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని బెంగళూరు నిమ్హాన్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బాలల్లో పెరిగిన రుగ్మతలు నగరంలోని ప్రతి పది మంది చిన్నారుల్లో ఇద్దరు వివిధ మానసిక సమస్యలతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్)కు వస్తున్నారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చిన సైక్రియాట్రిస్ట్లకు తమ తల్లిదండ్రుల ద్వారానే శారీరక, మానసిక హింసను ఎదుర్కొంటున్నారని తెలిసింది. పిల్లలు చదువులో రాణించలేకపోతున్నారనో, అల్లరి చేస్తున్నారనో, అందంగా లేరనో, ఆడపిల్ల అనో ఇంకా వివిధ కారణాలు చెబుతూ తమ పిల్లలపై హింసకు పాల్పడుతున్నారని నిమ్హాన్స్కు చెందిన సైక్రియాట్రిస్ట్లు చెబుతున్నారు. తమ సమస్యలు తట్టుకోలేక... = ఇక నిమ్హాన్స్ వైద్యుల వద్దకు వచ్చిన మరో కేసులో స్వయంగా తల్లే తన ఎనిమిదేళ్ల కూతుర్ని సిగరెట్లతో కాలుస్తుండడాన్ని గుర్తించారు. ఎందుకిలా చేస్తున్నావంటూ సైక్రియాట్రిస్ట్లు ఆమెను ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.....‘మాకు తెల్లగా ఉన్న అబ్బాయి పుడతాడని అనుకున్నాం. అయితే అమ్మాయి పుట్టింది, అది కూడా నల్లగా ఉంది.’ అని చెప్పింది. విచారించిన వైద్యులు ఆమె వైవాహిక జీవితం సరిగా లేదని, భర్త, అత్తమామల నుండి ఎదుర్కొంటున్న హింస కారణంగానే ఆమె అలా తయారైందని తేల్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో తమ పిల్లలపైనే శారీరక, మానసిక హింసకు పాల్పడుతున్న ఉదంతాలు ప్రస్తుతం నగరంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ‘పనిష్మెంట్ పేరెంటింగ్’ పెరుగుతోంది ఇటీవలి కాలంలో పనిష్మెంట్ పేరెంటింగ్ పెరిగిపోతోంది. ఆఫీసులో, ఇంట్లో తమకు ఎదురవుతున్న ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఇలా తమ ఒత్తిడి ఏదైనా సరే ఆ ఆక్రోశాన్నంతా పిల్లలపై చూపుతున్నారు. అంతేకాదు వారిని కొట్టడం తమ హక్కుగా భావిస్తున్నారు. పిల్లలను కర్ర లేదా బెల్ట్‌లతో ఎక్కువగా కొట్టడం, చీకటి గదుల్లో పెట్టి బంధించడం వంటి శిక్షలతో చిన్నారులు శారీరక, మానసిక హింసను ఎక్కువగా ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇలాంటి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ను ఇవ్వాలి. లేదంటే ప్రవర్తన మరింత విపరీతంగా మారవచ్చు. హింసను తట్టుకోలేక చిన్నారులు మానసిక రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. – డాక్టర్ కె.జాన్ విజయ్ సాగర్, నిమ్హాన్స్ ప్రతినిధి -
బాల్యంలోనే బాటలు
సముద్రంలోని అలలు నిరంతరం ముందుకీ, వెనక్కీ, పైకీ, కిందికీ అవుతుంటాయి. ఒక్కోసారి ఎగసి పడుతుంటాయి. అంతలోనే వెనక్కి తగ్గి సముద్రంలో కలిసిపోతుంటాయి. మానవజీవితం, సంపదలు కూడా అంతే. రావి ఆకు నిరంతరం గాలికి రెపరెపలాడుతూనే ఉంటుంది. ఎంత తొందరగా చిగురిస్తుందో అంత తొందరగానూ రాలిపోతుంది. గాలి వీచినప్పుడు ఎంతటి దీపమైనా కొండెక్కక తప్పదు. ఏనుగు నిరంతరం దాని చెవులను కదుపుతూ ఉంటుంది. మిణుగురుల కాంతి క్షణికం. నీటిమీద రాసిన రాతలు వెంటనే చెరిగిపోతాయి. వెన్నెల మురిపిస్తుంది. కాని చేతికి చిక్కదు. సంపద కూడా అంతే. ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రాణం కూడా అంతే. అందుకే జీవితం బుద్బుదప్రాయం అనే విషయాన్ని అర్థం చేసుకుని జీవించినంతకాలం సన్మార్గంలో ఉండాలి. కొందరు అలా కాదు, బతికినంత కాలం చేయరాని పనులు చేయడమే కాక తాము చేసినది తప్పు కాదనుకుంటారు. అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయి అహంకారంతో విర్రవీగుతుంటారు. అలా విర్రవీగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు బాల్యం నుంచే పిల్లలకు మంచి అలవాట్లు చేయాలి, మహనీయుల మహోన్నత గాథలు చెబుతూ పెంచితే వారు పెరిగి పెద్దయ్యాక ఉత్తమ పౌరులవుతారు లేదంటే సంఘవిద్రోహక శక్తులుగా మారతారు. అందుకే మొక్కగానే వంచాలి. అందుకు ఇప్పటినుంచే బాటలు వేయాలి. వారికి మంచీ చెడూ, ఆత్మీయత, ఆప్యాయతలు, సామాజిక, నైతిక విలువలు నేర్పాలి. -
బాల్యాన్ని చిదిమేస్తున్నాం!
విశ్లేషణ ఈ మధ్య ఇళ్ల నుంచీ, బడుల నుంచీ కూడా పిల్లలు పారిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతున్న ఈ తరహా దుర్ఘటనలు ఇటు తల్లిదండ్రులను, అటు పోలీసు శాఖను కూడా పరుగులు పెట్టిస్తున్నాయి. కనీస ఆచూకీ తెలుసుకోవడానికి కూడా నెలలు పడుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక నైపుణ్యం పెరిగి, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉంది. రైల్వేస్టేషన్లలో, బస్ స్టేషన్లలో రెప్ప వాల్చకుండా పనిచేసే చైల్డ్‌లైన్ వంటి సంస్థల నిఘా కూడా ఉంది. అయినా పిల్లలు, ముఖ్యంగా కౌమారంలో ఉన్న పిల్లలు ఎలా కన్నుగప్పి మాయం కాగలుగుతున్నారు? పిల్లలు అక్రమ రవాణా, కిడ్నాప్‌లకు గురైతే కొంత ప్రతిఘటన ఉంటుంది. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు గుర్తించగలరు. కానీ తమంతట తామే వెళ్లే పిల్లలు మొహాలలో ఎటువంటి కంగారు లేకుండా, ఎదుటివారికి అనుమానం కలగకుండా జాగ్రత్త పడుతూ పాఠశాల, కళాశాల పేరుచెప్పి సరిహద్దులు దాటిపోతున్నారు. నిజానికి ఎలా పారిపోతున్నారనేకంటే, ఎందుకు పారిపోతున్నారన్నది ముఖ్యం. పిల్లలు ఎందుకు పారిపోతున్నారు? ఇది తల్లిదండ్రులతో పాటు పాఠశాలల నిర్వాహకులు కూడా వేసుకోవలసిన ప్రశ్న. ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన పూర్ణిమ సాయి అనే బాలిక ఇలా వెళ్లిపోవడం సంచలనం సృష్టిం చింది. ఓ పూర్ణిమ సాయి, ఓ కాజల్, నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి, గాంధీనగర్‌కు చెందిన మరో అబ్బాయి వీరంతా అదృష్టవశాత్తు క్షేమంగా దొరికినా, అసలు వీరు ఇలా చేయడానికి వెనుక ఉన్న పరిస్థితులు ఏవి? పూర్ణిమకు నటన అంటే మక్కువ. కాజ ల్కు సినిమాలంటే ఇష్టం. నర్సాపూర్ పిల్లలకు సవతి తండ్రి వేధింపులు. ఇలా కారణాలు ఏమైనా వీరంతా భౌతి కంగా ఇళ్లలోనే ఉంటున్నారు గానీ, మానసికంగా అక్కడ ఇమడలేని పరిస్థితి. పిల్లలని కన్నాం కానీ, వాళ్ల అవసరాలనీ, ఆశలనీ కనడం లేదు. బడిలో చేర్చాం ఇదీ తల్లిదండ్రుల తీరు. ఫీజులు తీసుకుంటున్నాం, బట్టీయం వేయిస్తున్నాం. ర్యాంకులు రావాలని నిర్దేశిస్తున్నాం, రాకపోతే నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాం ఇదీ పాఠశాలల ధోరణి. ఇటు తల్లిదండ్రులు గానీ, అటు పాఠశాలల నిర్వాహకులు గానీ పిల్లలకు బాల్యాన్ని ఇస్తున్నారా? అసలు వారు బాలలని గుర్తిస్తున్నారా? వారికి కూడా మనసూ, ఆశయాలూ ఉంటాయని గమనిస్తున్నారా? లేదంటే పిల్లలంతా నాలుగ్గోడల మధ్యనే బందీలై ఉన్నారనీ, వారికి తామే సంరక్షకులమనీ తలపోస్తున్నారా? ఒకసారి ఒక అమ్మాయి తప్పిపోయి కశ్మీర్లో దుర్భర పరిస్థితుల మధ్య దొరికింది. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చక్కటి సందేశం ఇచ్చారు. ఎవరికైనా వంట బట్టిందా ఆ సందేశం? లేకుంటే ఇవి పోలీసులు నేర్పుతున్న సుద్దులనుకుంటూ నిర్లక్ష్యం చేశారా? దీనిని ఎంతమంది అర్థం చేసుకున్నారో మరి! ఎంతమంది ఆచరిస్తున్నారో! ఇదీ ఆ సందేశం సారాంశం ‘మీరు పిల్లలకు ఇవ్వవలసింది అడిగినంత డబ్బు కాదు, కార్పొరేట్ విద్య కాదు, ఎక్కి తిరగడానికి కారు కాదు, డాబూ దర్పాలు అసలే కాదు. వారికి ఇవ్వవలసింది కొంచెం సమయం. అది కేటాయించండి! వారి ఆశలూ, ఆకాం క్షలూ ఏమిటో గ్రహించండి! ఆచరణ సాధ్యమా, కాదా అన్నది విశ్లేషించుకుని వాటి గురించి వివరించండి. పెద్ద పెద్ద స్కూళ్లలో వేశామని కాదు, పిల్లలు చదువుల యంత్రాలు అవుతున్నారా? జ్ఞానవంతులవుతున్నారా? ఇది గమనించండి! ర్యాంకుల కోసం, గ్రేడ్ల కోసం పాకులాడకండి! అవి మీ బిడ్డల జీవితాలను తీర్చిదిద్దడానికి ఉపకరించవు. విద్యాసంస్థలు కేవలం మీ పిల్లల పేర్లు చెప్పుకుని మరిన్ని అడ్మిషన్లు తెచ్చుకోవడానికే ఉపయోగపడతాయి’. తల్లిదండ్రులు ఏది కొనాలన్నా పదిసార్లు ఆలోచిస్తారు. అలాగే బిడ్డలని కనేటప్పుడు కూడా మీ ఆర్థిక స్థోమత, కేటాయించగలిగిన సమయాల గురించి కూడా పదిసార్లు ఆలోచించండి. కడుపున పుట్టిన పిల్లలని శిక్షించడం కాదు, చక్కని శిక్షణ ఇవ్వాలి. అప్పుడే అలాంటి ఘటనలు పునరావృతం కావు. - అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
చిన్నప్పుడు నన్ను డుంబు అనేవాళ్లు: నటి
న్యూయార్క్: తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత కేట్ విన్సెలెట్ పంచుకుంది. తాను చిన్నతనంలో ఎంతో బొద్దుగా ఉండేదాన్నని అందరూ తనను ఆటపట్టించేవారని చెప్పింది. తనను ఫాలో అవుతూ, తనలాగే హావభావాలు పలికిస్తూ ఏడిపించేవారని తెలిపింది. లండన్‌లోని వీ డే అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాలు చెప్పింది. ‘నేనెప్పుడూ నన్ను ఇతరులతో పోల్చుకునేదాన్ని. వాళ్లంతా నన్ను డుంబు అని పిలుస్తూ టీజ్ చేసే వాళ్లు. కప్‌బోర్డులో పెట్టి నావైపు చూస్తూ తెగ నవ్వుతుండేవారు. నేను బొద్దుగా ఉండి అందంగా కనిపించకపోయేదాన్ని. అయితే, చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఇష్టం. ఈ విషయంలో నేను చాలా లక్కీ అని చెబుతుండేదాన్ని. స్కూళ్లో ప్రదర్శనలకోసం ప్రతిసారి ఆడిషన్‌కు వెళ్లే దాన్ని. నాకెప్పుడు మంచి పాత్రలు రాలేదు. కానీ అలాంటి విషయాలు నేను పట్టించుకోలేదు. ముసలి, కప్ప, డార్క్ ఫెయిరీలాంటి పాత్రలు కూడా చాలా బాగా చేసేదాన్ని ఒకసారి కప్పడాన్స్ కూడా చేశాను. దానిని ఇప్పటికే నేను ఇష్టపడతాను. నాకు నటనంటే పిచ్చి. అది చిన్నదా పెద్దదా అనే విషయం మాత్రం అస్సలు చూడను. నేను గొప్పగా ఉండాలని అనుకుంటాను. అందుకే ప్రతిక్షణం నేర్చుకుంటూనే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు. -
అమ్మ చేతుల్లో... అమ్మ చేతల్లో..
పితృరుణం, మాతృరుణం అని రెండుంటాయి. వీటిలో పితృరుణం తీర్చుకోవచ్చు. ఏ కారణంగానయినా తండ్రితో కలిసి లేనప్పుడు.. అంటే ఏ బాల్యంలోనో తండ్రిగారిని కోల్పోయినప్పుడు, వారికి సేవలు చేసే అవకాశం దొరకనప్పుడు, అటువంటి దురదృష్టాన్ని పోగొట్టుకుని పితృరుణం తీర్చుకోవాలనుకుంటే... దానికి ఒక నిర్దిష్ట యాగం చేస్తే పితృరుణం తీరిపోతుందంటుంది శాస్త్రం. కానీ మాతృరుణం తీరడానికి ఏ యాగం లేదు, యజ్ఞం లేదు... అమ్మ రుణం తీర్చుకోవడమన్నమాటే లేదంటుంది శాస్త్రం. శంకరభగవత్పాదులవారు ఈ ధర్మాన్ని పాటించారు. ‘‘నాకు ఒకవేళ ఇద్దరు కొడుకులుండి ఒకరు సన్యసిస్తే, ఈ శరీరం పడిపోయినప్పుడు రెండోవాడు అంత్యేష్టి సంస్కారం నిర్వహిస్తాడు. మరి ఒక్క కొడుకువి. నీవు వెళ్ళిపోతానంటున్నావు. నాకు అంత్యేష్టి సంస్కారం ఎవరు చేస్తారు’’అని వారితల్లి అడిగింది. ’’అమ్మా ! నీ శరీరం నుండి ప్రాణములు ఉత్కమ్రణమవుతున్నప్పుడు నన్ను తలచుకో. ఎక్కడున్నా వస్తానమ్మా’’ అన్నారు. అంతే... ఆమె అవసానదశలో తలచుకోగానే యోగమార్గాన కాలడికి వచ్చి అమ్మను శివ స్తోత్రంతో సంతోష పెట్టాడు. శివ భటులు వచ్చారు. అమ్మ భయపడింది. అమ్మా భయపడకని...విష్ణు స్తోత్రం చేసారు. విష్ణు భటులు వచ్చారు. వారిని చూసి సంతోషిస్తూ శరీరం విడిచి వారి వెంట వెళ్ళిపోయింది. ఆ శరీరానికి ఆయన అంత్యేష్టి సంస్కారం పూర్తి చేసారు. ’అమ్మ’ అన్నమాటకి శంకరులు అంత వైభవాన్ని కట్టబెట్టారు. అమ్మ అమ్మే. గాంధీగారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒకానొకనాడు ఓడలో విదేశాలకు బయల్దేరబోతున్నారు. పరస్త్రీ సంగమం ఎన్నటికీ చేయనని తనకు మాటివ్వమని తల్లి పుత్లీబాయ్ అడిగి ప్రమాణం చేయించుకుంది. కొన్నేళ్ళ తరువాత ఒకసారి ఆయన చెయ్యకూడని పొరబాటు చేయడానికి వెళ్ళి అంగుళం దూరంలో ఉన్నప్పుడు అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చి సర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇదంతా స్వయంగా ఆయన తన జీవిత చరిత్రలో నిజాయితీగా రాసుకున్నారు. అంత నిగ్రహం చూపి అలా వెనుకకు తిరిగి వెళ్ళిపోయిన కారణానికి ఆయన తరువాత కాలంలో మహాత్ముడయ్యాడు. జాతిపితయి, దేశప్రజలచేత ’తండ్రీ’ అని పిలిపించుకోలిగాడు. తల్లి జీజీబాయ్ నూరిపోసిన దేశభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ హితోక్తులతో శివాజీ మహరాజ్‌ధర్మసామ్రాజ్య స్థాపన చేసి, గోసంరక్షణ చేసి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారి అనుగ్రహంతో భవానీ ఖడ్గాన్ని కూడా పొందగలిగాడు. పిల్లల వయసుతో సంబంధం లేదు, ఐశ్వర్యాలతో, సామాజిక, రాజకీయ, అధికారిక హోదాలతో, విద్యార్హతలతో సంబంధం లేదు. అమ్మ అంటేనే ఆనందం. అమ్మే దైవం. అమ్మ మాట అమృతతుల్యం. అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు. ’అమ్మ’కు ఈ వేదభూమి, ఈ దేశం ఇచ్చిన గౌరవం అది. ఆ తరమయినా, ఈ తరమయినా, ఏతరమయినా సనాతన ధర్మ పరిరక్షణ అమ్మ చేతుల్లోనే ఉంది, అమ్మల చేతల్లోనే ఉంది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇక బడిబాట..!
చిత్తు కాగితాల్లో బాల్యం కథనానికి స్పందన ఉరుకులు, పరుగులు తీస్తున్న అధికారులు సాక్షి, వనపర్తి: ‘చిత్తు కాగితాల్లో బాల్యం’శీర్షికన ఈనెల 11వ తేదీన ‘సాక్షి’మెయిన్ ఎడిషన్‌లో ప్రచురించిన కథనానికి అదేరోజు స్పందించిన కలెక్టర్ ఎనిమిది మంది జిల్లాస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచే అధికారులు చెత్త కాగితాలు, వస్తువులు సేకరిస్తూ జీవనం గడుపుతున్న బాల బాలికలపై దృష్టి సారించారు. రెండురోజుల క్రితం పన్నెండేళ్ల గౌరి, పదమూడేళ్ల నారమ్మలను గుర్తించారు. వీరిని వీపనగండ్లలోని కస్తూర్బా పాఠశాలలో గౌరి (ఆరో తరగతి), నారమ్మ(ఏడో తరగతి)లను చేర్పించారు. గురువారం బండర్‌నగర్‌లోని బావిలోకి చెత్తకాగితాల కోసం దిగేందుకు ప్రయత్నిస్తున్న పదమూ డేళ్ల విములమ్మ, మరో యువతి లక్ష్మిని హెచ్ఎం కృష్ణయ్య, జీసీడీవో వసంత లక్ష్మి, సీఆర్పీ రాధ అడ్డగించారు. వారిలో లక్ష్మికి 18 ఏళ్లు ఉండటంతో అధికా రులు ఇంటికి పంపించారు. విములమ్మను మరికుంటలోని కస్తూర్బా గాంధీ పా ఠశాలలో చేర్పించారు. కర్నూలు జిల్లా కోడు మూ రుకు చెందిన విములమ్మ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవటంతో చిన్నాన్న గౌతమ్ వద్ద పెరుగుతోంది. ఆమెకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. పాఠశాలకు పంపించలేదు. గురువారం అధికారులు బాలికలను కేజీవీబీలో చేర్పించారనే విషయం తెలుసుకున్న విములమ్మ చిన్నాన్న అక్కడకు వచ్చి బాలికను ఇంటికి పంపించాలని అధికారులపై ఒత్తిడి చేసినా వారు ఒప్పుకోలేదు. విములమ్మ ఏడుస్తూ.. ‘ఇంటికి పోతే బాగా కొడతారు. ఇక్కడే ఉండి చదువుకుంటాను’అని చెప్పింది. -
చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమాకి కాంబినేషన్ మెడిసిన్!
చైల్డ్‌హుడ్ ఆస్తమా అని పిలిచే చిన్నపిల్లల ఆస్తమాకు మరింత మేలైన మందును రూపొందించారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని మెడిసిన్ విభాగంలో జరిగిన పరిశోధనల్లో ఈ మందును రూపొందించారు. ఆస్తమా వచ్చినప్పుడు మూసుకుపోయే గాలి మార్గాలు ఈ మందు వల్ల తెరచుకుంటాయి. ‘‘దీని వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఒనగూరతాయి. మొదటిది ఆస్తమా వచ్చినప్పుడు కలిగే ఇన్ఫ్లమేషన్ను ఇది తగ్గిస్తుంది. రెండోది... ఆస్తమాలో సన్నబారిన గాలి మార్గాలను విశాలంగా చేస్తుంది. ఈ రెండు ప్రయోజనాల వల్ల ఇది మరింత ప్రయోజనకారి’’ అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పిల్లల వైద్య పరిశోధనల్లో పాలుపంచుకున్న పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ స్టాన్లీ జెఫ్లర్. ప్రస్తుతం ఇది ఎంత సురక్షితం అన్న అంశంపై పరిశీలనలు జరుగుతున్నాయి. -
ఢాకా నుంచి రవీంద్రుడి విద్యాలయంలోకి..
కోల్‌కతా: మహాశ్వేతా దేవి 1926 జనవరి 14న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జన్మించారు. వారిది సాహితీ వేత్తల కుటుంబం. గత కొద్ది కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే ఆమె తండ్రి పేరు మనీశ్ ఘటక్. ఈయన ప్రముఖ కవి.. నవలా రచయిత కూడా. ఘటక్ సోదరుడు రిత్విక్ ఘటక్ ప్రముఖ చిత్ర దర్శకుడు. శ్వేతాదేవి తల్లి ధాత్రి దేవీ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త. ఆమె సోదరులు మాత్రం వివిధరంగాల్లో స్థిరపడ్డారు. మహాశ్వేతా దేవీ పాఠశాల విద్యాభ్యాసం ఢాకాలోనే పూర్తయింది. కానీ, విభజన తర్వాత వారి కుటుంబం కోల్ కతాకు వచ్చేసింది. అనంతరం ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతీ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. ఎంఏ ఇంగ్లిష్ ను కోల్ కతా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆమె బిజాన్ భట్టాచార్య అనే ప్రముఖ నాటకాల రచయితను వివాహం చేసుకున్నారు. అయితే, ఆయనతో ఆమె 1959లో విడిపోయారు. -
మరచిపోను నాన్నా...
ఎదురు చూపులు బాల్యం గుర్తుందా... ఇంటికొచ్చిన నాన్న చేతిలో ఏవో పొట్లాలు.. అవి అందుకునేందుకు అక్కా, తమ్ముడితో నీ పోట్లాటలు.. ఎవరివి వారికి తెచ్చాన్రా... అల్లరి ఆపండంటూ నాన్న వారింపులు.. అమృతంలా ఉండే వాటిని అపురూపంగా తిన్న రోజులు... గుర్తున్నాయా.... ఇప్పుడు మీరు నాన్న స్థానంలోకి వచ్చారుగా... మరి మీరూ ఇంటికి తీసుకెళ్లండి పొట్లం... బజ్జీలో, జిలేబీలో, పకోడీలో, వెజిటెబుల్ సిక్స్టీ ఫైవో... పదార్థాలే వైనా... మీరు తీసుకెళ్లే పొట్లంలో ఉండే ది ప్రేమే... పిల్లాడు ఏదో తెమ్మని చెబుతాడు... నాన్నకు గుర్తుండదు..మరిచిపోయి ఇంటికెళ్లగానే.. వాడు నిలదీస్తాడు... ఎందుకు తేలేదని... మరి ఆఫీస్ లో లేటయింది నాన్నా... రేపు తెస్తా అని బుజ్జగిస్తే... అదేం కుదరదు... ఎప్పుడూ ఇలాగే చెప్తారు.. నాకు అది కావాల్సిందే అంటాడు బాబు... వాడి కోపంలో న్యాయముంది... మీ అలసటలో అర్థం ఉంది... కానీ కాస్త ఓపిక చేసుకుంటే... వాడి కళ్లలో మీకు చెప్పలేని ఆనందం దొరుకుతుంది. వాడికి డిపార్ట్ మెంటల్ స్టోర్ అయినా, స్టేషనరీ అయినా, స్వీట్ షాప్ అయినా, టాయ్ స్టోర్ అయినా... అన్నీ మీరేగా... నాలుగేళ్ల పిల్లాడు బయటకు వెళ్లలేడు. ఏదీ సాధించలేడు... మిమ్మల్ని తప్ప. అందుకే ఇవాళ తీసుకెళ్లండి వాడు ఎన్నాళ్ల నుంచో అడిగేది. ఉట్టిచేతుల్తో ఇంటికెళ్లడం కంటే... ఏదైనా తీసుకెళ్తే అందరిలో ఏదో పాజిటివ్ నెస్. అది.. రోజంతా మిస్సయినందుకు అందరినీ ఊరడించే గిఫ్టే కావచ్చు. రాగానే సంతోషాలు పంచే ఆరాటం కావచ్చు. మీ ప్రేమను వ్యక్తీకరించే సాధనం అది. దీంట్లో స్వార్థ నిస్వార్థాల ప్రసక్తి లేదు. మీరు ఎలా ఉన్నా భార్యా పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు... ఇవ్వకున్నా, ఇచ్చినా... కానీ మీ స్తోమతలో తినేవో, ఆడేవో, వేసుకునేవో... ఏదోటి తీసుకెళ్లండి బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్నాం... కష్టమంతా మీదేనని అనుకోకండి... ఇంట్లో ఆవిడది మీకు రెట్టింపే. ఒకరోజు ఇంట్లో ఉంటే మీకే తెలుస్తుంది. ప్రపంచం చూస్తావు నువు...స్కూలుకెళ్లచ్చాక ఇల్లే ప్రపంచం వాళ్లకు. బతికేందుకు నువ్వుంటున్న బయట ప్రపంచం వదిలేస్తే... నీకు నిజమైన ప్రపంచం వాళ్లే. నీ ప్రపంచంలో ఎన్నో ఖర్చుపెట్టుకుంటావుగా... మరి నీకు ప్రాణమైన నీ ప్రపంచానికి ఏదో ఒకటి తీసుకె ళ్లండి ఇవాళే. - రమేష్ గోపిశెట్టి -
శాంతిదూతగా ముహమ్మద్
ప్రవక్త జీవితం ఒకసారి కాబాగృహ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు, తోటి పిల్లలంతా ఇటుకలు మోస్తుంటే, తను కూడా అందులో పాల్గొన్నారు. భుజాలు నొప్పెడుతున్నాయని పిల్లలంతా ఒంటిపైని వస్త్రం తీసి భుజంపై పెట్టుకొని మోస్తున్నారు. కాని చిన్నారి ముహమ్మద్ మాత్రం ఒంటిపైని వస్త్రాలు తీయలేదు. అబ్బాయి భుజాలెక్కడ కందిపోతాయోనని బాబాయి అబూతాలిబ్ బలవంతాన ప్రయత్నం చేస్తే, వెంటనే ఆయన స్పృహతప్పి పడిపొయ్యారు. మరో సందర్భంలో, స్నేహితుల ప్రోద్బలం, ఒత్తిడి మేరకు గ్రామంలో జరిగే ఓ వినోద కార్యక్రమానికి బయదేరారు. కాని మార్గమధ్యంలోనే ఓ ఇంట్లోంచి వీనుల విందైన మధుర గానమేదో వినిపించేసరికి అక్కడే ఆగిపోయారు. వింటూవింటూ అక్కడే నిద్రపోయారు. మరుసటి రోజు కూడా ఇలాగే జరిగింది. అంటే, అనవసర, ఉబుసుపోని కార్యకలాపాల్లో పాల్గొనకుండా దైవికంగానే ఏర్పాటు జరిగిపోయిందన్నమాట. చిన్నారి ముహమ్మద్ (స) బాల్యం, యవ్వనం ఎలాంటి మనోవికారాలకు తావులేకుండా నిష్కళంకంగా, నిర్మలంగా, పవిత్రంగా గడిచింది. ఆయన్ను వ్యతిరేకించేవారు సైతం ఆయన నైతికవర్తనాన్ని, శీలసంపదను ప్రశంసించకుండా ఉండలేకపోయేవారు. ఈ సంధి ఒప్పందంలో ముహమ్మద్ (స) కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఇలాంటి శాంతి ఒప్పందాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన తరచూ చెప్పేవారు. ఆయనలో ఉన్న నీతి, నిజాయితీ, న్యాయప్రియత్వం, రుజువర్తనం, సత్యసంధత, సౌజన్యత, సౌహార్థ్రతల కారణంగా జాతి ఆయనను ‘అమీన్’ అన్న బిరుదుతో గౌరవించింది. ఖురైష్, హవాజన్ తెగల మధ్య జరిగిన ఒక యుద్ధంలో ఆయన బాబాయిలతో కలసి పాల్గొన్నారు. ‘ఫుజ్జార్ ’ పేరుతో ప్రసిద్ధి చెందిన చారిత్రక సమరం అది. అంతటి భయానక సమరంలో బాబాయిల వెంట పాల్గొన్నారనే గాని, ఏ ఒక్కరిపైనా చేయెత్తిన దాఖలాలు లేవు. ఎన్నో కుటుంబాలను బలిగొన్న ఈ యుద్ధం పట్ల కొంతమంది సహృదయులు, శాంతికాముకులు ఎంతో కలత చెందారు. చిన్నారి ముహమ్మద్ పెదనాన్న సారధ్యంలో కొందరు ప్రముఖులు సంధికోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఫలితంగా రెండు తెగల మధ్య సంధి కుదిరింది. ‘హిల్ ఫుల్ ఫుజూల్’గా ఇది చరిత్రకెక్కింది.అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు. పగ, ప్రతీకారాలతో, అశాంతి అరాచకాలతో సతమతమవుతున్న ప్రజలకు శాంతి, సంతృప్తి, జ్ఞానకాంతిని పంచాలని ఆయన బలంగా కాంక్షించేవారు. నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనమైన ఈ సమాజాన్ని ఎలాగైనా దారికి తేవాలని తపన పడేవారు. ఈ ఆలోచనలతోనే అలాకాలం గడుస్తూ పోతోంది. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు) -
పిల్లల్లో కేన్సర్‌కు శక్తిమంతమైన ఔషధం!
గుర్తించిన పరిశోధకులు వాషింగ్టన్: బాల్యంలో వచ్చే ప్రాణాంతక కేన్సర్‌కు శక్తిమంతమైన ఔషధాన్ని పరిశోధకులు గుర్తించారు. నాడీకణాలకు సంబంధించిన న్యూరోబ్లాస్టోమా కేన్సర్ చికిత్సకు వినియోగించే యాంటీకేన్సర్ ఔషధం క్రిజిటినిబ్పై చేసిన గత పరిశోధనల అనుభవాల ఆధారంగా కొత్త చికిత్సా విధానాలను ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రి (సీహెచ్ఓపీ) పరిశోధకులు గుర్తించారు. కొత్త ఔషధంపై తాము నిర్వహించిన తొలిదశ ఔషధపరీక్షల (ప్రీడ్రగ్ ట్రయల్స్) ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, ఇప్పుడు ఔషధ పరీక్ష లు నిర్వహించాల్సి ఉందని సీహెచ్ఓపీ ఆంకాలజిస్ట్ యేల్ పి మోస్సే చెప్పారు. న్యూరోబ్లాస్టోమాకు దారితీసే అనప్లాస్టిక్ లింఫొమా కినాస్ (ఏఎల్కే) జన్యువుల ఉత్పరివర్తనలను, 2008లో అరుదైన, వంశపారంపర్య జన్యువులు న్యూరోబ్లాస్టోమాకు కారకాలంటూ మొదటిసారి తాము గుర్తించిన విషయాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఏఎల్కేలో వచ్చే అసాధారణ మార్పులు.. 14% ప్రాణాంతక న్యూరోబ్లాస్టోమాకు కారణమవుతున్నట్లు గుర్తించారు. -
సచిన్, గవాస్కర్.. నాకు దేవుళ్లు!
-
సచిన్, గవాస్కర్.. నాకు దేవుళ్లు!
న్యూఢిల్లీ: తన అద్భుత విజయాలతో ప్రపంచ యువలోకానికే ఒక ఐకాన్‌గా అవతరించిన ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి గూగల్ సీఈఓ సుందర్ పిచాయ్ (43). ఆయనకు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ అంటే చాలా అభిమానమట. వాళ్లే తనకు రోల్ మోడల్స్ అని, వారిలా గొప్ప క్రికెటర్‌ను కావాలని కలలు కనేవాడినని పేర్కొన్నారు. చదువుతో పాటు తనకు ఫుట్‌బాల్, క్రికెట్ అంటే చాలా ప్రేమించేవాడినన్నారు. రాత్రిళ్లు మేల్కొని మరీ సాకర్ వరల్డ్ కప్‌ను చూసేవాడినని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో శ్రీరాం కాలేజీ విద్యార్థులతో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను నెమరు వేసుకున్నారు. చదువుకునే రోజుల్లోనే చాలామంది క్రికెటర్స్ లాగే తనకూ క్రికెట్ అంటే విపరీతమైన అభిమానమని తెలిపారు. అలా క్రమం తప్పకుండా చూస్తూ క్రికెట్ లెజెండ్స్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లకు వీరాభిమానిగా మారిపోయానన్నారు. గవాస్కర్ క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా ఆయనంటే తెలియని అభిమానం ఉండిపోయిందన్నారు. వరల్డ్ కప్ పోటీలు జరిగే సమయంలో తెల్లవారుజామున తన ఫేవరెట్ ఆటలను చూడడం ఇప్పటికీ గుర్తుందని తెలిపారు. బార్సిలోనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంటే విపరీతమైన ఇష్టమన్నారు. సుందర్ పిచాయ్ ఆగస్టులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశానికి రావడం ఇదే ప్రథమం. గూగుల్ సీఈఓగా అత్యున్నత పదవిని స్వీకరించిన అనంతరం ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఉన్నత భవిత కోసం, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కలలుగనే యువలోకానికి ఆయనో స్పూర్తి ప్రదాతగా మారిపోయారు. -
వీరి ప్రాణాలు నిలపండి
ఆడుతూ.. పాడుతూ.. సంతోషంగా గడపాల్సిన బాల్యం మంచానికే పరిమితమైంది. కూలీకి వెళ్తేనే జీవనం గడిచే పేద కుటుంబాల పిల్లలు పెద్ద జబ్బుతో బాధ పడుతున్నారు. డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన సంపెట శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు దివ్య, అదే గ్రామ శివారులోని ఎర్రకుంటతండాకు చెందిన సర్వాన్, పద్మ దంపతుల కూతురు సింధు తలసేమియూ వ్యాధితో బాధపడుతున్నారు. పిల్లలకు రక్తం ఎక్కించేం దుకు నెలకు రూ.10 నుంచి 15 వేల వరకు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే ఎముకల్లోని గుజ్జును మార్చాలని, అందుకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. దాతల సాయం కోసం ఆ పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నారుు. పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన వారు మంచానికే పరిమితమయ్యూరు. తోటి పిల్లలతో ఎంచక్కా ఆడి పాడాల్సిన వయస్సులో నరకయూతన అనుభవిస్తున్నారు. రక్తం ఎక్కిస్తేనే బతికే జబ్బు (తలసేమియూ)తో వారు నిత్యం దిగులు చెందుతున్నారు. అరుుతే మాయదారి రోగంతో మంచం పట్టిన కంటి పాపలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మానవతావాదులు తమ పిల్లల వైద్యం కోసం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. తలసేమియూ వ్యాధితో తల్లడిల్లుతున్న ఇద్దరు నిరుపేద బాలికల కన్నీటిగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. డోర్నకల్ : మండలంలోని చిలుకోడు శివారు ఎర్రకుంట తండాకు చెందిన మాలోత్ సర్వాన్, పద్మ దంపతుల కూతురు సింధు, చిలుకోడు గ్రామానికి చెందిన సంపెట శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు దివ్యలు కొన్ని సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. అరుుతే మాయదారి రోగంతో బాధపడుతున్న తమ కంటిపాపలను కాపాడుకునేం దుకు తల్లిదండ్రులు ప్రతీ నెలా హైదరాబాద్ విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్ సంస్థకు తీసుకెళ్లి రక్తం ఎక్కించి తీసుకొస్తున్నారు. కాగా, నెలనెల ఇద్దరికి రక్తం ఎక్కిస్తుండడంతోపాటు మందుల ఖర్చుకు రూ. 10 వేల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా, సింధుకు ప్రస్తుతం 20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోం దని తల్లిదండ్రులు సర్వాన్, పద్మలు తెలిపారు. పది రోజుల క్రితం సింధును హైదరాబాద్‌కు తీసుకెళ్లగా రక్తం లేదని రెడ్‌క్రాస్ ప్రతినిధులు చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం అందక నీరసం.. సింధుకు పది రోజుల నుంచి రక్తం అందకపోవడంతో పూర్తిగా నీరసించి పోరుుందని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు. రక్త కణాలు బాగా తగ్గిపోవడంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా, దివ్యకు కూడా రక్తం దొరకకపోవడంతో శరీరం ఉబ్బి, తరచు జ్వరం వస్తోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కూలీ పనులు చేస్తేనే కుటుంబాన్ని పోషించుకునే తమ ఇళ్లలో పెద్దజబ్బు పీడిస్తోందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, తలసేమియా వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయించాలంటే పిల్లల ఎముకల్లోని గుజ్జును తొలగించే ఆపరేషన్ చేయించాలని, ఇందు కోసం రూ. లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారని సింధు, దివ్యల తల్లిదండ్రు లు చెబుతున్నారు. పిల్లలకు ప్రాణభిక్ష పెట్టండి.. తలసేమియూతో బాధపడుతున్న తమ పిల్లల వైద్యం కోసం సాయం అందించాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను, కలెక్టర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని సింధు, దివ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, దయూమయులు స్పందించి తమ పిల్లల వైద్య చికిత్స కోసం తమవంతు ఆర్థిక సాయం అందించి ప్రాణభిక్ష పెట్టాలని వారు చేతులెత్తి వేడుకుంటున్నారు. -
ఇదీ ప్రాథమిక హక్కే
నేడు వరల్డ్ టాయిలెట్ డే ముంబై స్లమ్.. ఓ గుడిసెలాంటి ఇంట్లో... బాగా తాగి వచ్చిన ఓ వ్యక్తి భార్యను చితక బాదుతున్నాడు. కర్టెన్ వెనక నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ భయంతో వణికిపోతోంది పదకొండేళ్ల పిల్ల. ‘ఈ రోజైనా నాన్న తాగి రావద్దు.. అమ్మను కొట్టొద్దు’ అంటూ వాళ్ల నాన్న ఇంటికొచ్చేదాకా అల్లాకి దండం పెట్టుకుంటూనే ఉంది ఆ అమ్మాయి. ఆయన తలుపు బాదడంతోనే అర్థమైందా పిల్లకి. ‘ఈరోజూ నాన్న తాగొచ్చాడు’ అనుకుంది నిరాశగా. ‘అంటే తన మొర అల్లాను చేరలేదన్నమాట. రాత్రి ఉపవాసం చేస్తే వింటాడేమో.. చేస్తాను’ నిశ్చయించుకుంది. నాన్న చేత దెబ్బలు తిని అమ్మ ఏడుస్తూంటే అమ్మను చూస్తూ తనూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది ఉపవాసంతోనే! పదకొండేళ్ల ఆ పిల్ల పేరు ముంతాజ్. ఇది పదిహేనేళ్ల కిందటి మాట. ఆమె ప్రస్తుత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆ పదిహేనేళ్ల ప్రయాణాన్నీ తెలుసుకోవాల్సిందే. అందుకే ఫ్లాష్‌బ్యాక్ లోంచి మొదలుపెట్టి వర్తమానానికి వద్దాం! ఫ్లాష్‌బ్యాక్ అమ్మ మీద జరిగే ఆ హింస ఆగిపోతే బాగుండు అని ఏ రోజుకారోజు అల్లాని ముంతాజ్ కోరుతూనే ఉంది. ఆమె కోరుకున్నట్టుగానే ఒకరోజు తల్లిని కొట్టడం ఆపేశాడు తండ్రి. బదులుగా ముంతాజ్‌ను కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ముంతాజ్ వయసు పధ్నాలుగు. ఈసారి తల్లడిల్లడం తల్లి వంతైంది. కూతురు తన దగ్గరుంటే చచ్చిపోతుంది అని భయపడ్డ తల్లి ముంతాజ్ని ముంబైలోనే మరో స్లమ్‌లో ఉంటున్న తన తమ్ముడి దగ్గరకు పంపించింది. ఆకలి పోరాటం మేనమామ దగ్గర కొట్లు, తిట్లు లేవు కానీ అర్ధాకలితోనే సర్దుకోవాల్సి వచ్చేది. మేనమామ కుటుంబానికి తన భారాన్ని తగ్గించడానికి చేతనైన పనిచేసేది. ఇంటి పనుల్లో అత్తకూ సహాయంగా ఉండేది. కష్టాల బాల్యం ఆ పిల్లకు త్వరగానే పెద్దరికాన్నిచ్చింది పెళ్లితో. అట్టేకాలం సాకలేని మేనమామ పధ్నాలుగేళ్లకే ముంతాజ్‌ను ఓ అయ్య చేతిలో పెట్టాడు. అదో నరకం... భర్త చేయి పట్టుకుని ముంతాజ్ ముంబైలోని ఇంకో స్లమ్‌కి వెళ్లింది. ప్రాంతాలు మారుతున్నాయి కానీ ఆమె పరిస్థితుల్లో మార్పులేదు. పైగా అమ్మ దగ్గరున్నప్పటి పరిస్థితులే పునరావృతం అయ్యాయి. నాన్న తన అనుమతి లేకుండా తనని కాలు బయటపెట్టనిచ్చేవాడు కాదు. ఇప్పుడు భర్తా తన అనుమతి లేందే కనీసం కిటికీలోంచి కూడా బయటకు చూడనివ్వడంలేదు. బుర్ఖాలేందే గడపదాటేదీ లేదు. ఆయనకు పని దొరక్కపోయినా.. వంట నచ్చకపోయినా.. తాగినా.. తాగకపోయినా.. ఏంచేసినా.. చేయకపోయినా ముంతాజ్ ఒంటి మీద బెల్టు వాతలు తేలేవి. అలాంటి స్థితిలోనే ఓ బిడ్డకు తల్లీ అయింది. అప్పుడు ముంతాజ్ వయసు పదహారు. ‘బిడ్డను మంచి వాతావరణంలో పెంచాలి. ఇప్పటికైనా తను ధైర్యం చేయకపోతే తన కూతురూ తనలాగే బానిస అవుతుంది’ అనుకుంది ముంతాజ్. కానీ ఎలా? చదువులేదు.. లోకజ్ఞానం అంతకన్నా లేదు. అయినా ఈ నరకం నుంచి బయటపడాలి.. ఆలోచించసాగింది. నలుగురితో కూడి... తన ఆలోచనలకు త్వరగానే దారి దొరికింది. తనుండే ప్రాంతంలోని ఆడవాళ్లంతా ఇంటి మగాళ్లు పనికి వెళ్లగానే మధ్యాహ్నం పూట ఎవరో ఒకరింట్లో సమావేశమయ్యేవారు. ఒకసారి తనూ వెళ్లింది. అది కమిటీ ఆఫ్ రిసోర్స్ ఆర్గనైజేషన్ (సిఓఆర్ఓ) మీటింగ్. అందులో ఆడవాళ్ల సమస్యల గురించి మాట్లాడేవారు. ముఖ్యంగా గృహహింస మీద. వారం రోజులు క్రమం తప్పకుండా వెళ్లేసరికి చాలా విషయాల పట్ల అవగాహన వచ్చింది. తన సమస్యను సరిదిద్దుకోవాలంటే ఆర్థికంగా నిలబడ్డం ముఖ్యమనీ గ్రహించింది. తన సమస్య గురించే కాక స్లమ్‌లోని సమస్యల మీదా దృష్టి పెట్టింది. అపరిశుభ్రత, నిరక్ష్యరాస్యత, హింస.. భూతాల్లా కనిపించాయి ఆమెకు. సిఓర్ఓలో కార్యకర్తగా చేరింది. భర్త బయటకు వెళ్లినప్పుడే చంటిపిల్లను చంకనెత్తుకొని మీటింగ్‌లకు వెళ్లిపోయేది. అక్కడే నాలుగు అక్షరాలూ నేర్చుకుంది. కానీ ఎంతోకాలం సాగకముందే ఈ విషయం ముంతాజ్ భర్తకు తెలిసి చావబాదాడు. అయితే ఏడుస్తూ మూలన కూర్చోలేదు. ఎదురు తిరిగింది. బిడ్డను తీసుకొని ధైర్యంగా బయటకు వచ్చేసింది. తలాక్ తీసుకుంది. తల్లి తనకు వారసత్వంగా ఇచ్చిన ఇంటిని బాగుచేసుకొని అందులోకి మారింది. సిఓఆర్ఓలో శాశ్వత ఉద్యోగిగా చేరింది. వెనక్కి లాగే బంధనాలు లేకపోయే సరికి ఫుల్‌టైమ్ స్లమ్ కమ్యూనిటీకే కేటాయించింది ముంతాజ్. 75 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. గృహహింసకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. అంతేకాదు స్లమ్‌లో ఉండే సమస్యల మీదా అక్కడివాళ్లను చైతన్యం చేయసాగింది. ఆమె ధైర్యానికి, పనితనానికి మెచ్చిన ‘లీడర్ క్వెస్ట్’ అంతర్జాతీయ సంస్థ ముంతాజ్‌కు ఫెలోషిప్‌నిచ్చింది. ప్రస్తుతం.. ముంతాజ్పడ్డ శ్రమ వృధాకాలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను ‘డాటర్ ఆఫ్ మహారాష్ట్ర’ అవార్డుతో సత్కరించింది. ‘నేను అవార్డులకోసం, రివార్డుల కోసం పనిచేయలేదు. నేను బాగుపడాలి, నా చుట్టూ ఉన్న స్త్రీలు బాగుపడాలి. మన ఆడబిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అనుకొని నాకు చేతనైన తీరులో పోరాడాను. పోరాడుతున్నాను. అన్నిట్లో మగవాళ్లతో సమానంగా ఉన్న మనం ఆత్మగౌరవం విషయంలో మాత్రం ఎందుకు అవమానపడాలి?’అంటుంది ముంతాజ్. 2017 ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉందట! ప్రభుత్వం దిగివచ్చింది 2013లో గృహహింస వ్యతిరేక ప్రచారంలో భాగంగా ముంతాజ్ కిలోమీటర్లకు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఉదయం వెళితే ఏ రాత్రికో ఇంటికి చేరేది. ఒక స్లమ్ నుంచి ఇంకో స్లమ్ వెళ్లేటప్పుడు నేచర్కాల్ కోసం స్త్రీలకు పబ్లిక్ టాయ్‌లెట్స్ లేక చాలా ఇబ్బంది పడేది. ‘మహిళల కోసం ప్రత్యేకమైన బస్సులు, లోకల్ ట్రైన్స్‌లో ప్రత్యేకమైన కంపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు లేడీస్ కోసం టాయ్‌లెట్స్ లేకపోవడమేంటి? అని విస్మయం చెందింది. ఈ మహానగరంలో పురుషుల కోసం అడుగడుగునా పబ్లిక్ టాయ్‌లెట్స్ ఉన్నప్పుడు ఆడవాళ్లకెందుకుండకూడదు? వాళ్లూ పనుల కోసం బయటకు వెళ్తున్నారు కదా.. వాళ్లకు అవసరాలు ఏర్పడతాయి కదా? ఇంత చిన్నచూపేంటి? స్త్రీలకూ పబ్లిక్ టాయ్‌లెట్స్ కావాలని ‘రైట్ టు పీ’ ఉద్యమం మొదలుపెట్టింది. ముంబైలో ఇది పెద్ద సంచలనమే అయింది. చదువుకున్న వాళ్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులూ ముంతాజ్‌కు మద్దతు పలికారు. ‘రైట్ టు పీ’ నినాదంతో ముంబై మున్సిపాలిటీ భవనం దద్దరిల్లింది. మహిళలకూ పబ్లిక్టాయ్లెట్స్ కావాలంటూ ముంబైలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులతో మున్సిపాలిటీ ముంగిలి నిండిపోయింది. ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రతి 20 కిలోమీటర్లకు మహిళా టాయ్లెట్ల బ్లాక్‌ను నిర్మించాలని జీవో జారీ చేసింది. 147 టాయ్లెట్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించింది కూడా. దానికోసం తొలివిడతగా అయిదు కోట్ల రూపాయలనూ విడుదల చేసింది. మొదటిసారిగా చెంబూర్ ప్రాంతంలో ఈ మోడల్ టాయ్‌లెట్ ప్రారంభం అయింది. -
ఆదిత్య లాంటి సినిమాలు అరుదు
బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ‘‘అబ్దుల్ కలాం స్ఫూర్తితో బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలనీ, దేశాభివృద్ధికి వివిధ రంగాల పరిశోధనల్లో కూడా రాణించాలని చెప్పే చిత్రం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆదిత్యలాంటి ప్రతిభ గల విద్యార్థులు ఉంటారని ఈ చిత్రంలో చూపించాం. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపునిచ్చాయి. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఐఏయస్ ఆఫీసర్లు మంచి కథాంశం అని అభినందించారు. ఆదిత్య లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి’’ అన్నారు. -
చీకటి వెలుగులు
గన్ దీపావళి అంటే బాల్యం. సందడి, శబ్దం, వెలుగు కలిస్తేనే దీపావళి. టపాసులతో చేతులు కాలకుండా పెరిగి పెద్దయినవాళ్లు ఒక్కరు కూడా ఉండరు. అందుకే ఈ పండుగ గుర్తొస్తే జ్ఞాపకాల్లో ఒక అల కదులుతుంది. రాయదుర్గంలో శీనయ్య అంగడంటే చాలా ఫేమస్. ఎందుకంటే టపాసులు అమ్మేది ఆయనొక్కడే కాబట్టి. దసరా నాటికే టపాసులు స్టాక్ వచ్చేవి. సర్కస్‌లో ఏనుగుల్ని చూడ్డానికి వెళ్లినట్టు ఆ టపాసులు చూడ్డానికి వెళ్లేవాళ్లం. ప్రతి ఏడాది అవే. రాకెట్లు, లక్ష్మీ ఔట్లు, భూ, విష్ణు చక్రాలు, వెన్నముద్దలు... అయినా వాటిని చూడ్డం ఓ థ్రిల్. దసరా నుండి దీపావళి వరకూ చాక్లెట్లు, బిస్కెట్లు, పుల్ల ఐస్‌క్రీంలు అన్ని కొనుగోళ్లు బంద్. చిన్న పిల్లల ఫుడ్ మార్కెట్‌కి ఆర్థికమాంద్యమొచ్చేది. ప్రతి పైసాని కాల్చి బూడిద చేసేవాళ్లం. మొదట చేసే పని ఇంట్లో వాళ్లని కాల్చుకు తిని రూపాయి పెట్టి రివాల్వర్ కొనేవాళ్లం. అవి పేలాలంటే రీలు కావాలి. రివాల్వర్‌లో రీలు చుట్టడం ఓ కళ. ఎందుకంటే ఇప్పటి రిలేషన్షిప్స్లా అది అకారణంగా పుటుక్కుమని తెగిపోయేది. దీన్ని చుట్టడానికి స్పెషలిస్ట్లుండేవాళ్లు. కృష్ణ కౌబాయ్ సినిమాల హ్యాంగోవర్ కాలమది. రివాల్వర్ తీసుకుంటే కృష్ణ ఎటు కాలుస్తాడో ఎవరికీ తెలియదు. కళ్లు మూసుకుని, ఒంటి కంటితో, ఇలా రకరకాలుగా కాల్చినా విలన్లు కుప్పకూలేవారు. ఆయన రివాల్వర్‌లో బుల్లెట్లు అయిపోవడమంటూ ఉండదు. కాల్చిన తరువాత స్టయిల్‌గా ఆయన పొగ ఊదుతుంటే చూసి తీరాల్సిన దృశ్యం. మేము కూడా రివాల్వర్ తీసుకుని రకరకాల పద్ధతుల్లో ఫైటింగ్‌లు చేస్తూ కాల్చుకునేవాళ్లం. పిచ్చికలా కిచ్‌కిచ్ అని అరుస్తూ అది పేలేది. ఎంత ప్రయత్నించినా ఊదడానికి సరిపడా పొగవచ్చేది కాదు. కాస్తో కూస్తో వచ్చినా గొట్టంలోంచి అస్సలొచ్చేది కాదు. తుపాకీగొట్టం నుంచి విప్లవమే కాదు, పొగ కూడా రాదని నేను ఆనాడే కనిపెట్టాను. అంగడి శీనయ్యకి ప్రభావతి అనే కూతురుండేది. అది మమ్మల్ని పురుగుల్లా చూసేది. ఎందుకంటే చాక్లెట్లు బిస్కెట్లే కాదు. టపాసులు కూడా దీనికి కొనాల్సిన అవసరం లేదు. మేం పిచ్చోళ్లలా చూస్తూ ఉంటే ప్రతిరోజూ మా కళ్లముందు కాకరపూలు గిరగిర తిప్పి మా మీదకే విసిరేది. నమిలి పీక్కుతిన్నా ఇంట్లోవాళ్లు అంత సులభంగా డబ్బులివ్వరు కాబట్టి మిత్రులమంతా ఒక పెద్ద పథకమేశాం. శీనయ్య అంగడికి కన్నం పెట్టి టపాసులన్నీ దోపిడీ చేయాలి. అంతటితో ఆగకుండా ప్రభావతిని కిడ్నాప్ చేసి ఆమె కళ్లముందే టపాసులన్నీ కాల్చి బూడిద చేయాలి. అంతా బానే ఉంది కానీ కన్నం ఎలా వేయాలో ఎవడికీ తెలియదు. కొద్దిరోజులు చర్చలు జరిగాయి కానీ ఎవరింట్లోనూ గునపం లేక శీనయ్య బతికిపోయాడు. మా అందరిలో బూసిగాడు అనేవాడు ప్రాక్టికల్. వాడికి భ్రమలు లేవు. ప్రతిరోజూ శీనయ్య అంగడికెళ్లి ‘అదెంత ఇదెంత’ అని కన్ఫ్యూజ్ చేసి నాలుగైదు టపాసులు కొట్టుకొచ్చేవాడు. (వీడిపుడు రెవిన్యూ ఉద్యోగి. జనాన్ని ఏం చేస్తున్నాడో నాకు తెలియదు) ఆశ నిరాశలు, చీకటి వెలుగులు మధ్య దీపావళి వచ్చేది, వెళ్లేది. ఎవడి స్థోమతకొద్దీ వాడు కాసిన్ని కాల్చేవాళ్లం. కసిదీరా కాలుద్దామనుకున్నప్పుడు పైసా డబ్బు లేదు. డబ్బులున్నపుడు కాల్చాలనే కసిలేదు. అమావాస్య నాడు కూడా వెలుతురు ఉంటుందని దీపావళి ఎప్పుటి నుంచో చెబుతూ ఉంది. ఇంతకు మించిన పాజిటివ్ థింకింగ్ ఉంటుందా? -
వోళిగెలు, వడియాలు, చిత్రాన్నం... బాల్యం
నిజానికి బాల్యమే ఒక పండుగ. కానీ అప్పుడా విషయం తెలిసి... భవిష్యత్తులో చాలా దూరం ప్రయాణిస్తే తప్ప, గతంలోని సంతోషాలను మనం అర్థం చేసుకోలేం. చిన్నప్పుడు దసరా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పది రోజులు స్కూలుండదు. ట్యూషన్ల గోల ఉండదు. అయ్యవార్లు కూడా వాళ్ల సొంతూళ్లకి వెళ్లిపోయేవాళ్లు. ప్రకృతి కూడా ఈ సెలవల్లో ప్రేమగా ఉంటుంది. లేత ఎండ తడుతూ ఉంటే, చలి చిగురులు వేస్తూ ఉంటుంది. దసరాకి గ్యారంటీగా బట్టలు కుట్టించేవాళ్లు. అందరూ పెద్దపెద్ద షాపుల్లో కొంటూ ఉంటే, ఒక డబ్బా షాపుల్లో ఖాతా రాసి మేము తెచ్చుకునేవాళ్లం. నేను ధగధగలాడేవి చూస్తే పెద్ద వాళ్లు ధరలు చూసి మొదటి ఉతుక్కే కలర్ మాయమయ్యే వాటిని కొనేవాళ్లు... కొనడం కంటే కుట్టించడం మహా కష్టం. బాబా బుడాన్సాబ్ అనే టైలర్ దయ మా ప్రాప్తం. ఎలిజిబెత్ టేలర్ వచ్చి గౌన్ కుట్టమని అడిగినా వెంటనే మెడలో పాములా వేలాడుతున్న టేప్‌ని తీసి కొలతలు తీసుకునే రకం. జీవితంలో గౌన్ ఎలా ఉంటుందో చూడకపోయినా జంకేవాడు కాదు. ఆవు వ్యాసం టైప్. ఏం కుట్టాలో అదే కుడతాడు, నీ అభిప్రాయంతో నిమిత్తం లేదు. పైజామా, జుబ్బా, మాసిపోయిన గడ్డం, ఇదీ ఆయన రూపం. జుబ్బాకు చిరుగులుండేవి. బట్టలు కుట్టేవాడికి బట్టలు లేకపోవడం, బియ్యం పండించేవాడికి అన్నం లేకపోవడం మన సంస్కృతిలో ఒక భాగం. మిషన్ తొక్కడమే బుడాన్ ఏకైక ... మిషన్. బట్టలు ఇవ్వగానే టేప్‌ని తెచ్చి మన ఒంటికి చుట్టేవాడు. కితకతలు పెట్టి కొలతలు తీసుకునేవాడు. పండగకి ముందు రోజు ఇస్తాననేవాడు. ఆ రోజు వెళితే గంటలో రెడీ అనేవాడు. గంటలో వెళితే ఇవ్వడం ఆయన ఇంటా వంటా లేదు. పండగ రోజు స్నానం చేసి పాత బట్టలు వేసుకుని వెళితే అక్కడ నాలా చాలామంది బుడాన్ వైపు ఆశగా చూస్తూ ఉండేవాళ్లు. ఆయన ఎవరివైపూ చూడకుండా కాళ్లతో కిటకిటమని సౌండ్ చేసేవాడు. ఆయన కొడుకు నా ఈడువాడే. గుండీలు కుట్టేవాడు. సూది గుచ్చుకుని వాడి వేళ్లన్నీ రంధ్రాలతో నిండి ఉండేది. చివరికి ఎంతోమంది కుయ్యోమొర్రోమని సౌండ్ చేయగా గుండీలు ఉన్న అంగీని, గుండీలు లేని నిక్కర్ని ఇచ్చేవాడు. అది జారిపోకుండా పురికొసని, మొలతాడుని జాయింట్‌గా కట్టుకుని పోస్టాఫీసులు తెరుచుకుని పండగ జరుపుకునేవాళ్లం. అంగీని బొడ్డుపైకి, నిక్కర్ని పిర్రలపైకి కుట్టడం బుడాన్ స్పెషాలిటీ. ఆయన ముగ్గురు పిల్లలకు బట్టలు కావాలంటే మాకీ స్పెషల్ ట్రీట్మెంట్ తప్పదు. వోళిగెలు (బొబ్బట్లు), వడియాలు, అప్పడాలు, చిత్రాన్నం ఇలా ఫుల్‌గా తినేసి సాయంత్రం జమ్మిచెట్టు దగ్గరకు బయలుదేరేవాళ్లం. వందలాది మందికి... అక్కడే సంబరం జరిగేది. పత్రిని ఒకరికొకరు ఇచ్చుకుంటూ కౌగిలించుకుని, శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. పత్రిని పెద్దవాళ్లకిచ్చి దండం పెడితే డబ్బులిచ్చేవాళ్లు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి టపాసులు కొని కాల్చేసేవాళ్లం. ఇదిగాకుండా అమ్మవారిని ప్రతిరోజూ అలంకరించేవాళ్లు. పళ్లతో, డబ్బులతో చేసిన అలంకారాన్ని చాలా ఇష్టపడేవాళ్లం. అంత డబ్బు ఒకేచోట చూడ్డం కూడా ఇదే మొదలు. కాలం మారింది. రోడ్డుసైడ్న జీవిస్తున్న బుడాన్సాబ్లు రోడ్డున పడ్డారు. ఇప్పటి పిల్లలకు జమ్మిచెట్టు ఎలా ఉంటుందో తెలియదు. తెలిసిన పెద్దవాళ్లు అప్యాయతలు, స్నేహాలు, అనుబంధాలు అన్నీ జమ్మిచెట్టు చాటున దాచేసి బతుకు కోసం నగరాలకొచ్చేసారు. తిరిగి వెళ్లినా ఆ చెట్టుని గుర్తు పట్టలేదు. ఫేస్బుక్, వాట్సాప్‌లో స్నేహితులు కనిపిస్తున్నారు కానీ స్వర్శ కోల్పోయి చాలాకాలమైంది. రోబోలు మనుషుల్లా చాలా పనులు చేస్తున్నాయని సంతోషించాలా? మనుషులు రోబోల్లా మారిపోతున్నారని బాధపడాలా? - జి.ఆర్. మహర్షి -
జీవితంలో పైకి రావాలంటే..?!
జీవన గమనం నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. ఉద్యోగ రీత్యా ‘స్వయం సంఘాల్లో’ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ మాట్లాడలేకపోతున్నాను. ఈ భయాన్ని పోగొట్టుకోవడం ఎలా? - జె.రామ్, మెయిల్ మెదడులో ఉత్పన్నమయ్యే నెగెటివ్ కార్టిజాల్ వల్ల స్టేజ్ ఫియర్ కలుగుతుంది. ఇది మొదట్లో నాకూ ఉండేది. చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా దీన్ని అధిగమించవచ్చు. 1. మీరు మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏమిటో క్షుణ్నంగా ఆలోచించి పెట్టు కోండి. చెప్పదలుచుకున్నది (కొన్నాళ్లు) పాయింట్లుగా రాసుకుని మనసులో పెట్టుకోండి. ‘మీమీద మీకున్న నమ్మకం’ కార్టిజాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. 2. కొంతమంది ఇచ్చిన సమయానికి చాలా రెట్లు ఎక్కువ మాట్లాడతారు. వినే వాళ్ల సహనాన్ని పరీక్షించవద్దు. మీరు చెప్ప దలుచుకున్నది అవతలివారికి అర్థమ య్యేలా ఎంతసేపు మాట్లాడితే చెప్పగల రన్న విషయాన్ని అంతేసేపు మాట్లాడండి. 3. బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఎదురుగా ఉన్నవాళ్లందరినీ చూస్తూ మాట్లాడండి. ఒకరిమీదే దృష్టి నిలపవద్దు. 4. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింటు హితం, ప్రియం..! చెప్ప దలుచుకున్నదాన్ని సీరియస్‌గా చెప్పాలా, కామెడీగా చెప్పాలా అనేది వినే ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది. ఈరకంగా నాలుగైదుసార్లు మాట్లా డిన తర్వాత మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది. మరింత ఉత్సాహం వస్తుంది. భమిడిపాటి రాధాకృష్ణగారి నాటకం ‘కీర్తిశేషులు’లో ‘అవిగో వినరా చప్పట్లు. అవే గదరా ఆకలిగొన్న కళా జీవికి పంచభక్ష్య పరమాన్నాలు’ అని ఒక డైలాగ్ ఉంది. ఆ విధంగా కాలక్రమేణా మీరు మంచి వక్త అవుతారు. బెస్టాఫ్ లక్. జీవితంలో పైకి రావాలంటే ఏమి చెయ్యాలో సింపుల్‌గా చెప్పండి సార్. - రంగారావు, అనంతపూర్ భగవద్గీతని చదివి ఆచరించాలి. ఇంత కన్నా సింపుల్‌గా చెప్పటం కష్టం. పిల్లి అంటే మార్జాలం అన్నట్టు ఉన్నదా? కాస్త వివరంగా చర్చిద్దాం. అసలు జీవితంలో పైకి రావటం అంటే ఏమిటి? ఆరోగ్యం బాగా చూసుకుంటూ, డబ్బు సంపాదన, కీర్తి సంపాదన, ఆర్థికపరమైన సుఖానికి లోటు లేకుండా, వీలైనన్ని తక్కువ సమస్యలతో; దానం, దయ, గాఢమైన ఆత్మీయ సంబంధాలతో, జీవితపు ఆఖరి రోజువరకూ ఉత్సాహం కోల్పోకుండా, జ్ఞానం పెంచుకుంటూ గడపటం. అంతేగా..! బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ ఆశిం చటం నుంచీ, వృద్ధాప్యంలో వారిని బాగా చూసుకోవటం వరకూ చేసే జీవన పయనం కూడా విజయమే. మరోలా చెప్పాలంటే, ‘అజ్ఞానం’ నుంచి ‘ప్రజ్ఞానం’ వరకూ పయనించటమే విజయం. ఈ ప్రయాణాన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. ఒక కుర్రవాడు ఆడుతూ పాడుతూ బాల్యం గడిపేస్తాడు (అమాయకత్వం). విద్యార్థి దశలో ‘ఇంగ్లిష్ ఆవశ్యకత’ని గుర్తించడు (అజ్ఞానం). డిగ్రీ పూర్తయ్యేసరికి ఏదోలా మ్యానేజ్ చేయగల ననుకుంటాడు (విశ్వాసం). నాలుగైదు ఇంటర్వ్యూల తరువాత దాని ప్రాముఖ్యత తెలుస్తుంది (జ్ఞానం). కోచింగ్ సెంటర్లో చేరి భాషా సామర్ధ్యాన్ని పెంచుకుని ఉద్యోగం సంపాదిస్తాడు (పరిజ్ఞానం). అద్భుతంగా మాట్లాడలేకపోయినా, మ్యానేజ్ చేయగలుగుతాడు (అభ్యాసం). బయట కూడా ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతూ దానికి అలవాటుపడిపోతాడు (విజ్ఞానం). ఆ విధంగా ఆంగ్లంలో అద్భుతమైన ప్రావీణ్యత సాధిస్తాడు (ప్రజ్ఞానం). నేను ఒక కంపెనీలో ప్రొడక్షన్ ఇన్చార్జిని. ఎంత శ్రద్ధగా పని చేసినా పై వారి నుంచి మెచ్చుకోలు లేదు. పని శ్రద్ధగా చేయాలన్నది నా విశ్వాసం. దాన్ని వాళ్లు ఆలస్యం అంటారు. ఏం చేయాలో తెలియట్లేదు. - శేఖర్, నల్లకుంట మీరు తయారుచేసే ప్రొడక్ట్ ఏమిటో చెప్పలేదు. ఒక పనిని ఫలవంతంగా చేయటం వేరు, సమర్థవంతంగా చేయటం వేరు. కిలో మైదాపిండితో ఒక గంటలో వంద కేకులు తయారుచేయడం ఫల వంతం (ఎఫీషియెన్సీ). ఒక రోజుపాటు శ్రమపడి ఎవరూ చేయలేనంత అద్భు తంగా ఒక కేకు తయారు చేయడం సమర్థ వంతం (ఎఫెక్టివ్‌నెస్). ఏ పని సమర్థ వంతంగా చేయాలి, దేన్ని ఫలవంతంగా చేయాలి అన్నది తెలుసు కోవడమే వృత్తిలోను, వ్యాపారంలోను విజయం. దురదృష్టవశాత్తూ మనం ఫలవంతంగా చేయవలసిన పనిని సమర్థవంతంగాను, సమర్థవంతంగా చేయవలసిన చోట ఫలవంతంగానూ చేసి పేరు పోగొట్టు కుంటూ ఉంటాం. ఈ ఇబ్బంది నాకు కూడా ఉంది. కర్త, కర్మ, క్రియల్ని మాటిమాటికీ అటూ ఇటూ మార్చడం, రాసినదాన్నే మళ్లీ మళ్లీ చెక్కడం వగైరా! అవసరం లేకపోయినా ఈ విధంగా మెరుగులు దిద్దేవారిని ‘పెరఫెక్షనిస్టులు’ అంటారు. కొన్ని వృత్తులకి ఇది పనికి రాదు. మీరు మీ పై అధికారుల చెప్పుల్లో కాళ్లు పెట్టి ఆలోచిస్తే, మీ పొరపాటు ఎక్కడుందో తెలుస్తుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
బాల్యంలో ఒత్తిడి.. మహిళలకు మరింత ముప్పు
న్యూయార్క్: ఒత్తిడి వల్ల వచ్చే అనర్థాల గురించి మనం తరచూ పేపర్లలో చదువుతూనే ఉంటాం. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో కొత్త విషయం న్యూయార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్దయ్యాక ఎదురయ్యే ఒత్తిడి సమస్యల కంటే బాల్యంలో ఎదుర్కొనే ఒత్తిడే మహిళలకు ఎక్కువ హాని చేస్తుందని ఈ పరిశోధనలో రుజువైంది. బాల్యంలో ఒత్తిడికి లోనవడం వల్ల మహిళల్లో బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా 2,259 మంది పురుషులు, 1,358 మంది మహిళలపై వారు పరిశోధనలు చేశారు. తల్లిదండ్రుల మధ్య సక్యత, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలకు, బాల్యంలో ఎదురయ్యే ఒత్తిడికి సంబంధం ఉంటుందన్నారు. ఉద్యోగం పోవడం, కావాల్సిన వాళ్లను కోల్పోవడం వంటి కారణాలు పెద్ద వయసు వారిలో ఒత్తిడికి కారణమవుతున్నాయని తెలిపారు. -
కలవరం కాదు... వరం!
బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలలో జీవితం గడుస్తుంది. బాల్యంలో ఆటపాటలు, విద్యాభ్యాసం; యవ్వనంలో ఉద్యోగం, వివాహం, సంతానం; వృద్ధాప్యంలో అరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు... ఇలా జీవనక్రమం ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగ జీవితం... కుటుంబపరంగా కూడా అనేక బాధ్యతలను నెరవేర్చుకోవడంతో సాగుతుంది. పిల్లల చదువుల, పిల్లల పెళ్లిళ్లు, అదే సమయంలో ఉద్యోగనిమిత్తం కొత్త కొత్త ప్రదేశాలలో పనిచేయాల్సి రావడం, కొత్తవారితో పరిచయాలు... జీవితాన్ని వేగంతో నింపేస్తాయి. అయితే ఉద్యోగ విరమణ పొందాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది. ఒంటరితనం మిగులుతుంది. దీంతో మనోవేదన కలుగుతుంది. వయసు తెచ్చిపెట్టే ఆరోగ్య సమస్యలూ ముప్పిరిగొంటాయి. అందుకే పదవీ విరమణ తర్వాత ఏదైనా ఒక వ్యాపకాన్ని పెట్టుకోవాలి. ఉచిత సేవలు అందించడం కానీ, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం కానీ చేయాలి. సమాజానికి ఉపకరించే పనుల్లో నిమగ్నం అయి ఉండడం వల్ల కూడా మనం ఈ ‘శూన్యత’ నుండి బయటపడవచ్చు. దాంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలూ తగ్గుతాయి. ఇక లలిత కళలు ఇచ్చే ఆనందం గురించైతే చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఉల్లాసాన్నిచ్చే వ్యాపకాలను ఏర్పరచుకుంటే ఉద్యోగ విరమణ అన్నది శాపంలా కాకుండా వరంలా పరిణమిస్తుంది. - చెన్నమాధవుని అశోక్‌రాజు -
బాల్యంలో హింసకు గురైతే తలనొప్పి!
టొరంటో: బాల్యంలో వివిధ రకాలుగా వేధింపులకు గురయ్యేవారు పెరిగి పెద్దవారయ్యాక తలనొప్పి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారని తాజా సర్వే వెల్లడించింది. తరచుగా వచ్చే తలనొప్పికి కారణం బాల్యంలో వారు తల్లిదండ్రుల చేతుల్లో హింసకు గురవ్వడమేనని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్మే ఫుల్లర్ థాంప్సన్ తన పరిశోధనలో గుర్తించారు. ఇందుకోసం వివిధ వయసులు, జాతులు, సామాజిక పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదుర్కొన్న నేపథ్యాలు, చికాకుతోపాటు చిన్నతనంలో భౌతిక, లైంగిక దాడులకు గురైన పురుషులు, మహిళల్లో 52 శాతం ఈ తలనొప్పి ఛాయలు కనిపించాయి. బాల్యంలో ఎలాంటి హింస ఎదుర్కోని వారితో పోల్చినపుడు వీరు 64 శాతం ఎక్కువగా తలనొప్పి బారినపడ్డారు. 18పై ఏళ్లు పైబడిన దాదాపు 12,638 మహిళలు, 10,358మంది పురుషులపై ఆరోగ్యస్థితిని పరిశీలించారు. ఇందుకోసం 2012 కెనడియన్ కమ్యూనిటీ హెల్త్ సర్వే-మెంటల్ హెల్త్ నుంచి ఈ వివరాలు సేకరించారు. -
బాల్యం ప్రభావం జీవితాంతం ఉంటుంది
పాలగుమ్మి పద్మరాజుగారు నవల, కథానిక, నాట కం, వ్యాసం, కవిత్వం... సాహిత్యంలోని పలు శాఖ లలో సృష్టి చేసినా ఆయన పేరు చెప్పగానే ‘కథానిక’ గుర్తుకొస్తుంది. కారణం- ఆయన ‘గాలివాన’ కథా నిక అంతర్జాతీయ పోటీలో ద్వితీయ బహుమతి పొందడమే! ఆయనకు ఇష్టమైన ప్రక్రియా కథానికే. ఆయన తన గురించి తనే ఓ వ్యాసంలో చెప్పు కుంటూ ‘‘నేను పది మందిని ఆకర్షించే మనిషిని కాదు. నాలో ఏదో అద్భుతమైన శక్తి ఉందని నమ్మే టంత అహంకారమూ లేదు. అందుచేత నా కథాని కలు వేటిలోనూ నేను కథానాయకుణ్ణి కాదు. ఎవరికీ దొరకని అపూర్వ అనుభవం నాకేమీ కలగలేదు. అం దుకే నా గురించి కథానికల్లో రాసుకోలేదు. కానీ ఒక భయంకరమైన అనుభవానికి ఒకసారి లోనయ్యా ను. ఆ అనుభవం మాత్రం నా కథానికలో చోటు చేసుకుంది. అదే నాకు అంతర్జాతీయ బహుమతి తెచ్చిన ‘గాలివాన’... సాఫీగా జీవితం గడుపుతున్న రావు, మరుక్షణంలో జీవితం ఎలా గడుస్తుందో తెలీ ని బిచ్చగత్తె ఈ కథానికలో పాత్రలు. 1948వ సంవ త్సరంలో అర్థరాత్రి సంభవించిన తుఫాన్లో నేను గాలివాన కథానికలో రావు అనుభవించిన క్షోభంతా అనుభవించాను. మా ఇల్లు కూలిపోయింది. ఆ కూ లిన ఇంటికింద నా భార్య చిక్కుకుపోయి మూడుగంటల పాటు నిస్సహాయంగా పడి ఉంది. ఆ రాత్రి భయానకం, బీభ త్సం. అలాగని నేను కథానికలో రావుని మాత్రం కాను. ఒకే పరిస్థితిలో మేమిద్ద రం చిక్కుకున్నాం’’ అన్నారు. రావు ఎన్నో బహిర్గత సూత్రాల్ని నిర్మించుకున్నారు. బిచ్చమెత్తకూడదు, అటువంటి వారిని దగ్గరకు రానీయకూడదు, దొంగతనాన్ని ప్రోత్సహించకూడదు లాంటివెన్నో! కానీ ‘గాలి వాన’లో ఆ సూత్రాలన్నీ కొట్టుకుపోయాయి. మాన వత్వమొక్కటే మిగిలింది. అదే రావుని, బిచ్చగత్తెను దగ్గరకు చేర్చింది. ‘మృత్యువు’ అంటే పాలగుమ్మి పద్మరాజు గారికి చెప్పలేని ఆకర్షణ. అందుక్కారణం 1927లో తాతగారి మరణాన్ని దగ్గర నుండి చూడటం! ఎం తో చలాకీగా ఉండే పిన్ని కూతురు హఠాత్తుగా చిన్న వయసులో చనిపోయింది. ఈ అనుభవం తాలూకు నీడలు ఆయన ‘బాల్యం, వియ్యన్న తాత మరణం, గాలివాన కథానికల్లో కనిపిస్తాయి. కొవ్వూరులో చది వేప్పుడు గోదావరి గట్టంట రైల్వే బ్రిడ్జి వరకు నడుస్తూ కనిపించిన అన్నింటి మీదా కవిత్వం చెప్తుండేవారట పద్మ రాజు. అందరిలోనూ అన్ని గుణాలూ కలసి ఉంటాయి. ఒకరిలోని మంచిని స్వీకరించగలిగినట్లు చెడుని స్వీకరించగ లగాలి అనడమే కాదు, ‘పడవ ప్రయా ణం’ అనే గొప్ప కథానిక ద్వారా ఈ విషయాన్ని చెప్పారు. ఓ విదేశీ సంస్థ పోలెండ్‌లోని భారతీయ రాయబారి కె.సత్వర్సింగ్ సంపాదకత్వంలో సంక లనం తెచ్చింది. దాంట్లో ఒకే ఒక తెలుగు కథానిక పడవ ప్రయాణం (ఆన్ ది బోట్). యాదృచ్ఛికమేమిటంటే ఈ నెలలో పాలగు మ్మి పద్మరాజుగారి శతజయంతి పూర్తయితే, వచ్చే నెలలో గోదావరికి మహా పుష్కరాలు. అప్పుడు గోదావరి మాతని అంతర్జాతీయ స్థాయికి పెంచిన పాలగుమ్మి పద్మరాజుగారిని గుర్తు చేసుకోవలసిన అవసరం ఈ సందర్భంలో లేదా? (జూన్ 24 పాలగుమ్మి శతజయంతి ముగింపు) -డా॥వేదగిరి రాంబాబు -
బాల్యం ‘ఊపిరి’కి కాలుష్యం తూట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్కూలుకు వెళుతున్న చిన్నారుల్లో దాదాపు 35 శాతం మందికి ఊపిరితిత్తులు మొరాయిస్తున్నాయి. ఎదిగే వయసులో ఉన్న బాలల లేత ఊపిరితిత్తులకు నాణ్యత లేని గాలి వల్ల తూట్లు పడుతున్నాయి. అంతిమంగా నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం బాల్యం ఊపిరి తీస్తోంది! ముఖ్యంగా ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 8-14 ఏళ్ల మధ్య ఉన్న 2 వేల మంది స్కూలు విద్యార్థులపై నిర్వహించిన ‘బ్రీత్ బ్లూ-15’ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సర్వేలో తేలిన ముఖ్యాంశాలు... {బీత్ బ్లూ సర్వేలో భాగంగా.. 2 వేల మంది బాలలకు ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్ష(లంగ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్-ఎల్‌హెచ్‌ఎస్‌టీ) నిర్వహించగా, ఏకంగా 35 శాతం మంది ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం లేదని తేలింది. ఇక వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 21 శాతం మంది విద్యార్థుల ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువగా(పూర్‌గా), మరో 19 శాతం మంది ఊపిరితిత్తుల పనితీరు అథమస్థాయిలో(బ్యాడ్‌గా) ఉంది. మొత్తంగా 40 శాతం మంది చిన్నారుల శ్వాస అవయవాలు సాధారణ స్థాయిలో పనిచేయడం లేదు. వాయుకాలుష్యంపై ప్రజల అవగాహనను తెలుసుకునేందుకు ‘క్లీన్ ఎయిర్ ఇండియా మూవ్మెంట్’ సంస్థ నిర్వహించిన ‘పౌరుల అవగాహన-దక్పథం సర్వే’ ప్రకారం.. వాయు కాలుష్యాన్ని నివారించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, తాము చేయాల్సిందేమీ లేదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. వాయు కాలుష్యానికి ప్రజలు కూడా బాధ్యులేనని ఢిల్లీలో 15 శాతం, ముంబైలో 24 శాతం, బెంగళూరులో 27 శాతం, కోల్‌కతాలో 9 శాతం మంది మాత్రమే అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ద్విచక్ర వాహనదారులు 46 శాతం, నాన్ ఏసీ కారు ఓనర్లు 63 శాతం, ఏసీ కారు ఓనర్లు 96 శాతం మంది వాహనాలు ఎక్కువసేపు నిలిపినప్పుడు నిర్లక్ష్యంతో ఇంజిన్ ఆపివేయడంలేదు. పరీక్షించిన అంశాలు ఇవే... ఊపిరితిత్తులు ఎంత గాలిని పీల్చుకుంటున్నాయి? బయటికి, లోపలికి గాలి ఎంత వేగంగా వెళ్తోంది? ఎంత ఆక్సిజన్‌ను పీల్చుకుని, ఎంత కార్బన్ డయాక్సైడ్ను వదులుతున్నాయి? ఊపిరితిత్తులకు ఇతర సమస్యలు, జబ్బులు వచ్చాయా? వంటి అంశాలను ఎల్హెచ్ఎస్టీలో పరీక్షించారు. ఇందులో ప్రతికూల ఫలితాలు వస్తే.. భవిష్యత్తులో తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
బాల్యానికి రక్షణ ఏది?
నందిపేట (నిజామాబాద్ జిల్లా) : అందరిలాగే చదువుకోవాలని తలంచినది ఆ బాలిక. తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి చూపిన బిక్షాటన మార్గంలో తగినంత అడుక్కురాలేక పోతోంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన కన్న తండ్రి కాలయముడిగా మారి గదిలో బంధించి కట్టేసి చితకబాదాడు. పదేళ్ల ఆ బాలిక ఒళ్లంతా గాయాలవడమేకాక కాళ్లు చేతులు విరిగిపోయాయి. నిజామాబాద్ జిల్లా నందిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి . నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లికి చెందిన కోట ఎల్లప్ప కొంత కాలం క్రితం బతుకు దెరువు కోసం ఇద్దరు కూతుర్లను వెంట తీసుకుని నందిపేట వచ్చాడు. వీరు వృత్తిరీత్యా బుగ్గల వ్యాపారులు. ఎల్లప్ప తన భార్యను చంపిన ఘటనలో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే తిరిగి వచ్చాడు. వచ్చిన నాటి నుండి ఇద్దరు కూతుర్లను బిక్షటనకు పంపిస్తున్నాడు. ప్రతి రోజు ఇద్దరు కూతుర్లు బిక్షాటన చేసిన డబ్బులు తండ్రికి తెచ్చి ఇవ్వాలి. శనివారం చిన్న కూతురు బడ్డెవ్వ సరిపడా డబ్బులు తీసుకురాలేదు. తప్ప తాగిన తండ్రి ఆగ్రహాంతో ఊగిపోతూ బాలికను గదిలో బంధించి, కిటికీకి కట్టేసి కొట్టాడు. దీంతో ఒడ్డెవ్వకు తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. కుడి చేయి, కాలు విరిగి పోయి నిస్సహాయ స్థితిలో పడిపోయింది. చుట్టుపక్కలవారు ఈ విషయం తెలుసుకుని, బాలికను రక్షించి అంబులెన్సుకు సమాచారం అందించారు. ఎల్లప్ప వారితోనూ గొడవకు దిగే ప్రయత్నం చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎల్లప్పను అదుపులోకి తీసుకున్నారు. గామపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు. తండ్రి విచక్షణా రహిత చర్యకు సహాయ పడిన పెద్దకూతురు పోసాని పరారయింది. -
అమ్మా.. నాన్నా..ఆలోచించండి!
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగ బాధ్యతలతో పిల్లలతో తీరిగ్గా గడిపేంత సమయం ఉండడం లేదు. దీంతో పిల్లల మార్కులు, ర్యాంకులపై చూపించే శ్రద్ధ వారి మనసు తెలుసుకోవడంలో చూపడం లేదని అపోలో ఆసుపత్రి మనస్తత్వ నిపుణులు డాక్టర్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. చిన్నారుల్లో అభద్రతాభావం పెరిగిపోతోందని, వారు మానసిక వైద్యులను తరచుగా ఆశ్రయిస్తున్నారని సైకాలజిస్టు గీత చెప్పారు. ఒంటరితనం వల్ల భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బడి ఒడిలో బాల్యం బందీ అందమైన బాల్యంలో ఆనందం, ఆహ్లాదం దూరమవుతున్నాయి. తెల్లవారుజామున మొదలైన పరుగు రాత్రి పదింటి వరకూ ఆగడం లేదు. బడిలో ఆటలు ఆగిపోయాయి. సాంస్కృతిక అంశాలు కనుమరుగయ్యాయి. ఎవరైనా ఆసక్తితో పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పాలని ప్రయత్నించినా యాజమాన్యాలు అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. సిలబస్ నుంచి తప్ప బయటి విషయాలు ఏవి చెప్పినా వెంటనే తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదుల పరంపర మొదలవుతుంది అంటున్నారు రిటైర్డ్ అధ్యాపకులు కె.వి.సుబ్బారావు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, మానసిక వికాసం వికసించాల్సిన పాఠశాల ప్రాంగణంలో అవన్నీ దూర మయ్యాయని ఆయన ఆవేదన చెందారు. 'సాధారణంగా పిల్లలు ఎదుర్కొనే ప్రధాన సమస్య వారిని ఇతరులతో పోల్చడం. తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పిదం ఇదే' అని ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి పేర్కొన్నారు. 'స్కూలు, కాలేజీ, పోటీ పరీక్షలు ఏవైనా విద్యార్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే రాణిస్తారు. కేవలం పరీక్షలో విజేతగా నిలవడమే తెలివితేటలకు కొలమానం కాదు. తెలివితేటలంటే కేవలం మార్కులు, ర్యాంకులే కాదు. సంగీతం, చిత్రలేఖనం, నటన.. ఇలా అభిరుచి ఉన్న రంగాల్లోనూ పిల్లలు రాణిస్తారు' అని చెప్పారు ఆర్.సి.రెడ్డి. బాలల్లోని సహజ సిద్ధమైన లక్షణాలను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. మార్గం చూపే గురువులు పిల్లల మనసెరిగి ప్రవర్తించడం గొప్ప కళ. వారి ఆసక్తులు, అభిరుచులను గమనించి ప్రోత్సహించటం ఇప్పటి తల్లిదండ్రులకు సవాలుగా మారింది. గతంలో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో పెద్దలు.. పిల్లలకు వినయం, విధేయత, సంస్కృతి, సంప్రదాయాల గురించి విడమర్చి చెప్పేవారు. చిట్టిపొట్టి కథల తో దిశానిర్దేశం చేసే తాతయ్యలు, మంచి చెడులు వివరించి సన్మార్గంలో నడిపించే బామ్మలు ఇప్పటి తరానికి కరువయ్యారు. అందుకే ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు పేరెంటింగ్ ఇన్స్టిట్యూట్స్ వెలిశాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆధునిక అంశాలు, గతాన్ని గుర్తుచేసే సంప్రదాయ విలువలను తల్లిదండ్రులకు, పిల్లలకు వారాంతాల్లో బోధిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చిన్నారుల కోసం క్వాలిటీ టైం కేటాయించడం, వారి సమస్యలను సావధానంగా తెలుసుకుని సానుకూలంగా స్పందించడం, సౌమ్యంగా మాట్లాడటం వంటివి తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారు. ఇంటి పనిలో, వంట పనిలో తల్లిదండ్రులకు సాయం చేసేలా పిల్లలకూ శిక్షణ ఇస్తున్నారు. ఖాళీ దొరికితే చాలు టీవీకో, ఇంటర్నెట్కో అతుక్కుపోకుండా.. చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, నటన, యోగా వంటివి నేర్పిస్తున్నారు. మన సుకుమారులు 'పోటీ ప్రపంచంలో చిన్నారులను యంత్రాలుగా మార్చేశాం. మార్కులు, ర్యాంకులు సాధించేవారిగానే పరిగణిస్తున్నాం. బిజీ లైఫ్‌లో పిల్లల కోసం సమయం వెచ్చించకపోవటం పెద్ద లోపం. మంచి చెడు, సభ్యత, సంస్కారం.. ఇవన్నీ పెద్దల నుంచి పిల్లలకు అలవడాల్సిన లక్షణాలు. కానీ వీటి గురించి తెలియజెప్పే సమయం తల్లిదండ్రులకు ఉండడం లేదు. పిల్లలు తీసుకుంటున్న ఆహారంపై పెద్దలు శ్రద్ధ వహించడం లేదు. ఫలితంగా పసితనంలోనే ఊబకాయం బారిన పడుతున్నారు. మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల మనస్తత్వాన్ని గమనించి ప్రవర్తించాలనే విషయం చాలామంది పేరెంట్స్‌కు తెలియదు. దీనికి పరిష్కారం.. పిల్లలకు కూడా మనసుంటుందనే విషయం తెలుసుకోవడం. దీని కోసమే పేరెంటింగ్ క్లాసులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. పిల్లల మనసును గుర్తించడం ఎలాగో తెలియజేస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది' -నయనతార నందకుమార్, డెరైక్టర్, అవర్ సేక్రెడ్ స్పేస్, సికింద్రాబాద్ -
యకీన్ కా ధోఖా...
ఇది కంచే చేను మేసే సామెతను తలపించే సంఘటన.. బాల్యం చేదు జ్ఞాపకంగా మిగిలినా ముందున్న జీవితాన్ని అందంగా మలచుకోవాలనుకుంటున్న బాలిక కథ! ఆమె పేరు రష్మీ (పేరు మార్చాం). వయసు పదమూడేళ్లు! ..:: సరస్వతి రమ సబిత, మోహన్ (పేర్లు మార్చాం)లకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. స్వస్థలం ఒడిశా. పెద్ద కూతురికి ఎనిమిదేళ్లకే పెళ్లి చేశారు. ఆ పిల్ల అత్తగారి కుటుంబంతో కలసి వలస కూలీగా దేశమంతా తిరుగుతోంది (ఇంతకుమించిన వివరాలేమీ చెప్పలేదు సబిత). రెండో సంతానం కొడుకు. చదువు కోసం ఆ పిల్లాడిని తన తల్లి దగ్గరుంచి ఇటుక బట్టీ కూలీగా ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ నిజామాబాద్ చేరాడు మోహన్ చిన్న బిడ్డ రష్మీని, సబితను వెంటబెట్టుకొని. ఇది ఆరేళ్ల నాటి సంగతి. అప్పుడు రష్మీకి ఏడేళ్లు. ఆ చిట్టిచేతులూ ఇటుకలు మోసి కాయలు కాశాయి. అక్కడ కొన్నాళ్లున్నాక హైదరాబాద్ బయలుదేరింది ఆ కుటుంబం. ఇక్కడ.. తెలిసినవాళ్ల ద్వారా పాతబస్తీలో మకాం పెట్టారు. పక్కనే ఉన్న ముస్లిం పిల్లలతో పాటు రష్మీ గోట్లు (లక్కగాజులు) తయారుచేసే కార్ఖానాలో పనికి వెళ్లేది. ఆ బస్తీలోనే ఉన్న రెండు మార్వాడీ ఇళ్లల్లో పనిచేసి తనూ అదే కార్ఖానాలో పని చూసుకుంది సబిత. మొదట్లో ఏదో ఒక పని చేసే మోహన్ తర్వాతర్వాత తాగుడుకు బానిసయ్యాడు. కొన్నిరోజులకి నల్లమందూ అతని ఒంటికి పట్టింది. ఆ మత్తు విచక్షణను మింగేసింది. ఉదయం ఏడింటికి వెళ్లి మధ్యాహ్నం మూడింటికల్లా ఇంటికి వచ్చేది రష్మీ. సబితేమో ఆరుగంటలకల్లా వచ్చి మళ్లీ సాయంకాలం ఇళ్లల్లో పనికి వెళ్లేది. తల్లి ఇంటికొచ్చేదాకా నిద్రపోయేది ఆ పిల్ల. ఒకరోజు.. కార్ఖానా నుంచి బాగా అలసిపోయి వచ్చిందో ఏమో ఆదమరిచి నిద్రపోయింది రష్మీ. మత్తు నెత్తికెక్కిన మోహన్‌కి రష్మీ కూతురులా కనిపించలేదు. గాఢనిద్రలో పీడకల వచ్చినట్టుగా ఉలిక్కిపడి లేచిన రష్మీ.. తండ్రి రూపం చూసి భయంతో కేకలేసింది. గింజుకుంది, పారిపోయే ప్రయత్నం చేసింది. శక్తి చాలలేదు. రెండేళ్లు.. సబిత ఇంటికి వచ్చేటప్పటికి వాతావరణంలో తేడా కనిపించింది. బిడ్డ ఒంటిమీది బట్టలు చెదిరి సొమ్మసిల్లి పడి ఉంది. కూతురిని ఆ స్థితిలో చూసి నెత్తిపట్టుకొని ఏడ్చింది. బిడ్డను హాస్పిటల్‌కు తీసుకెళ్దామని తోడు కావాలని భర్తకోసం చూసింది. కనపడలేదు. పక్కింటి వాళ్ల సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లింది. స్పృహలోకొచ్చిన రష్మీ మగమనిషిని చూస్తేనే వణికిపోసాగింది. ఈ లోకంలోకి రావడానికి రెండు రోజులు పట్టింది. అప్పుడు చెప్పింది జరిగిన విషయం.. తల్లి గుండెలో తలపెట్టి ఆమె పైటచెంగును గట్టిగా పిడికిలిలో బిగిస్తూ! ఇంటికి తీసుకొచ్చాక ఆ ఇంట్లో క్షణం కూడా ఉండలేకపోయిందా పిల్ల. తల్లిని వదిలితే ఒట్టు. బిడ్డ పరిస్థితి చూసి పక్కనే ఉన్న బ్యాంక్‌కాలనీలోని సునీత అనే టీచర్ సబితకు నచ్చచెప్పి రష్మీని తనింటికి తీసుకెళ్లింది. రష్మీని మామూలు మనిషిని చేయడానికి సునీతకి రెండేళ్లు పట్టింది. ఇప్పుడు.. రష్మీ 5వ తరగతి చదువుతోంది. సునీత దగ్గరే ఉంటోంది. ఓ ఏడాదిన్నర కిందట సబితకు మోహన్ జాడ తెలిసినా ఎవరకీ చెప్పలేదు.. అలాగని తనింటికి రానివ్వనూ లేదు. ఇప్పుడు ఆమెకు బిడ్డ క్షేమమే ముఖ్యం. ఆ బిడ్డకు చదువే లక్ష్యం. పాతగాయం.. అప్పుడప్పుడూ కలవరపెట్టినా భయపడట్లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. జిజియాబాయి, ఝాన్సీబాయిల కథలు ఇష్టంగా చదువుతుంది. ఎక్కువగా మాట్లాడదు.. పెదవులపై చిరునవ్వు చెరగనీయదు. ‘బాగా చదువుకోవాలి.. సావిత్రిబాయి పూలేలా మంచి టీచర్ కావాలి’ అంటుంది. -
చేద్దాం రన్‌డి.. raahgiri
బాల్యంలో ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుపై ఆడిన గిల్లీదండా గుర్తుందా?.. గల్లీ క్రికెట్లో చిచ్చర పిడుగులా రెచ్చిపోయిన రోజులు గుర్తున్నాయా ?.. అయితే, కొద్దిసేపు ఇంటికి తాళం వేయండి. షి‘కార్లు’ కట్టిపెట్టండి. బైక్‌ల స్పీడ్‌కు బ్రేక్‌లు వేయండి. నేరుగా మైండ్‌స్పేస్ జంక్షన్‌కు ‘రన్’డి. అక్కడ.. నో వెహికల్స్.. నో హార్న్స్.. నో పొల్యూషన్.. నాలుగు గంటల పాటు ఓన్లీ సెలబ్రేషన్స్. నచ్చిన పాట పాడుకోండి. వచ్చిన డ్యాన్స్ చేయండి. అలుపొచ్చే వరకు పరుగెత్తండి. రోడ్లపై దర్జాగా నడవండి. నడపడంలో బై‘స్కిల్’ చూపండి. అలసిపోయేలా ఆసనాలు వేయండి. మ్యూజిక్ వింటూ జాగింగ్.. యాహూ అంటూ స్కేటింగ్.. క్రికెట్, ఫుట్‌బాల్, స్టేజ్ షో.. అదీ ఇదీ అని కాదు.. మీకొచ్చిన ‘కళ’ను ప్రదర్శించండి. టోటల్‌గా ‘రాహ్‌గిరి’ చేయండి. ..:: సీహెచ్.ఎమ్.నాయుడు పాదచారే రహదారికి హీరో.. కానీ, రోడ్డెక్కితే అతను జీరో. కనీసం నిల్చునే చోటుండదు. సైక్లిస్ట్ పర్యావరణ మిత్రుడు.. కానీ, ట్రాఫిక్ రణంలో సైకిల్ దూసుకుపోలేదు. కార్లున్న వారివే సిటీ రహ‘దారులు’. ఇక్కడ పాదచారులకు నడవ చోటుండదు. ఆకాశాన్నంటే హార్మ్యాలు, గల్లీ నుంచి మెయిన్‌రోడ్ వరకూ పేరుకుపోయిన కార్లు.. ఇవే నగరానికి కొలమానం కావు. ‘రాజధానిలోని వీధి వీధి నగర వాసులందరివీ. కేవలం మోటార్ వాహనాలు నడిపేందుకే ఇవి లేవు. కనీసం వారానికోరోజు వాహనాలను పక్కన పడేద్దాం. రోడ్లపైకి వచ్చి అందరం ఆడుతూ పాడుతూ గడుపుదాం. ‘బ్రాండ్ హైదరాబాద్’ ఇమేజ్ పెంచడానికి ఏజ్‌తో పనిలేకుండా అందరం కలిసి గ్రాండ్ అంబాసిడర్లు అవుదాం’ అంటోంది ‘రాహ్‌గిరి’. యూనిక్ కాన్సెప్ట్.. సైక్లింగ్, పాదచారుల భద్రత కోసం కొలంబియాలోని బొగొటా నగరంలో ‘సైక్లోవియా’ పేరుతో ఓ ఉద్యమం మొదలైంది. ఏదైనా ప్రాంతంలోని రోడ్లపై ప్రతి ఆదివారం నిర్దేశిత సమయంలో మోటారు వాహనాల్ని అనుమతించరు. పాదచారులు, సైక్లిస్టులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి సైక్లింగ్, జాగింగ్, రన్నింగ్, వాకింగ్, స్కేటింగ్, ఎక్సర్సైజ్లు చేస్తూ స్వేచ్ఛగా గడుపుతారు. 70లలో మొదలైన ఈ ఈవెంట్ ప్రస్తుతం 120 కిలోమీటర్ల మేర ‘ఆటోమొబైల్ ఫ్రీ స్ట్రీట్స్’గా రూపాంతరం చెందింది. ఎల్లలు దాటిన ఈ యూనిక్ కాన్సెప్ట్ పలు అంతర్జాతీయ నగరాలను పలకరిస్తూ ఇండియాలో ‘రాహ్‌గిరి’గా రోడ్డెక్కింది. ‘ఈ వీధి మాదిరా.. ఈ రోడ్డు మాదిరా’ అంటూ గుర్గావ్లో 2013 నవంబర్‌లో మొదలైన ఈ కమ్యూనిటీ మూవ్మెంట్ తర్వాత దిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్ నగరాలను చేరుకుంది. ముంబైలో ఇది ‘ఈక్వల్ స్ట్రీట్స్’ పేరుతో నడుస్తోంది. ప్రస్తుతం సౌతిండియాలో తొలిసారిగా హైదరాబాద్‌లో రాహ్‌గిరి ఎంటరైంది. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ క్యాంపెయిన్‌లో భాగంగా దీనిని జీహెచ్ఎంసీ, సైబరాబాద్ పోలీస్, టీఎస్ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) తోపాటు, ఎంబార్క్ ఇండియా వంటి ఎన్జీఓ ఆర్గనైజేషన్లు నిర్వహిస్తున్నాయి. వాకింగ్ స్వాతంత్య్రం.. నగరంలో 42 శాతం మంది సైక్లిస్టులు, పాదచారులు ఉన్నారు. 27 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నారు. 22 శాతం మంది కార్లు వాడుతున్నారు.. మిగతా వారు వివిధ రవాణా సాధనాలను వినియోగిస్తున్నారు. ఇవీ అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ విభాగం లెక్కలు. ఒక్క కారు సుమారు 60 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. ఈ లెక్కన 22 శాతం మంది వినియోగిస్తున్న కార్లతోనే సిటీలోని రోడ్లు నిండిపోతున్నాయి.‘ఒక పాదచారి నిల్చోడానికి మూడు చదరపు అడుగుల చోటు చాలు. సైక్లిస్ట్‌లు, పాదచారుల నిష్పత్తి ఎక్కువున్నా.. రోడ్డుపై వారికి అడుగు మోపేంత స్థలమైనా లేదు. నగరంలో కనీస స్థాయిలో ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు లేవు. వాటిని కల్పిస్తేనే అందరికీ రోడ్ల స్వాతంత్య్రం దక్కినట్టు’ అని అంటారు ప్రశాంత్‌కుమార్. అర్బన్ ట్రాన్స్పోర్ట్ నిపుణులైన ఈయన.. ‘అలాగని ఇది కార్లకు వ్యతిరేకం కాదు. రోడ్లు, వీధులు పబ్లిక్ ప్రాపర్టీస్. ఎవరు ఎంత రోడ్డు వినియోగించుకుంటారో వారికి అంత ప్లేస్ ఇవ్వాలి. రాహ్‌గిరి ఉద్దేశాల్లో ఇదీ ఒకట ’ని చెబుతారు. అప్నీ రాస్తా.. అప్నీ ఆజాదీ.. సైక్లింగ్‌ను ప్రోత్సహించడం, వాకింగ్, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయడం మాత్రమే రాహ్‌గిరి లక్ష్యాలు కాదు. దీని ప్రధాన ఉద్దేశం ఈ కమ్యూనిటీ ఈవెంట్ ద్వారా వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఏకం చేయడమే. ఈ ఆదివారం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ కాంప్లెక్స్ వరకు 1.2 కిలోమీటర్ల మేర నగరవాసులు రాహ్‌గిరి చేయవచ్చు. ఆధునిక జీవనశైలిలో ఉనికి కోల్పోతున్న ఫిజికల్ యాక్టివిటీస్‌ను పునరుత్తేజపరచే విధంగా ఈవెంట్ డిజైన్ చేశారు. అంతేకాదు ప్రజల్లో సామాజిక స్పృహ పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణకు ఇది వేదికగా ఉంటుందంటున్నారు నిర్వాహకులు. ఇంకా చెప్పాలంటే ‘రోడ్లు ఏ కొందరికో, కార్లకో చెందవు. రోడ్లపై కార్లకే కాదు.. సామాన్యులకూ చోటుండాలి. అవి అందరివీ. అప్నీ రాస్తా.. అప్నీ ఆజాదీ..’ అనే కాన్సెప్ట్‌ను విస్తృత పరచడమే లక్ష్యంగా రాహ్‌గిరి సాగనుంది. అందరి ‘ఫన్’డుగ.. రేపే ఆదివారం జరగనున్న రాహ్గిరీలో రీబక్ గ్రూప్ జుంబా డ్యాన్స్, ఫిట్నెస్ శిబిరాలను కండక్ట్ చేస్తోంది. ఏడీఎఫ్ఐ- పిల్లలకు సైక్లింగ్‌పై అవగాహన కలిగిస్తోంది. కోకాకోలా- గల్లీ ఫుట్‌బాల్ నిర్వహిస్తోంది. ఐడెంసిటీ గ్రూప్ కల్చరల్ ఈవెంట్స్ పెడుతోంది. ఆక్టోపస్ థియేటర్ గ్రూప్ స్టేజ్ షోలు ప్రదర్శించనుంది. ఇక, టీఏఎఫ్ సంస్థ.. ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చిన వారిలో ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వంద సైకిళ్లను ఉచితంగా అందచేయనుంది. ఇంకా ఎవరికి వారు సొంత ఈవెంట్లను ప్రదర్శించవచ్చు. యోగా, జిమ్, ఎక్సర్సైజ్లు, డ్యాన్స్, ఆర్ట్, మ్యూజిక్, ఫన్.. అన్నిటికి మించి ప్రజల్లో టుగెదర్‌నెస్ పెంచే ఈ కమ్యూనిటీ ఈవెంట్‌కు నగరవాసులు రెడీ అవుతున్నారు. చిన్ననాడు వీధుల్లో మరచిపోయిన బాల్యాన్ని.. మళ్లీ రీక్లెయిమ్ చేద్దామంటూ నిమిషం నిడివి గల రాహ్‌గిరి థీమ్ ఆడియో సాంగ్ సిటీలో హల్చల్ చేస్తోంది. ఇక సోషల్సైట ్లలో రాహ్‌గిరి కబుర్లు సెకను సెకనుకు వందలాది మందికి చేరుతున్నాయి. టాలీవుడ్ డెరైక్టర్ రాజమౌళి తన సపోర్ట్ ఇప్పటికే ప్రకటించగా, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. ‘నేను సైతం’ అంటూ పిలుపునిచ్చాడు. ‘రాహ్‌గిరి వంటి ఈవెంట్లు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచుతాయి. హైదరాబాదీలంతా ఇందులో పాల్గొనాలి’ అని టీఎస్ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్ కోరారు. ఇక నుంచి ప్రతి ఆదివారం ఈవెంట్ జరగనుంది. రోడ్లు, వీధులు అందరివీ.. నగరంలోని 15 శాతం రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణల్లో ఉన్నాయి. ఉన్న రోడ్లను మోటారు వాహనాలు మింగేస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ రోడ్ల వెడల్పు ప్రతిపాదన తెరపైకి వస్తుంది. అన్నిటికీ రోడ్ల విస్తరణ అనేది పరిష్కారం కాదు. కొత్తగా రోడ్లు విస్తరిస్తే మరిన్ని వాహనాలు రోడ్డెక్కుతాయి. అంటే రోడ్డు ఉంది కాబట్టే ఇష్టానుసారంగా వాడుతున్నాం. అసలు లేకుంటే.. మన భారతీయ టౌన్‌ప్లానర్లు, ఆర్కిటెక్ట్ నిపుణుల ఈ యోచన నుంచే ‘రాహ్‌గిరి’ మూవ్మెంట్ పుట్టింది. రోడ్డు పూర్తిగా సైక్లింగ్ ఫ్రెండ్లీగా ఉండాలి. పాదచారులు హాయిగా నడవగలగాలి. అందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూర్చాలి. బైస్కిల్ షేరింగ్ స్కీమ్స్ వంటివి అమలు చేయాలి. ప్రజల్లో ఈ అవగాహన కలిగించడానికి రాహ్‌గిరి మూవ్మెంట్ దోహదం చేస్తుంది. - ప్రశాంత్‌కుమార్ బచ్చు, ప్రజా రవాణా వ్యవస్థ నిపుణులు, ఎంబార్క్ ట్రాఫిక్ అవేర్నెస్ రాహ్‌గిరికి అన్ని విధాలా సహకరిస్తున్నాం. నిర్దేశించిన ప్రాంతంలో 1.2 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు ఉండవు. టీఎస్ఐఐసీ నిర్వహించే ఈ కార్యక్రమంలో మా వంతుగా ప్రజల్లో ట్రాఫిక్, రోడ్ల స్థితిగతులు, నిబంధనలు తెలియచెప్పడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాం. - అవినాశ్ మహంతి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
లాలనగా... పాలనగా..!
కొంతమంది తల్లితండ్రులు పిల్లలను బాల్యం నుంచి చాలా క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు. వాళ్లు కదిలితే తప్పు, మెదిలితే తప్పు అన్నట్టుగా చూస్తుంటారు. వారు ఏ మాత్రం అల్లరి చేసినా, కాల్చేసేలా చూస్తారు. అవసరమైతే నాలుగు తగిలిస్తారు. అయితే చిన్నప్పటి నుంచి తలిదండ్రుల దండనతో పెరిగిన పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో లోపాలు చోటు చేసుకుంటాయని మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడిలో ఉపాధ్యాయుల కర్రపెత్తనం వచ్చిన పిల్లలు అమ్మానాన్నలను చూడగానే ఆనందంతో ఎగిరి గంతులు వేసేలా ఉండాలి కానీ, పెద్దపులిని చూసి భయపడినట్లు ఉండటం అటు పిల్లలకే కాదు, ఇటు పెద్దలకూ మంచిది కాదని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా వారు తలిదండ్రుల ప్రవర్తన- పిల్లల ఎదుగుదలపై చేసిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. పిల్లలను ప్రేమగా చూస్తూ, వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే తల్లితండ్రులను చూసి ‘స్ట్రిక్ట్ పేరెంట్స్’ తప్పు పడుతుం టారు. పిల్లలకు చనువిస్తే చంకనెక్కి కూచుంటారని, చెప్పిన మాట వినరని అంటుంటారు. కానీ, వారి వాదన తప్పని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. చైనాలోని ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థ హంగ్జువా ఏమి చెబుతోందంటే - తల్లితండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కోరుకోవటంలో తప్పు లేదు, అయితే అది మోతాదు మించి, పిల్లల పాలిట క్రమ‘శిక్ష’ణలా పరిణమించకూదు. దాని మూలంగా వారి లేత మనస్సులు తీవ్రమైన ఒత్తిడి కి గురై, పక్కతడపటం, నత్తిగా, నంగి నంగిగా మాట్లాడటం, పక్కచూపులు చూడటం, బిక్కచచ్చిపోవటం వంటి ప్రవర్తనా లోపాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి తల్లితండ్రులు తమ పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి తప్పితే, కోపంతో దండించకూడదు. అల్లరి చేసినప్పుడు సున్నితంగా హెచ్చరించాలి. మారాం చేసినప్పుడు మెల్లగా బుజ్జగించాలి. దానివల్ల క్రమంగా పిల్లలే తమ తప్పును తెలుసుకుని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలా పెరిగిన పిల్లలు తాము పెద్దయ్యాక తోటివారితో కూడా ప్రేమగా మెలగుతారని సర్వేలు చెబుతున్నాయి. -
బాల్యం బందీ
విధి.. ఊహ తెలియని వయసులోనే అమ్మానాన్నలను దూరం చేసింది. అందరూ ఉన్నా అనాథగా మిగిల్చింది. పలకాబలపం పట్టాల్సిన ఆ చిట్టిచేతులతో చీపురును పట్టి పాచిపనులు చేసింది. పొద్దస్తమానం పనిచేస్తే మూడుపూటల పట్టెడన్నం చాలనుకుంది. ఆకలి కోసం ఆ పసిహృదయం క్షోభకు గురైంది. పనిలో కుదుర్చుకున్న యజమానులు చిత్రహంసలకు గురిచేసినా చిలుకలా పంజరంలోనే బందీగా మారింది. బయటికెళ్తే చంపుతానని బెదిరిస్తే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపింది. ఎలాగోలా వారి చెరవీడి పోలీసుల చెంతకు చేరింది. సీఐ చొరతో బాలసదన్‌కు చేరింది. షాద్‌నగర్ రూరల్: ఆడిపాడి చదువుల ఒడిలో సేదతీరాల్సిన ఓ చిట్టితల్లిని ఇంటి యజమానులు బంధించారు. బయటి ప్రపంచాన్ని చూడకుండా చేసింది. ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు.. పోమాలపల్లి గ్రామానికి చెందిన జంగయ్య, రాములుమ్మకు ఒక్కగానొక్క కూతురు మహాలక్ష్మి(12). చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. మూడేళ్లక్రితం పక్షవాతంలో తల్లి మృతి చెందింది. దీంతో మహాలక్ష్మి అనాథగా మారింది. చిన్నారిలో చదువుకోవాలనే తపనను గ్రహించిన పాఠశాల ఉపాధ్యాయుడు మహాలక్ష్మిని వసతిగృహంలో చేర్పించాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ షాద్‌నగర్‌లోని విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న దమయంతి, జయకిషన్ ఇంట్లో పనిచేయడానికి బేరం కుదిర్చింది. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆ యజమానులు ఆ చిన్నారిని చిత్రహింసలకు చేసింది. వారు బయటకు వెళ్లే సమయంలో ఆ చిన్నారిని ఇంట్లోనే ఉంచి బయటనుండి తాళంవేసుకుని వెళ్లేవారు. పస్తులుండకుండా మూడుపూటల పట్టెడన్నం దొరికెతే చాలనుకున్న ఆ చిన్నారికి రోజుకు ఒకపూట మాత్రమే అన్నంపెట్టి పనిచేయించుకునేవారు. ఇక్కడి విషయాలు బయటకు చెప్పినా నిన్ను చంపుతామని బెదిరించేవారు. శనివారం రాత్రి ఎలాగైనా ఇక్కడనుండి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసింది. అక్కడినుండి తప్పించుకున్న మహాలక్ష్మి రాత్రి 9గంటల సమయంలో పటేల్‌రోడ్‌లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక బంధువులు నెలరోజుల క్రితమే ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది. చిరిగిన బట్టలతో వెళ్తున్న మహాలక్ష్మిని కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ చేరదీసింది. ఆదివారం లక్ష్మి అసలు విషయం బయటకు చెప్పింది. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ పట్టణ సీఐ నిర్మల ఆ చిన్నారిని చేరదీసి.. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో చేర్పించారు. ఈ విషయాన్ని కార్మికశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
డే కేర్లతో డేంజర్
‘డే కేర్’లలో బంధాలకు దూరమవుతున్న రేపటి తరం ఆయాల పాలనలో బాల్యం చిన్నారులను నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’ వాడకం పసిమొగ్గల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఐదేళ్ల వరకు ఆటపాటల్లో గడపాల్సిన బాల్యం.. ఐదు నెలలకే డే కేర్ పరం అవుతోంది. అమ్మ ఒడి వెచ్చదనాన్ని మనసారా ఆస్వాదించాల్సిన చిన్నారులు.. ఏడాది కూడా దాటకుండానే ప్లే స్కూల్స్‌లో ఆయమ్మల దగ్గరకు చేరుతున్నారు. మారుతున్న జీవనశైలి, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో చిన్నారులు ఇంట్లో ఆహ్లాదకరమైన జీవనాన్ని పొందలేకపోతున్నారు. ఇదిలా ఉంటే డే కేర్ సెంటర్లకు సంబంధించిన మరికొన్ని ఆందోళనకరమైన అంశాలు ‘డే కేర్’ సెంటర్లను ‘డేంజర్’ సెంటర్లగా మార్చేస్తున్నాయి. డే కేర్ సెంటర్లలోని చిన్నారులు త్వరగా నిద్రపోయేందుకు గాను అక్కడి సిబ్బంది వారికి ‘కాఫ్ సిరప్’ను అలవాటు చేస్తున్నారని ఇటీవలి కాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిన్నారుల ఆలనా, పాలనా విషయంలో డే కేర్ సెంటర్లు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ.... ఇక అమ్మ ఒడిలో హాయిగా సాగాల్సిన బాల్యం డేకేర్ సెంటర్లలో నలిగిపోతుండడంపై ఇటీవల నగరంలో నిర్వహించిన ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ జరిగింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులతో ముఖ్యమంత్రి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘డే కేర్’ సెంటర్ల పనితీరుపై విద్యార్థులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నగరంలోని అనేక డే కేర్ సెంటర్లలో చిన్నారులను త్వరగా నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’లను వినియోగిస్తున్నారని, తద్వారా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తున్నాయని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదే వేదికపై ఉన్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ ఈ విషయం పై స్పందిస్తూ...‘ఇలాంటి విషయాలు మా దృష్టికి కూడా వచ్చాయి. అందుకే ఇక నుంచి డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాం’ అని ప్రకటించారు. భద్రం ఎంత? నగరంలో ప్రస్తుతం వీధికొక డే కేర్ సెంటర్ కనిపిస్తోంది. తమ ఇంటికి దగ్గరగా ఉందనే కారణంతో చాలా మంది తల్లిదండ్రులు ఆ డే కేర్ సెంటర్ లేదా ప్లేస్కూల్ తమ బిడ్డలకు ఎంత వరకు సురక్షితం అనే అంశంపై తక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. అయితే ఇది ఎంత మాత్రం సరైంది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారులను డే కేర్ సెంటర్లలో చేర్చడానికి ముందు అక్కడ నిపుణులైన సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని చాలా డే కేర్ సెంటర్లలో పిల్లల పెంపకంపై ఏ మాత్రం అవగాహన లేని వారిని సైతం నియమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నగరంలోని చాలా వరకు డే కేర్ సెంటర్లలో సరైన శుభ్రత కూడా కనిపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. చిన్నారుల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, ఏ మాత్రం అపరిశుభ్ర వాతావరణం వారి దరికి చేరినా వెంటనే అనారోగ్యం బారిన పడతారు. అందుకే డే కేర్‌లోని పరిసరాలతో పాటు అక్కడి సిబ్బంది కూడా తప్పని సరిగా శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. డే కేర్లలో పిల్లలను చేర్చే ముందు పై విషయాలన్నింటిని ఓ సారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న కుటుంబాలు కావడంతోనే... ప్రస్తుతం బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో దంపతులిద్దరూ తప్పక పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులతో ఇంటిని నడపాలంటే దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు నగరంలో దాదాపు అన్నీ చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. ఎక్కడో స్వగ్రామంలో పెద్దలు ఉంటున్నారు. దీంతో ఇంట్లోని చిన్నారుల పెంపకం పెద్ద సవాల్‌గానే మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ చిన్నారిని కేవలం ఐదారు నెలల్లోనే డే కేర్ లేదా ప్లే స్కూల్లలో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ఉదయం దంపతులిద్దరూ ఆఫీసుకు వెళ్లే సమయంలో పాపాయిని డే కేర్సెంటర్లో వదిలి వెళ్లి, తిరిగి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటపుడు తమతో పాటు తీసుకొస్తున్నారు. ఇల్లే మొట్టమొదటి పాఠశాల... చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శ అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో పెరుగుదల బాగా కనిపించే ఐదేళ్ల వయసు వరకు వారికి ఇల్లే పాఠశాల కావాలని చెబుతున్నారు. చిన్నారులు తమ భావోద్వేగాలను తల్లిదండ్రులతో పంచుకున్నట్లుగా మరెవరితోనూ పంచుకోలేరని మానసిక నిపుణురాలు డైసీ చెబుతున్నారు. ఇంట్లో పిల్లలు పెరుగుతుంటే వారికి ఆత్మీయతలు, అనుబంధాలు, వరుసలు తెలుస్తాయని అంటున్నారు. ‘ఇంట్లో తల్లిదండ్రులు అందించే ప్రేమాభిమానాలు చిన్నారుల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మూడేళ్ల వరకు తల్లి ఒడిలో పెరిగిన చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఒక వేళ తల్లిదండ్రులిద్దరూ తప్పక ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే పెద్దలైన నాయనమ్మ-తాతయ్య లేదా అమ్మమ్మ-తాతయ్యల సహాయం తీసుకోండి. వారిని ఊరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల సంరక్షణా భారాన్ని పెద్దల చేతికి అందివ్వండి’ అని నగరానికి చెందిన ప్రముఖ మానసిక నిపుణురాలు డైసీ తెలిపారు. -
అంగట్లో బాల్యం
ఏలూరు సిటీ :అది ఏలూరు రవాణా కార్యాలయం. దానికి కూతవేటు దూరంలో గుడారాలు. అందులో ఓ బృందం. వారిమధ్య ఓ బాలుడు. ఆ చిన్నారిని చూసిన ఓ అధికారి ఎక్కడినుంచి వచ్చావని ప్రశ్నించారు. బాలుడు నీళ్లు నమిలాడు. ఆ బృంద సభ్యులు కృష్ణాజిల్లా నూజివీడు నుంచి వచ్చిన వలస జీవులమని చెప్పుకున్నారు. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ విభాగం అధికారులు అక్కడికెళ్లారు. ఆ బాలుడిని ప్రశ్నిం చారు. ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లాకు చెందిన తనను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని, తల్లిదండ్రులు లేరని చెప్పాడు. మరో ఘటనలో.. నిడదవోలు రైల్వేస్టేషన్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ సూయిజ్ స్వయంగా ముగ్గురు బాలికలను పట్టుకున్నారు. ఇంకో వైపు కృష్ణాజిల్లానుంచి వచ్చిన ఆరు కుటుంబాల వారు చంటి బిడ్డలతో భిక్షాటన చేయిస్తున్నారు. బాలల సంక్షేమాధికారులు వారిని అదుపులోకి తీసుకోగానే ఓ ప్రజాప్రతినిధి వారిని వదిలేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. అధికారులు విస్తుపోయూరు. చేసేదేమీ లేక వారిని వదిలేశారు. ఇలాంటి వ్యవహారాల వెనుక ఓ ముష్టి మాఫియూ పనిచేస్తోందని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అధికారుల చొరవతో జిల్లాలో ఇప్పటివరకూ 41 భిక్షాటన కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారిపై చర్యలు చేపట్టారు. ఇదో మాఫియూ కృష్ణాజిల్లా విజయవాడ నగరంలో ముష్టి మాఫియా వేళ్లూనుకున్నట్లు తెలుస్తోంది. ఈ మాఫియా కార్యకలాపాలు పశ్చిమగోదావరి జిల్లాకూ విస్తరించటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా పట్టణాలు, నగరాలపైనే ఈ మాఫియా దృష్టి కేంద్రీకరించింది. ప్రకాశం జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏలూరులో భిక్షాటన చేయించారు. సెప్టెంబర్‌లో ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో పదిమందితో కూడిన భిక్షాటన బృందాన్ని బాలల సంరక్షణ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉండికి చెందిన ఓ మహిళ చిన్నారితో భిక్షాటన చేరుుస్తూ పట్టుబడింది. జంగారెడ్డిగూడెం బస్టాండ్‌లో ఇద్దరు పిల్లలతో భిక్షాటన చేయిస్తుండగా బాలల సంక్షేమ కోర్టు చైర్మన్ టీఎన్ స్నేహన్ పట్టుకుని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అదేవిధంగా అరకు నుంచి వచ్చిన ఓ కుటుంబం పిల్లలను వదిలేసి పారిపోగా ఆ పిల్లలను తీగలవంచలోని కోళ్లఫారంలో పనికి పెట్టుకున్నారు. దాన్ని సాకుగా చూపించి కొందరు వారినుంచి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇలా జిల్లాలో అనేక ఘటనలు చోటు చేసుకోవటం ఆందోళనకు గురిచేస్తోంది. పసి మొగ్గలను చిదిమేస్తున్నారు చిన్నారులను రోడ్ల వెంబడి తిప్పుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. కేవలం భిక్షాటనతోనే బాలలను వదిలేయకుండా అసాంఘిక కార్యకలాపాలకూ వాడుతున్నట్లు తెలుస్తోంది. మానసిక వికలాంగులను కూడా భిక్షాటనకు వినియోగిస్తున్నారని అధికారులు అంటున్నారు. తల్లిదండ్రులమని చెప్పుకుంటూ చంటిపిల్లలను చంకన బెట్టుకుని మరీ భిక్షాటన చేస్తున్నారు. ఏలూరులో 36కేసులు, కొయ్యిలగూడెంలో 16, నిడదవోలులో 8, గోపాలపురంలో 6, భీమవరంలో 6, తాడేపల్లిగూడెంలో 24, తణుకులో 2 ఇలా కేసులు నమోదు అయ్యాయి. వీటితోపాటు బాలకార్మికులు 40మంది, అనాధలు 10మంది, వీధిబాలలు 32మంది, అ త్యాచారాలకు గురైన బాలికలు 74మంది, మానసిక వికలాంగులు 20మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవు బాలల న్యాయ చట్టంలోని సెక్షన్-24 ప్రకారం బాలలను భిక్షాటనకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనల్ని విచారిస్తే వీటి వెనుక మాఫియా ఉందనే అనుమానం వస్తోంది. కొందరు నాయకులు కూడా వారికోసం ఒత్తిడి తేవటం పరిస్థితికి అద్దం par పడుతోంది.ఙ- టీఎన్ స్నేహన్, చైర్మన్, జిల్లా బాలల కోర్టు సామాజిక రుగ్మతే విద్య, సామాజికపరంగా వెనుకబాటుకు గురైన వ్యక్తుల కుటుంబాల్లో ఎక్కువగా భిక్షాటన కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదనే కారణంతో చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరమే. కొన్ని కేసులు పరిశీలిస్తే పిల్లలను వేధిస్తూ భిక్షాటన చేయిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు par తప్పవు.ఙ- పి.విజయనిర్మల, మేజిస్ట్రేట్; బాలల సంక్షేమ కోర్టు అవగాహన కల్పించాలి జిల్లాలో అన్ని పట్టణాలతోపాటు ఏలూరు నగరంలోనూ బాలల సంరక్షణా బృంధాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారుు. వీధి బాలలు, అనాథలు, భిక్షాటన చేసే వారిని అదుపులోకి తీసుకుని సంరక్షణా కేంద్రాలకు తరలిస్తున్నాం. - సీహెచ్.సూర్యచక్రవేణి, జిల్లా బాలల రక్షణాధికారి -
ఒత్తిడిలో ఉన్నారా? అయితే రంగుపడాల్సిందే!
ట్రెండ్ ఒక్కసారి బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ‘రంగులు నింపండి’ అనే వాక్యం కింద ఉన్న బొమ్మలను మన దగ్గరున్న రకరకాల కలర్ పెన్సిళ్లతోనో, స్కెచ్పెన్లతోనో రంగులు వేసి మురిసిపోయేవాళ్లం. ఇప్పుడు కూడా అలా చేస్తే ఏమంటారు? ‘‘ఇంకా నీలో బాల్యం పోలేదు’’ అంటారు. లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే, ఫ్రాన్సులో చిన్నాపెద్దా తేడా లేకుండా బొమ్మలకు రంగులు వేస్తున్నారు. ఈ ధోరణి ఇప్పుడు బ్రిటన్‌కు కూడా పాకి... అక్కడినుండి పలుదేశాలకు వెళుతోంది. బొమ్మలకు రంగులు వేయడం ద్వారా, ఒత్తిడిని జయించవచ్చుననేది సరికొత్త మానసిక సిద్ధాంతం. దీంతో ఇప్పుడు చాలా మంది అభిరుచుల జాబితాలో ఇది పెద్దపీట వేసుకుంది. ‘‘ఒత్తిడికి గురవుతున్నాననే భావనకు లోనుకాగానే మందు కొట్టేవాడిని. ఒత్తిడికి దూరం కావడం మాట అలా ఉంచి, అనారోగ్య సమస్యలు దగ్గర కావడం మొదలయ్యాయి. ఏంచేయాలో తోచేది కాదు. ఈ సమయంలో మా ఆవిడ ఈ ‘కలరింగ్ థెరపీ’ గురించి చెప్పింది. మొదట్లో నమ్మలేదుగానీ, ఒకసారి ప్రయత్నించి చూస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఒత్తిడి మాయమైంది’’ అంటున్నాడు మెట్జ్ (ఫ్రాన్స్) నగరానికి చెందిన విలియం హెన్రీ. కలర్ థెరపీకి నిర్దిష్టమైన సమయం అంటూ లేదు. కొందరు అయిదు నిమిషాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందితే, మరికొందరు గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ‘క్రియేటివ్ థెరపీ కలరింగ్ బుక్’ పేరుతో మైఖేల్ ఒ మార రాసిన పుస్తకం హాట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ‘‘రంగులు వేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం అనేది నిన్న మొన్నటి విషయం కాదు. చాలా ఏళ్ల క్రితమే ఇది ఉనికిలో ఉంది’’ అంటున్నారు కొందరు మానసిక నిపుణులు. ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడకూడదూ! -
కన్నవారికి దూరమై...ఉన్న వారికి భారమై..
అలజంగి (బొబ్బిలి రూరల్): బాల్యం ఎవరికైనా మధురమే. కానీ వీరికి జీవితమంతా బాల్యమే అయిపోతూ... బతుకులో తీపి చచ్చిపోయి, చేదు మిగిలింది. ఆ చిన్నారులందరికీ ఏదో ఒక వైకల్యం. అందరి తల్లిదండ్రులూ పిల్లలను వదిలి దూరంగా వెళ్లిపోయిన వారే. వివిధ సమస్యలతో బాధపడుతున్న వీరందరినీ వారి నాయనమ్మలు, అమ్మమ్మలు సంరక్షిస్తున్నారు. వీరికి సేవలు చేయలేక, కనీసం ఫిజియోథెరపీ చేయించడానికి లేదా సదరంలో పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మండలంలో అలజంగి గ్రామానికి చెందిన 11 ఏళ్ల రాంబార్కి మాధవి మానసిక స్థితి సరిగా లేదు. అమ్మానాన్న మాధవిని నానమ్మ చిన్నమ్మి దగ్గర వదిలేయడంతో ఆమే పెంచుతోంది. తల పెరుగుతూ వైద్యులకు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు చందక సాయి. తల్లిదండ్రులు భారమని విడిచివెళ్లడంతో సాయి నానమ్మ సూరమ్మ వద్దే ఉం టున్నాడు.పెద్దగా తెలివితేటలు లేకపోవడంతో పాఠశా ల చదువు అంతంతమాత్రం.రోడ్డుపై ఎవరు వెళ్లినా పల కరిస్తూ ఇంట్లోనే సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. తల చిన్నగా ఉన్న పైల ఈశ్వరమ్మ చిన్నప్పటి నుంచి ఈ సమస్యతో బాధపడుతోంది. తల్లిదండ్రులు వలస కూలీలుగా సుదూర ప్రాంతాలకు వెళ్లడంతో వృద్ధురాలైన నానమ్మ సీతమ్మ వద్ద పెరుగుతోంది. ఈ చిన్నారికి కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా తెలీదు. కాళ్లు సరిగా రాని సువ్వాడ మహేష్‌ది మరో కథ. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడంతో ఆపరేషన్ చేయించారు. కానీ ఆపరేషన్ ముందు కాసింతైనా నడవగలిగిన మహేష్ తర్వాత నడవడం లేదు. మానసిక స్థితి కూడా సరిగా లేని మహేష్‌ను నాయనమ్మ నారాయణమ్మ పెంచుతోంది. అలాగే రాపాక చంద్రశేఖర్, వెంపటాపు స్వాతి మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎమ్మార్టీలు ఉండడంతో వీరిని కొంతమేర పర్యవేక్షించి సాయం చేసేవారు. ప్రస్తుతం వీరిని చూడడానికి తల్లిదండ్రులు కూడా లేరు. వీరంతా ఆ వృద్ధులపైనే ఆధారపడి బతుకుతున్నారు. మనసున్న వారు వచ్చి సాయం చేస్తే తమ పిల్లలు మళ్లీ మామూలుగా బతుకుతారని ఆ వృద్ధులు ఆశపడుతున్నారు. అవగాహన లేమి అసలు శాపం అలజంగి: బొబ్బిలి మండలంలోని చిన్న గ్రామం. ఈ గ్రామంలో ఎక్కువగా మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు కనిపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం గ్రామస్తుల్లో అవగాహన లోపం. ఇక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు, మేనరిక వివాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. బాల్య, మేన రిక వివాహాల వల్ల వచ్చే దుష్పరిణామాలు తెలియక వీరు ఇలా అవస్థలు పడుతున్నారు. ఎక్కువ మంది కూలీలే కావడం వల్ల ఈ తరహా వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాని ఫలితాన్ని చిన్నారులు ఇలా అనుభవిస్తున్నారు. -
అమ్మ ఒడిలో...నాన్న వడిలో
-
10 కి.మీ. నడిచి బడికి వెళ్లేవాడిని
ప్రథమ పౌరుని చిన్ననాటి జ్ఞాపకాలు కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నా ప్రొటోకాల్ పక్కన పెట్టి మీడియాతో ప్రణబ్ ఇష్టాగోష్టి రాష్ట్రపతి విమానం నుంచి సాక్షి ప్రతినిధి ప్రవీణ్ లెంకల:78 ఏళ్ల వయసున్నా ఇంకా కుర్రాడి ఉత్సాహం. అంతే చురుకుదనం. అలుపు లేని ప్రయాణం. నిరంతర శ్రమ. ఎంత క్లిష్ట సమస్యనైనా నేర్పుగా పరిష్కరించగలిగే మేధ. ఈ లక్షణాలే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిని చేశాయి. ఆయనే మన ప్రథమ పౌరుడు ప్రణబ్‌ముఖర్జీ. సాధారణంగా మీడియాతో ముక్కుసూటిగా, పాయింట్ టు పాయింట్ మాట్లాడే ప్రణబ్.. ప్రొటోకాల్ కట్టుబాట్లను కాసేపు పక్కన పెట్టారు. తన సహజ ధోరణికి భిన్నంగా శుక్రవారం చెన్నై-తిరువనంతపురం-కొచ్చి పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో విమానంలో విలేకరులతో అరగంటసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలు విషయాలను స్పృశించినప్పుడు చిన్ననాటి సంగతుల ను గుర్తు తెచ్చుకున్నారు. ఆ విశేషాలు ఆయున వూటల్లోనే... పొలం గట్లే బడిబాటలు: చదువుకునే రోజుల్లో బడికి పది కిలోమీటర్ల దూరం నడిచే వెళ్లేవాళ్లం. రోడ్లు కూడా లేవు. పొలాల గట్ల వెంబడే నడిచేవాళ్లం. కాలేజీ చదువు కోసం సమీప పట్టణంలో డిగ్రీలో చేరా. అక్కడి హాస్టల్లో అప్పటికి విద్యుత్ సౌకర్యమే లేదు. కిరోసిన్ దీపాల సాయంతోనే చదువుకునేవాళ్లం. అయినా ఆ కష్టాలు నన్ను అడ్డుకోలేదు. స్కూల్లో టీచర్ మాలో స్ఫూర్తి నింపేవారు. ప్రేరణ ఇచ్చేవారు. టీచర్లు మలిచిన తీరుగానే విద్యార్థులు మారుతారు. అప్పుడు వాళ్లు చెప్పిన తులనాత్మక అధ్యయనం నాకు జీవితంలో ఎంతగానో పనికొచ్చింది. విభిన్న దేశాల చరిత్రను, రాజవంశాలను, సంస్కృతిని అర్థం చేసుకోగలిగాం. దేశ విదేశ రాజులు, వారి రాజ్యాలు, పాలన గురించి మొత్తం చెప్పగలిగేవాళ్లం. ప్రతిభే పలు దారులు చూపుతుంది: చాలా ఏళ్ల నాటి సంగతిది. అవిభాజ్య బీహార్‌లోని ఒక నిరుపేద పిల్లాడు పాట్నా సైన్స్ కాలేజీలో స్కాలర్‌షిప్‌పై ఇంటర్ ఫస్టియర్‌లో చేరాడు. లెక్కల మాస్టారు పాఠం చెబుతుంటే ఈ పిల్లాడు పదేపదే లేవబోతూ, కూర్చుంటూ అసౌకర్యంగా కదులుతున్నాడు. సరిగ్గా పాఠం వినట్లేదనుకున్న మాస్టారు ఏమిటంటూ గద్దించారు. దాంతో ఆ విద్యార్థి లేచి, ‘మీరు చేస్తున్న పద్ధతిలో ఆ లెక్కకు ఎన్నటికీ జవాబు దొరకదు సర్. ఆ పద్ధతి తప్పు’ అంటూ జవాబిచ్చాడు. దాంతో అవాక్కయిన టీచర్ ఆ కుర్రాడిని వచ్చి బోర్డుపై ఆ లెక్కకు పరిష్కారం చూపమన్నాడు. కుర్రాడు ఆ ఒక్క లెక్కకు 18 రకాల పరిష్కారాలు చూపడంతో అబ్బురపడిపోయూడు. ఆ ఏడాది వరల్డ్ మ్యాథమెటిక్స్ కాన్ఫరెన్స్ ఆ కాలేజీలోనే జరగబోతోంది. అమెరికా వంటి దేశాల నుంచి గొప్ప ప్రొఫెసర్లు రాబోతున్నారు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర గొప్ప గణిత అధ్యాపకుడు . కుర్రాడికి ఆ సదస్సులో మాట్లాడే అవకాశం కల్పించాలని డాక్టర్ కెల్లీ అనే అమెరికా స్కాలర్‌ను కోరారు. ఆయనేమో తమ వర్సిటీలో నేరుగా ఒక రీసెర్చ్ స్కాలర్గానో, ప్రొఫెసర్‌గానో చేర్చుకుంటామన్నారు. కానీ ఆ కుర్రాడు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అని చెబితే అబ్బురపడ్డారు. వెంటనే తమ వర్సిటీ నిబంధనలను కూడా మార్చేసి మరీ వెంటవెంటే అన్ని పరీక్షలకూ హాజరయ్యేలా అతనికి అవకాశం కల్పించారు. ఆ విద్యార్థే గణిత శాస్త్ర ప్రముఖుడు వశిష్ట నారాయణ్ సింగ్. ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడైన అతని ప్రతిభను గుర్తించింది, ప్రేరణ కలిగేలా అవకాశాలు కల్పించింది ఓ మాస్టారే. అలాంటి అధ్యాపకులు అద్భుతాలు సృష్టించగలరు. నాడు టీచర్ల జీతం రూ. 60: మేం చదువుకునే రోజుల్లో కళాశాల అధ్యాపకులకు రూ.60 జీతం వచ్చేది. 1955లో యూజీసీ వచ్చేదాకా ఉపాధ్యాయులకు సరైన వేతనాలుండేవి కావు. కానీ వారి సేవలు అద్భుతంగా ఉండేవి. అధ్యాపకులు ప్రేరణ కలిగించినప్పుడు, స్ఫూర్తినిచ్చినప్పుడు దేశంలోని ప్రతిభ బయట పడుతుంది. ఒకప్పుడు మన దేశ వర్సిటీలకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకునే వారు. ఆ రోజులు మళ్లీ రావాలంటే అలాంటి టీచర్లను మనం గుర్తించగలగాలి. వెలుగులోకి తీసుకురాగలగాలి.. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పని చేసే అధ్యాపకులు పరిశోధనల్లో తాము భాగమై, విద్యార్థులనూ భాగస్వాములను చేయాలి. శక్తినిచ్చేది గమ్యమే: మన గమ్యమే మనకు శక్తినిస్తుంది. ఎలా ఉండాలనుకుంటున్నామన్న దాన్ని బట్టే మన ప్రయాణం ఉంటుంది. నిరంతరం శ్రమించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఇలాంటి ప్రయాణంలో అలుపుండదు. గమ్యం తెలియనప్పుడే అలుపొస్తుంది. శక్తిపుట్టదు. ముందుకూ సాగలేం. ‘నీలం’ శతజయంత్యుత్సవాలకు ప్రణబ్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23న అనంతపురంలో జరిగే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలసి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించగా.. ఆయన అంగీకరించారని రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి శనివారం వెల్లడించారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 12 వేల మందితో సంజీవరెడ్డి స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్, ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారన్నారు. 29న మూడు జిల్లాల్లో రాష్ర్టపతి పర్యటన రాష్ట్రపతి 29న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిలా ్లల్లో పర్యటించనున్నారు. 29న ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఐ భీమవరం చేరుకుంటారు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వేద పాఠశాల, కల్యాణమండపం, షిరిడీ సాయి మందిరాలను ప్రారంభిస్తారు. తర్వాత కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి చేరుకుంటారు. తిరుచానూరు వద్ద భక్తుల కోసం నిర్మించనున్న వసతి గృహ సముదాయానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.