ఆదిత్య లాంటి సినిమాలు అరుదు | adithya movie | Sakshi
Sakshi News home page

ఆదిత్య లాంటి సినిమాలు అరుదు

Nov 13 2015 11:08 PM | Updated on Sep 3 2017 12:26 PM

ఆదిత్య లాంటి సినిమాలు అరుదు

ఆదిత్య లాంటి సినిమాలు అరుదు

బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’.

బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ‘‘అబ్దుల్ కలాం స్ఫూర్తితో బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలనీ, దేశాభివృద్ధికి వివిధ రంగాల పరిశోధనల్లో కూడా రాణించాలని చెప్పే చిత్రం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆదిత్యలాంటి ప్రతిభ గల విద్యార్థులు ఉంటారని ఈ చిత్రంలో చూపించాం.

ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపునిచ్చాయి. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఐఏయస్ ఆఫీసర్లు మంచి కథాంశం అని అభినందించారు. ఆదిత్య లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement