Aditya
-
ఈనాడు ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: అందరికీ నిత్యం ఉదయాన్నే నీతులు చెప్పే ఈనాడు (ఉషోదయ ఎంటర్ప్రైజెస్) దౌర్జన్యం కొనసాగుతోంది. తమ పత్రిక ద్వారా జనాలకు నీతులు మాత్రమే చెబుతామని, వాటిని తాము మాత్రం ఆచరించమని ఈనాడు మరోమారు నిరూపించింది. గతంలో విశాఖపట్నం ఈనాడు కార్యాలయం స్థలం విషయంలో దాని యజమాని ఆదిత్య వర్మను ముప్పుతిప్పలు పెట్టిన ఈనాడు యాజమాన్యం, ఇప్పుడు విజయవాడలో ఉన్న కార్యాలయ స్థలం విషయంలో కూడా దాని యజమాని ముసునూరు అప్పారావును సైతం అలాగే ముప్పుతిప్పలు పెడుతోంది. ఈనాడు పత్రిక కోసం తీసుకున్న స్థలం లీజు గడువు ముగిసినా.. దాన్ని అప్పారావుకు అప్పగించకుండా చుక్కలు చూపిస్తోంది. చివరకు అప్పారావు కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అక్కడ కూడా అప్పారావుకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేసింది. కోర్టుకెళ్లి అప్పారావు విజయం సాధించినా.. న్యాయస్థానం ఆదేశాలను సైతం ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో కోర్టు ఈనాడు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. స్థల యజమానిని వేధించడానికే ఆ స్థలాన్ని ఖాళీ చేయడం లేదని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా.. బాధితుడు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఈనాడు యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనాడు ఆస్తుల జప్తునకు న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు ఆస్తులను బదలాయించడం, తాకట్టు పెట్టడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం చేయరాదని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ ఆస్తులను ఎవరూ కొనడం, బహుమతిగా తీసుకోవడం చేయరాదంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈనాడు సీఎండీ కిరణ్‌ను ఆదేశించింది. అసలు కథ ఏమిటంటే.. ఈనాడు యజమాని రామోజీరావు 1975లో విజయవాడ పటమటలంకలో ముసునూరి అప్పారావుకు చెందిన 92 సెంట్ల స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.725 అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పక్కనే అప్పారావు సమీప బంధువైన వల్లూరు వెంకటేశ్వరరావుకు చెందిన ఎకరా 47 సెంట్ల భూమిని కూడా రామోజీరావు లీజుకు తీసుకున్నారు. లీజు గడువు 30.04.2008న ముగిసింది. దీంతో మరో 33 ఏళ్ల పాటు లీజు పొడిగించాలని స్థల యజమాని అప్పారావును రామోజీరావు కోరారు. రామోజీ సంగతి బాగా తెలిసిన అప్పారావు లీజు పొడిగింపునకు నిరాకరించారు. 6 నెలల్లో స్థలాన్ని ఖాళీ చేసి ఇవ్వాలని రామోజీరావుకు తేల్చిచెప్పారు. 6 నెలల గడువు 2008 అక్టోబర్‌తో ముగిసింది. అయినా రామోజీరావు ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. ఇదే సమయంలో మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగించేలా అప్పారావును ఆదేశించాలంటూ విజయవాడ జిల్లా కోర్టులో రామోజీరావు సూట్ దాఖలు చేశారు. దానిని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 2013లో కొట్టేసింది. అప్పారావుకు చెందిన స్థలంపై ఈనాడుకు ఎలాంటి హక్కు లేదని తేల్చిoది. అంతేకాక ఈనాడు ఆ స్థలంలో ఉండటం అక్రమమేనని స్పష్టం చేసింది. దీనిపై ఈనాడు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను సైతం కోర్టు కొట్టేసింది. సీనియర్ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని స్పష్టం చేసింది. అప్పారావును వేధించడానికి ఈ అప్పీల్‌ను ఆయుధంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని జిల్లా కోర్టు 2017లో తీర్పునిచ్చింది. పరిహారంగా రూ.5.20 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించినా..2015లో ముసునూరి అప్పారావు తన స్థలం నుంచి ఈనాడును ఖాళీ చేయించాలని కోరుతూ విజయవాడ కోర్టులో సూట్ దా3ఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అప్పారావుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాదాపు 60 పేజీల తీర్పు వెలువరించింది. 2012–15 వరకు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6శాతం వార్షిక వడ్డీతో పరిహారంగా చెల్లించాలని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. మిగిలిన కాలానికి పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటును అప్పారావుకు ఇస్తూ 2024 అక్టోబర్ 3న తీర్పునిచ్చింది. అయితే.. ఈ తీర్పును ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో తీర్పు అమలుకు అప్పారావు కింది కోర్టులో ఈపీ దాఖలు చేశారు. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని జప్తు చేయాలని అందులో కోరారు. దానిపై విచారణ జరిపిన కోర్టు తాము ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.5.20 కోట్ల పరిహారం చెల్లించడంలో ఈనాడు విఫలమైందని తేల్చింది. ఇందుకు గాను ఈనాడు ఆస్తుల జప్తునకు ఆదేశిస్తున్నట్టు ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఎండీ కిరణ్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఆదిత్య వర్మను వేధించిన ఈనాడు రామోజీరావు ఈనాడు పత్రిక కోసం విశాఖపట్నం సీతమ్మధారలో మంతెన ఆదిత్య వర్మకు చెందిన 2.7 ఎకరాల భూమిని 1974లో 33 ఏళ్ల గడువుతో లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.2,500 అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే వర్మ నుంచి లీజుకు తీసుకున్న భూమిని రామోజీరావు సొంత భూమిగా చూపుకుని ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. రామోజీరావు లీజుకు తీసుకున్న 2.7 ఎకరాల భూమిలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు నిమిత్తం 618 గజాల భూమిని తీసుకుంది. ఇందుకు గాను సీతమ్మధారలో 872 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి ఈ స్థలం ఆదిత్య వర్మకు చెందాలి. కానీ.. రామోజీరావు మోసపూరితంగా ఆ భూమిని తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించారు. ఇందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆదిత్యవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామోజీ పలుకుబడి ముందు పోలీసులు ఏం చేయలేకపోయారు. దీంతో వర్మ న్యాయపోరాటం చేపట్టారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగగా.. ఆ భూమికి సంబంధించి 2007లో 33 ఏళ్ల లీజు ముగిసింది. అయినా రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. లీజును మరో 33 ఏళ్ల పాటు పొడిగించాలని కోరారు. రామోజీ దుర్బుద్ధి తెలిసిన వర్మ అందుకు అంగీకరించలేదు. దీంతో తనది కాని స్థలం విషయంలో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. వర్మ కూడా రామోజీరావును దీటుగా ఎదుర్కొన్నారు. చివరకు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఎక్కడా పప్పులు ఉడకకపోవడంతో రామోజీరావు చివరకు వర్మ స్థలాన్ని ఖాళీ చేశారు. వర్మకు చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా పూర్తిగా చెల్లించకుండా కొంత చెల్లించి రామోజీ రాజీ చేసుకున్నారు. -
నవ్విస్తూనే ఆలోచింపజేసే చిత్రం ‘తకిట తదిమి తందాన’
"మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - అచ్చ తెలుగమ్మాయి ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘తకిట తదిమి తందాన’(Thakita Thadhimi Tandana). రాజ్ లొహిత్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మించాడు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆదిత్య (ఘన ఆదిత్య) నకిలీ సర్టిఫికెట్స్‌తో ఓ పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. సాలరీ అంతా జల్సాల కోసం ఖర్చు చేస్తాడు. ఇక పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవుదామనుకునే సమయంలో ఉద్యోగం ఊడిపోతుంది. దీంతో క్రెడిట్ కార్డులను వాడేసి పెళ్లి చేసుకుంటాడు. ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానని అబద్దం చెప్తాడు. చాన్నాళ్ళపాటు ఉద్యోగం రాక ఫ్రెండ్స్ రూమ్ లో కూర్చుని ఉద్యోగం కోసం వెతుకుతాడు. అదే సమయంలో లోన్ యాప్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి. ఒకవైపు ఉద్యోగం లేదు..మరోవైపు అప్పు కట్టమని బెదిరింపులు.. మరి ఆదిత్య ఏం చేశాడు? తన తప్పుడు నిర్ణయాలు తన జీవితాన్ని ఎలా మార్చాయి? అనేదే ఈ సినిమా కథ. జల్సాల కోసం అప్పులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియజేసే చిత్రమే తకిట తధిమి తందాన. ఓవర్ కాన్ఫిడెన్స్, ఫాల్స్ ప్రెస్టేజ్ తో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకునే కుర్రాడి కథ.ఎప్పటికీ ఇలాగే పెద్ద మొత్తంలో నెలనెలా జీతం అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుందనే భ్రమలో, కలల్లో విహరించే కుర్రాళ్లకు కొంతలోకొంత కనువిప్పు కలిగేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.స్వయంగా కథ - సంభాషణలు సమకూర్చుకున్న రాజ్ లోహిత్... రచయితగా మంచి మార్కులు స్కోర్ చేసినా... దర్శకుడిగా కొంచెం తడబడ్డాడనిపిస్తుంది. అయితే చిన్న చిత్రాలకుండే బడ్జెట్ పరిమితులు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ గురించి కూడా ఆలోచించినప్పుడు.. దర్శకుడిగానూ అతన్ని మెచ్చుకోవచ్చు. ముఖ్యగా... హీరో ఏ ఫాల్స్ ప్రెస్టేజ్ తో అప్పులు పాలయ్యాడో... ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి, వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, తాత్కాలిక ఉపశమనం కోసం "స్విగ్గి బాయ్" అవతారం ఎత్తడం వంటి సీన్స్ దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి.రామ్ గోపాల్ వర్మ "మర్డర్"తోపాటు... "సమ్మేళనం" అనే వెబ్ సిరీస్ లో నటించిన గణాదిత్య నేటి యువతరానికి ప్రతినిధిలా తన పాత్రలో ఒదిగిపోయాడు. తనను తాను ఇంకొంచెం సానబెట్టుకుంటే ఈ కుర్రాడికి హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి "ప్రియ కొమ్మినేని"కి కూడా. పరభాషా హీరోయిన్లను చూసి చూసి విసిగిపోతున్న ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. హావభావాలపై మరి కాస్త దృష్టి పెడితే, ఈ అచ్చ తెలుగమ్మాయికి కూడా ప్రేక్షకులు కచ్చితంగా పట్టం కడతారు. గంగవ్వ కనిపించేది కాసేపే అయినా... కథకు/సినిమాకు చాలా హెల్పయ్యే పాత్ర. హీరోయిన్ తండ్రి పాత్రధారి సతీష్ సారిపల్లి కూడా మంచి మార్కులే స్కోర్ చేస్తాడు. యూత్ ఫుల్ చిత్రం అనగానే.. అనవసరమైన అసభ్యతను చొప్పించే నేటి కాలంలో... హీరోహీరోయిన్ల నడుమ వచ్చే రొమాంటిక్ సీన్స్.. శృతి మించకుండా, పొయిటిక్ గా తెరకెక్కించడం యూత్ కూడా ఇష్టపడేలా ఉన్నాయి. -
జల్సాల కోసం అప్పులు చేస్తే..‘తకిట తధిమి తందాన’
"మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - అచ్చ తెలుగమ్మాయి ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘తకిట తదిమి తందాన’(Thakita Thadhimi Tandana). రాజ్ లొహిత్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ నెల 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈసందర్భంగా నిర్మాత చందన్ కుమార్ కొప్పుల మాట్లాడుతూ... "నేను స్వతహా సినిమా పిచ్చోడ్ని. ఇంచుమించుగా అన్ని సినిమాలు చూస్తుంటాను. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ టైమ్ లో నేను చూసిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ నన్ను విపరీతంగా ఇంప్రెస్ చేశాయి. అలాంటి చెరగని ముద్ర వేసే సినిమా చేయాలనే సంకల్పంతో నిర్మాతగా మారాను. ఆ క్రమంలో రాజ్ లోహిత్ పరిచయం కావడం, తను చెప్పిన కథతో నేను కనెక్ట్ కావడంతో రంగంలోకి దిగాను. ఫస్ట్ కట్ చూసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది" అన్నారు. "తకిట తధిమి తందాన" రాజ్ లోహిత్ ప్రతిభకు అద్దం పడుతుందని, జల్సాల కోసం అప్పులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వినోదాత్మకంగా చెప్పామని" చందన్ తెలిపారు.ఇంకా ఆయన మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తాను విజయవంతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండడంతో తన కుటుంబ సభ్యుల మోరల్ సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. "తకిట తధిమి తందాన" చిత్రాన్ని విడుదల చేయడంలో సినేటేరియా వెంకట్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పిన ఈ నూతన నిర్మాత... హరి శంకర్ ఎడిటింగ్, నరేన్ రెడ్డి మ్యూజిక్, రాజ్ లోహిత్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలని పేర్కొన్నారు. హీరో ఘన ఆదిత్య, తెలుగమ్మాయి ప్రియలకు ఉజ్వల భవిష్యత్ ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
అలాంటి మాంసం కూడా తిన్నా.. రుచికరంగా..: టాలీవుడ్ విలన్
ఒకప్పుడు విలన్లను చూస్తేనే భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్లు కూడా మంచి ఎత్తూపొడుగూ ఉంటున్నారు. హీరోలతో పోటీపడేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఫిట్నెస్తో అబ్బురపరుస్తున్నారు. ఈ జాబితాలో నటుడు ఆదిత్య మీనన్ (Adithya Menon) ఉన్నాడు. మిర్చి, బిల్లా, పుష్ప.. ఇలా ఎన్నో సినిమాల్లో విలనిజం పండించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.హీరోగా ఛాన్సులు..ఆదిత్య మాట్లాడుతూ.. హీరోలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే హీరోగా అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాను. వివిధ రకాల పాత్రలు చేయడం ఇష్టం. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. కెరీర్ ప్రారంభంలో వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ పోయాను. తర్వాత నాకు ఏవి సెట్టవుతాయి? ఏవి సెట్టవవు? అని ఆలోచించి సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నాను.(చదవండి: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్ విజేత)చిత్రవిచిత్ర దేశాలకు వెళ్తుంటా.. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దేశవిదేశాలు తిరుగుతూ ఉంటాను. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా భిన్నమైన ప్లేసెస్‌కు వెళ్తుంటాను. అక్కడి ప్రజల గురించి, అలవాట్ల గురించి తెలుసుకుంటాను. వారి వంటకాలు ట్రై చేస్తాను. అక్కడ గుర్రపు మాంసం తిన్నాను. ఇదే కాదు పాము మాంసం, కప్ప కాళ్లు, మొసలి మాంసం తిన్నాను. పాము తోలు తీసి, ముక్కలు చేసి వండిస్తారు, బాగుంటుంది. నేను నాస్తికుడిని, భగవంతుడు ఉన్నాడని నమ్మను అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య మీనన్.. తెలుగులో బిల్లా, సింహా, అధినాయకుడు, కృష్ణం వందే జగద్గురుం, ఈగ, బాద్షా, బలుపు, మిర్చి, పవర్, లయన్, పండగ చేస్కో, రుద్రమదేవి, అమర్ అక్బర్ ఆంటోని, కార్తికేయ 2, పుష్ప 2.. ఇలా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈయన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేశాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు, నటులు మోహన్‌బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ తదితరుల వద్ద వందకుపైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా చేసిన ధర్మ ‘సంహారం’ చిత్రంతో డైరెక్టర్‌గా మారారు. ఆదిత్య, కవిత జంటగా ధర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సంహారం’ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో ధర్మ మాట్లాదుతూ– ‘‘తనకు, తన అక్కకు అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో ఓ అమ్మాయి దుష్టులను ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ సినిమా తీశాం. మహిళలు తమని తాము కాపాడుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఆవశ్యకమని ఈ చిత్రంలో చూపించాం’’ అని చెప్పారు. -
ఐదు వేల మందికి సాయం చేసిన సినీ నిర్మాత
సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. కానీ ఆదిత్య గ్రూప్ ఛైర్మన్ ఆదిత్యరామ్ పేదలతో పండుగ జరుపుకున్నారు. చెన్నై ECR వద్ద ఉన్న తన ఆదిత్యరామ్ ప్యాలెస్ వద్దకు పణైయూర్, అక్కరై, ఉతండి, ఇంజంబాకం, శోలింగనల్లూరు వంటి ప్రాంతాల్లోని సుమారు ఐదువేల మంది పేద ప్రజలు, అనాథ వృద్ధులు అక్కడికి చేరుకున్నారు. వారందరితో కలిసి ఆయన సంక్రాంతి జరుపుకున్నారు.కులమత భేదాలు లేకుండా వారికి నాణ్యమైన బియ్యంతో పాటు పండుగ సందర్భంగా చేసుకునే వంటలకు అవసరమైన వస్తువులను వారందరికీ పంపిణీ చేసి, వారు పండుగను ఆనందంగా జరుపుకునేలా శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్యరామ్ అందించిన పండుగ కానుకలను స్వీకరించిన ప్రజలు, 'ప్రతి పండుగలో మాకు ఆదిత్యరామ్ అందించే ఈ సహాయం మా జీవితాలకు ఎంతో ముఖ్యమైనది. ఇది మాకు ఆర్థికంగా చాలా తోడ్పాటుగా ఉంది' అని సంతోషంతో తెలియజేశారు. వారు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.ఆదిత్యరామ్ కూడా తన జీవన ప్రయాణం గురించి ఇలా పంచుకున్నారు. 'నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, పలు కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ అనుభవం కారణంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని గాఢమైన సంకల్పం కలిగింది. నా శక్తి మేరకు చివరి వరకు సహాయం చేయడం కొనసాగిస్తాను.' అని తెలిపారు. ఆదిత్యరామ్ కోలీవుడ్‌లో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఆయన రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by ADITYARAM P (@adityaram_chairman) View this post on Instagram A post shared by Tag Telugu (@tag.telugu) -
దేశభక్తి నేపథ్యంలో ‘అభినవ్’
‘ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలు తీసిన దర్శక–నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన మరో బాలల చిత్రం ‘అభినవ్’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్ , గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించాను. దురదృష్టవశాత్తూ పిల్లలు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఎన్సీసీ, స్కౌట్స్, యోగా, ధ్యానం నేర్చుకోవడం ద్వారా పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు’’ అన్నారు. -
Aditya Dadia: అతను.. అక్షరాలా ఆల్రైట్!
బీమా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త డిజిటల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు ఆదిత్య దాదియ. ముంబైకి చెందిన ఆదిత్య స్టార్టప్ ‘ఆల్ రైట్’ సూపర్ సక్సెస్ అయింది. ఎన్నో చిక్కుముడులకు పరిష్కార మార్గం చూపించింది. ‘ఆల్రైట్’ సృష్టించిన సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్ కంపెనీల పనితీరును సులభతరం చేస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది.వాణిజ్య బీమా విభాగం పాత దారిలోనే నడుస్తోంది. ఇంటర్నల్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఇప్పటికీ మాన్యువల్‌గానే ఉంది. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలను కొత్త దారిలో నడిపించడానికి ముందుకు వచ్చింది నెక్స్›్ట–జెనరేషన్ టెక్ ΄్లాట్‌ఫామ్ ఆల్రైట్. కోవిడ్ మహమ్మారి కాలంలో ‘ఆల్రైట్’పై దృష్టి పెట్టాడు కార్పొరేట్ లాయర్ అయిన ఆదిత్య దాదియ.ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఫిన్‌టెక్ స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన ఆదిత్య ఆ టైమ్‌లో గమనించిన విషయం ఏమిటంటే.... కమర్షియల్ ఇన్సూరెన్స్ స్పేస్‌లో పని పూర్తిగా మాన్యువల్‌గానే జరుగుతుందని. ఈ నేపథ్యంలోనే ‘ఆల్రైట్’పై దృష్టి పెట్టాడు. అయితే ఇది అంత తేలికైన విషయం కాదనేది ఆదిత్యకు తెలుసు. రకరకాల ప్రయత్నాల తరువాత విజయం సాధించాడు. బీమా కంపెనీల పనిని సులభతరం చేసే సాఫ్ట్‌వేర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రూపొందించాడు."సమయాన్ని ఆదా చేయగలిగే సాఫ్ట్వేర్ ఇది. ఉదాహరణకు..రెండు వారాలు పట్టే పనిని నిమిషాల్లో చేయవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌కు తక్కువ కాలంలోనే మార్కెట్ నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇన్నోవేటివ్ స్టార్టప్‌గా గుర్తింపు పొందిన ‘ఆల్రైట్’ గత సంవత్సరం సీడ్ ఫండింగ్ రౌండ్లో విజయవంతంగా పది కోట్లు సమీకరించింది". జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు ఏజెంట్లు, ఇన్సూరెన్స్ బ్రోకర్స్, కార్పొరేట్ ఏజెంట్స్ తమ ‘టార్గెట్ కన్జ్యూమర్స్’ అంటున్నాడు ఆదిత్య.బీమా కంపెనీలు, బ్రోకర్లు, ఏజెంట్లు, కార్పొరెట్ ఇంటర్మీడియరీస్, బ్యాంకుల మధ్య అంతరాన్ని తగ్గించే సొల్యూషన్స్ అందించాలని ‘ఆల్రైట్’ లక్ష్యంగా పెట్టుకుంది. కోట్ ప్రొక్యూర్మెంట్, ప్లేస్మెంట్, అండర్ రైటింగ్, యూజర్ మేనేజ్మెంట్, నాలెడ్జ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్....స్థూలంగా చె΄్పాలంటే బీమా ప్రక్రియను సులభతరం చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఆల్రైట్.‘ఫోర్స్బ్ 30 అండర్ 30–ఆసియా’ జాబితాలో చోటు సంపాదించిన ఆదిత్య తన కంపెనీ మరింత విస్తరించే ప్రణాళికలతో బిజీగా ఉన్నాడు. ‘ఇది ఇలాగే ఉంటుంది. అంతే’ అనుకునేవారు కొందరు. ‘అలాగే ఎందుకు ఉండాలి? మరోలా కూడా ఉండవచ్చు కదా’ అని అడిగే వాళ్లు కొందరు. ఆదిత్య రెండో కోవకు చెందిన యువకుడు. కొత్తగా ఆలోచిస్తే విజయం ఖాయం అని అక్షరాలా ‘ఆల్రైట్’తో నిరూపించిన యువకుడు. -
మనమే నా గ్రాఫ్ పెంచుతుంది: దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య
‘‘ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మన కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంటుంది. నా గత చిత్రం ‘హీరో’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కొంత కరోనా ప్రభావం కూడా ఉంది. ఇప్పుడు ‘మనమే’ సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నాను. నా కెరీర్ గ్రాఫ్ మళ్లీ పెరుగుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ – ‘‘పేరెంటింగ్ ఎమోషన్స్ గురించి కొంచెం వినూత్నంగా చెప్పాలన్న ఉద్దేశం నాకు ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే ఈ ఎమోషన్స్‌కు ఫన్ జోడించి, ఫుల్ ఎనర్జీతో చెప్పాలనుకున్నాను. అదే ‘మనమే’ కథ. ఈ సినిమాలో శర్వానంద్–కృతీ శెట్టిల క్యారెక్టర్స్ టామ్ అండ్ జెర్రీలా ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మనమే’ నా ఫేవరెట్.ఈ సినిమాలో నా కొడుకు చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడని నేను ఇలా చెప్పడం లేదు. అందమైన భావోద్వేగాలు ఉన్న మంచి సినిమా ఇది. ఈ సినిమాలో శివ కందుకూరి పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటల వరకూ ఉన్నాయి. ఇవి సినిమా ఫ్లోకు ప్లస్గానే ఉంటాయి కానీ అడ్డుగా అనిపించవు. హేషమ్ మంచి సంగీతం అందించారు’’ అని చెప్పుకొచ్చారు. -
Aditya Srivastava: యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. 'ఆదిత్య శ్రీవాస్తవ'?
యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. ఆదిత్య శ్రీవాస్తవ. యూపీఎస్సీ పరీక్షలో టాప్ 1లో నిలిచిన ఆదిత్యకు తొలి ప్రయత్నంలో ‘ఫెయిల్యూర్’ ఎదురైంది. మరింత కష్టపడి రెండో ప్రయత్నంలో 236 ర్యాంకు సాధించాడు. ‘ఇది చాలదు’ అనుకొని తప్పులను సరిద్దుకొని మరో ప్రయత్నంలో నెంబర్ వన్‌గా నిలిచాడు లక్నోకు చెంది ఆదిత్య. ‘కష్టపడడం అవసరమేగానీ ఒక పద్ధతి ప్రకారం పడాలి’ అని స్మార్ట్ స్ట్రాటజీతో అపూర్వ విజయం సాధించాడు ఆదిత్య శ్రీవాస్తవ.. ప్రపంచంలోని లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలో ఒకటైన ‘గోల్డ్‌మాన్ శాక్స్’తో ప్రొఫెషనల్ జర్నీ ప్రారంభించాడు ఆదిత్య. ‘బెంగళూరులో పెద్ద బ్యాంకులో పని చేస్తాడు’ అని చుట్టాలు, మిత్రుల తన గురించి కొత్త వారికి పరిచయం చేసేవారు. తన గురించి గొప్పగా పరిచయం చేస్తున్న సంతోషంలో ఉండి, అక్కడికే పరిమితమై ఉంటే ఆదిత్య సివిల్ సర్వీసెస్‌లోకి అడుగు పెట్టేవాడు కాదేమో. పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా సరే ఆదిత్య హృదయంలో సివిల్ సర్వీసులలోకి వెళ్లాలి అనే కోరిక బలంగా ఉండేది. సివిల్స్ విజేతల మాటలు తనకు ఇన్స్పైరింగ్గా అనిపించేవి. ఒక ప్రయత్నం చేసి చూడాలనిపించేది. పదిహేను నెలల తరువాత.. ఉద్యోగాన్ని, బెంగళూరును వదిలి హోమ్ టౌన్ లక్నోకు వచ్చాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడంప్రారంభించాడు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని కొద్దిమంది అన్నా ఆ మాటను పట్టించుకోలేదు. 2021.. పరీక్ష సమయం రానే వచ్చింది. అయితే ప్రిలిమినరీ స్టేజిలోనే ఫెయిల్యూర్ పలకరించింది. మామూలుగానైతే రథాన్ని వెనక్కి మళ్లించి వేరే కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అయితే ఆదిత్య నిరాశపడలేదు. వెనకడుగు వేయలేదు. ఎలాగైనా సరే తన కలను నిజం చేసుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు. గత సంవత్సర ప్రశ్నపత్రాల ఆధారంగా ఇన్–డెప్త్ ఎనాలసిస్‌తో ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకున్నాడు. ప్రశ్నల సరళి, సెంటెన్స్ ఫార్మేషన్‌పై దృష్టి పెట్టాడు. మాక్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు. స్ట్రాటజిక్ ప్రిపరేషన్కుప్రాధాన్యత ఇచ్చాడు. 2022 యూపీఎస్సీ ఎగ్జామ్‌లో 236 ర్యాంకు సాధించాడు. ఇండియన్ పోలిస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికయ్యాడు. ట్రైనింగ్‌కు కూడా వెళ్లాడు. అయినా సరే, ఇంకా ఏదో సాధించాలనే తపన. టాపర్లతో పోల్చితే తాను ఎందుకు వెనకబడిపోయాననే కోణంలో లోతైన విశ్లేషణప్రారంభించాడు. చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిద్దుకోవాలి అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. యూపీఎస్సీ తాజా ఫలితాల్లో అపూర్వమైన విజయాన్ని సాధించాడు. నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. రిజల్ట్ ప్రకటించడానికి ముందు మనసులో.. ‘టాప్ 70లో ఉండాలి’ అనుకున్నాడు ఆదిత్య. అయితే ఏకంగా మొదటి ర్యాంకు దక్కింది. అది అదృష్టం కాదు. కష్టానికి దొరికిన అసలు సిసలు ఫలితం. ‘సివిల్స్‌లో విజయం సాధించడానికి సెల్ఫ్–మోటివేషన్ అనేది ముఖ్యం’ అంటాడు ఆదిత్య శ్రీవాస్తవ. పక్కా ప్రణాళిక.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవకు పరీక్షలలో బోలెడు మార్కులు సొంతం చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐఐటీ, కాన్పూర్‌లో బీటెక్, ఎంటెక్ చేశాడు. బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఐఐటీలో డెవలప్ చేసుకున్న ఎనాలటికల్ స్కిల్స్ యూపీఎస్సీ ప్రిపేరేషన్‌కు ఉపయోగపడ్డాయి. ‘కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్’లాంటి వాటితో ప్రిపరేషన్ మెథడ్‌ను రూపొందించుకున్నాడు. ‘కష్టానికి పక్కా ప్రణాళిక తోడైతేనే విజయం సాధ్యం’ అనేది ఆదిత్య నమ్మే సిద్ధాంతం. పాఠ్యపుస్తకాలకు ఆవల ఆదిత్యకు నచ్చిన సబ్జెక్ట్...రాక్షస బల్లులు. వాటికి సంబంధించిన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆదిత్య శ్రీవాస్తవ నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మన దేశంలోనే ఉంటాను. దేశం కోసమే పనిచేస్తాను’ ఇవి చదవండి: యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్! -
సివిల్స్ టాపర్ ఆదిత్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ –2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. అఖిలభారత స్థాయిలో తొలి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంకును అనిమేశ్ ప్రధాన్ సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు దక్కించుకోవడం విశేషం. నాలుగు ర్యాంకు పి.కె.సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు, ఐదో ర్యాంకు రుహానీకి లభించింది. అఖిలభారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్–5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో 30 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్–2023కి 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 14,624 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 2,855 మంది పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 115 మంది, ఓబీసీలు 303 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 86 మంది ఉన్నారు. సివిల్స్–2023 ఫలితాల పూర్తి వివరాలను http:// www.upsc. gov. in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి, కేంద్ర సర్వీసులకు ఎంపికైన విజేతలకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి అంకితభావం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని పేర్కొన్నారు. విజేత కృషి, ప్రతిభ దేశ భవిష్యత్తుకు తోడ్పడుతుందని వివరించారు. మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్ ►సివిల్స్ తొలి ర్యాంకర్ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్ లో తన ఆప్షనల్‌గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్) పూర్తిచేశారు. ►రెండో ర్యాంకర్ అనిమేశ్ ప్రధాన్ ఐఐటీ–రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ అభ్యసించారు. సివిల్స్ మెయిన్స్ లో ఆప్షనల్‌గా సోషియాలజీని ఎంచుకున్నారు. ►తెలుగు యువతి, సివిల్స్ మూడో ర్యాంకర్ దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(ఆనర్స్) జాగ్రఫీ చదివారు. సివిల్స్ మెయిన్స్ లో ఆమె ఆప్షనల్ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ. -
సినిమా రంగంలోకి ఆదిత్య పాపగారి
తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కంటెంట్‌నే నమ్ముకొని వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తూ హిట్ కొడుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాపార వేత్తల కన్ను టాలీవుడ్‌పై పడింది. ఇతర రంగాలలో రాణిస్తున్నవారు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలతో తక్కువ బడ్జెట్లో సినిమాను నిర్మించి విజయం సాధిస్తున్నారు. తాజాగాప్రముఖ రియల్టర్ ఆదిత్య పాపగారి కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో రాణించాలని, మంచి సినిమాలు అందించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. షేక్ స్పియర్ డ్రీమ్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ తో, ప్రముఖ దర్శకుడు, నిర్మాత స్వప్నేష్ చింతల తో కలిసి సంయుక్తంగా చిత్రాలు నిర్మించబోతున్నారు. మంచి సినిమాలతో పాటు కొత్తవాళ్లను, ఔత్సాహిక నటీనటులను, రచయితలను, దర్శకులను ప్రొత్సహించాలనేది తన మోటో అని ఆదిత్య పాపగారి అన్నారు. -
సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ‘పాపా’
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలోని ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య(పాపా) పేలోడ్ విజయవంతంగా పనిచేస్తోందని ఇస్రో వెల్లడించింది. దీని అధునాతన సెన్సార్లు ఫిబ్రవరి 10, 11, 2024 తేదీల్లో సంభవించిన పరిణామాలతోపాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ల(సీఎమ్ఈ) ప్రభావాన్ని గుర్తించినట్లు ఇస్రో ట్విట్టర్లో తెలిపింది. పాపాలో రెండు సెన్సార్లు ఏర్పరిచారు. అందులో ఎలక్ట్రాన్లను కొలవడానికి సోలార్ విండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ ప్రోబ్ (స్వీప్), అయాన్లను కొలవడానికి సోలార్ విండ్ అయాన్ కంపోజిషన్ ఎనలైజర్ (స్వీకర్) ఉన్నాయి. రెండు సెన్సార్లు సౌర పవన కణాలు ఏ దిశ నుంచి వస్తున్నాయో గుర్తించగలవు. Aditya-L1 Mission: PAPA payload has been operational and performing nominally. It detected the solar wind impact of Coronal Mass Ejections (CMEs) including those that occurred during Feb 10-11, 2024. Demonstrates its effectiveness in monitoring space weather conditions.… pic.twitter.com/DiBtW4tQjl — ISRO (@isro) February 23, 2024 ఈ సెన్సార్లు డిసెంబరు 12 నుంచి పనిలో ఉన్నట్లు ఇస్రో తెలిపింది. ఊహించిన విధంగా ప్రోటాన్లు, ఆల్ఫా కణాల కదలికను గుర్తించేలా ఒక స్పెక్ట్రాను రికార్డ్ చేసింది. జనవరి 6న ఆదిత్య-ఎల్1 హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ సమయంలో తాత్కాలికంగా పేలోడ్ ఓరియంటేషన్ మారినప్పుడు స్పెక్ట్రాలో కొంత డిప్ కనిపించినట్లు తెలిపింది. ఇదీ చదవండి: ‘ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం అదే..’ DSCOVR, ACE ఉపగ్రహాల ద్వారా డిసెంబర్ 15న వచ్చిన డేటాను ఇస్రో విశ్లేషించింది. ఆదిత్య ఎల్1లోని సీఎంఈ సెన్సార్లు L1 పాయింట్ వద్ద సౌర గాలి మార్పులకు అనుగుణంగా కణాల స్థానాల్లో మార్పులు గమనించినట్లు చెప్పింది. ఫిబ్రవరి 10, 11న కూడా సౌరగాలిలో స్వల్ప వ్యత్యాసాలు ఏర్పడినట్లు తెలిపింది. -
‘ఆదిత్య ఎల్-1’ ఎక్కడివరకూ వచ్చింది? ఏ పరికరాలు ఏం చేస్తున్నాయి?
చంద్రయాన్ 3 విజయంతో భారత ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. చంద్రునిపై కాలిడిన దేశాల సరసన భారత్ చేరింది. ఈ విజయానంతరం కొద్దిరోజుల వ్యవధిలోనే ఇస్రో మరో ఘనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సూర్యుని కక్ష్యలోకి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి అంతరిక్షంలో 125 రోజుల పాటు ఒక మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తరువాత సూర్యునికి అత్యంత సమీపంలోని లాగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశిస్తుంది. కాగా ఈ మిషన్ తాజా అప్డేట్స్ వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ మీడియాకు వెల్లడించారు. 2024 జనవరి 6వ తేదీనాటికి ఆదిత్య ఎల్- 1 మిషన్ నిర్దేశిత, తుది లక్ష్యానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మనన్ సోమనాధ్ పేర్కొన్నారు. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య ఎల్- 1. జనవరి 7, 2024 నాటికి ఈ మిషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సూర్యుని కక్ష్యలో చేరిన తరువాత నిర్దేశించిన కార్యకపాలు నెరవేరుస్తూ, శాస్త్రీయ ప్రయోగాలకు అవసరమయ్యేలా మిషన్ ఆదిత్య ఎల్- 1 సూర్యుని చిత్రాలను తీసి పంపిస్తుంది. సౌర కుటుంబం అంతటికీ తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య-ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఇది తన నాలుగు నెలల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమితోపాటు సూర్యుని ఆకర్షణ శక్తి లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఇంతకీ ఆదిత్య-ఎల్-1లో ఏఏ పరికరాలున్నాయి? వాటితో సాగించే ప్రయోగాలేమిటి? దీనితో మనకొచ్చే ప్రయోజనాలేమిటి? ఆదిత్య-ఎల్-1లో మొత్తం ఏడు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగపడుతుండగా, మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేయనున్నాయి. ఒక్కో పరికరం చేసే పనేమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు నిజానికి ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదానిలో మరొకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతమే సూర్యుడు. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్ అని అంటారు. దీని దిగువన ఉన్న మరో పొరను క్రోమోస్ఫియర్ అని, దాని దిగువన ఉన్న ఇంకో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొరకు సంబంధించిన ఛాయాచిత్రాలను తీస్తుంది. దీనికితోడు వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్-రే) కరోనాను పరిశీలిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి రూపొందించిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాన్ని (కరోనల్ మాస్ ఎజెక్షన్)కూడా గుర్తిస్తుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ల కారణంగా వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణం, వానల తీరుతెన్నులపై ప్రభావం చూపగలవని అంచనా. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్ఫియర్, క్రోమోస్ఫియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధార్మిక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ పరికరాన్ని రూపొందించింది. సోలార్‌లో ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్), హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. అయితే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి సారిస్తుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతలు మొదలైనవాటిని గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్న విషయాలు తెలుస్తాయి. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది కూడా చదవండి: అమెరికాలో దోపిడీకి గురైన భారత సంతతి జంట -
Aditya-L1 mission: పని మొదలెట్టిన ఆదిత్య–ఎల్ 1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి దూసుకెళ్లిన ఆదిత్య–ఎల్ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ అనే పరికరం తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని రెండు విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయి’ అని ఇస్రో వెల్లడించింది. సంబంధిత వివరాలను ఇస్రో తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్‌చేసింది. ‘సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్’లో భాగమైన సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పారి్టకల్ స్పెక్ట్రోమీటర్(స్టెప్స్)ను సెపె్టంబర్ పదో తేదీన, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్(స్విస్)ను నవంబర్ రెండో తేదీన యాక్టివేట్ చేయడం తెల్సిందే. ఈ రెండు భాగాలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సార్లు 360 డిగ్రీలో చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పారి్టకల్స్లను ‘స్విస్’ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేíÙంచగలిగిందని ఇస్రో ప్రకటించింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్ట్రోగామ్ను పరిశీలించారు. దీంతో ప్రోటాన్, అయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పారి్టకల్స్లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల విలక్షణతపై ఇన్నాళ్లూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు. సౌర గాలుల్లోని అంతర్గత ప్రక్రియలు.. భూమిపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తాజా డేటా సహాయకారిగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్–1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది. -
ఆదిత్య–ఎల్1 మూడోసారి కక్ష్య పెంపు విజయవంతం
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మూడోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇ్రస్టాక్), పోర్టుబ్లెయర్‌లోని స్పేస్ ఏజెన్సీ కేంద్రాల శాస్త్రవేత్తలు కక్ష్య దూరాన్ని మరింత పెంచారు. Aditya-L1 Mission: The third Earth-bound maneuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru. ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation. The new orbit attained is 296 km x 71767 km.… pic.twitter.com/r9a8xwQ4My — ISRO (@isro) September 9, 2023 కక్ష్య దూరం పెంపుదలతో ఉపగ్రహం భూమికి దగ్గరగా 296 కిలోమీటర్లు, భూమికి దూరంగా 7,1,767 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. ఉపగ్రహాన్ని ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా పెంచారు. లాంగ్రేజ్ పాయింట్ ఎల్1కు చేరేసరికి మరోసారి కక్ష్య పెంపు ఉంటుంది. 125 రోజుల ప్రయాణం తర్వాత ఉపగ్రహం నిర్దేషిత ఎల్1 పాయింట్‌కు చేరుకోనుంది. సూర్యునిలో కరోనా అధ్యయనానికి పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ఇప్పటికే భూమి, చంద్రునికి సంబందించిన ఫొటోలను పంపించింది. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్1 పాయింట్‌కు చేరి సూర్యునిపై పరిశోధనలు చేయనుంది. ఇదీ చదవండి: జీవ ఇంధనాల కూటమి -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ‘ఇస్రో’ శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇది కూడా చదవండి: మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు? -
ఘన్ను భాయ్ వినోదం
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఘన్ను భాయ్’. ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా ద్వారా ఆదిత్య గంగసాని హీరోగా పరిచయమవుతున్నారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఘన్ను భాయ్’. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
బెంగళూరు: చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమయ్యేలా ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ‘‘ఆదిత్య–ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2న జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చాం’’ అని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయోగం విశేషాలివే.. ► భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు ► భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది ► లాంగ్రేజియన్1 పాయింట్లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు. ► ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు ► సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్1 అధ్యయనం చేస్తుంది. ► సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది. ► మొత్తం ఏడు పే లోడ్లను ఇది మోసుకుపోతుంది. ఈ పేలోడ్లతో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది రికార్డే ► ఇస్రో చరిత్రలో 2023 ఒక రికార్డుగా మిగిలిపోనుంది. సూర్య చంద్రుల లోతుల్ని తెలుసుకోవడానికి రెండు నెలల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేయడం చరిత్రే మరి. చంద్రయాన్–3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో ఇప్పుడు అన్ని దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆదిత్య–ఎల్1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందనే విశ్వాసం ఏర్పడింది. 2024 చివరికి అంతరిక్షంలోకి మనుషుల్ని పంపి భారతీయుల మరో స్వప్నాన్ని తీర్చాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఊహాచిత్రం -
మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
బెంగళూరు: తక్కువ ఖర్చుతో అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ISRO మరో అడుగు వేయబోతోంది. చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్ ఆస్వాదిస్తూనే.. మరో కీలక ప్రయోగంపై ఇస్రో ప్రకటన చేసింది. ఈసారి ఏకంగా సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమని స్పష్టం చేసింది. తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధమైంది. ఆదిత్య ఎల్-1 Aditya L1 పేరుతో సన్ మిషన్ ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారాయన. ఆదిత్య ఎల్1 ISRO Sun Mission ప్రయోగంలో కరోనాగ్రాఫీ స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమికి సూర్యుడికి మధ్య ఎల్1 పాయింట్ చుట్టూ ఒక హాలో ఆర్బిట్‌లో చొప్పిస్తారు. సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు.. భూమి చుట్టూ ఉన్న పర్యావరణంపై దాని ప్రభావం తదితర అంశాలపై ఇది అధ్యయనం చేస్తుంది. ఇస్రో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను దేశంలోని వివిధ పరిశోధన సంస్థల సహకారంతో తయారు చేసింది. పీఎస్ఎల్వీ-ఎక్సెల్(సీ 57) ద్వారా షార్ శ్రీహరికోట నుంచే ఈ ప్రయోగం చేపట్టనుంది. ఐదేళ్లపాటు లక్ష్యంగా ఆదిత్య ఎల్1 సన్ మిషన్ కొనసాగించాలని ఇస్రో భావిస్తోంది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 ల్యాండింగ్ సూపర్ సక్సెస్.. సాగిందిలా! -
సౌరగోళంపై అధ్యయనానికే ఆదిత్య–ఎల్1 మిషన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : సౌరగోళం రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ మొదటివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతుండగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్కు చేరుకుంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. బెంగళూరులోని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. యూఆర్ఎస్సీ సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ శాటిలైట్ సెంటర్లో స్పేస్ ఆస్ట్రానమీ గ్రూపు (సాగ్)కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఆదిత్య ఎల్1 ఉపగ్రహం రూపకల్పన చేశారు. శంకర్ సుబ్రమణియన్ గతంలో ఖగోళ పరిశోధనకు ఉపయోగించిన ఆస్ట్రోశాట్ ఆనే ఉపగ్రహాన్ని, చంద్రయాన్–1. చంద్రయాన్–2 మిషన్లకు అనేక హోదాల్లో పనిచేశారు. ఆదిత్య ఎల్–1 ప్రయోగంలో పరిశోధనలకు పేలోడ్స్ ఇవే 1,475 కేజీలు బరువు కలిగిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ బరువు 244 కేజీలు మాత్రమే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనం ఉంటుంది. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ మధ్యంతర కక్ష్య)లోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బింవు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి సూర్యుడిపై జరిగే మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చి పంపుతున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీలు వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. చంద్రుడు, ఆంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదిత్య ఎల్1లో ఆరు పేలోడ్స్ పరిశోధనలు.. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి 1,470 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్ 1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 170 కేజీల బరువు కలిగిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి యొక్క వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్–యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఏఎన్ రామ్ ప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ధి చేశారు. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ ద్వారా సౌర గాలి యెక్క వైవిధ్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణపటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి యొక్క కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా యొక్క సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. -
సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం చంద్రయాన్–3 మిషన్‌ను ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఆదిత్య–ఎల్1 పేరిట అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. సెపె్టంబర్ మొదటివారంలో ప్రయోగం ఉటుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరి కోటలో ఉన్న ‘షార్’కు చేరుకుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగిస్తారు. ఇక్కడి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో మూడు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఆదిత్య–ఎల్1కు క్లీన్‌రూంలో పరీక్షల అనంతరం రాకెట్ శిఖరభాగంలో అమర్చుతారు. ప్రయోగం ద్వారా సూర్యుడు–భూమి వ్యవస్థలోని లాంగ్రేంజ్ పాయింట్ 1(ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇది భూమికి 10.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనానికి అడ్డంకులుండవని సైంటిస్టులు చెబుతున్నారు. -
క్షణాల్లో తలపాగా కట్టించి గిన్నిస్ రికార్డ్.. వీడియో వైరల్
భారతీయ సంప్రదాయంలో తలపాగాను వివాహాలు వంటి శుభకార్యాల్లో ధరిస్తారన్న సంగతి తెలిసిందే. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సిక్కులు మత పరంగా దీన్ని తప్పనిసరిగా ధరిస్తారు. టర్బన్ లేదా దస్తర్ పేర్లతో పిలిచే తలపాగాను ఎవరైనా కట్టుకుంటారు. కానీ క్షణాల్లో, మెరుపువేగంతో తలపాగా కట్టేయగలగడం ఆదిత్యలో ఉన్న స్పెషాలిటీ. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదిత్య పచోలి అతి తక్కువ సమయంలోనే తలపాగాను కట్టించి గిన్సిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. వృత్తిరీత్యా లాయర్ అయిన పచోలి తన వృత్తిని కొనసాగిస్తూనే, అభిరుచి మేరకు 15 ఏళ్లుగా తలపాగా కట్టే పని చేస్తున్నాడు. ఇటీవలె ఓ వ్యక్తికి కేవలం 14.12 సెకన్లలోనే తలపాగా చుట్టేసి ఆదిత్య రికార్డ్ సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వైరల్ వీడియోపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు పచోలి టాలెంట్‌కు ఫిదా అవుతుందటే, మరికొందరు మాత్రం గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రతి చిన్న దాన్ని హైలైట్ చేస్తూ దాని విలువను కోల్పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాత్రూమ్లో శవమై తేలిన యువనటుడు
బాలీవుడ్లో విషాదం నెలకొంది. నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ బాత్రూమ్లో శవమై తేలాడు. సోమవారం ముంబయి అంధేరీలోని తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. అయితే అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకోవడం కారణంగానే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ జర్నీ దిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు. అతను దాదాపు 300లకు పైగా అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించాడు. స్ప్లిట్స్ విల్లా- 9 వంటి రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ -4తో పాటు ఇతర టీవీ షోల్లో కనిపించాడు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) View this post on Instagram A post shared by Aditya Singh Rajput OFFICIAL (@adityasinghrajput_official) -
ఒక్క రోజు.... 48 గంటలు! టైమ్ ట్రావెల్ చేసిన హీరో!
ఆదిత్య బద్వేలి, రేఖా నిరోషా జంటగా నిరంజన్ బండి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్క రోజు.. 48 హవర్స్’. ప్రీతీ క్రియేషన్స్, హేమలత సమర్పణలో కృష్ణా రెడ్డి, కేకే నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం పోస్టర్‌ను ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, షేడ్ స్టూడియోస్ అధినేత బలివాడ దేవి ప్రసాద్ ఆవిష్కరించారు. నిర్మాత కేకే మాట్లాడుతూ– ‘‘మా బేనర్లో ఇది తొలి చిత్రం. మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఔట్పుట్ బాగా వచ్చింది. విజయం పట్ల నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. నిరంజన్ బండి మాట్లాడుతూ– ‘‘అనుకోని పరిస్థితుల్లో కష్టాలపాలైన హీరో టైమ్ ట్రావెల్ చేసి తనని ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు ఆదిత్య, రేఖా నిరోషా. -
త్వరలో తల్లి కాబోతున్న నటి అనుష్క?
బాలీవుడ్ నటుడు ఆదిత్య సీల్ త్వరలో తండ్రి కాబోతున్నాడట. ఆదిత్య సతీమణి, నటి అనుష్క రంజన్ గర్భం దాల్చిందంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. దీని గురించి ఆదిత్య దంపతులు ఇంతవరకు స్పందించలేదు. అయితే వారి బంధువులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. ఆ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. కాగా ఇటీవలే వీరిద్దరూ దుబాయ్‌లో విహారయాత్రను ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చారు. ఇకపోతే అనుష్క తల్లి అను రంజన్ ఏర్పాటు చేసిన ఓ ఫ్యాషన్ షోలో తొలిసారి ఆదిత్య, అనుష్కల మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారగా 2019 అక్టోబర్‌లో ఆదిత్య.. అనుష్కకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పడంతో వీరి ప్రేమ ముందుకు సాగింది. రెండేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత పెద్దలను ఒప్పించి 2021 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Anush 🦭 (@anushkaranjan) చదవండి: వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు శ్రుతిహాసన్ డుమ్మా కొడుకు బ్లాక్మెయిల్ చేసిన శ్రీహాన్.. చిన్మయి ఫైర్ -
ఘనంగా బిగ్‌బాస్ ఫేమ్ బాలాదిత్య కూతురి నామకరణం.. ఫోటోలు వైరల్
-
భారత చెస్ 77వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య
ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆదిత్య మిట్టల్ భారత చెస్‌లో 77వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రెగట్ టోర్నీలో ఆరో రౌండ్లో ఫ్రాన్సిస్కో (స్పెయిన్)పై ఆదిత్య గెలిచి జీఎం నార్మ్ ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు. జీఎం కావాలంటే ఓ చెస్ ప్లేయర్ మూడు జీఎం నార్మ్‌లతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాలి. ఆదిత్య 2021లో తొలి జీఎం నార్మ్, 2022లో మిగతా రెండు జీఎం నార్మ్‌లు సంపాదించాడు. చదవండి: టీ 20 అండర్ 19 వరల్డ్ కప్‌లో మన చిచ్చర పిడుగులు IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? -
వీకెండ్ ట్విస్ట్: ఆ 9మంది హౌజ్‌మేట్స్‌పై నాగ్ ఫైర్, బయటకు వెళ్లిపొమ్మంటూ..
బిగ్‌బాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసే ఘట్టం వీకెండ్ ఎపిసోడ్. తొలివారం వీకెండ్లో ఎపిసోడ్లో హౌజ్‌మేట్స్‌తో సరదసరదాగా ఆటలు ఆడించిన నాగ్ ఈ వీకెండ్లో మాత్రం కంటెస్టెంట్స్‌పై గుర్రుమన్నాడు. కుండలు బద్దతు కొడుతూ కంటెస్టెంట్స్‌కి చీవాట్లు పెట్టాడు. అంతేకాదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ఆఖరిలో ట్విస్ట్ ఇచ్చాడు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, మరినా-రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్ ఈ తొమ్మిది మంది పేర్లపై కుండలు పెట్టి వాటిని పేరు పేరునా పగలగొడుతూ కంటెస్టెంట్స్‌పై చిర్రుబుర్రమన్నాడు. అంతేకాదు చివరిలో వారందరి లగేజ్ బ్యాగ్‌లను స్టేజ్‌పై పెట్టించాడు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. అయితే ఇందులో నామినేషన్లో ఉన్నది ముగ్గురు మాత్రమే. ఇక వీరందరిని ఉద్దేశిస్తూ.. మీరంతా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఆడటానికి రాలేదని, చిల్ అవ్వడానికి వచ్చారంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత షానీ కుండ పగలగొట్టి.. తింటానికే, పంటానికే ఈషోకు వచ్చాననని నువ్వు అనుకుంటే వెంటనే బ్యాగ్ సర్దుకుని బయటకు వెళ్లిపోవచ్చంటూ షాకిచ్చాడు. ఇక బాలాదిత్య ఉద్దేశిస్తూ.. నువ్వు ఆడకపోవవడమే కాదు ఇతరుల ఆటను కూడా చెడగొడుతున్నావంటూ ఫైర్ అయ్యాడు నాగ్. దీనికి ఈ మాజీ కెప్టెన్ స్పందిస్తూ.. ‘నేను తప్పు చేశాను.. బుర్రతో ఆలోచించలేదు. మనసుతో ఆలోచించాను’ అన్నాడు. దానికి నాగ్ ‘మనసూ బుర్రా కాదు బిగ్ బాస్ హౌస్‌మేట్‌గా ఆలోచించు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్ లుక్ వైరల్ ఇక మెరీనా - రోహిత్‌ను ఉద్దేశించి ‘మీరు ఇద్దరూ ఈ ఇంట్లోకి పవర్ ఆఫ్ టూ(power Of Two) కింద వచ్చారు. కానీ ఆటలో మాత్రం మైనస్‌లో ఉన్నారు’ అంటూ ఫైర్ అయ్యాడు. అనంతరం శ్రీసత్యను ‘నీ బొమ్మ పోయినప్పుడు నువ్వు ఫీలయ్యావా? అదే నీ ప్లేటు లాగేసుకుని ఉంటే కచ్చితంగా ఫీలయ్యేదానివి’ అంటూ ఆమెకు చురక అట్టించాడు. ఇక అభినయ మాట్లాడుతూ.. తాను జీరో పర్సెంట్ మాత్రమే ఆడానంటే ఒప్పుకోనంటూ నాగ్‌తో వాదించడంతో.. మరి 10 శాతం ఆడావా? అని బదులిచ్చాడు నాగార్జున. ఆ తర్వాత సుదీప ఖచ్చితంగా తానేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పడంతో నువ్వు ఈ హౌజ్‌లో ఉంటే.. అంటూ వ్యాఖ్యానించాడు. చూస్తుంటే ఈ వారంలో నామినేషన్లో ఉన్నవారు కాకుండా హౌజ్‌లో పర్ఫామెన్స్ ఇవ్వని వారిని బిగ్‌బాస్ బయటకు పంపించేలా కనిపిస్తున్నాడంటూ ప్రోమోపై నెటిజన్లు కామెంట్స చేస్తున్నారు. -
సక్సెస్‌స్టోరీ..:ఎకో–ఫ్రెండ్లీ ఫ్రెండ్స్
‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది’ అనే మాటను వింటూనే ఉన్నాం. ఈ ముగ్గురు కుర్రాళ్ల జీవితాన్ని మార్చేసి, అంకుర దిగ్గజాలుగా మార్చింది మాత్రం ఒక చాక్లెట్ రేపర్. అదేలా అంటే... ‘విజయానికి దారి ఏమిటి?’ అని మల్లగుల్లాలు పడుతుంటాంగానీ కొన్నిసార్లు పరిస్థితులే విజయానికి దారి చూపుతాయి. ముగ్గురు మిత్రులు, మూడు సంవత్సరాల క్రితం... అక్షయ్ వర్మ, ఆదిత్య రువా, అంజు రువా ఆరోజు చెమటలు కక్కుతూ ముంబైలో బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ ఎండలో వారికి తళతళ మెరుస్తూ ఒక ఒక చాక్లెట్ బ్రాండ్ ప్లాస్టిక్ రేపర్ కనిపించింది. ఆ బ్రాండ్ తన ఉత్పత్తులను 1990లోనే ఆపేసింది. రేపర్ మాత్రం ‘నిను వీడని నీడను నేను’ అన్నట్లుగా చూస్తోంది. కాలాలకు అతీతంగా పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్‌పై ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి చర్చ, ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘బెకో’ అనే స్టార్టప్. వెదురు, ప్లాంట్ బేస్డ్ ఇన్‌గ్రేడియంట్స్‌తో పర్యావరణహితమైన వస్తువులు, ఫ్లోర్ క్లీనర్స్, డిష్‌వాషింగ్ లిక్విడ్లాంటి కెమికల్ ఫ్రీ డిటర్జెంట్స్, గార్బేజ్ సంచులు, రీయూజబుల్ కిచెన్ టవల్స్, టూత్‌బ్రష్‌లు... మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది బెకో. దీనికి ముందు... పెట్ యాజమానుల కోసం ‘పెట్ ఇట్ అప్’ అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు అక్షయ్ వర్మ. కో–ఫౌండర్ జారుకోవడంతో ఒక సంవత్సరం తరువాత అది మూతపడింది. ఇక ఆదిత్య కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రొఫెషనల్స్ కోసం ఇంటర్–ఆర్గనైజేషన్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ వెంచర్‌ను అమ్మేశాడు. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. ఈ ముగ్గురు కలిసి ప్రారంభించిన ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ మొదట్లో తడబడినా, కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఊపందుకుంది. ఆన్లైన్ మార్కెట్ప్లేసులతో పాటు, ముంబై, బెంగళూర్లలో దీనికి ఆఫ్‌లైన్ స్టోర్లు ఉన్నాయి. ‘బెకో’లో క్లైమెట్ ఎంజెల్స్ ఫండ్, టైటాన్ క్యాపిటల్, రుకమ్ క్యాపిటల్...మొదలైన సంస్థలు పెట్టుబడి పెట్టాయి. ‘లాభాల కోసం ఆశించి ప్రారంభించిన వ్యాపారం కాదు. ఒక లక్ష్యం కోసం ప్రారంభించింది. వీరి తపన చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలరనే నమ్మకం కలుగుతుంది’ అంటున్నారు ‘రుకమ్ క్యాపిటల్’ ఫౌండర్ అర్చన జాహగిర్దార్. పర్యావరణ ప్రేమికురాలు, ప్రసిద్ధ నటి దియా మీర్జా ఈ ముగ్గురి భుజం తట్టడమే కాదు, కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారు. ముగ్గురు మిత్రులు అక్షయ్ (26), ఆద్యిత (26), అంజు (27) ముక్తకంఠంతో ఇలా అంటున్నారు... ‘భూగోళాన్ని పరిరక్షించుకుందాం అనేది పర్యావరణ దినోత్సవానికి పరిమితమైన నినాదం కాదు. పర్యావరణ స్పృహ అనేది మన జీవనశైలిలో భాగం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకో–సెన్సిటివ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది. వినియోగదారుల్లో 85 శాతం యువతరమే. పర్యావరణహిత వస్తువులను ఆదరించే ధోరణి పెరిగింది’ పర్యావరణహిత ఉత్పత్తుల మార్కెట్ రంగంలో ‘బెకో’ లీడింగ్ ప్లేయర్ పాత్ర పోషించనుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో ‘బెకో’ను 500 కోట్ల రూపాయల బ్రాండ్‌గా చేయాలనేది ముగ్గురు మిత్రుల ఆశయం. అది ఫలించాలని ఆశిద్దాం. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. -
షూటింగ్లో ప్రమాదం: నటుడికి గాయాలు
పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించిన ఆదిత్య మీనన్ ఆస్పత్రిపాలయ్యాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "హరి హర వీరమల్లు" షూటింగ్లో ఆయన గాయపడ్డారు. ఇటీవల సెట్స్‌లో గుర్రపు స్వారీ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను ముంబైలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. తాజాగా ఆయన్ను చెన్నై ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆదిత్య మీనన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు, చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా వుంటే ఆదిత్య మీనన్ 'బిల్లా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. గతంలో పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఇక అతడికి ప్రమాదం జరిగిన కారణంగా వీరమల్లు.. షూటింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయకర్ రావు నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో జాక్విలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ వజ్రాల దొంగగా ఆలరించనున్నట్లు సమాచారం. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. చదవండి: సర్ప్రైజ్: pspk27 టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేసింది -
మాజీ మంత్రి తనయుడి ఇంట్లో డ్రగ్స్
బెంగళూరు: శాండల్ వుడ్ డ్రగ్ కేసులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో కొంత మంది ప్రముఖులు వారి బంధువులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ లిస్ట్‌లో ఆదిత్య అల్వా కూడా నిందితులుగా ఉన్నారు. ఆదిత్య అల్వా మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సోదరుడు. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆదిత్య 6వ నిందితుడిగా ఉన్నారు. ఆదిత్య అల్వా నివాసంలో ఎన్సీబీ అధికారులు దాడులు చేయగా 55 గ్రాముల పొడి గంజాయి లభించింది. లాక్డౌన్ సమయంలో ఆల్వా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య అల్వా ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలో ఉన్నాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యింది. చదవండి: డ్రగ్స్ కేసు: తెరపైకి ప్రముఖుల పేర్లు.. -
బెస్ట్ మమ్మీ
బిడ్డ ఉన్నాడు. తల్లెక్కడ?! ఈయనే తల్లి. తల్లి మాత్రమే కాదు. ప్రపంచంలోనే ‘బెస్ట్ మమ్మీ’ కూడా. ఈ మహిళా దినోత్సవం రోజు బెంగళూరులో జరుగుతున్న ‘వెంపవర్’ ఈవెంట్లో మరికొందరు బెస్ట్ మమ్మీలతో పాటు ఈయనా ‘వరల్డ్స్ బెస్ట్ మమ్మీ’ అవార్డు అందుకోబోతున్నారు. పేరు ఆదిత్యా తివారి. ఉండటం పుణె. కొడుకు పేరు అవ్నీష్. నాలుగేళ్ల క్రితం రెండేళ్ల వయసున్న అవ్నీష్‌ని దత్తత తీసుకున్నారు ఆదిత్య. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతడు. అవ్నీష్ సంరక్షణ కోసం ఉద్యోగం మానేశాడు. అవ్నీష్ కొంచెం పెద్దయితే మళ్లీ చేరొచ్చని ఆలోచన. అవ్నీష్ స్పెషల్ చైల్డ్. ‘డౌన్ సిండ్రోమ్’ ఉంది. తెలిసీ దత్తత తీసుకున్నాడు. డౌన్ సిండ్రోమ్ శారీరకంగానూ, మానసికంగానూ త్వరగా ఎదగనివ్వదు. కానీ ఆదిత్య సంరక్షణలో త్వరత్వరగా ఎదుగుతున్నాడు అవ్నీష్! అవ్నీష్కి గుండెకు చిన్న రంధ్రం ఉండేది. ఏ మందులూ వాడకుండానే అది భర్తీ అయింది. బలెవాడిలోని బడికి వెళ్తున్నాడు ఇప్పుడు. డాన్స్ అంటే ఇష్టం. మ్యూజిక్, ఫొటోగ్రఫీ కూడా. ఈ తండ్రీకొడుకులిద్దరూ ఇప్పటివరకు దేశంలోని 22 రాష్ట్రాల్లో పర్యటించారు. అవ్నీష్ లాంటి పిల్లలే ఉన్న 10 వేల మంది తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు ఆదిత్య. సెమినార్లు, వర్క్‌షాపులు, క్లాసులు.. ఎక్కడికి వెళ్లినా అవ్నీష్‌ని వెంటబెట్టుకునే వెళ్తారు ఆయన. ఐక్యరాజ్యసమితి నుంచి పిలుపొస్తే వెళ్లి ప్రసంగించి వచ్చారు. జెనీవాలో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో కూడా వీళ్లు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అదీ ప్రత్యేక ఆహ్వానమే. అవ్నీష్ ఇంకా కొన్ని సర్జరీలేవో జరగాలి. వాటిని చేయించడానికి తగిన సమయం, వయసు కోసం చూస్తున్నారు ఆదిత్య. -
మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య
చిన్నారిని చిదిమేశారు.. కర్కశంగా గొంతుకోసి చంపేశారు.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లికి గుండెకోతను మిగిల్చారు.. చల్లపల్లి బీసీ వసతి గృహంలో ఓ చిన్నారిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన దివిసీమలో సంచలనం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి గొంతు కోసి బాత్ రూమ్‌లో పడేశారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి తల్లి తల్లడిల్లిపోయారు. అయితే బాలుడి తండ్రి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తల్లి ఆరోపిస్తుండగా.. హాస్టల్లోని తోటి విద్యార్థులే హత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, అవనిగడ్డ : బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాలు.. బాలుడు దాసరి ఆదిత్య(8) మూడో తరగతి చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నాడు. ఉదయానే డాబా పైకి వెళ్లిన తోటి విద్యార్థులు ఆదిత్య విగతజీవిగా పడి ఉండడంతో భయాందోళన చెంది, వెంటనే కాపలాదారుడు నాగబాబుకు చెప్పటంతో అధికారులకు సమాచారం అందించారు. పంచాయతీ పరిధిలోని చల్లపల్లి నారాయణరావు నగర్లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర, ఆదిలక్ష్మి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు అశోక్, రెండో కుమారుడు ఆదిత్య(8) స్థానిక బీసీ వసతిగృహంలో ఉంటున్నారు. రవీంద్ర శుభకార్యాలకు మండపాలు డెకరేషన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హాస్టల్లోకి వెళ్లింది సోమవారమే.. ఆదివారం ఇంటికి వచ్చిన ఆదిత్యకు తల్లి కొత్తబట్టలు కొనిచ్చి సోమవారం ఉదయం హాస్టల్‌కు తీసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి పైఅంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో హత్యకు గురయ్యాడు. నిద్రలేపి చంపేశారా? ఆదిత్య హత్య ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఆదిత్య అన్నయ్య అశోక్‌ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిద్రలేపి మూత్ర విసర్జనకు వెళ్లమని చెప్పాడు. నిద్రలో ఉన్న అశోక్ రావడం లేదని చెప్పి ప్రార్థన చేసి నిద్రపోయాడు. అనంతరం అదే వ్యక్తి ఆదిత్యను నిద్రలేపి వసతిగృహంపై అంతస్తులో ఉన్న బాత్రూంల వద్దకు తీసుకెళ్లి మెడకోసి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మెట్ల కింద రక్తపు మరకలు.. బీసీ వసతి గృహంలోని పై అంతస్తు బాత్రూంలో దాసరి ఆదిత్య హత్యకు గురి కాగా గ్రౌండ్‌ఫ్లోర్ మెట్లు కింద రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారం లేకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. వసతిగృహంలో గ్రౌండ్ ఫ్లోర్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, అర్ధరాత్రి పై అంతస్తులోని మరుగుదొడ్లుకు ఆదిత్య ఎందుకు వెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది. తండ్రి సంబంధాలపై అనుమానాలు.. మృతుడి తండ్రి రవీంద్రకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె భర్త ఈ హత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి తల్లి ఆదిలక్ష్మి ఆరోపించింది. ఈ విషయమై గతంలో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దలు రాజీ కుదర్చడం జరిగింది. ఏఎస్పీ సత్తిబాబు విచారణ తొలుత డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి, సీఐ ఎం.వెంకటనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఏఎస్పీ మోకా సత్తిబాబు çహత్య తీరును పరిశీలించారు. వసతిగృహంలో ఉన్న విద్యార్థులు, వాచ్మెన్, ఇన్చార్జి వార్డెన్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. డాగ్‌స్క్యాడ్, క్లూస్‌టీంలు రంగంలో దిగి ఆధారాలు సేకరించాయి. బీసీ సంక్షేమశాఖ డీడీ ఐ.రమాభార్గవి బీసీ వసతిగృహానికి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీ ఓ పరిశీలన.. బాలుడి దారుణ హత్య విషయం తెలుసుకున్న మచిలీపట్నం ఆర్డీఓ జె.ఉదయభాస్కర్, తహసీల్దార్ కె.స్వర్ణమేరి హాస్టల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. సిబ్బందిని ఆరా తీశారు. శవ పంచనామా అనంతరం పోలీసులు బాలుడి తండ్రి రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ తరలించారు. నిందుతుడిని అరెస్ట్ చేయాలని ఆందోళన బాలుడిని కిరాతంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయనివ్వమని మృతుడి బంధువులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్, వాచ్మన్ని సస్పెండ్ చేయాలని, మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో ఏఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సాయపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆదిత్య మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా! దాసరి ఆదిత్య హత్య కేసులో పోలీసుల విచారణ భిన్న కోణాల్లో సాగుతోంది. హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పదునైన ఆయుధంతో మెడకోసి హత్య చేసినట్టు పోస్టుమార్టంలో తేలడంతో ధర్మాకోల్ కట్టర్(చిన్న పోల్టు చాకు)తో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ పదోతరగతి విద్యార్థ్ధి కొన్నిరోజులు కలసి పడుకున్నారు. ఆ విద్యార్థి వికృత చేష్టలకు భయపడి అతని దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ విద్యార్ధి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వార్డెన్, వాచ్‌మన్ సస్పెన్షన్జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అవనిగడ్డ: చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసలి ఆదిత్య(8) హత్యకు గురైన నేపథ్యంలో ఇన్చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్ నాగబాబుని సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుర్ఘటనపై విచారణ జరుగుతుందని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
అద్దె ఇవ్వకుండా యజమానితో గొడవ పడిన నటుడు
యశవంతపుర : ఇంటి యజమానికి అద్దె ఇవ్వకుండా ఆయనతో గొడవ పడిన శాండిల్‌వుడ్ నటుడు ఆదిత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు ఆదిత్య సదాశివనగరలోని ఆర్‌ఎంవీ ఎక్స్టెన్షన్లో ప్రసన్న అనే వ్యక్తికి చెందిన ఇంటిలో నాలుగేళ్ల నుంచి తల్లిదండ్రులు, చెల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. గత ఏడు మాసాలుగా అద్దె ఇవ్వటం మానేశాడు. దీంతో యజమాని వాదనకు దిగాడు. అద్దె బకాయి రూ. 2 లక్షల 88 వేలు చెల్లించాలి. దీంతో బాధితుడు కోర్టులో కేసు దాఖలు చేశాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఆదిత్య తిట్టిన మాటలను రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమల్లో వైరల్‌గా మారింది. -
జిమ్ చేస్తూ యువకుడి మృతి
హైదరాబాద్: సరైన శిక్షణ లేకుండా జిమ్ చేస్తూ కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోమవారం ఎస్ఆర్నగర్లోని గోల్డెన్ జిమ్‌లో ఆదిత్య (30) అనే యువకుడు జిమ్ చేసిన అనంతరం అస్వస్థతకులోనై మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్‌కు చెందిన ఆదిత్య బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న గోల్డెన్ జిమ్‌లో ప్రతిరోజు ఉదయం కసరత్తులు చేసేవాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో జిమ్‌కు వచ్చిన ఆదిత్య గంటపాటు ఎప్పటిలాగే జిమ్ చేశాడు. ఆ తర్వాత కడుపులో నలతగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని నిర్వాహకులతో చెప్పి కుప్పకూలిపోయాడు. అయితే ఆదిత్యను నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆదిత్య స్నేహితుడు హుసేన్‌కు వారు ఫోన్ చేయగా హుసేన్ ఆదిత్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లాక పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం సనత్‌నగర్‌లోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆదిత్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్ జిమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జిమ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మాత్రలు వేసుకున్నానని చెప్పాడు ‘ఆదిత్యకు ఉదయం ఫోన్ చేస్తే తీయలేదు. దీంతో అతడిని తీసుకువచ్చేందుకు జిమ్‌కు వెళ్లాను, అప్పటికే ఆదిత్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంటికి తెచ్చాక పరిస్థితి విషమంగా మారడంతో ‘జిమ్‌లో ఏమైనా తిన్నావా’అని అడిగాను. జీఎంజీ మాత్ర వేసుకున్నానని ఆదిత్య చెప్పడంతో జిమ్ ట్రైనర్ అఖిల్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాను. ఆయన సలహా మేరకు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను’అని స్నేహితుడు హుసేన్ తెలిపాడు. అయితే జిమ్ చేసేముందు మాత్రలు వేసుకున్నాడా లేక అస్వస్థతకు గురైన అనంతరం మాత్ర వేశారా అన్నది తెలియాల్సి ఉంది. -
కామిరెడ్డి నాని నివాసంలో విషాదం..
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కామిరెడ్డి నానీ నివాసంలో విషాదం నెలకొంది. నానీకి వరసకు సోదరుడైన ఆదిత్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారంటూ కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్ట్ చేయగా, అనంతరం అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. అయితే సోదరుడి అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదిత్య నిన్న రాత్రంతా పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళన చేపట్టాడు. (కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు) (చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్) మరోవైపు కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు కావడంతో ఆదిత్య తన బంధువులను ఇంటి వద్ద దించేందుకు కారులో బయల్దేరాడు. పెదవేగి మండలం వేగివాడ గ్రామ శివారు వద్ద ఆదిత్య ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అక్కడికక్కడే మరణించగా, మరో వృద్ధురాలు గాయపడగా...ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆదిత్య మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేతలు ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కామిరెడ్డి పరామర్శించిన నేతలు వారికి మనోధైర్యం చెప్పారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కామిరెడ్డి నాని నివాసంలో విషాదం..
-
‘స్వయంవద’ టైటిల్ ఆవిష్కరణ
ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మి చలన చిత్ర పతాకంపై తెరకెక్కుతున్న సినిమా స్వయంవద. ఈ సినిమాను వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖ సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సీనియర్ దర్శకుడు అల్లాణి శ్రీధర్ ‘స్వయంవద’ చిత్ర టైటిల్‌ను, లోగోను ఎ.వి.ఏ సుబ్బారావు, టైటిల్ మోషన్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ, ‘వివేక్ మంచి రైటర్ అని అతికొద్ది మందికే తెలుసు. ఆయన నాతో కలిసి పనిచేసినప్పుడే నాకు విషయం అర్ధమైంది. యువత ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడింది? అన్నదే ఈ సినిమా కథ. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వివేక్ గురువుకు తగ్గ శిష్యుడని టైటిల్‌ను బట్టే తెలుస్తోంది. ఇదో డిఫరెంట్ మూవీ. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. చిత్ర దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ, ‘స్వయంవద అనేది సంస్కృత పదం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. తన గురించి తానే ఓ సర్వస్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఇందులో హీరోయిన్ మొత్తం 6 గెటప్స్‌లో కనిపిస్తుంది. హీరో కూడా చక్కగా నటించాడు. టెక్నికల్ గాను సినిమా హైలైట్‌గా ఉంటుంది. ఒక పాట షూటింగ్ మినహా అంతా పూర్తయింద’న్నారు. -
హెచ్‌యూఎల్ చేతికి ‘ఆదిత్య మిల్క్’
న్యూఢిల్లీ: ‘ఆదిత్య మిల్క్’ బ్రాండ్‌ను ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఆదిత్య మిల్క్ బ్రాండ్ ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిజర్ట్‌లను తయారు చేసే ఈ బ్రాండ్ యాజమాన్య సంస్థ, విజయకాంత్ డైరీ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని హెచ్‌యూఎల్ తెలిపింది. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిస్సర్ట్ మార్కెట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయనున్నామని హెచ్‌యూఎల్ సీఎమ్‌డీ, సంజీవ్ మెహతా తెలిపారు. -
బ్యాచ్‌లర్స్‌కు వ్యక్తిగత రుణాలు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాచ్లర్స్, విద్యార్థులను టార్గెట్‌గా చేసే ఏ వ్యాపారమైనా సరే హిట్ అవుతుంది. కారణం.. ఈ సెగ్మెంట్లో జనాభా ఎక్కువగా ఉండటమే! ఇదే లక్ష్యంతో ఫిన్‌టెక్ స్టార్టప్ క్యుబెరా ముందుకు సాగింది. పెద్ద మొత్తంలో కాకుండా రూ.15 వేల నుంచి రూ.75 వేలను పర్సనల్ లోన్స్గా అందించాలని నిర్ణయించింది. ఆర్బీఎల్, కొటక్, ఇండస్ ఇండ్ వంటి బ్యాంక్‌లతో ఒప్పందం కూడా చేసేసుకుంది. మరిన్ని వివరాలు క్యుబెరా ఫౌండర్ అండ్ సీఈఓ ఆదిత్య కుమార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్. నాన్న బిజినెస్ కావటంతో జర్మనీలోనే 18 ఏళ్లు ఉన్నాం. లండన్‌లో ఏడేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌లో పనిచేశా. ఆ తర్వాత ఇండియాకొచ్చి ఉత్తర్ ప్రదేశ్, రాజస్తాన్‌లోని ఫైస్టార్ హోటల్స్ క్లార్క్స్ గ్రూప్స్‌లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా పనిచేశా. 2016 జనవరిలో రూ.1.5 కోట్ల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా క్యుబెరాను ప్రారంభించా. పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు, ఎక్కువ వేతనం ఉన్నవాళ్లకు, సిబిల్ స్కోర్ బాగున్నవాళ్లకు మాత్రమే బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) రుణాలు అందిస్తాయి. మరి, సిబిల్ స్కోర్ లేనివాళ్లకు, వేతనం తక్కువున్న వాళ్ల పరిస్థితి ఏంటి? వీళ్లకు రుణం తిరిగి చెల్లించే స్థోమత ఉంటుంది కానీ, లోన్లే అందవు. వీళ్లను లక్ష్యంగా చేసుకొనే క్యుబెరాను ప్రారంభించాం. హైదరాబాద్‌లో రూ.10 కోట్లు.. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే అహ్మదాబాద్, జైపూర్ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఉద్యోగులు, నిరుద్యోగులు రెండు కేటగిరీలకూ వ్యక్తిగత రుణాలు అందిస్తాం. రుణ పరిమితి రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు. రుణ గ్రహీత కేవైసీ, అడ్రస్ ప్రూఫ్, పాన్, బ్యాంక్ చెక్స్, అకౌంట్ వివరాలను సమర్పించాలి. దరఖాస్తును పూర్తి చేసిన 24 గంటల్లో రుణం అందిస్తాం. ఆర్బీఎల్, ఇండిస్ ఇండ్, కొటక్ బ్యాంక్‌లతో పాటూ ఐఐఎఫ్ఎల్ ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటివరకు 2 లక్షల రుణ దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 2,500 మందికి రూ.50 కోట్ల వ్యక్తిగత రుణాలు అందించాం. ఇందులో రూ.10 కోట్లు హైదరాబాద్‌లోనే అందించాం. ఏటా వడ్డీ రేటు 10.99 శాతం.. మా కస్టమర్లలో 23 శాతం వాటా బ్యాచ్లర్స్ ఉంటారు. వచ్చే 6 నెలల్లో మరో 4 బ్యాంక్‌లు, 3 ఎన్బీఎఫ్సీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రుణ చెల్లింపు కాల పరిమితి మూడేళ్లు. ఏటా 10.99 శాతం నుంచి 28 శాతం వడ్డీ రేటు ఉంటుంది. గతేడాది కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.6 కోట్ల రెవెన్యూ లక్ష్యించాం. ఎన్పీఏ 1 శాతంగా ఉంది. వచ్చే ఏడాది నాటికి రూ.100 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యించాం. ముంబై ఇన్వెస్టర్ నుంచి రూ.20 కోట్ల నిధులు ఈ ఏడాది ముగింపు నాటికి కోయంబత్తూరు, ఇండోర్, భూపాల్, చండీగఢ్, కోల్‌కతా, లక్నో ప్రాంతాలకు విస్తరించనున్నాం. ఆ తర్వాతే విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు చేరుకుంటాం. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది పూర్తి ఈ సంఖ్యను 150కి చేర్చుతాం. ప్రస్తుతం ముంబైకు చెందిన ఇన్వెస్టర్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు పూర్తి కావచ్చాయి. 2 నెలల్లో రూ.20 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ అని ఆదిత్య వివరించారు. -
వండర్ బుక్‌లో ‘ఆదిత్య’కు చోటు
బాలల చిత్రం ‘‘ఆదిత్య’ క్రియేటివ్ జినియస్’కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పురస్కారం రావడంపై తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ బాలల చిత్రాన్ని రూపొందించారు. నవంబర్4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలో అవార్డ్‌ను అందుకుంది. దాదాపు వంద దేశాల్లో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఘనత పొందింది ఆదిత్య క్రియేటివ్ జీనియస్. వంద శాతం పన్ను రాయితీ పొందిన బాలల చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, నటులు బ్రహ్మానందం, సుమన్, చిత్రయూనిట్ పాల్గొన్నారు. -
స్ఫూర్తి నింపే చిత్రాలు రావాలి
‘‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’ సినిమా చాలా బాగుంది. చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూపించారు. బాల–బాలికల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి గొప్ప చిత్రాలు తరచూ రావాలి’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’. 2015 నవంబర్4న విడుదలైన ఈ చిత్రం 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం అందుకుంది. తాజాగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఆదిత్య’ చిత్రంలో నేనూ నటించాను. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే మా చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారం అందించారు’’ అన్నారు భీమగాని సుధాకర్ గౌడ్. నటుడు సుమన్ పాల్గొన్నారు. -
ఆదిత్య ‘డబుల్’ ధమాకా
సాక్షి, హైదరాబాద్: టి. విజయకృష్ణ స్మారక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్లో ఎస్. ఆదిత్య రెండు టైటిళ్లతో సత్తా చాటాడు. ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఆదిత్య సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ టైటిల్‌పోరులో ఎస్. ఆదిత్య (వి–10) 25–16, 25–5తో మాజీ ప్రపంచ చాంపియన్ కె. శ్రీనివాస్ (ఐఓసీఎల్)పై వరుస సెట్లలో గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఆదిత్య 25–11, 1–25, 20–18తో హకీమ్ (బీఎస్ఎన్ఎల్)పై, కె. శ్రీనివాస్ 25–11, 12–25, 25–10తో మొహమ్మద్ అహ్మద్ (హెచ్‌ఎంసీసీ)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదిత్య– వి. శివానంద రెడ్డి ద్వయం 21–7, 20–10తో ఎస్కే వసీమ్– మొహమ్మద్ జఫర్ జోడీని ఓడించి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో ఆదిత్య–శివానంద జంట 0–25, 25–21, 25–13తో కె. శ్రీనివాస్– బాసిల్ ఫిలిప్స్ జోడీపై, జఫర్– వసీమ్ జంట 25–6, 17–25, 25–12తో మొహమ్మద్ అహ్మద్– ఎస్కే మొహమ్మద్ జోడీపై గెలుపొందాయి. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ చాంపియన్ అపూర్వ గెలుచుకుంది. ఫైనల్లో అపూర్వ (ఎల్ఐసీ) 20–16, 24–4తో సి. కార్తీక వర్ష (ఎన్ఏఎస్ఆర్)పై విజయం సాధించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా క్యారమ్ సంఘం (హెచ్‌డీసీఏ) అధ్యక్షురాలు గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్యారమ్ సంఘం (క్యాట్స్) అధ్యక్షుడు బీకే హరినాథ్, కార్యదర్శి ఎస్. మదన్ రాజ్, హెచ్‌డీసీఏ ఉపాధ్యక్షులు నర్సింహారావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్. శోభన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి ఘనత.. వేతనం రూ. 1.2 కోట్లు
బెంగళూరు : నగరంలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీబీ)కి చెందిన 22 ఏళ్ల విద్యార్థి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టీమ్‌లో చోటు సంపాదించాడు. ఏడాదికి 1.2 కోట్ల రూపాయల భారీ పారితోషకాన్ని ఆదిత్య పలివల్ అందుకోనున్నారు. ముంబైకి చెందిన ఆదిత్య ఐఐఐటీ-బెంగళూరులో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేస్తున్నారు. గూగుల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెస్టులో ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది విద్యార్థులు పాల్గొనగా, 50 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో ఆదిత్య పలివల్ కూడా ఒకరు. బెంగళూరు క్యాంపస్‌లో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ వల్లే ఈ విజయం సాధించగలిగానని ఆదిత్య తెలిపారు. -
ఆర్సెలర్ ప్రెసిడెంట్‌గా ఆదిత్య మిట్టల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ప్రెసిడెంట్‌గా ఆదిత్య మిట్టల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్సెలర్ మిట్టల్ యూరప్ విభాగానికి సీఎఫ్‌వో, సీఈవోగా ఉన్న ఆదిత్యకు తాజాగా ప్రెసిడెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్, సీఈవో లక్ష్మీనివాస్ మిట్టల్ కుమారుడే ఆదిత్య మిట్టల్. చైర్మన్‌కి కుడిభుజంగా వ్యవహరిస్తూ.. గ్రూప్ కార్యకలాపాల్లో ఆదిత్య వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నారని సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ఆర్సెలర్ మిట్టల్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
బీసీసీఐ మీదే మా పోరాటం
కొరుక్కుపేట: బీసీసీఐలో అవినీతి పెరిగిందని బీహార్ కిక్రెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ ఆరోపించారు. అవినీతిదారుల భరతం పట్టేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు తాను వ్యతిరేకం కాదన్నారు. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ, జార్ఖండ్ క్రికెట్ సంఘం కోశాధికారి నరేష్ మకాణీ విలేకరులతో మాట్లాడారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను కలిసేందుకు తాము ఇక్కడికి వచ్చినట్టు వివరించారు. క్రికెట్ క్రీడాభివృద్ధి లక్ష్యంగా 2005 నుంచి తాను పోరాటాలు చేస్తున్నానని తెలిపారు. బీహార్, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా అనేక అవినీతి అరోపణలున్న అమితాబ్చౌదరిని ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా నియమించారన్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సన్నిహితుడిగా ఆయన ప్రచారం చేసుకుంటూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తాను న్యాయ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. తన పోరాటం బీసీసీఐపైనే కానీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా మాత్రం కాదని స్పష్టం చేశారు. శ్రీనివాసన్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని, ఆయన్ను కలిసి అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీనివాస్, ఆదిత్య
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర–తెలంగాణ ఇన్విటేషన్ గ్రీన్ క్యారమ్ టోర్నమెంట్లో రాష్ట్ర క్రీడాకారులు కె. శ్రీనివాస్, ఆదిత్య, జహీర్ అహ్మద్, దినేశ్ బాబు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో రాష్ట్ర ప్లేయర్లు మాధవి, సునీత క్వార్టర్స్ చేరుకున్నారు. కావలిలో శనివారం జరిగిన పురుషుల ఐదో రౌండ్ పోటీల్లో ఆదిత్య 25–0, 25–0తో సృజన్ కుమార్ (ఏపీ)పై, దినేశ్ బాబు (తెలంగాణ) 25–12, 25–0తో శ్రీను (ఏపీ)పై, వైఎస్‌డీ రమేశ్ (ఏపీ) 15–25, 25–4, 16–15తో కృష్ణ (తెలంగాణ)పై, కరీముల్లా (ఏపీ) 17–9, 25–7తో రవీంద్ర రెడ్డి (ఏపీ)పై గెలిచారు. మహిళల మూడో రౌండ్ పోటీల్లో హుస్నా సమీర (ఏపీ) 25–0, 25–0తో తేజస్విని (ఏపీ)పై, మాధవి (తెలంగాణ) 25–4, 23–2తో నిర్మల (ఏపీ)పై, తనూజ (ఏపీ) 25–0, 25–7తో సరిత (తెలంగాణ)పై, భవాని (ఏపీ) 8–21, 25–0, 17–10తో హారిక (ఏపీ)పై విజయం సాధించారు. లీగ్ పోటీలు ముగిసేసరికి టాప్–8లో నిలిచిన ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. -
బాలీవుడ్లో బంగారం మెరుస్తుందా ?
-
ఆదిత్య, అపూర్వలకు క్యారమ్ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ ఇంటర్ ఇన్స్టిట్యూషన్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో ఆదిత్య, అపూర్వ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదిత్య (వీ10) 25-8, 25-17తో హకీమ్ (బీఎస్ఎన్ఎల్)పై విజయం సాధించగా... మహిళల ఫైనల్లో అపూర్వ (ఎల్ఐసీ) 25-10, 25-8తో తేజస్వి (ఆక్సెంచర్)ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఆదిత్య 13-14, 19-2, 25-6తో సూర్యప్రకాశ్‌పై, హకీమ్ 25-0, 25-12తో శివానంద రెడ్డిపై గెలుపొందారు. మహిళల సెమీస్‌లో అపూర్వ 18-4, 29-24, 25-14తో సవితా దేవిపై, తేజస్వి 19-6, 25-0తో నేహారెడ్డిపై పైచేయి సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఆర్.గోవిందరావు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అజిత్, హెచ్ఆర్ఎండీ జనరల్ మేనేజర్ పి.కె.రౌత్, ఆర్బీఐ స్పోర్ట్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి మనోజ్ కులకర్ణి పాల్గొన్నారు. -
అడవి పందులు దూసుకురావడంతో..
అడవి పందులు అకస్మాత్తుగా జీపును ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ విషాదం నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం సంభాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొంతగల్ నుంచి బీర్కూట్ వరకూ కొత్త కల్వర్టు నిర్మాణం జరుగుతోంది. పనుల్లో పాల్గొంటున్న సిబ్బంది.. పనులు ముగించుకొని జీపులో తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా.. అడవి పందులు రోడ్డుపైకి దూసుకొచ్చి జీపును ఢీకొన్నాయి. జీపు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టుంది. ఈ ప్రమాదంలో మనోహర్(26) అనే యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. సురేష్ కుమార్, ఆదిత్య లకు తీవ్ర గాయాలయ్యయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కత్రినాకి లవర్ బాయ్ గిఫ్ట్
ముంబై: కత్రినా కైఫ్ కు ఫితూర్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ స్వయంగా ఒక బహుమతి కొనిచ్చాడట. స్వచ్ఛమైన కాశ్మీరీ పష్మీనా శాలువాను ఆమెకు బహుకరించాడు. 'ఆషికీ' ఫేం ఆదిత్యరాయ్ కపూర్ స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో ఇష్టంగా ఈ కానుకను సెలెక్ట్ చేశాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆదిత్య, కత్రీనాల ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ ఎలావుంటుందోనని ఇప్పటికే బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పష్మీనా షాల్ శాలువాపై చేతితో చేసిన ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇదే దీని ప్రత్యేకత కూడా.. ఇదిలా ఉండగా, చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్' నవల ఆధారంగా కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఫితూర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సీన్ల గురించి ఇప్పటికే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. -
'కెరీర్ ఎరీనా'తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
-
ఆదిత్య లాంటి సినిమాలు అరుదు
బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ‘‘అబ్దుల్ కలాం స్ఫూర్తితో బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలనీ, దేశాభివృద్ధికి వివిధ రంగాల పరిశోధనల్లో కూడా రాణించాలని చెప్పే చిత్రం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆదిత్యలాంటి ప్రతిభ గల విద్యార్థులు ఉంటారని ఈ చిత్రంలో చూపించాం. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపునిచ్చాయి. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఐఏయస్ ఆఫీసర్లు మంచి కథాంశం అని అభినందించారు. ఆదిత్య లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి’’ అన్నారు. -
కలాం స్ఫూర్తితో...
బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలనే అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘విద్యార్థులు దేశాభివృద్ధికి వివిధ పరిశోధనలు చేసి పేరు ప్రఖ్యాతులు పొందాలనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. మా చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి ’’ అన్నారు. వీధి బాలలను లేకుండా చేయాలన్న ఆలోచనతో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో చర్చించనున్నామని తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు. -
ప్రశంసలే ప్రశంసలు!
బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే అంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది. చిత్రవిశేషాలను సుధాకర్ గౌడ్ తెలియజేస్తూ -‘‘జాతీ, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ఈ చిత్రం పలువురి ప్రముఖుల ప్రసంశలు పొందింది. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాలచే పన్ను మినహాయింపు పొందింది. పలువురు ఐఏయస్ ఆఫీసర్స్ కూడా ఈ చిత్రాన్ని అభినందించారు’’ అన్నారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ -‘‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకుంటున్న వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం చేశారు. విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. -
'ఎన్నిసార్లు చెప్పాలి.. మేము ఫ్రెండ్సేనని'
ముంబయి: తాను.. ఆదిత్య అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మంచి స్నేహితులుగానే ఉంటామని ఆష్కి-2 చిత్ర బాలీవుడ్ తార శ్రద్దాకపూర్ అంటోంది. ఆష్కి-2 చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు ఆదిత్యతో మరీ చనువుగా ఉంటోందని ఆ చిత్రంలో మాదిరిగానే వారిద్దరి నిజ జీవితంలో కూడా కెమిస్ట్రీ బాగా కుదిరి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఆ వదంతులే మరికాస్త ముందుకెళ్లి వారిద్దరిప్పుడు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని రకరకాలు మీడియాలో వార్తలు పొక్కుతున్నాయి. ఇదే విషయంపై ప్రశ్నించిన మీడియాతో కాస్తంత చిర్రుబుర్రుగా మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను అదే విషయం మళ్లీ మళ్లీ చెప్తున్నాను. మేమెప్పుడు మంచి స్నేహితులమే. ఈ స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగిస్తాం. ఆష్కి-2 చిత్రం మాకు ఒక ప్రత్యేక అనుభవం అయితే మా ఇద్దరికే ఆ అనుభవం కాదు. దర్శకుడు మోహిత్ సూరి కూడా మాతో ఉన్నారు' అని చెప్పింది ఆ అమ్మడు. -
‘సిప్’ చేయడమే బెటర్!
సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఆదిత్య రెండేళ్ల నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామని ఎదురు చూస్తున్నాడు. మార్కెట్లు భారీగా పడితే ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే.. గత రెండేళ్లుగా స్టాక్ సూచీలు ఎటువంటి భారీ పతనాలు లేకుండా పెరుగుతూ వచ్చాయి. ఒకవేళ ఒకటిరెండు సెషన్లు పడినా వెంటనే మళ్లీ పెరిగిపోతున్నాయి. మొన్న బడ్జెట్ తర్వాత సెన్సెక్స్ 30,000 మార్కును కూడా అధిగమించేసింది. ఇక విశ్లేషకులైతే సెన్సెక్స్ తదుపరి లక్ష్యం 50,000 అని ఒకరు... లక్ష అని ఒకరు చెబుతున్నారు. ఇక ఆగలేక దాచుకున్న సొమ్మును ఒకేసారి ఇన్వెస్ట్ చేశాడు. దురదృష్టమేంటో గానీ... ఇన్వెస్ట్ చేసిన మర్నాటి నుంచీ మార్కెట్లు పడుతున్నాయి. 6శాతం నష్టపోయాయి. దీంతో ఆదిత్యలో ఆందోళన మొదలయింది. ఆదిత్య వైఖరితో ఆయనకు జరిగిన నష్టాలు రెండు. ఒకటి... రెండేళ్లుగా ఆలస్యం చెయ్యటం వల్ల ఈ మధ్యకాలంలో బాగా పెరిగినందున ఆ లాభాల్ని కోల్పోయాడు. రెండు... ఒకేసారి ఇన్వెస్ట్ చేశాడు కనక ఆ తరవాత 6 శాతం పడితే ఆందోళన చెందుతున్నాడు. ఇలా ఆదిత్యలా ఆలోచించే వారు మనలో చాలామందే కనిపిస్తుంటారు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం. స్టాక్ మార్కెట్లో కనిష్ట స్థాయిని, గరిష్ట స్థాయిని అంచనా వేయటం అసాధ్యం. ఇక్కడి వరకు పెరిగింది కనక ఇక తగ్గుతుందనిగానీ, ఇంతవరకూ తగ్గింది కనక ఇక పెరుగుతుందని గానీ చెప్పటం దాదాపు అసాధ్యం. అదే... ఆదిత్య సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని (సిప్) ఎంచుకుని ఉంటే ఎలాంటి ఆందోళనా ఉండేది కాదు. ఈ రెండేళ్ల లాభాన్ని పొందటంతో పాటు ఇపుడు తగ్గినపుడు మరింత ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని పొందేవాడు. ఈ విధాన మేంటో వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు సహజం. సూచీలు పెరుగుతున్నాయా లేక తగ్గుతున్నాయా అన్న విషయాలతో సంబంధం లేకుండా ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేయటమే సిప్. అంటే మీ దగ్గర ఉన్న సొమ్మంతా ఒకేసారిగా కాకుండా అదే మొత్తాన్ని సమాన భాగాలుగా విభజించి నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవడమన్నమాట. దీని వలన ఇన్వెస్టర్లకు ఆర్థిక క్రమశిక్షణ అలవడటమే కాకుండా మార్కెట్ల కదలికలపై ఎటువంటి అందోళనలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండవచ్చు. ఉదాహరణకు రెండేళ్ళ క్రితం స్నేహితులు శివ, సతీష్‌లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నారు. అనుకున్న వెంటనే శివ తన దగ్గరున్న రూ.2.40 లక్షలు ఒకేసారి గోల్డ్‌మాన్ శాక్స్ నిఫ్టీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాడు. సిప్ ప్రయోజనం, స్టాక్ మార్కెట్ కదలికలపై బాగా అవగాహన ఉన్న సతీష్ మాత్రం అలాకాక నెలకు రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. ఈ రెండేళ్ళలో ఈ ఫండ్ సగటున 25 శాతం రాబడిని అందించింది. అంటే 50 శాతం పెరిగినట్లన్న మాట. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసిన సతీష్‌కు కూడా ఇదే విధమైన రాబడి వచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే... శివ తన దగ్గరున్న మొత్తమంతా ఒకేసారి ఇన్వెస్ట్ చేశాడు. దీంతో స్టాక్ మార్కెట్లో ఏ మాత్రం చిన్న సర్దుబాటు వచ్చినా... తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడు. కానీ సతీష్ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్లు పడుతున్నా.. ఆందోళన చెందేవాడు కాదు. ఎందుకంటే మార్కెట్లు పడితే ఎక్కువ యూనిట్లు వస్తాయి.. అదే పెరుగుతుంటే తక్కువ యూనిట్లు వస్తాయి. దీర్ఘకాలంలో సగటున తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్లను పొందే అవకాశం కలుగుతుంది. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం అధిక లాభాలు.. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు కుప్ప కూలితే వచ్చే నష్టాలను ఊహించలేం. మార్కెట్ కష్ట నష్టాలను ముందే తెలుసుకోలేం. భయాలు సాధారణంగా వెంటాడు తుం టాయి. ముఖ్యంగా అధిక రిస్క్ ఉండే సెక్టోరియల్, థిమాటిక్ ఫండ్స్ విషయంలో ఈ భయాలు మరీ ఎక్కువ. ఇలాంటి నష్టభయానికి సిప్ చెక్ పెడుతుంది. మార్కెట్లు పడకుండా పెరుగుతున్న సమయంలో సిప్ వలన కొద్దిగా లాభాలు తగ్గినా నష్టభయం ఆందోళనకు దూరంగా ఉండొచ్చు. అదే ఒడిదుడుకుల మార్కెట్లో అయితే సిప్ అధిక లాభాలను కూడా అందిస్తుంది. మరింత రాబడి.. గత రెండేళ్ల స్టాక్ మార్కెట్ ర్యాలీని పరిశీలిస్తే బ్యాంకింగ్ షేర్లు ముందుండి నడిపిస్తున్నాయి. బ్యాంకు షేర్లలో ర్యాలీని ముందే అంచనా వేసిన జగన్, ఫణి బ్యాంకింగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవగా జగన్ తనదగ్గరున్న మొత్తాన్ని మార్చి, 2013లో ఇన్వెస్ట్ చేశాడు. అదే ఫండ్‌లో ఫణి మాత్రం సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేశాడు. ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన జగన్‌కి ఏడాదికి సగటున 32 శాతం రాబడి వస్తే అదే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసిన ఫణికి మాత్రం 40 శాతం రాబడి వచ్చింది. అదీ సిప్ ప్రయోజనం. కొత్త సిప్లొస్తున్నాయ్.. ఫండ్ సంస్థలు వివిధ సిప్ ప్రొడక్టులను ప్రవేశపెడుతున్నాయి. ఫండ్స్‌తో పాటు బ్రోకింగ్ సంస్థలు షేర్లను కూడా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నెలకు కాకుండా ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసే డైలీ సిప్, ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేసే ఐ-సిప్‌లను, అవసరమైతే మధ్యలో సిప్‌కి బ్రేక్ ఇవ్వడం వంటి పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ముందుగా తక్కువ రిస్క్ ఉండే డెట్ పథకాల్లో ఒకేసారిగా ఇన్వెస్ట్ చేసి, దాని నుంచి ఈక్విటీ ఫండ్‌లోకి ప్రతినెలా ఇన్వెస్ట్ చేసే విధంగా సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. -
మళ్లీ మళ్లీ రావాలి...
ప్రతిభ ఉన్న విద్యార్థి ఓ ప్రొఫెసర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ విద్యార్థి భవిష్యత్తు ఏంటి...? అన్న పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రం ‘ఆదిత్య’. క్రియేటివ్ జీనియస్ అనేది ఉపశీర్షిక. బ్రహ్మానందం, సుమన్, ఎమ్మెస్ నారాయణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు .సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రచార చిత్రాన్ని బ్రహ్మానందం ఆవిష్కరించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ -‘‘సుధాకర్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఈ చిత్రంలో ఓ ఫాల్స్ ప్రొఫెసర్‌గా నటించా. ఇలాంటి చిత్రాలు మళ్లీ మళ్లీ రావాల్సిన అవసరం ఉంది’’అన్నారు. సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ -‘‘సందేశంతో పాటు వినోదం ఉన్న సినిమా ఇది’’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోరుకున్న టీ షర్టు కొనివ్వలేదని...
సాక్షి, ముంబై: తాను కోరుకున్న టీ షర్టు కొనివ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పదేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పుణేలోని ధనక్వాడిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బిల్డర్ సునీల్ పిసాల్ కొడుకు ఆదిత్య... తనకు టీ షర్టు కావాలంటూ పట్టుబట్టాడు. ప్రస్తుతం చలికాలం అయినందువల్ల చలి కోటు కొనిస్తామంటూ తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు యత్నించారు. అయితే ఆదిత్య వినలేదు. తనకు టీ షర్టు మాత్రమే కావాలంటూ మొండికేశాడు, చివరకు అది కొనివ్వకపోవడంతో మనోవేదనకు గురైన ఆదిత్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఆదిత్య మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. -
విద్యార్థులకు స్ఫూర్తిగా...
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తే ఏదైనా సాధించగలుగుతారనేది ప్రధానాంశంగా చేసుకుని స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సీడీని విడుదల చేసి, హైకోర్ట్ న్యాయమూర్తి బి.చంద్రకుమార్‌కి ఇచ్చారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే చిత్రం రూపొందించిన సుధాకర్ గౌడ్‌ని అభినందిస్తున్నానని టి.రాజయ్య అన్నారు. బాలల చిత్రంలో నటించలేదనే కొరత ఈ చిత్రంతో తీరిందని సుమన్ అన్నారు. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ‘‘ఇందులో నేనో కీలక పాత్ర చేశాను. విద్యార్థుల్లో సృజనాతక్మ శక్తి పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనేది ఈ చిత్రం ఇతివృత్తం. వచ్చే నెల విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
ఆత్రేయ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
పిల్లలపై పెద్దల ప్రభావం
ఆదిత్య టైటిల్ పాత్ర పోషించిన బాలల చిత్రం ‘ఆత్రేయ’. అనూహ్య, జీవా కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి శాంతికుమార్ చిలుముల దర్శకుడు. స్టార్ట్ (సర్వీస్ త్రూ ఆర్ట్) హెల్ప్ ఫౌండేషన్-డాట్‌కామ్ ఆర్ట్ క్రియేషన్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 14న బాలల దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘పిల్లల పెంపకంలో పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తల నేపథ్యంలో సాగే కథాంశమిది. కథానుగుణంగా కావాల్సినంత వినోదం కూడా ఉంది. పెద్దల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ సినిమా ద్వారా తెలుపుతున్నాం. ఆత్రేయగా ఆదిత్య, ఎలైస్గా అనూహ్య చక్కగా నటించారు. జీవా మంత్రిగా నటించారు’’ అని తెలిపారు. -
బుడి బుడి పొదుపు...
ఏడేళ్ల ఆదిత్య నాన్నతో కలసి ఏటీఎంకి వెడితే .. కార్డు ఇన్సర్ట్ చేయడం నుంచి నగదు, ట్రాన్సాక్షన్ స్లిప్ తీసుకునేదాకా అంతా తానే చేయాలంటాడు. ఆరేళ్ల భార్గవి .. వాళ్లమ్మతో షాపింగ్‌కి వెడితే డబ్బులు తన చేత్తోనే ఇస్తానని మారాం చేస్తుంది. డబ్బు విలువ గురించి పూర్తిగా తెలియకపోయినా.. ఆర్థిక లావాదేవీలపై వారికి క్రమక్రమంగా పెరిగే ఆసక్తే ఇందుకు కారణం. అది గుర్తించే పిగ్గీ బ్యాంకులు, డిబ్బీలంటూ వారికి పొదుపును అలవాటు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. అటు బ్యాంకులు మరో అడుగు ముందుకేసి పిల్లల కోసం ప్రత్యేకంగా పొదుపు ఖాతాలు అందిస్తున్నాయి. ఉచితంగా పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలతో పలు బ్యాంకులు కిడ్స్ అకౌంట్స్ ఇస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ తదితర బ్యాంకులు ఈ మధ్యే ప్రత్యేక అకౌంట్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే పిల్లల పొదుపు ఖాతాలపై ఈ కథనం.. ఎస్బీఐ .. పెహ్లా కదమ్.. పెహ్లీ ఉడాన్.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల అకౌంట్లు అందిస్తోంది. తల్లి, తండ్రి లేదా సంరక్షకులతో కలసి ఏ వయస్సు పిల్లల కోసమైన సంయుక్తంగా పెహ్లా కదమ్ ఖాతాను తెరవొచ్చు. ఇక, పదేళ్లు పైబడిన వారి కోసం పెహ్లీ ఉడాన్ సేవింగ్స్ ఖాతా ఉపయోగపడుతుంది. దీన్ని వారు సొంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలకు సంబంధించి చెక్ బుక్, పాస్‌బుక్, ఏటీఎం కార్డు ఇస్తారు. బిల్లుల చెల్లింపులు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మొదలైన పరిమితమైన లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఇలాంటి వాటిలో రూ. 5,000 దాకా పరిమితి ఉంటుంది. అదే మొబైల్ బ్యాంకింగ్ విషయంలోనైతే పరిమితి రూ. 2,000గా ఉంటుంది. . యంగ్ చాంప్.. పద్దెనిమిది సంవత్సరాల లోపు వారి కోసం ఫెడరల్ బ్యాంక్ యంగ్ ఛాంప్ పేరిట పొదుపు ఖాతాలను ప్రవేశపెట్టింది. పదేళ్లు అంతకు పైబడి వయస్సున్న పిల్లల కోసం దీన్ని ఉద్దేశించారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్‌లో రూ. 2,500 దాకా వ్యయ పరిమితితో ప్రత్యేకంగా డెబిట్ కార్డును అందిస్తుంది. మొబైల్ అలర్ట్‌లు, పేరెంట్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా నిధుల బదలాయింపు, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్స్‌లో కొనుగోళ్లకు రివార్డు పాయింట్లు మొదలైన ఫీచర్లు ఈ అకౌంట్లో ఉన్నాయి. కిడ్స్ అడ్వాంటేజ్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల అనుమతి మేరకు 7-18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు వారి పేరు మీదే ఏటీఎం లేదా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డును బ్యాంకు ఇస్తుంది. ఏటీఎంల ద్వారా గరిష్టంగా రూ.2,500 విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్ పరిమితి రూ. 2,500గా ఉంటుంది. ఈ ఖాతా రూ. 1,00,000 మేర విద్యా బీమా కవరేజీ ఉచితంగా అందిస్తుంది. అలాగే మూడు నెలలకోసారి స్టేట్మెంట్లు, లావాదేవీలకు సంబంధించిన ఉచిత ఈమెయిల్ అలర్ట్‌లు కూడా బ్యాంకు పంపిస్తుంది. జంబో కిడ్స్ సేవింగ్స్.. కరూర్ వైశ్యా బ్యాంక్ పన్నెండేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం జంబో కిడ్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది. ఇందులో మినిమం బ్యాలెన్స్ బాదరబందీ లేదు. ఏటీఎం కార్డు, ఉచితంగా జంబో డాల్‌ను కూడా బ్యాంకు ఇస్తుంది. అటు స్టూడెంట్ సేవింగ్స్ అకౌంటు పేరిట గరిష్టంగా 23 ఏళ్ల దాకా వయస్సు గల విద్యార్థుల కోసం మరో పొదుపు ఖాతాను కూడా బ్యాంక్ అందిస్తోంది. ఇందులో కనీస బ్యాలెన్స్ రూ.250 ఉండాలి. కోటక్ మై జూనియర్ అకౌంటు.. ఈ ఖాతాలపై కొటక్ మహీంద్రా బ్యాంక్ వార్షికంగా దాదాపు ఆరు శాతం దాకా వడ్డీ ఇస్తోంది. దీనికి అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వంటివి ప్రారంభించి.. క్రమం తప్పకుండా కడుతూ ఉంటే మినిమం బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. రెస్టారెంట్లు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక ఆఫర్లు కూడా బ్యాంకు అందిస్తోంది. ఖాతాను ప్రారంభించిన తొలి ఏడాది ప్రారంభ ఆఫర్ కింద ఆర్డీ, సిప్ మొత్తాన్ని బట్టి నాలుగు నుంచి ఎనిమిది దాకా పీవీఆర్ థియేటర్ సినిమా టికెట్లు లేదా ల్యాండ్‌మార్క్ బుక్ వోచర్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తోంది. యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్ ఖాతా.. పద్దెనిమిదేళ్ల లోపు వారి కోసం యాక్సిస్ బ్యాంక్ ఈ ఖాతాను అందిస్తోంది. పిల్లల పేరిట మూడు నెలలకొకటి చొప్పున ఉచితంగా ఎట్ పార్ చెక్‌బుక్‌లను ఇస్తుంది. కనీసం రూ. 25,000 మేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా (ఆర్నెల్ల పాటు), రూ. 2,000 చొప్పున ఏడాదిపాటు రికరింగ్ డిపాజిట్ చేసినా కనీస నెలవారీ బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. పదేళ్ల పైబడిన పిల్లలకోసం వారు కోరిన చిత్రాన్ని డెబిట్ కార్డుపై ముద్రించి బ్యాంకు అందిస్తుంది. ఆర్నెల్లకోసారైనా డెబిట్ కార్డును స్వైప్ చేసిన పక్షంలో కొన్ని షరతులకు లోబడి రూ. 2 లక్షల దాకా వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. డెబిట్ కార్డు మోసాలు జరిగిన పక్షంలో రూ.50,000 దాకా పర్చేజ్ ప్రొటెక్షన్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీ ఉంటుంది. ఐసీఐసీఐ యంగ్ స్టార్స్ ఒక్క రోజు నుంచి పద్దెనిమిదేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం ఐసీఐసీఐ బ్యాం క్ ఈ ఖాతాను ప్రవేశపెట్టింది. పేరెంట్స్ కోరితే ఏడేళ్లు పైబడిన పిల్లలకు డెబిట్ కార్డును ఇస్తుంది బ్యాంకు. రోజువారీ షాపింగ్ లేదా విత్‌డ్రాయల్ కోసం రూ. 1,000 నుంచి రూ. 5,000 దాకా వీటిపై పరిమితులను ఎంచుకోవచ్చు. ప్రయోజనాలు.. ఈ తరహా అకౌంట్లు పిల్లలకు చిన్నప్పట్నుంచి ఆర్థిక క్రమశిక్షణ అలవర్చేందుకు ఉపయోగపడతాయి. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్‌బుక్కులు, డెబిట్ కార్డులు వాడటం మొదలైన బ్యాంకింగ్ లావాదేవీల గురించి అవగాహన ఏర్పడుతుంది. అయితే, కిడ్స్ అకౌంట్స్ అంటూ బ్యాంకులు ప్రత్యేకత చూపించినా.. బ్యాలెన్సులు, ఫీజులు మొదలైన వాటి విషయంలో మిగతా సాధారణ ఖాతాల తరహాలో వీటి ట్రీట్మెంటు ఉంటుంది. ఇక, పిల్లలు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలంటే.. తల్లిదండ్రులు కూడా వారితో కాస్త సమయం గడపాలి. డిపాజిట్, విత్‌డ్రాయల్స్ చేయడం, స్లిప్స్ నింపడం మొదలైనవి వారికి నేర్పాలి. అకౌంటు మనదే కదా అని వృథా ఖర్చులు చేస్తున్నారా లేదా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అన్నది పరిశీలిస్తూ ఉండాలి. అలాగే ఈ అకౌంట్లు మూడు నాళ్ల ముచ్చట కాకుండా కొనసాగించగలగాలి. ఇవన్నీ జరగాలంటే పేరెంట్స్‌కి కూడా క్రమశిక్షణ ఉండాలి. -
శాస్త్రవేత్తగా...!
ఇప్పటివరకు వెండితెరపై పలు రకాల పాత్రలు పోషించిన బ్రహ్మానందం ఇప్పుడు ‘ఆదిత్య’ చిత్రంలో శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ -‘‘బాల్య దశలోనే విద్యార్థులు సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇందులో బ్రహ్మానందం శాస్త్రవేత్త పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. అభ్యుదయవాదిగా సుమన్, స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎమ్మెస్ నారాయణ చేస్తున్నారు. ఇది చక్కని విద్యా వైజ్ఞానిక చిత్రం అవుతుంది. ఈ నెలాఖరున పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కందేటి శంకర్, ఎడిటింగ్: నందమూరి హరి. -
అబ్దుల్ కలామ్ అవార్డు కోసం...
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ అనాథ బాలుడు అబ్దుల్‌కలాం అవార్డును సొంతం చేసుకోవడానికి ఏ విధంగా కృషి చేశాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న బాలల చిత్రం ‘ఆదిత్య’. ‘క్రియేటివ్ జీనియస్’ అనేది ఉపశీర్షిక. విష్ణు, చెర్రీ, రోమీర్, అర్జున్ ఇందులో ప్రధాన పాత్రధారులు. సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ ప్రత్యేక పాత్రల్లో కనిపించే ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిగ్రహశక్తితో ఎదుర్కొని, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో పోటీ పడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీలో అబ్బుర పరిచే ప్రతిభ కనబరిచిన ‘ఆదిత్య’ అనే బాలుడి కథ ఇది. రాము, పాపం పసివాడు, రేపటి పౌరులు లాంటి క్లాసిక్‌లను గుర్తు చేసేలా సినిమా ఉంటుంది. సెప్టెంబర్ 5న గురుపూజా దినోత్సవ కానుకగా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
సత్యవేడు ఎమ్మెల్యేను నిలదీసిన జనం
రుణాలన్నీ మాఫీ చేయండి బుచ్చినాయుడుకండ్రిగ: రైతు, డ్వాక్రా రుణాలను పూర్తి గా మాఫీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే తలారి ఆదిత్యను వైఎస్సార్ సీపీ నాయకుడు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు అడ్డుకున్నారు. గురువారం మండలంలోని పల్లమాల గ్రామంలో ఎమ్మెల్యే ఆదిత్య పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వంచించడం దారుణమన్నారు. ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కోరారు. చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. రైతు, డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే పూర్తిగా మాఫీ చేయాలన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆదిత్య, టీడీపీ నాయకులు, రైతులు, మహిళలకు, వైఎస్సార్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకొంది. టీడీపీ నాయకులు గొడవకు దిగటంతో ఎస్ఐ ఈశ్వరయ్య రంగంలోకి దిగి సర్దిచెప్పారు. గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బ్రహ్మయ్య, శ్రీరాములురెడ్డి, అధికసంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
కోరిన అడ్రస్‌కు చేర్చే యాప్..
జిప్పర్ యాప్‌తో చిరునామా వెతకడం ఈజీ హైదరాబాదీ స్టార్టప్ ఘనత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటికి తొలిసారిగా వచ్చే స్నేహితులకు వారికి అర్థమయ్యేలా చిరునామా చెప్పడంలో పడే కష్టం అంతా ఇంతా కాదు. మీరు ఎంత వివరించినా చిరునామా కోసం వారి నుంచి పదే పదే ఫోన్ కాల్స్ రావడం సహజం. అదే మీరు పంపే ఒక్క కోడ్‌తో స్నేహితులు నేరుగా ఇంటికి రాగలిగితే.. మీలాంటి వారి కోసమే హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ జిప్పర్ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఉదాహరణకు సాక్షి ప్రధాన కార్యాలయానికి రావాలంటే జిప్పర్లోకి వెళ్లి ‘క్యూయూకేజెడ్3285’ అనే కోడ్ ఇస్తే చాలు. గూగుల్ మ్యాప్‌తో కూడిన చిరునామా మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్/ల్యాప్‌టాప్‌లో ప్రత్యక్షమవుతుంది. మీరున్న చోటు నుంచి ఎలా వెళ్లాలోదారి చూపుతుంది కూడా. ఎలా పనిచేస్తుందంటే.. స్మార్ట్‌ఫోన్‌లో జిప్పర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. క్రియేట్ ఏ జిప్పర్ అన్న చోట క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద ఉన్న మ్యాప్‌పై మీరుండే ప్రాంతం పేరు దగ్గర క్లిక్ చేయాలి. యాడ్ లొకేషన్ పేరుతో ఒక బాక్స్ తెరుచుకుంటుంది. పూర్తి చిరునామా వివరాలు ఇచ్చి సేవ్ చేయాలి. జెడ్ఐపీ.పీఆర్ అనే వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఇచ్చే వివరాల ఆధారంగా ఒక కోడ్ రూపొందుతుంది. జిప్పర్ యాప్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఈ కోడ్‌ను టైప్ చేయగానే అడ్రస్ స్క్రీన్‌పైన కనిపిస్తుంది. రూట్ మ్యాప్పైన క్లిక్ చేస్తే దారి కూడా చూపిస్తుంది. మీ స్నేహితులు, బంధువులు, డెలివరీ బాయ్, క్యాబ్ డ్రైవర్ ఇలా ఎవరికైనా ఈ కోడ్‌ను షేర్ చేయొచ్చు. అనుభవమే యాప్‌కు.. డిజిటల్ మీడియా యాడ్ ఏజెన్సీ మీడియా మింట్‌ను స్థాపించిన వి.ఆదిత్య జిప్పర్ యాప్‌కు రూపకర్త. కాలిఫోర్నియాలో స్టార్టప్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఆదిత్య తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు. క్లినిక్ చిరునామా చెప్పేందుకు ఆయన పడిన శ్రమ అంతా ఇంతాకాదు. అమెరికాలో ఇల్లు, కార్యాలయాల చిరునామా కనుక్కోవడం చాలా సులువు. ఆ స్థాయిలో చిరునామాను సూచించే బోర్డులుంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చిరునామా సమస్యలకు పరిష్కారం ఇవ్వాలన్న ఆలోచన ప్రతిరూపమే జిప్పర్ అని అంటున్నారు ఆదిత్య. 2013 డిసెంబరులో యాప్ విడుదలైంది. ఇప్పటి వరకు 17 దేశాలకు చెందిన 25 వేల మందికిపైగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. హలో కర్రీ, డిజిటల్ క్యాంపస్, ఫుడ్ మింగో, మీడియా మింట్ వంటి 15 కంపెనీలు ఈ యాప్ ద్వారా కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. 108 అంబులెన్సుల్లోనూ ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. నిధుల సమీకరణలో.. మొబైల్, టెలికం ద్వారా కోట్లాది ప్రజలపై ప్రభావం చూపే కంపెనీలకు ఇచ్చే ఎం బిల్లియన్త్ అవార్డ్ సౌత్ ఆసియా రన్నరప్‌గా జిప్పర్ నిలిచింది. కంపెనీకి ఉజ్వల భవిష్యత్తు ఉందనడానికి ఈ అవార్డు నిదర్శనమని ఆదిత్య తెలిపారు. ప్రతి ఇంటికి, కార్యాలయానికి, వ్యాపార సంస్థలకు డిజిటల్ చిరునామా గుర్తింపు ఇవ్వాలన్నదే తమ ల క్ష్యమని చెప్పారు. వ్యక్తులెవరైనా యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కంపెనీల నుంచి కొంత రుసుము వసూలు చేస్తామన్నారు. తొలి 50 కంపెనీలకు ఉచితమని వివరించారు. ఇప్పటి వరకు రూ.1 కోటి వ్యయం చేశామన్నారు. రూ.10 కోట్ల దాకా సీడ్ ఫండ్ సమకూర్చేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని స్వీకరిస్తామన్నారు. ఆదిత్య టీమ్‌లో 10 మంది యువకులున్నారు. -
యాపారం
చెట్టూ పుట్టా, వ్యర్ధం, వ్యసనం, చిన్నా, పెద్దా దేన్నైనా ఎకనామిక్ ఐతో చూడటం మనిషికి ఎప్పట్నుంచో అలవాటు. ఇప్పుడా కన్ను స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్స్ మీద పడింది. మొదట్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్లాంటి ఇంటర్ఫేస్లతో పాటు చిన్నా చితకా ఆప్స్ ఫోన్లతో నిక్షిప్తం అయి వచ్చేవి. కాని ఇప్పుడు ఆప్స్ ఉండే ఓఎస్‌కే ఆదరణ లభిస్తుంది. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. 19 బిలియన్స్లకి అమ్ముడు పోయినే వాట్సాపే దీనికి ప్రత్యేక నిదర్శనం. ఆ ఊపులో మన నగర విద్యార్థులు కూడా ఇ-కామ్ ఆప్స్ తయారీలో చొరవ చూపించి విజయవంతమయ్యారు. అందులో విజయవంతమైన ఓ ఆప్ గురించి... ‘‘..... ఖార్ఖానా బస్టాప్ వచ్చి, మాయా బజార్ హోటల్ గల్లీలో నాలుగో రైట్ నుండి మూడో లెఫ్ట్, పచ్చ రంగు గేటు, దాని మీద ఏపుగా మనీ ప్లాంట్ పెరిగి ఉంటుంది. అదే మా ఇల్లు’’ ఇలా తన అడ్రస్ చెప్పాడొకడు విదేశాల నుండి వచ్చిన తన మిత్రుడికి. ఆ అడ్రస్ ఆనవాళ్లను పట్టుకొని, ఆ మనీ ప్లాంట్ మొదళ్లని చేరుకునే సరికి ఆ విదేశీ ఆసామి వీసా కాస్తా ఆవిరైపోతుంది. ఇలా ఈ తంటాలేవి చెప్పినా అడ్రస్ని అర్థం చేసుకుని, అవతల వ్యక్తికి డెరైక్షన్‌తో కూడిన మ్యాప్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా! అచ్చం ఇలాంటి ఆలోచనే 2011లో ఆదిత్యా పుచి అనే వ్యక్తికి వచ్చింది. అలా ఏర్పడిందే ఈ జిప్పర్ అనే ఆప్. ‘‘స్వతహాగా వైద్యులు అయిన మా నాన్నగారు పేషెంట్లకు మా క్లినిక్‌కి దారి చెబుతుండగా పడ్డ ప్రయాసల నుండి పుట్టింది ఈ జిప్పర్ ఐడియా’’ అని అంటారు 34 ఏళ్ల ఆప్ ఎంటర్ప్రెన్యూర్ ఆదిత్య. హైదరాబాద్ వాస్తవ్యులైన ఆదిత్య స్కూలింగ్ అంతా హెచ్.పి.ఎస్.లోను తరువాత ఇంజినీరింగ్‌ని సి.బి.ఐ.టి.లో పూర్తి చేశారు. 2002లో పై చదువులకు యూఎస్ వెళ్లి వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసి సిలికాన్ వ్యాలీలో ఎక్స్‌పోనెన్షియల్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తరువాత 7 ఏళ్లకి కంపెనీ పనుల మీద తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు ఆదిత్య. ‘‘మన దేశానికి, అమెరికాకు చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇళ్లు - రోడ్ల నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో ఉండి, ఒకసారి తిరిగి చూస్తే లే అవుట్ అంతా గుర్తుండిపోతుంది. కాని మన దేశంలో రోడ్డు వ్యవస్థ సంక్లిష్టంగా, తిరిగే దూరం తక్కువే ఉన్నా చిన్న చిన్న సందులు, మలుపుల వల్ల ఎంతో కన్ఫ్యూజన్.’’ ఇది తిరిగి భారత దేశానికి వచ్చిన ఆదిత్యా మదిలో మెదిలిన ఆలోచన. ఈ ఆలోచనతో 2011లో ఆప్ పనులు మొదలు పెట్టాడు. అప్పటికే ‘మింట్ మీడియా’ అనే ఆన్లైన్ సైట్ నడుపుతున్న అనుభవంతో ఆప్ రూపకల్పన మొదలైంది. కోటి రూపాయల బడ్జెట్‌తో తన కంపెనీలో పనిచేస్తున్న స్నేహితులతో జిప్పర్‌ని రూపొందించి 2013 జూన్న విడుదల చేశారు. ఏం చేస్తుందీ జిప్పర్: ఈ ఆప్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్ కాని, ఏదైనా ప్రదేశం తాలూకు లొకేషన్‌కి ఒక జిప్పర్ కోడ్‌ని క్రియేట్ చేయొచ్చు. తరువాత మీ అడ్రస్ ఎవరికైనా చెప్పాల్సి వచ్చినపుడు, ఆ వ్యక్తికి మీ జిప్పర్ కోడ్‌ని ఎస్.ఎమ్.ఎస్. ద్వారా పంపిస్తే చాలు. సదురు వ్యక్తి కోడ్‌ని జిప్పర్లో ఎంటర్ చేస్తే ఆ వ్యక్తి ఉన్న మ్యాప్ అతని ఫోన్లో ప్రత్యక్షం అవుతుంది. 108తో ఒప్పందం: ఈ ఆప్‌ని మొదలు పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశ్యం ‘అంబులెన్స్ సేవలకు మెరుగైన సేవలు అందించడం’ అని అంటారు ఆదిత్య. జిప్పర్, 108 జీవీకె సేవలతో గత ఏడాది ఒప్పందం చేసుకున్నారు. ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు. ‘‘ఈ రెండేళ్లలో ఎంతో కొంత సాధించామనే అనుకుంటున్నాం. 108తో ఒప్పందం ఒక పెద్ద అచీవ్మెంట్. కోటి రూపాయల బడ్జెట్‌తో మొదలై ఇపుడు లక్షల సెల్ఫోన్స్లలో మా ఆప్ తన సేవలని అందిస్తోంది. మన రాష్ట్రానికి పరిమితం అయిన జిప్పర్‌ని ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు కూడా విస్తరింపచేసే పనిలో ఉన్నాం’’ అని అంటున్న ఆదిత్య యాపారం ఇది. - జాయ్ ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు. -
విద్యార్థుల్లో చైతన్యం కోసం...
‘ఆదిత్య’ పేరుతో ఓ బాలల చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు, నిర్మాత అశోక్‌కుమార్ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య క్లాప్ ఇచ్చారు. పి. విజయవర్మ గౌరవ దర్శకత్వం వహించారు. భీమగాని సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ -‘‘మూడు దశాబ్దాలుగా విద్యావేత్తగా ఉన్నాను. విద్యార్థుల్లో చైతన్యం కలిగించి, వాళ్లల్లో విద్య, వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలనే సదాశయంతో ఈ చిత్రం చేస్తున్నాను. రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. బ్రహ్మానందం ముఖ్య పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో బాలనటుల పాత్రలను ప్రవీణ్, రాహుల్, రోమీర్, షణ్ముఖ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: కందేటి శంకర్, పాటలు: దానయ్య, ఆర్ట్: భాస్కర్.