భారతీయ సంప్రదాయంలో తలపాగాను వివాహాలు వంటి శుభకార్యాల్లో ధరిస్తారన్న సంగతి తెలిసిందే. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సిక్కులు మత పరంగా దీన్ని తప్పనిసరిగా ధరిస్తారు. టర్బన్ లేదా దస్తర్ పేర్లతో పిలిచే తలపాగాను ఎవరైనా కట్టుకుంటారు. కానీ క్షణాల్లో, మెరుపువేగంతో తలపాగా కట్టేయగలగడం ఆదిత్యలో ఉన్న స్పెషాలిటీ.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదిత్య పచోలి అతి తక్కువ సమయంలోనే తలపాగాను కట్టించి గిన్సిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. వృత్తిరీత్యా లాయర్ అయిన పచోలి తన వృత్తిని కొనసాగిస్తూనే, అభిరుచి మేరకు 15 ఏళ్లుగా తలపాగా కట్టే పని చేస్తున్నాడు. ఇటీవలె ఓ వ్యక్తికి కేవలం 14.12 సెకన్లలోనే తలపాగా చుట్టేసి ఆదిత్య రికార్డ్ సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటికే ఈ వీడియోకు 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వైరల్ వీడియోపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు పచోలి టాలెంట్‌కు ఫిదా అవుతుందటే, మరికొందరు మాత్రం గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రతి చిన్న దాన్ని హైలైట్ చేస్తూ దాని విలువను కోల్పోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment