
లేని పోని ప్రయోగాలకు పోతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా వేగంగా కదులుతున్న ట్రైన్‌లోంచి ఒక బాలిక దూకేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
విపరీత పోకడలతో సాహసాలు చేయొద్దని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండటంలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒక బాలిక చాలా వేగంగా కదులుతున్న రైలు ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది.. మెల్లిగా మెట్లు దిగుతూ సడెన్‌గా పట్టాలపైకి దూకేసింది. అయితే ఆమెను నివారించాల్సిన వారు వీడియో తీయడం విమర్శలకు తావిచ్చింది.
ఇది కావాలనే చేశారా? లేదా ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? ఎక్కడ జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే ఆమె తీవ్ర గాయాలతో బతికే ఉందని మాత్రం కొంత మంది కమెంట్ చేశారు.
Girl jumps from a running train expecting to get off like in Bollywood 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/5ktDKMus6o
— Pagan 🚩 (@paganhindu) April 12, 2024