దుమ్మురేపిన అమ్మాయి.. ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు | America Got Talent Anand Mahindra lauds 9 year old Indian origin girl | Sakshi
Sakshi News home page

America's Got Talent దుమ్మురేపిన అమ్మాయి, ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు

Jul 8 2024 6:04 PM | Updated on Jul 8 2024 6:37 PM

America Got Talent Anand Mahindra lauds 9 year old Indian origin girl

‘అమెరికాస్ గాట్ టాలెంట్‌’ షోలో పాల్గొన్న భారతీయ సంతతి అమ్మాయిని ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా  ట్వీట్‌ చేశారు. రియాలిటీ షోలో   ఫ్లోరిడాకు చెందిన ప్రనిస్కా మిశ్రా  తన అద్భుతమైన తన గాప్రతిభతో  న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటోంది.  దీంతో "అవును, అమెరికాకు నిజంగానే టాలెంట్ ఉంది. కానీ అది చాలా వరకు భారతదేశం నుండే వస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో పాల్గొన్న ప్రనిస్కాను పొగడ్తలతో ముంచెత్తారు.  దీంతో ఇది వైరల్‌గా మారింది. 

టీనా  ఐకానిక్ సాంగ్ 'రివర్ డీప్ మౌంటైన్ హై' పాటతో అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మన భారతీయ బాలిక.  దీంతో సూపర్ మోడల్ హెడీ క్లమ్ నుండి గోల్డెన్ బజర్‌ను కూడా అందుకోవడం విశేషం. అంతేకాదు ఆమె స్టేజ్‌మీదకు వచ్చి  ప్రనిస్కాను ఆత్మీయంగా హగ్‌ చేసుకుంది. ఆ తరువాత  ఆమె తండ్రి ఇలా కాసేపు  ఉద్విగ్న క్షణాలతో నిండిపోయింది వేదిక. ఇంతలో వీడియో కాల్‌ ద్వారా  ప్రనిస్కా అమ్మమ్మ లైన్‌లోకి రావడంతో అక్కడి వాతావరణం అటు ఆనందం, ఇటు భావోద్వేగంతో నిండిపోయింది.

 

భూమిపై ఏమి జరుగుతోంది? రెండు వారాల్లో ఇది రెండోసారి. భారతీయ సంతతికి చెందిన  చిన్నఅమ్మాయి తన టేలంట్‌తో  షేక్ చేసింది అంటూ ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. అలాగే అమ్మమ్మ వీడియో కాల్‌ చూడగానే కన్నీళ్లు వచ్చాయంటా ఆయన రాసుకొచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement