Talent
-
శివమణితో సమానంగా.. జూనియర్ శివమణి!
డ్రమ్స్ పేరు చెప్తే ఇండియాలో శివమణి గుర్తుకు వస్తాడు. ఆయనో పెద్ద డ్రమ్స్ ప్లేయర్. ప్రితీష్ కూడా ఏం తక్కువ కాదు. జూనియర్ శివమణి అని చెప్పచ్చు. ఎ.ఆర్ ప్రీతీష్ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం తల్లిదండ్రులతోపాటు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఐదేళ్ల వయసులో అతను తొలిసారి డ్రమ్స్ చూశాడు. సరదాగా దాని మీద ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత అదే అతనికి పనిగా మారింది. వయసులో తనకన్నా పెద్దవాళ్ళతో పోటీ పడి మరీ వాయించేవాడు.డ్రమ్స్ మీద రకరకాల ప్రయోగాలు చేసేవాడు. 8వ తరగతి వచ్చేనాటికి ప్రదర్శనలు ఇస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకునేవాడు. ఆ తర్వాత అతని దృష్టి గిన్నిస్ రికార్డ్ మీద పడింది. ఎలాగైనా దాన్ని సాధించాలని అత్యంత వేగంగా డ్రమ్స్ వాయించడాన్ని నేర్చుకున్నాడు. ఏడు నెలలపాటు అదే పనిగా డ్రమ్స్ వాయించి ఆ పట్టు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గిన్నిస్ ప్రతినిధుల ముందు నిమిషానికి 2,370 సార్లు డ్రమ్స్ వాయించాడు. అంటే ఒక సెకనుకు దాదాపు 40 సార్లు డ్రమ్ వాయించాడు. అతని ప్రతిభ చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అత్యంత చిన్న వయసులో ఒక నిమిషంలో అత్యధిక సార్లు డ్రమ్స్ వాయించిన వ్యక్తిగా అధికారిక రికార్డు అందజేశారు. ప్రీతీష్ కల నెరవేరింది.ఇదీ చదవండి: సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా..వద్దొద్దు! చిన్నారులకోసం చిన్నారుల గేయంపాడుదాం గేయం తారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలుచంద్రుడి పక్కన చుక్కల్లా మెరిసే బంగరు గోపికలుఅంబరానికి తోరణమై నిలిచే అందాల జ్ఞాపికలుఎగరేసే దారం లేదు ఎవరి చేతి ఆధారం లేదుఎత్తున నిలిచే ఊతం అయినా మెరిసే తారకలుఏ రోజూ సెలవు లేదు ఏనాడూ అలుపు రాదువజ్రాలంటి మెరుపు ΄ోదుఅందుకే అవి తారకలుతారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలు∙ -
వయసుకే వృద్ధాప్యం.. !
వయసుకే వృద్ధాప్యం..మనసుకు మాత్రం కాదు.. అన్నట్లు హుషారైన వాతావరణం అక్కడి వారి సొంతం. ఆట ఏదైనా సై అంటూ రంగంలోకి దిగి తమదైన శైలిలో ప్రతిభను చాటుతుంటారు హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ అంతా ఒకచోట చేరి సందడిగా గడుపుతున్నారు. అలాంటి హుషారైన వేదికకు అసోసియేషన్ కార్యాలయం.. సీనియర్ సిటిజన్స్ ఆనందానికి నెలవైంది. వయస్సు మీద పడింది కదా.. అని ఏదో మూలన కూర్చోవడం ఒకప్పటి మాట. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మాత్రం ఆటలతో అదరగొట్టేస్తున్నారు. కేరమ్స్, చెస్ వంటి ఆటలతో మానసికోల్లాసం పొందడమే కాకుండా థ్రెడ్‌మిల్‌పై సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చాలా కుటుంబాల్లో తమవారంతా కార్యాలయాలకో, పిల్లలు స్కూళ్లకో, కళాశాలలకో వెళ్లిపోతుండగా.. సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి ఎవరికి ఇష్టమైన గేమ్‌లో వారు ఆడుతూ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు. రెండు వేల పుస్తకాలతో.. ఆడుకునేవారు ఆడుకుంటుంటే.. మరికొందరు ఇక్కడి లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ విజ్ఞాన సముపార్జన చేస్తుంటారు. సాహిత్యం, ఆధ్యాతి్మకం, హిస్టరీ.. ఇలా దాదాపు నాలుగు వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. కాలనీవాసులు ఇంటికీ తీసుకెవెళ్లేందుకు కూడా అనుమతిస్తారు. అలాగే దినపత్రికలు, మ్యాగజైన్స్ చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు. ప్రతిరోజూ ఇక్కడికి నాలుగు రకాల పత్రికలతో పాటు వివిధ రకాల వీక్లీ మ్యాగజైన్స్ వస్తుంటాయి. వాటిని చదువుతూ ప్రపంచ విశేషాలను తెలపడమే కాదు.. ఇంటికెళ్లి తమ వారితో పంచుకుంటుంటారు. ఆటల పోటీల్లో.. జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 1 (సీనియర్ సిటిజన్స్ డే) సందర్భంగా ఆసరా కమిటీ సహకారంతో జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని సీనియర్ సిటిజన్స్ పలు క్రీడాంశాల్లో పోటీ పడుతుంటారు. కేరంబోర్డు, చదరంగం, బ్రిస్క్ వాకింగ్, టగ్ ఆఫ్ వార్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేస్తారు. ఏడు పదులు దాటిన వయోధికులకు మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతియేటా సన్మానిస్తూ ఎప్పటికప్పుడు వారిలో నూతనోత్తేజాన్ని నింపుతోంది. భవిష్యత్తు తరాలకు సీనియర్ సిటిజన్స్‌కు ఏవిధమైన గౌరవం, ఆప్యాయత చూపించాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తుండడం విశేషం. ఆత్మాభిమానంతో బతకాలి.. ఏ సమాజంలో వృద్ధులు తల ఎత్తుకుని ఆత్మాభిమానంతో మనుగడ సాగిస్తారో ఆ సమాజమే నాగిరిక సమాజం. ఆ సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ముందంజవేసి భావితరాలకు కరదీపికగా నిలుస్తుంది. ఇది ఒక భావన, ఆకాంక్ష, స్వప్నం. దీనిని సాకారం చేసుకోవాలంటే కలలో నుంచి ఇలలోకి రావాలి. నేటి సమాజంలోని వృద్ధుల స్థితిగతులను సామాజిక, శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. – జేఎస్టీ శాయి, ప్రధాన కార్యదర్శి, మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ -
ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’
భారతీయ ఈస్పోర్ట్స్ రంగంలో ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి క్రాఫ్టన్(Krafton) ఇండియా ఈస్పోర్ట్స్(Esports) ‘రైజింగ్ స్టార్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక ఈస్పోర్ట్స్ అథ్లెట్లను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, వారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని కంపెనీ తెలిపింది.రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించనున్నారు. గేమింగ్ నైపుణ్యాలను పెంచడంతోపాటు కంటెంట్ సృష్టి, మానసిక శ్రేయస్సు, సమతుల్య జీవనశైలి నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి పరిశ్రమకు చెందిన కొంతమంది టాప్ ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు అందిస్తారు. వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఈస్పోర్ట్స్ లో దీర్ఘకాలిక విజయాల కోసం బలమైన పునాదిని ఏర్పరుచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: గగనతలంలోకి 16.13 కోట్ల మందిరైజింగ్ స్టార్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు యూట్యూబ్, ఫేస్బుక్ లేదా ఇతర స్ట్రీమింగ్ సర్వీసెస్ వంటి ప్లాట్ఫామ్ల్లో కనీసం 1,000 మంది ఫాలోవర్లు లేదా సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)కు సంబంధించిన కంటెంట్‌ను క్రమం తప్పకుండా తయారు చేస్తుండాలి. అభ్యర్థుల వయసు కనీసం 16 ఏళ్లు ఉండాలి. -
యంగ్ టాలెంట్: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు
అవధాన సుధ పద్యాలు చదివే పిల్లలు ఈరోజుల్లో అరుదైపోయారు. అయితే హైదరాబాద్‌కు చెందిన సంకీర్త్ అలా కాదు. పద్యాలు చదవడమే కాదు అలవోకగా పద్యాలు అల్లుతూ ‘బాలావధాని’ అనిపించుకుంటున్నాడు...పదమూడు సంవత్సరాల వింజమూరి సంకీర్త్ తటవర్తి గురుకులంలో పద్యరచనలో శిక్షణ ΄÷ందుతూ ఎన్నో పద్యాలు రాశాడు. ‘క్షాత్రసరణి’ అనే శతక కార్యక్రమంలో మొదటిసారిగా తన పద్యాలు చదివి ‘భేష్’ అనిపించుకున్నాడు. ‘భీముడు జంపె రావణుని భీకర లీల మహోగ్ర తేజుడై’ అని ఇచ్చిన సమస్యకు బాలావధాని ‘క్షేమము గూర్చగా ధరకి శ్రీయుత రూపము నెత్తె భూతలిన్ / ధామముగాను వెల్గు వరదాయకుడై రణధీరయోగియై/ స్వామిగ లోక రక్షణకు సంతసమొంద రణాన రాముడే / భీముడు జంపె రావణుని భీకర లీల మహోగ్ర తేజుడై’ అని చక్కగా పూరించాడు. దత్తపది అంశంలో ‘కరి వరి మరి తరి‘ పదాలు ఇచ్చి అమ్మవారిని వర్ణించమని అడగగా...‘దేవి శ్రీకరి శాంకరి దివ్యవాణినీదు సేవను తరియించి విత్యముగను లోకమును గావ రిపులను రూపుమాపికావుమమ్మ ధరన్ మరి కరుణ జూపి’ అంటూ పూరించాడు. వర్ణన అంశంలో ఉయ్యాల సేవ వర్ణన అడుగగా ‘వెంకటాచలమని వేంకటేశుని గొల్చి, ఊయలూపుచుండ హాయిగాను, భక్తులకు వరముగ భవ్య స్వరూవమై, వెలసినట్టి దేవ వినయ నుతులు‘ అంటూ చక్కగా వర్ణించాడు. ఒకటవ పాదంలో మొదటి అక్షరం శ, 2వ పాదంలో 2వ అక్షరం మ, 3వ పాదంలో 11వ అక్షరం సా, 4వ పాదంలో 19వ అక్షరం వచ్చే విధంగా దుర్గాపూజను వర్ణించమని అడిగితే...‘శమియగు నీ స్వరూపము సుశక్తినొసంగగ దివ్య మాతవై / గమనము దెల్పుచున్ సుమతి కామితదాయిని సింహవాహిని/ సమత వహించుదేవతగ సారమునిచ్చుచు మమ్ముగావవే / మమతయె పొంగగా ధరణు మానితమూర్తి ముదంబు పాడెనే’ అంటూ పూరించి ధారతో కూడిన ధారణ చేసి అందరి మనసులను ఆకట్టుకున్నాడు.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్కూచిపూడి నృత్య సంప్రదాయంలో తలపై మూడు కుండలు, హిప్ హోల రింగ్ వేసుకుని, కుండపై నిలబడి నృత్యం చేయడం ద్వారా ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది నిడదవోలుకు చెందిన ఆరు సంవత్సరాల చిన్నారి మద్దిరాల కేతనరెడ్డి.వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్పదిహేను సంవత్సరాల వయసులోనే బహుముఖ ప్రజ్ఞతో వివిధ రంగాలలో ఎన్నో విజయాలను సాధిస్తోంది అన్నమయ్య జిల్లా దేవరవాండ్లపల్లికి చెందిన కైవల్య రెడ్డి ‘వివిధ రంగాలలో బహుముఖప్రజ్ఞ చూపిన విద్యార్ధిని’గా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. కూచిపూడి నుంచి కరాటే వరకు ఎన్నో విద్యల్లో ప్రతిభ చాటుతోంది. (చదవండి: మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..ఏకంగా డిజిటల్ స్టార్..) -
ఫ్యాషన్ ప్రపంచాన్నే ఊపేస్తున్న పేదింటి అమ్మాయిలు
లక్నోకు చెందిన నిరుపేద యువతులు అద్భుతాలు సృష్టించారు. పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ల ప్రేరణతో అందమైన బ్రైడల్ డిజైనర్ దుస్తులను తయారు చేశారు. అదీ తమకు దానంగా వచ్చిన బట్టల నుంచి. అలా మనసు ఉండాలేగానీ, ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదని ఈ అమ్మాయిలు నిరూపించారు. వీరు సృష్టించిన డిజైన్లు, మోడలింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ స్ఫూర్తితో లక్నోలోని నిరుపేద పిల్లల బృందం తమ సృజనాత్మకతను గ్లామరస్ బ్రైడల్ వేర్‌గా అబ్బురపోయే డిజైన్లు, ఆకర్షణీయ మైన దుస్తులతో ఇంటర్నెట్లో సంచలనంగా మారారు. లక్నోకు చెందిన ఇన్నోవేషన్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నిరుపేద పిల్లలు. వీరి ప్రతిభకు నెటిజన్లు ఔరా అంటున్నారు. సబ్యసాచి ముఖర్జీ ప్రేరణతోనే వీరు ఈ డిజైన్లను తీర్చిదిద్దారు. వివిధ సంస్థలు, వ్యక్తులనుంచి తమకు విరాళంగా ఇచ్చిన బట్టలు , మిగిలిపోయిన బట్టలు ఉపయోగించి డిజైనర్ ఐకానిక్ డిజైన్లకు పునఃసృష్టి చేశారు. అంతేకాదు వారు రూపొందించిన దుస్తులతో మోడలింగ్ చేయడం మరింత విశేషంగా నిలిచింది. అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, ప్రతిభతో వారంతా స్వయంగా సబ్యసాచిని ప్రశంసలను కూడా దక్కించుకున్నారు. తన ఇన్‌స్టాలో కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు.Forget spending lakhs on bridal wear. These 15+ year old amateur designers from Lucknow who come from under privileged backgrounds & live in a very modest neighbourhood, just turned donated clothes into fashion masterpieces inspired by Sabyasachi Creations.Their inventive and… pic.twitter.com/RlEszP4eA1— Lucknow Development Index (@lucknow_updates) November 8, 2024 దీనికి సంబంధించిన వీడియోను ఎన్జీవో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “మేము లక్నోకు చెందిన NGO, 400+ మురికివాడల పిల్లలతో పని చేస్తున్నాము. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం ఈ డ్రెస్‌లను మా విద్యార్థులే డిజైన్ చేశారు. ఇందులో ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల ప్రాంతాలకు చెందిన వారే. ఈ పిల్లలు చాలా పేద మరియు నిస్సహాయ కుటుంబాల నుండి వచ్చారు. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించారు. వీరంతా స్థానికులు ,చుట్టుపక్కల వారినుంచి వచ్చిన దుస్తులతో వీటిని తీర్చిదిద్దారు. వీడియోలో కనిపిస్తున్న ఈ బాలికలు బస్తీలో నివసిస్తున్న 12 నుండి 17 ఏళ్ల వయస్సున్నబాలికలు’’ అని వివరించింది. ఈ వీడియోను 15 ఏళ్ల ఔత్సాహిక వీడియో గ్రాఫర్స్వ చిత్రీకరించారని కూడా వెల్లడించింది. View this post on Instagram A post shared by Sabyasachi (@sabyasachiofficial) కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో, సబ్యసాచి ఇటీవల తన 'హెరిటేజ్ బ్రైడల్' కలెక్షన్స్ మోడల్స్ వీడియోను పోస్ట్ చేశాడు: "ఎరుపు రంగు సీజనల్ కాదు.., ఐకానిక్." అని పోస్ట్ చేశారు. ఈ థీమ్‌తోనే అదే రంగులో లక్నో గాళ్స్ అదే డిజైన్స్‌ను పునఃసృష్టించారు. -
ఉత్తముల లక్షణం
తమ ప్రతిభని ఎవరు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రదర్శిస్తారు ఉత్తములు. అంతే కాని తమకి ఉన్న పాండిత్యాన్ని అంతా ఎవరి వద్ద పడితే వారి వద్ద ప్రదర్శించరు.ఒకటవ తరగతి చదివే పిల్లలకి వ్యాకరణం బోధిస్తే కంగారు పడి మళ్ళీ దాని జోలికి వెళ్ళటానికి ఇష్టపడరు. వారికి అక్షరాలు చాలు. అంత మాత్రానికే తమకి ఎంతో తెలుసు అనుకుంటారు. తనకి ఎంత తెలుసు అని కాదు, ఎదుటివారికి ఏమి కావాలి? ఎంత వరకు అర్థం చేసుకోగలరు? అన్నది ప్రధానం. ఈ మాట తుంబురుడి గాన విద్యా ప్రావీణ్యం చూసిన నారదుడు అనుకున్నది. ఒక పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థుల కోసం పాడ మంటే రాగం, తానం, పల్లవి ఆలపిస్తే వారు జన్మలో శాస్త్రీయ సంగీతం జోలికి వెళ్లరు. అయినా ప్రతివారి వద్ద తమ ప్రతిభని ప్రదర్శించ వలసిన అవసరం లేదు. చెవిటి వాడి ముందు శంఖం ఊదితే కొరుకుడు పడటం లేదా? సహాయం చేయనా? అని అడుగుతాడు. అంతేకాదు ఎవరి వద్ద క్లుప్తంగా చె΄్పాలి, ఎవరి వద్ద వివరంగా చె΄్పాలి అన్నది కూడా తెలియ వలసిన అవసరం ఉంది. మాట నేర్పరితనంలో ఇది ప్రధానమైన అంశం. దీనికి హనుమ గొప్ప ఉదాహరణం. సీతాదేవిని చూచి వచ్చిన హనుమ తన కోసం ఎదురు చూస్తున్న అంగదాదులతో ముందుగా ‘చూడబడినది నా చేత సీత’ అని క్లుప్తంగా చెప్పి, సావకాశంగా కూర్చొన్న తరువాత వారి కోరిక పైన తాను బయలుదేరిన దగ్గరనుండి ఆ క్షణం వరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు చె΄్పాడు. అందులో తన ప్రతాపం చాలా ఉంది. అది అంతా సత్యమే! అది విని ముఖ్యంగా యువరాజు, ఈ బృందనాయకుడు అయిన అంగదుడు, తన శక్తిని గుర్తించి, గుర్తు చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించిన జాంబవంతుడు, కపులు సంతోషిస్తారు. పైగా కపివీరులు అవన్నీ తామే చేసినట్టు ΄÷ంగి ΄ోయారు. అదే విషయం సుగ్రీవ శ్రీరామచంద్రులతో క్లుప్తంగా చె΄్పాడు. వారు తన యజమానులు. వారి వద్ద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారి సమయం విలువైనది. పైగా రాజుల వద్ద దాసులు తమ ఘనత చెప్పుకోకూడదు. అది రాచమర్యాద కాదు. అందుకే తన ప్రతాపం ఎక్కడా మాటల్లో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక్క మాటలో సముద్రం లంఘించి వెళ్ళాను అని తేల్చి వేశాడు. అది మర్యాద మాత్రమే కాదు, వినయశీలత. విరాటరాజు కొలువులో ప్రవేశించటానికి వెడుతున్న పాండవులకు వారి పురోహితుడు ఇచ్చిన సూచనలు అందరికీ ఉపయోగ పడేవే. రాజుకన్న విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించ కూడదు, రాజుగారి భవనాని కన్న పెద్ద, ఎతై ్తన భవనంలో ఉండ కూడదు అన్నవి ఇక్కడ పేర్కొన దగినవి. తమ ఘనత సందర్భానుసారం ప్రకటించాలి. ఎదగటం లేదా ఒదగటం పరిస్థితులను అనుసరించి ఉండాలి. పిడుగుకి బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు ఉండరు తెలివైన వారు. దీనికి చక్కని ఉదాహరణ చెపుతాడు పింగళి సూరన.‘‘ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మీ’’ అని. చెరువులో నీటి మట్టం పెరిగితే తామర కాడ చుట్లు విచ్చుకొని, పువ్వు గాని, మొగ్గ గాని ఆకు గానీ ఉపరితలం మీద తేలుతాయి. నీరు తగ్గితే కాడ చుట్టలు చుట్టుకొని పువ్వు మాత్రమే నీటి ఉపరితలం మీద ఉంటుంది. నీరు ఎండి΄ోతే దుంపలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి ముడుచుకొని ΄ోయి ఉంటుంది. నీరు నిండితే చిగురిస్తుంది. ఉత్తముల గొప్పతనం కూడా అంతే! – డా. ఎన్. అనంతలక్ష్మి -
లోకల్ టాలెంట్ కాదు అమెరికాస్ గాట్ టాలెంట్
కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్‌పై గ్లాస్ పద్దెనిమిది గ్లాస్లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ నిన్న మొన్నటి వరకు లోకల్ టాలెంట్. ఇప్పుడు మాత్రం అమెరికాస్ గాట్ టాలెంట్. ఫోక్ డ్యాన్సర్ అయిన ప్రవీణ్‌కు అమెరికాస్ గాట్ టాలెంట్ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ‘స్టాండింగ్ ఒవేషన్’ అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్ చేసిన ‘మట్కా భవ’ డ్యాన్స్ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
దుమ్మురేపిన అమ్మాయి.. ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో పాల్గొన్న భారతీయ సంతతి అమ్మాయిని ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రియాలిటీ షోలో ఫ్లోరిడాకు చెందిన ప్రనిస్కా మిశ్రా తన అద్భుతమైన తన గాప్రతిభతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటోంది. దీంతో "అవును, అమెరికాకు నిజంగానే టాలెంట్ ఉంది. కానీ అది చాలా వరకు భారతదేశం నుండే వస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో పాల్గొన్న ప్రనిస్కాను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. టీనా ఐకానిక్ సాంగ్ 'రివర్ డీప్ మౌంటైన్ హై' పాటతో అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మన భారతీయ బాలిక. దీంతో సూపర్ మోడల్ హెడీ క్లమ్ నుండి గోల్డెన్ బజర్‌ను కూడా అందుకోవడం విశేషం. అంతేకాదు ఆమె స్టేజ్‌మీదకు వచ్చి ప్రనిస్కాను ఆత్మీయంగా హగ్ చేసుకుంది. ఆ తరువాత ఆమె తండ్రి ఇలా కాసేపు ఉద్విగ్న క్షణాలతో నిండిపోయింది వేదిక. ఇంతలో వీడియో కాల్ ద్వారా ప్రనిస్కా అమ్మమ్మ లైన్లోకి రావడంతో అక్కడి వాతావరణం అటు ఆనందం, ఇటు భావోద్వేగంతో నిండిపోయింది.What on earth is going on??For the second time, within the past two weeks, a young—VERY young—woman of Indian origin has rocked the stage at @AGT with raw talent that is simply astonishing. With skills acquired in indigenous American genres of music. Rock & Gospel. Pranysqa… pic.twitter.com/2plEj8EXVs— anand mahindra (@anandmahindra) July 8, 2024 భూమిపై ఏమి జరుగుతోంది? రెండు వారాల్లో ఇది రెండోసారి. భారతీయ సంతతికి చెందిన చిన్నఅమ్మాయి తన టేలంట్‌తో షేక్ చేసింది అంటూ ఆనంద్ మహీంద్ర స్పందించారు. అలాగే అమ్మమ్మ వీడియో కాల్ చూడగానే కన్నీళ్లు వచ్చాయంటా ఆయన రాసుకొచ్చారు. -
నాలుగు నెలల చిన్నారి టాలెంట్..పుట్టుకతోనే పుట్టెడు బుద్దులు
-
హైదరాబాద్ టాలెంట్ హబ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని కీలక నగరాల్లో హైదరా బాద్ డైనమిక్ టాలెంట్ హబ్‌గా నిలిచింది. హైదరా బాద్‌తో పాటు నవీ ముంబై, పుణే కూడా మంచి నైపుణ్యం, విభిన్న ప్రతిభకు కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని ప్రముఖ కేపీఎంజీ సంస్థ తమ టాలెంట్ ఫీజబులిటీ నివేదికలో వెల్లడించింది. క్లిష్టమైన నైపుణ్యాలు, విభిన్న ప్రతిభను కోరుకునే రిక్రూటర్ల డిమాండ్లను తీర్చే విధంగా ఈ హబ్‌లు ఎదిగాయని తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు వివిధ పరిశ్రమలకు అవసరమైన ప్రతిభను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. జీవన నాణ్యత, ప్రయాణ సమయం, భద్రత, కనెక్టివిటీ, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన గాలి నాణ్యత అంశాల్లో ఈ మూడు నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని వివరించింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో జీవన వ్యయ సూచికలు తక్కువగా ఉన్నాయని.. బెంగళూరు, గుర్గావ్, పుణే నగరాలు స్థానికంగా అధిక కొనుగోలు శక్తిని అందిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో దేశంలోని 10 రంగాలకు చెందిన 40కిపైగా కంపెనీలు, హెచ్ఆర్ ప్రతినిధులు, నియామక బృందాలతో కలసి ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది.సులభతర వ్యాపారానికి వీలు..నవీ ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వాణిజ్య లీజు ధరలు అందుబాటులో ఉన్నాయని.. ఇది సులభతర వ్యాపారానికి వీలు కల్పిస్తుందని కేపీఎంజీ నివేదిక పేర్కొంది. దీనితో ఈ నగరాల్లో కార్యకలాపాలపై సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. అయితే పన్ను రాయితీలు, సరళీకృత విధానాలు, ఇతర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రతిభ, ప్రభుత్వ మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవన నాణ్యత, వ్యయాలు వంటి అంశాలు సంస్థల ఏర్పాటుకు, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి కీలకమని పేర్కొంది. -
వికసిత్ భారత్‌ను నిజం చేయండి: మోదీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ యువతలో అద్భుత ప్రతిభాపాటవాలు దాగున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడంలో తమ వంతు కృషిచేయాలని వారికి పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ప్రతి జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులతో మోదీ ఆదివారం ఢిల్లీలో మాట్లాడారు. క్రీడల పట్ల కశ్మీర్ ప్రజలు చూపే అమితాసక్తిపై విద్యార్థులను ఆయన అడిగి తెల్సుకున్నారు. హంగ్జూలో ఆసియాన్ పారా గేమ్స్‌లో కశ్మీర్ యువత ఆర్చర్ శీతల్ దేవి సాధించిన మూడు మెడల్స్ గురించి వారితో మాట్లాడారు. ‘‘రోజూ యోగా చేయండి. మీరంతా బాగా చదివి, కష్టపడి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయండి. 2047 కల్లా వికసిత భారత్ కలను నిజం చేయండి’’ అని వారికి పిలుపునిచ్చారు. -
వండర్ బుడ్డోడు..చిన్న వయసులోనే పెద్ద రికార్డు
-
వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో వెనుక పడిన భారత్.. రీజన్ ఇదే!
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (IMD) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ఇంతకు ముందుకంటే కూడా నాలుగు స్థానాలు దిగజారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 56 స్థానం పొందింది. 2022లో ఇండియా ర్యాంక్ 52 కావడం గమనార్హం. ఈ లెక్కన గతం కంటే ఇండియా నాలుగు స్థానాలు కిందికి వెళ్ళింది. భారతదేశ మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పటికీ, ప్రతిభ పోటీతత్వాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇది మెరుగుపడితే ఇండియా మరింత ముందుకు వెళుతుందని అభిప్రాయపడుతున్నారు. 2023 ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, లక్సెంబర్గ్ రెండవ స్థానంలో ఉంది, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా 15వ స్థానంలో, యూకే 35, చైనా 41 ఉన్నాయి. చివరి రెండు స్థానాల్లో బ్రెజిల్ 63, మంగోలియా 64 చేరాయి. ఇదీ చదవండి: భారత్‌లో ధాన్యం ధరలు పెరిగే అవకాశం! కారణం ఇదే.. ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అనేది క్వాలిటీ లైఫ్, చట్టబద్ధమైన కనీస వేతనం, ప్రాథమిక & మాధ్యమిక విద్యతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుంది. దీని ప్రకారం భవిష్యత్ సంసిద్ధతలో భారతదేశం 29వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. -
మన దౌత్యం...కొత్త శిఖరాలకు
న్యూఢిల్లీ: గత నెల రోజుల్లో భారత దౌత్య ప్రతిభ నూతన శిఖరాలను తాకిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 21వ శతాబ్దిలో ప్రపంచ గతిని నిర్ణయించే పలు కీలక నిర్ణయాలకు ఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు వేదికైందన్నారు. నేటి భిన్న ధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలను ఒకే వేదిక మీదికి తేవడం చిన్న విషయమేమీ కాదన్నారు. ‘దేశ వృద్ధి ప్రస్థానం నిర్నిరోధంగా సాగాలంటే స్వచ్ఛమైన, స్పష్టమైన, సుస్థిరమైన పాలన చాలా ముఖ్యం. ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు, మార్పులకు రాజకీయ స్థిరత్వం, విధాన స్పష్టత, పాలనలో ప్రతి అడుగులోనూ పాటిస్తున్న ప్రజాస్వామిక విలువలే ప్రధాన కారణం‘ అని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఇక్కడ జీ20 కనెక్ట్ లో విద్యార్థులు, బోధన సిబ్బంది, విద్యా సంస్థల అధిపతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతిని, వ్యవస్థలో లీకేజీలను అరికట్టేందుకు, దళారుల జాడ్యాన్ని నిర్మూలించేందుకు, పథకాల అమలుకు టెక్నాలజీని గరిష్టంగా వాడుకునేందుకు గత తొమ్మిదేళ్లలో తమ సర్కారు చిత్తశుద్ధితో ప్రయతి్నంచిందని చెప్పారు. భారత్, ద హ్యాపెనింగ్ ప్లేస్! భారత్ ఇప్పుడు ఎన్నో కీలక సంఘటనలకు వేదికగా మారుతోందని మోదీ అన్నారు. ‘గత నెల రోజుల ఘటనలే ఇందుకు నిదర్శనం. దానిపై ప్రగతి నివేదిక ఇవ్వదలచుకున్నా. అప్పుడు నూతన భారతం వృద్ధి పథంలో పెడుతున్న పరుగుల తాలూకు వేగం, తీవ్రత అర్థమవుతాయి. గత నెల వ్యవధిలో నేను ఏకంగా 85 దేశాల అధినేతలతో భేటీ అయ్యా. ఇక ఆగస్టు 23ను మనమెప్పటికీ గుర్తుంచుకోవాలి. అది భారత్ సగర్వంగా చంద్రుని మీద అడుగు పెట్టిన రోజు. ప్రపంచమంతా మన వాణిని విన్న రోజు. మనందరి పెదవులపై గర్వంతో కూడిన దరహాసం వెలిగిన రోజు. అందుకే జాతీయ అంతరిక్ష దినంగా ఆగస్ట్ 23 మన దేశ చరిత్రలో అజరామరంగా నిలవనుంది. ఆ విజయపు ఊపులో వెనువెంటనే సౌర యాత్రకు మనం శ్రీకారం చుట్టాం‘ అన్నారు. ఇక మామూలుగా కేవలం ఒక దౌత్య భేటీగా జరిగే జీ20 సదస్సును మన ప్రయత్నాలతో పౌర భాగస్వామ్యంతో కూడిన జాతీయ ఉద్యమంగా మలచుకున్నాం. ఢిల్లీ డిక్లరేషన్‌కు జీ20 దేశాల నుంచి 100 శాతం ఏకాభిప్రాయం దక్కడం ప్రపంచ స్థాయిలో పతాక శీర్షికలో నిలిచింది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్య దేశంగా చేరింది. ఇలాంటివన్నీ ఆ సదస్సు సారథ్య సందేశంగా మనం సాధించిన ఘనతలే. అంతేకాదు, భారత ప్రయత్నాల వల్ల మరో ఆరు దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి‘ అని వివరించారు. వీరికి అందలం, వారికి అరదండాలు! నేడు మన దేశంలో నిజాయితీపరులకు గుర్తింపు, అవినీతిపరులకు తగిన శిక్ష దక్కుతున్నాయని మోదీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మధ్య తరగతి శ్రేయస్సు కోసం గత నెల రోజుల్లో కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చింది. పీఎం విశ్వకర్మ యోజన, రోజ్ గార్ మేళాతో లక్ష మంది యువతకు ఉపాధి వంటివన్నీ వాటిలో భాగమే‘ అన్నారు. ‘మన దేశం మీద అంతర్జాతీయంగా భరోసా ఇనుమడిస్తోంది. విదేశీ పెట్టుబడుల వెల్లువ రికార్డులు తాకుతోంది. కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడి నూతన మధ్య తరగతిగా రూపుదాల్చారు‘ అని వివరించారు. యువతా! కలసి నడుద్దాం...! జీ20 సదస్సు ఘన విజయానికి యువత భాగస్వామ్యం ప్రధాన కారణమని మోదీ అన్నారు. లోకల్ నినాదానికి ఊపు తెచ్చేందుకు కాలేజీ, వర్సిటీ క్యాంపస్ లు కేంద్రాలుగా మారాలని ఆశాభావం వెలిబుచ్చారు. ‘ఖాదీ దుస్తులు ధరించడం ద్వారా వాటికి ప్రాచుర్యం కల్పించండి. క్యాంపస్‌లలో ఖాదీ ఫ్యాషన్ షోలు పెట్టండి’ అని యువతను కోరారు. ‘మన స్వాతంత్య్ర యోధుల్లా దేశం కోసం మరణించే అదృష్టం మనకు లేదు. కనీసం దేశం కోసం జీవితాలను అంకితం చేసే సదవకాశం మాత్రం మనందరికీ ఉంది’ అని గుర్తు చేశారు. వందేళ్ల క్రితం యువత స్వరాజ్య భారతం కోసం కదం తొక్కింది. మనమిప్పుడు సమృద్ద భారతం కోసం పాటుపడదాం. రండి, కలసి నడుద్దాం!‘ అని పిలుపునిచ్చారు. -
చిట్టి బుర్రలు..గట్టి ఆలోచనలు
రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు): చిట్టి బుర్రల్లో ఆధునిక ఆలోచనలు మొలకెత్తాయి. స్పీడ్‌గా వెళ్తున్న ట్రైన్‌కు ట్రాక్‌పై ఏదైనా అడ్డంకి ఏర్పడితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సడన్‌గా ఆగిపోయే ఇంటెలిజెంట్ ట్రైన్ ఇంజిన్.. చిన్న బటన్ సహాయంతో నడిచేలా దివ్యాంగుల కోసం రూపొందించిన స్మార్ట్ వీల్ చైర్.. మనిషికి అవసరమైన వివిధ పనులు చేసి పెట్టే ఎనిమిది రకాల రోబోలు ఆవిష్కృతమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అద్దంపడుతున్నాయి. పలువురి అభినందనలు అందుకున్నాయి. కాగా, ఇటీవల ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో నిర్వహించిన రోబోటిక్ వర్క్‌షాప్‌లో మూడు రోజుల పాటు 7, 8, 9, పది తరగతుల విద్యార్థులు శిక్షణ పొందారు. అనంతరం వారు రూపొందించిన వివిధ రకాల రోబోలను శనివారం ప్రదర్శించారు. వీటిలో స్మార్ట్ వీల్ చైర్, స్మార్ట్ షాపింగ్ ట్రాలీ, కెమెరాతో పనిచేసే స్పై రోబో, సెర్వింగ్ (ఆహార పదార్థాలు వడ్డించే) రోబో, అగ్రికల్చర్‌కు సంబంధించి హార్వెస్టింగ్ రోబో, ఇంటిలిజెంట్ ట్రైన్ ఇంజన్ తదితర ఎనిమిది రకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
కాలు పోయినా కళను వీడలేదు.. నాట్యం నేర్చుకుని ప్రశంసలు పొందింది
-
ఏలూరు జిల్లాలో వెల్లివిరిసిన విద్యార్థుల ప్రతిభ
-
వైరల్ వీడియో: ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావ్!
-
ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావ్!
వైరల్ వీడియో: ఇంటర్నెట్ తెరిస్తే చాలూ.. జంతువులకు సంబంధించి బోలెడన్ని సరదా వీడియోలు, వాటి విచిత్రమైన ప్రవర్తనకు సంబంధించినవి కనిపిస్తుంటాయి. ఇప్పుడు చూడబోయేది కూడా అలాంటి వీడియోనే. పావురాల మధ్య ఓ కపోతం.. తన ప్రత్యేకతతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్‌ఫ్లిప్స్(వెనకాలకు జంప్)తో . అఫ్కోర్స్.. ఇది పాత వీడియోనే అనుకోండి!. Pigeon doing backflips.. pic.twitter.com/fx51KYL522 — Buitengebieden (@buitengebieden) February 12, 2023 -
ఇంగ్లిష్ ఇడియమ్స్
ఒక విద్యలో అంతగా ప్రతిభ లేకపోయినా తనకు తానే ధైర్యం చెప్పుకుని బరిలోకి దిగడం, కంఫర్ట్ జోన్ వదిలి కొత్త దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా అసౌకర్యంగా ఉన్నా అది బయటపడనివ్వకుండా జాగ్రత్త పడడం...మొదలైన సందర్భాలలో ఉపయోగించే ఇడియమ్ ఇది. ఉదా: ఐ నో యూ ఆర్ వెరీ అన్‌కంఫర్టబుల్ ఇన్‌దిస్ క్లాత్స్. బట్ మస్ట్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియెన్స్. యూ గాట్ టు ఫేక్ ఇట్ అన్టిల్ యూ మేక్ ఇట్. -
అరరె.. అలా ఎలా చేశాడబ్బా? మీరూ ఓ లుక్కేయండి
-
Natural Skills: సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి
ఈ మధ్యన ఒకటి–రెండు సందర్భాలలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంభవించింది. వాళ్లతో మాటా–మాటా కలిపి, వారి–వారి ప్రొఫెషనల్ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారూ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే, వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత ఏరకమైన మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తరువాత సరాసరి ఏదైనా ప్రోగ్రామింగ్ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు. సివిల్ ఇంజనీరింగ్ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలని అనుకుంటున్నావని అడిగితే అసలే అర్థం కాలేదు. అందరూ విద్యార్థులూ ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో మినహాయింపు ఉండవచ్చు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్ బేస్డ్’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్ బేస్డ్’ కాకపోవడమే బహుశా దీనికి కారణం కావచ్చు. ఇదిలా ఉంటే ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా రకరకాల వృత్తి నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తులు మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాలు, ఎయిర్ కండీషన్లు వంటి వాటిని బాగుచేసే మెకానిక్కులు చాలామందే ఉన్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్ కుర్రవాడిని తీసుకు వస్తారు. అతడు కొంతకాలానికి సీనియర్ అయిపోతాడు. అందుకే ఇటువంటివారు నేర్చుకున్న విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం ప్రవేశపెట్టాలి. వీరికి సంబంధిత విద్యార్హతలు లేకపోయినా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! యాభై, అరవై ఏళ్ల అనుభవంతో చేస్తున్న సూచన ఇది. చేతి గడియారం పనిచేయకపోతే, కంపెనీ షోరూమ్‌కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్ షాప్‌కు పోయాను ఇటీవల. ఆ చిన్న షాప్‌లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కూర్చున్నారు. ఆ ఇద్దరిలో సీనియర్ వ్యక్తి (బహుశా) బ్యాటరీ కొత్తది వేయాలని చెప్పి రూ. 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గత ఏభై ఏళ్లుగా... తన తండ్రి కాలం నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామనీ, గడియారాలు రిపేరు చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చనీ, ఎలా అబ్బిందో తెలియదనీ, ఎక్కడా నేర్చుకున్నది కాదనీ అన్నాడు. ఇటీవల మనం వాడుకునే వస్తువులు చెడిపోయినప్పుడు ఎక్కువగా కంపెనీల సర్వీసింగ్ మెకానిక్‌లను పిలవకుండా స్వంతంగా నేర్చుకున్న పనితనంతో తక్కువ ధరకు సర్వీసు చేసి పోతున్న లోకల్ టాలెంట్లనే వినియోగదారులు ఆశ్రయించడం వీరికి ఉన్న విశ్వసనీయతను తెలియ జేస్తోంది. ఇటువంటి నేచురల్ టాలెంట్ ఉన్న వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళ గూడెం బజారులో (లంబాడి) రాము అని ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఖమ్మంలో కార్లు, జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కానీ, లారీలకు కానీ ఏ విధమైన రిపేర్ కావాలన్నా రామునే దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. అప్పట్లో హైదరాబాద్‌లో మా బంధువు లబ్బాయి ఒకడిది అద్భుతమైన మెకానికల్ బ్రెయిన్. ఇంకా కంప్యూటర్లు ప్రాముఖ్యం చెందని రోజుల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో నైపుణ్యం సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. స్నేహితుల సహాయంతో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా హార్డ్‌వేర్ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడి మీద ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు? చాలా కాలం క్రితం ఆంధ్రాబ్యాంక్‌లో కొఠారి చలపతి రావు అనే ఆయన పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు గ్రాడ్యుయేట్ మాత్రమే అయిన కొఠారి చలపతిరావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బ్యాంక్ కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్ భీష్మ పితామహుడు అని పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు? వీరిలాంటి అనేకమంది సహజ నైపుణ్యం ఉన్నవారిని ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలలో క్వాలిఫికేషన్ లేకపోయినా అయినా ఉపయోగించుకోవాలి. అప్పుడే సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మంచి నైపుణ్యం అందుబాటులోకి వస్తుంది. (క్లిక్ చేయండి: గట్టివాళ్లే చట్టానికి గౌరవం) - వనం జ్వాలా నరసింహారావు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం -
Viral Video: టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. వినూత్న డ్రమ్స్ తో అదరగొట్టేశాడు
-
ట్రెండ్: కుటుంబాలకు రీల్స్ గండం
33,500 మంది ఫాలోయెర్ల వల్ల ఒక గృహిణి ప్రాణం పోయింది. తమిళనాడులో తాజాగా ఈ ఘటన జరిగింది. ఫాలోయెర్లు పెరగడంతో రీల్స్ చేయడంలో పడి ఇంటిని పట్టించుకోని భార్యను క్షణికోద్రేకంలో భర్త కడతేర్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మహిళ రీల్స్ వద్దన్నందుకు తన అన్నలిద్దరి మీదా దాడి చేసి పోలీస్ స్టేషన్ చేరింది. రీల్స్ అనేవి మహిళల ప్రతిభను వ్యక్తం చేసే సోషల్ మీడియా సాధనాలుగా ఉన్నాయి. కాని ఏ ప్రతిభా లేకపోయినా కేవలం ఫాలోయెర్ల కోసం వెర్రిమొర్రి రీల్స్ చేసే మహిళల వల్ల కుటుంబాలకు గండాలు వస్తున్నాయి. సోషల్ మీడియా అడిక్షన్ గురించి చైతన్యం రావాల్సిన సందర్భం వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తే ఫాలోయెర్స్ వస్తారు. ఆదాయం కూడా వస్తుంది. 2000 మంది ఫాలోయెర్స్ వస్తే ‘ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్’గా గుర్తింపబడతారు. వీరు చేసిన రీల్స్ నెల రోజుల్లో 1000 మంది చూస్తే వీరికి బోనస్‌లు వస్తాయి. 10వేల మంది ఫాలోయెర్స్ ఉంటే ఒక స్థాయి... లక్ష దాటితే మరో స్థాయి. ఆ తర్వాత ప్రచారకర్తలే ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటారు. రకరకాల పద్ధతుల్లో ఆదాయం వస్తుంది కూడా. తమ ప్రతిభతో, నైపుణ్యాలతో ఈ రీల్స్ ద్వారా గుర్తింపు, గౌరవం పొందుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. ఫిట్నెస్, లైఫ్‌స్టయిల్, స్టాండ్ అప్ కామెడీ, మిమిక్రీ, హెల్త్, యోగా... ఇలా అనేక రంగాల్లో నైపుణ్యం ఉండి వాటి ద్వారా రీల్స్ చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారుతారు. ఈ రంగంలో కొందరు సగటు గృహిణులు, మహిళలు కూడా తమ వంటల ద్వారానో, చమత్కారమైన మాటల ద్వారానో, నృత్యాల ద్వారానో గుర్తింపు పొందుతున్నారు. అయితే తమకు ఉన్న చిన్నపాటి ప్రతిభకు కూడా కామెంట్లు, ఫాలోయెర్లు వస్తుండటంతో ఇక అదే లోకంగా మారిన వారు అవస్థలు తెచ్చుకుంటున్నారు. ఇరవై నాలుగ్గంటలు ఫోన్లో మునిగి, రీల్స్ తయారీలో నిమగ్నమయ్యి, కుటుంబాలలో కలతలకు కారణం అవుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే. సాధించానని భ్రమసి చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపూరులో అమృతలింగం (38) లోకల్ మార్కెట్లో హమాలీగా పని చేస్తాడు. అతడి భార్య చిత్ర చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ముందు టిక్ టాక్, ఆ తర్వాత ఇన్‌స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టిన చిత్ర దాదాపు 35 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. దాంతో ఆమె అన్ని పనులు మాని ఈ రీల్స్ తయారీలో పడింది. అమృతలింగంకు ఇది నచ్చలేదు. ఇంటిని పట్టించుకోమని గొడవకు దిగేవాడు. అయితే రీల్స్ కింద వచ్చే కామెంట్స్ లో పొగడ్తలు నిండేసరికి చిత్ర తన ప్రతిభకు సినీ పరిశ్రమే సరైనదని భర్త మాట వినకుండా మూడు నెలల క్రితం చెన్నై చేరి వేషాలకు ప్రయత్నించసాగింది. వారం క్రితం ఒక ఫంక్షన్‌కు సొంత ఊరు వచ్చి తిరిగి చెన్నై బయలుదేరుతుండేసరికి అమృతలింగం గట్టిగా అడ్డు పడ్డాడు. చెన్నై వెళ్లకూడదని పట్టుపట్టాడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. క్షణికావేశంలో అతను చీరతో ఆమె మెడను బిగించాడు. స్పృహ తప్పేసరికి భయపడి వదిలేశాడు. కాని అప్పటికే ఆమె చనిపోయింది. వద్దు అంటే తిరుగుబాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్తి రాజ్‌పుత్ అనే యువతి ఈ రీల్స్‌కు బాగా అడిక్ట్ అయ్యింది. ఆమెకు ఇంటి విషయాలే పట్టడం లేదని సోదరులు జైకిషన్, ఆకాష్ అభ్యంతరం తెలిపారు. దాంతో ఆమె ఆ ఇద్దరు సోదరులపై దాడి చేసింది. వారు భయపడి పోలీసులను పిలిస్తే స్టేషన్లో మళ్లీ సిబ్బంది ఎదుటే సోదరులను కొట్టింది. అంతే కాదు... అడ్డుపడ్డ మహిళా పోలీసులపై దాడి చేసింది. దాంతో ఆమె కటకటాలు లెక్కించే స్థితికి వెళ్లింది. బతికున్నా లేనట్టే సోషల్ మీడియా అడిక్షన్ దాదాపుగా మనిషిని జీవచ్ఛవంలా మారుస్తాయని నిపుణులైన మానసిక వైద్యులు అంటున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సప్‌లకు అడిక్ట్ అవుతున్నారు. లైక్‌లు, షేర్లు, సబ్స్క్రయిబ్లలో పడి చదువు, ఇంటి పని, బాధ్యతలు, లక్ష్యాలు మర్చిపోతున్నారు. భార్యాభర్తల్లో ఎవరు ఎడిక్ట్ అయినా కాపురంలో కలతలు, జగడాలు వస్తున్నాయి. పిల్లలు చదువును నష్టపోతున్నారు. ఫోన్ చూడొద్దంటే అలిగి ఇళ్ల నుంచి పిల్లలు పారిపోతున్నారు. అపరిచితులతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. లంఖణం దివ్యౌషధం అని పెద్దలు అన్నారు. సోషల్ మీడియా కు సంబంధించిన లంఖణాలు పెట్టడం మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. రోజులో కొన్ని గంటలు ఫోన్ ముట్టుకోకుండా వారంలో ఒక రోజు సోషల్ మీడియా చూడకుండా పేపర్లు, పుస్తకాలు, స్నేహితులపై ధ్యాస మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో అందరి సమ్మతంతో గౌరవాన్ని, ఆదాయాన్ని ఇచ్చే విధంగా మీడియాను వాడితే కలత లు రావు. కాని కుటుంబ సభ్యుల విముఖతను లెక్క చేయకుండా సోషల్ మీడియాకే ప్రాధాన్యం ఇస్తుంటే ఇబ్బందులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. -
పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!
బెల్లంపల్లి: ఆ ఖాకీ చొక్క హృదయంలో అంతులేని వేదన ఉంది. ఇద్దరు పిల్లలు దివ్యాంగులుగా జన్మించడం వేదనకు గురి చేసింది. ఆ వేదనను దిగమింగి పిల్లల సంతోషం కోసం పాడడం మొదలైంది. పాటలు వింటూ పిల్లలు వైకల్యాన్ని మరిచి ఆనందంతో కేరింతలు కొట్టేవారు. కొన్నేళ్లలోనే ఇద్దరు పిల్లలు దూరం కావడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆ బాధను మరిచిపోవడానికి పాటలు పాడుతూనే ఉన్నాడు. ఆ గాయకుడైన పోలీసు అధికారి రామగుండం పోలీసు కమిషనరేట్‌లోని బెల్లంపల్లి ఆర్మ్డ్ రిజర్వుడ్ ఏసీపీ చెరుకు మల్లికార్జున్. దివ్యాంగులుగా పిల్లలు.. మల్లికార్జున్, శ్యామల దంపతులకు 1996లో తొలి సంతానంగా సాహితీ దివ్యాంగురాలిగా జన్మించింది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా పరిస్థితిలో మార్పు రాలేదు. మంచం, కుర్చీకి పరిమితమై ఉండేది. కొద్దిగా మాట్లాడడం తప్పా భూమిపై అడుగు కదిపేది కాదు. తల్లిదండ్రులు ఆమెకు సపర్యలు చేస్తూ అల్లారు ముద్దుగా చూసుకున్నారు. 2001లో రెండో సంతానంగా మగ బిడ్డ జన్మించాడు. విధి ఆ దంపతులకు పరీక్ష పెట్టింది. హర్షిత్ కూడా మానసిక, శారీరక వైకల్యంతో జన్మించడంతో మల్లికార్జున్ దంపతుల దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లల ఆనందం కోసం.. పిల్లలను లాలిస్తూ మల్లికార్జున్ ఓ పాట పాడారు. అంతే ఆ ఇద్దరు పిల్లల మోములో ఆనందం తొణికిసలాడింది. అప్పటి నుంచి మల్లికార్జున్ పదే పదే పాటలు పాడుతుండడంతో ఆ చిన్నారులు వైకల్యాన్ని మరిచి కేరింతలు కొట్టేవారు. వారి సంతోషం కోసం సినిమా పాటలు నేర్చుకుని ఆలపించేవాడు. ఆ తీరుగా ఏళ్లపాటు కొనసాగగా ఆ చిన్నారుల సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. 18 ఏళ్ల వయస్సులో హర్షిత్ 2019లో, కూతురు సాహితీ ఇరవై నాలుగేళ్ల వయస్సు వచ్చాక 2020లో దూరమయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. పిల్లల మరణంతో కుంగిపోయిన మల్లికార్జున్‌ను చూసిన తోటి సహోద్యోగులు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ వేదనను మర్చిపోవడానికి అతడిలో అంతర్లీనంగా దాగి ఉన్న గాయకుడిని తట్టి లేపారు. గతాన్ని మర్చిపోవడానికి పాటలు పాడడం ప్రారంభించాడు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఫ్లేస్టోర్ నుంచి స్టార్ మేకర్ యాప్‌లో పాటలు పాడి అప్లోడ్ చేశారు. శ్రోతల నుంచి స్పందన రావడంతో డ్యూయెట్ పాటలను మేల్‌వర్షన్‌లో పాడి అప్లోడ్ చేయడం ప్రారంభించారు. నచ్చిన ఫిమేల్ సింగర్ అతడి గొంతుతో జత కలపడం, నచ్చిన ఫిమేల్ వాయిస్‌కు మెయిల్ వర్షన్లో మల్లికార్జున్ శృతి కలిపి డ్యూయెట్ పాటలు పాడటం మొదలు పెట్టారు. అలా ఏకంగా 3,387 పాటలు పాడి ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. చిన్నప్పటినుంచే పాటలపై ఆసక్తి కరీంనగర్‌కు చెందిన చెరుకు మల్లికార్జున్ 1996లో పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వుడ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేశారు. అంతకుముందు 1994–95లో మెడికల్ రిప్రజెంటిటివ్‌గా పని చేశారు. 1995లో శ్యామలతో వివాహం జరిగింది. మల్లికార్జున్ 2009లో ఇన్స్పెక్టర్గా, 2019లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఏడాదిన్నర కాలంగా బెల్లంపల్లి ఆర్ముడ్ రిజర్వుడు ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి ఉండగా చదువుకునే రోజుల్లో కళాశాలలో, పోలీసు కార్యక్రమాల్లో పాటలు పాడేవారు. (క్లిక్ చేయండి: అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు) బాలు గాత్రం అంటే ఎంతో ఇష్టం పిల్లల జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రస్తుతం స్టార్ మేకర్ వేదిగా పాటలు పాడుతున్నాను. పిల్లల కోసం నేర్చుకున్న పాటలు ఆ ఇద్దరు మానుండి వెళ్లిపోయాక మర్చిపోవడానికి మళ్లీ పాడడాన్ని ఎంచుకున్నాను. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అంటే ఎంతో ఇష్టం. తుది ఊపిరి ఆగిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాను. – మల్లికార్జున్, సీఆర్ ఏసీపీ, బెల్లంపల్లి -
వైఎస్సార్ జిల్లా యువతికి అరుదైన అవకాశం.. పార్లమెంట్లో ప్రసంగించే చాన్స్
వైవీయూ: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది కడపకు చెందిన యువతి మిద్దె రూప. ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నా.. అధ్యాపకుల తోడ్పాటుతో అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్న ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే అరుదైన చాన్స్ పొందింది. దేశవ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కడప జిల్లాకు చెందిన మిద్దె రూప ఒక్కరే ఉండటం విశేషం. వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన మిద్దె సత్యనారాయణ (లారీ డ్రైవర్), రమాదేవి (గృహిణి) దంపతుల కుమార్తె మిద్దె రూప కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ టూరిజం కోర్సును ఇటీవల పూర్తి చేసింది. అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తోడ్పాటుతో రూప చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ పోటీ ఏదైనా విజేతగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె దాతల సహకారంతో హైదరాబాద్‌లోని ఓ స్టడీ సర్కిల్లో సివిల్స్‌కు సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ కళాశాల నుంచి పార్లమెంట్ వరకు... అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే విద్యార్థులు, యువతీ యువకులను ఎంపిక చేసేందుకు నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న తొలుత జిల్లాస్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా, వీరిలో రూప అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన నలుగురిలో ఒకరిగా నిలిచింది. అనంతరం జాతీయ స్థాయిలో 35 మంది పోటీపడ్డారు. చివరగా టాప్–15 అభ్యర్థులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు ఎంపిక చేశారు. ఈ 15 మంది జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని మిద్దె రూప కావడం విశేషం. రూప పార్లమెంట్లో అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ గురించి ఇంగ్లిష్‌లో ప్రసంగించనుంది. కడప విద్యార్థినికి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడంపై నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయకర్త మణికంఠ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ, చరిత్ర అధ్యాపకుడు బాలగొండ గంగాధర్ తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) -
ఆప్టెక్ ఏవియేషన్- జీఎంఆర్ డీల్, రానున్న పలు ఉద్యోగాలు
సాక్షి, ముంబై: విమానాశ్రయ నిర్వహణ, కస్టమర్ల సేవలకు సంబంధించి కోర్సును ఆఫర్ చేసేందుకు ఆప్టెక్ ఏవియేషన్ అకాడమీతో, జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ‘‘ఈ కోర్సులో చేరే అభ్యర్థులకు ఆప్టెక్ తన కేంద్రాల్లో పూర్తి స్థాయి శిక్షణ అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్సులో మిగిలిన భాగాన్ని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీలో పూర్తి చేయాలి’’అని జీఎంఆర్ ప్రకటించింది. ఈ కోర్సు అనంతరం వారికి ఉపాధి లభించనుంది. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, టికెటింగ్, ప్యాసింజర్ సర్వీస్, సెక్యూరిటీ, క్యాబిన్ క్రూ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. -
పిల్లల కథ: ప్రతిభకు పట్టం
దేవరకొండ రాజ్యానికి రాజు శివవర్మ. తన తెలివితేటలతో, శక్తితో రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు. ప్రజల సుఖశాంతుల కోసం పాలనలో ఎన్నో సంస్కరణలు చేశాడు. తను వృద్ధుడు అవుతున్నాడు. తన తర్వాత రాజ్యానికి రాజు ఎవరు అనే ఆలోచన ఆయన్ని ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. రాజు కొడుకుని రాజు తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయటం అనే సంప్రదాయానికి శివవర్మ పూర్తిగా వ్యతిరేకం. సమర్థుడు, తెలివైనవాడు, ప్రజల మనసు తెలిసినవాడు దేవరకొండ రాజ్యానికి రాజు కావాలనేది శివవర్మ కోరిక. తన తర్వాత రాజ్యానికి రాజును ఎంపిక చేసేందుకు తను ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నానని, ఆ పరీక్షలో తన ఇద్దరు కుమారులతో పాటు రాజ్యంలోని పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చని ప్రకటించాడు శివవర్మ. ఆ పరీక్షకు రాజు పెద్దకొడుకుతో పాటు అనేక మంది హాజరయ్యారు. రాజు చిన్నకొడుకు హాజరుకాలేదు. అత్యంత క్లిష్టమైన రాత పరీక్ష, శరీర సామర్థ్య పరీక్షలలో రాజు పెద్దకొడుకు విఫలమయ్యాడు. పరీక్షలలో విజయం సాధించింది కేవలం ముగ్గురు. వారు అనంతుడు, వీరాచారి, కేశవుడు. ఆ ముగ్గురిని శివవర్మ తన మందిరానికి పిలిపించాడు. ‘నా తర్వాత రాజ్య బాధ్యతలు చేపట్టడానికి ముందుకు వచ్చి, రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైన మీ ముగ్గురికీ ముందుగా నా శుభాకాంక్షలు. చివరిగా నేను పెట్టబోయే పరీక్ష చాలా చిన్నది. కేవలం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరైతే నాకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తారో వారే నా తర్వాత ఈ రాజ్యానికి రాజు ’ అంటూ ముగ్గురికీ స్వాగతం పలికాడు శివవర్మ. ‘ఈ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరిలోకి గొప్పవాడు ఎవరు?’ అడిగాడు రాజు. ‘అందరి కంటే గొప్పవాడు దేవుడు.. ప్రభూ’ చెప్పాడు అనంతుడు. ‘మనుషుల్లో గొప్పవారు ఎవరు అనేది నా ప్రశ్న’ తెలియజేశాడు రాజు. ‘ప్రభూ... మీ మాట ఎవరూ కాదనరు. మీ కంటే గొప్పవారు ఇంకెవరుంటారు’ చెప్పాడు వీరాచారి. ‘రాజు కంటే గొప్పవాడు ఎవరు?’ మళ్లీ అడిగాడు రాజు. ‘గొప్పవాడు ఉన్నాడు మహారాజా.. అయితే నేను మీకు అతన్ని నేరుగా చూపిస్తాను’ అన్నాడు కేశవుడు. అనంతుడు, రంగాచారి, కేశవుడు, రాజుగారు మారువేషాల్లో నగరంలోకి ప్రవేశించారు. ఊరి బయట రహదారి పక్కన కొన్ని విత్తులు నాటుతూ, కొన్ని మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు ఒక వృద్ధుడు. తర్వాత మరో ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి శుభాశుభ కార్యక్రమాలు జరిగే ఇళ్ళల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పోగుచేసి నిరుపేదలకు పంచుతున్నాడు. ఇంకొక ఊరిలో ఒక వ్యక్తి అనాథ శవాలు, జంతు కళేబరాలకు అంతిమ సంస్కారం చేస్తున్నాడు. ‘ప్రభూ, తను పెంచుతున్న ఆ మొక్కలు వృక్షాలై ఫలాలను ఇచ్చేదాకా ఆ వృద్ధుడు జీవించి ఉండలేడు. అలాగే ఆహార పదార్థాలు వ్యర్థం కాకుండా నిరుపేదలకు పంచే.., అనాథ శవాలు, మృత కళేబరాలకు అంతిమ సంస్కారం చేసే వ్యక్తులు కూడా. ఈ ముగ్గురూ తమ కోసం కాక ఇతరుల కోసం పడే ప్రయాసను చూడండి. ఇతరులకు సేవ చేయడం కోసం జీవించేవాడి కంటే గొప్పవాడు ఎవరు ఉంటారు ప్రభూ? ’ అన్నాడు కేశవుడు. కేశవుడి సమాధానంతో రాజు శివవర్మ సంతృప్తి చెందాడు. సంతోషంతో కేశవుని ఆలింగనం చేసుకున్నాడు. కేశవుడిని తన తరువాత రాజుగా ప్రకటించాడు. వెంటనే కేశవుడు తననెవరూ గుర్తించలేని విధంగా ఉన్న తన మారువేషాన్ని తొలగించి అసలు రూపంతో కనిపించాడు. అతన్ని చూసిన రాజు, అనంతుడు, వీరాచారి ఆశ్చర్యపోయారు. అతను రాజు రెండవ కొడుకు కేశవవర్మ. ‘నువ్వు పోటీలో మారువేషంలో పాల్గొనడానికి కారణం ఏమిటి?’ అని కొడుకును ప్రశ్నించాడు శివశర్మ. (పిల్లల కథ: ఆనందమాత) ‘ప్రభూ.. రాజుగారి కొడుకు హోదాలో ఈ పోటీలో పాల్గొనటం నాకు ఇష్టంలేదు. రాజుగారి కొడుకుగా పోటీలో పాల్గొంటే నాతో పాటు పాల్గొనే సాధారణ పౌరులు నన్ను చూసి భయపడటం లేదా వెనకడుగు వేయటం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా మారువేషంలో పాల్గొన్నాను. క్షమించండి ప్రభూ’ చెప్పాడు కేశవవర్మ. ‘కుమారా.. నీ ఆలోచనా విధానం బాగుంది. నువ్వు ప్రజల మన్ననలను పొందే పాలకుడివి కాగలవు’ అంటూ కొడుకును ఆశీర్వదించాడు రాజు శివవర్మ. వీరాచారి, అనంతులకు తన ఆస్థానంలో తగిన ఉద్యోగాలు ఇచ్చాడు. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
నిరాడంబరత అంటే..?
విజ్ఞానం... సాంకేతికాభివృద్ధి వల్ల మన భౌతికమైన సుఖాన్ని పెంచే వస్తువులు ఇబ్బడిముబ్బడి గా మనకి అందుబాటులోకి వచ్చాయి. మన అవసరాలు పెరుగుతున్నాయి. పెరిగిన కొద్దీ వాటిని సమకూర్చుకోగలిగే స్థాయిలో మన ఆదాయాన్ని పెంచుకోవలసి వస్తోంది. సాంకేతిక–రంగ నిపుణులు అందించే ఫలాలను తప్పనిసరిగా పొందాల్సిందే. ఇక్కడే మన ఔచితి వ్యక్తమవ్వాలి. ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అసలు అవసరముందో లేదో వివేచన చెయ్యాలి. ఇది పరిశీలించి అప్రమత్తులమైతే నిరాడంబరతకు దగ్గరగా ఉన్నట్టే. అసాధారణ ప్రతిభ చూపిన తరువాత వచ్చే ప్రశంసలకు చిరునవ్వుతో స్పందించటం నిరాడంబరత. అద్భుతమైన ప్రతిభను ఓ కవి తన గీతంలో గాని, గాయకుడు పాటలో గాని, నర్తకి తన నాట్యంలోగాని లేదా ఏ ఇతర లలిత కళల్లో గాని చూపినపుడు ప్రజలు హర్షధ్వానాలు చేసిన క్షణాన ఎగిరెగిరి పడకుండా ఉండటం నిరాడంబరుల లక్షణం. నిరాడంబరతలో ఉన్న అనేక కోణాలలో ఇక్కడ మనకు స్ఫురించవలసింది నిగర్వం. అసామాన్యులైనా సామాన్యులవలే వర్తించటం, అందరితో కలుపుగోలుగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడటం నిరాడంబరుల వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమే. వారి లోని విద్వత్తు గాని, అద్వితీయమైన కళానైపుణ్యాన్ని గాని, విశేషమైన ప్రజ్ఞను గాని ఎక్కడా అసందర్భంగా.. అనుచితంగా ప్రదర్శన చేయరు. వారి వైఖరి నిండుకుండే. అట్టహాసం.. హడావిడి. వెంపర్లాట లేకుండా ఉండటమే వీరి విశిష్టత. ఆడంబరం లేకపోవటమే నిరాడంబరం. నిరాడంబరత ఇహ ప్రపంచానికే కాక ఆంతరంగిక జగత్తుకు అవసరం. నిజానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకు..? నిరాడంబరత్వాన్ని మాటల్లో.. చేతల్లో చూపించే వారెందరో ఉన్నారు. అది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గ విషయమే. వీరికి మనస్సు లో కూడ అదే భావన ఉండాలి. మనస్సు ఆడంబరపుటూయలలూగరాదు. ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపకూడదు. నిగ్రహశక్తి కావాలి. అపుడే అద్భుత సుఖజగత్తును త్రోసిరాజనగలం. దానిని గురించి ఎవరు మాట్లాడినా.. ఎన్ని ఆకర్షణలు చూపినా అణుమాత్రమైన చలించం. ఇవి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ప్రభావం తాత్కాలికం. శాశ్వతమైన.. అలౌకిక ఆనందాన్నిచ్చే ఉన్నతమైన ఆలోచనాసీమలో మీ మనస్సు విహరిస్తున్న వేళ ఈ బాహ్యప్రపంచపు సుఖం గురించి చింతన ఉండనే ఉండదు. అవి పొందలేకపోతున్నామనే స్పృహే ఉండదు. ఈ స్థితిలో మాట.. చేత.. మనస్సు ఏకమై నిరాడంబరత గంభీర ప్రవాహమవుతుంది. ఆ స్థితికి చేరుకున్నవాళ్లు నిస్సందేహం గా మహానుభావులే. అందుకే నిరాడంబరత అలవడటం.. వ్యక్తిత్వంలో ఓ భాగమవ్వటం చాలా కష్టమైనదని పెద్దలంటారు. అయితే, అసాధ్యం కాదు. కాని ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడని విద్య. నిరాడంబర జీవితం.. ఉన్నత ఆలోచన అనే సిద్ధాంతాన్ని పథంగా తమ జీవితాన్ని పయనింపచేసుకున్నవారు అత్యంత నిరాడంబరులు. ఆదర్శప్రాయులు.. ప్రాతః స్మరణీయులు. నిరాడంబరత కొందరికి స్వాభావికం. కానికొందరికి అభ్యాసం వల్ల అలవడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిభావ్యుత్పత్తులు.. ప్రజ్ఞ... చాలామందిలో ఉండచ్చు. మనకన్నా ప్రతిభావంతులు ఉండచ్చు. జ్ఞానంలో.. నైపుణ్యంలో అత్యద్భుత శక్తి సామర్థ్యాలున్నవారు అనేకులు ఉండవచ్చు. ఇది మదిలో పెట్టుకోవాలి. ఈ నిరంతర స్ఫురణ మనల్ని నిరాడంబరులుగానే ఉంచుతుంది. అతిశయం.. ఆవేశ కావేశాలు.. అతి విశ్వాసం మనల్ని నిరాడంబరతకు దూరం చేస్తాయి. నిరాడంబరత్వం మన ఆహార్యానికీ వర్తిస్తుంది. మనం వేసుకునే దుస్తులు మన ఆలోచనా తీరును చెపుతాయి. సమయానికి.. సందర్భానికి ఏ రకమైన ఉడుపులు వేసుకోవాలో నేర్పుతాయి. ఎంత విలువైన దుస్తులు ధరిస్తే మనకంతటి విలువ అనుకునే వారందరూ ఆడంబరులే. శుభ్రమైన... సాధారణమైన దుస్తులు ధరించి కూడ గొప్ప వ్యక్తిత్వం, ప్రజ్ఞ కలవారు లోకంలో మన్నన పొందుతారు. గొప్ప విద్యావేత్త... మేధావి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సాధారణ దుస్తులు ధరించి తను ప్రసంగించవలసిన సభకు విచ్చేసినపుడు ఆయనకు జరిగిన అనుభవం... ఆయన దానికి స్పందించిన తీరు మనకందరకు తెలుసు. మనిషికి జ్ఞానం... ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రధానం. వాటికే విలువివ్వాలి. నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్న చూపు. ఒక రకమైన ఏవగింపు. వారు పిసినారులని, జీవితాన్ని, దానిలోని సుఖాన్ని అనుభవించటం తెలియదని ఆలోచన.. మితిమీరిన పొదుపు తో ఈ దేహాన్ని కష్టపెడతారని వారి భావన. నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని.. ఆనందాన్ని చూడలేక అలా విమర్శ చేస్తుంటారు. ఐహిక సుఖం అశాశ్వతమైనది. అస్థిరమైనది. చంచలమైనది. నిరాడంబరత ఇచ్చేది ఆనందం. ఇదే శాశ్వతమైనది.. నిజమైనది. మనకవసరమైన వాటినే ఉంచుకోవాలి. మనం ఉపయోగించని వస్తువులను అవసరార్థులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అనవసరంగా కొనే అలవాటు మానుకోవాలి. ఈ పొదుపరితనమే ఒకరకమైన నిరాడంబరత్వం. నిరాడంబరత అలవరచుకోవటం వల్ల మనం సమయాన్ని వృధా కానీయం. మనకెంతో సమయం మిగులుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవనగమనాన్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవచ్చు. చేయతగ్గ మంచిపనులను చేసేందుకు సమయం కేటాయించవచ్చు. చావు పుట్టుకల చట్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించవచ్చు. మనలోని మానవీయతను మన జీవనం లో చూపి ఈ సృష్టిలో మనిషి సర్వోన్నతుడన్న గొప్పవారి మాటలను రుజువు చేయచ్చు. మానవుడు మహనీయుడు కాగలడని వెల్లడి చేయవచ్చు. లేనివారికి.. యోగ్యులైనవారికి మన శక్తిమేరకు దానం చేయవచ్చు. ఆపన్నులకు చేయూతనివ్వవచ్చు. నిరాడంబరతను అలవరచుకుంటే దానిలో నిబిడీకృతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఏమిటా ఐశ్వర్యం..!? పొదుపరితనం.. నిర్మలత్వం... పవిత్రత..« దార్మికత...అద్భుతమైన ఆత్మసంతృప్తి...ఉన్నత ఆలోచన... సాధన... సత్యశోధన ఇలా ఎన్నో ఎన్నెన్నో. పారమార్థిక దృష్టిలో మనమెంత నిరాడంబరులమైతే అంతటి ఐశ్వర్యవంతులం. ఎవరికి తృప్తి ఉంటుందో వారే ధనవంతులు. ఈ తృప్తికి.. అంతులేని సంపద కలిగి ఉండటానికి సంబంధమే లేదు. ఈ తృప్తి ఎలా వస్తుంది.. ఎవరికి ఉంటుంది? నిరాడంబరత వల్ల... ఆ విధమైన జీవితం గడపగలిగే వారికుంటుంది. అంటే సాదాసీదా జీవన శైలి. దీనివల్ల తృప్తి వస్తుంది. ఇదే మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇది గొప్ప ఆనందస్థితి. దీన్ని సాధించటానికే యోగుల దగ్గర నుండి సామాన్యుల వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు... వారి వారి జీవిత నేపథ్యం.. ఆలోచనా విధానం... వారికి తోచిన మార్గాలననుసరించి. గమ్యాలు వేరు, కాని లక్ష్యం ఒకటే. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
శభాష్ బాబు.. ఆయన చిత్రం సజీవ దృశ్యం
సిరిసిల్ల కల్చరల్: అతను చిత్రం గీస్తే సజీవ దృశ్యం అన్న భావన కలుగుతుంది. అత్యంత అలవోకగా గీసే రేఖాచిత్రాల్లో సైతం అరుదైన సృజనాత్మకతను ప్రదర్శించే నైపుణ్యం ఆయనకే సొంతం. పుస్తకాల ముఖచిత్రాలు, లోపల సందర్భానుసారం వచ్చే బొమ్మలు, వివిధస్థాయిల్లోని రాజకీయ నాయకుల చిత్రపటాలు అతని చేతిలో శాశ్వతత్వాన్ని ఆపాదించుకుంటాయి. పసి వయసు నుంచే పెంచుకున్న అభిరుచి అంచెలంచెలుగా పరిణామం చెంది చెయ్యి తిరిగిన కళాకారుడిగా ఎదిగిన ఆయనే దుండ్రపెల్లి బాబు. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని గీసి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టిని ఆకర్షించాడు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమే లక్ష్యం మా ఊరులో ఉన్న సొంత ఇల్లు, కొంత పొలం, మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణం కారణంగా మునిగిపోయింది. చిన్న కుటుంబం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. నా కళే నా పెట్టుబడి. చేతిలో ఉన్న కళనే పూర్తిగా నమ్ముకున్నా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న. ఎప్పటికైనా సరే అంతర్జాతీయ స్థాయి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నది నా సంకల్పం. – దుండ్రపల్లి బాబు పేద కుటుంబం నుంచి తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన దుండ్రపెల్లి లక్ష్మి, దుర్గయ్య రెండోసంతానంగా 1988లో జన్మించా డు బాబు. పేద వ్యవసాయ కుటుంబం. ఆర్థిక వనరుల లేమితో చొప్పదండిలోని తన మేనమామ దగ్గర పెరిగా డు.పదోతరగతి వరకు మంథనిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో, రుక్మాపూర్‌లో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి, జెఎన్టీయూ నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా తనకు ఎంతో ఇష్టమైన బ్యాచ్‌లర్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరిపోయాడు. 2014లో బీఎఫ్ఏ పూర్తి చేసి ఆరో అనే కంపెనీలో ఇలస్ట్రేటర్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశాడు. మరింత నైపుణ్యాల కోసం ఎంఎఫ్‌ఏలో చేరాడు. ఇదీ.. బాబు ప్రతిభ 2016లో ఎంఎఫ్ఏ పూర్తయ్యాక పుస్తకాలకు వేసే ముఖపత్రాలకు అందమైన ఇలస్ట్రేషన్ ఇవ్వడంతో పేరు తెచ్చుకున్నాడు. ఓ ప్రవాస భారతీయుడి కోరిక మేరకు ‘చిన్ననాటి ఆటలు. జ్ఞాపకాల మూటలు’ అనే పుస్తకానికి సుమారు 100 చిత్రాలు గీసి ఇచ్చారు. కందుకూరి రాము, శివజాస్తితో కలిసి చేసిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇచ్చింది. రామాయణం, మహాభారతం సహా అంతర్జాతీయస్థాయి పుస్తకాలకు వేసిన చిత్రాలు ఆదరణ పొందాయి. భారతీయ నేపథ్య వస్త్రాలంకరణతో రూపొందించిన రాజులు, చక్రవర్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ నేతలు సుమారు 500 క్యారెక్టర్ల చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. మరో వందచిత్రాల రూపకల్పన కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చలనచిత్రాలకు సంబంధించిన స్టోరీబోర్డు వర్క్‌లో బిజీగా ఉంటున్నాడు. సినిమాకు సంబంధించిన చిత్రానువాద స్క్రిప్ట్‌తో చిత్రాలకు అక్కడికక్కడే గీసి ఇవ్వడం మనోడి ప్రత్యేకత. -
ఇంటర్లో ఫస్టియర్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి ప్రతిభ
వరంగల్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి గుండ సాయి శ్రావణి అద్భుత ప్రతిభ కనబరిచింది. గురువారం వెల్లడైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఆమె మెరుగైన మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో మొత్తం 470 మార్కులకు గాను 466 మార్కులు తెచ్చుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇది రెండో అత్యుత్తమ మార్కులుగా పేర్కొంటున్నారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో లాంగ్వెజెస్‌ను మినహాయిస్తే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఫుల్ మార్కులు సాధించారు. ఇంగ్లీష్ వందకి 97, సంస్కృతంలో వందకి 99 మార్కులు తెచ్చుకున్నారు. సాయి శ్రావణి మార్కుల పట్ల ఆమె తల్లిదండ్రులు గుండ అమర్నాథ్, నిర్మలాదేవిలు హర్షం వ్యక్తం చేశారు. -
Celebrate Your Unique Talent Day: టాలెంట్ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: టాలెంట్ ఉండాలే కానీ మన క్రియేటివిటీని ఎక్కడైనా నిరూపించుకోవచ్చు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు టాలెంట్, ప్రతిభ లేదా దిమాక్ ఇవి వుంటే చాలు మనకు మనమే తోపులం. మిగతావారితో పోలిస్తే ప్రత్యేకమైన ప్రతిభతో డిఫరెంట్‌గా ఉండాలి. మనలో ఉన్న టాలెంట్‌ని వెలికి తీసి ఔరా అనిపించుకోవాలి. నవంబర్ 24 టాలెంట్ డే సందర్భంగా సెలబ్రేట్ యువర్ యూనిక్ టాలెంట్ డే అంటోంది సాక్షి. ఇది మీకు తెలుసా? టాలెంట్ అంటే ఒకప్పుడు బరువుకి మెజర్‌మెంట్‌గా వాడేవారు.అలాగే పనికి విలువ ఇవ్వడానికి ఇది ఒక మార్గంగా కూడా ఉపయోగించారు.. ప్రాచీన గ్రీస్‌లో టాలెంట్ అంటే దాదాపు 55 పౌండ్లు లేదా 25 కిలోగ్రాముల వెండికి సమానమట. -
సముద్రాలు దాటిన తెలుగోళ్ల ప్రతిభ
-
‘తరలింపు ఆపండి’ : అమెరికాకు తాలిబన్ల స్ట్రాంగ్ వార్నింగ్
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నైపుణ్యం కలిగిన అఫ్గాన్లను తరలించుకు పోవడాన్ని నిలిపివేయాలని అమెరికాను హెచ్చరించారు. అలాగే అఫ్గన్లు దేశం విడిచి వెళ్లిపోవద్దని, కాబూల్‌లోని విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇకపై అనుమతించబోమని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా వైద్యులు, ఇంజనీర్లు, ఇతర విద్యావంతులైన నిపుణులు తమకు చాలా అవసరమని మంగళవారం నాటి సమావేశంలో ప్రకటించారు. అలాగే ప్రస్తుత గందరగోళ పరిస్థితుల కారణంగా అఫ్గాన్లను విమానాశ్రయానికి అనుమతించడం లేదని, విమానాశ్రయంలో ఉన్నవారు ఇంటికి వెళ్లిపోవాలని కోరారు. వారి భద్రతకు తమది పూర్తి హామీ అని పేర్కొన్నారు. బ్యాంకులు బుధవారం నుంచి పనిచేస్తాయని, ఆసుపత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, మీడియా సంస్థలు, లోకల్ పాలనా సంస్థలు ఇప్పటికే పనిలో ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు మహిళలపై ఆంక్షలను కొనసాగిస్తూ కీలక ప్రకటన చేశారు. చదవండి : అమెరికాకు డెడ్‌లైన్ విధించిన తాలిబన్లు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్నేత తాజా హెచ్చరిక జారీ చేశారు. తమ భద్రత కోసం వారంతా ఇంట్లోనే ఉండాలన్నారు. అయితే భవిష్యత్తులో వాళ్లు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ రహస్య మంతనాలు జరిపారన్న వార్తలను ఆయన ఖండించారు. అలాంటి సమావేశం ఏదీ జరగలేదని తెలిపారు. చదవండి : Afghanistan: తాలిబన్లతో సీఐఏ చీఫ్ రహస్య భేటీ! అలాగే పంజ్‌షీర్ సోదరులంతా కాబూల్‌కు తిరిగి రావాలని ముజాహిద్ కోరారు. భయపడొద్దు, తిరుగుబాటు చేయొద్దని కూడా ఆయన తెలిపారు. కాబూల్‌నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకునేందుకు గడువును పొడిగించబోమని మరోసారి తెగేసి చెప్పారు. అమెరికా తన ప్రజలందరినీ ఆగస్టు 31 లోపు తరలించాల్సిందేనని స్పష్టం చేశారు. చదవండి : బంగారం లాంటి ఆస్తులు అమ్మేస్తున్నారు: మోదీపై రాహుల్ ధ్వజం -
రైతు ఐడియా చూసి వావ్ అనాల్సిందే!.. ఫన్నీ వీడియో
సాక్షి,హైదరాబాద్: శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మనిషి తనకెదురయ్యే అపాయాలకు, కష్టాలకు మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. తనకున్న పరిధిలో ఎప్పటికపుడు అనేక ఉపాయాలను కనుక్కుంటూనే ఉంటాడు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఆ అన్వేషణ, తపనే అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఆసక్తిని రేపుతోంది. కాకులు, ఇతర పక్షుల బెడదనుంచి తన పొలాన్ని తప్పించుకునేందుకు ఒక రైతు చేసిన ప్రయోగం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్ప్రింగ్ ద్వారా ఒక బొమ్మను నిరంతరం కదులుతూ ఉండేలా, పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు చేశాడు. ఇది చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. అంతేకాదు కాకులేమోగానీ, మనుషులకు మాత్రం హార్ట్ ఎటాక్ రావడం గ్యారంటీ అంటూ చమత్కరిస్తున్నారు. కాగా సాధారణంగా పొలంలో పశువులు, ఇతర పక్షులనుంచి పంటను రక్షించుకునేందుకు దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో రకరకాల దిష్టిబొమ్మలు పెడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు పోటోలు పొలంలో దిష్టి బొమ్మలుగా పెట్టుకున్న వైనం విచిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. O bhai saheb...did Ramsay brothers create this one??! crows ka toh nahi pata, insano ka heart attack guaranteed. https://t.co/sVFpd4bxo6 — Smita Sharma (@Smita_Sharma) July 12, 2021 -
పదేళ్ల వయస్సులోనే ప్రతిభ.. నాట్యం, మార్షల్ ఆర్ట్స్‌లో రాణిస్తున్నచిన్నారి..
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): చిరుప్రాయంలోనే పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ఈ చిన్నారి పేరు గద్దె శ్రేష్ట. వేములవాడకు చెందిన ఈ చిన్నారి ఓవైపు శాస్త్రీయ నృత్యం, మరోవైపు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబరుస్తూ ప్రశంసలు అందుకుంటోంది. వీటికి తోడు హస్తకళాకృతులను తయారు చేస్తూ తన సృజనాత్మకతను చాటుకుంటోంది. 2010 మే 17న జన్మించిన శ్రేష్ట ఉన్నత చదువుల కోసం ప్రస్తుతం కరీంనగర్లో తన తల్లిదండ్రులు స్వప్న–శ్రీవర్ధన్ వద్ద ఉంటోంది. నాలుగేళ్ల వయస్సులోనే టీవీలో వచ్చే వివిధ డ్యాన్స్ షోలను చూస్తూ అలవోకగా స్టెప్పులు వేయడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమె అభిరుచికి అనుగుణంగా కరీంనగర్‌లోనే చొప్పరి జయశ్రీ వద్ద డ్యాన్స్ నేర్పించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్’లో శిక్షణ ఇప్పించారు. ఇప్పటికే 20 వరకు నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ఆరెంజ్ బెల్ట్ సాధించి, పలు రాష్ట్రీయ, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. లాక్డౌన్లో సమయాన్ని వృథా చేసుకోకుండా వ్యర్థ పదార్థాలతో అర్థవంతమైన ఆకృతులను తయారు చేస్తూ తనలోని సృజనాత్మకతను చాటుకుంటున్న శ్రేష్ట మరింత రాణించాలని కోరుకుందాం. -
కష్టాల కడలి: రాత మార్చిన ‘గీత’
రాప్తాడు: చేయి పట్టుకుని నడక నేర్పించే తండ్రి దూరం కావడం.. ఆ చిన్నారి ఒంటరితనానికి కారణమైంది. కుటుంబ పోషణ కోసం అమ్మ పడుతున్న కష్టం కలచి వేసింది. పలుగు... పార చేతబట్టి ఉపాధి పనులకు పోయిన తల్లి చేతుల నిండా బొబ్బలు.. అన్నం ముద్ద తినిపిస్తున్న ఆమె చేతిలోని గాయాలు ఆ చిన్నారి హృదయాన్ని మరింత గాయపరిచాయి. ఏదో తెలియని ఒత్తిడి. ఆ భారం నుంచి బయటపడేందుకు తనకొచ్చిన గీతలతో కాలక్షేపం. ఆ గీతలే చివరకు అతని ఒత్తిడిని దూరం చేశాయి. అభద్రతాభావం నుంచి బయటపడేస్తూ అద్భుత చిత్రకారుడిని ఈ లోకానికి పరిచయం చేశాయి. అతనే షేక్ మహమ్మద్ అర్షద్ (ఎస్.ఎం.అర్షద్). చనిపోవాలనుకుని.. రాప్తాడుకు చెందిన బికెన్బాషా, కౌసర్‌బాను దంపతులకు ఇద్దరు కుమారులు. పదేళ్ల క్రితం భార్యాపిల్లలకు బికన్బాషా దూరమయ్యాడు. దిక్కుతోచని స్థితిలో కౌసర్‌బాను కొట్టుమిట్టాడింది. చిల్లిగవ్వ కూడా చేతిలో లేక సతమతమవుతున్న కౌసర్‌బాను తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో పుట్టింటి వారు ఆమెకు ధైర్యం చెప్పారు. మదర్‌థెరిస్సా చిత్రాన్ని గీస్తున్న అర్షద్- అర్షద్ గీసిన త్రీడీ చిత్రం.. ఎలాగైనా ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేయాలని అనుకున్న ఆమె ఉపాధి పనులతో పాటు కూలి పనులకు వెళ్లడం మొదలు పెట్టింది. ఏనాడూ ఎండ ముఖం ఎరుగని ఆమె.. ఒక్కసారిగా తట్టాబుట్ట పట్టుకుని పొలాల బాట పట్టింది. ఈ క్రమంలోనే తమ కోసం తల్లి పడుతున్న తపన ఆ ఇద్దరు చిన్నారులనూ కదిలించింది. తల్లి రెక్కల కష్టం వృథా కాకూడదనుకున్న వారు ఇష్టంతో చదువుకుంటూ రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో సీటు దక్కించుకున్నారు. ప్రస్తుతం కౌసర్‌బాను పెద్ద కుమారుడు ఎస్.ఎం.అర్షద్ స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. గీతలతోనే కాలక్షేపం రాప్తాడులోనే అద్దె ఇంటిలో నివసిస్తున్న కౌసర్‌బాను.. అప్పు చేసి కుట్టుమిషన్ సమకూర్చుకుంది. ఉదయం ఉపాధి పనులకు పోవడం, ఇంటికి వచ్చిన వెంటనే కుట్టు మిషన్ మీద ఇతరుల దుస్తులు కుట్టి ఇవ్వడం ద్వారా వచ్చే సంపాదనతో పొదుపుగా జీవనం సాగించడం మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలోనే తాను ఇంటి వద్ద లేని సమయంలో అర్షద్ కాగితాలపై గీతలు గీస్తుండడం ఆమె గ్రహించింది. నోటు పుస్తకాల నిండా గీతలు గమనించిన ఆమె ఒక్కసారిగా అసహనానికి గురైంది. అసలే అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే.. చదువులకు ఇక నోటు బుక్కులు ఎలా కొనుగోలు చేయాలంటూ కుమారుడిని మందలిస్తూ వచ్చింది. ఇలాగే గీతలు గీస్తూ కూర్చొంటే తనలా కూలి పనులకు వెళ్లాల్సి ఉంటుందని కుమారుడిని హెచ్చరించింది. బుద్ధిగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో బాగా ఎదగాలని హితబోధ చేసేది. త్రీడీ చిత్రాలు గీయడంలో దిట్ట ఇంటి వద్ద ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు పిచ్చి గీతలు గీయడం మొదలు పెట్టిన అర్షద్... ఆ తర్వాత ఆ గీతల ద్వారా అద్భుతాలను ఆవిష్కరించడం మొదలు పెట్టాడు. తల్లి ఇస్తున్న డబ్బును దాచుకుని వాటితో తనకు కావాల్సిన పెన్నులు, స్కెచ్‌లు, పెయింట్స్, డ్రాయింగ్ పేపర్లు కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో బొమ్మలు గీయడం మొదలు పెట్టాడు. అతనిలోని కళాకారుడిని అతని క్లాస్మేట్స్ గుర్తించి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తాను చదువుకుంటున్న స్కూల్లోని ఉపాధ్యాయుల చిత్రాలను గీసి, అందరి మన్ననలూ పొందాడు. ఆ సమయంలోనే త్రీడీ చిత్రాలు గీయడం నేర్చుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. అప్పటి వరకూ త్రీడీ చిత్రాలు అంటే ఏమిటో తెలియని అర్షద్.. ఇంటికెళ్లిన తర్వాత సెల్ఫోన్లో యూట్యూబ్ ద్వారా త్రీడీ చిత్రాలు గీయడం చూసి సాధన మొదలు పెట్టాడు. చూస్తుండగానే అందరినీ అబ్బురపరిచే స్థాయికి ఎదిగాడు. అర్షద్లోని ప్రతిభను తల్లి కౌసర్ గుర్తించింది. కుమారుడి అభీష్టం మేరకు అతనికి ఇష్టమైనవి కొనుగోలు చేసి ఇస్తూ మరింత ప్రోత్సహిస్తూ వచ్చింది. -
వీళ్ళు చాల కేక గురు
-
వావ్..చీరలోనే అదరగొట్టిందిగా...!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా మహిళలు చీర కట్టులో కొన్ని పనులు చేయడానికి ఇబ్బంది పడటం సహజం. ముఖ్యంగా క్రీడల్లో అయితే మరీ కష్టం. అందులోనూ చీరలో జిమ్నాస్టిక్స్ చేయడం మంటే కత్తి మీద సామే.. ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యం కాదు. అయితే ఇటీవలి కాలంలో చీరలో ఇలాంటి విన్యాసాలు చేస్తున్న వనితల వీడియోలు సోషల్ మీడియాలో అబ్బుర పరుస్తున్నాయి. మగువలు తలచు కోవాలేగానీ, సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక యువతి చీరలో అతి సునాయాసంగా పల్టీలు కొడుతున్న తీరు ఔరా అనిపిస్తోంది. చాలా నేర్పుగా, ఒడుపుగా తన విద్యను ప్రదర్శించిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఒకసారి చూసేయండి.. అన్నట్టు నో అబ్యూజ్ కమెంట్స్ ప్లీజ్.. ప్రతిభ ఏ రూపంలో ఉన్నా అభినందించాల్సిందే. వారి పట్టుదలను మెచ్చుకోవాల్సిందే! ఏమంటారు? When a gymnast does flips in a saree. Watched it thrice just to see how the saree defied gravity. #ParulArora #ownit pic.twitter.com/tOxzqUOA7H — Aparna Jain (@Aparna) January 7, 2021 -
వావ్.. వజీర్..
సాక్షి. వైరా రూరల్: యూట్యూబ్ అతడికి మార్గదర్శిగా నిలిచింది. అందులో నుంచి బుల్లెట్లను రీమోడలింగ్ చేసే విధానాన్ని నేర్చుకుని.. ఎన్నో పాత బుల్లెట్లను కొత్తగా మార్చాడు. ఈతరం బుల్లెట్ల మాదిరిగానే అవి ఉండటంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో ఆ వృత్తినే జీవనోపాధిగా మార్చుకుని “బుల్లెట్’లాగా దూసుకుపోతున్నాడు.. వైరాకు చెందిన వజీర్. తాను రీమోడలింగ్ చేసిన బుల్లెట్ల ఫొటోలు యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌లలో పెట్టి విక్రయిస్తున్నాడు. ప్రత్యేకంగా ఫేస్బుక్లో పేజీ రూపొందించి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకున్నాడు. యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి ఎందరో సబ్స్క్రైబర్లను సాధించాడు. 1994 అంతకంటే ముందు వచ్చిన డీజిల్ బుల్లెట్ వాహనాలకు రీమోడలింగ్ చేసి భవిష్యత్‌లో స్థిరపడాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఇంత వరకు అతను ఎక్కడా షాపు పెట్టలేదు. చదవండి: రాష్ట్రంలో విరివిగా కరోనా పరీక్షలు ఇలా మొదలైంది.. బుల్లెట్ వాహనాలకు రీమోడలింగ్ చేసే షేక్ వజీర్ ఏడేళ్ల కిందట టోరస్ 1995 మోడల్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. దానిని కొన్ని రోజులు నడిపిన తర్వాత ఆ బైక్ రిపేర్‌కు వచ్చింది. దానికి మరమ్మతులు చేయించేందుకు చాలా షాపులు తిరిగాడు. కానీ ఏళ్ల కిందట బుల్లెట్ కావడంతో రిపేర్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 1994 కంటే ముందు మోడల్ డీజిల్ బుల్లెట్లకు అప్పటి మెకానిక్‌లు ఆర్డీఓ అప్రూవల్తో పెట్రోల్ వాహనాలుగా మాత్రమే కన్వర్షన్ చేసేవారు తప్ప రిపేర్ మాత్రం చేసే వారు కాదు. ఇలాంటి బైక్‌లను మరమ్మతు చేయడం నేర్చుకుంటే జీవితంలో స్థిరపడవచ్చనే అనే ఆలోచన అప్పుడు అతడికి వచ్చింది. యూట్యూబ్ ద్వారా గుంటూరులో మాత్రమే ఇంజిన్ రిపేర్ చేసే వారు ఉంటారని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి ఇంజిన్ రీపేర్ చేయడం, అమర్చడం నేర్చుకున్నాడు. యూట్యూబ్ ద్వారా వాహనంలోని వివిధ భాగాలు వీడదీయడం, వాటిని అమర్చడం నేర్చుకున్నాడు. తాను కొనుగోలు చేసిన బుల్లెట్‌పై ప్రయోగం చేసి సత్ఫలితం సాధించాడు. షాపు పెట్టుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో యూట్యూబ్‌లో చానల్ రూపొందించాడు. తాను రీమోడలింగ్ చేసే ప్రతి వావాహనాన్ని అందులో ఆప్‌లోడ్ చేసి ప్రపంచమంతా వీక్షించే విధంగా దానిని రూపకల్పన చేశాడు. కుంగిపోకుండా.. వజీర్ ఎంబీఏ చేసి ఏదైనా ఉద్యోగంలో స్థిరపడాలని కోరిక. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు తప్పడంతో తన తండ్రి సైదులుకు ఉన్న చికెన్ షాపులో పని చేసుకుంటూ.. చదువుకునే వాడు. ఈ క్రమంలో తన తండ్రి మత్స్యకారుడు కూడా కావడంతో సుమారు ఆరేళ్ల కిందట చేపల వేటకు వెళ్లి ఈదురు గాలులకు రిజర్వాయర్‌లో గల్లంతై మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం మొత్తం ఇతడిపై పడడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. తండ్రి మృతి తర్వాత చికెన్ షాపులో కూడా వ్యాపారం తగ్గడంతో.. అతడికి తెలిసిన చికెన్ షాపులో పనిచేస్తూ.. అన్ని తానై తన చెల్లి వివాహం చేశాడు. ప్రస్తుతం కొణిజర్లలో చికెన్ షాపు పార్ట్‌టైంగా నిర్వహిస్తూ.. ఇంట్లో బుల్లెట్ రీమోడలింగ్ చేస్తున్నాడు. ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే.. డీజిల్ బుల్లెట్లు 1996 తర్వాత పూర్తిస్థాయిలో బ్యాన్ అయ్యా యి. కానీ, వాటి క్రేజ్ మాత్రం తగ్గలేదు. కారణం ఈ ద్విచక్రవాహనం లీటర్ డీజిల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ ఇస్తాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌ల ద్వారా నాటి బుల్లెట్లు ఎక్కడ దొరకుతాయో.. తెలుసుకొని అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉంటే.. వాటిని కొనుగోలు చేస్తాడు. అనంతరం దాని భాగాలు మొత్తం పూర్తి స్థాయిలో వీడదీసి, దానికి కావా ల్సిన స్పేర్ భాగాలను కొని మొత్తం ఫిట్టింగ్ అంతా పూర్తి చేస్తాడు. నూతన సీట్లు కావాలంటే వాటిని సైతం తయారు చేస్తాడు. పెయింటింగ్, రాయల్ ఎన్ఫీల్డ్ అనే స్టిక్కర్ కూడా వేస్తాడు. మొత్తం రీమోడలింగ్ అయిన తర్వాత తన సోషల్ మీడియా ద్వారా విక్రయానికి సిద్ధం చేస్తాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బుల్లెట్లను రీమోడలింగ్, రీస్టోర్ చేశాడు. -
రంగు కాదు.. ప్రతిభ ముఖ్యం
‘‘సమాజంలో మనల్ని మన అందం చూసి కాదు.. మన ప్రతిభను చూసి గుర్తించాలి, గౌరవించాలి. అదే నేను నమ్ముతాను. అందుకే చర్మ సౌందర్య ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఇష్టపడను’’ అన్నారు అదితీ రావ్ హైదరీ. ఇలా అనడమే కాదు గతంలో కొన్నిసార్లు అలాంటి ఆఫర్స్‌ను తిరస్కరించారట కూడా. ఓ సంఘటన గురించి అదితీ రావ్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ ప్రారంభంలో ఓ సౌందర్య ఉత్పత్తిని ప్రమోట్ చేసే అవకాశమొచ్చింది. నేను తిరస్కరించాను. నిజానికి ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు ఆ యాడ్ కెరీర్‌కి ఉపయోగపడుతుంది. అయినా అందం ప్రాధాన్యం అని చెబుతూ నటించడం నాకిష్టం లేదు. కానీ ఆ ఉత్పత్తిదారులు నన్ను ఒప్పించాలని చాలా ప్రయత్నించారు. ఏం చేయాలో తెలీక ఇలాంటివి చేస్తే మా అమ్మమ్మకు నచ్చదని చెప్పాను. రంగు, కులం, మతం వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చి, మనుషులను అంచనా వేయడం అలవాటు లేని కుటుంబం నుంచి వచ్చినదాన్ని నేను. ఇక తెల్లగా మారాలనుకుంటున్నారా? అనే యాడ్‌లో ఎందుకు నటిస్తాను? కేవలం తెల్లగా ఉన్నవాళ్లనే ఈ సమాజం గౌరవిస్తుంది, బాగా చూస్తుందనే ఆలోచనతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. తెల్లగా మారడానికి ఏం చేయాలా? అని ఆలోచిస్తారు. అలాంటివాళ్లకు నేను చెప్పేదేంటంటే.. రంగు ముఖ్యం కాదు.. టాలెంట్ ముఖ్యం. అందం కొలమానం కాకూడదు. అది కేవలం జీన్స్ మాత్రమే’’ అన్నారు. -
ప్రతిభకు కొదవ లేదు
మనం పని చేస్తున్న రంగంలో ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకుంటారు కొందరు. ప్రస్తుతం శోభితా ధూళిపాళ్లకు కూడా ఇదే ఆలోచన వచ్చినట్టుంది. అందుకే స్టూడియో స్థాపిస్తున్నానని ప్రకటించారు. అయితే ఇది షూటింగ్‌లు చేసుకునే స్టూడియో కాదు. షూటింగ్ చేయాలంటే కావాల్సిన కథలకు స్టూడియో... క్రియేటివ్ స్టూడియో. ఈ విషయం గురించి శోభితా మాట్లాడుతూ – ‘‘నాకు రాయడం అన్నా, చదవడం అన్నా ఎంతిష్టమో నా పరిచయస్తులందరికీ తెలుసు. ఆ ఇష్టమే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. పరిశ్రమలో సాధించిన ఏడెనిమిదేళ్ల అనుభవంతో మన దగ్గర ప్రతిభకు లోటు లేదని తెలిసింది. భిన్నమైన ఆలోచనలతో ఉన్న ప్రతిభ కలిగినవాళ్లను చాలామందిని చూశాను. క్రి యేటివ్ స్టూడియో అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి.. నేనో ప్లాట్‌ఫామ్ స్థాపించాలనుకుంటున్నాను. కొత్త కొత్త ఆలోచనలు, కథలు, ఐడియాలను ఇక్కడ తయారు చేయించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పటికి కార్యరూపం దాల్చడం చాలా సంతోషం’’ అన్నారామె. -
మూడెకరాల కోసం ట్రాక్టర్‌నే తయారు చేశాడు..
పెద్దపప్పూరు: పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు పెద్దపప్పూరు మండలం పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన హబీబ్‌బాషా. వృత్తి పరంగా మోటార్ రీవైండింగ్, లేత్ వర్క్, వెల్డింగ్ పనులు చేస్తున్న ఇతను చదువుకుంది తొమ్మిదో తరగతి మాత్రమే. తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయ పనుల కోసం సొంతంగా ఓ యంత్రాన్నే తయారు చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఏడాది పాటు శ్రమించి రూ.60 వేల ఖర్చుతో ఓ మినీ ట్రాక్టర్‌నే సిద్ధం చేశాడు. ఇందు కోసం గ్రామాలన్నీ వెదికి మూలన పడేసిన ఓ డీజిల్ ఇంజన్‌ను రూ.8,500కు కొనుగోలు చేశాడు. తర్వాత కమాండర్ జీప్‌కు వచ్చే గేర్ బాక్స్‌ను కూడా సమకూర్చుకుని నెలల పాటు శ్రమించి తన వర్క్‌షాప్‌లో ఈ ట్రాక్టర్‌కు రూపకల్పన చేశాడు. దీని సాయంతో తన మూడు ఎకరాల పొలంలో వ్యవసాయ పనులను విజయవంతంగా చేసి చూపించాడు. తెగుళ్ల నివారణకు పురుగు మందులను పిచికారీ చేసి తన తయారీకి తిరుగులేదని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వాహనాన్ని రైతులకు అందుబాటులో ఉంచాడు. ఎవరైనా రైతులు సంప్రదిస్తే తక్కువ బాడుగకు అందజేస్తున్నాడు. రూ.400 డీజిల్ వేసుకుంటే ఆరు గంటల పాటు వ్యవసాయ పనులు చేసుకోవచ్చని హబీబ్‌బాషా చెబుతున్నాడు. అన్నీ బాగున్నా.. ఈ వాహనానికి లైటింగ్ సమస్య ఒక్కటే వేధిస్తోందని, త్వరలో అధిగమిస్తానంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. -
నీ ప్రతిభను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేదు
‘‘నువ్వు ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడే బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత టాలెంట్ నీది అని నిరూపితమైంది రెహమాన్’’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్. ‘‘నా దగ్గరకు సినిమా (హిందీని ఉద్దేశించి) లు రానీయకుండా ఓ గ్యాంగ్ తెగ ప్రయత్నిస్తోంది. నా గురించి లేనిపోని వార్తలు ప్రచారం చేస్తోంది’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు రెహమాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెహమాన్ కి మద్దతుగా నిలిచారు శేఖర్ కపూర్. ‘‘రెహమాన్ ఈ సమస్య ఎందుకు ఏర్పడిందో చెప్పనా? నువ్వు ఆస్కార్ సాధించిన సంగీత దర్శకుడివి. ఆస్కార్ గెలవడం అంటే బాలీవుడ్ లో మృత్యువుని ముద్దాడినట్టే. నిన్ను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని అర్థం’’ అని ట్వీట్ చేశారు శేఖర్ కపూర్. దీనికి రెహమాన్ సమాధానమిస్తూ – ‘డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు పోతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వృథా చేస్తే మళ్లీ ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టిపెడదాం’’ అన్నారు. -
ఈ బుడ్డోడికి హర్భజన్ ఫిదా..
సాక్షి, ముంబై: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక బాలుడు కిక్-అప్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పోస్ట్ చేశారు. ఇంత చిన్న వయసులో ఆ చిన్నోడు బాల్ తో ఆడుకున్న తీరుకు ముగ్ధుడై తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా వుంటూ, విభిన్న వీడియోలతో ఆకట్టుకునే భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ ఇటీవల రాహుల్ ద్రావిడ్ అద్భుతమైన క్యాచుల వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన వీడియోల పరంపరంలో మరో ఆణిముత్యం లాంటి వీడియోను షేర్ చేశారు. ఈ వయసులో నమ్మశక్యంకాని నైపుణ్యమంటూ ఆ బుడ్డోడికి ఫిదా అయిపోయాడు. View this post on Instagram Unbelievable skill at his age.. another great in years to come 🤔?? What say guys A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on Jul 10, 2020 at 10:39pm PDT -
‘టాలెంట్ కోసం మా ఉద్యోగులను తీసుకోండి’
ముంబై: ఆన్లైన్ పుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కరోనా సంక్షోభం నేపథ్యంలో 520 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంస్థ పై తీవ్ర ప్రభావం పడిందని.. వ్యాపారాలు బాగా దెబ్బతిన్నందు వల్ల ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఎంతో మంది నైపుణ్యమున్న వ్యక్తులు కృషి చేయడం వల్లే జొమాటో సంస్థ విజయవంతయ్యిందని తెలిపారు. జొమాటో సంస్థలో నైపుణ్యం ఉండి ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం జొమాటో టాలెంట్ డైరెక్టరీ అనే అభ్యర్థి ప్రొఫైల్ లిస్ట్‌ను సంస్థ రూపొందించినట్లు దీపిందర్ గోయల్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులలో దాగి ఉన్న అన్ని నైపుణ్యాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కాగా తమ సంస్థలో వివిధ విభాగాలలో పని చేసిన ప్రతిభావంతమయిన ఉద్యోగుల జాబితా కోసం talentdirectory@zomato.comకు మెయిల్ చేయాలని సూచించాడు. జొమాటో సంస్థను ఎంతో మంది అభిరుచుల ఉన్న వ్యక్తులతో ప్రారంభించామని దీపిందర్ అన్నారు. సంస్థ అభివృద్ధికి నిరంతరం వారు పాటుపడ్డారని కొనియాడారు. ముఖ్యంగా వీడియో ఎడిటర్స్, డిజైనర్స్, కంటెంట్ ప్రొడ్యూసర్స్ లాంటి వివిధ విభాగాల ప్రతిభావంత వ్యక్తుల జాబితాను చూడవచ్చని సంస్థలకు జొమాటో ప్రతినిధులు సూచించారు. చదవండి: ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్ కాస్త సెలబ్రిటీ -
టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుంది: ఉదయ్ కొటక్
ముంబై: కరోనా ఉదృతి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పందిస్తూ.. కరోనా వల్ల అన్ని దేశాల అభిప్రాయాలు మారవచ్చని.. అది భారత్‌కు నూతన అవకాశాలకు మార్గం సుగుమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభ సమయంలో దేశీయ టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ కంపెనీలు భారతీయ యువతను నియమించుకోవాలని సూచించారు. టెక్ దిగ్గజం గూగుల్ లాక్డౌన్ నేపథ్యంలో అమెరికన్ ఇంజనీర్లకు రూ. 2లక్షల డాలర్లు చెల్లిస్తుందని.. అదే భారతీయ యువతను నియమిస్తే తక్కువ వేతనంతో నైపుణ్యంతో పనిచేస్తారని తెలిపారు. అయితే దేశీయ యువతను తక్కువ చేసే ఉద్దేశ్యం తనకు లేదని.. ప్రపంచ సంక్షోభ నేపథ్యంలో తక్కువ వేతనంతో కంపెనీలకు అత్యుత్తమ నైపుణ్యంతో కూడిన ఉద్యోగులు లభిస్తారని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా పీఎమ్ కేర్స్ పండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు బాధ్యతగా విరాళాలు ఇచ్చారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ సర్వే ప్రకారం 100 అత్యుత్తమ బ్యాంక్‌లో కొటక్ మహీంద్రా బ్యాంక్ పేరు నమోదవ్వడం విశేషం. చదవండి: వృద్ధి కథ.. బాలీవుడ్ సినిమాయే! -
కొత్త ఉద్యోగాలిస్తాం - శాంసంగ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కంపెనీల దెబ్బకి దక్షణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో వెయ్యికి పైగా ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుందన్న వార్తలపై సంస్థ స్పందించింది. ఇవి తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. పైగా మరింత మంది ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నామని పేర్కొంది. భారతదేశంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయనీ, దేశీయ టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కు సిద్ధమైన అనంతరం 5జీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తామని తెలిపింది. ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారి తీస్తుందని శాంసంగ్ ప్రకటించింది. భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తామని, ఇందుకోసం పెట్టుబడులు పెడుతూనే ఉంటామని శాంసంగ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్ అండ్ డీలో పెట్టుబడులు, 5జీ నెట్వర్క్ వంటి కొత్త వ్యాపారాల అన్వేషణకు ఉపయోగిస్తామన్నారు. ఈ క్రమంలోనే గతేడాది 2వేలకు పైగా కొత్త కొలువులను ఆఫర్ చేశామంటూ మంగళవారం వివరణ ఇచ్చింది. ఇండియాలో తమ వ్యాపారం విస్తరిస్తున్న క్రమంలో ఉద్యోగాల కల్పనలో తమ పాత్ర ఉంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాపార విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నామని ప్రతినిధి తెలిపారు. భారత మార్కెట్ తన 5జీ టెక్నాలజీ రానున్న నేపథ్యంతో తాము నైపుణ్యమున్న ఉద్యోగులకు ఏడాది పొడవునా ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. -
ప్రతిభని బట్టే పారితోషికం
ఫిల్మ్ ఇండస్ట్రీలో పారితోషికాలు జెండర్‌ని బట్టి ఉంటాయనే వాదన ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ‘‘పారితోషికం అనేది ప్రతిభను బట్టి ఇవ్వాలి కానీ జెండర్‌ని బట్టి డిసైడ్ అవ్వకూడదు’’ అన్నారు షారుక్ ఖాన్. ఈ పారితోషికం వ్యత్యాసాల గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘స్త్రీ, పురుషుల్లో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అనే వైఖరి కరెక్ట్ కాదు. ఇద్దరూ సమానమే. వాళ్ల పారితోషికం కూడా అలానే డిసైడ్ చేయాలి. స్త్రీలు మన ల్ని (మగవాళ్లను) ఇంకా గొప్పగా ఆలోచించేలా తీర్చిదిద్దుతారు. మనల్ని ఇంకా బెటర్ పర్సన్‌గా మారుస్తారు. ఇప్పటికీ వాళ్లకు రావాల్సిన క్రెడిట్, రెమ్యునరేషన్ రాకపోవడం కరెక్ట్ కాదు’’ అని పేర్కొన్నారు. -
ప్రతిభకు పట్టం.. సేవకు సలాం!
సాక్షి, హైదరాబాద్: తమ రంగాలలో ఉత్తమ సేవ, అత్యుత్తమ ప్రతిభ, విశేష కృషి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడుతున్న వారికి ప్రతి ఏటా అందించే ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పలువురు ఇతర ముఖ్యులు అతిథిలుగా పాల్గొనే ఈ కార్యక్రమంలో.. విజేతలకు 2017 సంవత్సరం సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను అందజేస్తారు. కొందరి అసాధారణ ప్రతిభ, ఇంకొందరి అవిరళ సేవ, మరికొందరి విశేష కృషి.. తగురీతిలో గుర్తింపు పొందడమే కాకుండా సమకాలికులకు, తర్వాతి స్ఫూర్తి కావాలనేదే సాక్షి తలంపు. ఇదే యోచనతో, సమాజంలోని వేర్వేరు రంగాల్లో విశేషంగా శ్రమిస్తున్నవారిని గుర్తించి, అభిమానించి, అభినందించి, అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని సాక్షి మీడియా సంస్థ గడిచిన మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. వరుసగా ఇది నాలుగో సంవత్సరం. విద్య, వైద్య, వాణిజ్య, వ్యవసాయ, సామాజిక సేవ తదితర రంగాలతోపాటు వివిధ విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. సినిమా రంగానికి చెందిన పాపులర్ అవార్డులతోపాటు జ్యూరీ ప్రత్యేక అవార్డులను కూడా ఈ సందర్భంగా అందజేయనున్నారు. సమాజ ఉన్నతికి తోడ్పడే కృషి ఏదైనా, అది.. వినూత్నంగా చేయడం, ప్రభావవంతంగా ఉండటం, సుస్థిరమై నిలవడం అన్న మూడు అంశాల ప్రాతిపదికన ఈ విజేతల్ని ఎంపిక చేశారు. అసాధారణ సేవ, కృషి, ప్రతిభ కలిగిన వ్యక్తులు, సంస్థల గురించి పలువురి ద్వారా అందిన ఎంట్రీలను పరిశీలించి, ప్రత్యేకంగా ఏర్పాటైన న్యాయనిర్ణేతలు అంతిమంగా విజేతల్ని ఖరారు చేశారు. రెయిన్బో ఆస్పత్రి మెటర్నల్, ఫీటల్ మెడిసిన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతీరెడ్డి జ్యూరీకి అధ్యక్షత వహించారు. శనివారం జరిగే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమ విశేషాలను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న సాక్షి టీవీ ప్రసారం చేయనుంది. -
మా నాన్న ఏకపత్నీ వ్రతుడు
సాక్షి సినిమా: మా నాన్న ఏకపత్నీవ్రతుడు అని అన్నది ఎవరో తెలుసా? సంచలన నటుడు శింబు. ఈయన తండ్రి సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాదు రాజకీయనాయకుడు కూడా. ప్రాసలో పంచ్ డైలాగ్స్ చెప్పడంతో దిట్ట. అయినా ఆయనపై సెటైర్లు వేస్తుంటారు. టీఆర్ డైలాగులను, ఆయన స్టైల్స్‌ను సినిమాల్లోనే కాకుండా బయట కూడా పేరడీ చేస్తుంటారు. అయితే ఇలా తన తండ్రిని పరిహాసం చేసేవారిపై ఆయన కొడుకు, సంచలన నటుడు శింబు దండెత్తారు. ఇటీవల ఒక టీవీ చానల్లో అతిథులుగా టీఆర్, ఆయన కొడుకు శింబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శింబు తన తండ్రి గురించి మాట్లాడుతూ తన తండ్రి చాలా ఉన్నతుడని పేర్కొన్నారు. ఆయనలో చాలా ప్రతిభ ఉందన్నారు. అలాంటి వ్యక్తిపై కొందరు సెటైర్స్ వేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి నోటితోనే సంగీత బాణీలు కడతారని, దాన్ని కొందరు పరిహాసం చేస్తుంటారని, అదే విధంగా తన తల జుత్తును ఎగరేసే స్టైల్‌ను ఎగతాళి చేస్తుంటారని అన్నారు. అలా చేయడం మీ వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. తన తండ్రి ఇప్పటికీ సూపర్‌గా డాన్స్ చేస్తారని, అలా మీరు 20 ఏళ్ల వయసులో కూడా చేయలేరని అన్నారు. ఏ అమ్మాయిని చూసినా మీకు ఏదో భావం కలుగుతుందని, తన తండ్రి మాత్రం ఏకపత్నీవ్రతుడని పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి దురలవాట్లు లేవన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా చెప్పాలంటే సెటైర్లు వేసే వారంతా ప్రతిభలేనివారేనని అన్నారు. తన తండ్రి ప్రతిభ అంగీకరించి గౌరవించేవారినే తాను గౌరవిస్తానని శింబు ఆవేశంగా మాట్లాడారు. ఆయన మాటలకు అదే వేదికపై ఉన్న టీ.రాజేందర్ ఆనంద బాష్పాలు రాల్చారు. -
ప్రతిభ కన్నా వ్యక్తిత్వం ముఖ్యం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): వ్యక్తుల్లో ప్రతిభ కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని వ్యక్తిత్వం ద్వారానే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కేపీడీటీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మహోన్నత స్థానముందని, ప్రతీ వారిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఏలూరుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తనను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న ఏలూరు నగర ప్రజల ఆత్మీయతను ఎన్నటికీ మరిచిపోలేనని తెలిపారు. చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ సినీ సాహిత్యాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లిన ఘనత సీతారామశాస్త్రికే దక్కుతుందన్నారు. అనంతరం ఉగాది పంచాంగాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఉగాది పురస్కారం అందించి దంపతులకు ఘన సన్మానం చేశారు. తొలుత మాచిరాజు వేణుగోపాల్, మాచిరాజు కిరణ్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి టీవీ యాంకర్ చిత్రలేఖ, కేఎల్వీ నరసింహం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అనంతరం బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి మహిళ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సిరివెన్నెల చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పారిశ్రామికవేత్త అంబికా రాజా, ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సత్యవాడ దుర్గాప్రసాద్, ఎంబీఎస్ శర్మ, కె.కృష్ణమాచార్యులు, ద్రోణంరాజు వెంకటరమణ, తోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ ఒకరి సొత్తు కాదు
సందర్భం ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు మణిపూర్‌లో జరుగనున్న చిల్డ్రన్స్ నేషనల్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు తెలంగాణ రాష్ట్రం బీసీ గురుకులాల నుంచి 21 మంది పిల్లలు ఎంపికయ్యారు. వీళ్లు ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల నుంచి వందలు, వేల సంఖ్యలో ప్రతిభావంతులైన విద్యార్థులు వస్తున్నారు. ప్రోత్సహిస్తే ఎవరెస్టు శిఖరం ఎక్కి జెండా ఎగుర వేయగలరని తెలంగాణ దళిత వర్గాల సోషల్ వెల్ఫేర్ పిల్లలు నిరూపించారు. బీసీ సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థలలో చదువుతున్న పిల్లలు కొన్నేళ్లుగా 10వ తరగతి, ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సంపాదిస్తున్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతం నుంచి మహా నగరాలలో విద్యాలయాల వరకు స్కూళ్లలో సైన్స్ ఫెయిర్లు నిర్వహించారు. ఆ చిన్నారి చేతులతో చేసిన ప్రయోగాలు చూస్తుంటే భవిష్యత్తును వాళ్లెంత గొప్పగా ఆవిష్కరించగలరో ఊహించవచ్చు. అట్టడుగున కన్పించకుండా పోయిన సంచార జాతులు, బాగా వెనుకబడిన ఎంబీసీ కులాల, వెనుకబడిన కులాల పిల్లలు అద్భుతాలు సృష్టించగలరని సైన్స్ఫెయిర్లు నిరూపిస్తున్నాయి. చేతివృత్తుల కులాల నుంచి వచ్చిన చిన్నారులు నడిచే యంత్రాల వెనుక ఉన్న సైన్స్‌ను వివరిస్తున్నారు. చేతులకు వేసుకునే అల్లికల గాజుల దగ్గర నుంచి ఖగోళ శాస్త్రం రహస్యాల వరకు చేసి చూపిస్తున్నారు. ఆడపిల్ల లను చూస్తుంటే వాళ్లు మొత్తం ప్రపంచానికే వెలుగులు పంచే దివ్వెలని తేటతెల్లమవుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అన్ని వసతులతో గురుకుల విద్యాలయాలను అత్యాధునికంగా నిర్మించే పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల మంచి భవనాలు, విశాలమైన స్థలాలు, క్రీడా మైదానాలుంటే కొన్ని చోట్ల మౌలిక వసతుల లేమి సమస్య కూడా ఉంది. వీటి వయసు 9 నెలలు మాత్రమే. స్వంత భవనాల కోసం ప్రత్యేకంగా స్థలాలను చూస్తున్నారు. కొన్నిచోట్ల ఇంజనీరింగ్ కాలేజీల భవనాలలోనే గురుకులాలు ప్రారంభమయ్యాయి. కొన్ని నెలల క్రితం వరంగల్ నిట్‌లో స్పేస్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్‌కు బీసీ గురుకులాల నుంచి 7, 9 తరగతులు చదువుతున్న 21 మంది బాలి కలు ఎంపికయ్యారు. ఆ చిన్నారుల సమాధానాలు విని శ్రీహరికోట స్పేస్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆశ్చ ర్యపోయారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు మణిపూర్‌లో జరుగనున్న చిల్డ్రన్స్ నేషనల్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు తెలంగాణ రాష్ట్రం బీసీ గురుకులాల నుంచి 21 మంది పిల్లలు ఎంపికయ్యారు. వీళ్లు ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు. అమెరికాలోని నాసాలో అడుగు పెట్టేందుకు వీరిని తీర్చిదిద్దుతున్నారు. త్వరలో వారు నాసాలో అడుగు పెట్టడం ఖాయమన్న ధీమాను గురుకుల విద్యా సంస్థ అడిషనల్ డైరెక్టర్ మల్లయ్యభట్టు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో వారు దూసుకుపోగలుగుతారు. ఆ పిల్లల ఆత్మస్థైర్యం చూస్తే ఐఐటి, ఎయిమ్స్, ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజీ (పుణే) లాంటి సంస్థలలో అత్యధిక సీట్లు ఈ పిల్లలు దక్కించుకోవడం ఖాయమని అనిపిస్తుంది. ఇటీవల మిర్యాలగూడెంలో జరిగిన బీసీ గురుకుల మహిళా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను చూస్తే క్రీడారంగంలో కూడా ఈ పిల్లలు ఎంతటి ప్రతిభను చూపగలరో అర్థం చేసుకోవచ్చు. 5వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు బాలికలకు జరిగిన క్రీడా పోటీలు ఆ పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 85 శాతం మంది ఉన్నారని, ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటమే గాకుండా ఆచరణాత్మకంగా 540 గురుకుల పాఠశాలలను కూడా నెలకొల్పారు. ఇప్పటివరకు బడికిరాని అట్టడుగు కులాల పిల్లలను బడిలోకి తెచ్చే పని తెలంగాణలో మొదలయ్యింది. ఈసారి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి ముఖ్యమంత్రి కేసీఆర్ దస్తూరితో ఉన్న అభినందన పత్రాన్ని అందించి బహుజన మైనార్టీ వర్గాల పిల్లలను ప్రోత్సహించే పనికి శ్రీకారం చుట్టబోతున్నారు. బీసీ కులాల నుంచి వచ్చిన మానవ వనరులే ఈ దేశ మానవ వనరుల్లో సగ భాగం కాబట్టి ఈ దేశం అభివృద్ధి ఈ వర్గాల పిల్లల చేతుల్లోనే ఉంది. బీసీల నుంచి సంపాదనలో ఎదిగిన బీసీ పారిశ్రామికవేత్తలు, బీసీ ఉన్నతాధికారులు ఈ సంస్థలు సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. తెలంగాణలో గురుకులాలు ఒక నిశ్శబ్ద విప్లవం. దీని ఫలితాలు రాబోయే పదేళ్లలో కనిపిస్తాయి. తెలంగాణలోని 31 జిల్లాల్లో మొత్తం 119 బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 37,155 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో బాలురు 19,583 మంది, బాలికలు 17,572 మంది. వీరంతా 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. ఈ ఏడాది జనవరి 20న ‘షార్’ ఆహ్వానం మేరకు శ్రీహరికోటకు రాష్ట్రవ్యాప్తంగా 50 మంది విద్యార్థులు ఎంపికైతే అందులో 22 మంది బీసీ గురుకుల చిన్నారులే. రాష్ట్రంలోని 119 గురుకుల పాఠశాలల్లో ఈ ఏడాది సైన్స్‌ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం రూపకల్పన చేసే పనిలో ఉన్నారు. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
లక్కుండాలట!
‘బోలెడన్ని తెలివితేటలు, విపరీతమైన టాలెంటు ఉన్నంత మాత్రాన సరిపోదు. కొంచెం లక్కుండాలి’ అనే మాట ఎవరో ఒకరు అనగా వినే ఉంటారు. లేకపోతే మీలో మీరే అనుకునే ఉంటారు. ఏదో జనాంతికంగా అనుకునే మాటలకు లేదా జనాభిప్రాయంగా వినిపించే మాటలకు శాస్త్రీయ ప్రామాణికత ఏముంటుందని ప్రశ్నించే మేధావులు కూడా మనలో ఉంటారు. అయితే, తెలివితేటలు, టాలెంటుతో పాటు కొంచెం లక్కుంటేనే బతుకు పోటీలో గెలుపు దక్కుతుందనే విషయం ఇటీవల వార్విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో శాస్త్రీయంగా తేలింది. బిల్ గేట్స్ సహా గడచిన నాలుగు దశాబ్దాల కెరీర్లో ఘన విజయాలను సాధించిన వెయ్యిమంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. సుదీర్ఘమైన కెరీర్లో విజయవంతంగా నిలదొక్కుకున్న వారికి తెలివితేటలు, ప్రతిభా పాటవాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చిందని, వారి ఘన విజయాల వెనుక అదృష్టమే ప్రధాన కారణమని తమ అధ్యయనంలో తేలినట్లు వార్విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే, ఇటలీలోని సిసిలీ నగరంలో ఉన్న కటానియా వర్సిటీ పరిశోధకులు వెయ్యిమంది ‘వర్చువల్’ వ్యక్తులపై నిర్వహించిన ప్రయోగంలో కూడా అదృష్టం ముఖ్య భూమిక పోషిస్తుందని తేలడం విశేషం. -
ప్రతిభకు మార్కులు కొలమానం కాదు
సాక్షి, సిద్దిపేట: విద్యార్థుల ప్రతిభకు మార్కులే కొలమానంగా పెట్టి చూడటం సరికాదని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, ప్రముఖకవి నందిని సిధారెడ్డి అన్నారు. కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన బాల ప్రతిభా మేళా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ప్రతీ విషయంపై అవగాహన కలిగించేలా చూడాలని, అందుకు ముందుగా వారు ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని వినేలా ప్రోత్సహించాలని చెప్పారు. బట్టీ పట్టించడం, మార్కులు ఎక్కువగా వస్తే తెలివైన విద్యార్థిగా చిత్రీకరించడం సరికాదన్నారు. విద్యార్థుల మనసులో మెదిలే ప్రతీ ఆలోచన బహిర్గతం చేసేలా స్వేచ్ఛనివ్వాలని, తప్పొప్పులను చెప్పి నూతన ఆవిష్కరణలకు దోహదపడేలా ప్రోత్సహిం చాలన్నారు. తనకు చిన్నప్పుడు పాటలంటే ఇష్టమని, కానీ వాటిని పాడటం కష్టంగా ఉండేదని, పాటలు రాసి ఇతరులు పాడితే సంతోషపడ్డానని అన్నారు. సీఎం కేసీఆర్ చిన్ననాటి నుంచి ఉపన్యాస పోటీల్లో ముందుండే వారని, అదే ఆయనను మంచి వక్తగా మార్చి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచేందుకు దోహద పడిందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రం ముస్తాబవుతున్న తరుణంలో ఇటువంటివి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ డైరెక్టర్ సజన, కవి సీతారాం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
యువత తెలివిని మార్కెటింగ్ చేస్తున్నా: బాబు
సాక్షి, అమరావతి బ్యూరో: ఐటీలో పెను మార్పులను ఇరవై ఏళ్ల కిందటే ఊహించి ఈ రంగానికి పునాది వేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ)ఆ«ధ్వర్యంలో శనివారం విజయవాడ బందరు రోడ్డులోని ఏ–కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మెగా జాబ్ మేళా వీడ్కోలు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. వచ్చే మూడేళ్లలో అన్ని రంగాలలో కలిపి 15 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. మన యువతకు ఉన్న తెలివితేటలు ఇండియాలో ఎవరికీ లేవని, వారి తెలివినే తాను మార్కెటింగ్ చేస్తున్నానని చెప్పారు. ప్రతి నెలా ఒక్కో విభాగంలో కాన్ఫరెస్స్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 1,087 మందికి ఉద్యోగాలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వీరికి గరిష్ట వేతనం ఏడాదికి రూ.3.10 లక్షలు ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో 5.35 లక్షల ఉద్యోగాలిచ్చామని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో 15 లక్షల ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు తెలిపారు. శనివారం శాసనసభలో పెట్టుబడులు, యువజన విధానం, నిరుద్యోగ భృతిపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23, 24, 25వ తేదీల్లో విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడుదారుల భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగ భృతిపై కమిటీల ఏర్పాటు నిరుద్యోగ భృతిపై కేబినెట్ సబ్‌కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని, విధి విధానాలు రూపొందించేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడా నిరుద్యోగ భృతి విజయవంతం కాలేదన్నారు. అర్హులకే నిరుద్యోగ భృతిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా యువత వివరాలు, భూమి, రేషన్‌కార్డులు తదితర కేటగిరీల కింద సమగ్ర సమాచారం సేకరిస్తున్నామన్నారు. విధి విధానాల అడ్వయిజరీ కౌన్సిల్ ఛైర్మన్‌గా తాను, అమలుకు సీఎస్ ఛైర్మన్‌గా ఉంటారన్నారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య, రాధాకృష్ణ, చాంద్‌బాషా, ఆనందరావు, జీవీ ఆంజనేయులు, గణేష్‌లు పాల్గొనగా, మంత్రులు అమరనాధ్‌రెడ్డి, కొల్లు రవీంద్రలు సమాధానమిచ్చారు. శాసనసభ నిరవధిక వాయిదా చర్చపై సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. నవంబరు 10 నుంచి డిసెంబర్ 2 వరకు 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందాయని, రెండు బిల్లులు ఉపసంహరించుకున్నట్లు వివరించారు. -
సాయానికి ఎదురు‘చూపు’
♦ చదువుల తల్లికి అరుదైన కంటి వ్యాధి ♦ చూపు కోల్పోయిన ప్రతిభావంతురాలు ♦ వైద్యం చేయించని పేద కుటుంబం ♦ దాతలు కరుణించాలని వినతి పసివాడో ఏమిటో ఆ పైవాడు.. తను చేసిన బొమ్మలతో తలపడతాడు.. అని రాశాడో సినీకవి. విజ్ఞానంతో విరిసిన ఆ నయనాలు నల్ల కలువలవుతుంటే ఈ గీతమే గుర్తొస్తోంది. బంగారు స్వప్నాల్ని కన్న కనులను అంధకారం కమ్మేస్తుంటే ప్రతి కన్ను చెమర్చుతోంది. అరుదైన కంటి జబ్బు అభం శుభం తెలియని చిన్నారిని కాటేస్తుంటే పాషాణుల్ని సైతం కరిగిస్తుంది. ఆ దురదృష్టవంతురాలు.. కొత్తవలస మండలం కంటకాపల్లికి చెందిన విద్యార్థిని శ్రావణి. ఈ ప్రతిభావంతురాలి బతుకులో ‘టాకయ్యాస్‘ అనే నరాల వ్యాధి నిప్పులు పోసింది. కంటిచూపును కబళించేసింది. అత్యంత ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప చూపు దక్కదని తెలిసిన ఆమె ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తోంది. కొత్తవలస రూరల్: కంటకాపల్లి ఎస్సీ కాలనీలో నివసిస్తున్న మాడుగుల సూర్యనారాయణ, వెంకటలక్ష్మికి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె శ్రావణి ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. సూర్యనారాయణ శారదా కంపెనీలో కాంట్రాక్ట్ వర్కర్. శ్రావణి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎనిమిదో తరగతి వరకూ స్కూల్ టాపర్. చదువుల్లోనే కాదు ఆటపాటలు, వ్యాసరచన, అన్నింటిలోనూ ప్రథమస్థానమే. పోటీలకు వెళ్తే పతకం రావలసిందే. ఇంతటి ప్రతిభావంతురాలు ‘టాకయ్యాస్‘ అనే నరాల వ్యాధి ప్రభావంతో కంటిచూపును కోల్పోయింది. ఇంజక్షన్ ఖరీదు రూ.70 వేలు శ్రావణికి ఈఏడాది వేసవి సెలవుల్లో చూపు తగ్గటంతో విశాఖపట్నం వైద్యుల్ని సంప్రదించారు. వారు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు సిఫార్సు చేశారు. అక్కడి వైద్యులు శ్రావణిని పరీక్షించి లక్షమందిలో వచ్చే వ్యాధిగా గుర్తించారు. దీంతో ఈమెకు నెలకు రూ.70 వేల విలువైన ఇంజక్షన్ (స్టెరాయిడ్స్), రూ.2వేల విలువైన మాత్రలను ఆరు డోసులు ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు అతి కష్టంమీద 3 డోసులు వేయించారు. ఆర్థిక స్తోమత చాలక పోవటంతో దాతలు కరుణించాలని కన్నీటితో ప్రాధేయపడుతున్నారు. దాతలు 94910601931 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. మనసున్న నేస్తాలు శ్రావణి సహ విద్యార్థులు తమ ఇంటి వద్ద, దాచుకున్నవి, గ్రామంలో మొత్తం సుమారు రూ.లక్ష సేకరించి స్నేహితురాలి కంటిచూపు మెరుగుకు కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు. వెలుగు ప్రసాదించండి చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలుస్తుండటంతో మా కుమార్తె ఉన్నత విద్య చదువుతుందని మురిసిపోయాం. కానీ భగవంతుడు ఇలా చేస్తాడని అనుకోలేదు. నరాల్లో ఎర్ర రక్తకణాలు స్పందించటం లేదని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దాతలు స్పందించి మా కుమార్తె బతుకులో వెలుగు ప్రసాదించాలి. – సూర్యనారాయణ, తండ్రి ప్రభుత్వం ఆదుకోవాలి అప్పులు చేసి ఇప్పటి వరకూ మూడు డోసులు వేయించాం. ఇంకా మూడు డోసులు వేయించాల్సి ఉంది. ఆ తరువాత వైద్యులు ఏం చెబుతారో భయంగా ఉంది. ప్రభుత్వం సాయం చేసి నా చిట్టి తల్లికి చూపు తెప్పించాలి. – వెంకటలక్ష్మి, తల్లి -
అవకాశాన్ని వెతుక్కోవాలి!
మనలో చాలామందికి ఎన్నో విషయాలలో ప్రతిభ ఉంటుంది. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి తగిన అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అవకాశం తమ తలుపు తట్టగానే చక్కగా అందిపుచ్చుకుంటారు. వెంటనే పని ప్రారంభిచేస్తారు. అయితే, తెలివైన వాళ్లు అవకాశాల కోసం ఎదురు చూడరు. వెతుక్కుంటారు. ఉదాహరణకు వర్షం అంతటా ఒకేలా పడుతుంది. ముత్యపు చిప్పలో పడ్డ నీటిబొట్టు ఆణిముత్యమవుతుంది. సముద్రంలో పడ్డ వానచినుకు వల్ల సముద్రానికీ ప్రయోజనం ఉండదు. వానచుక్కకీ ఉపయోగం ఉండదు. ముత్యపు చిప్పలాంటి వారు అలా అవకాశాలను అందుకుంటారు. ఆణిముత్యాల్లా తయారవుతారు. అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక కళ. అ కళ అందరికీ ఉండకపోవచ్చు కానీ, అలవరచుకోవాలి నెమ్మదిగానైనా. లేదంటే సముద్రంలో పడ్డ వానచినుకుల్లా నిరుపయోగంగా తయారవుతారు. మనిషి పుట్టిందే విజయం సాధించడానికే. ఓడిపోవడానికి కాదు. అలాగని ఓడిపోయిన వారందరూ పనికి రాని వారు కాదు. ఎలా విజయం సాధించాలో ప్రళాళిక వేసుకోవాలి. విజయం సాధించేవరకు ఆ ప్రణాళికకు తగ్గట్టుగా పని చేయాలి. మనమేమిటో మనం తెలుసుకోవాలి. మనకు మనమే అభివృద్ధి చెందాలి. ఎవరో వచ్చి మనల్ని అభివృద్ధి చేయరు. ఊతం ఇస్తారంతే! ఆ ఊతాన్ని పట్టుకుని పాకిన వారే పైపైకి పోతారు. మన పెరట్లో అనుకోకుండా పడి మొలిచిన కాకర, బీర, చిక్కుడు, సొర, పొట్ల, దోస వంటి తీగజాతి మొక్కలు కూడా ఆసరా కోసం ఎదురు చూడవు. చిన్న చిన్న గోడపగుళ్లనో, దగ్గరలో ఉన్న వృక్షాలనో, కర్రదుంగలనో పట్టుకుని పైపైకి పాకుతాయి. పందిరి వేస్తే అల్లుకుంటాయి. -
ప్రతిభ ఉంది.. కానీ పైసల్లేవు..
► పదోతరగతిలో 9.8 జీపీఏ ► దాత సహాయంతో ఇంటర్మీడియట్ పూర్తి ► ఇంజినీరింగ్ చదివేందుకు పైసల్లేవు ► తండ్రికి అంగవైకల్యం.. కూలి పనిచేస్తున్న తల్లి ► ఆర్థిక చేయూత కోసం ఎదురుచూపు శంషాబాద్(రాజేంద్రనగర్): చదువుల్లో చురుకైన ఆ విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఒకవైపు.. కుటుంబ పరిస్థితి మరోవైపు దీంతో ఆ విద్యార్థి కొట్టుమిట్టాడుతున్నాడు. తన కుమారుడికి ఉన్నత చదువులు చదివించేందుకు పెద్ద మనసు చేసుకొని ఎవరైనా సహాయం చేయాలని అంగవైకల్యంతో బాధపడుతున్న తండ్రి కోరుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా ఎండీహెచ్పల్లి గ్రామానికి చెందిన ఎం.మధుసూదన్‌రెడ్డి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చెయ్యి పోగొట్టుకున్నాడు. అంగవైకల్యంతో వ్యవసాయం చేయలేక పొట్టచేత పట్టుకొని 15 ఏళ్ల క్రితం మధుసూదన్‌రెడ్డి కుటుంబం సాతంరాయి గ్రామానికి వలస వచ్చింది. భర్త ఎలాంటి పని చేయలేకపోవడంతో మధు భార్య రాజవేణి పరిశ్రమలో కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. వీరి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పదోతరగతిలో 9.8 మార్కులు సాధించడంతో ఓ ఉపాధ్యాయుడి ఆర్థిక సహకారంతో నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఎంసెట్‌లో 14,904 ర్యాంకు సాధించడంతో దుండిగల్‌లోని ఐఏఆర్ఈ కళాశాలలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ పోను ట్యూషన్, హాస్టల్ ఇతరత్రా ఫీజులు చెల్లించడానికి వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. కళాశాలలో చేరేందుకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండడంతో బిడ్డను చదివించుకోలేకపోతున్నామని ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ కుమారుడి చదువుకు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. కష్టపడి చదువుకుంటా.. ఆర్థిక ఇబ్బందులన్నా ఇప్పటి వరకు కష్టపడి చదువుకుంటూ వచ్చాను. ఉన్నత చదువులు చదివి నా కుటుంబ పరిస్థితి మెరుగు పర్చాలన్నదే నా లక్ష్యం. కానీ ఇంజినీరింగ్‌లో చేరేందుకే మా దగ్గర డబ్బులు లేవు. ఇంకా నాలుగు రోజుల సమయమే ఉంది. ఎవరైనా నా చదువుకు సహకరించండి. – ఎం. శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థి -
హెచ్ 1బీ వీసాల కొత్త ఆర్డర్లపై ఉర్జిత్ చురకలు
న్యూఢిల్లీ: అమెరికా కొత్త హెచ్1 బీ పాలసీ నిబంధనలపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పందించారు. అమెరికా తదితర దేశాల రక్షణవాద విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ట్రంప్ హెచ్ 1 బీ వీసాల కఠిన నిబంధనలతో తీసుకొచ్చిన కొత్త ఆర్డర్లపై చురకలంటించారు. పరస్పర సహకారం లేకపోతే అమెరికా దిగ్గజ కంపెనీలు ఎక్కడ ఉండేవని ఆయన ప్రశ్నించారు. కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ లో ఇండియన్ ఎకనామిక్ పాలసీస్‌పై రాజ్ సెంటర్ స్పాన్సర్ చేసిన ‘థర్డ్ కోటక్ ఫ్యామిలీ విశిష్ట ప్రసంగం’ లో సోమవారం పటేల్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రధాన ప్రపంచ ఆర్థికవ్యవస్థల రక్షణవాద ధోరణుల పెరుగుదలపై ప్రశ్నకు ప్రతిస్పందనగా పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఉత్పత్తులు, ప్రతిభను అందించకపోతే, ఆపిల్, సిస్కో ఐబిఎమ్ లాంటి భారీ అమెరికన్ సంస్థలు ఎక్కడ ఉండేవని ఉర్జిత్ ప్రశ్నించారు. అమెరికా సహా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కార్పోరేషన్ల విలువ గ్లోబల్ సప్లయ్ చైన్ల కారణంగానే పెరిగిందని పేర్కొన్నారు. పెద్ద సంపద సృష్టికర్తలు ఇలాంటి విధానాలను అబలంబిస్తే చివరికివారే ఈ ప్రభావానికి లోను కావాల్సి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. కస్టమ్స్ డ్యూటీలు, సరిహద్దు పన్ను వంటి వాణిజ్య పరికరాలను ఉపయోగించడం సమర్థవంతమైన మార్గం కాదన్నారు. వాస్తవానికి దీనికి వేరే మార్గం ఎంచుకువాల్సి ఉంటుందన్నారు. ఈక్విటీ మరియు డిస్ట్రిబ్యూషన్స్ విధానాల్లో అనుసరిస్తున్న విధానాల కొన్నింటి ప్రభావం వారికి తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. ఇది వృద్ధికి తీరని నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. ఇది దేశీయ విధానాంగా ఉండాలన్నారు. దేశీయ విధాన సమస్యగా ఉండాలి. దేశీయ ఆర్థికవిధానాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఉర్జిత్ తెలిపారు. -
మినీ హెలికాప్టర్ తయారు చేసిన బీటెక్ స్టూడెంట్స్
-
విభిన్న ప్రతిభలకు వేదిక
-రావులపాలెంలో భరత్ టాలెంట్ టెస్ట్ -దేశం నలుమూలల నుంచి కళాకారులు -ముక్కుతో వాయిద్యాల వాదనలో రికార్డు సృష్టించిన సోహమ్ రావులపాలెం : స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్ శనివారం నిర్వహించిన భరత్ టాలెంట్ ఫెస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విభిన్న వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న కళాకారులు హాజరయ్యారు. వీరికి భరత్ శిరోమణి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా వారిలో కొందరిని ‘సాక్షి’ పలకరించింది. కోల్‌కతా సమీపంలోని బర్ధమాన్ పట్టణానికి చెందిన సోహమ్ ముఖోపాధ్యాయ పదేళ్ళ వయసు నుంచి ముక్కుతో మౌత్ ఆర్గన్ను వాయించడంపై దృష్టి పెట్టారు. ప్రసుతం కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న ఆయన మౌత్ఆర్గన్ను ముక్కుతో ఏకధాటిగా 20 నిమిషాల 20 సెకన్ల వాయిస్తూ ప్రపంచ రికార్డు సాధించారు. సోహమ్ తాజాగా మెలోడికా, ప్లూట్ సంగీత వాయిద్యాలను కూడా ముక్కుతో వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. మెలోడికాను 30 నిమిషాల 22 సెకన్లు, ప్లూట్ను 6 నిమిషాల 9 సెకన్లు వాయించడంలో ప్రపంచ రికార్డులు సాధించారు. ప్రపంచంలో ఈ మూడింటిని ముక్కుతో వాయించే ఏకైక వ్యక్తిని తానేనని సోహమ్ తెలిపారు. ఆయన పత్రికల్నే చిత్రిస్తారు.. హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన డాక్టర్ దార్ల నాగేశ్వరరావు దినపత్రికలను అచ్చుగుద్దినట్టుగా చిత్రీకరిస్తూ అబ్బుర పరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ ప్రెస్‌లో ఆర్టిస్టుగా పని చేస్తున్న ఆయన రిప్లికా ఆర్ట్‌లో ప్రావీణ్యుడు. దేశంలోని 14 భాషలతోపాటు మరో నాలుగు విదేశీ భాషల్లోని 45 దినపత్రికలనుచిత్రీకరించి ఔరా అని పిస్తున్నారు. దినపత్రికలోని మొదటి పేజీలను అసలుకు ఏమాత్రం తగ్గకుండా అచ్చుగుద్దినట్టుగా చేతితో వివిధ రంగుల పెన్నులతో చిత్రాలు వేయడం విశేషం. ఫొటోలనుమాత్రం వేరే పత్రిక నుండి సేకరించి అతికిస్తానని, మిగిలినవన్నీ పెన్నులతో చిత్రీకరిస్తానని ఒక పేజీకి 15 నుండి 30 రోజుల సమయం పడుతుందని తెలిపారు. నయా క్యాలెండర్ పేరుతో 2001 నుంచి 2120 సంవత్సరం వరకూ 120 సంవత్సరాల క్యాలెండర్‌ను తయారు చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సాధించారు. చెట్టు నాణేల సేకరణ ఆయన ప్రత్యేకత భూమిపై చెట్టు, నీరు, జీవరాశుల ఆవశ్యకతను తెలియజేపుతూ వివిధ దేశాలు రూపొందించిన నాణేల సేకరణతో ఆకట్టుకొంటున్నారు కాజులూరు మండలం శీలలంక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్వతిన వెంకట నారాయణ. ఆయన ప్రత్యేకంగా చెట్టు చిత్రంతో ఉన్న 130 దేశాల 450 నాణేలు సేకరించి ఎన్నో అవార్డులు పొందారు. ఆయన సేకరించిన ప్రతి నాణెంపై చెట్టు లేదా పర్యావరణ నినాదం ఉంటాయి. ఈ నాణేల సేకరణతో ఆయన కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మిత్ర అవార్డును, 2009, 2015 రాష్ట్రస్థాయి నాణేల ప్రదర్శనలో బంగారు పతకాల్ని సాధించారు. 2016లో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనకు హజరయ్యారు. -
‘సాక్షి’ మ్యాథ్స్ ‘బీ’లో మాంటిస్సోరి విద్యార్థి ప్రతిభ
కర్నూలు(అర్బన్): సాక్షి దినపత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మ్యాథ్స్ బీ టాలెంట్ సెర్చ్ పరీక్షలో మాంటిస్సోరి బాలుర క్యాంపస్ 10వ తరగతి విద్యార్థి సీ. మస్తానయ్య రాష్ట్రస్థాయి మూడో ర్యాంక్ సాధించాడు. ఈ నెల 23న జరిగిన ఫైనల్ పరీక్షలోవిద్యార్థి చాటడంతో సాక్షి యాజమాన్యం తరఫున కాంస్య పతకంతో పాటు రూ.5 వేల నగదు బహుమతి అందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్ కేఎస్వీ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. కాన్సెప్ట్ ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం నీలకంఠేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. -
ప్రతిభకు పట్టం.. సేవకు స్ఫూర్తి
⇒ ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులకు ఎంపిక ప్రక్రియ మొదలు ⇒ ఎంట్రీలు పంపేందుకు ఈ నెల 25 వరకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రతిభ, కృషి ఏ ఒక్కరి సొంతమో కాదు! సమాజమంతటికీ విస్తరించాలి. అసాధారణమైన ప్రతిభామూర్తులు, నిబద్ధత కలిగిన సంస్థల సామాజిక సేవ ఇంకా ఎందరెందరికో స్ఫూర్తి కావాలి. సమాజహితం కోసం జరిగే ఇలాంటి కృషి మరింత పెరగాలి. ఈ భావనతోనే ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ ఇవ్వడం ద్వారా లక్ష్య సాధనలో విశేష కృషి సల్పిన విజేతల్ని ప్రోత్సహించడంతో పాటు ఇతరులకు ప్రేరణ కల్పించేందుకు పూనుకుంది. ఇదే తలంపుతో అవార్డుల ప్రక్రియను ఒక సామాజిక బాధ్యతగా సాక్షి మీడియా హౌస్ చేపట్టి రెండేళ్లవుతోంది. తెలుగునాట వివిధ రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న పలువురు 2014, 2015లలో జరిగిన ప్రక్రియలో ఈ అవార్డులకు ఎంపికై ఎందరెందరిలోనో స్ఫూర్తిని రగిలించారు. కొత్త చిగుళ్లుగా ఎదుగుతున్న యువకిశోరాల నుంచి జీవన సాఫల్యం పొందిన మహామహుల వరకు ఈ అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. అసాధారణ ప్రతిభ, విశేష సేవల్ని గుర్తించిన సాక్షి తగు రీతిన వారిని సత్కరించి తద్వారా ఇతరులకు స్ఫూర్తి, ప్రేరణ కలిగించింది. 2016కుగాను అవార్డు ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. ఫిబ్రవరి 25 వరకు గడువుండటంతో ఎంట్రీలు అందుతున్నాయి. ఈ ప్రక్రియలో విశేషమేమంటే.. ఎవరికి వారు ఎంట్రీలు పంపే అవకాశం లేదు. విశేషంగా ప్రతిభ కనబరుస్తున్న, సేవలందిస్తున్న, లక్ష్యాలు సాధిస్తున్న విజేతల్ని గుర్తించి వారినెరిగిన ఇతరులెవరైనా ఈ ఎంట్రీలు పంపొచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారు న్యాయనిర్ణేతలుగా ఉండే జ్యూరీలు తుది ఎంపిక జరుపుతాయి. మరిన్ని వివరాలకు లాగాన్ చేయండి: www.sakshiexcellenceawards.com సంప్రదించాల్సిన నంబర్: 040–23322330 -
స్కేటింగ్‌లో విద్యార్థినుల ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: తమిళనాడులోని తిరుపూర్‌లో ఈ నెల 8వ తేదీన జరిగిన స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్లో తమ విద్యార్థులు నగీనా, ఆఫ్రీన్ ప్రతిభ కనబరిచారని విజయవాడ రవీంద్రభారతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్‌లోని స్కూల్ ఆవరణలో స్కేటింగ్ క్రీడాకారిణీలను అభినందించారు. ఆయన మాట్లాడుతూ వీరిద్దరూ జాతీయ స్థాయి క్రీడాకారులతో 24 గంటలు స్కేటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పారు. -
‘ఉత్తరాది’ హవా
→ సాఫ్ట్‌బాల్ టోర్నీలో వెనుకబడుతున్న దక్షిణాది జట్లు → హోరాహోరీగా సాగుతున్న పోటీలు అనంతపురం సప్తగిరి సర్కిల్ : 38వ జాలీయ సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో ఉత్తరాది రాష్ట్రాలదే పై చేయిగా నిలుస్తోందని రాష్ట్ర సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు, జిల్లా అధ్యక్షుడు నాగరాజులు తెలిపారు. గురువారం అనంతపురంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో జరిగిన క్రీడా పోటీల వివరాలను వారు వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్ర బాలికల జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి వైదొలిగే పరిస్థితి నెలకొంది. నిలకడగా ఆడుతున్న ఆంధ్ర, తెలంగాణ జట్లు సూపర్–8 దశకు చేరుకునే సరికి చతికిలబడ్డాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు వీరు గట్టిపోటిని ఇవ్వలేకపోయారు. మోహన్ (చత్తీస్గడ్), రితేష్ (మహారాష్ట్ర), షంతీల్ (పంజాబ్) హోమర్ షాట్లతో అలరించారు. బాలుర విభాగంలో విజేతలు మణిపూర్‌పై చత్తీస్గడ్, తెలంగాణపై హర్యానా, చండీఘడ్‌పై ఆంధ్ర, పాండిచ్చేరిపై పంజాబ్, వెస్ట్ బెంగాల్‌పై మహారాష్ట్ర జట్టు క్రీడాకారులు భారీ విజయాన్ని నమోదు చేశారు. ఏకపక్షంగా సాగిన ఈ పోటీల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క పాయింట్ కూడా దక్కలేదు. ఢిల్లీ జట్టుపై కర్ణాటక (3–4), ఒడిశాపై కేరళ (1–3), గోవాపై మధ్యప్రదేశ్ (1–8) జట్లు గెలుపొందాయి. బాలికల విభాగంలో... తెలంగాణపై పంజాబ్, బీహార్‌పై మహారాష్ట్ర, కర్ణాటకపై ఢిల్లీ, పాండిచ్చేరిపై చండీఘడ్ జట్టు క్రీడాకారిణులు పట్టు సాధించారు. ఏకపక్షంగా సాగిన ఈ పోటీల్లో ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. మణిపూర్‌పై హిమాచల్ ప్రదేశ్ (2–11), చత్తీస్‌ఘడ్‌పై మధ్యప్రదేశ్ (2–14), ఆంధ్రపై కేరళ (1–6), హర్యానాపై ఒడిశా (1–16) గెలుపొందాయి. సూపర్‌లీగ్‌లో... ఉత్కంఠగా సాగిన బాలికల సూపర్ లీగ్ పోటీల్లో మహారాష్ట్ర జట్టుపై పంజాబ్ క్రీడాకారులు 7–8 పాయింట్ల తేడాతో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్‌పై ఢిల్లీ, మధ్యప్రదేశ్‌పై కేరళ, చండీఘడ్‌పై ఒడిశా జట్లు గెలుపొందాయి. బాలుర విభాగంలో హర్యాణను చత్తీస్గడ్, ఆంధ్రను పంజాబ్, కర్ణాటకను కేరళ, మధ్యప్రదేశ్‌ను మహారాష్ట్ర, ఆంధ్రను చత్తీస్గడ్ జట్లు ఓడించాయి. -
ఎన్సీసీలో విద్యార్థినుల ప్రతిభ
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎన్సీసీ మహిళా క్యాడెట్స్‌కు జాతీయ స్థాయిలో పతకాలు వచ్చాయని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వీవీఐటీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ వీవీఐటీకి చెందిన ముగ్గురు మహిళా క్యాడెట్స్ జాతీయస్థాయి ఎన్సీసీ క్యాంప్‌కు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన ముగ్గురు న్యూఢిల్లీలోని ధల్ సైనిక క్యాంప్‌లో శిక్షణ పొందారని చెప్పారు. సెప్టెంబర్ 19 నుంచి 30వ తేదీ వరకూ జరిగిన ఈ క్యాంప్‌కు దేశంలోని 17 డైరెక్టరేట్లు పోటీ పడగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ మహిళా విభాగం మొదటి స్థానం సాధించిందన్నారు. క్యాంపులో అబ్స్టకల్ కోర్స్, మ్యాప్ రీడింగ్, హెల్త్ అండ్ హైజీన్, ఫైరింగ్, జడ్జింగ్ డిస్టెన్స్ అండ్ ఫీల్డ్ సిగ్నల్స్, అడ్వాన్స్ రైఫిల్ షూటింగ్, లైన్ ఏరియా కాంపిటేషన్ విభాగాల్లో వీవీఐటీ క్యాడెట్లు కాంస్య పతకం సాధించారని తెలిపారు. ఈ క్యాంప్‌లో పాల్గొన్న సీఎస్ఈ తృతీయ సంవత్సరం విద్యార్థినులు ఐ సాధనారెడ్డి, సీహెచ్ మధురిమ, సివిల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎన్ లక్ష్మీనాగ అపర్ణ ఎస్ఎస్బీ ఎగ్జామ్స్ రాయకుండా డిఫెన్స్ ఉద్యోగాల ఇంటర్వూ్యలకు డైరెక్ట్‌గా హాజరు కావచ్చన్నారు. -
క్రీడా‘కుసుమ’ం
–ప్రోత్సాహం ఉంటే ఒలింపిక్స్‌కు వీరవాసరం : గ్రామీణ ప్రాంతం నుంచి అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏపీ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికైంది రావాడ కుసుమ. వీరవాసరం గ్రామానికి చెందిన కుసుమ పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పాల్గొన్న ప్రతీ పోటీలోను పతకాలను చేతబడుతుంది. 2009 ఆగస్ట్ 16న అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏపీ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికైంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఇంటిర్మిడియట్ మొదటి సంవత్సరం చదువుతూ క్రీడల్లోనూ రాణిస్తుంది. లాంగ్‌జంప్, హార్డిల్స్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ మేటి క్రీడాకారిణిగా గుర్తింపుతెచ్చుకుంటుంది. తల్లి ప్రోత్సాహంతో ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే కుసుమ తండ్రి రావాడ అప్పారావు ఐదేళ్ల్ల క్రితం అనారోగ్యంతో మతి చెందాడు. కుసుమ అప్పుడు 7వ తరగతి చదువుతోంది. తల్లి దుర్గా ఆదిలక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమార్తె, కుమారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెంచుతోంది. సాధించిన పతకాలు క్రీడాకారిణిగా రావాడ కుసుమ ఎన్నో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి 100కు పైగా పతకాలను సొంతం చేసుకుంది. 2013లో శ్రీకాకుళంలో జరిగిన 59వ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ను, 2015లో కాకినాడలో జరిగిన 27వ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ను, 2016లో కోజికోడ్ (కేరళ)లో జరిగిన 61వ జాతీయ స్కూల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో రజత పతకం సాధించింది. ఇవే కాకుండా వికారాబాద్, రంగారెడ్డి, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఇంటర్ డ్రిస్టిక్ట్స్ స్కూల్ గేమ్స్ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హార్డీల్స్లో ఎన్నో పతకాలు, ప్రశంసా పత్రాలను అందుకుంది. –ఒలింపిక్స్‌లో పతకం నా లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. అథ్లెటిక్స్ కోచ్ ఆదిత్యవర్మ పర్యవేక్షణలో వివిధ పోటీల్లో రాణిస్తున్నాను. నా తల్లి దుర్గాఆదిలక్ష్మి నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ప్రోత్సాహం ఉంటే ఇంకా రాణించి దేశానికి ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. –ప్రోత్సాహం ఉంటే మరింత రాణిస్తుంది నా కుమార్తె కుసుమకు ప్రోత్సాహం ఉంటే క్రీడల్లో మరింత రాణిస్తుంది. కూలీ నాలీ చేసుకుని జీవనం సాగించే నాబోటి వాళ్లు మెరుగైన శిక్షణ ఇప్పించడం ఆర్థికంగా కష్టతరం. ప్రస్తుతం స్పోర్ట్స్ స్కూల్లో చదువుతుంది. ఇంటిర్మీడియట్ అనంతరం డిగ్రీ చదువును బయటే చదవాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నాపై పెనుభారం పడుతుంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. -
పట్టా కాదు.. పట్టు కావాలి
ఇంజనీరింగ్ విద్యతోపాటు నైపుణ్యం అవసరం ∙ సమయపాలనే కీలకమంటున్న నిపుణులు బాలాజీచెరువు (కాకినాడ) : జపాన్ దేశంలో పాఠ్యాంశాల బోధనతోపాటు విద్యార్థి ఎదగగలిగేలా నైపుణ్యాలు నేర్పుతారు. చైనాలో సాంకేతికత విద్యార్థులకు పట్టాతో పాటు ఉద్యోగాన్ని అందిస్తారు. కానీ మనదేశంలో పట్టా కోసం పరితపించే ఆలోచనే విద్యార్థిని ఆవహిస్తోంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నా ఉద్యోగాలు వేలల్లో మాత్రమే వస్తున్నాయి. నైపుణ్యం లేకుండా పట్టా పట్టుకొచ్చేస్తే ఉద్యోగాలు ఇవ్వలేమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం పట్టాకోసమే గాకుండా నైపుణ్యం సాధించే దిశగా విద్యార్జన సాగాలని నిపుణులు అంటున్నారు. అదే విజయ మార్గమని స్పష్టం చేస్తున్నారు. పట్టాతో ప్రయోజనం లేదు విద్యార్థులు కేవలం పట్టాను తీసుకుని బయటకు వెళితే ప్రయోజనం లేదు. అంతర్గత సామర్థ్యాలు పెంచుకుని పరిశ్రమకు తగ్గ నైపుణ్యాలు సాధించాలి. ఆ దిశగా ప్రథమ సంవత్సరం నుంచే కృషి చేయాలి. –పి.వి.కృష్ణంరాజు, చైతన్య ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ప్రథమ సంవత్సరం... జిల్లాలో 32 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ ఏడాది దాదాపు 14వేల మంది విద్యార్థులు చేరారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారే. విద్యార్థులు ప్రధానంగా ఆంగ్లభాషలో పట్టుకోసం గట్టి ప్రయత్నమే చేయాలి. అది మొదటి ఏడాదిలో ప్రారంభం కావాలి. ఇంజనీరింగ్ విద్య అంటే పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలపై అవగాహన పెంచుకుని, నమూనా ప్రశ్నాపత్రాలపై దృష్టి సారించాలి. అన్నింటికీ మించి సమయపాలన నేర్చుకోవాలి. రెండవ సంవత్సరం మొదటి సంవత్సరంతో పాటు రెండవ సంవత్సరం ఆరునెలల పాటు కామన్‌కోర్సు ఉంటుంది. ఇకపై కోర్ సబ్జెక్టువైపు బోధన మళ్లుతుంది. ఇక్కడి నుంచి క్రీయాశీలకంగా విద్య సాగుతుంది. వర్క్‌షాపులు, టెక్నికల్ సింపోనియమ్స్, సెమినార్లు, ప్రజంటేషన్లు వంటి వాటిపై దృష్టి సారించాలి. ప్రాజెక్టు రిపోర్టు తయారుచేయడం, పరిశోధనలలో ఫ్యాకల్టీతో కలిసి పనిచేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. మూడో సంవత్సరం... విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటున్నాడో, ఉద్యోగం వైపు దృష్టి సారించాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవలసింది ఇక్కడే. అంతర్గత సామర్థ్యాన్ని అంచనా వేస్తూ పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా సాగే ఇంటర్న్‌షిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 30 నుంచి 180 రోజులు ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. మంచి పరిశ్రమను ఎంచుకుని సమయపాలన, మైండ్ మేనేజ్మెంట్, తదితర లక్షణాలు అలవర్చుకోవాలి. మరోవైపు ఈ కాలంలో గేట్ కోసం సాధన ప్రారంభించాలి. స్టార్టప్ ప్రాజెక్టులు ఆవిష్కరించాలి. ఇలా మూడవ సంవత్సరం కీలకంగా వినియోగించుకోవాలి. చివరి సంవత్సరంలో... ఈ దశలో విద్యార్థులు నమూనా మౌఖిక పరీక్షలకు హాజరుకావడం, తమ రెజ్యూమ్ పక్కాగా తయారుచేసుకోవడం, బృంద చర్చల్లో పాల్గొనడం వంటివి సాధన చేయాలి. పత్రికలు చదువుతూ లోకజ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. గతవారం జేఎన్టీయూకేలో ప్రముఖ ఎంఎన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇంటర్వ్యూలు నిర్వహించింది. విద్యార్థులను టాటా సంస్థ చైర్మన్ ఎవరని అడిగితే చెప్పలేకపోయారని టీసీఎస్æహెచ్ఆర్ మేనేజర్ ఆశ్చర్యపోయారు. -
డీఈవో అభినందన
ఇందూరు: కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులను డీఈవో లింగయ్య అభినందించారు. గత శుక్రవారం నుంచి కరీంనగర్లో నిర్వహించిన ‘ఇన్స్పైర్’లో ఆర్మూర్ మామిడిపల్లికి చెందిన నరేంద్ర హైస్కూల్ విద్యార్థిని ఎం.భబిత, భీమ్‌గల్, మెంట్రాజ్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఎస్.నవీన్, ఆర్.ప్రశాంత్ ప్రతిభ చాటారు. ఇదే ఉత్సాహంతో జాతీయ స్థాయికి ఎదగాలని డీఈవో వారికి సూచించారు. జిల్లా సైన్స్ అధికారి గంగకిషన్, సుదేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
చెక్కు చెదరని ప్రతిభ
-
నృత్య పోటీల్లో ప్రవల్లిక ప్రతిభ
రేపల్లె: గత నెల 21 నుంచి 24వ తేదీ వరకు సిమ్లాలో నిర్వహించిన ధారోహర్ అంతర్జాతీయ నృత్యోత్సవంలో చెరుకుపల్లికి పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక ప్రతిభ కనబరిచింది. జాతీయస్థాయి నృత్య పోటీల్లో సెమీ క్లాసికల్ విభాగంలో ప్రథమ బహహుమతి, మరో నృత్యకారిణి మోహనతో కలిసి చేసిన కూచిపూడి జంట నృత్యంలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. జానపద నృత్య విభాగంలో తృతీయ బహుమతి దక్కించుకుంది. ఆమెను విద్యాశాఖ ప్రాంతీయ ఉప సంచాలకురాలు పార్వతి, నాట్య గురువు కాజ వెంకట సుబ్రహ్మణ్యం, బాపట్ల డీఈవో ఎన్.రఘుకుమార్, ఎంఈవో పి.లాజర్, ఎంపీడీవో షేక్ సుభానీ, వనజాచంద్ర విద్యాలయం డైరెక్టర్ కొడాలి మోహన్, ప్రిన్సిపాల్ ఏవీ కృష్ణారావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
కళా ప్రతిభే కొలమానం
సినీ దర్శకుడు మురళీ తెడ్ల తెనాలి : సినిమాకు సంబంధించిన ఏదో ఒక కళలో ప్రవేశమున్న యువతకు తగిన అవకాశం కల్పించాలన్నది తమ ఉద్దేశమని ‘రా...కిట్టు’ సినీ దర్శకుడు మురళి తెడ్ల చెప్పారు. విధాత ఫిలిమ్స్ వారి ప్రొడక్షన్స్ నెం.2 సినిమా ఆడిషన్ కార్యక్రమం ఆదివారం స్థానిక కవిరాజు పార్కులోని సీనియర్ సిటిజన్స్ భవనంలో నిర్వహించారు. ప్రారం¿¶ æసభకు బెల్లంకొండ వెంకట్ అధ్యక్షత వహించారు. ఉలి దెబ్బలు తిన్న రాయి.. దేవతామూర్తిగా మారి ప్రజల పూజలు అందుకుంటుందని, అలాగే కష్టపడి పని చేసిన వ్యక్తులు ఏదో ఒక సమయంలో గుర్తింపునకు నోచుకుంటారని అన్నారు. హైదరాబాద్‌లో సినీ స్టూడియోల చుట్టూ తిరక్కుండా వారి టాలెంట్‌ను నిరూపించుకున్న యువతకు తమ సినిమాలో అవకాశం ఇస్తామని తెలిపారు. సినీ నిర్మాత జె.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చెప్పాల్సిన సందేశాన్ని సినిమా ద్వారా చెబితే చేరగలుగుతుందని, ఇందుకు వ్యయప్రయాసలు తప్పవన్నారు. సహ నిర్మాత పెద్దసింగు, ప్రతినిధి సినిమా నిర్మాత గుమ్మడి రవీంద్ర, కెమెరామేన్ బి.చక్రధర్, రా...కిట్టు సినిమా నటులు అలపర్తి వెంకటేశ్వరరావు, వెలగా సుభాష్‌చంద్రబోస్, ఎంఎస్ ఛార్లీ, సంగీత దర్శకుడు జూనియర్ బాజీ మాట్లాడారు. అనంతరం ఆడిషన్ నిర్వహించారు. యువకులు హాజరయ్యారు. -
‘ఎర్ర’ స్మగ్లర్ల తెలివి తేటలు
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు మారు వేషాలు వేస్తుంటే.. స్మగ్లర్లు తప్పించుకోవడానికి విభిన్న ఆలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా ఎర్రచందనం దుంగలు తీసుకెళ్లే లారీలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లారీ లోపల టమాట, ఇతర కూరగాయలు పెట్టుకోవడానికి కమ్మీలు పెట్టి మధ్యలో ఎర్రచందనం దుంగలను ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా రవాణా చేస్తున్నారు. ఇదే లారీల్లో స్మగ్లర్లు టమాట బుట్టల వెనుకవైపు కూర్చుని పోలీసులు తనిఖీలు చేస్తే తప్పించుకోవడానికి ప్రత్యేకంగా ఓ అత్యవసర దారిని సైతం తయారు చేయించుకుంటున్నారు. పోలీసులు లారీని తనిఖీ చేసేలోపు స్మగ్లర్లు బాడీ కింద ఉన్న అత్యవసర తలుపును తీసి కిందకు దిగి తప్పించుకుంటున్నారు. తాజాగా అనంతపురంలో చిత్తూరు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ రెడ్‌లో స్వాధీనం చేసుకున్న లారీని ఇదే తరహాలో తయారుచేయించడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరం
సినిమా రంగంలో ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరమని వర్థమాన నటుడు ధీరేంద్ర అన్నారు. చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టమని, పాఠశాల, కళాశాలలో చదివే సమయంలో 50 వరకు స్టేజ్ ప్రోగ్రామ్‌లు చేశానని చెప్పారు. ఈ క్రమంలో ‘రెడ్ అలర్ట్’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చిందని తెలిపారు. మంగళవారం షీలానగర్‌లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో తన అనుభవాల్ని పంచుకున్నారు. ప్రశ్న : మీ స్వస్థలం ఎక్కడ, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది.? జ. మాది తిరుపతి, సినీ నటుడు మోహన్‌బాబు గారి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో బీటెక్, ఎంబీఏ పూర్తి చేశాను. మా నాన్న గారి ఉద్యోగి రీత్యా విశాఖలోని సిరిపురంలో మూడేళ్లగా ఉంటున్నాం. ప్రశ్న : సినిమా రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? జ. చిన్నప్పటి నుంచి నటన అంటే అమితమైన ఇష్టం. చిత్ర పరిశ్రమలో ప్రవేశించి హీరోగా ఎదగాలని ఉండేది. పాఠశాల, కళాశాలల్లో చదివే సమయంలో చాలా నటకాలు వేశాను. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. మోహన్‌బాబు గారి చేతులమీదుగా బహుమతులు అందుకున్నాను. ప్రశ్న : సినిమా రంగంలోకి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? జ. మోహన్‌బాబు గారు. ఆయన డైలాగ్ డెలివరి బాగుంటుంది. ప్రశ్న : ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు? ఏయే భాషల్లో నటిస్తున్నారు ? జ. తెలుగులో మూడు సినిమాలు చేశాను. రెడ్ అలర్డ్ రిలీజ్ అయ్యింది. కలి సినిమా పూర్తి కావచ్చింది. మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను. ప్రశ్న : ఎవరి వద్దయినా శిక్షణ తీసుకున్నారా? జ. మొదట్లో అనుపమ కేర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాను. విశాఖ వచ్చిన తరువాత స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద చేరాను. ఆ సమయంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రశ్న : విశాఖ నగరంతో అనుబంధం? జ. విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. నగరాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అన్ని ప్రదేశాలను చుట్టేశాను. విశాఖలో చిత్ర పరిశ్రమకు కావల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. -
ప్రతిభతో క్రీడల్లో గుర్తింపు
ఆదిలాబాద్ స్పోర్ట్స్: క్రీడాకారులోని ప్రతిభతోనే గుర్తింపు లభిస్తుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైధానంలో శనివారం టీసీఏ 2డే లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆదిలాబాద్ అర్బన్, ఆసిఫాబాద్ మ్యాచ్‌ల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు సాధన అవసరమని, ప్రతిభతోనే గుర్తింపు చేకూరుతుందని చెప్పారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారులు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పారు. క్రీడాకారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. క్రీడానైపుణ్యాలతో అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇందులో టీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నరోత్తమ్‌రెడ్డి, జిల్లా జట్టు కోచ్ జయేంద్రపటాస్కర్లు , క్రీడాకారులు ఉన్నారు. ఇంద్రనీల్ అల్రౌండర్ ప్రతిభ... ఆసిపాబాద్ జుట్ట టాస్‌గెలిచి మొదటి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ అర్బన్ జట్టు 359 పరుగులు చేసి 7 వికేట్ల నష్టపోయింది. ఇందులో ఇంద్రనీల్ పటాస్కర్ 156 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. జయగణేష్ 52 పరుగులతో నాటౌట్, అన్వేష్‌రెడ్డి 51 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసిఫాబాద్ జట్టు 98 పరుగులు చేసి 9 వికేట్ల నష్టపోయింది. ఇందులో ఇంద్రనీల్ 5 వికేట్లు తీసుకోగా , ప్రణయ్ 2 వికేట్లు తీసుకున్నారు. -
టిమ్ కుక్ ప్రేమలో పడిపోయారట!
న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ ప్రేమలో పోయాడట. ఇక్కడి కల్చర్, హిస్టరీ తనను బాగా ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా జి నారాయణమ్మ మహిళా కాలేజీ విద్యార్థినిల ప్రతిభా పాటవాలపై ప్రశంసలు కురిపించారు. ఆ విద్యార్థినులను కలవడం తనకు చాలా షంతోషాన్ని పంచిందన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. హైదరాబాదీయుల ప్రతిభకు ముగ్ధుడైపోయిన కుక్ తన ఆనందాన్ని శుక్రవారం ఆ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతోపాటుగా ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు. జి నారాయణమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా ఇన్స్టిట్యూట్ ను సందర్శించిన ఆయన హైదరాబాద్ సంస్కృతి, చరిత్రకు ముగ్ధుడినయ్యానని ఇప్పటికే నగరం ప్రేమలో పడిపోయానని వ్యాఖ్యానించారు. జీఎన్ఐటీఎస్ మహిళా కళాశాలని కొత్త మ్యాక్ ల్యాబ్ దగ్గర అత్యుత్తమ ప్రతిభ , ఉత్సాహం ఉందని ట్విట్టర్ లో తెలిపారు. మిమ్మల్ని చూసి చాలా ఆనందించానని కుక్ ట్విట్ చేశారు. గురువారం కాలేజీని సందర్శించిన కుక్ అక్కడ కంప్యూటర్ సెంటర్ ని ప్రారంభించారు. అలాగే ఆపిల్ విద్యార్ధులకు శిక్షణ కు సంబంధించిన ఒక అవగాహనా పత్రంపై సంతకం చేశారు . కాగా భారతదేశంలో రెండో రోజు పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్ వచ్చిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇక్కడ యాపిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. దీని ద్వారా భవిష్యత్తులో నాలుగువేలమంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. Lots of talent and enthusiasm at the new Mac Lab at GNITS women’s college. Enjoyed visiting you yesterday! pic.twitter.com/ZqCnVkBpii — Tim Cook (@tim_cook) May 20, 2016 -
బాసర టాపర్ మనోడే
♦ ఖేడ్ మండలానికి చెందిన రమేష్ ప్రతిభ ♦ మంత్రి కడియం చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ భైంసా/బాసర: ఉమ్మడి రాష్ట్రంలో గాడితప్పిన విద్యావ్యవస్థపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక ద ష్టి సారించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం బాసర ఆర్జీయూకేటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఆర్జీయూకేటీలో నిర్మాణాలు పూర్తయిన భవనాలను డార్మెటరీహాల్స్ను, స్టడీ సెంటర్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం స్నాతకోత్సవంలో ఆయన మట్లాడుతూ.. ఇంజినీరింగ్ కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రేడింగ్ విధానం తీసుకురానుందని చెప్పారు. వర్సిటీ టాపర్ మెదక్ జిల్లా విద్యార్థి బాసర ఆర్జీయూకేటీ వర్సిటీ టాపర్‌గా నిలిచిన కమ్ముల రమేష్‌కు డిప్యూటీ సీఎం కడియం గోల్డ్‌మెడల్ అందించారు. రమేష్.. నారాయణ్‌ఖేడ్ మండలం చాంద్‌ఖాన్‌పల్లికి చెందిన విద్యార్థి. మెకానికల్ విభాగంలో తూప్రాన్‌కు చెందిన దేవతా భానుకిరణ్ టాపర్‌గా నిలిచాడు. -
పేరెంట్స్ ఉత్సాహంతోనే పిల్లల్లో ప్రతిభాపాటవాలు!
పరిపరిశోధన పిల్లలు స్కూల్లో మంచి ప్రతిభను కనబరచాలంటే వాళ్లు మాత్రమే సంతోషంగా ఉంటే చాలదు. వాళ్ల తల్లిదండ్రులు కూడా ఉల్లాసంగా ఉండాలంటున్నారు పరిశోధకులు. తల్లిదండ్రులు నిరాశ నిస్పృహలతో ఉంటే అది పిల్లల చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు మానసిక నిపుణులు. స్వీడన్లో దాదాపు పదకొండు లక్షల మంది టీనేజ్ విద్యార్థులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందంటున్నారు మానసిక అధ్యయనవేత్తలు. ఈ పదకొండు లక్షల మంది పిల్లల ఫైనల్ పరీక్షల ఫలితాలను, వాళ్ల తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతూ వ్యాకులతతో ఉన్న తల్లిదండ్రులకు చెందిన పిల్లల స్కోర్లనూ, అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే తల్లిదండ్రుల తాలూకు పిల్లల మార్కులను సరిపోల్చి చూశారు. ఈ పరిశోధన ఫలితాలు అబ్బురపరచేలా ఉన్నాయట. మిగతావారిలో పోలిస్తే డిప్రెషన్‌తో బాధపడే తల్లిదండ్రుల తాలూకు పిల్లల మార్కులు కనీసం 4 శాతం నుంచి 4.5 శాతం తక్కువగా ఉన్నాయట. ఈ అధ్యయన ఫలితాలను ‘జామా సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు సదరు అధ్యయనవేత్తలు. అంతేకాదు... పిల్లల మానసిక వికాసం, నరాల ఆరోగ్యకరమైన ఎదుగుల, భావోద్వేగాలపై అదుపు, మంచి సామాజిక ప్రవర్తన ఉండాలంటే తల్లిదండ్రులు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలని పిలుపునిస్తున్నారు మానసిన నిపుణులు. -
‘షో’భన్ బాబు
♦ పాటలు, డ్యాన్స్, మిమిక్రీ, యాంకరింగ్‌లో ప్రతిభ ♦ రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రదర్శనలు.. పలువురి ప్రశంసలు పాటలు పాడటం.. పేరడీగా మలచడం.. ధ్వన్యనుకరణ చేయడం.. ఇతరుల డ్యాన్స్‌ను అనుకరించడం.. యాంకరింగ్‌తో ఆకట్టుకోవడం.. షార్ట్ ఫిలింస్‌లో నటనా కౌశలాన్ని ప్రదర్శించడం.. ఇలా వివిధ విభాగాల్లో ప్రతిభ చాటుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో బహుమతులు దక్కించుకోవడంతోపాటు ప్రముఖుల మెప్పు పొందుతున్నాడు నగరానికి చెందిన శోభన్‌బాబు. వేదికలపై నిత్యం ప్రదర్శనలతో అలరించే ఆయన అందరి దృష్టిలో ‘షో’భన్బాబుగా మారాడు. - ఖమ్మం కల్చరల్ నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన శోభన్‌బాబు ప్రైవేటు ఉద్యోగి. ప్రవృత్తిగా కళారంగాన్ని ఎంచుకున్నాడు. 1996లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కళారంగంలో రాణిస్తున్నాడు. అప్పట్లోనే జిల్లాస్థాయి పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచి.. ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. సినిమా పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా జానపద పాటలు ఎక్కువగా పాడుతూ పల్లె సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించడం అలవర్చుకున్నాడు. క్రమక్రమంగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అంతేకాక డ్యాన్స్‌లు చేస్తూ.. ఇతరులను అనుకరించడం అలవర్చుకున్నాడు. డ్యాన్స్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, రాజశేఖర్, బ్రహ్మానందం, ఆర్.నారాయణ మూర్తి, శోభన్‌బాబు తదితర హీరోలను అనుకరించడంలో నేర్పు సంపాదించాడు. ఖమ్మంకు చెందిన మొగిలి దర్శకుడిగా గతేడాది విడుదల అయిన ‘ఒక్కడితో మొదలైంది’ అనే సినిమాలో హీరో సుమన్ పక్కన ఓ పాత్రలో నటించాడు. వేదికలపై యాంకరింగ్ చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంటాడు. ఒకే వేదికపై యాంకరింగ్‌తోపాటు పాట పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ.. మిమిక్రీ చేయడం ఇతడి అదనపు ప్రత్యేకతలు. పలు టీవీ సీరియల్స్, లఘు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించిన అనుభవం ఉంది. అతడి ఉత్తమ నటనకు పలువురిచే ప్రశంసలు అందుకున్నాడు. సినిమా పాటలను యువతకు నచ్చేలా పేరడీ పాటలుగా మలిచి పాడటంలో సిద్ధహస్తుడు. అవార్డులు, ప్రశంసలు కొన్ని... ♦ 2001లో విజయవాడ రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో సిద్ధార్థ అకాడమీలో ‘పిచ్చి పెళ్లికొడుకుగా’ నవ్వించి..ప్రథమ బహుమతి పొందాడు. ♦ 2002లో హైదరాబాద్‌లో జరిగిన పాటల పోటీల్లో ప్రథమ బహుమతి ♦ 2002లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఫెస్టివల్ పాటల పోటీల్లో పాల్గొన్నాడు ♦ 2006లో జోనా మెమోరియల్ రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ప్రథమ బహుమతి. ♦ 2007లో వరంగల్ రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్లో మిమిక్రీ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించాడు. ♦ 2008లో తెలుగు భాషా దినోత్సవంలో వక్తృత్వ పోటీల్లో ద్వితీయ బహుమతి పొందాడు. వీటితోపాటు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, సునీల్, సుమన్, రఘు కుంచె, డెరైక్టర్ బి.గోపాల్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నాడు. -
ఈ షో రూటే సెపరేటు!
ప్రదీప్ షో చేశాడంటే అది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎనర్జీని ఎంటర్టైన్మెంట్ని మిక్సీలో వేసి తిప్పితే ప్రదీప్ అయ్యిందేమో అనిపిస్తుంది అతణ్ని చూస్తే. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ షో సూపర్ సక్సెస్ అయ్యిందంటే అది కేవలం అతడి వల్లే. అదే విధంగా ఇప్పుడు ‘బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్’ని కూడా విజయపథంలో నడిపిస్తున్నాడు ప్రదీప్. దేశం నలు మూలలా ఉన్న వైవిధ్యభరిత టాలెంట్స్‌ని పరిచయం చేసే వేదిక ఈ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్. వాళ్లను గెస్టులుగా వచ్చిన సెలెబ్రిటీలు చాలెంజ్ చేస్తారు. ఆ చాలెంజ్‌ను వాళ్లు ఎలా స్వీకరించారు, తమ టాలెంట్‌తో ఎలా బదులు చెప్పారు అన్నదే షో. అన్ని రకాల టాలెంట్స్నీ చూడటం ఓ గొప్ప అనుభూతి. కాన్సెప్ట్‌లో వెరైటీ ఉంటే ఏ కార్యక్రమానికి అయినా ప్రేక్షకులు పట్టం కడతారు. అచ్చంగా అలాంటి షోనే ఇది. రొటీన్ డ్యాన్స, కామెడీ షోల మధ్య ఓ సెపరేట్ రూట్‌ని సృష్టించుకుంది. కాన్సెప్ట్ క్రియేట్ చేసినవాళ్లను మెచ్చుకోవాల్సిందే! -
చెట్ల చుట్టూ తిరగడం అంత ఈజీ కాదు!
‘‘సెలబ్రిటీ స్టేటస్ చాలా గొప్పది కాబట్టి, నేను ఆర్టిస్ట్ కాలేదు. స్టార్స్ లైఫ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కూడా కాలేదు. నటన అనేది నా జీన్స్‌లోనే ఉంది. అందుకే ఎంతో మక్కువతో ఆర్టిస్ట్ అయ్యాను’’ అని శ్రుతీహాసన్ అన్నారు. గ్లామర్, డీ-గ్లామర్ రెండు పాత్రలనూ ఒకే రకంగా చూస్తానని శ్రుతి చెబుతూ - ‘‘మీకు గ్లామరస్ రోల్స్ ఇష్టమా? డీ-గ్లామరా అని ఎవరైనా నన్నడిగితే నాకేం చెప్పాలో తెలియదు. ఎందుకంటే నేను నటిని. ఏ పాత్ర అయినా నాకు ఒకటే. ‘గ్లామరస్ క్యారెక్టర్స్ చాలా ఈజీ. పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు’ అని కొంతమంది చాలా తేలికగా మాట్లాడతారు. ఏ పాత్రకైనా ఎంతో కొంత కష్టపడాల్సిందే. చెట్ల చుట్టూ తిరగడం అనుకున్నంత ఈజీ కాదు. దానికి కూడా టాలెంట్ ఉండాలి. గ్లామరస్‌గా కనిపించడం అంత సులువు కాదు. అందుకే గ్లామరస్ క్యారెక్టర్స్‌ని చిన్న చూపు చూడకూడదు. నా మటుకు నేను పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. ఎంత అందంగా కనిపించడానికైనా ఓకే. అలాగే, పాత్ర డిమాండ్ చేస్తే అంద విహీనంగా కనిపించడానికి కూడా నేను రెడీయే’’ అన్నారు. -
నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు..
పీజీఆర్ఆర్సీడీఈ డెరైక్టర్ ప్రొ.వెంకటేశ్వర్లు తాండూరు (రంగారెడ్డి జిల్లా): దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల కన్నా సేవారంగం ఒక్కటే దూసుకుపోతున్నదని ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్సీ దూరవిద్య డెరైక్టర్ ప్రొ.హెచ్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోనీ పీపుల్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన దూరవిద్యపై అవగాహనకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వృద్ధి రేటు పెరుగుదల 30శాతం ఉంటే.. సేవా రంగం పెరుగుల రేటు 60శాతం ఉందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవారంగంలోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్, అకౌటింగ్, టెలీకమ్యూనికేషన్స్, టూరిజం తదితర రంగాల్లో అవకాశాలు బోలెడు ఉన్నాయని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కామర్స్ విద్యార్థులే ఉద్యోగాలు పొందటంతో ఎక్కువగా రాణిస్తున్నట్టు చెప్పారు. విద్యార్హత ఒక్కటే సరిపోదని, నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు దక్కతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్ధేశించుకొని అర్హతలతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కామర్స్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్(త్రీసీ)పై పట్టు సాధిస్తే ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చన్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులతోపాటు వృత్తి విద్యా కోర్సులను చదవాలని సూచించారు. ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న కోర్సులు, బోధన అవకాశాలు, శిక్షణ కేంద్రాలు, పుస్తకాలు తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకుంటూ ముందుకుసాగితే ఉన్నతస్థాయికి వెళతారన్నారు. -
ప్రతిభకు తగ్గ పారితోషికం లేదు
ప్రతిభకు తగ్గ పారితోషికం ఇవ్వడంలేదంటూ కోలీవుడ్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది నటి అనన్య. నాడోడిగళ్ చిత్రం ద్వారా తమిళచిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ మలయాళ కుట్టి గుర్తుందా? ఇక్కడ తొలి చిత్రం విజయం సాధించడంతో అమ్మడికి అవకాశాలు వరుస కట్టాయి. శీడన్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, పులివాలు, ఇరవుపగలు చిత్రాల్లో నటించేసింది. అయితే వీటిలో ఎంగేయుమ్ఎప్పోదుమ్ చిత్రం మినహా ఏ చిత్రం విజయం సాధించలేదు. ఫలితం అవకాశాలు అడుగంటాయి. మధ్యలో తెలుగు తదితర ఇతర భాషల్లోనూ అదృష్టాన్ని పరిరక్షించుకున్నా ఫలితం శూన్యం. దీంతో మళ్లీ మాలీవుడ్‌కు పీచేమూడ్ అంది. ఇంత జరిగినా ఈ కేరళ కుట్టి అందాలారబోతకు తాను దూరం అంటోంది. సరే తమిళంలో నటించడంలేదేంటి అని అంటే అవకాశాలు రావడంలేదని చెప్పకుండా కోలీవుడ్ లో ప్రతిభకు దగ్గ పారితోషికం ఇవ్వడం లేదు అందుకే తమిళ చిత్రాల అవకాశాల్ని అంగీకరించడం లేదు అంటూ ఈ అమ్మడు కుంటి సాకులు చెబుతోంది. డొంక తిరుగుడు సమాధానం అంటే ఇదేనేమో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
కార్పొరేటు విద్య
రూ.వేలల్లో ఫీజులు వసూలు యథేచ్ఛగా ప్రయివేట్ స్కూళ్ల దందా పట్టించుకోని ప్రభుత్వం అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు విశాఖ ఎడ్యుకేషన్: సాంకేతిక విప్లవంతో విద్యా ప్రమాణాల్లో ఎప్పటికప్పుడు పెను మార్పు లు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే పిల్లలకు మంచి విద్య అందించాల్సిన అవశ్యకత ఎంతో ఉంది. నాణ్యమైన విద్యనందించడంలో ప్రభుత్వ పాఠశాలలు బాగా వెనుకబడి పోవడంతో ప్రయివేట్ విద్యా సంస్థల దందా కొనసాగుతోంది. కాస్త మెరుగైన విద్యనందిస్తుండడంతో సామా న్య ప్రజలు సైతం ప్రయివేట్ స్కూళ్లవైపు పరుగులు తీసున్నారు. అప్పోసొప్పో చేసి ఆ పాఠశాలల యాజమాన్యం అడిగినంత సమర్పించుకుని తమ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం అందులో చేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంస్థలు ప్రతి ఏటా ఫీజులు పెంచేసి ఎడాపెడా సొమ్ములు గుంజేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్, టెక్నో, ఈ-టెక్నో, కాన్సెప్ట్, టాలెంట్ పేరుతో రోజుకో పాఠశాల పుట్టుకొస్తూ విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చేశాయి. జూన్ వచ్చిందంటే హడల్... ఏటా జూన్ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు మాత్రం ఈ నెల వచ్చిందంటే హడలిపోతారు. దానికి కారణం పిల్లల చదువులు... వాటి కోసం ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాలు రకరకాల పేర్లతో వసూలు చేసే ఫీజులే. కార్పొరేట్ పాఠశాలలో కొత్తగా ఓ విద్యార్థిని ఎల్కేజీలో చేర్చేందుకు అప్లికేషన్ ఫీజు, అడ్మిషన్, బిల్డింగ్ ఫండ్ అంటూ రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్స్, షూలు కలిపి మరో రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుపెట్టిస్తున్నా రు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ స్థాయిలో ఫీజులు చెల్లించడానికి ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టడమో లేదా అప్పులు చేయడమో తప్పడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో కొరవడ్డ విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్లే తప్పని పరిస్థితుల్లో ఫీజులు ఎక్కువైనా ప్రయివేట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని చదివించాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ చెబుతున్న మాటలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో కూడా విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విద్యా హక్కు చట్టం అమలు శూన్యం ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం 8వ తరగతి వరకు ఫీజులు వసూలు చేయకూడదనే నిబంధన ఉన్న అది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రయివేట్ పాఠశాలల్లో కచ్చితంగా క్రీడా మైదానం, అగ్నిమాపక పరికరాల ఏర్పాటుతో పాటు ఫీజుల నియంత్రణపై కమిటీల ద్వారా పర్యవేక్షణ జరిపి తల్లిదండ్రులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఈ చట్టాన్ని ప్రయివేట్ పాఠశాలలు అస్సలు అనుసరించడం లేదు. పుస్తకాలు, యూనిఫాం స్కూళ్లలో విక్రయించరాదన్న నిబంధన ఉన్న బహిరంగంగానే వీటి అమ్మకాలు సాగుతున్నాయి. పలు పాఠశాలలు కొన్ని షాపులతో బేరం కుదుర్చుకొని తమ విద్యార్థులను వారి వద్దకు పంపిస్తున్నాయి. మొత్తం మీద చదువుల పేరుతో సాగుతున్న ఫీజుల దందాకు సామాన్య, మధ్య తరగతి తల్లిదండ్రుల నడ్డి విరిగిపోతోంది. -
అదరగొట్టారు
స్కూలు ఫంక్షన్స్‌లో పిల్లలు ప్రదర్శనలు ఇవ్వటం మాములే. అలా ఓ స్కూల్లో వేసిన నాటకంలో వాళ్ల ఇన్వాల్వ్మెంట్, టాలెంట్ చూసి ముచ్చట పడిన యాజమాన్యం.. మరోసారి పెద్దల కోసమంటూ లామకాన్‌లో వీళ్లతో ఓ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసింది. 20 మందికి పైగా పిల్లలు ఎలాంటి తడబాటు లేకుండా డైలాగులు, చక్కటి హావభావాలతో మురిపించారు. కామెడీ, సెటైర్, చక్కటి భాష కలిసిన ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. షేక్స్పియర్ రాసిన నాటకాలు అర్థం చేసుకోవటమే కష్టం. అలాంటిది ఆ నాటకాన్ని అలవోకగా ప్రదర్శించడం మహామహా నటులకే సాధ్యమయ్యే పని. అంతటి క్లిష్టమైన నాటకాన్ని సులభంగా అర్థం చేసుకోవడమే కాదు... అనుభవమున్న నటుల్లా ఆయా పాత్రల్లో జీవించారు చిన్నారులు. నగరంలోని శ్లోక పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు షేక్స్పియర్ ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకాన్ని నవరస రంజితంగా ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ఒరిజినల్లో వున్న క్యారెక్టర్లు, కథనం అలాగే ఉన్నాయి. సంభాషణలు మోడరన్ డేస్‌కి అనువుగా మార్చి, కాంటెపరరీగా మలిచిన ఈ నాటకం అబ్బురపరిచింది. ఊహించని మలుపులు.. షేక్స్పియర్ నాటకం విషయానికి వస్తే.. ‘ఫ్రెడరిక్ తన అన్న డ్యూక్ ఆస్తిని ఆక్రమించుకుని అతన్ని తరిమేస్తాడు. కానీ అతని కూతురు రోజాలిండ్ని మాత్రం తన కూతురు సిలియా కోసం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చూసీ చూడగానే రోజాలిండ్ ప్రేమలో పడతాడు పరదేశ యువరాజు ఆర్నాల్డో. అతని అన్న ఆలివర్. రోజాలిండ్ ప్రేమ విషయం తెలిసి ఫ్రెడరిక్ కోపగించుకొని దండించబోతాడు. తట్టుకోలేక రోజాలిండ్ అబ్బాయిగా, సిలియా ఎలీనాగా వేషం వేసుకుని ఇంటి నుంచి పారిపోతారు. మారువేషాల్లో వున్న ఎలీనాతో అలివర్ ప్రేమలో పడతాడు. మగవేషంలో ఉన్న రోజాలిండ్ ఆర్నాల్డోని కలుస్తుంది. ప్రేమకోసం తపిస్తూ అతను రాస్తున్న కవితలు చదివి, ఆ ప్రేమను మరిచిపొమ్మని చెబుతుంది. మరోవైపు రోజాలిండ్ని అబ్బాయి అనుకుని ఫేబ్ అనే అమ్మాయి ఆమెను ప్రేమిస్తుంది. ఇలా ఒక ప్రేమ జంటతో మొదలైన కథలోకి నాలుగు జంటలు వస్తాయి. చివరికి సుఖాంతమవుతుంది. అయితే మధ్యలో వచ్చే అనేక పాత్రలు, ఊహించని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రపంచం నేటికి చెప్పుకునే ‘జీవితం ఒక రంగస్థలం లాంటిది, అందులో మనమందరం పాత్రధారులం’ డైలాగ్స్ ఈ నాటకంలోనివే. -
అన్నింటా అమ్మ ఉంటే.. !
ఈ లోకంలో అడుగుపెట్టిన ఏ బిడ్డకైనా అమ్మతోడిదే తొలి బంధం. అమ్మే తొలి నేస్తం. అమ్మే తొలి గురువు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలోంచి ఓ కొత్త కోణాన్ని వెలికి తీశారు కొందరు పరిశోధకులు. పిల్లలు, వారి ప్రవర్తన, వారిలోని నైపుణ్యాలపై ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో, తల్లి తమ పక్కనే ఉన్నప్పుడు పిల్లలు ఎంతో చురుకుగా ఉంటారని తేలింది. కొందరు పిల్లలకు పాఠ్యాంశాలపై పరీక్షలు నిర్వహించారు. ఆపైన వారిని తమకు నచ్చిన పని చేయమని కూడా చెప్పడంతో బొమ్మలు గీయడం, ఏవో వస్తువులు తయారు చేయడం, ఇలా తమకు తోచిన పనులు చేశారు. అదే పిల్లల్ని తమ తల్లులతో కలిపి కూర్చోబెట్టి మళ్లీ అవన్నీ చేయమంటే... మొదటిసారి అంతంతమాత్రంగా ప్రతిభ చూపినవాళ్లు కూడా చక్కటి ప్రతిభను ప్రదర్శించారట. దాంతో తల్లి దగ్గరగా ఉంటే పిల్లలు అన్నింటిలో రాణిస్తారని నిర్థారిం చేశారు పరిశోధకులు. అర్థమైంది కదా! కేవలం వండి పెట్టడం, తయారుచేసి స్కూలుకు పంపడం చేస్తే సరి పోదు. వారు చేసే ప్రతి పనిలోనూ తల్లి బాధ్యత పంచు కోవాలి. అప్పుడు వాళ్లు అన్నింట్లో ముందుంటారు! -
గ్లామర్ పాయింట్
కూడలి ఆ టీవి.... ఠీవీయే వేరు! ప్రతిభ ఉండగానే సరిపోదు. ఆ ప్రతిభ పదిమంది దృష్టిలో పడడానికి సరియైన టైమ్ రావాలి. ప్రకటనల్లో, నాటకాల్లో నటించినప్పటికీ నిమ్రత కౌర్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ‘లంచ్‌బాక్స్’ సినిమా ఆమె కెరీర్‌కు కొత్త ఊపు ఇచ్చింది. కౌర్ నటప్రతిభ అంతర్జాతీయస్థాయి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే అమెరికన్ పాప్లర్ టీవీ సిరీస్ ‘హోమ్‌లాండ్’లో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. ‘‘అమెరికన్ టీవీలో సరే మన ఇండియన్ టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తారా?’’ అనే ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పకపోయినా ‘కాదు’ అనే చెప్పింది కౌర్. ‘‘వేరొకదాన్ని అనుకరిస్తూ చేసే సీరియల్స్‌లో నటించడం అంటే ఇష్టం ఉండదు. కాపీ సీరియల్స్‌లో నటించడానికి కష్టపడాలా? అని కూడా అనిపిస్తుంది. ఏ రకంగా చూసినా మన ఇండియన్ టీవీతో పోల్చితే అమెరికన్ టీవీ వేరు. వారి ప్రమాణాలు, ప్రాధాన్యతలు వేరు’’ అంటుంది నిమ్రత. -
టాలెంట్...మోసం
నెల్లూరు(విద్య) : రంగురంగుల బ్రోచర్లు... బంపర్ ఆఫర్లు... కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, ఉచిత విద్యాబోధన, ఇలా రకరకాల ఆకర్షణలతో తమ టాలెంట్‌నంతా ఉపయోగించి టెస్ట్ పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేయడం రోజురోజుకీ పెరిగిపోతుంది. కొందరైతే ప్రతి స్కూల్‌కు తిరిగి విద్యార్థుల వద్ద నుంచి ఎంట్రీ ఫీజులను వసూలుచేసి మరీ పరీక్షలు నిర్వహించకుండానే చేతులెత్తేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించే నెపంతో నిర్వహించే పలు టాలెంట్టెస్ట్లు మోసాలపుట్టగా మారుతున్నాయి. విద్యార్థుల ప్రతిభ కంటే చదువు పేరుతో మోసం చేసే టాలెంట్‌తో చాలామంది బతికేస్తున్నారు. ఈ వాస్తవం తెలియక తల్లిదండ్రులు ప్రతి టాలెంట్టెస్ట్కు తమ పిల్లలను పంపుతున్నారు. తమ పిల్లల్లో ప్రతిభకు కొలమానంగా ఈ పరీక్షలను వారు భావిస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం డబ్బుకు కక్కుర్తిపడి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి కొంతమంది ప్రతిభ ఉన్న విద్యార్థుల గుర్తించి వారిని వేరే పాఠశాలకు తరలించేందుకు చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సొసైటీలుగా ఏర్పడి టాలెంట్ టెస్ట్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి భారీ మొత్తాల్లో వసూలు చేస్తున్నారు. ఆ సంస్థలకు కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేకపోవడం గమనార్హం. విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ఎటువంటి టాలెంట్ టెస్ట్‌లను నిర్వహించకూడదు. ఇందుకు విరుద్ధంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, ఈసెట్, ఐసెట్, ఎంసెట్లతోపాటు ఉపాధ్యాయ వృత్తి కోసం నిర్వహించే టెట్, డీఎస్సీలకు సైతం మోడల్, టాలెంట్ టెస్ట్‌ల పేరుతో పలు సంస్థలు మోసం చేస్తున్నాయి. కొద్ది సంస్థలు మాత్రమే కట్టించుకున్న రుసుంకి తగినట్టుగా, సక్రమంగా మంచి ఉద్దేశంతో పరీక్షలను నిర్వహిస్తున్నాయి. జిల్లాస్థాయిలో ఉండే ఈ మోసపు టాలెంట్ ప్రస్తుతం మండల స్థాయికి పాకింది. తాజాగా నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట లక్ష్మీపురానికి చెందిన సి.బాపూజీ హిందీ వికాస కేంద్రం నిర్వహించిన హిందీ టాలెంట్ టెస్ట్ వివాదానికి తెరతీసింది. విద్యార్థుల నుంచి రూ.100లు వసూలు చేసి, హాల్ టికెట్ ఇచ్చి 397 మందికి పరీక్షలు నిర్వహించకుండానే ఆ సంస్థ ప్రతినిధి ఎస్కే అలీఅహ్మద్ చేతులెత్తేశాడు. పైగా ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తామని ప్రజలను మోసం చేశాడు. ఉన్నత విద్యను అభ్యసించిన వారే ఇలాంటి టాలెంటెడ్ మోసాలను చేయడాన్ని సాధారణ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి...
సాంకేతికం మీరు కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? గణితంలో మీ ప్రతిభను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘అన్‌లాక్ యువర్ బ్రెయిన్’ అనే ఈ ఆండ్రాయిడ్ యాప్ రకరకాల భాషలు నేర్పిస్తుంది. చరిత్రను బోధిస్తుంది. దీంతో పాటు రకరకాల పరీక్షలు పెట్టి, మీ గణిత ప్రతిభను మెరుగుపరుస్తుంది. ప్రశ్నకు సరియైన సమాధానం కోసం రెండు నుంచి మూడు సెకండ్ల సమయం ఇస్తుంది. ‘‘ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్ ఉపకరిస్తుంది’’ అంటున్నాడు సిమన్. జర్మన్‌కు చెందిన సిమన్ సెమెండ్ ఈ యాప్‌ను తయారుచేశాడు. పదసంపద, గణిత ప్రశ్నలతో ప్రస్తుతం ఈ యాప్‌లో ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని కొత్త సబ్జెక్ట్‌లను రాబోయే రోజుల్లో చేర్చే అవకాశం ఉంది. ఆ యాప్ శక్తిని అంచనా వేయడానికి జర్మనీలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పోట్స్డమ్’ కొన్ని పరీక్షలు నిర్వహించింది. ఇందులో 13,285 మంది పాల్గొన్నారు. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నవారు రెండు వారాల్లో వివిధ సబ్జెక్ట్‌లలో తమ ప్రతిభను గణనీయంగా మెరుగుపరుచుకున్నట్లు ఈ పరీక్షలో తేలింది. ‘‘ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రతి సబెక్ట్కు సంబంధించి గుట్టలు గుట్టలుగా సమాచారం ఉంటుంది. దీంతో ఎక్కడ మొదలుపెట్టాలో వారికి తెలియడం లేదు. కానీ, ఈ ‘అన్‌లాక్ యువర్ బ్రెయిన్’ యాప్ ఆ అయోమయాన్ని నివారిస్తుంది. సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా అందుబాటులో ఉంచి, ఎంచుకున్న సబ్జెక్ట్ మీద అవగాహనకు ఉపకరిస్తుంది’’ అంటున్నాడు సిమన్. మరింకేం... ప్రయత్నించి చూడండి! -
ఎత్తు లేకున్నా... ఎంతో ఎత్తుకు..!
కనీసం నాలుగు అడుగులు దాటని ఎత్తు... వయసేమో రెండు పదులు... ప్రతిభ ఉన్నా కాలంతో పోటీపడదామంటే ప్రోత్సాహం కరువు... గుర్తించే వాళ్లు అంతకన్నా లేరు... ఇవీ మరుగుజ్జుల కష్టాలు... అలాగని వాళ్లు మనో ధైర్యాన్ని వీడలేదు... క్రీడల్లో తమకున్న నైపుణ్యానికి మరింత పదును పెట్టారు... మంచి ఫలితాలు సాధించారు... తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మరుగుజ్జులంటే అందరికీ చిన్నచూపే... సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు... ప్రతిభ ఉన్నా బండెడు కష్టాలే... అందుకే వాళ్లు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లతోనో... సర్కస్‌లో జోకర్లుగానో... చిరు వ్యాపారులుగానో స్థిరపడిపోతున్నారు. ఇవేమీ లేనివాళ్లు బతుకు బండిని భారంగా లాగిస్తున్నారు. అయితే సమాజంలో తమకూ ఏదో విధమైన గుర్తింపు దక్కాలన్న ఆశయం వారిని క్రీడాకారుల్ని చేసింది. తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించేలా చేసింది. ఫలితంగా మరుగుజ్జులు డ్వార్ఫ్ క్రీడల్లో, పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్నారు. ఇంతింతై... మరుగుజ్జు క్రీడాకారుల కోసం అమెరికాలో డ్వార్ఫ్ అథ్లెటిక్ అసోసియేషన్ 1985లో ఏర్పాటైంది. మరుగుజ్జు క్రీడలను అభివృద్ధి చేసి, వాటికి ప్రాచుర్యం కల్పించి, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ సంఘం ఏర్పడింది. అలా తామూ ఏ క్రీడలనైనా ఆడగలమనే ధీమాను సాధించడమే కాకుండా మరుగుజ్జులకు పోటీలూ ఉన్నాయని ప్రపంచానికి చాటినట్లయింది. అలా మొదలైన వారి ప్రస్థానం ప్రపంచ క్రీడల్లో ప్రత్యేకంగా కొనసాగుతోంది. మరుగుజ్జులకు ప్రత్యేకం అథ్లెటిక్స్... ఫుట్‌బాల్... బాస్కెట్‌బాల్... స్విమ్మింగ్... బ్యాడ్మింటన్... ఫ్లోర్ హాకీ... వాలీబాల్... ఆర్చరీ.. టెన్నిస్... పవర్‌లిఫ్టింగ్... షూటింగ్... కర్లింగ్... ఇలా పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉండి.. క్రీడాకారుడిగా సత్తా చాటాలనుకునే మరుగుజ్జుల కోసం ప్రతీ నాలుగేళ్లకోసారి ప్రపంచ క్రీడలు జరుగుతాయి. ఇప్పటిదాకా ఆరుసార్లు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడలు జరగ్గా... చివరిసారిగా 2013లో అమెరికాలోని మిచిగాన్ ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. 2013 ప్రపంచ క్రీడల్లో 17 దేశాలకు చెందిన 395 మంది మరుగుజ్జులు పోటీల్లో పాల్గొన్నారు. 1993లో తొలిసారిగా ఈ పోటీలకు అమెరికాలోని చికాగో ఇల్లినాయిస్లో నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేది వీరే మరుగుజ్జుల పోటీల్లో పాల్గొనాలనుకునే వారి ఎత్తు నాలుగు అడుగుల పది అంగుళాలు మించకూడదు. కండరాలు అసాధారణంగా పెరగడం వల్ల కాళ్లు, చేతుల్లో వాపు వచ్చిన వారిని ఇందులో పాల్గొనేందుకు అనుమతినిస్తారు. అయితే ఈ పోటీల్లో పాల్గొనే వాళ్లంతా మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక డ్వార్ఫ్ క్రీడలు ఎక్కడ జరిగినా నిబంధనలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఈ క్రీడల్లో పాల్గొనే వాళ్లు పారా ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతుంటారు. అందుకే మరుగుజ్జులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఈ క్రీడల్లో పాల్గొనే వారికి ఫ్యూచర్స్, జూనియర్స్, ఓపెన్, మాస్టర్స్ వయస్సు గ్రూపుల్లో పోటీలు నిర్వహిస్తారు. వీరికి అత్యున్నత క్రీడలు ఒకరకంగా ప్రపంచ డార్ఫ్ గేమ్సే. మరుగుజ్జు క్రీడాకారులు ఏ దేశానికి చెందిన వారైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. తమ దేశానికి చెందిన చెఫ్ డి మిషన్ ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ చీఫ్ డి మిషన్ లేకపోతే పోటీల్లో పాల్గొనేందుకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మనకూ ఉన్నారు... మరుగుజ్జు క్రీడల్లో మనవాళ్లూ తక్కువేమీ తినలేదు. భారత్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొనేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు అంతర్జాతీయ వేదికల్లో రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లో పతకాల పంట పండించారు. 9 బంగారు పతకాలతో సహా మొత్తం 18 పతకాలు సాధించి భారత్‌ను ఆరో స్థానంలో నిలిపారు. 16 మంది పోటీల్లో పాల్గొనగా.. జోబీ మాథ్యూ, రాజన్న, ప్రకాశ్, ఆకాశ్ మాధవన్, నళిని, రేణు కుమార్‌లు తమ సత్తా చాటి పలు విభాగాల్లో పతకాలు సాధించారు. ఆల్‌రౌండర్ జోబి కేరళకు చెందిన 38 ఏళ్ల మరుగుజ్జు జోబీ మాథ్యూ అర్మ్ రెజ్లర్‌గా అందరికీ సుపరిచితమే. ప్రాక్సిమల్ ఫెమోరల్ ఫోకల్ డెఫీషియన్సీ (పీఎఫ్‌ఎఫ్‌డీ) కారణంగా జోబి 60 శాతం వైకల్యంతో పుట్టాడు. పీఎఫ్‌ఎఫ్‌డీ వల్ల జోబి కాళ్లలో ఏమాత్రం ఎదుగుల లేకపోయినా.. మిగిలిన శరీరం మొత్తం వయసుకు తగ్గట్లుగానే పెరిగింది. మూడు అడుగుల ఐదు అంగుళాల పొడవున్న ఈ కేరళ మరుగుజ్జు తాను ఎత్తు పెరగలేకపోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. కాళ్లు సహకరించకపోయినా.. మిగిలిన శరీరంలో అందరి లాగే పెరుగుదల ఉండటంతో జిమ్‌కి వెళ్లి తీవ్రంగా సాధన చేశాడు. అందుకు జోబికి తగిన ఫలితం దక్కింది. బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్‌లో సత్తా చాటాడు. స్పెయిన్‌లో జరిగిన 29వ ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లోనూ దుమ్ము రేపాడు. అథ్లెటిక్స్ క్లాస్ 3లో షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావిలిన్ త్రో తోపాటు సీనియర్ క్లాస్ 1 బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. ఇక జోబి జనరల్ కేటగిరీలోనూ, వైకల్య విభాగంలోనూ రెజ్లింగ్, ఫెన్సింగ్, బాడీ బిల్డింగ్‌లో చాలా సార్లు సత్తా చాటి ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు. -
గోటితో కొండంత...
ఫొటో చూడగానే ఈ కుర్రవాడి ప్రతిభ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మైక్రో ఆర్ట్‌లో తన ప్రతిభను చాటుకుంటున్న ఇతడి పేరు చుండూరు పవన్. వయసు 21 ఏళ్లు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం గ్రామంలో పుట్టాడు. ‘‘ఏదైనా విభిన్నంగా చేయాలనిపించింది. అందుకే వ్యర్థాలతో మైక్రో ఆర్ట్ చేయడం ప్రారంభించాను. వ్యర్థాలతో కళాకృతులు తయారుచేయడం ప్రారంభించిన కొత్తలో మా నాన్నగారు నన్ను కేకలేసేవారు. ఆ తరవాత ప్రోత్సహించడం మొదలుపెట్టారు’’ అంటాడు పవన్. ‘‘ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డిగ్రీ చదువుకున్నాను. అక్కడ బస్ స్టాండ్‌లో ఎందరో వికలాంగులను చూసేవాడిని. చాలా బాధ అనిపించేది. వారికి ఏమైనా చేయాలనుకునేవాడిని. అందుకే ఇలా డబ్బులు సేకరించి, ఎంత వస్తే అంత వారికి అందచేస్తుంటాను’’ అని వివరించాడు పవన్. ఇతడు చేసిన కళాకృతులు... వ్యర్థాలతో... టేబుల్ ఫ్యాను అర అంగుళం చెప్పులు పిఎస్ఎల్వి సి 23 నమూనా ఈగ సినిమా ప్రేరణతో ఈగ బొమ్మ... ఇవి మచ్చుకి మాత్రమే కేవలం మైక్రో ఆర్ట్ మాత్రమే కాకుండా, ఒకేసారి ఇద్దరు వినేలా రెండు ఇయర్ ఫోన్లు ఉంచడానికి అనువుగా సాకెట్‌ను కూడా తయారుచేశాడు. ‘‘ఇప్పుడు రేడియేషన్ ప్రొటెక్టర్ ఆప్ చేస్తున్నాను. దీని వల్ల మనం ఉన్న ప్రదేశంలో ఎంత రేడియేషన్ ఉన్నదీ తెలుసుకోవచ్చు. అలాగే కాలుష్యాన్ని నియంత్రించే హెల్మెట్ లాంటిది కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చోరీకి గురైన మోటారు వాహనాల ఆచూకీ కనుక్కోవడానికి వీలుగా, పాడైపోయిన సెల్ఫోన్లను అనుసంధానం చేసే ఉపకరణం తయారు చేయాలనేది నా ఆశ ’’ అంటున్న పవన్, తగిన ప్రోత్సాహం లేకపోవడంతో తయారుచేసిన కళాకృతులను ఇంతవరకూ ప్రదర్శనకు ఉంచలేదని చెబుతున్నారు. అంతేకాదు, ఎప్పటికైనా యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డెరైక్టర్ కావాలనేది తన జీవితధ్యేయం అంటున్నారు. -
ప్రతిభకు కట్టంకట్టే ‘వీర్’డు
‘మనసుంటే మట్టిలోనుంచైనా మాణిక్యాలను వెలికి తీయవచ్చు. మంచి చేయాలనే ఆలోచనకు పట్టుదల తోడైతే మట్టినైనా బంగారంలా మార్చేయవచ్చు’ అంటున్నారు అశోక్‌వీర్. ఏడుపదుల వయసుకు చేరువవుతున్న ఆయన నిరుపేద విద్యార్థులు పారిశ్రామిక రంగంలో నిలదొక్కుకునేందుకు, వారికి కావల్సిన సాంకేతిక నైపుణ్యాలను దగ్గరుండి మరీ నేర్పుతున్నారు. అర్ధంతరంగా ఆగిన చదువులకు సాధనను జోడించి వారు సమున్నతంగా నిలిచేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల శివారుప్రాంతమైన బహదూర్‌పల్లి గ్రామానికి వెళితే అశోక్‌వీర్ కలగన్న సంస్థను చూడొచ్చు. అక్కడ విద్యార్థులు ఉచితంగా నేర్చుకుంటున్న నైపుణ్యాలను సమీక్షించవచ్చు. అశోక్‌వీర్ యాభై ఏళ్ల క్రితమే ఇంజినీరింగ్ పూర్తిచేసుకొని, విదేశాలలో ఉద్యోగంలో చేరారు. అప్పటికే ఆయన జీతం ఐదంకెల్లో ఉండేది. ఇంకెవరైనా అయితే విదేశాలలోనే స్థిరపడేవారు. కానీ అశోక్‌వీర్ తన విద్య స్వదేశానికే ఉపయోగపడాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే 40 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చేశారు. చండీగఢ్‌కు చెందిన ఆయన ఇక్కడే ఓ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్‌గా కొన్నాళ్లు విధులు నిర్వహించారు. అప్పుడే తనకున్న అనుభవంతో పదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆ ఉద్యోగాన్నీ వదిలేశారు. సొంతంగా పరిశ్రమను నెలకొల్పాలని నిశ్చయించుకుని, భార్య సుధావీర్కు చెప్పారు. సంగీత ఉపాధ్యాయురాలైన ఆమె భర్త లక్ష్యానికి తోడుగా నిలిచారు. రెండు లక్షల రూపాయల పెట్టుబడి, ఐదుగురు పనివారితో కాలమాన్స్ పరిశ్రమను స్థాపించారు. కంపెనీ అభివృద్ధికి పాటుపడుతూ వందల మందికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన దృష్టి యువత మీదకు మళ్లింది. ‘నా వద్ద డబ్బుంది. దానిలో కొంత సమాజసేవకు ఉపయోపడేలా చేయాలి’ అనుకున్నారు. కోట్లలో సంపాదన ఇవ్వలేని సంతృప్తి, నిరుపేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే లభిస్తుందని భావించారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకు వచ్చిందే ‘వీఈటిఎఫ్.’ పూర్తి పేరు ‘వీర్స్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ముందు రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎంతో మందిని కలిశారు. ఈ క్రమంలోనే పారిశ్రామిక రంగంలో డిప్లమా, ఐటిఐ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం ఎంత మాత్రం లేదని గమనించారు. దీనివల్ల అటు పారిశ్రామిక రంగానికి, ఇటు విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని భావించారు. విదేశాలలో ఉన్నట్టు 75 శాతం ప్రాక్టికల్స్, 25 శాతం థియరీ ఉండేలా ‘వీఈటీఎఫ్’ను నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు. ఇందుకు కాలమాన్స్ సీఈఓగా ఉన్న వారి కుమారుడు గౌతమ్వీర్ కూడా తండ్రి ఆలోచనకు ఊతమిచ్చారు. దీంతో 2004లో వీఈటీఎఫ్ సంస్థను స్థాపించి, ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి, పది ఎకరాల సువిశాల స్థలంలో.. పచ్చని చెట్ల మధ్య.. వీఈటీఎఫ్ సంస్థను నడపడం మొదలుపెట్టారు అశోక్‌వీర్. ఇక్కడకూడా తనదైన ప్రత్యేకతను చూపించారు. విద్యార్థులకు వసతి, తగిన వనరులను సమకూర్చి.., స్వయంగా వారే వండుకో వడం, దుస్తులు, గదులు శుభ్రం చేసుకోవ డం.. ఇలా తమ పనులు తాము చేసుకునే లా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు ఈ విధంగానే 150 కి పైగా విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకొని, పేరున్న కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయాన్నే యోగా, వ్యక్తిత్వవికాసం, కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల ద్వారా విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను వృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ప్లంబింగ్, వెల్డింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్స్ విభాగాల్లోనూ ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా అశోక్‌వీర్, సుధావీర్ విద్యార్థుల పర్యవేక్షణ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ప్రస్తుత విద్యాసంవ త్సరానికి వచ్చే వారంలో విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు అశోక్‌వీర్ తెలిపారు. ఆసక్తి ఉన్న యువత ఫోన్ నెంబర్: 8978459303, 040-23095068 లలో సంప్రదించవచ్చు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: శివ మల్లాల వీఈటీఎఫ్ ఆదుకుంది... మా నాన్న చనిపోవడం, ఆర్థిక లేమి కారణంగా పదవ తర గతితో చదువు ఆపేయాల్సి వచ్చింది. ఏ ఉద్యోగం చేయాలో, కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో తెలియలేదు. వీఈటీఎఫ్ గురించి తెలిసి, 2004లో ఇక్కడ రాత పరీక్షలో పాసై, ఏడాది పాటు టెక్నికల్‌గా శిక్షణ పొందాను. అప్పటి నుంచి ఇక్కడే ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నాను. - కిశోర్, ప్రిన్సిపల్ క్యాంపస్ సెలక్షన్... నాది విజయవాడ దగ్గర గన్నవరం. స్థోమత లేక పై చదువులకు వెళ్లలేకపోయాను. వీఈటీఎఫ్లో మిషన్ పరికరకాల తయారీలో శిక్షణపొందుతున్నాను. మరో నెలలో శిక్షణ పూర్తవుతుంది. ప్రసిద్ధ కంపెనీలు ఇక్కడికే క్యాంపస్ సెలక్షన్స్ జరపడానికి వస్తున్నాయి. పనిలో ప్రావీణ్యత సాధించి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్న ఆశయంతో ఉన్నాను. - ఇమ్రాన్, విద్యార్థి -
మీ టాలెంట్ మీకు తెలుసా?
ప్రేరణ ప్రతిఒక్కరిలో అంతర్గతంగా ప్రత్యేకమైన నైపుణ్యం, ప్రజ్ఞ ఉంటాయి. వాటిని గుర్తించి, వెలికితీస్తే అద్భుతాలు సృష్టిస్తారు. బాల్యంలో మందమతులుగా ముద్రపడినవారు సైతం తమ ప్రతిభాపాటవాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. వారు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ప్రముఖ బ్రిటిష్ నృత్యకారిణి గిలియన్ లైనీ ఉదంతం కూడా అలాంటిదే. గిలియన్ లైనీ ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆమె చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయురాలి నుంచి ఆమె తల్లికి ఓ ఉత్తరం వచ్చింది. స్కూల్లో గిలియన్ ప్రవర్తనపై సదరు టీచర్ ఫిర్యాదు చేస్తూ పెద్ద ఉత్తరం రాసింది. చిన్నారి చదువుపై ఆసక్తి చూపడం లేదని, ఎప్పుడూ మందకొడిగా ఉంటోందని అందులో తెలిపింది. అంతేకాకుండా హోమ్‌వర్క్ కూడా సమయానికి పూర్తి చేయదని, ఇక ఆమె చేతిరాత చాలా ఘోరంగా ఉందని విమర్శించింది. గిలియన్‌కు లెర్నింగ్ డిజార్డర్ ఉందనే అనుమానం తనను వేధిస్తోందని, ఆమెను అలాంటి విద్యార్థులకు ఉద్దేశించిన స్పెషల్ స్కూల్లో చేర్పిస్తే మంచిదని సలహా కూడా ఇచ్చింది. అంతర్గత నైపుణ్యం మేల్కొంది టీచర్ నుంచి వచ్చిన ఉత్తరం చదివిన గిలియన్ తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. టీచర్ ఇచ్చిన సలహాను పాటించడం కంటే ముందు తన బిడ్డ ఎదుర్కొంటున్న సమస్య, దాని పరిష్కారం కోసం చిన్నారిని సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. వెంటనే గిలియన్ను తీసుకొని వెళ్లి ఒక సైకాలజిస్టును కలిసింది. ఆయన గిలియన్ ముఖ కవళికలను, కాళ్లు, చేతుల కదలికలను నిశితంగా పరిశీలించాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత.. వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ ఆమె తల్లిని బయటకు తీసుకెళ్లాడు. బయటకు వెళ్లేటప్పుడు గదిలోని రేడియోను ఆన్ చేసి, సౌండ్ పెంచాడు. గదిలో గిలియన్ మాత్రమే ఉంది. ఆమెలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యం ఒక్కసారిగా మేల్కొంది. కుర్చీలోంచి లేచి రేడియోలో వస్తున్న పాటలకు అనుగుణంగా కాళ్లు, చేతులను లయబద్ధంగా కదపసాగింది. ఇప్పుడు ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోతోంది. గది బయట ఉన్న సైకాలజిస్టు కిటికీలోంచి ఈ దృశ్యాన్ని ఆమె తల్లికి చూపించాడు. ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతులేని ఆశ్చర్యానికి లోనైంది. గిలియన్లో ఎలాంటి లోపం లేదని సైకాలజిస్టు తేల్చిచెప్పాడు. ఆమె నృత్యంలో ప్రతిభ చూపుతుందని, శిక్షణ కోసం డ్యాన్స్ స్కూల్లో చేర్పించమని సూచించాడు. సాన పెడితే వజ్రమే అదృష్టవశాత్తూ గిలియన్ తల్లి ఆ సూచనను అమల్లో పెట్టింది. ఇక మిగిలిందంతా చరిత్రే. గిలియన్ లైనీ గొప్ప నృత్యకారిణిగా పేరుగాంచింది. ప్రపంచంలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందింది. తనలోని టాలెంట్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తక్కువ కాలంలోనే అత్యంత సంపన్నురాలిగా ఎదిగింది. ఇక్కడ తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది సైకాలజిస్టుకే. ఎనిమిదేళ్ల బాలికలోని ప్రతిభను ఆయన గుర్తించడం వల్లే ఒక గొప్ప డ్యాన్సర్ ప్రపంచానికి లభించింది. ఒక వైద్యుడిగా ఆమెకు మందులు ఇవ్వడం లేదా స్పెషల్ స్కూల్‌కు పంపడం వంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన గిలియన్లోని సహజ ప్రతిభను పసిగట్టాడు. ఆ ప్రతిభకు సాన పెట్టుకోవడంతో గిలియన్ వజ్రంగా మారింది. మార్కులే కొలమానం కాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ కచ్చితంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. మరి వాటినెందుకు గుర్తించలేకపోతున్నారు? మన ప్రతిభను మనం తెలుసుకోకుండా బయటి నుంచి చాలా ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. స్కూల్లో పిల్లల ప్రతిభను మార్కుల ఆధారంగా మాత్రమే కొలుస్తుంటారు. మంచి మార్కులు రాకపోతే వారిని అసమర్థులు, బుద్ధిహీనులుగా పరిగణిస్తారు. చదువుపై అంతగా ఆసక్తి లేని పిల్లలకు మరో రంగంలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉండొచ్చు. దాన్ని గుర్తించి వెలికితీసే అవకాశం ఉండాలి. స్కూల్లో మంచి మార్కులు సాధించేవారు మరో రంగంలో వెనుకబడి ఉండొచ్చు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని తెలుసుకోవాలి. కలలను నిజం చేసుకోండి మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నలుగురిలో నిలిపే విశిష్టమైన టాలెంట్ మీలో ఉందా? కలలను నిజం చేసుకొనేందుకు శ్రమించండి. ఎవరికి తెలుసు.. మీలోని ప్రతిభ మిమ్మల్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లొచ్చు. గిలియన్లోని ప్రతిభను కనిపెట్టిన సైకాలజిస్టు అందరికీ అవసరమే. ఆ సైకాలజిస్టు.. మన తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా కావొచ్చు. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వారిలో ఏదైనా ప్రత్యేక ప్రతిభ ఉంటే వారికి తెలియజేయండి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో.. -
విద్యా రుణాలు...భవితకు వరాలు
ఓ వైపు బంగారు భవిష్యత్తును చూపించే కోర్సులు.. మరో వైపు కళ్లు చెదిరే ఫీజులు.. కోర్సులో చేరాలనే బలమైన ఆకాంక్ష.. అనుకూలించని ఆర్థిక పరిస్థితులు.. చివరకు రాజీ ధోరణితో ఏదో ఒక కోర్సులో చేరడం..ప్రతిభ, నైపుణ్యాలు మెండుగా ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యా ప్రపంచంలో అధిక శాతం మందికి ఎదురవుతున్న అనుభవం. అయితే.. విద్యార్థులు ఈ పరిస్థితిని అధిగమించొచ్చు. ప్రతిభ ఉంటే రాజీ పడాల్సిన అవసరమే లేదు. కారణం.. బ్యాంకులు విద్యా రుణాల పేరుతో అందిస్తున్న భరోసానే. రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్లలో.. విదేశాల్లోనూ చదవాలనుకునే ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్ని జాతీయ బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యా రుణాల విధివిధానాలపై విశ్లేషణ.. ఎన్నో కోర్సులు.. వాటిని పూర్తి చేస్తే మరెన్నో అవకాశాలు. ఒకేషనల్ నుంచి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వరకు ఔత్సాహిక విద్యార్థులకు ఉన్నత విద్య దిశగా ఎన్నెన్నో మార్గాలు. వాటికి సరిపడే అర్హతలూ, ప్రతిభాపాటవాలు విద్యార్థులకు ఉంటున్నాయి. కానీ ఈ అవకాశాలను అందుకుంటున్న విద్యార్థులు కొందరే. కారణం.. రూ. లక్షల్లో ఉంటున్న ఫీజులు. కేవలం రుసుముల కారణంగా.. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆశించిన కోర్సులో చేరలేక ఏదో ఒక కోర్సుకు పరిమితమవుతున్న వారి సంఖ్య లక్షల్లోనే. దీంతో దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులకు ‘విద్యా రుణాలు’ పేరుతో ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్‌తో సంప్రదింపులు సాగించి అన్ని జాతీయ బ్యాంకుల్లో విద్యా రుణ పథకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంది. దీంతో ఇప్పుడు ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రవేశం లభించే సాధారణ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు మొదలు మరెన్నో కోర్సులకు రుణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గుర్తింపు పొందిన కోర్సులకే విద్యా రుణాలు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా.. ఈ రుణాలకు అర్హమైన కోర్సులను నిర్దేశించాయి. దీని ప్రకారం.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తదితర నియంత్రణ సంస్థల పరిధిలోని యూనివర్సిటీల్లో లభించే బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులన్నిటికీ రుణ సదుపాయం లభిస్తుంది. అంతేకాకుండా ప్రొఫెషనల్ కోర్సులుగా పేరొందిన చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల ఔత్సాహికులు కూడా విద్యా రుణాల దరఖాస్తుకు అర్హులే. వీటితోపాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల వంటి ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు, ఇతర అన్ని జాతీయ ప్రాధాన్యమున్న ఇన్స్టిట్యూట్స్ (కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే సంస్థలు)లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కూడా విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నిటికంటే అత్యంత ఆకర్షణీయ అంశం రూ. లక్షల ఖర్చుతో కూడుకున్న పైలట్ శిక్షణ కోర్సులకు కూడా రుణ సదుపాయం అందుబాటులోకి తేవడం. అయితే దీనికి సంబంధించి సదరు శిక్షణనిచ్చే సంస్థకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుర్తింపు తప్పనిసరి. విదేశీ విద్యకు ప్రతిభావంతులైన విద్యార్థుల విషయంలో విదేశీ విద్య ఔత్సాహికులకు కూడా ఈ విద్యా రుణాలు అందుబాటులోకి వచ్చాయి. స్టడీ అబ్రాడ్‌కు సంబంధించి ఆయా దేశాల నియంత్రణ సంస్థల గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో జాబ్ ఓరియెంటెడ్, ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సుల ఔత్సాహికులు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్ వంటి కోర్సులు చదవాలనుకునేవారు విద్యా రుణాలకు అర్హులు. దేశంలో ఒకేషనల్ కోర్సులకు కూడా దీర్ఘకాలిక వ్యవధిలో ఉండే బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ కోర్సులే కాకుండా మూడు నెలలు మొదలు రెండు, మూడేళ్ల వ్యవధిలో ఉండే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మోడల్ ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. దీనికి ప్రధాన కారణం ఆయా వృత్తి నైపుణ్యాలను అందించే రంగాల్లో సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దడమే. ఈ క్రమంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల గుర్తింపు పొందిన సంస్థలలో కోర్సులను ఈ విద్యా రుణాలకు అర్హమైన కోర్సులుగా పేర్కొన్నారు. దీంతో ఆయా సంస్థలు అందించే స్వల్పకాలిక కోర్సుల నుంచి ఐటీఐలు, పాలిటెక్నిక్ కోర్సుల వరకు దాదాపు అన్ని ఒకేషనల్ కోర్సులకు విద్యా రుణాలు అందుబాటులోకి వస్తున్నాయి. రుణ మొత్తం కోర్సు కాల వ్యవధి ఆధారంగా ఉంటుంది. మూడు నెలల వ్యవధిలోని కోర్సులకు రూ. 10 వేలు; మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలోని కోర్సులకు రూ. 25 వేలు; ఏడాది వ్యవధి గల కోర్సులకు రూ. 50 వేలు; ఏడాదికంటే ఎక్కువ వ్యవధి గల కోర్సులకు రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్దేశిత ఫీజు మొత్తాలకు మాత్రమే విద్యా రుణాలను అందించే విషయంలో ప్రభుత్వం, బ్యాంకర్స్ అసోసియేషన్లు కలిసి కొన్ని నిబంధనలను నిర్దిష్టంగా పేర్కొన్నాయి. ముఖ్యంగా రుణ మొత్తం మంజూరుకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలను పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజులకు సమానమైన మొత్తానికి మాత్రమే రుణాలను అందిస్తారు. మేనేజ్మెంట్ కోటాలో చేరినా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మేరకే రుణం మంజూరు చేస్తారు. రుణ మొత్తాలు ఇలా దేశంలో, విదేశాల్లో విద్యాభ్యాసానికి సంబంధించి రుణ సదుపాయంపై బ్యాంకులు గరిష్ట పరిమితులు విధించాయి. దీని ప్రకారం దేశంలోని విద్యా సంస్థల్లో కోర్సులకు గరిష్టంగా రూ. పది లక్షలు, విదేశీ విద్యకు గరిష్టంగా రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. అంతేకాకుండా మొత్తం రుణాలకు సంబంధించి మార్జిన్ మనీ (విద్యార్థులు సొంతంగా భరించాల్సిన మొత్తం)ని కూడా నిర్దేశించాయి. రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ ఉండదు. రుణ మొత్తం రూ.నాలుగు లక్షలు దాటితే స్వదేశంలో విద్యకు 5 శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్ మనీ నిబంధన అమలులో ఉంది. హామీల నిబంధనలివే రుణ మంజూరుకు సంబంధించి విద్యార్థులు కొన్ని హామీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేదు. కేవలం తల్లిదండ్రులను సహ దరఖాస్తుదారులుగా పేర్కొంటే సరిపోతుంది. రూ. నాలుగు లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు తల్లిదండ్రుల హామీతో పాటు థర్డ్‌పార్టీ గ్యారెంటీ సమర్పించాలి. రూ.7.5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు తల్లిదండ్రుల హామీతోపాటు స్థిరాస్థులను కొల్లేటర్ సెక్యూరిటీగా చూపించాలి. వడ్డీ రేట్లలోనూ చేయూత ఆయా రుణ మొత్తాలపై వసూలు చేసే వడ్డీ రేట్ల విషయంలోనూ బ్యాంకులు సరళీకృత విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం 10.5 శాతం నుంచి 13.00 శాతం వరకు వార్షిక వడ్డీరేటును వసూలు చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు ఆయా బ్యాంకుల అంతర్గత నిబంధనల మేరకు నిర్ణయమవుతున్నాయి. అంతేకాకుండా మహిళా విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే క్రమంలో అన్ని బ్యాంకులు దాదాపు ఒక శాతం వడ్డీని తక్కువగా వసూలు చేస్తున్నాయి. సీఎస్ఐఎస్ స్కీం.. ప్రత్యేక సదుపాయం వడ్డీ గణన విషయంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించే క్రమంలో 2009లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్) స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం 2009-10 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కోర్సు వ్యవధిలో వడ్డీ రేటును లెక్కించరు. దీని ఫలితంగా అంతకు ముందు మాదిరిగా రుణం మంజూరు చేసిన రోజు నుంచి వడ్డీ చెల్లించాల్సిన అవసరం విద్యార్థులకు తప్పింది. తిరిగి చెల్లింపు ఇలా విద్యా రుణాలు పొందిన విద్యార్థులు ఆ మొత్తాలను కోర్సు పూర్తి చేసుకున్న ఒక ఏడాది తర్వాత నుంచి లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత నుంచి (రెండిట్లో ముందుగా ఏది సాధ్యమైతే దానినే పరిగణనలోకి తీసుకుంటారు) నెల వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు రీపేమెంట్ హాలిడే లేదా మారటోరియం పేరుతో తిరిగి చెల్లింపు విషయంలో బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఒకవేళ విద్యార్థులు అనివార్య కారణాల వల్ల కోర్సును నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయలేక పోయినా.. మరో రెండేళ్లు రీపేమెంట్ హాలిడే సదుపాయాన్ని అందిస్తు న్నాయి. అకడెమిక్ ట్రాక్ రికార్డ్‌పైనా దృష్టి విద్యా రుణాలు మంజూరు చేసే క్రమంలో బ్యాంకులు విద్యార్థుల అకడెమిక్ రికార్డ్‌పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు నిర్దిష్ట పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను విధిస్తున్నాయి. సాధారణంగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాయి. అంతేకాకుండా నిరంతరం ఆయా కళాశాలల యాజమాన్యాల సహకారంతో విద్యార్థుల ట్రాక్ రికార్డ్‌ను తెలుసుకుంటున్నాయి. కాబట్టి రుణం మంజూరు చేయించుకోవడంతో పాటు.. ఆ తర్వాత అకడెమిక్గానూ మంచి ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం విద్యార్థులపై ఉంటోంది. రుణ మొత్తాలు.. వీటికే బ్యాంకులు మంజూరు చేసే విద్యా రుణాల్లో ట్యూషన్ ఫీజుతోపాటు మరికొన్ని వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అవి.. ట్యూషన్ ఫీజు లైబ్రరీ/లేబొరేటరీ/ఎగ్జామినేషన్ ఫీజు పుస్తకాలు, యూనిఫామ్స్, కోర్సు అభ్యసనానికి అవసరమయ్యే ఇతర పరికరాలు (కంప్యూటర్లు తదితర) కొనుగోలు వ్యయం. స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్‌కు వెచ్చించే మొత్తం. విదేశీ విద్య ఔత్సాహికులకు సంబంధించి ప్రయాణ ఖర్చులు అన్ని బ్యాంకులు ప్రధానంగా వీటి ఆధారంగానే రుణ మొత్తాలను ఖరారు చేస్తాయి. వాటిని నేరుగా కళాశాలలకు అందిస్తాయి. ఒకవేళ అప్పటికే విద్యార్థులు ఆయా ఫీజులను చెల్లించి ఉంటే తగిన ఆధారాలను పరిశీలించి సదరు మొత్తాన్ని విద్యార్థి చేతికి అందిస్తాయి. కోర్సు మిగతా సమయాల్లో చెల్లించాల్సిన మొత్తాలను కళాశాలలకు చెల్లిస్తాయి. రుణ దరఖాస్తుకు సమర్పించాల్సిన పత్రాలు ప్రవేశం లభించిన ఇన్స్టిట్యూట్ నుంచి ఫీజు, ఇతర అకడెమిక్ సంబంధిత ఖర్చులతో కూడిన అడ్మిషన్ లెటర్ వయసు నిర్ధారణకు సంబంధించి వయో ధ్రువీకరణ పత్రం అప్పటి వరకు పొందిన అకడెమిక్ అర్హతలకు సంబంధించి సర్టిఫికెట్ల నకలు ప్రతులు తల్లిదండ్రులు/కో-అప్లికెంట్స్/హామీదారుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు. కొల్లేటర్ సెక్యూరిటీకి సంబంధించి వాల్యుయేషన్ సర్టిఫికెట్ విదేశీ విద్య ఔత్సాహికులు పాస్‌పోర్ట్, వీసా, అడ్మిషన్ లెటర్, ప్రయాణ ఖర్చులకు సంబంధించిన నకలు ప్రతులు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్యారంటార్ల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఇటీవల కాలంలో బ్యాంకులు దరఖాస్తు చేసుకునే బ్రాంచ్ విషయంలోనూ కొన్ని నిబంధనలు పాటిస్తున్నాయి. దీని ప్రకారం విద్యార్థులు తమ నివాస పరిధిలోని లేదా తాము చేరిన కళాశాల/ఇన్స్టిట్యూట్ సమీపంలోని బ్యాంకుల బ్రాంచ్‌లలోనే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల నుంచి ఎంతో చేయూత విద్యా రుణాల విషయంలో బ్యాంకులు ఎంతో చేయూతనిస్తున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య కలలను నిజం చేసేందుకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో రీపేమెంట్ హాలిడే, మహిళలకు వడ్డీ రాయితీ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి. నెలవారీ వాయిదాల చెల్లింపు విషయంలోనూ విద్యార్థుల కోణంలో ఆలోచిస్తున్నాయి. నిర్దిష్ట రీపేమెంట్ గడువు కంటే ముందే రుణ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే మొత్తం వడ్డీ నుంచి ఒక శాతం గుడ్‌విల్ అందిస్తున్నాయి. విద్యార్థులు ఈ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యలో రాణించాలని అభిలషిస్తున్నాను. - ఆర్.సి. రాజన్, జీఎం, కెనరా బ్యాంక్ ముందస్తు కసరత్తుతో సులువుగా విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలి. అన్ని బ్యాంకుల్లో లోన్ ప్రాసెసింగ్‌కు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. కాబట్టి తమ కోర్సు ప్రారంభానికి ముందే అడ్మిషన్ లెటర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. దరఖాస్తులో చిన్న చిన్న లోపాలతో చాలా మంది విద్యార్థులు చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే దరఖాస్తును, అందులోని నియమ నిబంధనలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి దరఖాస్తు చేయడం మంచిది. దరఖాస్తుతోపాటు అవసరమైన ఇతర పత్రాలన్నిటినీ పకడ్బందీగా సమర్పిస్తే 15 రోజుల్లో రుణం మంజూరవుతోంది. - వి.కె. గోపాలన్, చీఫ్ మేనేజర్, ఎస్బీహెచ్ -
పవిత్ర దృక్పథం
ఇరవయ్యేళ్ల అమ్మాయి. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసింది. అలాంటి ఆమె ఎలా ఆలోచించాలి? మంచి చిత్రాలు తీయాలి, పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, పెద్ద సెలెబ్రిటీ అవ్వాలి అనే కదా! పవిత్రాచలం కూడా మొదట అలానే అనుకుంది. కానీ ఓ ఊహించని సంఘటన ఆమె ఆలోచనలను వేరే దిశగా మళ్లించింది. ఓ వ్యక్తి అన్న ఒక్క మాట... ఆమెకో కొత్త గమ్యాన్ని నిర్దేశించింది. ఏమిటా గమ్యం? పవిత్రాచలం తీసిన డాక్యుమెంటరీలు చూస్తే... ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది! ‘‘సినిమా చూస్తే మనసు భారమైపోకూడదు. ఒత్తిళ్లను మర్చిపోవ డానికి సినిమాకెళ్తాం. అక్కడికెళ్లాక సరదాగా ఎంజాయ్ చేయాల్సింది పోయి అక్కడికెళ్లి కూడా బాధపడితే ఇక సినిమాకి వెళ్లడం ఎందుకు? ఇలా అనుకునేవాళ్లెవరూ సందేశాత్మక చిత్రాలు చూడరు. ఇక డాక్యుమెంటరీలేం చూస్తారు, నావయితే అస్సలు చూడరు’’ అంటుంది పవిత్ర. అది నిజమే. ఆమె తీసే డాక్యుమెంటరీలు చూడాలంటే ప్రత్యేకమైన నేత్రం కావాలి. ఎదుటివాడి కష్టాన్ని చూసి కదిలిపోయే సున్నితమైన మనసు ఉండాలి. వాస్తవాలను తెలుసుకుని తట్టుకోగల స్థైర్యం ఉండాలి. అలాంటివాళ్లు మాత్రమే పవిత్ర చిత్రాలను చూడగలరు. పోతపోసిన ప్రతిభ... పవిత్రాచలం బెంగళూరులో జన్మించింది. ఆమెకు మొదట్నుంచీ చాలా ఆసక్తులున్నాయి. ప్రతిభాపాటవాలూ ఉన్నాయి. మొదట మౌంట్ కార్మెల్ కాలేజీలో బీఏ చేసింది. మంచి క్రీడాకారిణి. జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్ చాంపియన్‌గా ఎదిగింది. జర్నలిజంలో డిప్లొమో చేసింది. న్యూయార్క యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా చేసింది. ఆ పైన ఓ జాతీయ చానెల్లో చేరింది. అప్పటివరకూ జరిగిందంతా ఒకెత్తు. 2003లో పాకిస్థాన్‌లో జరిగిన యువ శాంతి సదస్సులో పాల్గొనడానికి వెళ్లడం మరో ఎత్తు. ఆ పర్యటన... పవిత్రని, ఆమె ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. శాంతి గురించి, సమాజ శ్రేయస్సు గురించి అక్కడ యువతీ యువకులు చేసిన ప్రసంగాలు పవిత్రలో స్ఫూర్తిని నింపాయి. అప్పుడే తొలిసారిగా ఆమెలోని ఫిల్మ్‌మేకర్ మేల్కొంది. ఇరుదేశాల యువత మనోభావాలూ ప్రతిఫలించేలా ‘బస్’ అనే డాక్యుమెంటరీని తీసింది. తరువాత ఆమె వరుసగా తీస్తూనే ఉంది. కానీ అనుకోకుండా ఎదురైన ఓ అనుభవం... ఆమెను ఓ స్ఫూర్తిదాయక ఫిల్మ్‌మేకర్‌ను చేసింది. 2007లో క్యాన్సర్ మీద అవగాహన కలిగించే డాక్యుమెంటరీ తీయడానికి ఆయేషా అనే యువతి దగ్గరకు వెళ్లింది పవిత్ర. ఆయేషా వయసు 26. క్యాన్సర్ ముదిరిపోయింది. మనిషి శుష్కించిపోయింది. ఇప్పుడో రేపో అన్నట్టుంది. వీడియో తీయడానికి సహకరించే ఓపిక కూడా లేదామెలో. దాంతో నీకు ఓపిక ఉన్నప్పుడు చేద్దాంలే అని చెప్పి వచ్చేసింది పవిత్ర. తర్వాత రోజు ఆయేషా నుంచి ఫోన్ వచ్చింది. ‘రండి తీసేద్దాం’ అని ఆమె అనడంతో వెంటనే వెళ్లింది. ఆయేషాని పవిత్ర అడిగింది... ఇంత నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు చేయడం అని! ‘‘నేనెప్పుడు పోతానో నాకే తెలీదు, నేను పోయాక నా వీడియో ఒక్కరికి ఉపయోగపడినా చాలు కదా’’ అంది ఆయేషా. ఆ మాట పవిత్ర మనసులోకి చొచ్చుకుని పోయింది. చనిపోతూ కూడా ఎదుటి వారికి ఉపయోగపడాలన్న ఆయేషా ఆలోచన... పవిత్రకు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసింది. ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది... ఇక మీదట సమాజానికి ఉపయోగపడే చిత్రాలు మాత్రమే తీయాలని! ‘కర్లీ స్ట్రీట్ మీడియా’ అనే సంస్థను స్థాపించి, సామాజిక సమస్యల్ని చిత్రాలుగా తీయడం మొదలుపెట్టింది. ట్రాఫికింగ్ గురించి ‘బౌండ్ బై అజ్’, దేవదాసీల గురించి ‘అనామిక’, మాదక ద్రవ్యాలకు బానిసైన వారి కోసం ‘మై ఫ్రెండ్ ద అడిక్ట్’, మానసిక వికలాంగ చిన్నారుల కోసం ‘ఖుష్బూ’, డౌన్ సిండ్రోమ్ బాధితుల గురించి ‘ఇన్ డెలిబుల్’... ఆమె తీసిన ప్రతి చిత్రమూ కదిలించింది. సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. ఉన్నట్టుండి ఈ సమాజాన్ని ఏ ఒక్కరూ మార్చేయలేరు. అందుకే... కనీసం సమస్యల విషయంలో అప్రమత్తం చేస్తోంది. వాటి పరిష్కారాల గురించి ఆలోచనలు రేకెత్తిస్తోంది. అందుకు పవిత్రని అభినందించి తీరాల్సిందే! - సమీర నేలపూడి పవిత్ర తీసిన డాక్యుమెంటరీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నాయి. వాటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘రూట్ ఫర్ రూనా’ గురించి. ఓ రోజు ఓ ఆంగ్ల పత్రికలో రూనా అనే రెండేళ్ల అమ్మాయి గురించి కథనం వెలువడింది. త్రిపురకు చెందిన ఆ పాప హైడ్రోసెఫలస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ మెదడు సంబంధిత వ్యాధి ఉన్నవాళ్లకు తల అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. రూనాకి కూడా అలానే పెరిగిపోయింది. ఆమె ఫొటోని పత్రికలో చూడగానే పవిత్ర కదిలి పోయింది. ఆ వ్యాధి గురించి తన టీమ్‌తో కలిసి రీసెర్చ చేసింది. మన దేశంలో రూనాలాగా ఆ వ్యాధితో బాధపడుతోన్న చిన్నారులు చాలమంది ఉన్నారని తెలుసుకుంది. వెంటనే ‘రూటింగ్ ఫర్ రూనా’ అనే డాక్యుమెంట రీని తీసింది. రూనా చికిత్సకి నిధులు సమకూరడంలో ఈ డాక్యుమెంటరీ పెద్ద పాత్రే పోషించింది. రూనాకి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. మెల్లగా కోలు కుంటోంది. అయితే రూనా లాంటి వారందరినీ కూడా వ్యాధి నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తున్నారు పవిత్ర టీమ్. ఆ వ్యాధిపట్ల అందరికీ అవగాహన కల్పించడంతోపాటు నిధులనూ సేకరిస్తున్నారు. ************** పవిత్రతో పాటు అడుగులు వేస్తున్నవాళ్లు కొందరున్నారు. అశ్విన్, అక్షయ్ శంకర్, అనన్య రాయ్, రిషి తుషు, జ్యోత్స్న బాలకృష్ణన్, తేజేష్ కిరణ్, అనితా తుషు... వీళ్లంతా పవిత్రలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న తపన ఉన్నవాళ్లు. అందుకే ఆమెతో చేతులు కలిపారు. ఆమెతో కలిసి అడుగులు వేస్తున్నారు. సమాజంలో ఉన్న సమస్యల మీద పరిశోధన చేయడం, వాటిని ఎలా చూపించాలి, దాని ద్వారా ఏ సందేశం ఇవ్వాలి అన్న విషయాలను అందరూ కలిసి చర్చించుకుంటారు. కలసికట్టుగా నిర్ణయం తీసుకుని ఆ దిశగా సాగిపోతారు. -
గురుకులాల్లో ప్రవేశం... పేద విద్యార్థులకు వరం
జూన్ రెండోతేదీ నాటికి దరఖాస్తు చేసుకోవాలి బాలికలకు నూజివీడు, బాలురకు తిరువూరులో కౌన్సెలింగ్ నూజివీడు, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల ఎస్సీ వర్గాలకు చెందిన ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఎంతగానో ఆరాటపడతారు. అలాంటి వారి కోసం జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖకు చెందిన గురుకుల కళాశాలు ఉన్నాయి. వీటిల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో చేర్చుకునేందుకు అధికారులు నోటిఫికేషన్‌ను జారీచేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్లో చేరేందుకు జూన్ రెండో తేదీ సాయంత్రం ఐదుగంటల కల్లా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న బాలబాలికలకు జూన్ ఆరోతేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో పది కళాశాలలు సాంఘిక సంక్షేమశాఖకు చెందిన గురుకుల పాఠశాలలు జిల్లాలో పది ఉన్నాయి. వీటిల్లో బాలికలకు నూజివీడు, నందిగామ, చల్లపల్లి, గన్నవరం మండలం వీరపనేనిగూడెం, గుడివాడ, జగ్గయ్యపేట, పెడన మండలం బల్లిపర్రులో ఉన్నాయి. బాలురకు తిరువూరు, మచిలీపట్నం మండలం రుద్రవరం, ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఉన్నాయి. సీట్ల వివరాలు బాలుర కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపులో 40 సీట్లు చొప్పున ఉన్నాయి. బాలికలకు సంబంధించి ఎంపీసీ, బైపీసీ గ్రూపులు నూజివీడు, నందిగామ, చల్లపల్లి, వీరపనేనిగూడెం, గుడివాడలో ఉన్నాయి. జగ్గయ్యపేట, బల్లిపర్రులోని కళాశాలల్లో ఆర్ట్స్ గ్రూపులైన ఎంఈసీ, సీఈసీ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపులో 40 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలల్లో కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధన జరుగుతుంది. ఇవీ అర్హతలు పదో తరగతి ఒక ప్రయత్నంలో మార్చి-2014లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థుల వయో పరిమితి ఆగస్టు 31నాటికి 17 సంవత్సరాలు దాటకూడదు. సాంఘిక సంక్షేమశాఖ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకైతే ఒక ఏడాది సడలింపు ఉంటుంది. పదో తరగతి తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. మీ-సేవ నుంచి పొందిన పదో తరగతి గ్రేడ్ జాబితా, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జిరాక్సు కాపీలను దరఖాస్తుతో జతచేయాలి. ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండాలి. దరఖాస్తును జూన్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అందజేయాలి. ఆ తరువాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించరు. కౌన్సెలింగ్ జరిగే ప్రదేశాలు జూన్ ఆరో తేదీన బాలికలకు నూజివీడు పట్టణ పరిధిలోని తిరువూరు రోడ్డులో ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహిస్తారు. బాలురకు తిరువూరులోని గురుకుల కళాశాలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు గంట ముందుగా హాజరవ్వాలి. -
చివరి స్థానమే పదిలం
టెన్త్ ఫలితాల్లో.. హైదరాబాద్‌కు మళ్లీ 22వ స్థానమే ఒక స్థానం మెరుగైన రంగారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి ప్రతిభ చాటిన సర్కారు విద్యార్థులు సాక్షి, సిటీబ్యూరో: మొన్న ఇంటర్, నిన్న టెన్త్.. ఫలితాలేవైనా హైటెక్ జిల్లా హైదరాబాద్ మాత్రం చివరి స్థానాలతోనే సరిపెట్టుకుంటోంది. తాజాగా గురువారం విడుదలైన టెన్త్ ఫలితాల్లోనూ మరోమారు చతికిలపడింది. నాలుగేళ్లుగా హైదరాబాద్ జిల్లా చిట్టచివరి (22, 23వ ) స్థానాలకే పరిమితమవుతోంది. ఈ సారి 22వ స్థానంలో నిలిచింది. పొరుగునున్న రంగారెడ్డి జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు. గతేడాది 21వ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది ఓ మెట్టెక్కి 20వ స్థానానికి చేరింది. గత మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా నుంచి 63,611 విద్యార్థులు పరీక్షలు రాయగా, 49,143 మంది(77.29%) ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా నుంచి 82,099 మంది పరీక్షలు రా యగా, 69,535 మంది (84.70%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలదే హవా.. రెండు జిల్లాల్లోనూ ఈ ఏడాది టెన్త్ ఉత్తీర్ణతను పరిశీలిస్తే.. బాలుర కంటే బాలికలే మెరుగ్గా రాణిం చారు. రంగారెడ్డి జిల్లాలో 43,239 మంది బాలురు పరీక్ష రాయగా, 36267 మంది (83.88 శాతం) పాసయ్యారు. 38,860 మంది బాలికలలో 33,268 మంది (85.61 శాతం) ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 31,353 మంది బాలురు పరీక్షలు రాయగా, 22,936 మంది (73.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన 32,774 మంది బాలికల్లో 26,630 మంది (81.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఈసారి కాస్త ఉపశమనం కలిగించే అంశం. 23 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9.5పైగా జీపీఏ పాయింట్లు సాధించి సత్తాను చాటారు. ప్రైవేటైనా.. ప్రభుత్వ స్కూలైనా.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఫలితాలు అధ్వానంగానే వచ్చాయి. సకల సదుపాయాలున్న కార్పొరేట్ స్కూళ్లూ ఆశించిన మేర రాణించలేకపోయాయి. అయితే.. కనీస సదుపాయాల్లేని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అవే ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణత విషయానికొస్తే హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 78.13 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రస్తుతం 72 శాతానికి పడిపోయింది. 14 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం, 6 పాఠశాలలు 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని మొత్తం 184కి 22 పాఠశాలల్లో 50 శాతం లోపు ఉత్తీర్ణత నమోదైంది. ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు హైదరాబాద్ జిల్లాలో టెన్త్ ఫలితాల మెరుగుకు విద్యాశాఖ పరంగా అన్నిరకాల ప్రయత్నాలు చేశాం. ప్రత్యేక తరగతులు పెట్టాం. నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను అందజే శాం. గత మూడేళ్లలో రెండేళ్ల పాటు ఉత్తీర్ణత మెరుగైంది. ఈ ఏడాది మాత్రం ఒక శాతం తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం వివిధ ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో చదివే 50 శాతం మంది విద్యార్థులు పేద వర్గాలకు చెందిన వారు కావడమే. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచే స్తాం. - ఎ.సుబ్బారెడ్డి, హైదరాబాద్ డీఈవో ఆశించిన ఫలితాలే వచ్చాయి మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లాలో టెన్త్ ఫలితాల్లో ఆశించిన ఫలితాలే వస్తున్నాయి. ఏటా ఉత్తీర్ణత మెరుగవుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా స్థానాల్లో మాత్రం వెనుకబాటు తప్పట్లేదు. జిల్లా వ్యాప్తంగా 562 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ పాయింట్లు వచ్చాయి. జీపీఏ పాయింట్ల సాధనలో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే రంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లను సత్కరిస్తాం. 40 శాతంలోపు ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్ని సంజాయిషీ కోరతాం. - ఎం.సోమిరెడ్డి, రంగారెడ్డి డీఈవో -
మణిదీపం
జలంధర్‌కు చెందిన మణిదీప్ హాకీలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ‘శభాష్’ అనిపించుకుంటున్నాడు. నేషనల్ జూనియర్ టీమ్‌లో ఆడి అత్యధికసంఖ్యలో గోల్స్ చేసిన వ్యక్తిగా హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) దృష్టిని ఆకర్షించిన మణిదీప్ మన క్రీడారంగంలో భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. గ్రౌండ్లో చురుకైన కదలికలు, బంతిని ఒడుపుగా నియంత్రించడం, వ్యూహాత్మక ఎత్తుగడలు అతని సొంతం. ‘అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్ గెలుచుకున్న మణిదీప్ గాయం కారణంగా హెచ్ఐఎల్లో 2014లో స్థానం కోల్పోయాడు. ‘‘శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది ఈ గాయం నేర్పింది’’ అంటాడు మణిదీప్. చిన్నప్పుడు హాకీ ప్రాక్టీస్ కోసం బయటకు వెళ్లేవాడు మణిదీప్. కానీ ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఒకసారి వాళ్ల నాన్న దృష్టిలో పడ్డాడు. ‘‘హాకీ మీద దృష్టి పెట్టు’’ అని కాస్త గట్టిగానే చెప్పాడు నాన్న. ఇక ఆనాటి నుంచి క్రికెట్ కంటే హాకీనే ఎక్కువగా ఆడడం మొదలుపెట్టాడు. హాకీ విలువను తెలుసుకొని ఆ ఆట ప్రేమలో పడిపోయాడు. ‘‘వచ్చిన అవకాశాలను విజయంగా ఎలా మలుచుకోవాలో తెలిసిన కుర్రాడు. భవిష్యత్‌లో మన దేశంలో హాకీకి ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు’’ అంటున్నాడు కోచ్ బల్జిత్సింగ్ సైనీ. ‘‘ఒలింపిక్స్‌లో మన దేశానికి స్వర్ణపతకం సాధించడమే నా లక్ష్యం’’ అంటున్న మణిదీప్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. -
సమ్‌థింగ్ స్పెషల్
నే ఆటోవాణ్ణి...అందరివాణ్ణి! ‘ఆటోలలో అన్నాదురై ఆటో వేరయా...’ అనుకుంటారు అందరూ. చెన్నైకి చెందిన అన్నాదురై ఆటోకు ఇతర ఆటోలలో లేని సౌకర్యాలు ఉన్నాయి. గ్రంథాలయాన్ని తలపించేలా పుస్తకాలు ఉంటాయి. మొబైల్ ఫోన్ ఛార్జర్, వై-ఫై, టాబ్లెట్లు ఆటోలో ఉంటాయి. ఆటోలో ప్రయాణిస్తున్నంత సేపు వాటిని ఉచితంగా వాడుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే ఆటో ఎక్కిన ప్రతి కస్టమర్‌కు లక్కీ కూపన్ ఇస్తాడు. నెల చివరిలో డ్రా తీసి విజేతను ఎంపిక చేస్తాడు. డ్రాలో గెలిచిన వారు నెల మొత్తం ఉచితంగా ప్రయాణించవచ్చు. కొన్నిసార్లు నగదు బహుమతి కూడా ఉంటుంది. వచ్చిన ఆదాయంలో సగం పేదలకు పంచాలనేది ఇరవై ఎనిమిది సంవత్సరాల అన్నాదురై ఆశయం. కూలీ పనులు చేసే శ్రామికులు, ఆస్పత్రిలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ ఆటో ప్రయాణించవచ్చు. ‘‘కస్టమర్ తృప్తి చెందడమే నాకు ముఖ్యం. కస్టమరే నా దేవుడు’’ అంటాడు అన్నాదురై. ఈ యువకుడు తన సొమ్ములో అధిక భాగాన్ని చెన్నైలోని వీధిపిల్లల సంక్షేమానికి ఖర్చు చేస్తాడు. గత సంవత్సరం ముగ్గురు పిల్లలను సొంత ఖర్చుతో చదివించాడు. వృద్ధులకు సహాయపడుతుంటాడు. ‘‘మనం ఎవరికైనా మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు’’ అని సింపుల్‌గా తన ఫిలాసఫీ గురించి చెబుతున్నాడు అన్నాదురై. ఈ కుర్రాడు...కారు తయారుచేశాడు! ప్రతిభ ఉదయపూర్(రాజస్థాన్)కు చెందిన యువ ఇంజనీర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ శారీరకవైకల్యం ఉన్న వారి కోసం ఒక ప్రత్యేకమైన కారును తయారుచేశాడు. ఈ కారును చాలా సులభంగా ఆపరెట్ చేయవచ్చు. జోధ్‌పూర్‌లో ఎంయిసిఆర్సి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న ఖదీర్‌కు కొత్తగా ఆలోచించడమన్నా, కొత్త వస్తువులు కనిపెట్టడమన్నా చాలా ఇష్టం. ‘‘ఆటో క్లచ్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకొని సులభమైన కంట్రోలింగ్ పవర్ ఉన్న కారును రూపొందించాను. తమ జీవితంలో ఒక్కసారైనా నాలుగు చక్రాల వాహనాన్ని నడపని వారు కూడా దీన్ని నడపవచ్చు’’ అంటున్నాడు ఖదీర్. పుసుక్కున డౌటు అడిగితే... క్లాస్రూమ్ ఇంటర్ చదివే రోజుల్లో రమణమూర్తి అనె లెక్చరర్ ఉండేవారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ చాలా బాగా చెప్పేవారు. అయితే ఆయనకు ఒక వింత అలవాటు ఉండేది. పాఠం చెబుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా డౌటు అడిగితే...క్లాస్ మొత్తం ఆ డౌటు గురించే చెప్పేవారు. ఎప్పుడైనా మాకు క్లాస్ బోర్ కొడితే కావాలనే సబ్జెక్ట్‌కు సంబంధం లేని డౌటు అడిగేవాళ్లం. ‘సార్...శంకరాభరణం సినిమా పాటలు రాసిందా వేటూరా? సినారెనా?’’ అని అడిగితే- ‘‘ఇలాంటి డౌట్లు ఇప్పుడా అడగటం?’’ అని విసుక్కుంటూనే ఆ సినిమాలోని పాటల గొప్పదనం గురించి క్లాస్ టైం అయిపోయే వరకు చెబుతూనే ఉండేవారు. ఈ సరదా సంగతి ఎలా ఉన్నా ఆయన పుణ్యమా అని ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. - బి.విక్రమ్, తాడేపల్లిగూడెం -
'నా టాలెంట్‌ను ఉపయోగించుకోవడం లేదు'
-
మెరుపుల రాణి!
‘టెల్ మీ సమ్‌థింగ్ ఐ డోన్ట్ నో’ ఆల్బమ్‌తో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది అమెరికన్ అమ్మాయి సెలినా గోమెజ్. మనల్ని చెప్పమంటుందిగానీ... ఈ అందాల అమ్మాయి నోటి నుంచి ఎన్నో కొత్త విషయాలు వినవచ్చు. అవి మనల్ని నవ్వించేవి కావచ్చు. స్ఫూర్తినిచ్చేవి కావచ్చు, స్నేహానికి సంబంధించిన విషయాలు కావచ్చు. ఏ విషయం గురించి చెప్పినా పాట పాడినంత తీయగా చెప్పడం ఆమె ప్రత్యేకత. ఏడు సంవత్సరాల వయసు నుంచే తల్లి నటించిన చిత్రాలు చూసేది. ఆమె రిహార్సల్స్‌ను దగ్గరి నుంచి గమనించేది. తల్లితో పాటే థియేటర్లకు వెళ్లేది. ఇలా చిన్న వయసులోనే సెలినాలో ‘నటన’ పట్ల అభిమానం, ఆసక్తి పెరిగాయి. సెలినా నటించిన తొలి చిత్రం ‘బెర్ని అండ్ ఫ్రెండ్’. ఈ సినిమాలో నటించడానికి పద్నాలుగు వందల మంది పిల్లలతో పోటీ పడి గెలిచింది. ‘‘ఈ సినిమాకు ముందు నటన మీద ప్రేమ తప్ప ఎలా నటించాలనేది పెద్దగా తెలియదు. ఈ సినిమా నాకు అన్నీ నేర్పింది’’ అంటుంది సెలిన. డైలాగులు కంఠతా పట్టడం మిగిలిన వాళ్లకు కష్టమేమోగానీ సెలినాకు మాత్రం మంచి నీళ్లు తాగినంత సులువు. తన డైలాగులను ఒక్కసారి చూస్తే వంద సార్లు చూసినట్లే. ఠకీమని చెప్పేస్తుంది. ‘‘నీ టెక్నిక్ మాకు కూడా నేర్పవూ’’ అని చాలామంది నటులు సెలినాను అడుగుతుంటారు! సెలినా నటి, గాయని మాత్రమే కాదు...పెయింటర్ కూడా. ఏమాత్రం తీరిక దొరికినా చక్కగా బొమ్మలు వేస్తుంది. భౌతికశాస్త్రం అంటే ఇష్టం. పర్యావరణ సమస్యల గురించి చక్కగా మాట్లాడగదు. ‘‘పర్యావరణ పరిరక్షణకు నా వంతుగా పని చేస్తాను’’ అంటోంది. తాను చేయాల్సిన మిగిలిన పనుల కంటే ఈ పనే ముఖ్యం అని కూడా అంటుంది సెలినా. -
పెసలిస్తే పోస్టు మీకే!
పెసలిస్తే పోస్టు మీకే! న్యూస్‌లైన్: అంగన్వాడీ పోస్టుల భర్తీ అక్రమార్కులకు వరంగా మారింది. అంగట్లో సరుకులా వీటికి ఓ రేటు ఫిక్స్ చేసి పైరవీలు చేస్తున్నారు. అభ్యర్థుల టాలెంట్, అనుభవం, అర్హతలతో సంబంధం లేకుండానే రికమండేషన్లు, కాసులు ఖర్చుపెడితే సరి.. పోస్టులు వరిస్తాయనే ప్రచారానికి తెర లేపారు. ఈ తతంగమంతా కొందరు నాయకుల కనుసన్నల్లోనే సాగుతోందంటే దీని వెనకాల ఏ స్థాయి నేతలున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పరిగి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 215 అంగన్వాడీ లింక్ వర్కర్లను నియమించేందుకు గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టపర్చటం, పూర్వ ప్రాథమిక విద్యను అందించటం తదితర కారణాలతో.. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కార్యకర్త, ఆయాలతో పాటు ప్రతి సెంటర్‌కూ అదనంగా అంగన్వాడీ లింక్ వర్కర్లను నియమించేందుకు మాతా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఆయా పోస్టుల కేటగిరీలకు సంబంధించి మొత్తం 228 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. చెల్లని దరఖాస్తులే ఎక్కువ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు తక్కువ సమయం ఉండటం, ఇచ్చిన గడువులోపు కులం తదితర ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు అభ్యర్థులకు వీలుపడలేదు. దరఖాస్తులు ఆహ్వానించిన సమయంలో తహసీల్దార్లు బదిలీ కావటం, దీంతోపాటు వారు కార్యాలయాలకు సమయం కేటాయించకపోవటం తదితర కారణాలతో చాలా మంది పాత ధ్రువీకరణ పత్రాలతోనే దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో సగానికిపైగా చెల్లవంటూ అధికారులు తిరస్కరించారు. దీంతో కొన్ని గ్రామాలకు ఐదునుంచి 10 వరకు దరఖాస్తులే వచ్చాయి. మరికొన్ని గ్రామాలకు ఒక్క దరఖాస్తూ అందలేదు. ప్రధాన అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్న చోట పోటీ మరీ ఎక్కవగా ఉంది. ప్రస్తుతం 228 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించి వారికి కాల్‌లెటర్లు అందజేశారు. మిగతా 200పైగా దరఖాస్తులు ఆయా కారణాలతో చెల్లనివిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలకు చెందిన వారు ప్రస్తుతం దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పెంచటమో, లేదంటే మరోసారి నోటిఫికేషన్ ఇవ్వడమో చేయాలని కోరుతున్నారు. పెరిగిన పోటీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేందుకు గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు దొరికేవారు కాదు. గ్రామాల్లో చదువుకున్న మహిళలు కూడా ఉండేవారు కాదు. దీంతో సంవత్సరాల తరబడి కొన్ని సెంటర్లు కార్యకర్తలు లేక ఖాళీగానే ఉండేవి. కొన్నిచోట్ల వేరే గ్రామాలనుంచి కూడా కార్యకర్తలను ఎంపిక చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామాల్లో చదువుకున్న మహిళలు పెరిగిపోవటం, ఇటీవల అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు మెరుగుపడటం, భవిష్యత్తులో పర్మినెంట్ కావచ్చనే ఆశలు ప్రస్తుతం పోటీ తీవ్రతను పెంచేశాయి. ప్రారంభమైన పైరవీలు దరఖాస్తులు చేసుకున్నది మొదలు అంగన్వాడీ పోస్టులు దక్కించుకునేందుకు ఆశావహులు పైరవీలు ముమ్మరం చేశారు. ఆయా గ్రామాల లీడర్లు పెద్ద నేతలను కలిపించేందుకు పావులు కదుపుతున్నారు. గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు మొదలుకుని అమాత్యుల వరకూ పైరవీలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా పోస్టులు దక్కించుకునేందుకు ఆశావహులు ఉవ్విళ్లూరుతుండగా.. ఇదే అదనుగా భావించిన నాయకులు, పైరవీకారులు వారి నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారు. మెయిన్ అంగన్వాడీ పోస్టులకు పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్కో పోస్టుకు రూ.40 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. లింక్ వర్కర్లు, మినీ అంగన్వాడీ పోస్టులకు సైతం రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. -
ప్రతిభ ఒక్కటే కొలమానం
వీఆర్వో, వీఆర్ఏ.. పచ్చని పల్లెలో ప్రభుత్వ కొలువు. సొంతూళ్లో గౌరవం, గుర్తింపు పొందే అవకాశం. అందుకే వేలల్లో ఉన్న పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1657 వీఆర్వో, 4305 వీఆర్ఏ పోస్టులకు ఫిబ్రవరి 2న పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది హాజరుకానున్న వీఆర్వో/వీఆర్ఏ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు.. హాల్టిక్కెట్ల పంపిణీ.. నియామక ప్రక్రియ తదితర అంశాలపై సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్.కృష్ణారావుతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ... ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా? గ్రామీణ ప్రాంతాల్లోనూ మీ-సేవా కేంద్రాలున్నాయి. టెక్నాలజీ వినియోగం వల్ల జాప్యం జరగదు. దరఖాస్తుల స్వీకరణ, హాల్టిక్కెట్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తవు. 2012లో, ఇప్పుడూ ఆన్లైన్ విధానం వల్ల అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. చాలా విద్యా సంస్థలు కూడా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహి స్తున్నాయి. ఇప్పుడు ఇది చాలా సులువైన పద్ధతి అని చెప్పొచ్చు. వీఆర్వో/వీఆర్ఏ పరీక్షలకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు?హాల్‌టికెట్ల పంపిణీ ఎలా ఉంటుంది? 2012లో నిర్వహించిన వీఆర్వో/వీఆర్ఏ పరీక్షకు సుమారు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది వీఆర్వో, వీఆర్ఏలకు కలిపి మొత్తం 14,14,006 దరఖాస్తులందాయి. 1,657 వీఆర్వో ఉద్యోగాలకు 13,13,302 మంది, 4,305 వీఆర్ఏ ఉద్యోగాలకు 62,786 మంది దరఖాస్తు చేసుకు న్నారు. రెండు పోస్టులకు 37,918 మంది పోటీ పడుతున్నారు. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 2న పరీక్ష సమయానికి గంట ముందు వరకూ.. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష పూర్తయ్యాక నకలు జవాబు పత్రం తీసుకెళ్లొచ్చు. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణను ఎవరికి అప్పగించారు? పరీక్ష నిర్వహణ నుంచి ఫలితాల వరకూ ఏపీపీఎస్సీదే బాధ్యత. దరఖాస్తుల స్వీకరణ, హాల్టిక్కెట్ల పంపిణీని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేపడుతోంది. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు అప్పుడే పైరవీలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది? ఇలాంటి వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎవరు చెప్పినా నమ్మొద్దు. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే వీఆర్వో/వీఆర్ఏ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పైరవీకారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అన్ని జిల్లా పోలీసు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఒకవేళ ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే.. వెంటనే హెల్ప్‌లైన్‌కు తెలియజేయొచ్చు. జిల్లా స్థాయిలో ఆర్డీవో, తహసీల్దార్లకు ఫిర్యాదు చేయొచ్చు. అక్రమార్కులపై కేసు నమోదు చేస్తాం. పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల గురించి చెప్పండి? ఫిబ్రవరి 2వ తేదీన పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష నిర్వహణకు 4,012 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్ష నిర్వహణపై అధికారులకు ఈ నెల 29, 30, 31న శిక్షణ ఉంటుంది. ఫిబ్రవరి 2న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్వో.. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సులను నడపాల్సిందిగా సంబంధిత అధికారు లను కోరాం. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు పోలీసుశాఖ తోడ్పాటు అందిస్తోంది. నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలు ఉండవు. ముందుగా పరీక్ష పూర్తి కాగానే ఫిబ్రవరి 4న ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తాం. వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలను స్వీకరించి 10న తుది ‘కీ’ విడుదల చేస్తాం. ఫిబ్రవరి 26 నాటికి మెరిట్ జాబితాను రూపొందించి.. నెలాఖరుకల్లా ఉద్యోగాలు ఇస్తాం. వీఆర్వో ఎంపికకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ ఉంటుంది. కమిటీలో జడ్పీ సీఈవో, డీఈవోలతోపాటు జాయింట్ కలెక్టర్లు ఉంటారు. అభ్యర్థులకు మీ సలహా? ప్రతిభ ఒక్కటే కొలమానంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దీనిపై ఎలాంటి అపోహలకు గురికావద్దు. సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై పట్టు సాధించి.. ఉత్తమ స్కోరు సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందించేందుకు.. ఫిర్యాదులు స్వీకరించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన 040-23201530 హెల్ప్‌లైన్ నెంబరును వినియోగించుకోవచ్చు. ccla.cgg.gov.inలో జిల్లాల వారీగా హెల్ప్డెస్కులకు ఫిర్యాదు చేయవచ్చు. -
‘సమ’భావనమూ, సమతావాదము...
తక్కువ ఆదాయంతో, చాలా సాధారణంగా బతుకీడ్చే వారుంటారు. తమ ప్రతిభతో మంచి స్థాయి సంపాదనతో బతికే వారూ ఉంటారు. కానీ కొంతమంది టాలెంట్‌తో తాము బాగా బతకడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారి లైఫ్‌స్టైల్‌ను కూడా మార్చేస్తూ వారి జీవితాలను తీర్చిదిద్దుతూ తాము కూడా వెలిగిపోతారు. అలాంటి వ్యక్తే లీల జనా. ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన ఈ యువతి ప్రస్థానం ఇది... అవకాశం ఉంటే ఆసియా, ఆఫ్రికాఖండాల్లోని అభివృది ్ధచెందుతున్న దేశాల ప్రజల స్థితిగతులను మార్చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. అలాంటి తపననే కలిగి అవకాశం కోసం ఎదురు చూడకుండా, అవకాశాన్ని సృష్టించుకుంది లీల. స్కాలర్షిప్ చదువులు... పుట్టింది సాధారణ మధ్య తరగతి కుటుంబంలోనే అయినా... స్కాలర్‌షిప్‌ల సాయంతో మంచి మంచి విద్యాసంస్థల్లోనే చదువుతూ వచ్చింది లీల. హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక అనేక ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశాన్ని సంపాదించుకొంది. ముందుగా ఆఫ్రికాలోని ఘనా వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు పరిస్థితులను పరిశీలించి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచబ్యాంకు తరపున అనేక ఆఫ్రికా దేశాల్లో పర్యటించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షకురాలిగా పనిచేసింది. ఈ సందర్భంలో అక్కడి పరిస్థితులను చూసి చలించి పోయింది లీల. వారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏదో ఒకటి చేయాలని తపించింది. తిరిగి అమెరికాకు వెళ్లిపోయాకా దీని గురించి సొంతంగా అధ్యయనం చేయసాగింది. ఔట్‌సోర్సింగ్‌ను ఆధారం చేసింది... ఈ క్రమంలో ఆఫ్రికాలో పేదరికం, నిరక్షరాస్యత లు తీవ్రమైన సమస్యలుగా గుర్తించింది. అయితే అక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో చదువుకున్న వారు కూడా ఉపాధి లేకుండా నిరక్షరాస్యులతో పాటే మనుగడ సాగిస్తున్నట్టు అర్థం చేసుకొంది. వారిని లక్ష్యంగా చేసుకొని, ఔట్సోర్సింగ్పద్ధతిని అమల్లో పెట్టాలని లీల ప్రణాళిక రచించింది. ‘ఆఫ్రికన్ డెవలప్మెంట్’ అనే సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేషన్ చేసిన నేపథ్యం, ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు లాభించాయి. ఆమె ప్రణాళికకు ప్రముఖ కంపెనీలు సహకరించేలా చేశాయి. ఈ క్రమంలో లీల ‘సమా సోర్స్’ అనే సంస్థను నెలకొల్పింది. అందరికీ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘సమ’ అనే సంస్కృత పదం స్ఫూర్తితో తన సంస్థకు ఆ పేరు పెట్టింది లీల. సక్సెస్ సాధించింది... ముందుగా తాను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి అక్కడ చదువుకొన్న యువతను సమీకరించుకొంది. వారికి కంప్యూటర్ టెక్నాలజీ మీద ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణా కార్యకమాలను ఏర్పాటు చేసింది. అలాంటి వారి చేత ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రముఖ కంపెనీ ఉద్యోగులను చేయాలన్నదే లీల ఉద్దేశం. ఈ విషయంలో ఆమెకు గూగుల్, లింక్డిన్, ఈబే, మైక్రోసాఫ్ట్, ఈవెంట్ బ్రైట్ వంటి కంపెనీలు సహాకారం అందించాయి. తమకు కావాల్సిన పనులను లీల ద్వారా అభివృద్ధి చెందిన నిపుణుల ద్వారా చేయించుకోవడం మొదలెట్టాయి. దీంతో లీల ప్రణాళిక ఫలించింది. వేలమందికి ఉపాధి లభించింది. ప్రస్తుతానికి సబ్ సహారన్ ఆఫ్రిక దేశాల్లో, దక్షిణాసియా, కరేబియన్ దేశాల్లో ‘సమాసోర్స్’ కార్యకలాపాలను విస్తరించింది. దాదాపు ఐదువేల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది. ఈ స్థాయిని మరింత విస్తరించాలన్నదే తన లక్ష్యమని లీల చెబుతోంది. తాను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి అక్కడ చదువుకొన్న యువతను సమీకరించుకొంది. వారికి కంప్యూటర్ టెక్నాలజీ మీద ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాంటి వారి చేత ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రముఖ కంపెనీ ఉద్యోగులను చేయాలన్నదే లీల ఉద్దేశం.