డ్రమ్స్ పేరు చెప్తే ఇండియాలో శివమణి గుర్తుకు వస్తాడు. ఆయనో పెద్ద డ్రమ్స్ ప్లేయర్. ప్రితీష్ కూడా ఏం తక్కువ కాదు. జూనియర్ శివమణి అని చెప్పచ్చు. ఎ.ఆర్ ప్రీతీష్ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం తల్లిదండ్రులతోపాటు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఐదేళ్ల వయసులో అతను తొలిసారి డ్రమ్స్ చూశాడు.
సరదాగా దాని మీద ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత అదే అతనికి పనిగా మారింది. వయసులో తనకన్నా పెద్దవాళ్ళతో పోటీ పడి మరీ వాయించేవాడు.డ్రమ్స్ మీద రకరకాల ప్రయోగాలు చేసేవాడు. 8వ తరగతి వచ్చేనాటికి ప్రదర్శనలు ఇస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకునేవాడు. ఆ తర్వాత అతని దృష్టి గిన్నిస్ రికార్డ్ మీద పడింది. ఎలాగైనా దాన్ని సాధించాలని అత్యంత వేగంగా డ్రమ్స్ వాయించడాన్ని నేర్చుకున్నాడు. ఏడు నెలలపాటు అదే పనిగా డ్రమ్స్ వాయించి ఆ పట్టు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గిన్నిస్ ప్రతినిధుల ముందు నిమిషానికి 2,370 సార్లు డ్రమ్స్ వాయించాడు. అంటే ఒక సెకనుకు దాదాపు 40 సార్లు డ్రమ్ వాయించాడు. అతని ప్రతిభ చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అత్యంత చిన్న వయసులో ఒక నిమిషంలో అత్యధిక సార్లు డ్రమ్స్ వాయించిన వ్యక్తిగా అధికారిక రికార్డు అందజేశారు. ప్రీతీష్ కల నెరవేరింది.
ఇదీ చదవండి: సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా..వద్దొద్దు!
చిన్నారులకోసం చిన్నారుల గేయం
పాడుదాం గేయం
తారకలు..తారకలు..
తళతళ మెరిసే తారకలు
ఆకాశంలో అందంగా
మెరిసే తెల్లని దీపికలు
చంద్రుడి పక్కన చుక్కల్లా
మెరిసే బంగరు గోపికలు
అంబరానికి తోరణమై
నిలిచే అందాల జ్ఞాపికలు
ఎగరేసే దారం లేదు
ఎవరి చేతి ఆధారం లేదు
ఎత్తున నిలిచే ఊతం
అయినా మెరిసే తారకలు
ఏ రోజూ సెలవు లేదు
ఏనాడూ అలుపు రాదు
వజ్రాలంటి మెరుపు ΄ోదు
అందుకే అవి తారకలు
తారకలు..తారకలు..
తళతళ మెరిసే తారకలు
ఆకాశంలో అందంగా
మెరిసే తెల్లని దీపికలు∙
Comments
Please login to add a commentAdd a comment