ఎయిర్‌పోర్ట్‌లో శివమణి హల్చల్ : గుర్తుపట్టని ప్రయాణీకులు, వైరల్ వీడియో
విమానాశ్రయంలో ప్రయాణీకులంతా లగేజీ కోసం వెయిట్ చేస్తుండగా సడెన్‌గా అద్భుతమైన డ్రమ్ము వాయిద్యం వినిపించింది. దీంతో అందరూ అటువైపు డైవర్ట్ అయిపోయారు. అటు ప్రయాణ అలసట, ఇటు వెయిటింగ్ చిరాకు నుంచి బయటపడి 'హమ్మా-హమ్మ' అంటూ సైలెంట్‌గా గొంతు కలిపారు. కానీ అక్కడున్నది పాపులర్ డ్రమ్మర్ శివమణి చాలా మంది గుర్తించలేకపోయారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్(ట్విటర్)లో తెగ వైరల్ అవుతోంది.
కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లగేజీకోసం వెయిట్ చేయడం మొదలు పెట్టి దాదాపు 40 నిమిషాలై పోయింది. దీంతో ప్యాసింజర్లంతా విసుగ్గా , అసహనంగా అటూ ఇటు కదులున్నారు. దీంతో అక్కడున్న శివమణి ఏమనుకున్నాడో ఏమో గానీ, రంగంలోకి దిగిపోయాడు. కన్వేయర్ బెల్ట్ రైలింగ్‌పై తన డ్రమ్‌స్టిక్‌లను ఉపయోగించి A.R రెహమాన్ స్వరపరిచిన 'హమ్మా-హమ్మ’ పాటను వాయించడం మొదలు పెట్టాడు. తనదైన సిగ్నేచర్ దుస్తులు, స్టయిల్‌తో హమ్మా! అంటూ ముగించాడు. అంతే ఒక్కసారి చప్పట్లు మారుమోగిపోయాయి. ప్రశంసలే ప్రశంసలు. కానీ అక్కడున్నది డ్రమ్మర్ శివమణి అని చాలామంది గుర్తించలేదు.
దీనికి సంబంధించిన వీడియోను ఒక ప్యాసింజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఫెలో ప్యాసింజర్ మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేశారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో అది శివమణి అని గుర్తించిన ట్వీపుల్.. అయ్యో. అది గ్రేట్ శివమణి, మీరంతా లక్కీ అంటూ కమెంట్లు పెట్టారు. జనవరి 17న షేర్ అయిన ఈ వీడియో ఏడు లక్షలకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఎంజాయ్ చేయండి!