చెన్నె: తన సన్నిహితుడు మాండలిన్ శ్రీనివాస్ మరణాన్ని ప్రముఖ డ్రమ్మర్ శివమణి జీర్ణించుకోలేకపోయాడు. సంగీత ప్రయాణంలో తనతో పాటు పయనించిన మిత్రుడు ఆకస్మికంగా తరలనిరాని దూరాలకు వెళ్లిపోవడంతో ఆయన క్రుంగిపోయాడు. తన సంగీత స్నేహితుడికి తన వాయిద్యంతో శ్రద్ధాంజలి ఘటించాడు. మాండలిన్ శ్రీనివాస్ పార్థీవదేహం వద్ద డ్రమ్ వాయించి కన్నీటి నివాళి అర్పించాడు.
అంతేకాదు మాండలిన్ మాంత్రికుణ్ని 'కర్ణాటక సంగీత మహాన్' అంటూ కొనియాడాడు. శ్రీనివాస్ తనకు గురువు అంటూ సంబోధించారు. ఆయనతో కలిసి పలు కచేరీలు చేశానని గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ మరణం వ్యక్తిగతంగా తనకెంటో లోటు అని శివమణి పేర్కొన్నారు.
పార్థీవదేహం వద్ద డ్రమ్స్ వాయించి నివాళి
Published Sun, Sep 21 2014 10:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement
Advertisement