Chennai
-
విభజన కుట్ర
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి. చెన్నైలో ఓ స్టార్ హోటల్లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా? ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారురాజకీయ అలజడి కోసమే...అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది. 2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు. దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.పరుష వ్యాఖ్యలు ఎందుకు?ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు -
వైవిధ్య వైరుద్ధ్యాలు
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి. నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు. ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు. వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి. వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రిఅమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.సమావేశం అవసరం!చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది. ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శంకర్-దివ్య విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్
ప్రముఖ టెక్ ఎంట్రాప్రెన్యూర్ ప్రసన్న శంకర్ నారాయణ ఇంటి వ్యవహారం.. మొత్తంగా రచ్చకెక్కింది. అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న ఆయన.. సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేశారు. అది కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ రచ్చ కాస్త శాంతించింది. చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ(Prasanna Sankar Narayana).. ప్రముఖ హెచ్ఆర్ టెక్ స్టార్టప్ 'రిప్లింగ్' సహ వ్యవస్థాపకుడు. అంతేకాదు.. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. అయితే.. .. దివ్య, అమె కుమారుడు అమెరికా పౌరులు. ఈ నేపథ్యంలో, భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా, దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈలోపు హఠాత్తుగా సీన్ చెన్నైకి మారింది. భారత్‌కు వచ్చిన దివ్యఅమెరికా కోర్టు ప్రసన్నకు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, ప్రసన్న తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు(Prasanna Sankar) ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.అయితే కుమారుడు తనతో సంతోషంగా ఆడుకుంటున్నాడని ప్రసన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దివ్య ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, డబ్బుల కోసం డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించాడు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.కొడుకును కిడ్నాప్ చేసినట్టు తన భార్య దివ్య ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం తాను చెన్నై పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని.. పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తన మొబైల్ ఫోన్ లొకేషన్, కారు, యూపీఐ, ఐపీ అడ్రస్ లను ట్రాక్ చేస్తున్నారని ప్రసన్న శంకర్ ఆరోపించారు. చివరకు.. పోలీసుల హామీతో ఆయన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు.దివ్య ఏమన్నారంటే..ప్రసన్న శంకర్ ఒక కామ పిశాచి అని భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని తెలిపారు. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని వివరించారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని ఆరోపించారు. English Translation of @myprasanna 's video:"My name is Prasanna. I was born and brought up in Chennai. I went to US and founded a 10B dollar company. I'm a Tech Entrepreneur. Recently me and my wife got divorced and we had 50/50 custody of our son after signing a MOU.." https://t.co/uxSvgS1Xar— 7y913.acc (@aayeinbaigan) March 23, 2025అయితే.. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవలు జరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా, తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు దివ్య ఫిర్యాదు చేసిందని... అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదైందని వివరించారు. అమెరికా పోలీసులు, కోర్టు ఈ ఆరోపణలను విచారించి, అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా... నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్‌లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. -
25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం
-
పాతికేళ్ల దాకా పునర్విభజన వద్దు
సాక్షి, చెన్నై: జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్‌సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది. స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కేంద్రం చేపట్టే ఎలాంటి డీలిమిటేషన్ ప్రక్రియపై అయినా ముందుగా భాగస్వామ్య పక్షాలన్నింటితోనూ చర్చించాల్సిందేనని జేఏసీ సభ్యులు కుండబద్దలు కొట్టారు. ‘‘అందరి భాగస్వామ్యంతో మాత్రమే డీలిమిటేషన్ జరగాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో కచ్చితంగా సంప్రదింపులు జరపాలి. అభిప్రాయాలు తెలుసుకోవాలి. లోక్‌సభ స్థానాల పునర్విభజన మన ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను పెంచేలా ఉండాలి’’అని పేర్కొన్నారు. ఈ మేరకు రూపొందించిన తీర్మానాన్ని జేఏసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘‘జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని 42, 84, 87వ రాజ్యాంగ సవరణలు సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనాభా విషయంలో స్థిరీకరణ సాధించాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. అందుకే 1971 నాటి జనగణన ఆధారంగా నిర్ధారించిన లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యపై పరిమితిని మరో 25 ఏళ్లపాటు పొడిగించాలి. రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించకూడదు. జనాభా నియంత్రణ చర్యలతో జనాభాను గణనీయంగా తగ్గించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణలు చేయాలి’’అని తీర్మానంలో పేర్కొన్నారు. తమ డిమాండ్లను లెక్కచేయకుండా కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే కలిసికట్టుగా అడ్డుకోవడానికి ఎంపీలతో కూడిన కోర్ కమిటీ ద్వారా సమన్వయం చేసుకోవాలని, ఆ మేరకు వ్యూహాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ‘జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్’కు వ్యతిరేకంగా శాసనసభల్లో తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి పంపించాలని నిర్ణయానికొచ్చారు. గతంలో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియల చరిత్ర, వాటి ఉద్దేశం, ప్రతిపాదిత పునర్విభజన వల్ల తలెత్తే విపరిణామాలపై తమ రాష్ట్రాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తమిళనాడులో అధికార డీఎంకే దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. సమావేశంలో స్టాలిన్, పినరయి విజయన్, రేవంత్‌రెడ్డి, భగవంత్‌మాన్, కేటీఆర్, డీకే శివకుమార్, సురేశ్‌రెడ్డి, వద్దిరాజు, వినోద్‌కుమార్, మహేశ్‌గౌడ్, మల్లు రవి తదితరులు దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు: విజయన్ ప్రతిపాదిత పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు వంటిదేనని విజయన్ తేల్చిచెప్పారు. జనాభా తగ్గించినందుకు ఇస్తున్న బహుమానం ఇదేనా అని మండిపడ్డారు. పునర్విభజనపై ముందుకెళ్లే ముందు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో అర్థవంతమైన చర్చలు జరపాలన్నారు. ‘‘ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే లోక్‌సభ సీట్లు ఉత్తరాదిన పెరిగి దక్షిణాదిన తగ్గుతాయి. తద్వారా బీజేపీ లాభపడుతుంది. స్వీయ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నదే బీజేపీ ఆలోచన’’అని మండిపడ్డారు. జేఏసీ సమావేశం అనంతరం విజయన్ ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. దేశ సమాఖ్య వ్యవస్థపై సంఘ్ పరివార్ బహిరంగ యుద్ధం ప్రారంభించిందని ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలని దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య ప్రజాస్వామ్యానికి ముప్పు: డీకే కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దేశ సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంచేస్తున్న రాజకీయ దాడిగా అభివరి్ణంచారు. ‘‘సమాఖ్య నిర్మాణం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకర్తలు నిర్మించిన సమాఖ్య ప్రజాస్వామ్య పునాదులను కూల్చివేయొద్దు’’అని కేంద్రానికి సూచించారు. ‘‘ఆధిపత్యాన్ని అంగీకరించడమా? తిరుగుబాటు చేయడమా? ప్రగతిశీల రాష్ట్రాలకు ఇప్పుడు ఈ రెండే అవకాశాలున్నాయి. మేం తిరుగుబాటునే ఎంచుకున్నాం’’అని ఉద్ఘాటించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. జాతీయ వేదికపై దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికి కేంద్రం కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో చర్చించాలి: నవీన్ పట్నాయక్ పార్లమెంట్లో, అసెంబ్లీల్లో ఎన్ని స్థానాలు ఉండాలో నిర్ణయించడానికి జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియపై అన్ని పార్టీలతో సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. జేఏసీ భేటీని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు. డీమిలిటేషన్పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జనాభాను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాల ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని, ప్రజల హక్కులను కేంద్రం కాపాడాలన్నారు. దేశ అభివృద్ధి కోసం జనాభా నియంత్రణ అనేది అత్యంత కీలకమైన జాతీయ అజెండా అని నవీన్ వివరించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపడితే తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. బీజేడీ తరఫున మాజీ మంత్రి సంజయ్ దాస్, మాజీ ఎంపీ అమర్ పట్నాయక్ భేటీలో పాల్గొన్నారు.మన ఆమోదం లేకుండానే చట్టాలు: స్టాలిన్ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రాజకీయ, న్యాయపరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని స్టాలిన్ చెప్పారు. పునర్విభజన పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేలా చర్యలు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే పలు రాష్ట్రాలకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దు. సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గరాదు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంట్లో చట్టాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది. మన ఆమోదం లేకుండానే చట్టాలు రూపొందితే మన ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. సామాజిక న్యాయం దెబ్బతింటుంది’’అని ఉద్ఘాటించారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు. ఈ జేఏసీ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని స్టాలిన్ అన్నారు. ఈ భేటీని ‘జేఏసీ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్’గా పిలుద్దామని ప్రతిపాదించారు. జేఏసీ రెండో భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని చెప్పారు. తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండో భేటీ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నేతలు ఏకాభిప్రాయానికి వచి్చనట్లు సమాచారం. -
ఐక్యంగా పోరాడుదాం.. బీజేపీని అడ్డుకుందాం
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుదామని, అసమగ్ర పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా చెన్నైలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందించారు. సమావేశంలో రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. జనాభాను నియంత్రించాలని 1971లో దేశం నిర్ణయించినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే.. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్ధి సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి. ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు దక్షిణాది రాష్ట్రాలు దేశ ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ కూడా తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయి. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. 29 పైసలే వెనక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు అందుతున్నాయి. బిహార్‌కు ఆరు రూపాయల ఆరు పైసలు, మధ్యప్రదేశ్‌కు రూపాయి 73 పైసలు వెనక్కి పొందుతున్నాయి. అదే కర్ణాటక కేవలం 14 పైసలు, తెలంగాణ 41 పైసలు, కేరళ 62 పైసలు మాత్రమే వెనక్కు పొందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్నుల వాటా చెల్లింపులు క్రమంగా తగ్గుతున్నాయి. చివరికి జాతీయ ఆరోగ్యమిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60– 65 శాతం నిధులు దక్కుతున్నాయి. అలా పునర్విభజనను ఒప్పుకోం.. మనది ఒకే దేశం.. దానిని గౌరవిస్తాం.. కానీ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించం. అది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అధికారాన్ని కుదిస్తుంది. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలకు శిక్షగా మారుతుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందాం. దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలి. వాజ్‌పేయి విధానాన్ని అనుసరించండి.. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర కూడా ఉంది. ఈ దృష్ట్యా ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచకుండా ఏ విధంగా పునర్విభజన ప్రక్రియ జరిపిందో.. ఆ విధానాన్నే ఇప్పుడు అనుసరించాలి. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అదే తరహాలో ప్రారంభించింది. ఇప్పుడు అదే విధానాన్ని పాటించేలా.. మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో, సంఖ్యలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. ఈ అంశంపై తర్వాతి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిద్దాం. పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనే అంశంపై ఆ సమావేశంలో చర్చిద్దాం. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం..’’అని రేవంత్ చెప్పారు.చెన్నై శ్రీకారం.. హైదరాబాద్ ఆకారం: రేవంత్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిని గౌరవిస్తామని.. రాజకీయాల్లోనైనా, విద్యావ్యవస్థలోనైనా పెత్తనాన్ని మాత్రం సహించబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తి ప్రకారం హక్కుల సాధనలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా పోస్టు చేశారు. ‘‘ఈ పుణ్యభూమి అంబేడ్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. కేవలం రాజకీయ ప్రయోజన కాంక్షతో పునర్విభజనను అస్త్రంగా ప్రయోగించి ఆ హక్కులను విచ్చిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది’’అని పేర్కొన్నారు. -
హైదరాబాద్ వేదికగా ‘ఢీ’లిమిటేషన్
చెన్నై: జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజక వర్గాల పునర్విభజన (Delimitation) జరపబోతోందన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం జరిగింది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్‌ను తాము వ్యతిరేకించడం లేదని.. అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని అని అక్కడ హాజరైన ప్రతినిధుల తరఫున స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యాయని, ఈ ఘనత స్టాలిన్‌కే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్‌కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్(Hyderabad Delimitation Meeting)లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.ఇక.. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు. -
చెన్నైలో అఖిలపక్ష భేటీ ప్రారంభం
-
తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశం
-
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి: రేవంత్ రెడ్డి
Delimitation JAC meeting Updates..👉కేటీఆర్ కామెంట్స్: ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని.. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా… భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుంది...కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈ రోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నెడుతున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.👉దేశానికి 36% జిడిపిలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది.👉దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీ లిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. బీజేపీ సారధ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపైన పుండుపైన ఉప్పురుద్దినట్టుగా వ్యవహరిస్తున్నది👉ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆదిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి. ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది. మనమంతరం భారతీయులం…అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.👉1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈ రోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదు. డిలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదు. ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి.👉తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ కారణంగా పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మన గొంతు వినిపించే వాళ్లు తగ్గిపోతారు. మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. భవిష్యత్ శ్రేయస్సుకు భంగం కలుగుతుంది. స్త్రీల హక్కులకు కూడా భంగం కలుగుతుంది. 👉తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కామెంట్స్..‘దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలుకాలేదు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది. బాగా పని చేసిన మనకు శిక్ష వేస్తారా?. న్యాయబద్దం కాని డీలిమిటేషన్‌పై మనం బీజేపీని అడ్డుకోవాలి. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుంది. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుంది. గతంలో వాజ్‌పేయి కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారు. దక్షిణాది నుంచి వెళ్తుంది ఎక్కువ.. వస్తున్నది తక్కువ. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూపాయి వెళ్తే వస్తున్నది మాత్రం 42 పైసలే. బీహార్ రూపాయి పన్ను కడితే.. ఆరు రూపాయాలు పోతున్నాయి. యూపీకి రూపాయికి రెండు రూపాయల మూడు పైసలు వెనక్కు వస్తున్నాయి. దక్షిణాది రాజకీయంగా గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోతుంది. మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారతాం. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి.👉తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ ప్రతినిధి హాజరయ్యారు. ఈ భేటీకి బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ దూరంగా ఉంది.👉ఇక, ఈ సమావేశంలో డీలిమిటేషన్‌పై నేతలు చర్చించనున్నారు. ఫెయిర్ డీలిమిటేషన్ నినాదంతో సమావేశం జరగనుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి, నియోజకవర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన న్యాయంగా జరగాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. சென்னையில் நடைபெறும் கூட்டு நடவடிக்கை குழு ஆலோசனைக் கூட்டத்தில் பங்கேற்க வருகை தந்த அனைத்து தலைவர்களையும் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு @mkstalin அவர்கள் வரவேற்றார். #FairDelimitation pic.twitter.com/0Ject5TUiA— DMK (@arivalayam) March 22, 2025 👉అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, కీలక నేతలు చెన్నైకి చేరుకున్నారు. Honourable Chief Minister of Telangana Thiru @revanth_anumula Avl arrives in Chennai ahead of the crucial JAC meeting against unfair delimitation. Leaders from 14+ parties will unite tomorrow to discuss the pressing issue of delimitation and its impact on state rights.… pic.twitter.com/mhhpbaUH8b— DMK (@arivalayam) March 21, 2025Honourable Chief Minister of Punjab Thiru. @BhagwantMann arrives in Chennai ahead of the crucial JAC meeting against unfair delimitation. Leaders from 14+ parties will unite tomorrow to discuss the pressing issue of delimitation and its impact on state rights.… pic.twitter.com/g2uo33Tw5i— DMK (@arivalayam) March 21, 2025 -
హీరోయిన్ నయనతార కొత్త ఇల్లు.. చాలా కాస్ట్ లీ (ఫొటోలు)
-
ఏఆర్ రెహమాన్ కు అస్వస్థత ఆస్పత్రిలో చేరిక
-
40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత
దాదాపు 40 ఏళ్ల చరిత్ర గల మరో థియేటర్ నేలమట్టమైంది. సూపర్‌స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా 1985లో చెన్నైలో ప్రారంభమైన బృందా థియేటర్.. దశాబ్దాల పాటూ అభిమానులను ఎంతో అలరించింది. కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇప్పటికే సినిమాలను ప్రదర్శించడం ఆగిపోయింది. గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీనికి ప్రతిగా తమిళనాడు వ్యాప్తంగా ఐకానిక్ థియేటర్లను కూల్చివేస్తున్నారు. ఇప్పటికే చైన్నెలో పాపులర్ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణితదితర ఎన్నో థియేటర్లు నేలమట్టమయ్యాయి. ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన పెరంబూర్ బృందా థియేటర్ చరిత్ర సోమవారంతో ముగిసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)1985 ఏప్రిల్ 14న సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులమీదుగా బృందా థియేటర్ని ప్రారంభించారు. అప్పుడు లోగనాథన్ చెట్టియార్ దాని యజమాని. అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్, చంద్రశేఖర్ దీనిని కొనసాగించారు. ఈ మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ థియేటర్‌ను కూల్చివేయనున్నారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. 40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మా థియేటర్‌కి బృందా థియేటర్ అని పేరు పెట్టినా రజనీ థియేటర్ అని పిలుస్తారని, రజనీ ఈ థియేటర్ని ప్రారంభించారు.. రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం
సాక్షి, చెన్నై: మరికొన్ని గంటల్లో కుమారుడి వివాహం జరగబోనుండగా.. తండ్రి గుండెపోటుతో(Heart attack) కుప్పకూలిపోయాడు. సాధారణంగా అయితే వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. అంతటి దుఃఖంలోనూ వరుడి తల్లి స్పందించి.. తన భర్త నిర్ణయాన్ని అమలు చేశారు. ఆయన మృత దేహం సాక్షిగా కుమారుడి వివాహం జరిపించారు. వివరాలు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పేరుగోపనపల్లికి చెందిన వరదరాజ్ (60) దుస్తుల వ్యాపారం చేస్తుండగా.. అతని భార్య మంజుల గృహిణి. వీరి కుమారుడు మనీశ్‌కు బర్గూరు చెందిన గోవిందరాజులు, శివశంకరిల కుమార్తె కావ్య ప్రియకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి వివాహానికి సంబంధించిన వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వరుడి తండ్రి వరదరాజ్ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి.. వరద రాజ్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. దీంతో వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. వివాహాన్ని వాయిదా వేద్దా మంటూ సలహాలు ఇచ్చారు. కానీ వరుడి తల్లి మంజుల స్పందించి.. పెళ్లి (marriage) కుదరగానే తన భర్త ఎంతో సంతోషించాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన నిర్ణయం ప్రకారం వివాహ తంతు పూర్తి చేస్తే.. తన భర్త ఆత్మకు శాంతి కలుగు తుందన్నారు. దీంతో గ్రామ పెద్దలు, వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు చర్చించుకొని.. వివాహానికి అంగీకారం తెలిపారు. అనంతరం వరదరాజ్ మృతదేహం సాక్షిగా వరుడు మనీశ్ వధువు మెడలో తాళి కట్టాడు. అనంతరం వరదరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు.Video Credit To Polimer News -
ముదిరిన భాషా వివాదం.. తమిళిసై అరెస్ట్
చెన్నై: తమిళనాడులో త్రిభాషా వివాదం ముదిరింది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోబీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసైని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, రాష్ట్రంలో త్రి భాష విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణకు బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. అలాగే డీఎంకే అఖిల పక్షాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని మూడు భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు.నిన్నటి (బుధవారం) నుంచి త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ – సంతకాల సేకరణ కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. కాగా, డీఎంకే నేతృత్వంలో బుధవారం జరిగిన అఖిల పక్షం భేటీని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలు, దుష్ప్రవర్తన, శాంతిభద్రతల వైఫల్యాల గురించి చర్చించిన కోర్‌కమిటీ.. రానున్న రోజులలో తమిళ ప్రజల సంక్షేమార్థం, డీఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలకు నిర్ణయించారు. -
15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత.. అవార్డ్ కూడా పట్టేసింది!
-
చెఫ్ అవతారంలో సోనూసూద్.. దోశ రేటు రెట్టింపు చేసి..
కరోనా కాలంలో మానవత్వానికి మారుపేరుగా నిలిచారు బాలీవుడ్ హీరో సోనూసూద్(Sonu Sood). అది మొదలు ఆయన ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆ అంశం వైరల్‌గా మారుతోంది. సోనూసూద్ తరచూ చిరు వ్యాపారులకు సాయం అందిస్తుంటారు. తాజాగా సోనూసూద్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్‌గా మారింది. దానిలో సోనూసూద్ చెఫ్ అవతారంలో కనిపిస్తున్నారు.సోను సూద్ ఇలీవల తమిళనాడులోని చెన్నైలో రోడ్డుపక్కనున్న ఒక టిఫిన్ సెంటర్‌కు వెళ్లారు. అతని బృందం కూడా అతని వెంట ఉంది. ఇంతలో సోనూసూద్ దోశె వేసేందుకు ప్రయత్నించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, ‘ఇది నా ఇడ్లీ సాంబార్ దుకాణం’ అని రాశారు.వీడియో క్లిప్ మొదట్లో సోనూసూద్ ఆ ఫుడ్ స్టాల్(Food stall) యజమాని శాంతిని పరిచయం చేసుకున్నారు. తరువాత అక్కడ సిద్ధమైన వంటకాలన్నీ కనిపిస్తాయి. తరువాత కెమెరా కిచెన్ కౌంటర్ వైపు కదులుతుంది. అక్కడ కొబ్బరి పచ్చడి, సాంబారు, ఇడ్లీలతో కూడిన పాత్రలు ఉంటాయి. ఇడ్లీ, వడ ప్లేటు పట్టుకున్న సోనూసూద్.. మూడు ఇడ్లీలు, రెండు వడల ధర కేవలం రూ. 35 అని చెబుతారు. దీనిపై మీకు నమ్మకం లేదా?’ అని ప్రశ్నిస్తారు. అయితే టిఫిన్ సెంటర్ యజమాని శాంతి ఆయనకు ఆ టిఫిన్ రూ. 30కే ఇస్తుంది. తరువాత సోనూసూద్ చెఫ్ అవతారమెత్తి దోశ వేసేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు శాంతి ప్లెయిన్ దోశ రూ. 15 అని చెబుతుంది. వెంటనే సోనూ సూద్ దోశ ధర రెండింతలు చేస్తూ రూ. 30 అయ్యిందని చెబుతారు. తరువాత ఆయన తన బృందంలోని సభ్యులందరికీ దోశలను వడ్డిస్తారు.గతంలో కూమారి ఆంటీని కలిసి..గత ఏడాది సోసూసూద్ హైదరాబాద్‌లో ఫుడ్‌స్టాల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ(Aunty Kumari)ని కలుసుకున్నారు. అప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. కుమారి ఆంటీని పలుకరిస్తూ కనిపించారు. ‘నేను కుమారి ఆంటీ పక్కన ఉన్నాను. ఆమె గురించి చాలా విన్నాను. ఆమె స్వయంకృషితో ఎదిగిన మహిళ’ అని ఆమెను మెచ్చుకున్నారు. మహిళా సాధికారతకు కుమారి ఆంటీ ఉత్తమ ఉదాహరణ అని సోనూసూద్ అన్నారు. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్లో సోనూసూద్ వెజిటేరియన్ మీల్స్ తిన్నారు. ఇది కూడా చదవండి: Sarojini Naidu: మహాత్మునితో ‘మిక్కీ మౌస్’ అని పిలిపించుకుని.. -
పిల్లల పరీక్షలు, పెద్దోళ్లకు అగ్నిపరీక్ష! ఈ విషయాలు గుర్తుంచుకోండి!
చెన్నైలో CBSE పరీక్షల సమయంలో స్కూల్ గోడ ఎక్కి, తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసి మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.ఇలాంటి ఘటనలు ఏ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి?🔹మన విద్యా వ్యవస్థ పిల్లలపై ఎంత ఒత్తిడిని పెడుతోంది?🔹తల్లిదండ్రుల ఆందోళన పిల్లల మనసుపై ఎలా ప్రభావం చూపుతోంది?🔹తల్లిదండ్రుల ప్రేమ వారికి బలాన్ని ఇస్తుందా, భయాన్ని పెంచుతుందా?ప్రతీ సంవత్సరం పరీక్షల సీజన్ వచ్చినప్పుడల్లా విద్యార్థుల కన్నా ఎక్కువగా ఒత్తిడిలో ఉంటున్న వారు తల్లిదండ్రులే. "తప్పక పాస్ అవ్వాలి!", "అగ్రశ్రేణి మార్కులు రావాలి!", "లేకపోతే భవిష్యత్తు అంధకారం!" – ఇవీ తల్లిదండ్రులలో నిండిపోయిన భయాలు. ర్యాంక్ కోసమే మన ప్రేమ అని పిల్లలకు అనిపించకూడదు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి తల్లిదండ్రులు చేయకూడనిది...❌ హెలికాప్టర్ పేరెంటింగ్:ప్రతీ చిన్న విషయాన్ని తల్లిదండ్రులు గమని…పిల్లలను ఎలా ప్రోత్సహించాలి?✅ పరీక్ష ఫలితాలు ఆశించినంత రాలేదనుకోండి. పిల్లలు దిగులుగా ఉన్నప్పుడు, "నీ ప్రయత్నం గొప్పది, మార్కులు మాత్రమే జీవితానికి అద్దం కాదు" అని చెప్పండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.✅ పిల్లలకు చదువు అంటే భయం కాకుండా ఆసక్తిగా ఉండేలా చేయండి. "ఏ విషయం నచ్చింది? ఏ ప్రశ్న ఆసక్తికరంగా అనిపించింది?" అని అడిగితే, పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే ప్రక్రియగా భావిస్తారు.✅ "నీ ఫ్రెండ్ అజయ్ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీవు ఎందుకు సాధించలేకపోతున్నావు?" అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చతాయి. ప్రతి ఒక్కరికీ తన ప్రయాణం ఉంటుంది. అందుకే పోల్చడం మానండి.✅ తప్పిదాలను సహజంగా అంగీకరించండి. "ఈసారి ఏమి తప్పైంది? తర్వాత ఎలా మెరుగుపరచుకోవచ్చు?" అనే విధంగా ప్రశ్నించడం ద్వారా పిల్లలు సమస్యలను అర్థం చేసుకొని, మెరుగుపడటాన్ని నేర్చుకుంటారు.గుర్తుంచుకోవాల్సిన విషయాలు📌 పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. అవి ఒక చిన్న అంచనా మాత్రమే.📌 పిల్లలకు భయం పోగొట్టండి. పరీక్షలు అంటే భయపడేలా కాకుండా, కొత్త విషయాలు నేర్చుకునే అనుభవంగా చూడమని ప్రేరేపించండి.📌 పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడితో విజయం సాధించడమే కాదు, ఆనందంగా ఎదగాలి.📌 గోడలు ఎక్కే తల్లిదండ్రులు కాకుండా, పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి.పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే మంచి అవకాశంగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల భవిష్యత్తును భయంతో నింపకుండా, ధైర్యంగా ముందుకు నడిపిద్దాం!మీకేమైనా కౌన్సెలింగ్ సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి.-సైకాలజిస్ట్ విశేష్ -
నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.అక్రమ్ తండ్రి షిల్బీ మొళిప్పిరిన్. ఉద్యోగరీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు (English Letters) నేర్చుకున్న అక్రమ్, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఆరేళ్ల వయసొచ్చేసరికి తండ్రితో రకరకాల భాషల్లో మాట్లాడటమే కాకుండా తమిళ వాక్యాలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో 50 భాషలు సాధన చేసి, వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి, వివిధ భాషల పుస్తకాలు తెప్పించి, అతనికి ఇచ్చేవారు మొళిప్పిరిన్. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు.10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి, రాసి, టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.చదవండి: డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి, ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. -
విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌రేప్.. తమిళనాడులో వెలుగు చూసిన దారుణం
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయారు. సభ్య సమాజం తల దించుకునేలా టీచర్లు వ్యవహరించారు. ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని గర్భం దాల్చింది. అసలు విషయం తన తల్లికి చెప్పడంతో ఆవేదన చెందిన ఆమె.. బిడ్డను గత నెల రోజులుగా పాఠశాలకు పంపించలేదు. స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసింది.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే శిశు సంక్షేమ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితురాలితో ఫిర్యాదు చేయించారు. దీంతో, బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు.. దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్(37)ను అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటన చర్చనీయాంశంగా మారడంతో స్థానికులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు.. ఈ ఘటన అనంతరం వారిని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తమిళనాడులో వరుస లైంగిక దాడుల ఘటనలు స్టాలిన్ సర్కార్‌కు మచ్చ తెస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, ప్రతిపక్ష బీజేపీ నిరసనలు చేపట్టింది. స్టాలిన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.Tamil Nadu | A 13-year-old girl student was allegedly sexually assaulted by three teachers at a government middle school in Krishnagiri district. The three teachers have been suspended by the District Education Officer (DEO) and arrested under various sections of the Protection…— ANI (@ANI) February 6, 2025 -
ప్రియుడి కోసం ఇల్లు వదిలి..పోలీసుల చేతిలో..!
చెన్నై:ప్రియుడిని వెతుక్కుంటూ బయలుదేరిన ఓ 13 ఏళ్ల బాలిక పోలీసుల చేతిలోనే లైంగికదాడికి గురైంది. కాపాడాల్సిన పోలీసే ఆ బాలిక జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇటీవల జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన బాయ్‌ఫ్రెండ్ మాటలు నమ్మి ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చింది. రాత్రి వేళ కావడంతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసు రామన్ సాయం చేస్తానని బాలికను జీపు ఎక్కించుకున్నాడు. వాహనంలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసుల బూత్‌కు తీసుకెళ్లి బాలికపై మరోసారి లైంగిక దాడి చేశాడు.రామన్ నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరింది.అయితే తనకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న బాలిక ఇంటి నుంచి మళ్లీ పారిపోయింది బాలిక.ఈసారి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసింది. ఇద్దరు కలిసి ఒక చోట సహజీవనం మొదలు పెట్టారు. ఇంతలో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టారు. బాలికను విచారించగా ట్రాఫిక్ పోలీసు రామన్ బాగోతం బయటపడింది. దీనికి తోడు బాయ్‌ఫ్రెండ్ కూడా తనపై లైంగికదాడి చేశాడని బాలిక పోలీసులకు తెలిపింది. -
చెన్నై కారు ఛేజింగ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్
చెన్నయ్: చెన్నైలోని ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో కారు ఛేజింగ్ ఘటనలో మరో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఏడుగురు నిందితుల్లో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. చంద్రు అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దర్యాప్తు అనంతరం సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీలను పరిశీలించి ఫిబ్రవరి 1న చంద్రును అరెస్టు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్తికేయన్ (పల్లికరనై) తెలిపారు. మరో ఇద్దరు నిందితులను కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. శనివారం అరెస్టైన చంద్రుపై ఇప్పటికే కిడ్నాప్ సహా రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ నేరం సమయంలో ఉపయోగించిన రెండు ఎస్‌యూవీలను ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం కారులో ఉన్న కొందరు మహిళలను డీఎంకే జెండా ఉన్న ఎస్‌యూవీలో వచ్చిన వ్యక్తులు వెంబడించి బెదిరిస్తున్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో 2025 జనవరి 25 తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ఫిర్యాదు ఆధారంగా తొలుత సీఎస్ఆర్ (కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్) నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం బీఎన్ఎస్, తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్గా మార్చారు. అయితే ఘటన పట్ల ప్రభుత్వ తీరుపై అన్నాడీఎంకే, బీజేపీ సహా విపక్షాలు మండిపడ్డాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే రాజకీయ సంబంధాలను పోలీసులు తోసిపుచ్చారు. టోల్ ప్లాజాల వద్ద రుసుము వసూలు చేయడానికి నిందితులు పార్టీ జెండాను ఉపయోగించారని చెప్పారు. -
5 నెలల తరువాత చెన్నైకు తిరిగొచ్చిన కమల్ హాసన్
కోలీవుడ్ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) సుమారు 5 నెలల తరువాత చైన్నెకి చేరుకున్నారు. ఈయన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొందడానికి అమెరికా వెళ్లారు. ఈయన నిర్మించిన అమరన్ చిత్రం ప్రమోషన్లోగానీ, చిత్ర విడుదల సమయంలోగానీ పాల్గొనలేదు. ఆ సమయంలో అమెరికాలోనే ఉన్నారు. కాగా మక్కల్ నీది మయ్యం పార్టీలోనూ అనిశ్చితి వాతావరణం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కమలహాసన్ ఎట్టకేలకు 5 నెలల తరువాత అమెరికా నుంచి చైన్నెకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 6వ తేదీన విడుదల కానుందని చెప్పారు. అదేవిధంగా విక్రమ్ 2 చిత్రం చేస్తున్నారా అన్న ప్రశ్నకు అలాంటిది ఏమీ లేదని, వేరే చిత్రానికి కథను సిద్ధం చేసినట్లు కమలహాసన్ చెప్పారు. కాగా ఈయన త్వరలో ఫైట్ మాస్టర్ల ద్వయం అన్బరివ్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలను కూడా అమెరికాలోనే జరిపారన్నది గమనార్హం. -
ఓడిపోతాననే భయం.. అందుకే ఇష్టపడలేదు: సమంత (ఫొటోలు)
-
మాల్స్‌లో తగ్గిన రిటైల్ లీజింగ్
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, హై స్ట్రీట్లలో (ప్రముఖ షాపింగ్ ప్రాంతాలు) రిటైల్ స్థలాల లీజింగ్ 2024లో 10 శాతం తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 64 లక్షల చదరపు అడుగుల లీజింగ్ కార్యకలాపాలు 2024లో నమోదయ్యాయి. హైదరాబాద్, చెన్నై మాత్రం రాణించాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో స్థూల రిటైల్ స్పేస్ లీజింగ్ 71 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. ‘‘భార త రిటైల్ స్పేస్ విభాగం 2025లో గణీయమైన వృద్ధిని చూడనుంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరులో 50–60 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ మాల్స్ స్థలాలు ఈ ఏడాది వినియోగంలోకి రానున్నాయి’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీ ఈవో అన్హుమన్ మ్యాగజిన్ తెలిపారు. మధ్య శ్రేణి ఫ్యాషన్, వ్యాల్యూ ఫ్యాషన్, క్రీడా వ్రస్తాలు, జ్యుయ లరీ విభాగాల నుంచి బలమైన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సైతం మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు. రిటైల్ కేంద్రాలు షాపింగ్, డైనింగ్, వినోదం కలిసిన వినూత్నమైన అనుభవాన్ని అందిస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. పట్టణాల వారీగా లీజింగ్ → హైదరాబాద్ మార్కెట్లో 2024లో రిటైల్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 10 లక్షల చదరపు అడుగులకు చేరింది. అంతక్రితం ఏడాది ఇది 7 లక్షల చదరపు అడుగులుగానే ఉంది. → చెన్నైలోనూ రిటైల్ స్పేస్ లీజింగ్ 6 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి 7 లక్షల ఎస్ఎఫ్టీకి పెరిగింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో 2023లో 14 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదు కాగా, 2024లో 10 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → బెంగళూరులో పెద్దగా మార్పు లేకుండా 19 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. → ముంబైలో 10 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి 8 లక్షల ఎస్ఎఫ్టీకి లీజింగ్ తగ్గింది. → పుణెలోనూ 8 లక్షల చదరపు అడుగుల నుంచి 6 లక్షలకు పరిమితమైంది. → కోల్‌కతాలో రిటైల్ స్పేస్ లీజింగ్ లక్ష చదరపు అడుగుల నుంచి 2 లక్షలకు పెరిగింది. → అహ్మదాబాద్‌లో 5 లక్షల నుంచి 4 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. -
కోస్ట్‌గార్డ్ రైజింగ్ డే బైక్ ర్యాలీ ప్రారంభం
సింథియా: ఇండియన్ కోస్ట్‌గార్డ్ 49వ రైజింగ్ డే వేడుకల్లో భాగంగా మంగళవారం భారీ బైక్ ర్యాలీని కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేపట్టారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమై చెన్నై వరకు సాగనున్న ఈ ర్యాలీకి అడిషనల్ డైరెక్టర్ జనరల్ డానీ మైఖేల్, పీటీఎం, టీఎం(జీ) కోస్ట్‌గార్డ్ కమాండర్ జెండా ఊపి ప్రారంభించారు.49 మంది కోస్ట్‌గార్డ్ సిబ్బందితో ఈ బైక్ ర్యాలీ విశాఖలో ప్రారంభమై సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫిబ్రవరి 1న చెన్నైలోని ట్యూటికోరిన్ మెరైన్ బీచ్ వద్ద ముగుస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. ఏపీలో సుమారు 850 కిలోమీటర్ల ప్రయాణంలో కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్ట్‌లను సందర్శించి రైజింగ్ డేపై అవగాహనతో పాటు రహదారి, సముద్ర భద్రత, రక్షణ విషయాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ మోటారు బైక్ ర్యాలీని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. -
నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20
-
చెన్నై సూపర్ చాంప్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో సమంత సందడి (ఫొటోలు)
-
పుస్తకాలతో పెంచుదాం
‘కౌమార వయసులో ఉండే పిల్లలు చదవడానికి పుస్తకాలు లేవు. వారి కోసం ప్రపంచ దేశాలు పుస్తకాలు అచ్చు వేసే పనిలో పడ్డాయి’ అన్నారు ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్’కు హాజరైన ప్రసిద్ధ పబ్లిషర్లు. ప్రతి సంవత్సరం ఇటలీలో, షాంఘైలో ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్‌ఫెయిర్’లు భారీగా జరుగుతాయి. కాని మన దేశంలో కోట్ల మంది బాలలున్నా బాల సాహిత్యం ఊసే ఉండదు. బాల సాహిత్యమే కేంద్రంగా సాగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ నుంచి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి.‘కాలేజీ చదువుల తర్వాత కూడా అందరూ అవే క్లాసు పుస్తకాలు చదవక తప్పని పరిస్థితి ఉంటే బతుకు ఎంత నరకంగా ఉంటుందో... స్కూలు పుస్తకాలు మాత్రమే చదవమంటే పిల్లలకూ అంతే నరకంగా ఉంటుంది. విద్య అనేది అందరికీ దొరికే అవకాశం. కాని వినోదం, ఆహ్లాదం, విజ్ఞానం కలిగించే బాలల సాహిత్యం చదవడమే పిల్లలకు జీవితం అంటే ఏమిటో తెలియచేస్తాయి. మనం మాత్రం కాల్పనిక సాహిత్యం చదువుతూ పిల్లలను స్కూలు పుస్తకాలకు వదిలిపెట్టడంలో ఔచిత్యం ఏమిటో మీరే ఆలోచించండి’ అన్నారు సైమన్ జాకస్. కెనడాలో పిల్లల పుస్తకాల పబ్లిషర్‌గా ప్రసిద్ధి పొందిన జాకస్ ప్రస్తుతం ఆ దేశంలో బాలల వికాసం కోసం పుస్తకాలు అందుబాటులోకి తేవడానికి చేస్తున్న ప్రయత్నాలను చెప్పారు– ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్’ (సి.ఐ.బి.ఎఫ్)లో. ఈ ఉత్సవం జనవరి 16–18 తేదీల్లో జరిగింది. తమిళ సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి, ఇతర భాషల సాహిత్యాన్ని తమిళంలోకి తీసుకురావడానికి పబ్లిషర్ల మధ్య ఒడంబడికలు చేసే ప్రత్యేక పుస్తక ఉత్సవం ఇది. ‘కెనడాలో ఇప్పుడు ప్రతి క్లాస్‌లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నారు. స్కూలు పుస్తకాలు కాకుండా పిల్లలు ఈ సాహిత్య పుస్తకాలను ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవచ్చు. బాల సాహిత్యం కోసం వారికి తెలియాల్సిన అన్ని విషయాలను కథలుగా రాయించి అందుబాటులోకి తెస్తున్నాం. ఉదాహరణకు ఊహ తెలిశాక దత్తతకు వచ్చిన పిల్లవాడు తన అంతర్మథనాన్ని అర్థం చేసుకునే పుస్తకం కూడా సాహిత్యరూపంలో పెడుతున్నాం’ అన్నారాయన.అంతర్జాతీయ ఉత్సవాలు‘భారతదేశంలో కోట్లమంది బాలలు ఉన్నారు. కాని బాల సాహిత్యం తగినంత అందుబాటులో లేదు. పిల్లలను సినిమాకు తీసుకెళతారుగాని వారికి పుస్తకాలు కొనివ్వరు తల్లిదండ్రులు. కాని ప్రపంచ దేశాలు ఇప్పుడు కేవలం పిల్లలకు సాహిత్యం అందించే ప్రయత్నంలో ఉన్నాయ’ని అన్నారు సి.ఐ.బి.ఎఫ్లోపాల్గొన్న పబ్లిషర్లు. ఇటలీలోని బొలొనియా నగరంలో రాబోయే మార్చిలో ‘బొలొనియా అంతర్జాతీయ పిల్లల పుస్తక ప్రదర్శన’ జరుగుతుంది. దీని నిర్వాహకురాలు జాక్స్ థామస్ కూడా ఈ వేదిక మీదపాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ‘బొలొనియా చిల్డ్రన్స్ బుక్ఫెయిర్లో ప్రపంచ దేశాల బాలల రచయితలు, పబ్లిషర్లు, చిత్రకారులుపాల్గొంటారు. ఒక దేశ రచయితలు మరో దేశ పబ్లిషర్లతో ఒడంబడికలు చేసుకుంటారు.ఇటలీ రచయిత, జపాన్ పబ్లిషర్, రష్యన్ చిత్రకారుడు కలిసి ఒక పుస్తకం తయారు చేసే ఆలోచన చేయడం ఇక్కడ కనిపిస్తుంది. అదొక పిల్లల ప్రపంచం. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ తమ పుస్తకాలు ప్రదర్శనకు పెడుతోంది. ఇలా ప్రతి భారతీయ భాష నుంచి జరగాలి’ అని అన్నారు. బొలొనియా బాలల బుక్ ఫెయిర్ జరిగినంత ఘనంగా షాంఘైలో ప్రతి నవంబర్‌లో పిల్లల బుక్‌ఫెయిర్ జరుగుతుంది. ఎక్కడ చూసినా బాల సాహిత్యమే కనపడుతుంది అక్కడ. కాని మన దేశంలో ‘అడవిలో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది’ అనే వాక్యం చదివి దానికి తగ్గ బొమ్మను చూస్తే పిల్లల్లో కలిగే ఊహను మనవాళ్లు ఏమాత్రం అనుమతించడం లేదు. మార్కులు కావాలి మన తల్లిదండ్రులకు.లైంగిక చైతన్యం‘నేనొక కథ రాశాను. ఆ కథను చాలా స్కూళ్లలో లైంగిక చైతన్యంలో భాగంగా చదివి వినిపిస్తున్నారు. స్కూల్లో ఆపాఠం విన్న ఒక పిల్లవాడు నాకు ఫోన్ చేశాడు. అంకుల్... నన్ను ఒకతను అబ్యూజ్ చేశాడు. ఆ రోజు నుంచి ఆ తప్పు చేసింది నేనే అనే భావనతో నలిగిపోతున్నాను. కాని మీ కథ చదివాక తప్పు చేసింది ఆ వ్యక్తి అని, నేను బాధితుణ్ణి అని తెలుసుకున్నాను. నా బాధపోయింది. నన్ను బాధ పెట్టినవాడి గురించి ఇప్పుడు మా ఇంట్లో చెప్పగలను– అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. బాల సాహిత్యం ఏం చేస్తుందంటే ఇదంతా చేస్తుంది’ అన్నారు మరో రచయిత బాల భారతి.టీనేజ్ పిల్లలకు పుస్తకాలు లేవుచెన్నై బుక్ ఫెయిర్‌లో ప్రసిద్ధ బాలసాహిత్య ప్రచురణ సంస్థ ‘తులిక బుక్స్’ ఎడిటర్ ప్రియ కృష్ణన్పాల్గొన్నారు. ‘పది పన్నెండేళ్ల వయసున్న పిల్లలు చదవదగ్గ పుస్తకాలు ఇప్పుడు లేవు. ఈ విషయంలో చాలా కొరత ఉంది. పిల్లలు పుస్తకాలు చదవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని మనకు బాలల రచయితలు, ప్రచురణ కర్తలు, బాల సాహిత్యానికి బొమ్మలు వేసే చిత్రకారులు చాలా తక్కువగా ఉన్నారు. అందరం పూనుకొని శ్రద్ధపెట్టకపోతే పిల్లలు సెల్ఫోన్లలో కనిపించే డిజిటల్ ప్రపంచంలో తప్పిపోతారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లలకు మనోవికాసం, సమాజాన్ని ఎదుర్కొనే దిలాసా కలగాలంటే సాహిత్యం వల్ల కలుగుతుంది. చిన్న విషయాలకే పిల్లలు ఎందుకు కలత పడుతున్నారో అర్థం చేసుకుంటే ప్రతి తల్లిదండ్రులు వారి చేతుల్లో ఇవాళే పుస్తకాలు పెట్టగలరు. – సాక్షి ప్రతినిధితల్లిదండ్రులతో వెళ్లొద్దు‘మన దేశంలో కొన్ని నగరాల్లో బుక్‌ఫెయిర్‌లు జరుగుతుంటాయి. పిల్లల్ని తల్లిదండ్రులు ఆ బుక్ఫెయిర్లకు తీసుకువెళతారు. కాని పిల్లలు ఇలాంటి వాటికి తల్లిదండ్రులతో వెళ్లకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు నేరుగా వారిని తీసుకెళ్లి కలెక్టర్ కావడం ఎలా వంటి పుస్తకాలు కొనిపెడతారు. దయచేసి వాళ్లకు డబ్బు ఇచ్చి వదిలిపెట్టండి. ఏం కావాలో అది కొనుక్కోనివ్వండి. అదొక్కటే కాదు... పిల్లల పుస్తకాలు అత్యంత తక్కువ ధరకు దొరికే ఏర్పాటు చేయాలి. ఆ పుస్తకాన్ని ఆశించిన ఏ ఒక్క పిల్లవాడు కూడా అది దక్కలేదని నిరాశపడకూడదు’ అన్నారు రచయిత నటరాజన్. ఆయన బాలల కోసం 120కి పైగా పుస్తకాలు రాశారు. -
విమానాశ్రయాలలో భద్రత పెంపు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని చైన్నెతోపాటూ ఇతర నగరాలలో ఉన్న విమానాశ్రయాలలో భద్రతను ఐదు అంచెలకు పెంచారు. విమానాశ్రయాలు, పరిసరాలలో 30వ తేదీ వరకు పలు రకాల నిబంధనలతో ఆంక్షలు విధించారు. ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థిలలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లపై పోలీసుల ఽఅధికారులు దృష్టి పెట్టారు. అదే సమయంలో చైన్నెలోని అంతర్జాతీయ విమానాశ్రయం, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై విమానాశ్రయాలలనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.తూత్తుకుడి, సేలంలోని స్వదేశీ విమానాశ్రయాలను భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. విమానాశ్రయాలలో సాధారణంగా ఉన్న భద్రతతో పాటూ అదనంగా ఐదు అంచెల భద్రతను పెంచారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతిస్తున్నారు. అలాగే చైన్నె, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తూత్తుకుడి, తిరునల్వేలి, విల్లుపురం తదిత ర రైల్వే స్టేషన్లను నిఘాపెంచారు. విమానశ్రయం పరిసరాలలో కేంద్ర బలగాలు, వెలుపల రాష్ట్ర పోలీసులు భద్రతా విధులలో ఉన్నారు. సందర్శకులకు ఆంక్షలు విధించారు. విమానాశ్రయం రన్ వే మార్గం జీఎస్టీ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ఈ మార్గంలో ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. అలాగే, రైల్వే స్టేషన్ల వద్ద సైతం భద్రతను పెంచారు.రిహార్సల్స్..మెరీనా తీరంలో రిపబ్లిక్ డే వేడుకల కసరత్తులు మొదలయ్యాయి. కామరాజర్ సాలైలో సోమవారం నుంచి రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. త్రివిధ దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు, పోలీసు శాఖ, వివిధ కళాశాలల విద్యార్థులు రిహార్సల్స్ రూపంలో ఉదయాన్నే తమ ప్రదర్శనలు చేశారు. పోలీసులు, త్రివిధ దళాల కవాతులు అబ్బుర పరిచాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈసారి వేడుకలలో పలు రాష్ట్రాల సంస్కృతులను చాటే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ రిహార్సల్స్ జరిగే సమయాలలో కామరాజర్ సాలై , పరిసరాలలో ఉదయాన్నే ట్రాఫిక్ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి
-
క్యారమ్స్ కాశీమా
పైన లైట్ బల్బు వెలుగుతుండగా... ఆ కాంతిలో...క్యారమ్ బోర్డ్‌పై ‘టప్’ ‘టప్’ అంటూ శబ్దాలు వినిపించేవి. లక్ష్యాన్ని ఛేదించడం నుంచి ఛేదించక పోవడం వరకు ఆ శబ్దాలలో ఎన్నో అర్థాలు ఉండేవి. ఆ అర్థాలను ఔపాసన పట్టింది చెన్నైకి చెందిన కాశీమా. ‘క్యారమ్స్’ కుటుంబ ఆట అంటారు. ఆ ఆటలోని రెడ్, వైట్, బ్లాక్ కాయిన్స్, స్ట్రైకర్... కాశీమాకు కుటుంబ సభ్యులు అయ్యాయి. వాటితో అనుబంధం ఆమెను క్యారమ్స్ ప్లేయర్‌గా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.ఆరు సంవత్సరాల వయసు నుంచి కాశీమా క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టింది. కుమార్తె క్యారమ్స్‌లో చూపుతున్న ప్రతిభకు సంబరపడిపోయేవాడు తండ్రి మెహబూబ్ బాషా.ఉత్తరచెన్నై పరిధిలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కాశీమాను ఆడించే వాడు బాషా. కప్పులు గెలుచుకోవడం సంగతి ఎలా ఉన్నా ఇరుగు, ΄÷రుగు, బంధువులు ‘అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్లవచ్చా? ఇది పద్ధతేనా!’ అనేవారు. అయితే మెహబూబ్ వారి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ‘వారి మాటలు పట్టించుకోవద్దు. క్యారమ్స్‌లో నువ్వు పెద్దపేరు తెచ్చుకోవాలి’ అంటూ కూతుర్నిప్రోత్సహించేవాడు బాషా.గల్లీనుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న కాశీమా జాతీయ స్థాయిలో పదికి పైగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించింది. కాశీమా ప్రతిభ అర్జున అవార్డు గ్రహీత మరియా ఇరుదయం దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కాశీమాకు వచ్చింది.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో జరిగిన 6వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీలలో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి పాల్గొన్న కాశీమా సింగిల్స్, డబుల్స్, గ్రూప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించి క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అమెరికాకు వెళ్లడానికి ముందు వీసా రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో కాశీమా పడిన బాధ ఇంతా అంతా కాదు. ‘నేను కచ్చితంగా అమెరికాకు వెళ్లాలి. వెళ్లడమే కాదు పతకాలు సాధించాలి’ అని గట్టిగా అనుకుంది. పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికాలో అడుగుపెట్టిన కాశీమా ఏకంగా మూడు స్వర్ణాలతో క్యారమ్స్ విశ్వవిజేతగా చెన్నైలో అడుగు పెట్టింది. ఆటకు అడ్డుపడే విధంగా విమర్శలు చేసిన వారే కాశీమాకు చెన్నైలో బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆమె విజయానికి మరింతప్రోత్సాహాన్నిస్తూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే ఆమెకు కోటి రూపాయల చెక్ అందజేశారు. ‘క్యారమ్స్’ అనేది జీవితంలాంటిది. కాయిన్స్ లక్ష్యాలు అనుకుంటే ‘స్టైకర్’ అనేది ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలాంటిది. స్ట్రైకర్ మీద పట్టు ఉన్న కాశీమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.నాన్న కల సాకారం చేస్తానుక్యారమ్స్ ఆడుతుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు కొత్తశక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తే నన్ను చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట మురికివాడ నుంచి అమెరికా వరకు తీసుకువెళ్లింది. ‘క్యారమ్స్ ఆకాడమీ’ ఏర్పాటు చేసి మురికివాడలోని పేద పిల్లలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనేది నాన్న కల. ఆయన కల నెరవేర్చాలని ఉంది.– కాశీమా – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
సింధు లోయ లిపిని పరిష్కరిస్తే 10 లక్షల డాలర్ల నజరానా
చెన్నై: శతాబ్ద కాలానికి పైగా అపరిష్కృతంగా మిగిలి పోయిన సింధు నదీ లోయ నాగరికత కాలం నాటి లిపిని పరిష్కరించిన వారికి 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సింధూ నాగరికతను వెలుగులో వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఆయన చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్..ఒకప్పుడు విలసిల్లిన సింధు లోయ నాగరికతకు చెందిన లిపిని ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరూ అర్థం చేసుకో లేకపోయారని పేర్కొన్నారు. లిపిని పరిష్కరించేందుకు ఇప్పటికీ పండితులు ప్రయత్ని స్తూనే ఉన్నారన్నారు. ఈ దిశగా కృషి చేసి, విజయం సాధించిన వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సా హంగా 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. -
50 పైసలకు టీ అమ్ముకునే మహిళ..రూ. 100 కోట్లకు అధిపతిగా!
స్వతంత్రంగా జీవించాలని, సొంతకాళ్లపై నిలబడాలనే ఆలోచన ఒక మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అదీ కష్టాల్లో ఉన్న మహిళ ధైర్యంగా, ఆర్థికంగా ఉన్నతంగా బతకాలని నిర్ణయించుకుంటే మాత్రం తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ధీరగా నిలబడుతుంది. బీచ్‌లో కాఫీ, టీ అమ్ముకునే స్థాయి నుంచి రెస్టారెంట్ల సారధిగా ఎదిగిన పెట్రిసియా నారాయణ్ అనే మహిళ సక్సెస్ జర్నీ అలాంటిదే. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి!తమిళనాడులోని నాగర్‌కోయిల్ ప్రాంతంలో జన్మించారు ప్యాట్రిసియా థామస్ 17 ఏళ్ల వయస్సులోనే నారాయన్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కలిగారు. కానీ కాల క్రమంలో ఆమె కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. ఆమె భర్త మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌కి భావిసగా మారిపోయాడు. జీవితం దుర్భరమైపోయింది. డబ్బుల కోసం భర్త వేధించేవాడు. సిగరెట్లతో కాల్చేవాడు. అందిన డబ్బులు తీసుకుని నెలల తరబడి అదృశ్యమయ్యేవాడు. ఇక అతనిలో మార్పురాదని గ్రహించింది. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు అదృష్టవశాత్తూ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆసరాగా నిలబడ్డారు.తల్లి ఇచ్చిన ఆర్థిక బలానికి పెట్రిసియా నారాయణ్ దృఢ సంకల్పం తోడైంది. వంటపై ఉన్న ఆసక్తినే వ్యాపారంగా మార్చుకుంది. పచ్చళ్లు, జామ్ లు వంటివి సిద్ధం చేసి విక్రయించటం ప్రారంభించింది. మంచి ఆదరణ లభించింది. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. విభిన్నంగా ఆలోచించింది. పచ్చళ్లు, జామ్‌ల వ్యాపార లాభాలను మరో వ్యాపారంలో పెట్టాలని భావించింది. అంతే క్షణం ఆలోచించకుండా చెన్నై మెరీనా బీచ్‌లో టీ, కాఫీ, జ్యూస్, స్నాక్స్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 పైసలకు కాఫీ, టీ అమ్మింది. మెుదటి రోజు కేవలం ఒక్క కాఫీ మాత్రమే అమ్ముడు బోయింది. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అంతే తర్వాతి రోజు పుంజుకున్న వ్యాపారం రూ.700కి చేరింది. మెనూలో శాండ్విచ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్‌క్రీమ్‌లను కూడా చేర్చింది. స్నాక్స్, ఫ్రెష్ జ్యూస్, కాఫీ, టీ అమ్మడంలో ఆమెకు సహాయం చేయడానికి ఇద్దరు వికలాంగులను నియమించుకుంది. మెరీనా నే బిజినెస్ స్కూల్,అదే నా ఎంబీయే అంటారు ప్యాట్రిసియా. అలా తన సొంత వ్యాపారంతో కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో 1998లో సంగీత గ్రూప్ నెల్సన్ మాణికం రోడ్ రెస్టారెంట్‌కి డైరెక్టర్ అవకాశాన్ని పొందటంతో జీవితం మలుపు తిరిగింది.2002లో భర్త మరణించాడు. రెండేళ్ల తర్వాత కూతురు, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో దివంగత కుమార్తె జ్ఞాపకార్థం, కుమారుడుతో కలిసి తొలి రెస్టారెంట్ 'సందీప'ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచీ, ఆ హోటలే తన కుమార్తెగా మారిపోయింది. అంత జాగ్రత్తగా దాన్ని ప్రేమించి పోషించింది. కట్ చేస్తే..సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ చెన్నైలో కొత్త బ్రాంచీలతో విస్తరించింది. ప్రస్తుతం పెట్రిసియా నారాయణ్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఆమె 14 వివిధ ప్రాంతాల్లో 200 మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తున్న ఆమె సక్సెస్ జర్నీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. 2010లో 'FICCI ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. సైకిల్ రిక్షా, ఆటో రిక్షానుంచి సొంతకారుకు తన జీవితం మారిందనీ, రోజుకు 50 పైసలు ఆదాయం రోజుకు రూ. 2 లక్షలకు పెరిగింది. ఇద్దరు వ్యక్తులతో మొదలైన తన వ్యాపారం 200 వందలకు చేరిందని గర్వంగా చెప్పుకుంటారు ప్యాట్రిసియా . ఇదీ చదవండి : నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ! -
సాయి పల్లవి కు ఉత్తమ నటిగా మరో అవార్డ్
-
భార్యపై కోపం.. రెండు బస్తాల నాణేలతో కోర్టుకు భర్త.. తర్వాత ఏమైందంటే..
సాక్షి, చైన్నె: తన భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ. 2 లక్షలు మొత్తాన్ని చిల్లరగా 20 బస్తాలలో కోర్టుకు ఓ భర్త గురువారం తీసుకొచ్చాడు. ఈ చిలర్ల చూసి షాక్‌కు గురైన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ చిల్లర మొత్తాన్ని నోట్లుగా మార్చి సమర్పించాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన దంపతులు గతంలో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు రాగా, తనకు భరణం ఇప్పించాలని ఆ భార్య కోర్టుకు విన్నవించారు. దీంతో, న్యాయమూర్తి ఆ భర్తకు ఆదేశాలు ఇచ్చారు. రూ. 2 లక్షలు భరణం అందజేయాలని సూచించారు. దీనిని ముందే గ్రహించిన ఆ భర్త వినూత్న ప్రయోగం చేసి కంగు తిన్నాడు. తన భార్య మీదున్న కోపంతో కోర్టు నుంచి బయటకు వెళ్లి తన కారులో ఉన్న బస్తాలు ఒకొక్కటిగా తీసుకొచ్చి పెట్టారు. అనంతరం, 20 బస్తాలను కోర్టులో ఉంచి, ఇదిగోండి రూ. 2 లక్షలు అంటూ సూచించాడు. న్యాయమూర్తి ప్రశ్నించగా, రూ. 80 వేలకు ఒక్క రూపాయి నాణెలు, మిగిలిన మొత్తం రూ. 5 ,రూ. 10, రూ. 20 నాణేలు అంటూ వివరించాడు. దీనిని విన్న అక్కడున్న వారంతా అవ్వాక్కయారు. ఇతడు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న జడ్జి మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈచిల్లరను నోట్లుగా మార్చి తీసుకొచ్చి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ భర్త చిల్లర బస్తాలను కోర్టు నుంచి మళ్లీ తన కారు వద్దకు మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కోయంబత్తూరుకోర్టు ఆవరణలో సర్వత్రా హాస్యాన్ని పంచినట్లయ్యింది. విచారణ వాయిదా పడడంతో చిల్లర బస్తాలతో ఆ భర్త తాను వచ్చిన కారులోనే వెళ్లియాడు. -
‘అప్పుడే డిసైడ్ అయ్యాను’.. రోహిత్ అలా.. అశ్విన్ ఇలా!
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. అశూ అన్న చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న సమయంలో సమయంలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు మేళతాళాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.టీమిండియా క్రికెటర్‌గా మాత్రమేబ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగానే తాను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు అశ్విన్ తెలిపాడు. ఏదేమైనా క్రికెటర్ అశ్విన్‌గా తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని.. టీమిండియా క్రికెటర్‌గా మాత్రమే తన ప్రస్థానం ముగిసిందని పేర్కొన్నాడు. వీలైనంత కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తానని అశూ తెలిపాడు.‘‘చాలా మందికి ఇదొక భావోద్వేగ సమయం. బహుశా నా మనఃస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. అయితే, నేను ఇప్పుడు పూర్తి సంతృప్తితో ఉన్నాను. రిటైర్మెంట్ విషయం చాలా రోజులుగా నా మదిలో తిరుగుతూనే ఉంది. అయితే, బ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట జరుగుతున్నపుడు నేను నిర్ణయం తీసుకున్నా.జీరో రిగ్రెట్స్ఇదేమీ నా జీవితంలో అతిపెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను ఇకపై కొత్త దారిలో ప్రయాణిస్తాను’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా ఒక్కసారి కూడా అవకాశం రానందుకు బాధపడుతున్నారా అని విలేకరులుగా అడగా.. ‘‘నాకు ఎలాంటి విచారం లేదు. జీరో రిగ్రెట్స్.జీవితం, కెరీర్ పట్ల విచారంతో ఉండే వ్యక్తులను నేను దూరంగా ఉండి చూశాను. కానీ నా లైఫ్‌లో అలాంటివేమీ లేవు’’ అని అశ్విని తమ మనసులోని భావాలను వెల్లడించాడు. ఇక 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచినపుడు తనకు ఘన స్వాగతం లభించిందని.. ఇప్పుడు మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారంటూ అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.రోహిత్ అలా.. అశూ ఇలాకాగా తాను పెర్త్‌కు చేరుకున్నపుడే అశూ రిటైర్మెంట్ విషయం తెలిసిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పగా.. అశూ మాత్రం బ్రిస్బేన్‌లోనే తాను డిసైడ్ అయ్యానని చెప్పడం గమనార్హం.కాగా 2010లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు అశ్విన్. తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం.సీఎస్కే తరఫునఇదిలా ఉంటే.. వన్డేల్లో 707 పరుగులు సాధించిన అశ్విన్.. టీ20లలో 184 రన్స్ రాబట్టాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు(బ్రిస్బేన్) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇకపై అశూ క్లబ్ క్రికెట్‌కే పరిమితం కానున్నాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తరఫున అతడు ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలం-2025లో చెన్నై ఫ్రాంఛైజీ.. అశూను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్ శర్మతో అశ్విన్The countless battles on the field are memorable ❤️But it's also moments like these that Ashwin will reminisce from his international career 😃👌 Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc— BCCI (@BCCI) December 19, 2024 -
కోటీశ్వరుడిగా గుకేశ్.. ప్రైజ్‌మనీపై స్పందించిన వరల్డ్ చాంపియన్
కఠిన శ్రమ, అంకిత భావం ఉంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని దొమ్మరాజు గుకేశ్ నిరూపించాడు. పద్దెమినిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, గుకేశ్ ఈ ఘనత సాధించడంతో అతడి తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారిలది కీలక పాత్ర.కోటీశ్వరుడిగా గుకేశ్ఇక వరల్డ్ చాంపియన్‌గా గుకేశ్ రూ. 11.45 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన విజయంతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన ఈ గ్రాండ్ మాస్టర్‌కు తమిళనాడు ప్రభుత్వం ఏకంగా రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుకేశ్ కోటీశ్వరుడైపోయాడు.నా తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఇకపైఈ విషయం గురించి గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రైజ్‌మనీ నాకు ఎంత ముఖ్యమైనదో మాటల్లో చెప్పలేను. అయితే, డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. నిజానికి నేను చెస్ ఆడటం మొదలుపెట్టినపుడు మా కుటుంబం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి... నా తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు.అయితే, ఇప్పుడు కాస్త మేము సౌకర్యవంతంగా జీవించగలుగుతాం. ఇకపై వాళ్లు దేనికీ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తనకు తెలిసింది కొంతేనని.. ఇంకా నేర్చుకోవాల్సి ఎంతో ఉందంటూ గుకేశ్.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటానని చెప్పకనే చెప్పాడు.అప్పుడే మా అమ్మకు సంతోషంఇక తన తల్లి తనకు గొప్ప చదరంగ ఆటగాడిగా కంటే.. గొప్ప మనిషిగా గుర్తింపు వచ్చినపుడే ఎక్కువ సంతోషిస్తానని చెప్పిందని ఈ సందర్భంగా గుకేశ్ వెల్లడించాడు. కాగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న నాలుగు రోజుల తర్వాత గుకేశ్ స్వదేశంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ నుంచి అతడు సోమవారం చెన్నైకి చేరుకున్నాడు.పుట్టి పెరిగి ఆటలో ఓనమాలు చేర్చుకున్న గడ్డపై విశ్వ విజేత హోదాలో గుకేశ్‌కు సోమవారం భారీ స్థాయిలో ఘన స్వాగతం లభించింది. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ప్రతినిధులు, తమిళనాడు రాష్ట్ర అధికారులతో పాటు అతను చదువుకున్న వేలమ్మాల్ స్కూల్ విద్యార్థులు, వర్ధమాన చెస్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో గుకేశ్‌కు వెల్కమ్ చెప్పారు. అతని ఫోటోలు, ఇతర చెస్ చిత్రాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంలో ఈ యువ చాంపియన్ విమానాశ్రయం నుంచి ముందుగా తన ఇంటికి వెళ్లాడు. ఆపై వేలమ్మాల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారి అతని వెంట ఉన్నారు. ఇక మంగళవారం గుకేశ్‌కు స్థానిక కలైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ప్రత్యేక సన్మానం జరిగే అవకాశం ఉంది. ఇదే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొని ఇప్పటికే ప్రకటించిన రూ.5 కోట్ల బహుమతి పురస్కారాన్ని గుకేశ్‌కు అందించనున్నారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం వల్లే‘నాకు మద్దతు పలికిన అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి సహకారం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వరల్డ్ చాంపియన్‌గా నిలవడం చాలా గొప్పగా ఉంది. భారత ఆటగాడు మరోసారి విశ్వ విజేత కాగలిగాడు. నా ఈ విజయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఎంతో ఉంది. గత ఏడాది గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ నిర్వహించి నాకు స్పాన్సర్షిప్ అందించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు.అక్కడ గెలవడంతో క్యాండిడేట్స్ విజయానికి పునాది పడింది. ఇలాంటి సహకారం ఉంటే రాష్ట్రం నుంచి మరెంతో మంది ఆటగాళ్లు పైస్థాయికి చేరతారు. ఈ రోజు లభించిన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాబోయే కొన్ని రోజులు కలిసి సంబరాలు చేసుకుందాం’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు.ఆయన సహకారం మరువలేనిదితన చాంపియన్‌షిప్ విజయంపై స్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానిస్తూ... ‘చెస్‌లో విజయం అంటే బాగా ఆడితేనే సరిపోదు. ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. దానిని అధిగమించాలి. అందుకే మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సహకారం తీసుకున్నాను. ఆయనతో కలిసి పని చేయడం నాకు కలిసొచ్చింది’ అని వెల్లడించాడు. కాగా ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన గుకేశ్ తండ్రి కుమారుడి ప్రయాణంలో తోడుండేందుకు తన వృత్తిని త్యాగం చేయగా.. తల్లి పద్మాకుమారి ఉద్యోగం(మైక్రోబయాలజిస్ట్) చేస్తూ కుటుంబాన్ని పోషించారు. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
చెన్నైకి చేరుకున్న గుకేశ్.. వరల్డ్ చాంపియన్ భావోద్వేగం
ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చదరంగ రారాజు హోదాలో తొలిసారి భారత్‌లో అడగుపెట్టాడు. ఈ వరల్డ్ చాంపియన్ సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారుఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, జాతీయ చెస్ సమాఖ్య ముఖ్యులు, అభిమానులు గుకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా... గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డ మీద తిరిగి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మీ అభిమానం, మద్దతు చూసిన తర్వాత.. భారత్‌కు ఈ విజయం ఎంతటి గొప్ప అనుభూతిచ్చిందో నాకు మరింతగా అర్థమైంది. మీరంతా అత్యద్భుతం. నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా భారత్ తరఫున వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా పద్దెమినిదేళ్ల గుకేశ్ చరిత్రకెక్కాడు. చెన్నైకే చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన చెస్ ప్లేయర్‌గానూ రికార్డు సాధించాడు. సింగపూర్ సిటీలో ఇటీవల జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించిడిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు. 32 ఏళ్ల లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజేతగా అవతరించాడుభారీ నజరానాఈ నేపథ్యంలో దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్ 13 లక్షల 50 వేల డాలర్ల(రూ.11.45 కోట్లు) ప్రైజ్‌మనీ పొందాడు. ఇక తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన గుకేశ్‌ను కొనియాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్‌కు రూ. ఐదు కోట్ల క్యాష్ రివార్డు అందచేస్తామని తెలిపారు. చదవండి: WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి#WATCH | Chennai, Tamil Nadu: World Chess Champion #GukeshD says, "I am very glad to be here. I could see the support that and what it means to India...You guys are amazing. You gave me so much energy..." pic.twitter.com/iuFXDiLcjx— ANI (@ANI) December 16, 2024 -
తమిళనాడు: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పలువురు మృతి
చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారి సహా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని దిండిగుల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా మొదట ఆసుపత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అనంతరం, భవనం మొత్తానికి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో, ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన, అస్వస్థతకు గురైన రోగులను 50 అంబులెన్స్‌ల సాయంతో ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.#TamilNadu : #HospitalFireAt least 6 people, including a child and 3 women died and 6 others were injured, after a #fire broke out at a four-story private Hospital in #Dindigul on Thursday night.Reportedly the victims succumbed to suffocation caused by the thick #smoke that… pic.twitter.com/2Iac9Qt5Gh— Surya Reddy (@jsuryareddy) December 12, 2024 -
వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ : టాప్-5లో ముంబై, అయ్యో హైదరాబాద్!
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం నగరం జాబితాలో వాణిజ్య రాజధాని టాప్ -5లో చోటు దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన తాజా లిస్టును ప్రకటించింది. వాటిలో అనేక స్థానాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ముంబై నగరం టాప్ప్లేస్కి ఎగబాకగా హైదరాబాద్, 50వ స్థానానికి పడిపోయింది.ముంబై ప్రపంచంలో 5వ అత్యుత్తమ ఆహార నగరంగా నిలిచింది. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ఫుడ్ గైడ్ వివిధ వర్గాలలో ర్యాంకింగ్‌లను విడుదల చేసింది."ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల" జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది.తొలి నాలుగు స్థానాలకు ఇటలీలోని నగరాలు చోటు సంపాదించాయి. నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్ , ఒసాకా టాప్ 10లో ఉన్న నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి, వాటిలో మూడు ముంబైతో పాటు టాప్ 50లోకి వచ్చాయి. అమృత్సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచాయి. కోల్‌కతా 71వ స్థానంలో ఉండగా, చెన్నై 75వ స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) అలాగే టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల ర్యాంకింగ్‌ను కూడా ప్రకటించింది. భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ మెరుగ్గానే ఉందని తెలిపింది. కాగా గత ఏడాది ఈ జాబితాలో ముంబై35, హైదరాబాద్ 39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలోనూ, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లోనూ నిలిచాయి. -
భారత్ తొలి హైపర్‌లూప్ ట్రాక్ సిద్ధం
చెన్నై: భారత రవాణా రంగంలో మరో కలికితురాయి. ఐఐటీ మద్రాస్,భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఐఐటీ చెన్నైలోని తైయూర్ క్యాంపస్‌లో 410 మీటర్ల హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. భారత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ (410 మీటర్లు) పూర్తయింది. రైల్వేస్, ఐఐటీ-మద్రాస్ ఆవిష్కార్ హైపర్‌లూప్ బృందం,ఓ స్టార్టప్ సంస్థ భాగస్వామ్యంలో ఈ హైపర్ లూప్‌ను నిర్మించినట్లు చెప్పారు. హైపర్ లూప్ టెక్నాలజీహైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. ఇప్పుడి హైపర్‌లూప్ ట్రాక్‌ను టెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగావెళ్లొచ్చు. ఈ హైపర్‌లూప్ ఈ పద్దతిపై ట్రయల్ రన్ చేస్తారు. -
మొదట్లో లోన్లే దొరకలే, కట్ చేస్తే : రూ. 2వేలతో మొదలై రూ. 125 కోట్లకు
ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ముందుగా అందరికీ గుర్తొచ్చే అమ్మమ్మ నాన్నమ్మలే. వారి చేతి వంట మహిమ అలాటిది మరి. కరియర్ కోసం సప్త సముద్రాలు దాటి ఈ తరం పిల్లలు చాలామంది ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చెన్నైకు చెందిన దంపతులకు ఒక ఐడియా వచ్చింది. దీనికి బిజినెస్‌లో రాణించాలన్న అమ్మమ్మ కుతూహలం కూడా తోడైంది. ఇంకేముంది జానకి పాటి వంటలు ఖండాంతరాలు దాటి రుచులను పంచుతున్నాయి. రూ.2 వేలతో మొదలైన వ్యాపారం రూ.125 కోట్లకు చేరుకుంది. స్వీట్ కారం కాఫీ(ఎస్కేసీ) సక్సెస్ స్టోరీ గురించి తెలుసు కుందాం రండి! చెన్నైలో ఉండే ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు. చాలా సందర్బాల్లో అమ్మమ్మ జానకి వంటకాలను ఆస్వాదించ లేకపోతున్నామే అని బాధపడేవారు. చివరికి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తొలుత సుముఖత చూప లేదు. దీంతో ఇంట్లోనే ఒక చిన్న గదిలో కొద్ది పెట్టుబడితో ప్రారంభించారు.అలా 2015లో ఆనంద్ భరద్వాజ్ , నళిని పార్థిబన్ కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్‌లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. ప్రచారం కోసం స్వయంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ జంతికలు జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను పరిచయం చేశారు. ఇక అంతే వెనుదిరిగి చూసింది లేదు. అమ్మమ్మ చేతి వంట అందరికీ తెగ నచ్చేసింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా మొదలైన ప్రయాణం వారు కూడా ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాలకు విస్తరించింది. కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను కొన్ని ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా కూడా విక్రయాలను కొనసాగిస్తోంది. అలాగే సొంత వెబ్సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. View this post on Instagram A post shared by Sweet Karam Coffee - Experience South India (@sweetkaramcoffee_india) “నేను ఎప్పటికప్పుడు వంటలన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తాను. ఎక్కడా రాజీ పడను. ప్రతిదీ ప్రేమగా శ్రద్ధగా, శుభ్రంగా, రుచిగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా సొంతం కుటుంబంకోసం చేసినట్టే చేస్తాను’’ అంటారు జానకి పాటి. అంతేకాదు పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఈమె చాలా పాపులర్. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని చెబుతారు గర్వంగా. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తూ, ముదిమి వయసులో కూడా ఆనందంగా గడపడం ఎలాగో చెప్పకనే చెబుతోందీ అమ్మమ్మ. -
ఎస్జే సూర్యకు గౌరవ డాక్టరేట్.. కారణం ఇదే
కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్జే సూర్యకు చెన్నైలోని 'వేల్స్ విశ్వవిద్యాలయం' గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ 15వ స్నాతకోత్సవ వేడుక ఈరోజు (డిసెంబర్ 1) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇందులో సుమారు 5 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధక విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.దర్శకుడు, నటుడు, నిర్మాత, గీత రచయిత, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్.జె.సూర్యను గౌరవ డాక్టరేట్‌తో 'వేల్స్ విశ్వవిద్యాలయం' సత్కరించింది. 25 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ గుర్తిస్తూ ఈ గౌరవాన్ని కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులను ఒలింపిక్ క్రీడల్లో ప్రపంచ వేదికపై విజయం సాధించేలా మార్గనిర్దేశం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా గౌరవ డాక్టరేట్ లభించింది. వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గతేడాదిలో రామ్ చరణ్ డాక్టరేట్‌ను పొందిన విషయం తెలిసిందే.దర్శకుడిగా కాస్త విరామం తీసుకున్న ఎస్జే సూర్య తమిళ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే బిగ్ హిట్‌గా నిలిచిన 'ఖుషి' చిత్రానికి ఆయన డైరెక్షన్ చేశారు. ఒక రకంగా ఈ సినిమాతోనే పవన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 2001లో విడుదలైన ఈ సినిమా టేకింగ్ చేసిన తీరుకు ఎస్జే సూర్య పట్ల చాలామంది ఫిదా అయిపోయారు. -
వణికించే చలిలో వరదలు..చెన్నైని చెల్లాచెదురు చేసిన ‘ఫెంగల్’(ఫొటోలు)
-
Cyclone Fengal: ఏటీఎంకు వెళ్లి వ్యక్తి మృతి
చెన్నై: ఫెంగల్ తుపానుతో తమిళనాడు అతలాకుతలం అవుతున్న వేళ.. చెన్నైలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడానికి వెళ్లిన ఓ యువకుడు.. శవమై వరద నీటిలో తేలుతూ కనిపించాడు.తుపాను కారణంగా చెన్నై సహా తమిళనాడు అంతటా కుండపోత కురుస్తోంది. ఈ క్రమంలో ఓ ఏటీఎంలో వరద నీరు చేరింది. అయితే అది గమనించకుండా లోపలికి వెళ్లిన ఓ వ్యక్తి.. కరెంట్ షాక్ కొట్టి మృతిచెందాడు. ఆపై యువకుడి మృతదేహం వర్షపు నీటిలో తేలియాడుతుండగా గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. -
Cyclone Fengal: చెన్నై ఎయిర్‌పోర్టు బంద్.. రెడ్ అలెర్ట్ జారీ
ఫెంగల్ తుఫాను తమిళనాడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారిన ఫెంగల్.. శనివారం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాగే అవకాశం ఉంది. కారైకాల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో నేటి మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని రాత్రి ఏడు గంటల వరకు అధికారులు మూసివేశారు. ఈ సమయంలో సబర్బన్ రైళ్లు కూడా తక్కువగా నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.భారీ వర్షాలు..పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక తీర ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో మార్పు, అధిక ఆటుపోట్లను చూస్తున్నాయని తెలిపింది. తీరాన్ని ఫెంగల్ సమీపించే కొద్దీ గాలిప్రభావం 90 కి.మీ వేగంతో ఉండేందుకు అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తలు విస్తృతమయ్యాయి.Beautiful low cyclonic clouds... #ChennaiRains #Cyclone #Fengal pic.twitter.com/VTGxLYNty4— Sreeram (@sreeram) November 30, 2024 వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, పెరంబలూరు, అరియలూర్, తంజావూరు, నాగపట్నం, రాణిపేట, కారైకల్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి విపత్తు ఎదురైనా తక్షణం బాధితులను ఆదుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. పుదుచ్చేరిలో వర్షాలు కొనసాగుతుండడంతో పాటు కారైక్కాల్–తమి నాడులోని చైన్నె శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరాన్ని ఫెంగల్ తుపాను తాకనుండడంతో ఇక్కడి గ్రామీణ, తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.Velachery, Vijayanagar 2nd main road #Fengal #ChennaiRains #velachery pic.twitter.com/nR7Ygwywcm— Swetha Chandran (@SwethaC3110) November 30, 2024మత్స్యకారులకు ఆదేశం..ఈ జిల్లాల్లో పడవలు, జనరేటర్లు, మోటారు పంపులు, ట్రీ కటర్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచారు. ఈ జిల్లాల్లో ఎన్డిఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించారు. తమ పడవలు, ఇతర పరికరాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించి నష్టం జరగకుండా చూడాలని అధికారులు సూచించారు.విద్యాసంస్థలు బంద్తుఫాను కారణంగా భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పుదుచ్చేరి, తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, మైలాడుతురై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కంపెనీలను కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అటు విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. -
ఫెంగల్ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం
చెన్నై: తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది. VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W— Press Trust of India (@PTI_News) November 27, 2024 -
గేలి చేసినచోటే గెలిచి చూపిద్దాం!
ఆనందం ఎక్కడ ఉంటుందో ఆత్మస్థైర్యం అక్కడ ఉంటుంది. ఆత్మస్థైర్యం కొలువైన చోట అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. విజయానికి సింహద్వారాన్ని చూపిస్తాయి.శారీరక మార్పుల వల్ల లింగమార్పిడికి ముందు, లింగ మార్పిడి తరువాత ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది శ్వేతాసుధాకర్. అవమానాలు, కష్టాలలో ఆమె జపించిన మంత్రం... ‘జీవితం ఒక్కటే. బార్న్ 2 విన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యకర్త, రచయిత, మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమంది ట్రాన్స్జెండర్ల జీవితాలలో వెలుగులు నింపుతోంది చెన్నైకి చెందిన శ్వేతా సుధాకర్.వెయ్యి ఏనుగుల బలంతో రోజు మొదలు కావాలి అంటారు. ఆ మాట విషయం ఎలా ఉన్నా శ్వేతకు రోజు మొదలైందంటే దిగులుగా ఉండేది. ‘ఈరోజు ఎన్ని అవమానాలు పడాలో!’ అనుకునేది. చెన్నైలో పుట్టిన శ్వేత సుధాకర్లోని శారీరక మార్పులు చూసి ‘నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందేమిటి... అలా మాట్లాడుతున్నావేమిటీ’... ఇలా రకరకాలుగా వెక్కిరించేవారు. శారీరకంగా వచ్చిన మార్పులతో కుటుంబాన్ని వదిలి లింగమార్పిడితో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది శ్వేత. ‘చదువును నమ్ముకున్నవారు ఎప్పుడూ జీవితంలో ఓడిపోరు’ తాను విన్న మాట ఆ రోజు పదే పదే గుర్తు వచ్చింది. ఇక అప్పటినుంచి చదువు తన నేస్తం అయింది. ఆత్మీయత పంచే కుటుంబం అయింది. ధైర్యం ఇచ్చే గురువు అయింది. మద్రాస్ యూనివర్సిటీలో ఎం.ఏ. సోషియాలజీ చేసిన శ్వేతాసుధాకర్ ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనుకోలేదు. ఒక ఉద్యమంలా తనలాంటి వారి కోసం విస్తరించాలనుకుంది. ‘బార్న్ 2 విన్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. అయితే చెన్నైలో సంస్థ కార్యాలయం కోసం గదిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఒక మానవతావాది సహాయంతో చెన్నైలోని సైదాపేటలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది శ్వేత. (క్రేజీ.. డీజే..)గురుకులం...ఇప్పుడు ఈ కార్యాలయం వందలాది మంది ట్రాన్స్జెండర్లకు రణక్షేత్రం. ‘ఇదిగో... జీవితంలో ఎదురయ్యే సమస్యలతో ఇలా యుద్ధం చేయాలి’ అని నేర్పుతుంది. ‘చింతవద్దు. నువ్వు బతికేమార్గాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఉపాధి విద్యలను నేర్పే గురుకులం అవుతోంది. లింగమార్పిడి చేసుకున్న వారి హక్కుల కోసం తన గళాన్ని వినిపించడంతో పాటు విద్య, ఉపాధి, లైఫ్‌స్కిల్స్... మొదలైన వాటిలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైలరింగ్, కాస్మోటాలజీ, ఫ్యాషన్ డిజైన్కోర్సులతో ఎవరికి వారు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా తీర్చిదిద్దుతుంది శ్వేతా సుధాకర్.ట్రాన్స్ అచీవర్స్ అవార్డ్తమిళనాడుకే పరిమితం కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది బార్న్ 2 విన్. శ్రీలంక నుంచి మొదలు యూరప్‌లోని ఎన్నో దేశాల వరకు వివిధ రంగాలలో రాణిస్తున్న ట్రాన్స్జెండర్లను గత పదకొండు సంవత్సరాలుగా ‘ట్రాన్స్ అచీవర్స్’ అవార్డులతో సత్కరిస్తోంది శ్వేత. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం లాంటి భాషలను అనర్గళంగా మాట్లాడుతూ ‘శ్వేతా టాక్ షో’ పేరుతో ట్రాన్స్ మీడియా యూ ట్యూబ్‌ను నిర్వహిస్తోంది. ‘మిస్ తమిళనాడు ట్రాన్స్ క్వీన్ ప్రొగ్రామ్‌ను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ‘బార్న్ 2 విన్ అనేది సంస్థ కాదు. మా కుటుంబం. అది నాకు ఇచ్చిన ధైర్యం ఇంతా అంతా కాదు’ అంటుంది సుప్రియ. నిజానికి ఇది ఆమె మాటే కాదు ‘బార్న్ 2 విన్’ ద్వారా గెలుపు పాఠాలు నేర్చుకున్న ఎందరో విజేతల మాట.మన కోసం మనంకుటుంబాన్ని వదిలి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ ఒంటరి రోజులలో పుస్తకాలు నా కుటుంబసభ్యులు అయ్యాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే చదువు ద్వారా ఎంతోమందికి ధైర్యం వచ్చేలా చేస్తున్నాను. ‘నా కోసం ఏదీ లేదు. నా కోసం ఎవరూ లేరు’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ విశాల ప్రపంచంలో మన కోసం ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని వెదుక్కోగలగాలి. వాటిని వెదకాలంటే బలం కావాలి. ఆ బలం జీవనోత్సాహం నుంచి వస్తుంది. అందుకే నిరాశానిస్పృహలకు దూరంగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు ‘బార్న్ 2 విన్’ రూపంలో నాకంటూ ఒక కుటుంబం ఉంది. సామాజిక, రాజకీయ రంగాలలో గుర్తింపు దొరికింది.– శ్వేతా సుధాకర్, బార్న్ 2 విన్–ఫౌండర్అక్షర బలంశ్వేతా సుధాకర్ మంచి వక్త మాత్రమే కాదు రచయిత్రి కూడా. నిండైన భావుకత, చక్కని శైలి ఆమె అక్షరబలం. ‘నన్గై స్వేతాసీ’ పేరుతో హిజ్రాల జీవితాలపై ‘ఇయర్కై ఎలిదియ ఎలుత్తు పిలయ్(ప్రకృతి రాసిన అక్షర దోషం)’, కూందలుం... మీసయుం (శిరోజాలు..మీసాలు), వానం పాత్త తారగయే (ఆకాశం చూసిన తార), తర్కొలై దాహంగల్ (ఆత్మహత్యా దాహం), కల్యాణ కనువుగల్ (పెళ్లి కలలు)... మొదలైన పుస్తకాలను తన ‘నన్గై పబ్లికేషన్స్’ ద్వారా ప్రచురించింది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
చెన్నైలో 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్ (ఫొటోలు)
-
హ్యుందాయ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) రెండు పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వాహనాల తయారీకై 2025 నాటికి పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులోని ప్లాంటులో వీటిని నెలకొల్పనుంది.ఇందుకోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ ఒప్పందం చేసుకున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. 75 మెగావాట్ల సౌర, 43 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ను స్థాపిస్తారు. ఈ రెండు కేంద్రాలకు హెచ్ఎంఐఎల్ రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో కలిసి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశారు.హ్యుండై మోటార్ ఇండియాకు ఈ ఎస్పీవీలో 26 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుత విద్యుత్ అవసరాల్లో 63 శాతం పునరుత్పాదక వనరుల నుంచి సమకూరుతోందని కంపెనీ తెలిపింది. హెచ్ఎంఐఎల్ ప్లాంటుకు 25 ఏళ్లపాటు ఏటా 25 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామని ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీ తెలిపింది. -
24న చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఈవెంట్
-
కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్‌ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. #BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024 -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
తెలుగువారిపై కామెంట్స్.. సినీ నటి కస్తూరికి రిమాండ్
తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఇవాళ ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. (ఇది చదవండి: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్)క్షమాపణలు చెప్పిన కస్తూరిఅలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై చెన్నైలో నివసించే తెలుగు వారు మండిపడ్డారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలుగువారికి కస్తూరి క్షమాపణలు చెప్పింది. -
వీడియో: అమరన్ సినిమా ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమరన్ సినిమా నడుస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్‌పై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. బాంబు దాడి నేపథ్యంలో పెద్ద శబ్ధం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ధియేటర్లో శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పెట్రోల్ బాంబు దాడులపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టినట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే, శివకార్తికేయన్ అంటే గిట్టని వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.A petrol bomb incident has stirred tension at Alangaar Theatre in Melapalayam, Tirunelveli, early this morning.The incident reportedly linked to opposition to actor Sivakarthikeyan's film #Amaran, was captured on CCTV footage. pic.twitter.com/jN3QoLrBzz— South First (@TheSouthfirst) November 16, 2024 -
తల్లికి వైద్యం సరిగా చేయలేదని కత్తితో డాక్టర్‌పై దాడి
తల్లికి వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌ను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటన బుధవారం తమిళనాడు చెన్నైలోని గిండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడు ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకు తన తల్లి ప్రేమకు క్యాన్సర్ వైద్యం చేయించాడు. ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో వైద్యుడు బాలాజీ జగన్నాథన్పై కక్ష పెంచుకుని దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఓ యువకుడు ఉద్యోగి వేషధారణలో వచ్చి.. ప్రభుత్వ వైద్యుడిని ఏడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆయన ఛాతీ పైభాగానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం డాక్టర్ ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తితో పొడిచి పారిపోతుండగా నిందితుడిని వైద్యసిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.కలైంజర్ సెంటెనరీ హాస్పిటల్‌లోని ఓపీడీ లేదా ఔట్ పేషెంట్ విభాగంలో.. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి డాక్టర్ తప్పుగా మందులు రాశారని కక్ష పెంచుకొని ఆ యువకుడు ఈ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై.. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు. యువకుడు చిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భద్రతా లోపం ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. డాక్టర్‌కు వైద్య సహాయం హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి దాడి మళ్లీ జరగదని హామీ ఇచ్చారు.“సమయంతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ విజేత అరవింద్
చెన్నై: వరుసగా రెండో ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ టైటిల్ భారత గ్రాండ్‌మాస్టర్‌కు దక్కింది. గత ఏడాది ఈ టైటిల్‌ను తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ దక్కించుకోగా... ఈ ఏడాది తమిళనాడుకే చెందిన గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిరీ్ణత ఏడు రౌండ్ల తర్వాత అరవింద్, అరోనియన్ (అమెరికా), భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. చివరిదైన ఏడో రౌండ్లో అరవింద్ 64 ఎత్తుల్లో పర్హామ్ (ఇరాన్)పై గెలుపొందగా... లాగ్రెవ్‌తో అర్జున్; అరోనియన్‌తో అమీన్; విదిత్‌తో అలెక్సీ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌ను నిర్వహించారు. ఓవరాల్‌గా మెరుగైన టైబ్రేక్ స్కోరు కారణంగా అరవింద్ నేరుగా ఫైనల్లోకి ప్రవేశించగా... అర్జున్, అరోనియన్ మధ్య జరిగిన సెమీఫైనల్లో అరోనియన్ గెలిచి ఫైనల్లో అరవింద్‌తో తలపడ్డాడు. ఫైనల్లో అరవింద్ 2–0తో అరోనియన్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. అర్జున్‌కు మూడో స్థానం లభించింది. -
Arjun Erigaisi: ప్రపంచ రెండో ర్యాంకర్‌గా..
సాక్షి, హైదరాబాద్: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయాన్ని అందుకున్నాడు. సెర్బియా గ్రాండ్‌మాస్టర్ అలెక్సీ సరానాతో గురువారం చెన్నైలో జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 37 ఎత్తుల్లో గెలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.మూడో రౌండ్ తర్వాత అర్జున్, అమీన్ తబాతబాయి (ఇరాన్) 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజా ఫలితంతో 21 ఏళ్ల అర్జున్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ర్యాంకింగ్స్‌లో 2805.8 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంకర్‌గా అవతరించాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానా 2805 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.2011లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరిన భారత ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. లైవ్ రేటింగ్స్ అనేవి ప్రతి టోర్నీలో రౌండ్ రౌండ్‌కూ మారుతుంటాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ‘ఫిడే’ ప్రచురించే అధికారిక ర్యాంకింగ్స్‌నే ప్లేయర్ తుది ర్యాంక్‌గా పరిగణిస్తారు. గత నెలలో సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ఐదో రౌండ్ తర్వాత లైవ్ రేటింగ్స్‌లో అర్జున్ తొలిసారి 2800 పాయింట్లను అందుకున్నాడు.ఈ ఘనత సాధించిన 16వ చెస్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. అయితే అదే టోర్నీలోని ఆరో రౌండ్లో, ఏడో రౌండ్లో అర్జున్ తన గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో అతని లైవ్ రేటింగ్ 2800లోపు వచ్చింది. నవంబర్ 1న ‘ఫిడే’ అధికారికంగా వెలువరించిన ర్యాంకింగ్స్‌లో అర్జున్ 2799 రేటింగ్‌తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌గా ఉన్నాడు. చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలోని మిగిలిన నాలుగు రౌండ్లలో అర్జున్ రాణిస్తే డిసెంబర్ 1న విడుదలయ్యే తదుపరి ర్యాంకింగ్స్ లో అధికారికంగా 2800 రేటింగ్ పాయింట్లతో మూడు లేదా రెండో ర్యాంక్‌లో నిలుస్తాడు. -
‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!
ఒకరోజు శ్రీరంజనికి తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ట్యాక్సీ బుక్ చేయాల్సి వచ్చింది. పురుష డ్రైవర్ వెనుక కూర్చొని ప్రయాణించడానికి ఆమె పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ‘ఎవరైనా చూస్తారేమో...ఏమైనా అనుకుంటారేమో’ ‘ఈ డ్రైవరు ఉన్నట్టుండీ అసభ్యంగా ప్రవర్తిస్తాడేమో...’ ఇలా ఎన్నో ఆలోచనలతో ఆమె ప్రయాణం అత్యంత భారంగా గడిచింది. ఇప్పుడు శ్రీరంజనిలాంటి మహిళలకు బైక్ ట్యాక్సీ ప్రయాణం భారం కాబోదు...‘పింక్’ యాప్‌లో బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లు మాత్రమే వస్తారు. ‘పింక్’ ద్వారా మహిళల సౌకర్యం, భద్రతా అనేది ఒక కోణం అయితే ఎంతోమంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారనేది మరో కోణం. చెన్నై నగరంలో ఎంటీసీ బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు, ఎంఆర్టీఎస్ రైళ్లు, మెట్రో రైలులాంటి రవాణా సేవలు ఉన్నా, ఆటో, ట్యాక్సీల మీద ఆధారపడే ప్రయాణీకులు కూడా ఎక్కువే. ఆయా సంస్థల యాప్‌లలో బైక్ టాక్సీ కోసం బుక్ చేస్తే పురుషు డ్రైవర్లే ఎక్కువగా వచ్చేవారు. వారి వెనుక కూర్చుని ప్రయాణించడం మహిళలకు అసౌకర్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో ‘పింక్’ బైక్‌లు వారి చింతను దూరం చేసి నిశ్చింతగా ప్రయాణం చేసేలా చేస్తున్నాయి. ప్రముఖ బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ‘ర్యాపిడో’ చెన్నైౖలో ‘బైక్ పింక్’ను ప్రారంభించింది. ‘బైక్ పింక్ సర్వీస్ అనేది మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాం. ఇది మహిళా ప్రయాణికులకు భద్రతను ఇవ్వడమే కాదు, ఎంతో మంది మహిళలకు డ్రైవర్లుగా ఉపాధిని ఇస్తుంది’ అని ‘ర్యాపిడో’ ప్రకటించింది. మహిళా డ్రైవర్లను ‘వుమెన్ కెప్టెన్’గా వ్యవహరిస్తారు. ర్యాపిడోతోపాటు ఉబర్, వోలలాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా మహిళలు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.అనకాపుత్తూరుకు చెందిన మంగ ఉమెన్ కెప్టెన్. ఆమెకు ఐదేళ్ల కుమార్తె ఉంది. పాపను ఉదయం స్కూల్‌కు బైక్‌పై డ్రాప్ చేసిన తర్వాత ఆమె పని మొదలవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు బైక్ రైడింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోతుంది. కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు బైక్ రైడింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో పాపను తన తల్లి ఇంటి దగ్గర వదలి పెట్టి వస్తుంది. తొమ్మిది గంటలకు రైడింగ్ యాప్‌ను ఆఫ్ చేస్తుంది. ఒక క్లాత్‌స్టోర్‌లో పనిచేసిన శ్వేత జీతం సరిపోకపోవడంతోబైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. రోజుకు రూ. 1000 వరకు సంపాదిస్తోంది. ‘మొదట్లో నేను చేయగలనా? అని భయపడ్డాను. ఎంతోమంది ఉమెన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడాను. వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అంటుంది శ్వేత. ఇక మహిళా డ్రైవర్ల దారి రహదారేనా! కావచ్చేమో కాని... ఆ దారిలో రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. ‘ఒక ప్రయాణికుడు కావాలని పద్నాలుగు సార్లు నా బైక్ బుక్ చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి సంస్థకు ఫిర్యాదు చేస్తే తక్షణం అతడి ఖాతాను రద్దు చేశారు’ అంది ఒక మహిళా డ్రైవర్. ‘డ్రైవింగ్ సమయంలో మేము అభద్రతగా ఫీల్ అయితే సంస్థకు ఫిర్యాదు చేసే, పోలీసులను సంప్రదించే వీలు ఉంది’ అంటుంది మరో మహిళా డ్రైవర్. కొందరు పురుష ప్రయాణికులు మహిళా డ్రైవర్‌ను చూడగానే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. ‘డ్రైవర్ మహిళ అనే విషయం తెలియక బుక్ చేశాను. సారీ’ అంటూ ప్రయాణాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకుంటున్నారు. మహిళలు సరిగ్గా డ్రైవ్ చేయరనేది అనేది వారి అపోహ. ఇలాంటి అపోహల అడ్డుగోడలను కూల్చేస్తూ, లింగ వివక్షతను సవాలు చేస్తూ విమెన్ కెప్టెన్ల బండి వేగంగా దూసుకుపోతోంది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై (చదవండి: అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్‌తో భయం ఏమిటి..?) -
కమల యోధురాలు
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్‌ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు. స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్‌దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం. ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు. చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన -
కమలా.. విజయాన్ని కాంక్షిస్తూ పూజలు
సాక్షి, చైన్నె: అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా గతంలో ఎన్నికై , ప్రస్తుతం అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ గెలుపు కోసం ఆమె పూర్వీకుల గ్రామంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. బ్రిటన్, అమెరికాల నుంచి ఆమె మద్దతుదారులు పలువురు ఇక్కడకు వచ్చి పూజలలో లీనమయ్యారు. అమెరికా అధ్యక్షురాలుగా ఆమె తన పూర్వీకుల గ్రామానికి వస్తారన్న ఆశాభావాన్ని ఆ గ్రామస్తులు వ్యక్తం చేశారు. వివరాలు.. కమలా హారిస్ పూర్వీకులది తమిళనాడు అన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి తరపు తాత, ముత్తాతలు తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామానికి చెందిన వారు.దీంతో తమ ఇంటి బిడ్డగా కమలా హ్యారిస్‌ను ఆ గ్రామస్తులు భావిస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఆమె పేరును గతంలో ప్రకటించిన రోజు నుంచి ఈ గ్రామంలో ఎదురు చూపులు పెరిగాయి. గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో రోజూ పూజలు నిర్వహించారు. అమెరికా ఎన్నికల్లో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ విజయకేతనం ఎగుర వేయడంతో ఆ గ్రామంలో ఆనందోత్సాహాలు అప్పట్లో మిన్నంటాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికలలో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో అధ్యక్ష బరిలో కమల హరిస్ నిలబడ్డారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొట్టే విధంగా కమలా దూసుకెళ్లారు. హోరాహోరీగా ఈ ఇద్దరి మధ్య సమరం నెలకొంది. మంగళవారం పోలింగ్ పూర్తి కావడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా 47వ ప్రిసిడెంట్ కమల హరిస్ లేదా ట్రంప్..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితులలో గతంలో వలే కమలా గెలుపు కోసం పూర్వీక గ్రామస్తులు పూజలపై దృష్టి పెట్టారు. తమ గ్రామానికే కాకుండా, కమలా హారీస్ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కుల దైవంగా ఉన్న ధర్మ శాస్త ఆలయంలో కమలా గెలుపు కాంక్షిస్తూ నిత్యం ప్రత్యేక పూజలు చేస్తూ వస్తున్నారు. మంగళవారం అయితే, ఉదయం నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం పూర్తి ఫలితాలు వెలువడనున్నడంతో కమలా హరిస్పేరిట ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ల నుంచి వచ్చిన కమలా మద్దతుదారులు ఆమె పేరు కలిగిన టీ షర్టులను ధరించి ఆలయంలో పూజలు చేస్తున్నారు. కమలా తప్పకుండా ఈ ఎన్నికలలో గెలుస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షురాలుగా తమ గ్రామానికి కమల వస్తారన్న నమ్మకం ఉందని, ఆమె తప్పకుండా గెలుస్తారని తులసేంద్ర పురం వాసులు పేర్కొంటున్నారు. కులదైవం ఆలయం ధర్మ శాస్తలో అందరం మొక్కుకున్నామని, తమ కులదైవం ఆమెను ఆశీర్వదిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. గతంలో కూడా ఇక్కడ పూజలు జరిగాయని, ఆమె గెలిచారని గుర్తుచేశారు. కమలా హారీస్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచినానంతరం భారత్ , అమెరికా మధ్య బంధం మరింత బలోపేతం కావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఆలయ పరిసరాలు గ్రామంలో కమలా హరిస్ గెలుపును కాంక్షిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. -
‘నటుడు విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభం’
చెన్నై: తమిళగ వెట్రి కజగం(టీవీకే)చీఫ్, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటంకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు నటుడు విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇవ్వటంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘విజయ్ రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకురాదు. ఆయన రాజకీయ ప్రవేశం ఇండియా కూటమి విజయానికి ఉపయోగపడుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లను, ముఖ్యంగా ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుంది. విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇండియా కూటమి మిత్రపక్షలు ఎటువంటి అలజడికి గురికాలేదు. ఇండియా కూటమి బలంగానే ఉంది. కాంగ్రెస్ 2004-2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. దాని ఆధారంగా.. మేం అధికారం పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తున్నాం. అయితే అధికారాన్ని పంచుకోవడంపై జాతీయ నాయకత్వందే తుది నిర్ణయం. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో.. ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే అప్పటి సీఎం కరుణానిధి ఇచ్చి ఉండేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వాటా కోరలేదు. అధికార భాగస్వామ్యం ప్రజల ఆదేశంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని కోరుకుంటుంది. మేం తమిళనాడులో కామరాజ్ పాలనను ప్రారంభిస్తాం’ అని అన్నారు. -
ర్యాపిడోపై చెన్నై సీఈఓ ఫైర్: ఎందుకంటే..
ర్యాపిడో, ఉబర్ క్యాబ్స్, ఓలా రైడ్స్ వంటివి కస్టమర్ల నుంచి నిర్ణీత ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేసిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 21 కి.మీ దూరంలో ఉన్న తొరైపాక్కం వరకు వెళ్లడానికి ర్యాపిడో ఏకంగా రూ.1,000 వసూలు చేసినట్లు ఏజే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓ 'అశోక్ రాజ్ రాజేంద్రన్' వెల్లడించారు. 21 కిలోమీటర్లకు ఛార్జ్ రూ. 350 మాత్రమే. కానీ ర్యాపిడో మూడు రెట్లు డబ్బు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదని అన్నాడు.ఈ సమస్య గురించి ర్యాపిడోకు తెలియజేసినప్పటికీ.. డ్రైవర్ చర్యల గురించి కూడా అడగకుండా చాట్‌ను ముగించారని, రాపిడో కస్టమర్ కేర్ సర్వీస్‌పై సీఈఓ నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు త్వరలోనే తగిన గుణపాఠం ఎదురవుతుందని వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అనుభవాలు ఎదురైనా పలువురు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ర్యాపిడోలో ఇలాంటివి చాలాసార్లు ఎదురయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్లు.. కస్టమర్లను మోసం చేయడం ప్రారంభించారని మరికొందరు చెబుతున్నారు. -
స్కూల్లో గ్యాస్ లీక్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో గల ఓ పాఠశాలలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగా పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొత్తియూర్‌లోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థత బారిన పడ్డారు. బాధితులను స్కూలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స జరుగుతున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థులకు సాయం అందించేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఏకే చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తమ బృందం బాధితులకు సహాయం అందిస్తున్నదన్నారు. బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీతో ఇబ్బంది ఎదుర్కొన్న మేము తరగతి గది నుండి బయటికి పరుగుపరుగున వచ్చేశామన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారని, కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే బాధిత విద్యార్థులకు ఉపాధ్యాయులు సాయమందించాన్నారు.పాఠశాలలో నుంచే గ్యాస్ లీకేజీ జరిగిందా లేదా రసాయన కర్మాగారం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూలుకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా! -
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. అట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు
-
చెన్నైలో వందే భారత్ స్లీపర్ ఆవిష్కరణ
సాక్షి, చెన్నై: వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలును చెన్నై ఐసీఎఫ్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ సుబ్బారావు ఈ రైలు గురించి మీడియాకు తెలిపారు. చెన్నైలోని ఐసీఎఫ్‌లో వందే భారత్ రైళ్ల తయారీ జరుగుతోందని చెప్పారు. దీంతోపాటు వందే మెట్రో రైళ్లు, అమృత్ వందే మెట్రో రైళ్లు కూడా తయారు చేస్తున్నామన్నారు. అదే సమయంలో స్లీపర్ సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైళ్లను సిద్ధం చేసి రాత్రి వేళల్లో నడపాలని రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా స్లీపర్ వెర్షన్ అన్ని హంగులతో రూపుదిద్దుకుందని వివరించారు. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి పట్టా లెక్కించబోతున్నట్లు తెలిపారు. -
భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్రకోణం?
చెన్నై: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనక కుట్రకోణం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఎన్ఐఏ, రైల్వే అధికారులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైలు ప్రమాదానికి రైల్వే ఉద్యోగులేనన్న అనుమానాలు వస్తున్నాయి.విచారణలో ప్రమాద ప్రాంతంలో స్విచ్ పాయింట్ల బోల్టులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. లూప్ లైన్లో పట్టాలు ట్రాక్‌గా మారే చోట బోల్ట్‌నట్ విప్పడంతో గూడ్స్ ట్రాక్ మారింది. దీంతో గూడ్స్ ట్రైన్‌ను భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు.20 మందికి పైగా రైల్వే సిబ్బంది, అధికారులను సౌత్‌జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ చౌదరి ప్రశ్నించారు. బోల్ట్ విప్పింది బయటి వ్యక్తులు కాదని, రైల్వే ఉద్యోగులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతుంది. దాని వెనుక కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.కాగా, గత శుక్రవారం (అక్టోబర 11)న రాత్రి 8.27 సమయంలో తమిళనాడులో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు పొన్నేరి స్టేషన్ దాటింది. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఆ రైలు ప్రధాన లైనుపై నుంచి కాకుండా లూప్లైన్లోకి వెళ్లడం, ఆ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి.ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పార్సిల్ వ్యానులో మంటలు చెలరేగాయి. రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు,ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జరిగిన విచారణలో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై కుట్రకోణం ఉందని సమాచారం. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది -
నెల్లూరు వైపు దూసుకొస్తున్న వాయుగుండం
సాక్షి,నెల్లూరు:చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.గురువారం(అక్టోబర్17) వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.తీరందాటే సమయంలో60- 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గూడూరు, మనుబోలు, కావలి, నెల్లూరు సమీప ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి.ఇప్పటికే నెల్లూరుతో పాటు కావలిలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఇదీ చదవండి: వాయుగుండం ముప్పు -
చెన్నై, బెంగళూరులో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు
చెన్నై: దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై, బెంగళూరులో పాఠశాలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.#WATCH | Chennai, Tamil Nadu: Heavy rainfall causes waterlogging in several parts of the city(Visuals from Choolaimedu area) pic.twitter.com/3hWHlXfPSL— ANI (@ANI) October 16, 2024 భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మూసివేయలని పేర్కొంది.Good morning #Chennai. 16 Oct 4:45 am : System moving North West towards North TN and South AP coast #Chennairains #Chennai Most of the main band over South Andhra coastDrizzle rain band over #Chennai. No need to worry for now. pic.twitter.com/r7aWnpm5nd— Chennai Weather-Raja Ramasamy (@chennaiweather) October 15, 2024రేపు (గురువారం) తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పీడన ప్రాంతం పశ్చిమం నుంచి వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం అల్పపీడనంగా మారింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో బెంగళూరు, చెన్నైలలో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని నగరంలో మోహరించారు.Palavanthangal Subway. 7 AM #ChennaiRains pic.twitter.com/v2YIiRUxv3— Dhivya Marunthiah (@DhivCM) October 16, 2024 3 தலைமுறையா கொள்ளை அடிச்சுட்டு இருக்கானுங்க அப்பவும் பத்தல போல.அவ்ளோ பணத்த வச்சு என்னதான் பண்ணுவானுங்களோ, கொஞ்சமாவது மக்கள் நலனுக்கு செலவு பண்ணுங்கடா!!!#ChennaiRains pic.twitter.com/YamVQQ0Zo2— Arvinth Easwaran (@arvinth_e) October 16, 2024 ‘‘బెంగళూరులో భారీ వర్షాల నేపథ్యంలో బెంళూరులో హై అలర్ట్ ప్రకటించాం. ఇప్పటికే బెంగళూరులో సుమారు 60 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించాం. ఏదైనా అవసరం కోసం సిద్ధంగా ఉండటానికి మరో 40 మందిని మళ్లీ నియమించాం. అగ్నిమాపక , అత్యవసర సేవలను సిబ్బందిని అందుబాటులో ఉంచాం’ అని కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు.Current situation of BangloreAs Per Wheather Reports 5 Days light moderate and some time Heavy rain at Banglore#BangloreRains #INDvsNZpic.twitter.com/oYC0GKyXxf— Cricket Manchurian (@Cric_man07) October 16, 2024Bengaluru Weather Alert: Depression taking slightly northwards path. #Bengaluru will experience cloudy weather with intermittent light rain or drizzle for 36 hours with moderate rain spells in afternoon/evening. Strong impact will be near #Hindupur -#Nellore belt slightly north. pic.twitter.com/mQSFRb4AEL— 🛑 Bengaluru Rain Alert (@Bengalururain) October 16, 2024 -
ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?!
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, గిప్ట్‌లు ఇవ్వడం చాలా కామన్. ఇటీవలి కాలంలో కంపెనీ లాభాలను బట్టి ఖరీదైన బహుమతులను ఇస్తున్న సందర్భాలను కూడా చూశాం. గతంలో డైమండ్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇళ్లు, కార్లు బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచాడు. తాజాగా చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చింది. బెంజ్ సహా 28 ఇతర బ్రాండెడ్ కార్లను, 29 బైక్‌లను దివాలీ గిఫ్ట్ ఇచ్చింది.స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అండ్ డిటైలింగ్ కంపెనీ, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తన ఉద్యోగులకుఅదిరిపోయే దీపావళి కానుక అందించింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ , మెర్సిడెస్ బెంజ్ నుండి వివిధ రకాల బ్రాండ్ కొత్త కార్లను ఉద్యోగులకు అందించింది. కంపెనీ అభివృద్ధిలోనూ, విజయవంతంగా కంపెనీని నడిపించడంలోనూ ఉద్యోగుల కృషి , అంకితభావానికి ప్రశంసల చిహ్నంగా అందించినట్లు కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమ గొప్ప ఆస్తి అని, ఈ విధంగా ఉద్యోగుల విజయాలను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తమ ఉద్యోగుల్లో ధైర్యాన్ని, ప్రేరణనిచ్చి, ఉత్పాదకతను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల అభివృద్ధికి , కస్టమర్ సంతృప్తికి అధిక ప్రాధాన్యత భవిష్యత్తులో కొనసాగుతుందని కన్నన్ తెలిపారు. వివాహ సాయం లక్ష రూపాయలకు పెంపుకంపెనీలో సుమారు 180 మంది ఉద్యోగులుండగా, దాదాపు అందరూ నిరాడంబరమైన నేపథ్యంనుండి వచ్చినవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారేనని కంపెనీ కొనియాడింది. కార్లను బహుమతిగా ఇవ్వడంతో పాటు, వివాహ సహాయంగా ఉద్యోగులకు సహాయం కూడా చేస్తుందని కూడా వెల్లడించారు. వివాహ సహాయంగా గతంలో ఇచ్చే 50 వేల సాయాన్ని ఇపుడు లక్షరూపాయలకు పెంచారు.2022లో, ఇద్దరు సీనియర్ సిబ్బందికి మాత్రమే రెండు కార్లను ఇచ్చిన కంపెనీ,ఈ ఏడాది 28 కార్లతోపాటు, 28 బైక్‌లను కూడా కానుకంగా అందించడం విశేషం.కాగా సరిగ్గా జీతాలు ఇవ్వక ఉద్యోగులను, కార్మికులను దోపిడీ చేస్తున్నారంటూ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్న తరుణంలో చెన్నైకంపెనీ నిర్ణయం విశేషంగా నిలిచింది. -
తమిళనాడులో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలువు
చెన్నై: తమినాడులో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోంది. తిరువళ్లూరు నగరం, పొన్నేరి ప్రాంతం, చెన్నైలోని కోయంబేడు, చెన్నై సిటీలో భారీగా వర్షంకుస్తోంది. చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.#WATCH | Tamil Nadu: Rain lashes parts of Tiruvallur city; visuals from Ponneri area. pic.twitter.com/LpmESToXIT— ANI (@ANI) October 15, 2024 మంగళవారం చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ సిబ్బంది ద్వారా ఆఫీసులలో కాకుండా, వర్క్ ఫ్రం హోం కేటాయించాలని సూచించారు.#WATCH | Tamil Nadu: Waterlogging witnessed in Koyambedu area of Chennai after incessant rainfall in the area. pic.twitter.com/4cvS9JjgsM— ANI (@ANI) October 15, 2024 చైన్నె, శివారు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలను మంత్రులు, ఐఏఎస్‌ల బృందం నిత్యం పర్యవేక్షిస్తోంది. పుదుచ్చేరి లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని పల్లికరణై-కోవిలంబాక్కం మధ్య నారాయణపురం సరస్సు ప్రాంతాన్ని పరిశీలించారు.#WATCH | Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin inspected the banks of the Narayanapuram Lake area between Pallikaranai and Kovilambakkam in Chennai, after heavy rainfall in area. (Source: Udhayanidhi Stalin's Office) pic.twitter.com/MN69dNaiLc— ANI (@ANI) October 14, 2024 -
నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం
అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో చైన్నె నగరం, శివారు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో మాదిరి మరోమారు ఈ ప్రాంతాలు వరద విలయంలో చిక్కకుండా ముందుజాగ్రత్త చర్యలను విస్తృతం చేశారు. మంగళవారం చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ సిబ్బంది ద్వారా ఆఫీసులలో కాకుండా, వర్క్ ఫ్రం హోం కేటాయించాలని సూచించారు. చైన్నె, శివారు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలను మంత్రులు, ఐఏఎస్‌ల బృందం నిత్యం పర్యవేక్షిస్తోంది. పుదుచ్చేరి లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.సాక్షి, చైన్నె: ఉపరితల ఆవర్తనం రూపంలో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో చెదురు ముదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి క్రమంగా వరుణాగ్రహం తీవ్రమైంది. తొలుత మదురై, దిండుగల్, తిరుచ్చి జిల్లాలోనూ తర్వాత కోయంత్తూరు, ఈరోడ్ తదితర చోట్ల కుండపోతగా వర్షం పడింది. ఆదివారం రాత్రంతా అనేక జిల్లాలో వర్షాలు కొనసాగాయి. సోమవారం విల్లుపురం, కడలూరు, అరియలూరు,పెరంబలూరు తదితరప్రాంతాలలో అనేక చోట్ల వర్షం పడింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా బూదలూరులో 12 సెం.మీ వర్షం పడింది. వర్షాలతో తేని, మదురైలోని జలపాతాలు, వైగై జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. కావేరి తీరంలో కురుస్తున్న వర్షాలకు మే ట్టూరు జలాశయంలో కి సెకనుకు 17 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దిండుగల్‌లోని వరదమానది రిజర్వాయర్ నిండడంతో ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. మ దురై, దిండుగల్,కోయంబత్తూరులలోని లోతట్టు ప్రాంతాలలో చేరిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. మదురైలో వర్షాలకు కోట్టం పట్టి వద్ద విద్యుత్ తీగ తెగి పడడంతో రైతు గణేషన్(50) మరణించాడు. పూంజుత్తి ప్రాంతానికి చెందిన రామచంద్రన్ (58) విద్యుదాఘాతానికి గురై బలయ్యాడు.నామక్కల్ తిరుచంగోడువద్ద తిరుమని ముత్తారునదిలో పాల వ్యాపారి పెరిస్వామి(63) మోటారు సైకిల్‌తో పాటు కొట్టుకెళ్లి మరణించాడు.అల్పపీడన ప్రభావంతో..బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దక్షిణమధ్య బంగా ళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి వా యువ్య దిశలో పయనించి మంగళవారం సెంట్రల్ బంగాళా ఖాతంలో వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో చైన్నె నగరం, శివారు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు డెల్టాలోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, మైలాడుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో అతిభారీ వర్షాలు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, వేలూరు జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశాల ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చైన్నె, శివా రులలో ఒకే రోజు 20 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మూడు రోజులు సరా సరిగా 40 సెం.మీ వర్షం పడేందుకు అధిక అవకాశాలు ఉందన్న సమాచారంతో చైన్నె, శివారు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. శివారుల నుంచే అధిక నీరు నగరంలోకి రావడం, వరద ముంపు ఎదుర కావడం వంటి పరి ణామాలు గతంలో జరగడంతో ఈ సారి శివారు ప్రాంతాలపై మరింతగా అధికార యంత్రాంగం ఎక్కువ దృష్టి సారించింది. మంగళవారం చైన్నె, శి వారు జిల్లాలో స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు సంస్థల సిబ్బందికి వర్క్ ఫ్రంహోంకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.మంత్రుల ఉరుకుల.. పరుగులుడిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, నగరాభివృద్ధి శాఖమంత్రి కేఎన్ నెహ్రూ, ఎంఎస్ఎంఈ మంత్రి అన్బరసన్, దేవదాయ మంత్రి శేఖర్‌బాబు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తదితరులు చైన్నె, శివారు జిల్లాల వైపుగా పరుగులు తీశారు. ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. జె. మేఘనాథరెడ్డి, సమీరన్, కుమర వేల్ పాండియన్, ఎస్ రామన్, శ్రేయ, కన్నన్, జాన్ వర్గీస్, విశాఖన్ తదితర ఐఏఎస్ అధికారులను మండలాల వారీగా రంగంలోకి దించారు. శివారులోని తాంబరంలో 19 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశారు. శివారులతోపాటూ చైన్నెలో భారీ వర్షం కురిసినా నీరు సులభంగా సముద్రంలోకి వెళ్లే విధంగా ముఖద్వారం వద్ద పూడికతీత శరవేగంగా సాగుతోంది. ఇక్కడకు కొట్టుకు వచ్చే చెత్త చెదారాన్ని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలలో ముందు జాగ్రత్తలతో పాటు ఇక్కడి ప్రజల కోసం శిబిరాలను సిద్ధం చేశారు. చైన్నెలో 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరో 16 పోలీసు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా చైన్నె శివారులలోని వేళచ్చేరి పరిసరాలలోని లోతట్టు ప్రాంతవాసులు ముందు జాగ్రత్తగా తమ కార్లను సమీపంలోని వంతెనల మీద పార్క్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని పాఠశాలలలో పరిస్థితులు, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ కన్నన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని ఆస్పత్రులలో మందులు పుష్కలంగా ఉండాలని, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎంసుబ్రమణియన్ ఆదేశించారు. వండలూరు, గిండిలలోని పార్కులలో ఉన్న పక్షలు, వన్య ప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈశాన్య రుతు పవనాల అలర్ట్ చేస్తూ, ముందు జాగ్రత్తల విస్తృతంపై సీఎస్ మురుగానంద్ లేఖ రాశారు.అత్యవసర సేవల నంబర్లు ఇవే..అతి భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవలకు గాను చైన్నె కార్పొరేషన్ యంత్రాంగం హెల్ప్‌లైన్ నం బర్లను ప్రకటించింది. మండలాల వారీగా అఽధికారులు, వారి సెల్ నెంబర్లను విడుదల చేసింది.ప్రాంతం అధికారి సెల్ నంబరుతిరువొత్తియూరు బాబు 94445 90102మనలి గోవిందరాజు 94445 90002మాదవరం తిరుమురుగన్ 94445 90003తండయార్ పేట శరవన్ ముర్తి 94445 90004రాయపురం ఫరీదా బాబు 94445 90005తిరువీకానగర్ మురగన్ 94445 90006అంబత్తూరు తమిళ్ సెల్వన్ 94445 90007అన్నానగర్ సురేష్ 94445 90008తేనాంపేట మురుగ దాసు 94445 90009కోడంబాక్కం మురుగేషన్ 94445 90010వలసరవాక్కం ఉమాపతి 94445 90011ఆలందూరు పీఎఎస్ శ్రీనివాసన్ 94445 90012అడయార్ పీవీ శ్రీనివాసన్ 94445 90013పెరుంగుడి కరుణాకరన్ 94445 90014షోళింగనల్లూరు రాజశేఖరన్ 94445 90015హెల్ప్‌లైన్ నంబర్లుకార్పొరేషన్ కంట్రోల్ రూం –1913స్టేట్ కంట్రోల్ రూం –1070 -
రైలు ప్రమాదానికి కారణమేంటీ? దక్షిణ రైల్వే జీఎం స్పందన
తమిళనాడులో శుక్రవారం రాత్రి మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై తాజాగా దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ స్పందించారు. మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సిగ్నల్, రూట్ మధ్య అసమతుల్యతే కారణమని తెలిపారు. ‘‘మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు మారాలి, కానీ ఏదో తప్పు జరిగింది. గూడ్స్ రైలు నిలిచిన ట్రాక్‌లోని ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ మార్చబడింది. సరిగ్గా ఏమి జరిగిందో ఇప్పడే ఏం చెప్పలేం. ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరుకు (ఆంధ్రప్రదేశ్‌లోని) వెళుతోంది. ఇది తిరువళ్లూరులోని కవరైప్పెట్టై రైల్వే స్టేషన్లో ఆగింది. అక్కడ గూడూరుకు వెళ్లే గూడ్స్ రైలు కూడా లూప్ లైన్లో ఉంది. అయితే మెయిన్ లైన్‌కు సిగ్నల్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ.. ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్లోకి ప్రవేశించి వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పడానికి దారి తీస్తుంది.ఇక.. ఈ ప్రమాదంలో 12 కోచ్‌లు పట్టాలు తప్పగా.. 19 మంది గాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్ రైలులో 1,300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎక్స్‌ప్రెస్ రైలులోని ఓ పవర్ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో రైలు పట్టాలు తప్పడంతో మరమ్మతుల కారణంగా శనివారం షెడ్యూల్ చేసిన 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.చదవండి: తమిళనాడు రైలు ప్రమాదం.. కేంద్రంపై రాహుల్ మండిపాటు -
ఎయిర్ షో విషాదం.. స్పందించిన సీఎం స్టాలిన్
చెన్నై: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు, ఆదివారం మెరీనా బీచ్‌లో వైమానిక ప్రదర్శన కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోరిన దానికి మించిని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ షో కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రమాదంపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. భారత వైమానిక దళం కోరిన దాని కంటే మించిన ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పారు. ఊహించినదానికంటే ఎయిర్‌షోకు ఎక్కువ ప్రజలు వచ్చారని తెలిపారు. ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను చేరుకోవడానికి, ప్రజా రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.కాగా చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడి తట్టుకోలేక, ఊపిరి అందక, లోకల్ స్టేషన్ వద్ద తొక్కిసలాట వంటి కారణాల వల్ల ఐదుగురు మరణించగా వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. -
TN: ఎయిర్ షో మరణాలకు కారణం అదే: మంత్రి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం(అక్టోబర్6) జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందడంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం స్పందించారు.ఎయిర్‌షోలో మరణాలు ప్రభుత్వ నిర్వహణ లోపం,తొక్కిసలాట వల్ల కాదని డీ హైడ్రేషన్ వల్లే సంభవించాయని చెప్పారు.అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన వందల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. షో కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అడిగనదాని కంటే ఎక్కువ ఏర్పాట్లే చేశామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారు 100 బెడ్లు సిద్ధంగా ఉంచాలని కోరారని, తాము 4 వేల బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. బీచ్‌లో జరిగిన ఐఏఎఫ్ ఎయిర్‌షోకు భారీగా జనం హాజరవడంతో తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందడంతో పాటు చాలా మందికి గాయాలయ్యాయి.ఇదీ చదవండి: చుక్కలు చూపించిన ఎయిర్‌షో -
చుక్కలు చూపిన ఎయిర్ షో
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా, 230 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం. షో ఉదయం 11 నుంచి కాగా జనం 8 గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు చాలామంది షో ప్రారంభం కాకమునుపే సొమ్మసిల్లి పడిపోయారు. తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని వాపోయారు. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలడంతో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మండుతున్న ఎండ, రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపికలేక చాలామంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు. బీచ్‌కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది. అయితే, జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని, కనీస వసతులు సైతం ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మెరీనా బీచ్ రోడ్డులో కిక్కిరిసిన జన సందోహం -
చెన్నై: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. పలువురి మృతి
చెన్నై: తమిళనాడు చెన్నై ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మెరీనా బీచ్‌లో ఎయిర్ షో అనంతరం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎయిర్ షో ముగిసిన తర్వాత జనాలు తిరిగి వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్లోనూ తొక్కిసలాట జరిగింది. డీహైడ్రేషన్ కారణంగా సొమ్మసిల్లి 290 మంది పడిపోవటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయిన 80 మందిని ఆసుపత్రి తరలించారు. Closecall#IndianAirForce #Chennai #ChennaiAirShow2024 #ChennaiAirShow #Airshow #ChennaiMarina #MarinaBeach ch pic.twitter.com/4FvsqaCNPh— Bharani Dharan (@bharani2dharan) October 6, 2024 ఎయిర్ షో చూసేందుకు లక్షాలాది మంది జనాలు తరలివచ్చారు. దీంతో ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో పోలీసులు వైఫల్యం చెందారు. జనం భారీగా రావటంతో పోలీసులు చేతులెత్తేశారు. తొక్కిసలాటలో వందలాది మంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. The worst arrangement by the govtStampede in Marina!#IndianAirForce#tngovt #chennai #marina pic.twitter.com/Qjb6B1OvJg— Sankrithi (@sank_rang) October 6, 2024 వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.More people gathered here no cop to navigate the public!!No water and Bio toilets were arranged The government should arrange enough train and bus transport to relocate people from destination to parking .#Chennai#AirShow2024 pic.twitter.com/rrNU1GgOvG— ல.மோ. ஜெய்கணேஷ் (@jai_lm) October 6, 2024సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు మూడు లక్షలమందిపైగా లోకల్ ట్రైన్లలో ప్రయాణించనట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే, మెట్రో స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఎయిర్ షోను తిలకించడానికి మెరీనా బీచ్‌కు సుమారు 15 లక్షలకుపైగా ప్రజలు వచ్చినట్లు అంచనా. Marina Beach Chennai AF Day celebrationIndian Airforce came into existence on 08 Oct 1932 pic.twitter.com/r3jUS5wKTc— धर्म व देश से ऊपर कोई नही (@VaDharma) October 6, 2024లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో మెరీనా బీచ్ ఎయిర్ షో నమోదుకు విస్తృత ప్రచారం. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఎయిర్ షో ఏర్పాటు చేశారు.#WATCH | Chennai, Tamil Nadu | A woman seen being evacuated from a huge rush at the Mega Air Show on Marina Beach ahead of the 92nd Indian Air Force Day.There are reports of attendees fainting, rushed to the hospital due to heavy crowd presence and heat. pic.twitter.com/SgNEhuTnUH— ANI (@ANI) October 6, 2024 -
నైంటీస్ జమానా దుకాణం..! ఆ తరం మధుర జ్ఞాపకాలు..
ముయ్యేళ్ల కిందట– అంటే..నైంటీస్ జమానాలో ఇప్పుడున్నస్మార్ట్ఫోన్లు లేవు, ఆన్లైన్ గేమ్స్ లేవు. అప్పటి పిల్లలకు గోలీలు, బొంగరాలువంటి ఆరుబయటి ఆటలే కాలక్షేపం. అప్పట్లో పిజ్జాలు, బర్గర్లు లేవు. నారింజ మిఠాయిలు, అంకెలు, అక్షరాల ఆకారంలో ఉండే బిస్కట్లు వంటివే పిల్లల జిహ్వచాపల్యాన్ని తీర్చే చిరుతిళ్లు. అప్పటి పిల్లలు ఇప్పుడు యువకులైపోయారు. పిల్లలకు తల్లిదండ్రులైపోయారు. తమ పిల్లలకు తమచిన్ననాటి కాలక్షేపాలను, చిరుతిళ్లను పరిచయం చేయాలని ఉన్నా, బజారులో అవేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ఆ లోటును తీర్చడానికే చెన్నైలోని తెలుగు సంతతికి చెందిన ఆర్.జయంతన్ చెన్నై క్రోంపేటలో ‘నైంటీస్ మిఠాయి కడై’ పేరుతో ఆనాటి జ్ఞాపకాలను కొలువుతీర్చి దుకాణం ఏర్పాటు చేశారు. ఇందులోని వస్తువులను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటి తరానికి కూడా అందుబాటులోకి తెచ్చేఉద్దేశంతో జయంతన్ ప్రారంభించిన ఈ దుకాణం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టి కడత్తూరు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు ఆర్.జయంతన్ చెన్నైలోని ఓ కళాశాలలో ఎంటెక్ పూర్తి చేశారు. ఎంబీఏ పట్టభద్రురాలైన తన భార్య విద్య ఇచ్చిన సలహాతో విలక్షణంగా ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఉద్యోగం చూసుకునే బదులు వ్యాపార రంగంలోకిఅడుగుపెట్టి, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి గుర్తు చేసేలా చెన్నై క్రోంపేటలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఎనభై, తొంభై దశకాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్న వివిధ రకాల ఆట వస్తువులు, పెన్నులు, పుస్తకాలు, బ్యాగ్‌లు, బిస్కట్లు, చాక్లెట్లు వంటివి సేకరించి, తన దుకాణంలో కొలువుదీర్చారు. అలాగే ఆన్‌లైన్‌లోనూ వీటి అమ్మకాలను సాగించేందుకు'www.90smittaikadai.com' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ దుకాణంలోకి అడుగుపెడితే చాలు, నైంటీస్ నాటివారు తమ బాల్యజ్ఞాపకాల్లో తేలిపోతారు.వారి కళ్లలో ఆనందాన్ని చూస్తున్నా: ఆర్.జయంతన్మా దుకాణానికి వచ్చే నైంటీస్ తరంవారు తమ పిల్లలకు ఇక్కడి వస్తువులను ఒక్కొక్కటే చూపిస్తూ, వాటిని తాము ఎలా ఉపయోగించేవారో, ఎలా ఆటలాడే వారో వివరిస్తుంటే ఎనలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడికొచ్చే కస్టమర్ల కళ్లలో బాల్య స్మృతుల ఆనందాన్ని చూస్తున్నా. అప్పట్లో ఇలాంటివి కొనేందుకు డబ్బులు లేకున్నా, చూసి ఆనందంతో గంతులేసే వాళ్లం. ఇప్పుడుచేతిలో డబ్బులు ఉన్నా, ఈ వస్తువులు దొరకడం అరుదైపోయింది. అందుకే ఈ అరుదైన వస్తువులను వెతికి, ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మా దుకాణంలో విక్రయాలకు పెట్టాం. ఈ వస్తువులను నైంటీస్ తరంవారు తమ పిల్లలకు కొనివ్వడమే కాకుండా, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండటం సంతోషం కలిగిస్తోంది. ఇవి మరింత విస్తృతం కావాలన్న కాంక్షతోనే ఆన్‌లైన్‌లోనూ విక్రయాలను ప్రారంభించా. ఇందులో లాభాపేక్ష కన్నా, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి చేరవేయాలనేదే మా లక్ష్యం. దేశంలో ఏ మూలకైనా సరే ఈ వస్తువులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు నేను ఆడుకున్న వస్తువులు సైతం ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కొందరు కస్టమర్లు తమకు కావాల్సిన కొన్ని వస్తువులను సూచిస్తుంటారు. వారి ఆర్డర్‌కు తగినట్లుగా, వాటిని కొంత సమయం పట్టినా సరే సేకరించి లేదా తయారు చేయించి కొరియర్ ద్వారాపంపిస్తున్నాం. కనుమరుగైన వస్తువులు కూడా ఈ నైంటీస్ జమానా దుకాణంలో కనుమరుగైపోయిన పాతకాలం వస్తువులను కూడా కొలువుదీర్చారు. గ్రామఫోన్, కిరోసిన్ లాంతరు వంటి వస్తువులతో పాటు ఆనాటి గేమ్ కిట్స్, బొంగరాలు, కర్రా బిళ్ల, గోలీలు, నారింజ మిఠాయి, ఐస్ట్యూబ్, పాపిన్స్, ఫాంటమ్ స్వీట్ సిగరెట్లు, బొంబాయి మిఠాయి, టిట్ బిట్స్, అక్షరాలు, అంకెలతో కూడిన బిస్కట్లు, కిస్మీ బార్, చాక్లెట్లు, ట్రంప్ కార్డులు, కొయ్య బొమ్మలు, ఫ్రిజ్ మేగ్నెట్లు, రెండు నిబ్బుల ఫౌంటెన్ పెన్నులు, కాప్సూ్యల్పెన్నులు, కొయ్య పెన్నులు, హీరో పెన్నులు, కామ్లిన్ పెన్నులు, ఇన్విజిబుల్ పెన్నులు, ఇంక్ ఇరేజర్లు వంటి వస్తువులు, బొమ్మ కార్లు, బొమ్మ బైకులు, సైకిల్ హారన్లు, విసనకర్రలు, మౌతార్గాన్ వంటి సంగీత పరికరాలు, ఆనాటి సినిమా పాటల పుస్తకాలు వంటి ఎన్నోవస్తువులు ఈ దుకాణంలో ఐదు రూపాయలు మొదలుకొని పదిహేనువందల రూపాయలవరకు వివిధ ధరల్లో అందుబాటులోఉంటాయి. అస్మతీన్ మైదిన్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై (చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!) -
Ind vs Aus: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND U-19 Vs AUS U-19 Test Series: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో అండర్-19 అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా తొలి టెస్టులో యువ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సొంతగడ్డపై జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.కాగా ఓవర్‌నైట్ స్కోరు 110/4తో బుధవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా అండర్–19 జట్టు 67.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. రిలీ కింగ్సెల్ (48; 7 ఫోర్లు, ఒక సిక్స్) ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ కాగా... ఎయిడెన్ ఓ కానర్ (38 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. ఇక యువ భారత బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ మహమ్మద్ ఇనాన్ ఆరు వికెట్లతో చెలరేగాడు.మరోవైపు.. కెప్టెన్ సొహమ్ పట్వర్ధన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువభారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 61.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి జయభేరి మోగించింది.అయితే, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ (1) విఫలం కాగా.. నిత్య పాండ్యా (86 బంతుల్లో 51; 3 ఫోర్లు), నిఖిల్ కుమార్ (71 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఛేజింగ్‌లో ఒత్తిడి పెరిగిపోతున్న సమయంలో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన నిఖిల్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఎయిడెన్ ఓ కానర్ నాలుగు, విశ్వ రామ్‌కుమార్ మూడు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో అనధికారిక టెస్టు మొదలు కానుంది. చదవండి: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్.. రజినీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని విజయ్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ సార్ పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. అియితే అనారోగ్యంతో తలైవా సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చెన్నై అపోలో వైద్యులు చికిత్స అందించారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ ఉందని తెలిపారు. రెండో రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని బులెటిన్ విడుదల చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ చిత్రంతో అభిమానులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. రజినీకాంత్ సైతం ప్రస్తుతం దసరా బరిలో నిలిచారు. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో ఆయన నటించిన వేట్టైయాన్ ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டு குணமடைந்து வரும் சூப்பர் ஸ்டார் திரு. @rajinikanth sir அவர்கள் விரைவில் பூரண உடல்நலத்துடன் வீடு திரும்ப வேண்டும் என்று உளமார இறைவனை வேண்டுகிறேன்.— TVK Vijay (@tvkvijayhq) October 1, 2024 -
Ind vs Aus: భారత బ్యాటర్ రికార్డు.. ప్రపంచంలోనే తొలిసారి
U19 Ind vs Aus Day 1 Final Update: ఆస్ట్రేలియా అండర్–19 జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్–19 జట్టు అనధికారిక టెస్టు సిరీస్‌ను కూడా మెరుగ్గా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు ప్రారంభమైంది. 293 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71.4 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్సెల్ (77 బంతుల్లో 53; 9 ఫోర్లు, ఒక సిక్సర్), ఎయిడెన్ ఓ కానర్ (70 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత జట్టు బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఇనాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 81 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), విహాన్ మల్హోత్రా (21 బ్యాటింగ్, 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న యువ భారత్... ప్రత్యర్థి స్కోరుకు 190 పరుగులు వెనుకబడి ఉంది. వైభవ్ రికార్డు అర్ధ శతకం అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా యువ భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల్లోకెక్కాడు. వైభవ్ 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ఏ స్థాయి క్రికెట్లోనైనా ఇదే అతి పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉంది. శ్రీలంకపై నజ్ముల్ ఈ రికార్డు నమోదు చేశాడు.సమిత్ ద్రవిడ్‌కు గాయం భారత అండర్–19 జట్టులో సభ్యుడైన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ మోకాలి గాయం కారణంగా ఆ్రస్టేలియాతో అనధికారిక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ వరకూ అతడు కోలుకోవడం అనుమానమే. ప్రస్తుతం సమిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. ఇటీవల యూత్ వన్డే సిరీస్‌కు కూడా గాయం కారణంగానే దూరమైన సమిత్... కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భారత అండర్–19 జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్ తెలిపాడు. అండర్–19 స్థాయిలో ఆడేందుకు సమిత్ ద్రవిడ్‌కు ఇదే చివరి అవకాశం కాగా... ఈ నెల 11న అతడు 19వ పడిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో 2026లో జరగనున్న అండర్–19 ప్రపంచకప్‌లో ఆడే అర్హత కోల్పోయాడు. -
అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (73) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 1 మంగళవారం నాడు ఆయనకు పలు వైద్య పరీక్షలను చేయనున్నారు. ఈ క్రమంలో ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఆయనకు అందించనున్నట్లు తెలుస్తోంది. గుండెకు సంబంధించిన పరీక్షలు ఆయనకు చేయనున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. రొటీన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి లతా రజనీకాంత్ వెళ్లడించారు.జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేట్టైయన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని రజనీ చెన్నై వచ్చారు. ఇంతలో ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితం సింగపూర్‌లో రజనీకాంత్ కిడ్నీ మార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: 'హీరోతో విడాకులు.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం' -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం
చెన్నై : తమిళనాడు కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రి వర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకున్నారు సీఎం స్టాలిన్. డిప్యూటీ సీఎంగా ఉదయనిది స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాజ్ భవన్లో గవర్నర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురి మంత్రుల శాఖల్ని మార్చారు సీఎం స్టాలిన్. ఈడీ దర్యాప్తు చేసిన అవినీతి కేసులో అరెస్టయి బెయిల్‌పై ఉన్న సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రిపదవి దక్కింది. 👉 చదవండి : చంద్రబాబు పొలిటికల్ జాదు -
భారత్‌లో సిస్కో తొలి ప్లాంట్
చెన్నై: డిజిటల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలో ఉన్న యూఎస్ దిగ్గజం సిస్కో తాజాగా భారత్‌లో తొలి ప్లాంటును ప్రారంభించింది. చెన్నైలోని ఈ కేంద్రంలో రూటింగ్, స్విచింగ్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఈ ఫెసిలిటీ ద్వారా తమిళనాడులో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు అభిస్తాయని కంపెనీ ప్రకటించింది.ఎగుమతులతో కలుపుకుని ఏటా 1.3 బిలియన్ డాలర్ల ఆదాయ నమోదుకు అవకాశం ఉందని వెల్లడించింది. చెన్నైలో తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి, విస్తరణకు ఫ్లెక్స్‌తో సిస్కో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ప్రారంభంలో సిస్కో నెట్వర్క్ కన్వర్జెన్స్ సిస్టమ్–540 సిరీస్ రూటర్ల తయారీపై దృష్టి పెడుతుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతరాదిత్య సింధియా చేతుల మీదుగా ప్లాంటు ప్రారంభం అయింది. -
పెదవుల అందం.. పదవికి చేటు!
ఆడాళ్లు అనుకువగా ఉండడం అసాధ్యమంటారు పెద్దలు.. ఇది అక్షరాలా నిజం అనిపించే ఘటన చెన్నై నడిరోడ్డున కార్పొరేషన్ కార్యాలయం సాక్షిగా చోటు చేసుకుంది. ఒక ఒరలో రెండు కత్తులు.. సాధ్యం కాదనేలా.. కార్పొషన్ను శాసించే మేయర్‌కు.. ఆమెకు సహాయకారిగా ఉండే మహిళా దఫేదార్కు మధ్య ఏర్పడిన చిరు వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి రచ్చకెక్కింది. చివరికి ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది... అదెలాగో మీరూ చూడండి! సాక్షి, చెన్నై: నగర కార్పొరేషన్లో మహిళలు పెదావుల కు వేసుకునే లిప్‌స్టిక్ వ్యవహారం బుధవారం పెద్ద చర్చకే దారి తీసింది. మేయర్ ప్రియ వెన్నంటి ఉండే మహిళా దఫేదార్ మాధవి బదిలీ ఈ లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు తెచ్చింది. వివరాలు.. చెన్నై కార్పొరేషన్లో గత 15 ఏళ్లుగా మాధవి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డీఎంకే మేయర్ ఆర్ ప్రియకు దఫేదార్‌గా ఉన్నారు. హఠాత్తుగా మాధవిని మనలి మండలానికి బదిలీ చేశారు. అలాగే ఆమెకు ఓ మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు వచ్చింది. మేయర్ ఆర్.ప్రియతో సమానంగా మాధవి లిప్‌స్టిక్ వేసుకుని రావడమే ఈ బదిలీకి కారణం అనే చర్చ జోరందుకుంది.మేయర్ వేసుకునే రంగులోనే లిప్‌స్టిక్‌ను ఆమె అనేక సందర్భాలలో వేసుకుని రావడాన్ని ప్రియ పీఏలు ఖండించినట్టు సమాచారం. చిన్నతనం నుంచి తాను లిప్‌స్టిక్ వాడుతున్నాని, తనకు నచ్చిన రంగు,ఫ్లేవర్ వాడుతానని, దీనిని హఠాత్తుగా మార్చుకోమడం సబబు కాదని వారికి మాధవి సూచించిన నేపథ్యంలో ఈ బదిలీ వేటు పడటమే కాకుండా, ఆమె సరిగ్గా పనిచేయడం లే దంటూ మెమో జారీ చేసినట్టు కార్పొరేషన్లో చర్చ ఊ పందుకుంది. ఈ విషయంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ, తాను వేసుకునే లిప్‌స్టిక్, మేయర్ వేసుకునే లిప్‌స్టిక్ ఒకే విధంగా ఉందని పేర్కొంటున్నారని వాపోయారు. తనకు నచ్చిన రంగు తాను వాడుతున్నానని, ఇది తన వ్యక్తిగతం అని వ్యాఖ్యలు చేశారు. పురుష దఫేదార్ ఇంటికి వెళ్లి పోయినా, తాను మాత్రం కుటుంబాన్ని సైతం వీడి మేయర్‌కు వెన్నంటి రేయింబవళ్లు శ్రమించినందుకు మంచి గుర్తింపునే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా వీరికి మరో రెండేళ్లు పదవి ఉండవచ్చునని, తాను ఓ ఉద్యోగిని అని, తన జర్నీ మరింతగా కార్పొరేషన్లో కొనసాగాల్సి ఉంటుందని వ్యాఖ్యనించడం కొనమెరుపు. -
ఆరుగురు బిడ్డలున్నా.. అనాథలే!
సాక్షి, చైన్నె: ఆరుగురు పిల్లలు ఉన్నా, అనాథలుగా జీ వించాల్సి రావడం ఆ వృద్ధ జంటను తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. ఒక్కోనెల ఒకొక్కరి ఇంటి నుంచి ఆహారం వస్తున్నా, తమతో ప్రేమగా మా ట్లాడే వారు లేక, అనారోగ్యంతో భార్య పడుతున్న వేదనను చూడ లేక ఆమెను హత్య చేశాడు. బుధ వారం కన్యాకుమారి జిల్లా కురుందన్ కోడు ఆచారి పల్లం గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన చంద్రబోస్(83), లక్ష్మీ(75) దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా ఆ పరిసర గ్రామాలలో తమ తమ కుటుంబాలతో ఉంటున్నారు. నెలకు ఒక ఇంట్లో నుంచి ఆహారం మాత్రం ఈ దంపతులకు వచ్చి చేరుతుండేది. అయితే వృద్ధాప్యంతో వీరు పడుతున్న బాధలు, ఆరోగ్య సమస్యలు ఆ కుమారులు, కుమార్తెల కంట పడ లేదు. మధుమేహం మరీ ఎక్కవ కావడంతో భార్య లక్ష్మి మూడు నెలలుగా మంచానికే పరిమితం కావడం చంద్రబోస్‌ను మరింత వేదనకు గురి చేసింది. తనకు సైతం చూపు మందగించడంతో ఆమెను చూసుకోలేని పరిస్థితి. మంచానికి పరిమితమైన ఆమె వీపు భాగం అంతా పుండు ఏర్పడి ఆ నొప్పితో లక్ష్మీపడుతున్న బాధ ఆయనను కలచి వేసింది. తమను చూసుకునే వారు లేక పోవడంతో ఇంట్లో ఉన్న కత్తి ద్వారా లక్ష్మి గొంతు కోసేశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఇంటి గుమ్మం ముందు బైటాయించాడు. బుధవారం ఉదయం అటు వైపుగా వచ్చిన చిన్నకుమార్తె చంద్రకుమారి తండ్రి గొంతు భాగం నుంచి రక్తం కారుతుండటం, లోపల తల్లి గొంతు కోయబడ్డ స్థితిలో మరణించడం చూసి ఆందోళనతో అన్నలు, అక్కలకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు, గాయాలతో పడి ఉన్న చంద్రబోస్‌ను ఆస్పత్రికి తరలించారు. చంద్రబోస్ వద్ద జరిపిన విచారణలో తన భార్య పడుతున్న వేదనతో హత్య చేసినట్టు, తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు గొంతు కోసుకున్నట్టు పోలీసులకు వివరించారు. పొడి పొడి మాటలతో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు బిడ్డలు ఉన్నా అనాథగా బతికి , చివరకు తన భార్యను హత్య చేసి, ఆతర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఈ వృద్ధుడి దీన గాథ ఆ పరిసర వాసులను కలచి వేసింది. -
మా వాళ్లకు ఇలాంటివి చేతకావు: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్‌ల తయారీ ఎలా ఉండాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. చెన్నై వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు అద్భుతంగా సాగిందని.. ఇందుకు పిచ్ క్యూరేటర్లే కారణమని కొనియాడాడు.280 పరుగుల తేడాతో విజయంకాగా పాకిస్తాన్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ప్రస్తుతం భారత్ టూర్లో ఉంది. ఇందులో భాగంగా చెపాక్ వేదికగా సెప్టెంబరు 19న మొదలైన తొలి టెస్టు మూడున్నర రోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.అయితే, పేసర్లకు అనుకూలంగా ఉండే ఎర్రమట్టి పిచ్‌పై జరిగిన భారత్- బంగ్లా మ్యాచ్‌లో ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటగా.. పాతబడే కొద్ది స్పిన్నర్లు దుమ్ములేపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. చెన్నై పిచ్ క్యూరేటర్ల పనితనాన్ని ప్రశంసించాడు.ప్రతి బౌలర్ వికెట్లు తీశాడు‘‘బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. జడేజా ఐదు వికెట్లు కూల్చాడు. సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా టీమిండియా 20 వికెట్లూ పడగొట్టింది. జట్టులోని ప్రతి బౌలర్ అన్ని రకాలుగా పరీక్షలో పాసయ్యారు.మా వాళ్లకు ఇలాంటివి సాధ్యం కావుపిచ్ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేసిన భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లనూ తుదిజట్టులోకి తీసుకుంది. అందుకు తగ్గట్లుగానే మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్ బౌలర్లు ప్రభావం చూపారు. ఈ మ్యాచ్ ఇంత బాగా సాగడానికి కారణం పిచ్ క్యూరేటర్లు. క్రెడిట్ మొత్తం వాళ్లకే ఇవ్వాలి. టెస్టు మ్యాచ్‌ను ఎలా నిర్వహించాలో వారికి ఎంతబాగా తెలుసో మ్యాచ్ చూశాక అర్థమైంది.మా వాళ్లకు మాత్రం ఇలాంటివి సాధ్యం కావు. మా దేశంలో పిచ్‌లకు ఎలాంటి విలువా లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి వాళ్లు నిరక్షరాస్యులేనని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు ఆడినందుకు గర్వపడే తనకు.. ఇప్పటి పిచ్ క్యూరేటర్లను చూసి కోపం వస్తోందంటూ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఆడించింది.చదవండి: రోహిత్‌పై విమర్శలు.. ఎన్ని పరుగులు చేస్తారో చేయండి! పంత్ చెప్పిందిదే! -
రోహిత్‌పై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన పంత్!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా మరో ముందడుగు వేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసింది. తొలి టెస్టులో గెలుపొంది.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. చెన్నైలోని చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 280 పరుగులతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.పునరాగమనంలో పంత్ అదుర్స్.. కానీ రాహుల్ మాత్రంఅయితే, బంగ్లాదేశ్ కూడా అంత తేలికగా రోహిత్ సేన ముందు తలొగ్గలేదు. ఆరంభంలో గట్టిపోటీనిచ్చింది. తమ స్థాయికి మించిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే, టీమిండియా సమిష్ఠిగా రాణించడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో చెపాక్ మ్యాచ్ ద్వారా ద్వారా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, సీనియర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో పునరాగమనం చేశారు.పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులకే పరిమితమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ(109)తో దుమ్ములేపాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం తనను తాను నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులే చేసిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులతో ఆడుతున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఫలితంగా రాహుల్ మైదానాన్ని వీడకతప్పలేదు.రోహిత్‌పై విమర్శలుఅయితే, రాహుల్‌కు మరికొంత సేపు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాల్సిందని.. అలా అయితే, అతడు ఫామ్‌లోకి వచ్చేవాడంటూ అభిమానులు రోహిత్ శర్మ నిర్ణయాన్ని విమర్శించారు. ఈ విషయంపై రిషభ్ పంత్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. ‘‘మేము భోజన విరామానికి వెళ్లినపుడే ఇన్నింగ్స్ డిక్లరేషన్ గురించి చర్చ జరిగింది.ఎవరు ఎన్ని పరుగులు చేస్తారో చేయండిఅప్పుడు రోహిత్ భాయ్.. ‘ఇంకో గంటసేపు మనం బ్యాటింగ్ చేస్తాం. ఈలోపు ఎవరు ఎన్ని పరుగులు చేస్తారో చేయండి’ అని చెప్పాడు. దీంతో.. తిరిగి బ్యాటింగ్‌కు వెళ్లగానే వీలైనన్ని రన్స్ చేయాలని నిర్ణయించుకున్నా. ఏమో నేను ఇంకాసేపు క్రీజులో ఉంటే 150 పరుగులు కూడా చేసేవాడిని’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. తద్వారా రాహుల్ విషయంలో రోహిత్‌ను విమర్శిస్తున్న వాళ్ల నోళ్లకు తాళం వేశాడు.కాగా ఈ మ్యాచ్‌లో పంత్‌తో పాటు శుబ్‌మన్ గిల్ శతకంతో అలరించాడు. అయితే, గిల్ 119, కేఎల్ రాహుల్ 22 కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అప్పటికి టీమిండియా 514 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల రూపంలో ముందుంచాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్ కావడంతో భారీ తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. చదవండి: రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే: బంగ్లాదేశ్ క్రికెటర్Rishabh pant bodied all haters who trolled Rohit sharma for not giving enough time to kl Rahul at the creasepic.twitter.com/MVPiWkhr4w— Gillfied⁷⁷ (@Gill_era7) September 22, 2024 -
పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
చెన్నై: ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల ఉద్యోగిని పని ఒత్తిడితో మృతిచెందిన ఘటన మరవక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మ హత్య చేసుకొని ఉంటాడని అతని భార్య అనుమానం వ్యక్తం చేసినట్లు పోలిసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కార్తికేయ టెక్కీగా పని చేస్తున్నారు. ఇక.. కార్తికేయ తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడు.ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం ఆయన భార్య కె జయరాణి.. పిల్లలను తన తల్లి వద్దకు దింపి, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లూరు ఆలయానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఇంట్లో నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి స్పేర్ కీని ఉపయోగించి లోపలికి వెళ్లగా.. కార్తికేయ కరెంట్ తీగకు చుట్టుకొని విగతజీవిగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదికూడా చదవండి: పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం -
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం
బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తమ దేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ 2005లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు 90 టెస్టులు, 271 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 5892, వన్డేల్లో 7792, టీ20లలో 1500 పరుగులు సాధించాడు. అయితే, టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముష్ఫికర్ పెద్దగా రాణించలేకపోయాడు.తమీమ్ ఇక్బాల్‌ను అధిగమించితొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 13 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, మొత్తంగా 21 పరుగులు చేయగలిగిన ముష్ఫికర్.. తన అంతర్జాతీయ కెరీర్లో 15,196 రన్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్(15192)ను అధిగమించి.. బంగ్లాదేశ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.ఇంకో 357 పరుగులు అవసరంఇదిలా ఉంటే.. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొందాలంటే ఇంకో 357 పరుగులు అవసరం. టీమిండియా బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకటి, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించడం గమనార్హం. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు15196- ముష్ఫికర్ రహీం *15192- తమీమ్ ఇక్బాల్14696- షకీబ్ అల్ హసన్10694- మహ్మదుల్లాచదవండి: భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.. టీమిండియాదే విజయం! -
డకౌట్ని మరిపించి.. సెంచరీతో చెలరేగిన గిల్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు. శనివారం నాటి మూడో రోజు ఆట భోజన విరామ సమయానికి 137 బంతులు ఎదుర్కొన్న గిల్.. 86 పరుగులు సాధించాడు.రెండో ఇన్నింగ్స్‌లోనే ఇలాబ్రేక్ తర్వాత తిరిగొచ్చి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ వన్‌డౌన్ బ్యాటర్ గత నాలుగు టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ శతకాలతో పాటు.. ఒక సెంచరీ సాధించాడు. తాజాగా మరోసారి రెండో ఇన్నింగ్స్‌లోనే శతకంతో సత్తా చాటడం విశేషం. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా గురువారం మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. పంత్ కూడా శతకం బాదాడుఈ క్రమంలో 83/3 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు గిల్, పంత్ శుభారంభం అందించారు. వీరిద్దరి శతకాల కారణంగా టీమిండియాకు ఏకంగా 514 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో గిల్.. 119 పరుగుల వద్ద ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని విధించింది.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులుతుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
Ind vs Ban: ముగిసిన మూడో రోజు ఆట.. బంగ్లా @158/4
India vs Bangladesh, 1st Test Chennai Day 3 Updates: వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించారు. అప్పటికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. విజయానికి 357 పరుగుల దూరంలో ఉంది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు ఒకటి, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకు ముందు 287/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. బంగ్లాకు 515 పరుగుల టార్గెట్ విధించింది. శుబ్‌మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109) శతకాలతో అదరగొట్టారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులు33.4:నాలుగో వికెట్ డౌన్ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్ పెవిలియన్‌చేరాడు. బంగ్లా స్కోరు: 146/4 (33.4) . లక్ష్యానికి ఇంకా 369 పరుగుల దూరంలో ఉంది.29.6: మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్అశ్విన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా మొమినుల్ హక్(13) వెనుదిరిగాడు. క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ముష్ఫికర్ హీం క్రీజులోకి వచ్చాడు. షాంటో 36 పరుగులతో ఆడుతున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్అశ్విన్ బౌలింగ్‌లో షాద్మన్ ఇస్లాం(35) గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొమినుల్ హక్ క్రీజులోకి వచ్చాడు. నజ్ముల్ షాంటో 14 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 86-2.16.2: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బుమ్రా బౌలింగ్‌లో జకీర్ హసన్ 33 పరుగుల వద్ద నిష్క్రమించాడు. షాద్మన్ ఇస్లాం 26 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ స్కోరు: 62/1 (16.2) బంగ్లా స్కోరు @ టీ బ్రేక్ 56/0(13)భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ టీ బ్రేక్ సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం 21, జకీర్ హసన్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.బంగ్లాదేశ్ లక్ష్యం 515భారీ ఆధిక్యంలో ఉన్న టీమిండియా 287/4 స్కోరు వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొత్తంగా 514 పరుగుల లీడ్‌లో ఉన్న భారత్.. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది.భారత్‌కు 502 పరుగుల ఆధిక్యంగిల్, పంత్ సెంచరీల కారణంగా 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ 506 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.గిల్ శతకం59.4: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న గిల్. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన గిల్.. ఇప్పుడిలా శతక్కొట్టడం విశేషం. రాహుల్ 10, గిల్ 100 పరుగులతో క్రీజులో ఉన్నారు. సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. వికెట్ డౌన్54.4: గిల్‌తో కలిసి బజ్‌బాల్ తరహాలో దూకుడు పెంచిన రిషభ్‌పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండు రన్స్ తీసి వంద పరుగుల మార్కు అందుకున్నాడు.అయితే ఆమరుసటి ఓవర్ మూడో బంతికే మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో పంత్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 234-4(56). 461 పరుగుల ఆధిక్యం.లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 205/3 (51)శుబ్‌మన్ గిల్ 86, రిషభ్ పంత్ 82 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లాదేశ్ కంటే టీమిండియా 432 పరుగుల ఆధిక్యం(తొలి ఇన్నింగ్స్ కలుపుకొని)లో ఉంది. సెంచరీకి చేరువైన గిల్శుబ్మన్ గిల్ శతకానికి చేరువయ్యాడు. 50 ఓవర్లు ముగిసే సరికి 136 బంతులు ఎదుర్కొన్న అతడు 85 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరోవైపు పంత్ 73 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా 422 పరుగుల ఆధిక్యంలో ఉంది.దంచి కొడుతున్న గిల్, పంత్గిల్ 75, పంత్ 72 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 48 ఓవర్లలో టీమిండియా స్కోరు: 184/3.పంత్ హాఫ్ సెంచరీ43.3: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి పంత్ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. గిల్, పంత్ నిలకడగా ఆడుతుండటంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. 44 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 151-3. బంగ్లాదేశ్‌పై 378 పరుగుల ఆధిక్యం.గిల్ హాఫ్ సెంచరీ29.5వ ఓవర్: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి సైతం గిల్ సిక్స్ కొట్టడం విశేషం. టీమిండియా స్కోరు: 114-3(30).సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా28.5వ ఓవర్: బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో పంత్ ఫోర్ బాదడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగుల మార్కు అందుకుంది. 29 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 100-3. పంత్ 25, గిల్ 39 పరుగులతో ఆడుతున్నారు.టీమిండియా రెండో ఇన్నింగ్స్- ఓవర్ నైట్ స్కోరుశుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 23.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. 308 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కాగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 10, రోహిత్ శర్మ 5 పరుగులతో నిరాశపరచగా.. విరాట్ కోహ్లి సైతం 17 పరుగులకే నిష్క్రమించాడు. శుబ్‌మన్ గిల్ 34, రిషభ్ పంత్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు సెప్టెంబరు 19- 23వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నైటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
పంత్‌పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు వికెట్ దక్కకపోవడానికి పరోక్ష కారణమైనందుకు ఫైర్ అయ్యాడు. అయితే, పొరపాటును తెలుసుకున్న పంత్ తనకు సారీ చెప్పడంతో సిరాజ్ శాంతించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.టీమిండియా 376 ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో చెన్నైలో ఇరు జట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 376 పరుగుల వద్ద ఆలౌట్ అయిన భారత్... తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు కూల్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) పాపం సిరాజ్నిజానికి ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కు మూడో వికెట్ కూడా దక్కేది. కానీ పంత్ కారణంగా మిస్ అయ్యింది. అసలేం జరిగిందంటే.. బంగ్లా ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న జకీర్ హసన్.. ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అయినట్లు సిరాజ్ భావించాడు. దీంతో వికెట్ కోసం బిగ్గరగా అప్పీలు చేశాడు.రివ్యూ వద్దని చెప్పాడుఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ .. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను సంప్రదించగా... ‘‘బాల్ మరీ అంత హైట్‌కి రాలేదు. కానీ లెగ్ స్టంప్ మాత్రం మిస్సవుతోంది’’ అని బదులిచ్చాడు. దీంతో రివ్యూ తీసుకోవాలన్న సిరాజ్ అభ్యర్థనను రోహిత్ తిరస్కరించాడు. కానీ.. రీప్లేలో జకీర్ అవుటైనట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. పంత్ చేయి పైకెత్తుతూ సారీ అన్నట్లుగా సైగ చేశాడు. అలా పంత్ చెప్పింది రోహిత్ విన్న కారణంగా సిరాజ్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.చదవండి: హెడ్ ఊచకోత.. పరుగుల విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు pic.twitter.com/bcyWefmJ7H— Nihari Korma (@NihariVsKorma) September 20, 2024 -
ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని చేయి చేసుకుంటే..
చెన్నై: ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడం..ఓ విద్యార్థి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చెన్నైకి చెందిన పవిత్రన్(19) బీకాం చదువుకుంటూ తీరిక వేళల్లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన కొరట్టూర్ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్డర్‌ను అందజేయడానికి పవిత్రన్ బయలుదేరాడు. లొకేషన్ గుర్తించి, చేరుకోవడంలో ఆలస్యమైంది. ఈ విషయంలో మహిళా కస్టమర్‌తో పవిత్రన్‌కు వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆమె అతనిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత పవిత్రన్ రాయి విసరడంతోనే తన ఇంటికి కిటికీ అద్దం పగిలిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పవిత్రన్ తన ఇంట్లో ఉరి వేసుకుని, తనువు చాలించాడు. ఫుడ్ డెలివరీ ఆలస్యమైనందుకు మహిళా కస్టమర్ తనను కొట్టడంతో తీవ్ర మనస్తాపంతో ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగ్లాదేశ్ జట్టుకు రోహిత్ శర్మ వార్నింగ్
ప్రత్యర్థి ఎవరన్న అంశంతో తమకు పనిలేదని.. గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో తమకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమేనని పేర్కొన్నాడు. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని పేర్కొన్నాడు.బంగ్లాదేశ్ ముచ్చటపడుతోంది.. కానీఏదేమైనా.. ఆరు నెలల పాటు టెస్టులకు దూరం ఉండటం కచ్చితంగా ప్రభావం చూపుతుందని.. అయితే, తమ జట్టులోని చాలా మంది క్రికెటర్లు దేశవాళీ టోర్నీలు ఆడటం సానుకూల అంశమని రోహిత్ అన్నాడు. బంగ్లాదేశ్ తమను ఓడించాలని ముచ్చటపడుతోందని.. అయితే, వారి ఆశ నెరవేరదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ కూడా ఇలాగే చాలెంజ్ చేసి బోల్తా పడిందని రోహిత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇక చివరగా తాము ఇంగ్లండ్‌తో ఆడిన సిరీస్‌కు చాలా మంది ఆటగాళ్లు గాయాల వల్ల దూరమయ్యారని.. ఇప్పుడు మాత్రం దాదాపుగా అందరూ అందుబాటులో ఉండటం అదనపు బలమని హర్షం వ్యక్తం చేశాడు.ప్రతి ఒక్క మ్యాచ్ మాకు కీలకమేకాగా డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగంగా సెప్టెంబరు 19 నుంచి టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. చెన్నై, కాన్పూర్ ఇందుకు వేదికలు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే తొలి టెస్టుకు జట్టును ప్రకటించగా.. చెన్నై చేరుకుని శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నారు ఆటగాళ్లు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘దేశం కోసం ఆడే ప్రతి ఒక్క మ్యాచ్ మాకు కీలకమే. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఇదొక రిహార్సల్‌లా మేము భావించడం లేదు. ఎందుకంటే.. డబ్ల్యూటీసీ పాయింట్లు గెలవాలంటే ప్రత్యర్థి ఎవరైనా తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. మేము దాదాపుగా ఆరు- ఏడు నెలల పాటు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నాము.అయితే, జట్టులోని అత్యధిక మంది అనుభవజ్ఞులే. మరికొందరేమో దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆడి ఫామ్‌లోకి వచ్చారు. కాబట్టి బంగ్లాదేశ్‌తో టెస్టులకు మేము అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నాము. చిన్నపాటి విరామం వల్ల పెద్దగా ప్రభావం ఉండబోదు.జట్టు ఏదైనా మా లక్ష్యం ఒకటేఇక ఏ జట్టైనా సరే టీమిండియాను ఓడించాలనే కోరుకుంటోంది. బంగ్లాదేశ్ కూడా ముచ్చటపడుతోంది. అయితే, మాకు ఇప్పటికే అన్ని జట్లతో ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా అయినా.. బంగ్లాదేశ్ అయినా.. మా వ్యూహాలు అంతే పటిష్టంగా ఉంటాయి. గెలుపే మా అంతిమ లక్ష్యం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. బంగ్లా జట్టుకు రోహిత్ కౌంటర్కాగా ఇటీవల.. పాకిస్తాన్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన జోరుమీదున్న బంగ్లాదేశ్.. టీమిండియాపై గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ ఈ మేర కౌంటర్ ఇచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ తర్వాత న్యూజిలాండ్(3), ఆస్ట్రేలియా(5)తో టెస్టు సిరీస్ ఆడనుంది. టీమిండియా చివరగా ఆరు నెలల క్రితం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడి 4-1తో గెలిచింది.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్ -
జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్.. వీడియో
చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతుంది. భారత ఆటగాళ్లంతా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. కుల్దీప్, సిరాజ్, బుమ్రా, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రోహిత్, విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్, ధృవ్ జురెల్, అశ్విన్, జడేజా, యశస్వి, గిల్ ఈ వీడియోలో ఉన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియాకు సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ సహచరులతో గేమ్ ప్లాన్స్ డిస్కస్ చేస్తున్నాడు.Team India's practice session at the Chepauk Stadium. 🇮🇳pic.twitter.com/WM8piciC03— Mufaddal Vohra (@mufaddal_vohra) September 14, 2024కాగా, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు వారం రోజుల ముందుగానే ప్రాక్టీస్ షూరు చేసింది. భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. బంగ్లాతో సిరీస్‌ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపైనే ఘోరంగా ఓడించింది. ఈ కారణంగానే భారత్ బంగ్లాదేశ్‌ను లైట్‌గా తీసుకోదలచుకోలేదు. టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్ తమదైన రోజున అద్భుతాలు చేయగలదు.Virat Kohli in the batting practice session at Chepauk yesterday. 🔥- The GOAT is getting ready to Rule..!!!! 🐐pic.twitter.com/g3O1Q9eHaR— Tanuj Singh (@ImTanujSingh) September 15, 2024ఇదిలా ఉంటే, రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలోని తొలి టెస్ట్ చెన్నై వేదికగా, రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా జరుగనున్నాయి. రెండో టెస్ట్ సెప్టెంబర్ 27న మొదలవుతుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి. టీమిండియాతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. టీమిండియా మాత్రం తొలి టెస్ట్‌కు మాత్రమే జట్టును ప్రకటించింది.టీమిండియాతో టెస్ట్ సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, మొమినుల్ హక్, షకీబ్ అల్ హసన్, మెహిది హసన్ మీరజ్, ముష్ఫికర్ రహీం, లిట్టన్ దాస్, జాకిర్ అలీ, జాకిర్ హసన్, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్, నహిద్ రాణా, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. విజేత ఎవరో చెప్పేసిన షమీ! -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ సాయివిష్ణు అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్ అంటూ భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నైలో జరిగిన మేఘా ఆకాష్, సాయివిష్ణు వివాహ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు డీఎంకే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ( ఇది చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు)కాగా.. నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది మేఘా ఆకాశ్. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో 'లై'తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది. కోలీవుడ్‌లో 2019లో పెట్టా మూవీతో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. ఎన్నై నోకి పాయుమ్ తోట, వంద రాజావ తాన్ వరవానే చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా సబానాయగన్, వడకుపట్టి రామసామి సినిమాలతో మెప్పించింది. சென்னையில் நடைபெற்ற தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டி முன்னாள் தலைவர் திரு. சு.திருநாவுக்கரசர் அவர்களின் மகன் எஸ்.ஆர்.டி.சாய் விஷ்ணு - மேகா ஆகாஷ் ஆகியோரது திருமண வரவேற்பு நிகழ்ச்சியில் மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் கலந்துகொண்டு மரக்கன்று பசுமைக்கூடை வழங்கி மணமக்களை… pic.twitter.com/OQXqNfAowD— CMOTamilNadu (@CMOTamilnadu) September 14, 2024 View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
Ind vs Ban: కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్.. జట్టుతో చేరిన కొత్త కోచ్
దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. సొంతగడ్డపై సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం(చెపాక్) స్టేడియం వేదిక. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడుకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది.సీనియర్లంతా వచ్చేశారుభారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా శుక్రవారం నాటి నెట్ సెషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన కోహ్లికాగా శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత లండన్ వెళ్లిపోయిన విరాట్ కోహ్లి.. నెల రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడే మళ్లీ ఇండియాకు తిరిగొచ్చాడు. వచ్చీ రాగానే యాక్షన్‌లో దిగాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సమక్షంలో కోహ్లి తొలి రోజు దాదాపుగా 45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసినట్లు సమాచారం.మూడేళ్ల తర్వాత తాను తొలిసారిగా చెన్నైలో తొలి టెస్టు ఆడనున్న నేపథ్యంలో.. అభిమానులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కోహ్లి ఇలా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చెపాక్ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు టెస్టులు ఆడిన ఈ ఢిల్లీ బ్యాటర్... ఒక సెంచరీ సాయంతో 267 పరుగులు చేశాడు.టీమిండియాతో చేరిన మోర్నీ మోర్కెల్నూతన బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమిండియాతో చేరాడు. హెడ్‌కోచ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, డష్కాటేలతో కలిసి రోహిత్ సేన ప్రాక్టీస్‌ను గమనించాడు. కాగా స్వదేశంలో ఓ సిరీస్‌కు ముందు భారత జట్టు వారం రోజుల పాటు ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొనడం ఇదే తొలిసారి.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. బంగ్లాదేశ్ టెస్టు జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్, జాకీర్ హసన్, మోమినుల్, ముష్ఫికర్, షకీబుల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, జాకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్, మెహమూదుల్ హసన్, నయీమ్, ఖాలిద్ అహ్మద్. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్ -
బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ
ముంబై: వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 20 నెలల తర్వాత టెస్టు ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 7, 61 పరుగులు చేశాడు. ఈ నెల 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం రాత్రి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లి తిరిగి రాగా... ఉత్తర ప్రదేశ్ పేస్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోకపోవడంతో... సెలెక్టర్లు యశ్ దయాల్‌కు అవకాశం కలి్పంచారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లాడిన యశ్ దయాల్ 76 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా... ఇతర ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేశాడు. తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. -
అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం! ఇక్కడ కళ్యాణం..
చెన్నైనగర శివారు ప్రాంతమైన తిరువొట్రియూర్లో అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం ఉంది. అత్యద్భుతమైన శిల్పసౌందర్యంతో, అణువణువునా సొగసైన పనితనం ఉట్టిపడే ఈ ప్రాచీన కట్టడం త్యాగరాజస్వామి ఆలయమైతే, ఈ ఆలయ ప్రాంగణంలోనే పరమశివుడు తన భక్తుడైన సుందరుని కల్యాణాన్ని జరిపించిన వృక్షం నేటికీ భక్తులకు దర్శనమిస్తూ, వారి మనోరథాలను నెరవేరుస్తుంటుంది.స్వామివారి సన్నిధికి కుడివైపునే వడి ఉడై అమ్మన్ ఆలయం ఉంది. ఎడమవైపున జగన్నాథుడు, జగదాంబికల సన్నిధులు నేత్రపర్వం చేస్తుంటాయి. ఆ పక్కనే వినాయకుడు, కుమారస్వామి, బాలపరమేశ్వరుడు, కాళికాంబ సన్నిధులు కనువిందు చేస్తూ, భక్తులకు పరమశివుడి సాన్నిధ్యాన్ని కనులముందు సాక్షాత్కరింపజేస్తుంటాయి. తిరువొట్రియూర్ ఆలయంలోని మరో విశిష్టత ఏమిటంటే, ఇక్కడ నక్షత్రలింగ సన్నిధి అని 27 నక్షత్రాలకు సంబంధించి 27 శివలింగాలున్నాయి. ఈ సన్నిధిలో 27 నక్షత్రాలకు సంబంధించిన భక్తులు తమ జాతక దోషాలను ΄పోగొట్టుకునేందుకు పూజలు చేస్తుంటారు. ఉత్సవమూర్తి అయిన త్యాగరాజస్వామి, మూలవిరాట్టు అయిన ఆదిపురీశ్వరుని విగ్రహాలు భక్తులను ఆనంద పరవశ్యంలో ముంచి వేస్తుంటాయి. సువర్ణకవచాన్ని అలంకరించుకుని ఉన్న మూలవిరాట్టు ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ, భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతుంటుంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడి మూలవిరాట్టు ఆదిపురీశ్వరుడు నిత్యం తైలాభిషేకంలో మునిగి తేలుతుంటాడు. ఆయనకు అభిషేకించిన తైలం పిల్లల మాడుమీద అంటి, నొసట బొట్టులా పెడితే చాలు– బాలారిష్టాలూ, దృష్టిదోషాలూ అంతరించిపోతాయనీ, బాలలు ఆయురారోగ్యాలతో నిత్యం ఆనందంతో కేరింతలు కొడతారని ప్రతీతి. భక్తులు ప్రత్యేక రుసుము చెల్లించడం ద్వారా ఆలయంలో స్వామికి చందనకాప్పు (గంధపు పూత), మంజళ్ కాప్పు (పసుపు పూత), పంచామృతాభిషేకం, క్షీరాభిషేకాలను స్వయంగా నిర్వహించుకోవచ్చు. దోషనివారణ చేసుకోవచ్చు.ఎక్కడ ఉందంటే..?చెన్నై నగరానికి శివారు ప్రాంతంలోనే ఉంది తిరువొట్రియూర్. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి బస్సులు, లోకల్ రైళ్లు ఉన్నాయి. ఆటోలలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు. తిరువొట్రియూరులో తెలుగు వారు తక్కువేమీ కాదు. అందువల్ల తెలుగుమాత్రమే తెలిసిన వాళ్లకు ఇబ్బంది ఏమీ ఉండదు. బస, భోజన వసతులకు కూడా బాగానే ఉంటాయిక్కడ. తిరువొట్రియూరులో కూడా అలాంటి సౌకర్యం ఉంది కాబట్టి యాత్రికులు తిండికోసం ఇబ్బంది పడనక్కరలేదు.అతిపెద్ద ఆలయం... త్యాగరాజస్వామికి తిరువారూరులో అతిపెద్ద ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా పేర్కొనే ఈ గుడి తంజావూరు జిల్లాలోని తిరువారూరులో ఉంది. ఈ గుడికి నాలుగువైపులా నాలుగు గోపురాలున్నాయి. ఈ దేవాలయం 30 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఉంది. దీనికి అనుసంధానంగా పెద్ద కోనేరు ఉంది. కమలాలయం అనే పేరుగల ఈ కోనేరు ఆలయంకన్నా పెద్దగా ఉండటం విశేషం. దక్షిణ భారతదేశంలో ఇదే అతి పెద్ద కోనేరు. చోళరాజుల కాలం నాటి ఈ గుడి శిల్పసౌందర్యానికి పెట్టింది పేరు. అత్యంత విలువైన దివ్యాభరణాలతో అలంకృతమై ఉన్న త్యాగరాజ స్వామివారి విగ్రహం ఈ గుడిలో కనువిందు చేస్తుంది. అంతేకాదు, ఆలయంలో అనేకమైన తైలవర్ణ చిత్రాలున్నాయి. వాటిలో శయనముద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రం చూపు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎదపైన నటరాజస్వామి నర్తిస్తూ ఉన్నట్లు చిత్రించి ఉండటం మరో అద్భుతం. తిరువారూరులో ఏటా బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది. అంతేకాదు, ఇక్కడ కమలాలయం కోనేరులో జరిగే తెప్పోత్సవానికి కూడా మంచి పేరుంది. -
సైకిల్‌పై వచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ చెన్నైలో సందడి చేశారు. చాలా సింపుల్‌గా సైకిల్ తొక్కుతూ కనిపించారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ 68వ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి వచ్చారు. సైకిల్‌పై తమ అభిమాన హీరో రావడంతో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అక్కడే గేట్ దగ్గర ఉన్న అభిమానులతో విశాల్ కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొద్దిరోజుల క్రితమే నడిగర్ సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో పది రోజుల్లో నడిగర్ సంఘం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని విశాల్ వెల్లడించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఇండస్ట్రీ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తామని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. VIDEO | Actor Vishal arrives on a bicycle to attend 68th South Indian Artist Association meeting being organised in Chennai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/EYP25aY3rb— Press Trust of India (@PTI_News) September 8, 2024 -
బంగ్లాతో తొలి టెస్టు.. టీమిండియా క్యాంపులోకి యువ ఆటగాడు! ఎవరంటే?
భారత క్రికెట్ జట్టు దాదాపు నెల రోజుల విరామం తర్వాత మళ్లీ తిరిగి మైదానంలో అడుగు పెట్టనుంది. స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జడేజా, అశ్విన్ మినహా మిగితా భారత ఆటగాళ్లందరూ దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో భాగమయ్యారు. ఈ టోర్నీలో ప్రదర్శనల ఆధారంగా బంగ్లాతో సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశముంది. వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.బంగ్లాతో సిరీస్‌కు ఎంపికయ్యే భారత ఆటగాళ్లందరూ సెప్టెంబర్ 12న చెన్నైలో సమావేశం కానున్నారు. బంగ్లాతో తొలి టెస్టు కోసం చెపాక్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఈ ప్రాక్టీస్ శిబిరంసెప్టెంబర్ 13 నుండి 18 వరకు కొనసాగుతుంది.హిమాన్షుకు పిలుపు..ఇక బంగ్లాతో తొలి టెస్టుకు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై యువ ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను నెట్ బౌలర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. చెన్నైలో ఏర్పాటు చేయనున్న టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌లో హిమాన్షును చేరాలని భారత క్రికెట్ బోర్డు ఆదేశించింది. బంగ్లా జట్టులో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నందున వారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆఫ్ స్పిన్నర్ హిమాన్షుతో భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది. ఇటీవల కాలంలో టీమిండియా ఆటగాళ్లు స్పిన్‌కు కాస్త ఇబ్బంది పడుతుడండంతో హిమాన్షును నెట్ బౌలర్‌గా బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అతడికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. 21 ఏళ్ల హిమాన్షు.. డాక్టర్ (కెప్టెన్) కె తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్లో తన అద్భుతమైన ప్రదర్శనకనబరిచాడు. తాజాగా ఆలూర్-1 గ్రౌండ్లో ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో సత్తాచాటాడు. ముంబై సీనియర్ టీమ్‌కు ఇప్పటివరకు అతడు ప్రాతినిథ్యం వహించకపోయినప్పటకి.. ముంబై U-16, U-23 జట్లు తరపున అదరగొట్టాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్లు దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లకు బౌలింగ్ చేసే బంపరాఫర్‌ను హిమాన్షు కొట్టేశాడు. -
ఇక్కడ ఇళ్లు కొనడం సాధ్యమే!
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్లకు చిరునామాగా చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలు నిలుస్తున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ నగరాలు మాత్రం ఇళ్ల కొనుగోలు పరంగా ఖరీదైనవని ప్రాప్‌టెక్ సంస్థ మ్యాజిక్‌బ్రిక్స్ వెల్లడించింది. ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరల తీరుపై ఒక నివేదిక విడుదల చేసింది. ఓ ఇంటి వార్షిక ఆదాయం నుంచి ఇంటి ధర (పీఐ రేషియో) నిష్పత్తి 2020లో ఉన్న 6.6 శాతం నుంచి 2024లో 7.5 శాతానికి పెరిగింది. అంటే ఓ ఇంటి వారందరూ ఏడున్నరేళ్లు కష్టపడి సంపాదించినంతా వెచ్చిస్తే కానీ ఇల్లు సమకూర్చుకోలేని పరిస్థితి. పీఐ రేషియో చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాలో 5 చొప్పున ఉంది. అందుకే ఇక్కడి ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఎంఎంఆర్‌లో 14.3గా ఉంటే, ఢిల్లీలో 10.1గా ఉంది. అంటే ఇక్కడ ఇళ్ల ధరలు ఖరీదుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈఎంఐ – నెలవారీ ఆదాయం రేషియో 2020లో ఉన్న 46 శాతం నుంచి 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. అంటే నెలవారీ వేతనంలో ఈఎంఐ వాటా 61 శాతానికి చేరింది. ఇళ్ల కొనుగోలుదారులపై పెరిగిన ఈఎంఐ భారాన్ని ఇది సూచిస్తోంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐ రేషియో ఢిల్లీలో 82 శాతం, ఎంఎంఆర్‌లో 116 శాతంగా ఉంది. హైదరాబాద్, గురుగ్రామ్‌లో 61 శాతం చొప్పున ఉంది. అహ్మదాబాద్, చెన్నైలో 41 శాతంగా, కోల్‌కతాలో 47 శాతంగా ఉంది. అసాధారణంగా పెరిగిన ధరలు 2021 ద్వితీయ ఆరు నెలలతోపాటు 2022లోనూ ఇళ్ల ధరలు ఎంతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, గృహ ఆదాయాలు తిరిగి పుంజుకోవడంతో ఈ కాలంలో ఇళ్ల ధరలు తిరిగి పుంజుకున్నాయి. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షతో డిమాండ్ సరఫరాను మించిపోయింది. దీంతో ఇళ్ల ధరలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. దీంతో అందుబాటు ధరల ఇళ్ల కొనుగోలు పరంగా సవాళ్లను తీసుకొచి్చంది’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సు«దీర్ పాయ్ పేర్కొన్నారు. -
నాగచైతన్య బ్లాక్‌బర్డ్స్ జట్టు రేసర్‌కు తొలి స్థానం
చెన్నై: ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా జరిగిన ఎఫ్ఐఏ ఫార్ములా–4 ఇండియా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్ట్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. ఆదివారం చెన్నై నైట్ సర్క్యూట్లో జరిగిన ఈ పోటీల రెండో రౌండ్లో దక్షిణాఫ్రికాకు చెందిన అలీఖాన్ విజేతగా నిలిచాడు. కారులో సాంకేతిక లోపం కారణంగా తొలి రౌండ్ నుంచి అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్న అలీ రెండో రౌండ్లో అంచనాలకు అనుగుణంగా రాణించాడు.గ్రిడ్‌లో నాలుగో స్థానం నుంచి మొదలు పెట్టిన అతను వేగంగా దూసుకుపోయాడు. ఈ క్రమంలో ఇద్దరు భారత రేసర్లు దివీ నందన్, జేడెన్ పారియట్ను అతను అధిగమించాడు. తొలి రౌండ్లో విజేతగా నిలిచిన హ్యూజ్ బార్టర్ (గాడ్స్పీడ్ కొచ్చి టీమ్) రెండో రౌండ్ క్వాలిఫయింగ్‌లో విఫలమై గ్రిడ్‌లో చివరి స్థానంనుంచి మొదలు పెట్టాడు. చివరకు ఐదో స్థానంతో అతను రేస్‌ను ముగించాడు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌కు యజమానిగా ఉన్నాడు. -
తమిళనాడు చరిత్రలో మరో మైలురాయి.. ఫార్ములా రేస్
సాక్షి, చెన్నై: తమిళనాడు చరిత్రలో ఫార్ములా కార్ రేసు –4 మరోమైలు రాయి అని క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఫార్ములా కార్ రేసు పోటీలు చెన్నైలో విజయవంతంగా జరిగాయి. బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వివరాలు.. తమిళనాడు క్రీడలశాఖ, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో ప్రొమోటర్ ఆఫ్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఆర్పీపీఎల్) నేతృత్వంలో చెన్నై వేదికగా భారతదేశంలోనే ప్రపథమంగా నైట్ స్ట్రీట్ సర్క్యూట్ పందేంగా శని, ఆదివారాలలో ఫార్ములా కార్ రేస్ – 4 పోటీలు జరిగాయి. చెన్నై ఐల్యాండ్ గ్రౌండ్ మైదానం చుట్టూ ఉన్న 3.5 కి.మీ దూరంలోని అన్నాసాలై, శివానందసాలై, నేప్పియర్ వంతెన మీదుగా పోటీలు హోరెత్తాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, గోవా తదితర నగరాలకు చెందిన జట్టులకు చెందిన 24 మంది క్రీడాకారులు కార్ రేసింగ్‌లో దూసుకెళ్లారు. ఇందులో ఆరుగురు మహిళా డ్రైవర్లు సైతం ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. వినోదం, సాహసంతో కూడిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర వాసులు ఈ పోటీలను తిలకించేందుకు వీలుగా అనేక చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. తుది పోటీలు ఇండియన్ చాంపియన్ షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరీలలో పోటాపోటీగా జరిగాయి. జేకే టైర్ జూనియర్ జాతీయ పోటీలు, సాహస కార్యక్రమాలు నిర్వహించారు. విజయవంతంగా.. ఫార్ములా రేస్ విజయవంతమైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో విజేతలకు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు, నిర్వాహకులు, సినీ సెలబ్రటీలు బహుమతులను ప్రదానం చేశారు. ఫారుమలా – 4 ఛాంపియన్ షిప్లో ఆ్రస్టేలియాకు చెందిన కొచ్చి టీం క్రీడాకారుడు హగ్ బర్టర్, బెంగాళ్ జట్టుకు చెందిన భారత క్రీడాకారుడు రుహాన్ అల్వ, బెంగళూరు జట్టుకు చెందిన భారత క్రీడాకారుడు అభయ్ మోహన్ తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. రేస్ –2లో విజేతలుగా హైదరాబాద్ జట్టుకు చెందిన దక్షిణాఫ్రికా క్రీడాకారుడు అకిల్ అలీబాయ్, అహ్మదా బాద్ జట్టుకు చెందిన భారత డ్రైవర్ దివ్య నందన్, బెంగళూరు జట్టుకు చెందిన భారత డ్రైవర్ జడిన్ పరియట్ తొలి మూడుస్థానాలను దక్కించుకున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్, జేకే టైర్ జూనియర్ పోటీలలోనూ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల విజయవంతం గురించి క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం ఉదయం సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. చెన్నైలో ఈ పోటీలు విజయవంతంగా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకులు, అధికారులు, మద్దతు ఇచ్చిన చెన్నై నగర ప్రజలు, క్రీడాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పోటీలు తమిళనాడు చరిత్రలో మరో మైలురాయిగా నిలిచి పోతాయని అభిప్రాయపడ్డారు. ఈ పోటీలను ఇక్కడ నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ పోటీలలో విజేతలు, కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ సీఎం స్టాలిన్ సైతం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.The best video to come out of #Formula4Chennai with 🐐BGM! Top class…👌💥P.C : dinesh _dharmendra_17 (IG) 🙌 pic.twitter.com/DJLQlfU8ci— Chennai Updates (@UpdatesChennai) September 2, 2024 -
చెన్నైలో 'రేస్' అదరహో.. సెలబ్రిటీల సందడి
సాక్షి, చెన్నై: ఫార్ములా కార్ రేస్ ఆదివారం అదరహో అనిపించే విధంగా జరిగింది. వినోదంతో కూడిన సాహసాలు హోరెత్తాయి. సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. చెన్నై ఐలాండ్ గ్రౌండ్ వేదికగా ఫార్ములా కార్ రేస్ –4 శనివారం మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు అర్హత పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం నుంచి ట్రయల్ రన్ పేరిట పోటీలు హోరెత్తాయి. అలాగే, నగర వాసులు, ప్రేక్షకులను ఆకర్షించే దిశగా వినోద కార్యక్రమాలు, సాహసాలతో కూడిన కార్ రేసులు సాగాయి. జేకే టైర్ కార్ రేస్ ప్రత్యేక ఆకర్షణగా దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు తుది పోటీలు ఇండియన్ చాంపియన్‌షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరిలలో జరిగాయి. అత్యంత పోటాపోటీగా ఉత్కంఠ భరితంగా గాల్లో 200 కి.మీకి పైగా వేగంతో కార్లు దూసుకెళ్లాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పోటీలలో విజయాన్ని కైవశం చేసుకునే దిశగా రేసులో దూసుకెళ్లారు.చివరి రోజు పోటీలను వీక్షించేందుక ప్రత్యేక ఆకర్షణగా త్రిష వంటి సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అలాగే, భారత మాజీ క్రికెటర్ గంగూలి, బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, జాన్అబ్రహం, నిర్మాత బోనికపూర్‌తో పాటు పలువురు నటీ నటులు హాజరయ్యారు. కోలీవుడ్‌కు చెందిన అనేక మంది స్టార్లు తరలి వచ్చారు.సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, టాలీవుడ్ స్టార్ నాగచైతన్య ఈ ఫార్ములాకు మరింత ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అర్ధరాత్రి జరిగిన విజయోత్సవంలో మరెందరో సినీ, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. శునకాల కోసం వేట కార్ రేస్‌కు శునకాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ రేస్ జరిగే పరిసరాలలో కూవం నదీ తీరంలోని కొన్ని మురికి వాడలు ఉన్నాయి. ఇక్కడ శునకాలు ఎక్కవ. శనివారం రేస్ సమయంలో ఓ శునకం ట్రాక్‌లోకి దూసుకు రావడంతో రైడర్లు అలర్ట్ అయ్యారు. ఆ శునకం ట్రాక్‌ను రేస్ కారు వేగంతో దాటేయడంతో పెనుప్రమాదం తప్పినట్టైంది. దీంతో ఆదివారం రేసుకు శునకాల రూపంలో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు పడ్డారు. ఆదివారం ఉదయం నుంచి ఆ పరిసరాలలో శునకాల కోసం కార్పొరేషన్ సిబ్బంది తీవ్ర వేట సాగించారు. పదికి పైగా శునకాలను పట్టేశారు. రాత్రి జరిగిన ఫైనల్స్‌లోకి శునకాలు ట్రాక్ వైపుగా దూసుకు రాకుండా డేగ కళ్లతో కార్పొరేషన్ సిబ్బంది నిఘా వేయాల్సి వచ్చింది. Lovely! Normal Traffic on the left lane! Races on the right lane..👌🏎️#Formula4Chennai pic.twitter.com/2fqMd5KDSY— Chennai Updates (@UpdatesChennai) September 1, 2024 -
భారత్‌లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీ
ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుంటే.. అమెరికాకు చెందిన 'కాగ్నిజెంట్' మాత్రం ఏకంగా భారతదేశంలోని ఆఫీసునే అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఆఫీసును విక్రయిస్తే.. ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో సుమారు 20 సంవత్సరాలుగా ప్రధాన కార్యాలయంగా కలిగిన ఉన్న ఆఫీసును డిసెంబర్ నాటికి విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఈ విక్రయానికి సంబంధించిన బాధ్యతను అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ 'జేఎల్ఎల్'కు అప్పగించినట్లు చెబుతున్నారు.కాగ్నిజెంట్ విక్రయించనున్న ఈ ఆఫీసు చెన్నైలోని ఐటీ కారిడార్‌లో ఉంది. ఇది సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ సుమారు రూ. 750 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. దీనిని కొనుగోలు చేయడానికి భాష్యం గ్రూప్, కాసాగ్రాండ్ సంస్థలు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద ఆ రెండు సంస్థలు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఇదీ చదవండి: 30 నెలలు వెయింట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్2024 డిసెంబర్ నాటికి ఆఫీసును విక్రయించి.. చెన్నైలోని జీఎస్టీ రోడ్డులోని తాంబరం సమీపంలో కొత్త హెడ్ ఆఫీసు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి బహుశా ఉద్యోగులంతా ఆ కొత్త ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుందని భావిస్తున్నాము. కొత్త భవనం అందుబాటులోకి రావడంతో.. కంపెనీ తన పాత భవనాన్ని విక్రయించడానికి సన్నద్ధమైంది. -
ఆడుకుందాం రండి
‘ఎప్పుడూ ఆటలేనా... చదువుకోవచ్చు కదా’ అనే తల్లిదండ్రులే ఎక్కువ. ‘ఎప్పుడూ చదువేనా... ఆటలు కూడా ఆడవచ్చు కదా’ అనే తల్లిదండ్రులు అతి తక్కువ. చదువు విషయంలోనే కాదు ఆటల్లో కూడా పిల్లలను ్రపోత్సహిస్తే చారిత్రక అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి బలమైన ఉదాహరణ... స్టార్ షూటర్ మను బాకర్. ‘మీకు డాక్టర్ లేదా ఇంజినీర్ కావాలని లేదా... అయితే ఆటల ప్రపంచంలోకి రండి. అదొక అద్భుత ప్రపంచం’ అంటుంది ఒలింపిక్స్‌లో డబుల్–మెడల్ గెల్చుకున్న మను బాకర్. విద్యార్థుల దృష్టిని ఆటలపై మళ్లించడానికి నేషనల్ టూర్ చేస్తోంది...తన పర్యటనలో భాగంగా చెన్నైలోని వేలమ్మళ్ నెక్సెస్ స్కూల్‌కు వెళ్లిన మను బాకర్ ఆటలకు ఉండే శక్తి ఏమిటో ఆసక్తికరంగా చెప్పింది. ‘ఆటలు అనే దారి వైపు వచ్చి చూడండి. ఆ దారిలో ముందుకు వెళుతున్న కొద్దీ మీలో ఉత్సాహం, శక్తి అంతకంతకూ పెరుగుతూ పోతాయి’ అంటుంది మను.‘టోక్యో ఒలింపిక్స్‌లో నా గురి తప్పింది. ఓటమి పలకరించింది. అలా అని నిరాశలోనే ఉండిపోలేదు. ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి అంతే సహజం. గెలుపు ఓటములు ఆటలో శాశ్వతం కాదు. ఆటలో ఉన్న అందం, అద్భుతం ఇదే’ అంటుంది మను.‘డ్రీమ్ బిగ్’ అని మను అన్నప్పుడు పిల్లలు చప్పట్లు కొట్టారు. ‘మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అనేది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుందంటూ తన గత అనుభవాలను విద్యార్థులతో పంచుకుంది.‘ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకే ఆటలు సరిపోతాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు కష్టం’ అనే అపోహను తోసిపుచ్చింది మను. ‘ఆత్మస్థైర్యం నుంచి ఆర్థికసహాయం వరకు క్రీడా ప్రపంచంలో ఏది కష్టం కాదు. మీరు పెద్ద కల కంటే పెద్ద విజయాన్ని సాధిస్తారు. పేదరికం మీకు ఎప్పుడూ అడ్డు కాదు. ఈ విషయాన్ని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది’ అంటుంది మను బాకర్. ‘మీ ఇన్స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు– ‘ఇంకెవరు... మా అమ్మే’ అని చెప్పింది మను. ‘ఎప్పుడూ ఆటలేనా!’ అని ఎప్పుడూ అనేది కాదు ఆమె. ఆటల్లో కూతురు చూపుతున్న ప్రతిభకు సంతోషించేది.‘క్రీడల్లో పిల్లలు రాణించడం, పెద్దస్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది’ అంటుంది మను బాకర్.ఆటలు ఇంకా ఏం చేస్తాయి? మను మాటల్లో చె΄్పాలంటే ప్రపంచాన్ని చూపిస్తాయి. ‘షూటింగ్ కెరీర్ వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. దీనివల్ల రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, చరిత్ర, పోరాటాలు... ఒక్కటా రెండా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. నేను ఆటల్లోకి రాకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు’ అంటుంది మను.‘మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఎక్కడికి వెళ్లాలనేది ముఖ్యం’ అంటారు పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన విజేతలు. ఇదే విషయాన్ని పిల్లలకు చెబుతుంటుంది మను.‘మేము పేదవాళ్లం, నాకు ఇంగ్లీష్ రాదు, నేను బలహీనంగా ఉంటాను, ఇతరులతో పోటీ పడగలనా... ఇలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దు. ఎన్ని పరిమితులు ఉన్నా కష్టపడే తత్వం, అంకితభావం ఉంటే మన ప్రయాణానికి అవేమీ అడ్డు కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. నా విషయానికి వస్తే... మొదట్లో నాకూ ఇంగ్లీష్ పెద్దగా రాదు, ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమీ తెలియదు... అనుకుంటే అక్కడే ఉండిపోతాం. తెలుసుకుంటాను’... అనే పట్టుదల ఉంటే తెలుసుకోగలం. నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరితోనైనా మాట్లాడవచ్చు’ అంటుంది మను.‘మీకు ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. అవేమీ మీకు ఆసక్తిగా లేకపోతే ఆటల ప్రపంచంలోకి రండి’ అని విద్యార్థులను ఆహ్వానిస్తోంది మను బాకర్. ఆమె మాటల స్ఫూర్తి ఎంతోమందికి విజయ మంత్రం కావాలని ఆశిద్దాం. -
లీలా ప్యాలెస్‌లో మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం
చెన్నైలోని సుప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్‌లో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. మనూ గౌరవార్థం హోటల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సన్మానించింది. హోటల్ రూమ్స్‌లో టవల్స్, పిల్లోస్, న్యాప్కిన్స్ ఇతరత్రా వస్తువులపై మనూ పేరును ముద్రించారు హోటల్ నిర్వహకులు. హోటల్ సిబ్బంది మనూను సంప్రదాయ బద్ధంగా హోటల్లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. The Leela Palace Chennai welcomes Manu Bhaker, the Olympic Champion ! Just WoW pic.twitter.com/Dc2lhQpnE4— Megh Updates 🚨™ (@MeghUpdates) August 27, 2024హోటల్ నిర్వహకులు మనూ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. లీలా ప్యాలెస్ ఆతిథ్యానికి మనూ పరవశించి పోయింది. మనూ లీలా ప్యాలెస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కాగా, మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ రెండు పతకాలు సాధించాక దేశవ్యాప్తంగా చాలామంది ఆమెను తమతమ స్థానాలకు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే మనూ చెన్నైలోని ఓ కాలేజీలో పర్యటించింది. అక్కడ కూడా కాలేజీ యాజమాన్యం మనూను ఘనంగా సన్మానించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాక మనూకు దేశవ్యాప్తంగా పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా జనాలు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మనూ పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లోని రెండు ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
రీయూజబుల్ రాకెట్.. రూమీ-1 సక్సెస్
-
ఫ్రాంచైజ్ లీగ్ టోర్నమెంట్లో గోవా చాలెంజర్స్ శుభారంభం
చెన్నై: ఫ్రాంచైజీ లీగ్ టోర్నీ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఐదో సీజన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రోజు డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్ శుభారంభం చేసింది. చాలెంజర్స్ 9–6 పాయింట్ల తేడాతో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతున్న జైపూర్ పేట్రియాట్స్‌పై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 1–2 తేడాతో చో సుంగ్ మిన్ చేతిలో ఓడగా... మహిళల సింగిల్స్‌లో ల్యూ యాంగ్ జి 3–0తో సుతాసిని సవేతాత్ను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో హర్మీత్–ల్యూ ద్వయం 2–1తో రోనిత్ భాంజా–సుతాసినిలపై గెలుపొందింది. రెండో పురుషుల సింగిల్స్‌లో మిహాయి బొబొసికా 2–1తో రోనిత్ భాంజాను ఓడించగా... రెండో మహిళల సింగిల్స్‌లో నిత్యశ్రీ మణి 2–1తో యశస్విని ఘోర్పడేపై విజయం సాధించింది.ఐదు మ్యాచ్‌ల ఈ పోరులో మూడు మ్యాచ్‌లు నెగ్గిన గోవా ఖాతాలో 9 పాయింట్లు చేరగా... రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన పేట్రియాట్స్‌కు మొత్తం 6 పాయింట్లు లభించాయి. అంతకుముందు తమిళనాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ లీగ్‌ను ప్రారంభించారు. -
టీవీకే జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.#WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party's flag and symbol today.(Source: ANI/TVK) pic.twitter.com/J2nk2aRmsR— ANI (@ANI) August 22, 2024 #WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay takes pledge along with party workers and leaders at the party office in Chennai "We will always appreciate the fighters who fought and sacrificed their life for the liberation of our country… pic.twitter.com/amiti3rBC2— ANI (@ANI) August 22, 2024 -
మద్రాసు @385
దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలలో చెన్నై ఒకటి. ఈ నగరం భిన్న సంస్కృతులకు ప్రతిబింబంగా నిలుస్తుంది. భారతీయతకు చిహ్నంగానూ ఈ నగరం పేరొందింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ‘మద్రాస్ డే’ నిర్వహిస్తుంటారు.తమిళనాడు రాజధాని మద్రాసును ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు. మద్రాసు ఏర్పడి నేటికి( 2024, ఆగస్టు 22) 385 ఏళ్లు పూర్తయ్యాయి. 1639 ఆగస్టు 22న తమిళనాడు రాజధాని మద్రాసుకి బ్రిటీష్ ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పునాది రాయి వేసింది. అప్పట్లో దీనిని ‘మద్రాసు’ అని పిలిచేవారు. దాదాపు 70 లక్షల జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోనే 31వ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. అయితే చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నగరం రెండు వేల ఏళ్ల క్రితం నాటిది.రెండవ శతాబ్దంలో ఈ ప్రాంతం చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. తోడై మండల ప్రావిన్స్‌లో మద్రాసు పట్టణం అనే చిన్న గ్రామం ఉండేది. 1639 ఆగస్టు 22న సెయింట్ ఫోర్ట్ జార్జ్ నిర్మాణంతో ఆధునిక మద్రాస్ ఉనికిలోకి వచ్చింది. దీని తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలను కూడా మద్రాసులో విలీనం చేసింది. 1639లో ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలోని చంద్రగిరిలో విజయనగర రాజు పెద వెంకట రాయల నుంచి కొంత భూమిని కొనుగోలు చేసింది. ఈ నేలపైనే ఆధునిక మద్రాసు పుట్టింది. ఇది వలస కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. నాటి రోజుల్లో బ్రిటీష్‌వారు మద్రాసు గ్రామాన్ని ఆ పక్కనే ఉన్న చెన్నపట్టణాన్ని కలిపి మద్రాసుగా పిలుస్తూ వచ్చారు. అయితే నాటి రోజుల్లో స్థానికులు మద్రాసును చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలిచేవారు. ఈ నేపధ్యంలోనే 1996 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం మద్రాసును అధికారికంగా ‘చెన్నై’గా మార్చింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 22న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ‘మద్రాస్ డే’ను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 1939లో మద్రాసు చరిత్రపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చరిత్రకారులు, ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. 2004 నుంచి ‘చెన్నై హెరిటేజ్ ఫౌండేషన్’ మద్రాసు దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకే ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. -
క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండి, జీవితం అందంగా ఉంటుంది: మనూ భాకర్
చెన్నై: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత మహిళా షూటర్ మనూ భాకర్ క్రీడారంగంలోనూ అందమైన కెరీర్ ఉంటుందని చెప్పింది. డాక్టర్లు, ఇంజినీర్లే కాదు క్రీడాకారులుగా కూడా అందమైన జీవితాన్ని గడపొచ్చని 22 ఏళ్ల మనూ చెన్నై విద్యార్థులకు సూచింది. మంగళవారం వేళమ్మాల్ నెక్సస్ స్కూల్ మనూను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం టోక్యోలో ఎదురైనా పరాభవాన్ని పారిస్‌లో రెండు పతకాలతో అధిగమించిన తీరును వివరించింది. ఓటమిని రుచి చూసి... ‘ప్రపంచ రెండో ర్యాంక్ షూటర్‌గా టోక్యోకు వెళ్లాను. కానీ ఒలింపిక్స్‌లో నా గురి అస్సలు కుదర్లేదు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఎదురైన చేదు అనుభవం కొన్నాళ్లు నా ప్రయాణాన్ని కష్టంగా మార్చింది. అయినా నేనెప్పుడూ దాన్నే తలచుకొని దిగులుపడలేదు. ఓటమిని రుచి చూసిన నాకు విజయం దక్కుతుందని తెలుసు. స్పోర్ట్స్ అంటేనే అది! ఒకదాంట్లో పరాజయం, మరోదాంట్లో విజయం సహజం. అయితే ఇవన్నీ కూడా కష్టపడితేనే సాధ్యం’ అని పేర్కొంది. మనం కనే పెద్ద పెద్ద కలల్ని సాకారం చేసుకోవాలంటే ఆ స్థాయిలో కఠోరంగా శ్రమించాల్సిందేనని మనూ తెలిపింది. లక్ష్యాన్ని పెట్టుకుంటే దాని కోసం చెమటోడ్చాలని, ఒక్కసారిగా అవి సాకారం కాకపోవచ్చని... కానీ అంతమాత్రాన నిరాశ చెందకుండా లక్ష్యం కోసం నిరంతరం పనిచేయాలని వివరించింది. Badhiya pradarshani chal rahi is desh main Bronze medal ki. pic.twitter.com/sX2FpS4vZX— Prayag (@theprayagtiwari) August 20, 2024ఆత్మవిశాస్వంతో... ‘నేనెప్పుడు కూడా పోటీల్లో జయాపజయాల గురించి పట్టించుకోలేదు. ప్రతీసారి ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ప్రతీ పరీక్షను ఆ ఆత్మవిశ్వాసంతోనే నెట్టుకొస్తాను. మనకు కెరీర్లో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు, ప్రత్యామ్నాయాలుంటాయి. చాలామంది డాక్టరో, ఇంజనీర్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకుంటారు. కానీ క్రీడల్లోనూ అపారమైన అవకాశాలున్నాయన్న సంగతి గుర్తుంచుకోండి. ఆర్థికపరమైన మద్దతు కావొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు. క్రీడల్లో అవన్నీ దక్కుతాయి’ అని మనూ భాకర్ వివరించింది. అమ్మ చూపిన దారి... తనకు తన అమ్మ స్ఫూర్తి అని ఆమె చూపించిన దారే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పింది. అడుగడుగునా తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకపోతే పిల్లలకు ఇవేవి సాధ్యం కానేకావని తెలిపింది. ‘ఏ క్రీడయినా సరై బీజం పడేది ఇంట్లోనే! ఆ తర్వాత స్కూల్లో మొదలవుతుంది. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల భవితకు చక్కని బాట వేయడంలో కీలక భూమిక పోషిస్తారు’ అని వినమ్రంగా చెప్పింది. మన సంస్కృతి, నేపథ్యం ఏదైనా మనం ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకూడదని, చిన్న చిన్న అవరోధాలు ఎదురైనంత మాత్రాన ఆగిపోకూడదని స్ఫూర్తివంతమైన మాటలతో విద్యార్థులను మనూ ఉత్తేజపరిచింది. మన ప్రదర్శన బాలేకపోయినా, కొన్నిసార్లు విఫలమైనా, క్రీడల్లో పతకాలు గెలవలేకపోయినా, పరీక్షల్లో పాస్ కాకపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోకూడదని ఉద్బోధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందింది. సరదాగా ఆడి పాడిన మనూ..కార్యక్రమం ముగింపు సందర్భంగా మనూ విద్యార్థులతో కలిసి ప్రముఖ హిందీ పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
కోస్ట్ గార్డ్ డీజీ హఠాన్మరణం
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్ పాల్‌ను వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్ పాల్‌కు నివాళులర్పించారు. రాకేశ్ పాల్ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. -
ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత
-
దోశ, ఊతప్పం మిస్సింగ్.. జొమాటోకు రూ. 15వేలు ఫైన్
జొమాటో, స్విగ్గి వంటి డెలివరీ యాప్స్ వచ్చిన తరువాత నచ్చిన ఫుడ్ బుక్ చేసుకుని, ఉన్నచోటుకే తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీలలో సమస్యలు తలెత్తుతాయి. దీనికి సంస్థలు బాధ్యత వహిస్తూ.. జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చినప్పటికీ, తాజాగా మరో సంఘటన తెరమీదకు వచ్చింది.చైనాలోని పూనమల్లి నివాసి ఆనంద్ శేఖర్ 2023 ఆగష్టు 21న జొమాటో యాప్ ద్వారా స్థానిక రెస్టారెంట్ 'అక్షయ్ భవన్' నుంచి ఊతప్పం, దోశ కాంబోతో సహా ఇతర ఆహార పదార్థాలను 498 రూపాయలకు ఆర్డర్ చేసుకున్నారు. కానీ అతనికి ఇచ్చిన డెలివరీలో దోశ, ఊతప్పం మిస్ అయ్యాయి. ఇది గమనించి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించడానికి పదేపదే ప్రయత్నించాడు, కానీ సహాయం లభించలేదు.జొమాటో తాను పెట్టిన పూర్తి ఆర్డర్ అందివ్వలేదని.. నష్టపరిహారం కోరుతూ తిరువల్లూరులోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో కేసు వేశారు. దీనికి జొమాటో కూడా బాధ్యత వహిస్తుందని కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు జొమాటోకు రూ. 15000 జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పునిచ్చింది. -
చెన్నై–మైసూర్ మధ్య హైస్పీడ్ రైలు
సాక్షి, అమరావతి : దక్షిణ భారతదేశంలో చెన్నై–మైసూర్ మధ్య తొలి హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మీదుగా ప్రత్యేక కారిడార్‌ను నిరి్మంచాలని జాతీయ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 463 కి.మీ. మేర ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ 83 కి.మీ.మేర నిరి్మంచనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్‌ను రైల్వేశాఖ సూత్రప్రాయంగా ఆమోదించి భూసేకరణ ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఖరారు చేయనుంది. మూడు రాష్ట్రాల మీదుగా.. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా నిర్మిస్తారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూర్ వరకు నిరి్మస్తారు. మొత్తం 463 కి.మీ. పొడవైన ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్‌లో 83 కి.మీ. మేర ఉంటుంది. తమిళనాడులో 122 కి.మీ, కర్ణాటకలో 258 కి.మీ. మేర నిరి్మస్తారు. రెండు దశలుగా చేపట్టే ఈ ప్రాజెక్టును మొదటి దశ కింద చెన్నై నుంచి బెంగళూరు వరకు 306 కి.మీ., రెండో దశ కింద బెంగళూరు నుంచి మైసూర్ వరకు 157 కి.మీ. మేర నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇక అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ హైస్పీడ్ కారిడార్‌లో భాగంగా ఏలివేటెడ్ కారిడార్, ఎట్ గ్రేడ్, టెన్నెల్, గ్రీన్‌ఫీల్డ్ సెగ్మెంట్లుగా నిర్మించాలని డిజైన్‌ను ఖరారుచేశారు. ఈ కారిడార్‌లో భాగంగా 30 కి.మీ.మేర సొరంగాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. చెన్నైలో 2.8 కి.మీ, చిత్తూరులో 11.8 కి.మీ., బెంగళూరు రూరల్‌లో 2 కి.మీ., బెంగళూరులో 11 కి.మీ. మేర వీటిని నిర్మిస్తారు. మొత్తం 11 స్టేషన్లు.. ఏపీలో చిత్తూరులో హాల్ట్.. ఇక ఈ హైస్పీడ్ రైలుకు చెన్నై–మైసూర్ మధ్య 11 చోట్ల హాల్ట్‌లు కల్పిస్తారు. ఏపీలో ఒక్క చిత్తూరులోనే ఉంటుంది. దీంతోపాటు చెన్నై, పూనమల్లి, కోలార్, కొడహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయపనహళ్లి, ఎల్రక్టానిక్స్ సిటీ, కెంగేరీ, మాండ్య, మైసూర్‌లలో ఎలివేటెడ్ రైల్వేస్టేషన్లను నిరి్మస్తారు. భూసేకరణ ప్రక్రియపై కసరత్తు.. హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 303 గ్రామాలు, పట్టణాల మీదుగా నిరి్మంచాల్సి ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. అందుకోసం తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రామనగర, మాండ్య, మైసూర్ జిల్లాల్లో 2,905 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 2,660 ఎకరాలు ప్రైవేటు భూములే. ప్రస్తుతం రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు.. భూసేకరణ ప్రక్రియపై ప్రాథమిక కసరత్తు చేపట్టింది. అనంతరం డీపీఆర్‌ను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. 2025–26 ఆరి్థక సంవత్సరంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నది రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ట వేగం గంటకు 350 కి.మీ..ఇక ఈ హైస్పీడ్ రైల్ గంటకు గరిష్టంగా 350 కి.మీ. వేగంతో దూసుకపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని నిర్వహణ వేగం గంటకు 320 కి.మీ.గా నిర్ణయించారు. సగటు వేగం గంటకు 250 కి.మీ. ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. మొత్తం 730 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. -
కమలా దేవి హారిస్ గెలవాలని తమిళనాడులో పూజలు
చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు బైడెన్ భారతీయ మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆమె డెమోక్రట్ల మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే.. కమలా హారిస్‌కు తమిళనాడుతో సంబంధం ఉంది. పైంగనాడు-తులసేంద్రపురం.. ఆమె తాతల ఊరు. ఈ గ్రామ ప్రజలు ఆమె అగ్రరాజ్యం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉండాలని కోరుకుంటున్నారు. సోమవారం ఆమె గెలుపు కోసం గ్రామంలోని ధర్మ శాస్తా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలా దేవి గెలిచేంతవరకు తమ పూజలు కొనసాగుతాయని చెబుతున్నారు. ‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీవీ గోపాలన్ గారి మనవరాలు (కమలా హారిస్) ప్రెసిడెంట్ అభ్యర్థి బరిలో ఉంటటం చాలా ఆనందంగా ఉంది. ఆమె డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించాలని మేము గ్రామంలో ప్రత్యేక పూజలు చేశాం’’ అని ఓ గ్రామస్తుడు అంటున్నాడు. ‘‘ఈ ఆలయ పునరుద్ధరణ కోసం ఒక్కొక్కరు రూ. 5,000 విరాళం ఇచ్చిన వ్యక్తుల జాబితాలో కమలా హ్యారిస్ మామ బాలచంద్రన్ గోపాలన్ ఉన్నారు. ఆలయం మేనేజ్మెంట్ వారికి తరచూ విభూతి, కుంకుమ పంపిస్తుంది. ఆలయంలో జరిగే కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తాం. వారు ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పటికీ ఈ గ్రామంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆలయం పునరుద్ధరణకు విరాళం ఇచ్చారు. ఆలయం కార్యక్రమాలకు హాజరవుతారు’’అని గ్రామస్తులు తెలిపారు.చెన్నైకి 350 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ ప్రజలు.. 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్
చెన్నై : పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం మరణించాడు. శనివారం సాయంత్రం చెన్నై పోలీసులు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కోసం నిందితుడు తిరువేంగడం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు నిందితుణ్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ లభ్యమైన గన్‌తో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.అత్యవసర చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. నిందితుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని చెన్నై పోలీస్ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణహత్యకు గుయ్యారు. చెన్నై పెరంబూర్‌లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడిచేసి పారిపోయారు.స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం థౌజండ్‌లైట్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.ఈ దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ముఖ్యంగా బలహీన వర్గాలు సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే, నిందితులను అరెస్టు చేసి ఉండేవారు. అది లేదు కాదు కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఆమె అన్నారు. -
ఇదేంటి భయ్యా?.. ఇండియన్-2 టికెట్స్ అక్కడే చీపా?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.అయితే ఇప్పటికే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 టికెట్‌పై పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లోని ఒక్కో టికెట్ ధర రూ.350 రూపాయలుగా ఉంది.అయితే ఇండియన్-2 సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడమేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐌𝐚𝐧𝐚 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐓𝐫𝐨𝐥𝐥𝐬 🤗 (@mana_telugu_trolls) -
టీ20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
బీజేపీ మిత్రపక్ష పార్టీని ఓడించండి: మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడులోని విక్రవాండీ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షమైన పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీని ఓడించాలని డీఎంకే నేత, మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ అన్నారు. ఆయన సోమవారం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నీట్-యూజీ -2024 పరీక్ష పేపర్ లీకేజీ, అక్రమాల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అందుకే ఈ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రమైన పక్షమైన పీఎంకే పార్టీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.‘మీరు (ప్రజలు) అంతా ఇప్పటికే అధికార డీఎంకే పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై డీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పింది. దీంతో ఉత్తరాది నేతలు కూడా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే ఉపఎన్నిక బరిలో నిలిచింది. అందుకే పీఎంకే పార్టీని ఓడించాలని కోరుతున్నా’అని ఉదయ్ నిధి అన్నారు. పరీక్ష పేపర్ లీకైన నేపథ్యంలో జూన్ 28న తమిళనాడు అసెంబ్లీలో నీట్ పరీక్షను రద్దు చేయాలని డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేసింది.ఇక.. విక్రవాండీ అసెంబ్లీ డీఎంకే ఎమ్మెల్యే ఎన్. పుగజేంటి అనారోగ్యం కారణాలతో ఏప్రిల్ 6న మృతిచెందగా ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఇక.. ఇక్కడ పోటీ డీఎంకే పార్టీ, పీఎంకే పార్టీకి మధ్య నెలకొంది. డీఎంకే నుంచి అన్నియూర్ శివ, పీఎంకే నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు సి అన్బుమణి అభ్యర్థులుగా బరిలో దిగారు. రెండు పార్టీలు వన్నియార్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక్కడ దళిత ఓటర్లు మెజార్టీగా ఉన్నారు. -
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై ప్రభుత్వం సీరియస్
చెన్నై : చెన్నైలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)చీఫ్ కే.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్‌ను బదిలీపై వేటు వేసింది. చెన్నై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ లా అండ్ ఆర్డర్)గా ఉన్న అరుణ్‌ను కమిషనర్‌గా నియమించింది.ఇప్పటి వరకు చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్న సందీప్ రాయ్‌ని చెన్నై పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీజీపీగా ఎంపిక చేసింది. -
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య
చెన్నై: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ ( 47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.దాడి ఆయన ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్‌లు వేసుకొచ్చారని, పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. ఆర్మ్‌స్టాంగ్ హత్యకేసులో శనివారం వేకువజామున పోలీసులు 8 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. హత్యకు రాజకీయ వైరమా? వ్యక్తిగత కక్షలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ హత్యను రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను ఖండించిన బీఎస్పీ చీఫ్ మాయావతికె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ‘ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన్ను గుర్తుతెలియని దుండగులు హత్య చేయటం విచారకరం. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళనాడులో బలమైన దళిత నాయకుడిగా తన గళాన్ని వినిపించేవారు. నిందితులను ప్రభుత్వం శిక్షించాలి’ అని ‘ఎక్స్’వేదికగా స్పందించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.The gruesome killing of Mr. K. Armstrong, Tamil Nadu state Bahujan Samaj Party (BSP) president, outside his Chennai house is highly deplorable and condemnable. An advocate by profession, he was known as a strong Dalit voice in the state. The state Govt. must punish the guilty.— Mayawati (@Mayawati) July 5, 2024 -
విక్రవాండికి.. ఉదయనిధి!
సాక్షి, చైన్నె: విక్రవాండి ఉప ఎన్నికల్లో నేతల ప్రచారం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే యువజన నేత, మంత్రి ఉదయ నిధి రెండు రోజుల పాటుగా నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఈవీఎంలలో చిహ్నాలను పొందు పరిచే కార్యక్రమంతో పాటు, పోలీసుల తపాల్ ఓట్ల నమోదు ప్రక్రియను గురువారం ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పళణి పర్యవేక్షించారు.వివరాలు.. విక్రవాండి అసెంబ్లీ స్థానానికి ఈనెల 10వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. డీఎంకే అభ్యర్థి అన్నియూరు శివాకు మద్దతుగా మంత్రులు ఆ నియోజకవర్గంలో తిష్ట వేశారు. గ్రామగ్రామానా తిరుగుతూ ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. పీఎంకే అభ్యర్థి సి. అన్బుమణికి మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి అభినయకు మద్దతుగా ఆ పార్టీ నేత సీమాన్ ఓట్ల వేటలో ఉన్నారు.ఈ పరిస్థితుల్లో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచార ప్రయాణానికి డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఈనెల 7,8 తేదీలలో ఆయన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 8 గ్రామాలలో ఆయన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించే విధంగా డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి.పోస్టల్ ఓట్ల నమోదు..ప్రచారం ఓ వైపు ఉధృతంగా సాగుతుంటే, మరోవైపు ఎన్నికల సమయం సమీపించడంతో ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఆ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పళణి మాట్లాడుతూ, పోలీసులకు తపాల (పోస్టల్) ఓట్ల నమోదు తాలుకా కార్యాలయంలో శనివారం వరకు జరగనున్నట్లు వివరించారు. 370 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు 574 మంది తమ తపాల్ ఓట్లను నమోదు చేశారని తెలిపారు. ఈవీఎంలలో చిహ్నాలు, అభ్యర్థుల పేర్లను పొందు పరిచే పనులు శరవేగంగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 276 పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 140 పోలింగ్ బూత్‌లలో వెలుపలు, పరిసరాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.44 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించామని, ఇక్కడ పారా మిలటరీ భద్రతకు నిర్ణయించామన్నారు. ఈనెల 10 వ తేదీ విక్రవాండికి లోక్‌ల్ హాలిడే ప్రకటించనున్నామని, రెండు రోజులు టాస్మాక్ దుకాణాల మూతకు ఆదేశాలు ఇవ్వానున్నామన్నారు. తమకు ఇప్పటి వరకు 41 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్‌కాన్‌పై ప్రచారం.. ఎందుకంటే?
చెన్నై: వివాహితులకు ‘నోజాబ్’ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఖండించింది. తాము నియమించుకున్న ఉద్యోగుల్లో 25 తం మంది వివాహుతలైన మహిళలే ఉన్నారని స్పష్టం చేసింది.తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఫాక్స్‌కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తుంది. అయితే ఇటీవల ఐఫోన్ తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కానీ దీనిపై ప్రచారం మరోలా జరిగినట్లు తెలుస్తోంది. ఫాక్స్‌కాన్ యాజమాన్యం వివాహితులైన మహిళల్ని నియమించుకోవడం లేదనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారంతో అప్రమత్తమైన కేంద్రం ఫాక్స్‌కాన్‌లో జరిగిన నియామకాలపై వెంటనే తమకు సమగ్ర సమాచారాన్ని అందించాలని తమిళనాడు కార్మిక శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఉద్యోగుల నియామకంపై ఫాక్స్‌కాన్ వివరణ ఇచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలు ఆధారంగా తమ ఐఫోన్ తయారీ ఫ్లాంట్‌లో కొత్తగా ఉద్యోగుల నియామకం జరిగిందని, వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలేనని ఫాక్స్‌కాన్ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగం రాలేదని అసత్య ప్రచారం చేశారని, ఇలాంటి నిరాధారమైన ప్రచారంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని వారు తెలిపారు.ఇదిలా ఉంటే, ఫాక్స్ కాన్ ఫ్లాంట్‌లో పని చేయడానికి వివాహిత మహిళలను అనుమతించకపోవడంపై పలు మీడియా సంస్థలు (అందులో పీటీఐ) ఆరా తీయగా ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. తమిళనాడు ప్లాంట్ దేశంలో మహిళలు అత్యధికంగా ఉపాధి పొందుతున్న మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌గా పేరు సంపాదించింది. ఇందులో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న సిబ్బంది సంఖ్య 45,000 దాటినట్లు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు వెల్లడించారు. పలు జాతీయ మీడియా కథనాలు సైతం.. ఫాక్స్ కాన్‌లో ఉద్యోగం రాలేదన్న కారణంతో 5 నుంచి 10 మంది ఈ అసత్య ప్రచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
బడుల్లో మత చిహ్నాలొద్దు.. మళ్లీ వార్తల్లోకి ‘జై భీమ్’ చంద్రూ
దళితుల హక్కుల కోసం న్యాయమూర్తిగా అనేక తీర్పులిచ్చి.. సూర్య హీరోగా నటించిన జైభీమ్ సినిమాకు స్ఫూర్తిగా నిలిచారు జస్టిస్ చంద్రు. ఈయన ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి పాఠశాలల్లో ఎవరూ ఏ రకమైన మతచిహ్నమూ ధరించ రాదు అని చేసిన సూచన ఇప్పుడు తమిళనాడులో హల్చల్ చేస్తోంది.2023 సెప్టెంబర్‌లో నంగునేరిలోని ఓ స్కూల్లో 17 ఏళ్ల దళిత బాలుడిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటన ఆప్పట్లో వివాదాస్పదం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ ఆధ్వరంలో ఓ కమిటీ వేసింది. అదే సమయంలో.. స్కూల్స్‌లో విద్యార్థినులు హిజాబ్ ధరించటం కొన్ని రాష్ట్రాల్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. విద్యార్థినులు ధరించే దుస్తులు ఆధారంగా మతాన్ని గుర్తించటం సరికాదని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ చంద్రూ.. తమిళనాడులోని పాఠశాలల్లో కులాన్ని గుర్తించేలా ఉండే చిహ్నాలను ధరించడాన్ని పూర్తిగా నిషేధించాలంటూ ఓ రిపోర్ట్ సమర్పించారు. అయితే.. ఈ నివేదిక హిందువులకు వ్యతిరేకంగా ఉందని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సోమవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్ ఉమా ఆనందన్ ఆ రిపోర్టుపై వ్యతిరేక తీర్మానం చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆ నివేదికను చించేసి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని వీసీకే కౌన్సిలర్ అంబేద్వాలన్ మేయర్‌ను కోరారు..@BJP4TamilNadu councillor Uma Anandan tears copy of Chandru report at corporation meetingGreater Chennai Corporation BJP councillor Uma Anandan on Tuesday attacked the report submitted by retired HC judge K Chandru, which has recommended a ban on wearing any symbol that… pic.twitter.com/I1Dj1be7hP— South First (@TheSouthfirst) June 25, 2024 -
చదువుకోమన్నందుకు చంపేశాడు!
సాక్షి, చైన్నె: దేశం గాని దేశానికి వెళ్లి బిడ్డల కోసం కార్మికుడిగా రేయింబవళ్లు తండ్రి శ్రమిస్తుంటే, ప్రయోజకుడై ఆయనకు తోడు ఉండాల్సిన పెద్ద కుమారుడు ఉన్మాది అయ్యాడు. చదువుకోమని పదేపదే వేధిస్తున్నారనే ఆగ్రహంతో కని పెంచిన తల్లిని, తోడ పుట్టిన తమ్ముడిని హతమార్చాడు. తానూ ఆత్మహత్యాయ త్నం చేసినా ధైర్యం చాలక పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తర చైన్నె పరిధిలోని తిరువొత్తియూరులో ఈ దా రుణ ఘటన శనివారం వెలుగు చూసింది. వివరాలు.. తిరువొత్తియూరు తిరునగర్ మొదటి వీధికి చెందిన మురుగన్(50) ప్రొక్లయినర్ ఆపరేటర్. ఓమన్ దేశంలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య పద్మ(45), కు మారులు నితీష్(21), సంజయ్(15) ఉన్నారు. పద్మ అన్నాసాలైలోని ఓ అక్కుపంచర్ క్లినిక్‌లో పనిచేయగా, నితీష్ వేళచ్చేరిలోని ఓ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సంజయ్ స్థానికంగా పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన ప్లస్–1లో చేరడానికి సిద్ధమయ్యాడు. ఈ పరిస్థితులలో శుక్రవారం తన పెద్దమ్మ మహాలక్ష్మి కుమార్తె ప్రియ ఇంటికి నితీష్ వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి ముందు ఓ బ్యాగ్ ఉంచి వెళ్లాడు. ప్రియ వాట్సాప్‌కు ఈ సమాచారం చేర వేశాడు. ఇంటికి వచ్చినానంతరం రాత్రి సమయంలో ఈ మెసేజ్ చూసుకున్న ప్రియ తీవ్ర ఆందోళనకు లోనైంది.ఇంటికి వెళ్లి చూడగా...నితీష్పెట్టిన మెసేజ్‌లను వాట్సాప్‌లో చూసుకున్న ప్రియ తీవ్ర ఆందోళనతో తన తల్లి మహాలక్ష్మికి సమాచారం అందించింది. తన మెసేజ్‌లో అమ్మ, తమ్ముడి ని చంపేశా? అని ఉన్మాదంతో నితీష్ వ్యాఖ్యలు చేసి ఉండటం కలవరాన్ని రేపింది. హుటాహుటిన మహాలక్ష్మి , ప్రియ పద్మ ఇంటికి వెళ్లి చూశారు. ఇంటిలో రెండు మూటలలో గొంతులు తెగిన స్థితిలో పద్మ, సంజయ్ మృతదేహాలు బయట పడ్డాయి. దీంతో పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అర్ధరా త్రి వేళ ఈ హత్యల సమాచారం తిరువొత్తియూరులో కలకలాన్ని సృష్టించింది. నితీష్ కోసం పోలీసులు తీవ్ర వేట మొదలెట్టారు. పలగై తొట్టి కుప్పం బస్టాండ్‌లో నిద్రపోతున్న నితీష్‌ను వేకువ జామున పోలీసు లు పట్టుకున్నారు. అతడిని విచారించగా ఉన్మాదం బయట పడింది.చదువుకోమన్నందుకే..వేళచ్చేరిలోని ఓ కళాశాలలో చదువుతున్న నితీష్ చదువుపై దృష్టి పెట్టడం మానేశాడు. దీంతో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. దీంతో తల్లి పదే పదే చదువుకోవాలని, విదేశాలలో తండ్రి పడుతున్న కష్టాలను గుర్తు చేస్తూ, మందలిస్తూ వచ్చింది. తమ్ముడు సంజయ్ సైతం ఇదే విషయాన్ని తనకు గుర్తుచేస్తూ రావడంతో నితీష్ ఉన్మాదిగా మారాడు. తనను చదువుకో మని పదేపదే హెచ్చరించడాన్ని తీవ్రంగా పరిగణించి మనో వేదనకు లోనయ్యాడు. ఆత్మహత్య చేసుకోవా లని నిర్ణయించుకున్నాడు. అయితే అంతుకు ముందు గా తన తల్లి, తమ్ముడిని చంపేయాలన్న ఉన్మాద నిర్ణయానికి వచ్చేశాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న తల్లి గొంతుపై విచక్షణా రహితంగా కత్తితో పొడి చి చంపేశాడు. ఆ తర్వాత తమ్ముడు సంజయ్‌ను కూ డా అలాగే చంపేశాడు. తాను ఉపయోగించి న కత్తిని అక్కడే ఓ కవర్లో ప్యాక్ చేసి పెట్టి, మృత దేహాలను మూట కట్టి పడేసి బయటకు వెళ్లిపోయాడు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని తొలుత నిర్ణయించి, ధైర్యం చాలక వెనక్కి వచ్చేశాడు. తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అనంతరం అక్కడి థియేటర్లో నైట్ షో చూశాడు. చివరకు ఇంటి తాళం, సెల్‌ఫోన్ ప్రియ ఇంటి వద్ద ఉంచి సముద్రంలో దూకి ఆత్మహత్యా ప్ర యత్నం చేసి ధైర్యం చాలక, ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్టాండ్‌కు వచ్చి పడుకుని నిద్ర పో యాడు. నితీష్‌ను అరెస్టు చేసిన పోలీసులు కట కటాల్లోకి నెట్టారు. కాగా ఈ హత్య సమాచారంతో ఒమన్ నుంచి తండ్రి చైన్నెకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. -
హీరో విజయ్ బర్త్‌డే వేడుకల్లో అపశృతి.. కాలిపోయిన బాలుడి చేయి!
దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అభిమానుల అత్యుత్యాహం ప్రమాదానికి దారి తీసింది. విజయ్ 50వ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా చెన్నై విజయ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఈసీఆర్ శరవణన్ ఫ్యాన్స్ కోసం ఒక ట్రిక్రీ షోను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ షోలో ఓ యువకుడు కిరోసిన్ ఉపయోగించి స్టంట్ చేస్తున్నాడు. చేతికి మంటలు అంటించుకొని టైల్స్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ కమ్రంలో ప్రమాదం జరిగింది. టైల్స్ పగలగొట్టిన తర్వాత యువకుడి చేతి మంటలు ఆరిపోలేదు. అది కాస్త ఎక్కువై చేయి మొత్తం కాలిపోయింది. ఈవెంట్లో పక్కనే ఉన్నవారు త్వరగా స్పందించి.. మంటలు ఆర్పేశారు. అనంతరం అంబులెన్స్‌లో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. -
అన్నాడీఎంకేలో నా పార్టీ విలీనం చేయను: టీటీవీ దినకరన్
చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ఘోర ఓటమికి ఆ పార్టీ నేత ఎడప్పాడి కె పళనిస్వామి క్షమాపణలు చెప్పాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ అన్నారు. తంజావురులో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం డబ్బులు ఉన్నవారి చేతిలో చిక్కుకుందన్నారు.కేవలం కార్యర్తలు మాత్రమే దివంగత జయలలిత అభిమానులని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి నాయకత్వం దారితప్పిందని విమర్శలు చేశారు. అటువంటి పార్టీలో తన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోను విలీనం చేయబోనని నకరన్ అన్నారు. అన్నాడీఎంకే తన పార్టీని విలీనం అస్సలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో అన్నాడీఎంకే ఓటు షేర్ తగ్గిందని తెలిపారు. మరోవైపు ఎన్డీయే కూటమి అనూహ్యంగా 18.5 శాతం ఓటు షేర్‌ను సాధించిందని అన్నారు. అన్నాడీఎంకే తగ్గిన ఓటు షేర్‌ను గమనిస్తే.. ఆ పార్టీకి మైనార్టీ కులాల నుంచి మద్దతు పడిపోయిందన్నారు. విక్రవంది అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎన్డీయే కూటమి పక్షాలు అన్నీ చర్చించుకోని నిర్ణయిస్తామని అన్నారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా టీటీవీ దినకరన్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
మహిళా యూట్యూబర్ అరెస్టు
సాక్షి, చెన్నై: ఓ యువతి అనుమతి లేకుండా యూట్యూబ్ ఛానల్లో ఆమెకు సంబంధించిన వీడియోను అప్లోడ్ చేసిన వీరా టాక్ డబుల్ ఎక్స్ యూట్యూబ్ వ్యా ఖ్యాత వీజే శ్వేత, నిర్వాహకుడు రామ వీరప్పన్, కెమెరామెన్ యోగరాజ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లైక్‌లు, ప్రచారం కోసం యూ ట్యూబ్ ఛానళ్ల రూపంలో ఇష్టానుసారంగా వ్యవహరించే వారు రోజురోజుకూ అధికమైన విషయం తెలిసిందే. కొన్ని చానళ్లు మరీ అశ్లీలంగా మాట్లాడడం, జుగుప్స కలిగించే ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టడం, ఫ్రాంక్‌ల పేరిట వేధించడం పెరుగుతున్నాయి. ఈ కోవకు చెందిన వీరా టాక్ డబుల్ ఎక్స్ యూ ట్యూబ్ ఛానళ్ ఓ యువతి ప్రమేయం లేకుండా, ఆమె అనుమతి కూడా తీసుకో కుండా ఓ వీడియోను అప్లోడ్ చేసింది. ఈ వీడియో కారణంగా ఆయువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమాచారంతో కీల్పాకం పోలీసులు కేసు నమోదు చేశారు. యూ ట్యూబ్ ఛానల్‌కు చెందిన వీజే శ్వేత, నిర్వాహకుడు వలసరవాక్కంకు చెందిన రామ వీరప్పన్, కెమెరామెన్ యోగరాజ్‌ను బుధవారం అరెస్టు చేశారు. ఆ చానల్లో అశ్లీల వ్యాఖ్యలతో కూడిన వీడియోలు కోకొల్లలుగా ఉండడంతో ఆ ఛానల్‌ను సీజ్ చేయడానికి చర్యలు చేపట్టారు. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ సమస్యకు చెక్!
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కీలక ప్రకటన చేసింది. తమిళనాడు కేంద్రంగా మొత్తం 100 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో హ్యుందాయ్ మోటార్స్ 28 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 180 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను చైన్నై అంతటా ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఐఎల్ ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ జే వాంగ్ ర్యూ తెలిపారు.హ్యుందాయ్ ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ విజన్‌కు అనుగుణంగా మేం వాహనదారుల సౌకర్యాన్ని మెరుగు పరిచే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. కాబట్టే తమిళనాడు అంతటా 100 ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయడానికి, ఈవీ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడానికి, రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఈవీలను వినియోగించేలా ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు జే వాంగ్ ర్యూ వెల్లడించారు. ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు, ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో ఉన్న 170 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు కస్టమర్ సౌలభ్యం కోసం మై హ్యుందాయ్ యాప్‌లోని ఈవీ ఛార్జ్ విభాగంలో మ్యాప్ చేసింది. తద్వారా ఈవీ వాహనదారులు ఛార్జింగ్ పాయింట్లలో తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హ్యుందాయ్ ఈవీ వినియోగదారులే కాకుండా ఇతర వాహన యజమానులు ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని హ్యుందాయ్ స్పష్టం చేసింది. -
శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా పాల్గొన్నారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు సరసన నటిస్తోంది. ఈ సినిమాలో మహిమ అనే పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఒక్కసారిలో చెన్నైలో వాలిపోయింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరై కేకేఆర్‌కు మద్దతుగా సందడి చేసింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న జాన్వీ కపూర్ ప్రముఖ ముప్పాతమ్మన్ ఆలయాన్ని మొదటిసారి దర్శించుకుంది. శ్రీదేవి సిస్టర్ మహేశ్వరితో కలిసి ఆలయానికి వెళ్లింది. అమ్మ ఎంతగానో ఇష్టపడే ఆలయాన్ని మొదటిసారి సందర్శించానని జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముచ్చటగా మూడోసారి ఫైనల్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన తుదిపోరులో పేలవ ప్రదర్శనతో పరాజయం పాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.గతేడాదితో పోలిస్తే ఈ సీజన్ ఆసాంతం అద్భుతంగా ఆడినా అసలు మ్యాచ్‌లో చేతులెత్తేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన కమిన్స్ బృందం ఫైనల్లో మాత్రం తుస్సుమనిపించింది.అందుకే ఓడిపోయాంఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయంపై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని కితాబులు ఇచ్చాడు. తమ బ్యాటర్లు సీజన్ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని.. అయితే, చెన్నై వికెట్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు.‘‘వాళ్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. స్టార్కీ(మిచెల్ స్టార్క్) మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఈ మ్యాచ్‌లో మా ఆట తీరు అస్సలు బాగాలేదు. బౌండరీలు రాబట్టానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. గత వారం అహ్మదాబాద్(క్వాలిఫయర్-1)లోనూ వాళ్ల బౌలర్లు అద్భుతంగా ఆడారు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకు ఇవ్వాల్సిందే. ఈ వికెట్ స్వభావాన్ని మేము పసిగట్టలేకపోయాం. కనీసం 160 పరుగులు స్కోరు చేసినా కనీస పోటీ ఉండేది’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.మా వాళ్లు మాత్రం సూపర్అదే విధంగా.. ‘‘ఏదేమైనా.. ఈ సీజన్లో మాకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. మా వాళ్లు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. మూడుసార్లు 250 పరుగుల మేర స్కోరు చేశాం.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చివేశారు. హైదరాబాద్‌లో అభిమానులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు.ఈ సీజన్ మొత్తం అద్భుతంగా సాగింది. ఈసారి చాలా మంది కొత్త ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. భువీ, నట్టు, జయదేవ్‌లతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో మమేకమయ్యాను.సాధారణంగా టీమిండియాతో మ్యాచ్ అంటే మొత్తం నీలిరంగుతో స్టేడియం నిండిపోతుంది. అయితే, ఇప్పుడు ఇక్కడ ప్రేక్షకులు మా(నా)కు మద్దతుగా నిలవడం కొత్త అనుభూతినిచ్చింది’’ అని ప్యాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.ఐపీఎల్-2024 ఫైనల్: కేకేఆర్ వర్సెస్ సన్‌రైజర్స్👉వేదిక: చెపాక్ స్టేడియం.. చెన్నై👉టాస్: సన్‌రైజర్స్.. బ్యాటింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 113 (18.3)👉కేకేఆర్ స్కోరు: 114/2 (10.3)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా కేకేఆర్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్👉ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: సునిల్ నరైన్.చదవండి: IPL 2024: ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్ ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
ప్రధాని మోదీని చంపేస్తాం!.. ఎన్ఐఏకి బెదిరింపు కాల్
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ అందిన బెదిరింపు కాల్‌తో చెన్నైలోని జాతీయ దర్యాప్తు విభాగం అప్రమత్తమైంది. చెన్నై పురసైవాక్కంలో ఎన్ఐఏ కార్యాలయం ఉంది. బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కార్యాలయానికి ఫోన్ చేసి...ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని హతమా రుస్తామంటూ హిందీలో హెచ్చరించాడు. వెంటనే ఎన్ఐఏ అధికారులు చెన్నై సైబర్‌క్రైం బ్రాంచిని అప్రమత్తం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ కాల్ వచ్చిన ట్టుగా తేలడంతో గురువారం ఉదయం ఎన్ఐఏ, సైబర్ క్రైం బృందాలు భోపాల్‌కు వెళ్లాయి. అదేవిధంగా, చివరి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానికి భద్రతను మరింతగా పెంచాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. -
SRH vs RR: ‘సన్‌రైజర్స్ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్’
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ రాజస్తాన్ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్‌ను విమర్శించారు.ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్-2లోఇక సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్ వార్ వన్‌సైడ్ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్సన్రైజర్స్- రాజస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.చెన్నై పిచ్ పరిస్థితులు కూడా రాజస్తాన్ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.అది హైదరాబాద్ వికెట్ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్‌మన్‌షిప్ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫైర్అయితే, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్ మాదిరే సన్‌రైజర్స్ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.హైదరాబాద్ జట్టులోనూ షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, విజయకాంత్ వియస్కాంత్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అనుభవం లేకపోయినా మొమెంటమ్ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్ జట్టులో చెన్నై దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
విచక్షణ లేకుండా, చేతికొచ్చినట్టు కమెంట్లు చేయడం, సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేయడం సోషల్ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపడిందన్న సంతోషం ఒక తల్లికి ఎంతో సేపు నిలవనీయలేదు. వేధించి, వేధించి ఆమె ఉసురు తీసిన ఘటన విషాదం నింపింది.ఇటీవలి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుందా?ఎనిమిది నెలల పాపను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి బిడ్డను కాపాడారు. కానీ ఇపుడా పాపకు తల్లిని దూరం చేసింది మాయదారి సోషల్ మీడియా. కోయంబత్తూర్‌లో పాపను రక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విడియో చూసిన నెటిజన్లు "బిడ్డను చూసుకోవటం చేత కాదా?" అని ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కి గురైన ఆమె కోయంబత్తూర్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.కాగా చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నాలుగో అంతస్తులో నివసించే రమ్య, వెంకటేష్‌లకు ఇద్దరు పిల్లలు, నాలుగేళ్ల అబ్బాయి, ఏడు నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న, ఐటీ ఉద్యోగి రమ్య తన ఫ్లాట్‌లోని బాల్కనీలో తన పసికందుతో ఆడుకుంటూ ఉండగా, పాప ఆమె చేతుల్లోంచి జారి కింద ఉన్న తాత్కాలిక సన్షేడ్లో పడింది. దీంతో పొరుగువారు కింద దుప్పట్లు పట్టుకోగా, ఒక వ్యక్తి సన్‌షేడ్ నుండి పాపను పట్టుకుని సురక్షితంగా క్రిందికి తీసుకు రాగలిగాడు. ఈ ఘటన తర్వాత రమ్య తల్లిగారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినా ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో శనివారం కారమడైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉసురు తీసుకుంది. -
Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్‌లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్‌లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్‌సీఎల్, ఇండిగో ఎయిర్లైన్స్లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్‌లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్‌తో చేసిన ఇన్స్టాగ్రామ్ సిరీస్‌కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్లైన్లో ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్‌లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్డ్ థెరపిస్ట్‌గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.‘లైఫ్‌స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది. భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్‌ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది. -
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అనుకోకుండా చిన్న ఎల్ఈడీ బల్బు మింగాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బల్బు బాలుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు.బాలుడు దగ్గుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆపరేషన్ చేసి బల్బు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. రెండుసార్లు బ్రాంకోస్కోపి సర్జరీ చేసినప్పటికీ బల్బు బయటికి తీయడం వీలు కాలేదు. దీంతో డాక్టర్లు బాలుడి ఛాతి ఓపెన్ చేసి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.మేజర్ సర్జరీ అని భయపడ్డ తల్లిదండ్రులు బాలుడిని శ్రీరామచంద్ర మిషన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీటీ స్కాన్‌తో బల్బును గుర్తించి బ్రాంకోస్కోపి సర్జరీ ద్వారా తీసివేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం కుదుటపడింది. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపారు. -
TePe Sigeman Chess Tournament: రన్నరప్ అర్జున్
మాల్మో (స్వీడన్): టెపె సెజెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా), అర్జున్, నొదిర్బెక్ అబ్దుసత్తొరోవ్ (ఉజ్బెకిస్తాన్) 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు.విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య బ్లిట్జ్ గేమ్ టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో అర్జున్, నొదిర్బెక్ చేతిలో స్విద్లెర్ ఓడిపోయాడు. దాంతో అర్జున్, నొదిర్బెక్ టైటిల్ కోసం తలపడ్డారు. అర్జున్, నొదిర్బెక్ మధ్య రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌ను అర్జున్ ‘డ్రా’ చేసుకొని, రెండో గేమ్‌లో ఓడిపోవడంతో నొదిర్బెక్ చాంపియన్‌గా అవతరించాడు.ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ .. ఆరో ర్యాంకులో గుకేశ్ చెన్నై: గత నెలలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు టీనేజర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. గత నెలలో 16వ స్థానంలో ఉన్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ ప్రదర్శనతో గుకేశ్ 21 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ ఖాతాలో 2764 రేటింగ్ పాయింట్లున్నాయి. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 2761 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2751 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 14వ ర్యాంక్‌లో, విదిత్ 28వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 37వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల చెస్ ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి 5వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక 11వ ర్యాంక్‌లో, వైశాలి 13వ ర్యాంక్‌లో ఉన్నారు. -
సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఎయిర్‌బీఎన్‌బీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ తదితర రంగాల సెలబ్రిటీలతో జట్టు కడుతోంది. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌తో చేతులు కలిపింది. ’భారత్‌లో బాలీవుడ్ స్టార్ జాన్వి కపూర్‌లా జీవించండి’ స్లోగన్‌తో ఆమె బాల్యంలో నివసించిన చెన్నై ఇంటిని బస కోసం ప్రమోట్ చేస్తోంది. తమ కార్యకలాపాలకు సంబంధించి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని, టాప్ 10 మార్కెట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎయిర్‌బీఎన్‌బీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డేవ్ స్టీఫెన్సన్ తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో బుకింగ్స్ 30 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలు వెళ్లేవారితో పాటు దేశీయంగా కూడా పర్యటించే టూరిస్టులను ఆకట్టుకునేందుకు భారత్‌లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్టీఫెన్సన్ వివరించారు. తమ కార్యకలాపాల ద్వారా భారత్‌లో 85,000 పైచిలుకు ఉద్యోగాలకు, జీడీ పీ వృద్ధికి 920 మిలియన్ డాలర్ల మేర తోడ్పా టు అందించినట్లు పేర్కొన్నారు. -
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్‌కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్‌తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్‌ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్‌కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) తన వెబ్సైట్ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
చెన్నైకి గేమ్
చెన్నైలో ఆట మొదలెట్టనున్నారు హీరో రామ్‌చరణ్. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ‘వినయ విధేయ రామ’ మూవీ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ మరోసారి ‘గేమ్ చేంజర్’లో జోడీగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ చెన్నైలోప్రారంభం కానుందని సమాచారం. మే మొదటి వారంలో చెన్నైలోప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, కియారా అద్వానీ, సునీల్, నవీన్ చంద్రలపై ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారట శంకర్. కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. -
గుకేశ్‌కు ఘనస్వాగతం
సాక్షి, చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం టొరంటో నుంచి స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. అతనికి చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. టోర్నీ సమయంలో గుకేశ్ వెంట తండ్రి రజినీకాంత్ ఉన్నారు. విమానాశ్రయంలో గుకేశ్ తల్లి పద్మ కుమారితోపాటు ఇతర కుటుంబ సభ్యులు, అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు గుకేశ్‌కు స్వాగతం పలికారు.‘టైటిల్ గెలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా కెరీర్‌ను తీర్చిదిద్దడంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పాత్ర ఎంతో ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక ఈ ఏడాది చివర్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగే ప్రపంచ చాంపియన్íÙప్ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతాను’ అని వచ్చే నెలలో 18 ఏళ్లు పూర్తి చేసుకోనున్న గుకేశ్ వ్యాఖ్యానించాడు.మరోవైపు గుకేశ్–డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని ఏఐసీఎఫ్ కార్యదర్శి దేవ్ పటేల్ ప్రకటించారు. ఒకవేళ భారత్‌కు ఆతిథ్య హక్కులు లభిస్తే చెన్నై నగరం ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వేదిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ నెగ్గిన గుకేశ్‌కు ఏఐసీఎఫ్ రూ. 51 లక్షలు నగదు పురస్కారం ప్రకటించింది. -
లోక్‌సభ పోలింగ్ : తమిళనాడులో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
-
దేశమంతా షాక్! అక్కడ బంగారం కొనేవారికి మాత్రం గుడ్‌న్యూస్
Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 15) షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజుల క్రితం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. నిన్నటి రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ ఈరోజు పరుగు అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 చొప్పున పెరిగి రూ.73,150 వద్దకు చేరింది. దేశమంతా బంగారం ధరలు దడ పుట్టిస్తుంటే చెన్నైలో మాత్రం ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.67,900 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.710 చొప్పున క్షీణించి రూ.74,070 లకు తగ్గింది. ఇతర ప్రధాన నగరాల్లో.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 ఎగిసి రూ.67,200 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.73,300 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. -
Ram Charan Photos: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు)
-
అవినీతి యూనివర్సిటి ఛాన్సలర్ మోదీ : సీఎం స్టాలిన్
చెన్నై: డీఎంకేని అవినీతి పార్టీ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి అనే ఓ యూనివర్సిటీ ఉంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్ అవుతారని అని సెటైర్లు వేశారు. ‘అవినీతి పేరుతో ఓ విశ్వవిద్యాలయం స్థాపిస్తే.. ఆ యూనివర్సిటీకి ప్రధాన మంత్రి మోదీ ఛాన్సలర్ అవుతారు. ఛాన్సలర్ కావడానికి ప్రధాని మోదీకి అన్ని అర్హతలు ఉన్నాయి. బీజేపీనే దేశంలో అతిపెద్ద అవినీతీ పార్టీ. దానికి ఉదాహారణ.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. అది ఒక్కటే కాదు.. పీఎం కేర్స్ ఫండ్, కేసుల్లో ఇరుకున్న ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరిన తర్వాత విచారణ ఉండకపోవటం. అసలు అవినీతితో కూడిన పార్టీ బీజేపీ’ అని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ఇక.. బుధవారం తమిళనాడులోని వెల్లూరులో బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే అవినీతి పార్టీ అని మండిపడ్డారు. ‘అవినీతికి మొదటి కాపీ రైట్ డీఎంకేకు చెందుతుంది. ఎంకే స్టాలిన్ కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంది. తమిళనాడు ప్రజలను అవినీతి కుటుంబ పాలన కొనసాగించే డీఎంకే తమ ట్రాప్‌లో పడిపోయారు. డీఎంకే పార్టీ తమిళ సంస్కృతి, సాంప్రదాయానికి వ్యవతిరేకంగా ఉంది. సీఎం స్టాలిన్ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నారు’ అని మోదీ విమర్శలు చేశారు.