
చెన్నైలో CBSE పరీక్షల సమయంలో స్కూల్ గోడ ఎక్కి, తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసి మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
ఇలాంటి ఘటనలు ఏ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి?
🔹మన విద్యా వ్యవస్థ పిల్లలపై ఎంత ఒత్తిడిని పెడుతోంది?
🔹తల్లిదండ్రుల ఆందోళన పిల్లల మనసుపై ఎలా ప్రభావం చూపుతోంది?
🔹తల్లిదండ్రుల ప్రేమ వారికి బలాన్ని ఇస్తుందా, భయాన్ని పెంచుతుందా?
ప్రతీ సంవత్సరం పరీక్షల సీజన్ వచ్చినప్పుడల్లా విద్యార్థుల కన్నా ఎక్కువగా ఒత్తిడిలో ఉంటున్న వారు తల్లిదండ్రులే. "తప్పక పాస్ అవ్వాలి!", "అగ్రశ్రేణి మార్కులు రావాలి!", "లేకపోతే భవిష్యత్తు అంధకారం!" – ఇవీ తల్లిదండ్రులలో నిండిపోయిన భయాలు. ర్యాంక్ కోసమే మన ప్రేమ అని పిల్లలకు అనిపించకూడదు.
ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
తల్లిదండ్రులు చేయకూడనిది...
❌ హెలికాప్టర్ పేరెంటింగ్:
ప్రతీ చిన్న విషయాన్ని తల్లిదండ్రులు గమని…
పిల్లలను ఎలా ప్రోత్సహించాలి?
✅ పరీక్ష ఫలితాలు ఆశించినంత రాలేదనుకోండి. పిల్లలు దిగులుగా ఉన్నప్పుడు, "నీ ప్రయత్నం గొప్పది, మార్కులు మాత్రమే జీవితానికి అద్దం కాదు" అని చెప్పండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.
✅ పిల్లలకు చదువు అంటే భయం కాకుండా ఆసక్తిగా ఉండేలా చేయండి. "ఏ విషయం నచ్చింది? ఏ ప్రశ్న ఆసక్తికరంగా అనిపించింది?" అని అడిగితే, పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే ప్రక్రియగా భావిస్తారు.
✅ "నీ ఫ్రెండ్ అజయ్ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీవు ఎందుకు సాధించలేకపోతున్నావు?" అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చతాయి. ప్రతి ఒక్కరికీ తన ప్రయాణం ఉంటుంది. అందుకే పోల్చడం మానండి.
✅ తప్పిదాలను సహజంగా అంగీకరించండి. "ఈసారి ఏమి తప్పైంది? తర్వాత ఎలా మెరుగుపరచుకోవచ్చు?" అనే విధంగా ప్రశ్నించడం ద్వారా పిల్లలు సమస్యలను అర్థం చేసుకొని, మెరుగుపడటాన్ని నేర్చుకుంటారు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
📌 పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. అవి ఒక చిన్న అంచనా మాత్రమే.
📌 పిల్లలకు భయం పోగొట్టండి. పరీక్షలు అంటే భయపడేలా కాకుండా, కొత్త విషయాలు నేర్చుకునే అనుభవంగా చూడమని ప్రేరేపించండి.
📌 పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడితో విజయం సాధించడమే కాదు, ఆనందంగా ఎదగాలి.
📌 గోడలు ఎక్కే తల్లిదండ్రులు కాకుండా, పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి.
పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే మంచి అవకాశంగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల భవిష్యత్తును భయంతో నింపకుండా, ధైర్యంగా ముందుకు నడిపిద్దాం!
మీకేమైనా కౌన్సెలింగ్ సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి.
-సైకాలజిస్ట్
విశేష్
Comments
Please login to add a commentAdd a comment