CBSE
-
అనుకున్నదే జరిగింది పేద పిల్లలపై కక్ష తీర్చుకున్న బాబు
-
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్‌కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్‌ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్‌ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్‌లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్‌లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్‌ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్‌గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
పేద పిల్లలకు ఆ అర్హత లేదా ? CBSE రద్దుపై వైఎస్ జగన్ ఆవేదన
-
ఖజానా దోపిడీకి లైన్ క్లియర్
ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన సర్కారే.. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ చేసింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి (2003 జూలై 1న జారీ చేసిన జీవో 94) ప్రకారమే టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని అమలు చేస్తూ ఆదివారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 40) జారీ చేశారు. దీంతో 2014–19 మధ్య కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ ఖజానాను దోచేసినట్లుగానే ఇప్పుడూ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. సీబీఎస్ఈ సిలబస్ రద్దు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. టోఫెల్ వ్యవస్థ రద్దు.. సెబ్ రద్దు.. వలంటీర్ వ్యవస్థ రద్దు.. ఇలా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవస్థలన్నీంటినీ చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఈ పరంపరలో పొరుగు రాష్ట్రాల ప్రశంసలు పొందిన రివర్స్ టెండరింగ్ విధానాన్నీ తాజాగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ప్రతిపాదన దశలోనే బేరసారాలు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఒక పని ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో బేరసారాలాడి కమీషన్లు ఖరారు చేసుకునేవారు. ఈ మేరకు అంచనాలు పెంచేయించడం.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్‌కే ఆ పని దక్కేలా నిబంధనలను రూపొందించి టెండర్లు పిలవడం.. అదే కాంట్రాక్టర్‌కు అధిక ధరకు పనులు కట్టబెట్టడం.. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చేసి.. వాటినే కమీషన్లుగా రాబట్టుకుని తమ జేబులో వేసుకోవడం రివాజుగా మార్చుకున్నారు. అప్పట్లో కేవలం టెండర్ల వ్యవస్థను నీరుగార్చి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.20 వేల కోట్లను దోచేశారు. 7,500కోట్లు ఆదా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం వంటి విప్లవాత్మక సంస్కరణలను అమల్లోకి తెస్తూ 2019, ఆగస్టు 16న ఉత్తర్వులు(జీవో 67) జారీ చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులను పూర్తిగా రద్దు చేశారు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించడంతో కాంట్రాక్టర్లు భారీ ఎత్తున పోటీ పడ్డారు. దీంతో కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. 2019 ఆగస్టు 16 నుంచి 2024 మే వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ 2019, జూలై 26న నివేదిక ఇచ్చిన బీవోసీఈతోనే... ఆ విధానం రద్దు చేయాలంటూ గత నెల 21న చంద్రబాబు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ఆ నివేదికను అదే నెల 28న కేబినెట్లో ఆమోదించి.. పాత విధానంలో టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి0ది.– సాక్షి, అమరావతి -
సీబీఎస్ఈకీ మంగళం!
సాక్షి, అమరావతి: మొన్న టోఫెల్.. నిన్న ఐబీ.. నేడు సీబీఎస్ఈ.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఉన్నతాశయంతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు వీటి ద్వారా బంగారు బాటలు వేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలుచేస్తే.. ఆయన మీద అక్కసుతో చంద్రబాబు సర్కారు పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా.. జగన్ అమలుచేసిన ఒక్కో అంశానికీ స్వస్తి చెబుతోంది. టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన ఈ ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన ఊసెత్తడంలేదు. తాజాగా.. సీబీఎస్ఈ బోధనకూ తూచ్ అంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది.విద్యా సంవత్సరంలో మధ్యలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోను, విద్యార్థుల్లోను వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దుచేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దుచేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయనిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే, విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘టోఫెల్’ శిక్షణను అధికారంలోకి వచ్చీరాగానే జూన్‌లో రద్దుచేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సీబీఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సీబీఎస్ఈ బోధనను రద్దుచేశారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుళ విధానాల కారణంగా.. ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది.జగన్‌పై కోపంతోనే విద్యపై అక్కసు..‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు, మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’.. అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. పేదల పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ మాటలే చెబుతున్నాయి. ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఉదా.. గతంలో తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలికొదిలేశారు. అలాగే, 4,300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు వైఎస్ జగన్‌పై కోపంతో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు.విద్యా సంస్కరణలకు జగన్ శ్రీకారం..పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని, పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వైఎస్ జగన్ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లిష్ మీడియం అమలుచేశారు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను సైతం అందించారు. మరోపక్క.. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ‘టోఫెల్’ను సిలబస్‌లో అంతర్భాగం చేశారు. మరోపక్క.. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువమంది విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యను అందించేందుకు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 2023–34 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒక యూనిట్ పరీక్షలు కూడా ముగిసిన తర్వాత ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షా విధానం రద్దుచేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసింది.అంధకారంలోకి 84 వేల సీబీఎస్ఈ విద్యార్థుల భవిష్యత్తు..నిజానికి.. గత విద్యా సంవత్సరంలో పదో తరగతికి ఇంగ్లిష్ మీడియం అమలుచేయకున్నా దాదాపు 1.94 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్‌లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తేగా ఇప్పుడీ స్కూళ్లల్లో దాదాపు 84 వేల మంది టెన్త్ విద్యార్థులు, 82 వేల మంది 9వ తరగతి చదువుతున్నారు. అయితే, ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్–పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దుచేసింది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దుచేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది తగ్గిపోయారంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా దిగజార్చిందో అర్థంచేసుకోవచ్చు. మరోవైపు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ‘రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.తల్లికి వందనం ఎగనామం!మరోవైపు.. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రకటించింది. దీంతో.. తల్లికి వందనం కింద వచ్చే రూ.15 వేలకు అదనంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని ప్రైవేటు స్కూళ్లు ఆకర్షిస్తుండడంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లారు. కానీ, అధికార పగ్గాలు చేపట్టాక మాటమార్చి వచ్చే విద్యా సంవత్సరంలో చూద్దామని శాసనసభ సాక్షిగా ఆ శాఖా మంత్రి లోకేశ్ ప్రకటించి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లారు.నిర్దాక్షిణ్యంగా ‘టోఫెల్’ రద్దు..ఇక పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరం జగన్ సర్కారు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీలు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,265 మందికిగాను 4,17,879 మంది (92 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.ఐబీ శిక్షణకూ అదే గతి..‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’.. అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలకు తగ్గట్లుగానే టీడీపీ ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది. అలాగే, అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి.. ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్‌పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లుచేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్నే తొలగించడంతో మొత్తం ప్రక్రియ అటకెక్కినట్లయింది. -
కూటమి రాజకీయ కక్ష.. అటకెక్కనున్న CBSE
-
కూటమి సర్కార్ కుట్ర.. విద్యారంగ సంస్కరణలపై వేటు!
సాక్షి, విజయవాడ: ఏపీ విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలకు కూటమి సర్కార్ తిలోదకాలు పలికింది. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలను ఆపేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ జగన్‌కు పేరు రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సంస్కరణలపై వేటు వేస్తోంది...ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన కీలక సంస్కరణలను ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో సీబీఎస్ఈ సిలబస్‌ను కూడా ఎత్తేస్తామని ఆయన తెలిపారు. ఇక, బైజూస్ ట్యాబ్‌లు దండగ అంటూ టీడీపీ ముద్ర వేసింది. పిల్లలకు ఇచ్చే ట్యాబ్‌ల పంపిణీకి కూడా మంగళం పాడేయాలని కూటమి సర్కార్ నిర్ణయించుకుంది.మరోవైపు.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే ఏడాది నుండి ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్టు అశోక్ బాబు తెలిపారు. ఇక, ఇప్పటికే టోఫెల్ శిక్షణను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలు తేవాలని వైఎస్ జగన్ ఎంతగానో ప్రయత్నించారు. కార్పొరేట్ పాఠశాలతో పోటీ పడేందుకు ఆధునిక పద్ధతులను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే టోఫెల్, ఐబీ సిలబస్, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ వంటి వాటిని వైఎస్ జగన్ అమలుచేశారు. దీంతో, వైఎస్ జగన్‌కు పేరు రావొద్దని భావించిన చంద్రబాబు.. సంస్కరణలు అన్నింటినీ ఎత్తేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలపై వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు తన పార్టీ ఎమ్మెల్సీలు, ఎల్లో పత్రికలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయిస్తున్నారు. క్రమంగా ఒక్కో సంస్కరణపై చంద్రబాబు వేటు వేసుకుంటూ వస్తున్నారు. -
విద్యలో సరికొత్త విప్లవం
» ఇదీ జగన్ బ్రాండ్ గవర్నెన్స్ » పేద విద్యార్థుల చెంతకు ఇంగ్లిష్ చదువులు » ప్రస్తుత ప్రపంచంలో మన పిల్లలు రాణించేలా నైపుణ్య శిక్షణ » అన్ని స్థాయిల్లోను యాక్టివిటీ బేస్డ్ పాఠ్యపుస్తకాల రూపకల్పన » ఐటీ కోర్సుల్లో శిక్షణకు స్కిల్ ఎక్స్పర్ట్స్ నియామకం » నిత్య జీవిత సమస్యలను అధిగమించేందుకు ‘సంకల్పం’ శిక్షణ » డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ » ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు సోమవారంహాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారంఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారంవెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారంఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారంఅన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారంఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్–సాక్షి, అమరావతిమన ఇంగ్లిష్ విద్యపై ప్రశంసల జల్లు » ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ » ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ » ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు అమలుకు సిద్ధం’’ » ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే గాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు మొత్తం రూ.25,809.5 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేశారు. నాడు– నేడులో చేసిన ఖర్చు విడత పాఠశాలలు ఖర్చు (రూ.కోట్లలో) మొదటి 15,715 3,669 రెండో 22,344 8,000 -
సీబీఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో... డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు
న్యూఢిల్లీ: టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం.. తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సీబీఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి ఛాప్టర్లను తమ 9వ తరగతి ‘వాల్యూ ఎడిషన్’ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసి మెలసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. ‘డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్: అండర్స్టాండింగ్ యువర్సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్ధాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలవంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్‌ఫిషింగ్’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్’, ‘సైబర్ బులీయింగ్’ పదాలకు అర్ధాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. ‘క్రష్’, ‘స్పెషల్’ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు. -
ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లల్లో తొలిసారి పరీక్షలు
సాక్షి, అమరావతి: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి 8, 9 తరగతుల విద్యార్థులు పీరియాడిక్ రాత పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్ పరీక్షలు రాయనున్నారు. గతేడాది 1,000 ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే దాదాపు విద్యా సంవత్సరం పూర్తవడంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు స్టేట్ బోర్డు పరీక్షలైన ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్లకే హాజరయ్యారు. కాగా, ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి సీబీఎస్ఈ బోర్డు నిర్వహించే పీడబ్ల్యూటీ, టర్మ్ పరీక్షలు రాయనున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో వెయ్యి పాఠశాలల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనకు అనుమతి వచ్చింది. ఈ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు 2023–24 నుంచి సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ బోర్డు పరీక్షలు రాస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీని ప్రకారం 8, 9 తరగతులకు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల తరహాలో పీరియాడిక్ పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు పీడబ్ల్యూటీ జరగనున్నాయి. విషయ పరిజ్ఞానం పెంచేలా.. విద్యా సంవత్సరంలో పీడబ్ల్యూటీలు నాలుగు, టర్మ్ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్–1 నవంబర్‌లో, టర్మ్–2 (వార్షిక) పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, రెండు భాషా పేపర్లు (మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు) రాయాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు 50 మార్కులకు నిర్వహించే పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు ఇంటర్నల్ థియరీ పరీక్ష ఉంటుంది. 100 మార్కుల టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు (ఇంటర్నల్ థియరీ) ఉంటాయి. విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలంటే ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. సబ్జెక్టుల్లో ప్రాజెక్టులు, ల్యాబ్ టెస్టులు కూడా ఉంటాయి. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా విద్యార్థులతో పోటీపడేలా పరీక్షల్లో విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇవ్వనున్నారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. ఇందులో పెన్ పేపర్ టెస్ట్ (5 మార్కులు), మల్టిపుల్ అసెస్మెంట్ (5), ఫోర్ట్పోలియో (5), సబ్జెక్టుపై విద్యార్థికున్న అవగాహనకు 5 మార్కులు మొత్తం 20 మార్కులు కేటాయించారు. భాషా పరీక్షలో వ్యూహాత్మకంగా పరిష్కరించే పజిల్స్, క్లాస్‌వర్క్, ఇంగ్లిష్ మాట్లాడడం, విని అర్థం చేసుకునే సామర్థ్యంపైన ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న 85,353 మంది విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీరికి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి సిలబస్‌ను బోధించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 10వ తరగతిలో ‘స్కిల్’ సబ్జెక్టు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం(2024–25)లో 10వ తరగతిలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో వీరికి ఆరో సబ్జెక్టుగా ‘స్కిల్ టెస్ట్’ను ప్రవేశపెట్టారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ పరీక్షలో తప్పిన విద్యార్థులు స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుని పాస్ చేస్తారు. ఆరో సబ్జెక్టుగా విద్యార్థుల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. పదో తరగతి విద్యార్థులు ఈ రెండింటిలో ఒకదాన్ని ఆరో సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. జాగ్రత్త పాటించండి సీబీఎస్ఈ బోర్డు క్యాలెండర్ ప్రకారం.. వచ్చే మార్చి 31 నాటికి 9వ తరగతి పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి బోధన చేపట్టాలి. అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థుల బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల వివరాల నమోదులో పాఠశాలల ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థి పేరు, ఆధార్, తల్లిదండ్రుల వివరాలు పుట్టిన తేదీ ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్త వహించాలి. – ఎం.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్, సీబీఎస్ఈ స్కూల్స్. -
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్‌లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్‌కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్‌లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్‌తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
CBSE 10th Class Result 2023: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలను విడదుల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌తో పాటు డిజిలాకర్, ఇతర వెబ్సైట్లలో చెక్‌చేసుకోవచ్చు. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు జరిగాయి. మొత్తం 21, 86,940 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి. చదవండి: మోదీ 'మన్ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్.. -
2025 నుంచి సీబీఎస్ఈ ప్యాట్రన్‌లో టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. ఆ విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో ముద్రించి ఇచ్చారు. ఈ విద్యార్థులు 2025లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు. వీటిని సీబీఎస్ఈ ప్యాట్రన్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత నుంచి వచ్చే బ్యాచ్‌ల విద్యార్థులు సీబీఎస్ఈ ప్యాట్రన్‌లోనే అభ్యసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022–23, 2023–24 విద్యాసంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆతరువాత నుంచి పూర్తిగా సీబీఎస్ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షలను.. అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్, కంటిన్యూ ఇవాల్యుయేషన్ – సీసీఈ) విధానం ప్రకారం గతంలో ఎస్సెస్సీ పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి. అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు, పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది. పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని అనుసరించనున్నందున 2025 నుంచి జరిగే టెన్త్ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2022–23)లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. తొలివిడతగా 1,092 స్కూళ్లకు రానున్న సీబీఎస్ఈ గుర్తింపు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపునకోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1,092 స్కూళ్లకు తొలివిడతగా ఈ గుర్తింపు రానుంది. ఈ స్కూళ్ల విద్యార్థులకు సీబీఎస్ఈ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి. నేరుగా ఆ బోర్డే ఈ స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది. సీబీఎస్ఈ గుర్తింపులేకున్నా దాని సిలబస్, ప్యాట్రన్‌ను మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులకు మాత్రం ఎస్సెస్సీ బోర్డు ద్వారా.. సీబీఎస్ఈ ప్యాట్రన్‌లోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. -
ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యానికి ముకుతాడు వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డొనేషన్లు, ఫీజులు కనీస వసతులతో పాటు నిర్వహణ తీరుతెన్నులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమైంది. సీసీ కెమెరాల నిఘా నడుమ పాఠశాల నిర్వహణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మండలం యూనిట్‌గా ఆయా పాఠశాల వ్యవహారంపై సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాల అనుమతి పునరుద్ధరించే సమయంలో చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. పాఠశాలకు అనుమతి రెన్యువల్ చేయడమో.. లేక తిరస్కరించడమో చేయనుంది. నిబంధనలు తూచ తప్పకుండా పాటించే విధంగా షరతులను అనుమతికి కొర్రీగా పెట్టనుంది. నిబంధనలు అమలు చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర స్కూళ్లపై కూడా.. ►స్టేట్ సిలబస్‌తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్‌పై కూడా పర్యవేక్షణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. స్టేట్ సిలబస్ పాఠశాలపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులది ఉండగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపునకు మాత్రం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) మాత్రమే జారీ చేస్తోంది. ►ఈ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్ఓసీ సైతం ఉపసంహరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఫీజులపై దృష్టి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు దండుకునే విషయంలో చూపే శ్రద్ధ.. మౌలిక వసతులను కల్పించడంలో లేకపోవడం సర్వసాధారణంగా తయారైంది. ►ప్రైవేటు యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలా ఉంచుతున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి.. ►ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. ►కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఒత్తిళ్లు, పలుకుబడితో అనుమతులు లభించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతుల జారీ అనుమానాలకు తావిస్తోది. -
CBSE 10th Result 2022: సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికలు 95.21 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 93.80 శాతం మంది పాసయ్యారు. బాలికల్లో దియా నామ్‌దేవ్, బాలురలో మయాంక్ యాదవ్ నేషనల్ టాపర్స్‌గా నిలిచారు. వీరిద్దరూ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుని చదివా షామ్లీ జిల్లాకు చెందిన దియా నామ్‌దేవ్.. స్థానిక స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాను టాపర్‌గా నిలిచానని దియా నామ్‌దేవ్ తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉంటాను. నేను ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు చదువుకున్నాను. కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకుని చదవడం వల్ల టాపర్‌గా నిలిచాన’ని అన్నారు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన మయాంక్ యాదవ్ కూడా 100 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచాడు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు తెచ్చుకుని సత్తా చాటాడు. టాపర్‌గా నిలవడం పట్ల మయాంక్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. త్రివేండ్రం టాప్.. గువాహటి లాస్ట్ సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో త్రివేండ్రం ముందు వరుసలో నిలిచింది. త్రివేండ్రంలో అత్యధికంగా 99.68 శాతం ఉత్తీర్ణత నమోదయింది. గువాహటి 82.23 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. ఢిల్లీలో 86.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తూర్పు ఢిల్లీలో 86.96 శాతం, పశ్చిమఢిల్లీలో 85.94 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ( కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటీషన్.. పోలీసుల అదుపులో ఒకరు) -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
-
National Education Policy–2020: సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. కొత్త మార్పులు ఏమిటంటే.. విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది. విద్యార్థుల టాలెంట్‌ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్‌ను సీబీఎస్ఈ జారీ చేస్తుంది. -
సీబీఎస్ఈ సిలబస్‌లో భారీ మార్పులు
న్యూఢిల్లీ: 2022–23 విద్యా సంవత్సరానికి 11, 12వ తరగతుల సిలబస్‌లో సీబీఎస్ఈ పలు మార్పులు ప్రకటించింది. చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లోని అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధ కాలం, ఆసియా–ఆఫ్రికా దేశాల్లో ముస్లిం సామ్రాజ్యాల అవతరణ, మొగలుల పాలన, పారిశ్రామిక విప్లవం పాఠ్యాంశాలను తొలగించింది. 10వ తరగతిలో ఫుడ్ సెక్యూరిటీ చాప్టర్లోని ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ అగ్రికల్చర్‌ను తీసేసింది. ఉర్దూ కవి ఫయీజ్ అహ్మద్ ఫయిజ్ అనువాద కవితలను, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ చాప్టర్లను తీసేసింది. సిలబస్‌లో హేతుబద్ధత కోసమే ఈ మార్పులు చేసినట్టు చెప్పింది. గత విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా నిర్వహించిన ఫైనల్ పరీక్షను ఈసారి ఒకే దఫా నిర్వహించాలని నిర్ణయించింది. 2020లోనూ 11వ తరగతి రాజనీతి శాస్త్రంలో పలు చాప్టర్లు తొలగించిన సీబీఎస్ఈ, నిరసనలతో మరుసటి ఏడాది నుంచి వాటిని పునరుద్ధరించింది. -
జేఈఈ మెయిన్ మరోసారి వాయిదా
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌ను ఎన్టీఏ వాయిదా వేసింది. ఈమేరకు బుధవారం రాత్రి పబ్లిక్ నోటిఫికేషన్ జారీచేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తోన్న విన్నపాలను పరిశీలించిన ఎన్టీఏ జేఈఈ 2 విడతల పరీక్షలను వాయిదా వేసింది. తొలి విడత పరీక్షలను జూన్‌లో, రెండో విడత జులైలో నిర్వహించనుంది. ఇంతకు ముందు ఫస్ట్, సెకండ్ సెషన్లను 6 రోజుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించగా సవరించిన షెడ్యూల్లో పదేసి రోజులకు పెంచారు. తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు పేర్కొన్న ప్రకారం రెండో విడత దరఖాస్తు ప్రక్రియ 8వ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉంది. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకొనే తేదీని కూడా తరువాత వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)తో పాటు పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, హయ్యర్ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్ కూడా జరుగుతుండడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 2 పరీక్షలూ కీలకమైనవి కావడంతో దేనిపై దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు. జేఈఈ షెడ్యూల్ దృష్ట్యా బోర్డు పరీక్షలు ఇప్పటికే 2 సార్లు మారాయి. ఇంటర్ పరీక్షలు నెల పాటు ఆలస్యమయ్యాయి. ఏపీలో ఏప్రిల్ 8 నుంచి 28 వ తేదీవరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉండగా జేఈఈ తొలి షెడ్యూల్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు ప్రకటించడంతో బోర్డు పరీక్షల తేదీలను మార్చారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ తేదీలను మళ్లీ ఏప్రిల్ 21 నుంచి మే 4వరకు మార్చడంతో ఇంటర్ పరీక్షల తేదీలను కూడా మార్చి మే 6 నుంచి మే 24 వరకు పెట్టారు. ఇప్పుడు జేఈఈ పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అడ్వాన్స్డ్ పైనా ప్రభావం జేఈఈ మెయిన్ వాయిదా ప్రభావం జేఈఈ అడ్వాన్స్‌డ్‌పైనా పడుతోంది. జూలై 3 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించాలని ముంబై ఐఐటీ ఇంతకు ముందే షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడు జేఈఈ మెయిన్ పరీక్షలు జూలై 21 నుంచి 30వ తేదీవరకు జరుగనున్నాయి. ఆ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అడ్వాన్స్డ్ నిర్వహించేందుకు వీలుంటుంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. -
మేలో జేఈఈ మెయిన్స్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షను మేలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించినట్లు తెలిసింది.ఈ దిశగా ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు తెలిసింది. నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలో మొదలవనుంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే పరీక్ష నిర్వహించాలను కున్నా సీబీఎస్ఈ టర్మ్–2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుండటంతో అవి పూర్తయ్యాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నిబంధనలు సడలించాలని డిమాండ్లు జేఈఈ మెయిన్స్ నిబంధనలు సడలించాలని అన్ని రాష్ట్రాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష రాసేందుకు కనీసం ఇంటర్, ప్లస్–2లో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ఈసారీ సడలించాలని పట్టుబడుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ నిబంధనకు మినహాయింపు ఇవ్వగా తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆ నిబంధనను మళ్లీ అమలు చేయాలని ఎన్టీఏ భావిస్తోంది. విద్యార్థులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. గత రెండేళ్లుగా పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ప్రమోట్ అవుతున్నారు. తెలంగాణలో టెన్త్ పరీక్షలు లేకుండా ఇంటర్‌కు పంపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలుత నిర్వహించకుండా సెకెండియర్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పరీక్షల నిర్వహించినా కేవలం 49 శాతమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో అందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. ఇప్పుడు వీళ్ళే జేఈఈ మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చాలామందికి 75 మార్కులు ఇంటర్లో వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఈ కారణంగా ఈ నిబంధన సడలింపు కోరుతున్నారు. రెండుసార్లు చాలు! జేఈఈ మెయిన్స్‌ను రెండుసార్లు నిర్వహిస్తే చాలన్న అభిప్రాయంతో అన్ని రాష్ట్రాలు ఏకీభవిస్తున్నాయి. తమిళనాడు, ఢిల్లీ విద్యార్థులు 4 సార్లూ మెయిన్స్ నిర్వహించాలని, ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఏ మాత్రం ఈ అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడట్లేదు. గతేడాది కూడా 4 అవకాశాలు ఇచ్చినా విద్యార్థులు పెద్దగా వినియోగించుకోలేదు. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది పరీక్షకు హాజరవలేదు. ఆఖరి రెండు దఫాలకు హాజరు బాగా తగ్గిందని ఎన్టీఏ అధికారులు చెబుతున్నారు. ఈ దృష్ట్యా పరీక్షను రెండుసార్లే నిర్వహించడంపై ఎన్టీఏ దృష్టి పెట్టింది. -
ఇదేం ‘పరీక్ష’?
సాక్షి, అమరావతి: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానం అమలవుతున్న స్కూళ్లలో 10, 12 తరగతుల పరీక్షలకు ఒకే ఏడాది వేర్వేరు విధానాలను అనుసరిస్తుండడంపై విద్యార్థులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఏడాది వేర్వేరు రకాలుగా పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారని, పాఠ్యబోధనలో తమకూ ఇబ్బందులు తప్పవని టీచర్లు చెబుతున్నారు. సీబీఎస్ఈ ఈ ఏడాది 10, 12 తరగతుల విద్యార్థులకు రెండు టర్మ్‌ల పరీక్షల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఒకే ఏడాదిలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ టర్మ్ పరీక్షలు గతేడాది నవంబర్–డిసెంబర్‌ల్లో జరిగాయి. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఈ పరీక్షలను నిర్వహించారు. రెండో టర్మ్ పరీక్షలను వచ్చే మార్చిలో నిర్వహించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బోర్డు ఇంకా విడుదల చేయలేదు. రెండో టర్మ్ పరీక్షలను వ్యాసరూప (డిస్క్రిప్టివ్) ప్రశ్నల విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళానికి కారణమవుతోంది. ఒకే విధానంలో పరీక్షలు ఉండాలి.. సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలు రెండింటికీ ఒకే విధానాన్ని కాకుండా వేర్వేరు విధానాలను అనుసరించడం సరికాదన్నది పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్ల అభిప్రాయం. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో విద్యార్థుల్లో సృజనాత్మకత, అవగాహన శక్తి, ఇతర నైపుణ్యాలను లోతుగా అంచనా వేసే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. వ్యాసరూప ప్రశ్నలతో అయితే విద్యార్థి సమాధానాల తీరును పరిశీలించడం ద్వారా ఆ నైపుణ్యాలను తెలుసుకోగలుగుతామని కొందరు అంటున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నల ద్వారానే విద్యార్థిని లోతుగా, సంపూర్ణంగా అన్ని అంశాల్లో పరిశీలించవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. పైగా వివిధ పోటీపరీక్షల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలే ఉంటున్నాయని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంతో విద్యార్థులకు వాటిని ఎదుర్కొనేలా ముందుగానే తర్ఫీదునిచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కాబట్టి ఒక ఏడాదిలో ఈ రెండింటిలో ఏదో ఒక విధానంలోనే పరీక్షలు నిర్వహించడం సరైనదని అంటున్నారు. ఒకే విద్యా సంవత్సరంలో సగం రోజులు ఒక తరహా పరీక్షలకు బోధించి, ఆ వెంటనే మరో తరహాలో బోధించడం కష్టమని వివరిస్తున్నారు. విద్యార్థుల విముఖత విద్యార్థులు కూడా కొన్ని రోజులు ఆబ్జెక్టివ్‌కు అలవాటు పడి.. ఆ వెంటనే డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు రాయడం కష్టమేనని చెబుతున్నారు. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. రెండు విధానాల్లో పరీక్షలపై విద్యార్థులు కూడా విముఖంగా ఉన్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు వ్యాసరూప ప్రశ్నలకు విద్యార్థులు సన్నద్ధం కావడం కష్టమని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల ద్వారా గణితం, అర్థశాస్త్రం వంటి సబ్జెక్టులను నేర్చుకున్న విద్యార్థులు.. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల ఒక ఏడాదికి ఒకే తరహా పరీక్షలు పెడితే ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల విద్యార్థులు, తాము సీబీఎస్ఈకి ఈ విషయంలో విజ్ఞప్తి చేశామని టీచర్లు చెబుతున్నారు. -
రెండేళ్ల పాటు బాలికలకు స్కాలర్షిప్.. ఆన్లైన్లో అప్లై చేయండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్(ఎస్జీసీఎస్) పథకాన్ని అమలుచేస్తోంది. ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు గాను ఈ స్కాలర్షిప్ను సీబీఎస్ఈ 2006లో ప్రారంభించింది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు ► విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె(సింగిల్ గర్ల్‌చైల్డ్) అయి ఉండాలి. ► ఈ స్కాలర్షిప్కు కేవలం భారతీయ పౌరులు మాత్రమే అర్హులు. ► విద్యార్థిని సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి. ► పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ► విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు. ► 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు మాత్రమే అర్హులు. ► 2020 సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు. ► సీబీఎస్ఈ బోర్డుకు సంబంధించి ఎన్ఆర్ఐ విద్యార్థిని అయితే ట్యూషన్ ఫీజు నెలకు రూ.6000కు మించకుండా ఉంటే స్కాలర్షిప్కు అర్హురాలే. ► విద్యార్థిని ఏకైక సంతానం అని రుజువు చేయడానికి సంబంధించి సీబీఎస్ఈ వెబ్సైట్లో పేర్కొన్న ఫార్మెట్లో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ఎడీఎం /ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్/నోటరీ అటెస్ట్ చేసిన ఒరిజనల్ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ వ్యవధి ► స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ► స్కాలర్షిప్ రెన్యువల్ చేయించుకోవాలంటే.. విద్యార్థిని 11వ తరగతి నుంచి ఆపై తరగతులలో కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ► విద్యార్ధిని సత్ప్రవర్తనతోపాటు పాఠశాలలో హాజరు శాతం కూడా బాగుండాలి. ► ఒకవేళ విద్యార్థిని పాఠశాల లేదా కోర్సు మారాలంటే.. బోర్డు ముందస్తు అనుమతి తీసుకుంటేనే స్కాలర్షిప్ కొనసాగుతుంది. ► స్కాలర్షిప్ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు. స్కాలర్షిప్ మొత్తం ► విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2022 ► సీబీఎస్ఈ పాఠశాలల దరఖాస్తు ధృవీకరణకు చివరి తేది: 25.01.2022 ► వెబ్సైట్: cbse.nic.in -
సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు!
ఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల పరీక్షా పత్రంలో వచ్చిన ఒక వివాదాస్పద వ్యాసం తీవ్ర దుమారం రేపింది. దాంతో దీన్ని ఉపసంహరిస్తున్నామని సీబీఎస్ఈ సోమవారం ప్రకటించింది. విద్యార్థులందరికీ ఈ ప్రశ్నకు సంబంధించి ఫుల్ మార్కులు ఇస్తామని పేర్కొంది. వ్యాసంలో అంశాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన బోర్డు, ఇది ఒక దురదృష్ట ఘటనగా అభివర్ణించింది. విద్యాభ్యాసనలో సమానత్వానికి, శ్రేష్టతకు సీబీఎస్ఈ కట్టుబడి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. సీబీఎస్ఈ 10వ తరగతి ఇంగ్లిషు టర్మ్ 1 ప్రశ్నాపత్రంలోని ఒక వ్యాసంలో లైంగిక వివక్ష, తిరోగామి విశ్వాసాలను ప్రతిబింబించే అభిప్రాయాలున్నాయని శనివారం తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వెంటనే సీబీఎస్ఈ అప్రమత్తమైంది. ఈ వ్యాసంలో ‘‘ పిల్లలపై తల్లిదండ్రుల అధికారాన్ని స్త్రీ విముక్తి నాశనం చేసింది’’, ‘‘భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారానే పిల్లల విధేయతను తల్లి పొందగలదు’’ అనే వాక్యాలున్నాయి. ‘‘స్త్రీ స్వాతంత్య్రం అనేక సామాజికార్థిక సమస్యలకు కారణమైంది, భర్తకు భార్య విధేయత చూపకపోవడంతో పిల్లల్లో క్రమశిక్షణారాహిత్యం పెరిగింది’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో సీబీఎస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో సీబీఎస్ఈ ‘ఇన్సల్ట్స్ ఉమెన్’ పేరిట హ్యాష్‌ట్యాగ్‌లు దర్శనమిచ్చాయి. బోర్డు స్త్రీద్వేష, తిరోగామి భావనలకు మద్దతినిస్తోందని పలువురు దుయ్యబట్టారు. దీంతో స్పందించిన బోర్డు సదరు వ్యాసం తమ ప్రశ్నాపత్రాల రూపకల్పనా నిబంధనలకు అనుగుణంగా లేదని, విద్యార్ధులకు పూర్తి మార్కులు కేటాయిస్తామని బోర్డు పరీక్షా కంట్రోలర్ సన్యామ్ భరధ్వాజ్ ప్రకటించారు. లోక్‌సభలో ప్రస్తావించిన కాంగ్రెస్ సీబీఎస్ఈ పరీక్షా పత్రంలోని వ్యాసం అసంబద్ధం, స్త్రీ ద్వేషపూర్వకమని కాంగెస్ర్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. చదువు, పరీక్షలకు సంబంధించిన ప్రమాణాలు నాసిరకంగా మారాయని ఈ వ్యాసం నిరూపిస్తోందన్నారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించి పభ్రుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షలో స్త్రీద్వేష పూర్వక వ్యాసం ప్రత్యక్షమవడమై తీసుకున్న చర్యలకు సంబంధించి ఈనెల 17లోగా నివేదిక ఇవ్వాలని సీబీఎస్ఈకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
సీబీఎస్ఈకి 1,092 స్కూళ్లు ఎంపిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు తెస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా వ్యవస్థలో ముఖ్యంగా మూల్యాంకన విధానంలో పూర్తి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దే ఉద్దేశంతో సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ముందుగా సీబీఎస్ఈకి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా సుముఖత వ్యక్తపరిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న 1,092 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి దశ కింద వీటిలో సీబీఎస్ఈ అమలుకు నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రాసేలా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏడో తరగతి నుంచి అమలు చేయాలని ముందు నిర్ణయించారు. అయితే సీబీఎస్ఈ అఫిలియేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం, ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడచిపోతుండడంతో వచ్చే ఏడాది నుంచి అంటే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కేజీబీవీలకు అగ్రస్థానం తొలి విడతగా సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వంలోని 10 విభాగాల యాజమాన్యాల పరిధిలో ఉన్న వివిధ స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో నిరుపేద, అనాధ బాలికలు విద్యనభ్యసిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత ఏపీ మోడల్ స్కూళ్లు, వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే గురుకుల స్కూళ్లు, మున్సిపల్ స్కూళ్లు, జెడ్పీ, ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేశారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో.. సీబీఎస్ఈ విధానం తొలి విడత అమలుకు సంబంధించి ఎంపిక చేసిన స్కూళ్లలో అత్యధికం అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో 137 స్కూళ్లను ఎంపిక చేయగా రెండో స్థానంలో కర్నూలు (128) మూడో స్థానంలో ప్రకాశం (94) ఉన్నాయి. -
AP: ఇంటి దగ్గరే ‘ప్రాక్టికల్స్’
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా పాఠశాలలను చాలాకాలంగా మూసి ఉంచినందున విద్యా సంవత్సరపు పని దినాలను తగ్గించి పాఠ్యప్రణాళికలో మార్పులు చేసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అందుకు అనుగుణంగా ల్యాబ్ ప్రయోగాల (ప్రాక్టికల్స్)లోనూ మార్పులు చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు అనుకున్న మేర ప్రయోగాల ప్రక్రియను ల్యాబ్‌లలో నిర్వహించే పరిస్థితులు లేనందున ఇంటినుంచే అందుబాటులో ఉన్న వనరులతో ప్రయోగాలు చేపట్టేలా ప్రత్యామ్నాయాలను నిర్దేశించింది. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ తాజాగా విధివిధానాలను ప్రకటించింది. ఉపాధ్యాయుల ముఖాముఖి సూచనలతో నిర్వహించే ల్యాబ్ ప్రయోగాలకు బదులు వారి మార్గనిర్దేశంలో ఇంటినుంచే విద్యార్థులు తమ ప్రాక్టికల్ వర్కులు, ప్రాజెక్టు వర్కులు పూర్తిచేయవచ్చని సూచించింది. ఈ ప్రయోగాల ద్వారా అభ్యాస ఫలితాలు ఒకే విధంగా ఉండేలా ఆయా అంశాలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాక్డౌన్ కారణంగా ల్యాబ్ ప్రయోగాలు నిర్వహించలేని పరిస్థితుల్లో సీబీఎస్ఈ అన్ని పాఠశాలల్లోని 9 నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఆన్లైన్ ప్లాట్‌ఫాం ‘ఓల్యాబ్స్టో’ ద్వారా సీబీఎస్ఈ కరిక్యులమ్‌ను, ప్రయోగాల ప్రక్రియలను వర్చువల్ రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. తాజాగా వీటితోపాటు జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మాన్యువల్ నుంచి మరికొన్ని ఇతర ప్రయోగ కార్యకలాపాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. అందుబాటులో ఉండే వనరులతోనే ప్రయోగాలు విద్యార్థులు తమ ఇంటివద్ద అందుబాటులో ఉండే వనరులతోనే ఈ ప్రయోగాలు చేపట్టేలా ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రక్రియలను విద్యార్థులతో అనుసరింప చేయాలని సీబీఎస్ఈ ఆయా పాఠశాలలకు సూచనలు చేసింది. ఈ కంటెంట్ దీక్షా పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా రక్షిత పద్ధతుల్లో ఇంటివద్దే ప్రయోగాలు చేసేలా ఆయా మెటీరియల్‌ను సూచించాలని టీచర్లకు నిర్దేశించింది. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠ్యబోధన ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్ కూడా అంతకంటే ముఖ్యమైనవని పేర్కొంటున్న సీబీఎస్ఈ వీటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. సీబీఎస్ఈలో ప్లస్ 2లోనే ప్రయోగాలు చేపట్టించేలా కాకుండా 9వ తరగతి నుంచే విద్యార్థులకు వాటిని అమలు చేయిస్తోంది.