రెండేళ్ల పాటు బాలికలకు స్కాలర్‌షిప్‌.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి | CBSE Single Girl Child Scholarship 2021: Application, Eligibility, Scholarship Amount | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పాటు బాలికలకు స్కాలర్‌షిప్‌.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

Published Wed, Jan 12 2022 3:09 PM | Last Updated on Wed, Jan 12 2022 6:52 PM

CBSE Single Girl Child Scholarship 2021: Application, Eligibility, Scholarship Amount - Sakshi

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ).. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌(ఎస్‌జీసీఎస్‌) పథకాన్ని అమలుచేస్తోంది. ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు గాను ఈ స్కాలర్‌షిప్‌ను సీబీఎస్‌ఈ 2006లో ప్రారంభించింది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు
► విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె(సింగిల్‌ గర్ల్‌చైల్డ్‌) అయి ఉండాలి.

► ఈ స్కాలర్‌షిప్‌కు కేవలం భారతీయ పౌరులు మాత్రమే అర్హులు.

► విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి.

► పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.

► విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు.

► 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు మాత్రమే అర్హులు.

► 2020 సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు.

► సీబీఎస్‌ఈ బోర్డుకు సంబంధించి ఎన్‌ఆర్‌ఐ విద్యార్థిని అయితే ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.6000కు మించకుండా ఉంటే స్కాలర్‌షిప్‌కు అర్హురాలే.

► విద్యార్థిని ఏకైక సంతానం అని రుజువు చేయడానికి సంబంధించి సీబీఎస్‌ఈ వెబ్‌సైట్లో పేర్కొన్న ఫార్మెట్లో ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌/ఎడీఎం /ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌/నోటరీ అటెస్ట్‌ చేసిన ఒరిజనల్‌ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

స్కాలర్‌షిప్‌ వ్యవధి
► స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

► స్కాలర్‌షిప్‌ రెన్యువల్‌ చేయించుకోవాలంటే.. విద్యార్థిని 11వ తరగతి నుంచి ఆపై తరగతులలో కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.

► విద్యార్ధిని సత్ప్రవర్తనతోపాటు పాఠశాలలో హాజరు శాతం కూడా బాగుండాలి.

► ఒకవేళ విద్యార్థిని పాఠశాల లేదా కోర్సు మారాలంటే.. బోర్డు ముందస్తు అనుమతి తీసుకుంటేనే స్కాలర్‌షిప్‌ కొనసాగుతుంది.

► స్కాలర్‌షిప్‌ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు.

స్కాలర్‌షిప్‌ మొత్తం
► విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2022 
► సీబీఎస్‌ఈ పాఠశాలల దరఖాస్తు ధృవీకరణకు చివరి తేది: 25.01.2022
► వెబ్‌సైట్‌: cbse.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement