
న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ పేపర్ల లీకేజీ కేసులో న్యూఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం ముగ్గురిని అరెస్టు చేశారు. ఇటీవల పన్నెండో తరగతి ఆర్థిక శాస్త్రం పరీక్ష పేపర్లు చేతితో రాసినవి పరీక్షకు ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో హిమాచల్‌ప్రదేశ్‌లోని డీఏవీ స్కూలుకు చెందిన ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్ రాకేశ్, క్లర్క్ అమిత్ సహా అశోక్ మరో వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని ఢిల్లీకి తరలించారు.
ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ పేపర్‌తో పాటు ఇంటర్ ఎకనామిక్స్ పరీక్షా పత్రాలను వాట్సాప్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. రద్దు చేసిన ఇంటర్ ఎకనామిక్స్ పరీక్షను ఈ 25వ తేదీన నిర్వహిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment