paper leak case
-
నీట్ పేపర్ లీక్ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్ట్
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసు వ్యవహారం ఇంకా చల్లారడం లేదు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకవకలపై అటు సుప్రీంకోర్టు విచారణ, ఇటు సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.తాజాగా నీట్ వ్యవహారంలో కేంద్ర దర్యప్తు సంస్థ సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. పేపర్ లీక్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను సీబీఐ శనివారం అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన ఇద్దరు నిందితులను భరత్పూర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కుమార్ మంగళం బిష్ణోయ్,దీపేందర్ కుమార్‌లుగా గుర్తించారు.నీట్ యూజీ పరీక్ష రోజు హజారీబాగ్‌లో రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి బిష్ణోయ్, మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి శర్మ ఉన్నట్లు సాంకేతిక నిఘా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ తంలో అరెస్టయిన ఇంజనీర్ పంకజ్ కుమార్ దొంగిలించిన పేపర్‌కు ‘పరిష్కారకర్తలుగా’ వ్యవహరిస్తున్నారని తేలిందని పేర్కొన్నారు.కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్‌పూర్‌కు (జార్ఖండ్)చెందిన 2017-బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య.. హజారీబాగ్‌లోని ఎన్టీయే ట్రంక్ నుండి నీట్ పేపర్‌ను దొంగిలించాడన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. -
నీట్ పేపర్ లీక్ కేసు: నలుగురు విద్యార్థులపై సీబీఐ విచారణ
పట్నా: నీట్ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా గురువారం సీబీఐ అధికారులు నలుగురు పట్నా ఎయిమ్స్ విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. పేపర్ లీక్‌కు సంబంధించి వారిని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పట్నా ఎయిమ్స్ డైరెక్టర్ బీజే పాల్ మీడియాతో మాట్లాడారు.‘సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న నలుగురు విద్యార్థులు విచారణకు సహకరిస్తున్నారు. సీబీఐ విచారణ నుంచి విద్యార్థులు ఇంకా తిరిగి రాలేదు. సీబీఐ విచారణ చేస్తున్న విద్యార్థులు చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాను, కరణ్. ముందుగా ఇన్స్టిట్యూట్కు సీబీఐ అధికారులు సమాచారం అందించి.. నలుగురు విధ్యార్థులను వారి హాస్టల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీవ్ విషయంలో వారిని విచారణ చేసేందుకు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు’ అని తెలిపారు.విచారణలో భాగంగా విద్యార్థుల రూంలను అధికారులు సీజ్ చేశారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్,డీన్ సమక్షంలో సీబీఐ టీం విద్యార్థుల ఫోటోలు , మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇక జూలై 17 పేపర్ లీక్ ప్రధాన నిందితుడు పంకజ్ త్రిపాఠి, అతని సహాయకుడు రాజు సింగ్‌ను సీబీఐ అధికారులు జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో అరెస్ట్ చేశారు. ఇటీవల పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ట్రంక్ పెట్టె నుంచి నీట్ పేపర్ దొంగిలిచిన ఇద్దరిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.మరోవైపు.. ప్రధాన నిందితుడు పంకజ్ త్రిపాఠికీ సీబీఐ ప్రత్యేక కోర్టు.. 14రోజుల సీబీఐ కస్టడీ, అతని సహాయకుడు రాజు సింగ్‌కు 10 రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో సీబీఐ అధికారులు 14 మందిని అరెస్ట్ చేశారు. -
నీట్ పేపర్ లీక్.. మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ
దేశ వ్యాప్తంగా వివాదాన్ని రాజేసిన వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ‘నీట్’ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ స్కామ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.పరీక్షకు ముందు నీట్ యూజీ ప్రశ్నపత్రాన్ని దొంగిలించి సర్క్యులేట్ చేస్తున్నారనే ఆరోపణలపై బిహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్, జార్ఖండ్‌లోని హజారీ బాగ్‌కు చెందిన రాజ్సింగ్ను అదుపులోకి తీసుకుంది. పంకజ్‌ను పాట్నాలో, రాజ్‌ను జంషెడ్‌పూర్‌లో పట్టుకున్నారు.అప్పటికే పేపర్ లీక్ మాఫియాలో హస్తమున్న పంకజ్ కుమార్.. బిహార్‌లోని హజారీబాగ్‌లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ట్రంక్ నుంచి నీట్ యూజీ పేపర్‌ను దొంగిలించగా, ఇతనికి పేపర్‌ను సర్క్యూలేట్ చేయడంలో రాజ్ సింగ్ సాయం చేసినట్లు సీబీఐ పేర్కొంది. పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య 2017లో ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లు తేలింది.కాగా నీట్ పేపర్ లీక్ కేసుపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌తో సహా మరో 13 మంది నిందితులను జూలై 12న బీహార్‌లో కస్టడీలోకి తీసుకుంది.నీట్-యూజీ పేపర్ లీక్‌కు హజారీబాగే మూల ప్రదేశమని సీబీఐ గతంలోనే తెలిపింది. హజారీ బాగ్‌లోని ఒయాసిస్ పాఠశాలలో పేపర్ లీక్ అయిందని, అక్కడకు చేరిన రెండు సెట్ల పేపర్ల సీలు ఊడిపోయిందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండా పాఠశాల సిబ్బంది మౌనం వహించారని సీబీఐ విచారణలో తేలింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేదే నీట్-యూజీ పరీక్ష. ఈ ఏడాది మే 5న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. బిహార్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో నమోదైనవి అభ్యర్థులను మోసగించిన వాటికి సంబంధించినవి -
నీట్ పేపర్ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ లోక్‌సభలో తొలిసారి స్పందించారు. ‘నీట్ పేపర్ లీకేజీపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. లక్షలాది విద్యార్ధుల కష్టాన్ని వృథా పోనివ్వం. ప్రశ్నాపత్రాలను లీక్ చేసే వారిని వదిలిపెట్టం’ అని మోదీ హెచ్చరించారు. యువత భవిష్యత్‌ను ఆడుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న ఆయన.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని నీట్ విద్యార్ధులకు భరోసా ఇచ్చారు. -
బాయ్స్ హాస్టల్లో 25 మందికి నీట్ పేపర్ లీక్.. సంజీవ్ ముఖియా ఎవరు?
ఢిల్లీ: నీట్ పరీక్షా ప్రతాల లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇక, పేపర్ లీక్ ఘటనలో జార్ఖండ్‌లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే, నీట్ పేపర్లు లీక్ కావడానికి బీహార్‌కు చెందిన సంజీవ్ ముఖియా గ్యాంగ్ కారణమని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు.కాగా, నీట్ పేపర్ల లీక్ ఘటనలో సంజీవ్ ముఖియా గ్యాంగ్ సైబర్ నేరగాళ్లతో టచ్‌లో ఉన్నట్టు బీహార్ పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్‌లో అరెస్ట్ అయిన ఐదుగురిలో ముగ్గురు సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఇక, వీరి వద్ద నుంచి పోస్ట్ డేటెడ్ చెక్కులు, పలు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో కూడా వీరి ప్రమేయం ఉంది. ఈ కేసులో సంజయ్ ముఖియా కొడుకు శివ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.ఇక, నీట్ పరీక్షకు ముందు రోజు సంజీమ్ ముఖియా గ్యాంగ్ పాట్నాలోని లేర్న్ ప్లే స్కూల్‌తో సంబంధం ఉన్న బాయ్స్ హాస్టల్లో దాదాపు 25 మంది అభ్యర్థులను ఉంచినట్టు ఆరోపణలు వచ్చాయి. అదే హాస్టల్లో అభ్యర్థులకు పేపర్ లీక్, సమాధాన పత్రాలు అందించినట్టు సమాచారం. ఇక, ఈ కేసులో సంజీవ్ ముఖియా మేనల్లుడు రాఖీ కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాఖీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇదిలా ఉండగా.. నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగం ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం విషయానికి సంబంధించి ఈడీ త్వరలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశముంది. ఈడీ పాత కేసుల్లో అరెస్ట్‌లు చేస్తోందని, వారి నెట్‌వర్క్‌లు, మనీలాండరింగ్ లింక్‌లపై విచారణ జరుపుతోందని సమాచారం.పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బృందం బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. సోమవారం పాట్నాలోని బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి సీబీఐ బృందం కూడా చేరుకుంది. అక్కడ పేపర్ లీక్ కేసు దర్యాప్తుకు సంబంధించిన అన్ని వాస్తవాలను ఆర్థిక నేరాల విభాగం సీబీఐకి అప్పగించింది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ఎవరు ఎలాంటి పాత్ర పోషించారో ఈఓయూ తన విచారణలో కనుగొంది. -
నీట్ పేపర్ లీక్.. బిహార్, మహారాష్ట్ర.. బయటపడిన ఢిల్లీ కనెక్షన్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరు మహారాష్ట్ర స్కూల్ టీచర్లపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇద్దరు టీచర్లను సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్లుగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) గుర్తించింది.వీరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచింగ్ చేసేవారని, లాతూర్‌లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కూడా నడుపుతున్నట్లు తేలింది. అనేక గంటలు విచారణ అనంతరం జలీల్ ఉమర్ఖాన్ పఠాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, సంజయ్ తుకారాం జాదవ్ పరారీలో ఉన్నారు.వీరి ఫోన్లలో పలువురు విద్యార్థుల అడ్మిట్ కార్డులు, వాట్సాప్ చాట్లను పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తితో రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఢిల్లీకి చెందిన గంగాధర్... విద్యార్ధులు సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్లను సంప్రదించడానికి సహాయం చేసినట్లు తేలింది.మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో గంగాధర్, నాందేడ్‌లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఈరన్న కొంగళ్వార్ల పేర్లు కూడా ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర అభియోగాలపై వీరిపై కేసు నమోదు చేశారు.విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శనివారం నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. డార్క్ నెట్లో పేపర్లు లీక్ కావడం, విక్రయించడం వంటి అక్రమాలపై కూడా ఇది విచారణ చేస్తోంది.అదే విధంగా పోటీ పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా అమలు చేసింది. నేరస్తులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు విధిస్తుంది. కాగా నీట్ యూజీ పరీక్షకు ఒక రాత్రి ముందు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు అంగీకరించిన నలుగురిని బీహార్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి విచారిస్తున్నారు.. -
అమలులోకి పేపర్ లీక్ నిరోధక చట్టం.. జైలు శిక్ష, జరిమానాలు ఇలా..
ఢిల్లీ: నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కేంద్రంపై తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది.కాగా, పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీన్ని చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. The Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 - the anti-paper leak law for examinations for central recruitment and entrance into central educational institutions, came into effect on Friday. A gazette notification issued by the Ministry of Personnel, Public… pic.twitter.com/TMJhsDtcJ5— ANI (@ANI) June 21, 2024ఇక, గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశ్నించగా.. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇదిలా ఉండగా, కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ సమయంలో దీనికి కారణమైన వారికి 5-10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక, ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టానికి లోబడే కేసులు నమోదు చేయనున్నారు. -
నీట్ పేపర్ లీకేజీ.. పరీక్షకు 48 గంటల ముందే అమ్మకం
న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన బీహార్‌కు చెందిన నలుగురు నీట్ అభ్యర్ధులు అనురాగ్ యాదవ్,శివానందన్, అభిషేక్, ఆయుష్‌రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీష్, అమిత్ ఆనంద్‌తోపాటు ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్ సికిందర్ యాదవేందులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ నిజమేనని, ఒక్కో నీట్ అభ్యర్ధి నుంచి రూ.40 లక్షలు, రూ. 32 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.తాజాగా, నీట్ ఎగ్జామ్ నిర్వహణకు 48 గంటల ముందే నీట్ పేపర్‌ను డార్క్ వెబ్, ఎన్‌క్రిప్ట్‌డ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌లో రూ.6 లక్షలకు అమ్మినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే పేపర్ లీకేజీతో విద్యా మంత్రిత్వ శాఖ పరీక్షను రద్దు చేసిందని సీబీఐ అధికారులు పలు జాతీయ మీడియా సంస్థలకు చెప్పినట్లు సమాచారం.ప్రస్తుతం, నీట్ పేపర్ లీకేజీ మూలాలు ఇంకా గుర్తించలేదు. వాటిని గుర్తించేందుకు సీబీఐ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లు రంగంలోకి దిగాయి. -
‘అవును.. నీట్ పేపర్- లీక్ పేపర్ ఒక్కటే!’
పాట్నా: దేశవ్యాప్తంగా ‘నీట్’ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నీట్ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అవి కోరుతున్నాయి. ఇంకోపక్క.. నీట్ అభ్యర్థులతో ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది.పరీక్షకు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందనే వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న బీహార్ పోలీసులు.. దాదాపుగా ఆ విషయాన్ని నిర్ధారించుకున్నారు!. ఈ కేసులో అరెస్టైన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్(22) ఆ విషయాన్ని అంగీకరించినట్లు తేలింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం, పరీక్షలో వచ్చిన పత్రం ఒక్కటేనని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన లేఖ(Confession Letter) ఓ జాతీయ మీడియా సంస్థ ద్వారా బయటకు వచ్చింది.పాట్నా నీట్ పరీక్ష కేంద్రంలో రాసిన విద్యార్థులకు ముందుగానే పశ్నాపత్రం చేరిందనే విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు.. అమిత్ ఆనంద్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు. ప్రశ్నాపత్రం లీక్‌కు రూ.30-32 లక్షలు తీసుకున్నట్లు అతను ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సికిందర్ ప్రసాద్ యాదవేందు అనే ఇంజినీర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు. అనురాగ్ యాదవ్‌కు యాదవేందు దగ్గరి బంధవు కూడా. పరీక్షకు ముందు యాదవేందు అనురాగ్‌కు ఓ ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలను కూడా ఇచ్చాడట. అయితే పరీక్షలోనూ అవే ప్రశ్నలు వచ్చాయని అనురాగ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో ఈ ఘటనపై బీహార్ పోలీసులను కేంద్ర విద్యాశాఖ వివరణ కోరింది. అంతకు ముందు ఈ కేసులో యాదవేందు ఇచ్చిన స్టేట్మెంట్ కలకలం రేపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి జోక్యం ఉందని, ఆయనే తనతో(యాదవేందు) మరికొందరికి ప్రభుత్వ బంగ్లాలో సౌకర్యాలు కల్పించారని వాంగ్మూలం ఇచ్చాడు నిందితుడు. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుంది? రాజకీయంగా ఎలాంటి దుమారానికి కారణం కానుంది? అనే ఆసక్తి నెలకొంది.దేశవ్యాప్తంగా నీట్-యూజీ ఎగ్జామ్ మే 5 తేదీన జరగ్గా.. 4,750 సెంటర్లలో 24 లక్షల మంది రాశారు. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉండగా.. మూల్యాంకనం త్వరగా ముగియడంతో జూన్ 4వ తేదీనే విడుదల చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించుకుంది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: నిందితులకు షాక్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో 7 మంది నిందితులకు ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. నాంపల్లి కోర్టు శుక్రవారం ముద్దాయిందరినీ ఎగ్జామినేషన్ కొరకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాలేదు. విచారణకు గైర్హాజరైన నిందితులు.. గైర్హాజరు పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే నిందితులుకు అనుమతి నిరాకరిస్తూ వారిపై నాంపల్లి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: మాది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం: సీఎం రేవంత్ -
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. విచారణకు హాజరైన 37 మంది నిందితులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. కోర్టులో విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, డాఖ్యానాయక్, రాజేశ్వర్ తో పాటు మిగతా నిందితుల హాజరయ్యారు. గత నెలలో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ అధికారులు.. ప్రాథమిక అభియోగ పత్రంలో 37 మందినీ నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 105 మందిని సిట్ అరెస్ట్ చేసింది. త్వరలో సిట్ అధికారులు త్వరలో మిగతా నిందితులతో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. కాగా పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ మినహా ఇప్పటికే మిగతా నిందితులందరికీ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా ఇక పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ తేల్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రవీణ్ పేపర్‌ను తీసుకొని ఆమె డైరీలో ఉన్న సాస్‌వర్డ్, యూజర్‌నేమ్ ద్వారా పేపర్ లీక్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. చదవండి: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ -
గ్రూప్-1 ప్రిలిమ్స్.. టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. దర్యాప్తు నివేదిక మూడు వారాల్లో సమర్పించాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. కాగా పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. మరో కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ఈ పిల్‌కు అటాచ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. చదవండి: వారం రోజుల్లో తొలి విడుత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపీణీ: కేటీఆర్ -
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్ కార్డులు మార్చి పుణ్యక్షేత్రాలకు తిరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో తప్పించుకోలేమని తెలుసుకొని ఎట్టకేలకు సిట్ ఎదుట లొంగిపోయారు. అంతేగాక కేసు నుంచి తప్పించుకునేందుకు మరో 15 మంది ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు ఈకేసులో 90 మందిని పైగా అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఈ నెలాఖరులో మరో 10 మందిని అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందగాగానే రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ సిద్ధమైంది. ఇక పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ తేల్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రవీణ్ పేపర్‌ను తీసుకొని ఆమె డైరీలో ఉన్న సాస్‌వర్డ్, యూజర్‌నేమ్ ద్వారా పేపర్ లీక్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
TSPSC పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం
-
పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్
-
హైటెక్ మాస్ కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె..
-
TSPSC కేసులో బయటపడుతున్న రాజకీయా నేతల పుత్రరత్నాలు..!
-
టీఎస్పీఎస్సీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. తాజాగా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్‌ను సిట్ అధికారులు విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధితో రమేష్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ మద్దెల శ్రీనివాస్ కూతురు.. రమేష్ ద్వారా ఏఈఈ పరీక్ష రాసినట్లు తేలింది. ఏఈఈ ఉద్యోగం ఇప్పిస్తానని 75 లక్షలకు డీఈ రమేశ్ బేరం పెట్టినట్లు వెల్లడైంది.. ఏఈఈ పరీక్ష జనవరి 22న జరగ్గా.. పరీక్షకు నెలరోజుల ముందు రమేష్ శ్రీనివాస్‌ను కలిశాడు. పరీక్షకు ముందు ప్రజా ప్రతినిధి కూతురుకు ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాతనే డబ్బులు చెల్లిస్తానని ప్రజాప్రతినిధి చెప్పాడు. ఎలక్ట్రానిక్ డివైస్ జాకెట్ కోసం కూడా ఎలాంటి డబ్బు ఇవ్వలేదని తేలింది. మరోవైపు డీఈ రమేష్ 80 మందికి ఏఈఈ పేపర్లు అమ్మినట్టుగా గుర్తించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల రూపాయలకు బేరం ఆడినట్లు తెలిసింది. ఇక రమేష్ విచారణతో మరికొందరు మందిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. చదవండి: ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు! -
TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్.
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్‌తోపాటు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన నీటిపారుదల శాఖ పెద్దపల్లి ఏఈ పూల రమేష్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ అధికారులు ఇతడిని బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు ప్రస్తావించారు. హైటెక్ మాస్ కాపీయింగ్ ద్వారా ఇతడు రూ.1.1 కోటి వరకు ఆర్జించినట్లు తేల్చారు. ఒక్కో అభ్యర్ధితో రూ.20–30 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకుని, ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించినట్లు పేర్కొన్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న ఇతడు మిగిలింది ఫలితాల తర్వాత తీసుకోవాల్సి ఉందని అందులో చెప్పారు. కాగా, భార్యను హత్య చేసినట్లు రమేశ్‌పై ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో డాక్టర్ ద్వారా పరిచయం పెద్దపల్లిలో ఇరిగేషన్ ఏఈగా పనిచేస్తున్న రమేశ్‌కు గతంలో నార్కట్‌పల్లి వద్ద ప్రమాదం జరిగింది. అప్పట్లో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... డాక్టర్ ద్వారా టీఎస్పీఎస్సీ ఉద్యోగి సురేష్ పరిచయం అయ్యాడు. ఆపై ఇద్దరూ స్నేహితులుగా మారడంతో నగరంలోని రమేష్ ఇంట్లో సురేష్ అద్దెకు దిగాడు. ఆపై ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం మానేసిన సురేష్ పేపర్ల లీకేజ్‌లో కీలకంగా మారాడు. ఇతడి ద్వారా ఏఈ పరీక్షలకు సంబంధించిన పేపర్లు రమేష్‌కు అందాయి. వీటిని ఇతడు 30 మందికి విక్రయించాడు. ఇలా వచ్చిన సొమ్ములో సగం సగం తీసుకుందామని సురేష్ ప్రతిపాదించాడు. దీనికి అంగీకరించని రమేష్... తనకు 70 శాతం ఇచ్చేలా సురేష్‌ను ఒప్పించాడు. అభ్యర్థులను వెతికి పట్టుకోవడం, విక్రయించడం లాంటి రిస్కులు తనవే అని, అందుకే ఎక్కువ వాటా కావాలన్నాడు. దీంతో సురేష్ ఏఈఈ, డీఏఓ పేపర్ల లీకేజ్ విషయం ఇతడికి చెప్పలేదు. దీంతో ఏడుగురితో ఒప్పందం చేసుకుని హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పథకం వేశాడు. ఇతడు అనుసరించిన హైటెక్ కాపీయింగ్‌కు ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది. చదవండి: తెరపైకి కొత్త సీపీ.. సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసిన రమేష్ అందులోని కాపీయింగ్ పంథాను కాస్త హైటెక్‌గా మార్చి టీఎస్పీఎస్సీ పరీక్షలకు వినియోగించాడు. కాపీయింగ్‌కు రమేష్ భారీ స్కెచ్ వేశాడు. ఇంటర్నెట్ నుంచి అత్యాధునికమైన చెవిలో ఇమిడిపోయే బ్లూటూత్, సిమ్‌కార్డు ఆధారంగా పని చేసే చిన్న రిసీవర్, ట్రాన్స్‌మీటర్ తదితరాలు ఖరీదు చేశాడు. బ్లూటూత్ డివైజ్ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టించాడు. వారి చొక్కా కింది భాగంగా ప్రత్యేకంగా కుట్టించిన జేబులో రిసీవర్ ఉంచాడు. ఏడుగురు అభ్యర్థులు కచ్చితంగా ఇన్‌షర్ట్ చేసుకునేలా సూచించి తనిఖీల్లో దొరక్కుండా చేశాడు. ఓ పరీక్ష కేంద్రం నిర్వాహకుడితో ఒప్పందం చేసుకున్న రమేష్ పరీక్ష పత్రం బయటకు పంపేలా ప్రేరేపించాడు. ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి ప్రశ్నపత్రాలు అన్ని సిరీస్‌లవి ఫొటోలు తీసి ఈ నిర్వాహకుడు వాట్సాప్ ద్వారా రమేశ్‌కు పంపాడు. అప్పటికే ఇతడు సిద్ధం చేసుకున్న బృందానికి వీటిని పంపాడు. వాళ్లు చాట్‌జీపీటీ యాప్ ద్వారా ఆయా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి.. వాటిని తమ వద్ద ఉన్న ట్రాన్స్‌మీటర్ ద్వారా ఏడుగురు అభ్యర్థులకు చెప్పారు. ఒక సిరీస్ తర్వాత మరో సిరీస్‌లోని ప్రశ్నల జవాబులను వీళ్లు చెప్పారు. రమేశ్‌తోపాటు ముగ్గురు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ మిగిలిన నిందితుల కోసం గాలిస్తోంది. అరెస్టయిన ఇతర నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. ‘లీకేజీ’ వ్యవహారంలో 50 మంది డిబార్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పలువురిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అరెస్టయి కస్టడీలో ఉన్న అభ్యర్థులను టీఎస్పీఎస్సీ పరీక్షల నుంచి డిబార్ చేసింది. ఆయా అభ్యర్థులను ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనర్హులుగా ప్రకటించగా... భవిష్యత్తులోనూ వారిని పరీక్షలకు అనుమతించబోమని తేల్చింది. ఇలా 50మందిని పరీక్షల నుంచి డిబార్ చేస్తూ టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. డిబార్ చేసిన అభ్యర్థులు వివరణ సమర్పించాలని భావిస్తే రెండ్రోజుల్లోగా కమిషన్‌కు సమరి్పంచాల్సి ఉంటుందని వెబ్‌నోట్ ద్వారా వెల్లడించింది. అయిన అభ్యర్థులు వీరే.. పులిదిండి ప్రవీణ్‌కుమార్, అట్ల రాజశేఖర్‌రెడ్డి, రేణుక రాథోడ్, లవడ్యావత్ దాఖ్య, కే.రాజేశ్వర్, కే.నీలేశ్ నాయక్, పి.గోపాల్‌నాయక్, కే.శ్రీనివాస్, కే.రాజేందర్ నాయక్, షమీమ్, ఎన్.సురేశ్, డి.రమేశ్‌కుమార్, ఏ.ప్రశాంత్‌రెడ్డి, టి.రాజేంద్రకుమార్, డి.తిరుపతయ్య, సాన ప్రశాంత్, వై.సాయిలౌకిక్, ఎం.సాయి సుష్మిత, కోస్గి వెంకట జనార్థన్, కోస్గి మైబయ్య, కోస్గి రవి, కోస్గి భగవంత్ కుమార్, కొంతం మురళీధర్ రెడ్డి, ఆకుల మనోజ్ కుమార్, ఆది సాయిబాబు, పొన్నం వరున్‌కుమార్, రమావత్ మహేశ్, ముదావత్ శివకుమార్, దానంనేని రవితేజ, గున్రెడ్డి క్రాంతికుమార్ రెడ్డి, కొంతం శశిధర్‌రెడ్డి, అట్ల సుచరితారెడ్డి, జీపీ పురేందర్, నూతన్ రాహుల్ కుమార్, లవ్‌డ్యా శాంతి, రమావత్ దత్తు, అజ్మీరా పృథీ్వరాజ్, జాదవ్ రాజేశ్వర్, పూల రవికిశోర్, రాయపూర విక్రమ్, రాయపురం దివ్య, ధనావత్ భరత్ నాయక్, పాశికంటి రోహిత్‌కుమార్, గాదె సాయిమధు, లోకిని సతీశ్‌కుమార్, బొడ్డుపల్లి నర్సింగ్‌రావు, గుగులోత్ శ్రీనునాయక్, భుక్య మహేశ్, ముదావత్ ప్రశాంత్, వడిత్య నరేశ్, పూల రమేశ్‌కుమార్. -
TSPSC పేపర్ లీకేజ్ కేసు...విప్రో ఉద్యోగి అరెస్ట్..!
-
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆయన 20 మందికి పశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ బృందం గుర్తించింది. డీఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడని, అభ్యర్థులతో పరిచయం పెంచుకుని ఈ దందాకు తెరలేపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. టాప్ మార్కులు వచ్చిన వారి వివరాలను సిట్ బృందం సేకరిస్తోంది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి. చదవండి: రవికిశోర్ ద్వారా మరో ముగ్గురికి.. ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా.. రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు సహకరిచకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించిన సిట్.. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. కాగా 2015 నుంచి శంకర్ లక్ష్మీ టీఎస్పీఎస్సీలో విధులు కొనసాగిస్తున్నారు. DAO, AEE, AE, పేపర్ల అంశంలో టీఎస్పీఎస్సీ వివరాలు దాచిపెట్టనట్లు సిట్ గుర్తించింది.పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని TSPSC తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది. మరోవైపు రాథోడ్ వ్యవహారంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. బుధవారం మరో సారి విచారణకు రావాలని రేణుకకు నోటీసులు అందించింది. రేణుక నుంచి ప్రవీణ్‌కు పేపర్ మొదటగా వెళ్లింది. రేణుక రాథోడ్ నుంచి గంబిరాం రాహుల్‌కు గ్రూప్ పేపర్ చేరింది. అతన్ని సొంత వాహనంలో హైదరాబాద్‌త ఈసుకొచ్చిన రేణుక.. సిటీలోని సీక్రెట్ రూమ్ బుక్‌చేసుకొని లీకైన పేపర్ ప్రిపేర్ చేయించింది. అయితే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ సిట్‌కు ఇచ్చిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. TSPSC వివరాల కోసం సిట్ RTI దాఖలు చేయలేదని సిట్ స్పష్టం చేసింది. RTI దాఖలు చేసినట్లువ స్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. చదవండి: వంట మనిషి కొడుకు ‘సివిల్స్’ కొట్టాడు.. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రేణుకకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ కేసులో నిందితురాలు(ఏ3) రేణుకకు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు రూ.50వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. రేణుకతో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఏ12 డి.రమేష్, ఏ13 ప్రశాంత్ రెడ్డిలకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ పొందిన ఈ ముగ్గురి నిందితుల పాస్‌పోర్టు సీజ్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మూడ నెలల వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ కార్యలయంలో హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈమేరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కాగా.. రేణుక గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఆమెకు ఊరటనిచ్చింది. (చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు) -
TSPSC కేసులో మరో ఇద్దరు అరెస్ట్
-
ED విచారణలో TSPSC చైర్మన్,సెక్రటరీలు