
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ : ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కీలక సూత్రధారి గురవా రెడ్డియేనని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ మొత్తం స్కాంకు సంబంధించి 155 మంది విద్యార్థులు నిందితులుగా ఉన్నారని, వారిలో 88 మంది కార్పొరేట్ కళాశాలలకు చెందిన వారున్నారని, వీరందరినీ ఏడు క్యాంపులకు తరలించినట్లు సీఐడీ తెలిపింది. కేసులో ఇరుక్కోకుండా ఉండేందుకు కార్పొరేట్ కళాశాలలు ఆధారాలు మాయం చేశాయని సీఐడీ పేర్కొంది. విద్యార్థుల అడ్మిషన్ల దగ్గరి నుంచి ర్యాంకుల పత్రాల వరకు అన్నింటికీ నిప్పు పెట్టినట్లు విచారణలో తేలింది. ఇప్పటి వరకు రూ.8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సీఐడీ తెలిపింది.
ఎవరినీ ప్రశ్నించినా నిందితులు ఒకే తరహా సమాధానం ఇస్తున్నారని సీఐడీ అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 90 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. సినిమా తరహాలో కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం జరిగినట్లు విచారణలో తేలింది. ఇప్పటికే మెడికో గణేశ్ ప్రసాద్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. డీన్ వాసుబాబు, వెంకట శివనారాయణలను మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీని అడిగింది. నాంపల్లి కోర్టు మాత్రం నిందితులను కస్టడీకి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment