CID investigation
-
నటి రన్యారావు కేసులో కీలక మలుపు
సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో పాటు వీఐపీ ప్రొటోకాల్ దుర్వినియోగం.. అందులో ఆమె సవతి తండ్రి ప్రమేయం తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విచారణకు ఆదేశించారు.ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు.. అలాగే తన విదేశీ పర్యటనల టైంలో వాళ్ల చేతుల్లో వేధింపులకు గురయ్యానన్న రన్యారావు ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరపనుంది. వీలైనంత త్వరగా నిజనిర్ధారణలతో నివేదిక సమర్పించాలని దర్యాప్తు ఏజెన్సీని ప్రభుత్వం ఆదేశించింది.ఇక మరోవైపు.. నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమ రవాణా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం అంశంపైనా ప్రభుత్వం విడిగా మరో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి, అదనపు సీఎస్ గౌరవ్ గుప్తా అప్పగించింది. అలాగే.. ఈ అంశంలో ఆమె సవతి తండ్రి, డీజీపీ కె. రామచంద్రరావు పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే ఆయన్ని విచారించాలని కోరింది. ఈ వ్యవహారంలో రామచంద్ర పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చాలని గుప్తాకు వారం గడువు ఇచ్చింది ప్రభుత్వం. మార్చి 3వ తేదీన 14.8 కేజీల అక్రమ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
చికలూరిపేట ICICI బ్యాంకులో సీఐడీ విచారణ
-
ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ
సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.ఫిక్స్డ్ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది -
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ పేర్కొంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ ప్రధానం పిటిషన్లో తెలిపింది. -
రాహుల్‌కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్‌ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్‌గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్‌గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్‌హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తలనరికి తెస్తే రూ.కోటి ఇస్తామన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 న్యూస్ యాంకర్ సాంబశివరావులను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 5.30 గంటలపాటు వారిద్దరిని కలిపి, విడివిడిగానూ విచారించారు. టీవీ 5 చానల్ నిర్వహించిన డిబేట్ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూర్వకంగానే కొలికపూడి శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలు చేశారని రామ్‌గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయన పేర్కొన్న కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు, టీవీ 5 చానల్ ఎండీ, చీఫ్ ఎడిటర్ బి.ఆర్.నాయుడు, న్యూస్ యాంకర్ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ 5 మేనేజింగ్ ఎడిటర్లపై పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 3న కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ అధికారులు మొదటి దఫా విచారించారు. కాగా ఆరోజు న్యూస్ యాంకర్ సాంబశివరావు విచారణకు హాజరుకాలేదు. దాంతో వారిద్దరిని సోమవారం సీఐడీ అధికారులు విచారించారు. ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా.. సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూడదన్న అవగాహన లేదా..? అంటూ వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సీఐడీ అధికారుల ప్రశ్నలకు కొలికపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అందుకు వారిద్దరూ సమ్మతించారు. -
కొలికపూడి, టీవీ5 సాంబ అరెస్ట్ ?..సీఐడీ విచారణలో కీలక విషయాలు
-
మహేంద్ర మృతిపై సీఐడీ విచారణ
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపంతో బొంత మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సీఐడీ ద్వారా సమగ్ర విచారణ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని అన్నారు. మంత్రి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పెనకనమెట్టలో 13వ తేదీన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త పోసిబాబు ఫోన్లో మాట్లాడారు. ఆయన సోదరుడి కుమారుడు మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. వెంటనే స్టేషన్‌కి ఫోన్ చేయించి మహేంద్రను ఇంటికి పంపమని సూచించాను. తర్వాత మహేంద్రను ఇంటికి పంపారు. మహేంద్ర పురుగుమందు తాగినట్లు తర్వాత రోజు తెలిసింది. మహేంద్ర చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో నేనే మాట్లాడాను. తర్వాత విజయవాడ తీసుకెళ్లినట్లు ఎవరూ చెప్పలేదు. 15వ తేదీ ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ ఫోన్ చేసి మహేంద్ర మృతి విషయం చెప్పారు. మహేంద్ర కుటుంబం ఏమీ చెప్పకపోయినా నేనే చొరవ తీసుకుని చేయగలిగిన సాయమంతా చేశాను. మహేంద్ర మృతదేహం వచ్చే సమయానికి నాయకులతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి నా కాన్వాయ్‌పై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేశారు’ అని చెప్పారు. తానేదో పోలీసుల్ని ఆర్డర్ చేసి మహేంద్రను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హోంమంత్రి చెప్పారు. మహేంద్ర మృతిలో నిజాలు నిగ్గుతేలాలంటే సీఐడీ విచారణ చేయించాలని తాను సీఎం వైఎస్ జగన్‌ను కోరానని, వెంటనే చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. -
టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్ స్కామ్ నిధులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అక్రమ నిధుల తరలింపునకు టీడీపీ ప్రధాన కార్యాలయం కేంద్రబిందువుగా మారిందని సీఐడీ గుర్తించింది. వివిధ కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన అక్రమ నిధులను గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్టు విశ్వసిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతోపాటు చంద్రబాబుపై నమోదైన ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అసైన్డ్ భూములు, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనం హవాలా మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఈ మేరకు సీఐడీ దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. దీంతో టీడీపీ ఖాతాల్లో చేరిన నిధుల లోగుట్టును రట్టు చేసే దిశగా సీఐడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. అందులో మొదటగా స్కిల్ స్కామ్ కేసులో కార్యాచరణకు ఉపక్రమించింది. ఈ కేసులో టీడీపీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. తాము కోరిన వివరాలతో ఈ నెల 18న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. హవాలా మార్గంలో రూ.27 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో కొల్లగొట్టిన రూ.241 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరినట్టు సీఐడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లను డిజైన్ టెక్ వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేర్చినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అందులో రూ.27 కోట్లను టీడీపీ ఖాతాలో జమ చేసినట్టు సీఐడీ ఇటీవల గుర్తించింది. ఆ నిధులు పార్టీ బ్యాంకు ఖాతాలోకి ఎలా వచ్చాయన్నదానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. దీనిపై ప్రాథమిక ఆధారాలు సేకరించాక సీఐడీ నెల క్రితం టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాల లావాదేవీలు వివరాలు తెలపాలని పోస్టు ద్వారా నోటీసులు పంపించింది. దీంతో కంగుతిన్న టీడీపీ బ్యాంకు లావాదేవీల వివరాలను తెలిపేందుకు నాలుగు వారాల గడువు కావాలని సీఐడీకి సమాధానం ఇచ్చింది. నాలుగు వారాల గడువు ముగిశాక కూడా టీడీపీ ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. అంటే టీడీపీ బ్యాంకు ఖాతాల్లో చేరిన నిధుల్లో ఏదో గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమైంది. దాంతో సీఐడీ మరింత దూకుడు పెంచింది. టీడీపీ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను తెలపాలని టీడీపీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం నోటీసులు పంపింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పేరిట ఆ నోటీసులు జారీ చేసింది. ఇతర కుంభకోణాలపైనా.. నెల క్రితం పోస్టులో పంపిన నోటీసులపై స్పందించని టీడీపీ.. ప్రస్తుతం ప్రత్యక్షంగా పంపిన నోటీసులపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం స్కిల్ స్కామ్‌కు సంబంధించిన రూ.27 కోట్ల వివరాలే కాకుండా మొత్తం బ్యాంకు లావాదేవీల వివరాలు సీఐడీకి వెల్లడించాల్సిన అనివార్యత ఏర్పడింది. తద్వారా టీడీపీ అక్రమ నిధుల తరలింపు నెట్ వర్క్ గుట్టురట్టు కానుంది. ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూములు, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఎంతమేర తరలించారో నిగ్గు తేల్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
కిలారు రాజేష్ గుండెల్లో వణుకు
తెలీదు.. గుర్తులేదు..ఏమో.. చంద్రబాబు నాయుడి దగ్గరనుంచి కిలారు రాజేష్ వరకు అంతా ఇదే పాట. విచారణాధికారులు ఏ ప్రశ్న వేసినా ఈ మూడే సమాధానాలు. 371 కోట్ల రూపాయల దోపిడీ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఆ లోకేష్ కి సన్నిహితుడు అయిన కిలారు రాజేష్ లు సిఐడీ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదు. సిఐడీ నోటీసులు అందుకున్న వెంటనే అమాతం అదృశ్యమైన కిలారు రాజేష్ నెల తర్వాత సిఐడీ ముందు ప్రత్యక్షమై నేను విచారణకు సిద్ధమన్నాడు. మొదటి రోజు ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. రెండో రోజు విచారణకు పిలిస్తే వస్తానన్న కిలారు మళ్లీ మాయమయ్యాడు. విజయదశమి పండగ తర్వాత వస్తానంటూ లేఖ పంపాడు. స్కిల్ స్కాంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి హవాలా రూపంలో తమ దగ్గరకు రప్పించుకున్న చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 9న అరెస్ట్ అయ్యారు. దానికి నాలుగు రోజుల ముందు హవాలా రూపంలో డబ్బును చంద్రబాబు నాయుడు, నారాలోకేష్ లకు తరలించిన చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లకు సిఐడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే నోటీసులు అందుకున్న రోజునుంచే ఇద్దరూ మాయమయ్యారు. ఒకరు దుబాయ్ కి మరొకరు అమెరికాకి పరారయ్యారని ప్రచారం జరిగింది. నెల రోజుల తర్వాత సిఐడీ ముందు ప్రత్యక్షమైన కిలారు రాజేష్ తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఏపీలోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఎక్కడికీ పారిపోకపోతే సిఐడీ నోటీసులకు ఇంత వరకు ఎందుకు స్పందించలేదు? ఎందుకు విచారణకు హాజరు కాలేదు? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలోనే ఉన్నాడా.. లేక లోకేష్ తో పాటు ఢిల్లీలో రహస్య స్థావరంలో తలదాచుకున్నాడా అన్నది కూడా తెలీదు. సరే విచారణకు సిద్ధమంటూ వచ్చాడు కాబట్టి సిఐడీ విచారణ మొదలు పెట్టింది. మొదటి రోజు విచారణ సందర్భంగా సిఐడీ ఏ ప్రశ్న వేసినా సరిగ్గా సమాధానం చెప్పలేదని సమాచారం. ఇంతకాలం ఎక్కడున్నావు అని అడిగితే ఏపీలోనే అన్నాడు. ఏపీలో ఎక్కడ ఉన్నావని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదట. లోకేష్ తో ఎంతకాలం నుంచి పరిచయం ఉంది అని అడిగితే సమాధానం లేదు. నారా లోకేష్ కు డబ్బు అందించిన విషయంపై అడిగితే ఏం మాట్లాడకుడా మౌనంగా ఉండిపోయాడట. షెల్ కంపెనీల సృష్టికర్త మనోజ్ వాసుదేవ్ పార్ధసాని గురించి అడిగితే అతనెవరో తెలీదన్నాడట. తీరా వాసుదేవ్ -రాజేష్ ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ చూపించగానే నీళ్లు నమిలి బిక్కమొగం వేశాడట. 25 ప్రశ్నలు సంధిస్తే తెలీదు.. గుర్తులేదు..ఏమో అన్న సమాధానాలే ఇచ్చాడట. మొదటి రోజు విచారణ పూర్తికాగానే బయటకు వచ్చిన రాజేష్ తనని రెండో రోజు కూడా విచారణకు రమ్మన్నారని తాను కచ్చితంగా వస్తానని చెప్పాడు. రెండో రోజు ఉదయం రాజేష్ కోసం సిఐడీ పోలీసులు ఎదురు చూస్తోన్న తరుణంలో సిఐడీ వారు అడిగిన డాక్యుమెంట్లు తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుందని..దసరా పండగ తర్వాతనే తాను విచారణకు వస్తానని లేఖ పంపాడు రాజేష్. మొదటి రోజు మీడియా ముందు పెద్ద బిల్డప్ ఇచ్చిన రాజేష్ సిఐడీ మొదటి రోజు విచారణతోనే డంగైపోయాడు. తాను తప్పించుకునే పరిస్థితి లేదని అర్ధమైందో ఏమో కానీ.. రెండో రోజు విచారణకు గైర్హాజరయ్యాడు. మళ్లీ లోకేష్ ను కలిసి సిఐడీ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలో క్లారిటీ తీసుకున్న తర్వాతనే రాజేష్ సిఐడీ ముందుకు వస్తాడని భావిస్తున్నారు. చిత్రం ఏంటంటే ఈకేసులో విచారణ ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు సైతం సిఐడీ ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తులేదు..ఏమో అన్న సమాధానాలే ఇచ్చి విచారణకు ఏ మాత్రం సహకరించలేదని సిఐడీ పోలీసులే కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం విచారణలో నారా లోకేష్ కూడా అచ్చం ఇవే సమాధానాలు చెప్పి సిఐడీకి సహకరించకుండా వెళ్లిపోయాడు. ఇపుడు రాజేష్ కూడ అదే తంతు. అంతా కూడా ఒకే స్కూల్లో చదువుకున్నట్లు..ఒకేలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందంటున్నారు సిఐడీ పోలీసులు. నెల రోజుల పైగా రాజేష్‌కు ఇలాంటి సమాధానాలు చెప్పాల్సిందిగా లోకేష్ మంచి ట్రెయినింగ్ ఇప్పించారని అంటున్నారు. - సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
CID విచారణకు కిలారు రాజేష్..బాబు, లోకేష్ గుండెల్లో వణుకు
-
అసైన్డ్ భూదోపిడీలో కొత్త కోణం.. గుట్టుగా జీఓ–41 జారీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అమరావతి భూదోపిడీలో కొత్త కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు చెందిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించారన్నది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టానికి విరుద్ధంగా జీఓ–41 జారీకి ఆ ద్వయం బరితెగించి మరీ వ్యవహరించింది. అందుకోసం ఏకంగా కేబినెట్‌కు తెలియకుండా.. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ దోపిడీకి వారిద్దరూ కుట్ర పన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా.. సీఆర్డీఏ చట్టానికి విరుద్ధంగా జీఓ–41ను జారీచేశారని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వరని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి.. ఆ తర్వాత తమ బినామీల ద్వారా వాటిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తూ సేల్డీడ్ల ద్వారా రిజిస్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తెలిసికూడా దరఖాస్తు చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి ఉంది. సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తూ నెంబర్ కేటాయించిన తర్వాత ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని బుకాయిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు.. టీడీపీ నేతల ఒత్తిడితో ఆ భూములన్నీ 1954కు ముందు కేటాయించినవేనని సీఆర్డీఏ అధికారులు గుర్తించి టీడీపీ నేతలు, వారి బినామీ పేర్లను సీఆర్టీఏ రికార్డుల్లో నమోదుచేసి ప్యాకేజీ ప్రకటించారు. భూములన్నీ తమ హస్తగతమయ్యాక అసైన్డ్ భూములకూ భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ జీఓ–41ను టీడీపీ ప్రభుత్వం జారీచేసింది. ఈ కుట్ర ద్వారా 950 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ భూదోపిడీకి మూలమైన జీఓ–41 జారీ వెనుక అసలు కుట్ర తాజాగా బయటపడింది. కేబినెట్ ఆమోదం లేకుండానే జీఓ.. అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు ఈ జీఓ–41 జారీచేయడం వెనుకనున్న కుట్ర కోణం సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి.. రాజధాని అమరావతి ఏర్పాటుకోసం చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం సీఆర్డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ, అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం–1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీఓ–41ను తీసుకొచ్చింది. అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్లో చర్చించకుండానే ఏకపక్షంగా జీఓ–41ను అడ్డదారిలో జారీచేసేసింది. ఎందుకంటే కేబినెట్లో తీర్మానం చేయాలంటే అందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే కేబినెట్‌ను బైపాస్ చేసి జీఓ జారీచేసింది. తద్వారా.. మంత్రివర్గం ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్డీఏ చట్టాన్ని సైతం ఉల్లంఘించింది. నారా, నారాయణే కుట్రదారులు.. ఇక నిబంధనలకు విరుద్ధంగా జీఓ–41ను అప్పటి పురపాలక–సీఆర్డీఏ శాఖ మంత్రి పి.నారాయణ 2016, ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016, మార్చి 22న సీఎం హోదాలో చంద్రబాబు పోస్ట్–ఫాక్టో–రాటిఫికేషన్ చేసి మరీ ఆమోదించారు. అంటే.. అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు జీఓ–41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. ఈ కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు సిట్ దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అసైన్డ్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీఓ–41 జారీచేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. అలా జారీచేసిన జీఓ–41తో అమరావతి పరిధిలోని 950 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్టకొట్టింది. Follow the Sakshi Telugu News channel on WhatsApp -
అవినీతి చినబాబు ఆట కట్..సిద్ధంగా ఉండు లోకేశం
-
రెండో రోజు నారాయణ అల్లుడు పునీత్ సీఐడీ విచారణ
-
‘రింగ్’ మాస్టర్ అష్ట వంకర్లు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఎన్ని వంకర్లు తిప్పారో.. ఆ కేసులో నిందితుడు నారా లోకేశ్ సీఐడీ విచారణలో ప్రశ్నలకు అన్ని వంకర్లు తిరిగారు. చంద్రబాబు కుటుంబం, ఆయన అస్మదీయుల భూముల విలువ అమాంతంగా పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చిన తీరుపై సీఐడీ అధికారులు అడిగిన సూటి ప్రశ్నలకు లోకేశ్ నేల చూపులు చూశారు. తాను సభ్యుడిగా ఉన్న మంత్రివర్గ ఉప సంఘం ద్వారానే అక్రమాల కథ నడిపిన తీరును సీఐడీ ఆధారాలతో సహా ముందు పెట్టడంతో బిత్తరపోయారు. హెరిటేజ్ భూముల కొనుగోలు, లింగమనేని కుటుంబం నుంచి క్విడ్‌ప్రోకో కింద పొందిన కరకట్ట నివాసంపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. విచారణకు సహకరించకుండా దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఈ కేసులో ఏ–14గా ఉన్న లోకేశ్‌ను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు రెండో రోజు బుధవారం తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ దర్యాప్తునకు సహకరించకుండా ఉండేందుకు లోకేశ్ అనేక ప్రయత్నాలు చేశారు. అయినా సిట్ బృందం తమదైన శైలిలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన న్యాయవాది సమీప దూరంలో ఉండగా ఆడియో, వీడియో రికార్డింగ్ నిర్వహిస్తూ అధికారులు లోకేశ్‌ను విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దర్యాప్తునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అలైన్మెంట్ మార్చాలని ఎందుకు ఒత్తిడి చేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అమరావతి కోర్ కేపిటల్‌పై టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ ఉప సంఘం ద్వారా అక్రమాల కథ నడిపిన తీరుపై సీఐడీ లోకేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. జూనియర్ మంత్రి అయినప్పటికీ లోకేశ్‌కు ఉప సంఘంలో స్థానం కల్పించడంపై మొదటగా ప్రశ్నించింది. పేరుకు మంత్రివర్గ ఉప సంఘం అయిన్పటికీ ఇతర సభ్యులకంటే అందులో లోకేశ్, నారాయణదే హవా అని, భూ సమీకరణ, ఇన్నర్‌రింగ్ రోడ్డుకు భూసేకరణపై వారే కీలకంగా వ్యవహరించినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. వాటిని లోకేశ్‌కు చూపిస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాలని సీఆర్డీఏ అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారని ప్రశ్నించింది. తామేమీ ఒత్తిడి చేయలేదని లోకేశ్ బుకాయించారు. మంత్రివర్గ ఉపసంఘం, టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అలైన్‌మెంట్‌ను మార్చినట్లు అప్పటి సీఆర్డీఏ అధికారులు వాంగ్మూలం ఇచ్చిన అంశాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించడంతో లోకేశ్ షాక్ తిన్నారు. దాంతో ఆయన నోట మాట రాలేదని సమాచారం. వెంటనే తన న్యాయవాదితో సంప్రదించి చెబుతానని చెప్పారు. న్యాయవాదితో మాట్లాడిన తరువాత కూడా ఆయన ఈ అంశంపై సమాధానం దాట వేసేందుకే ప్రయత్నించారు. ముందుగానే సీఆర్డీఏ అధికారులతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖారారు చేయించి, దానినే మాస్టర్‌ప్లాన్‌లో చేర్పించి సింగపూర్‌కు చెందిన కన్సల్టెన్సీ ద్వారా ఆమోదింపజేయడం అంటే అక్రమమే కదా.. అని అధికారులు ప్రశ్నించడంతో లోకేశ్ మౌనంగా ఉండిపోయారు. మంత్రివర్గ ఉప సంఘం వ్యవహారం అంతా బూటకమని, ఆ ముసుగులో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాల భూముల విలువ అమాంతంగా పెంచుకున్నారని సీఐడీ కీలక ఆధారాలు చూపించడంతో లోకేశ్ నిశ్చేష్టుడయ్యారు. హెరిటేజ్ భూముల అంశంపై అసహనం ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ భూములు కొన్న అంశంపై సీఐడీ సూటి ప్రశ్నలకు లోకేశ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏ ప్రాతిపదికన ఆ ప్రాంతంలో భూములు కొనాలని హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని అధికారులు వేసిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ప్రస్తుతం తాను హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా లేనని, ఆ విషయాలు తనకు తెలియవని అన్నారు. భూములు కొనాలని తీర్మానించిన సమయంలో మీరే డైరెక్టర్‌గా ఉన్నారు కదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేయడం గమనార్హం. కరకట్ట నివాసం అంశంపై కస్సుబుస్సు లింగమనేని కుటుంబం నుంచి క్విడ్‌ప్రోకో కింద పొందిన కరకట్ట బంగ్లాపై సీఐడీ ప్రశ్నించడంతో లోకేశ్ తత్తరపాటుకు గురై అధికారులపై కస్సుబుస్సులాడారు. ఆ ఇంటికి తాము అద్దె చెల్లించామన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఆదాయ పన్ను రిటర్న్‌లను అధికారులు చూపిస్తూ ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. తన తల్లి ఆదాయ పన్ను రిటర్న్‌ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా ఏ పత్రాలనైనా సంబంధిత శాఖలను సంప్రదించి తీసుకునే వెసులుబాటు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఉందనే అవగాహన ఆయనకు లేకపోవడం విడ్డూరం. లింగమనేని రమేశ్ ఆ కరకట్ట నివాసాన్ని ఉచితంగా ఇచ్చానని ఓసారి, కాదు దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని మరోసారి చెప్పిన విషయాలను అధికారులు ప్రస్తావించారు. దాంతో అసలు తనకు ఆ కరకట్ట నివాసం గురించి తెలియదని లోకేశ్ బుకాయించారు. మంత్రి హోదాలో మీరు నివసించిన ఇంటి గురించి తెలియదా... అని అధికారులు రెట్టించి అడిగేసరికి సమాధానం దాటవేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణానికి సంబందించి మరికొన్ని కీలక వ్యవహారాలపై లోకేశ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. వీలైనంతవరకు దర్యాప్తునకు సహకరించకుండా విషయాన్ని పక్కదారి పట్టించేందుకే యత్నించారు. పలువురు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని ప్రశ్నించాలని సీఐడీకి సూచించడం హాస్యాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన నిందితుడే ఇతరులను ప్రశ్నించాలని చెబుతుండటం విడ్డూరంగా ఉందని సీఐడీవర్గాలు వ్యాఖ్యానించాయి. అవసరమైతే మరోసారి విచారణకు రావల్సి ఉంటుందని సీఐడీ అధికారులు లోకేశ్‌కు చెప్పి బుధవారం విచారణ ప్రక్రియను ముగించారు. సంబంధం లేని ప్రశ్నలు వేశారు: లోకేశ్ సీఐడీ అధికారులు తనకు ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలు వేశారని లోకేశ్ చెప్పారు. రెండో రోజు విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే హెరిటేజ్ ఫుడ్స్ భూములు కోల్పోతుందని ఈ విచారణ ద్వారా తనకు తెలిసిందన్నారు. కరకట్ట నివాసానికి తన తల్లి అద్దె చెల్లించారన్నారు. తన తల్లి ఆదాయ పన్ను రిటర్న్‌లను అధికారులు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. సాక్షి పత్రికలో షేర్లను కొందరు కొన్నట్లుగా తమ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను లింగమనేని కొనలేదని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ప్రశ్నలకు తత్తరపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ పాత్రపై ‘సాక్షి’ ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. సాక్షి పత్రికపై అసత్య ఆరోపణలు చేసి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. కానీ సాక్షి ప్రతినిధులు సూటి ప్రశ్నలు సంధించడంతో తత్తరపాటుకు గురయ్యారు. ఇతర మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోకేశ్‌తో సాక్షి, ఇతర మీడియా ప్రతినిధుల సంభాషణ ఇలా సాగింది.. సాక్షి: మీరు మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడయ్యాకే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు కొన్నారన్న అభియోగంపై మీ స్పందన ఏమిటి? లోకేశ్: మంత్రివర్గ ఉప సంఘం సభ్యుడిగా నేను ఒత్తిడి చేసి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశానని సీఐడీ అంటోంది. కానీ అది నా శాఖకు ప్రమేయం లేని అంశం. అదే చెప్పా. సాక్షి: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉన్న కంతేరు వైపు ఎందుకు మళ్లింది? లోకేశ్: సీఐడీ అధికారులు నాకు బాహుబలి సినిమా చూపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గూగుల్ మ్యాప్ చూపించి ప్రశ్నించారు. ఆ రోడ్డు నిర్మిస్తే హెరిటేజ్ ఫుడ్స్ భూములు కోల్పోతుందని నాకు అర్థమైంది. సాక్షి: క్విడ్‌ప్రోకో కిందే లింగమనేని మీకు కరకట్ట బంగ్లా ఇచ్చారని సీఐడీ అభియోగం మోపింది కదా? లోకేశ్: మాకు క్విడ్ ప్రోకో అలవాటు లేదు. అలా మా హెరిటేజ్ ఫుడ్స్‌లో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదు. సాక్షి: మరి మీకు మాత్రమే లింగమనేని ఆ కరకట్ట బంగ్లాను ఎందుకు ఇచ్చారు? లోకేశ్: ఆ ఇంటికి మేము అద్దె చెల్లిస్తున్నాం. ప్రభుత్వానికి ఆ మేరకు లేఖ కూడా రాశాం. సాక్షి: అదే నిజమైతే 2019కు ముందు ఎందుకు అద్దె చెల్లించలేదు? లోకేశ్: (వెంటనే సమాధానం చెప్పలేక మౌనం వహించారు. కాసేపటికి తేరుకుని..) ఆ విషయం నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు అద్దె చెల్లిస్తున్నాం. మా అమ్మ ఐటీ రిటర్న్ రికార్డులు సీఐడీకి ఎలా వచ్చాయి? దీనిపై న్యాయపోరాటం చేస్తాం. సాక్షి: మీ సన్నిహితుడు కిలారు రాజేశ్ ఎందుకు పరారయ్యారు? లోకేశ్: ఆయన గురించి నాకేం తెలుస్తుంది? ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు ఇతర మీడియా ప్రతినిధులు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలుకు పంపారు అని మీరు అంటున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించేది కోర్టులు కదా? లోకేశ్: ఈ కేసులో ఎఫ్ఐఆర్ వేసింది జగన్ ప్రభుత్వమే. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు. మీడియా ప్రతినిధులు: మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లిపోతారా? లోకేశ్: నేను ఎక్కడికి వెళ్తానో మీకు చెప్పాలా? అది మీకు అనవసరం. నేను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఎక్కడికి వెళ్లినా షెడ్యూల్ ఇస్తా. -
ఇన్నర్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టు బుధవారం తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌లో తదుపరి ముందుకెళ్లొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో తదుపరి ఎలాంటి సమయం ఇచ్చే ప్రసక్తేలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏదైనా కేసులో వాదనలు వినిపించాల్సి ఉంటే ఒక్కరోజు మాత్రమే గడువునివ్వడం సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద వాదించారు. అప్పటివరకు రక్షణ కల్పించండి.. అంతకుముందు సిద్ధార్థ లూథ్రా తదితరులు వాదనలు వినిపిస్తూ.. 2022లో కేసు నమోదు చేశారని, ఇప్పటివరకు చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వడంగానీ, విచారణకు పిలవడంగానీ చేయలేదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తరువాతే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారించి చంద్రబాబు కస్టడీకి అనుమతినిస్తే తాము దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకం అవుతుందని చెప్పారు. డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే తాము ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. విచారణను ఈ నెల 16కి వాయిదా వేయాలని, అప్పటివరకు రక్షణ కల్పించాలని కోరారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు.. తరువాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ విచారణను 16కి వాయిదా వేస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో బెయిల్ కోసం చంద్రబాబు గతంలో దాఖలు చేసిన పిటిషన్లోనే తాము అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. చంద్రబాబు కస్టడీ కోసం సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ నెలరోజులుగా ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిందని తెలిపారు. పీటీ వారెంట్‌పై విచారణ కొనసాగించుకోవచ్చునని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కేసుకు, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సారూప్యత ఉందని వివరించారు. చంద్రబాబు కోరుకున్న విధంగా ఈ కేసులో ఏ రక్షణ కల్పించినా, గత ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించినట్లవుతుందని చెప్పారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై జరుగుతున్న విచారణను కొనసాగనివ్వాలని కోరారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఏరకంగాను ముందుకెళ్లొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించారు. విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ నెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ముదివీడు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అలాగే ఈ కేసులో చంద్రబాబుపై అదేరోజు వరకు పీటీ వారెంట్ కూడా దాఖలు చేయబోమని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. వాయిదాకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు సైతం అభ్యంతరం చెప్పలేదు. దీంతో న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ కుంభకోణంలో బెయిలివ్వాలని చంద్రబాబు పిటిషన్.. నేడు విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు కనీసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, సీఐడీ దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కస్టడీ తరువాత తాను దాఖలు చేస్తున్న తొలి బెయిల్ పిటిషన్ ఇదేనన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించనుంది. -
నారాయణ అల్లుడిని విచారిస్తున్న సీఐడీ
-
సీఐడీ విచారణలో నారాయణ అల్లుడు..
-
సిట్ కార్యాలయానికి భయపడుతూ బయల్దేరిన లోకేశ్
-
నారా లోకేశ్ రెండో రోజు CID విచారణ
-
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సీఐడీ విచారణలో లోకేశ్ తడబాటు
-
చంద్రబాబుకు నో రిలీఫ్..!
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ కేసును తగిన ధర్మాసనం ముందు జాబితా చేస్తామని, అక్టోబరు 3న దీన్ని విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే ఈ పిటిషన్ విచారణపై జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి కొన్ని రిజర్వేషన్లు (అభ్యంతరాలు) ఉన్నాయని జస్టిస్ సంజీవ్‌ఖన్నా పేర్కొన్నారు. దీంతో జస్టిస్ భట్టి నిర్ణయంపై తామేమీ చేయలేమని, కేసును త్వరగా జాబితా చేయాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. వచ్చే వారం జాబితా చేస్తామని జస్టిస్ సంజీవ్‌ఖన్నా పేర్కొనడంతో, జస్టిస్ భట్టి విచారణ నుంచి వైదొలిగిన అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అనుమతి కోరారు. ఇందుకు అనుమతించిన జస్టిస్ సంజీవ్‌ఖన్నా కేసును పాస్ ఓవర్ చేయాలా? అని న్యాయవాదుల్ని ప్రశ్నించారు. పాస్ ఓవర్‌తో ఉపయోగం ఉండదని, సోమవారం జాబితా చేయాలని హరీశ్ సాల్వే అభ్యర్థించారు. అది సాధ్యం కాదని, వచ్చే వారం జాబితా చేస్తామని, ప్రాసెస్‌కు కొంత సమయం పడుతుందని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి లేని ధర్మాసనంలో అక్టోబరు 3న ప్రారంభయ్యే వారంలో కేసును జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేం.. ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేం: సీజేఐ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నిరాకరించారని, దీనిపై వెంటనే విచారణ జరిగేలా చూడాలని అనంతరం సీజేఐ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అభ్యర్థించారు. అయితే ఈ అంశంలో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని, వెంటనే విచారణ వద్దని సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ విన్నవించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ.. ‘అసలు మీకేం కావాలి? సెక్షన్ 17ఏతో బెయిలు కావాలని కోరుతున్నారా?’ అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఎస్సెల్పీపై విచారణ జరపాలని లూత్రా కోరారు. అయితే బెయిలు కావాలని దరఖాస్తు చేసుకోవచ్చుగా? అని సీజేఐ సూచించారు. దీనిపై లూత్రా స్పందిస్తూ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, 17 ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. దీంతో అక్టోబరు 3న విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తెలిపారు. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు విచారిస్తోందని, చంద్రబాబును వారి కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని లూత్రా కోరారు. ఇప్పటికే పోలీసు కస్టడీ పూర్తయిందని, మరో 15 రోజులు పోలీసు కస్టడీ కోరుతున్నారని ఎన్నికల నేపథ్యంలో పదే పదే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని లూత్రా ఆరోపించారు. తొలుత జ్యుడీషియల్ కస్టడీ తర్వాత పోలీసు కస్టడీకి ఇచ్చారన్నారు. ఈ క్రమంలో లూత్రా పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఈ దశలో అలాంటి ఆదేశాలను ఇవ్వలేమని, ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేమని, అక్టోబరు 3నే విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తేల్చి చెప్పారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలి: రంజిత్‌కుమార్ ఇదే సమయంలో సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ స్పందిస్తూ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.కోట్లలో కుంభకోణం జరిగిందని సీజేఐ దృష్టికి తెచ్చారు. రూ.3,330 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పది శాతం మాత్రమే వెచ్చిస్తుందంటూ నిధులు విడుదల చేశారన్నారు. ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులను ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా పది శాతం నిధులు చేతులు మారిపోయాయన్నారు. సొమ్ములు స్వాహా అయినట్లు జీఎస్టీ అధికారులు కూడా గుర్తించారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడంతో గత ప్రభుత్వం ఫైళ్లు మాయం చేసిందన్నారు. ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని పిటిషనర్ వాదించడం సరి కాదన్నారు. ఆ చట్ట సవరణ కన్నా ముందుగానే ఈ కుంభకోణం జరిగిందన్నారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు. -
మళ్లీ ఆవు కథే!
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా నకిలీ ఒప్పందంతో నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసి రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టిన కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. పక్కా పన్నాగంతో ‘స్కిల్’ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సీఐడీ విచారణను కూడా పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలోనూ ఆయన ఏమాత్రం సహకరించనందున చంద్రబాబు కస్టడీని పొడిగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 14 ఏళ్లు సీఎంనంటూ సీఐడీ విచారణలో చంద్రబాబు సంబంధం లేని సంగతులు చెబుతూ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్కిల్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఏ ప్రశ్నలు వేసినా చంద్రబాబు ఒకటే చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని... 14 ఏళ్లు సీఎంగా చేశానంటూ కాలయాపన చేసేందుకే ప్రయత్నించారు. దీంతో ఆయన రాజకీయ అనుభవం గురించి తమకు కూడా తెలుసని, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ జీవో, ఒప్పందాలను ఏ ప్రాతిపదికన చేశారు? బిల్లులు చెల్లింపుల్లో హేతుబద్ధత ఏమిటీ? నిధుల మళ్లింపులో పాత్రధారులతో సంబంధాలు ఏమిటీ? అనే అంశాలకు సూటిగా సమాధానాలు చెప్పాలని సిట్ అధికారులు పదేపదే పట్టుబట్టాల్సి వచ్చింది. వ్యూహాత్మక ప్రశ్నావళి.. కొంతవరకు సఫలీకృతం మొదటి రోజు చంద్రబాబు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో రెండో రోజు సిట్ అధికారులు ప్రశ్నావళిలో కొన్ని మార్పులు చేశారు. వరుస క్రమంలో కాకుండా ఓ అంశం నుంచి మరో అంశానికి జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే సీఐడీ, ఈడీ అరెస్ట్ చేసిన సుమన్‌బోస్, వికాస్ వినాయక్ కన్విల్కర్లతోపాటు నిధుల అక్రమ తరలింపులో షెల్ కంపెనీలతో చంద్రబాబు సంబందాలు, ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. నిధుల అక్రమ మళ్లింపులో కీలక పాత్రధారులైన చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలతో చంద్రబాబు, లోకేశ్ లావాదేవీలపై కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు జారీ చేయగానే పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారు కావడంపై సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. వెరసి రెండు రోజుల విచారణలో వ్యూహాత్మకంగా ప్రశ్నలు సంధించడం ద్వారా సీఐడీ అధికారులు కొంతవరకు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబు విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. మధ్యవర్తుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేశారు. విచారణ సాగిన తీరు, వీడియో రికార్డింగ్ తదితర ఫైళ్లను న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించనున్నారు. మరింత విచారించాల్సిన అవసరం విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించి కాలహరణం చేసినందున చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలో విచారించేందుకు అనుమతించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారు కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు నివేదించనుంది. ఈ కేసులో గతంలో విచారించిన సాక్షులను ప్రభావితం చేసిన ఉదంతాలను కూడా న్యాయస్థానం దృష్టికి మరింత వివరంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో కుట్రకోణానికి సంబంధించి పూర్తి వాస్తవాలను రాబట్టేందుకు చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి సిట్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నారు. -
సీఐడీ లోతైన విచారణ..బాబుకు నో ఛాన్స్..
-
మొదటిరోజు విచారణలో అధికారులకు సహకరించని చంద్రబాబు
-
చంద్రబాబు విచారణ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా
-
నేడు మరోసారి చంద్రబాబును విచారించనున్న సీఐడీ
-
తెలీదు.. గుర్తులేదు అంటూ సీఐడీకి సహకరించని చంద్రబాబు
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తొలిరోజు శనివారం విచారించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని రెండ్రోజుల సీఐడీ కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్ బృందం చంద్రబాబును సెంట్రల్ జైలులోనే కస్టడీలోకి తీసుకుని విచారించింది. న్యాయస్థానం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఆయన్ను విచారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గతంలో సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్లుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలిసింది. పక్కా పన్నాగంతో తొలిరోజు విచారణలో ఆయన దాదాపు సగం సమయం వృథా అయ్యేటట్లు చేయగలిగారు. దాంతోపాటు సిట్ అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకే ఆయన ప్రాధాన్యమిచ్చారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సిట్ అధికారులు పూర్తి సంయమనం, ఓపికతో వ్యవహరించి తొలిరోజు విచారణ ప్రక్రియను పూర్తిచేశారు. సమీపం నుంచి పరిశీలించేందుకు చంద్రబాబు న్యాయవాదులను అనుమతించారు. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు కాలహరణం.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్‌కు సమీపంలోని కాన్ఫరెన్స్ హాలులో సిట్ అధికారులు చంద్రబాబును విచారించారు. అందుకోసం ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతోపాటు మొత్తం 12 మందితో కూడిన సిట్ బృందం శనివారం ఉ.9.30 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకుంది. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విచారణ ప్రక్రియను ప్రారంభించారు. అంతకుముందు.. తనను కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల కాపీ కావాలని చంద్రబాబు అడిగారు. 20 పేజీల ఆ కాపీని అధికారులు ఆయనకిచ్చారు. దానిని చదివే నెపంతో చంద్రబాబు చాలాసేపు కాలహరణం చేశారు. అయినప్పటికీ సిట్ అధికారులు ఓపిగ్గా వేచి చూసి ఆయన సరే అన్నాకే విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ప్రశ్నావళిలో 30 శాతమే తొలిరోజు.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో వెల్లడైన కీలక ఆధారాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రశ్నావళిని అనుసరించి సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్టుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. కొన్ని ప్రశ్నలకు అవి సంబంధిత అధికారులను అడగాలిగానీ తనను కాదని వ్యాఖ్యానించారని సమాచారం. కీలక పత్రాలను ఆయన ముందుంచి మరీ వాటిపై ప్రశ్నించినా సరే ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించకపోవడంతో ప్రశ్నావళిలోని 30 శాతం ప్రశ్నలను కూడా సీఐడీ అధికారులు అడగలేకపోయారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశమన్నది స్పష్టమైంది. అయినప్పటికీ అధికారులు పూర్తి సహనంతో వ్యవహరించి తమ ప్రశ్నలను కొనసాగించారు. ప్రతి గంటకూ ఐదు నిముషాల పాటు విరామం ఇవ్వడంతోపాటు చంద్రబాబు కోరిన అదనపు సమయాల్లోనూ విచారణ ప్రక్రియను నిలుపుదల చేశారు. గంటసేపు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అలా తొలిరోజు నాలుగు దశల్లో విచారించారు. అనంతరం.. చంద్రబాబు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని స్నేహబ్లాక్‌కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత.. చంద్రబాబు కస్టడీ విచారణ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. జైలు లోపల, బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది ఆక్టోపస్, సివిల్ పోలీసు బృందాలను మొహరించారు. తొలిరోజు విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందం ఫైళ్లు, వీడియో రికార్డింగ్ సామగ్రి మొత్తం తీసుకుని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంది. మీడియాపై బాలకృష్ణ చిందులు.. మరోవైపు.. నందమూరి బాలకృష్ణ తన నైజాన్ని ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లపై చిందులు తొక్కారు. రాజమహేంద్రవరం విద్యానగర్‌లోని లోకేశ్ క్యాంప్ ఆఫీసు వద్ద శనివారం పార్టీ నేతలతో మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై ఆయన మండిపడ్డారు. క్యాంప్ వద్ద ఉన్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌పై ఆయన తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు. తాను ఈనాడు ఫొటోగ్రాఫర్‌నని ఆయన చెబితే.. ‘అయితే ఏంటి బొక్కా..’ అంటూ బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది. -
చంద్రబాబు సమాధానం చెప్పకపోతే సీఐడీ ప్లాన్ B సిద్ధం
-
చంద్రబాబును ప్రశ్నించేందుకు రెండు సీఐడీ టీమ్ లు
-
విచారణలో సైలెంట్ గా ఉంటే బాబుకే నష్టం..
-
చంద్రబాబు కస్టడీ విచారణలో స్కిల్ స్కాం గుట్టు రట్టు కానుందా..?
-
దొరికిపోయినా బుకాయింపేనా?
సాక్షి, అమరావతి: స్కిల్ స్కాంలో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసి, ఆధారాలతో సహా పట్టుబడినా.. ఇప్పటికీ తాను తప్పేమీ చేయలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుకాయిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.ఆర్థిక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబుపై కేసు పెట్టారనడం అవాస్తవమంటూ కొట్టిపారేశారు.కేసు కోర్టు పరిధిలో ఉండగా ఆయన మాట్లాడటం సరికాదన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల మాట్లాడుతూ.. స్కిల్ స్కాంపై సీఐడీ దర్యాప్తులో భాగంగా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో తనను అరెస్టు చేశారంటూ చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. అమరావతి భూకుంభకోణం, అసైన్డ్ భూకుంభకోణం, టిడ్కో ఇళ్ల స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్‌నెట్ స్కాం కేసులు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చినవి కావని.. రెండేళ్లుగా వాటిపై విచారణ సాగుతోందని స్పష్టంచేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ కుంభకోణాలను ప్రస్తావించామని.. అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదంటూ సజ్జల స్పష్టంచేశారు. ఈ కేసులకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నప్పుడు చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు తమ పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాయని వివరించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. కేసుల దర్యాప్తులో సీఐడీకి సరైన ఆధారాలు లభిస్తే.. చంద్రబాబునైన, లోకేశ్నైన, అచ్చెన్నాయుడునైనా విచారణకు పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు విని ఉంటే జగన్‌పై కేసులు ఉండేవే కాదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టి, కక్ష సాధింపులకు గురిచేసిందనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భావించబట్టే జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో కూడా చంద్రబాబు పాత్ర ఉంది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో విచారణకు పీటీ వారెంట్ వేసి ఉంటారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి కేసుల్లేవని చంద్రబాబు చెప్పుకోవడం పూర్తి అబద్ధం. అనేక కేసుల్లో విచారణను ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకుంటూ ఇంతకాలం తప్పించుకుంటూ వస్తున్నారు. ఏ కేసులో కూడా క్లీన్చిట్ తెచ్చుకోలేదు. గతంలో చంద్రబాబుపై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కేసులు పెట్టారు. కానీ.. రాజకీయంగా తేల్చుకుందామని వాటిని వదిలేశారు. ఇక వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేశ్‌ను చూసి సీఎం జగన్ భయపడాలా? చంద్రబాబు జైలులో ఉంటే తప్పితే ఎన్నికలను ఎదుర్కోలేం అనే భావనలో సీఎం జగన్ లేరు. ఊతకర్రలు లేనిదే ఎన్నికలకు వెళ్లలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినప్పుడు పవన్ కనబడలేదు. ఆయనకు అవసరమైనప్పుడు రాష్ట్రానికి వచ్చి మాట్లాడి తిరిగి వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడొచ్చి పవన్ హడావుడి చేశాడు. -
‘ఫైబర్‌గ్రిడ్’లోనూ అదే స్కిల్
సాక్షి, అమరావతి: స్కిల్ డెవల్ప్మెంట్, రాజధాని తాత్కాలిక నిర్మాణాల్లో నిధులు కొట్టేయడానికి అనుసరించిన మార్గాన్నే ఫైబర్‌గ్రిడ్‌లోనూ టీడీపీ పెద్దలు అనుసరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో కూడా యథేచ్ఛగా అవినీతికి తెగబడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు కేటాయించారు. ఈ ప్రజాధనాన్ని అనేక డొల్ల కంపెనీల ద్వారా కొట్టేశారు. ఇందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని వేమూరి తీసుకున్నాడు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేర్పించారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలిసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పటివరకు ఇన్‌క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవకుమార్ (ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రామ్మూర్తి (ఏ–21)లతో పాటు కనుమూరి కోటేశ్వరరావును అరెస్టుచేసింది. ఈ డొల్ల కంపెనీల ద్వారా కాజేసిన సొమ్మును అందుకున్న అసలు వ్యక్తులను అరెస్టుచేసేందుకు సీఐడీ రంగం సిద్ధంచేస్తోంది. నెటాప్స్ ద్వారా ఇలా కొట్టేశారు.. ♦ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. ♦ నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు. ♦ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీచేసింది. ♦ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది. ♦ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ చేసింది. -
బాబు చేసింది పెద్ద నేరమే!
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సీఐడీ బలమైన ఆధారాలతో అంతకంటే బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ముఖ్యంగా చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన ప్రజా సేవకుడు దురుద్దేశంతో ఆ చట్టాలను ఉల్లంఘించడం, తప్పుడు లేదా నకిలీ సంస్థలను సృష్టించి ప్రజా ధనాన్ని సొంతం చేసుకునేందుకు ఫోర్జరీ పత్రాలను నిజమైనవిగా వినియోగించడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ నేరాలకు పాల్పడినట్లు సీఐడీ భావిస్తోంది. మొత్తం 11 ఐపీసీ సెక్షన్లు, రెండు అవినీతి నిరోధక సెక్షన్ల కింద అరెస్టు చేసింది. తీవ్రమైన నేరాలు చేయడంతో పాటు నేరాలను ప్రోత్సహించిన చంద్రబాబుకు ఈ చట్టాల కింద 7 నుంచి 25 ఏళ్ల కారాగార శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. బాబుపై నమోదైన కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే.. ఐపీసీ సెక్షన్లు 120–బి: నేరపూరిత కుట్ర 166: ప్రభుత్వ సేవకుడు ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన వారు దురుద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడటం 167: పబ్లిక్ సర్వెంట్ ఉద్దేశపూర్వకంగా లేని/తప్పుడు సంస్థలను, పత్రాలను సృష్టించి మోసం చేయడం 418: ఎవరికైనా నష్టం వాటిల్లుతుందని తెలిసీ ఉద్దేశ పూర్వకంగానే మోసం చేయడం 420: మోసం చేయడం 465: ఫోర్జరీ చేయడం 468: మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించడం 471: ఫోర్జరీ పత్రాలను అసలైన పత్రాలుగా ఉపయోగించడం 409: నేరపూరిత విశ్వాస ఘాతుకం 201: నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం, లేదా నేరస్థుడు దొరక్కుండా తప్పుడు సమాచారం ఇవ్వడం 109: నేరాన్ని ప్రేరేపించడం, ఆ నేరం లేదా కుట్రలో భాగస్వామిగా ఉండటం పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్) యాక్ట్ 12(బి)(1): అవినీతికి పాల్పడటం 13(1)(సి)(డి): పబ్లిక్ సర్వెంట్‌గా ఉండి అవినీతికి పాల్పడడం -
చందాదారులకు మార్గదర్శి బెదిరింపులు 'చెప్పింది చేయండి'
సాక్షి, అమరావతి: సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులను ఆ సంస్థ యాజమాన్యం బెదిరిస్తోందా? మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందా? ఇంతగా బరితెగించడం నిజమేనా? దీనిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారా? తదితర ప్రశ్నలన్నింటికీ సీఐడీ విభాగం అవునని స్పష్టం చేస్తోంది. ఘోస్ట్ చందాదారుల పేరిట అక్రమాలకు పాల్పడుతుండటాన్ని సీఐడీ ఆధారాలతోసహా వెలికి తీస్తుంటే బెంబేలెత్తిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా బెదిరింపులకు పాల్పడుతోందని కుండబద్దలు కొట్టింది. చందాదారులు, ఏజంట్లను మోసగిస్తూ మార్గదర్శి భారీగా అక్రమాలకు పాల్పడుతోందని పలువురు బాధితుల ఫిర్యాదుతో విశాఖపట్నం, విజయవాడ, నరసరావుపేటలో తాజాగా ఆ సంస్థపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫకీరప్పతో కలసి విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఘోస్ట్ చందాదారుల పేరిట ఆర్థిక దందా ► మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రతి చిట్టీ గ్రూపులో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున మొత్తం మీద రాష్ట్రంలో 3 వేల మంది ఘోస్ట్ చందాదారుల పేరిట భారీగా ఆర్థిక మోసానికి పాల్పడుతోంది. ఆ 3 వేల మందికి తెలియకుండానే వారిని చందాదారులుగా చూపిస్తూ వారి పేరిట అక్రమంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తోంది. ఇతరత్రా సేకరించిన వారి గుర్తింపు కార్డులతో వ్యవహారం నడుపుతోంది. వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ తీవ్ర నేరానికి పాల్పడుతోంది. ► ఘోస్ట్ చందాదారుల పేరిట చెక్‌లు జారీ చేస్తున్నప్పటికీ, ఆ చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం వారి వద్దే అట్టిపెట్టుకుంటోంది. ఆ చెక్కుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం లేదు. బ్యాంకులో జమ చేయడం లేదు. ఇదో అతి పెద్ద ఆర్థిక మోసం. అలాంటి 3 వేల మంది ఘోస్ట్ చందాదారుల్లో వంద మందిని సీఐడీ విచారిస్తోంది. ► దాంతో బెంబేలెత్తిన మార్గదర్శి యాజమాన్యం ఆ ఘోస్ట్ చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తోంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని, తర్వాత తాము అన్నీ సెటిల్ చేస్తామని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ తన పీఏ శశికళ ద్వారా చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అక్రమ డిపాజిట్లుగా నల్లధనం ► రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే తిరిగి బుకాయిస్తోంది. రాబోయే నెలలకు చిట్టీ గ్రూపులకు చెల్లించాల్సిన చందాలను అడ్వాన్స్‌గా జమ చేస్తున్నారని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అసలు చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే చందాదారుల పేరిట నాలుగైదు నెలల ముందే డిపాజిట్లు సేకరించిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. ► చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే ఎవరైనా చందాల మొత్తం చెల్లిస్తారా? ఎవరూ చెల్లించరు కాబట్టి అవి అక్రమ డిపాజిట్లే. రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు దాదాపు 2 వేల మందిలో రూ.కోటికి పైగా విలువైన అక్రమ డిపాజిట్లు చేసిన, చిట్టీ గ్రూపుల్లో చందాదారులుగా ఉన్న వారు ఏకంగా 800 మందికిపైగా ఉన్నారు. చాలా కంపెనీల పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. ► ఆ 800 మందికిపైగా డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అంత భారీగా డిపాజిట్లు ఎలా చేశారు.. ఆ నిధులు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయనే కోణంలో విచారిస్తోంది. విజయవాడలో ఓ బిల్డర్ ఏకంగా రూ.50 కోట్ల విలువైన చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా ఉన్నారు. ► ఇలాంటి భారీ మొత్తాల డిపాజిట్‌దారులు, చిట్టీ గ్రూపుల్లో సభ్యుల గురించి ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా సీఐడీ సమాచారమిచ్చింది. అక్రమ డిపాజిట్ల ముసుగులో నల్లధనం చలామణిలోకి తీసుకువస్తున్నారా అన్నది సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఏజంట్లకూ కుచ్చుటోపి ► మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ చందాదారులు, ఏజంట్లను కూడా మోసగిస్తోంది. కుట్ర పూరితంగా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారి ఆస్తులు రాయించుకుంటోంది. దీనిపై చందాదారులు, ఏజెంట్లు, ఘోస్ట్ చందాదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిశీలించి తగిన ఆధారాలు ఉన్న వాటిపై సీఐడీ కేసులు నమోదు చేస్తోంది. ► విజయవాడలో కోళ్ల ఫారం యజమాని బొండు అన్నపూర్ణా దేవి అనే మహిళను ఏకంగా 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్పించి ఆమెను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. కుట్ర పూరితంగా విజయవాడలోని లబ్బీపేట, గుడివాడ మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు కేంద్రంగా ఈ మోసానికి పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆమె కుమార్తె ప్రియాంక సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. ష్యూరిటీలు ఇచ్చినా సరే కొర్రీలు వేస్తూ ఆమెను డిఫాల్టర్‌గా చూపిస్తూ వారి ఆస్తులు కూడా రాయించుకున్నారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. ఆమె రూ.14 కోట్ల విలువైన 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా ఉన్నారు. ఆమె రూ.8 కోట్లు చందా మొత్తం చెల్లించారు. కానీ చిట్టీ పాట పాడితే ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.48 లక్షలు మాత్రమే. ఇందులో రూ.8 కోట్ల విలువైన 45 చిట్టీ గ్రూపుల్లో ఆమె రూ.1.7 కోట్లు చందా మొత్తంగా చెల్లిస్తే.. చిట్టీ పాట పాడిన తర్వాత ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.8 వేలు. ఆమెను డిఫాల్టర్‌గా చూపిస్తూ వారి కుటుంబ ఆస్తులు కూడా రాయించుకుంటున్నారు. ► విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన పిలక లలిత కుమారి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఆమెను విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో ఘోస్ట్ చందాదారుగా చేర్చారు. ఆ విషయం తెలిసి ఆమె చిట్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. అక్కడ ఉన్న పత్రాల్లో ఉన్న సంతకాలు చూసి అవి తాను చేయలేదని ఫోర్జరీ చేశారని తెలిపారు. ► ఆమె చిట్టీ పాడినట్టు.. ఆమెకు చిట్టీ మొత్తం చెల్లించినట్టు కూడా రికార్డుల్లో ఉంది. అందుకు ఇద్దరు సాక్షి సంతకాలు కూడా చేశారు. తనకు తెలియకుండానే తనను చందాదారుగా చేర్చడంతోపాటు తన సంతకాలు ఫోర్జరీ చేయడంపై లలిత కుమారి విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో విశాఖపట్నం డాబా గార్డెన్స్ మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏజెంట్ కె.సంతోష్, సాక్షి సంతకాలు చేసిన జి.నరసింగరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్, ఎండీ శైలజ కిరణ్, ఆమె పీఏ శశికళ, విజయవాడ లబ్బిపేట బ్రాంచి మేనేజర్ బండారు శ్రీనివాసరావు, గుడివాడ బ్రాంచి మేనేజర్ వైవీవీడీ ప్రసాద్, పాతూరి రాజాజీ, పాపి నాయుడులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ► పల్పాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏజంట్‌నే ఆ సంస్థ మోసం చేసింది. ఏజంట్ సంతకాన్ని బ్రాంచి మేనేజర్ ఫోర్జరీ చేశారు. ఏజంట్ ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మా కుటుంబాన్ని దోచేసి రోడ్డున పడేశారు – బోరున విలపించిన బొండు అన్నపూర్ణా దేవి ‘మార్గదర్శి చిట్ ఫండ్స్ మమ్మల్ని పూర్తిగా మోసం చేసి ఆర్థికంగా కుదేలయ్యేట్టు చేసింది. మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. మా ఆస్తులు, బంగారం, వృద్ధాప్యంలో అవసరాల కోసం దాచుకున్న మొత్తం అంతా మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు ధారపోశాం. అయినా సరే ఇంకా మమ్మల్ని వేధిస్తూ మిగిలిన ఉన్న ఇంటిని కూడా తీసుకునేందుకు వేధిస్తోంది. మా కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడింది. నా భర్త ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడు. నేను కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాను. నేను మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో ఒక గ్రూపులో చందాదారుగా చేరాను. ఆ తర్వాత ఏకంగా 65 గ్రూపుల్లో నన్ను చందాదారుగా చేర్చింది. నిబంధనల ప్రకారం మేము ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఉద్దేశ పూర్వకంగా మమ్మల్ని 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్‌గా చూపించింది. మా ఆస్తులు తీసుకుంది. నా భర్త జీపీఎఫ్ డబ్బులు కట్టి, పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించాం. అయినా సరే ఇంకా బకాయి ఉన్నారంటూ మా ఇల్లు వేలం వేయించారు. మా ఇంటికి వచ్చి అల్లరి చేశారు. మా అమ్మాయి విదేశాల్లో వైద్య విద్య చదువుతోంది. ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు. చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మమ్మల్ని వేధిస్తున్నారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది? ఎలా వేలం పాటలో పాల్గొంది? తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది? ఇంత దారుణంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ మమ్మల్ని మోసం చేసింది. మమ్మల్ని కుట్ర పూరితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం, మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.’ రూ.9.43 కోట్ల జగజ్జనని చిట్ ఫండ్స్ ఆస్తులు అటాచ్ కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడిన రాజమహేంద్రవరానికి చెందిన జగజ్జనని చిట్ ఫండ్స్‌కు చెందిన రూ.9,43,52,020 విలువైన స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. వాటిలో భవనాలు, భూములు, ఖాళీ స్థలాలతో కూడిన మొత్తం 12 స్థిరాస్తులను అటాచ్ చేయనుంది. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఐడీ ప్రతిపాదనకు హోమ్ శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై న్యాయస్థానం ఆమోదం కోసం సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. న్యాయస్థానం అనుమతి అనంతరం ఆ ఆస్తులను అటాచ్ చేస్తుంది. -
విశాఖ రీతి సాహ కేసు.. నలుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: సంచలనంగా మారిన రీతి సాహ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం కూడా మొదలైంది. తాజాగా నలుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. సాధన హాస్టల్‌కు చెందిన ఇద్దరు, బైజూస్ యజమాన్యానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో సాధన హాస్టల్ ఓనర్ లక్ష్మీ, వార్డెన్ కుమారి, ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్ సూర్యకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రామేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వీరి నిరక్ష్యం కారణంగానే రీతి సాహ చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. వెంకటరామ, కేర్ ఆసుపత్రిలో కూడా సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసు దర్యాప్తులో భాగంగా బెంగాల్ పోలీసులు, సీఐడీ విశాఖలోనే మకాం వేసి దూకుడు పెంచారు. ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులు.. అడ్డంగా బుక్కైనా నోరు విప్పని చంద్రబాబు -
మార్గదర్శిలో లోపాలను ప్రభుత్వం ఎత్తు చూపుతుంది
-
నల్ల‘మార్గ’o ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్టలో దాగిన ‘నల్ల’పాములు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అక్రమ డిపాజిట్ల గుట్టు తేల్చేందుకు సీఐడీ తీసుకుంటున్న చర్యలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బెంబేలెత్తుతోంది. రూ.కోటి దాటి అక్రమ డిపాజిట్లు చేసిన వారెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ చర్యలను వ్యతిరేకించడం ద్వారా అక్రమ డిపాజిట్ల సేకరణను మార్గదర్శి పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు పేర్కొన్నారు. బ్యాంకులను కాదని చిట్టీ కంపెనీలోనా? రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 బ్రాంచి కార్యాలయాల పరిధిలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులను సీఐడీ గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 800 మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. డిపాజిట్ చేసిన మొత్తం ఎలా ఆర్జించారు? ఆదాయ మార్గాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలను పాటించారా? అనే వివరాలను వెల్లడించాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ఆదేశించింది. అంత భారీ మొత్తాన్ని జాతీయ బ్యాంకులు, కేంద్ర ఆర్థిక సంస్థల్లో కాకుండా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో దాచడం సాధారణ అంశం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి కేవలం 5 శాతం వడ్డీనే చెల్లించడం, అదికూడా ఓ రశీదు జారీ చేసి సరిపుచ్చుతున్నా భారీగా డిపాజిట్లు చేయడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందో చెప్పాలి. పాన్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. ఆర్బీఐ, ఆదాయపన్ను, సీబీడీటీ అధికారుల దృష్టిలో పడుతుంది. ఆ వివరాలేవీ వెల్లడించేందుకు సుముఖంగా లేనివారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఇదే తరహా మోసంలో సహారా చైర్మన్‌కు జైలు శిక్ష బడాబాబుల నల్లధనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఓ వేదికగా మారిందన్న వాదనకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. అక్రమ డిపాజిట్ల ద్వారా భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలోనూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఇలాంటి వ్యవహారాలనే సాగించినట్లు ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించిన సహారా పరివార్ లాంటి సంస్థలు తమ డిపాజిట్‌దారుల వివరాలను గోప్యంగా ఉంచటాన్ని ప్రస్తావిస్తున్నారు. సహారా ఇండియా అక్రమ డిపాజిట్ల వ్యవహారం గుట్టు రట్టు కావడంతో సంస్థ చైర్మన్ సుబ్రతోరాయ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుకాయించబోయి దొరికిన రామోజీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికి సీఐడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో ఏ–1గా ఉన్న సంస్థ చైర్మన్ రామోజీరావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ డిపాజిట్‌దారులకు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. తాము చిట్‌ఫండ్స్ చట్టం, ఆదాయపన్ను చట్టాన్ని సక్రమంగా పాటిస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనలను పాటిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ అనుమతించడంలేదు. డిపాజిట్ల సేకరణపై సీబీడీటీ కింద పన్నులు చెల్లించాలి. అలా చెల్లించినట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎక్కడా చెప్పడం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకే ఆదాయపన్ను చట్టాన్ని పాటిస్తున్నట్లు మభ్యపుచ్చుతున్నట్లు స్పష్టమవుతోంది. -
మార్గదర్శిలో ‘నల్ల’ ఇంధనం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. చిట్‌ఫండ్స్ ముసుగులో సాగిన నల్లధనం దందాపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెలికి తీసేందుకు సిద్ధమైంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసి వేసిన 23 చిట్ గ్రూపులతోపాటు మరికొన్ని గ్రూపుల మూసివేతకు చర్యలు చేపట్టింది. ఆ చిట్టీల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రూ.కోటికిపైగా డిపాజిట్‌దారులకు నోటీసులు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి అంతకుమించి డిపాజిట్లు చేసినవారికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ల ముసుగులో నల్లధనం వ్యవహారాలను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లను వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ డిపాజిట్లకు సంబంధించి పూర్తి వివరాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ వెల్లడించలేదు. రశీదుల పేరిట భారీ ఎత్తున నల్లధనం దందా సాగిస్తున్నట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఆదాయ వివరాల పరిశీలన.. రాష్ట్రవ్యాప్తంగా 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో రశీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరాలను సీఐడీ సేకరించింది. డిపాజిట్‌దారుల వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సీఐడీ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించారు. మొదటి దశలో రూ.కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారికి నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ చేసిన ఆ మొత్తాన్ని ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా సేకరించారు? మార్గదర్శి చిట్ఫండ్స్లోనే ఎందుకు డిపాజిట్ చేశారు? తదితర వివరాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా దర్యాప్తు సంస్థకు ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారులు లిఖితపూర్వకంగా తెలిపే వివరాలను సీఐడీ అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలించి వాస్తవికతను నిగ్గు తేలుస్తారు. ఆర్బీఐ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు నిబంధనలను ఎందుకు పాటించలేదు? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేయనున్నారు. తద్వారా నల్లధనం వ్యవహారాలపై ఒక నిర్ధారణకు వస్తారు. అనంతరం తదుపరి చర్యలు చేపడతారు. మూసివేసిన చిట్టీల నిర్వహణకు ప్రత్యేక అధికారి! కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థకు చెందిన 23 చిట్టీ గ్రూపులను మూసివేయాలని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు చిట్టీ గ్రూపుల మూసివేత దాదాపు పూర్తయ్యింది. మరిన్ని గ్రూపులను మూసివేసే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈమేరకు ఇప్పటికే గుర్తించిన అక్రమాలతో నివేదికను రూపొందిస్తున్నారు. మూసివేసిన చిట్టీల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధీకృత అధికారిని నియమించడానికి సన్నద్ధమవుతున్నారు. మూసివేసిన చిట్టీల గ్రూపుల్లోని చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిట్టీ పాట పాడిన చందాదారులు మిగిలిన వాయిదాలను చెల్లించాలి. మూసివేసిన చిట్టీ గ్రూపుల చందాదారులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ పర్యవేక్షణకు అధీకృత అధికారిని నియమిస్తూ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. -
మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజ కిరణ్ తాము గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు, రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హాజరుకాలేమని ఈ–మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లించడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఉన్న చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించారు.. కాబట్టి నిందితులిద్దర్నీ ఏపీలో విచారించడం సరైందని సీఐడీ అధికారులు భావించారు. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం మరోవైపు.. హైదరాబాద్‌లో విచారణ సందర్భంగా సీఐడీ అధికారులను తమ నివాసంలోకి అనుమతించకుండా రామోజీరావు తన సిబ్బంది ద్వారా చాలాసేపు అడ్డుకోవడం గమనార్హం. దీంతో ఈ నెల 5న గుంటూరులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రామోజీరావు, శైలజ కిరణ్‌లకు సీఐడీ అధికారులు సీఆర్పీసీ 41(ఏ) కింద గత నెల 22న నోటీసులు జారీచేశారు. చదవండి: మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్ -
విచారణకు శైలజా కిరణ్ సహకరించలేదు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించడంలేదని, అయినప్పటికీ తాము చట్టానికి లోబడే విచారణ జరుపుతున్నామని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఈనాడు, ఈటీవీ మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే సీఐడీ విచారణపై నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము శైలజ కిరణ్‌ను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని, .ఆమె పట్ల పూర్తి మర్యాదతో వ్యవహరించామని చెప్పారు. ఆమె భోజనం, టీ, మందుల కోసం అవసరమైన ప్రతిసారీ అవకాశం కల్పించామన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు కచ్చితమైన ఆధారాలు లభించాయని రవికుమార్ స్పష్టం చేశారు. విచారణ కోసం మంగళవారం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు. ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు. శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ
సాక్షి, అమరావతి: మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు సాగుతుందని ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం సీఐడీకి లేదని, విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం. ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడం లేదన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ చేస్తున్నాం మార్గదర్శిలో చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయి. చట్టం పరిధిలోనే విచారిస్తున్నాం. మేము ఎక్కడ వేధించలేదు. మేము వారి పట్ల పూర్తి మర్యాదగా వ్యవహరించి విచారిస్తున్నాం. వారికి భోజనం, టీ, మందులకు అవసరమైన స్వేచ్ఛ కూడా ఇస్తున్నాం. నిజం రాబట్టడం కోసం పారదర్శకంగా విచారణ చేస్తున్నాం. వాళ్లు సమాధానం లేక చెప్పిందే చెబుతున్నారు’’ అని రవికుమార్ పేర్కొన్నారు. చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు ‘‘నిన్న మేము విచారణకు వెళ్లినప్పుడు 10 మంది ని ఆబ్జెక్ట్ చేశారు. టెక్నికల్ ఆఫీసర్స్‌ను తీసుకెళ్లొద్దని అభ్యంతరం తెలిపారు. ఎండి శైలజ మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు.ఎండిగా ఈ సమాచారం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. 25 శాతం ప్రశ్నలకు మాత్రమే ఎండి శైలజ సమాధానం చెప్పారు. వెళ్లిన ప్రతిసారి ఎదో వంకలు పెట్టి ఆలస్యం చేస్తున్నారు. మేము మళ్లీ ఎండి శైలజను విచారణ చేస్తాం. అవసరమైనప్పుడు మళ్లీ రామోజీరావుని కూడా విచారిస్తాం’’ అని రవికుమార్ తెలిపారు. -
నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు
తమ చందాదారుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో తెలియదు! బ్రాంచీలు, ప్రధాన కార్యాలయంలో ఉన్న నిధులెన్నో తెలియదు! మిగిలిన నిధులను ఎక్కడికి మళ్లించారో కూడా తెలియదు! కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం గురించి ఏమాత్రం తెలియదు! అసలు నాకేమీ తెలియదు.. తెలియదు.. తెలియదు!! –సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజ తీరు ఇదీ సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–2గా ఉన్న సంస్థ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లో మరోసారి విచారించారు. సీఐడీ ఎస్పీలు అమిత్ బర్దర్, హర్షవర్థన్‌రాజు, విచారణ అధికారి రవికుమార్‌తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకోగా దాదాపు అరగంటపాటు గేటు తాళం తీయలేదు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. ‘మీరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ కదా? మీ పేరిటే చెక్ పవర్ కూడా ఉంది. నిధుల మళ్లింపుపై ఆధారాలు ఇవిగో..! మరి వీటిపై ఏమంటారు..?’ అని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో ‘నాకు ఆరోగ్యం బాగా లేదు! నేను సమాధానాలు చెప్పలేకపోతున్నా.. ఇబ్బంది పెట్టొద్దు..’ అంటూ శైలజా కిరణ్ తప్పించుకునేందుకు యత్నించారు. విచారణకు సహకరించకుండా.. తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ శైలజా కిరణ్ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేశారు. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు. సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేపట్టిన కొద్దిసేపటికే మరోసారి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని శైలజా కిరణ్ పేర్కొన్నారు. విచారణను అర్ధాంతరంగా ముగించేందుకు ప్రయత్నించగా సీఐడీ అధికారులు పూర్తి సహనం వహిస్తూ విచారణను కొనసాగించారు. మళ్లించాం... ఎక్కడికో తెలియదు! మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని తెలుసుకోవడంపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం రూ.వేల కోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్లు తేలింది. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన రూ.793.50 కోట్లను అటాచ్ చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్లించారన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. సీఐడీ అధికారులు అదే విషయంపై శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలోని 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా వసూలు చేసిన చందా నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని పేర్కొనట్లు సమాచారం. నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. దీనిపై సీఐడీ అధికారులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని శైలజా కిరణ్ చెప్పడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందని సీఐడీ అధికారులు శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. చందాదారుల సొమ్ము భద్రంగా ఉందంటూ తప్పించుకునే యత్నం చేశారు. అదే నిజమైతే చిట్టీల మొత్తం ఎందుకు చెల్లించలేకపోతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె స్పందించలేదు. మరోసారి విచారణ విచారణకు శైలజా కిరణ్ సహకరించకపోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారించాలని భావిస్తున్నారు. ఈమేరకు త్వరలో మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తరువాత రామోజీరావును కూడా మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి... నిధులు కొల్లగొట్టి! మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ద్వారా చెరుకూరి రామోజీరావు, శైలజ భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి ఆర్థిక అక్రమాలను నిర్ధారించారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను సంబంధిత బ్రాంచీ కార్యాలయాలున్న నగరాలు/పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలి. అందుకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ రూ.వేల కోట్లను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించింది. చిట్‌ఫండ్స్ సంస్థలు తమ నిధులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం తమ చందాదారుల నిధులను అత్యంత మార్కెట్ రిస్క్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లోకి మళ్లించింది. తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. చిట్‌ఫండ్స్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారుల చిట్టీల మొత్తాన్ని పూర్తిగా వారికి ఇవ్వకుండా రశీదులిస్తూ 4 – 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోంది. పెద్ద ఎత్తున నల్లధననాన్ని తమ సంస్థ ముసుగులో చలామణిలోకి తెస్తున్నట్లు కూడా సీఐడీ గుర్తించింది. గత డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్ నిలిచిపోయింది. చందాదారుల సొమ్మును గుర్తుతెలియని సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది. ఆ నిధులు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. దీంతో చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేకపోతోంది. -
‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లను నిలువునా ముంచేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేసిన జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ గత పాలకవర్గ సభ్యుల ఆస్తులను సీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సీఐడీ ఆ దిశగా దూకుడు పెంచింది. నిన్న మొన్నటివరకు మార్గదర్శి కుంభకోణాన్ని ఛేదించడంలో నిమగ్నమైన సీఐడీ ఇప్పుడు తాజాగా ‘జయలక్ష్మి’పై దృష్టిపెట్టింది. కాకినాడ సర్పవరంలోని జయలక్ష్మి మెయిన్ బ్రాంచిలో రెండ్రోజులుగా సీఐడీ బృందం పాత పాలకవర్గ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సహా డైరెక్టర్లు వ్యూహాత్మకంగా ముందుగానే అమ్మేసిన ఆస్తుల సీజ్‌కు రికార్డులను సిద్ధంచేసింది. జామీను దొరక్కపోవడంతో జైలులోనే.. ఏప్రిల్‌లో కాకినాడ సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బోర్డు తిప్పేసి 19,911 మందికి చెందిన రూ.520 కోట్ల డిపాజిట్లు కొల్లగొట్టేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల్లో 29 బ్రాంచీలను ఏర్పాటుచేసి ఈ మోసానికి తెగబడ్డారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరి డిపాజిటర్ వరకు న్యాయం చేసేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇందులో భాగంగా సీఐడీని రంగంలోకి దించడంతో చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షి, 11 మంది సహా డైరెక్టర్లపై కేసులు నమోదుచేయడానికి, ముగ్గురు మినహా అందరినీ అరెస్టుచేయించడానికి వీలు చిక్కింది. ఆంజనేయులు, విశాలాక్షి, డైరెక్టర్లకు బెయిల్ మంజూరైనప్పటికీ జామీను ఇవ్వడానికి ఎవరు ముందుకురాకపోవడంతో వారంతా ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఆస్తులు సీజ్ చేస్తున్న సీఐడీ ఈ క్రమంలో.. గత పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్పర్సన్ సహా డైరెక్టర్ల పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పాలకవర్గ చైర్మన్ గంగిరెడ్డి త్రినాథ్‌రావు సమక్షంలో సీఐడీ బృందం గురు, శుక్రవారాల్లో కాకినాడ మెయిన్ బ్రాంచిలో రికార్డులను పరిశీలించింది. ఒక్క కాకినాడ జిల్లాలోని ఎనిమిది బ్రాంచీల వివరాలు సేకరిస్తేనే కోట్ల విలువైన చర, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు తేలింది. సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సీఐడీ సీఐ పైడప్ప నాయుడు, ఆరుగురు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం రికార్డులు, గత పాలకవర్గ సభ్యుల పేరుతో ఉన్న డాక్యుమెంట్లను సేకరించి ఆస్తులను సీజ్ చేసే పనిలో నిమగ్నమైంది. వీటిపై చట్టపరంగా ఆంజనేయులు, విశాలాక్షి సహా డైరెక్టర్లకు ఎటువంటి హక్కుల్లేవని సీఐడీ తేల్చింది. ఆర్నెల్ల ముందు నుంచే అమ్మకానికి ఆస్తులు.. ఇక విశాలాక్షి, భర్త, కుమారులు కలిసి బ్యాంకు బోర్డు తిప్పేయడానికి ఆర్నెల్ల ముందునుంచే తమ పేరుతో ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టేశారు. కాకినాడలో ఒక మార్ట్.. రామారావుపేట, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న నాలుగు చర, స్థిరాస్తులతో పాటు ఎనిమిది ఎకరాల భూమిని కూడా ఆమె విక్రయించినట్లుగా గుర్తించారు. అలాగే, విశాలాక్షి పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న మొత్తం 64 ఆస్తులనూ సీజ్ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. సుమారు రూ.120 కోట్ల విలువైన ఆస్తులు అమ్మేసినట్లు తేలింది. వాటిలో కాకినాడ ఎస్ఈజడ్లో 30 ఎకరాలు ఉంది. ఇలా కొనుగోలుచేసి తిరిగి అమ్మేసిన ఆస్తులను సీజ్ చేయడంపై సీఐడీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఆస్తులను కొనుగోలు చేసిన వారికి సీఐడీ నోటీసులు సిద్ధంచేస్తోంది. వారిపై చార్జిషీట్లు కూడా వేయనుంది. సీఐడీ దూకుడుతో వారంతా బయటకు.. బ్యాంకు నుంచి రూ.120 కోట్లు వరకు రుణాలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఉన్న వారంతా ఇప్పుడు సీఐడీ దూకుడుతో బయటకొస్తున్నారు. నోటీసులు తీసుకుని 50 రోజులు దాటినా స్పందించని వారు సీఐడీ జోరుతో రుణాలు జమచేసేందుకు రుణగ్రహీతలు ముందుకొస్తున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా రుణగ్రస్తుల ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లుగా లెక్కతేలింది. 30శాతం తిరిగి చెల్లింపు? ఇక డిపాజిటర్లకు తొలి విడతగా మొత్తం డిపాజిట్లలో 30 శాతం తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకల్లా బాధితులకు రూ.100 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు 3 కోట్లు వసూలయ్యాయి. డిపాజిటర్లలో 14వేల మంది రూ.లక్ష నుంచి రూ.4 లక్షలలోపు డిపాజిట్ చేసిన వారే. రూ.26 కోట్లు తిరిగి ఇచ్చేస్తే మూడొంతులు మంది బాధితులు జయలక్ష్మి కుంభకోణం నుంచి బయటపడతారు. మరోవైపు.. సివిల్, అండ్ క్రిమినల్ కేసుల ప్రకారం ముందుకెళ్లే అవకాశముండడంతో జూలై 10 నాటికి జమచేస్తామని రుణాలు తీసుకున్న వారు చెబుతున్నారు. – గంగిరెడ్డి త్రినాథ్‌రావు, చైర్మన్, కాకినాడ జయలక్ష్మి సొసైటీ -
మార్గదర్శి కేసు: ఈనెల 6న శైలజాకిరణ్‌ను విచారించనున్న సీఐడీ
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఆ సంస్థ ఎండీ చెరుకూరి శైలజాకిరణ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ ఆమె ఆ నోటీసులపై సీఐడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజాకిరణ్‌ను ఇప్పటికే సీఐడీ హైదరాబాద్‌లో వారి నివాసంలో వేర్వేరుగా విచారించింది. ఈ కేసులో మరోసారి విచారించాల్సి ఉంటుందని ఆమెకు సీఐడీ విభాగం ఇటీవల సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లో ఆమె అందుబాటులో ఉండే తేదీలు తెలపాలని సూచించింది కూడా. జూన్ 3 తరువాత తాను విచారణకు అందుబాటులో ఉంటానని ఆమె సీఐడీకి తెలిపారు. దీంతో జూన్ 6న హైదరాబాద్‌లో శైలజాకిరణ్ నివాసంలోనే ఆమెను విచారిస్తామని సీఐడీ నోటీసులిచ్చింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఆమెగానీ ఆమె తరఫు న్యాయవాదులుగానీ సీఐడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన సీఐడీ అధికారులు ఇటీవల ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆమె విమానాశ్రయానికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అల్లూరి జయంతి వేడుకలకు రాష్ట్రపతి ముర్ము -
హెరిటేజ్ పై సీఐడీ ఫోకస్...!
-
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ దూకుడును గురువారం మరింతగా పెంచింది. చందాదారుల సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా మళ్లింపు, అక్రమ డిపాజిట్ల వ్యవహారాల్లో ఏ1 చెరుకూరి రామోజీ రావు, ఏ 2 చెరుకూరి శైలజాకిరణ్‌కు సహాయకారిగా వ్యవహరించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏడుగురు కీలక అధికారుల విచారణ చేపట్టింది. ఈ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏపీలోని చందాదారుల నిధుల అక్రమ మళ్లింపులో సాధనంలా వ్యవహరించారు. నిధుల మళ్లింపునకు చెక్‌పవర్ కలిగిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని వైస్ ప్రెసిడెంట్లు సీహెచ్ సాంబమూర్తి, రాజాజీ, పి.మల్లికార్జున రావు, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకట స్వామి, ఫైనాన్స్ జనరల్ మేనేజర్ టి.హరగోపాల్, జనరల్ మేనేజర్లు ఎల్.శ్రీనివాసరావు, జె.శ్రీనివాసరావును విచారించి ముఖ్యమైన ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం సంబంధిత బ్రాంచి మేనేజర్ (ఫోర్‌మెన్)కు చెక్ పవర్ ఉండాలి. కానీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో బ్రాంచి మేనేజర్లకు రూ.500 వరకు మాత్రమే చెక్ పవర్‌ను పరిమితం చేయడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్‌తో పాటు మరో 11 మందికి నిబంధనలకు విరుద్ధంగా చెక్ పవర్ కేటాయించి నిధుల అక్రమ బదిలీకి పాల్పడ్డారు. అందులో ప్రధాన భూమిక పోషించిన ఈ ఏడుగురిని విచారించి కీలక ఆధారాలు రాబట్టడంతో పాటు వారి స్టేట్మెంట్ సీఐడీ నమోదు చేసుకుంది. ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో ట్విస్ట్.. రామోజీకి బిగుస్తున్న ఉచ్చు! -
ఫింగర్ ప్రింట్స్ కోసం సీఐడీకి అధునాతన కిట్లు
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు వాటిని ఛేదించేందుకు ఫింగర్ ప్రింట్స్ కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫింగర్ ప్రింట్స్ సేకరణ, తరువాత వాటిని విశ్లేషించడానికి అవసరమైన అధునాతన కిట్స్‌ను రాష్ట్ర సీఐడీ విభాగం సమకూర్చుకుంది. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఫింగర్ ప్రింట్ కిట్స్‌ను సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆరు జోన్లలోని అధికారులకు అందజేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లోని ఎల్బీ నగర్ జోన్, సైబరాబాద్‌లోని శంషాబాద్ జోన్, హైదరాబాద్ నగరంలోని సౌత్, నార్త్, వెస్ట్, సెంట్రల్ జోన్లకు ఈ కిట్లను అందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఫింగర్ ప్రింట్ యూనిట్లకు వీటిని అందచేయనున్నట్లు మహే ష్భగవత్ చెప్పారు. సీఐడీలోని ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ తాతా రావు మాట్లాడుతూ ఒక్కో కిట్‌లో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయని తెలిపారు. మాస్టర్ ఎక్స్పర్ట్ లేటంట్ ప్రింట్ కిట్, ఫింగర్ ప్రింట్ కెమికల్ ప్రాసెసింగ్ కిట్, లెటంట్ బ్రషెస్, మాగ్నటిక్ పౌడర్ అప్లికేటర్, పోస్టు మార్టమ్ ఇంక్ టూల్, ఇంక్డ్ స్ట్రిప్స్, మాగ్నటిక్ పౌడర్స్, లెటెంట్ ప్రింట్ బేసిక్ పౌడర్స్, పోర్టబుల్ మల్టీబాండ్ లైట్సోర్స్ ఉంటాయి. కార్యక్రమంలో సీఐడీ అధికారులు ఎం.నారాయణ(అడ్మిన్), ఆర్ వెంకటేశ్వర్లు(ఎస్సీఆర్బీ) రవీందర్(నార్కొటిక్స్), డీఎస్పీ నందుకుమార్(ఎఫ్‌పీబీ) పాల్గొన్నారు. -
మార్గదర్శి అక్రమాలపై కొనసాగుతున్న సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాలపై సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో మార్గదర్శి బ్రాంచీల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి రశీదు డిపాజిట్ల ముసుగులో భారీగా బ్లాక్‌మనీ మార్పిడి జరిగిందని, ఆ నల్లధనాన్నే తమ సంస్థల్లో పెట్టుబడులుగా రామోజీ తరలించినట్లు సీఐడీ గుర్తించింది. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. రికార్డులు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సీఐడీ పరిశీలించింది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, ఏలూరు, అనంతపురం మార్గదర్శి బ్రాంచీల్లో సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్‌ఫండ్ అక్రమాలు, నిధులు దారిమళ్లింపుపై విచారణ జరుపుతుంది. ఇప్పటికే హైదరాబాద్ మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఎండీ శైలజాకిరణ్‌పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి.. -
నల్ల ‘మార్గం’లో! పయనించిన మార్గదర్శి.. గుర్తించిన సీఐడీ
సాక్షి, అమరావతి: భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించింది. రశీదుల రూపంలో బ్రాంచీ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి చేరిన భారీ నిధుల వెనుక మనీ లాండరింగ్ ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సేకరించింది. చందాదారుల నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అభియోగాలతో ఏ–1గా మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజా కిరణ్, ఏ–3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతోపాటు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు అవకతవకలను గుర్తించారు. ఆ సోదాలకు కొనసాగింపుగా తాజాగా 7 చోట్ల మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచీ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. విశాఖ (సీతంపేట), రాజమహేంద్రవరం (శ్యామల థియేటర్ బ్రాంచి), ఏలూరు (నర్సింగరావుపేట బ్రాంచి), విజయవాడ (లబ్బిపేట బ్రాంచి), గుంటూరు (అరండల్ పేట), నరసరావుపేట (సత్తెనపల్లి రోడ్ బ్రాంచి), అనంతపురం (లక్ష్మీనగర్ బ్రాంచి)లోని మార్గదర్శి కార్యాలయాల్లో ఉదయం 10కి మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగుతున్నాయి. చట్ట ప్రకారం నిర్వహించాల్సిన 12 రికార్డులకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ అధికారుల సోదాల సందర్భంగా గుర్తించినట్లు సమాచారం. ఏటా దాదాపు రూ.600 కోట్ల వరకు నగదు రూపంలో మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా బదిలీ చేసినట్లు గతంలో గుర్తించారు. ఆ నిధులను బ్రాంచి కార్యాలయాల నుంచి ఏ తేదీల్లో అక్రమంగా తరలించారనే అంశాలపై తాజా సోదాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ఏటా మార్చి 31న వచ్చినట్లు చూపిస్తున్న దాదాపు రూ.500 కోట్లకు పైగా చెక్కులకు సంబంధించిన వివరాలను సంబంధిత బ్రాంచి కార్యాలయాల రికార్డుల్లో నమోదు చేస్తున్నారా? అనే అంశాన్ని పరిశీలించారు. ఇక రశీదుల రూపంలో డిపాజిట్లు వివిధ బ్రాంచి కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు మార్గదర్శి చూపిస్తోంది. అయితే అందుకు సంబంధించిన రికార్డులు బ్రాంచి కార్యాలయాల్లో లేవని వెల్లడైనట్లు తెలుస్తోంది. రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల నిధులనే రామోజీరావు తమ కుటుంబ సంస్థల్లోకి మళ్లించినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. ప్రధాన కార్యాలయం, బ్రాంచీల రికార్డులకు ఎక్కడా పొంతన లేదని వెల్లడైంది. తాజా సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ సోదాలు మరికొద్ది రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. -
మార్గదర్శి హెడ్ ఆఫీస్‌లో కొనసాగుతున్న సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి హెడ్ ఆఫీసులో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాలెన్స్ షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏ1 రామోజీ, ఏ2 శైలజను సీఐడీ విచారించింది. అయితే, విచారణలో డాక్యుమెంట్లను చూపేందుకు రామోజీ, శైలజ నిరాకరించారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా నగదు మళ్లించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. వైఎస్ ఛైర్మన్, ఫైనాన్స్ డైరెక్టర్లను విచారించిన సీఐడీ.. మరో నలుగురు కీలక ఉద్యోగులను పశ్నించింది. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ, శైలజ, ఉద్యోగుల స్టేట్మెంట్లను సీఐడీ పరిశీలించింది. మార్గదర్శి ఫండ్స్ పెట్టుబడుల రూపంలో ఇతర కంపెనీలకు మళ్లించారు. మార్గదర్శి కస్టమర్ల సొత్తును రిస్క్ ఎక్కువగా ఉండే షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ రంగంలో యాజమాన్యం పెట్టుబడులు పెట్టింది. కస్టమర్ల చిట్స్ కోసం సేకరించిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మార్గదర్శి యాజమాన్యం జమ చేసుకుంది. మనీలాండరింగ్ జరిగినట్లు ఏపీ సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దర్యాప్తు జరపాలని ఈడీ, సీబీడీటీకీ సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. చదవండి: ‘చెక్కు’తో చిక్కారు!.. -
చట్టాలకు రామోజీ అతీతుడా! చట్టాన్ని ఇప్పుడే తెచ్చినట్లు ‘ఎల్లో’ పెడబొబ్బలు
సాక్షి, అమరావతి: ఇది నా దేశం... అనుకున్న వాళ్లెవరైనా ఇక్కడి చట్టాలను గౌరవించి తీరాలి. ఆ చట్టాలకు లోబడే పనిచేయాలి. అసలు ఒక వ్యాపారం చేస్తూ... ఆ వ్యాపారాన్ని ఏ చట్టం కింద రిజిస్టర్ చేశారో ఆ చట్టం తనకు తెలియనే తెలియదని... దాన్ని తాను పాటించనని నిస్సిగ్గుగా... నిర్భీతిగా చెప్పే మనుషులను ఏం చేయాలి? తమకు ఏ చట్టాలూ వర్తించవని చెప్పే పెద్ద మనుషుల్ని ఏమనాలి? ఇక్కడైతే చెరుకూరి రామోజీరావు అనో... చెరుకూరి శైలజా కిరణ్ అనో పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే నాటి మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి నేటి మార్గదర్శి చిట్స్ వరకూ... మేం డిపాజిట్లు సేకరించలేదని కానీ, మేం నిధులు మళ్లించలేదని గానీ వాళ్లు చెప్పటం లేదు. చట్టప్రకారం అలా చెయ్యకూడదు కదా? అంటే... ఆ చట్టాలేవీ తమకు వర్తించవంటున్నారు. ఆ చట్టాలు తాము పాటించబోమని చెబుతున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో... ఆ కంపెనీ ద్వారా తాము చేసినవన్నీ చట్ట విరుద్ధమైన పనులే అని తేలటంతో... తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఏకంగా ఆ సంస్థనే మూసేశారు. ఇపుడు ఆ సంస్థే లేదు కదా? అని వాదిస్తున్నారు. ఒక బ్యాంకు తన వద్దకు వచ్చిన డిపాజిట్లను ఇష్టం వచ్చినట్లు సొంత అవసరాల కోసం వాడేయొచ్చా? సొంత కంపెనీల్లోకి మళ్లించొచ్చా? అలా మళ్లిస్తే బ్యాంకు కుప్పకూలిపోదా? కృషి, చార్మినార్.. ప్రుడెన్షియల్ బ్యాంకుల నుంచి బిచాణా ఎత్తేసిన బ్యాంకులన్నీ ఇలా చేసినవే కదా? మార్గదర్శి చిట్స్‌లో ప్రస్తుతం వేలకోట్ల రూపాయల మనీ లాండరింగ్, అక్రమ నిధుల మళ్లింపు జరుగుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రబుత్వం విచారణ జరుపుతోంది. నిజాలు బయటికొస్తున్నాయి. కానీ దీన్ని ఈ నిజాలు వెలుగుచూడకుండా 86 ఏళ్ల రామోజీరావు కొత్త నాటకానికి తెరతీశారు. ‘ఈనాడు’ పత్రికను అడ్డంపెట్టుకుని, తటస్థుల ముసుగులో తన వాళ్లను తెరపైకి తెస్తున్నారు. అడ్డగోలు బుకాయింపులకు దిగుతున్నారు. మార్గదర్శిపై ఏ ఒక్క ఫిర్యాదూ రాలేదు కదా? అలాంటపుడు సీఐడీ విచారణ ఎందుకంటున్నారు. ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నందుకే ప్రభుత్వం కక్ష గట్టి ఇలా చేస్తోందని... తన వాళ్లచేత కేంద్రానికి లేఖలు కూడా రాయిస్తున్నారు. ఇక్కడ మార్గదర్శిలో చిట్లు వేస్తున్నవారు, డిపాజిటర్లు గమనించాల్సింది ఒక్కటే. యావత్తు దేశాన్ని కుదిపేసి దివాలా తీసిన శారదా చిట్ఫండ్స్గానీ, వేల మందిని ముంచేసిన సుదర్శన్ చిట్స్గానీ కూలిపోవటానికి ముందు చాలా బలంగా కనిపించినవే కదా? కూలిపోయేదాకా వాటిపై ఎవ్వరూ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదే!!. ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోబట్టే... చట్టాలు ఉల్లంఘిస్తున్నా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్లే అవి కుప్పకూలాయి. వేల మంది దాచుకున్న కష్టార్జితాన్ని స్వాహా చేసేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్గదర్శి చిట్స్‌ను... చట్టప్రకారం నడుచుకోవాలని కోరటం తప్పా? చట్టాలను అనుసరించాలని అడగటం నేరమా? ఇదెక్కడి తీరు!!. అయినా డిపాజిట్లు సేకరించకూడదన్న ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఎన్ని ఎన్బీఎఫ్సీలు మూతపడలేదు? కనీసం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎన్బీఎఫ్సీ కూడా కాదు. ఒక 50 మంది చిట్ సభ్యులుంటే... ప్రతినెలా ప్రతి ఒక్కరి దగ్గరా సొమ్ములు వసూలు చేసి.. వాటిని చిట్ పాడుకున్న ఎవరో ఒక్కరికి ఆ నెల్లోనే ఇవ్వటం దాని పని. మరి ప్రతినెలా అలా ఎవరి చిట్ల డబ్బులు వాళ్లకు ఇచ్చేస్తున్నపుడు వేల కోట్ల రూపాయల మిగులు మొత్తాలు దానిదగ్గర ఎలా ఉంటాయి? వాటిని తన సొంత సంస్థల్లోకి మళ్లించే అధికారం ఎవరిచ్చారు? వాటిని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్‌చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఉల్లంఘనలు కావా? పత్రికాధిపతి... వ్యాపారవేత్త అనే రెండు టోపీల్ని రామోజీరావు ధరిస్తుంటారని... వ్యాపారాల్లో అక్రమాలేవైనా బయటపడినపుడి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోబోయినపుడల్లా... అది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ఎదురుదాడికి దిగుతారని సాక్షాత్తూ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే గతంలో చెప్పింది. గతమంతా రామోజీ చేసింది ఇదే. కాకపోతే ఇపుడలా మాటలు పనిచేయటం లేదు. నమ్మేవారెవరూ లేరు. దీంతో ఆ మాటలు తాను చెప్పకుండా... తటస్థుల ముసుగులో తనకు కొమ్ముకాసే కొందరితో చెప్పిస్తున్నారు. అయినా అక్రమాలు చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై చర్యలు తీసుకుంటుంటే మధ్యలో ఈ తటస్థులెవరు? వీళ్లేమైనా మార్గదర్శిలో చిట్లు వేస్తున్నవారా? వీళ్లకేం సంబంధం? వీళ్లకసలు అక్రమాలకు పాల్పడుతున్న రామోజీని రక్షించే బాధ్యతను ఎవరిచ్చారు? రామోజీరావా... చంద్రబాబు నాయుడా? ఈ చట్టాలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాదే? కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999లను ఉల్లంఘించి నిధులు మళ్లించినట్టు, అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆ శాఖ అధికారుల ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీన్ని వక్రీకరిస్తూ రామోజీరావు మీడియా, చంద్రబాబు పార్టీ గగ్గోలు పెడుతున్నాయి. నిజానికి ఈ రెండు చట్టాలూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసినవేమీ కావు. చిట్‌ఫండ్ చట్టాన్ని కేంద్రం 1982లో రూపొందించింది. ఇక ఏపీ డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తెచ్చింది 1999లో చంద్రబాబు ప్రభుత్వమే. వాటిని అమలు చేస్తుంటే... దాన్ని రామోజీరావుపై వేధింపులుగా వక్రీకరిస్తున్నారు. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ తరవాత దివాలాయే!! చిట్‌ఫండ్ చట్టాన్ని, డిపాజిటర్ల చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందన్నట్టుగా రామోజీరావు, ఆయన మనుషులు, టీడీపీ ప్రజల్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. సామాన్యుల డబ్బు భద్రంగా ఉండటం కోసం చేసిన ఆ చట్టాలను ఉల్లంఘిస్తే ఏమవుతుందో... దేశంలో బట్టబయలైన ఎన్నో చిట్‌ఫండ్ కుంభకోణాలు, ప్రైవేట్ బ్యాంకుల ఆర్థిక దోపిడీలు నిరూపించాయి కూడా... శారదా చిట్‌ఫండ్... 4.90 లక్షల కోట్ల భారీ దోపిడీ 2013లో బట్టబయలైన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం దేశంలోనే సంచలనం సృష్టించింది. పశ్చిమబెంగాల్, అసోం, త్రిపురలలో డిపాజిట్‌దారుల నుంచి ఏకంగా 4.90 లక్షల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించింది. అధికవడ్డీల ఆశ చూపించి పోంజీ తరహా మోసానికి పాల్పడింది. 2013లో శారదా చిట్‌ఫండ్ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఏకంగా 17 లక్షల మంది ఆ సంస్థ ఖాతాదారులు నిండా మోసపోయారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా పోంజీ తరహా మోసానికే పాల్పడుతోందని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో వెల్లడి కావడం గమనార్హం. రూ.6,380కోట్ల అగ్రిగోల్డ్ కుంభకోణం చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే రాష్ట్రంలో వెలుగుచూసిన మరో ఆర్థిక మోసం అగ్రిగోల్డ్. గొలుసుకట్టు తరహాలో 8 రాష్ట్రాల్లో ఏకంగా రూ.6,380 కోట్ల డిపాజిట్లు సేకరించింది. అందులో రూ.3,996కోట్లు డిపాజిట్లు ఆంధ్ర ప్రదేశ్‌లో సేకరించినవే. ఇష్టం వచ్చినట్లుగా నిధుల్ని మళ్లించి సంస్థ బోర్డు తిప్పేసింది. ఫలితం... కష్టార్జితాన్ని దాచుకున్న 32 లక్షల మంది డిపాజిట్‌దారులు రోడ్డునపడ్డారు. వారిలో అత్యధికంగా 19.50 లక్షలమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. అగ్రిగోల్డ్ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని గుర్తించినా నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ సంస్థకు చెందిన హాయ్లాండ్తోపాటు అమరావతిలో భూములను కొల్లగొట్టేందుకే చంద్రబాబు, లోకేశ్ ప్రాధాన్యమిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక దశలవారీగా డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తూ వస్తోంది. పాతికేళ్ల కిందటే... ‘కృషి’ బ్యాంకు చంద్రబాబు సీఎంగా ఉండగా 2001లో కృషి బ్యాంకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఖాతాదారులను బురిడీ కొట్టించింది. అత్యధిక వడ్డీల ఆశ చూపించిన ఈ బ్యాంకు ఛైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు... రూ.35కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టారు. అనధికారిక లెక్కల ప్రకారం ఈ డిపాజిట్లు రూ.100 కోట్లకుపైనే ఉంటాయని సమాచారం. కొసరాజు ఆ నిధులను ఇతర సంస్థల్లోకి అక్రమంగా మళ్లించి చివరికి 2001లో చేతులెత్తేసి విదేశాలకు పారిపోయాడు. ప్రుడెన్షినల్... పాపులర్.. ఏదైనా అంతే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2003లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో భారీ ఆర్థిక మోసం... ప్రుడెన్షియల్ బ్యాంకు. ఏకంగా రూ.550 కోట్ల మేర డిపాజిట్‌దారులను మోసం చేసింది ఆ సంస్థ. ఇక కేరళ కేంద్రంగా డిపాజిట్లు సేకరించిన పాపులర్ ఫైనాన్స్ సంస్థ ఏకంగా రూ.2వేల కోట్లమేర డిపాజిటర్లను మోసం చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 274 బ్రాంచులతో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ 2022లో బోర్డు తిప్పేసి డిపాజిటర్లను ముంచేసింది. వీటన్నింటినీ మించిపోయిన మార్గదర్శి... పైన పేర్కొన్న సంస్థలను తలదన్నే రీతిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందని ఆధారాలతో సహా వెల్లడైంది. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు గత ఏడాది నవంబరు, డిసెంబర్లలో మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. అనంతరం సీఐడీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సోదాల్లోనూ ఈ అక్రమాలు ధ్రువపడ్డాయి. ► రశీదు ముసుగులో అక్రమ డిపాజిట్లు: చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 నుంచి 5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తుస్తోంది. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధం. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడం నేరం. మార్గదర్శి చిట్స్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఈ అక్రమ డిపాజిట్లు ఎన్ని వేల కోట్లు అన్నది లెక్కతేలాల్సి ఉంది. ► గతంలో రూ.15వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరణ: మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన నేర చరిత్ర మార్గదర్శి గ్రూపునకు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. దాంతో హడావుడిగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసేశారు. కేసు దర్యాప్తులో ఉండగా సంస్థను మూసివేయడం అంటే ఆధారాలను ధ్వంసం చేయడమే. అది క్రిమినల్ నేరం. ► చందాదారుల సొమ్ము సొంత పెట్టుబడిగా...: మార్గదర్శి చిట్స్‌కు మూడు అనుబంధ కంపెనీలున్నట్టుగా బ్యాలన్స్ షీట్లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించడానికే ఈ కథ. ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాకోసం పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. అంటే రామోజీరావు కుటుంబం రూపాయి పెట్టకుండా...చందాదారుల సొమ్ముతోనే సొంత వ్యాపారాలు చేస్తున్నారు. అసలు చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం చిట్ ఫండ్ చట్టం–1982కు విరుద్ధం. ► మార్గదర్శి చిట్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడుతోంది. ఇది చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధం. ► రికార్డుల కనికట్టు...: చట్ట విరుద్ధంగా చేస్తున్న ఈ మోసాన్ని కప్పిపుచ్చేందుకు మార్గదర్శి చిట్స్ రికార్డుల్లో భారీ అవకతవకలకు పాల్పడుతోంది.చందాదారుల సొమ్ము చెక్కుల రూపంలో తమ వద్ద ఉన్నట్టుగా బ్యాలన్స్షీట్లో చూపిస్తోంది. ఏటా మార్చి 31న వందల కోట్ల రూపాయలు చెక్కులు వచ్చినట్టు చూపిస్తోంది. కానీ ఆ చెక్కులు ఎన్నిరోజులైనా క్యాష్ కావు. అంటే... అవి బోగస్ చెక్కులన్నమాట. అప్పటికే ఆ సొమ్మును మనీ లాండరింగ్ చేసేశారన్నది స్పష్టంగా తెలియకమానదు. ఏపీ ప్రజల సొమ్ము... పెత్తనం పక్క రాష్ట్రంలో: రాష్ట్రంలో మార్గదర్శి చిట్స్కున్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదు. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేస్తున్నారు. రాష్ట్రంలోని మార్గదర్శి ఫోర్‌మేన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలూ లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి ఎండీ శైలజతో పాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలలయంలోని 11మందికే ఉంది. ఇక్కడి చందాదారుల సొమ్ము భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్‌మెన్ చెబుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అడిగితే... తెలంగాణలో ఉంది కనక అది ఏపీ అధికారుల పరిధిలోకి రాదని చెబుతున్నారు. మరీ ఏపీ చందాదారుల సొమ్ముకు బాధ్యులెవరని అడిగితే... సమాధానం లేదు. ఒక్క బ్యాంకు ఖాతా చాలట...: చిట్‌ఫండ్ సంస్థలు తాము నిర్వహించే ప్రతి చిట్టీకీ సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. మార్గదర్శి దీన్ని పట్టించుకుంటే ఒట్టు. అన్ని చిట్లకూ ఒకే బ్యాంకు ఖాతా. ఏపీకి సంబంధించి ప్రత్యేక ఖాతా కూడా లేదు. ► ఇదో పోంజీ తరహా స్కామ్: మార్గదర్శి చిట్స్ పోంజీ స్కీమ్‌కు తక్కువేమీ కాదు. చిట్టీల్లో 30 – 40శాతం టికెట్లు(సభ్యత్వాలు) యజమాన్యానివే. వాటికి తన తరఫున చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. కొత్త చిట్లు, ఇతర చిట్ల నుంచి వచ్చిన సొమ్మును తాము చెల్లించినట్టుగా రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. అంటే... ఏ రోజైనా కొత్తగా వచ్చే చందాదారులు తగ్గినా, కొత్త చిట్లు ఆగినా మార్గదర్శి తన తరఫున చెల్లించాల్సిన చందాను చెల్లించే పరిస్థితి ఉండదు. అప్పుడు చిట్ పాడుకున్నవారికి సొమ్ము చెల్లించే అవకాశమూ ఉండదు. అదేరోజున దివాలా తీసే ప్రమాదం ఉంటుంది. ఒక్క రూపాయి చెల్లించకుండా...తమపేరిట చిట్టీలు సాధారణంగా ప్రతి చిట్కూ నిర్ణీత చందాదారుల సంఖ్య ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో తక్కువ మంది సభ్యులు (టికెట్లు) చేరితే కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆ ఖాళీ టికెట్స్‌ను కంపెనీ తీసుకోవాలి. వాటి చందాను కంపెనీ చెల్లించాలి. తరవాత కొత్త చందాదారులు చేరితే ఆ మేరకు టికెట్స్ భర్తీ చేయొచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని ఈ నిబంధనలను మార్గదర్శి ఏనాడూ పట్టించుకోలేదు. గరిష్ఠంగా ఒకో గ్రూపులో 50 శాతం వరకూ టికెట్లు కంపెనీవే ఉన్నాయి. వాటికోసం మార్గదర్శి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లపై తమకు వచ్చే డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్ చేసి అన్నిచోట్లా రికార్డుల్లో చూపిస్తోంది. నిధులు మళ్లించామని అంగీకరించిన రామోజీ సీఐడీ దర్యాప్తులో... తాము మార్గదర్శి చిట్స్ నిధులను ఇతర సంస్థలకు మళ్లించామని రామోజీరావే అంగీకరించారు. ఆధారాలతోసహా సీఐడీ అధికారులు ప్రశ్నించేసరికి ఆయన నోటమాట రాలేదు. దాంతో నిధులు మళ్లించింది వాస్తవమేనని అంగీకరిస్తూనే అది తమ ఆర్థిక ప్రణాళిక అన్నట్టుగా బుకాయించేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావే అక్రమాలు నిజమేనని సమ్మతించిన తరువాత ... మళ్లీ వక్రీకరిస్తూ వితండవాదనలెందుకు? చట్టాలు తమకు వర్తించవన్న శైలజ... మామ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివానన్నట్టుగా ఏ–2 చెరుకూరి శైలజ వ్యవహరించారు. అసలు చిట్‌ఫండ్ చట్టం తమకు వర్తించదని...తాము పట్టించుకోమని ఆమె సీఐడీ అధికారుల వద్దే వ్యాఖ్యానించడం తీవ్రమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నామన్న ఆమె... పోనీ ఆ చట్ట ప్రకారమైనా అనుబంధ కంపెనీలకు నిధుల మళ్లించడం నేరమే కదా అని అంటే మాత్రం సమాధానమివ్వలేదు. -
Margadarsi: అవును.. మళ్లించాం
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సొంత కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ విచారణలో శైలజా కిరణ్ దాదాపుగా అంగీకరించారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు ఇప్పటికే నిధులు మళ్లించామని సీఐడీ విచారణలో పరోక్షంగా అంగీకరించారు. తాజాగా చెరుకూరి శైలజ కూడా నిధులు మళ్లించినట్టు సమ్మతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దేశంలో చట్టాలకు తాము అతీతం అన్నట్టుగా ఆమె సీఐడీ అధికారుల ఎదుటే అడ్డగోలుగా వాదించడం విస్మయపరుస్తోంది. చిట్‌ఫండ్స్ వ్యాపారం చేస్తూ కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం తమకు వర్తించదని దబాయించడం రామోజీరావు, ఆయన కుటుంబం బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఐడీ అధికారులకు రికార్డులు చూపించబోమని శైలజా కిరణ్ భీష్మించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజను సీఐడీ అధికారులు గురువారం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఆమె నివాసంలో విచారించారు. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్, విచారణ అధికారి రవికుమార్‌లతోపాటు 25 మంది అధికారుల బృందం గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారించింది. శైలజ తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులతోపాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాది కూడా విచారణ ప్రక్రియ సమయంలో ఉన్నారు. నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన విచారణ ప్రక్రియను సీఐడీ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. దాదాపు 75 ప్రశ్నలకు వివరాలు రాబట్టి వాంగ్మూల పత్రంపై శైలజ సంతకం తీసుకున్నారు. గతంలో తనిఖీల్లో కనుగొన్న ఆధారాలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా శైలజ నుంచి పలు కీలక విషయాలను సీఐడీ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి... చందాదారుల సొమ్మును మళ్లించాం మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీల్లో సేకరించిన పలు కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ సీఐడీ అధికారులు శైలజను విచారించారు. ప్రధానంగా చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సొంత పెట్టుబడులుగా పెట్టడం, మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడంపై ప్రశ్నించినట్లు సమాచారం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులను రామోజీ గ్రూపునకు చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ (కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నైలలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు బ్యాలన్స్ షీట్ నోట్ నంబర్ 40లో పేర్కొన్న విషయాన్ని ఆమెకు చూపించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఏకంగా 88.5 శాతం వాటా మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిటే ఉంది. ‘‘అవును.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులను ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాం..’ అని శైలజ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన అభియోగమైన అక్రమంగా నిధుల మళ్లింపునకు సంబంధించి సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించినట్లైంది. కంపెనీల చట్టం అనుసరిస్తామంటూ... అంతలోనే తెలీదంటూ సీఐడీ అధికారులు అదే విషయంపై గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో తాము కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నామని శైలజ పేర్కొనట్లు సమాచారం. చిట్‌ఫండ్స్ వ్యాపారానికి కంపెనీల చట్టంతో నిమిత్తం లేదని, అనుసరించాల్సింది కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982 కదా? అని అధికారులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. పోనీ కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నారని భావించినా... ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.5 శాతం వాటాతోపాటు మరో రెండు కంపెనీల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ పెట్టుబడులు పెట్టినట్టు బ్యాలన్స్ షీట్లో చూపించారు కదా? అని అధికారులు ప్రశ్నించడంతో అవునని ఆమె సమాధానమిచ్చారు. కంపెనీల చట్టం ప్రకారం 50 శాతానికి మించి వాటా కలిగి ఉంటే అనుబంధ కంపెనీగానే పరిగణిస్తారు కదా? అని తిరిగి ప్రశ్నించగా అందుకు కూడా ఆమె అవుననే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. అంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు కంపెనీల్లో 88 శాతం పెట్టుబడులు పెట్టి అనుబంధ కంపెనీగా ఉన్నట్టే కదా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె మౌనం వహించినట్టు సమాచారం. అటు చిట్‌ఫండ్స్ చట్టం.. ఇటు కంపెనీల చట్టాన్ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు ఆమె సమ్మతించినట్టైంది. ఏటా మార్చి 31న రూ.వందల కోట్ల చెక్కులు.. విచారణ సందర్భంగా సీఐడీ మరో కీలక ఆధారాన్ని సేకరించింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లిస్తున్న రామోజీరావు, శైలజ రికార్డుల్లో మాత్రం చట్టాన్ని ఏమార్చేందుకు యత్నించారని నిరూపితమైంది. 2022 మార్చి 31న రూ.255 కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్యాలన్స్ షీట్లో చూపించారు. కానీ ఆ చెక్కులేవీ తరువాత నగదుగా మారినట్లు (ఎన్‌క్యాష్)గా రికార్డుల్లో లేవని సీఐడీ అధికారులు గుర్తించారు. గరిష్టంగా పది రోజుల్లో చెక్కులను నగదుగా జమ చేస్తామని శైలజ పేర్కొన్నారు. మరి గతేడాది మార్చి 31న వచ్చినట్లు చూపించిన రూ.255 కోట్ల చెక్కులేవీ నగదుగా మారినట్లు రికార్డుల్లో ఎందుకు లేవని సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో శైలజ తెల్లమొహం వేశారని సమాచారం. కొన్ని దశాబ్దాలుగా ఏటా మార్చి 31న రూ.వందల కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు రికార్డుల్లో చూపుతున్నా అవి నగదుగా మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఏటా చందాదారులు చెల్లిస్తున్న రూ.వందల కోట్లను మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లిస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరిలో ఆ నిధులు ఉన్నట్లుగా చూపించాల్సి రావడంతో చెక్కులు వచ్చినట్లు చూపించి కనికట్టు చేస్తోంది. ఆ నిధులను రామోజీరావు కుటుంబ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో మార్గదర్శి ఆడిటర్ శ్రావణ్ ఇదే విషయాన్ని అంగీకరించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి కానీ.. చూపించను లేని చెక్కులు ఉన్నట్టుగా చూపించి మోసానికి పాల్పడినట్టు నిరూపితం కావడంతో శైలజ షాక్‌కు గురయ్యారు. దాంతో సీఐడీ అధికారులను పక్కదారి పట్టించేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. ‘ఆ చెక్కుల సమాచారం అంతా ప్రధాన కార్యాలయంలో ఉంటుంది... నాకు తెలీదు’ అని పేర్కొన్నారు. అక్కడకు వెళ్లి పరిశీలిద్దామని సీఐడీ అధికారులు సూచించగా ఆమె నిరాకరించారు. పోనీ మార్గదర్శి సిబ్బంది ద్వారానైనా ఆ వివరాలు అందించాలని సూచించగా అందుకు కూడా ఆమె ఒప్పుకోలేదు. వీడియో రికార్డింగ్ ద్వారా పారదర్శకంగా చెక్కుల రికార్డులు పరిశీలిస్తామని చెప్పినా ఆమె ససేమిరా అన్నారు. అంటే చెక్కుల వివరాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో కూడా లేవా? అని ప్రశ్నించగా ఆమె మౌనం దాల్చినట్లు సమాచారం. ఏపీ రికార్డులు ప్రత్యేకంగా లేవు చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు ఏ రాష్ట్రానికి సంబంధించిన రికార్డులు ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిర్వహించాలి. అక్కడి చందాదారులు చెల్లిస్తున్న మొత్తం, చిట్టీల వివరాలు, ఆదాయ– వ్యయాలు, బ్యాలన్స్‌షీట్‌ను ప్రత్యేకంగా రూపొందించాలి. ఈ నిబంధనను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ చందాదారులు చెల్లిస్తున్న మొత్తం, ఇతర వివరాలను తెలంగాణ, ఇతర రాష్ట్రాల రికార్డులతో పాటు కలిపి నిర్వహిస్తోంది. మార్గదర్శి చందాదారుల్లో సింహభాగం అంటే 60 శాతం వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారు. ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రామోజీరావు కుటుంబానికి చెందిన ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ రికార్డుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతోంది. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించగా తాము అలాగే రికార్డులు నిర్వహిస్తామని శైలజ చెప్పినట్టు సమాచారం. నీళ్లు నమిలి... నీళ్లు తాగి సీఐడీ అధికారులు నిబంధనలు పాటిస్తూ శైలజా కిరణ్‌ను విచారించారు. విచారణకు ఆమె ఏమాత్రం సహకరించకపోయినా సరే ఇబ్బంది పెట్టకుండా...ఒత్తిడి చేయకుండా ప్రశ్నలు సంధించారు. గురువారం రోజు మధ్యాహ్నం వరకు సాగిన మొదటి విడతలో చాలా ప్రశ్నలకు నాకు తెలియదు.. గుర్తులేదు...నాకు సంబంధం లేదు అంటూ ఆమె సమాధానాలు దాటవేసేందుకు యత్నించారు. మధ్యాహ్న భోజన విరామం తరువాత సీఐడీ అధికారులు విచారణ జోరు పెంచారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఆమె ముందు ఉంచుతూ ఒక్కొక్క అంశంపై ప్రశ్నించారు. దీంతో శైలజకు నోట మాట రాలేదు. కాదు అని చెప్పేందుకు అవకాశం లేదు. ఎదురుగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. దాంతో చాలా ప్రశ్నలకు ఆమె నీళ్లు నమిలినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఆమె పలుసార్లు తనకు దాహం వేస్తోందంటూ బయటకు వెళ్లి వచ్చారు. తమ ఆడిటర్లు, ఇతరులతో సంప్రదించి వచ్చి నాకు తెలియదు.. గుర్తు లేదు అని సమాధానాలు దాటవేసేందుకు యత్నించారు. చూపు సరిగా లేదు.. కనిపించడం లేదు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ల్యాప్‌టాప్‌లో సీఐడీ అధికారులు శైలజకు చూపించారు. నిధులు మళ్లించినట్టు అందులో ఉన్న వివరాలను చూపిస్తూ అవి వాస్తవమేనా? అని అడిగారు. అయితే ఆ పత్రాలు తనకు కనిపించడం లేదని... అక్షరాలు చిన్నవిగా ఉన్నాయని ఆమె పేర్కొనడంతో సీఐడీ అధికారులు ల్యాప్‌టాప్‌లో ఎన్లార్జ్ చేసి మరీ చూపించారు. ‘నాకు చూపు సరిగా లేదు... ఆ పత్రాల్లో ఏముందో కనిపించడం లేదు’ అని శైలజ పేర్కొనడంతో సీఐడీ అధికారులు విచారణ ప్రక్రియలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని పిలిచి ఆ పత్రాలు చూపించారు. అవి తనకు కనిపిస్తున్నాయని ఆయన చెప్పడంతో పాటు అందులో ఏముందో చదివి వినిపించారు. దీంతో తనకు ఏమీ కనిపించడంలేదని తప్పించుకునేందుకు శైలజ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మాకు ఏ చట్టాలు వర్తించవు.. మా చట్టం మాకుంది చందాదారులు చెల్లించిన నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడం కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982కు వ్యతిరేకం కదా...! ఆ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం అందుకు రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని తెలుసు కదా..? అని సీఐడీ అధికారులు శైలజను ప్రశ్నించారు. అయితే అసలు చిట్‌ఫండ్స్ చట్టమే తనకు తెలియదని ఆమె చెప్పడంతో సీఐడీ అధికారులు విస్తుపోయారు. చిట్‌ఫండ్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మీకు అసలు చిట్‌ఫండ్స్ చట్టమే తెలియదా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. చిట్‌ఫండ్స్ చట్టం– 1982ను తాము అనుసరించబోమని ఆమె సమాధానం ఇవ్వడంతో నివ్వెరపోవడం సీఐడీ అధికారుల వంతైంది. మరి చిట్‌ఫండ్స్ వ్యాపారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించగా.. మా చట్టాలు మాకున్నాయి... వాటి ప్రకారం చేస్తున్నాం అని ఆమె బదులిచ్చినట్లు సమాచారం. చిట్‌ఫండ్స్ కంపెనీలు అక్రమాలకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం 1982లోనే చేసిన చట్టం గురించి కూడా తెలుసుకోకుండా... అసలు ఆ చట్టాన్ని పట్టించుకోకుండా చిట్‌ఫండ్స్ వ్యాపారం చేస్తున్నామని శైలజ చెప్పడం గమనార్హం. రామోజీ, శైలజను అమరావతిలో విచారిస్తాం ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజను త్వరలో అమరావతిలో మరోదఫా విచారిస్తాం. ఈ కేసులో ఇప్పటికే వారిద్దరినీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేశాం. వాటిని విశ్లేషించిన అనంతరం మరి కొన్నిసార్లు విచారించాల్సి ఉంటుంది. ఈసారి వారిద్దరూ విచారణ కోసం అమరావతికి రావాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు విచారణ కొనసాగుతోంది. శైలజ ఈ నెల 13న విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆమెకు ఇప్పటికే సమాచారమిచ్చాం. ఈదఫా ఆమెను అమరావతిలో విచారిస్తాం’ – అమిత్ బర్దర్, ఎస్పీ, సీఐడీ -
విచారణకు అమరావతి రావాలని మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది. మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు అమరావతి సీఐడీ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. అవసరమైతే రామోజీని విచారిస్తామని, ఆయన కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్‌ను సీఐడీ అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్‌లోని శైలజ కిరణ్ ఇంటికి చేరుకున్న సీఐడి బృందం శైలజ కిరణ్ స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేశారు. ఇదిలా ఉండగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్.. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించడంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది. -
Margadarsi: నిజమే.. నిధులు మళ్లించాం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–1గా ఉన్న సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు సీఐడీ విచారణను తప్పించుకునేందుకు ఆడిన డ్రామాలు ఫలించలేదు. విచారించాల్సింది తనను కాదని, మార్గదర్శిలో కిందిస్థాయి సిబ్బందినంటూ తప్పించుకునేందుకు ఆయన వేసిన ఎత్తుగడలు పారలేదు. తన ఆరోగ్యం బాగా లేదని రామోజీరావు చెబుతున్నవి సాకులేనని ఆయన వ్యక్తిగత వైద్యుడే పరోక్షంగా సమ్మతించడంతో విచారణకు అంగీకరించక తప్పలేదు. చిట్‌ఫండ్ చట్టం, రిజర్వ్‌బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డ రామోజీరావు సీఐడీ అధికారులు రామోజీరావును హైదరాబాద్‌లో సోమవారం దాదాపు 8 గంటలపాటు విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా భారీగా నిధుల మళ్లింపు, రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్ల సేకరణపై ఆధారాలతో విచారించారు. ఈ కేసులో ఏ–2గా ఉన్న రామోజీరావు కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజను ఈ నెల 6న సీఐడీ అధికారులు విచారించనున్నారు. అనంతరం కేసు దర్యాప్తులో పురోగతిని సమీక్షించి రామోజీరావు, శైలజను ఆంధ్రప్రదేశ్‌కు పిలిచి మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రామోజీరావును విచారించిన అనంతరం బయటకు వస్తున్న అధికారులు తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం.. మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ విచారణను తప్పించుకునేందుకు రామోజీరావు చివరి వరకూ ప్రయత్నించారు. రామోజీరావు, శైలజ హైదరాబాద్‌లోనే వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. నాలుగు తేదీలు సూచించి వారికి అనువైన రోజు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. నిబంధనల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే విచారణను తప్పించుకునేందుకు రామోజీరావు కాలయాపన చేశారు. చివరికి మార్చి 3న రామోజీ ఫిల్మ్‌సిటీలోని తన కార్యాలయంలో విచారణకు హాజరవుతానని సీఐడీకి తొలుత సమాచారం ఇచ్చారు. తీరా సోమవారం రోజు ఫిల్మ్‌సిటీలో కాకుండా జూబ్లీహిల్స్‌లోని తన కోడలు శైలజ కిరణ్ నివాసంలో విచారణకు హాజరవుతానని పేర్కొనగా అందుకు సీఐడీ అధికారులు సమ్మతించారు. ఈ మేరకు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్, విచారణాధికారి రవికుమార్‌తోపాటు అధికారుల బృందం జూబ్లీహిల్స్‌లోని శైలజ నివాసానికి ఉదయం 10.30 గంటలకు చేరుకుంది. సీఐడీ అధికారులు రావడమే ఆలస్యం తన ఆరోగ్యం సరిగా లేనందున విచారణకు సహకరించలేనని రామోజీ పేర్కొన్నారు. అనారోగ్యానికి కారణాలు, నివేదికలు అందచేసి విచారణకు హాజరు కాలేరని ధృవీకరించాలని రామోజీరావు వ్యక్తిగత వైద్యుడిని సీఐడీ అధికారులు కోరారు. దీంతో రామోజీని విచారించవచ్చని, మంచంపై పడుకుని సమాధానాలు ఇస్తారని ఆయన వైద్యుడు చెప్పడంతో అందుకు సీఐడీ అధికారులు సమ్మతించారు. ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, కేసును సక్రమంగా విచారించడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇక తప్పదని స్పష్టం కావడంతో సీఐడీ అధికారుల విచారణకు రామోజీ సమ్మతించారు. ఆడియో...వీడియో రికార్డింగ్ విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించారు. ఈ ప్రక్రియ మొత్తం రికార్డింగ్ చేశారు. రామోజీ పడుకున్న మంచం సమీపంలోనే వేర్వేరు కోణాల్లో రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయనకు కాస్త దూరంగానే సీఐడీ అధికారులు కూర్చున్నారు. విచారణ సందర్భంగా రామోజీరావు చెప్పిన సమాధానాలు, ఆయన హావభావాలు అన్నీ రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుదీర్ఘ విచారణ సందర్భంగా సీఐడీ అధికారుల బృందం అక్కడ కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. తమకు కావల్సిన ఆహారం, మంచినీళ్లు అంతా బయట నుంచే తెచ్చుకున్నారు. సహకరించని రామోజీ సీఐడీ అధికారులు విచారణ మొదలు పెట్టిన తరువాత రామోజీరావు సమాధానాలు చెప్పేందుకు చాలాసేపు ససేమిరా అన్నారు. సీఐడీ పరిధినే ప్రశ్నిస్తూ తనను అసలు విచారించడానికే వీల్లేదన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. తాను విచారణ సంస్థలకు అతీతమన్నట్టు మొండిగా వ్యవహరించారు. దీంతో చట్ట నిబంధనలను తెలియచేస్తూ సీఐడీ అధికారులు విచారణ ప్రక్రియ కొనసాగించారు. చిట్‌ఫండ్స్‌లో అక్రమ వ్యవహారాలన్నింటికీ తమ బ్రాంచి మేనేజర్లు(ఫోర్‌మెన్), అకౌంటెంట్లదే బాధ్యతని, తనకు సంబంధం లేదని తప్పించుకునేందుకు రామోజీరావు ప్రయత్నించారు. బ్రాంచి కార్యాలయాల్లోనే అన్ని వ్యవహారాలు సాగినందున వారినే ప్రశ్నించాలని మొండికేసినట్లు తెలుస్తోంది. బ్రాంచి మేనేజర్లకు రూ.500కు మించి చెక్‌పవర్ లేనప్పుడు భారీగా నిధుల బదిలీపై వారిని మాత్రమే ఎలా బాధ్యులను చేస్తామని సీఐడీ అధికారులు ఎదురు ప్రశ్నించడంతో రామోజీరావు మౌనం వహించారు. బ్రాంచిల నుంచి నిధులన్నీ హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలింపుపై కూడా తనకు సంబంధం లేదని రామోజీ వాదించారు. మరి చెక్ పవర్ మార్గదర్శి ఎండీ శైలజ, ప్రధాన కార్యాలయంలోని మరో 10 మంది వద్ద ఎందుకు ఉందని విచారణ అధికారులు ప్రశ్నించడంతో రామోజీ సమాధానం చెప్పలేకపోయారు. చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆర్జించిన ఆదాయం అంతా చైర్మన్, ఎండీలుగా వారే ప్రయోజనం పొందుతున్నప్పుడు కేవలం జీతాలకు పనిచేసే మేనేజర్లు ఎలా బాధ్యులవుతారని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. నిధులు మళ్లింపు, అక్రమ డిపాజిట్లపై.. విచారణలో సీఐడీ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులు అక్రమంగా బదిలీ, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, రికార్డుల నిర్వహణలో అవకతవకలపై ప్రశ్నించినట్లు సమాచారం. మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీల్లో కనుగొన్న ఆధారాలు, బ్రహ్మయ్య అండ్ కో చార్టెడ్ అకౌంటెంట్ శ్రావణ్ ఇచ్చిన వాంగ్మూలం కాపీలను చూపిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసేందుకు రామోజీరావు ప్రయత్నించారు. కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల కాపీలు, బ్యాలన్స్ షీట్ల కాపీలను చూపిస్తూ అధికారులు ప్రశ్నించడంతో ఇక మాట్లాడలేకపోయారని తెలుస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లోని నిధులను ప్రధాన కార్యాలయానికి మళ్లించడం నిజమా.. కాదా? అని సూటిగా ప్రశ్నించడంతో అవునని రామోజీ అంగీకరించాల్సి వచ్చింది. చిట్‌ఫండ్స్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచ్‌వల్ ఫండ్స్, ఇతర షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన ఆధారాలను కూడా సీఐడీ అధికారులు చూపించి ప్రశ్నించగా అదంతా మార్గదర్శి ఆర్థిక ప్రణాళికలో భాగమని రామోజీ చెప్పినట్టు సమాచారం. అంటే చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వాస్తవమే కదా? అని ప్రశ్నించడంతో ఔనని రామోజీరావు అంగీకరించారని సమాచారం. చిట్టీల చందాదారులు పాడిన మొత్తాన్ని ఇవ్వకుండా రశీదు’ మాత్రమే ఇస్తూ 5శాతం వడ్డీ చెల్లిస్తున్న విషయంపై కూడా సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించారు. తాము అట్టిపెట్టుకున్న మొత్తానికి వడ్డీ చెల్లిస్తున్నాం కదా అందులో అక్రమం ఏముందనీ రామోజీరావు ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వడ్డీ చెల్లిస్తామని చెప్పి నగదును అట్టిపెట్టుకోవడం అంటే అది డిపాజిట్ సేకరణే అవుతుంది కదా... చిట్‌ఫండ్ కంపెనీలను డిపాజిట్ల సేకరణకు రిజర్వ్‌బ్యాంకు అనుమతించిందా? అంటే రామోజీరావు స్పందించకుండా మౌనం వహించారని సమాచారం. అంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ అధికారులు నమోదు చేసిన అభియోగాలన్నీ దాదాపు వాస్తవమేనని ఆయన పరోక్షంగా సమ్మతించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు, ఆడిటింగ్ వ్యవహారాలు చూసిన చార్టెడ్ అకౌంటెంట్ కూడా నిధులు మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్లకు పాల్పడినట్టు సమ్మతించారు. తదుపరి విచారణ ఏపీలో! మార్గదర్శి వ్యవహారంలో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు. అందుకోసం రామోజీరావు, శైలజలను త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు రప్పించి విచారించాలని భావిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం(సీన్ ఆఫ్ అఫెన్స్) ఆంధ్రప్రదేశ్ కాగా మన రాష్ట్రంలోని చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ తరలించారు. కేసు దర్యాప్తు తీరును సమీక్షించిన అనంతరం తదుపరి విచారణ కోసం రామోజీరావు, శైలజలను రాష్ట్రానికి రప్పించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో వారు ఎంపిక చేసుకున్న నగరంలో విచారించేందుకు సమాయత్తమవుతున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాలకు ఇప్పటికే సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. స్టేట్మెంట్ విశ్లేషించాక తదుపరి చర్యలు: అమిత్ బర్దార్, ఎస్పీ ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాలకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయి. రామోజీరావును విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేశాం. అది విశ్లేషించాల్సి ఉంది. మార్గదర్శి ఎండీ శైలజను ఈ నెల 6న విచారిస్తాం. కేసులో కనుగొన్న ఆధారాలు, పురోగతిని బట్టి తదుపరి చర్యలు చేపడతాం’ -
Margadarsi: అక్రమాలు నిజం!
సాక్షి, అమరావతి: ప్రతి ఏటా మార్చి 31న రూపొందించే బ్యాలెన్స్షీట్లో... చెల్లించాల్సిన బకాయిలు, ఇతర అప్పులకు సమానంగా తమ వద్ద వందల కోట్ల రూపాయల చెక్కుల రూపంలో, మరికొన్ని వందల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు చూపిస్తున్నారు. వాటిని తమ ఆస్తులుగా పేర్కొంటున్నారు. మరి ఆ చెక్కుల్ని తదుపరి కాలంలో ఎప్పుడైనా డిపాజిట్ చేయాలి కదా? ఆ నగదును సంస్థ అవసరాల కోసం ఖర్చు చేయాలి కదా? విచిత్రమేంటంటే అందులో పేర్కొన్న చెక్కుల్లో ఒక్క చెక్కు కూడా తరువాతి కాలంలో సంస్థ ఖాతాలోకి వచ్చిన దాఖలాలు ఉండటం లేదు. నగదు పరిస్థితి కూడా అంతే!!. అంటే ఆ చెక్కులు గానీ, ఆ నగదు కానీ వాస్తవంగా కంపెనీ దగ్గర ఉన్నవి కావన్న మాట!!. వాటిని అప్పటికే వేరే సంస్థల ఖాతాల్లోకో, ఇతరత్రా అవసరాలకో మళ్లించేశారు. కానీ... అవన్నీ తమ వద్దే ఉన్నట్లుగా తప్పుడు బ్యాలెన్స్‌షీట్ ద్వారా మభ్య పెడుతున్నారు. తమ సంస్థ తగిన ఆస్తులతో బలంగానే ఉన్నదని ఒకవైపు చిట్లు వేస్తున్న చిట్ దారులను, మరోవైపు నియంత్రణ సంస్థలను నమ్మిస్తున్నారు. ఇదీ.. రామోజీరావు నడిపిస్తున్న ‘మార్గదర్శి’ అసలు కథ. మార్గదర్శి సంస్థను ఆడిట్ చేస్తున్న ఆడిటింగ్ సంస్థల ప్రతినిధి నేరుగా దర్యాప్తు సంస్థ ఎదుట అంగీకరించిన వాస్తవం. ఇదే కాదు. తనిఖీలకు అడుగడుగునా అడ్డుపడుతున్న మార్గదర్శిలో... ఎక్కడ ఏ సోదా జరిపినా నివ్వెరపోయే నిజాలే వెలుగుచూస్తున్నాయి. వాస్తవాలను బయటకు వెల్లడించకపోవటం ద్వారా.. చిట్లు వేస్తున్నవారికి తమ సొమ్ము ఎంత భద్రంగా ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి సృష్టిస్తున్నారు. అంతేకాదు.. డిపాజిట్లు తీసుకోవటాన్ని నిషేధించినా సరే... వాటిని ఇతరత్రా రూపాల్లో తీసుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. చట్టాలను పరిహాసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మార్గదర్శి ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో కంపెనీలో సీఐడీ జరిపిన తనిఖీల్లో వెల్లడైన పలు అక్రమాలు బయటపడ్డాయి. చార్టర్డ్ అకౌంటెంట్‌కు 14 రోజుల రిమాండ్... మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్యాంకు లావాదేవీలు, రికార్డుల నిర్వహణలో పలు అవకతవకలున్నట్లు మార్గదర్శి చిట్స్‌కు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న బ్రహ్మయ్య అండ్ కో ప్రతినిధి సీఐడీ విచారణలో వెల్లడించారు. దాంతో బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి గురువారం విజయవాడలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా... చందాదారుల సొమ్మును తరలించటం, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోను, షేర్లలోను అక్రమంగా పెట్టుబడులు పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు సేకరించడం చేసినట్లు ఇప్పటికే సీఐడీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే బ్రహ్మయ్య అండ్ కో సంస్థ రికార్డులను తనిఖీ చేసి, ఆ సంస్థ సీఏ శ్రావణ్‌ను విచారించారు. ఈ విచారణలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. మార్గదర్శి ఖాతాలు సవ్యంగానే ఉన్నాయని ఏటా ఆడిట్ నివేదిక ఇస్తున్న ఈ సంస్థ... అసలు మార్గదర్శి చిట్స్ బ్యాంకు ఖాతాలు, రికార్డులు, లావాదేవీలను సమగ్రంగా పరిశీలించకుండానే ఈ నివేదిక ఇస్తున్నట్లు సదరు చార్టర్డ్ అకౌంటెంట్ వెల్లడించటం గమనార్హం. ఇలాంటి డిపాజిట్లు ప్రమాదకరమే? ► చిట్లు వేసేవారిలో కొందరు చిట్‌ను పాడుకుంటారు కానీ... ఆ డబ్బును తీసుకోవటానికి అవసరమైన ష్యూరిటీలను కంపెనీకి సబ్మిట్ చేయలేరు. మరికొందరైతే రకరకాల కారణాల వల్ల పాడుకున్న మొత్తాన్ని తీసుకోకుండా భవిష్యత్తులో తాము చెల్లించాల్సిన చిట్ మొత్తానికి సంబంధించి దాన్ని సదరు చిట్‌ఫండ్ సంస్థ వద్దే వదిలిపెడతారు. ఇంకొందరైతే ఓ రెండు మూడు నెలలు ఉంన్నపుడు చిట్‌ను పాడుకుని... ఆ మిగిలిన నెలల ఫ్యూచర్ చిట్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని సంస్థ దగ్గరే వదిలేస్తారు. అయితే ఏ చిట్‌ఫండ్ సంస్థయినా తమ ప్రతి బ్రాంచి కార్యాలయంలోనూ... అక్కడి చిట్టీలకు సంబంధించిన ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని జమ చేసేందుకు ప్రత్యేకంగా రెండో బ్యాంకు ఖాతాను నిర్వహిస్తుండాలి. ఇలా ఫ్యూచర్ చిట్ల మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేయాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఏ ఒక్క బ్రాంచిలోనూ ఇలా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి వేరే బ్యాంకు ఖాతా తెరవలేదు. అన్నిచోట్ల నుంచీ ఆ మొత్తాన్ని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తోంది. దానికో రశీదు ఇస్తూ 4–5 వడ్డీ చెల్లిస్తోంది. ఇది అనధికారికంగా డిపాజిట్లు వసూలు చేయటమే. చట్టవిరుద్ధంగా వసూలు చేస్తున్న ఈ డిపాజిట్లను గనక ఏ ఆర్బీఐనో జప్తు చేస్తే..? చిట్‌దారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది. అయినా సరే మార్గదర్శి వసూలు చేస్తున్న అక్రమ డిపాజిట్లు సక్రమమేననే రీతిలో బ్రహ్మయ్య అండ్ కో సంస్థ నివేదిక ఇవ్వటం విస్మయం కలిగించేదే!!. ► ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ ఆదాయ, వ్యయాల ఖాతాలు, ఆస్తి, అప్పుల ఖాతాలు, తమ పెట్టుబడలు వివరాలను బహిర్గతం చేయటం లేదు. గోప్యంగా ఉంచుతోంది. ఇది చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. అయినా సరే బ్రహ్మయ్య అండ్ కో ఇది పట్టించుకోకుండా అంతా సక్రమంగానే ఉందని ఆడిట్ నివేదిక ఇచ్చేస్తోంది. అక్రమాలు వాస్తవమే: బ్రహ్మయ్య సంస్థ సీఏ శ్రావణ్ సీఐడీ దర్యాప్తు సందర్భంగా బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్ కీలక విషయాలు వెల్లడించారు. తాము అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో రికార్డులను వ్యక్తిగతంగా పరిశీలించకుండానే ఆడిట్ నివేదిక జారీ చేస్తున్నామని అంగీకరించారు. మార్గదర్శి చిట్స్ ఆదాయ– వ్యయాలు, ఆస్తి– అప్పులకు సంబంధించిన ఎలాంటి వివరాలనూ ఆయన సీఐడీ అధికారులకు చెప్పలేకపోయారు. ఒక్కో బ్రాంచి బ్యాంకు ఖాతాల్లో అప్పుడప్పుడు చూపిస్తున్న వందల కోట్ల రూపాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తరువాత అవి ఎక్కడికి మాయమయ్యాయి? అనేది ఆయన ఏమాత్రం చెప్పలేకపోయారు. ఆ వివరాలేవీ తనకు తెలియవని ఆయన అంగీకరించారు. -
మార్గదర్శి కేసులో శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా చెరుకూరి రామోజీరావును, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజను ఏ2గా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీఐడీ డీఎస్పీ రవి కుమార్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ2 చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. ఈ నెల 29 లేదా 31వ తేదీల్లో లేదంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఇళ్లు లేదంటే ఆఫీస్‌లో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని పేర్కొంది. -
Skill Development Scam: ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లో విచారణ విభాగానికి అనుకూలంగా గురువారం తీర్పు వెలువడింది. జీవీఎస్ భాస్కర్ అరెస్ట్ వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది. భాస్కర్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు సస్పెండ్ చేయగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే.. ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని స్పష్టం చేస్తూ.. ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసింది హైకోర్టు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ.. భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ కేసులో భాస్కర్ రిమాండ్‌ను విజయవాడ సీఐడీ కోర్టు తిరస్కరించింది. భాస్కర్‌ను సీఐడీ అధికారులు విచారించాలని అనుకుంటే 41-ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. -
తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: సీఐడీ విచారణలో నారాయణ తీరు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అసైన్డ్ భూములు, బినామీ పేర్లతో భూములు కొనుగోలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంలో అక్రమాలపై సీఐడీ అధికారులు ఎంత గుచ్చి గుచ్చి అడిగినా నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని సమాచారం. తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అనే రీతిలో నారాయణ వ్యవహరించారని తెలిసింది. ఈ మేరకు సీఐడీ అధికారులు నారాయణ, ఆయన భార్య పి.రమాదేవి, నారాయణ విద్యా సంస్థల ఆర్థిక వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన ఎన్ స్పైరా సంస్థలో కీలక స్థానంలో ఉన్న పొత్తూరి ప్రమీల అనే ఉద్యోగిని హైదరాబాద్‌లో సోమవారం వేర్వేరుగా విచారించారు. నారాయణ విద్యా సంస్థలు, ఎన్ స్పైరా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు నిధుల బదలాయింపుపై సీఐడీ అధికారులు నారాయణను ప్రశ్నించారు. ఇక ఆ నిధులతో బినామీల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన రికార్డులు చూపిస్తూ పలు ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. అలాగే నారాయణ బినామీల పేరిట కొనుగోలు చేసిన భూముల సమీపంలోనే స్టార్టప్ సిటీ వచ్చేలా సీఆర్డీఏ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఉదంతంపైన కూడా వివరాలు అడిగారు. ఆ సమయంలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ మాస్టర్ ప్లాన్‌ను ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయి. అలాగే నారాయణ విద్యా సంస్థలు, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, వారి సన్నిహితుడు లింగమనేని కుటుంబానికి చెందిన సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చేలా నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై కూడా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించకూడదని ఆయన ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా వ్యవహరించారని సమాచారం. అలాగే నారాయణ భార్య రమాదేవి, పొత్తూరి ప్రమీల కూడా విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. నారాయణ కుమార్తెను ఇంటి వద్దే విచారించండి అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ నారాయణ కుమార్తె సింధూర, ఆమె భర్త పునీత్, అతడి సోదరుడు వరుణ్ కుమార్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ బాబీలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సింధూరను ఆమె ఇంటి వద్దే ఈ నెల 20న విచారించాలని సీఐడీని ఆదేశించారు. అలాగే అదే రోజున సీఐడీ ముందు హాజరు కావాలని పునీత్, వరుణ్‌లకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇక అంజనీ కుమార్‌ను అదే రోజున న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి సూచించారు. -
టీడీపీ పెద్దల అక్రమాలు బట్టబయలు.. నా‘రాబంధువులే’!
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల్లో వాలిపోయిన భూ రాబందుల అక్రమాలు బహిర్గతమయ్యాయి. బడుగు, బలహీన వర్గాల రైతులను బెదిరించి 932.72 ఎకరాల అసైన్డ్ భూములను పచ్చ గద్దలు కాజేసినట్లు వెల్లడైంది. గ్రామాలవారీగా ఎల్లో గ్యాంగ్ అసైన్డ్ భూముల అక్రమాల చిట్టా రట్టైంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014– 18 మధ్య చోటు చేసుకున్న ఈ దారుణాలు సీఐడీ దర్యాప్తులో ఆధార సహితంగా, రియల్ ఎస్టేట్ అక్రమ సామ్రాజ్యం భౌగోళిక సరిహద్దులతో సహా వెలుగు చూశాయి. ఇప్పటివరకు బట్టబయలైన అసైన్డ్ భూములు 932.72 ఎకరాలు. చంద్రబాబు చెప్పిన ప్రకారం వాటి మార్కెట్ విలువ ఏకంగా రూ.3,730.88 కోట్లకు పైమాటే! కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తులో మరిన్ని అసైన్డ్ బాగోతాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. కార్యాలయాల వారీగా రికార్డుల పరిశీలన.. రాజధాని అమరావతి ప్రాంతంలో 2014 నాటికి ఎస్సీ, బీసీ రైతుల పేరిట ఉన్న అసైన్డ్ భూములు గత సర్కారు హయాంలో ఇతరుల పేరుతో సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు కావడం గమనార్హం. సీఐడీ దర్యాప్తులో గుర్తించిన అసైన్డ్ భూముల రికార్డులను గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయించారు. అమరావతి పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్టు ఇప్పటివరకు నిర్ధారించారు. భూ సమీకరణ కోసం ఏర్పాటైన సీఆర్డీఏ కార్యాలయాల వారీగా రికార్డులను పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చారు. మొత్తం 23 సీఆర్డీఏ కార్యాలయాల పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. రాజధాని నిర్మాణం తరువాత అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ కనీసం రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఆ ప్రకారం టీడీపీ పెద్దలు హస్తగతం చేసుకున్న 932.72 ఎకరాల అసైన్డ్ భూముల మార్కెట్ విలువ రూ.3,730.88 కోట్లకు పైమాటేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం అసైన్డ్ అక్రమాలు రూ.5,600 కోట్లు! సీఐడీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అసైన్డ్ భూముల అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. అమరావతి పరిధిలో మొత్తం 1,400 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను తారుమారు చేసినట్లు గతంలోనే సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. ఆ ప్రకారం టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూముల విలువ రూ.5,600 కోట్లని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘నారా’యణ బంధువులు, బినామీలే.. అసైన్డ్ భూముల అక్రమాల తీగ లాగితే నారా చంద్రబాబు, పొంగూరు నారాయణ బంధువులు, బినామీల ఇళ్లల్లో డొంక కదులుతోంది. బినామీలు, బంధువుల పేరిట అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సమీప బంధువు పేరిట కూడా అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. నారాయణ విద్యా సంస్థలు, ఆయన సమీప బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ చిరుద్యోగుల పేరిట అసైన్డ్ భూములను కాజేశారు. ఇప్పటివరకు గుర్తించిన 932.72 ఎకరాల అసైన్డ్ భూముల సేల్డీడ్లు, జీపీఏలను సీఐడీ అధికారులు విశ్లేషించగా ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ‘ఎన్‌స్పైర’లో కీలక ఆధారాలు స్వాధీనం మాజీ మంత్రి పి.నారాయణ కుటుంబానికి చెందిన హైదరాబాద్‌లోని ‘ఎన్ స్పైర’ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో సీఐడీ అధికారుల సోదాలు బుధవారం ముగిశాయి. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు ఖాతా లావాదేవీల పత్రాలు, ఇతర కీలక రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. మునుముందు మరిన్ని కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. -
‘అసైన్డ్’ ప్లాట్లు అమ్ముతాం! అమరావతిలో పచ్చ గ్యాంగ్ నయా దందా
సాక్షి, అమరావతి: ‘ప్లాట్లు అమ్ముతాం బాబూ.. అమరావతిలో ప్లాట్లు అమ్ముతాం.. కొంత తక్కువ ధరకే ఇస్తాం.. మంచి అవకాశం.. త్వరగా వచ్చి కొనుగోలు చేయండి.’ ఇదీ అమరావతి పరిరక్షణ సమితిలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నేతల తాజా నినాదం. ఇందులో విశేషం ఏముందీ అంటారా.. అక్కడే ఉంది అసలు గుట్టు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం సమీకరించిన భూముల్లో వారికి సంబంధించిన భూమి ఒక్క సెంటు కూడా లేదు. కానీ ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినట్టుగా కనికట్టు చేసి ప్లాట్లు పొందారు. ఈ బండారం సీఐడీ దర్యాప్తుతో బట్టబయలు అవుతుండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకునే యత్నాల్లో నిమగ్నమయ్యారు. అమరావతిలో మరో కొత్త భూదందాకు తెరతీశారు. ఇదీ ఉద్యమ నేత తీరు.. ఆయన అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమనేత. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కనుసన్నల్లో అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అమరావతిలో ఆయనకున్న 20 ప్లాట్లను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల జాబితాలో ఆయన పేరే లేదు. కానీ అసైన్డ్ రైతుల పేరిట అక్రమంగా ఆయనకు గత ప్రభుత్వం 20 ప్లాట్లు కేటాయించింది. రిజిస్టర్ సేల్ డీడ్ కింద వాటిని ఆయన పేరిట రిజస్టర్ చేశారు. అవన్నీ తుళ్లూరు మండలం మందడం పరిధిలోనివే కావడం గమనార్హం. సర్వే నంబర్లు 199, 133, 131, 242, 236, 321, 308, 307, 268, 295, 408, 296, 413, 465తో ఉన్న ఆ ప్లాట్లను ఆయన విక్రయించేందుకు యత్నిస్తుండటం అమరావతిలో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములన్నీ పలువురి రైతుల పేరిట ఉన్నాయి. కానీ సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం అమరావతి పరిరక్షణ సమితి నేత పేరిట నమోదు కావడం గమనార్హం. ఆ భూముల కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన కొందరు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంకటపాలెంలో సర్వే నంబరు 295/10, 296/5, మందడంలో సర్వే నంబరు 454/3సీ, కురగల్లులో సర్వే నంబరు 500/1లో ఉన్న ప్లాట్లు కూడా విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. సీఐడీ దర్యాప్తులో ఈ బండారం మొత్తం బయటపడింది. అమరావతిలో 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటన్నది పరిశీలించినప్పుడు టీడీపీ భూ బాగోతం గుట్టు రట్టయింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. బడుగు, బలహీన వర్గాల రైతుల స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. వాటిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. వాటిలో అత్యధిక భాగం టీడీపీ పెద్దలు తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. అనంతరం ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినట్టుగా చూపించి ప్లాట్లు తీసుకున్నారు. బినామీలుగా ఉన్నందుకు కొందరు అనుయాయులకు కూడా కొన్ని ప్లాట్లు కేటాయించారు. వారిలో టీడీపీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు, అమరావతి ప్రాంతంలో ఆ పార్టీ కార్యకర్తలు మొదలైన వారు ఉన్నారు. ప్రస్తుతం వారే అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్లాట్లను ఎలా విక్రయిస్తారన్నది తాడేపల్లి, మంగళగిరిలో హాట్ టాపిక్‌గా మారింది. సీఐడీ దర్యాప్తుతో బెంబేలు అమరావతి అక్రమాలపై సీఐడీ దరా>్యప్తుతో అసైన్డ్ దొంగలు కలవరపడుతున్నారు. మొత్తం వ్యవహారం నిగ్గు తేలితే తాము అక్రమంగా పొందిన ప్లాట్ల కేటాయింపును రద్దు చేస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. దాంతో ఆ ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నవారే తమ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తుండటం గమనార్హం. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని న్యాయస్థానం చెప్పింది. దాంతో బోగస్ అమరావతి రైతు ఉద్యమ నేతలకు ఝలక్ ఇచ్చినట్లయింది. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పాదయాత్ర నిలిపివేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది స్పష్టత లేదు. దాంతో తాము అక్రమంగా పొందిన ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేసి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. భూమి చూపించకుండానే కేవలం సేల్ డీడ్ పత్రాలను చూపించి ప్లాట్ల విక్రయాల దందాకు తెరతీశారు. తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెం, కురగల్లు, పెనుమాక, నవులూరు తదితర గ్రామాల్లో అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు లావాదేవీలు జోరందుకున్నాయి. -
వాహనాల అడ్వాన్స్ అక్రమాలపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటుగా సీఐడీ విచారణ చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన 11వ కమిటీ ఆఫ్ పర్సన్స్ (సీఓపీ) సమావేశంలో మంత్రి నాగార్జున పలు అంశాలపై సమీక్షించారు. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి వివిధ జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఈడీ)గా పనిచేస్తున్న వారిలో ఏడాదికాలం సర్వీసును పూర్తి చేసిన వారిని సొంత శాఖలకు వెనక్కు పంపాలని మంత్రి ఆదేశించారు. -
తెలీదు.. గుర్తు లేదు: సీఐడీ విచారణలో ఇదే ‘నారాయణ’ మంత్రం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: టీడీపీ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో శుక్రవారం విచారించారు. అమరావతిలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతో పాటు మొత్తం 14 మందిపై కొన్ని నెలల క్రితం సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో నారాయణను ఆయన నివాసంలో విచారించేలా న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చింది. దాంతో సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించింది. కాగా, సీఐడీ విచారణకు నారాయణ ఏమాత్రం సహకరించలేదని సమాచారం. సీఐడీ అధికారులు ఏం అడిగినా ‘తెలియదు.. గుర్తు లేదు’ అంటూ సమాధానం దాటవేసేందుకు యత్నించారని తెలిసింది. ఈ కేసులో నారాయణను మరికొన్నిసార్లు విచారించాలని సీఐడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఇటూ అటూ బాబు బినామీలే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కూడా ప్రధానమైంది. అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారన్నది సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్ ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌ను డిజైన్ చేసేందుకు ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించినట్టు కథ నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. ముందుగానే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్‌ను చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన సమీక్షలో ఆమోదించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి, వారి బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర ఆధారాలను సీఐడీ విభాగం సేకరించి కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను ఆయన ఇంట్లో సీఐడీ ప్రశ్నించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలపై అధికారులు విచారణ జరిపారు. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగ్‌రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలైన్మెంట్ మార్చడంతో రామకృష్ణా హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్‌కు లబ్ధి చేకూర్చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్మెంట్ మార్పులు చేసిట్టు గుర్తించారు. ఇప్పటికే నారాయణ బెయిల్‌ను సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. చదవండి: ఈడీ విచారణలో ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత -
అయ్యన్నపాత్రుడిని సీఐడీ విచారించుకోవచ్చు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి చుక్కెదురైంది. తన పైన సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణ కేసును కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. 41ఏ నోటీసు ఇవ్వాలని సంబంధిత విచారణ సంస్థకు సూచించింది. అంతేకాదు.. అయ్యన్నపాత్రుడిని, ఆయన తనయుడు రాజేష్‌ను సీఐడీ విచారించుకోవచ్చని తెలుపుతూ.. విచారణకు అయ్యన్నపాత్రుడు సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. -
చట్ట ప్రకారమే టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరెస్ట్
సాక్షి, అమరావతి: కేసుల దర్యాప్తులో చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని సీఐడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేసిన ప్రతిసారీ వారిని అధికారులు కొట్టారంటూ దుష్ప్రచారానికి పాల్పడటాన్ని ఖండించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబును అరెస్టు చేసినట్టు వెల్లడించింది. ‘గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారి భార్య.. అందుకు సహకరించిన ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు.. ఆ మహిళతో పాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు’ అంటూ సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేసిన కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్టు తెలిపింది. నరేంద్రబాబు తన ఫోన్ నుంచి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ఆ మెసేజ్‌లు పోస్టు చేయడం ద్వారా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పింది. ఆయన్ని విచారించేందుకు ఇంటికి వెళ్లగా ఆయన తన ఫోన్లోని మెసేజ్‌లను డిలీట్ చేసేందుకు యత్నించారని తెలిపింది. దాంతో ఐపీసీ సెక్షన్ 201ను అదనంగా నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఆ ప్రకటనలో సీఐడీ వెల్లడించింది. -
నెటాప్స్ ముసుగులో టెర్రర్ సాఫ్ట్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ ప్రాజెక్టు కుంభకోణంలో కీలక పాత్రధారి కనుమూరి కోటేశ్వరరావును సీఐడీ తాజాగా అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ముసుగులో రూ.284 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ నిధులను నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు, ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వేమూరి హరిప్రసాద్ కంపెనీలకు మళ్లించినట్లు వెల్లడైంది. ఈ కేసులో కనుమూరిని ఏ–23గా సీఐడీ పేర్కొంది. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే విదేశాలకు ఉడాయించడంతో కనుమూరిపై సీఐడీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12న అమెరికా నుంచి తిరిగి వచ్చిన నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు. సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేసింది. నిందితుడికి న్యాయస్థానం ఈ నెల 21వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కీలక పురోగతి టీడీపీ హయాంలో ఇన్‌క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవ కుమార్(ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రామ్మూర్తి(ఏ–21)లను ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ–11 తుమ్మల గోపీచంద్, ఏ–22 రామ్‌కుమార్ రామ్మూర్తి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో వేమూరి హరికృష్ణకు సహకరించిన కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేయడం ద్వారా సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. షెల్ కంపెనీలతో కొల్లగొట్టారు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఫైబర్ నెట్ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్‌కు కేటాయించారు. వేమూరి హరికృష్ణ ప్రజాధనాన్ని కాజేసేందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్నాడు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. నెటాప్స్ – టెరాసాఫ్ట్ వయా వేమూరి ► నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. ► నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పని చేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు. ► నెటాప్స్ కంపెనీ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ చేసింది. -
ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడతారా?
సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడతారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి ఆ పార్టీ ఐటీ విభాగమైన ఐటీడీపీ బాధ్యతలు చూస్తున్న చింతకాయల విజయ్‌ని బాధ్యుడిగా చేస్తూ సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సీఐడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. విజయ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని విజయ్ను ఆదేశించింది. సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన తరువాత మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామంది. ఇలాంటి కేసులో దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులను అడ్డుకునేందుకు నిర్దిష్ట యంత్రాంగం లేదన్న కారణంతో ఇష్టమొచ్చిన పోస్టులు పెడుతూ కొందరు చెలరేగిపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇందుకు హైకోర్టు న్యాయమూర్తులు సైతం బాధితులుగా మారారని తెలిపింది. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని, వీటిపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సీఐడీ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ జయసూర్య మంగళవారం విచారణ జరిపారు. విజయ్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్‌తో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. 41ఏ నోటీసు ఇవ్వడానికి పిటిషనర్ ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులు భయానక వాతావరణం సృష్టించారన్నారు. పిటిషనర్‌కు మాత్రం నోటీసు ఇవ్వలేదన్నారు. సీఐడీ తరపు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. నోటీసు ఇచ్చేందుకే పోలీసులు పిటిషనర్ ఇంటికి వెళ్లారని చెప్పారు. పిటిషనర్‌పై పెట్టిన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని, అందువల్ల అరెస్ట్ చేసే అవకాశం లేదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
సీఐడీ విచారణకు హాజరుకాని చింతకాయల విజయ్
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్.. సీఐడీ విచారణకు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐ–టీడీపీ దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక ఐ–టీడీపీ విభాగ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న చింతకాయల విజయ్ పాత్ర ఉన్నట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం దీంతో ఆయనపై క్రైమ్ నంబర్ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్‌విత్ 34, ఐటీ చట్టం సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేశారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో గురువారం విచారణకు హాజరుకావల్సిందిగా ఈ నెల 1న హైదరాబాద్‌లోని విజయ్ నివాసానికి వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. కానీ విజయ్ మాత్రం విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు, ఇతర వివరాలు ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను విజయ్ తరఫు న్యాయవాదులు సీఐడీ కార్యాలయంలో అందించారు. -
సైకోలా అయ్యన్న తీరు
దేవరాపల్లి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సైకో చేష్టలు మానుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సూచించారు. వైఎస్సార్ కుటుంబంపై పిచ్చి ప్రేలాపనలను సహించబోమని హెచ్చరించారు. తారువలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై ఐ టీడీపీ ద్వారా దుష్ప్రచారానికి పాల్పడటంపై సీఐడీ అధికారులు చింతకాయల విజయ్‌కు 41 ఏ నోటీస్ ఇవ్వడానికి వెళ్తే అయ్యన్న అనుచిత వాఖ్యలు చేయటాన్ని ఖండించారు. తప్పు చేయకుంటే సీఐడీ విచారణను ఎదుర్కోవాలన్నారు. నర్సీపట్నంలో యువకుడి చేతిలో ఓటమి చెందడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
ఫేక్ పోస్టులపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి : ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఒక ఉన్నతాధికారిపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన కొల్లు అంకబాబును గురువారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతూ ఓ మహిళ విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తుండగా, కేంద్ర డీఆర్ఐ అధికారులు ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో గుర్తించారు. దీనితో ఏమాత్రం సంబంధంలేని ఒక ఉన్నతాధికారికి ఈ ఉదంతాన్ని ఆపాదిస్తూ కొల్లు అంకబాబు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. ఆ పోస్టులు పెట్టిన అంకబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అది ‘ఐ–టీడీపీ’ పనే
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’పై ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. మార్ఫింగ్ వీడియోల ద్వారా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రతిష్టకు భంగం కలిగించిందన్న ఫిర్యాదుపై టీడీపీ సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదు చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించడం, దుష్ప్రచారానికి ఒడిగట్టి గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీకి పాల్పడిన అభియోగాలపై ఐటీ, ఐపీసీలోని ఫోర్జరీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు మంగళవారం ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఐ–టీడీపీ’, మరికొందరిపై ఐటీ(66టి), ఐపీసీ 465, 469, 471, 153(ఎ), 505(2), 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరుతో ఇటీవల ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ మాధవ్ పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో అనంతపురం పోలీసులు విచారించగా, అది ఫేక్ వీడియో అని నిర్ధారణ అయ్యింది. ఆ మార్ఫింగ్ వీడియోను ఐ–టీడీపీ సోషల్ మీడియా గ్రూప్ తొలుత సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసినట్టు కూడా వెలుగు చూసింది. అది ఒరిజినల్ కానేకాదు.. ఆ వీడియో అసలైనదేనని అమెరికాకు చెందిన ‘ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ’ నిర్ధారించినట్టుగా టీడీపీ నేతలు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆ మేరకు ఎక్లిప్స్ ల్యాబరేటరీ జారీ చేసినట్టుగా ఓ సర్టిఫికెట్‌ను కూడా విడుదల చేశారు. కాగా, ఫోరెన్సిక్ సర్టిఫికెట్ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సీడీఐ విభాగాన్ని ఆదేశించింది. దాంతో సీఐడీ అధికారులు అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని సంప్రదించగా అసలు విషయం వెలుగు చూసింది. ఆ వీడియో అసలైందేనని తాము ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేదని ఆ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. ఓ సెల్ఫోన్లో ప్లే చేస్తున్న వీడియోను మరో సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసిన క్లిప్‌ను మాత్రమే ప్రసాద్ పోతిని అనే వ్యక్తి తమకు పంపినట్టుగా తెలిపింది. వీడియో కాల్ మాట్లాడుతుండగా మొదట రికార్డు చేసిన వీడియో క్లిప్‌ను పంపిస్తే ఆ వీడియోను మార్ఫింగ్ చేశారో లేదో నిర్ధారించగలం తప్ప.. ఇలా ఒక క్లిప్‌ను మూడో వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి రికార్డు చేసిన వీడియోను పరిశీలించి నిర్ధారించలేమని కూడా సీఐడీ విభాగానికి పంపిన ఈ మెయిల్లో స్పష్టం చేసింది. దాంతో ఎంపీ మాధవ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మార్ఫింగేనన్నది స్పష్టమైంది. వాస్తవానికి ఓ ల్యాబరేటరీ ఇచ్చిన సర్టిఫికెట్‌ను యథాతథంగా విడుదల చేయాలి. సర్టిఫికెట్లో మార్పులు చేయడం అన్నది చట్ట వ్యతిరేకం. కానీ టీడీపీ నేతలు ఎక్లిప్స్ ల్యాబొరేటరీ సర్టిఫికెట్‌ను ట్యాంపర్ చేసి మీడియాకు విడుదల చేయడం గమనార్హం. దీనిపై ఎంపీ మాధవ్ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
‘స్కిల్’ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితుల అరెస్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఇద్దరు కీలక నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విపిన్ కుమార్ శర్మ, ఆయన భార్య నీలం శర్మను సీఐడీ అధికారులు అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. వారిని విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయస్థానంలో బుధవారం రాత్రి హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామంటూ షెల్ కంపెనీల ముసుగులో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు రూ.241 కోట్ల నిధులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నకిలీ ఇన్వాయిస్లతో బురిడీ.. రూ.241 కోట్ల ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలకు అడ్డదారిలో నిధులు మళ్లించడంలో ఢిల్లీకి చెందిన విపిన్ శర్మ, నీలం శర్మ దంపతులు కీలకంగా వ్యవహరించారు. వారిద్దరూ ఢిల్లీలో ‘ఇన్ వెబ్ సర్వీసెస్’ అనే ఓ షెల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ఎస్డీసీ నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలకు నిధులు చెల్లించింది. ఈ నిధులను సీమెన్స్, డిజైన్ టెక్.. వివిధ షెల్ కంపెనీల రూపంలో దారి మళ్లించాయి. ఈ క్రమంలో పూణేకు చెందిన స్కిల్లర్ అనే షెల్ కంపెనీ ద్వారా నకిలీ ఇన్వాయిస్లతో నిధులు కొల్లగొట్టిన విషయం గతంలోనే వెలుగు చూసింది. ఆ నిధులను సింగపూర్‌లోని సంస్థలకు తరలించి.. అక్కడి నుంచి టీడీపీ ప్రభుత్వ పెద్దలకు చేర్చారు. అదే రీతిలో విపిన్ శర్మ, నీలం శర్మలకు చెందిన ఇన్ వెబ్ సర్వీసెస్ కంపెనీ నుంచి నకిలీ ఇన్వాయిస్లు తీసుకుని ఆ కంపెనీకి రూ.8.50 కోట్లు చెల్లించారు. అందులో తమ కమీషన్‌గా రూ.7.5 లక్షలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని మళ్లీ టీడీపీ ప్రభుత్వ పెద్దల ఖాతాల్లోకి ఆ కంపెనీ చేర్చింది. సీఐడీ దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. దీంతో డిజైన్ టెక్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని రూ.23 కోట్లను ఇటీవల సీఐడీ అధికారులు జప్తు చేశారు. చంద్రబాబు ఆదేశాలతో రూ.371 కోట్లు చెల్లింపు ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకుండానే చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్ల నిధులను సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్‌లకు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కుంభకోణంలో ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ఇక ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా ఐఏఎస్ అధికారి అపర్ణ ఉపాధ్యాయను నియమించారు. ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న సీమెన్స్ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ భార్య ఈమె. ఈ విధంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కనీసం సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకోలేదు. ఇందులో సీమెన్స్ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్వేర్, మరికొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు. మిగతా రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్ టెక్ ఖాతాలోకి మళ్లించారు. అక్కడి నుంచి టీడీపీ పెద్దల ఖాతాల్లోకి రూ.241 కోట్లు చేరాయి. తనిఖీల్లో వెలుగుచూసిన నకిలీ ఇన్వాయిస్లు.. కాగా కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పూణేలో కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్లు వెలుగు చూశాయి. అవి ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుకు సంబంధించినవని గుర్తించి ఆ విషయాన్ని ఏపీ ఏసీబీ విభాగానికి తెలిపారు. కానీ అప్పటి టీడీపీ పెద్దలు ఈ విషయాన్ని కప్పిపుచ్చారు. పైగా ఏపీఎస్ఎస్డీసీలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీబీ దృష్టికి తెచ్చిన విషయం బయటపడింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు చేపట్టింది. టీడీపీ హయాంలో ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేసుకున్న సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ వ్యవహారాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్పష్టం చేస్తూ ఏపీఎస్ఎస్డీసీకి ఓ లేఖ రాసింది. తాము అందించిన లైసెన్స్డ్ సాఫ్ట్వేర్కుగాను తమకు రూ.56 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించింది. అంతేగానీ వేల కోట్ల ప్రాజెక్టుకు తమ బాధ్యత లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. దీంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు పేరుతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా రూ.241 కోట్లు ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టు తేలింది. కుంభకోణం కథ ఇదీ.. 2014–15 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు రూ.3,556 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే కేవలం కాగితాలపైనే ఓ ప్రాజెక్టును చూపించి ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టారు. ఇందులో భాగంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును సీమెన్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ కాన్విల్కర్ కలిశారు. మొత్తం రూ.3,556 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు 90 శాతం నిధులు పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు ఆ ప్రాజెక్టు వ్యయం రూ.3,556 కోట్లుగా ఎలా నిర్ధారించారని శాస్త్రీయంగా మదింపు చేయనే లేదు. అసలు సీమెన్స్ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలియదు. భారత్‌లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్ టెక్‌తో కలిసి కథ నడిపించారు. -
హీటెక్కిన ఎస్ఐ కొలువుల స్కాం.. సీఐడీ అదుపులో హోంమంత్రి పీఎస్
బనశంకరి(బెంగళూరు): సంచలనాత్మక ఎస్ఐ ఉద్యోగాల కుంభకోణం మరింత వేడెక్కింది. మొన్న అదనపు డీజీపీ అమృత్‌పాల్ అరెస్టు కాగా, ఇప్పుడు ఏకంగా హోంమంత్రి పీఎస్ సీఐడీకి చిక్కాడు. ఈ స్కాంకు సంబంధించి హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యక్తిగత కార్యదర్శి గణపతి భట్‌ను మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితులతో అతడు కుమ్మక్కయ్యాడని ఆరోపణలు ఉండగా, సీఐడీ రంగంలోకి దిగింది. ఆరోపణలకు పలు సాక్ష్యాధారాలు లభించడంతో గణపతిభట్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో హోంమంత్రి అరగ జ్ఞానేంద్రకు, బొమ్మై సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఉత్తర కన్నడ జిల్లా శిరసి ప్రాంతానికి చెందిన గణపతిభట్ ఆర్ఎస్ఎస్లో గుర్తింపు పొందాడు. చదవండి: పబ్లిక్ పార్క్ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు.. డౌటనుమానాలతో నవ్వులు -
రఘురామను విచారించొచ్చు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని, కులాలను అవమానించి, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించినందుకు నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుపై సుమోటోగా నమోదు చేసిన కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున దర్యాప్తును అడ్డుకోవడంలేదని చెప్పింది. రఘురామకృష్ణరాజు తదితరులపై సీఐడీ నమోదు చేసిన కేసులో దేశద్రోహం సెక్షన్‌ను మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, మిగిలిన సెక్షన్ల కింద సీఐడీ చేసే దర్యాప్తునకు సహకరించాలని నిందితులను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసింది. ఇదే కేసులో ఏబీఎన్, టీవీ 5 యజమానులపైనా దర్యాప్తు కొనసాగించవచ్చని సీఐడీకి స్పష్టంచేసింది. సీఐడీ చేతిలో ప్రాణహాని ఉందని రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్‌లోని దిల్కుషా అతిథి గృహంలో విచారించాలని ఆదేశించింది. ఆయన్ని ఇతర నిందితులతో కలిపి విచారించాలనుకుంటే 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని తెలిపింది. రఘురామకృష్ణరాజు ఎంపిక చేసుకున్న న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, వీడియో తీయాలని చెప్పింది. కేసుకు సంబంధించిన విషయాలకే విచారణను పరిమితం చేయాలని స్పష్టంచేసింది. ఆయన హృద్రోగి అని చెబుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు చెప్పింది. ఆయన భద్రతా సిబ్బందిని విచారణ ప్రాంగణం వెలుపలి వరకు అనుమతించాలంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని తేల్చాల్సి ఉన్నందున, దర్యాప్తు పూర్తి చేసిప్పటికీ, చార్జిషీట్ దాఖలు చేయవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలులో ఏదైనా ఉల్లంఘన జరిగితే, అందుకు బాధ్యులైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వేదికపై తీవ్ర చర్చ సీఐడీ కేసును కొట్టేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ రాయ్ బుధవారం మరోసారి విచారించారు. విచారణ కోసం ఓ తటస్థ ప్రాంతాన్ని ఎంపిక చేసి, తమకు చెప్పాలని సీఐడీని, రఘురామకృష్ణరాజును న్యాయమూర్తి ఇంతకు ముందు ఆదేశించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ విషయంపై ఇరుపక్షాల మధ్య చర్చ జరిగింది. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ను ప్రతిపాదించారు. అందుకయ్యే వ్యయాన్ని భరిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనను సీఐడీ తరఫు న్యాయవాది వైఎన్ వివేకానంద వ్యతిరేకించారు. న్యాయమూర్తి సైతం ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు. పోలీసు అధికారుల మెస్ లేదా దిల్కుషా అతిథి గృహాన్ని వివేకా ప్రతిపాదించారు. పోలీసు అధికారుల మెస్కన్నా అతిథి గృహమే మేలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చివరకు దిల్కుషా అతిథి గృహాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హింసను ప్రేరేపించేందుకే ఆ వ్యాఖ్యలు..
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిని, పలు కులాలను అవమానించేలా నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించారని, ఇది ఐపీసీ కింద నేరమని వివరించారు. ప్రతిపక్ష పార్టీ, రెండు వార్తా చానళ్లతో కలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రఘురామకృష్ణరాజుకు పరిపాటిగా మారిందని అన్నారు. రెడ్డి వర్గాన్ని ఉద్దేశించి డియర్ పాస్టర్స్ అని సంభోధిస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అందుకే ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రిని, ఇతర కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తనని ప్రజలు జోకర్‌గా భావించి తన వ్యాఖ్యలను పట్టించుకోలేదని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలని రఘురామకృష్ణరాజు ప్రశ్నిస్తున్నారని ఏజీ తెలిపారు. ఆయన జోకర్ కావొచ్చునని, పాలన అంటే సర్కస్ మాత్రం కాదని వివరించారు. ఆయనపై నమోదు చేసిన దేశద్రోహం కేసుపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించిందని, మిగిలిన నేరాలపై దర్యాప్తు కొనసాగించవచ్చని చెప్పిందన్నారు. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని కూడా ఆయన్ని ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రక్షణకు మించి ఆయన ఇంకా ఎక్కువ రక్షణ కోరుతున్నారని, అందుకు చట్టం అనుమతించదని తెలిపారు. గతంలో విచారణకు వచ్చినప్పుడు సీఐడీ హింసించిందని, అందువల్ల ఇప్పుడు సీఐడీ వద్దకు రాలేనని, తన ఇంటికే అధికారులు రావాలన్న రఘురామకృష్ణరాజు వాదనను ఏజీ తోసిపుచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు ఇంటికి వెళితే, వారిని కాల్చేయాలని భద్రతా సిబ్బందిని ఆదేశించిన ఘనుడని, అందువల్ల ఆయన ఇంటికెళ్లే ప్రసక్తే లేదన్నారు. పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన్ని విచారించే ప్రక్రియను వీడియో తీస్తామని అన్నారు. మరికొందరితో కలిపి ఆయన్ని విచారించాల్సి ఉంటుందని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. సీఐడీ పిలిచిన చోటకి వెళ్లే పరిస్థితి లేదని, మరోసారి దాడి చేయడమో, ఇతర కేసుల్లో అరెస్ట్ చేయడమో చేసే అవకాశం ఉందని అన్నారు. ఆన్లైన్లో లేదా హైదరాబాద్‌లోని పిటిషనర్ ఇంట్లో విచారణ జరపాలని కోరారు. ఈ ప్రతిపాదనను ఏజీ వ్యతిరేకించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందన్నారు. అందువల్ల ఆన్లైన్లో విచారించడమా? లేక తటస్థ ప్రదేశంలోనా అన్నది తెలపాలని సీఐడీకి సూచించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
దుష్ప్రచారం చేసిన వ్యక్తిని విచారించిన సీఐడీ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు షేర్ చేసి, వైరల్ చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లా బోరుబద్ర రామాలయం గుడి ప్రాంతానికి చెందిన ఎ.వెంకటేష్‌ను గురువారం సీఐడీ గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రైవేటు పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేసే అతను సోషల్ మీడియా ద్వారా పలువురికి పంపించినట్లు గుర్తించారు. దీంతో అతనికి నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ గుంటూరు అధికారి ఒకరు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అతనికి సూచించినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేసిన పలువురిని గుర్తిస్తున్నామని వివరించారు. -
సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం.. సీఐడీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాలను ఈ ఏడాది నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం చేసిన వారిలో ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. కాగా వారిలో ముగ్గురిని సీఐడీ అధికారులు మంగళవారం విచారించారు. భారత జాతీయ చిహ్నం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాలను ముద్రించి మరీ ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా ఫేక్ పోస్టులు సృష్టించినట్టు సీఐడీ దృష్టికి వచ్చింది. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాల లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే ఈ పోస్టులు సృష్టించినట్లు విచారణలో వెల్లడైంది. దాంతో మంగళగిరిలోని సీఐడీ విభాగంలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత జాతీయ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాల దుర్వినియోగ నివారణ చట్టం, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆ ఫేక్ పోస్టులను వైరల్ చేసిన 12 సోషల్ మీడియా ఖాతాలను ఇప్పటివరకు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఐదుగురికి 41ఏ నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పరుచూరి రమ్య, బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కోగంటి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా బుర్రిపాలేనికి చెందిన దాసరి కోటేశ్వరరావులను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. మళ్లీ విచారణకు పిలిస్తే రావల్సి ఉంటుందని చెప్పారు. నోటీసులు జారీ చేసినవారిలో మరో ఇద్దరు విచారణకు హాజరుకావల్సి ఉంది. కాగా మరికొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నట్టు దుష్ప్రచారం చేసిన మరికొందరిపై కూడా సీఐడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. -
ఎస్ఐ పరీక్షల స్కాంలో కొత్త కోణం.. కాలువలోకి ఓఎంఆర్ షీట్లు పడేసి..
బనశంకరి(బెంగళూరు): ఎస్ఐ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సీఐడీ అధికారులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసు వెలుగులోకి రాగానే సీఐడీ అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఓఎంఆర్‌షీట్లను కాలువలోకి పడేసినట్లు ఎస్ఐ నియామక అక్రమాలతో సంబంధం ఉన్న సీఐడీ కస్టడీలో ఉన్న కలబురిగి నీరావరి శాఖ ఇంజినీర్ మంజునాథ్ నోరువిప్పాడు. అసలైన ఓఎంఆర్‌షీట్‌కు, కార్బన్‌షీట్‌ను పోల్చి చూస్తే తేడా కనబడటం ఖాయమని భావించిన ఇతడితో డీల్ చేసుకున్న అభ్యర్థులు కార్బన్‌షీట్‌ను కలబురిగి నగర శివారులోని కోటనూరు వద్ద పెద్దకాలువలోకి పడేసినట్లు మంజునాథ్ సీఐడీ ముందు నోరువిప్పాడు. సీఐడీ అధికారులు రెండురోజుల క్రితం మంజునాథ్‌ను కాలువవద్దకు తీసుకెళ్లి పరిశీలించారు. కాగా ఈయన ఇంటిలో గతంలో సీఐడీ అధికారులు 12 హాల్‌టికెట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా పోలీసులకు లొంగిపోక ముందు ఇతను తన సెల్‌ఫోన్‌ను అళంద తాలూకా అమర్జా డ్యాంలోకి విసిరేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కేసులో ముఖ్యసూత్రధారి అయిన డీఎస్పీ శాంతకుమార్‌ను సీఐడీ అధికారులు కోర్టులో హజరుపరిచి తమ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. శాంతకుమార్ 1996 బ్యాచ్ సీఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికై 2006లో ఆర్ఎస్ఐ పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. గుల్బర్గాలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2007–08 నుంచి నియామక విభాగంలో శాంతకుమార్ మకాంవేశాడు. నియామకాల్లో ఏమిజరుగుతుంది అనేది తెలుసుకున్నారు. రెండేళ్ల క్రితం సీఐ నుంచి డీవైఎస్పీగా పదోన్నతి పొందారు. పీఎస్ఐ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి ఓఎంఆర్‌షీట్లు దిద్దినట్లు సీఐడీవిచారణలో తేలింది. చదవండి: వివాహేతర సంబంధం: అర్ధరాత్రి బైక్‌పై వస్తుంటే అడ్డగించి.. -
దర్యాప్తుపై ‘ముద్ర’కు సీఐడీ వెనకడుగు!
సాక్షి, హైదరాబాద్: కుంభకోణాల్లోనే ఈ సొసైటీది ప్రత్యేక ‘ముద్ర’. ఏకంగా తన ఉద్యోగులందరికీ టోకరా వేసింది. పెద్ద ఎత్తున రైతులకు కుచ్చుటోపి పెట్టింది. వీరి వద్ద నుంచి సుమారు రూ.200 కోట్ల మేర స్వాహా చేసింది. అయితే ఈ సొసైటీ అక్రమాలపై దర్యాప్తునకు సీఐడీ వెనుకడుగు వేయడం గమనార్హం. అదే ‘ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’. నల్లగొండ, రామాయంపేట, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సొసైటీపై కేసులు నమోదయ్యాయి. ఇదీ కుంభకోణం కథ... తిప్పినేని రామదాసప్పనాయుడు అనే వ్యక్తి చైర్మన్‌గా ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇది ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీం కింద ఏర్పాటు చేసిన సంస్థగా అందరినీ నమ్మించాడు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేశాడు. అగ్రికల్చర్ సొసైటీ పేరుతో ప్రతి జిల్లాల్లో రైతుల నుంచి రూ.50 వేల చొప్పున డిపాజిట్లు వసూలు చేశాడు. మండలాలు, డివిజన్లలో సొసైటీ కార్యాలయాలను ఏర్పాటు చేసి మేనేజర్, క్యాషియర్ లాంటి ఉద్యోగులను నియమిం చాడు. రెండేళ్ల తర్వాత సొసైటీ పూర్తిస్థాయిలో బ్యాంకుగా మారుతుందని చెప్పి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష వసూలు చేసి ఒరిజినల్ సర్టిఫికెట్లను తన వద్ద సెక్యూరిటీగా పెట్టించుకున్నాడు. నెలకు రూ.20 వేల జీతం చెల్లిస్తానని చెప్పి రూ.4 వేలు, రూ.8 వేల చొప్పున చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడు నెలల్లోనే రామదాసప్పనాయుడు నుంచి ఉద్యోగులకు వేధింపులు మొదలయ్యాయి. డిపాజిట్ల రూపంలో మరింత ఎక్కువ సొమ్ము వసూలు చేయాలని హుకుం జారీచేశాడు. దీంతో ఉద్యోగులు ఒత్తిడికిలోనై రాజీనామాలు సమర్పించగా క్రిమినల్ కేసులు పెట్టిస్తానని, అసాంఘిక శక్తులతో సంబంధాలున్నాయని వేధించాడు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని కోరగా ప్రతి ఉద్యోగి 10 లక్షలు కట్టాలని బెదిరించాడు. దీనితో బాధిత ఉద్యోగులంతా పోలీసులను ఆశ్రయించారు. రూ.200 కోట్లకుపైగా వసూలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల పేరుతో 1,780 మంది నుంచి రూ.లక్ష నుంచి ఆపై మొత్తం లో వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. రైతులకు రుణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత స్కీంల పేరుతో భారీగానే వసూలు చేసినట్టు ఆ ఉద్యోగులు వెల్లడించారు. ఇలా మొత్తంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డబ్బుతో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకుంటేగానీ బాధితులకు న్యాయం చేయలేమని పోలీసులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేసి విచారణ పక్కాగా జరిగేలా చూడాలని దర్యాప్తు అధికారులైన పలువురు సీఐలు, ఎస్ఐలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎస్పీలు, కమిషనర్లు సీఐడీకి లేఖలు రాసినా పట్టించుకోవడంలేదు. స్కామ్ సొమ్ముతో కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలంటే హైదరాబాద్ సీసీఎస్‌తోపాటు సీఐడీకి మాత్రమే అధికారాలున్నాయి. -
అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తులో సీఐడీ నిద్రమత్తులో జోగుతోంది. వేల ఎకరాలు చే తులు మారుతున్నా పట్టించుకోకపోవడమే కాకుం డా గతంలో అటాచ్ చేసిన ఆస్తులను కాపాడటంలోనూ విఫలమవుతోంది. హైదరాబాద్‌లో అగ్రిగోల్డ్‌కు చెందిన ఓ భవనాన్ని కబ్జాదారులు కూల్చేసి దర్జాగా మరో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతుండటం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం జప్తు: హైదరాబాద్‌లోని కాప్రాలో అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫారమ్స్ లిమిటెడ్‌కు 333 గజాల స్థలంలో ఓ భవనం ఉంది. దీన్ని సీఐడీ 2018లోనే జప్తు చేసింది. అయితే గతేడాది 2021 మేలో ఒక వ్యక్తి కబ్జాకు విఫలమయత్నం చేశాడు. అప్పుడు అగ్రిగోల్డ్ డైరెక్టర్లలో ఒకరైన అవ్వా సీతారామారావు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్జా వ్యవహారం, కేసు నమోదుపై 2021, మే 21న మల్కాజ్గిరి డీసీపీ సీఐడీకి ఓ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించిన జీవోలతోపాటు వివరాల ప్రతిని ఇవ్వాలని, తమ జోన్లో అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఒక భవనం కబ్జాపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సీఐడీకి ఆ డీసీపీ రాసిన లేఖగానీ, ఆస్తి కబ్జా సమాచారం గానీ లేదు. గతేడాది దర్యాప్తు అధికారి ఆ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడం, అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఇచ్చిన సమాచారంతో కనీసం క్షేత్రస్థాయిలోనూ తనిఖీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. దర్జాగా భవనం కూల్చి...: ఈసీఐఎల్‌లో ఉన్న అగ్రిగోల్డ్‌కు చెందిన భవనాన్ని కూల్చేసి బోరు వేసి న ఓ వ్యక్తిపై అగ్రిగోల్డ్ బాధిత సంఘం ‘సాక్షి’కి సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై వరుస కథనాలు అందిసు ్తన్న ‘సాక్షి’కి బాధితులు ఆ ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు అందజేశారు. ఈ విషయాన్ని సీఐడీ ఉన్నతాధికారులకు తెలపగా అప్పుడు రంగంలోకి దిగారు. నెల రోజుల క్రితం ఆ స్థలంలో ఉన్న భవ నం కూల్చేసి బోర్ వేసినట్టు బాధితులు గుర్తించా రు. ఆ ఫొటోలను సీఐడీకి పంపగా కొత్తగా వచ్చిన దర్యాప్తు అధికారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి సంబంధిత స్థలం సీఐడీ జప్తులో ఉందని, కబ్జాకు యత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ ఎట్టకేలకు బోర్డు ఏర్పాటు చేశారు. జప్తు చేసిన వాటిని కాపాడాలి.. అగ్రిగోల్డ్‌కు చెందిన బినామీ ఆస్తులను ఎలాగూ గుర్తించని సీఐడీ అధికారులు, కనీసం జప్తులో ఉన్న ఆస్తులనైనా కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కష్టపడి సంపాధించిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో పెట్టి మోసపోయామని... ఇప్పటికైనా సీఐడీ అధికారులు జప్తు చేసిన ఆస్తుల పరిస్థితి ఏమిటి? అవి భద్రంగా ఉన్నాయా లేకా అన్యాక్రాంతమయ్యాయా అనే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ విషయంలో స్థానిక పోలీసుల నుంచి లేఖలు వచ్చినా అవి దర్యాప్తు అధికారి వరకు రాకపోవడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అటాచ్ చేసిన ఆస్తుల పరిస్థితిపై దృష్టి పెట్టకపోవడంపై గత దర్యాప్తు అధికారి నిర్లక్ష్యం ఉన్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
రఘురామ పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని, కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. సీఐడీ విచారణకు ప్రత్యక్షంగా కాకుండా ఆన్లైన్ ద్వారా హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అలాంటి వెసులుబాటు ఇవ్వడం సాధ్యం కాదంది. రాఘురామకృష్ణరాజు తన పిటిషన్లో సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసు జారీచేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై సీఐడీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసుకు ఆ సెక్షన్లు వర్తించవని చెప్పారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై చేసినట్లు కాదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగమే కదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినా అవి ఆరోపణలు, అపవాదులు అవుతాయే తప్ప దేశద్రోహం కిందకు రావని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ తరఫున స్పెషల్ పీపీ చైతన్య వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు 110 మందికిపైగా సాక్షులను విచారించామని తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దీనిపై రాష్ట్రంలో పలుచోట్ల ధర్నాలు, నిరసనలు కూడా జరిగాయని చెప్పారు. రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో సీఐడీ అదనపు డీజీపై దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని, వాటన్నింటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌తో సహా మిగిలిన ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ విచారణను వాయిదా వేశారు. ఈ సమయంలో ఆదినారాయణరావు స్పందిస్తూ సీఐడీ విచారణకు ఆన్లైన్ ద్వారా స్పందించేందుకు వెసులుబాటునివ్వాలని కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. -
మరింత లోతుగా ‘స్కిల్’ స్కాం దర్యాప్తు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారులు రెండో రోజూ దర్యాప్తు కొనసాగించారు. హైదరాబాద్‌తో పాటు పూణే, ముంబై, ఢిల్లీలోని షెల్ కంపెనీల రికార్డులను పరిశీలించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని కీలక ఆధారాలను సేకరించడం కోసం సీఐడీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. -
పెద్ద సారు వద్దన్నా... దర్యాప్తునకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ‘బోధన్’స్కాంపై సీఐడీ తదుపరి దర్యాప్తును ఓ ఉన్నతాధికారి అడ్డుకుంటున్న వైనాన్ని వివరిస్తూ ‘పెద్దసారు వద్దనే.. దర్యాప్తు ఆగేనే’పేరిట ‘సాక్షి’శుక్రవారం ప్రచురించిన కథనం అధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో 2005 నుంచి 2015 మధ్య జరిగిన రూ. 275 కోట్ల నకిలీ చలాన్ల కుంభకోణంలో కీలక నిందితులను అరెస్టు చేయరాదంటూ ఆ అధికారి హుకూం జారీ చేయడంతో నాలుగేళ్లుగా నిలిచిన దర్యాప్తులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ కేసులో నిందితులను ప్రశ్నించాకే చార్జిషీట్ వేస్తామని ఇంతకాలం దర్యాప్తుకు అడ్డుపడుతున్న ‘పెద్దసారు’కు సీఐడీ తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ స్కాం బోధన్ సర్కిల్ కార్యాలయంలో జరిగినా దాని లింకులు హైదరాబాద్ కేంద్ర కార్యాలయం వరకూ ఉన్నట్లు సీఐడీ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పాత్రపై ఆధారాలున్నందున వారిని ప్రశ్నించేందు కు అనుమతివ్వాలని కోరినట్లు సమాచారం. తొలుత 8 మందికి తాఖీదులు? కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివి ధ స్థాయిల్లోని 42 మంది అధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న సీఐడీ అధికారులు... తొలుత 8 మంది నిందితులకు తాఖీదులు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ముగ్గురు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు (ఏసీటీవో), ఇద్దరు సూపరింటెండెంట్లు, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఆడిటింగ్‌లోని ఓ అసిస్టెంట్ కమిషనర్‌ను విచారిం చేందుకు వారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వారంతా బోధన్‌తోపాటు నిజామాబాద్ జిల్లాలో పనిచేసి తర్వాత కేంద్ర కార్యాలయానికి వచ్చినట్లు సీఐడీ గతంలోనే ధ్రువీకరించింది. ఈ కేసులో ప్రధా న నిందితుడిగా ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్ ఎస్ఎల్ శివరాజు కాల్‌డేటాలో వారి నంబర్లతోపాటు లావాదేవీల వివరాలు, సంబంధిత అధికారుల యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, ఉన్నట్లు గుర్తించింది. వణికిపోతున్న అధికారులు... ఈ కేసును తొక్కిపెట్టామని భావిస్తున్న నిందితులు సీఐడీ తాజా దూకుడుతో వణికిపోతున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లూ పెద్ద దిక్కుగా ఉన్న ఓ మాజీ ఐఏఎస్ అధికారి వద్దకు వెళ్లి తమను కాపాడాలని ప్రాధేయపడ్డట్లు తెలియవచ్చింది. అయితే ఆయన నుంచి కూడా పెద్దగా హామీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడ్డట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే బెయిల్‌పై వచ్చిన ఓ అధికారిని సంప్రదించి సీఐడీ అధికారులు ఏమేం ప్రశ్నలు అడిగారు.. అందుకు ఎలాంటి సమాధానాలు చెప్పావో తెలపాలని ఆరా తీసినట్లు తెలుస్తోంది. -
ఫైబర్ నెట్ కుంభకోణంలో సాంబశివరావు అరెస్ట్
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటుచేసుకున్న ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంలో ఏ–2 నిందితుడు, అప్పటి ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ కె.సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. అక్టోబర్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మచిలీపట్నంలోని సబ్‌జైలుకు తరలించారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్ల మొదటి దశలో రూ.330 కోట్ల అవినీతిపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసి 19మంది నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా సాంబశివరావును కొన్ని రోజులుగా సీఐడీ అధికారులు విచారించారు. Raj Kundra: నీలిచిత్రాల కేసులో నేనే బలిపశువును: రాజ్ కుంద్రా చంద్రబాబు తన సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో సాంబశివరావు కీలకంగా వ్యవహరించారు. టెరాసాఫ్ట్ బిడ్ దాఖలు చేసేందుకే టెండర్ల గడువును పొడిగించారు. టెరాసాఫ్ట్ సమర్పించిన ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్‌ను ఆయన ఆమోదించారు. ఆ ఫేక్ సర్టిఫికెట్ సరైందేనని ఒప్పుకోమని సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. దీనిపై విచారణలో ప్రశ్నించగా ఫేక్ సర్టిఫికెట్‌ను ఆమోదించడం నేరమేనని సాంబశివరావు సమ్మతించినట్టు సమాచారం. వీడియోలను అడ్డం పెట్టుకుని.. 250 మందిని ట్రాప్ చేశారు ఇక కేంద్ర టెలికాం శాఖ మార్గదర్శకాలు, టెండరు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అర్హత లేదని పలువురు బిడ్డర్లు ఆధారాలతో ఆయనకు ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆ ఫిర్యాదులను ఆయన బేఖాతరు చేశారు. టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టారు. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంలో మరికొందరు కీలక నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
ఏపీ ఫైబర్‌నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్టయ్యారు. గత ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనిచేశారు. ఇప్పటికే సాంబశివరావు, హరిప్రసాద్‌లను సీఐడీ విచారించింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం సాంబశివరావును సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు విజయవాడ స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాంబశివరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారులు తరలించనున్నారు. టెర్రా సాఫ్ట్ కంపెనీకి సాంబశివరావు నిబంధనలకి విరుద్దంగా టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. (చదవండి: భారీ మోసం: ఫైబర్‌నెట్‌లో ‘చంద్ర’జాలం) ఫైబర్ నెట్‌లోని తొలి ఫేజులో రూ.320 కోట్ల టెండర్లలో రూ.121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఇప్పటికే ఈ అక్రమాలపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ-1గా వేమూరి హరిప్రసాద్, ఏ-2గా సాంబశివరావులపై కేసు నమోదైంది. గత నాలుగైదు రోజులగా వేమూరితో పాటు సాంబశివరావును కూడా సీఐడీ పలుమార్లు విచారించింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు దక్కేలా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు చక్రం తిప్పారు. చదవండి: ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’ -
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: రెండో రోజు సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ కేసును బుధవారం రెండో రోజు సీఐడీ విచారణ చేపట్టింది. రెండో రోజు సీఐడీ విచారణకు వేమూరి హరిప్రసాద్ హాజరయ్యారు. నిన్న(మంగళవారం) వేమూరితో పాటు ఇన్ కాప్ మాజీ ఎండి సాంబశివరావుని కూడా సీఐడీ విచారించింది. నోటీసులు అందుకున్న ముగ్గురిలో నిన్న ఇద్దరు విచారణకు హాజరయ్యారు. సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు ఫైబర్ నెట్ కుంభకోణంలో A-1 వేమూరి హరిప్రసాద్, ఎ-2 మాజీ ఎండి సాంబశివరావు.. టెర్రా సాఫ్ట్‌కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడంపై సీఐడీ ప్రశ్నించింది. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీఐడీ మొత్తం19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మిగిలిన నిందితులకి సీఐడీ నోటీసులు జారీ చేయనుంది. -
ఫైబర్ నెట్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ
-
ఫైబర్‌నెట్ కేసులో ముగ్గురికి నోటీసులు
-
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: ముగ్గురికి సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: ఫైబర్‌నెట్ కుంభకోణంపై విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఫైబర్‌నెట్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన సీఐడీ.. నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వేమూరి హరిప్రసాద్, సాంబశివరావు, గోపీచంద్‌కు నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్లో రూ.320 కోట్లకి టెండర్లు పిలిస్తే 121 కోట్ల అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలకి పాల్పడ్డారు. (చదవండి: ఫైబర్‌నెట్ అక్రమార్కులకు శిక్ష తప్పదు) బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. టెండర్లలో పాల్గొనేందుకు టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు. ఈ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు -
ఫైబర్‌నెట్ అక్రమార్కులకు శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణానికి సంబంధించి సీఐడీ దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు లభించాయని, ఇందులోని సూత్రధారులు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ చైర్మన్ పి. గౌతమ్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని టెరాసాఫ్ట్ కంపెనీకి రూ.321 కోట్ల విలువైన టెండర్లు అప్పగించడమే కాకుండా రూ.121 కోట్ల పనులకు అక్రమ చెల్లింపులు జరిపారన్న విషయం సీఐడీ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోని కొంతమంది పెద్దలు టెరాసాఫ్ట్ పేరుతో ఏ విధంగా టెండర్లు దక్కించుకున్నారన్న విషయంపై స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. టెండర్ల ఎంపికలో టెరాసాఫ్ట్ ఎండీ.. టెరాసాఫ్ట్‌కు ఎండీగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్ 2015లో టెండర్లు పిలిచే సమయానికి ఆ పదవికి ఆయనతో రాజీనామా చేయించి ఏపీఎస్ఎఫ్ఎల్ టెండర్ల పరిశీలన కమిటీలో సభ్యునిగా నియమించారని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అలాగే, ఏడాదిపాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఆ సంస్థను కేవలం రెండు నెలల్లోనే నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని.. టెండర్ల గడువును ఒక వారం పొడిగించి బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించిన మర్నాడే ఆ కంపెనీతో టెండర్లు వేయించారన్నారు. టెరాసాఫ్ట్‌కు ఈ రంగంలో అనుభవం లేకపోయినా టెండర్లు కట్టబెట్టినట్లు ఆయన తెలిపారు. ఇలా అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వైనంపై బేస్ పవర్ సిస్టమ్స్ అనే కంపెనీ ఫిర్యాదు చేస్తే దానిపై దర్యాప్తు చేయకుండా, ఏకంగా ప్రభుత్వమే బేస్ పవర్ సిస్టమ్స్‌పై కేవియట్ దాఖలు చేసిందంటే ఈ కుట్ర వెనకున్న వారి హస్తం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న ప్రతీఒక్కరూ శిక్ష ఎదుర్కొక తప్పదన్నారు. ప్రస్తుతం 19 మంది అనుమానితులపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, దర్యాప్తు తర్వాత కీలక వ్యక్తుల పాత్ర బయటకు వస్తుందని గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై ‘సీఐడీ’ వేయండి
నరసాపురం: గత సర్కార్ హయాంలో అన్నదాతలను మోసం చేస్తూ టీడీపీ నేతలు చేసిన రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖ కోరింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో లీజు ముగిసిన భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ అమాయకులైన రైతుల నుంచి డబ్బులు దండుకున్న వ్యవహారంపై సమగ్ర దర్యాపునకు ఆదేశాలివ్వాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ‘నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీ’ భూముల రిజిస్ట్రేషన్‌కు కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారాన్ని గతేడాది సెప్టెంబర్ 16న ‘టీడీపీ తీరంతా అవినీతి’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కుంభకోణంపై అప్పటి నరసాపురం సబ్ కలెక్టర్ విచారణ చేసి.. అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రిటిష్ హయాంలో ఇచ్చిన భూములు.. బ్రిటిష్ హయాంలో నరసాపురం తీర ప్రాంతమంతా ఇసుక భూములే. ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు కలిసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. తమకు భూములిస్తే.. సాగు చేసుకుని ఉపాధి పొందుతామన్నారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. స్థానిక రైతులంతా కలిసి నరసాపురం అగ్రికల్చర్ కంపెనీగా ఏర్పడ్డారు. దర్భరేవు, మర్రితిప్ప, వేములదీవి ప్రాంతాల్లోని 1,811.33 ఎకరాలను ఈ కంపెనీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1920లో ఆమోదం తెలిపింది. అమలు కాని జీవోను అడ్డంపెట్టుకొని.. మొత్తం 1,811.33 ఎకరాల్లో గట్లు, నీటి కుంటలను తీసివేయగా.. నికరంగా 1,754.49 ఎకరాలను 1,485 మంది రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లీజు గడువు ముగింపునకు వచ్చింది. ఈ భూములను ఉచితంగా ఇస్తామంటూ సాగుదారులకు టీడీపీ పాలకులు సరిగ్గా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 2019 జనవరి 24న జీవో కూడా విడుదల చేశారు. ఎకరాకు రూ.1,000 చొప్పున రైతులకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ భూముల వ్యవహారాలు చూసేందుకు రైతులు సభ్యులుగా ఉన్న ‘కంపెనీ’ బోర్డుకు టీడీపీ నేత కోట్ల సాయి వెంకట రాజా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో కలిసి బోర్డు డైరెక్టర్లు, టీడీపీ స్థానిక నేతలు సజ్జా వీర వెంకట సత్యనారాయణ, మేకా శ్రీధర్ చౌదరి రంగంలోకి దిగారు. రైతుల నుంచి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. డబ్బులివ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసేది లేదంటూ బెదిరించారు. దీంతో 1,485 మంది సాగుదారుల్లో 760 మంది రూ.1.58 కోట్లు ఇచ్చారు. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవోను మాత్రం అమలు చేయలేదు.. రైతుల పేర్ల మీద భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ కుంభకోణాన్ని గతేడాది ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. బాధిత రైతులు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, అప్పటి సబ్ కలెక్టర్ విశ్వనాథన్‌కు ఫిర్యాదు చేశారు. రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు మా కుటుంబానికి కంపెనీ భూముల్లో 5 ఎకరాలున్నాయి. తరతరాలుగా వాటిని సాగు చేసుకుంటున్నాం. 2019 ఎన్నికలకు ముందు మీ భూములు మీకే రిజిస్ట్రేషన్ చేసేస్తాం.. ఎకరాకు రూ.21 వేలు కట్టాలని చెప్పారు. రూ.1,000 ప్రభుత్వానికి, మిగిలినవి ఖర్చులకని చెప్పి.. నా నుంచి రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదు. మా నుంచి వసూలు చేసిన డబ్బులను బోర్డు పెద్దలే జేబులో వేసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే వారేమీ జవాబివ్వట్లేదు. సీఐడీ విచారణతో న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం. – జి.బంగార్రాజు, రైతు, దర్భరేవు -
టీడీపీ కుంభకోణాలపై దర్యాప్తు.. సీఐడీ సమాయత్తం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఫైబర్‌నెట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై దర్యాప్తునకు సీఐడీ సంసిద్ధమవుతోంది. ఫైబర్‌నెట్ టెండర్లలో రూ.2వేల కోట్ల అవినీతి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లింపు వ్యవహారాలపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సీఐడీ కార్యాచరణకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం రెండు వేర్వేరు దర్యాప్తు బృందాలను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆ రెండు సంస్థల్లో టెండర్ల, నిధుల మళ్లింపు వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. అనంతరం ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తారు. అలాగే, దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాల్సిన సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులు, అప్పటి ప్రభుత్వ అధికారుల జాబితాలను కూడా రూపొందించనున్నారు. దర్యాప్తులో పరిశీలించేవి ఇవే.. ఫైబర్‌నెట్ టెండర్ల కోసం కేంద్ర టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్, సాంకేతిక బిడ్లలో అర్హతలు నిర్ణయించిన విధానం, ఫైనాన్స్ బిడ్లలో కోట్ చేసిన రేట్లు, వాటిపై పలు సంస్థల అభ్యంతరాలు మొదలైనవి దర్యాప్తులో ప్రధానంగా పరిశీలించనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో షెల్ కంపెనీలకు రూ.241.78 కోట్లు దారి మళ్లించిన తీరుపై సీఐడీ దర్యాప్తు చేయనుంది. ఆ షెల్ కంపెనీల చిరునామాలు, వాటిలోని డైరెక్టర్లు, వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించి వారితో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ఉన్న సంబంధాలను ఆరా తీయనుంది. ఈ రెండు కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేసి నిర్ణీత సమయంలో విచారణను ఓ కొలిక్కి తీసుకురావాలని సీఐడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
టీడీపీ కుంభకోణాలపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో రాష్ట్రంలో భారీ ఎత్తున నిధులు దోపిడీ చేసిన రెండు కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. నాటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సన్నిహితులు, బినామీలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టి రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన అవినీతిపై చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో దాదాపు రూ.2 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన కంపెనీ టెరాసాఫ్ట్‌కు ఈ కాంట్రాక్టును నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరిట రూ.241.78 కోట్లను దారి మళ్లించారు. సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో షెల్ కంపెనీలకు అడ్డగోలుగా నిధులు దోచిపెట్టారు. ఈ 2 కుంభకోణాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లోనే జాతీయ స్థాయిలో దుమారం ఫైబర్ నెట్ టెండర్ల అక్రమాలపై కేసు విచారణకు తగిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. చంద్రబాబు హయాంలో ‘ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్’ చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు టెండర్లలో అడ్డగోలు అవినీతికి పాల్పడిన వైనంపై అప్పట్లోనే జాతీయ స్థాయిలో దుమారం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో భారత్ నెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం 2014–19లో ఫైబర్ నెట్ రెండో దశ పనులు చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, బినామీ వేమూరి హరికృష్ణకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వ సలహాదారు కూడా అయిన వేమూరి హరికృష్ణ ఈ ఫైబర్ నెట్ టెండర్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తనకు చెందిన టెరా సాఫ్ట్ కంపెనీకే టెండర్లు ఖరారు చేశారు. ఈ టెండర్లను అత్యధిక రేట్లకు అంటే అంచనా విలువ కంటే ఏకంగా 11.26 శాతం అధికానికి కట్టబెట్టేశారు. టెండర్లలో ఎల్–1గా వచ్చిన సంస్థను కాదని ఎల్–3గా నిలిచిన టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు అప్పగించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు విరుద్ధంగా భూగర్భ ఇంటర్నెట్ కేబుళ్లు కాకుండా ఓపెన్ కేబుళ్లకు కూడా అనుమతి ఇచ్చేశారు. వేమూరి హరికృష్ణకు అయాచితంగా లబ్ధి చేకూర్చేందుకు సెట్‌టాప్ బాక్సుల సరఫరా కాంట్రాక్టును కూడా నాలుగు ప్యాకేజీల కింద విభజించి మరీ టెరా సాఫ్ట్కంపెనీకి కట్టబెట్టారు. 13 జిల్లాల్లో ఫైబర్ నెట్ నిర్వహణ కాంట్రాక్టు కూడా అదే రీతిలో ఆ సంస్థకే ఏకపక్షంగా అప్పగించారు. భారత్ నెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ రేట్లకు టెండర్లను ఆమోదించడం గమనార్హం. టెలికం శాఖ అభ్యంతరాలూ బేఖాతరు కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ ఓసారి అభ్యంతరాలు వ్యక్తం చేసి టెండర్లను ఆమోదించలేదు. దాంతో ఓ బినామీ సంస్థతో జాయింట్ వెంచర్ ముసుగులో మళ్లీ అదే రీతిలో టెరాసాఫ్ట్ సంస్థకే ఫైబర్ నెట్ టెండర్లను అడ్డగోలుగా అప్పగించేశారు. టెండర్లలో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పక్కనపెట్టేసి టెరా సాఫ్ట్ కంపెనీకి అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా టెండర్లను ఖరారు చేసింది. ఈ కుంభకోణంపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అంతర్జాతీయ టెలికాం సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖకు ఫిర్యాదు చేశాయి. షెల్ కంపెనీలకు రూ.241.78 కోట్లు మళ్లింపు కాగా, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మరో కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని అక్రమంగా బినామీ కంపెనీలకు తరలించినట్టు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో సుమారు రూ.241.78 కోట్లు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని తరలించినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లెక్క తేల్చింది. టీడీపీ హయాంలో డిజైన్ టెక్ సంస్థతో కలిసి సీమెన్స్ సంస్థ విద్యార్థులకు నైపుణ్యం పేరుతో భారీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు రూ.37 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 10 శాతం వాటా రూ.370.78 కోట్లను ప్రభుత్వం భరించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శిక్షణ పేరుతో రికార్డుల్లో భారీగా వ్యయం చేసినట్టు చూపించి రూ.241.78 కోట్లను బినామీ కంపెనీల ద్వారా అక్రమంగా తరలించినట్టు తేలింది. సీమెన్స్, డిజైన్ టెక్ల ద్వారా జరిగిన అక్రమ నగదు తరలింపు లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఎస్డీసీని ఆదేశించింది. ఈ మేరకు కేసు విచారణను సీఐడీకి ఇస్తూ రాష్ట్ర ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట ప్రకారం దర్యాప్తును పూర్తి చేసి త్వరితగతిన నివేదిక అందించాల్సిందిగా సీఐడీ అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది. కేసుపై సమగ్ర దర్యాప్తు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ నెట్ కాంట్రాక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. అందులో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలతోపాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. అందుకే సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీఐడీకి ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. -
వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్‌రెడ్డి
-
ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ
-
ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ : గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో యథేచ్ఛగా అక్రమాలు జరిగాయి. కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండిపడింది. -
రెండో రోజూ.. ఉమ దాటవేత ధోరణి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేసి.. ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన కేసులో నిందితుడైన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండో రోజు విచారణలోనూ దాటవేత ధోరణే అవలంభించారు. మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం 11గంటలకు వచ్చిన ఉమను రాత్రి 8 గంటల వరకు విచారించారు. సీఎం వైఎస్ జగన్ వీడియో మార్ఫింగ్‌పై కీలక సమాచారం రాబట్టేందుకు సీఐడీ ప్రయత్నం చేసింది. తొలి రోజు విచారణలో దాటవేసిన సమాధానాలను రాబట్టేందుకు అవే ప్రశ్నలను రెండో రోజు కూడా సీఐడీ అధికారులు సంధించారు. అయినప్పటికీ తన ఫోన్‌కు సంబంధించిన సమాచారం, మార్ఫింగ్ వీడియో ప్రదర్శించిన ట్యాబ్, తగిన ఆధారాలపై ఉమ స్పష్టత ఇవ్వలేదని సమాచారం. దీంతో ఈ నెల 4వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు ఉమకు నోటీసు ఇచ్చారు. అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి తేలుస్తాం..ఉమ టీడీపీ అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి తేలుస్తామని, తమను ఇబ్బంది పెట్టిన పోలీసులను గుర్తుపెట్టుకుని మరీ ఛత్తీస్‌గఢ్, ఒడిశా బోర్డర్‌కు పంపిస్తామని మాజీ మంత్రి ఉమ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. సీఐడీ విచారణకు ముందు, అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ పోలీసులను టార్గెట్ చేసి హెచ్చరికలు చేశారు. కేసులకు భయపడేది లేదని, రాజమండ్రి జైల్లో ఉండడానికైనా తాను సిద్ధమన్నారు. -
ఎవరి కోసం చేశారు?.. దేవినేని ఉమాపై సీఐడీ ప్రశ్నల వర్షం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేసి అనని మాటలను అన్నట్టుగా ఎందుకు చూపించారు? ఎవరి ప్రోద్బలంతో చేశారు? ఎవరి ప్రయోజనం కోసం మీరు ఆపని చేశారు?.. అంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉమాను దాదాపు 10 గంటలపాటు సీఐడీ దర్యాప్తు అధికారులు పదేపదే ప్రశ్నించినా ఆయన పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. సీఎం వైఎస్ జగన్ వీడియోను మార్ఫింగ్ చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ నెల 7న దుష్ప్రచారం చేసిన ఉమాపై కర్నూలులో సీఐడీ ఈ నెల 9న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణకు సహకరించాలన్న కోర్టు డైరెక్షన్ మేరకు ఆయన గురువారం మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. సీఐడీ కార్యాలయంలోని ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ప్రత్యేక గదిలో ఉదయం 10.40 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీఐడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ వీడియో, ఆడియోను మార్ఫింగ్ చేసి తిరుపతిలో మత విద్వేషాలు, అలజడులు రేపేందుకు ఎందుకు కుట్ర చేశారని, ఇందులో మీకు ఎటువంటి ప్రయోజనాలున్నాయని ప్రశ్నించినట్టు సమాచారం. వీడియో మార్ఫింగ్ ఎలా చేశారని, ఎందుకు చేశారని ప్రశ్నించగా.. ఆ వీడియోను తాను పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకున్నట్టు ఉమా బదులిచ్చారని తెలిసింది. తిరుపతి ప్రెస్మీట్లో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ వీడియో ప్రదర్శించిన సెల్‌ఫోన్, ట్యాబ్ గురించి సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో ఆయన సమాధానం దాటవేసినట్టు తెలిసింది. దాదాపు 10 గంటలపాటు సాగిన విచారణలో పదేపదే అడిగిన పలు ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో వాస్తవాలు రాబట్టేందుకు శనివారం (మే 1వ తేదీ) మరోసారి విచారణకు హాజరుకావాలని ఉమాను సీఐడీ అధికారులు ఆదేశించారు. ఉమా ఉపయోగించిన సెల్‌ఫోన్, ట్యాబ్‌లతోపాటు సీఐడీ అధికారులు అడిగిన ఆధారాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు అందజేయాలని కోరినట్టు తెలిసింది. తొలిరోజు విచారణలో ఉమా చెప్పిన విషయాలను సీఐడీ అధికారులు రికార్డు చేసినట్టు తెలిసింది. చదవండి: ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
‘నా ఫోన్‌ను ట్యాప్ చేశారు’: ముఖ్యమంత్రి
గల్సీ (పశ్చిమ బెంగాల్): పోలింగ్ బూత్ వద్ద భద్రతా బలగాల కాల్పుల తర్వాత ఆ మృతదేహాలతో ర్యాలీ చేపట్టాలని తాను ఆదేశించానని చెబుతున్న ఆడియో టేప్ వివాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘నా ఫోన్‌ను ట్యాప్ చేశారు. ఈ మొత్తం వివాదంపై నిజానిజాలు రాబట్టేందుకు సీఐడీ విచారణకు ఆదేశిస్తాను’ అని మమత ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గల్సీలో జరిగిన సభలో మమత ప్రసంగించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పోల్చుకుంటే తృణమూల్ కాంగ్రెస్‌తో ఏ పార్టీ సాటిరాలేదని మమత వ్యాఖ్యానించారు. ‘వంట చేస్తున్నామా.. ఇంటి పని చేస్తున్నామా అనేది సహా మా దినచర్య మొత్తం మీద బీజేపీ నిఘా పెట్టింది అని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మా పాత్ర లేదు అని బీజేపీ చెబుతోంది. మరోవైపు ఈ ఆడియో టేప్ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘ఆ ఆడియో టేప్ నకిలీది. అలాంటి సంభాషణ జరగనే లేదు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయడం ఆశ్చర్యంగా ఉంది’ అని టీఎంసీ వ్యాఖ్యానించింది. -
లేనిది ఉన్నట్టు.. అంతా 'కనికట్టు'
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అసలు వైద్య పరికరాలే లేవు. అయినా రికార్డుల్లో మాత్రం ఉన్నట్టు చూపించారు. పాడవడంతో మూలన పడేసిన పరికరాలు పనిచేస్తున్నట్టు రికార్డుల్లో చూపించారు. పరికరాల వాస్తవ ధరకు.. రికార్డుల్లో చూపించిన ధరకు అసలు పొంతన లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో కొన్ని రోజులుగా సీఐడీ ప్రత్యేక బృందాలు చేస్తున్న తనిఖీల్లో వెలుగు చూస్తున్న నిజాలివి. చంద్రబాబు హయాంలో వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్‌లో అడ్డగోలుగా సాగిన కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు మొదలుపెట్టింది. మొత్తం 1,315 ఆస్పత్రులు ఉండగా.. ఇప్పటివరకు 40 శాతం ఆసుపత్రుల్లో సోదాలు పూర్తయినట్టు సమాచారం. పాత తేదీలతో సంతకాలు చేసి.. టెలీ బయోమాటిక్ సర్వీసెస్ (టీబీఎస్) సంస్థకు బిల్లులు చెల్లించేందుకు అప్పటి ఉన్నతాధికారులు, నాయకులు తొక్కని అడ్డదారి అంటూ లేదు.అప్పటి ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా పనిచేసిన సీహెచ్.గోపీనాథ్, బయో మెడికల్ ఇంజనీర్ రోహిణి చెప్పినట్టు నడుచుకున్నామని కొంతమంది వైద్య సిబ్బంది చెబుతుండగా.. మరికొందరు అప్పటి ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మౌఖిక ఆదేశాల మేరకు ఆ తప్పులు చేశామని చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో పెద్ద చేపలు కీలక పాత్ర పోషించాయనే విషయం తెలుస్తోంది. టీసీఎస్ సంస్థ వైద్య పరికరాల నిర్వహణను సక్రమంగా చేయలేదు. అయినా సరే మొత్తం పరికరాల విలువలో 7.5 శాతం బిల్లులు పెట్టారు. దీనికి తొలుత బిల్లు చెల్లించారు. ఆ తర్వాత ఈ కేసు కోర్టుకు వెళ్లింది. ఆ వెంటనే బిల్లులపై వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లతో పాత తేదీలతో బిల్లులపై సంతకాలు చేయించారు. ఇప్పుడా సంతకాలే వారి మెడకు చుట్టుకున్నాయి. ఎందుకు సంతకాలు చేశారు, వైద్య పరికరాలను మరమ్మతు చేసినట్టు ఆధారాలున్నాయా అని అడిగితే.. తమకు తెలియదని, ఈ తేదీలతో సంతకాలు చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశించారని చెబుతున్నారు. ఏఎంసీ (వార్షిక నిర్వహణ) పరిధిలో ఉన్న వాటికీ ఎందుకు సంతకాలు చేశారని అడుగుతుంటే.. తమకు తెలియదని సమాధానమిస్తున్నారు. ఈ కుంభకోణం ఉన్నతాధికారులతో పాటు పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది మెడకు కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. కొనసాగిన తనిఖీలు విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో సీఐడీ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. ఇప్పటికే సేకరించిన ఆధారాలను దృష్టిలో పెట్టుకుని సీఐడీ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోంది. తొలుత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు(జీజీహెచ్), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ)లలో సోదాలు కొనసాగుతున్నాయి. 13 జిల్లాల్లోనూ 42 ప్రత్యేక బృందాలు సేకరించిన వివరాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన అన్ని లెక్కల్ని తేల్చాకు మరింత దూకుడుగా దర్యాప్తు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. -
ఆస్పత్రుల్లో కొనసాగుతున్న సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి/కల్యాణదుర్గం టౌన్: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన వైద్య పరికరాల నిర్వహణ స్కామ్‌పై సీఐడీ దర్యాప్తు సోమవారం కూడా కొనసాగింది. గత సర్కార్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన స్కామ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించిన సీఐడీ ఆస్పత్రుల వారీగా వైద్య పరికరాల వివరాలను లెక్కతేల్చేందుకు ఈ నెల 10న రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 1,315 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు రోజులుగా సోదాలు చేపట్టింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 42 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రితోపాటు అదే జిల్లాలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ సీఐడీ బృందాలు సోదాలు కొనసాగించాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంతోపాటు పలు ఆస్పత్రుల్లోనూ తనిఖీలు చేపట్టాయి. 2015 నుంచి 2018 వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన వైద్య పరికరాలు, అప్పటికే ఉన్న పరికరాలు, వాటి విలువ, పనితీరు, నిర్వహణ చార్జీల పేరుతో చెల్లించిన మొత్తాలపై ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలకు చెందిన రికార్డులను కూడా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. -
అడుగడుగునా మేసేశారు
సాక్షి, అమరావతి: విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో పనిచేయని సిటీ స్కాన్ మెషిన్‌ను పని చేస్తున్నట్టు చూపించారు. దాని విలువ రూ.2 కోట్లుగా చూపించి.. ఆ మొత్తంపై 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో బిల్లులు కొట్టేశారు. కర్నూలు జీజీహెచ్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్ ధరను రూ.3.60 కోట్లుగా రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి మార్కెట్లో దీని విలువ రూ.1.69 కోట్లు. జెమిని అనే ప్రైవేట్ సంస్థ అప్పటికే పదేళ్ల ఒప్పందంతో దాని నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం టెండర్ ఇచ్చిన బెంగళూరు టీబీఎస్ సంస్థ కూడా నిర్వహణ సేవల పేరుతో బిల్లులు పెట్టి నిధులు గుంజేసింది. అంటే ఒకే ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్ నిర్వహణ పేరిట రెండు సంస్థలకు బిల్లులు ఇవ్వడమే కాకుండా, మార్కెట్ ధర కంటే రెట్టింపు చూపించి ఏడాదికి రూ.26.82 లక్షలను నిర్వహణ చార్జీల పేరిట అదనంగా తినేశారు. ఈ విధంగా వైద్య పరికరాల నిర్వహణ పేరిట అడుగడుగునా ప్రజాధనాన్ని మేసేశారు. ఈ కుంభకోణం తీరును లోతుగా పరిశీలిస్తే లెక్కలేనన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్ స్కామ్‌పై సెక్షన్ 420, 406, 477 కింద నేర పరిశోధన విభాగం (సీఐడీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే... కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వైద్య పరికరాల నిర్వహణ తంతు నడిపినట్టు నిర్థారణ అవుతోంది. అప్పటి సీఎం చంద్రబాబు, కామినేని శ్రీనివాస్‌తోపాటు వైద్య, ఆరోగ్య శాఖ కీలక అధికారుల అండతోనే అవినీతి, అక్రమాలు జరిగినట్టు సీఐడీ అంచనాకు వచ్చింది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలీమాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ సంస్థకు 2015లో ఏడాది మాత్రమేనంటూ టెండర్ ఖరారు చేసిన నాటి నుంచి.. నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లు కొనసాగించడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాల మొత్తం విలువకు 7.45 శాతం చొప్పున నిర్వహణ రుసుం చెల్లించే ఒప్పందంతో ఈ కుంభకోణానికి బీజం పడింది. టెండర్ దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు పెంచేసి మోసానికి పాల్పడింది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరికరాలు మొత్తం విలువ రూ.300 కోట్లు లోపే ఉంటుందని, దాన్ని ఏకంగా రూ.508 కోట్లుగా చూపించి ఆ మొత్తానికి 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో నిధులు కొల్లగొట్టారు. ఇందుకోసం ఆ సంస్థకు ఏడాదికి రూ.38.22 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించిన ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో భాగంగా తొలి ఏడాది చెల్లించిన రూ.38.22 కోట్లకు అదనంగా ఏటా పది శాతం చొప్పున నిర్వహణ సేవల మొత్తాన్ని చెల్లించారు. మరికొన్ని అక్రమాలు ఇలా.. ప్రకాశం జిల్లా కంభం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో రూ.లక్ష విలువైన స్కానింగ్ మెషిన్‌ను రూ.2.40 లక్షలుగా చూపించి నిర్వహణ చార్జీలు వసూలు చేశారు. వాస్తవానికి దీనికి గతం నుంచి కృష్ణా డయాగొస్టిక్స్ అనే సంస్థ నిర్వహణ కాంట్రాక్ట్ కలిగి ఉంది. అంటే ఒకే స్కానింగ్ మెషిన్‌కు రెట్టింపు ధర చూపడమే కాకుండా రెండు సంస్థలు బిల్లులు పెట్టుకునే మోసాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200 పైగా వెంటిలేటర్లు ఉన్నట్టు లెక్కల్లో చూపించారు. ఒక్కొక్క వెంటిలేటర్ విలువ సుమారు రూ.7.10 లక్షలు కాగా.. రూ.11 లక్షలుగా చూపించారు. వాస్తవానికి వీటికి వారంటీ ఉన్నందున నిర్వహణ వ్యయం అవసరం లేదు. అయినా ధర అధికంగా చూపించి నిర్వహణ చార్జీల మోత మోగించారు. ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకు టెక్నీషియన్లు, తగిన విద్యార్హతలు కలిగిన సిబ్బందిని నియమించాలి. అందుకు విరుద్ధంగా నాన్ టెక్నీషియన్లను, డిగ్రీ చదివిన వారిని నియమించుకుని తక్కువ జీతాలతోనే ఐదేళ్లు నెట్టుకొచ్చి కోట్లు కొల్లగొట్టినట్టు సీఐడీ పరిశీలనలో తేలింది. -
వైద్య సేవల్లోనూ రూ.కోట్లు మింగిన అవినీతి రాబందులు
సాక్షి, అమరావతి: వైద్య సేవల్లోనూ కోట్లు తినేసిన అవినీతి రాబందుల రెక్కలు విరిగే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాల నిర్వహణ పేరుతో మొత్తం రూ.200 కోట్లు కొల్లగొట్టడానికి జరిగిన భారీ స్కామ్ వెనుక సూత్రధారులుగా ఉన్న గత ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం బెంగళూరుకు చెందిన ఒక సంస్థను తెర మీదకు తెచ్చి టెండర్లు కట్టబెట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కానున్నాయి. ఈ స్కామ్‌పై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇందుకూరి వెంకట రామరాజు ఫిర్యాదు మేరకు సెక్షన్–420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారుల డైరెక్షన్లోనే ఈ మొత్తం అవినీతి వ్యవహారం సాగినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అవినీతి కథ ఇలా.. 41–11–2015 ► టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ సంస్థకు ఏడాది కాలానికి టెండర్ ఖరారు చేస్తూ గత ప్రభుత్వం జీవో నంబర్ 660 ఇచ్చింది. దీనిలో భాగంగా 13 జిల్లాల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లోని పరికరాల నిర్వహణ సేవల బాధ్యతలను చంద్రబాబు సర్కార్ ఆ సంస్థకు అప్పగించింది. 27–11–2017 ► ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కీలక అధికారులతోపాటు వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ఉన్న జితేంద్రశర్మతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 703 జారీ చేసింది. అధికారులను సంప్రదించకుండా బయటి వ్యక్తిగా ఉన్న జితేంద్రశర్మ ద్వారా బెంగళూరు సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం వెనుక చంద్రబాబు, కామినేని ప్రయోజనాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. 18–12–2017 ► ఈ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇందుకూరి వెంకట రామరాజు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎటువంటి విచారణ జరగకుండా ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్, డైరెక్టర్‌గా ఉన్న శంకబ్రతబాగీ్చలపై చంద్రబాబు ప్రమేయంతో కొందరు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకోకుండానే ఆ ఆరోపణలు నిజం కాదని తేల్చింది. 23–4–2018 ► దీనిపై వెంకట రామరాజు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదించాలంటూ ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 31–7–2019 ► వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్టులో అవకతవకలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 14–10–2019 ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. హైకోర్టు తీర్పు, ఏసీబీ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ, అందుకు సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖకు నివేదించారు. 4–3–2020 ► టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థపైన, బాధ్యులపైన, వైద్య ఆరోగ్య శాఖ అధికారులపైన కేసు పెట్టాలంటూ సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. సెప్టెంబర్ 2020 ► వైద్య పరికరాల నిర్వహణలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ప్రాథమిక నిర్ధారణతో కాంట్రాక్టు సంస్థ ఒప్పందాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 12–2–021 ► కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అనిల్‌కుమార్ సింఘాల్ సీఐడీని కోరారు. దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం అవినీతి, అక్రమాలపై నిర్ధారణకు వచ్చిన సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. టెండర్ ఖరారు నుంచే అక్రమాలు.. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ సంస్థకు టెండర్ ఖరారు కట్టబెట్టడం నుంచే అక్రమాలు కొనసాగాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాల నిర్వహణకు ఆ సంస్థకు ఏడాదిపాటు కాంట్రాక్టును అప్పగిస్తూ 2015లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా దాన్ని ఐదేళ్లపాటు కొనసాగించారు. టెండరు దక్కించుకున్న సంస్థ.. ఉపకరణాల విలువను మార్కెట్ ధరల కంటే ఎన్నో రెట్లు అమాంతంగా పెంచేసి మోసానికి పాల్పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరికరాల మొత్తం విలువ రూ.300 కోట్లు లోపే ఉంటుంది. అయితే దాన్ని ఏకంగా రూ.508 కోట్లుగా చూపించి.. ఆ మొత్తానికి 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందుకోసం ఆ సంస్థకు ఏడాదికి రూ.38.22 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించిన ఐదేళ్ల కాంట్రాక్టులో భాగంగా తొలి ఏడాదిలో చెల్లించిన రూ.38.22 కోట్లకు అదనంగా ఏటా పది శాతం చొప్పున పెంచి నిర్వహణ సేవల మొత్తాన్ని చెల్లించారు. ఇలా ఐదేళ్లలో రూ.200 కోట్లకుపైగా ఆ సంస్థ బిల్లులు పెట్టగా.. గత సర్కారు రూ.100 కోట్లకుపైగా చెల్లించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. -
‘అసైన్డ్’ స్కామ్‌లో సీఐడీకి కీలక ఆధారాలు!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణంపై విచారణ నిర్వహిస్తున్న సీఐడీ దర్యాప్తు అధికారులు తాజాగా కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఫిర్యాదుదారైన ఆర్కే, అప్పటి గుంటూరుæ జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్‌ను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. అసైన్డ్ భూముల కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీలు ఉన్నట్లు సీఐడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో దీన్ని ఎత్తివేసేలా ప్రాథమిక ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయడంపై సీఐడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు సేకరించిన పలు ఆధారాలను కూడా న్యాయస్థానానికి నివేదించనుంది. హైకోర్టు స్టే ఉత్తర్వులను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు రెండు రోజులుగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కేసులో క్షుణ్నంగా దర్యాప్తు జరిపేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
‘అసైన్డ్’పై గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారు?
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారంటూ సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారుల బృందం ప్రశ్నించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులపై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కారు హయాంలో రాజధానికోసం భూ సమీకరణ(ల్యాండ్ ఫూలింగ్) జరిగినప్పుడు ఆ ప్రాంతమున్న గుంటూరు జిల్లాకు జాయింట్ కలెక్టర్గాను, రాజధానిలో రైతుల భూముల సేకరణ, ప్లాట్లు కేటాయింపు తదితర చర్యలు చేపట్టినప్పుడు సీఆర్డీఏ కమిషనర్‌గాను కీలక బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్‌ను శుక్రవారం విజయవాడలోని సత్యనారాయణపురం సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు. అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా చేతులు మారుతున్నప్పుడు, అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న మీరు ఎందుకు పట్టించుకోలేదని శ్రీధర్‌పై సీఐడీ అధికారులు ప్రశ్నలవర్షం కురిపించినట్టు సమాచారం. మంత్రివర్గ ఆమోదం లేకుండానే జీవోలు జారీ చేస్తున్నా, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ అడ్డగోలుగా జరిగినా ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారిగా తన పరిధి మేరకు ఏది చట్టబద్ధమో? ఏది చట్టబద్ధం కాదో? ప్రభుత్వానికి చెప్పడం వరకే తన బాధ్యత అని, ఆచరించడం, ఆచరించకపోవడం అనేది వారిష్టమని శ్రీధర్ చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో ఇంకా అనేక కీలక ఆధారాలను శ్రీధర్ నుంచి సీఐడీ సేకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామానికి చెందిన దళిత రైతుల నుంచి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ పోలీసులు శుక్రవారం పలు వివరాలు సేకరించారు. చంద్రబాబు హయాంలో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. -
చంద్రబాబు – నారాయణపై విచారణకు బ్రేక్ 4 వారాలు ‘స్టే’
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణతో పాటు తదుపరి చర్యలపై హైకోర్టు తాత్కాలికంగా ‘స్టే’ విధించింది. సీఆర్డీఏ చట్టం కింద చేపట్టిన చర్యల విషయంలో ప్రభుత్వం, అధికారులు, అథారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి సూట్ దాఖలు చేయడం గానీ, ప్రాసిక్యూట్ చేయడంగానీ చేయరాదంటూ సీఆర్డీఏ చట్టం సెక్షన్ 146లో నిషేధం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణార్హతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయంది. ఈ ప్రశ్నలను తేల్చేంత వరకు, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆధారాలను బట్టి చంద్రబాబు, నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నాలుగు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ప్రాసిక్యూషన్‌పై సెక్షన్ 146 నిషేధం విధిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సీఐడీ, ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డిని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జాస్తి నాగభూషణ్ వాదనలను వినిపించారు. కక్ష సాధింపులో భాగం.. ప్రభుత్వ పెద్దలు వరుసగా పిటిషనర్లపై దాడులు చేస్తున్నారని, ఇప్పుడు సీఐడీతో కేసులు నమోదు చేయించారని సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి వాదనలు వినిపించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో చంద్రబాబుపై ఒక కేసు (ఓటుకు కోట్లు) వేశారని, అది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. రాజధాని భూ సమీకరణలో అసైన్డ్ భూములను చేరుస్తూ జారీ చేసిన జీవో 41 విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకే జీవో జారీ అయిందన్నారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉందన్నారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు.. అసైన్డ్ భూములను భూ సమీకరణలో భాగం చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకోకముందే నిర్ణయించారని అదనపు ఏజీ నాగభూషణ్ న్యాయస్థానానికి నివేదించారు. టీడీపీ వారికి లబ్ధి చేకూర్చాలనే ఇలా చేశారని వివరించారు. గుంటూరు జిల్లా నవులూరులో 70 ఎకరాల అసైన్డ్ భూమి తీసుకుని ప్లాట్ల పంపిణీని మాత్రం 105 ఎకరాల మేర చేశారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. వారికి కావాల్సిన వారికి మరో 35 ఎకరాల మేర లబ్ధి చేకూర్చారన్నారు. మిగిలిన చోట్ల కూడా ఇలాగే జరిగిందన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. అప్పటి తహసీల్దార్ అన్నే సుధీర్‌బాబు పాత్రపై విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. అసైన్డ్ భూముల బదలాయింపులో చంద్రబాబు, నారాయణలకు సంబంధం ఉందని, వారి ఆదేశాల మేరకే జీవో 41 జారీ అయిందన్నారు. ఇదే విషయాన్ని రూఢీ చేస్తూ అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారని నివేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించి నోట్ ఫైళ్లు, అడ్వొకేట్ జనరల్ సలహాలు లేవన్నారు. జీవో 41 వల్ల అసైనీలు మాత్రమే కాకుండా సీఆర్డీఏ, ప్రభుత్వం కూడా నష్టపోయిందన్నారు. సదుద్దేశ చర్యలకే సెక్షన్ 146 నిషేధం వర్తిస్తుంది... ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ రాయ్ స్పందిస్తూ.. సీఆర్‌ఏడీ చట్టం సెక్షన్ 146 కింద ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉంది కదా? అని ప్రశ్నించారు. దీనిపై ఏజీ నాగభూషణ్ సమాధానమిస్తూ సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలకే అది వర్తిస్తుందన్నారు. చంద్రబాబు, నారాయణ దురుద్దేశాలతో వ్యవహరించారని, కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చాలనే జీవో 41 తెచ్చారన్నారు. వాదనల అనంతరం ఈ కేసులో నాలుగు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అయితే విచారణపై స్టే కేవలం చంద్రబాబు, నారాయణకే వర్తిస్తుందా? లేక అధికారులతోపాటు ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారికి కూడా వర్తిస్తుందా? అని అదనపు ఏజీ భూషణ్ వివరణ కోరడంతో, ఈ కోర్టుకు చంద్రబాబు, నారాయణ మాత్రమే వచ్చారని, అందువల్ల ఈ ఉత్తర్వులు వారికి మాత్రమే వర్తిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
అక్రమాల పుట్ట ‘అమరావతి’
సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే. ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్‌తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్‌లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. అక్రమాల చిట్టా... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మైత్రీ ఇన్ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది. బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా.. టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్‌కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తాజాగా అసైన్డ్ భూ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు నేపథ్యంలో ఈ నెల 23న చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన తప్పించుకునేందుకు దారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం. -
రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇటీవల ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పోలీస్, దేవదాయ శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వెలంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి హంగులతో ఆలయం ఆధునికీకరణ ఎటువంటి వసతులు లేని రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆలయ డిజైన్లు ప్రాథమికంగా తయారు చేయించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో విగ్రహ పునఃప్రతిష్ఠ తేదీలను ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను సైతం తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అది టీడీపీ కార్మిక సంఘం కట్టుకున్న గుడి విజయవాడ బస్టాండ్‌లో ఘటన జరిగిన ఆలయం టీడీపీ అనుబంధ కార్మిక సంఘం సభ్యులు కట్టుకున్నదని.. అందులో మట్టి విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారని మంత్రి వివరించారు. ఆ ఆలయానికి, దేవదాయ శాఖకు, ప్రభుత్వానికి సంబంధం లేదని.. గుడి భద్రతను పట్టించుకోవాల్సిన టీడీపీ దానిని ఎందుకు పట్టించుకోలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ధ్వంసంపైనా సీఐడీ విచారణకు ఆదేశించామని.. ఆ ఆలయం కూడా టీడీపీ నేత గన్ని కృష్ణ నిర్వహణలో ఉందని అన్నారు. నిందితులకు శిక్షలు పడ్డాయ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవదాయ శాఖకు సంబంధించి 8 ఆలయాల్లో దుశ్చర్యలు చోటు చేసుకున్నాయని.. వాటిలో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉండే వాటితో కలిపి మొత్తం 31 ఆలయాలపై దాడులు జరిగాయని, గుప్త నిధుల కోసం తవ్వకాలు, హుండీ చోరీలు వంటి వాటితో కలిపి పోలీసులు 88 కేసులు నమోదు చేశారని వివరించారు. ఆ కేసుల్లో 159 మందిని అరెస్ట్ చేశారని, వారిలో కొందరికి రెండేళ్ల శిక్ష పడిందని, మరికొందరు రిమాండ్‌లో ఉన్నారని వివరించారు. ప్రైవేట్ ఆలయాల్లో భద్రతపైనా దృష్టి గడచిన రెండేళ్లలో రాష్ట్రంలోని 31 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు దేవదాయ శాఖ గుర్తించింది. వీటిలో 23 ఆలయాలు ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉన్నట్టు తేల్చారు. దేవదాయ శాఖ పరిధిలోని 8 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో మారుమూల ఉండే ప్రైవేట్ ఆలయాల భద్రతపై దేవదాయ శాఖ, పోలీసులు శాఖ దృష్టి పెట్టాయి. ప్రైవేట్ ఆలయాల భద్రత విషయంలో ఆలయ నిర్వహక కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. పోలీసు స్టేషన్ల వారీగా ప్రైవేట్ ఆలయాల నిర్వహకులను పిలిపించి మాట్లాడే ప్రక్రియను పోలీసులు మొదలు పెట్టారు. -
సీఐడీ దర్యాప్తు జరగాల్సిందే..
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి తుళ్లూరు తహసీల్దార్ అన్నె సుదీర్‌బాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం, స్టే ఇవ్వడం లాంటివి చేయరాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంగా చెప్పిందని పేర్కొంది. ఈ వ్యవహారంలో సుదీర్‌బాబుపై తీవ్రమైన ఆరోపణలున్నాయని గుర్తు చేసింది. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అన్నె సుధీర్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఐడీ తరఫున పీపీ కె.శ్రీనివాసరెడ్డి, సుదీర్‌బాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. పేదల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చడంలో సు«దీర్‌బాబు కీలక పాత్ర పోషించారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న శ్రీనివాసరెడ్డి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఎస్సీ, ఎస్టీలను భూములు అమ్ముకునేలా చేసి ఇతరులకు లబ్ధి చేకూర్చడంలో సుదీర్బాబుదే కీలక పాత్ర అనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయన్న శ్రీనివాసరెడ్డి వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. పెద్ద మొత్తం చేతులు మారిందని, ఇందులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందన్న వాదనను పరిగణలోకి తీసుకుంది. -
‘శ్రీశైలం’ ఎఫ్ఐఆర్లో మార్పులు!
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది మందిని బలితీసుకున్న శ్రీశైలం దుర్ఘటన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్)లో మార్పులు జరిగాయి. గత గురువారం రాత్రి 4వ ఫేజ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం తొమ్మిది మంది మరణానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శనివారం హైదరాబాద్ నుంచి ఈగలపెంట వెళ్లిన సీఐడీ బృందం పలు కీలక ఆధారాలు సేకరించింది. వారు గమనించిన అంశాల ఆధారంగా ఎఫ్ఐఆర్లో మార్పులు జరిగాయని సమాచారం. కేసును మలుపు తిప్పే ఆధారాలు సీఐడీ విభాగానికి లభించాయని, అందుకే, ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి ఉంటారని పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యమా? నిర్వహణ లోపమా?: ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో పోలీసులు ప్రధానంగా నిర్లక్ష్యం, కుట్ర, నిర్వహణ లోపాలపై దృష్టి సారిస్తారు. ఈ కేసులో కుట్రకు అవకాశం లేకపోవడంతో సీఐడీ అధికారులు నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలపైనే దృష్టి పెట్టారని సమాచారం. ఈ రెండు అంశాలపై లోతైన దర్యాప్తు జరపనున్నారు. ఇందులో భాగంగా సీఐడీ అధికారుల బృందం శ్రీశైలం పవర్‌ప్లాంట్‌ను ఈ వారంలోనే సందర్శించే అవకాశాలు ఉన్నాయి. సొంత రెస్క్యూ టీమ్ ఎక్కడ?: సింగరేణి భూగర్భ గనులు ఉన్న ప్రాంతాల్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ టన్నెల్ 1.2 కిలోమీటరుకుపైగా భూమి లోపలికి ఉంటే.. సింగరేణి బొగ్గు గనులు 5 కిలోమీటర్లకుపైగా ఉంటాయి. గనుల్లో ప్రమాదాలు జరిగితే కార్మికులను రక్షించేందుకు ప్రత్యేకం గా రెస్క్యూ సిబ్బంది ఉంటారు. సింగరేణిలో ఎక్కడ ప్రమాదం జరిగినా.. క్షణాల్లో వీరికి సమాచారం చేరుతుంది. కొద్ది నిమిషాల్లోనే వీరు ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు ప్రారంభిస్తారు. కానీ, శ్రీశైలం పవర్‌ప్లాంట్‌కు ఈ తరహా ఏర్పాటు లేదు. పవర్‌ప్లాంట్‌లో రక్షణ చర్యల విషయంలో సీఐడీ అధికారులు సంతృప్తిగా లేరని సమాచారం. ప్రత్యేక రెస్క్యూ విభాగం ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మంటలనార్పేందుకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థపైనా అధికారులు పెదవి విరుస్తున్నారు. వందల కిలోవాట్ల మేర సామర్థ్యమున్న మెషీన్లకు అగ్నిప్రమాదం సంభవిస్తే.. ఆర్పేందుకు ధీటైన అగ్నిమాపక సదుపాయాలు లేవన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైనట్టు సమాచారం. -
ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యుట్ కారణమని అంతా భావిస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కొత్త బ్యాటరీలు అమర్చున్న తరణంలోనే అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అర్దరాత్రి వేళ బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఏముంది..? బ్యాటరీలు అమర్చే సమయంలో జరిగిన పొరపాటే 9 మంది ప్రాణాలు బలితీసుకున్నాయా..? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు జన్కోలో పనిచేసి ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ప్రమాదంపై సీఐడి విచారణ ముమ్మరం చేసింది. దర్యాప్తుకు కావాల్సిన పూర్తి స్థాయి ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఓ వైపు సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా..? లేక మానవ తప్పిదం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదంతా సాంకేతికమైన అంశం కావడంతో ప్రధానంగా యూనిట్ల పనితీరు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకోసం విద్యుత్ రంగ నిపుణుల సహకారం, ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఐతే సీఐడి విచారణ ఇలా కొనసాగుతుండగానే ప్రమాదం రోజుకో ఒకరమైన వాదనలు వెలుగు చూస్తున్నాయి. ఆ వాదనలు ప్రమాదం ముమ్మాటికి మానవ తప్పిదాలే కారణం అన్న ప్రచారం సాగుతుంది. (కొంపముంచిన అత్యవసర స్విచ్!) 220 కేవీకి డీసీ కరెంటు సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్యానల్ బోర్డులో మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగిందని జన్కో ఉద్యాగులు భావిస్తున్నారు. జనరేటర్‌ను నియంత్రించే సెన్సార్ కు నేరుగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోడ్ పెరిగి మంటలు చెలరేగినట్టు అధికారులు అనుకుంటున్నారు. ప్రమాదం జరిగిన రోజున హైద్రాబాద్ జల సౌదాలో సీఈ స్థాయిలో ఉన్న ఓ అధికారి వచ్చి బ్యాటరీలను మార్పించే పనులను హడావిడిగా చేశారన్న గుసగులు వినిపిస్తున్నాయి. ఇక్కడ సీఈ ఉన్నా ఆయన ప్రమేయం లేకుండానే సదరు అధికారే నలుగురిని తీసుకువచ్చి బ్యాటరీ మార్పిడి కార్యక్రమం చేపట్టినట్టు సమాచారం. అక్కడ పనిచేస్తున్న డీఈ, ఏఈ హడాహుడి పనులపై అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నేను చెప్పింది చేయాల్సిందేనని హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడి నుంచి బదిలీ ఐన ఓ డీఈ రిలీవ్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. బ్యాటరీలను మార్చాలని రెండేళ్ల క్రితమే ప్రతిపాదించినా... ఇంత జాప్యం జరగడం వెనక ఈ తతంగం నడిపిన సీఈ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా అర్దరాత్రి సమయంలో హడావిడిగా బ్యాటరీల మార్పు వెనక కూడా ఈయన హస్తం ఉందని స్పష్టమౌతుంది. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) ఐతే ఈ దారుణ ఘటనపై అనుమానాలు, వాదనలు, విమర్శలు ఎలా ఉన్నా... ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్ప లేదు. ప్రస్తుతం జల విద్యుత్ కేంద్రం మళ్లీ పూర్వ వైభవానికి నోచుకోవాలంటే వేల కోట్లకు పైగా ఖర్చు చెయ్యక తప్పని పరిస్థితి నెలకొంది. అంతే కాదు ప్రమాదానికి గురైన యూనిట్లలో కొన్ని పరికరాలను జపాన్ కు ఆర్డర్ పై తెప్పించాల్సి ఉండటంతో పునరుద్దరణకు నెలలు సమయం పట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఏది ఏమైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బ్యాటరీలు పాడయ్యేవరకు ఎందుకు నిర్లక్ష్యం?
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్‌హౌస్ ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. ప్యానల్ బోర్డులో వచ్చిన మంటలపై దర్యాప్తు కొనసాగుతోంది. 220 కేవీ డీసీ విద్యుత్ సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్రమాదం జరిగినట్టు అంచనాకొచ్చింది. అయితే, అర్ధరాత్రి బ్యాటరీలు ఎందుకు బిగించాల్సి వచ్చింది? అధికారులు, సీఈలు లేకుండా బ్యాటరీలు ఎందుకు ఏర్పాటు చేశారు? బ్యాటరీలు బిగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదు? బ్యాటరీలు పూర్తిగా పాడయ్యే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అని శ్రీశైలం విద్యుత్ అధికారులను సీఐడీ బృందం ప్రశ్నించింది. దాంతోపాటు చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలను సేకరించింది. చదవండి: కొంపముంచిన అత్యవసర స్విచ్!) కాగా, శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 యూనిట్లు ఉండగా, వీటికి సంబంధించిన టర్బయిన్లను తెరిచి చూసే అవకాశం ఉంది. అప్పుడే నష్టంపై పూర్తి అంచనా రానుందని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. టర్బయిన్ల పైన ఉండే జనరేటర్లు, వైన్డింగ్ కాయిల్స్ కాలిపోతే మాత్రం నష్టం రూ.వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఆరు యూనిట్లలో తొలి రెండింటి టర్బయిన్లు బాగానే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
143 మంది అత్యాచారం.. రోజుకో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ అత్యాచారం కేసు పోలీసులకి తలనొప్పిగా మారింది. గడిచిన 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీస్ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో లోతైన దర్యాప్తు కోసం కేసు బాధ్యతను ఎవరికి అప్పగించాలో కసరత్తు చేస్తున్నారు. ఈ కేసును సీఐడికి అప్పగించాలా లేదా సీసీఎస్‌కి బదిలీ చేయాలా అనే దాని గురించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. ఆధారాలు లేవు.. సీసీఫుటేజ్ దొరకడం అసాధ్యం నిజంగానే తొమ్మిదేళ్లుగా యువతిపై అత్యాచారం చేస్తూ వస్తున్నా ఎందుకు ఇప్పటి వరకు బాధితురాలు నోరు విప్పలేదు? పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు అనుకున్న మరి మీడియా ముందుకు రావొచ్చు కదా అనే వారు కూడా లేక పోలేదు. అయితే ఈ ప్రశ్నల గురించి భరోసా సెంటర్లో కౌన్సలింగ్ చేస్తున్న పోలీసులు భాదితురాలను ప్రశ్నించగా కొన్నిటికి సమాదానాలు ఇచ్చింది. ‘ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే నిన్ను చంపేస్తాం .. నీకు వెనుక ముందు ఎవరు లేరు’ అని చాలా మంది కాల్స్ చేసి బెదిరించారని తెలిపింది. దాంతో ఆ వేధింపులు భరించలేక తానే ఆత్మహత్య చేసుకుందాం అని నిర్ణయం తీసుకొని మరణ వాంగ్మూలం కూడా రాసి పెట్టినట్లు బాధితురాలు వెల్లడించింది. (143 మంది అత్యాచారం చేశారు) ఈ ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని బాధితురాలిని ప్రశ్నించగా.. లేవని.. కానీ తాను వెళ్లిన హోటల్స్ అడ్రస్‌లు చెపుతాను అక్కడికి వెళ్లి దర్యాప్తు చేయండి అంటూ పోలీసులుకి సూచనలు చేసింది. ఈ మేరకు అక్కడకు వెళ్లిన పోలీసులకు తొమ్మదేళ్ళ క్రితం, ఐదేళ్ల క్రితం ఫుటేజ్ ఇప్పుడు దొరకడం అనేది అసాధారణంగా మారింది. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: నిందితులు ఎలాగో ఆధారాలు దొరకవు కాబట్టే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందని.. ఆ అమ్మయిని మేము ఎప్పుడు చూడనే లేదని 139 మందిలో కొంత మంది పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే ఇన్ని సంచలనాలు ఉన్న కేసులో వాస్తవం ఏంటి.. అసలు ఈ కేసులో ఎవరైనా బాధితురాలను అడ్డం పెట్టుకొని మొత్తం కథ నడుపుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిందితులు కొంత మంది పోలీసులుకి సమాచారం ఇచ్చారు. నిజంగా డబ్బులు కోసం బాధితురాలను పావుగా వాడుకొని ఇలా పథకం వేశారా.. బాధితురాలు వెనుక ఉండి ఓ ఎన్జీఓ ప్రతినిధి నడిపిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. (యువతి శరీరంలో మూడేళ్లుగా బుల్లెట్!) కేసు సీఐడీకీ లేదా సీసీఎస్‌కు బదిలీ ఈ కేసుకు సంబంధించి విచారణ ఎలా చేయాలి? ఏవిధంగా ముందుకు వెళ్లాలి? అనుమానితులను ఏ విధంగా ప్రశ్నించాలి? మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారిని ఏ విధంగా పిలవాలి? వీటన్నిటిపై పోలీసులు సమగ్ర ప్రణాళిక చేయబోతున్నారు. అయితే, పంజాగుట్ట పోలీసులతో విచారణ కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలా? లేకుంటే సీసీఎస్‌కు ఈ కేసును బదిలీ చేయాలా? అనే దాని పైన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత అడుగు ముందుకేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి అనుమతిస్తే దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తారు. లేదంటే ఈ కేసును పంజాగుట్ట ఠాణా నుంచి సీసీఎస్‌కు బదిలీ చేయాలా అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. -
పవర్ హౌస్‌లోకి నీళ్లు.. విచారణకు ఆటంకం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో సోమవారం విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో చీకటి, వేడి ఎక్కువగా ఉండడంతో పూర్తి అండర్ గ్రౌండ్‌కు దర్యాప్తు బృందం వెళ్లలేకపోయింది. కొన్ని చోట్ల కాలిన పదార్థాల నుండి సీఐడీ బృందం షాంపిల్స్ సేకరించారు. మానవ తప్పిదమా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) ఇప్పటికే అధికారుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని సాక్ష్యాల కోసం సీఐడీ అధికారులు నేడు విచారణ చేట్టారు. అదే విధంగా పవర్ హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో చేస్తున్న మరమ్మతుల వల్ల దర్యాప్తుకు కొంత ఆటంకం ఏర్పడింది. పవర్ హౌస్‌లోకి విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది బయటి నుంచి లోపలికి విద్యుత్ వైర్లను తీసుకెళ్లారు. ఊట నీరును మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. (శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ) -
ఆప్కో అవినీతిపై కొనసాగిన సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి/ప్రొద్దుటూరు టౌన్: ఆప్కో అవినీతిపై మూడోరోజు సీఐడీ సోదాలు కొనసాగాయి. ఆదివారం వైఎస్సార్ జిల్లాలోని ఖాజీపేట, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప తదితర ప్రాంతాల్లో.. సొసైటీ అధ్యక్షులు, వారి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను సన్నిహితుడు, మల్లేశ్వరి సొసైటీ అధ్యక్షుడైన ఉప్పు మల్లికార్జున ఇంటిలో ఆదివారం తనిఖీలు జరిపిన అధికారులు.. చేనేత సొసైటీల పేర్లతో ఉన్న సీళ్లు, కొన్ని పత్రాలను, చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ► ఎర్రగుంట్ల పట్టణంలోని నారాయణనగర్ కాలనీలో నివాసం ఉన్న ఉప్పు ఈశ్వరయ్య, ఉప్పు శివ ఇంటిలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరు ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులుకు సమీప బంధువులు కాగా, సోదాల్లో విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ► గుజ్జల శ్రీను బంధువులు డి.శ్రీనివాసులు, ఆర్.ధనుంజయ్‌రావు నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విచారణలో భాగంగా తదుపరి సోదాలు నిర్వహిస్తామని సీఐడీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు రూ. 1.11కోట్ల నగదు, 10 కిలోల పైనే బంగారం అప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనుకు సంబంధించిన ఇళ్లలో ఇప్పటివరకు రూ. 1.11 కోటి నగదుతోపాటు 10.48 కేజీల బంగారం, 19.56 కేజీల వెండి ఆభరణాలు, 43 బ్యాంకు పాస్ పుస్తకాలు, ఆప్కోకు చెందిన పలు రికార్డులు, ఒక డిజిటల్ లాకర్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీ విచారణ
-
శ్రీశైలం ప్రమాదం: వివరాలు సేకరిస్తున్న సీఐడీ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇక షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలను సీఐడీ దర్యాప్తు బృందం విశ్లేషించనున్నది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలిపోయిన వైర్లతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్థాలను ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందని టెక్నికల్ బృందాలు వీడియో తీశారు. (కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) పవర్ సప్లై ఎలా ఇచ్చారనే వివరాలు సీఐడీ రాబడుతోంది. పలువురు అధికారుల నుంచి సీఐడీ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మొదట ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న స్థలంలోని పదార్థాలను అధికారులు సేకరించారు. అక్కడ కాలిన పదార్థాలలో వాటర్ ఉందా? లేదా? అన్న దానిపై సీఐడీ టెక్నికల్ బృందం విశ్లేషించనుంది. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. మానవ తప్పిదం ఉందా లేదా అనేది సీఐడీ అధికారులు తేల్చనున్నారు. (శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ) చదవండి: (‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
-
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాదంపై సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ విచారణ కొనసాగుతోంది. శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాదంపై విచారణకు నాలుగు బృందాలు ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్ సైన్స్, సీఐడీ, లోకల్ పోలీసుల టీమ్‌లు ఏర్పాటు చేశారు. కాగా, ప్రమాద ఘటనపై ఈగలపెంట పోలీస్ స్టేషన్లో 174 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 8 మంది గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. (చదవండి: కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) (చదవండి: మృత్యుసొరంగం) -
పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ విచారణ
-
పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సీఐడీ విచారణకు ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. విద్యుత్ కేంద్రంలో మొత్తం 9 మంది చిక్కుకుపోగా సీఐఎస్ఎఫ్ రెస్క్యూ బృందం వారిని రక్షించేందుకు రంగంలోకి దిగింది. అయితే దురదృష్టవశాత్తూ లోపల చిక్కుకుపోయిన వారంతా మృత్యువాతపడ్డారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదం ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, గురువారం రాత్రి 10.35 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. -
సీఐడీ అదుపులో టీడీపీ మాజీ మంత్రి అనుచరుడు..
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్‌ను మంగళవారం తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు నలంద కిషోర్‌కు మూడు రోజుల క్రితం సీఐడీ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం రీజనల్ సీఐడీ కార్యాలయానికి ఆయనను తరలించారు. ఐపీసీ 50బి, 5బి, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు అనితా రాణి వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై నిజానిజాలేంటో తేల్చాలంటూ ఆయన సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చారు. కాగా, డాక్టర్ అనితా రాణి.. కొంతమంది తనను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వేధింపులపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించారు. మహిళ కమిషన్ సైతం డాక్టర్ అనితా రాణి వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. చిత్తూరు జిల్లా అధికారులను నివేదిక కోరారు. (సమగ్ర భూ సర్వేలో ఆలస్యం వద్దు: సీఎం జగన్) అయితే, ప్రభుత్వ వైద్యురాలు అనితారాణిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయని, పని చేసిన ప్రతిచోట రోగులతో కూడా గొడవలు పెట్టుకునేవారని జిల్లా వైద్యాధికారి పెంచలయ్య తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేయకుండా రక్తం కారుతున్నా బయటకు పంపడంతో రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం వాస్తవమేనన్నారు. ఆసుపత్రికి వచ్చిన వారికి చికిత్స అందించకపోవడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పని చేసినప్పుడు ఆరు నెలలకు మించి కూడా ఆమె ఎక్కడ పని చేయలేదని గుర్తు చేశారు. బిల్లు విషయంలోనూ ఒక సబ్ ట్రెజరీ అధికారితో కూడా గొడవ పెట్టుకున్నారన్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని పెంచలయ్య తెలిపారు. -
నిమ్మగడ్డ లేఖ బయటి నుంచే
రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ లేఖ వెనుక దాగి ఉన్న అనుమానాలు నిగ్గుతేలుతున్నాయి.తాజాగా ఆ లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖ వెనుక దాగిన లెక్కలేనన్ని అనుమానాలు ఒక్కొక్కటిగా నిగ్గుతేలుతున్నాయి. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసినట్లుగా చెబుతున్న లేఖకు సంబంధించి సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే పలు కీలక విషయాలు రాబట్టింది. తాజాగా ఆ లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. ఈమేరకు ఫోరెన్సిక్ నివేదిక సీఐడీకి చేరింది. కేసు దర్యాప్తులో తాజా పరిణామాలపై సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ మంగళవారం మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు నిమ్మగడ్డ లేఖ పేరుతో కుట్ర జరిగిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టాం. ► ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి మాటల్లో పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి. చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేకపోయారు. ‘లెటర్ టు హోం సెక్రటరీ’ అనే ఫైల్‌ను ఎందుకు ధ్వంసం చేశారంటే అది రహస్యం అన్నారు. మరి అంత రహస్యం అయితే ఆ లేఖ మీడియాలో యధాతథంగా ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. వెరీ కాన్ఫిడెన్షియల్ అనుకున్నప్పుడు ఆ లేఖ తాలూకు ఫైల్ ఒక్కటే డిలీట్ చేయాలి గానీ మొత్తం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ సిస్టమ్ ఎందుకు డిలీట్ చేశారంటే జవాబు లేదు. ► సాంబమూర్తిని విచారించి నాలుగు పరికరాలు సీజ్ చేశాం. డెల్ ల్యాప్‌టాప్, లెనోవా డెస్క్‌టాప్, స్కానర్, మోటరోలా ఫోన్‌ను విశ్లేషణ కోసం సైబర్ ఫోరెన్సిక్‌కు పంపించాం. వీటిని పరీక్షించిన సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు అసలు వాటిలో ఎస్ఈసీ లేఖ తయారు కాలేదని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. వి.విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో వ్యక్తం చేసిన అనుమానాలకు బలం చేకూర్చే విధంగా సైబర్ ఫోరెన్సిక్ నివేదిక ఉంది. ► ఫోరెన్సిక్ నివేదికను బట్టి ఎస్ఈసీలో ఆ లేఖ తయారు కాలేదని తేలింది. ఆ లేఖ ముందుగానే తయారై బయటి నుంచి వచ్చిందని నిర్ధారణ అయింది. మార్చి 18వ తేదీ పెన్‌డ్రైవ్‌లో ఆ లేఖ రమేష్‌కుమార్ వద్దకు చేరింది. వెలుగులోకి వాస్తవాలు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ వెనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర దాగి ఉందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందనే ఆరోపణలున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా రమేష్ కుమార్ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో ఉన్న సంతకానికి పొంతన లేదని ఫిర్యాదులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సీఐడీ పలు కీలక ఆధారాలు సేకరించడంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఎన్నికల కమిషనర్’ ఆర్డినెన్స్ వ్యాజ్యాల్లో విచారణ 7కి వాయిదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్, తదానుగుణ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మంగళవారం హైకోర్టులో వాదనలను ముగించారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ తదితరుల వాదనలు వినేందుకు విచారణను కోర్టు ఈనెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం, శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ వాదనలు వింటామని, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల తిరుగు సమాధానాలు వింటామని ధర్మాసనం పేర్కొంది. -
రట్టవుతున్న 'ఇన్సైడర్' గుట్టు
సాక్షి, అమరావతి/కంచికచర్ల: రాజధాని అమరావతిలో గత టీడీపీ సర్కారు హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో టీడీపీ నేతలకు ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పక్కా ఆధారాలు చిక్కుతున్నాయి. కృష్ణా జిల్లాలో శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), శనివారం సీఐడీ వరుసగా నిర్వహించిన సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. సీఐడీ ప్రత్యేక బృందాలు కృష్ణా జిల్లా కంచికచర్లలో పలువురు టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా(ఏజీ) పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్.. నన్నపనేని లక్ష్మీనారాయణకు స్వయానా అల్లుడే. కాగా, లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. ఇంటి నుంచి పరారైన లక్ష్మీనారాయణ అమరావతిలో భూముల కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుడి ఇంట్లో శుక్రవారం సిట్ సోదాలు నిర్వహించింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. అలాగే కంచికచర్లలో సీతారామరాజు ఇంట్లోనూ సిట్ అధికారులు సోదాలు జరిపారు. దీంతో నన్నపనేని లక్ష్మీనారాయణ తన ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. శుక్రవారం కంచికచర్లలోని లక్ష్మీనారాయణ నివాసంలో సోదాల కోసం వెళ్లిన సీఐడీ ప్రత్యేక బృందానికి ఆయన దొరకలేదు. ఇంటికి తాళం వేసి ఉండటం, లక్ష్మీనారాయణతోపాటు కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో సీఐడీ అధికారులు శుక్రవారం సెర్చ్ వారెంట్‌ను ఆయన ఇంటి గోడకు అతికించి వెనుతిరిగారు. సీఐడీ ప్రత్యేక బృందాల ఏర్పాటు! అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తును వేగవంతం చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఐడీ నిర్ణయించింది. భూ కుంభకోణాలు, భూ వివాదాలు, రికార్డుల తారుమారు తదితర కీలక అంశాలపై దర్యాప్తు చేసిన అనుభవం కలిగిన పోలీసు అధికారులను సీఐడీ విభాగంలోకి తీసుకొచ్చి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందానికి డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. 4 గంటలపాటు సీఐడీ సోదాలు తన కుమారుడు సీతారామరాజు ఇంట్లో శుక్రవారం సిట్ సోదాలు ముగియడం, సీఐడీ అధికారులు వచ్చి వెళ్లిపోవడంతో లక్ష్మీనారాయణ శనివారం తన ఇంటికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐడీ అధికారులు శనివారం ఉదయం మరోమారు లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలకు వెళ్లారు. లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు నివాసంలోనూ 4 గంటలపాటు సీఐడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు కీలకపత్రాలు, సీడీలను స్వాధీనం చేసుకున్నాయి. టీడీపీ నేత లక్ష్మీనారాయణ అమరావతిలో తక్కువ ధరకే విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగానే తెలుసుకుని విలువైన భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనేశారని స్థానికులు చెబుతున్నారు. -
'సీఐడీ విచారణ జరిపిస్తే నిజస్వరూపం తెలుస్తుంది'
సాక్షి, అనంతపురం : మంత్రిగా ఉన్న సమయంలో పరిటాల సునీత అనేక అక్రమాలకు పాల్పడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె అవినీతిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సునీత తన కుటుంబసభ్యులతో కలిసి వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. సీఐడీ విచారణ జరిపిస్తే ఆమె నిజస్వరూపం మొత్తం బయటపడుతుందని, పౌరసరఫలా శాఖ కాంట్రాక్టులన్నీ ఆమె తన బినామీలకే కట్టబెట్టారని మండిపడ్డారు. జంగాలపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాంలను నంద్యాలకు మార్చడంతో ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. (చంద్రబాబు.. అప్పుడు ఎందుకు జోలె పట్టలేదు?) -
గత సర్కారు అవినీతిని నిగ్గు తేల్చనున్న సిట్
-
రాజధాని అక్రమాలపై ‘సిట్’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. భూ సేకరణతోపాటు గత సర్కారు హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు నిమిత్తం దీనిని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి పాలకపక్ష నేతలు అధికార రహస్యాల ప్రతిజ్ఞను తుంగలో తొక్కి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, అసైన్డ్ చట్టాన్ని తుత్తునియలు చేస్తూ అడ్డగోలుగా, బలవంతంగా, కారు చౌకగా పేదల నుంచి భూములు కొన్నారని.. సరిహద్దులు మార్చి అడ్డగోలుగా లబ్ధి పొందారని మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనంలో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. (మూడు రాజధానులు ముమ్మాటికీ అవసరమే) ఆ మేరకు మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో పది మందితో కూడిన ‘సిట్’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు తదితరాలపై సమీక్షించేందుకు జీవో 1411 ద్వారా గతేడాది జూన్ 26న మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. సీఆర్డీఏ ప్రాంతంలో భూ సేకరణతోపాటు పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ పరమైన లోపాలతోపాటు నకిలీ లావాదేవీలు, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉప సంఘం గుర్తించింది. (వెనకుండి నడిపిందెవరు?) పాత్రధారులు, సూత్రధారులెవరో తేల్చాలనే.. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భారీ అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదికపై గత అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరిగింది. ఎవరెవరు అసైన్డ్ భూములు కొన్నారు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కారుచౌకగా దక్కించుకున్నారనే వివరాలను పేర్లు, సర్వే నంబర్లతో సహా సభలో వివరించారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. తమ నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను కొన్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. (అమరావతి ఆందోళనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు) ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంతోపాటు రాజధాని భూకుంభకోణంలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నాటి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి బినామీల హస్తం ఉందని రిజిస్ట్రేషన్ లావాదేవీలు, భూముల కొనుగోలు సాక్షిగా తేలిపోయింది. అందువల్ల ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను తేల్చడంతోపాటు మొత్తం అక్రమాలను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్థాయి అధికారాలు అప్పగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. (‘ఇన్సైడర్’పై ఈడీ కేసు!) విధి విధానాలు.. – గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సీఆర్పీసీ నిబంధనల ప్రకారం దర్యాప్తు. – అవసరమైతే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కలిసి పని చేయొచ్చు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు. – అవసరమైన పక్షంలో విచారణ నిమిత్తం ఎవరినైనా పలిపించి, ప్రశ్నించే సంపూర్ణ అధికారం. వారి వాదనను సిట్ రికార్డు చేస్తుంది. – భూ లావాదేవీలు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన ఏ రికార్డులనైనా పరిశీలించే అధికారం. – అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు ‘సిట్’ కోరిన సమాచారాన్ని అందజేయడంతోపాటు సంపూర్ణ సహకారం అందించాలి. పక్కా ఇన్సైడర్ ట్రేడింగ్ రాజధాని ముసుగులో అమరావతి వేదికగా గత సర్కారు పాలనలో అంతులేనన్ని అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనంలో తేలింది. గత పాలకులు రాజధాని నూజివీడులో వస్తుందని ఒకసారి, మరో చోట వస్తుందని మరో సారి, ఇంకో చోట వస్తుందని ఇంకోసారి.. లీకులిచ్చి సామాన్యులు భూములు కొనుగోలు చేసి నష్టపోయేలా చేశారు. పాలక పెద్దలు మాత్రం ఎక్కడ రాజధాని వస్తుందో అక్కడే కారుచౌకగా భూములు కొన్నారు. ఇలా వారు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. ఇందుకు కొన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆధారంగా ఉన్నాయని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక మేరకు ప్రభుత్వం అసెంబ్లీలోనే బట్టబయలు చేసింది. 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ మధ్య రాజధాని ప్రకటనకు ముందు.. వాస్తవ రాజధాని ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు భూములు కొన్నారో ఆధార సహితంగా వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. బినామీల పేరుతో కారుచౌకగా కొనుగోలు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందున గత పాలకులు.. డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో కారు చౌకగా భూములు కొన్నారు. ఇలా టీడీపీ పెద్దలు అమరావతి ప్రాంతంలో 4,075 ఎకరాల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ 14.22 ఎకరాలు తాడికొండ మండలం కంతేరులో కొనింది. టీడీపీ నేత లంకా దినకర్ (లోకేశ్ బినామి), జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, అప్పటి మంత్రి నారాయణ, కంభంపాటి స్వాతి (కంభంపాటి రామ్మోహన్రావు కుటుంబీకురాలు)లాంటి వారెందరో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు. బంధువుల పేర్లతోనే కాకుండా బినామీల పేర్లతో కూడా భూములు కొన్నారు. సరిహద్దులు మార్చి భారీగా లబ్ధి చంద్రబాబు అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో సరిపెట్టుకో లేదు. లంక, పొరంబోకు, ప్రభుత్వ భూములనూ వదల్లేదు. సీఆర్డీఏ సరిహద్దులు సైతం మార్చారు. కోర్ రాజధానిని జూలై 2015లో 395 చదరపు కిలోమీటర్ల మేర ప్లాన్ చేశారు. అయితే వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని 2016లో దానిని 217 చదరపు కిలోమీటర్లకు తగ్గించారు. తమ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వకుండా కాపాడుకుని అధిక విలువ పొందడమే లక్ష్యంగా వ్యవహరించారు. రింగ్ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. లేని భూములు ఇచ్చి.. కోట్లకు పడగలెత్తి.. అనంతవరంలో భూభాగోతం మరోరకంగా సాగింది. లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములిచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు దక్కించుకున్నారు. లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాల ప్రభుత్వ భూమి.. నేలపాడు, పిచ్చుకాయలపాలెంలో 9 ఎకరాలు, శాఖమూరులో 3 ఎకరాలు, వెలగపూడిలో 3 ఎకరాలు తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను కైవసం చేసుకున్నారు. శివాయ్ జమీందార్ పేరుతో జీఓలు ఇచ్చి దాదాపు 289 ఎకరాలను బదలాయించుకున్నారు. చెరువుల భూముల విషయంలోనూ ఇలాగే చేశారు. కాగా, ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు కట్టబెడుతూ, ప్రభుత్వ సంస్థలకు మాత్రం అధిక ధరలకు ఇచ్చిన వైనం కూడా వెలుగు చూసింది. సీఐడీ విచారణలోనూ అక్రమాలు బట్టబయలు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్ కో సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించిన అప్పటి మంత్రి పి.నారాయణ తన సమీప బంధువులు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పేర్లతో ఇన్సైడరన్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు. వందలాది మంది తెల్లకార్డుదారులు భారీగా భూములు కొనుగోలు చేసిన విషయం కూడా బట్టబయలైంది. సిట్ బృందమిదే.. డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి (డీఐజీ, ఇంటెలిజెన్స్–బృంద నాయకుడు),అత్తాడ బాబూజీ (విశాఖపట్నం ఎస్పీ),సీహెచ్ వెంకట అప్పలనాయుడు (ఎస్పీ–2 ఇంటెలిజెన్స్), సీహెచ్ శ్రీనివాస రెడ్డి, (అడిషనల్ ఎస్పీ, కడప), జయరామరాజు (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), విజయ భాస్కర్ (డీఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్), ఎం.గిరిధర్ (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), కెన్నెడి (ఇన్స్పెక్టర్, ఏలూరు రేంజి), ఐ.శ్రీనివాసన్ (ఇన్స్పెక్టర్, నెల్లూరు జిల్లా), ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి (ఇన్స్పెక్టర్, గుంటూరు జిల్లా). -
ఇన్సైడర్ ట్రేడింగ్: ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
-
చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అడిషనల్ డైరెక్టర్ పీవీ సునీల్ కుమార్ అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్‌కు శనివారం లేఖ రాశారు. లేఖతో పాటు 106 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 106 మంది అసైన్డ్ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల వివరాలు, భూముల సర్వే నెంబర్లు, అడ్రసుతో సహా పూర్తి వివరాలను ఎక్సెల్ షీట్లో చీఫ్ కమిషనర్‌కు లేఖతో పాటే పంపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్; ఏడుగురిపై కేసు కాగా 2018-2019 మధ్య జరిగిన అసైన్డ్ భూముల కొనుగోలు ట్రాన్సాక్షన్లపై విచారణ చేపట్టేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. కాగా ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. -
మరో ఐదుగురిపై సీఐడీ కేసులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దల అండతో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ డొంక కదులుతోంది. ఇందుకు కారకులైన వారిపై సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంకు చెందిన దళిత మహిళ పి.బుజ్జి ఫిర్యాదుతో టీడీపీ మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు మరో నేత బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనితోపాటు కురగల్లు గ్రామానికి చెందిన పల్లెపోగు శివశంకర్ ఫిర్యాదుతో తాతా బసవశంకర్రావు, పాలడుగు నాగలక్ష్మిలపై కూడా కేసు నమోదు చేసింది. తాజాగా.. కృష్ణాజిల్లా విజయవాడ, యనమలకుదురు, పెనమలూరు, పోరంకి ప్రాంతాలకు చెందిన వారిపై సీఐడీ ఐదు కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా పెనమలూరు తహసీల్దార్ జి. భద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యనమలకుదురుకు చెందిన పొల్లినేని కొండలరావుపై కేసు నమోదు చేసింది. తప్పుడు ధృవపత్రాలు చూపించి తెల్లకార్డు పొందిన కొండలరావు రాజధాని ప్రాంతంలోని నేలపాడులో ఎకరా 8 సెంట్లు భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇతనిపై ఐపీసీ సెక్షన్–177, 403, 420, 468, 471, 120(బి) కింద కేసు నమోదు చేసిన అధికారులు అతని తెల్లకార్డు రద్దుకు సిఫారసు చేశారు. అలాగే, పెనమలూరుకు చెందిన మండవ నాగమణి వెంకటపాలెంలో 95 సెంట్లు.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బొల్లినేని నాగలక్ష్మి.. ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి అయిన భూక్యా నాగలక్ష్మి.. పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన అబ్దుల్ జమేదార్ తప్పుడు పత్రాల ద్వారా తెల్లకార్డులు పొంది తద్వారా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అసైన్డ్ భూములు కొన్న 106 మంది జాబితా ఐటీ శాఖకు.. కాగా, అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన 106 మంది జాబితాను ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు సీఐడీ మరోసారి పంపించింది. ఈ మేరకు వారికి సంబంధించిన చిరునామా, తెల్లకార్డు నంబర్, కొనుగోలు చేసిన భూమి విస్తీర్ణం, దాని విలువ తదితర వివరాలతో ఐటీ శాఖ కమిషనర్‌కు ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ లేఖ రాశారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారు, రూ.2 లక్షలకు పైగా మొత్తాలను నగదు రూపంలో చెల్లించిన వారి వివరాలను అందజేశారు. వీరిపై ఐటీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంత భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే అనేక అక్రమాలు వెలుగుచూశాయని.. నిబంధనలకు విరుద్ధంగా భూములు కొనుగోలు చేసిన వారిలో తెల్లకార్డుదారులు కూడా ఉన్నారని సీఐడీ ఆ లేఖలో వివరించింది. మరోవైపు.. ఉద్యోగాలు చేస్తున్న వారు, భూములు కలిగిన వారు, విలువైన ఆస్తులు కలిగిన వారు నిబంధనలకు విరుద్ధంగా పొందిన తెల్లకార్డులను రద్దుచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను కూడా సీఐడీ అధికారులు కోరారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్; ఏడుగురిపై కేసు
సాక్షి, విజయవాడ: రాజధాని అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. తాజాగా ఏడుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్ కార్డు దారుల పేర్లతో కోట్లాది రూపాయల విలువైలన భూములు కొనుగోలు చేసినట్టు కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. పాన్‌కార్డు లేని పేదలు కోట్లాది రూపాయల చెలామణి చేశారని గుర్తించింది. నాగమణి, నరసింహారావు, అనురాధ, కొండలరావు, భుక్యానాగమణి, అబ్దుల్, జమేదార్‌లపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై కేసు నమోదైన సంగతి తెలిసింది. మరికొందరి ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. (చదవండి: టీడీపీలో ఈడీ దడ!) కూపీ లాగుతున్న ఈడీ అమరావతి : రాజధాని అమరావతిలో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి మనీల్యాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్సుమెంట్ డైరెక్ట రేట్(ఈడీ) మరో అడుగు ముందుకేసింది. తెల్ల కార్డుదారులు ఎవరికి బినామీలనే కోణంలో ఆరా తీస్తోంది. కోట్లాది రూపాయలతో అక్కడ విలువైన భూములు కొనుగోలు చేసిన పేదల(తెల్లకార్డుదా రుల) జాబితాను సీఐడీ సేకరించడం తెలిసిందే. దీనిపై సీఐడీ ఇచ్చిన వివరాలతో క్రైమ్ నెంబర్ 3/ 2020 కేసు నమోదు చేసిన ఈడీ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టింది. అమరావతి కోర్ ఏరియాలో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు బహిరంగ మార్కెట్లో రూ.276 కోట్ల విలువైన 761.34 ఎకరా ల్ని రూ.38.56 కోట్లు(రిజిస్ట్రేషన్ విలువ) పెట్టి ఎలా కొన్నారనే దానిపై ప్రధానంగా ఆరా తీస్తోంది. వీరిలో పాన్‌కార్డు కలిగినవారు 268 మంది ఉండగా.. లేనివారు 529 మంది. తెల్లకార్డులు కలిగిన వారి వివరాల్ని వివిధ కోణాల్లో సేకరిస్తున్న విషయాన్ని ఈడీ హైద రాబాద్ జోనల్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ (జేడీ) అభిషేక్ గోయల్ ఏపీ సీఐడీ అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. అలాగే, రాజధాని రావడానికి ముందు నుంచి పథకం ప్రకారం బినామీలను వాడుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసినట్లు ఈడీ పసిగట్టింది. తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, పెదకాకాని, అమరావతి మండలాల్లో ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు నిర్ధారించింది. మరోవైపు.. ఎన్ని లక్షల రూపాయిల చొప్పున ఎంతమంది పెట్టుబడి పెట్టి భూములు కొన్నారో ఈడీ లెక్క తీసింది. -
రాజధాని భూ దందాపై రంగంలోకి ఈడీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం పాల్పడిన ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లతో పలువురు టీడీపీ నేతలు 761.34 ఎకరాల భూములను కొనుగోలు చేయడంపై ఏపీ సీఐడీ అధికారులతో ఈడీ అధికారులు శుక్రవారం చర్చించారు. సీఐడీ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై నివేదికతోపాటు బినామీల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తొలుత తెల్ల రేషన్‌కార్డుదారులకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అనంతరం బడా బాబులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మాజీ మంత్రులపై ఇప్పటికే కేసులు రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే అంటే 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య చంద్రబాబు బృందం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఏడాదికి రూ.60 వేలలోపు ఆదాయం మాత్రమే ఉండే తెల్లరేషన్ కార్డుదారులు కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేయడంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేసింది. వీరి వెనుక చంద్రబాబు బృందం ఉన్నట్లు ఆధారాలను సేకరించింది. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా బినామీ పేర్లతో భూములు కొన్న మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, చంద్రబాబుకు సన్నిహితుడైన బెల్లకొండ నరసింహారావుపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120 బీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు సమాంతరంగా విచారణ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. విచారణకు రెండు బృందాలు! తొలిదశలో తెల్లరేషన్ కార్డుదారుల పేర్లతో కొనుగోలు చేసిన భూములపై విచారణ చేపట్టి మలిదశలో సీఐడీ దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆదారంగా రాజధాని ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై లోతుగా విచారణ చేసేందుకు ఈడీ సిద్ధమైంది. దీనిపై విచారణకు హైదరాబాద్, చెన్నై కార్యాలయాల్లో పనిచేసే అధికారులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూముల కొనుగోళ్లపై సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివరాలను సేకరించనుంది. ఆదాయపు పన్ను చెల్లించకుండా భూములు కొన్నవారిపై మనీల్యాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి విచారించాలని నిర్ణయించింది. ఈడీకి వివరాలు ఇచ్చాం ఈడీ అధికారుల సూచన మేరకు అమరావతిలో 761.34 ఎకరాల భూములు కొన్న 797 మంది తెల్లరేషన్‌కార్డుదారుల వివరాలు అందచేశాం. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఈడీకి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తాం. – సునీల్‌కుమార్, సీఐడీ అదనపు డీజీ -
అమరావతిని చుట్టేశారు
అదిగదిగో రాజధాని అంటూ ఓ వైపు చూపించి, మరో వైపు ఉన్న భూములను కారు చౌకగా కొట్టేసిన గత పాలకుల బండారం బట్టబయలవుతోంది. అమాయకపు రైతులను నమ్మించి, బెదిరించి బంగారం లాంటి భూములను కాజేసిన వైనం విస్తుగొలుపుతోంది. అధికారం అండ చూసుకుని బంధువులు, అనుచరుల పేరుతో విచ్చలవిడిగా సాగించిన అనైతిక, అక్రమ లావాదేవీల నిగ్గు తేలుతోంది. రాజధాని పేరుతో గత సర్కారు పెద్దలు సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌ను చూస్తున్న దర్యాప్తు అధికారులు.. ‘అబ్బబ్బబ్బబ్బా.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆప్టర్’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో గత ఐదేళ్లలో చంద్రబాబు బృందం సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై చేపట్టిన సీఐడీ దర్యాప్తులో తీగలాగితే డొంక కదులుతోంది. పచ్చ గద్దల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్ట దాఖలు చేసి.. అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో వ్యాపారులు, తన బినామీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి పి.నారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరిలు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తక్కువ ధరకే భూములు కాజేయడంలో నువ్వా–నేనా అన్న రీతిలో పోటీపడినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి పరిటాల సునీత, మరో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, చంద్రబాబు కోటరీలో కీలక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణ రైతుల నుంచి తక్కువ ధరలకే భూములు కాజేసి కోట్లకు పడగలెత్తారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం ప్రైవేటు సైన్యంతో రాజధాని ప్రాంతంలో సాగించిన ఆకృత్యాలు, భూ దందాలు, సెటిల్మెంట్లపై సీఐడీ ప్రత్యేకంగా విచారణ చేస్తోంది. కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రాజధాని ప్రాంతంలో భూములను కోడె దూడలా దున్నేయడమూ సీఐడీ విచారణలో బహిర్గతమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్‌తో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం పరిధిని నిర్ణయించడం.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లింగమనేని సంస్థలు దోచేసిన భూములు.. ఆ సంస్థల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు దక్కిన రహస్య వాటాలపై సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. బినామీ పేర్లతో నారాయణ దూకుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి పి.నారాయణ తన సమీప బంధువులు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పేర్లతో రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే భారీగా భూములు కొనుగోలు చేశారు. తన బంధువు ఆవుల మునిశంకర్ పేరుతో తుళ్లూరు మండలం రాయపూడిలో సర్వే నంబర్ 167/8 లోని 1.18 ఎకరాలను.. ఎకరం రూ.9.44 లక్షల వంతున కొనుగోలు చేసి, అగ్రిమెంట్ చేసుకున్నారు. రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడ్డాక 2015 జూలై 23న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నారాయణ.. తన బావమరిది, నారాయణ విద్యా సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాపూరి సాంబశివరావు పేరుతో రాయపూడిలో 3.54 ఎకరాలు, ఆవుల మునిశంకర్ పేరుతో ఏడు ఎకరాలు, బెంగళూరులో తన విద్యా సంస్థల్లో పని చేసే కోతపు వరుణ్‌కుమార్ పేరుతో 0.4 ఎకరాలు.. వెరసి 12.12 ఎకరాలను 15 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. మందడంలో ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, కోతపు వరుణ్కుమార్లతోపాటు.. హైదరాబాద్, బెంగళూరుల్లో నారాయణ విద్యా సంస్థలను పర్యవేక్షించే పోతూరి ప్రమీల పేర్లతో 33.43 ఎకరాలను కొనుగోలు చేశారు. లింగాయపాలెంలో ఆవుల మునిశంకర్, పోతూరి ప్రమీల పేర్లతో 8.89 ఎకరాలను 12 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉద్దండరాయుని పాలెంలో పోతూరి ప్రమీల పేరుతో 1.43 ఎకరాలను కొన్నారు. మొత్తమ్మీద ఈ 4 గ్రామాల్లో 57.05 ఎకరాలను బినామీ పేర్లతో నారాయణ కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో సుజనా భూదందా టీడీపీలో నంబర్ టూగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి.. జాతీయ బ్యాంకులకు రూ.6 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఘనుడు. బ్యాంకులకు కన్నం వేసి దోచేసిన సొమ్ముతో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కాజేశారు. సీఆర్డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. రాజధాని ప్రకటన వెలువడ్డ తర్వాత గుడిమెట్లలో ఎకరం భూమి విలువ రూ.50 లక్షలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన రూ.50 కోట్లకుపైగా సుజనా చౌదరి కొట్టేసినట్లు స్పష్టమవుతోంది. తమను మోసం చేశారని నిలదీసేందుకు యత్నించిన రైతులపై అప్పట్లో ఉక్కుపాదం మోపి, ఆ భూములను 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 404–1, 404–5, 404–6లో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిగ్గు తేల్చింది. సీఐడీ విచారణలోనూ ఇదే అంశం వెల్లడైంది. కుమారుడి పేరుతో చినరాజప్ప చేతివాటం మాజీ డిప్యూటీ సీఎం.. హోం శాఖ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన కుమారుడు నిమ్మకాయల రంగనాథ్ పేరుతో తుళ్లూరు మండలం నేలపాడులో సర్వే నంబరు 59లో ఒక ఎకరం, తన అనుచరుడు జగతా వెంకట గంగాధర్ పేరుతో ఒక ఎకరం.. ఎకరం రూ.మూడు లక్షల చొప్పున 2014 జూన్ 10న కొనుగోలు చేసినట్లుగా సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఆ భూమిని 2014 అక్టోబరు 31న రిజిష్టర్ చేసుకున్నట్లు తేలింది. మిగతా గ్రామాల్లోనూ తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో భూమి కొనుగోలు చేసినట్లు అంచనాకు వచ్చిన సీఐడీ.. ఆ దిశగా విచారణ చేస్తోంది. చంద్రబాబు–లింగమనేని బంధం బట్టబయలు మంగళగిరి మండలం కాజ, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో 636.32 ఎకరాల్లో లింగమనేని రమేష్ భూములు కొనుగోలు చేసి 2014కు ముందే అపార్ట్మెంట్లను నిర్మించారు. టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే రాజధాని ఏర్పాటుపై లింగమనేనితో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 30 మధ్య లింగమనేని రమేష్ తన సంస్థ పేరుతో కాజ, కంతేరు గ్రామాల్లో 168 ఎకరాలకుపైగా భూమిని ఎకరం కనిష్టంగా రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.40 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కాజా, కంతేరు గ్రామాలకు ఆనుకుని 804.32 ఎకరాలకుపైగా భూమిలో ఎస్టేట్‌ను ఏర్పాటు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడిలో లింగమనేని ఎస్టేట్స్ డైరెక్టర్ బొబ్బా శివప్రకాష్ తన డ్రైవర్ బోడెపూడి హరిబాబు పేరుతో రాయపూడిలో సర్వే నంబర్ 369–2లో 0.65 ఎకరాలు, 369–2లో 1.13 ఎకరాలు, 371–2లో 0.65 ఎకరాలు.. మొత్తం 2.43 ఎకరాలను కొనుగోలు చేశారు. ముందస్తు ఒప్పందం మేరకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందులో రహస్యంగా లింగమనేని వాటా ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాలే వెల్లడించాయి. దీనికి ప్రతిఫలంగా రాజధాని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి లింగమనేని ఎస్టేట్స్ భూములు రాకుండా చంద్రబాబు సహకరించారు. ఈ విషయంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. సెటిల్మెంట్లతో పరిటాల వీరంగం మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి హర్షవర్దన్ డైరెక్టర్లుగా ఉన్న పీఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ పేరుతో అమరావతి మండలం ధరణికోటలో సర్వే నంబర్ 38–1లో ఎకరం భూమిని రూ.3.50 లక్షలకు కొనుగోలు చేసి 2014 ఆగస్టు 27న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెదకూరపాడు మండలం బలుసుపాడులో సర్వే నంబర్ 371లో ఎకరం రూ.2 లక్షల చొప్పున రెండు ఎకరాల భూమిని ఆ సంస్థ పేరుతో కొనుగోలు చేసి.. 2014 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన భర్త పరిటాల రవి సోదరి కుమార్తె వడ్లమూడి మౌనిక పేరుతో అమరావతి మండలం నెమలికల్లులో 71/1, 71/2బీ సర్వే నంబర్లలో ఒక ఎకరం భూమిని రూ.2 లక్షలకు కొనుగోలు చేసి 2014 నవంబర్ 24న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అమరావతి మండలం ధరణికోటలో అల్లుడు హర్షవర్దన్ పేరుతో 38/1 సర్వే నంబర్లో 1.3 ఎకరాల భూమిని ఎకరం రూ.2.10 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పరిటాల రవి సోదరి వడ్లమూడి సుధాశారద పేరుతో తుళ్లూరు మండల కేంద్రంలో సర్వే నంబర్ 193లో ఎకరం భూమిని రూ.4 లక్షలకు కొనుగోలు చేసి.. 2014 అక్టోబర్ 11న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం.. రాజధాని ప్రకటన వెలువడక ముందే రాజధాని ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని మోహరింపజేసి.. వివాదాస్పద భూములపై సెటిల్మెంట్లు చేసి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. కారుచౌకగా 11.60 ఎకరాలు కొట్టేసిన కోడెల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ తుళ్లూరు మండలం కొండమరాజుపాలెంలో సర్వే నంబర్ 21–సీలో ఎకరం రూ.1.87 లక్షల చొప్పున 1.66 ఎకరాలను రాజధానిపై ప్రకటన వెలువడక ముందే కొనుగోలు చేసి, 2015 మార్చి 7న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాజధాని ప్రాంతంలో వివాదాస్పద భూములను గుర్తించి, అధికార బలంతో వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో దూసుకెళ్లారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నంబర్లు 167–1ఏ, 167–1సీ, 168–1, 168–3లో 11.60 ఎకరాల భూమికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తుండటాన్ని పసిగట్టిన కోడెల శివరామకృష్ణ.. ఆ భూమిని చౌకగా కొట్టేశారు. అన్నదమ్ముల్లో ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న శశి ఇన్ఫ్రా పేరుతో ఎకరం రూ.8 లక్షల చొప్పున కొనుగోలు చేసి, 2015 ఆగస్టు 1న రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. వాస్తవంగా ఆ ప్రాంతంలో అప్పటికే ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతుండేది. కేసుల నమోదుకు రంగం సిద్ధం సీఐడీ అధికారులు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బృందం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి 4,069.94 ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది. 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్31 మధ్య కాలంలో అంటే రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించక ముందే కుటుంబ సభ్యులు, కుటుంబ సంస్థలు, బినామీల పేర్లతో ఆ భూములను దోచేయడం వెల్లడైంది. నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు బృందం, వ్యాపార సంస్థలపై ఐపీసీ 418, 420, 406, 403, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైంది. ‘రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం ప్రకటన చేయక ముందే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడంలో ఆంతర్యమేమిటి? అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఆ భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయి? వాటికి ఆదాయ మార్గాలు ఏమిటి? ఆదాయపు పన్ను చెల్లించారా?’ అంటూ ఇన్సైడర్ ట్రేడింగ్‌లో భూములు కొనుగోలు చేసిన వారికి చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయడానికి సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేసులు నమోదు చేయడంతోపాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు సమాచారం ఇచ్చి ఆ సంస్థలతో కూడా కేసులు నమోదు చేయించి సమాంతరంగా విచారణ చేపట్టనున్నారు. -
మహిళ ఫిర్యాదుతో సీఐడీ విచారణ
సాక్షి, వరంగల్: మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లుపై గతేడాది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్సీఎస్)కు బాధితురాలు ధరావత్ శకుంతల ఫిర్యాదు చేయగా విచారణ అధికారిగా కమిషన్ సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను నియమించింది. ఈ మేరకు బుధవారం డీఎస్పీ రవికుమార్ రైస్‌మిల్లు వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిన వారితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న వారిని విచారించారు. 2010లో ధరావత్ శకుంతల ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రైజెస్ పథకంలో రూ.50 లక్షల సబ్సిడీతో రూ.3 కోట్లతో రైస్‌మిల్లు పొంది రూ.1.93 కోట్ల పెట్టుబడితో రైస్‌మిల్లు ఏర్పాటు చేసుకున్నారు. రూ.89,50 లక్షలు కెనరా బ్యాంక్ రుణం అందజేయగా.. ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల సబ్సిడీ విడుదల చేసింది. ప్రతినెలా 1.29 లక్షలు బ్యాంక్ అప్పు చెల్లించే విధంగా ప్రీమియం ఏర్పాటు చేసుకోగా ప్రతినెలా ప్రీమియం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు మిల్లును వేలం వేసి అమ్మేశారు. దీనిపై ధరావత్ శకుంతల మిల్లును వేలం వేసి తనకు నష్టం చేశారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రస్థాయి నుంచి ఆ ఫిర్యాదుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్‌్సకు బదిలీ చేసింది. దీనిపై సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను విచారణ అధికారిగా నియమించగా బుధవారం రైస్‌మిల్లు వద్ద విచారించారు. -
ఎంసెట్ కేసులో చార్జిషీట్..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎట్టకేలకు సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయనుంది. మూడేళ్లుగా నానుతూ వస్తున్న దర్యాప్తు కొద్ది రోజుల క్రితం పూర్తి కావడంతో పట్టుబడిన నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనితో సీఐడీ దర్యాప్తు బృందం ఇప్పటివరకు కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారులు, బ్రోకర్లు, కాలేజీ ప్రతినిధులను ఎఫ్ఐఆర్లో చేర్చింది. పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్న వారి పేర్లను సైతం చేర్చి దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ చార్జిషీట్ కొద్ది రోజుల క్రితమే తయారుచేసిన సీఐడీ అధికారులు న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు లీగల్ విభాగానికి పంపించారు. చార్జిషీట్ డ్రాప్ట్‌ను అధ్యయనం చేసిన న్యాయవిభాగం అధికారులు కొన్ని సాంకేతిక కారణాలను ఎత్తిచూపారు. వీటిని సరిచేసుకున్న దర్యాప్తు బృందం నాంపల్లిలోని సీఐడీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కేసులో 124 మందిని నిందితులుగా గుర్తించిన సీఐడీ 94 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారులుగా 22మంది ఉండగా, మిగిలిన వారంతా బ్రోకర్లని సీఐడీ లెక్క తేల్చింది. మరో దఫా దర్యాప్తు... ప్రస్తుతం దాఖలు చేస్తున్న చార్జిషీట్ తుదిది కాదని, మరో దఫా దర్యాప్తు ఉంటుందని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ కేసులో ఇంకొంత మంది పాత్ర తేలాల్సి ఉందని, గతంలో దర్యాప్తు అధికారులు చేసిన పొరపాట్ల వల్ల కొంత మంది నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, వారి కోసం వేటసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.మరికొంత మంది బ్రోకర్ల పాత్ర సైతం పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సి ఉందని, వారినీ అరెస్ట్ చేసి అనుబంధ చార్జిషీట్ కూడా దాఖలు చేసేందుకు తాము కృషిచేస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా సాగుతూ.. వస్తున్న ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరు మృతి చెందడం, కేసులో అనేక ప్రతిష్టంభనలకు కారణమైంది. 312మంది విద్యార్థులకు కోల్కత్తా, బెంగళూరు, ఢిల్లీ, కటక్, ముంబై, పుణేలో క్యాంపులు నిర్వహించి లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇప్పించిన సంగతి విదితమే. -
అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తు తీరుపై ఉమ్మడి హైకోర్టు మండిపడింది. దర్యాప్తు తీరు మారకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి, దర్యాప్తు బాధ్యతలను దానికి అప్పగిస్తామని తేల్చి చెప్పింది. హాయ్ల్యాండ్కూ, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదనే విషయాన్ని ముందుగానే ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీసింది. ఇదే సమయంలో హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎంత మాత్రం సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. మరోపక్క హాయ్‌ల్యాండ్ యాజమాన్యం కూడా తమని అగ్రిగోల్డ్‌కి చెందిన కంపెనీగా భావిస్తూ, తమ ఆస్తులను ఏపీ డిపాజిటర్ల చట్టం కింద ఇప్పటికే జప్తు చేశారని, అందువల్ల సర్ఫేసీ చట్టం కింద వాటిని వేలం వేసే అధికారం బ్యాంకులకు లేదని హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేసింది. హాయ్‌ల్యాండ్ విషయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం మాటమార్చడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇప్పటి వరకు హాయ్‌ల్యాండ్ తమదేనని చెప్పుకుంటూ ఆ మేర అఫిడవిట్ చేసి, ఇప్పుడు దానితో తమకు సంబంధం లేదని చెప్పడంలో ఉద్దేశం ఏమిటని నిలదీసింది. దీనికి అగ్రి గోల్డ్ యాజమాన్యం తగిన మూల్యం చెల్లించకపోక తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా మాట మార్చకుండా గట్టి గుణపాఠం నేర్పుతామంది. అప్పుడు డిపాజిటర్లతో, ఇప్పుడు న్యాయస్థానంతో ఆటలాడుకుంటున్నారని, ఇందుకు ఎదుర్కోబోయే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. సీఐడీ దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హాయ్‌ల్యాండ్ ఎంఓయూను పరిశీలిస్తే అందులో ఈ కంపెనీ యాజమాన్యం వివరాలుంటాయని, వాటి ఆధారంగా అగ్రిగోల్డ్ యాజమానులకు, హాయ్‌ల్యాండ్ యాజమానులకు ఉన్న సంబంధం తెలిసి ఉండేదని, ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏముందని నిలదీసింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకుని ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ యాజమాన్యం విషయంలో చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోనున్నారో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. పర్యవసానాలు ఎదుర్కొంటారు విచారణ సందర్భంగా సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది.. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు, వాటి మార్కెట్, రిజిస్టర్ విలువను ధర్మాసనం ముందుంచారు. అటు తరువాత హాయ్‌ల్యాండ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ వాదనలు వినిపిస్తూ, హాయ్ల్యాండ్కూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తమ పూర్తి వాదనలను వినాలని కోరారు. దీనిపై అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ధర్మాసనం వివరణ కోరింది. ఆయన కూడా సంబంధం లేదని చెప్పారు. దీంతో ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది. హాయ్‌ల్యాండ్ విషయంలో మాట మార్చినందుకు వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. న్యాయస్థానాలతో ఆటలాడుకుంటే ఎలా ఉంటుందో వారికి చూపిస్తామని, వారు మోసం చేసింది కోర్టునే కాదు.. 32 లక్షల మంది డిపాజిటర్లను కూడా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్ పిటిషన్‌పై బ్యాంకులకు నోటీసులు హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారా? అని సీఐడీ అధికారులను ధర్మాసనం ప్రశ్నించగా, అతడు ఈ కేసులో నిందితుడు కాదని, అందుకే అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ చెప్పారు. అయితే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ మధ్య ఉన్న సంబంధాలను తప్పక తెలుసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకుల వేలం ప్రక్రియను సవాలు చేస్తూ హాయ్‌ల్యాండ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఎస్బీఐ, కర్ణాటక, ఓబీసీ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యాజ్యంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చి, వారికి కూడా నోటీసులిచ్చింది. అవ్వా సీతారామారావు, అల్లూరి వెంకటేశ్వరరావుల మధ్య ఉన్న సంబంధాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే హాయ్‌ల్యాండ్ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. -
అగ్రిగోల్డ్ ఆస్తులు రూ.3,861 కోట్లు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ ధరల ఆధారంగా రూ.3,861 కోట్ల 76 లక్షలని సీఐడీ ఎస్పీ ఉదయ్‌భాస్కర్ వెల్లడించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలోను, డిపాజిటర్లకు న్యాయం చేయడంలోను రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్ మొత్తం ఆస్తుల వివరాలు హైకోర్టుకు సమర్పించామన్నారు. వాటిలో 366 ఆస్తులకు సంబంధించి వేలానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అందులో కొన్నిటిని ఇప్పటికే రూ.47 కోట్లకు వేలం వేశామన్నారు. మిగిలిన అన్ని ఆస్తులను హైకోర్టు ఆదేశాలు ఇవ్వగానే వేలం వేస్తామన్నారు. మూడు బ్యాంకుల్లో రూ.428 కోట్లకు హాయ్‌ల్యాండ్ మార్టిగేజ్ చేశారని, స్టేట్‌బ్యాంక్ ద్వారా రూ.95 కోట్లు ఇచ్చారని తెలిపారు. హాయ్‌ల్యాండ్ వేలానికి ఎస్బీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చిందని, వేలం అనంతరం వివరాలు తమకు తెలిపి తుది అనుమతి తీసుకోవాలని ఆదేశించినట్టు ఉదయ్‌భాస్కర్ చెప్పారు. అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన మోసాలపై మొత్తం 29 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఏపీలో 15 కేసులు, తెలంగాణాలో 3, కర్ణాటకలో 9, అండమాన్ నికోబర్, ఒడిశాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయని చెప్పారు. ఎండీ అవ్వా వెంకటరామారావుతోపాటు డైరెక్టర్లను అరెస్టు చేసి జ్యూడీషీయల్ కస్టడీకి పంపించామన్నారు. మొత్తం 19,18,865 డిపాజిటర్ల (32,02,632ఖాతాలు)లో ఏపీకి చెందిన 11,57,497 మంది(19,43,121ఖాతాలు) ఉన్నారన్నారు. మొత్తం రూ.6,380 కోట్ల 31 లక్షల డిపాజిట్లలో ఏపీకి చెందిన రూ.3,944 కోట్ల 70 లక్షల డిపాజిట్లు ఉన్నాయన్నారు. చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు చెందిన కుటుంబాలలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.7 కోట్లు పరిహారం అందించినట్టు చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తుల గుర్తింపు, వేలం, డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్న సీఐడీ జిల్లా వారీగా కమిటీలు వేసినట్టు చెప్పారు. -
రెండున్నరేళ్ల తర్వాత గుర్తించారు..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన ఎంసెట్ స్కాంలో సీఐడీ అధికారుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దర్యాప్తు అధికారులు బెంగళూరులో ఎంసెట్ లీక్ క్యాంపు కేంద్రాన్ని గుర్తించారు. 16 మంది విద్యార్థులను హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి బెంగళూరులోని ఓ ప్రైవేట్ భవనంలో లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. ఎంసెట్ కేసులో ఎప్పుడో అరెస్టయిన నిందితుడు అషుతోశ్ ఈ క్యాంపును నడిపించినట్టు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. కేసు దర్యాప్తు మూడేళ్లకు చేరువవుతున్న తరుణంలో కీలక ఆధారాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ కేసులో గతంలో దర్యాప్తు చేసిన అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కేసులో ఏం జరుగుతోంది..? ప్రశ్నపత్రం లీక్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి దర్యాప్తు అధికారులు సరైన వ్యూహంతో వ్యవహరించకపోవడం ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితుల కాల్‌డేటా వివరాలు బయటకు తీయడం దర్యాప్తు అధికారులకు కష్టసాధ్యంగా మారినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు ఏడాదిలోపున్న కాల్‌డేటా వివరాలను మాత్రమే దర్యాప్తు సంస్థకు అందించవచ్చు. ఏడాది దాటితే వాటిని బయటకు తేవడం సులభకాకపోవడంతో ఇప్పుడు అధికారులు తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 74 మందిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయాలంటే ఈ డేటా వివరాలు తప్పనిసరని భావిస్తున్నారు. అదే విధంగా కేసు తుదిదశలో ఉన్న సందర్భంలో కార్పొరేట్ కాలేజీల వ్యవహారం బయటపడటం, క్యాంపు నిర్వహించిన ప్రాంతం వెలుగులోకి రావడం, విద్యార్థులు ముందుకు వచ్చి వాంగ్మూలాలు ఇస్తుండటం సంచలనం రేపుతోంది. ఇంకా ఈ కేసు ఎన్నాళ్లు దర్యాప్తు చేస్తారు? ఎవరిని కటకటాల్లోకి పంపుతారు? ఎవరి ఒత్తిడికైనా తలొగ్గుతారా? అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. -
అప్డేట్ కారా?
సాక్షి, హైదరాబాద్: మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోలీస్ శాఖ టెక్నాలజీ పరంగా చాలా ముందుంది. అయితే ఇది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు మాత్రమే పరిమితం. విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన యాప్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ తదితరాలన్నీ ఈ కమిషనరేట్ల పరిధిలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు పోలీస్ శాఖ వీటిని రాష్ట్రవ్యాప్తం చేసేలా అడుగులు వేస్తోంది. కానీ కొన్ని జిల్లాల పోలీస్ అధికారులు, కమిషనర్లు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆ జిల్లా పోలీస్ విభాగానికి ప్రత్యేక వెబ్సైట్ రూపొందించుకోలేని దుస్థితిలో ఉండటమే ఇందుకు కారణం. రెండేళ్లు గడిచిపోతున్నా... టెక్నాలజీతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుంటే జిల్లాల్లోని అధికారులు ఇంకా మూస పద్ధతినే అనుసరిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ ఏర్పడి దాదాపు మూడున్నరేళ్లు కావొస్తున్నా కనీసం వెబ్సైట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. కమిషనరేట్‌లో పని చేస్తున్న అధికారులెవరు? ఏ ప్రాంతం ఏ స్టేషన్ కిందకు వస్తుంది? అధికారి ఎవరు, ఫిర్యాదెలా చేయాలి? సైబర్ క్రైమ్ ఫిర్యాదులెలా చేయాలి? క్రైమ్ కంట్రోల్‌కు ఎలా సహకరించాలి? నేరాల నమోదు.. తదితరాలన్నింటిని ప్రజలకు తెలిపాల్సి ఉంటుంది. ఎస్పీలు, కమిషనర్లు మారుతున్నారు తప్ప వెబ్సైట్ అందుబాటులోకి రావడంలేదు. నూతన జిల్లాల్లో చాలా వాటి పరిస్థితి మరీ దారుణం. జిల్లా ఎస్పీకి నేరుగా ఫోన్ ద్వారా సమాచారం అందించేందుకు కనీసం మొబైల్ నంబర్ కూడా దొరకని పరిస్థితి. పాత జిల్లా అయినా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ పోలీస్ కూడా సొంత వెబ్సైట్ ఏర్పాటు చేసుకోలేదు. నల్లగొండ జిల్లా పోలీస్‌కు వెబ్సైట్ ఉన్నా అది అందుబాటులోకి రావడం లేదు. కొత్తగా ఏర్పడిన కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట్ కమిషనరేట్ల వెబ్సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం, వరంగల్ మాత్రం ఇంకా వెబ్çసైట్ ఏర్పాటు చేసుకోలేదు. రాజన్న సిరిసిల్లకు వెబ్సైట్ ఉన్నా డీజీపీ, డీఐజీ, ఎస్పీలు మారినా ఇంకా పాత వారి పేరిటే దర్శనమిస్తోంది. సీఐడీయే ఇలా చేస్తే... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీఐడీ) వ్యవహారం ఉన్నతాధికారులకే అర్థం కాకుండా ఉంది. అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలకు నోడల్ కేంద్రంగా సీఐడీ పనిచేస్తుంది. ప్రతీ ఏటా క్రైమ్ కంట్రోల్, అనాలసిస్ పైన నివేదికలిస్తుంది. అలాంటి సీఐడీ ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మూలనపడ్డ సోషల్ మీడియా ఖాతాలు.. కొన్ని జిల్లాల్లో పోలీస్ అధికారులు పక్క జిల్లాలను చూసి హడావుడిగా సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి కొన్ని వీడియోలు, ఫొటోలు షేర్ చేసి వదిలేశారు. మళ్లీ వాటిని ఉపయోగించిన దాఖలాల్లేవు. ఒక్క తెలంగాణ స్టేట్ పోలీస్, కరీంనగర్, రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ ఫేస్బుక్ ఖాతాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. మిగతా యూనిట్లు కార్యక్రమాలు చేసినప్పుడో, పండుగలు వచ్చినప్పుడో తప్ప పెద్దగా పట్టించుకోవడంలేదని పోలీస్ శాఖ గుర్తించింది. -
సాఫ్ట్వేర్ క్రిమినల్ లాయర్ జైలుకు..
బెంగళూరు: చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సకల ప్రయత్నాలుచేశాడు. అందుకోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వదిలేసి లా చదివి క్రిమినల్ లాయర్‌గా మారాడు. ఏంచేసినా ఫలితం శూన్యం. దీంతో పదేళ్ల కిందట కేసులో శిక్ష పడింది. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన శివప్రసాద్ సజ్జన్ సాఫ్ట్వేర్ ఇంజనీ. ఓ మహిళకు అశ్లీల ఈ–మెయిల్స్ పంపుతూ, ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అందరికీ సర్క్యులేట్ చేస్తూ వేధించాడు. బాధిత మహిళ ఫిర్యాదుచేయంతో సజ్జన్‌ను 2008లో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన సజ్జన్.. ఇంజనీరింగ్ జాబ్ వదిలి లా గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేసి క్రిమినల్ లాయర్ అయ్యాడు. కేసును పొడిగించేందుకు చట్టంలోని లొసుగులను వాడాడు. తర్వాత కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. తాజాగా కేసు విచారణ పూర్తయింది. సజ్జన్‌ను దోషిగా నిర్ధారించిన బెంగళూరులోని కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధించింది. -
యురేనియం మోసాలమయం..
సాక్షి, హైదరాబాద్: చిట్టీలు వేసి మోసం చేసిన వాళ్లను చూశాం. ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకొని బోర్డు తిప్పేసిన కంపెనీలను చూశాం. చివరకు కరక్కాయల పేరుతో లక్షలు దండుకున్న గ్యాంగునూ చూశాం. కానీ మెరుపులు, ఉరుములు పడితే యురేనియం, ఇరీడియం తీసిస్తామన్న నయా గ్యాంగ్‌ను చూశారా? అవును రెండు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉరుములు, మెరుపులు పడినా ఆ ప్రాంతం నుంచి విలువైన యురేనియం, ఇరీడియం ఖనిజాలను తీసిస్తామంటూ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. వీరి మాటలు నమ్మి అమాయకులు రూ. కోట్లల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో మూడు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు, పరీక్షలంటూ.. బెంగుళూరుకు చెందిన గంగాధర్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన కోహ్లీ బాబా ఇద్దరు ముఠాగా ఏర్పడ్డారు. కర్ణాటక, ఆం«ధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషాలోని పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులను టార్గెట్ చేసి ఇరీడియం, యురేనియం పేరుతో బురిడీ కొట్టించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రముఖ బిల్డర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ అధికారి ఇద్దరూ ఈ ముఠాను నమ్మి రూ. 4.5 కోట్లు పోగొట్టుకున్నారు. గంగాధర్‌రెడ్డి వీరితో పరిచయం పెంచుకొని బెంగుళూరు విమానాశ్రయ పరిధిలోని రసాయన కంపెనీలో యురేనియం నిలువ ఉందని, దాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ రక్షణ శాఖలో పని చేసే శాస్త్రవేత్త కోహ్లీ వస్తున్నాడని చెప్పి తీసుకెళ్లాడు. రూ. 4.5 కోట్లు టోకారా ఓ గదిలోని రసాయన పదార్థాన్ని పరిశీలించేందుకు గాను ఆ బిల్డరు, రిటైర్డ్ ఉద్యోగికి ప్రత్యేక జాకెట్లు, హెల్మెట్ పెట్టి లోపలికి పంపాడు. ఆ రసాయనాన్ని పరీక్షిస్తున్నట్లు కోహ్లీ నటించడం, వెంటనే అందులో నుంచి పొగలు రావడం చూపించి ఇది నిజమైన ఇరీడియమని, దీన్ని జర్మన్‌లోని ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపాల్సి ఉంటుందన్నాడు. దీన్ని నమ్మిన బిల్డర్, రిటైర్డ్ ఉద్యోగి చెరో రూ. 2 కోట్లు గంగాధర్‌కు ఇచ్చారు. వీరికి మధ్యవర్తిగా ఉంటూ హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ ఉద్యోగిగా చెప్పుకుంటున్న మొయిన్ అనే వ్యక్తి రూ. 50 లక్షలు తీసుకొని మొహం చాటేశాడు. తీరా ఇదంతా ఫేక్ అని, అలాంటి ఖనిజాలు దేశంలో అరుదుగా ఉంటాయని.. దీనికి ప్రభుత్వాల అనుమతి తదితర వ్యవహారా లుంటాయని తెలుసుకొని వారు సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సీఐడీ గంగాధర్‌రెడ్డితో పాటు కోహ్లీని అరెస్టు చేసింది. విదేశాల్లో భారీ డిమాండ్ అంటూ.. 10 కిలోల యురేనియం, ఇరీడియం విదేశీ మార్కెట్లో రూ. 100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు పలుకుతుందని బాధితులను ఈ గ్యాంగ్ నమ్మించింది. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా చూపించినట్లు తెలిసింది. టాలీవుడ్, శాండిల్‌వుడ్‌లోని ప్రముఖ హీరోలు, రాజకీయ నేతలు తమ ద్వారానే రూ. వందల కోట్లు దక్కించుకున్నారని నమ్మబలికింది. ఇందుకు పలువురు శాండిల్‌వుడ్ హీరోలతో దిగిన ఫోటోలను ఆధారాలుగా చూపించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాల్లో పిడుగు పడినపుడు తమ శాస్త్రవేత్తలు యురేనియాన్ని గుర్తించి ప్రముఖులకు సొమ్ము చేశారని చెప్పడంతో బాధితులు నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్నారు. ఒక్కరి నుంచే రూ.10 కోట్లు.. కొద్ది రోజుల క్రితమే విజయవాడకు చెందిన కొందరు.. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉండే రిటైర్డ్ ఉద్యోగి రామారావు (పేరు మార్చాము)ను ఇదేవిధంగా మోసం చేశారు. రెండున్నరేళ్లుగా రామారావును నమ్మించి ఆయన ఆస్తులన్నీ అమ్మిస్తూ ఖనిజ నిక్షే పాల పేరిట దండుకున్నట్టు రామారావు కుమారుడు నగర సీసీఎస్‌లో ఫిరా>్యదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ బృందం.. బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఇరీడియం, యురేనియం దొరుకుతుందని, పలానా చోట దొరికిందని, దాన్ని పరీక్షించేందుకు జర్మన్ శాస్త్రవేత్తలు వస్తున్నారని చెప్పి రూ. కోట్లు దండుకుంటున్నట్లు వెలుగులోకి తీసుకొచ్చింది. రామారావు కేసులో విజయవాడకు చెందిన వ్యక్తిని, హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. వీరి వెనుకున్న గ్యాంగ్ ఏంటి? రెండు రాష్ట్రాల్లో ఎంత మందిని ఇలా మోసగించారో ఆరా తీస్తున్నారు. ఒక్క రామారావే రూ.10 కోట్ల వరకు నష్టపోయినట్లు గుర్తించారు. నమ్మొద్దు: సీఐడీ ఇరీడియం, యురేనియం, ఇతర ఖనిజాల వల్ల రూ. కోట్ల కొద్దీ డబ్బొస్తుందని నమ్మొద్దని, ఇలాంటి ముఠాలకు చెందిన సభ్యుల సమాచారం ఉంటే సీఐడీకి తెలపాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పిడుగు పడినట్లు అలాంటి ఖనిజాలేవి పడవని, అత్యాశకు పోయి ఆస్తులను పోగొట్టుకోవద్దని సూచించారు. -
ఎంసెట్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారుల దర్యాప్తు తుదిదశకు చేరుకుంది. లీకేజీలో ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్న కార్పొరేట్ కాలేజీల లింకును పూర్తిస్థాయిలో ఛేదించేందుకు కృషి చేస్తున్నారు. లీకేజీలో కీలకంగా ఉండి దర్యాప్తులో మృతి చెందిన కమిలేశ్‌కుమార్ లింకును ఛేదించనున్నారు. కమిలేశ్‌కు అనుచరులుగా వ్యవహరిస్తూ.. విద్యార్థులను క్యాంపులకు తరలించిన మరో 9మందిని సీఐడీ గుర్తించింది. వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బృందాలను పట్నా, పుణే, ముంబై, బెంగళూరు, ఢిల్లీ పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. రెండు రోజుల్లో నిందితుల ఆచూకీ పూర్తిస్థాయిలో గుర్తిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించి బ్రోకర్లు, కీలక నిందితుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలతో చార్జిషీట్ రూపొందించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. -
దారుణం.. బాలికపై పోలీసులే..
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణానికి ఒడిగట్టారు. ఓ మైనర్ బాలిక తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, వారిలో ఇద్దరు పోలీసులున్నారి జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌కు ఫిర్యాదు చేసింది. మంగళవారం సీఎం సిద్దిబాత్ కార్యక్రమానికి వచ్చిన బాలిక సీఎంతో తన గోడు వెల్లబోసుకుంది. వెంటనే స్పందించిన సీఎం ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. జంషెడ్‌పూర్‌కు చెందిన ఆ బాలిక ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీ, డీఎస్పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన జంషెడ్పూర్ ఎస్పీ అనూప్ బర్తార్యా స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఎంసెట్ స్కాం..లీకేజీలో ప్రధాన సూత్రధారి ఆయనే
హైదరాబాద్ : ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కీలక సూత్రధారి గురవా రెడ్డియేనని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ మొత్తం స్కాంకు సంబంధించి 155 మంది విద్యార్థులు నిందితులుగా ఉన్నారని, వారిలో 88 మంది కార్పొరేట్ కళాశాలలకు చెందిన వారున్నారని, వీరందరినీ ఏడు క్యాంపులకు తరలించినట్లు సీఐడీ తెలిపింది. కేసులో ఇరుక్కోకుండా ఉండేందుకు కార్పొరేట్ కళాశాలలు ఆధారాలు మాయం చేశాయని సీఐడీ పేర్కొంది. విద్యార్థుల అడ్మిషన్ల దగ్గరి నుంచి ర్యాంకుల పత్రాల వరకు అన్నింటికీ నిప్పు పెట్టినట్లు విచారణలో తేలింది. ఇప్పటి వరకు రూ.8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సీఐడీ తెలిపింది. ఎవరినీ ప్రశ్నించినా నిందితులు ఒకే తరహా సమాధానం ఇస్తున్నారని సీఐడీ అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 90 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. సినిమా తరహాలో కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం జరిగినట్లు విచారణలో తేలింది. ఇప్పటికే మెడికో గణేశ్ ప్రసాద్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. డీన్ వాసుబాబు, వెంకట శివనారాయణలను మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీని అడిగింది. నాంపల్లి కోర్టు మాత్రం నిందితులను కస్టడీకి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. -
వాసుబాబు, నారాయణకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కళాశాల ఏజెంట్ శివనారాయణలకు సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం వీరి కస్టడీ ముగియడంతో సాయంత్రం నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా శివనారాయణను సీఐడీ బృందం భువనేశ్వర్ తీసుకెళ్లి విచారించిన విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని రాజధాని హోటల్లో 4 రూములు బుక్ చేసి 18 మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించినట్లు సీఐడీ ఆధారాలు రాబట్టింది. ఇందులో రెండు గదులు శివనారాయణ బంధువులమ్మాయి పేరుతో, మరో రెండు గదులు వరంగల్ జిల్లాకు చెందిన తిరుపతిరెడ్డి పేరుతో ఉన్నట్లు హోటల్ రికార్డుల ద్వారా తెలిసింది. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు మేక్ మై ట్రిప్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్వాన్స్ రూపంలో రూ.65 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వాసుబాబు, శివనారాయణ వెల్లడించినట్లు అధికారుల ద్వా రా తెలిసింది. సీఐడీ కస్టడీలోని వీరిద్దరినీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ప్రశ్నించారు. కార్పొరేట్ కాలేజీలకు చెందిన మరో వ్యక్తి వ్యవహారంపై వారిని ఆరా తీసినట్లు తెలిసింది. గత దర్యాప్తు అధికారులపై నజర్ గతంలో దర్యాప్తు అధికారులుగా పనిచేసిన వారిపై పోలీస్‌శాఖ దృష్టి సారించింది. రెండుసార్లు చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఆ అధికారులపై సీఐడీ ఉన్నతాధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులోని కీలకాంశాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురాకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని, దీని వెనకున్న రహస్యా న్ని బయటపెట్టేందుకు అంతర్గత విచారణకు ఆదేశించామని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య మాజీ డీన్‌ను విచారణ పేరుతో పిలిచి పంపేయడం, ఆ తర్వాత మరో కార్పొరేట్ కాలేజీ ప్రిన్సిపాల్‌నూ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో పోలీస్ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కేసును కేవలం బిహార్ గ్యాంగ్‌కు అంటగట్టి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారని, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి వారి నుంచి భారీగా దండుకున్నారని పోలీస్ పెద్దలు అనుమానిస్తున్నారు. దాదాపు రూ.1 కోటి వరకు దర్యాప్తు అధికారుల మీదుగా చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఏమాత్రం ఆధారం దొరికినా దర్యాప్తు అధికారి, ఆయనకు సహకరించిన డీఎస్పీ, ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. -
ఎంసెట్-2 పేపర్ లీకేజీలో మరో 16 మంది..!
సాక్షి, హైదరాబాద్: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో నిందితులు వాసుబాబు, శివ నారాయణ గత కొంత కాలంగా సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. కాగా, కోర్టు నిందితులిద్దరికీ 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. తమ విచారణలో కేసుకు సంబంధించి కీలక సూత్రధారిని గుర్తించినట్లు సీఐడీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన కీలక వ్యక్తికి ఈ లీకేజీ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అతన్ని అరెస్టు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేసుతో ఎవరెవరికి సంబంధాలున్నాయో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ఆరు క్యాంపులు నిర్వహించామనీ, మరో 16 మందికి ఈ కేసులో ప్రమేయం ఉందని గుర్తించినట్టు సీఐడీ పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు మెడికో గణేష్ ప్రసాద్‌ను వారం రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు సీఐడీ కోర్టులో పిటిషన్ వేసింది. వాసుబాబు, శివ నారాయణలు శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగులు అన్న సంగతి తెలిసిందే.