
దేవరాపల్లి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సైకో చేష్టలు మానుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సూచించారు. వైఎస్సార్ కుటుంబంపై పిచ్చి ప్రేలాపనలను సహించబోమని హెచ్చరించారు. తారువలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ కుటుంబ సభ్యులపై ఐ టీడీపీ ద్వారా దుష్ప్రచారానికి పాల్పడటంపై సీఐడీ అధికారులు చింతకాయల విజయ్‌కు 41 ఏ నోటీస్ ఇవ్వడానికి వెళ్తే అయ్యన్న అనుచిత వాఖ్యలు చేయటాన్ని ఖండించారు. తప్పు చేయకుంటే సీఐడీ విచారణను ఎదుర్కోవాలన్నారు. నర్సీపట్నంలో యువకుడి చేతిలో ఓటమి చెందడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.