ayyannapatrudu
-
అయ్యన్న వ్యాఖ్యలతో స్తంభించిన మన్యం
సాక్షి, పాడేరు/బుట్టాయగూడెం: గిరిజనుల ప్రధాన చట్టం 1/70ని సవరించి టూరిజం అభివృద్ధి చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో తలపెట్టిన 48 గంటల రాష్ట్ర మన్యం బంద్ తొలిరోజు విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీతో పాటు అఖిలపక్షాల నేతలు ఈ బంద్‌లో పాల్గొన్నారు. పాడేరు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా బంద్ జరిగింది. పాడేరు, అరకు, రంపచోడవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి తదితర ప్రాంతాల్లో గిరిజనులంతా ఏకమై సంపూర్ణ బంద్ చేశారు. మన్యం మొత్తం స్తంభించడంతో సీఎం చంద్రబాబు దిగి వచ్చారు. 1/70 చట్టాన్ని సవరించబోమని స్వయంగా ‘ఎక్స్’లో ప్రకటించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అఖిలపక్ష నాయకులతో మంగళవారం సమావేశమై గిరిజన చట్టాలు, హక్కులను పరిరక్షిస్తామని సీఎం ప్రకటించారని, 1/70 చట్టం రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. దీంతో మంగళవారం సాయంత్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. బంద్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించారు.గిరిజన చట్టాల జోలికి వస్తే ఖబడ్దార్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకూటమి ప్రభుత్వ పెద్దలు గిరిజన హక్కులు, చట్టాల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు హెచ్చరించారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ బాధ్యత పాలకులపై ఉందన్నారు. 1/70 చట్టాన్ని సవరించి గిరిజనుల సంపదను దోచుకునేలా స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలిరోజు బంద్ విజయవంతం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని, ప్రభుత్వం గిరిజనులకు నష్టం చేసే ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎమ్మెల్యే› విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు.అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే బాలరాజుగిరిజన చట్టాలను సవరించాలంటూ వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు గిరిజనులకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ 1/70 చట్టం సవరణ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.స్పీకర్ అయ్యన్నపై జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదురాజవొమ్మంగి: గిరిజనుల చట్టం 1/70పై వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకా యల అయ్యన్నపాత్రుడుపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయ కులు జడ్డంగి పోలీస్ స్టేషన్లో మంగళవా రం ఫిర్యాదు చేశారు. టూరిజంతో పాటు ఇతరత్రా మన్యం అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలన్న అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం నాయకులు తెడ్ల రాంబాబు, సత్యన్నారాయణ, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, సవిరెల చంద్రుడు, పలువురు మహిళా నాయకులు చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉన్న అయ్యన్న ఇలా మాట్లాడటం చట్ట వ్యతిరేకమని అన్నారు.వేకువజాము నుంచే బంద్మంగళవారం వేకువజాము పాడేరులో వైఎస్సార్ïÜపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సీపీఎం, సీపీఐతో పాటు గిరిజన, ప్రజా సంఘాలన్నీ మంగళవారం బంద్ చేపట్టాయి. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, సీపీఎం రాష్ట్ర నేతలు పి.అప్పలనరస, కిల్లో సురేంద్రతో పాటు నేతలంతా గిరిజనులకు అయ్యన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.పెదబయలులో మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో నేతలంతా రోడ్లపై బైఠాయించారు. అరకు లోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు ఘాట్‌లో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జీసీసీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, వైఎస్సార్సీపీ నేతలంతా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలు, పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగానే మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వారపు సంతలు రద్దయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షను వాయిదా వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగానే పనిచేశాయి. బ్యాంకులు తెరచుకోలేదు. అకిలపక్ష నేతలు రోడ్లపైనే భోజనాలు చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివే యించారు. స్థానిక బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించారు. -
అయ్యన్న ముంగిట్లో సీఎం రమేష్ హడావుడి రగులుతున్న కుంపటి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అయ్యన్న ముంగిట్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంక్రాంతి సందడి చేశారు. నర్సీపట్నంలోని ప్రైవేటు రిసార్టులో గత మూడు రోజులుగా మకాం వేసిన రమేష్... సంక్రాంతి వేడుకలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిర్వహించుకున్నారు. ఇటువైపు కనీసం టీడీపీ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు స్పీకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జరుగుతున్న మకర జ్యోతి మహోత్సవాలకు సీఎం రమేష్‌ను ఆహ్వానించలేదు. ఒకవైపు నర్సీపట్నం కేంద్రంగా పలువురు నేతలను తనకు తెలియకుండా బీజేపీలో చేర్చుకోవడంతోపాటు పోటీగా రాజకీయాలు చేస్తున్నారని అయ్యన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కనీస సమాచారం లేకుండా జరుగుతున్న చేరికలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన ప్రధాని సభ సందర్భంగా కూడా స్పీకర్ హోదాలో తనకు కనీస గుర్తింపు దక్కలేదని ఆయన కినుక వహించినట్టు తెలుస్తోంది. ప్రధాని సభకు జన సమీకరణ సందర్భంగా... నర్సీపట్నంలో మీరు చేర్చుకున్న నేతల ద్వారా జనాలను తరలించుకోండంటూ సీఎం రమేష్‌కు అయ్యన్న గట్టిగా బదులిచ్చినట్టు సమాచారం. మొత్తంగా నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు రిసార్టు కేంద్రంగా జరిగిన సంక్రాంతి వేడుకలు కాస్తా కూటమిలో భోగి మంటలను మించి వేడిని రాజేశాయని అర్థమవుతోంది. కొరివితో తలగోక్కున్నట్టు...! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ పోటీలో స్థానికేతరుడైన దిలీప్‌కుమార్‌కు సీటు ఇవ్వాలని టీడీపీ భావించింది. ఈ సీటును తన కుమారుడి కోసం ఆశించిన అయ్యన్నపాత్రుడు... స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఎన్నికల ముందు జరిగిన పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే మాట్లాడారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ స్థానంలో ఎంపీ అభ్యరి్థగా సీఎం రమేష్‌ను బీజేపీ ప్రకటించింది. అనూహ్యంగా అయ్యన్నపాత్రుడు రమేష్‌ను వెంటబెట్టుకుని మరీ ఎన్నికల్లో కలియతిరిగారు. మిగిలిన నేతల కంటే ఎక్కువగా సీఎం రమేష్ తో సఖ్యతగా మెలిగారు. తీరా ఎన్నికల తర్వాత నర్సీపట్నంలోనే సీఎం రమేష్ రాజకీయం మొదలుపెట్టారు. దీంతో కొరివితో తలగొక్కున్నట్టుగా పరిస్థితి తయారయ్యిందని అయ్యన్న వాపోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా నర్సీపట్నం నుంచి జనసమీకరణపై సీఎం రమేష్ అయ్యన్నను కదిపే ప్రయత్నం చేశారు. మీరు చేర్చుకున్న నాయకులతో జనాలను తరలించుకువెళ్లండంటూ అయ్యన్న గట్టిగానే బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంక్రాంతి సందర్భంగా సీఎం రమేష్ నర్సీపట్నంలో మకాం వేయడం చర్చనీయాంశమవుతోంది. సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలో చేరిన ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లతో పాటు ఓ డాక్టర్, జనసేన నేతలు సదరు ప్రైవేటు రిసార్టు వద్ద హడావుడి చేస్తున్నారు. అయితే, అటువైపు ఏ ఒక్క టీడీపీ నేత కానీ కార్యకర్త కానీ వెళ్లకపోవడం గమనార్హం. విశాఖ డెయిరీ డైరెక్టర్ల చేరికపై...! విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ హడావుడిగా అసెంబ్లీలో సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్న ఏర్పాటు చేశారు. దీనిపై పార్టీలోని నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయనే ప్రచారం ఉంది. మరోవైపు తమ పార్టీలో విశాఖ డెయిరీ నేతలను చేర్చుకుంటున్నట్టు సీఎం రమేష్.... అయ్యన్నకు సమాచారమిచ్చినప్పటికీ ఆ విషయంలో ముందుకు వెళ్లడంపై కూడా సీఎం రమేష్ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలోని ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లు సూర్యనారాయణ, రాజకుమారిలను బీజేపీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా నర్సీపట్నంలోని డాక్టర్ కిలాడి సత్యనారాయణను కూడా తాజాగా ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీలో చేర్చుకున్నారు. ఈ చేరిక వెనుక కూడా సీఎం రమేష్ ఉన్నట్టు అయ్యన్న మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ అంటే ఎవరో తెలియని సందర్భంలో ప్రతీ చోట పరిచయం చేసిన తననే లెక్కచేయకపోవడంపై అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ కాస్తా కూటమి నేతల మధ్య కుంపటి రాజేసిందని చెప్పవచ్చు. అది నేనే.. ఇది నేనే..! -
కూటమిలో చిచ్చురేపిన చేరికలు?
సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమిలో పార్టీ నేతల చేరికల విషయంలో రాజకీయ లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుంటే.. మరో పార్టీ నేత మాత్రం చేరికలు వద్దంటూ సూచనలు చేస్తున్నారు. దీంతో, కూటమిలో కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ మొదలైంది.తాజాగా ఓ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) మాట్లాడుతూ.. ఏపీలో(Andhra Pradesh) కూటమి పార్టీల్లో మనకు కావాల్సినంత మంది నేతలు ఉన్నారు. పార్టీలు మారే నేతలు నేతలు మనకు అవసరం లేదు. ఇతరులు ఎవరు వచ్చినా.. కూటమి పార్టీల్లో చేర్చుకోవద్దు అంటూ కామెంట్స్ చేశారు. అయితే, అయ్యన్న ఇలా వ్యాఖ్యలు చేసి 48 గంటలైనా గడవక ముందే బీజేపీలోకి ఒక నేత చేరడం చిచ్చు రేపినట్టు తెలుస్తోంది. దీంతో, కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఇక, అయ్యన్న మాటలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari) పట్టించుకోలేదు. అయ్యన్న సూచనను పరిగణలోకి ఆమె పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. బీజేపీలో చేరికకు రంగం సిద్దమైనట్టు సమాచారం. నేడో, రేపో.. పురందేశ్వరి సమక్షంలో ఆనంద్ బీజేపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. విశాఖ డైరీ అవినీతిపై ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతుండటంతో ట్విస్ట్ చోటుచేసుకుంది. -
అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి లేదు.. స్పీకర్ కు జగన్ బహిరంగ లేఖ
-
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు.‘‘ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది.అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి, కానీ అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోంది.👉 ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ -1953 చట్టంలోని 12-Bలో ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరనే విషయాన్ని నిర్వచించారు. విపక్షంలో ఉన్నపార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. 👉 కానీ.. జూన్ 21న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే YSRCPని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలో కాని, ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలోకాని, మీ ఉద్దేశాలేంటో బయటపడ్డాయి. చట్టాన్ని చూస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో కానీ, ఆ పార్టీ శాసనసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్షనేతగా స్పీకర్ గుర్తించడంలో ఎలాంటి సందిగ్ధతకు తావు లేదు.👉 గౌరవ స్పీకర్ ఇటీవల నన్ను ఉద్దేశించి అన్న మాటలు యూట్యూబ్ ఛానళ్లలో పబ్లిష్ అయ్యాయి. "ఓడిపోయాడు కాని చావలేదు, చచ్చేవరకూ కొట్టాలి" అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.👉 ఇటీవల జరిగిన ఎన్నికల్లో YSRCP 40శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఒకవేళ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్టవుతుంది. YSRCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారు.👉 సభాకార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్షానికి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది కాని, వివిధ అంశాల్లో సరైన చర్చలు జరిగే అవకాశం ఉండదు.👉అసెంబ్లీ సీట్లలో 10శాతం సీట్లు రానందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శానసభాపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోంది. భారత రాజ్యంగం ప్రకారం ఆర్టికల్-208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో ఇన్ని సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తుచేస్తున్నాను. 1984లో లోక్‌సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లేకపోయినప్పటికీ పి.జనార్దన్‌రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు.ఈ అంశాలన్నీకూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ మీకు రాస్తున్నాను. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, "నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న" స్పీకర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నానని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. -
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు.. సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
-
కరుడుగట్టిన పసుపు యోధుడు
సాక్షి, అమరావతి: చింతకాయల అయ్యన్నపాత్రుడు కరుడు గట్టిన పసుపు యోధుడు, ఫైర్‌బ్రాండ్ అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా శాసనసభ హుందాగా నడుస్తుందని నమ్ముతున్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమానపరచకూడదని సభలోని సభ్యులకు సూచించారు. అయ్యన్నను స్పీకర్ పదవిలో చూడటం గర్వంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ సీఎం ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో వచ్చిన అయ్యన్న ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్రవేశారన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతను ఆయన పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు. సీఎంగానే సభలో అడుగుపెట్టా.. సీఎంగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని 2021 నవంబర్ 19న సభ నుంచి బయటకువెళ్లానని, ప్రజల ఆశీస్సులతో మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెట్టానని చంద్రబాబు తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ రాలేదన్నారు. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలన్నారు. 25 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయాల ప్రభావంతోనే నేడు హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలిచిందన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తిచేయడంతో పాటు, వికసిత్, పేదరికంలేని ఏపీని తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా 2047 నాటికి రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా చట్టసభ ముందుకు సాగాలన్నారు. ప్రజలు హుందాతనం చూస్తారు ఇన్ని రోజులు ప్రజలు అయ్యన్నలోని వాడివేడి చూశారని, ఇక మీదట హుందాతనం చూడబోతున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై తిట్టే అవకాశం ఆయనకులేదని, సభలో తిట్టే వారిని నిలువరించే బాధ్యత ఉందన్నారు. అయ్యన్నను స్పీకర్ చేయడం చూస్తుంటే అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్‌ను చేసినట్లుందన్నారు. గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టినప్పటికీ అయ్యన్నపాత్రుడు భయపడలేదని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. సు«దీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రజలకు ఎన్నో సేవలు చేశారని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.హుందాగా మాట్లాడాలి.. శాసనసభలో సభ్యులు హుందాతనంగా మాట్లాడాలి. ప్రస్తుత సభలో 88 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరందరికీ అవకాశాలిస్తాను. ప్రజలు, రాష్ట్రం కోసం అందరూ మాట్లాడాలి. కొత్తగా ఎన్నికైన వారందరికీ సభ సంప్రదాయాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజలెంతో నమ్మకంతో బాధ్యత ఇచ్చారు. సభ్యులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ స్పీకర్హుందాగా నడపాలంటూనే జగన్‌పై అనవసర విమర్శలు.. గత శాసనసభను కౌరవ సభతో పోలుస్తూ.. ప్రస్తుత సభను హుందాగా నడపాలంటూ సీఎం చంద్రబాబు ప్రసంగం ముగిసిన వెంటనే మంత్రులు అనిత, బీసీ జనార్థన్‌రెడ్డి, ఫరూక్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర సహా ఇతర సభ్యుల ప్రసంగాలన్నీ మాజీ సీఎం జగన్ నామస్మరణతోనే కొనసాగాయి. పదేపదే ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శించారు.నీతి వాక్యాలు వల్లెవేసిన అధికార పక్ష నాయకులే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా సభలోలేని ప్రతిపక్ష నేత పేరును పదేపదే ప్రస్తావిస్తూ అర్థరహిత విమర్శలు చేశారు. టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ స్పీకర్‌కు అభినందనలు చెప్పడం కంటే జగన్‌ను తూలనాడటంపైనే ఎక్కువగా దృష్టిసారించారు.అంతకుముందు.. సభను దూషణలు, వెకిలి చేష్టలతో కాకుండా గౌరవంగా నిర్వహించాలని కోరిన చంద్రబాబే.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పిరికితనంతో సభకు రాలేదని వ్యాఖ్యానించడం విశేషం. పవన్ కళ్యాణ్ సైతం ప్రతిపక్ష సభ్యులకు సభకు వచ్చే ధైర్యంలేదని విమర్శించారు. విజయాన్ని తీసుకున్నారుగాని, ఓటమిని తీసుకోలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. -
ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు
శ్రీకాకుళం, సాక్షి, అనకాపల్లి, సింహాచలం: కొత్త అసెంబ్లీ ఇంకా కొలువుదీరలేదు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తి కాలేదు. కొందరు టీడీపీ ప్రజా ప్రతినిధులు నిజ స్వరూపాలు అప్పుడే బయ టపడుతున్నాయి. బూతు భాష, బెదిరింపుల్లో పోటాపోటీగా దూసుకెళుతున్నారు. ఉన్నత పద వుల్లో ఉన్నప్పుడు హుందాగా నడుచుకోవాలనే విషయాన్ని విస్మరించి తమ అధినేత ప్రశంసల కోసం తహతహలాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. టీడీపీ కార్యకర్తలంతా పసుపు బిళ్లలతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటూ ఉపదేశించారు. వారికి కుర్చీలేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి పనులు చేయాని అధికార యంత్రాంగాన్ని బెదిరించారు. పోలీసుల్లో గత ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరించిన వారు స్వయంగా తప్పుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరికలు జారీ చేశారు. నర్సీపట్నంలో నాసిరకంగా రోడ్లు నిర్మించారంటూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మునిసిపల్ అధికారులపై నడిరోడ్డులో పచ్చి బూతులతో రెచ్చిపోయారు. త్వరలో తాను స్పీకర్ అవుతున్నానని, ఇలాంటి రోడ్లు వేసినందుకు మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్దీ నిలబెడతానని హెచ్చరించారు. అయ్యన్న తిట్ల దండకానికి నిశ్చేష్టులైన అధికారులు చుట్టూ ప్రజలంతా చూస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.లైన్లో పెడతా: మంత్రి అచ్చెన్న ‘నేను మాటిస్తున్నా. అధికారులకు సమావేశం పెట్టి చెబుతా. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరకు వెళ్లినా.. ఎమ్మార్వో, ఎండీఓ వద్దకు వెళ్లినా.. ఏ ఆఫీసుకు వెళ్లినా పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పనేమిటి? అని అడిగి అందరికీ పనులు చేసే విధంగా అధికారులను లైన్లో పెడతా. ఎవరైనా నా మాట జవదాటితే ఏమవుతారో వాళ్లకు నేను చెప్పాల్సిన అవసరం లేదు’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం రాత్రి ఓ సభలో వ్యాఖ్యానించారు. మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలసి శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి, టీ ఇచ్చి గౌరవించాలని ఆదేశించారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ క్యాడర్ ఎన్నో అవమానాలకు గురైందన్నారు. ఏ పనిమీద వెళ్లినా అధికారులు, ఉద్యోగులు పట్టించుకోలేదని చెప్పారు. ఎంపీగా రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలుగా తనతో పాటు బెందాళం అశోక్ బాబు ఉన్నా తమను పట్టించుకోకుండా అవమానించారన్నారు. ఇకపై అలా జరగకుండా ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అప్పట్లో అవమానించి పనులు చేయని వారి వద్దే గౌరవం పొందాలని, పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ విషయంలో అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఐదేళ్లలో ఏ అధికారి, ఉద్యోగి ఎలా పని చేశారో తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. కాగా, వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వారిపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి, తమను కలవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. తమకు ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలంటూ మంగళవారం తనను కలసిన కొందరు వలంటీర్లనుద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.తమాషాలు చేస్తున్నారా..‘తమాషాలు ...(బూతు)? ఇష్టం లేకపోతే ...(బూతు)’ అంటూ మున్సిపల్ అధికారులపై నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నడిరోడ్డు మీద బూతులతో రెచ్చిపోయారు. ‘నేను అసెంబ్లీ స్పీకర్‌ను అవుతున్నా.. మిమ్మల్ని గంటల కొద్దీ నిలబెడతా..’ అంటూ పరుష పదజాలంతో దుర్భాషలాడారు. ‘కళ్లు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడకల్లారా!’ అంటూ నోరు పారేసుకున్నారు. ‘నర్సీపట్నంలో దిక్కుమాలిన మున్సిపల్ కమిషనర్ ఒకడున్నాడు. వాడి సంగతి తేలుస్తా’ అంటూ చిందులు తొక్కారు. మంగళవారం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని అబిద్ సెంటర్లో ఇటీవల నిర్మించిన వంద అడుగుల మెయిన్ రోడ్డు, ఆరిలోవ అటవీ ప్రాంతం వద్ద నర్సీపట్నం–కేడీపేట రోడ్డును పరిశీలించిన క్రమంలో అయ్యన్న బూతు పురాణానికి అధికారులు నిశ్చేష్టులయ్యారు.నా కొడకల్లారా.. కళ్లు మూసుకున్నారా? నాణ్యత లేకుండా రోడ్డు ఎలా వేస్తారంటూ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమాషాలు చేస్తున్నారా..? కళ్లు మూసుకుపోయి ఏడుస్తున్నారా.. నా కొడకల్లారా..’ అంటూ బూతులతో విరుచుకుపడ్డారు. పని చేయడానికి ఇష్టం లేకపోతే.. పోండి అంటూ గద్దించారు. ఆర్అండ్బీ రోడ్డుకు మున్సిపాలిటీ నిధులను వినియోగించటంపై అధికారులను ప్రశ్నించారు. రోడ్డు పనుల్లో నాణ్యత లేదని.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయడం తథ్యమన్నారు. అప్పటి ఎమ్మెల్యే ఒత్తిడితో ఎన్నికల కోసం ఈ రోడ్డు వేశారని మండిపడ్డారు.గత ప్రభుత్వ తొత్తులు తప్పుకోండి..కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ తొత్తులుగా పని చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మంత్రి పదవి చేపట్టాక తొలిసారిగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనంతరం సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఖాకీ చొక్కా వదిలిపెట్టి వైఎస్సార్సీపీ కండువా వేసుకునేందుకు కూడా కొంత మంది పోలీసులు సిద్ధమయ్యారన్నారు. అలాంటి పోలీసులకు తాను హెచ్చరికలు జారీ చేస్తున్నానని చెప్పారు. వైఎస్సార్సీపీ రక్తం ఇంకా మీలో ప్రవహిస్తోందన్న ఫీలింగ్ ఉంటే మీ అంతట మీరే తప్పుకోవాలని పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి సంఘటనపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. -
Big Question: అయ్యన్న మాటల వెనుక అసలు స్కెచ్ ఏంటి ?
-
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. -
కులం మీద బతికేవాడు అయ్యన్నపాత్రుడు
సాక్షి,అనకాపల్లి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వెలమ కుల ద్రోహి అని టీడీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడుతున్న టీడీపీ రెబల్ అభ్యర్థి ఈర్లె శ్రీరామ్మూర్తి విమర్శించారు. కులం కోసం కాదు.. కులం మీద బతికేవాడే అయ్యన్నపాత్రుడు అని, తాను తప్ప ఎవరూ ఎదగకూడదని అనుకునే వాడని మండిపడ్డారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2018లో రెవెన్యూ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీకి సేవలు చేస్తున్నానని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన తనకు గతంలో చంద్రబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని.. కానీ మాట తప్పారని ధ్వజమెత్తారు. బీసీ కులాలంటే టీడీపీ అధిష్టానానికి గౌరవం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తనకు ఉపాధ్యాయ సంఘాలు, పట్టభద్రులతో మంచి సన్నిహితం ఉందని, టీడీపీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గానైనా నామినేషన్ వేసి గెలుస్తానని శ్రీరామ్మూర్తి ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉంటాననే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు అడుగడుగునా తనపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి అయ్యన్నపాత్రుడి స్వగ్రామమని, ఆయనది ఉత్తరాంధ్ర కాదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వలస నేతలు పాలిస్తున్నారనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అయ్యన్నకు ఆ అర్హత లేదన్నారు. -
మహిళల మానప్రాణాలతో చెలగాటమా?
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. వారికి కొమ్ముకాస్తున్న పచ్చ మీడియా వ్యవహారశైలి కూడా అలాగే ఉందన్నారు. చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున ఆదివారం మీడియాతో మాట్లా డారు. ‘మహిళల మానప్రాణాలపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయటం కరెక్టేనా? ఇంత సిగ్గుమాలిన పనులు చేసే వ్యక్తిని రామోజీరావు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు మా పార్టీ వాళ్లకు కూడా ఒళ్లు మండి అయ్యన్నపాత్రుడి కుటుంబంలోని మహిళలనో, నారా భువనేశ్వరినో, బ్రాహ్మణినో, లేకపోతే రామోజీరావు కోడలినో, మనవరాలినో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే వారికెలా ఉంటుంది? అప్పుడు కూడా... అలాంటి కామెంట్లు చేసిన వారిని ఈనాడు ఇలాగే సమర్థిస్తుందా?’ అని ప్రశ్నించారు. సీఐడీ వారు విజయ్ కోసం వెళితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ‘ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్థిస్తారా? ఐటీడీపీ అనే దానిలో ఈ విజయ్ దారుణమైన పోస్టులు పెట్టాడు. మహిళల శీలాన్ని అవమానించేలా, ప్రజలు అసహ్యించుకునేలా విజయ్ పోస్టులు ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు. టీడీపీ అధికార వెబ్సైట్ ఐటీడీపీ ద్వారా పోస్టులు పెట్టారు. అందుకే విచారణ కోసం పోలీసులు పిలిచారు. అదేమైనా తప్పా? ఇలాంటి వ్యక్తులను ఎల్లో మీడియా ఎందుకు వెనుకేసుకుని వస్తోంది?. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలను చంద్రబాబు, లోకేశ్ సమర్థిస్తున్నారు. వీరంతా రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? అని మంత్రి ప్రశ్నించారు. ‘దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. చింతకాయల విజయ్ కంటే ఎక్కువగా మేం మాట్లాడతాం. తిడతాం. కానీ మాకు సంస్కారం ఉండబట్టి అలా చేయడం లేదు. టీడీపీ వారికి సిగ్గు అనేది లేదు. చింతకాయల విజయ్ అనే వ్యక్తిపై చట్టం తనపని తాను చేసుకుం టుంది. మహిళలపై సీఐడీ దౌర్జన్యం అంటూ తప్పు డు మాటలు మాట్లాడటం సరికాదు’ అని అన్నారు. మాకు విచక్షణ ఉంది ... చంద్రబాబు భార్య మీద, కోడలి మీద, రామోజీరావు భార్య మీద, కోడలి మీద, మనవరాళ్ల మీద రాధాకృష్ణ కూతురు మీద.. ఇలా వారి ఇళ్లలో ఉన్న మహిళల మీద ఏనాడూ తాము ఇటువంటి విమర్శలకు దిగడం లేదని మంత్రి స్పష్టంచేశారు. ‘మా పార్టీ ప్రజలకు చేసిన మంచిని, మేలును నమ్ముకున్న పార్టీనే తప్ప దిగజారుడు ప్రచారాన్ని నమ్ముకోలేదు. ఇంత నిగ్రహంగా మా నాయకత్వం, మేము ఉన్నా ఎవరో ఒకరు సహనం కోల్పోయి ప్రతిస్పందనగా పోస్టింగ్ పెడితే, నానా యాగీ చేస్తున్నారు. చింతకాయల విజయ్‌కు నోటీసు ఇస్తే, ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. మేమూ తిట్టగలం. కానీ మాకు సంస్కారం ఉంది. అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. విజయ్ శిక్షార్హుడు’ అని అన్నారు. టీడీపీ నేతలకు నిజంగా సిగ్గు ఉంటే చింతకాయల విజయ్ను సమర్థించకూడదన్నారు. -
సైకోలా అయ్యన్న తీరు
దేవరాపల్లి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సైకో చేష్టలు మానుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సూచించారు. వైఎస్సార్ కుటుంబంపై పిచ్చి ప్రేలాపనలను సహించబోమని హెచ్చరించారు. తారువలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై ఐ టీడీపీ ద్వారా దుష్ప్రచారానికి పాల్పడటంపై సీఐడీ అధికారులు చింతకాయల విజయ్‌కు 41 ఏ నోటీస్ ఇవ్వడానికి వెళ్తే అయ్యన్న అనుచిత వాఖ్యలు చేయటాన్ని ఖండించారు. తప్పు చేయకుంటే సీఐడీ విచారణను ఎదుర్కోవాలన్నారు. నర్సీపట్నంలో యువకుడి చేతిలో ఓటమి చెందడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
అయ్యన్న ఇంటి ముట్టడికి యత్నం
నర్సీపట్నం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి శనివారం అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీ నిర్వహించవద్దని టౌన్ సీఐ స్వామినాయుడు ఎమ్మెల్యేకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా.. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి. అతడి ఇంటిని ముట్టడించి తీరుతామని పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ముందుకు సాగడంతో ఐదు రోడ్ల కూడలి సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, పార్టీ నాయకులు మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని సీఐలు ఎమ్మెల్యేకు నచ్చచెప్పడంతో అక్కడ నుండి ఎమ్మెల్యే టౌన్ స్టేషన్‌కు చేరుకుని అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీనికి ముందు అబిద్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి మద్యం సీసాల దండలు మెడలో వేసి అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు దిష్టి బొమ్మలను దహనం చేశారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. గొలుగొండ మండలంలో అయ్యన్న బినామీల పేరుతో వందల ఎకరాలు సంపాదించారని, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి సన్ రిసార్ట్స్, లిక్కర్ ఫ్యాక్టరీ వంటి కంపెనీలు ఎలా పెట్టారని అయ్యన్నపాత్రుడిని ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు. లేటరైట్ అక్రమ తవ్వకాలతో అయ్యన్నపాత్రుడు రూ.100 కోట్లు దోచుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసునన్నారు. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, మునిసిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అయ్యన్న అరెస్ట్‌కు డిమాండ్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులపై అభ్యంతరకరమైన భాషలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌గున్నికి ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మద్దాళి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, జీడీసీసీ చైర్మన్ రాము, జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా బత్తుల దేవా, వైఎస్సార్సీపీ నాయకుడు షౌకత్ తదితరులు శనివారం కలిశారు. అయ్యన్నపై ఫిర్యాదు చేసిన వారంతా ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై, పోలీస్ శాఖపై, రాజ్యాంగ బద్ధమైన హక్కులపై అయ్యన్నపాత్రుడు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని ధ్వజమెత్తారు. హోంమంత్రిగా ఉన్న దళిత మహిళను కించపరిచేలా, చట్టాలను అపహాస్యం చేసేలా వ్యవహరించిన అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రణాళిక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను బలహీనపరిచేలా ఉందని, వారు కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ ప్రజారంజకమైన పాలనతో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. జగన్ అందిస్తున్న చక్కని పరిపాలనతో చంద్రబాబు కూశాలు కదులుతున్నాయని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడి బతుకు ఏమిటో ఏ చెట్టు, పుట్టనడిగినా చెబుతాయని ఎద్దేవా చేశారు. అయ్యన్నపై కేసు నమోదు సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నకరికల్లు మండలం కండ్లకుంట మాజీ సర్పంచ్ కంఠమనేని కోటేశ్వరరావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 16న కండ్లకుంటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రిని, మంత్రులను ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఐపీసీ 153ఏ, 505, 504, 501 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు నకరికల్లు ఎస్ఐ ఉదయ్‌బాబు తెలిపారు. -
మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు: హోంమంత్రి సుచరిత
సాక్షి, అమరావతి: ఎంతో సీనియర్, ఎన్నో పదవులు చేసిన అయ్యన్నపాత్రుడు ఒక దళిత మహిళ గురించి మాట్లాడిన తీరు అందరూ చూశారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ కమిషనర్‌ను బట్టలు ఊడదీసి కొడతా అన్న వ్యక్తి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడని తాను అనుకోవడం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అతడి వ్యాఖ్యలపై స్పందించకూడదనుకున్నా.. కానీ వాళ్లు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని తెలిపారు. దళిత జాతిలో పుట్టినందుకు తాను గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఒక దళిత మహిళగా ఏ జన్మలోనూ ఇలాంటి భాష మాట్లాడలేనని వివరించారు. గొప్పతనమనేది మన ప్రవర్తన బట్టి వస్తుంది.. అతడి సంస్కారం ఏమిటో అర్థం అవుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి ఇచ్చింది సీఎం జగన్.. తనను గెలిపించింది నియోజకవర్గ ప్రజలు అని పేర్కొన్నారు. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? ‘సీఎం జగన్‌ని మీరు మాట్లాడిన మాటలు ఏమిటి..? మీరు మహిళలను గౌరవించి ఉంటే మీకు 23 సీట్లు వచ్చేవి కాదు’ హోంమంత్రి సుచరిత విమర్శించారు. ‘వంగవీటి రంగాను చంపింది మీ హయాంలోనే కదా..? మీ హయాంలో ఒక హోంమంత్రిని హత్య చేశారు.. అప్పుడు మీకు శాంతి భద్రతలు గుర్తుకురాలేదా..? మీ మీద హత్యాయత్నం జరిగితే మీకు మద్దతుగా వైఎస్సార్ ఆందోళన చేశారు. మీరేమో జగన్‌పై దాడి జరిగితే కోడి కత్తి అన్నారు. జగన్ ఈ రోజు రాజీనామా చేయమంటే వెంటనే చేస్తాను.. మీరెవరు అడగడానికి..? మల్లెపూలు అమ్ముకునే వాళ్లు మనుషులు కదా...? గంజాయి అమ్ముకునే నువ్వే ద్రోహివి. ఒక దళిత మహిళను హోంమంత్రి చేస్తే మీకెందుకు కడుపు మంట.’ చదవండి: అమిత్ షా సభలో ‘ఈటల’ స్పెషల్ అట్రాక్షన్ ‘ఆత్మాభిమానమే ముఖ్యంగా బతుకుతున్న దళిత మహిళను నేను. ఏదైనా శాఖాపరంగా అడగండి సమాధానం చెప్తా! మీ పరిపాలనలో మహిళకు ఏ మేరకు న్యాయం చేశారు..? నా మీద మీరు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమి చేస్తారో తేల్చుకోవాలి. లోపాలు ఉంటే ఎత్తి చూపండి సమాధానం చెప్తామ్. కానీ వ్యక్తిగత దూషణకు వెళ్తే సహించేది లేదు. ఒక మహిళా హోంమంత్రినే ఇలా మాట్లాడుతున్నారంటే ఇక సామాన్య మహిళలపై ఎలా ప్రవర్తిస్తారు..? జోగి రమేశ్ ఒక లేఖ ఇవ్వడానికి వెళ్తే ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. గతంలో కూడా అసెంబ్లీలో పాతరేస్తా అని మాట్లాడిన వాళ్లు ఇంతకంటే ఎలా ప్రవర్తిస్తారు?’ అని హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు. -
పేరులో అన్నం.. నోట్లో అశుద్ధం!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన దుర్భాషలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురువారం వారు మాట్లాడుతూ.. టీడీపీకి చెందిన ఈ వెధవకు సీఎం జగన్ గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు. అయ్యన్నపాత్రుడు పేరులో అన్నం ఉంది గానీ.. నోట్లో ఉన్నదంతా అశుద్ధమేనని విరుచుకుపడ్డారు. ఈ రోజు నుంచి అయ్యన్నను అశుద్ధంపాత్రుడుగా పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారం పోయిందని రగిలిపోతున్న ఈ గాడిద గురించి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నీచంగా చెబుతారన్నారు. పొద్దున లేస్తే అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు చేసేదే గంజాయి వ్యాపారమని, ఇది గత రెండున్నరేళ్లుగా బంద్ అయ్యేసరికి అయ్యన్న గాడిదలాగా మారి అరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతకాయల రూ.కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. ఆయన, చంద్రబాబు అవినీతిని ప్రభుత్వం బయటపెడుతున్నందుకే దూషణలకు దిగుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు లోకేశ్ డైరెక్షన్ మేరకే చింతకాయల విమర్శలకు దిగారన్నారు. ఆయనకు సిగ్గు, శరం ఉంటే, నిజంగా మనిషి అయితే మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు కారణమో, కాదో చెప్పాలన్నారు. కోడెలను చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారని తెలుగు ప్రజలు కోడై కూస్తున్నారని తెలిపారు. అయ్యన్న తిట్టాల్సింది.. చంద్రబాబును, లోకేశ్నేనని చెప్పారు. నర్సీపట్నం ప్రజలు అయ్యన్న వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నారన్నారు. హైకోర్టు.. తన తీర్పుతో చంద్రబాబు, లోకేశ్‌లను చాచి లెంపకాయ కొట్టిందని.. దాన్ని మళ్లించడానికే ఇలా దూషణలకు దిగాడన్నారు. -
వేల కోట్లు కొల్లగొట్టారు.. అయ్యన్నే అసలైన మైనింగ్ డాన్
దొంగే.. ‘దొంగ.. దొంగ’ అని అరిచినట్లుంది. గత ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టానుసారం తవ్వకాలు సాగించి, వారికీ వాటాలు పంచి.. అమాయక గిరిజనం నోట్లో మట్టి కొట్టారు. ఇప్పుడా బాగోతం బట్టబయలు కావడంతో గురివింద గింజను తలపిస్తూ సరికొత్త డ్రామాకు తెరలేపారు. సాక్షి, అమరావతి: బాక్సైట్ తవ్వకాలు అక్రమంగా జరిగిపోతున్నాయని ఆందోళన చేస్తున్న టీడీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే అసలైన మైనింగ్ డాన్ అని తేటతెల్లమైంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన కొడుకు చింతకాయల విజయ్.. విశాఖ మన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని అడ్డూ అదుపు లేకుండా ఖనిజ వనరుల్ని కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. అప్పటి అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని లేటరైట్ తవ్వకాలను యథేచ్చగా జరిపించారు. అయ్యన్న ముఠా మన్యంలో జరిపిన అక్రమ తవ్వకాల విలువ వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అయ్యన్న కుమారుడి అక్రమాల్లో చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు కూడా వాటాలున్నాయని ప్రచారం జరుగుతోంది. భూగర్భ గనుల శాఖ నిర్వహించిన విచారణలో ఈ అక్రమాలన్నీ బహిర్గతమయ్యాయి. వాటిని కప్పి పుచ్చేందుకు, అక్రమ ఆదాయానికి గండి పడిందనే అక్కసుతో ఎదురుదాడి మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. విచారణలో వాళ్ల అక్రమాలన్నీ బయట పడడంతోపాటు మైనింగ్ దోపిడీపై అయ్యన్న గ్యాంగ్‌పై కోట్ల రూపాయల జరిమానా పడింది. ఆ లీజులు రద్దయ్యాయి. అందుకే తమకు అంటిన బురదను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటించాలనే దుర్బుద్ధితో తాజాగా లేని బాక్సైట్‌ను తవ్వేస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో ఉన్న ఏడు లేటరైట్ లీజులు చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. అందులో మూడు చింతకాయల విజయ్‌వే. అమాయక గిరిజనులకు లేటరైట్ లీజులు వాళ్లు అమాయక గిరిజనులు. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేనివాళ్లు. అలాంటి ముగ్గురికి వేల కోట్ల రూపాయల విలువైన లేటరైట్ లీజులు వచ్చాయి. కాయకష్టంతో కడుపు నింపుకునే వాళ్లకు అంత విలువైన లీజులు ఎలా వచ్చాయి? చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన మాయ అది. ఇప్పుడు నీతులు చెబుతున్న చింతకాయల అయ్యన్న పాత్రుడి ముఠా లీల అది. ఆ మూడు లీజులు చింతకాయల విజయ్‌వే. ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ లీజులు గిరిజనులకే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అమాయక గిరిజనుల పేరుతో మూడు లేటరైట్ లీజులు తీసుకుని మన్యాన్ని కబళించేశారు విజయ్ అతని అనుయాయులు. సర్వే చేయని కొండను సైతం.. విశాఖ జిల్లా నాతవరం మండలం సుందరకోట గ్రామంలో 4.97 హెక్టార్లలో లేటరైట్ తవ్వకానికి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే సింగం భవానీ పేరుతో మైనింగ్ లీజును తీసుకున్నారు. ఇది సర్వే చేయని కొండ ప్రాంతం. అక్కడ డీజీపీఎస్ సర్వే జరగలేదు. నిబంధనల ప్రకారం ఈ భూమికి మైనింగ్ లీజు ఇవ్వకూడదు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేసింది. మైనింగ్ ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమంగా లేటరైట్‌ను తవ్వారు. లీజు భూమిలో తవ్విన లేటరైట్‌ను బయట ప్రాంతాలకు రవాణా చేసేందుకు రిజర్వు ఫారెస్టులో అడ్డగోలుగా రెండు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు వేశారు. ఇందుకోసం గ్రావెల్, లేటరైట్, ఎర్రరాయిని తవ్వి వాడేశారు. అంతేకాకుండా లీజు పరిధిలోకి రాని భూముల్లో కూడా ఇష్టానుసారం మైనింగ్ చేసి 18,942 మెట్రిక్ టన్నుల లేటరైట్‌ను అమ్మేసుకున్నారు. మరోవైపు ఈ లీజు కింద ఇచ్చిన పర్మిట్లను తూర్పుగోదావరి జిల్లా వంతాడ మైనింగ్ లీజుకు చూపించి వినియోగించుకున్నారు. ఇక్కడ 4,09,542 మెట్రిక్ టన్నులకు పర్మిట్లు తీసుకున్నారు. కానీ తవ్వింది మాత్రం 2,81,488 మెట్రిక్ టన్నులే. మిగిలిన 1,28,054 మెట్రిక్ టన్నుల పర్మిట్లను వంతాడ మైనింగ్ లీజుకు చూపించి భారీగా డబ్బు దండుకున్నారు. వీటిపై ఆరోపణలు రావడంతో విచారణకు వెళుతున్న మైనింగ్ అధికారుల్ని అడ్డుకునేందుకు విజయ్ మనుషులు రోడ్డు తవ్వేశారు. అయినా అధికారులు విచారణ చేశారు. అవకతవకలు తేలడంతో రూ.9.34 కోట్ల జరిమానా విధించారు. కొండను తవ్వి నాలుగు కిలోమీటర్లు రోడ్డు నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని తోరాడ గ్రామంలో సర్వే నంబరు 532లో 68 ఎకరాలను గిరిజనుడైన కిలె లోవరాజుకు లేటరైట్ తవ్వకానికి తెలుగుదేశం హయాంలో 2017లో అనుమతి ఇచ్చారు. లోవరాజును మభ్యపెట్టి అతని పేరుతో విజయ్ ఈ లీజును తీసుకున్నట్లు విచారణలో తేలింది. అడ్డగోలుగా తవ్వడమే కాక.. తవ్వే ప్రాంతానికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా, సీనరేజి కట్టకుండా ఏకంగా రిజర్వు ఫారెస్టులో కొండను తవ్వి నాలుగు కిలోమీటర్ల రోడ్డును వేశారు. ఈ గనిలో 3,26,187 మెట్రిక్ టన్నుల లేటరైట్‌ను తవ్వారు. దాన్ని రవాణా చేయడం కోసం తీసుకున్న పర్మిట్లను తూర్పుగోదావరి జిల్లా వంతాడ మైనింగ్‌లో వినియోగించారు. తోరాడ లీజులో తవ్విన ఖనిజానికి సంబంధించిన పర్మిట్లను వంతాడలో వాడి, అక్కడా లేటరైట్‌ను తవ్వి అమ్మేసుకున్నారు. 50,169 మెట్రిక్ టన్నుల బిల్లుల్ని ఇలా వంతాడకు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జరిపిన విచారణలో ఈ ఉల్లంఘనలు స్పష్టమవడంతో మైనింగ్ శాఖ రూ.8 కోట్ల జరిమానా విధించింది. ప్రస్తుతం తవ్వకాలు నిలిచిపోయాయి. అల్లూరి గుహలు కనుమరుగయ్యేలా తవ్వకాలు నాతవరం మండలం అసనగిరి గ్రామంలో సింగం భవానీ పేరు మీద 89 ఎకరాలకు మరో లేటరైట్ లీజు తీసుకున్నారు. ఈ లీజు ప్రాంతంలోనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తలదాచుకున్న ఎర్రమట్టి గుహలున్నాయి. స్థానిక గిరిజన దేవత గంగాలమ్మను పూజించే ప్రాంతం ఇది. గిరిజనులు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం ఈ లీజు ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ అనుయాయులు రంగంలోకి దిగి ఎర్రమట్టి గుహల వద్దకు వెళ్లేందుకు అడవిని నాశనం చేసి ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. ఇందుకోసం ఎర్రమట్టి, గ్రావెల్‌ను ఇష్టానుసారం వాడుకున్నారు. తవ్వకాలు జరుగుతున్న తీరు చూసి ఇది పూర్తయితే చారిత్రక ప్రదేశంగా ఉన్న సీతారామరాజు ఉన్న గుహలు కనుమరుగవుతాయని స్థానికులు ఆందోళన చెందారు. తమ దేవతను పూజించే ప్రాంతం ఉండదని తవ్వకాల్ని అడ్డుకున్నారు. ఈ లీజులోనూ అయ్యన్న కుమారుడి అక్రమాలు బయటపడడంతో దీని రద్దుకు మైనింగ్ అధికారులు సిఫారసు చేశారు. ప్రస్తుతం తవ్వకాలు నిలిచిపోయాయి. ఈ గనుల్లో తవ్విన లేటరైట్‌ను దొంగతనంగా ఒరిస్సాలోని వేదాంత కంపెనీకి అమ్ముకుని వందల కోట్లు గడించారు. లోకేశ్‌కు వాటా! ఈ అక్రమాల్లో చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్‌కు వాటా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్, చింతకాయల విజయ్ అత్యంత సన్నిహితులు. లోకేశ్ అండతోనే మన్యంలో విజయ్ చెలరేగిపోయారు. లోకేశ్ ప్రోద్బలంతోనే విజయ్.. విశాఖ మన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని కబళించారు. ఐదేళ్లపాటు లేటరైటే కాదు.. మన్యంలో కనిపించిన ప్రతి ఖనిజాన్ని అయ్యన్న ముఠా తవ్వేసి అమ్ముకుంది. ఎర్రరాయి, గ్రావెల్‌ను పెద్దఎత్తున తవ్వి సొమ్ము చేసుకుంది. వీళ్లు తవ్వి అమ్ముకున్న ఖనిజం విలువ వేల కోట్లకుపైనే ఉంటుందని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అయ్యన్న గ్యాంగ్ అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడింది. మైనింగ్ విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. తవ్వకాలు నిలిచి పోవడంతో ఈ ముఠా ఆదాయానికి గండి పడింది. మరోవైపు కోట్ల రూపాయల జరిమానాలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అక్కసుతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అయ్యన్న ముఠా ఎదురు దాడికి దిగింది. ప్రభుత్వంపై బురదజల్లడం మొదలు పెట్టింది. తాము చేసిన అక్రమాలు ఇప్పుడు జరుగుతున్నట్లు చిత్రీకరించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత విలువైన ఖనిజ వనరుల్ని మింగేసి ఇప్పుడు వాటి కోసం ఆందోళనల పేరుతో హడావుడి చేస్తుండడం చూసి గిరిపుత్రులు నవ్వుకుంటున్నారు. లేటరైట్‌ను దోచేసిన అయ్యన్నపాత్రుడు నిజ నిర్ధారణ పేరుతో మన్యంలోకి వెళ్లేందుకు హడావుడి చేయడం చూసి ఇంతకన్నా దారుణం ఏముంటుందని గిరిజనులు వాపోతున్నారు. తమను మోసం చేసిన వాళ్లే ఇప్పుడు తమను రక్షించడానికి వస్తున్నట్లు డ్రామాలాడడం మన్యంలో చర్చనీయాంశమైంది. నిజానికి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక లేటరైట్ లీజు కూడా మంజూరు చేయలేదు. ఉన్న ఏడు లీజులు చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. లేని బాక్సైట్‌ను తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నిజానికి ఆ లీజును ఇచ్చేందుకు అయ్యన్న మంత్రిగా ఉన్నప్పుడే అంగీకరించారు. ఇప్పుడు అదే తప్పు అని రోడ్డెక్కడం కొసమెరుపు. -
తారాస్థాయికి చేరిన మంత్రుల మధ్య విబేధాలు
-
డ్యాన్సర్లతో రోడ్డుపైన స్టెప్పులేసిన మంత్రి
-
ఆదేశాలు పాటిస్తే బహుమానం ఇదా ?
♦ వాహనాన్ని వేరో రూటులో వెళ్లాలని చెప్పడంతో ♦ ఏఆర్ ఎస్ఐపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం ♦ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు ♦ ఎస్ఐపై చర్యలకు రంగం సిద్ధం? పట్నంబజారు (గుంటూరు) : ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం మంత్రి గారి వాహనాన్ని అటువైపు పార్కింగ్‌కు వెళ్లమని చెప్పడం ఆ ఎస్ఐ చేసిన నేరం. దీంతో ఆగ్రహించిన సదరు మంత్రిగారు చిందులు తొక్కారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 15న మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సీటీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతం వర్షం కారణంగా పూర్తిగా తడిసిపోయింది. దీనితో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ ఎస్ఐ వి. బాలకృష్ణ వేరే రూటు ద్వారా లోపలికి వెళ్లాలని సూచించారు. దీతో అగ్రహం చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన్ను దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా పోలీసు ఉన్నతాధికారులకు సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. సుమారు సంవత్సరం పైగా ఎస్ఐ బాలకృష్ణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వర్తించారు. నెలన్నర నుంచి ఈస్ట్ ట్రాఫిక్ స్టేషన్లో పని చేస్తున్నారు. మంత్రి గారి ఎపిసోడ్ నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా ఆయన్ను ఏఆర్ కార్యాలయానికి వచ్చి రిపోర్టు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునే దిశగా యోచిస్తున్నారని పోలీసు శాఖలో అనుకుంటున్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించినా ఇదేమి గోలంటూ పోలీసులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. -
వచ్చే ఎన్నికలపై అయ్యన్న జోస్యం
-
‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి’
-
‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ’
విశాఖ : వచ్చే ఎన్నికలపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని, కావాలంటే పేపర్ మీద రాసుకోవాలంటూ అయ్యన్న పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కాగా 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా జనసేన ఇప్పుడు ఎన్డీయే భాగస్వామి పక్షం కాదని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. మరోవైపు మంత్రి అయ్యన్న వ్యాఖ్యలపై జనసేన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గంటా ఫ్లాప్ షో..
వరుసగా దెబ్బ మీద దెబ్బ ఫిల్మ్‌నగర్ క్లబ్ స్థలం లీజు రద్దు బీచ్ లవ్ ఫెస్టివల్‌పై సర్కారు వెనక్కి? ఆ రెండింటిలోనూ గంటా పెత్తనం దానికి చెక్ పెట్టేసిన వైరివర్గం {పభుత్వంలో మంత్రి పరపతిపై నీలినీడలు గంటా శ్రీనివాసరావు.. విశాఖ జిల్లాలో మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నప్పటికీ తనదైన శైలిలో హల్చల్ చేస్తూ జిల్లా దేశం రాజకీయాల్లో చక్రం తిప్పేస్తుంటారు. విశాఖలో ఉత్సవాలు, పండుగలు, పబ్బాలు.. వెరసి ఆడంబరాల సారధిగా అటు జనం నోట నానాలని.. ఇటు ప్రభుత్వం వద్ద పేరు కొట్టేయాలని తాపత్రయపడిపోతుంటారు. మరోవైపు వర్గ రాజకీయలతో పార్టీలోనూ పెత్తనం చేయాలని భావించే గంటా వ్యవహారశైలి పట్ల కొంతకాలంగా సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నారన్న ప్రచారం గణగణమని మోగుతోంది. సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో బాబు చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న అభిప్రాయమూ నిన్నమొన్నటి వరకూ వినిపించింది. కానీ ఇటీవలి కాలంలో జరిగిన వరుస పరిణామాలు చూస్తుంటే గంటల చప్పుడు చప్పబడిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నారుు. ఫిల్మ్‌నగర్ క్లబ్ స్థలం లీజు రద్దు చేయడమే కాకుండా.. బీచ్ లవ్ ఫెస్టివల్‌పై వెనక్కి తగ్గాలని సర్కారు నిర్ణరుుంచడం గంటా మాట చెల్లుబాటు కావడం లేదన్న వాదనకు బలం చేకూరుస్తోందని ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ రెండింటితో గంటాకేం సంబంధం.. ఈ వ్యవహారాల్లో ఏ విధంగా ఆయనకు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడింది, వైరి వర్గం గంటాకు ఎలా చెక్ పెట్టింది.. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వారం విశాఖ తీరానికి రండి. విశాఖపట్నం పవర్ + పాలిట్రిక్స్ = గంటా. ఆయన గురించి రాజకీయవర్గాల్లో సహజంగా వినిపించే మాట ఇది. కానీ ఇప్పుడు గంటా రాజకీయ పరపతిపై నీలినీడలు కమ్ముకుంటున్నారుు. వరుసగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో పాటు ఆయన స్వయంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీలోనే వైరివర్గంగా చెలామణీ అయ్యే అయ్యన్నపాత్రుడి శిబిరం వరుసగా పైచేరుు సాధిస్తున్న దరిమిలా టీడీపీలో గంటా హవాకు బ్రేక్ పడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీచ్ లవ్ దుమారం తీవ్ర వివాదం రేపిన బీచ్ లవ్ ఫెస్టివల్ దుమారం కూడా మంత్రి గంటానే కమ్మేసింది. విశాఖ తీరంలో వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ప్రేమోత్సవం నిర్వహించేందుకు సర్కారు సరదా పడిన సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరు వేల విదేశీ జంటలతో లవ్ ఫెస్టివల్ జరిపేందుకు ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ముందుకొచ్చింది. ప్రఖ్యాత పాప్ గాయని షకీరాతో మ్యూజికల్ నైట్, క్యాట్‌వాక్, వెస్టన్ర్ డ్యాన్సలు, ఫ్యాషన్ షో, లైవ్‌షోలు ఏర్పాటు చేయాలని భావించింది. విదేశీ అతిధలు మందు, విందులతో మజా చేస్తూ బీచ్‌లో బికినీలు ధరించి యథేచ్ఛగా విహరించేందుకు విశాఖ బీచ్ వేదికగా సన్నాహాలు చేసింది. ఈ ప్రతిపాదనపై ప్రజా, మహిళా సంఘాలు దుమ్మెత్తిపోశారుు. ప్రేమోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారుు. ఈ వ్యవహారంలో కూడా గంటా అనవసర జోక్యం వివాదాస్పదమైంది. జిల్లా మంత్రిగా ఆయన స్పందించవచ్చు కానీ.. అంతకుమించి అంతా తానే అన్నట్టుగా లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించితీరుతామని ప్రకటించారు. పాశ్చాత్య పోకడలతో గోవా మాదిరిగా విశాఖ బీచ్‌ను మారిస్తే చూస్తూ ఊరుకోమని ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలన్నీ తెగేసి చెప్పడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ప్రభుత్వంతో పాటు పార్టీ పరువు కూడా పోయే ప్రమాదం తలెత్తడంతో సీఎం చంద్రబాబు బీచ్ లవ్ ఫెస్టివల్ రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. జిల్లా మంత్రిగా ఇక్కడి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సీఎంకు నచ్చజెప్పి ప్రేమోత్సవాన్ని రద్దు చేరుుంచి ఉంటే సీన్ మరోలా ఉండేది. కానీ గంటా ఆ ఛాన్స కూడా మిస్ చేసుకుని విమర్శల పాలయ్యారు.ఏతావాతా.. విశాఖ రాజకీయ తీరంలో ఇటీవల తుపాను సృష్టించిన రెండు వివాదాలకు ఆద్యుడు, బాధితుడు, క్షతగాత్రుడు కూడా గంటానే.. అందుకే ఆయనది ఫ్లాప్ షో అనడానికి.. ఎనీ డౌట్. బుద్ధిస్టుల్లో అ‘శాంతి’ పవిత్రమైన బౌద్ధారామం చెంతన క్లబ్ పేరిట అపచారానికి పాల్పడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తారుు. అరుుతే ఇవేమీ ఆయన పట్టించుకోలేదు. మరోవైపు బుద్ధిస్టులు గంటాకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేశారు. బుద్ధుడు నడయాడిన అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తున్నామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ బౌద్దారామంలో చేసే నిర్వాకం ఇదేనా అంటూ బుద్ధిస్టులు ధ్వజమెత్తారు. సరిగ్గా వీరికి గంటా వ్యతిరేక శిబిరం అండ లభించింది. ఇదే అదనుగా పావులు కదిపిన మంత్రి అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు స్థల వివాదాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో మొండిగా ముందుకెళ్తే ప్రభుత్వ పరుపుపోతుందని, దేశ విదేశాల్లో బుద్ధిస్టులు ఏపీకి వ్యతిరేకమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతో ఎందుకొచ్చిన గొడవని బాబు ఆ స్థలంలో క్లబ్ నిర్మాణం లీజును రద్దు చేస్తామని హామీనిచ్చారు. చిరంజీవికి గంటా సన్నిహితుడు కావడంతో అయ్యన్న వర్గం బాలకృష్ణను ఆశ్రరుుంచి గంటాపై ఉసిగొల్పిందన్న ప్రచారం సాగింది. ఇదెంత వరకు వాస్తవమో పక్కన పెడితే ఫిల్మ్‌నగర్ క్లబ్ స్థల విషయంలో గంటాకు పరాభవ సినిమా కనబడిందన్నది మాత్రం యదార్ధం. -
అయ్యో.. అయ్యన్న!
సీనియర్ నేత సీన్ అంతేనా? పతాకావిష్కరణ అవకాశం ఇవ్వని సర్కారు ఇన్చార్జి మంత్రిగా పశ్చిమలోనూ చాన్స్ లేదు ఇక్కడ మాత్రం ఇన్చార్జి మంత్రి యనమలకు అవకాశం మరో మంత్రి గంటాకు కడపలో అవకాశం అయ్యన్నను లెక్క చేయకపోవడంపై టీడీపీ క్యాడర్లో నిర్వేదం పేరు గొప్ప ఊరు దిబ్బలా మారింది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి పరిస్థితి. విశాఖ పోలీస్ బ్యారెక్స్‌లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు జాతీయ జెండా ఎగురవేశారు. ఇక మన జిల్లాకే చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు తను ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ కడప జిల్లాలో ఆవిష్కరించారు. కానీ మంత్రిగా వారిద్దరి కంటే ఎంతో సీనియర్ అయిన అయ్యన్నపాత్రుడు మాత్రం సోమవారం నాటి వేడుకల్లో కేవలం ‘తదితరుల’ జాబితాలోనే ఉండిపోయారు. తను ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలోనూ జెండా ఎగురవేసే భాగ్యం ఆయనకు దక్కలేదు. ఆ జిల్లాకు చెందిన దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(బీజేపీ)కు ఆ బాధ్యత కట్టబెట్టారు. దీంతో అయ్యన్న ఎక్కడా ప్రొటోకాల్ హోదాలో జాతీయ జెండా ఎగురవేయని పరిస్థితిపై టీడీపీ శ్రేణుల్లోనూ కాదు.. అధికారవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆవిర్భావం నుంచి టీడీపీనే అంటిపెట్టుకొని.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అమాత్య పదవి పొందుతున్న సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు ఆ పార్టీలో ఈ మధ్యకాలంలో ప్రాధాన్యం తగ్గుతోందన్న వాదన ఇటీవల పార్టీ శ్రేణుల్లో బలంగా విన్పిస్తోంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన గంటా శ్రీనివాసరావుకు యంత్రాంగంలోనే కాదు పార్టీలో కూడా ప్రాధాన్యం పెరుగుతోందన్న ఆందోళన అయన వర్గీయుల్లో కలవరం రేపుతోంది. ఈ వాదనలకు బలం చేకూరేలా సోమవారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో అయ్యన్నను ప్రభుత్వ పెద్దలు కనీసమాత్రంగా కూడా పట్టించుకోకపోవడం చర్చకు దారితీసింది. పార్టీలోనూ.. మంత్రిగా సీనియారిటీలోనూ తమ నాయకుడి కంటే చాలా జూనియర్ అయిన గంటాకు ఇచ్చిన ప్రాధాన్యత అయ్యన్నకు ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా అంతే.. పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో జెండా ఎగురవేసిన అయ్యన్నకు ఆ తర్వాత ఆ అవకాశం దక్కలేదు. గత ఏడాది విశాఖలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగడం.. వాటిలో సీఎం చంద్రబాబు పాల్గొనడంతో అయ్యన్నకు జెండా ఎగరేసే చాన్స్ రాలేదు. ఈసారి ఇన్చార్జి మంత్రిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఆవిష్కరిద్దామనుకుంటే.. అక్కడి మంత్రి మాణిక్యాలరావు అడ్డుతగిలారు. దీంతో ఆయన ఒకింత నిస్తేజానికి లోనయ్యారని అంటున్నారు. అందుకే.. సోమవారం విశాఖ నగరంలో జరిగిన వేడుకల్లో మొక్కుబడిగా పాల్గొన్న అయ్యన్న కార్యక్రమం ఆసాంతం ముభావంగానే కనిపించారు. పోలీస్ బ్యారెక్స్‌లో జరిగిన వేడుక సభలో పతాకావిష్కరణ, ప్రసంగానికి అవకాశం లేకపోయినా.. కనీసం ప్రశంసాపత్రాలు కూడా అయ్యన్నతో ఇప్పించకపోవడం చర్చనీయాంశమవుతోంది. -
మంత్రులూ.. మీరెక్కడ?
పెను తుపాను పడగెత్తినా.. పట్టించుకోని గంటా, అయ్యన్న మినీ మహానాడులో ఒకరు మొక్కుబడి సమీక్షతో సరిపెట్టారు మరొకరు ఏడాదిన్నర క్రితం హుద్‌హుద్ తుపానుతో భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్న విశాఖ ప్రజలు తుపాను పేరెత్తితే చాలు ఇప్పటికీ హడలిపోతున్నారు. తాజాగా వచ్చిన రోను తుపాను విశాఖ సమీపంలోనే తీవ్ర తుపానుగా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మళ్లీ ఎంత విధ్వంసం జరుగుతుందోనని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. అధికారులు సహాయ చర్యలకు సమాయత్తమయ్యారు. కానీ జిల్లా మంత్రులు మాత్రం ఇవేవీ పట్టలేదు. ప్రజల పట్ల బాధ్యతా గుర్తుకు రాలేదు. అయ్యన్న నర్సీపట్నం దాటి రాలేదు. గంటా మొక్కుబడి సమీక్షతో సరిపెట్టి.. నగరం దాటి వెళ్లిపోయారు. విశాఖపట్నం: హుద్‌హుద్ విధ్వంసం ఇంకా కళ్లముందే మెదులుతుండటం.. తాజాగా రోను తుపాను హెచ్చరికలతో విశాఖ ప్రజలు బెంబేలెత్తారు. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే బుధ, గురువారాల్లో ఎడతెరపి లేకుండా జిల్లా అంతటా వర్షాలు కురిశాయి. తుపాను శుక్రవారం విశాఖ సమీపంలోనే తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందని, గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తుపానును ఎదుర్కొనేందుకు అప్రమత్తమైంది. శక్తి మేరకు ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రం దాని గురించి పట్టించుకోలేదు. తుపాను హెచ్చరికలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. అదృష్టవశాత్తూ తీవ్ర తుపానుగా బలపడకముందే రోను ఒడిశా వైపు వెళ్లిపోయింది.. వెళ్తూ వెళ్తూ జిల్లా మంత్రుల అంతులేని నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. నర్సీపట్నం దాటి రాని అయ్యన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గత మూడు రోజుల నుంచి నర్సీపట్నంలోనే ఉన్నా విశాఖ వైపు తొంగిచూడలేదు. తాను సీనియర్ మంత్రినని చెప్పుకునే ఆయన విశాఖ ప్రజలు భయాందోళనలో ఉన్నా కనీసమాత్రంగా కూడా ఎక్కడా పర్యటించలేదు. చివరికి తుపాను ముప్పుపై అధికారులు నిర్వహించిన సమీక్షలోనూ పాల్గొనలేదు. శుక్రవారం నర్సీపట్నంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీమహానాడులో పాల్గొనేందుకు రెండు, మూడు రోజులుగా అక్కడే మకాం వేసిన మంత్రి వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. మొక్కుబడి సమీక్షకే గంటా బుధ, గురువారాల్లో విశాఖలోనే ఉన్న గంటా శ్రీనివాసరావు ఎక్కడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేదు. గురువారం సాయంత్రం అధికారులతో మొక్కుబడి సమీక్ష నిర్వహించి రాత్రికి విజయవాడ బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి గురువారం రాత్రే వాతావరణశాఖ అధికారులు తీవ్ర తుపానుపై ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం తుపాను తీవ్రరూపం దాలుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. ఈ సమయంలో విశాఖలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాల్సిన మంత్రి గంటా గురువారం రాత్రే విజయవాడకు వెళ్లిపోయారు. అటు నుంచి అటే శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు పయనమయ్యారు. పెను తుపాను పడగెత్తిన సమయంలోనే ఇద్దరు మంత్రులూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కరవు వేళలోనూ అంతే రోను తుపానుకు ముందు జిల్లాలో తీవ్ర కరవుఛాయలు అలుముకున్నాయి. ఈ వేసవిలో వడదెబ్బకు 147 మంది మృ త్యువాత పడ్డారు. పంటలే కాదు బోర్లు, బావులు, చెరువులు ఎండిపోయి తీవ్ర దుర్భిక్షం నెలకొంది. చివరికి విశాఖ నగరంలో కూడా తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో కరవు తీవ్రత ఉన్న రోజుల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ఊరూరా పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క ట్యాంకు కూడా తిరగని పరిస్థితి దాపురించింది. కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలిన మంత్రులు ఏ మాత్రం పట్టించుకోలేదు. చివరికి కరువుపై జిల్లా ఇన్చార్జి మంత్రి, ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విశాఖలోనే నిర్వహంచిన సమీక్షకు ఇద్దరు మంత్రులూ డుమ్మాకొట్టారు. ఇప్పుడు రోను తుపాను విషయంలోనూ అదే నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించారు. గంటాకు సినిమాలే ముఖ్యమా? రోడ్డు ప్రమాదంలో 11మంది జిల్లావాసులు మృత్యువాత పడినా.. మంత్రిగా స్పందించకుండా సరైనోడు సినిమా వేడుకల్లో మునిగితేలిన గంటా వైఖరి నెల కిందట తీవ్ర విమర్శల పాలైంది. ఏ మాత్రం బాధ్యత లేకుండా మంత్రి వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా గంటా రోను తుపాను కంటే సినిమానే ప్రధానమన్నట్టు వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్న మంత్రి బ్రహ్మోత్సవం సినిమా చూశారని అంటున్నారు. ఓ పక్క విశాఖ ప్రజలు రోను భయంతో అల్లాడుతుంటే గంటా ఏమాత్రం పట్టకుండా ఎంచక్కా హైదరాబాద్‌లో కూర్చుని సినిమా వీక్షించారన్న ఆరోపణలు శుక్రవారం విశాఖలో వర్షం కంటే జోరుగా హోరెత్తాయి. -
మాజీ సీఎంతో ఇలాగేనా...!
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఆ దర్పం, దర్జా అన్నీ అనుభవించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని శంకుస్థాపన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన పూర్తిగా చిన్నబుచ్చుకునేలా చేసిందట. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లు మాజీ ముఖ్యమంత్రిని సమయం ఇవ్వాలని కోరారు. చెప్పిన సమయానికి తీరా మంత్రులు కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒకరు, ఆయనతో మరో ఇద్దరు చోటా టీడీపీ నేతలు ఆహ్వానపత్రం తీసుకెళ్లడంతో కిరణ్‌కుమార్‌రెడ్డికి కోపం వచ్చిందట. దాంతో ఆహ్వాన పత్రం అందజేసే సమయంలో ఫొటోలు తీయడంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కోసం కొంతమంది మీడియా ప్రతినిధులను వెంట తీసుకెళ్లిన టీడీపీ నేతలపై రుసరుసలాడారు. మంత్రులు వస్తున్నారు కదా అని ఆహ్వానపత్రం తీసుకోవడానికి సరేనని అన్నాననీ, చోటామోటా లీడర్లతో ఫొటోలు దిగాలా...! అని చిన్నబుచ్చుకున్న ఆ మాజీ సీఎంగారు ఆహ్వానపత్రం అందజేసే సమయంలో ఫొటోగ్రాఫర్లు, వీడియో కెమెరామెన్లను లోపలికి అనుమతించలేదట. అధికారం లేకపోతే అంతే మరి. -
ముస్లిం సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం
సంక్షేమ పథకాలకు పెద్దపీట మంత్రులు గంటా, అయ్యన్న రంజాన్ తోఫా కానుకల పంపిణీ మహారాణిపేట(విశాఖ): ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం మొదట నుంచి అండగా ఉంటోందని జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు అన్నారు. రంజాన్ సందర్భంగా గురువారం సాయంత్రం ఏయూ అంబేద్కర్ హాల్లో ముస్లిం సోదరులకు చంద్రన్న రంజాన్ తోఫా కానుకలను అందచేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల గోధుమపిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముస్లింల కోసం ప్రభుత్వం రోష్ని, దుకాణ్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టిందని, అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా జిల్లాలో కోటి రూపాయల విలువైన సరకులను 21,200 ముస్లిం కుటుంబాలకు అందచేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండగ అయిన వెంటనే ముస్లింల సమస్యలపై చర్చించేందుకు ముస్లిం పెద్దలతో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పండగ సమయాల్లో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు ఈ కానుకలను అందచేస్తున్నారన్నారు. ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో ముస్లిం కోసం రూ.379 కోట్లు కేటాయించిందన్నారు. ఎంపీలు హ రిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలకు జిల్లా అంతా ప్రచారం కల్పించాలని కలెక్టర్ యువరాజ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్ సత్యనారాయణ, కె.ఎస్.ఎన్.రాజు, వాసుపల్లి గణేశ్‌కుమార్, కలెక్టర్ ఎన్.యువరాజ్, జేసీ జనార్దన్ నివాస్, డీఎస్ఓ జె.శాంతకుమారి, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.రెహ్మాన్, డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిట్టిరాజు, ఏఎస్ఓలు పాల్గొన్నారు. -
మీ ఉద్యోగాలు పోతాయ్
-
మీ ఉద్యోగాలు పోతాయ్
మంత్రులు గంటా, అయ్యన్నలకు సీఎం హెచ్చరిక విశాఖలో టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం విశాఖపట్నం: ‘‘చెప్పుడు మాటలు నమ్మితే మీ ఉద్యోగాలు పోతాయ్.. ఒక్కరికే పదవి ఇచ్చేవాడ్ని. కానీ ఇద్దరూ సమర్థులనే ఇచ్చాను. కలసికట్టుగా ఉండాలి’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందలాదిమంది కార్యకర్తల సమక్షంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడులను హెచ్చరించారు. టీడీపీ అధికారం చేపట్టాక కార్యకర్తల తొలి విస్తృత స్థాయి సమావేశం విశాఖలో బుధవారం జరిగింది. జిల్లాకు చెందిన మంత్రులిద్దరూ ఎడమొఖం, పెడమొఖంగా ఉండటంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని పార్టీ నగరశాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ సభాముఖంగా తన దృష్టికి తీసుకురావడంతో చంద్రబాబు స్పందించారు. కొందరు కార్యకర్తలు లేనిపోనివి చెబుతున్నప్పుడు వాటిని నమ్మరాదని, ఇద్దరు మంత్రులూ కలిసే ఏ కార్యక్రమానికైనా వెళ్లాలని ఆయన సూచించారు. ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు తలదూర్చవద్దని సూచించారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ రావడానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కారణమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పద్ధతి లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై కసితో ప్రజలు టీడీపీకి పట్టం గట్టారని, వారు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు. రాష్ర్టంలో రూ.15,500 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, ఐదేళ్లలో ఇది మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును పూడ్చినట్టు చెప్పారు. మే నెలలో మహానాడు నిర్వహించి తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించనివాళ్లు నామినేటెడ్ పదవులకోసం పాకులాడటం మంచిది కాదన్నారు. బాబుకు తమ్ముళ్ల షాక్ సమావేశంలో పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ.. రుణమాఫీ, పింఛన్ల విషయంలో జనానికి సమాధానం చెప్పలేకపోతున్నామంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. రుణమాఫీ చాలామందికి కాలేదని, పింఛన్లు రావడం లేదని తమను నిలదీస్తున్నారని వారు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రుణమాఫీ అందరికీ చేశామని, ఎవరైనా ఎక్కువ రుణం తీసుకున్నవారు 4 శాతం మంది ఉంటే వారికి మాఫీ కాకపోవచ్చని, అలాంటి వారిలోనూ అర్హులుంటే తప్పకుండా మాఫీ చేస్తామని చెప్పారు. -
తమ్ముళ్ల పోరు... బాబు బేజారు!
టీడీపీ వర్గవిభేదాలతో సీఎంకు సంకటం అయ్యన్నపై ఆగ్రహం!... గంటాపై అపనమ్మకం త్వరలో జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయం విశాఖపట్నం: మొన్న ఆర్డీవోల బదిలీ వ్యవహారం... నిన్న మాడుగుల నియోజకవర్గంలో కార్యక్రమాల వివాదం... నేడు పెందుర్తి నియోజకవర్గంలో పోటాపోటీగా బలప్రదర్శనలు... ఇలా టీడీపీ టీడీపీ తమ్ముళ్ల చెలగాటం సీఎం చంద్రబాబుకు సంకటప్రాయంగా మారింది. తన ఆదేశాలనే బేఖాతరు చేస్తూ రోజుకో రీతిగా పార్టీ బజారున పడుతుండడంతో ఆయన్ని అసహనానికి గురిచేస్తోంది. ఇరువర్గాలను కట్టడి చేయలేకపోతున్న నిస్సహాయ స్థితి చంద్రబాబును తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్న అయ్యన్న తీరుపై ఆగ్రహం... ఎమ్మెల్యేలను కూడగట్టి రహస్య భేటీలు నిర్వహిస్తున్న గంటాపై సందేహంతో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నారు. అయ్యన్నపై ఆగ్రహం! అయ్యన్నపాత్రుడి తీరుపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాల్లో అయ్యన్న ఒంటెద్దు పోకడకు పోయినట్టు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పినప్పటికీ హడావుడిగా మాడుగులలో కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టినట్టు సమాచారం. దీనిపై అయ్యన్నను నేరుగానే మందలించాలని భావించారు. అంతలోనే పెందుర్తి నియోజకవర్గంలో మరోసారి ఆయన జోక్యం వివాదాస్పదమైంది. ఈ రెండు వ్యవహారాల వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. దాంతో చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అయ్యన్న తీరుపై కొందరి వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గంటాపై అపనమ్మకం!? మరోవైపు మంత్రి గంటా వ్యవహార శైలి కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారు. అయ్యన్న మాదిరిగా వీధినపడకపోయినప్పటికీ గంటా జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలతో ఓ వర్గాన్ని కూడగట్టడాన్ని సహించలేకపోతున్నారు. ఈ వర్గం అడపాదడపా సమావేశమవుతుండడం కూడా ఆయన దృష్టిలో ఉంది. ఈ భేటీలో భవిష్యత్తులో ఎలాంటి మలుపులైనా తిరగొచ్చని చంద్రబాబు సందేహిస్తున్నారు. దీన్ని ఆదిలోనే కట్టడి చేసే విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నార త్వరలో జిల్లా నేతలతో భేటీ తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాట చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. జిల్లా పార్టీ విభేదాలపై హైదరాబాద్‌లో తనను కలిసిన నేతలతో క్లుప్తంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఈ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. చివరి సారిగా అందర్నీ హెచ్చరించాలని ఆయన భావిస్తున్నారు. అప్పటికీ మార్పు రాకపోతే తీవ్రమై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. మరి ఆయన అంత తీవ్ర చర్య తీసుకుంటారా?... తీసుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఇలా అయితే విలువేముంది
పార్లమెంటు సమావేశాలున్నందున వాయిదా వేయమన్నా మంత్రి అయ్యన్న వినలేదు.. పైగా సొంత పార్టీ వాడినైన నాపైనే విమర్శలు చేశారు సీఎంకు ఫిర్యాదు చేసిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి పిలిచి మాట్లాడతానని ఎంపీకి సర్దిచెప్పిన బాబు విశాఖపట్నం: తాను లేని సమయంలో రాష్ర్టమంత్రి అయ్యన్నపాత్రుడు జిల్లాపార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామా నాయుడుతో కలిసి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్లో శుక్రవారం పెద్ద ఎత్తునఅభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడాన్ని తప్పుబడుతూ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. శనివారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి జిల్లాపార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బాబుకు వివరించారు. ఈ విషయాన్ని శనివారం రాత్రి స్థానిక విలేకర్లకు ఫోన్లో తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవద్దని జిల్లా అధికారులను కోరాను..లిఖితపూర్వకంగా లేఖ కూడా ఇచ్చాను. అయినాపట్టించుకోలేదు..కార్యక్రమాలను ఆపలేదు. ఇలా అయితేమాకు విలువేం ఉంటుంది..మేము నియోజకవర్గంలో తిరగాలా? వద్దా లేకపోతే ఢిల్లీలోనే కూర్చో మంటే అక్కడే ఉండిపోతాం. అధికారులు మా మాట వినకపోతే ఎలా ఒక ఎంపీనైనా నా మాటకే విలువ లేదు..ఇక పార్టీలో మిగిలిన వారి మాట అధికారులెలా వింటారు. మీరే చెప్పండి అంటూ సీఎంకు ఎంపీ మొరపెట్టుకున్నారు. సీనియర్ మంత్రి అయిన అయ్యన్న ఒక నియోజక వర్గంలో పర్యటించేటప్పుడు ఆ నియోజకవర్గ ఎంపీకి సమాచారం ఇవ్వాలన్న ఆలోనచన కూడా చేయలేదు. పైగా నాపై లేనిపోని ఆరోపణలుగుప్పించారు. పార్టీలో గ్రూపులకు ఆజ్యం పోస్తున్నారు..పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బాధిస్తున్నాయి. మీరు చక్కదిద్దాలి అంటూ సీఎంను కోరినట్టు తెలియవచ్చింది. కాగా ఎంపీ చెప్పిన విషయాన్ని విన్న ముఖ్య మంత్రి చంద్రబాబు మంత్రి అయ్యన్న, జిల్లా పార్టీఅధ్యక్షుడు రామానాయుడ్ని పిలిపించి జరిగిన విషయాన్ని ఆరా తీస్తానని సర్దిచెప్పారు. దీంతో మంత్రుల మధ్య నెలకొన్న విబేధాలు మరింత ముదురి పాకాన పడినట్టయ్యింది. ఈ పరిణామాలు దీనికి దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు మదనపడుతున్నారు. మేం నియోజకవర్గంలో తిరగాలా? వద్దా.. లేకపోతే ఢిల్లీలోనే కూర్చో మంటే అక్కడే ఉండిపోతాం. అధికారులు మా మాట వినకపోతే ఎలా ఒక ఎంపీనైనా నా మాటకే విలువ లేదు.. ఇక పార్టీలో మిగిలిన వారి మాట అధికారులెలా వింటారు. -అవంతి -
అమీ..తుమీకి సిద్ధం
నేడు మాడుగులకు మంత్రి అయ్యన్న రూ.6.31కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం వెళ్లాలా..? వద్దా..? ఎటూ తేల్చుకోలేని కలెక్టర్ పర్యటనకు ‘గంటా’ వర్గం దూరం విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గపోరుకు మాడుగుల శుక్రవారం వేదిక కాబోతుంది. ఎడముఖం..పెదముఖంగా జిల్లా పార్టీలో గ్రూపులకు ఆజ్యం పోస్తున్న రాష్ర్టమంత్రులు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. వీరి మధ్య అడకత్తెరలో పోకచెక్కలా అధికారులు నిలిగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ విశాఖ గ్రామీణ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు సొంత నియోజకవర్గమైన మాడుగులలో నేడు బలప్రదర్శనకు సిద్దమయ్యారు. రాజకీయ గురువైన రాష్ర్టమంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడితో రూ.6.31కోట్ల విలువైన భారీ ఎత్తున అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. తాను లేనప్పుడు ఏ విధంగా ఈ కారక్రమాలు తలపెడతారంటూ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కే లేఖ ఇవ్వడంతో పాటు అడ్డుకోకపోతే సభాహక్కుల నోటీసు ఇస్తానంటూ హెచ్చరికలు చేశారు. దీంతో మాడుగులలో అయ్యన్న పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రుల మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో రాష్ర్ట మంత్రి అయ్యన్న పాత్రుడు వెళ్లితీరతానని తెగేసి చెప్పడం..సొంత నియోజకవర్గంలో తలపెట్టిన ఈ కార్యక్రమాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసు కోవడంతో ఈ పరిణామాలు పార్టీలో ఎంతవరకు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.చివరి నిముషం వరకు అడ్డుకోవాలని పట్టుదలతో మరోపక్క మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం విఫలయత్నం చేస్తోంది. ఎంపీ కలెక్టర్‌కు లేఖ సంధించగా గంటా వర్గీయులు ఇప్పటికే నియోజకవర్గంలోని పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులకు అయ్యన్న పర్యటనలో పాల్గొన వద్దంటూ ఫోన్లలో బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది.విశాఖ డెయిరీ రైతులెవ్వరూ పాల్గొనవద్దంటూ గంటా అనుచరుడి నుంచి ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. మరొక పక్క ఈ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ తమ ఉన్నతాధికారులతో చర్చించారు. పార్లమెంటు సమావేశాల సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను ఆపనవసరం లేదని చెప్పినట్టుగా వారు కలెక్టర్‌కు సూచించినట్టు సమాచారం. మాడుగులలో తలపెట్టిన ఏ ఒక్క కార్యక్ర మం కూడా ఎంపీ లాడ్స్‌తో చేపట్టినవి కావు కూడా కాదు. అందువలన ఈ కార్యక్రమాలను ఏ విధంగా అడ్డుకోగలమని అధికారులంటున్నారు. గవిరెడ్డి విజయవంతం చేసేందుకు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నారు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో అయ్యన్న పర్యటన విజయవంతంపై కసరత్తు చేశారు. ఫ్లెక్సీలతో ముంచెత్తారు. బలనిరూపణలో భాగంగా ఈసందర్భంగా భారీ బహిరంగ సభ కూడా తలపెట్టారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ ఈ పర్యటనలో పాల్గొంటారని గవిరెడ్డి తెలిపారు. అయితే ఈ పర్యటనకు వెళ్లాలా? వద్దా? అంటూ కలెక్టర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వె ళితే గంటా వర్గానికి, వెళ్లకపోతే అయ్యన్నవర్గానికి టార్గెట్ అయిపోతానంటూ కలెక్టర్ మదనపడుతున్నట్టు సమా చారం. మీటింగ్‌ల వంకతో ఈ ఒక్కసారి అయ్యన్న పర్యటనకు దూరంగా ఉండడమే మేలన్న భావనలో కలెక్టర్ ఉన్నట్టుగా తెలియవచ్చింది. -
మంత్రుల మధ్య మాడుగుల చిచ్చు
జిల్లా అధికారులకు శిరోభారం మాడుగులలో కార్యక్రమాలు ఆపకుంటే కలెక్టర్‌పై సభాహక్కుల నోటీసు ఇస్తానన్న ఎంపీ ఉన్నతాధికారులతో చర్చిస్తున్న యువరాజ్ పట్టువీడని గంటా..గవిరెడ్డి విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీలో ఆదిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ అధికారులకు తలనొప్పిగా తయారైంది. తాజాగా మాడుగలలో అయ్యన్నవర్గం తలపెట్టిన ప్రారంభోత్సవాలు...శంఖుస్థాపన లను అడ్డుకోవాలని మంత్రి గంటా వర్గం వేస్తున్న ఎత్తుగడలు అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లా యంత్రాంగంపై, మరో వైపు పార్టీలోనూ పట్టు సాధించేందుకు రాష్ర్ట మంత్రులు సీహెచ్.అయ్యన్నపాత్రుడు గంటా శ్రీనివాసరావు పావులు కదుపుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరువర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. వీరి ఆదిపత్యపోరు పార్టీఅధినేతకే కాదు..అధికారులకు తలనొప్పిగా మారింది. నెలరోజుల క్రితం తనకు చెప్పకుండా నియోజకవర్గంలో మంత్రి గంటా పర్యటించడాన్ని మాడుగల పార్టీ ఇన్చార్జి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. గంటా వర్గీయుడైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తన అనుచరులతో మాడుగల నియోజకవర్గంలో గవిరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయించడంతో టీడీపీలో అంతర్గత పోరు రోడ్డెక్కింది. ఆ తర్వాత పార్టీ జిల్లా కార్యాలయాన్ని వేదికగా చేసుకుని తులసీరావుపై గవిరెడ్డి బహిరంగంగా అవినీతి ఆరోపణలు గుప్పించారు. విశాఖ డెయిరీని అడ్డం పెట్టుకుని రూ.500కోట్లకు పైగా తులసీరావు దోచుకున్నారని..తక్షణమే సీబీఐతో విచారణ చేయించి సచ్చీలత నిరూపించుకోవాలంటూ గవిరెడ్డి ఏకంగా చంద్రబాబుకే సవాల్ విసిరారు. తర్వాత ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి గంటాతో కలిసి మరోసారి గవిరెడ్డికి సమాచారం ఇవ్వకుండా మాడుగులలో పర్యటించడమే కాకుండా వివిధ అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. ఈ విషయంలో గంటా విజ్ఞతకే వదిలేస్తున్నట్టుగా ప్రకటించిన గవిరెడ్డి తన పట్టు నిరూపించుకునేందుకు ఈనెల 27వ తేదీన నియోజకవర్గంలో మంత్రి అయ్యన్నతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. నాలుగు మండలాల్లో ఒకే రోజు రూ.8.31కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు బ్రేకు వేయడం ద్వారా పట్టు నిరూపించుకోవాలని గంటా వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కలకలం రేపిన ఎంపీ లేఖ పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు తన నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తలపెడతారంటూ ఏకంగా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు ఎంపీ ముత్తంశెట్టి నోటీసు ఇచ్చారు. కార్యక్రమాలను అడ్డుకోకపోతే పార్లమెంటులో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలిసింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ర్టమంత్రులతో అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టకూడదన్న వాదనపై అయ్యన్న వర్గం విబేధిస్తుంది. అలా అయితే ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నెల 27న తలపెట్టిన అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు ఆగబోవని అయ్యన్న వర్గీయులు తేల్చి చెబుతున్నారు.దీంతో ఏర్పాట్లు చేయాలో వద్దో తెలియక అధికారులు తల పట్టుకుంటు న్నారు. -
మాట తప్పిన అయ్యన్న
నిరసనగా తరగతుల బహిష్కరణ పాలిటెక్నిక్ విద్యార్థుల ఇంటిబాట మంత్రి వస్తేనే కళాశాలకు వస్తామని స్పష్టీకరణ తమ సమస్యలు పరిష్కరించాలంటూ నర్సీపట్నం పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ నెల 6న ఆందోళన చేపట్టారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మొర పెట్టుకున్నారు. ఈమేరకు కళాశాలకు వస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన కళాశాలకు వస్తారని, సమస్యలు చెప్పుకుందామని విద్యార్థులు ఆశగా ఎదురు చూశారు. మంత్రి మాటతప్పడంతో విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఇంటి ముఖం పట్టారు. మంత్రి వస్తేనే కళాశాలకు మళ్లీ వస్తామని స్పష్టం చేశారు. నర్సీపట్నం: తమ సమస్యలు పరిష్కరించాలని పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో సోమవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఇంటి ముఖం పట్టారు. తాగునీరు, మరుగు సౌకర్యం కల్పించాలని ఈ నెల 6న పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు మీద బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేశారు. అంతటితో ఆగకుండా ర్యాలీగా వెళ్లి మంత్రి అయ్యన్నపాత్రుడిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం మీ కళాశాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించిన విషయం తెలిసిందే. మంత్రి అయ్యన్న సోమవారం తమ కళాశాలకు వస్తే సమస్యలు చెప్పుకుందామని విద్యార్థులు ఆశగా ఎదురు చూశారు. మంత్రి రాకపోవడంతో విద్యార్థులు బ్యాగ్‌లు సర్దుకుని ఇంటి బాట పట్టారు.పాడైన తాగునీటి కూలర్‌ను వినియోగంలో తీసుకురాకుండా, కూలర్ ప్రదేశంలో ట్యాప్‌లు ఏర్పాటు చేశారు. ట్యాప్‌లు ఏర్పాటు చేసినా తాగేందుకు నీరు పనికిరాదని విద్యార్థులు చెబుతున్నారు. మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించకుండా శుభ్రం మాత్రమే చేశారని. రన్నింగ్ వాటర్ లేకపోతే టాయిలెట్స్ ఎలా వినియోగించగలమని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ముందు పడి ఉన్న చెట్లు, చెత్తా చెదారాన్ని తొలగించారు తప్ప సౌకర్యాలు మెరుగుపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్‌లు, ప్రొజెక్టర్లు, అధ్యాపకుల కొరతతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని స్వయంగా మంత్రికి చూపిద్దామనుకున్నాం. విద్యా పరంగా నర్సీపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకునే అయ్యన్న ఇలాకాలోని కళాశాలలో మౌలిక వసతులు లేకపోతే ఎలా చదవగలమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 700 మంది విద్యార్థులం వెళ్లి మొర పెట్టుకున్నప్పటికీ మంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఎంత నచ్చచెప్పినా విద్యార్థులు వినలేదు. మంత్రి అయ్యన్న తమ కళాశాలకు ఎప్పుడు వస్తే అప్పుడే తాము వస్తామని విద్యార్థులు తరగతులు బహిష్కరించి వెళ్లిపోయారు. -
గంటాపై గవిరెడ్డి నిప్పులు
ఆడారితో కలిసి మంత్రి పోకడలపై ఆగ్రహం సీఎంకు ఫిర్యాదు చేస్తానని ప్రకటన జిల్లా టీడీపీలో మరో వివాదం మంత్రుల ఆధిపత్య పోరుతో ఇప్పటికే అట్టుడుకుతున్న జిల్లా అధికార పార్టీలో మరో వివాదం రాజుకుంది. దీనికి స్వయానా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు కేంద్ర బిందువు కావడం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ సీనియర్ నాయకుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావే తన ఓటమి కారకుడంటూ కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇప్పుడు ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావుపైనే ధ్వజమెత్తడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. చోడవరం/కె.కోటపాడు: విశాఖ డెయిరీ నిధులతో కె.కోటపాడు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తులసీరావుతో కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల హాజరయ్యారు. ఇదే పార్టీలో వివాదానికి మరోసారి కారణమైంది. జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఎడముఖం పెడముఖంగా ఉన్న విషయం తెలిసిందే. అయ్యన్నకు సన్నిహితుడిగా ఉంటున్న గవిరెడ్డి రామానాయుడు ఏకంగా కె.కోటపాడులో సోమవారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి మంత్రి గంటా, డెయిరీ చైర్మన్ తులసీరావులపై ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడినైన తన నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు కనీసం తనతో సంప్రదించాలన్న ఆలోచన మంత్రికి లేకపోవడం విచారకమని వాపోయారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఆడారి తులసీరావు రమ్మంటే వచ్చేయడమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిపోకడ, తులసీరావు విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని సమావేశంలో ఆవేశంగా పేర్కొన్నారు. రైతుల డబ్బుతో అధికారం అనుభవిస్తూ అన్నీ తానే చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న డెయిరీ చైర్మన్ తీరుపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. ఇలా పార్టీ జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అధికార పార్టీలో తీవ్ర చర్చకు తెరతీశాయి. గంటా వర్గీయుల్లో ఆగ్రహావేశాలు రేపాయి. అవిర్భావం నుంచి పార్టీని వెన్నంటి ఉన్న విశాఖడెయిరీ చైర్మన్‌ను, మంత్రి గంటాను బహిరంగంగా గవిరెడ్డి విమర్శించడాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని అంతర్గత సమస్యలను ఇలా బహిరంగపరచడం జిల్లా అధ్యక్షుడిగా అతనికి తగదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. ఈ వివాదం ఏ స్థాయికి వెళుతుందో చూడాలి. -
అయ్యన్న ఆగ్రహం
సీఎం కార్యదర్శిపై సీరియస్ గంటా పెత్తనాన్ని సహించేది లేదని స్పష్టీకరణ సొంతింట్లోనూ విద్యామంత్రికి పొగబెట్టే ఎత్తుగడ పతాక స్థాయికి మంత్రుల మధ్య విభేదాలు ‘ఆర్డీవోల బదిలీలు ఆపాలని చెప్పడానికి ఆయనెవరు?... ఆయన చెబితే ఆపాలని ఆదేశించడానికి మీరెవరు?...పూటకో పార్టీ మారేవారా మా ప్రభుత్వంలో నిర్ణయాలను శాసించేది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఆ ఆర్డీవోలను జాయిన్ చేసుకోండి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం చంద్రబాబు ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆర్డీవోల బదిలీ వ్యవహారంతో జిల్లా మంత్రుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇక మంత్రి గంటాతో తాడోపేడో తేల్చుకోవ డానికే అయ్యన్న సంసిద్ధమయ్యారు. విశాఖపట్నం : వ్యూహత్మకంగా జిల్లాలో మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చి న మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఇక నేరుగా ఢీ అంటే ఢీ అనడానికి ఉ ద్యుక్తమయ్యారు. మరోవైపు గంటా కు సొంత నియోజకవర్గంలోనే ఆయనపై తిరుగుబాటుకు ఆజ్యం పోశారు. తా ను ఇతర జిల్లాల మంత్రులు వ్యూ హా త్మకంగా ఆర్డీవోల బదిలీలు చేయి స్తే మంత్రి గంటా అభ్యంతరం తెలపడా న్ని అయ్యన్న సహించలేకపోయారు. మంత్రి గంటా ఒత్తిడితో సీఎం కార్యాలయ అధికారులు కొత్తగా నియమితులైన ఆర్డీవోలను విధుల్లో చేర్చుకోవద్దని కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాంతో గంటా వర్గం మళ్లీ పెచైయ్యి సాధించిందని అంతా భావించారు. కానీ దీన్ని అయ్యన్న ఏమాత్రం సహించలేకపోయారు. తీవ్రంగా ఆగ్రహించిన ఆయన అదే స్థాయిలో స్పందించారు. కొత్త ఆర్డీవోలను గురువారం విధుల్లో చేర్చుకోకపోవడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఏకంగా సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్రకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే సమయంలో మంత్రి గంటా వ్యవహార శైలిని కూడా సతీష్ చంద్ర వద్ద కడిగిపారేశారు. ‘ఆర్డీవో బదిలీలను నిలిపివేయమనడానికి ఆయనెవరు?... ఆయన చెబితే ఆపేయడానికి మీరెవరు?... ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చిన తరువాత వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద లేదా?... మీరే నిర్ణయాలు తీసుకుంటారా?.... అలా అయితే మేమెందుకు?... పూటకోపార్టీ మారేవారి మాటలు విని మమ్మల్ని అవమానపరుస్తారా?’అని తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. ఈ వ్యవహారం కాస్త సీఎం కార్యాల యంలో కలకలం సృష్టించింది. ఆ తరు వా ఏమైందో తెలియదు గానీ అనకాపల్లి ఆర్డీవోగా నియమితులైన బి.పద్మావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించ డం గమనార్హం. మంత్రి గంటా, పెందు ర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి తదితరులు తీవ్రంగా వ్యతిరేకత ను బేఖాతరు చేస్తూ ఉన్నతాధికారులు ఆమె జాయినింగ్‌కు పచ్చజెండా ఊపా రు. కాగా విశాఖపట్నం ఆర్డీవోగా నియమితులైన రామచంద్రారెడ్డి మాత్రం ఇం కా విధుల్లో చేరకపోవడం గమనార్హం. గంటాకు సొంతింట్లోనే పొగ ఓ వైపు జిల్లాలో మంత్రి గంటా మాటకు విలువలేకుండా చేస్తూనే మరోవైపు ఆయనకు సొంతింట్లోనే పొగబెట్టడానికి అయ్యన్న వర్గం పావులు కదుపుతోంది. భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం ఇందుకు వేదికగా నిలిచింది. మంత్రి గంటా నియోజకవర్గాన్ని పట్టిం చుకోవడం లేదని ఆ మండలంలోని టీడీపీ నేతలు శుక్రవారం అసమ్మతి జెండా ఎగురవేశారు. మంత్రి తీరుకు నిరసగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం వెనుక మంత్రి అయ్యన్న వర్గం హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఈ పరిణామాలతో జిల్లాలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నట్లే! దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే. -
‘జన్మభూమి’తో ధన్యం
సమస్యల పరిష్కారానికే.. గతంలో సత్ఫలితాలు మంత్రి అయ్యన్నపాత్రుడు బీచ్‌రోడ్డులో ప్రారంభం విశాఖపట్నం : ప్రజల సమస్యల పరిష్కారానికే రాష్ట్రప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమం తలపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. విశాఖ ఆర్కే బీచ్ ఎన్టీయార్ విగ్రహం వద్ద గురువారం ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ గతంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. అధికారులు స్వయంగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని తెలిపారు. అర్హులకు పింఛన్లు ఇస్తారని, అనర్హులను తొలగిస్తారని స్పష్టం చేశారు. ఇందుకు కారణాలను గ్రామ సభల్లో అధికారులు వివరిస్తారని తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. ‘స్వచ్ఛ్ భారత్’లో మరుగుదొడ్లు మంజూరు చేస్తామన్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ శిబిరాలు నిర్వహించి నిరుపేదలకు వైద్యసేవలు అందిస్తామన్నారు. పశువులకు వైద్యసేవలు కల్పిస్తామని చెప్పారు. పొదుపు సంఘాల మహిళలకు వృత్తినైపుణ్యం పెంచే శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఎన్టీయార్ విగ్రహానికి మంత్రులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎంసీఏ వరకు జన్మభూమి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్‌రోడ్డు సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిపోయింది. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, కె.హరిబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ వై.నరసింహారావు, డీఆర్డీఏ పీడీ వి.సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములునాయుడు పాల్గొన్నారు. -
ఎంపీడీవోలు vs కార్యదర్శులు ప్రచ్ఛన్నయుద్ధం!
‘ఉపాధి’పై పర్యవేక్షణ కావాలంటున్న ఎంపీడీవోలు మాకొద్దంటున్న కార్యదర్శులు మచిలీపట్నం : జిల్లాలో మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య ప్రచ్ఛన్నం యుద్ధం కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలను తమకు అప్పగించాలని ఎంపీడీవోలు ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని కోరడమే ఇందుకు కారణం. ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగిస్తే క్షేత్ర స్థాయిలో తమపై అదనపు భారం పడుతుందని కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉపాధి హామీ పనులపై ఎంపీడీవోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తే వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు అలవెన్సుల రూపంలో అందే అవకాశం ఉంది. అందువల్లే ఎంపీడీవోలు ఉపాధి హామీ పనులకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలని పట్టుబడుతున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శులతో ఫీల్డ్ అసిస్టెంట్ పనులు! ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు నూతన ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించకూడదంటూ నోటీసులు కూడా జారీ చేసింది. మరికొందరికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించినా, ఆ పనులను పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తామని ఎంపీడీవోలు మంత్రికి వివరించారని సమాచారం. జిల్లాలో 156 పంచాయతీలకు కార్యదర్శులే లేరని ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. అసలే పనిభారం అధికంగా ఉండగా ఉపాధి హామీ పనులను తామెలా పర్యవేక్షించగలమని వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తారా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పంచాయతీల్లో పనిభారం పెరిగింది. వంద రోజుల ప్రణాళిక అమలు, పంచాయతీలో రోజువారీ చేపట్టిన కార్యక్రమాలను వివిధ ఫార్మాట్లలో నివేదికలను కార్యదర్శులు పంపాల్సి వస్తోంది. వీటితోపాటు గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్రభుత్వం నుంచి అప్పటికప్పుడు వచ్చే ఉత్తర్వులను అమలు చేయటం తదితర పనులతో సతమతమవుతన్నామని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబరు నాటికి ఇంటి పన్నులు వసూలు చేయాలని పంచాయతీ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో 516 క్లస్టర్ పంచాయతీలు ఉండగా, వీటిలో 156 క్లస్టర్ పంచాయతీలకు కార్యదర్శులే లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలు తమకు అప్పగిస్తే మరింత భారం పడుతుందని కార్యదర్శులు వాదిస్తున్నారు. ఎంపీడీవోలు తమ ప్రయోజనాల కోసం ఉపాధి హామీ పనులపై పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నా, క్షేత్రస్థాయిలో ఈ పనులను చేయించే బాధ్యతలను తమకు అప్పగిస్తారని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఏమైనా అవకతవకలు జరిగితే తమను బాధ్యులు చేస్తారని కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టీఏ, డీఏలు ఇవ్వటం లేదు ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వహిస్తుండగా టీఏ, డీఏ బిల్లులు ఇవ్వడంలేదని తెలుస్తోంది. తమకు ఇవ్వాల్సిన టీఏ, డీఏ బిల్లులు పక్కదారి పడుతున్నాయని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. 010 పద్దు ద్వారా పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు అందుతుండటంతో తమకు రావాల్సిన టీఏ, డీఏ బిల్లులు ఏమవుతున్నాయో అర్థం కావటం లేదని వారు చెబుతున్నారు. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నామని, ఉపాధి హామీ పనులను తమకు అప్పగించకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. -
నేటి తరం ‘ప్రకాశ’వంతం కావాలి
కష్టపడి రాజకీయాల్లో రాణించారు నెల రోజుల్లో పార్టీలోకి వచ్చి పదవులు పొందలేదు టంగుటూరి జయంత్యుత్సవంలో మంత్రి అయ్యన్న ఏయూ క్యాంపస్ : దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధపడిన టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు నేడు రాష్ట్రానికి, దేశానికి అవసరమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్. అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ఆంధ్రకేశరి ప్రకాశం పం తులు జయంత్యుత్సవంలో ముఖ్య అతి థిగా ప్రసంగించారు. ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. మంచి వ్యక్తులు రాజకీయాలలోకి రావలసిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సైమన్ కమిషన్‌కు ఎదురొడ్డి నిలచిన ధీశాలి టంగుటూరి నేటి తరానికి ఆదర్శప్రాయుడన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ కష్టపడి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిగా ప్రకాశం పంతులు నిలిచారన్నారు. జేసీ ప్రవీణ్‌కుమార్, ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు తోట నగేష్, ప్రభుత్వ అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వెల్లివిరిసిన తెలుగు దనం ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. స్వచ్ఛమైన నాయకుడు టంగుటూరి సిరిపురం : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. టంగుటూరి జ యంతి సందర్భంగా ఆశీల్‌మెట్ట వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి రాజకీయ నాయకుల్లా నెలరోజులు ముం దు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించలేదని, ప్రజ ల్లోంచి కష్టపడి పైకొచ్చిన రాజకీయనేత అని కొనియాడారు. కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహారావు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ జయరామిరెడ్డి, జోన్-3 కమిషనర్ వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అగ్ర పథాన విశాఖ
సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక మెగా సిటీగా విశాఖ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు అక్టోబర్‌లో అరకు ఉత్సవ్ స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి అయ్యన్న వెల్లడి విశాఖపట్నం : విశాఖ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ నగరాన్ని మెగా సిటీగా, ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మెట్రోరైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, పర్యాటక, ఐటీ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు అనుమతులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఐఐఎంతో పాటు మరికొన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పి ఉన్నత విద్యా కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. విశాఖను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో జిల్లా విజన్ డాక్యుమెంట్‌ను 30 రోజుల్లో రూపొందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కచ్చితంగా రుణ మాఫీ అమలు రైతులు తీసుకున్న పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రుణ మాఫీ అమలు చేసి తీరుతామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం జీవో జారీ చేశారన్నారు. దీని వల్ల జిల్లాలో 90 శాతం మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. 44 వేల 212 స్వయం సహాయక సంఘాలకు చెందిన 5 లక్షల 8 వేల 782 మంది మహిళలకు లబ్ధిచేకూర్చే విధంగా రూ.442.12 కోట్ల రుణ మాఫీ అవుతుందన్నారు. వ్యవసాయంలో అధికోత్పత్తికి పొలం పిలుస్తోంది ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ తక్కువ ఖర్చుతో అధికోత్పత్తులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రూ.93 లక్షల రాయితీపై 18 వేల 334 క్వింటాళ్ల వివిధ రకాలైన విత్తనాలు, 19 వేల 134 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులు సరఫరా చేస్తున్నామన్నారు. వివిధ శాఖల శక టాల ప్రదర్శన డ్వామా, ఐసీడీఎస్, ఆర్‌డబ్లూఎస్, సర్వశిక్షా అభియూన్, డీఆర్డీఏ, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ శాఖ, జీవీఎంసీ, మెట్రోరైల్ ప్రాజెక్టు, 108 శకటాలను ప్రదర్శించారు. వాటిలో మొదటి బహుమతి వ్యవసాయ శాఖ శకటానికి, ద్వితీయ బహుమతి జీవీఎంసీ మెట్రోరైలు నమూనాకు, తృతీయ బహుమతి డీఆర్డీఏ, నాల్గవ బహుమతి జిల్లా నీటియూజమాన్య సంస్థ శకటానికి, ఐదో బహుమతి ఐసీడీఎస్-అంగన్వాడీ శకటాలకు దక్కాయి. స్వాతంత్య్ర సమరయోధునికి సన్మానం స్వాతంత్య్ర సమరయోధుడు, క్విట్ ఇండియూ ఉద్యమకర్త కె.అప్పారావును మంత్రి అయ్యన్న ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమానికి హాజరయిన న్యాయూధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, పోలీస్ అధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలరించిన సాంస్కతిక కార్యక్రమాలు సాంస్కతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఎస్.రాయవరం మండలం ఒమ్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రద ర్శించిన మల్లకంభ చూపరులను ఆకట్టుకుంది. సేక్రెట్ హార్ట్, పోలాక్, పెన్ స్కూల్, మధురవాడ విజయం స్కూల్, అల్లిపురం ప్రియూంకా విద్యోదయ హైస్కూల్, మేహాద్రిగెడ్డ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలకు పురస్కారాలు జిల్లాలో పలు శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు సేవా, క్రీడా రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 222 మందికి రాష్ట్ర స్థాయి పురస్కారాలతో పాటు జిల్లా స్థాయిలో పురస్కారాలను మంత్రి అయ్యన్నపాత్రుడు అందజేశారు. అవార్డులు పొందిన వారిలో రెవెన్యూ, జీవీఎంసీ, వాణిజ్య పన్నులు, వుడా, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖ, సమాచార, పౌర సంబంధాలు, పోలీస్, ఫైర్ తదితర శాఖల్లో పనిచేస్తున్నవారున్నారు. వారితో పాటు 2013లో ఉత్తమ ప్రతిభా పురస్కారాలు అందుకున్న పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించారు. రూ.25.69 కోట్ల ఆస్తుల పంపిణీ జిల్లాలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ పథకాల ద్వారా రూ.25.69 కోట్ల మేర ఆస్తులను 9 వేల 514 మందికి లబ్ధి చేకూర్చే విధంగా మంత్రి అయ్యన్నపాత్రుడు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రూ.25 కోట్లు, డ్వామా ద్వారా రూ.16.61 లక్షలు, వ్యవసాయశాఖ ద్వారా రూ.1.80 లక్షలు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా రూ.11 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.32.26 లక్షలు, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా రూ.7.71 లక్షల విలువైన ఆస్తులను అందజేశారు. -
తాగునీటికే తొలి ప్రాధాన్యం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు తిప్పనగుంట (హనుమాన్‌జంక్షన్ రూరల్) : రక్షిత తాగునీటి సరఫరాకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ శాఖల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బాపులపాడు మండలం తిప్పన గుంటలో ఆయన, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా, సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు రూ.3.50 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం తిప్పనగుంటలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 13వేల గ్రామ పంచాయతీలకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తొలివిడతగా 5000 పంచాయతీల్లో అక్టోబర్ 2 నుంచి ఆర్వో ప్లాంట్లు ప్రారంభిస్తామన్నారు. పుట్టిన పెరిగిన గ్రామం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ మొవ్వా తిరుమల కృష్ణబాబు ఆదర్శనీయుడని కొనియాడారు. సమావేశంలో మంత్రులు ఉమా, కామినేని శ్రీనివాస్, రావెల కిషోర్‌బాబు, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తదితరులు ప్రసంగించారు. కలెక్టర్ ఎం.రఘునందనరావు, జేసీ మురళి, తహశీల్దారు, ఎంపీడీవో, జెడ్పీటీసీ సభ్యురాలు పాల్గొన్నారు. కైకలూరులో.. కైకలూరు : తాగునీటికి అధికారులు, మంత్రులు ప్రాధాన్యత కల్పించాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కోరారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి కైకలూరులో వివిధ కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొన్నారు. ముందుగా స్థానిక సంతమార్కెట్లో రూ. 7 లక్షల 50 వేలు మత్స్యశాఖ నిధులతో నిర్మించిన చేపల విక్రయ షెడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులతో స్థానిక సీతారామఫంక్షన్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. కైకలూరులో అంతర్గత రోడ్ల ఏర్పాటుకు తక్షణం రూ. 2కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధి హామి పథకం నిధులతో గ్రామాల్లో రోడ్డు, పంచాయతీ, అంగన్వాడీ, పంచాయతీ భవనాలను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రెండు మండలాలకు కలిపి ఒక డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. అక్కడ చెత్తను వేయకపోతే సర్పంచ్ చెక్‌పవర్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పంచాయతీ సర్పంచ్‌లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మంత్రి కామినేని మాట్లాడుతూ జిల్లా శివారు ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య వేధిస్తోందన్నారు. అందరూ సమన్వయంగా పనిచేసి అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ప్రతి పనిని అధికారులు పారదర్శకంగా అవినీతి తావివ్వకుండా చేయాలని సూచించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు అధ్యక్షత వహించారు. జెడ్పీచైర్‌పర్సన్ గద్దె అనురాధ, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, టీడీపీ నేతలు చలమలశెట్టి రామానుజయ్య తదితరులు పాల్గొన్నారు. నిధులు దుర్వినియోగం చేయవద్దు గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోయినా పలువురు అధికారుల ఆర్డబ్ల్యూఎస్ స్కీంలను నిర్మిస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. పనిచేయని అధికారులను పంపించేస్తామని, పనిచేసే అధికారులకు అండగా ఉంటామని చెప్పారు. కొల్లేరు పరిసర ప్రాంతాల చుట్టూ చేపల చెరువులు ఉండటం వల్ల రోడ్లు త్వరగా పాడవుతాయని అన్నారు. దీనిపైఅధ్యాయనం చేస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.10,500 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
అయ్యన్నా..మా మొర వినన్నా...
నేడు మంత్రి అయ్యన్నపాత్రుడు రాక కైకలూరు : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎన్ఆర్ ఈజీఎస్ (ఉపాధి హామీ) శాఖల మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు నేడు జిల్లాకు రానున్నారు. సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నిధుల కొరత వేధిస్తుండంతో అనేక పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా గ్రామ పట్టుసీమలైన పంచాయతీలు నిధుల కొరతతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో 969 పంచాయతీలుండగా...వీటిలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయలేని దీనస్థితిలో అనేక పంచాయతీలు పాలన సాగిస్తున్నాయి. ఒక పక్క 100 రోజుల ప్రణాళిక అంటూ కాగితాల మీద లెక్కలు అడుగుతున్న అధికారులు నిధుల మార్గాలు చూపాలని ప్రజాప్రతినిధుల నుంచి ఇప్పటికే ఆయా పంచాయతీల్లో వ్యతిరేకత వచ్చింది. పంచాయతీల్లో పెరుకుపోయిన విద్యుత్ బకాయిల కారణంగా కొత్త పనులు చేయడానికి విద్యుత్‌శాఖ ససేమిరా అంటుంది. ఈ కారణంతో అనేక కాలనీలు చీకట్లో మగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే గ్రామీణ నీటి సరఫరా కోటి సమస్యలతో ఈదుతుంది. ఫిల్టర్బెడ్లలో ఇసుక మార్చడానికి కూడా నిధులు లేమి వేధిస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాలో రక్షిత నీటి సరఫరా పథకాలు ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పనుల కోసం కూలీలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వలసల నివారణకు ఈ పథకం ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఎస్సీ, ఎస్టీ సర్పంచులు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. అనేక పంచాయతీలు పాడుబడ్డ కొంపల్లా దర్శనమిస్తున్నాయి. సమస్యలు తీర్చాలని మంత్రిని కోరుతున్నారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
నేడు రేపు జిల్లాలో టూర్ అనకాపల్లి అగ్రిపాలిటెక్నిక్లో బస ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు విశాఖ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు జిల్లాలో ఏర్పాటు పూర్తయ్యాయి. తొలిరోజు శుక్రవారం అనకాపల్లి, చోడవరం ప్రాంతాల్లో పర్యటించి రాత్రికి అనకాపల్లి వ్యవసాయపరిశోధన స్థానం(ఆర్‌ఏఆర్‌ఎస్)లో బస చేస్తారు. ఈమేరకు మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. సీఎం రాత్రికి బస చేసే అగ్రి పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితులు, అందులో సదుపాయాలను మంత్రులిద్దరూ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో 8.30 గంటలకు సీఎం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.45 వరకు అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. 9.30 వరకు రిజర్వులో ఉంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10 గంటలకు అనకాపల్లి నూకాంబిక దేవాలయానికి వెళతారు. దర్శనానంతరం ఉదయం 10.15 నుంచి 11గంటల వరకు రిజర్వులో ఉంటారు. తిరిగి 11 గంటలకు తుమ్మపాల, 11.40కి గంధవరం,12.25గంటలకు గజపతినగరం గ్రామాలకు వెళ్లి స్థానికులతో ముచ్చటిస్తారు. 12.55 గంటలకు చోడవరంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో లంచ్ చేసి 2.30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.40 నుంచి సాయంత్రం 5 వరకు చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రైతులు, ఉపాధిహామీ కార్మికులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 5.30కు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం(ఆర్‌ఏఆర్‌ఎస్)కు వెళ్లి శాస్త్రవేత్తలు, విద్యార్థులతో సమావేశమవుతారు. సాయంత్రం 6.30 నుంచి 8గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 8.30గంటల వరకు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. -
కేజీహెచ్‌ను సందర్శించిన మంత్రి
విశాఖపట్నం, మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం ఉదయం కేజీహెచ్, ఆంధ్ర వైద్యకళాశాలను సందర్శించారు. ఆస్పత్రిలోని ప్రవేశిస్తుండగా ప్రధాన ద్వారం వద్ద ధర్నాచేస్తున్న ట్రామాకేర్ సిబ్బంది మంత్రికారును అడ్డగించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్డియాలజీ ఐసీయూను సందర్శించి సేవలను తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స విభాగంతో పాటు ప్రసూతి వైద్య విభాగాలను సందర్శించారు. అక్కడ ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైద్య కళాశాలకు చేరుకొని అక్క డ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు, జిల్లా నోడల్ వైద్యాధికారి ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ ముద్దాడ రవి చంద్రలతో సమావేశమయ్యారు. 50 మెడికల్ సీట్లు పెరిగే నేపథ్యంలో ఎంసీ ఐ అడిగిన సదుపాయాలను కల్పించే విషయంలో చేపట్టవలసిన చర్యల గు రించి చర్చించారు. దీర్ఘకాలిక సెలవుపెట్టి బయట ఆస్పత్రులకు వెళ్తున్న వైద్యులపై కఠిన చర్యలు చేపడతామ ని, వారి వివరాలు వెంటనే అందజేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పదోన్నతులకు నోచుకోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు డీపీసీని నిర్వహిం చాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ద్వా రా వినతిపత్రం అందజేయగా మంత్రి స్పంధిస్తూ పదోన్నతులు ఇస్తే బయటికి వెళ్లిపోతారా? అని ప్రశ్నించారు. తాము సిద్దంగా ఉన్నామని అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్పారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ మదుసూదనబాబు, ఆర్‌ఎంఓలు శాస్త్రి, బంగారయ్య పాల్గొన్నారు. మానవీయకోణంలో వైద్యసేవలందించాలి మానవీయ కోణంలో వైద్య సేవలు అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్యులను కోరారు. సోమవారం సాయంత్రం కేజీహెచ్ రేడియాలజీ లెక్చర్ గ్యాలరీలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ విధుల్లో ఉంటూ నిజాయతీతో సమయపాలన పాటించాలన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు సేకరించి కేజీహెచ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నామన్నారు. పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ రూ.2 కోట్లు అందించేందుకు ముందుకువచ్చిందన్నారు. మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడుతోపాటు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్.. జీవీఎంసీ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడారు. తొలుత సమీకృత విరోచన వ్యాధి నివారణ పక్షోత్సవాలను మంత్రులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
అయ్యన్నపాత్రుడు , గంటా మధ్య విభేదాలు
మరోసారి బయటపడ్డ అయ్యన్న, గంటా మధ్య విభేదాలు సమీక్షకు గంటా మూడు గంటలు ఆలస్యం అయ్యన్న అసహనం పరస్పరం విసుర్లు సాక్షి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించే వీరిద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆదివారం ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన సమీక్షలో తేటతెల్లమైంది. సీఎం చంద్రబాబు ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి అయ్యన్న ఉదయం 10 గంటలకే ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. మంత్రి గంటా మాత్రం సమావేశం ఉందని తెలిసీ గంభీరం పర్యటనకు వెళ్లిపోయారు. దీంతో అయ్యన్న గంటా ఎంతసేపటికీ రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కలెక్టర్‌తోపాటు అధికారులంతా గంటా వెనుకే వెళ్లడంతో అయ్యన్న వద్ద ఒక్క జిల్లా అధికారి మినహా మరెవరూ లేరు. మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుండడంతో వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ఆయన బయటకు వచ్చేశారు. ఈలోగా గంటా రావడంతో ఆయన్ను ఉద్దేశించి ‘ఏం మంత్రిగారు.. మమ్మల్ని మూడు గంటలు నిరీక్షింపచేస్తారా’? అని ప్రశ్నించగా, ‘నువ్వు కూడా నన్ను గతంలో చాలా వెయిట్ చేయించావు కదా’ అని గంటా బదులిచ్చి నేరుగా లోపలికి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా సమావేశం ముగించారు. నవ్వులు విరిశాయ్... చేతులు కలుస్తాయా? అవును... మీరు చూస్తున్నది మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులనే. ఈ చిత్రం ఆదివారం సాయంత్రం చోడవరంలో కనిపించింది. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్షకు చోడవరం వచ్చిన వీరు స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు కార్యాలయంలో పక్కపక్కనే కూర్చున్నారు. చలోక్తులు వేసుకొని నవ్వుకున్నారు. గంటా ముందు ముభావంగానే ఉన్నా అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే రాజుపై చలోక్తులు వేయడంతో గంటాతో పాటు ఎంపీ ముత్తంశెట్టి కూడా చిరునవ్వు చిందించారు. దీంతో రాజు కాస్త చిన్నబుచ్చుకున్నట్లు కనిపించినా తర్వాత ఆయన కూడా నవ్వులు కలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చలో మాత్రం గంటా ఆధిక్యం ప్రదర్శించడంతో అయ్యన్న వినడానికే పరిమితమయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రులిద్దరూ వేర్వేరుగా విలేకరుల సమావేశం నిర్వహించడం గమనార్హం. మీ శాఖలో నేను వేలుపెట్టలేదంటూ అయ్యన్న చెబితే... ఈ విషయం ఫోన్లో అడిగావు కదా అంటూ గంటా సమాధానమివ్వడం ఈ పర్యటనలో కొసమెరుపు. మరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కలసినట్టేనా అంటే ఏమో అనే సంశయమే ఇంకా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. - చోడవరం టౌన్ చెప్పింది చాల్లే.. : ముత్తంశెట్టిపై గంటా విసుర్లు విశాఖపట్నం : ఇంతవరకూ గంటా మాటే వేదమని భావించిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి నిండుసభలో నివ్వెరపోయారు. వేపగుంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి తన ప్రసంగంతో రాష్ట్ర మంత్రి నారాయణను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మంత్రి నారాయణను కొనియాడుతూనే నగరంలో పెండింగ్ ప్రాజెక్టుల జాప్యాన్ని, అధికారుల అనాలోచిత చర్యలను గుర్తు చేశారు. ఇలా ప్రసంగిస్తుండగా, మంత్రి గంటా ఆయన వైపు ఒకింత అసహనంగా చూశారు. ఎంపీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. ‘చాల్లే చెప్పింది.. ఇక ఆపు...’ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో ముత్తంశెట్టి అవాక్కయ్యారు. మీరు ఎంపీ పదవిని అనుభవించారు... అయినా మంత్రిగారు కాస్త ఒత్తిడితో ఉన్నట్లున్నారు...సభకు నమస్కారం అంటూ ప్రసంగం ఆపేశారు. ఆ తర్వాత మంత్రి గంటా మైకుతీసుకుని ముత్తంశెట్టిని మరోమారు చమత్కరించారు. ముత్తంశెట్టికి ఎంపీ పదవి తొలిసారి...అందుకే ఇంత ఉత్సాహం అంటూ...వ్యాఖ్యానించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
సీఎం పర్యటన విజయవంతం చేయాలి
మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ రూరల్: సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సి.హెచ్.అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్, ఎస్పీ ప్రవీణ్, ఏఎస్పీ కిషోర్, డీసీపీ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డుమా పీడీ శ్రీరాములునాయుడులతో సమావేశమయ్యారు. సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 30 , 31 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రతీ వేదిక వద్ద సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రజలతో ఎక్కువగా మమేకమవుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశమున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పర్యటన ఇలా సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కానప్పటికీ ఈ నెల 30న ఉదయం స్పైస్‌జెట్ విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి నేరుగా అనకాపల్లి బయలుదేరుతారని కలెక్టర్ తెలిపారు. అనకాపల్లి, చోడవరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి అనకాపల్లిలో బసచేసి మరుసటి రోజు కశింకోట, యలమంచిలి, నక్కపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. సాయంత్రం విమానంలో తిరిగి వెళతారన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ నక్కపల్లి: నక్కపల్లి మండలంలో ఈనెల 30,31 తేదీల్లో సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ ప్రవీణ్ శని వారం పరిశీలించారు. ఉపమాక వేంకటేశ్వరస్వామిని సీఎం దర్శించుకోనుండడంతో ఆల య పరిసరాలను పరిశీలించారు. తొలుత స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఎస్పీకి స్వాగతం పలికారు. గోత్రనామాలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అంద జేశారు. సీఎం బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ విశాల్‌గున్ని, సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐవిజయ్కుమార్ ఉన్నారు. -
కర్చీఫ్ వేసేసిన గంటా
చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఇప్పటి నుంచి కర్చీఫ్ వేసేసుకుంటున్నారు. మాజీమంత్రి, భీమిలీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈసారి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిపైనే కన్నేశారు. చంద్రబాబు ఆదేశిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపడతానంటూ తన మనసులో మాటను వెల్లడించారు. లేకుంటే సామాన్య కార్యకర్తగానే ఉండిపోతానంటూ గంటా చెప్పుకొచ్చారు. కాగా విశాఖ జిల్లాలో మరోసారి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మరోసారి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎన్నికల్లో ఇద్దరూ గెలవడంతో మంత్రిపదవులపై కన్నేసిన ఈ నేతల మధ్య మాటలు హద్దులు మీరడంతో అధినేత జోక్యం చేసుకున్నట్టు సమాచారం. గత ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు టీడీపీ హ్యాండిచ్చి ప్రజా రాజ్యం పార్టీలోకి దూకి, అక్కడి నుండి చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి దూకేసి మంత్రి అయిపోయారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు బయటకి దూకేసి పారిపోయిన గంటా, కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చి మళ్లీ సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. కాగా గంటా రాకను అప్పట్లో అయ్యన్నపాత్రుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఓదశలో టీడీపీని వదిలేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే బాబు బుజ్జగింపులతో ఆయన తన ప్రయత్నం విరమించారు. ఈసారి గంటా, అయ్యన్నల మధ్య మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు వార్ మొదలైందనే చెప్పుకోవచ్చు. మరి బాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది వేచి చూడాల్సిందే.