అగ్ర పథాన విశాఖ | Comprehensive development plan | Sakshi
Sakshi News home page

అగ్ర పథాన విశాఖ

Published Fri, Aug 15 2014 11:54 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

అగ్ర పథాన విశాఖ - Sakshi

అగ్ర పథాన విశాఖ

  • సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక
  •  మెగా సిటీగా విశాఖ
  •  ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు
  •  అక్టోబర్‌లో అరకు ఉత్సవ్
  •  స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి అయ్యన్న వెల్లడి
  • విశాఖపట్నం : విశాఖ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ నగరాన్ని మెగా సిటీగా, ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

    మెట్రోరైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, పర్యాటక, ఐటీ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు అనుమతులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఐఐఎంతో పాటు మరికొన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పి ఉన్నత విద్యా కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. విశాఖను ఆదర్శ జిల్లాగా
     తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో జిల్లా విజన్ డాక్యుమెంట్‌ను 30 రోజుల్లో రూపొందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
     
    కచ్చితంగా రుణ మాఫీ అమలు
     
    రైతులు తీసుకున్న పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రుణ మాఫీ అమలు చేసి తీరుతామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం జీవో జారీ చేశారన్నారు. దీని వల్ల జిల్లాలో 90 శాతం మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. 44 వేల 212 స్వయం సహాయక సంఘాలకు చెందిన 5 లక్షల 8 వేల 782 మంది మహిళలకు లబ్ధిచేకూర్చే విధంగా రూ.442.12 కోట్ల  రుణ మాఫీ అవుతుందన్నారు.
     
    వ్యవసాయంలో అధికోత్పత్తికి పొలం పిలుస్తోంది
     
    ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ తక్కువ ఖర్చుతో అధికోత్పత్తులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రూ.93 లక్షల రాయితీపై 18 వేల 334 క్వింటాళ్ల వివిధ రకాలైన విత్తనాలు, 19 వేల 134 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులు సరఫరా చేస్తున్నామన్నారు.
     
    వివిధ శాఖల శక టాల ప్రదర్శన
     
    డ్వామా, ఐసీడీఎస్, ఆర్‌డబ్లూఎస్, సర్వశిక్షా అభియూన్, డీఆర్‌డీఏ, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ శాఖ, జీవీఎంసీ, మెట్రోరైల్ ప్రాజెక్టు, 108 శకటాలను ప్రదర్శించారు. వాటిలో మొదటి బహుమతి వ్యవసాయ శాఖ శకటానికి, ద్వితీయ బహుమతి జీవీఎంసీ మెట్రోరైలు నమూనాకు, తృతీయ బహుమతి డీఆర్‌డీఏ, నాల్గవ బహుమతి జిల్లా నీటియూజమాన్య సంస్థ శకటానికి, ఐదో బహుమతి ఐసీడీఎస్-అంగన్వాడీ శకటాలకు దక్కాయి.
     
    స్వాతంత్య్ర సమరయోధునికి సన్మానం
     
    స్వాతంత్య్ర సమరయోధుడు, క్విట్ ఇండియూ ఉద్యమకర్త కె.అప్పారావును మంత్రి అయ్యన్న ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమానికి హాజరయిన న్యాయూధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, పోలీస్ అధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
     
    అలరించిన సాంస్క­తిక కార్యక్రమాలు
     
    సాంస్క­తిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఎస్.రాయవరం మండలం ఒమ్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రద ర్శించిన మల్లకంభ చూపరులను ఆకట్టుకుంది. సేక్రెట్ హార్ట్, పోలాక్, పెన్ స్కూల్, మధురవాడ విజయం స్కూల్, అల్లిపురం ప్రియూంకా విద్యోదయ హైస్కూల్, మేహాద్రిగెడ్డ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.
     
    ఉత్తమ సేవలకు పురస్కారాలు
     
    జిల్లాలో పలు శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు సేవా, క్రీడా రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 222 మందికి రాష్ట్ర స్థాయి పురస్కారాలతో పాటు జిల్లా స్థాయిలో పురస్కారాలను మంత్రి అయ్యన్నపాత్రుడు అందజేశారు.
     
    అవార్డులు పొందిన వారిలో రెవెన్యూ, జీవీఎంసీ, వాణిజ్య పన్నులు, వుడా, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖ, సమాచార, పౌర సంబంధాలు, పోలీస్, ఫైర్ తదితర శాఖల్లో పనిచేస్తున్నవారున్నారు. వారితో పాటు 2013లో ఉత్తమ ప్రతిభా పురస్కారాలు అందుకున్న పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించారు.
     
    రూ.25.69 కోట్ల ఆస్తుల పంపిణీ
     
    జిల్లాలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ పథకాల ద్వారా రూ.25.69 కోట్ల మేర ఆస్తులను 9 వేల 514 మందికి లబ్ధి చేకూర్చే విధంగా మంత్రి అయ్యన్నపాత్రుడు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రూ.25 కోట్లు, డ్వామా ద్వారా రూ.16.61 లక్షలు, వ్యవసాయశాఖ ద్వారా రూ.1.80 లక్షలు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా రూ.11 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.32.26 లక్షలు, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా రూ.7.71 లక్షల విలువైన ఆస్తులను అందజేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement