Development
-
Telangana: మా గ్రామాలను ఎఫ్‌సీడీఏలో కలపండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను సైతం విలీనం చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. 56 రెవెన్యూ గ్రామాలతో పాటు 765.25 స్కై్వర్ కిలోమీటర్ల పరిధిని 12 జోన్లుగా విభజించి.. భావినగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను తొలగించి, ఫ్యూచర్‌సిటీ డెవలెప్మెంట్ అథారిటీలో విలీనం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ డెవలెప్మెంట్ అథారిటీ కోసం ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్(ఆమనగల్లు) వరకు 330 ఫీట్ల రేడియల్ గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు ఏర్పాటుకు భూ సేకరణ చేపట్టింది. అంతర్జాతీయ హంగులతో సుమారు 30 వేల ఎకరాల్లో కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను కూడా విలీనం చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కొన్ని గ్రామాల ప్రజలైతే ఏకంగా అఖిలపక్షంగా ఏర్పడి ధర్నాలకు సైతం దిగుతుండడం విశేషం. బతుకులు మారతాయనే.. ఐటీ, ఇండ్రస్టియల్ పరిశ్రమల రాకతో సమీప భూముల ధరలకు రెక్కలొచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కనీస అభివృద్ధికి నోచుకోని తమ గ్రామాలను కొత్తసిటీలో కలపడం ద్వారా తమ జీవితాలు పూర్తిగా మారిపోతాయనే ఆశ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. కాగా ప్రభుత్వ ప్రతిపాదిత ఫోర్త్‌సిటీ కోసం ఇప్పటికే 13,973 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. తాజా గా మరికొంత భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కృత్రిమమేథ (ఏఐ) సిటీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యాధునిక వాణిజ్య భవనం సహా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, క్రికెట్ స్టేడియం తదితర ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు ఇందులో చోటు కలి్పంచనుంది. ఐటీ, ఇండ్రస్టియల్ పార్కుల పేరుతో కొత్తగా మహేశ్వ రం మండలం రావిర్యాల గ్రామం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 275.12 ఎకరాలు, కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 350.22 ఎకరాల భూసేకరణకు నోటిఫి కేషన్ జారీ చేసింది. అదనంగా తిమ్మాపూర్‌లో 600 ఎకరాలు, పంజాగూడలో 300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కన్సల్టెన్సీకి నోటిఫికేషన్ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని 14 గ్రామాల మీదుగా వెళ్లే గ్రీన్ఫిల్డ్ రేడియల్ రోడ్డును రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. ఫేజ్–1లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్ పేట వరకు 19.02 కిలోమీటర్ల మేర రూ.1,665 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఫేజ్–2లో భాగంగా మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు ఆర్ఆర్ఆర్ వరకు 22.30 కిలోమీటర్లు రూ.2,365 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న టెక్నికల్ బిడ్లను ఆహ్వానించడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లను నాటే పనిలో నిమగ్నమయ్యారు. మార్చి 21న టెక్నికల్ బిడ్స్ తెరవనున్నారు. తాజాగా రోడ్డు నిర్మాణ సమయంలో పనులు పర్యవేక్షించేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సరీ్వసులకు టెండర్లు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ⇒ మహేశ్వరం మండలంలో 31 పంచాయతీలు ఉండగా, వీటిలో హర్షగూడ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం అయింది. తాజాగా తుమ్మలూరు, మహబత్నగర్ను ఫోర్త్‌సిటీలో విలీనం చేశారు. ఇదే మండలం నుంచి మరికొన్ని విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి.⇒ కందుకూరు మండల పరిధిలోని నేదునూరు, బాచుపల్లి, జైత్వారం, పులిమామిడి, ధన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, దావుద్ గూడతండా, పెద్దమ్మతండా పంచాయతీలను సైతం ఫోర్త్‌సిటీలో కలపాలని కోరుతున్నారు. -
జగన్ అంటే ఒక పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్!
-
చిన్నమ్మా.. చేతకాలేదా?
చిన్నమ్మకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకావడం లేదా.. ఎంపీగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదా.. బీజేపీ పెద్దల వద్ద ఆమె మాట చెల్లడం లేదా.. టీడీపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే అనుమానంతో చిన్నమ్మను కేంద్రం దూరం పెట్టిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇటీవలి కేంద్ర బడ్జెట్టే దీనికి నిదర్శనంగా నిలుస్తూండగా.. రైల్వే బడ్జెట్లో సైతం జిల్లాకు కేటాయింపులు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలస వచ్చినా ఇక్కడి ప్రజలు ఆమెను ఆదరించారు. 54.82 శాతం ఓట్లు వేసి, 2,39,139 ఓట్ల మెజార్టీతో పట్టం కట్టారు. ఆమె ద్వారా జిల్లాకు మరిన్ని మంచి రోజులు వస్తాయని, తమ గళం ఢిల్లీ వరకూ వినిపిస్తుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తనపై అంత అభిమానం చూపిన జిల్లా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధిపై చిన్నమ్మ కనీస శ్రద్ధ కూడా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా సమావేశాలకు రావడం, వెళ్లడం తప్ప గోదారోళ్ల గుండె ఘోష తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు పెదవి విరుస్తున్నారు. స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికే నిధులు రాబట్టుకోలేని చిన్నమ్మ నిస్సహాయతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం రైల్వే అభివృద్ధికి కూడా పాటు పడిన దాఖలాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి.ప్రత్యామ్నాయ మార్గం ప్రస్తావనేదీ?రాష్ట్రంలో రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజూ సుమారు 200కు పైగా ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూంటాయి. మామూలు రోజుల్లో 30 వేల మంది, పండగ సమయాల్లో 40 వేల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. ఆదాయంలోనూ ఈ స్టేషన్ మేటిగా నిలుస్తోంది. ఏటా రూ.123 కోట్లకు పైగా ఆదాయంతో ఎన్ఎస్జీ–2 హోదా సొంతం చేసుకుంటోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రాక్‌లు నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఈ దృష్ట్యా గోదావరి బ్రిడ్జిల పైన, కొవ్వూరు, ఔటర్లోను పలు సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తూ, ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడియం నుంచి నిడదవోలు వరకూ ప్రత్యామ్నాయ రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదన ఉంది. తద్వారా గూడ్స్ రైళ్లను అటు మళ్లించడంతో రాజమండ్రి స్టేషన్‌కు ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ రైల్వే లైన్ నిర్మాణ విషయం బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. నిధుల కేటాయింపుపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.గత నిధులనే ఇప్పుడిచ్చినట్లు!రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.271 కోట్లు కేటాయించారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ప్రస్తుత రైల్వే బడ్జెట్లో మరోసారి కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, గతంలో మంజూరైన నిధులనే కొత్తగా ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. కేంద్రం తెలివితేటలు చూసి, జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.ఆర్వోబీల ఏర్పాటుపై నీలినీడలురైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు నివారించాలంటే ఆర్వోబీల నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ భావించింది. దీనికి గాను 2027 నాటికి గేట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని అన్నపూర్ణమ్మపేట, కేశవరం, అనపర్తి ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వే శాఖ పంపిన ప్రతిపాదనలకు తాజా బడ్జెట్లో దిక్కూమొక్కూ లేకుండా పోయింది.కొవ్వూరు – కొత్తగూడెం రైల్వే లైన్ ఊసే లేదువిశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని సుమారు 130 కిలోమీటర్ల మేర తగ్గించాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చాలా కాలం కిందటే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇటీవల తిరిగి పట్టాలెక్కినట్టు కనిపించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ రైల్వే లైను నిర్మాణం అన్నివిధాలుగా ఉపయోగకరమని నివేదికలు సైతం స్పష్టం చేశాయి. దీనికి ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించినా నిరాశే ఎదురైంది.పుష్కర నిధులపై స్పష్టత ఏదీ?గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,286 కోట్లు అవసరమని ప్రజాప్రతినిధులు, అధికారులు లెక్కలు వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుందని భావించారు. కానీ, ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో అసలు పుష్కరాలకు కేంద్రం తన వాటా ఇస్తుందా, లేదా.. ఇస్తే ఏ మేరకు అనే ప్రశ్న తలెత్తుతోంది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించిన ఎంపీ పురందేశ్వరి నిధుల మంజూరుపై దృష్టి సారించలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలాగే, రైల్వే సమస్యలపై కూడా ఆమె ఎందుకు శ్రద్ధ చూపలేదని ప్రశ్నిస్తున్నారు.అమృత్ స్టేషన్ల అభివృద్ధేదీ?అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా నిడదవోలు జంక్షన్, కొవ్వూరు, రాజమహేంద్రవరం, కడియం, ద్వారపూడి (కోనసీమ జిల్లా), అనపర్తి స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ప్రకటనలే తప్ప ఈ పనులు నత్తకు మేనత్తలా మారాయి. ప్రస్తుత బడ్జెట్లో వీటికి భారీగా నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దక్షిణ హైదరాబాద్‌కు 'రియల్' అభివృద్ధి!
నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్ మీదుగా వెస్ట్‌తో సౌత్ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్ అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్ సిటీలను దక్షిణ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్‌లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్‌సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్‌కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్ హోమ్స్‌తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.ట్రిపుల్ ఆర్తో ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు, ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్ ఆర్తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్.. లగ్జరీ హౌసింగ్ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో 5–10 వేల చ.అ. ఫ్లాట్ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్ హైట్ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.ఇంటి అవసరం పెరిగింది గతంలో ఇండిపెండెంట్ హౌస్‌లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్‌తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్‌గా ఉంటుంది. థర్డ్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది. -
దటీజ్ జగన్..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల మధ్య ఓ తేడా ఉంది. ఇద్దరూ పోటాపోటీగా రాష్ట్రం చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేస్తూంటారు. జరిగిన ప్రతి మంచిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూంటారు. కారణమేమిటో తెలియదు కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచిని అనివార్యంగానైనా గుర్తిస్తున్నారు. ఏదో మాటవరసకు బాబుగారిని పొగుడుతూన్నట్టు కనిపిస్తాడేగానీ పవన్ ఆంతర్యం మొత్తం గత ప్రభుత్వం తాలూకేనని తేలికగానే అర్థమైపోతుంది.పవన్ ఈ మధ్యే కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద ‘గ్రీన్ కో’ సంస్థ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్తు ప్లాంట్లను పరిశీలించారు. వెళ్లకముందు ఆ కంపెనీ అటవీ భూములను ఆక్రమించిందని, విచారించాలని అధికారులకు సూచించారు. కానీ.. ఆ తరువాత మాత్రం ప్రాజెక్టు ఒక అద్భుతమని కొనియాడారు. బహుశా వ్యతిరేక వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఈ ప్రాజెక్టుపై రాసిన తప్పుడు కథనాల ఫలితం కావొచ్చు. సుమారు రూ.28 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసింది అందరికీ తెలిసిందే. అంతెందుకు అప్పట్లో టీడీపీ నేతలు కొందరు ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విమర్శలు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న కృత నిశ్చయంతో కంపెనీకి అవసరమైన వనరులను సమకూర్చారు. ఈ గ్రీన్ కో కంపెనీలో ముఖ్యుడు చలమలశెట్టి సునీల్ 2024లో వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. ఈ కారణంగా ఆ కంపెనీపై టీడీపీ, జనసేన ముఖ్యనేతలకు గుర్రుగా ఉండేది. ఆ క్రమంలోనే గ్రీన్ కో రిజర్వు ఫారెస్ట్ పరిధిలో అటవీభూముల ఆక్రమణకు పాల్పడిందని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని, అటవీశాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఆరా కూడా తీశారని ఎల్లో మీడియా ఈనాడు ఒక వార్తను రాసింది. గతంలో సునీల్‌కు ప్రజారాజ్యం, టీడీపీ పక్షాలతో కూడా అనుబంధం ఉంది. అయినా గతసారి వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేశారు కాబట్టి ఎలాగోలా ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా ప్రయత్నించింది. అందులో భాగంగానే గత మార్చిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎంత ఘోరంగా రాసిందో చూడండి..'అస్మదీయుడికి అదిరేటి ఆఫర్" అంటూ సునీల్ కుటుంబ కంపెనీకి భారీ భూ సంతర్పణ చేశారని, అది కూడా ఎకరా రూ.ఐదు లక్షలకే అని ప్రచారం చేసింది. సుమారు 1500 ఎకరాల భూమిని పరిశ్రమకు ఇవ్వడంపై విషం కక్కింది. అక్కడ విలువ రూ.కోటి ఉంటే తక్కువ ధరకు ఇచ్చారని ఏడ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంతకాలం గ్రీన్ కో పై తప్పుడు రాతలు రాసిందని చెప్పవచ్చు. ఉదాహరణకు 2024 జూలై 18 న ఒక కథనాన్ని వారి టీవీలో ప్రసారం చేస్తూ ‘అడవి తల్లికి గాయం’ అని కంపెనీని ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అదే నెలలో అంతకుముందు వారి పత్రికలో కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని దుర్మార్గంగా రాసింది. ఆ తర్వాత ఏమైందో కాని మొత్తం ప్లేట్ మార్చేసింది. వారి పత్రికలో 'జల కిరణాలు" అనే శీర్షికన ఈ ప్రాజెక్టును ఆకాశానికి ఎత్తేసింది. ఎత్తైన కొండలు, కశ్మీర్ అందాలు తలపించే లోయలు, జల హోయలు, సౌర ఫలకలు, గాలిమరలు, అబ్బుర పరుస్తున్నాయని ఇదే పత్రిక తెలిపింది. ఎండ, నీరు, గాలి ఆధారంగా చేసే విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్నారని పేర్కొంది.ఆ కంపెనీతో ఈనాడుకు లాలూచీ అయిందా? లేక బుద్ది తెచ్చుకుని వాస్తవాలు రాసే యత్నం చేసిందా? అన్న ప్రశ్నకు ఎవరు జవాబు ఇస్తారు? ఈ ప్రక్రియలో ఎక్కడా జగన్‌కు క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం జాగ్రత్తపడింది. పవన్‌కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేదా సంబంధ బాంధవ్యాల రీత్యా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లారు. దానిని పూర్తిగా తిలకించిన తర్వాత ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు.ఇది పూర్తి అయితే విదేశాలకు కూడా కరెంటు అమ్మవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగాను, మరో 40 వేల మందికి పరోక్షంగాను ఉపాధి వస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ మాట విన్న తర్వాత ‘‘హమ్మయ్యా.. ఇప్పటికే ఏపీలో పలు విధ్వంసాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదలి వేసిందిలే!’’ అనే భావన ఏర్పడింది. ఇది జగన్ ప్రభుత్వ కృషి అని పవన్ ప్రశంసించకపోయినా, ప్రజలందరికి అర్థమైపోయింది. జగన్ ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు ఈ రూపు సంతరించుకుందని.. ఆ రకంగా సోషల్ మీడియాలో విస్తారంగా వీడియోలు వచ్చాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లి ఇది ప్రైవేటు స్కూలేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నిటిని గమనించిన ఆయన స్కూల్ ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్ కు వెళ్లినప్పుడు అదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపకక్షంలో ఉన్నప్పుడు ఎంత విష ప్రచారం చేసినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తరువాతైనా జగన్ చేసిన మంచిని, అభివృద్దిని ఏదో రకంగా ఒప్పుకోక తప్పలేదు. జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలు, గ్రామ, గ్రామాన నిర్మించిన సచివాలయ భవనాలు, పోర్టులు మొదలైన వాటిని అప్పుడు ప్రజలు గుర్తించారో లేదో కాని, ఇప్పుడు కూటమి నేతలు పర్యటించినప్పుడు జనానికి అర్థమవుతున్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన శైలిలోనే ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తన గొప్పతనమని, వైఎస్సార్సీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శలు చేస్తుంటారు. దావోస్ పర్యటనలో కూడా ఏపీలో నిర్మాణం చేస్తున్న పది ఓడరేవుల గురించి చంద్రబాబు చెప్పక తప్పలేదు. అవన్నీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నారన్నది తెలిసిన సంగతే. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ హరిత ఇంధన హబ్ గా అవుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకుంటే చెప్పుకున్నారు కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. జగన్ తన హయాంలో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలోకి తీసుకు వచ్చారు. అప్పుడేమో ఎల్లో మీడియా ‘అదానీ వంటి కంపెనీలకు ఏపీని రాసిచ్చేస్తున్నారు’ అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేసింది. భూములను లీజుకు ఇప్పించడాన్ని కూడా తప్పు పట్టింది. ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తోంది. మరి దీనిని ఏమనాలి?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణ రూపు రేఖలు మార్చేలా రాజధాని హైదరాబాద్ అభివృద్ధి... దావోస్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
-
అమరావతిపై కపట ప్రేమ చూపిస్తున్న కూటమి నేతలు
-
ఓల్డ్ సిటీ అభివృద్ధిపై అక్బరుద్దీన్ తో మాట్లాడా: CM Reventh
-
హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!
‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్‌లతో హైదరాబాద్ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోసబర్బన్ పాలసీ అవసరం.. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.ఆదాయంలో 25–30 శాతం వాటా.. ప్రస్తుతం గ్రేటర్లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.‘యూజర్ పే’తో గ్రోత్ కారిడార్‌లో రోడ్లు.. ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలోనే గ్రోత్ కారిడార్‌కు రెండు వైపులా రహదారులను ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్ రింగ్ రోడ్ అనుసంధానించబడి రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.వాక్ టు వర్క్‌తో.. ఫోర్త్ సిటీ.. తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్‌ను హైదరాబాద్‌లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్.. హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్ హైదరాబాద్. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్ నుంచి నారాపల్లి, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట, పరేడ్ గ్రౌండ్ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి. -
అవరోధాలు తొలగిస్తూ సంస్కరణలు
న్యూఢిల్లీ: భారత యువత అభివృద్ధి పథంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం సంస్కరణలు తెచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు యువత సరైన పరిష్కారాలు చూపుతూ సాగే ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్(ఎస్ఐహెచ్)’ కార్యక్రమం అంతిమ పోరు సందర్భంగా ప్రధాని మోదీ తుది పోటీదారులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపే బాధ్యత తమపై ఉందని నేటి యువత బాధ్యతాయుతంగా ఆలోచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలు సాధించగల, సాంకేతికత సత్తా ఉన్న యువత భారత్ సొంతం. శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. సంస్కరణలు తెస్తూ భారత యువత అభివృద్ధి పథంలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం తొలగిస్తోంది’’ అని మోదీ అన్నారు. ఏడో దఫా ఎస్ఐహెచ్లో దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల్లో 1,300కుపైగా విద్యార్థి బృందాలు ఫైనల్లో పోటీపడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎడిషన్ పోటీ 36 గంటల్లో ముగుస్తుండగా హార్డ్‌వేర్ ఎడిషన్‌లో పోటీ 15వ తేదీదాకా కొనసాగనుంది. హ్యాకథాన్‌లో భాగంగా జాతీయ ప్రాధాన్యత గల 17 అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశ్రమలు ఇచ్చి సమస్యలకు అత్యంత ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపుతూ విద్యార్థి బృందాలు తమ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తిచేసి సమర్పించాల్సి ఉంటుంది. పలు రంగాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది. -
చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా శాంతి బహుమతి
న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రముఖ మానవ హక్కుల నేత, చిలీ మాజీ దేశాధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ అందుకోనున్నారు. ఇందిరా గాంధీ శాంతి బహుమతి అంతర్జాతీయ జ్యూరీ చైర్మన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఈ అవార్డుతో గౌరవిస్తారు. ఐరాస మహిళా విభాగం వ్యవస్థాపక డైరెక్టర్‌గా, ఐరాస మానవ హక్కుల హై కమిషనర్‌గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం స్వదేశంలో, అంతర్జాతీయంగా మిచెల్ ఎంతగానో కృషి చేశారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది. -
Andhra Pradesh: అభివృద్ధిపైనా అబద్ధాలే
సాక్షి, అమరావతి: వరుసగా ఏటా సొంత ఆదాయాల్లో పెరుగుదల.. జాతీయ స్థాయికి మించి పెరిగిన తలసరి ఆదాయం.. చిన్న, సూక్ష్మ పరిశ్రమలతో 32.79 లక్షల ఉద్యోగాలు.. కోవిడ్‌లోనూ ఉపాధికి ఢోకా లేకుండా భరోసా.. గాడిన పడ్డ పొదుపు సంఘాలు.. బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు.. పేదవాడికి ఆరోగ్య భరోసా.. రైతుల్లో నిశ్చింత.... ఇవన్నీ ఒక రాష్ట్రం అభివృద్ధి ప్రయాణానికి తిరుగులేని నిదర్శనాలు! స్ధిర ధరల ఆధారంగా వృద్ధి రేటు వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా పెరిగినట్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేనే స్పష్టంగా చెబుతోంది. అయినా సరే.. గత సర్కారు పాలనలో అభివృద్ధి జరగలేదని.. ఆదాయం పెరగలేదని.. తలసరి ఆదాయం తగ్గిపోయిందని.. పెట్టుబడులు రాలేదని.. స్కీములన్నీ స్కామ్‌లేనంటూ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్పారు!! కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన 2023–24 సామాజిక ఆర్ధిక సర్వే సాక్షిగా ఈ అబద్ధాలు బట్టబయలయ్యాయి. స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణించడం వాస్తవ అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. వైఎస్సార్ సీపీ హయాంలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ ప్రతి ఏడాది వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. 2022–23తో పోల్చితే 2023–24లో స్థిర ధరల ఆధారంగా వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని సర్వే తెలిపింది.వృద్ధికి ఊతం..⇒ 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా జాతీయ స్థాయిని మించి పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,84,205 కాగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,42,479గా ఉంది. ⇒ 2021–22 నుంచి 2023–24 వరకు రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరులు వరుసగా పెరిగాయి. పొదుపు మహిళకు ‘‘ఆసరా’’రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 99 శాతం రికవరీతో పాటు 30 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే వెల్లడించింది. స్వయం సహాయక సంఘాలకు 2019 ఏప్రిల్ 11వతేదీ వరకు ఉన్న రుణాల భారాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా చెల్లించి గత ప్రభుత్వం ఆదుకుంది. 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.25,557.54 కోట్లు చెల్లించింది.పారిశ్రామిక విప్లవం.. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,688.11 కోట్ల పెట్టుబడితో 20 భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడమే కాకుండా ఉత్పత్తిని సైతం ప్రారంభించి 14,596 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ⇒ రూ.6.07 లక్షల కోట్ల పెట్టుబడితో తలపెట్టిన మరో 156 భారీ మెగా ప్రాజెక్టులు నిర్మాణ, ప్రారంభ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా 4.86 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,286.48 కోట్ల పెట్టుబడితో 2,71,341 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావడమే కాకుండా వాటి ద్వారా ఏకంగా 19,86,658 మందికి ఉపాధి కల్పించాయి. ⇒ గతంలో ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎంఎస్ఎంఈల ద్వారా రూ.26,000 కోట్ల పెట్టుబడులు, 8.67 లక్షల మందికి ఉపాధి కల్పించగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంఎస్ఎంఈలతో రూ.33,177 కోట్లు పెట్టుబడులు, 32.79 లక్షల మందికి ఉపాధి చూపినట్లు సర్వే వెల్లడించింది. 2023–24లో 2.24 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా 64,307 మంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. విద్యా సంస్కరణలు.. చదువులకు సాయం⇒ మన బడి నాడు – నేడు కింద తొలి దశలో రూ.3859.12 కోట్ల వ్యయంతో 15,715 స్కూళ్లలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను కల్పించగా రెండో దశలో రూ.8,000 కోట్లతో అదనపు తరగతి గదులతోపాటు 11 రకాల సదుపాయాలను 22,344 స్కూళ్లలో కల్పించారు. రూ.372.77 కోట్లతో 883 స్కూళ్లలో వసతులు కల్పించారు. ⇒ పిల్లల చదువులకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు చొప్పున 2022–23లో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు అందచేశారు. ⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ లేవు. 6 నుంచి 8వ తరగతి వరకు 0.01 శాతం మాత్రమే డ్రాప్ అవుట్స్ ఉండగా తొమ్మిది, పదో తరగతిలో 2.39 శాతం డ్రాప్ అవుట్స్ నమోదయ్యాయి.ఆర్బీకేలు.. పెట్టుబడి సాయందేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలందించాయని సర్వే తెలిపింది. రైతు భరోసా – పీఎం కిసాన్ కింద 2023–24లో 2.58 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్, కౌలు రైతులతో సహా 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,226.08 కోట్లు పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం అందచేసింది. రాష్ట్ర పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరుల గురించి సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్న భాగం -
ప్రపంచ వేదికపై భారత్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికాలో సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జాన్ జే హామ్రేతో జరిగిన సమావేశంలో ఆర్థిక సాధికారతలో భారత్ అభివృద్ధిని గురించి వివరించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.2014లో రాష్ట్ర రాజధానులకు సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా విద్యుత్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉండేది. నేడు ప్రతి గ్రామంల్లో విద్యుత్ సదుపాయం మాత్రమే కాకుండా.. ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం గురించి కూడా సీతారామన్ వెల్లడించారు.ఇంతకు ముందు గ్రామాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్స్ అందించడం జరిగింది. లక్షలాది భారతీయ కుటుంబాల ఆరోగ్యం, పారిశుధ్యం వంటి సౌకర్యాలపై కూడా కేంద్రం సానుకూల దృష్టి పెట్టిందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరుమున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగాన్ని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అదనపు నిధులను పొందుతాయని ఆమె వివరించారు. అంతే కాకుండా మార్కెట్ నుంచి వనరులను సేకరించేందుకు వారి సామర్థ్యాలను పెంచుతున్నాము. ఇది దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు.భారతదేశ ఆర్థిక వృద్ధికి కొన్ని సంస్కరణలు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది పెట్టుబడిదారులు కొత్త రంగాలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు. కొనసాగుతున్న సంస్కరణలు, పెరిగిన గ్లోబల్ ఎంగేజ్మెంట్తో.. భారతదేశం ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందుతుందని సీతారామన్ స్పష్టం చేశారు. -
చదువుల తండా.. రూప్లానాయక్ తండా
సాక్షి, మహబూబాబాద్: లంబాడ తండాలు అంటే అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఏడు దశాబ్దాల క్రితమే ఆ తండా అక్షరాస్యతతో అభివృద్ధి దిశగా పయనించింది. మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం రూప్లానాయక్ తండా (కలెక్టర్ తండా)లో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో దాదాపు అన్ని విభాగాలు, దేశ విదేశాల్లో.. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని రంగాల్లో రాణించారు. జలపతినాయక్ నుంచి చదువుల ప్రస్థానం భారతదేశాన్ని బ్రిటీష్ వారు పాలిస్తున్న కాలంలో బానోత్, తేజావత్ కుటుంబాలకు చెందినవారు సీరోలు గ్రామానికి సమీపంలో తండాను ఏర్పాటు చేశారు. ఈ తండాకు చెందిన జలపతినాయక్ అప్పటి మదరాసాల్లో ఉర్దూ మీడియంలో ఐదోతరగతి వరకు చదువుకొని సమీపంలోని చింతపల్లి గ్రామ పోలీస్ పటేల్‌గా ఉద్యోగం చేశారు. ఆయన్ను చూసి తండాకు చెందిన బానోత్ చంద్రమౌళినాయక్ హెచ్ఎస్సీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు.. ఇలా మొదలైన తండాలో విద్యా ప్రస్థానం.. పిల్లలను పనికి కాకుండా బడికి పంపించడం అలవాటుగా మారింది. ఒకరిని చూసి ఒకరు పిల్లలను పక్కనే ఉన్న కాంపెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. ఆపై మహబూబాబాద్, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు పిల్లలను పంపించి ఉన్నత చదువులు చదివించారు. అప్పుడు 20...నేడు 80 కుటుంబాలుమొదట 20 కుటుంబాలుగా ఉన్న రూప్లాతండా ఇప్పుడు 80 కుటుంబాలకు చేరింది. జనాభా 150 మంది ఉండగా, వీరిలో దాదాపు 90 శాతం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా, జాతీయ అంతర్జాతీయ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తండాకు చెందిన జలపతినాయక్ కు ఎనిమిది మంది కుమారులు, ఎనిమిది మంది కుమా ర్తెలు.. వారి కుటుంబాల్లో మొత్తం 13 మంది డాక్టర్లు, ఒక ఐపీఎస్, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్, ఫార్మా, డిఫెన్స్, యూనివ ర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్నారు. చంద్రమౌళినాయక్ నలుగురి సంతానంలో యూఎస్, ఇతర దేశాల్లో స్థిరపడినవారు, డాక్టర్లు ఉన్నారు. బీమ్లానాయక్ కుటుంబానికి చెందిన రాంచంద్రునాయక్ లంబాడ నుంచి మొదటగా ఐఏఎస్ అధి కారిగా ఎంపికయ్యారు. రామోజీనాయక్ కుటుంబం నుంచి రమేష్‌నాయక్ ఐపీఎస్ కాగా, డిఫెన్స్, ఎయిర్‌ఫోర్స్, డాక్టర్లు ఇలా ఉన్నత చదువులు, అత్యున్నత ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఆ తండా నుంచి ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, 20 మంది డాక్టర్లు, 25 మంది ఇంజనీర్లు, 10 మంది విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డారు. ఆరుగురు పోలీస్ డిపార్ట్మెంట్లో, మరో పది మంది ఫార్మా కంపెనీల్లో పనిచేస్తుండగా, హైదరాబాద్, ఖమ్మం, ఢిల్లీ ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు చేస్తుండగా, మిగిలిన వారిలో కూడా చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.తండాలో పుట్టినందుకు గర్వంగా ఉందినలభై సంవత్సరాల క్రితం నేను బడికి పోతుంటే అందరూ హేళన చేసేవారు. కానీ మా నాన్న ఉపాధ్యాయుడు కావడంతో నన్ను పట్టుదలతో చదివించారు. అప్పటివరకు మా లంబాడ ఇళ్లలో డాక్టర్ చదవం నాతోటే మొదలైంది. ఈ తండాలో పుట్టినందుకు గర్వంగా ఉంది. – కళావతిబాయి, ఖమ్మం జిల్లా డీఎంహెచ్ఓనాన్న ముందు చూపేఉర్దూ మీడియంలో ఐదవ తరగతి వరకు చదువుకున్న నాన్న ముందు చూపే తండాలో పుట్టిన వారి జీవన విధానాన్నే మార్చేసింది. కుటుంబాలు గడవడం ఇబ్బందైన రోజుల్లోనే ఇంటర్ హైదరాబాద్‌లో చదవించారు. అదే స్ఫూర్తిగా ఇప్పటి వరకు తండాలో పుట్టిన మాతోపాటు, మా బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదివి దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. – డాక్టర్ రూప్‌లాల్, మహబూబాబాద్ఒకరిని చూసి ఒకరు పోటీపడి చదివాంమా తండాలో పుట్టడం ఒక వరంగా భావిస్తాం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందరూ బడికి పోవాలి అని చెప్పేవారు. పిల్లల ప్రవర్త నపై దృష్టి పెట్టి ఎప్పటి కప్పుడు హెచ్చరించేవారు. అందుకోసమే ఏ పాఠశాల, ఏ కళాశాలకు వెళ్లినా మా తండా విద్యార్థి అంటే ప్రత్యేకం. అందరం పో టీపడి చదివాం. ఐఏఎస్, ఐపీఎస్ నుంచి అన్ని రకాల ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. – జగదీష్, మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో -
మూసీపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్
-
మహిళల కోసం కోర్టెవా అగ్రిసైన్స్ కొత్త ప్రోగ్రామ్
భారతదేశాన్ని వ్యవసాయ దేశంగా పిలుస్తారు. వ్యవసాయం అంటే ప్రధానంగా పురుషులే కనిపిస్తారు. ఈ రంగంలో మహిళలను కూడా ప్రోత్సహించదానికి కోర్టెవా అగ్రిసైన్స్ ఓ కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని ద్వారా 20230 నాటికి దేశంలో 20 లక్షలమంది మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది.కోర్టెవా అగ్రిసైన్స్ ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ ద్వారా.. రైతులను, పరిశోధకులను, వ్యవస్థాపకులను తయారు చేయనుంది. ఇది కేవలం కార్పొరేట్ రంగం అభివృద్ధి చెందడానికి మాత్రమే కాకుండా.. లింగ సమానత్వం, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.గ్రామీణ జీవితానికి, వ్యవసాయానికి మహిళలు వెన్నెముక. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, విద్య, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పొందడం ద్వారా మహిళలు జీవితాలను మెరుగు పరుస్తుందని.. కోర్టెవా అగ్రిసైన్స్ ప్రెసిడెంట్ 'సుబ్రొటో గీడ్' పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి కూడా సహాయపడుతుంది, వికసిత భారత్ వైవు అడుగుల వేస్తూ ఈ సామాజిక బాధ్యతను స్వీకరించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. -
అభివృద్ధి కోసమే ‘జమిలి’: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: దేశ అభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం( సెప్టెంబర్18) ఆమోదం తెలిపిన సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘జమిలితో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడుతోంది. దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవు.జమిలి ఎన్నికలు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది.పార్లమెంట్లో జమిలి బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది.ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే పార్లమెంట్లో జరిగే చర్చలో చెప్పొచ్చు’అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి..కేసీఆర్,కేటీఆర్ వదిలిపెట్టినా..నేను వదిలిపెట్టను: బాల్కసుమన్ -
వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో సాగుతోంది. చురుకైన ఆర్థికాభివృద్ధితోపాటు సాంస్కృతిక భిన్నత్వం, పటిష్టమైన ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఐటీ, జీసీసీ, ఏరోస్పేస్ వంటి విభిన్న రంగాల్లో దూసుకుపోతోంది. దీనికితోడు ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ రివర్‌ఫ్రంట్ తదితర మౌలిక వసతుల ప్రాజెక్టులు పట్టలెక్కనుండటంతో కొత్త అవకాశాలు విస్తృతం కానున్నాయి. గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) రంగాల్లో రియల్ ఎస్టేట్, ప్రొవిషనల్ సరీ్వసెస్, ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు తదితరాలు సింహభాగం అయ్యాయి.అక్షరాస్యత 67 శాతంగా ఉండటంతోపాటు 1.6 కోట్ల మంది (రాష్ట్ర జనాభాలో 66 శాతం) 15–59 ఏళ్ల మధ్య వర్కింగ్ ఏజ్‌లో ఉండటం తెలంగాణకు కలిసొచ్చే అంశం. దీంతో ప్రస్తుతమున్న 176 బిలియŒన్ డాలర్ల ఎకానమీ నుంచి 2036 కల్లా ఒక ట్రిలియŒన్ డాలర్ల ఎకానమీ వైపు పరుగులు పెట్టొచ్చని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా కూడా ‘ద మెగా మాస్టర్‌ప్లాన్ 2050’ దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రణాళికలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. తాజాగా డబ్ల్యూటీసీ శంషాబాద్, జీనోమ్ వ్యాలీ ఆధ్వర్యంలో ‘తెలంగాణాస్ గ్రోథ్ స్టోరీ–ద రోడ్ టు డాలర్స్ 1 ట్రిలియన్ ఎకానమీ’ పేరిట విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. దేశంలోనే ‘యంగెస్ట్ స్టేట్’గా తెలంగాణ ఇప్పటికే పలు రంగాల్లో ఆధిక్యతను కనబరుస్తూ ముందుకు సాగుతోంది. భారత్ అభివృద్ధి, ముందంజలో తన వంతు పాత్ర పోషిస్తూ తెలంగాణ పురోగతి బాటలో నడుస్తోంది. నూతన ఆవిష్కరణలు, సాంకేతికలపై ప్రత్యేక దృష్టి పెడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం హైదరాబాద్ మహానగరం, ఇతర నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త అవకాశాలు అందిపుచ్చుకొనేలా చర్యల ద్వారా ప్రాంతీయంగా వ్యాపార, వాణిజ్యాల వృద్ధికి చర్యలు చేపడుతోంది.నివేదిక ముఖ్యాంశాలు ⇒ 2024 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ (కరెంట్) యూఎస్ డాలర్లు 176 బిలియన్లు ⇒ 2024లో తలసరి ఆదాయం 4,160 డాలర్లు ⇒ 2021 జనాభా లెక్కల ప్రకారం 3.8 కోట్ల మంది జనాభా ⇒ 2011 లెక్కల ప్రకారం 39 శాతం పట్టణ జనాభా ⇒ 2011 లెక్కల ప్రకారం స్త్రీ పురుష లింగ నిష్పత్తి 988 ⇒ రాష్ట్ర జనాభాలో 66% పనిచేసే వయసు (15 నుంచి 59 ఏళ్ల లోపు) ఉన్న 1.6 కోట్ల మంది ⇒ 2011 లెక్కల ప్రకారం అక్షరాస్యత 67 శాతం ⇒ దేశ భూభాగంలో 3.4 శాతమున్న తెలంగాణ: 1,12,077 చ.కి.మీ.లలో విస్తరణతలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్... ⇒ రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 9.52 లక్షలు ⇒ హైదరాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ. 4.96 లక్షలు ⇒ సంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 3.24 లక్షలు ⇒ మేడ్చల్–మల్కాజిగిరి తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు గ్రాస్ డి్రస్టిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్–జీడీడీపీ ( బిలియన్ డాలర్లలో) రంగారెడ్డి జిల్లా టాప్.. ⇒ రంగారెడ్డి జిల్లా 33.94 బిలియన్ డాలర్లు ⇒ హైదరాబాద్ జిల్లా 27.38 బిలియన్ డాలర్లు ⇒ మేడ్చల్–మల్కాజిగిరిజిల్లా 10.64 బిలియన్ డాలర్లు ⇒ సంగారెడ్డి జిల్లా 7.23 బిలియన్ డాలర్లు -
భారత్ వృద్ధికి తయారీ రంగం కీలకం: పీయూష్ గోయల్
భారతదేశంలో తయారీ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే దేశాభివృద్ధిని నిర్ణయిస్తుందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్ ఫోరమ్‌లో వెల్లడించారు. 2017 నాటికి వికసిత భారత్ సాకారానికి తయారీ రంగం కీలకమని అన్నారు.భారతదేశ జీడీపీ వేగవంతమవుతున్నప్పటికీ.. తయారీ రంగం వృద్ధి సాపేక్షంగా నిలిచిపోయింది. జీడీపీలో దీని వాటా 15 శాతం నుంచి 16 శాతంగా ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ సంఖ్య స్థిరంగా ఉంది. అంటే జీడీపీ పెరుగుతున్నప్పటికీ తయారీ రంగం ఇందులో చెప్పుకోదగ్గ వృద్దివైపు అడుగులు వేయడం లేదు.కోట్ల జనాభా ఉన్న మన దేశంలో నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి భారత్ ఎంతో అభివృద్ధి చెందగలదని గోయల్ పేర్కొన్నారు. అయితే దేశంలోని కంపెనీలు తమకు కావాల్సిన వస్తువులను లేదా ఉత్పత్తులను మరో దేశీయ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలి. ఇది తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం సహాయపడుతుందని ఆయన అన్నారు.ఒక భారతీయ కంపెనీ మరొక భారతీయ కంపెనీ నుంచి కొనుగోలు చేయడం ఒక స్థితిస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. ఇది వ్యాపారాల అంతరాయాలను నిరోధించడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం కూడా దేశాభివృద్ధికి చాలా పాటుపడుతోందని అన్నారు. -
‘ఫ్యూచర్ సిటీ’లో పెట్టుబడులు పెట్టండి... క్షత్రియ సమితి ఆత్మీయ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రేవంత్ విదేశీ పర్యటన సఫలం అయ్యిందా..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి యత్నించారు. ఇలా ఎవరు చేసినా అభినందించవలసిందే. ఏ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా కేవలం ప్రచారం కోసం కాకుండా, రాష్ట్రానికి మంచి జరగాలన్న లక్ష్యంతో ఆయా విదేశీ, ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను కలిసి తమ వద్ద కూడా పెట్టుబడులు పెట్టాలని కోరితే, వారిలో కొందరైనా అంగీకరిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగం జరుగుతుంది.రేవంత్ విదేశీపర్యటన ద్వారా సుమారు ముప్పైఐదు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అయినప్పటికీ ఈ మేరకు పెట్టుబడులు తేగలిగితే గొప్ప విషయమే. అవన్ని సాకారం అయితే అభినందించవలసిందే. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా వంటి ఒకటి, రెండు దేశాలకు పెట్టుబడుల నిమిత్తం వెళ్లివచ్చినా, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటనలు చేసి పెట్టుబడులు తీసుకు రావడానికి యత్నించారు. కేటీఆర్ వద్దే ఐటి, పరిశ్రమల శాఖలు ఉండేవి. ఆయన హయాంలోనే ఫార్మాసిటీ ఒక రూపు దిద్దుకుంది.హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులో ఆదిభట్ల మొదలైన ప్రాంతాలలో కొత్త కంపెనీలు నెలకొల్పడానికి కృషి జరిగింది. దీనికి ముందుగా హైదరాబాద్‌లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం చాలా గట్టి కృషి చేసిందని చెప్పాలి. రింగ్ రోడ్డుకు కనెక్టివిని బాగా పెంచింది. హైదరాబాద్ పశ్చిమ భాగంలో కాని, ఇటు వరంగల్, విజయవాడ రూట్లలో కాని కొత్త వంతెలను భారీ ఎత్తున చేపట్టి వాహనాల రాకపోకలకు చర్యలు తీసుకుంది. ఐటి రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. వీటన్నిటి పలితంగానే గత శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్, పరిసరాలలో మొత్తం అసెంబ్లీ సీట్లన్నిటిని బీఆర్ఎస్ స్వీప్ చేసిందన్న విశ్లేషణ ఉంది. అదే టైమ్‌లో గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ బాగా దెబ్బతినడం, ఎమ్మెల్యే అభ్యర్ధులపై తీవ్ర వ్యతిరేకత, కేసీఆర్ వ్యవహారశైలి వంటివాటి కారణాల వల్ల ఆ పార్టీ అధికారం కోల్పోయింది.తదుపరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ తొలుత కొంత తొందరపాటు ప్రకటనలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉండేవి. ముఖ్యంగా ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, దానిని ఆయా చోట్ల ఏర్పాటు చేస్తామని అనడంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ యాక్టివిటి బాగా దెబ్బతింది. ఆ తర్వాత రేవంత్ కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చే యత్నం చేశారు. ఆ కృషిలో భాగంగా ఎన్ఆర్ఐ పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికా, దక్షిణ కోరియా టూర్ పెట్టుకున్నారు.దాదాపు పది రోజుల ఈ టూర్లో సుమారు ఏభైకి పైగా సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. అమెరికాలోనే 19 కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకున్నారు. ఇవి కార్యరూపం దాల్చితే ముప్పైవేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. దీని ప్రభావం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్‌గా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకు రావడం శుభ పరిణామం. అలాగే అమెజానన్తో సహా ఆయా సంస్థలు పెట్టుబడులు పెడతామని అంటున్నాయి. వీటిలో స్వచ్ఛ బయో అనే సంస్థపై కొన్ని విమర్శలు వచ్చాయి. అది సీఎంకు సంబంధించినవారి కంపెనీ అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయినా ఫర్వాలేదు. ఎవరి కంపెనీ అయినా పెట్టుబడి పెట్టి పదిమందికి ఉపాధి కల్పిస్తే సంతోషించవలసిందే. అయితే ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ నిజంగానే పెట్టుబడులు పెడతాయి అన్న చర్చ లేకపోలేదు.ప్రతిపాదిత పెట్టుబడులలో పాతిక శాతం నుంచి ఏభై శాతం మొత్తం వచ్చినా ప్రయోజనకరమే. కాకపోతే రేవంత్ తన గురువు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడలలో నడిచి ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తే అది ఆయనకు నష్టం జరగవచ్చు. 2014 టరమ్‌లో చంద్రబాబు నాయుడు విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. తీరా చూస్తే అదంతా ప్రచారార్భాటమేనని ఆ తర్వాత వెల్లడైంది. ఆ పరిస్థితి రేవంత్ తెచ్చుకోకూడదు. అమెరికా టూర్ ద్వారా ఏదో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని పబ్లిసిటీ ఇచ్చుకోకుండా, వాస్తవంగా ఎన్ని ఒప్పందాలు కుదిరితే వాటినే అంటే రూ.32 వేల కోట్ల పెట్టుబడులు అని అధికారికంగా ప్రకటించడం మంచిదే. దాని వల్ల రేవంత్ విశ్వసనీయత పెరుగుతుంది.తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నగరం ఒక పెద్ద అస్సెట్‌గా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తయారైన అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ స్వరూపస్వభావాలనే మార్చివేసిందని చెప్పాలి. చంద్రబాబు హైదరాబాద్ అంతా తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. పాతికేళ్ల క్రితం ఒక బిల్డింగ్ కట్టి హైటెక్ సిటీ అని పేరు పెట్టి, ఆ ప్రాంతం అంతటికి సైబరాబాద్ అని నామకరణం చేసి మొత్తం నగరాన్ని తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలు ఒక ప్లాన్ ప్రకారం అభివృద్ధి అయ్యాయి.బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన మాట వాస్తవమే అయినా, ఆ రోజుల్లో మాట్లాడితే లండన్ చేస్తా.. డల్లాస్ చేస్తా అంటూ కేసీఆర్ చేసిన ప్రచారం వల్ల దాని సీరియస్‌నెస్ పోయిందని చెప్పాలి. హుస్సేన్ సాగర్‌లో మురికి నీటిని కొబ్బరినీరులా మార్చుతానంటూ కబుర్లు చెప్పేవారు. మూసి నదిని సుందరంగా తీర్చుదిద్దుతానని అనేవారు. కొంత ప్రయత్నం చేసి ఉండవచ్చు. కాని ఆచరణ సాద్యంకాని మాటలు చెప్పడం వల్ల వ్యంగ్య వ్యాఖ్యలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందే తప్ప ప్రయోజనం కలగదు. ఇప్పుడు అదే బాటలో రేవంత్ కూడా భారీ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. తన హయాంలో ఒక నగరం నిర్మించానని చెప్పుకోవాలని ఆయన ఉబలాటపడుతున్నారు. నిజానికి సిటీల నిర్మాణం ఎవరివల్లకాదు. అందులోను ప్రభుత్వాలు అసలు అలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదు.ఒక ప్రణాళికాబద్దమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి కాని, అన్నీ తామే నిర్మిస్తామని, దానిని రియల్ ఎస్టేట్ మోడల్లో తీసుకు వస్తామని అంటే ఎక్కువ సందర్భాలలో అది ఉపయోగపడలేదు. ఉదాహరణకు అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వెంచర్ తరహా అభివృద్దికి శ్రీకారం చుట్టి 2019లో దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది. ఏభై వేల ఎకరాల భూమిలో ప్రభుత్వపరంగా అభివృద్ది చేపట్టడం అంటే లక్షల కోట్ల వ్యవహారం అని చెప్పాలి. తాజాగా రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్‌ను న్యూయార్కు సిటీగా మార్చుతానని అంటున్నారు. ప్రత్యేకించి ప్యూచర్ స్టేట్ అనో, ఫ్యూచర్ సిటీ అనో చెప్పి నాలుగో నగరాన్ని నిర్మిస్తానని అంటున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ది చేయడంలో బాగంగా అని ఉంటే పెద్దగా తప్పు లేదు. కాని తన ప్రభుత్వమే ఆ వ్యాపారం చేస్తుందని రియల్ ఎస్టేట్ రంగంలో దిగితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంత ప్రోత్సాహకరంగా లేదన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణగా ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికలు, అంతర్జాతీయ మాంద్య పరిస్తితులు, ఐటి రంగంలో ఉపాది అవకాశాలు తగ్గడం వంటి కారణాలు ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ వాటిన్నిటిని అధిగమించే విదంగా రేవంత్ తన పెట్టుబడుల యాత్రను విజయవంతం చేయగలిగితే ఆయనకు మంచిపేరే వస్తుంది. ఇక మూసి మురుగునీటి నదిని శుద్ది చేస్తామని రేవంత్ కూడా అంటున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుల గురించి మరీ అతిగా ప్రచారం చేసుకుంటే, అది కొంత శాతం అయినా చేయలేకపోతే అవన్ని ఉత్తుత్తి కబుర్లుగా మిగిలిపోతాయి.ఇక గతంలో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆయన పీసీసీ అధ్యక్షుడి హోదాలో వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి పెట్టుబడులు కావాలని అమెరికా వరకు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు కేటీఆర్ తెలంగాణ నుంచి కొన్ని పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని అంటున్నారు. వాటిలో తొమ్మిదివేల కోట్ల రూపాయల వ్యయంతో పెట్టదలచిన అమరరాజా బాటరీస్ కూడా ఉందని ఆయన చెబుతున్నారు. అలాగే గుజరాత్‌కు ఒక కంపెనీ, చెన్నైకి మరో కంపెనీ తరలిపోయాయని ఆయన చెబుతున్నారు.అది నిజమా? కాదా? దానికి కారణాలు ఏమిటి అన్నదానిపై రేవంత్ సర్కార్ విశ్లేషణ చేసుకుని వాటిలో నిజం ఉంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకుంటే వచ్చే పెట్టుబడుల సంగతి ఎలా ఉన్నా, వెళ్ళే సంస్థల వల్ల తెలంగాణకు అప్రతిష్ట వస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే ఐటి సెంటర్‌గా విలసిల్లుతోంది. ఇది కేంద్రీకృత విధానంలో కాకుండా, చుట్టూరా ఉన్న రెండో స్థాయి నగరాలకు వ్యాప్తి చేయగలిగితే అప్పుడు తెలంగాణ దశ-దిశ మారిపోతాయి. అది అంత తేలిక కాదు.గతంలో కేటీఆర్ కూడా వరంగల్, ఖమ్మం వంటి చోట్ల ఐటీని అభివృద్ధి చేయాలని ప్రయత్నించారు. కాని అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అంటారు. ఏది ఏమైనా రేవంత్ టూర్ కేవలం రియల్ ఎస్టేట్ టూర్‌గా కాకుండా, ఉపాది, ఉద్యోగ అవకాశాలు పెంచే పరిశ్రమల స్థాపన టూర్‌గా విజయవంతం అయితే అభినందించవచ్చు. ఈ టూర్ సఫలం అయిందా? లేదా? అన్నది తేలడానికి కొంత టైమ్ పడుతుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆదివాసీ గూడేల అభివృద్ధే నిజమైన అభివృద్ధి : మంత్రి సీతక్క
బంజారాహిల్స్: దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధే నిజ మైన అభివృద్ధి అని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజనీతిశాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ‘ఆదివాసీ జీవనోపాధి పద్ధ తులు: సాధికారత సాధనలో సమస్యలు– వ్యూహాలు’అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి ధనసరి సీతక్క హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆదివాసీ బిడ్డగా ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉం దన్నారు. గత కొన్నేళ్లుగా ఆత్మగౌరవం కోసం ఆదివాసీ పోరాటాలు ఇపμటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అభివృద్ధి నమూనాలోనైనా వెనుకంజలో ఆదివాసీలు: హరగోపాల్ఏ అభివృద్ధి నమూనాలోనైనా ఆదివాసీలు వెనుకంజలోనే ఉన్నారని ప్రొఫెసర్ హర సదస్సులో మంత్రి సీతక్క,ప్రొఫెసర్ హరగోపాలæ తదితరులు గోపాల్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, ఆదివా సీల ప్రయోజనాల మధ్య ఎప్పుడూ వైరు ధ్యముంటుందని, ఇక్కడ నష్టపోయేది గిరిజ నులేనని ఆయన వివరించారు. కార్యక్రమం లో విశ్వవిద్యాలయ రిజి స్ట్రార్ సుధారాణి, అకడమిక్ డైరెక్టర్ పుషμచక్రపాణి, సదస్సు డైరెక్టర్ గుంటి రవీందర్, సామాజిక శాస్త్రం విభాగాధిపతి వడ్డా ణం శ్రీనివాస్, కో–డైరెక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. -
పెట్టుబడులతో రావాలి
సాక్షి, హైదరాబాద్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రవా సులు ఇకపై తెలంగాణకు అత్యధిక పెట్టుబడులతో రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపుని చ్చారు. ‘తెలంగాణ మీ జన్మభూమి. దేశంలో మీరు పెట్టే ప్రతి పెట్టుబడికి ప్రయోజనంతో పాటు మంచి ప్రతిఫలం కూడా ఉంటుంది. నైపుణ్యాలు, ప్రతి భా పాటవాలతో అమెరికాను సంపన్నంగా, పటి ష్టంగా మార్చిన ప్రవాసులు తెలంగాణలో సేవలు అందించాలి. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాము లైతే సంతృప్తి బోనస్‌గా లభిస్తుంది. కాంగ్రెస్ పాలనలో అపోహలు, ఆందోళనలకు తావు లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు కొత్త పారిశ్రా మిక విధానం తీసుకువస్తాం. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి మేలు జరిగేలా ఉపాధి కల్పన, నైపుణ్యాభిృద్ధికి కొత్త పాలసీలో ప్రాధాన్యత నిస్తాం. తెలంగాణను మెట్రో కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడుల కోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం. హైద రాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతాం. ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్‌తో హైదరాబాద్‌ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రవాసులు కలిసి రావాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ప్రవాస భారతీయులతో జరిగిన ఆత్మీయ సమ్మేళ నంలో ఆయన మాట్లాడారు. అపోహలు సృష్టించేవారికి బుద్ధి చెబుతాం..‘ఎన్నికల ముందు కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్లు విష ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని, వచ్చినా కొనసాగదని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తోందంటూ అపోహలు కల్పిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు వారివి అబద్ధాలని నిరూపిస్తాం. గత ఏడాది టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో అమెరి కాలో పర్యటించినప్పుడు.. తెలంగాణలో పదేళ్లుగా సాగుతున్న దుష్పరిపాలన, విధ్వంసాలకు విముక్తి కల్పిస్తానని మాట ఇచ్చా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తాననే మాట మేరకు మళ్లీ వచ్చా. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. హామీల అమల్లో భాగంగా ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేప ట్టాం. భవిష్యత్తు ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది..’ అని సీఎం చెప్పారు.సీఎంకు ఓవర్సీస్ కాంగ్రెస్ స్వాగతంఅమెరికాలో ముఖ్యమంత్రికి ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా విభాగం అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ నేతృత్వంలో వేలాది మంది ప్రవాసులు స్వాగతం పలికారు. సీఎంగా రేవంత్‌రెడ్డి పనితీరును అభినందించడంతో పాటు తెలంగాణలో పెట్టుబడుల కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్‌ను సీఎంగా చూడాలనే కోరిక తీరిందని, రాహుల్ గాంధీని భారత ప్రధానిగా చేసేందుకు అందరం కష్టపడదామని మొహిందర్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు తెలంగాణ సంస్కృతిని చాటేలా పాటలు పాడటంతో పాటు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కాగా అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతోనూ సీఎం సమావేశమయ్యారు.స్కిల్స్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా’యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ’ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రా మికవేత్త, పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర వ్యవహరి స్తారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా అంగీకారం తెలిపినట్లు న్యూజెర్సీలో జరి గిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఆయన బాధ్య తలు స్వీకరిస్తారని చెప్పారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపు ణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చి దిద్దేందుకు ఏర్పాటు చేసిన స్కిల్స్ యూని వర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రము ఖుడిని చైర్మన్‌గా నియమిస్తామని సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి విది తమే. కాగా ఇటీవల ఆనంద్ మహీంద్రాతో ఈ విషయమై రేవంత్ చర్చించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేయనున్న ‘ఫ్యూచర్ సిటీ’ పరిధిలోని బ్యాగరికంచె వద్ద స్కిల్స్ యూనివర్సిటీ భవనానికి సీఎం ఇటీవల శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. -
విస్తరణవాదం కాదు.. అభివృద్ధి కావాలి: మోదీ
న్యూఢిల్లీ: విస్తరణవాదం కాదు... అభివృద్ధి కావాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా చైనాకు చురక అంటించారు. తమ మద్దతు ఎల్లప్పుడూ అభివృద్ధికేనని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ, వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్చిన్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–వియత్నాం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర సహకారంపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. వియత్నంలో భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఇరువురు ప్రధానమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంధనం, సాంకేతికత, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాల్లో ఆరు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు చేశారు. మరో మూడు ఒప్పందాలను ఖరారు చేశారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం ఫామ్ మిన్చిన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. -
ముంబై, ఢిల్లీ సరసన హైదరాబాద్!
జీహెచ్ఎంసీలో ఉన్న ఉప్పల్ పక్కనే పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లు.. వాటి పక్కనే కొర్రెముల గ్రామ పంచాయతీ...ఆ తరువాత పోచారం మున్సిపాలిటీ. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని పరిస్థితి ఇది. ఒక దగ్గర 60 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ వెంటనే 40 ఫీట్ల రోడ్డు, డ్రైనేజీ.. ఆయా రోడ్లలో వరదనీటి కాలువల అనుసంధానమే లేదు. వివిధ సంస్థలు చేపట్టే పనులకు పొంతన ఉండట్లేదు. అందుకే ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న అర్బన్ పరిధిని ఒకే సంస్థ పరిధిలోకి తేవాలని నిర్ణయించాం. – ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ వంటి అతిపెద్ద నగరాల సరసన హైదరాబాద్ చేరబోతోంది. ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న ప్రాంతాన్ని ఒకే గొడుగు కిందకు తేవాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీలను కలిపి అతిపెద్ద కార్పొరేషన్‌గా రూపొందించాలని సీఎం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) పేరుతో ఇప్పటికే ఓ సంస్థను ఏర్పాటు చేశారు.2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జీహెచ్ఎంసీతోపాటు శివారు పురపాలికలు, గ్రామాల్లో విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించడం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో కీలకంగా వ్యవహరించేలా ఈ సంస్థకు విధులు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీహెచ్ఎంసీ, పురపాలికల్లో గ్రామాల విలీనానికి సంబంధించి సీఎం రేవంత్.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్కతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వనుంది. గ్రామాలు పురపాలికల్లో... ఆ తరువాత జీహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా రక్షణ శాఖ పరిధి నుంచి ప్రభుత్వ అ«దీనంలోకి వచి్చన సికింద్రాబాద్ కంటోన్మెంట్ 40.17 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. 2024 జనాభా అంచనాల ప్రకారం ఈ రెండింటిలో కలిపి 1.06 కోట్ల జనాభా ఉంది. ఇవి కాకుండా శివార్లలోని బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీని ఆనుకొని ఓఆర్ఆర్ లోపలే ఉన్నాయి.వాటితోపాటు మరో 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. విలీన ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పాలకమండళ్ల పదవీకాలం ముగిసిన పంచాయతీలను వాటికి సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయనున్నారు. ఆయా గ్రామాలను పురపాలికల్లో కలిపిన అనంతరం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ పూర్తికానుంది. ఓఆర్ఆర్ ఆవల ఉన్న కొన్నింటిని కూడా... హైడ్రా ప్రాజెక్టులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు సంగారెడ్డి జిల్లా పరిధిలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలు, ఓఆర్ఆర్ అవతల ఉన్న ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, దుండిగల్ వంటి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను కూడా కలిపారు. 33 గ్రామ పంచాయతీల్లో ఓఆర్ఆర్ ఆవల సైతం కొన్ని గ్రామాలు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీలో వాటి విలీనం ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం తేలుస్తుందని ఓ అధికారి తెలిపారు. విలీనమైతే భారీ నగరాల చెంతన ఓఆర్ఆర్ లోపలి పట్టణాలు, గ్రామాలు జీహెచ్ఎంసీలో విలీనమైతే ‘హైడ్రా’పరిధిలో జనాభా 1.29 కోట్లకు చేరుతుంది. గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం)లో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1.24 కోట్లుకాగా తాజా అంచనాల ప్రకారం ఈ జనాభా 1.75 కోట్లకు చేరవచ్చని తెలుస్తోంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీబీ) జనాభా కూడా 2011 లెక్కల ప్రకారం 1.10 కోట్లుగా ఉండగా తాజా లెక్కల్లో కోటిన్నరకు చేరుకొనే అవకాశం ఉంది.బృహత్ బెంగుళూరు (బీబీఎంపీ) జనాభా (2011 లెక్కలు) 68 లక్షలుకాగా జీహెచ్ఎంసీలో జనాభా 2011 లెక్కల ప్రకారం 69.93 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు విలీనమైతే ముంబై, ఢిల్లీ తరహాలో అధిక జనాభాగల నగరాల సరసన చేరనుంది. -
కేంద్ర బడ్జెట్ 2024-25 : మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్
కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పథకాలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో మాదిరిగానే పేదలు, మహిళలు, యువత, రైతులపై కేంద్రం దృష్టి సారిస్తుందని అన్ని తెలిపిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేకంగా, మహిళలు ,బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ రూ. 3 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, శ్రామిక మహిళల కోసం వర్కింగ్ విమెన్ హాస్ట్సల్‌ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తూ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికమంత్రి తెలిపరారు పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం , క్రెచ్‌ల స్థాపన ద్వారా వర్క్‌ఫోర్స్‌లో మహిళల అధిక భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తామన్నారు. అలాగే మహిళలకు నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలు,మహిళా ఎస్‌హెచ్‌జి సంస్థలకు మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి ఇది ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు.ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. 'ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్' కోసం మూడు పథకాలను కూడా ప్రకటించారు. ఉపాధి మరియు నైపుణ్యం కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ తొలి స్కీమ్ ‘ఎ’ ‘ఫస్ట్ టైమర్స్’ కోసం, ‘తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన’ కోసం స్కీమ్ ‘బి’ , యజమానులకు మద్దతిచ్చేందుకు స్కీమ్ ‘సి’ని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు స్కీంల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం, 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం లాంటివి ఇందులో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. -
వరల్డ్ క్లాస్ లుక్‌లో గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్
గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ త్వరలో వరల్డ్ క్లాస్ లుక్‌లో కనిపించనుంది. ఈ రైల్వే స్టేషన్‌ను రూ.498 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్లో పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నామని నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు, రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బడ్జెట్ హోటల్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా ఇక్కడకు వచ్చి సినిమాలు చూసేందుకు, షాపింగ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలేటర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇది ప్రత్యేక తరహా ఎస్కలేటర్. దానిపై నిలబడి నడవకుండానే ఒక చోట నుంచి మరో చోటికి చేరుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులతో సహా ప్రయాణికులంతా ట్రావెలేటర్ను వినియోగించుకోవచ్చు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. 2023 జూలై 7న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పలు రంగాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఫ్రంట్ రన్నర్‌గా ముందుకు దూసుకుపోతోంది. 2020–21తో పోల్చితే 2023–24లో పేదరికం, మాతా శిశు మరణాల రేటు భారీగా తగ్గింది. ఆస్పత్రుల్లో కాన్పులు పెరగడంతో పాటు పిల్లలకు నూరు శాతం రోగ నిరోధక శక్తి టీకాలు విజయవంతంగా వేయించింది. విద్యలో నాణ్యత పెరగడంతో పాటు ఎలిమెంటరీ, ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్ పెరిగింది. రాష్ట్రంలో 80 శాతానికి పైగా కుటుంబాలకు ఆరోగ్య భరోసా లభించింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయా రంగాల్లో తీసుకున్న విప్లవాత్మక చర్యలే ఇందుకు కారణం. ఈ మేరకు నీతి ఆయోగ్ విడుదల చేసిన 2023–24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ నిర్ధేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి సమీక్షించారు. అంతటితో ఆగకుండా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను అనుసంధానం చేశారు. నవరత్నాలతో పేదరికం.. మాతా శిశు మరణాలు తగ్గించడం, నాణ్యమైన విద్య, అర్హులందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీని వర్తింప చేయడం, ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలాగ చర్యలు తీసుకోవడంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల్లో నిలిచింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన మూడో నివేదికతో పోల్చితే నాలుగో నివేదికలో పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పురోగతిలో దూసుకుపోతున్నట్లు స్పష్టమైంది. పేదరికం శాతం 15.60 నుంచి 2023–24 నాటికి 6.06 శాతానికి తగ్గింది. పేదరికం తగ్గించడంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్‌లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 80.20% కుటుంబాలకు ఆరోగ్య భరోసా ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య బీమా పధకాన్ని 80.20 శాతం కుటుంబాలకు వర్తింప చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది. అంతకు ముందు 74.60 శాతం కుటుంబాలకే ఆరోగ్య బీమాను వర్తింప చేశారని పేర్కొంది. మాతా శిశు మరణాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ ఐదు రాష్ట్రాల్లో ముందుంది. ప్రతి లక్ష జననాలకు ప్రసూతి మరణాల నిష్పత్తి 65 నుంచి 45కు ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిందని, ప్రతి వెయ్యి సజీవ జననాల్లో ఐదేళ్లలోపు శిశు మరణాలు 33 నుంచి 27కు తగ్గాయని నివేదిక తెలిపింది. ఈ లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలను సాధించినట్లు నివేదిక వెల్లడించింది. 9 నుంచి 11 నెలల పిల్లలకు రోగ నిరోధక శక్తి టీకాలు ఇప్పించడంలో 87 శాతం నుంచి నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించిందని నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..» ఆస్పత్రుల్లోనే 99.98 శాతం కాన్పులు » 87.98 శాతం నుంచి 96.90 శాతానికి పెరిగిన ఎలిమెంటరీ ఎన్రోల్మెంట్ » 46.84 శాతం నుంచి 56.70 శాతానికి పెరిగిన ఉన్నత సెకండరీ ఎన్రోల్మెంట్ » స్కూల్స్‌లో 91.26 శాతం నుంచి 98.80 శాతానికి పెరిగిన తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు » సెకండరీ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం 75.18 నుంచి 82.50కి పెరుగుదల » నూటికి నూరు శాతం మెరుగు పడిన గ్రామీణ జనాభాకు తాగునీటి సరఫరా » పీడబ్ల్యూఎస్ ద్వారా 73.38 శాతం కుటుంబాలకు వారి ప్రాంగణాల్లోనే సురక్షిత తాగునీరు » 44.17 శాతం నుంచి 28.30 శాతానికి తగ్గిన భూగర్భ జలాల వెలికితీత » నూరు శాతం మందికి సరసమైన ధరలకు స్వచ్ఛమైన ఇంధనం సరఫరా » విద్యుత్ కనెక్షన్లలో నూటికి నూరు శాతం లక్ష్య సాధన » ఎల్పీజీ, పీఎస్జీ కనెక్షన్లలలో 103.56 శాతం లక్ష్య సాధన » స్థిర ధరల ఆధారంగా 3.84 శాతం నుంచి 4.05 శాతానికి పెరిగిన తలసరి జీడీపీ వార్షిక వృద్ధి రేటు » 5.70 శాతం నుంచి 4.40 శాతానికి తగ్గిన 15–59 ఏళ్ల మధ్య నిరుద్యోగిత » రాష్ట్ర మొత్తం స్తూల ఉత్పత్తి విలువలో 9.5 శాతం నుంచి 12.79 శాతానికి పెరిగిన తయారీ రంగం విలువ » ప్లాస్టిక్ వ్యర్థాలు 1.27 టన్నుల నుంచి 0.75 టన్నులకు తగ్గుదల (ఏటా ప్రతి 1000 మందికి లెక్కన) » సున్నా నుంచి 0.25 శాతానికి పెరిగిన మడ అడవుల విస్తీర్ణం » 17.88 శాతం నుంచి 18.28 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం -
వరంగల్ అభివృద్ధిపై సమీక్ష.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, వరంగల్: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వరంగల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలన్నారు.ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్న సీఎం. స్మార్ట్ సిటీ మిషన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20 రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించిన సీఎం.. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వరంగల్‌లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్న సీఎం.. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా: కేంద్ర సహాయ మంత్రి
-
అమరావతికి రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పాత మాస్లర్ ప్లాన్ ప్రకారమే రాజధానిలో నిర్మాణాలు చేపడతామన్నారు.మూడు దశల్లో రాజధాని పనులు పూర్తి చేసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రపంచంలో ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. అత్యుత్తమ డిజైన్ రూపొందించి సింగపూర్, చైనా, జపాన్, రష్యా, మలేసియా తదితర దేశాలను సందర్శించామన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామని, తొలిదశలో భాగంగా రూ.48 వేల కోట్లతో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు.తొలిదశ పనులకు గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు రూ.9 వేల కోట్ల చెల్లింపులు కూడా చేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తైనట్లు పేర్కొన్నారు. తొలి దశలో సిటీ నిర్మాణం పూర్తి చేసి రెండో దశలో మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. రాజధాని విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌నే ఇప్పుడూ అమలు చేస్తామని, అయితే అంచనా వ్యయాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాల్సి ఉందన్నారు. 217 చ.కి.మీ మేర అమరావతి నిర్మాణం రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇవ్వగా అదే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఎలాంటి వివాదాలు లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. మొత్తం 217 చ.కి.మీ విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపడతామని, సుమారు 3,600 కి.మీ మేర రోడ్లు నిరి్మస్తామని వివరించారు.రూ.48 వేల కోట్లతో చేపట్టిన ఈ తొలిదశ పనులు పూర్తవగానే రెండో దశలో గన్నవరం విమానాశ్రయాన్ని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ఖర్చు గత మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనా వేశామని, మరోసారి టెండర్లు పిలిచి సవరించే అవకాశం ఉందన్నారు. అధికారులతో సమీక్షించి 15 రోజుల్లో దీనిపై పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియ చేస్తామన్నారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్షి్మ, సీడీఎంఏ శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ కట్టా సింహాచలం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్లు ఎన్వీఆర్కే ప్రసాద్, సీహెచ్ ధనుంజయ్ తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై అంచనాలకు ఆదేశం అన్న క్యాంటీన్లను మూడు వారాల్లోగా వంద చోట్ల పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా 184 చోట్ల ప్రారంభించినట్లు చెప్పారు. వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రెండు మూడు రోజుల్లో అంచనాలు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
‘మహా’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర విస్తరణ, అభివృద్ధికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశలో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు హెచ్ఎండీఏలోని వివిధ విభాగాలను బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో సుమారు 7,200 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ సేవలు విస్తరించి ఉన్నాయి.ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరిగితే ఇది 10 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం, ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యను కూడా పెంచవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట కీలకమైన సంస్థ ప్రణాళికా విభాగాన్ని విస్తరించడం ద్వారా సేవలను మరింత పారదర్శకం చేయనున్నారు. ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో శంకర్పల్లి, ఘటకేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులన్నీ ఈ నాలుగు జోన్ల నుంచే లభిస్తాయి.వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధి గతంలో కంటే ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగింది. కానీ ఇందుకనుగుణంగా జోన్లు, ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాత్రం పెరగలేదు. దీంతో అధికారులపై పని ఒత్తిడి బాగా ఎక్కువైంది. వందల కొద్దీ ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. టీజీబీపాస్ (తెలంగాణ బిల్డింగ్ పరి్మషన్ అండ్ సెల్ఫ్ సరి్టఫికేషన్ సిస్టమ్) ద్వారా వచ్చే దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న 4 జోన్లను 8కి పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. నలువైపులా అభివృద్ధి పడమటి హైదరాబాద్‌కు దీటుగా తూర్పు, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే రాబోయే రోజుల్లో సుమారు 3 కోట్ల జనాభా అవసరాలకు నగరం సరిపోతుందని అంచనా. ఈ క్రమంలో హెచ్ఎండీఏ బాధ్యతలు మరింత పెరగనునున్నాయి. టౌన్íÙప్ల కోసం ప్రణాళికలను రూ పొందించడం, రోడ్డు, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం, లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయడం వంటి కీలకమైన ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. అన్ని వైపులా టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే నగర అభివృద్ధి సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏలో ప్రణాళికా విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ‘అధికారు లు, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సేవల్లో పారదర్శకతను పెంచాల్సి ఉంది. అప్పు డే ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించగలం..’అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.జోన్ల విస్తరణ ఇలా..ప్రస్తుతం ఉన్న ఘట్కేసర్ జోన్లో మరో కొత్త జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్ జోన్లను కూడా రెండు చొప్పున విభజించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 8 జోన్లను ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు ఉన్న ప్రతిపాదన.. మొదట 6 వరకు ఆ తర్వాత 8కి పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులను ఇక నుంచి పూర్తిగా ఆన్లైన్లో టీజీ బీపాస్ ద్వారానే ఇవ్వనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి చేసే లే అవుట్లు, భవనాలకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా కూడా అనుమతులను ఇస్తున్నారు. ఈ నెలాఖరుతో డీపీఎంఎస్ సేవలను నిలిపివేయనున్నారు. హెచ్ఎండీఏలోని 7 జిల్లాల్లో ఉన్న 70 మండలాలు, సుమారు 1,032 గ్రామాల్లో టీజీబీపాస్ ద్వారానే అనుమతులు లభించనున్నాయి. -
‘క్రూయిజ్’కు పెరుగుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: పర్యాటకుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికల ఫలితంగా క్రూయిజ్ పర్యాటకం దేశంలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల మంది క్రూయిజ్‌లో ప్రయాణించడమే ఇందుకు నిదర్శనం. ఇది కరోనా ముందు 2019–20లో 4.20 లక్షల మంది క్రూయిజ్ ఫుట్‌ఫాల్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. ఈ క్రమంలోనే 2041 నాటికి 40లక్షల మందిని క్రూయిజ్‌లో పర్యటించేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.లోతైన సముద్ర క్రూయిజ్‌లు, తీర ప్రాంత క్రూయిజ్‌లు, రివర్ క్రూయిజ్‌లు, యాచ్ క్రూయిజ్లలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్ల పెట్టుబడితో రివర్ క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం కోర్డెలియా, కోస్టా క్రూయిజ్ వంటి క్రూయిజ్ లైన్లు ప్రస్తుతం అరేబియా సముద్రంలో దేశీయ విహార యాత్రలను నిర్వహిస్తున్నాయి.దేశీయంగా పెరుగుదల..గడిచిన ఆర్థిక సంవత్సరంలో 80 శాతం మంది దేశీయంగానే ప్రయాణించారు. ఇందులో 29వేల మంది మాత్రమే అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం ఇంకా కోవిడ్‌కు మునుపటి స్థాయిలో చేరకపోవడంతో విదేశీ పర్యాటకులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ పర్యాటకులలో క్రూయిజ్‌లకు ఆదరణ పెరుగుతోంది. 2019–20లో 50 శాతం దేశీయ, 50 శాతం అంతర్జాతీయ క్రూయిజ్ పర్యటనలు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే తాజాగా దేశీయ పర్యాటకులు దాదాపు 85శాతం పెరిగారు. సింగపూర్ వంటి దేశాలలో క్రూయిజ్ పరిశ్రమకు భారతీయ పర్యాటకులు కీలకంగా ఉన్నారు. అయితే అబుదాబి కూడా భారతీయ పర్యాటకులను తన క్రూయిజ్ ఆఫర్లకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.క్రూయిజ్ పర్యటనలు ఇలా..ముంబై, గోవా, న్యూ మంగళూరు, కొచ్చి, విశాఖ పోర్టులకు అంతర్జాతీయ క్రూయిజ్ షిప్‌ల రాక పెరుగుతోంది. దేశీయ క్రూయిజ్‌లు ముంబై–గోవా, ముంబై–డయ్యూ, ముంబై–కొచ్చి, ముంబై–లక్ష ద్వీప్, ముంబై–హై సీస్, చెన్నై–వైజాగ్ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. నది క్రూయిజ్ టూరిజం కోసం తొమ్మిది జలమార్గాలను గుర్తించారు. వాటిలో గంగానదిపై వారణాసి–హలి్దయా, బ్రహ్మపుత్రలోని ధుబ్రి–సాదియా మార్గాలున్నాయి. గుజరాత్ తీర్థయాత్ర పర్యటనలు, పశ్చిమ తీర సాంస్కృతిక, సుందరమైన పర్యటనలు, సౌత్ కోస్ట్ ఆయుర్వేద వెల్నెస్ పర్యటనలు, తూర్పు తీర వారసత్వ పర్యటనలు వంటి థీమ్–ఆధారిత పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.అందుబాటులో విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్..దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దేశీయ, అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం అందుబాటులో ఉంది. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులకు విశేష సేవలందిస్తోంది. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సుమారు 2వేల మంది ప్రయాణికులకుపైగా సామర్థ్యం ఉన్న నౌకలకు వసతి కల్పిస్తోంది. -
అభివృద్ధి.. అప్పులు.. ఆరోపణలు పయనం పదేళ్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరి దశాబ్ద కాలం గడిచింది. అరవై ఏళ్ల పట్టుదలకు, పోరాటాలకు ప్రతిరూపంగా.. ముక్కోటి మంది మనోభావాలకు నిలువుటద్దంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఈ పదేళ్లలో బుడిబుడి అడుగులనుంచి సాధికారత వైపు పయనించింది. బాలారిష్టాలను దాటుకుని ప్రగతి నమూనాను ఆవిష్కరించే దిశగా ముందడుగు వేసింది. అనతి కాలంలోనే అగ్రరాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. అప్పులు పెరుగుతున్నాయనే ఆందోళన ఉన్నా.. కొన్ని అంశాల్లో వివాదాలు, ఆరోపణలు ఉన్నా.. ప్రగతిపథంలో దూసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న నేపథ్యంలో.. ఇన్నేళ్లలో మారిన ముఖచిత్రం, కీలక రంగాల్లో జరిగిన పరిణామాలపై ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్వెలుగు.. చీకట్లుతెలంగాణ ఏర్పడితే చీకట్లో బతకాల్సిందేనన్న కొందరు నేతల విమర్శలను తిప్పికొట్టేలా రాష్ట్ర విద్యుత్ రంగం ఎదిగింది. సంప్రదాయేతర విద్యుత్‌కు పెద్దపీట వేయడంతో వేల మెగావాట్ల సౌర విద్యుత్, పవన విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. అలాగే భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తెలంగాణ విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశలో పొరపాట్లు జరిగాయన్న విమర్శలు, ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. అదే సమయంలో అతి తక్కువ కాలంలో ప్రాజెక్టులు పూర్తయి నీటిని అందించారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.వివాదాల మధ్య తనదైన ముద్రకీలక రంగాల్లోనే కాదు.. మరెన్నో అంశాల్లో తెలంగాణ తనదైన ముద్రను వేసింది. 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయ నిర్మాణం, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు, పోడు పట్టాల పంపిణీ, పామాయిల్ సాగుకు ప్రోత్సాహం, మిషన్ భగీరథ, సమీకృత జిల్లా కలెక్టరేట్లు, నూతన జోనల్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ సెంటర్, భరోసా కేంద్రాలు, మోడల్ శ్మశాన వాటికలు, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా, పల్లె–పట్టణ ప్రగతి, యాదాద్రి ఆలయ అభివృద్ధి, బతుకమ్మ చీరలు, మెట్రో రైలు, హరితహారం లాంటి కార్యక్రమాలతో వేగంగా ముందుకు కదిలింది. రాజకీయాలు, వివాదాలు, విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ముందుకెళ్లాలని... సామాజిక, ఆర్థిక అసమానతలు లేని ‘సమున్నత తెలంగాణ’ అతి త్వరలోనే ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిద్దాం.అత్యధిక గురుకులాలుతెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలైంది. దేశంలోనే అత్యధిక గురుకులాలున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. అన్ని రకాల విద్యా సంస్థలు, హాస్టళ్లకు సన్న బియ్యం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందుతున్నాయి. మన ఊరు– మన బడి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్య పట్ల ప్రజలను ఆకర్షితులను చేసే ప్రయత్నాలు జరిగాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నీచర్, కాంపౌండ్ వాల్స్, కిచెన్షెడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం గత పదేళ్లలో మంచి ప్రయత్నమే జరిగింది.‘ఐటీ’లో దాటేసి..తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో, అందులోనూ ప్రధానంగా ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరును దాటేసి.. హైదరాబాద్ ఐటీ రంగం ముందుకు వెళ్తోంది. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటిపోయిందని రికార్డులు చెప్తున్నాయి. ఐటీ ఎగుమతులకు సంబంధించి 2030 సంవత్సరానికి పెట్టుకున్న లక్ష్యాలు కూడా ఇప్పటికే దాటిపోవడం గమనార్హం. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని రానున్నాయి.‘ఆసరా’కు యత్నాలుతెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచీ ఆపన్నులకు మరింత ‘ఆసరా’ అందుతోంది. సంక్షేమ కార్యక్రమాల అమలు పెరిగింది. దళితబంధు, బీసీ బంధు వంటి పథకాలు పెద్దగా విజయవంతం కాకపోయినా.. మిగతా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ ఖజానా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు.. ఇలా అవసరమున్న వారందరికీ ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్ అందుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వర్గాలకు ఆసరా పథకం కింద పింఛన్లు అందుతున్నాయి.ఇవి వారి ఆర్థిక అవసరాలకే కాకుండా సామాజిక భద్రతకు ఆలంబనగా నిలుస్తున్నాయి. ఆసరా పింఛన్ల కోసం ఏటా తెలంగాణ ఖజానా నుంచి దాదాపు రూ.12 వేల కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేద వర్గాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఇప్పటివరకు రూ.12వేల కోట్ల వరకు అందజేశారు.కులాంతర వివాహాలకు ప్రోత్సహకాలు, అంబేడ్కర్ భవనాలు, హాస్టళ్లు, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు, స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలలు, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, అధికారికంగా ఆదివాసీల పండుగలు, గొల్లకుర్మలకు సబ్సిడీ గొర్రెలు, ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ, నేతన్నలకు బీమా, సెలూన్లకు ఉచిత విద్యుత్, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు, వేద పండితులకు గౌరవ భృతి, మౌజమ్, ఇమాంలకు గౌరవ వేతనం.. ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.2 కోట్ల ఎకరాలకు సాగుతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కనిపించిన అతి పెద్ద మార్పు భారీగా ధాన్యం ఉత్పత్తి. 2014లో తెలంగాణలో 99.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తికాగా.. పదేళ్ల తర్వాత అది 2.48 కోట్ల టన్నులకు చేరింది రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి.. 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు చేరింది. వరి సాగు విస్తీర్ణం 49.63 లక్షల ఎకరాల నుంచి 97.97 లక్షల ఎకరాలకు పెరిగింది. గతంలో నిర్మించిన ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 15లక్షల ఎకరాల్లో పెరిగిన భూగర్భజలాలు వంటివి ఇందుకు దోహదపడ్డాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. దేశంలో తెలంగాణ మార్క్‌ను చూపిన రైతుబంధు పథకం.. రైతులు పంటలు వేసేందుకు పెట్టుబడి సాయంగా ఇతోధికంగా దోహదపడుతోంది.ఇప్పటివరకు ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తుండగా.. కొత్త ప్రభుత్వం దాన్ని రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించింది. ఇక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు రుణ మాఫీ, రైతు వేదికలు, సమీకృత మార్కెట్ల నిర్మాణం, గోదాముల సామర్థ్యం పెంపు, ధాన్యం సేకరణ వంటివి కూడా వ్యవసాయానికి అండగా నిలిచాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్లలో తెచ్చిన మార్పులు, భూరికార్డుల నిర్వహణ కోసం అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్ పలు వివాదాలకు కారణమైనా.. వ్యవసాయ, రెవెన్యూ వర్గాలను అనుసంధానం చేసే దిశలో సాగాయని నిపుణులు అంటున్నారు.కంటి వెలుగులు.. ఫ్రీ డయాలసిస్లుతెలంగాణ ఏర్పాటయ్యాక వైద్య రంగం అభివృద్ధి వైపు పయనించింది. పల్లె దవాఖానాలు, పట్టణ దవాఖానాల ఏర్పాటుతో వైద్యం పేదల ముంగిటకు చేరింది. కంటి వెలుగు పథకం పేదల చూపునకు అండగా నిలిచింది. తెలంగాణ డయాగ్నస్టిక్స్ పేరుతో పేదలకు ఉచితంగా రక్త పరీక్షల కార్యక్రమం వివిధ వ్యాధుల బాధితులను గుర్తించింది. నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఆస్పత్రుల్లో 4 వేల పడకలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో 2 వేల పడకలు, కొత్త ఏరియా, జిల్లా ఆస్పత్రుల ఏర్పాటు, విస్తరణ, పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు రాష్ట్ర వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడ్డాయి.తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఒకటి ఉచిత డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 102కు చేరింది. ఇక పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు కూడా గత పదేళ్లలో అభివృద్ధికి సూచిక. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా.. ఇప్పుడు తెలంగాణలోని 33 జిల్లాల్లో కలిపి 34 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. 2014కు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే.. ఇప్పుడు 8,515 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. -
ఐదేళ్ళ లో అంచెలంచెలుగా ఎదిగిన మత్స్యకారులు
-
మూడో నేత్రానికి 'మామయ్య' రాచబాట
‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది విజయనగరం శివారు జమ్మునారాయణపురానికి చెందిన అల్లం రామకృష్ణారెడ్డి కుటుంబం. భార్య ఉదయలక్షి్మ, ఇద్దరు కుమార్తెలు. తన పిల్లలను పెద్ద చదువులు చెప్పించి ప్రయోజకులను చేయాలన్నది ఆయన తపన. ప్రైవేటు సంస్థలో మెకానిక్‌గా పనిచేసే రామకృష్ణారెడ్డికి వచ్చే కొద్దిపాటి ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతుంది, పిల్లలను చదివించుకునేందుకు ఎన్నో ఆరి్థక కష్టాలు పడేవారు. వైఎస్ జగన్ సీఎం కాగానే వచి్చన అమ్మఒడితో తన పిల్లల చదువు కష్టాలు తీరిపోయాంటున్నారాయన. పెద్ద కుమార్తె హోషితారెడ్డి జగనన్న విద్యా దీవెన పథకంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతుండగా, చిన్న కుమార్తె రిషితారెడ్డి స్థానిక కస్పా మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పదో తరగతిలో 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది.గతేడాది ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి పంపిన 10 మంది విద్యార్థుల బృందంలో రిషితారెడ్డి కూడా ఒకరు. ‘ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారనేదానికన్నా ఈ పరీక్షలో విజయం సాధిస్తే జగనన్నను కలిసే అవకాశం దొరుకుందని భావించి అర్హత పరీక్షను పట్టుదలతో రాశాను. ఆమెరికా వెళుతున్నాన్న ఆనందం కంటే.. ఇలాగైనా జగన్ సర్‌ను కలుస్తానన్న ఆనందమే ఎక్కువగా ఉంది’ అని రిషితారెడ్డి తన సంతోషాన్ని పంచుకుంది. తల్లి ఉదయలక్ష్మి మాట్లాడుతూ ‘చాలీచాలని ఆదాయంతో ఇద్దరు పిల్లల చదువులు ఎలా అని బెంగ పడేవాళ్లం.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ స్కూళ్లు చాలా బాగుపడ్డాయి. మా పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదువుకుని ఉన్నతంగా రాణించారు. రిషితా కూడా నూజివీడు ట్రీపుల్ ఐటీలోనే చేరింది’ అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మి దంపతులు. వీరే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యలో వచి్చన మార్పులు, సంస్కరణలతో పిల్లలను అద్భుతంగా చదివించుకుంటున్న లక్షలాది మంది తల్లిదండ్రుల అభిప్రాయం కూడా ఇదే’. నానాజీ అంకంరెడ్డి, సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఈ ప్రభుత్వం సర్కారు బడుల రూపురేఖలను మార్చేసింది. చదువుకునే ఆసక్తే అర్హతగా నిర్ణయించి, ప్రతి పేదింటి బిడ్డను ఉన్నత చదువులు చదివిస్తోంది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత దేశంలో ఏపీకి మాత్రమే దక్కింది. కార్పొరేట్ విద్యారంగం ఈర్ష పడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 12 రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ఒక్క ఏపీలోనే సాధ్యమైంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌ను సైతం అమలు చేయనుంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది.ప్రతి విద్యార్థి అంతర్జాతీయంగా ఎదిగేందుకు ఇంగ్లిష్ ల్యాబ్స్‌తో పాటు టోఫెల్ శిక్షణను అందిస్తోంది. గోరుముద్దతో వారంలో ఆరు రోజులు 16 రకాల వంటకాలతో పోషకాహారం అందిస్తోంది. బైలింగ్వుల్ టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లి‹Ùను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. ఏపీలోని విద్యా సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐక్యరాజ్య సమితిలో సైతం ప్రపంచ దేశాలు అభినందించాయి. ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఈ మార్పును అద్భుతమైన సంస్కరణగా కొనియాడుతున్నారు. నాడు–నేడుతో బడులకు కొత్త సొబగులువిద్యార్థులు చదివేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచేలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 12 సదుపాలను కలి్పంచింది. నిరంత నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించి పాఠశాల వాతావరణాన్ని అభ్యసన కేంద్రాలుగా మార్చింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించి ప్రజలకు అంకితం చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు. ప్రపంచ టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణవిద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది.నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా ప్రభుత్వం నియమించింది. అంగన్వాడీ నుంచి పాఠ్యాంశాలు సంస్కరణమూస పద్ధతిలో సాగుతున్న పాఠాల బోధనను 2020–21 నుంచి మార్చింది. కొత్త పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పొందుపరిచి, పౌండేషనల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను రూపొందించి అమలు చేస్తోంది. పీపీ–1, పీపీ–2 విధానం అమలు చేసేలా 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు భారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’పై ఇఫ్లూ, రివర్సైడ్ లెరి్నంగ్ సెంటర్ల నిపుణలతో శిక్షణనిచి్చంది. జగనన్న ‘గోరుముద్ద’..ఇదో నూతన ఒరవడి ⇒ పేద పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే ‘గోరుముద్ద’ పథకాన్ని రూపొందించారు. ⇒ 45 వేల పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ⇒ విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం వడ్డన ⇒ సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూ చొప్పున 16 రకాల పదార్థాలు గోరుముద్దలో చేర్చారు. ⇒ ఏ రోజు ఏయే పదార్థాలు పెట్టాలో మెనూలో స్పష్టంగా పేర్కొన్నారు. ⇒ రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ అందజేత ⇒ ఉడికించిన గుడ్డు ఐదు రోజులు తప్పనిసరిగా అందజేత ⇒ మారిన మెనూతో ప్రతిరోజు సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. ⇒ మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. ⇒ ప్రతి గురువారం బడి పిల్లలను ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి పరీక్షలు ⇒ రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలన. ⇒ గత ఐదేళ్లలో పాఠశాల విద్యార్థుల్లో దాదాపుగా తగ్గిపోయిన రక్తహీనత ⇒ గత ప్రభుత్వం 2014–2019 మధ్య పిల్లల భోజన ఖర్చు ఏడాది వ్యయం రూ.450 కోట్లే ⇒ అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది రూ.1,400 కోట్లకు పెంచింది. ⇒ వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ⇒ ఈ ఐదేళ్లల్లో గోరుముద్దకు రూ.6995.34 కోట్ల నిధులు ఖర్చు సీబీఎస్ఈ బోధన, మండలానికో జూ.కాలేజీ ⇒ విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడేందుకు మొదటి విడతలో 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ⇒ హైసూ్కల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోను బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. ⇒ 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ⇒ మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్ను ప్రవేశపెట్టారు. ⇒ 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలు గరల్స్ జూనియర్ కళాశాలలుగా మార్పు ⇒ మొత్తంగా 679 మండలాల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి ..బాలికలు ‘స్వేచ్ఛ’గా ఎదిగేలా.. ⇒ దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడి ⇒ రాష్ట్రంలోనూ పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్‌కు ఇదే కారణం ⇒ ఈ సమస్యలు, నివారణపై ప్రతి పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసుల ద్వారా విద్యారి్థనులకు అవగాహన ⇒ డ్రాప్ అవుట్స్‌కు కారణంగా ఉన్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ‘స్వేచ్ఛ’ పథకం ప్రారంభం ⇒ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్ అందజేత ⇒ వీటికోసం ఏడాదికి 12 కోట్ల ఫ్యాడ్స్‌ను బాలికలకు ఉచితంగా అందజేత ⇒ గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా టాయిలెట్లు ⇒ టాయిలెట్ల లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు. ⇒ మనబడి నాడు–నేడు ప్రాజెక్టుతో ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం ⇒ ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచి్చనట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు ⇒ 45,137 పాఠశాలల్లో బాలికలు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటన ⇒ ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి. ⇒ 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. ⇒ డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది.‘డిజిటల్’లో దుమ్ము దులిపేలా బోధన⇒ బ్లాక్ బోర్డులపై రాసే సుద్ద ముక్కలు సరఫరా లేక ఇబ్బంది పడిన ప్రభుత్వ బడిలో నేడు డిజిటల్ బోధన సాగుతోంది. ⇒ నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్‌పీ)తో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ⇒ ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. ⇒ నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం. ⇒ దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ విప్లవం. ⇒ ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి, ఇంటి వద్దా డిజిటల్ పాఠాలు నేర్చుకునే అవకాశం కలి్పంచింది. ⇒ డిజిటల్ పాఠాలను ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూస్తున్నారు. ⇒ ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. ⇒ విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ⇒ ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లి‹Ù, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను సునాయాసంగా నివృత్తి చేస్తోంది. సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్ శిక్షణ⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించింది. ⇒ అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. ⇒ ప్రాధమిక స్థాయి నుంచి ఇంగ్లి‹Ùపై పట్టు సాధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు యూఎస్ఏకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సరీ్వసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ⇒ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణనిస్తున్నారు. ⇒ ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ⇒విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించి ఉత్తమ శిక్షణనిస్తోంది. ⇒ఇందుకోసం అర్హత గల 25 వేల మందికి పైగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి హైసూ్కళ్లల్లో నియమించింది. అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు⇒ విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలు ⇒మనబడి నాడు–నేడు’లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు ⇒ రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ⇒ ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ⇒వారికి అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభం ⇒నవరత్నాల పథకంలో ఒకటి నుంచి ఇంటరీ్మడియట్ వరకు పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6349.6 కోట్లు జమ ⇒ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే గాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారీకీ అమ్మ ఒడి అమలు చేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు రూ.26,067 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ ⇒విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ⇒ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటినవారి ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది.⇒ 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందజేత ⇒ 2024 మార్చిలో విడుదలైన ఫలితాల్లోనూ దాదాపు 35 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలు, జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధన -
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
ఐదేళ్లూ అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడి చంద్రబాబు సర్కార్ అధోగతిపాలు చేసిన రాష్ట్రాన్ని.. గత 59 నెలలుగా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు.. సుపరిపాలనతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, నీతి ఆయోగ్ నివేదికలే అందుకు నిదర్శనం. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాల పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు దారిద్య్రం నుంచి బయట పడుతున్నారు.రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు సర్కార్ హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,51,173లు ఉంటే.. సీఎం జగన్ హయాంలో 2022–23 నాటికి రూ.2,19,518కు పెరిగింది. కేంద్రం జీడీపీలో రాష్ట వాటా చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 4.82 శాతానికి పెరిగింది.సీఎంజగన్ అధికారంలోకి వచి్చనప్పటి నుంచి సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఎగుమతుల్లో రాష్ట్రం చంద్రబాబు హయాంలో తొమ్మిదో స్థానంలో నిలిస్తే.. సీఎం జగన్ హయాంలో ఐదో స్థానానికి చేరుకుంది. పరిశ్రమల స్థాపన కోసం చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు వస్తే.. సీఎం జగన్ హయాంలో ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎంఎస్ఎంఈలు చంద్రబాబు హయాంలో 1.9 లక్షలు ఉంటే.. సీఎం జగన్ హయాంలో ఏడు లక్షలకు చేరుకున్నాయి. పాపారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతుండటంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. రాష్ట్రంలో పీఎఫ్ ఖాతాలు చంద్రబాబు హయాంలో 44.85 లక్షలు ఉంటే.. సీఎం జగన్ హయాంలో 2022–23 నాటికి 60.73 లక్షలకు పెరిగాయి. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉంటే.. ఇప్పుడు అది 4.2 శాతానికి తగ్గింది.రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన సీఎం జగన్ విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. దాంతో వ్యవసాయాభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోంది. దేశంలో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 36 శాతం ఉంది. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరాకు ఏటా సగటున రూ.8,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఉచిత పంటల బీమా, ఆర్బీకేలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని నీతి ఆయోగ్ అభినందించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజ గ్రూపులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. అచ్యుతాపురం వద్ద జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్, అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, లారస్ ల్యాబ్, విజయనగరంలో శారదా మెటల్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బలభద్రపురంలోగ్రాసిమ్ ఇండస్ట్రీస్, కాకినాడలో లూఫిస్ ఫార్మా, గుంటూరు జిల్లాలో ఐటీసీ స్పైసెస్ పార్కు, పిడుగురాళ్ల వద్ద శ్రీ సిమెంట్స్, నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ, క్రిభ్కో ఇథనాల్, గ్రీన్‌ల్యామ్ సొల్యూషన్స్, గోకుల్ ఆగ్రో ప్రారంభం అయ్యాయి. చిత్తూరులో బ్లూస్టార్, డైకిన్, హావెల్స్, యాంబర్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్, టీసీఎల్, వైఎస్సార్ జిల్లాలో డిక్సన్, సెంచురీ ప్లైవుడ్స్, బిర్లా గార్మెంట్స్, కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ వంటి భారీ పెట్టుబడులు వచ్చాయి. -
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
-
అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...
-
తీరం మారింది
ఆ తీర ప్రాంతమంతా మత్స్యకారుల ఆవాసం.. చేపల వేట వారి జీవనాధారం అయితే వేటాడిన చేపలు వెంటనే అమ్ముకోవడం తప్ప వేరే దారి లేదు. వారి వేట సామగ్రికి రక్షణ లేదు. వారి జీవితాలే గాలి వాటంగా మారిపోయాయి. అలాంటి వారి జీవితాలలో 2019వ సంవత్సరం వెలుగులు నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎటువంటి సౌకర్యాలు లేని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం ఇప్పుడు దేశం గర్వించదగ్గ తీర ప్రాంతంగా మారింది. రాష్ట్రానికి మత్స్యసంపద ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చి పెట్టే ఒక ప్రముఖ ప్రాంతంగా ఉప్పాడ తీరం చరిత్ర సృష్టించబోతోంది. పిఠాపురం: మాకు మాట ఇచ్చారు... అన్న వచ్చారు... చెప్పినదానికంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జాలర్లు జై కొడుతున్నారు. సుమారు 50 ఏళ్లుగా ప్రధాన సమస్యగా ఉన్న ఉప్పాడ మినీ హార్బర్ నిర్మాణం సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కార్యరూపం దాలి్చంది. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ హార్బర్‌ను నిర్వించడం విశేషం. మినీ హార్బర్ నిరి్మస్తామని చెప్పినా మేజర్ హార్బర్ నిరి్మంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ హయాంలో... 2014లో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తీరుస్తామని మినీ హార్బర్ నిరి్మస్తామని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మినీ హార్బర్ ఊసెత్తలేదు. రూ.50 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకున్నారు. డీజిల్ సబ్సిడీ, వేట నిషేధ పరిహారం, ప్రమాదవశాత్తు మరణించిన వారికి పరిహారం పెంపు విషయాలను పక్కన పెట్టేశారు. ఐదేళ్లపాటు ఉప్పాడ తీర ప్రాంతంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. డ్రెడ్జింగ్ పేరుతో రూ.2 కోట్లు ప్రభుత్వ సొమ్మును టీడీపీ నేతలు పంచేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 తరువాత... ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహించిన మత్స్యకార సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచి్చన వెంటనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న మత్స్యకారుల వేటకు వీలుగా మేజర్ హార్బర్ నిర్మాణానికి రూ.351 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు మత్స్య సంపద సేకరించేలా, 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఆసరాగా నిర్మాణం చేపట్టారు. కోల్డ్ స్టోరేజ్‌లు, పెట్రోల్ బంకు, జెట్టీలు, ఫిష్ హ్యాండ్లింగ్, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం, వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. తొలుత కరోనా వల్ల పనులు కొంత నెమ్మదైనా గత ఏడాది నుంచి ఊపందుకున్నాయి. ఆరు నెలలుగా పరుగులు పెట్టిన పనులతో రూ.250 కోట్లకు పైగా నిధులు వెచి్చంచి నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంత అభివృద్ధి చూస్తాననుకోలేదు నా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో హార్బరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో కాకినాడ హార్బర్‌కు మా బోట్లు వెళ్లేవి. కానీ పదేళ్లుగా మా బోట్లను కాకినాడ హార్బర్‌కు రానివ్వడం లేదు. దీంతో ఇక్కడే ఉప్పుటేరులో బోట్లు నిలుపుకుంటున్నాం. అప్పుడప్పుడు చాలా ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించేవి. గతంలో టీడీపీ నేతలు ఎన్నో వాగ్దానాలు చేసినా అవేవీ నెరవేరలేదు. ఇక జన్మలో హార్బర్ చూస్తామనుకోలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ మా బాధలు విని అన్న మాట ప్రకారం నిరి్మంచి,మాకు ప్రత్యక్ష దైవంగా మారారు. - కంబాల రాంబాబు, మత్స్యకారుడు,ఉప్పాడ శివారు సూరాడపేటజిల్లాలో తీరప్రాంత మండలాలు: 5 మత్స్యకార గ్రామాలు: 36 మెరైన్ ఫిషర్మెన్ జనాభా: 2,00,000 చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్న వారు: 36,000 మెకనైజ్డ్ బోట్లు: 467 మోటారు బోట్లు: 3,779 సంప్రదాయ బోట్లు: 399 మొత్తం బోట్లు: 4,645ఉప్పాడ మేజర్ హార్బర్ విశేషాలు∗ నిర్మాణ వ్యయం: రూ.351 కోట్లు ∗ నిర్మాణ స్థలం: 58 ఎకరాలు∗ ఉపాధి పొందే మత్స్యకారుల కుటుంబాలు: 2500 ∗ ఉపాధి పొందే మండలాలు కొత్తపల్లి,తొండంగి, కాకినాడ రూరల్ ∗ ఏటా 30 వేల టన్నుల నుంచి 1.10 లక్షల టన్నులకు పెరగనున్న మత్స్య ఉత్పత్తి ∗ చేపల ఉత్పత్తి అంచనా విలువ రూ.890 కోట్లు ∗ ఒకేసారి 2,500 బోట్లు నిలుపుకునే సామర్థ్యం.. భారీ బోట్లు నిలుపగలిగేలా నిర్మాణం ∗ 20 టన్నుల కెపాసిటీ గలశీతల గిడ్డంగులు.. భారీ ట్యూనా చేపల ఫిష్ హ్యాండ్లింగ్ ప్యాకింగ్ షెడ్లు ∗ కోల్డ్ స్టోరేజ్‌లు, పెట్రోల్ బంకు, జెట్టీలు, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ∗ ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం.. వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్ -
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
దేశంలో చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్‌కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరాఖండ్‌లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీనిని తీర్థయాత్రల ప్రధాన ద్వారం అని కూడా అంటారు. రిషికేశ్ ఆలయంతో పాటు ఇక్కడి ఘాట్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం రిషేకేశ్‌ను సందర్శించిన తర్వాతే చార్‌ధామ్‌కు వెళ్లేవారు. రిషికేశ్కు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. అనేక పురాతన, గుర్తింపు పొందిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్ బద్రీనాథ్ ధామ్‌కు నడక మార్గంగా ఉండేది.రిషికేశ్‌లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహంత్ రామేశ్వర్ గిరి మీడియాకు ఈ ప్రాంతపు ప్రత్యేకతలను తెలియజేశారు. ఇక్కడ మూడు పవిత్ర నదుల త్రివేణీ సంగమం ఉందన్నారు. ఇక్కడున్న మార్కెట్ రిషికేశ్‌లోని ప్రధాన మార్కెట్ అని, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళతారన్నారు. ఈ మార్కెట్ కొన్నాళ్ల క్రితం బద్రీనాథ్‌కు నడక మార్గంగా ఉండేదని తెలిపారు. దీంతో ఈ రహదారి మార్గంలో అనేక దుకాణాలు, రెస్టారెంట్లు, భవనాలు నిర్మితమయ్యాయన్నారు.కొన్నాళ్ల క్రితం రిషికేశ్ అడవిలా ఉండేదని రామేశ్వర్ గిరి తెలిపారు. నాడు ఇక్కడ ఋషులు కఠోర తపస్సు చేసేవారన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులంతా త్రివేణిలో స్నానమాచరించిన తర్వాతనే చార్ధామ్ యాత్రకు బయలుదేరేవారని పేర్కొన్నారు. -
జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి
-
ఆర్థికాభివృద్ధి అదుర్స్
సెల్ ఫోన్ నేనే కనిపెట్టా.. ఐటీని నేనే సృష్టించా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌నూ నేనే కట్టా.. హైదరాబాద్‌లో రింగు రోడ్డునూ నేనే వేశా.. సింధూకు బాడ్మింటన్ ఆడమని నేనే చెప్పా.. అంతెందుకు నా గైడెన్స్ మేరకే సత్య నాదెళ్ల ఇవాళ అంతటివాడయ్యాడు.. తుపాన్లనే ఆపగలిగాను.. సంపద సృష్టికి నేనే బ్రాండ్ అంబాసిడర్..’ ఇలా కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పేదెవరంటే, చంద్రబాబు అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అప్పుడు బాబు హయాంలో, ఇప్పుడు జగన్ హయాంలో దాదాపు ఒకే బడ్జెట్.. అప్పులు అప్పటి కంటే ఇప్పుడే తక్కువ.. అయినప్పటికీ సీఎం జగన్ ఈ ఐదేళ్లలో పేద ప్రజల ఖాతాల్లో వివిధ పథకాల రూపేణ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. తద్వారా ఆర్థిక చక్రాన్ని పరుగులు పెట్టించారు. అభివృద్ధి విషయంలో కొత్త పుంతలు తొక్కించారు. ఈ ఐదేళ్లలో వార్షిక సగటు వృద్ధి 6.20 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. అన్ని రంగాల్లోనూ స్పష్టమైన అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. ఇందుకు కేంద్ర గణాంకాలే సాక్ష్యం. ► స్థిర ధరల ప్రకారం గత ఐదేళ్లలో జీఎస్డీపీ పెరుగుదల రూ.1,94,063 కోట్లు ► అదే బాబు పాలనలో రూ.1,28,341 కోట్లే ► కోవిడ్ సంక్షోభంలోనూ జగన్ హయాంలోనే భారీగా పెరిగిన సంపద ► స్థిర ధరల ఆధారంగా 2023–24 రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 7.35 శాతం ► బాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6.26 లక్షల కోట్లు ► 2023–24లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8.20 లక్షల కోట్లు ► కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ లెక్కలేఇందుకు నిదర్శనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ వైపు సంక్షేమాభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ.. మరో వైపు పేదరికాన్ని తగ్గించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ముందంజలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి, సంపద సృష్టించారనడానికి కొలమానం అ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలే. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభాలను సైతం అధిగమించి సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో వరుసగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కోవిడ్ సంక్షోభం లేనప్పటికీ గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు వార్షిక వృద్ధి రేటు 5.15 శాతం నమోదు కాగా, అదే సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. పదే పదే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. తన ఐదేళ్ల పాలనలో కోవిడ్ లాంటి సంక్షోభం లేనప్పటికీ సంపద సృష్టించడంలో ఎందుకు వెనుకబడ్డారో చెప్పాలి. ప్రజలు ఏది చెబితే అదే నమ్ముతారనుకోవడం ఎల్లవేళలా సాగదనే విషయం చంద్రబాబు మరిచిపోతున్నారు. తనకొక్కడికే సంపద సృష్టించడం వచ్చనే ధోరణిలో చంద్రబాబు ఇస్తున్న బిల్డప్ అంతా తుస్ అని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నమోదులో టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉందని స్పష్టమైంది. ఈ గణాంకాలన్నీ 2011–12 సంవత్సరం స్థిర ధరల ఆధారంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ గణాంకాలన్నీ పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. కోవిడ్‌లోనూ రయ్.. రయ్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,28,341 కోట్లు పెరిగింది. అంటే మొత్తం ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 25.74 శాతం పెరిగింది. అంటే సగటు వార్షిక వృద్ధి 5.15 శాతంగా నమోదైంది. అదే సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,94,063 కోట్ల మేర పెరిగింది. అంటే ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 30.95 శాతం. వార్షిక సగటు వృద్ధి 6.20 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే సంపద సృష్టించడంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత చంద్రబాబు పాలన కన్నా సీఎం వైఎస్ జగన్ పాలన ఎంతో మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రూపంలో రాబడి తగ్గిపోయినప్పటికీ రాష్టంలో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకుండా కొనసాగించే చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారు. మరో పక్క కోవిడ్‌లోనూ పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఈ చర్యలతో రాష్ట్ర ఆర్థిక చక్రం ఆగిపోకుండా నిలదొక్కుకుంది. అందువల్లే జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల ఎక్కువగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.35 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ వేసిన అడుగులు చక్కటి ఫలితాలిచ్చాయి. ప్రధానంగా పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. ఎలాంటి హడావుడి లేకుండా అన్ని ప్రాంతాలకు భారీ పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా, అవి ఉత్పత్తిని ప్రారంభించేలా అన్ని విధాలా ఊతమందించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు విదేశీ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని అచ్యుతాపురం వద్ద జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్ (అలయన్స్ టైర్స్ గ్రూపు), అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, లారస్ ల్యాబ్ వంటి దిగ్గజ సంస్థలు, విజయనగరంలో శారడా మెటల్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోస్తాంధ్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్, కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సులిన్ తయారీ సంస్థ లూఫిస్ ఫార్మా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐటీసీ స్పైసెస్ పార్కు, పిడుగురాళ్ల వద్ద శ్రీ సిమెంట్స్, నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ, క్రిభ్కో ఇథనాల్, గ్రీన్‌లామ్ సొల్యూషన్స్, గోకుల్ ఆగ్రో ప్రారంభం అయ్యాయి. రాయలసీమలోని చిత్తూరులో బ్లూస్టార్, డైకిన్, హావెల్స్, యాంబర్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్, టీసీఎల్, వైఎస్సార్ జిల్లాలో డిక్సన్, సెంచురీ ప్లేవుడ్స్, బిర్లా గార్మెంట్స్, కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ వంటి భారీ పెట్టుబడులు వచ్చాయి. ► చంద్రబాబు ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.59,970 కోట్లు ►ఈ 5 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల్లో రూ.78,514 కోట్ల పెట్టుబడులు ►వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదంటూ ఎల్లో మీడియాతో కుట్ర చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. ►తప్పుడు సమాచారంతో యువతను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే చంద్రబాబు అండ్ కోకు ఈ వాస్తవాలు కనిపించవా... ►సంక్షేమంతో పాటు సమానంగా పరిశ్రమలకు అగ్రతాంబూలం ఇస్తే నీచమైన రాతలా.. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి ఇదీ జగన్ అంటే.. ►గత ప్రభుత్వంలా ఏటా పెట్టుబడుల సదస్సు అంటూ హడావుడి చేయలేదు. ఒక్కసారి మాత్రమే 2023లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించగా.. 386 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఏ రాష్ట్ర పెట్టుబడుల సదస్సుకు రాని రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా విశాఖ రావడమే కాకుండా రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఐదేళ్లలో బిర్లాలు, అదానీ, మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి విచ్చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ► సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది తిరక్కుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఎంఎస్ఎంఈలకు పునరుజ్జీవం కోవిడ్ సమయంలో రీస్టార్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలతో ఆదుకుంటోంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీ పడేలా క్లస్టర్ విధానాన్ని, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రూ.118 కోట్లతో జగన్ ప్రభుత్వం ర్యాంప్ కార్యక్రమం చేపట్టింది. చంద్రబాబు సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు ఉంటే.. ఇప్పుడు ఏడు లక్షలు దాటాయని ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్రం రికార్డులు పరిశ్రమలకు అన్ని రకాల మౌలికవసతులు ఒకే చోట లభించేలా మూడు పారిశ్రామిక కారిడార్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మూడు పారిశ్రామిక కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది. ►విశాఖ–చెన్నై కారిడార్(వీసీఐసీ) ►చెన్నై–బెంగళూరు కారిడార్ ►హైదరాబాద్–బెంగళూరు కారిడార్.. ఈ మూడూ అభివృద్ధి దశలో ఉన్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఇందులో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌గా రూపుదిద్దుకుంటోంది. తిరుపతి జిల్లాలోని 2,500 ఎకరాల్లో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలి్పస్తోంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. విశాఖ–చెన్నై కారిడార్(వీసీఐసీ) విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రెండు గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్లు తీర్చిదిద్దారు. విశాఖపట్నంలోని నక్కపల్లి–రాంబిల్లి క్లస్టర్లు, చిత్తూరు నోడ్‌లో ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో అంతర్గత మౌలిక సదుపాయాలు కల్పించారు. వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్టర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్‌లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్‌లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారు. నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులతో 9,030 ఉద్యోగాలు కల్పించారు. అచ్యుతాపురంలో మొత్తం 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు రాగా 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ► వీసీఐసీలో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలో 6,740 ఎకరాలలో పరిశ్రమల హబ్ తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండ్రస్టియల్ పార్కు, ఎంఎస్ఈ సీడీపీ, వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.2595.74 కోట్ల నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధికి కార్యాచరణ రూపొందించారు. అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్ అండ్ ప్లే పరిశ్రమల కోసం ఇప్పటికే షెడ్ల నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఈ కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ► పెట్టుబడుల సదస్సు అంటూ గత ప్రభుత్వం రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయని ఎల్లో మీడియాలో ఊదరగొట్టేశారు. కనీసం అందులో 10 శాతం పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోయేది. బాబు హయాంలో కనీసం 5 శాతం పెట్టుబడులు కూడా రాలేదు. దీనిపై మీ ఎల్లో మీడియాలో రాయించగలవా.. ►బాబు హయాంలో కేంద్ర సహకారం అందినా.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్నా.. పెట్టుబడుల ప్రవాహానికి అనుకూల వాతావరణం ఉన్నా.. తన సొంత అజెండాతో పారిశ్రామిక ప్రగతిని బాబు నిర్లక్ష్యం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే పరిశ్రమలకు పట్టం కడుతున్న వేళ.. కోవిడ్ లాక్‌డౌన్‌తో రెండేళ్లు ప్రపంచమంతా పడకేసింది. అయినా జగన్ గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. ►జగన్ పాలనలో రాష్ట్రంలో 163 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.78,514 పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఉత్పత్తి ప్రారంభించాయి. బాబు హయాంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు పెడితే.. జగన్ హయాంలో ఏటా రూ.15,702.8 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వివిధ దశల్లో రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందం జరిగిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. అదనంగా దావోస్ పర్యటనలో మరో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా యువతకు 38 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక ఫోన్ కాల్ దూరంలో మీకు నేను ఉన్నానంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఇచ్చిన అభయం వారి నమ్మకాన్ని రెట్టింపు చేసింది. గత మూడేళ్ల నుంచి పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 6 లక్షల మందికిపైగా ఉపాధి ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా రాష్ట్రంలో 6 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తోంది. ఎంఎస్ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. ఇందుకు ప్రతి జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల్ని అందించేలా మరో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో టెక్నాలజీ సెంటర్ కొనసాగుతోంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో ఈ టెక్నాలజీ సెంటర్ అభివృద్ధి చేస్తున్నారు. బంధం కొనసాగిస్తాం ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తాం. ఇందులో భాగంగా 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో సేవలు అందిస్తున్న రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలి్పస్తున్నాం. – ముఖేశ్ అంబానీ రెండు నెలల్లో రెండు యూనిట్లు ఆదిత్య బిర్లా గ్రూపు ద్వారా రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఆరు వ్యాపారాల్లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. – కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు మే నెలలో సీఎం జగన్‌ను కలిసి 30 సెకన్లు మాత్రమే మాట్లాడా. ఈ సందర్భంగా మా అబ్బాయి బయో ఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలు పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహా్వనించారు. బయో ఇథనాల్ పాలసీని యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. –సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా రాష్ట్రం వైపు ఐటీ దిగ్గజ సంస్థల చూపు దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్, విప్రో, రాండ్‌స్టా్టండ్, బీఈఎల్, అమెజాన్ డీసీ వంటి అనేక దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. బీపీఓ కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన విశాఖ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడంతో.. విప్రో కూడా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ల ఆకర్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఐటీ హబ్‌గా విశాఖ గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని ఐటీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643గా ఉంది. అందులో సగం మందికి ఉద్యోగాలు దివంగత నేత వైఎస్సార్ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కొత్తగా 47,908 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 75,551కు చేరుకుంది. స్టార్టప్స్ కూడా 161 నుంచి 586కు చేరాయి. స్టార్టప్స్‌లో 2019 నాటికి 1,552 మంది పనిచేస్తుంటే ఇప్పుడు ఆ సంఖ్య 55,669కు చేరింది. ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) చెబుతున్నవే. తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ‘కల్పతరువు’తో పాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుస పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను ప్రారంభించాం. ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్ ప్రారంభిస్తున్నాం. – సంజయ్ పూరి, ఐటీసీ సీఈవో -
ప్రగతి గోదావరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం: పైరు పచ్చని సీమ ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రగతి బాటన పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అద్భుత అభివృద్ధి సాధించింది. ఆక్వా వర్సిటీ, మెడికల్ కళాశాలలు, ఫిషింగ్ హార్బర్, వాటర్‌గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో పశ్చిమ ముంగిట వాలాయి. పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. జిల్లా పునర్వి భజనతో ఏలూరు జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. ఫలితంగా పాలన పల్లె ముంగిటకు చేరింది. ఆణి‘మత్స్యం’.. ఆక్వా వర్సిటీ తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాస్త్రీయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలో తుఫాన్ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు. బియ్యపుతిప్ప వద్ద రూ. 430 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.490 కోట్లతో వశిష్టగోదావరి వంతెన, అంబేడ్కర్ కోనసీమ జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ. 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. సహజసిద్ధ ప్రవాహం మళ్లింపు పోలవరం ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా గాడిలో పెట్టి కరోనా కష్టకాలంలోనూ పనులు వేగంగా సాగేలా చేశారు. ప్రధా నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 48 స్పిల్ వే గేట్ల నిర్మాణం, స్పిల్ చానల్ ఎగువ, దిగువ డ్యాంలు, 2021 జనవరి 11 నాటికి పూర్తి చేసి 6.1 కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. సహజసిద్ధ గోదావరి నది ప్రవాహాన్ని ఇంత భారీ ఎత్తున మళ్లించడం చరిత్రలో ఇదే ప్రథమం. తాడువాయిలో 3095 పునరావాస ఇళ్ళను ఒకేచోట మెగా టౌన్షిప్ మాదిరి రూ.488 కోట్లతో నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఏలూరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరుతోపాటు, పాలకొల్లు మండలంలో వైద్యకళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏలూరులోని వైద్య కళాశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రూ.60 కోట్లతో అధునాతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.525 కోట్లు. ► పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ్మిలేరుకు ‘వాల్’జడ ఏలూరు నగరాన్ని తమ్మిలేరు ముంపు నుంచి రక్షించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2006లో తమ్మిలేరు ముంపుతో ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని రిటైనింగ్‌వాల్ నిర్మించాలని విన్నవించారు. వెంటనే ప్రతిపాదనలు తయారు చేయించి వైఎస్సార్ అనుమతులు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 2019లో అంచనాలు సవరించి రూ.80 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించి 90 శాతానికిపైగా పూర్తి చేశారు. ఇతర అభివృద్ధి పనులు ► రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిరి్మంచనున్న భారీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు టెండర్ దశకు చేరుకున్నాయి. ► భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ► యనమదుర్రు డ్రెయిన్‌పై నిరి్మంచిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా త్వరలో పనులు మొదలుకానున్నాయి. ► ఏలూరు జిల్లా చింతలపూడి– జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రికి అనుసంధానం చేస్తూ 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీలుగుమిల్లి– కొవ్వూరు మధ్య ఎన్‌హెచ్ 365 (బీబీ) రూ.605 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. రూ.124 కోట్ల వ్యయంతో 516 (డీ) జాతీయ రహదారిని కొయ్యలగూడెం– జీలుగుమిల్లి మధ్య అభివృద్ధి చేశారు. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
-
మోసం, దగా, కుట్ర చంద్రబాబు పేటెంట్: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించాం. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చెప్పిన మాటమీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారు. విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు’ అని బొత్స అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏమన్నారంటే.. విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట తప్పని మనిషని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట చెబితే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దానిని నెరవేర్చాలనే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి బిడ్డగా ఆయన నైజం అది. అలాంటి నేపథ్యంలోనే కిందటి సారి విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఓ మాట చెప్పారు. దేవుడి దయతో రాష్ట్ర ప్రజల సహకారంతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్టణంలోనే చేస్తాను. విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ అన్ని మౌలికసదుపాయాలను కల్పించి ఒక హబ్‌గా తయారు చేస్తానంటూ మాట ఇచ్చారు. అప్పట్లో ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ విశాఖపట్టణంలో పెట్టుబడులకు ఓ భరోసా కల్పించారు. - విశాఖ ఇన్వెస్టర్ల మీటింగ్‌లో తాను ఏమైతే మాట ఇచ్చారో.. దానికి నూటికి నూరుశాతం జగన్‌గారు కట్టుబడి ఉన్నారు. అధికారంలోకి రాగానే తాను ఇక్కడికే తన పరిపాలన తెస్తానన్నారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా సంస్థలు రోజుకో విధంగా విషం చిమ్మాయి. లేనిపోని గాలికబుర్లు, అభూతకల్పనలతో ఆయనపై దుమ్మత్తిపోస్తున్నప్పటికీ.. తన మాటపై తాను ధృఢంగా నిలబడి ఉన్నారు. రేపటి ఎన్నికల్లో గెలవగానే ఇక్కడ్నే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే విశాఖ అగ్రగామిగా నిలబడుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంత మణిహారంగా డిస్నీ ఆఫ్ విశాఖపట్టణం మారనున్నదని చెప్పడానికి మేం గర్విస్తున్నాం. ఇవ్వన్నీ మరోమారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ నెలకొల్పుతారు. అందులో పెద్ద సందేహమేదీలేదు. ఆయన చెప్పినట్లు.. డిస్నీ ఆఫ్ విశాఖకు ఇక్కడున్న సహజ వనరులు, సీకోస్ట్, పోర్టులు, ఏయిర్పోర్టు, హైవే కనెక్టివిటీ తదితర సదుపాయాలన్నీ అనుకూలించనున్నాయి. బెంగుళూరు, ముంబై, చెన్నై తరహాలో విశాఖ పట్టణాన్ని కూడా తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కనుకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ దిశగా ముందుకెళ్లే కృతనిశ్చయంతో మేమున్నాం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కిందటేడాదిన విశాఖకు సుమారు 40 కిలోమీటర్ల దూరమున్న భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్మోహన్రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. పనులు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఏజెన్సీలకు బిడ్స్ అప్పగించడం కూడా జరిగింది. ఇవన్నీ పూర్తిచేసుకుని 6 మిలియన్ల పాసింజర్ల ప్రయాణ రాకపోకలకు విమనాశ్రయాన్ని మొదటి దశలో సిద్ధం చేస్తున్నామనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి కనెక్టివిటీ చేస్తూ గాజువాక నుంచి భోగాపురం వరకు మెట్రో ట్రైన్ ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేసి త్వరలోనే దాన్ని పూర్తిచేయనున్నాం. వీటన్నిటి పట్ల మా జగన్ గారి కృతనిశ్చయంతో ఉన్నారని మరోమారు గుర్తుచేస్తున్నాను. ఇది మా ప్రభుత్వ తాలూకూ ఆలోచన, ప్రణాళికగా చెబుతున్నాను. వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులు అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఇక్కడ ఫిష్షింగ్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్షింగ్ హార్బర్లు, శ్రీకాకుళంలో మరో పోర్టు కావాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. దీనివలన మత్స్యసంపదను పెంచుకుని పెట్టుబడులను ఆకర్షిస్తూ వాణిజ్య అవసరాలను తీర్చుకునే వెసులు ఉంటుందన్నది ప్రజల ఆలోచన. వీటిపై గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. అదే శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక మూలపేటలో సుమారు రూ. 430 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు జరుగుతోన్నాయి. విశాఖ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఒక ఫిష్షింగ్ హార్బర్‌ను కూడా నిర్మిస్తున్నారు. వీటితో పాటు అక్కడ సమీప ప్రాంతాల్లో మరో 10 ఫిష్షింగ్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి పనులు కూడా ప్రారంభించారు. మేం చెప్పేవన్నీ మాటలతో చెప్పి ఊరుకున్నవి కావు.. పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబులా సెల్ఫ్ డబ్బా కొట్టుకోం ఆనాడు ఐటీ రంగాన్ని విశాఖపట్టణం తెచ్చేందుకు దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు కృషి చేశారు. అప్పట్లోనే కొన్ని టవర్ల ఏర్పాటుకు ఆయన శ్రీకారం చుడితే.. ఇవాళ ఇక్కడ ఇన్ఫోసిస్ డెటా సెంటర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను జగన్మోహన్రెడ్డి గారు తెచ్చారు. అంతేకాకుండా ఇక్కడ దాదాపు రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. మేము చంద్రబాబు మాదిరిగా చేయని పనులకూ డబ్బాలు కొట్టుకునే రకాలం కాదు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేన్నట్టు చెప్పుకుని పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు లాంటి తత్త్వం మాది కాదు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు చేసేదే చెబుతారు. చెప్పిందే చేసి చూపుతారు. అదే ఆయన ప్రత్యేకత నైజం. పైశాచికానందంలో రామోజీ, రాధాకృష్ణలు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కలిసి చంద్రబాబు కోసం ఓ పైశాచిక క్రీడకు తెరలేపారు. ఆ మేరకు జగన్మోహన్రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రోజుకో పైశాచిక వార్తలు రాసి.. వికృతానందం పొందుతున్నారు. వాళ్లకు మా మీద నెగిటివ్ వార్తలు రాయడమే పైశాచికానందం అంట. దీనివల్ల చివరకు వాళ్లు సాధించేదేముంది..? ఆ రెండు పత్రికల్లో వాళ్లు రాసే విషయాల్లో ఒక్కటంటే ఒక్క పర్సంటేజీ నిజాలు కనిపించడం లేదు. పేరెంట్స్ మీటింగ్‌కు రాజకీయం అంటగడతారా..? ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఇవాళ ఎలాంటి వార్తలొస్తున్నాయంటే, ఉదాహరణకు నేను మంత్రిగా పర్యవేక్షించే శాఖనే తీసుకుందాం. విద్యా శాఖపై ఇవాళ కూడా మూడు వార్తలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ మీటింగ్స్ కూడా పెట్టకూడదంట. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా చదివి పరీక్షలు రాస్తే.. మార్కులు బాగా రావాలని కోరు కుంటారు. ఆయా విషయాలపై చదువు చెప్పిన ఉపాధ్యాయులతోనూ మాట్లాడాలని కోరుకోవడం సహజమే. అలాంటి సందర్భాల్లో పెట్టే పేరెంట్స్ మీటింగ్‌నూ రాజకీయాలకు ముడిపెట్టి వార్తలెలా రాస్తారు..? ప్రభుత్వ స్కూళ్లల్లో జరిగే పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లకు రాజకీయ నేతలుగా మేం అక్కడికెళ్లి పబ్లిసిటీ చేస్తామా..? విద్యార్థికి చదువు చెప్పిన టీచర్, విద్యార్థి తల్లిదండ్రులు కూర్చొని అతని చదువు పరిస్థితిపై మాట్లాడుకునే వాతావరణం అది. దానికి రాజకీయం రంగు పులమడం దేనికి..? మీడియా సంస్థలుగా ఆ రెండు పత్రికలు ఈ వ్యవస్థను ఏం చేద్దామనుకుంటున్నాయి..? మీరు చేసేది చాలా తప్పుకదా..? 18,200 మంది టీచర్లను రిక్రూట్ చేశాం.. స్థానికంగా కూటమి అభ్యర్థి ఒకరు విద్యాసంస్థ నడుపుతున్నాడంట. ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లకు రంగులేయడం కాదు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి అప్పాయింట్మెంట్లు ఇవ్వాలంటున్నాడు. గత ఐదేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందో ఆయనకేం తెలుసు..? ఇంగ్లీషు మీడియం విద్యాబోధనపై టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించాం. ఎప్పటికప్పుడు వాళ్లను మోటివేట్ చేస్తూ లెర్నింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నింటిపై టీచర్లను అడిగితే చెబుతారు కదా..? మా ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జగన్ గారు 18,200 మంది టీచర్లను రిక్రూట్ చేసుకుని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాం. ఇవన్నీ తెలియక ఎవరంటే వారు మైండ్‌లేని మాటలు మాట్లాడటం మంచిదికాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి అనుకూలమా..? వ్యతిరేకమా..? ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి సంబంధించి జగన్ గారు ఇప్పటికే అనేక ప్రణాళికలు అమల్లోకి తెచ్చి పూర్తిచేస్తున్నారు. రేపు అధికారంలోకి రాగానే విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా తీర్చిదిద్దబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనేక ఐటీ తదితర పరిశ్రమలు, పోర్టులు, హార్బర్లు, ఏయిర్‌పోర్టులు కూడా వచ్చాయి. మరి, కూటమి వీటన్నింటికీ అనుకూలమా..? వ్యతిరేకమా..? దీనిపై సమాధానం చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసుకుని ఓట్లు అడగాలని డిమాండ్ చే స్తున్నాం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని బీజేపీతో చెప్పించగలరా..? విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మా విధానం చెప్పింది. దీనిపై మేము ఒక లెటర్ ఇచ్చి ఊరుకున్నామని కూడా ఆ రెండు పత్రికలు రాశాయి. అంటే, గతంలో జరిగిన విషయాలపై బుర్ర ఉండాల్నా.. లేదా..? జగన్మోహన్రెడ్డి గారు ఢిల్లీలో ప్రధాని మోదీగారిని కలిసినప్పుడు.. అదే మోదీ గారు విశాఖకు వచ్చినప్పుడు కూడా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మా విధానాన్ని స్పష్టంగా వివరించారు. అదే విధానంపైనే ఇప్పటికీ మేం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే పోరాడుతున్నాం. మరి, ఈ అంశంపై కూటమి సమాధానం ఏంటి..? చంద్రబాబు కొత్తగా కూటమిలో చేరిన సందర్భంగా .. ఆ కూటమితో స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పించమనండి. బీజేపీ పెద్దల నోటివెంట ప్రైవేటీకరణ చేయబోమని చెబితే అందరం వింటాం కదా..? ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. నాసిరకం మద్యం అని బాబుకు ఎలా తెలుసు? జగన్ గారు మ్యానిఫెస్టోలో దశలవారీగా మద్యం నిషేధిస్తామన్నారు. అదే విధానాన్ని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇవాళ ఎక్కడ చూసినా.. మద్యం ధరలపై చంద్రబాబు చెబుతున్నారు. ప్రజల నిత్యావసరాలు, మత్తు కోసం తాగే మద్యం ఒకటేనా..? ధరల పెంపుతో మద్యం వినియోగాన్ని తగ్గించాలనేది మా ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వ్యవస్థను నడిపిస్తున్నాం. అందులో తప్పేముంది..? ఇక, మద్యం నాణ్యత గురించి కూడా ఆయన చెబుతున్నాడు. అది నాసిరకపు మద్యం అని చంద్రబాబు తాగి చూశాడా..? ఆయనకు మద్యం తాగే అలవాటు లేదనుకుంటాను. మరి, ఆయనేదో మద్యం తాగడంలో ఎక్స్‌పర్ట్‌గా మాట్లాడుతాడే..? లేదంటే, ఏబీఎన్ లిక్కర్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరీక్షించారా..? మీకు చేతనైన లేబొరేటరీకి పంపి అందులో ఉండాల్సిన ఏబీసీడీలు ఉన్నాయో.. లేవో తెలుసుకోండి. అంతేగానీ, వ్యసనపరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని రాజకీయం నడుపుదామని అనుకోవడం ప్రతిపక్షాలకు మంచిది కాదు -
ఉమ్మడి ‘తూర్పు’లో అభివృద్ధి వికాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్న్పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రి రాత మారింది ♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి. ♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు. ♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి. ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది. ♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది. ♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి. ♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. ♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు ♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం. ♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి. ♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు. ♦ జల జీవన్ మిషన్‌లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం. ♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు. ♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా 2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి 2020–21లో 119 యూనిట్లతో 978 మందికి 2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి 2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి -
జగన్ పాలనలో జనం హ్యాపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయమే కొలమానం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోకన్నా గత ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ, దాన్ని అధిగమించి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.88,448 పెరిగింది. కోవిడ్ సంక్షోభం లేకపోయినప్పటికీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల రూ.60,128 మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం చివరి ఏడాది 2018–19 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్రమే ఉండగా, సీఎం జగన్ పాలనలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,42,479కి పెరిగింది. అంతేకాకుండా 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లలో జాతీయ సగటును మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది. 2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,14,000కు చేరింది. ఇదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,60,341 ఉండగా 2023–24 నాటికి రూ.2,42,479 కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 తో దేశంలో 17వ స్థానంలో ఉంది. కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం వరుసగా పెరుగుతూ 2022–23 నా టికి దేశంలోనే 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. తలసరి ఆదాయం అంటే.. తలసరి ఆదాయం అనేది రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సు ముఖ్యమైన సూచిక. ఇది వ్యక్తులు, కుటుంబాలపై ఆచరణాత్మక ప్రభావాలను కలిగి ఉంటుంది. తలసరి ఆదాయం అంటే సాధారణంగా ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి డబ్బుని కలిగి ఉండటం. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఏదైనా రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కొలమానం తలసరి ఆదాయమే. జగన్ సర్కారు కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించిందిలా.. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాల పథకాలను యథాతథంగా అమలు చేసింది. ఈ సమయంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. జీవనోపాధి కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకొంది. వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. ప్రజల ఆదాయ మార్గాలను పెంచేందుకు అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగే వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా కోవిడ్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా నమోదైంది. -
వలసల గడ్డపై...ప్రగతి వీచిక
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, పార్వతీపురం మన్యం: వలసలకు, వెనుకబాటుతనానికి నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి విజయనగరం జిల్లా. జగన్మోహన్రెడ్డి పాలనలో ఈ ప్రాంత దశా దిశా మారిపోతోంది. రాష్ట్రానికి పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరానికి చేరువగా ఉండటం, భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరగడం, విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తికావడం విజయనగరానికి వరంలా మారాయి. రూ.500 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, 519 ఎకరాల సువిశాల సుందర ప్రదేశంలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయంగా మారిన జేఎన్టీయూ–జీవీ... ఇవన్నీ విజయనగరం జిల్లాకు కలికితురాయి కానున్నాయి. అభివృద్ధికి రాచబాట గ్రీన్‌ఫీల్డ్ హైవే... అటు రాష్ట్ర పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరాన్ని ఇటు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌ను అనుసంధానం చేస్తూ విజయనగరం జిల్లా మీదుగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే సాకారమవుతోంది. రామభద్రపురం, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, ఎల్.కోట, కొత్తవలస మండలాల మీదుగా వెళ్లే దీని పొడవు: 75.03 కిమీ. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.3,778 కోట్లు వెచి్చస్తోంది. ప్రజల కల... ప్రభుత్వ వైద్య కళాశాల! విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. దాన్ని సాకారం చేస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. శంకుస్థాపన చేసిన ఆయనే రూ.500 కోట్లతో భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి గత ఏడాది సెపె్టంబరు 15న ప్రారంభోత్సవం కూడా చేయడం విశేషం. దీంతో ప్రజలు అత్యవసర వైద్యానికి, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల కోసం విశాఖపట్నం వరకూ పరుగులుపెట్టాల్సిన పరిస్థితి తప్పింది. 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. : 222 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. గంగపుత్రులకు వరం ఫిషింగ్ జెట్టీ... పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి గత ఏడాది మే 3వ తేదీన భూమి పూజ జరిగింది. అంచనా వ్యయం: రూ.23.74 కోట్లు. కేటాయించిన నిధులు: రూ.25 కోట్లు. 6 ఎకరాల్లో నిర్మించనున్న ఈ జెట్టీ వల్ల 5,053 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 4 వేల కుటుంబాలకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ‘వైభోగా’పురం... ► గత ఏడాది మే 3న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దాదాపు రూ.4,500 కోట్లతో జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టింది. 2025 నాటికి మొదటి దశ పూర్తి కానుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సరిపోయేలా సౌకర్యాలు. ► ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం. ► ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుంది. ► భీమిలి బీచ్ కారిడార్ కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ పెరగడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఏర్పడుతుంది. ► విమానాశ్రయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ► విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన భూమి 2203.26 ఎకరాలు ► భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.835.48 కోట్లు ► 404 నిర్వాసిత కుటుంబాలకు రూ.67.04 కోట్లతో టౌన్íÙప్ల నిర్మాణం. మన్యంలో ఇదిగో సంక్షేమాభివృద్ధి ► రూ.100 కోట్లతో సమీకృత కలెక్టర్ కార్యాలయం ► జిల్లా కేంద్రంలో రూ.600 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురం, సీతంపేటల్లో రూ.50 కోట్ల చొప్పున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణ పనులు. ► అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.126 కోట్ల చొప్పున జమ. ► జగనన్న విద్యాదీవెన కింద రూ.23.42 కోట్లు.. ► జగనన్న వసతి దీవెన ద్వారా రూ.15.84 కోట్లు. ► జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల్లో భాగంగా ముగ్గురికి రూ.లక్ష చొప్పున సాయం. ► పింఛన్ కానుక కింద నెలకు రూ.37 కోట్లు పంపిణీ. ► వైఎస్సార్ ఆసరా కింద రూ.378 కోట్లు, వైఎస్సార్ చేయూత ద్వారా రూ.147 కోట్లు, వైఎస్సార్ కల్యాణ మస్తు కింద రూ.11.84 కోట్లు, జగనన్న తోడు కింద రూ.7.59 కోట్లు చొప్పున లబ్ధి కలిగింది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట ► పీఎంజీఎస్‌వై, ఆర్సీఈపీఎల్డబ్ల్యూ గ్రాంట్ల కింద 1,008 రహదారి పనులు రూ.1,260 కోట్లతో జరుగుతున్నాయి. ► 190 4జీ సెల్ టవర్లకు 77 పూర్తయ్యాయి. ► 58 రహదారులకు అటవీ అనుమతులు మంజూరు. n సీతంపేటలో గిరిజన మ్యూజియం, జగతిపల్లి, అడాలి వ్యూ పాయింట్ల వద్ద పర్యాటక పనులు రూ.1.40 కోట్లతో, గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్.కె.పాడులో ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు రూ.1.80 కోట్లతో చేపడుతున్నారు. ‘గిరి’జన ప్రగతికి దిక్సూచి... ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూఏపీ) సొంత భవనాల నిర్మాణ పనులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది ఆగస్టు 25న భూమి పూజ చేశారు. గజపతినగరం నియోజకవర్గంలోని మర్రివలస గ్రామ సరిహద్దులో దీన్ని నిర్మిస్తున్నారు. సీటీయూఏపీ కోసం ఏపీ బడ్జెట్లో రూ.834.83 కోట్లు కేటాయించారు. 519.03 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేయడానికి 42 నెలలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు రూ.23.60 కోట్లు ఇచ్చారు. -
ధర్మం అంటే..? మంచిమాట
ప్రకృతి ఎలా ప్రవర్తించాలి, ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి– నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, అలాగే మనిషిని దహింప జేసేవి– అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతరప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు. మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. మానవులకు, జంతువులకు, వస్తువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం. అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది. ధర్మాచరణ వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది. కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి అవుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది. ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేటపుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదించింది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసి పెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక రాబోయే తరాలకు నువ్వు సంపాదించి ఇచ్చే తాపత్రయం పెంచుకోకూడదు. ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతనీ బాధ్యతనీ మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి: ధర్మాచరణ వలన అర్థప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మ సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. స్వధర్మానికి బాధ కలిగించేది–విధర్మం, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మాన్ని ఆచరించేది – పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాసరహితులైన వారు చేసేది, చెప్పేది – ఉపధర్మం. తన «దర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, చెప్పబడిన ధర్మానికి విపరీతార్థాలను తీసి వివరించడం అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించవలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత లోక కల్యాణకార కాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
జగన్ ఏలిక...ఆంధ్రావనికి ఏరువాక!
జనం బాధలు తమవిగా భావించే నేతలే ప్రజా సమస్యల పరిష్కారానికి తపిస్తారు. అలా తపించే నాయకులే నేటి సమాజానికి కావాలి. ఎవరికి ఏ కష్టమొచ్చినా చలించే మనసు ఉండాలి. చలించడంతో సరిపోదు... ఆ బాధలను తీర్చాలన్న పట్టుదల... ఆ కష్టం తీరేదాకా జనం వెన్నంటి ఉన్నప్పుడే రాజకీయ నాయకుడికి గుర్తింపు. అలాంటి గుర్తింపును తండ్రీ తనయులైన దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలోనూ అతి దగ్గరగా చూసిన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త మనోగతమిది... రైతులకు ఏం చేస్తే వారి బతుకులు బాగుపడతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరు సందర్భాల్లో ఈ శాస్త్రవేత్తను సలహాలు అడిగారు. తాను చెప్పిన వాటన్నిటినీ తూచా తప్పకుండా ఆచరించడమే జగన్‌లోని ఆదర్శ నాయకుడిని చూపించాయని ఆ శాస్త్రవేత్త చెబుతున్నారు. జగన్‌లోని వినే గుణం, విన్న తర్వాత ఆచరణలోకి తీసుకురావడమనేది ఈ రాష్ట్ర వ్యవసాయ రంగానికి పట్టిన అదృష్టమని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వపు వీసీ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గవర్నింగ్ బాడీ మాజీ సభ్యుడు, ఏపీ అగ్రి మిషన్ సభ్యుడు...ప్రొఫెసర్ పోలి రాఘవరెడ్డి కొనియాడారు... జగన్‌తో తన స్ఫూర్తిదాయక అనుభవాలను ఇలా ‘సాక్షి’ తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, అమరావతి ‘నాడు ఆ మహానేత వైఎస్సార్.. నేడు ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. రైతుల కోసం ఆలోచించే విధానం.. స్పందించే తీరు ఒకే రీతిలో ఉంది. ప్రతీ అడుగులోనూ రైతులకు మేలు చేయాలన్న తపన వారిద్దరిలోనూ కన్పించింది. ఇద్దరి పాలనా తీరును దగ్గర నుంచి చూశాను. నాన్న ఒక అడుగు వేస్తే నేను నాలుగడుగులు వేస్తానన్న సీఎం వైఎస్ జగన్.. ఐదేళ్లలో రైతుల కోసం ఏకంగా వంద అడుగులు వేశారనే చెప్పాలి. మహానేత హయాంలో రైతులు ఎంత సుభిక్షంగా ఉన్నారో అంతకు రెట్టింపు సంతోషంగా ఈ ఐదేళ్లలో ఉన్నారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఈ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు..నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 77 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధికి బాటలు పడ్డాయని చెప్పొచ్చు. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ... రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గర నుంచి చూసిన నేతగా వైఎస్ జగన్ వారి ప్రతీ సమస్య పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. సమస్యలను ఆకళింపు చేసుకోవడమే కాదు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే సాగుకు అవసరమైన పెట్టుబడి, సారవంతమైన నేల, అవసరమైన మేరకు నీరు, సాగు ఉత్పాదకాలు, సాంకేతిక బదలాయింపు, గిట్టుబాటు ధర కల్పన, సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు అవసరం. ఈ ఐదేళ్లలో వీటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతులకు మేలు చేయాలన్నదే ఆయన తపన మహానేత మాదిరిగానే వైఎస్ జగన్ రైతుకు మేలు చేసేందుకు ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటున్నారు. అగ్రిమిషన్ తొలి సమావేశంలో పెట్టుబడి సాయం ఇచ్చేటప్పుడు ఎంత విస్తీర్ణం ఉండాలి. ఎవరిని రైతులుగా గుర్తించాలని అడిగారు. అప్పుడు నేను చెప్పిన రెండు సూచనలు ఆచరణలో పెట్టారు. తమలపాకు రైతులు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. పైగా మెజార్టీ సాగుదారులకు ఎకరం కంటే తక్కువ భూమే ఉందని చెప్పాను. ఒక రైతుకు ఇద్దరు ముగ్గురు కొడుకులుంటారు. పెళ్లయిన తర్వాత వారికి పొలాలు వాటాలు పంచినా ఒకే ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించడం సరికాదన్నా.. అని చెప్పాను. అలా చెప్పిన మరుక్షణమే.. రైతుకు 15 సెంట్లున్నా పెట్టుబడి సాయం ఇవ్వాలని, పెళ్లయితే చాలు ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా వేర్వేరు కుటుంబాలుగా పరిగణించి రైతు భరోసా ఇద్దామని సీఎం జగన్ ప్రకటించి ఆచరణలో పెట్టారు. రైతులకు ఒక్క రూపాయి అయినా అదనంగా మేలు చేయాలన్న తపన, తాపత్రయం పెద్దాయనలో మాదిరిగానే వైఎస్ జగన్‌లోనూ చూశాను. పరిశోధనలకు పెద్ద పీట... మహానేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నేను మార్టేరు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా ఉండేవాణ్ని. సీఎంగా పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో మా పరిశోధనా స్థానానికి వచ్చినప్పుడు రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగారు. పరిశోధనలు బాగా పెరగాలి. వాటి ఫలాలు క్షేత్ర స్థాయిలో రైతులకు చేరువ చేసిన రోజు కచ్చితంగా వారికి మేలు జరుగుతుందని చెప్పాను. అంతే.. క్షణం ఆలోచించకుండా పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అక్కడికక్కడే రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఫలితంగా కొత్త రకాలు సృష్టించగలిగాం. ఉత్పత్తిని పెంచేందుకు బలమైన అడుగు వేయగలిగాం. ఆ తర్వాత డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌గా, వీసీగా ఆయన హయాంలో పనిచేసే అవకాశం కలిగింది. ఆ సమయంలో నేను ఇచ్చిన సలహాలు, సూచనలకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఆచరణలో పెట్టేందుకు కృషి చేశారు. ఆ మహానేత కంటే మిన్నగా నేడు సీఎం వైఎస్ జగన్ తాను అమలు చేసే ప్రతీ కార్యక్రమం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. -
ప్రగతి పథం...శ్రీకాకుళం గమనం...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేసి 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ వ్యాధులపై రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. ఇక్కడి కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరే అని తేలడంతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 807 గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. సుమారు 5,57,633 మందికి తాగునీరు అందించారు. మూలపేట పోర్టు నిర్మాణంతో మత్స్యకారులకు ఆసరా దొరికింది. ► రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్ర భవనాలు మంజూరు కాగా రూ.67.67 కోట్లతో 270 భవనాలు పూర్తి ► రూ.262 కోట్లతో 654 గ్రామ సచివాలయ భవనాలు మంజూరు కాగా రూ.146.74 కోట్లతో 360 భవనాలు పూర్తి ► రూ.31.20 కోట్లతో 195 డిజిటల్ లైబ్రరీ భవనాలు మంజూరుకాగా 22 భవనాల నిర్మాణం. ► రూ.93.62 కోట్లతో 535 విలేజ్ క్లినిక్ భవనాలు మంజూరు కాగా రూ.48.42 కోట్లతో 122 భవనాలు పూర్తి.. ఐదు రూరల్ పీహెచ్‌సీలు, 11 అర్బన్ హెచ్‌సీలు సాగుకు సాయం ► జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు, 7 ఇంటిగ్రేటె డ్ ల్యాబ్‌లు నిర్మించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 3.21 లక్షల మందికి రూ.1,919.46 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 మందికి రూ.85.14 కోట్లు అందజేశారు. ► రూ.424.74 కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలు సబ్సిడీపై అందించారు. ► 82,745 మెట్రిక్ టన్నుల ఎరువులు, 5592 లీటర్ల నానో యూరియా వంటివి అందించారు. ► చిన్న, సన్నకారు రైతుల కోసం 505 ట్రాక్టర్లు, మల్టిపుల్ క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు. ► 10వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చారు. ఉద్యోగాల కల్పన ► సచివాలయాల ఏర్పాటు ద్వారా 7880 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పంచారు. – ప్రతి పీహెచ్‌సీకి అదనంగా ఒక్కో డాక్టర్ వంతున 66 మంది నియామకం ► పీహెచ్‌సీల్లో 108, 104 వాహనాల్లో కొత్తగా 2199 మంది నియామకం ► ఎంప్లాయిమెంట్ కార్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 9018 ఉద్యోగాలు జలయజ్ఞానికి ఊతం ► జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా రూ.176.35 కోట్లు వెచి్చంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మిస్తున్నారు. మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు. ► మత్స్యకారుల సంక్షేమం, వివిధ ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా మూలపేటలో రూ.2,949.70 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మత్స్యకారుల కోసం రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, వజ్రపుకొత్తూరు మండలంలోని నీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. మెరుగుపడిన మార్గాలు ► గడచిన ఐదేళ్లలో ఆర్అండ్బీ పరిధిలో రూ.526.69 కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేయగా చాలా వరకూ పూర్తయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43 కిలోమీటర్ల మేర 312 రోడ్లు మంజూరు కాగా 266 రోడ్ల పనులు జరుగుతున్నాయి. ► ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్ల పొడవున 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్లతో 21రహదారుల నిర్మాణం పూర్తయింది. ► పీఎంజీఎస్‌వై బ్యాచ్ 1 కింద రూ.51.27 కోట్లతో 11 పనులు మంజూరు కాగా 10 పనులు, బ్యాచ్ 2లో రూ.38.23 కోట్లతో 8 పనులు మంజూరు కాగా 6 పూర్తయ్యాయి. ► ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవు గల 312 పనులు చేపడుతున్నారు. రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవున 83 పనులు చేపడుతున్నారు. ► గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు. నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.16.60 కోట్లతో 115 రహదారులను అభివృద్ధి చేశారు. మరో రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87 కోట్లు మంజూరు చేశారు. ► పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2 కోట్లతో, జొన్నవలస ఆస్పత్రిని రూ.2.45 కోట్లతో, లావేరులో రూ.1.2 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ.4.60 కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ.5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. నాడు నేడు కింద 83 ఆస్పత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ► ఇంటింటికి తాగునీరు సరఫరాకు రూ.1552.36 కోట్లతో 4822 పనులు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్ కాలనీలో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4 కోట్లతో చేపడుతున్నారు. సుపరిపాలన సుసాధ్యమయ్యేలా... ► జాతిపిత కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా జిల్లాలో 835 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాల ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నారు. వీటి ద్వారా మొత్తం 512 రకాల సేవలు అందిస్తుండగా, ఇప్పటివరకూ 47,27,732 మందికి సేవలందాయి. ► విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా సామాన్య, పేద వర్గాలకు గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలు నిర్మించారు. శ్రీకూర్మం ఆస్పత్రిలో చాలా మార్పులొచ్చాయి గతంలో శ్రీకూర్మం ఆస్పత్రి వద్దకు వచ్చేవాడిని. కూర్చోడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పాడుబడిన భవనం ఉండేది. ఇరుకైన గదులు, ఎవ్వరూ కూడా సరిగ్గా ఉండేవారు కాదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్లినట్టుంది. ఈ ప్రభుత్వం వచ్చాక గదులు అందంగా తయారు చేశారు. అన్ని పరీక్షలు రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు. అన్ని సలహాలు చెబుతూనే మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. అలాగే మా గ్రామంలోకి డాక్టరమ్మలు వచ్చి ఆరోగ్యం కోసం అడుగుతున్నారు. అవసరమైన మందులు కూడా ఇంటి వద్దనే ఇస్తున్నారు. –గేదెల తవుడు, దువ్వుపేట, గార మండలం -
సకల సౌకర్యాలతో అభివృద్ధిపథంలో నందిగామ
-
PM Narendra Modi: అసలైన అభివృద్ధి ముందుంది
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ తమ పదేళ్లకాలంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ఆకలి పుట్టించే స్టార్టర్‌గా అభివరి్ణంచారు. అసలైన అభివృద్ధి భోజనం ముందుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజస్థాన్‌లోని చురులో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఇదే కాంగ్రెస్ అసలైన మనస్తత్వమని విపక్ష పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘ ఇప్పుడున్న నయా భారత్ శత్రువును ఇంట్లోకి చొరబడి మరీ దెబ్బ కొట్టగలదు. శత్రువు గడ్డపైనా దాడి చేసే సరికొత్త భారత్ ఆవిష్కృతమైంది’ అని అన్నారు. ‘‘ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. అది భోజనాల వేళ ఆకలి పుట్టించే స్టార్టర్ మాత్రమే. అసలైన మెయిన్ కోర్సు భోజనం(అభివృద్ధి) ముందుంది. చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. ఇంకా ఎన్నో కలలున్నాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి మనం’ అని అన్నారు. -
విషపు రాతలు.. నీచపు కూతలు..
-
జగన్ పాలనలో విశాఖ అభివృద్ధి బాట
-
ప్రజాసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
హుజూర్నగర్, పాలకవీడు: ప్రజాసంక్షేమం.. అభి వృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గుట్ట వద్ద రూ.74.80 కోట్లతో 2,160 సింగిల్ బెడ్రూం ఇళ్ల పునర్నిర్మాణ పైలాన్ ఆవిష్కరించారు. రూ.50 లక్ష లతో క్రిస్టియన్ సిమెట్రీ, రూ.కోటితో టౌన్హాల్లో అభివృద్ధి పనులు, రూ.33.83 కోట్లతో పాలకవీడు మండలం బెట్టెతండ గ్రామం వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పనులకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లా డుతూ.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయ న్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వంలో ధరణి పేరుతో వేలాది కోట్ల ఆస్తులు ఎలా దోచుకుని దాచుకున్నారో..ఆ లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం అభివృద్ధిపై పెట్టలేద ని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లలో అర్హుల ఎంపికకు రాజకీయాలకతీతంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇళ్లు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్షా 12 వేల ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందిస్తామని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభు త్వంలో ఎన్నో లిఫ్ట్‌లు, రహదారులు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లత, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. -
ఈ మమకారం ఎప్పటికీ తీరదు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డపై సగర్వంగా ప్రకటించారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా సోమవారం వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్న సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గ పరిధిలో రూ.861.84 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని, సొంతగడ్డపై మమకారం ఎప్పటికీ తీరేది కాదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రారంభించినవి ఇవీ.. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా రూ.20.69 కోట్లతో అధునాతన వసతులతో 4,595 చదరపు మీటర్లలో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవన సముదాయాన్ని సీఎంజగన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో 58 షాపులు, మొదటి ఫ్లోర్ లో 32 షాపులతో పాటు టాయిలెట్ బ్లాకులను ఏర్పాటు చేశారు. పులివెందులలో 2.79 ఎకరాల్లో రూ.38.15 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్డీవో, స్పందన హాల్, అగ్రికల్చర్, పే–అకౌంట్స్, సబ్‌ట్రెజరీ, 3 కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో పాడా ఆఫీస్, పీఆర్, ఆర్‌డబ్ల్యూస్ ఇంజనీరింగ్, సీడీపీవో కార్యాలయాలు, రెండు కాన్ఫరెన్స్ హాళ్లున్నాయి. రూ.500 కోట్లతో నాబార్డ్, ఆర్ఐడీఎఫ్–37 నిధులతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) భవనాలను ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏటా 150 మంది వైద్య విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రవేశాలు కల్పిస్తారు. 627 పడకల కెపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ప్రధానంగా ఓపీడీ బ్లాక్, ఐపీడీ బ్లాక్, 24/7 అక్యూట్ కేర్ బ్లాక్ భవనాలున్నాయి. పులివెందులలో డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) ఎదుట సిబ్బంది, అధికారులతో సీఎం వైఎస్ జగన్ ► పులివెందుల మైన్స్ సమీపంలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ వద్ద రూ.20.15 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ (పులివెందుల మార్కెట్ కమిటీ) భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న నాలుగు (4/150) కోల్డ్ రూములు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు (6/21) ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జితో పాటు బనానా, స్వీట్ లైమ్కు సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటయ్యాయి. ► పులివెందుల పట్టణం నడిబొడ్డున రూ.70 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ఆకర్షణీయంగా ల్యాండ్ స్కెప్ మధ్యలో చూపరులను ఆకట్టుకునేలా డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.11.04 కోట్లతో అభివృద్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం నిర్వహించారు. వైఎస్ఆర్ జంక్షన్‌కు 500 మీటర్ల దూరంలో అభివృద్ధి చేసిన ఈ మార్గంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్, రోడ్డుకు ఇరువైపులా 3 మీటర్ల ఫుట్‌పాత్, 2.25 మీటర్ల సీటింగ్ ఏరియా, బెంచ్‌లు, 3 మీటర్ల పార్కింగ్ ఏరియా, స్టోన్ బొల్లార్డ్స్, రోడ్డుకు ఇరువైపులా నగిïÙలతో తయారైన విద్యుత్ దీపాలు, పూల కుండీలతో 6 మీటర్ల బీటీ క్యారేజ్ వే వంటి ప్రత్యేకతలు పులివెందుల పట్టణ సరికొత్త జీవనశైలికి నాంది కానున్నాయి. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణ నడిబొడ్డున రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన గాంధీ జంక్షన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సర్కిల్లో అత్యంత సుందరంగా, జీవకళ ఉట్టి పడేలా నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహం, పూలమొక్కలతో ల్యాండ్ స్కేప్, లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యమంత్రి పర్యటనలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ వి.విజయ్‌రామరాజు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, పాడ ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు బలరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌తోపాటు పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పర్యటన పూర్తి చేసుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరిన సీఎం జగన్‌కు కడప విమానాశ్రయంలో సాదరంగా వీడ్కోలు పలికారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మి«థున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ జకియాఖానం, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, డీసీ గోవిందురెడ్డి, రమేష్ యాదవ్, ఎమ్మెల్యేలు దాసరి సుధా, పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సు«దీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్‌బాబు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా రూ.175 కోట్ల పెట్టుబడితో 16.63 ఎకరాల్లో నిర్మించిన ఆదిత్య బిర్లా రెడీమేడ్ సూట్స్ తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ పరిశ్రమ స్థాపనతో ఇప్పటికే 500 మంది ఉద్యోగాలను పొందగా మొత్తం 2,100 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇడుపులపాయ ఎస్టేట్‌లో రూ.39.13 కోట్లతో 16 ఎకరాల్లో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. నెమళ్ల పార్కు, పచ్చదనంతో ఆకట్టుకుంటున్న ఇడుపులపాయ ఎస్టేట్ దీనిద్వారా పర్యాటక శోభను సంతరించుకుంది. 48 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం, ఆడియో విజువల్ బ్లాక్, ఫోటో గ్యాలరీ, ఎంట్రన్స్ బ్లాక్, పెవిలియన్ బ్లాక్, చిల్డ్రన్ పార్క్, ట్రాపికల్ గార్డెన్ లోటస్ పాండ్, ఫ్లోరల్ పార్క్, పాదయాత్రకు సంబంధించి 21 విగ్రహాల సమూహం ఉన్నాయి. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా రూ.65.99 కోట్లతో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఇందులో ఎంట్రన్స్ ప్లాజా, ఎంట్రన్స్ వాటర్ ఫౌంటెన్, ఐ లవ్ పులివెందుల, ఎలివేటెడ్ స్టెప్స్, ఓ.ఏ.టి. ఏరియా, బ్రిడ్జి, మ్యూజికల్ లేజర్ ఫౌంటెన్, మేజ్ గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా, కనెక్టింగ్ బ్రిడ్జి, బోటింగ్ జెట్టీ, అర్బన్ ఫారెస్ట్ తదితర ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. -
జగన్ ఏంటో చెప్పడానికి విశాఖ చాలదా!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో చేసిన ప్రసంగం ఎంత ముచ్చటగా ఉందో గమనించారా..! ఆయన చక్కటి ఇంగ్లీష్ భాషలో నిరాఘాటంగా ప్రసంగించి ఆ సదస్సులో ఉన్న సుమారు రెండువేల మంది ఔత్సాహికులు, వివిధ వర్గాల వారిని ఆకట్టుకున్నారు. ఆ ప్రసంగం వింటుంటే ఏపీ గౌరవాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచినట్లు అనిపిస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వచ్చీ, రాని ఆంగ్లభాషలో మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బంది అనిపించేది. ఆంగ్ల భాష రాకపోవడం తప్పు కాదు. గ్రామర్‌తో సంబంధం లేకుండా మాట్లాడడం కన్నా ముందుగా తయారుచేసిన ప్రసంగం చదవడం మంచిది. కాని చంద్రబాబు అలాకాకుండా తాను ఆంగ్లంలో పండితుడినే అన్నట్లుగా సొంతగా స్పీచ్ ఇవ్వడానికి యత్నించేవారు. దాంతో పలు తప్పులు దొర్లేవి. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలో ఆ సమస్య లేదు. దానికి కారణం ఆయన ఆంగ్ల భాషలోవిద్యను అభ్యసించడమే. బహుశా అందుకేనేమో రాష్ట్రం అంతటా తెలుగుతో పాటు, ఆంగ్ల మీడియంను ప్రభుత్వ స్కూళ్లలో పెట్టి విద్యార్దులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాన్ని అలా ఉంచితే విజన్ విశాఖపై ఆయన మాట్లాడిన విషయం చక్కగా ఉంది. అందులో ఒక చిత్తశుద్ది కనిపించింది. వైజాగ్ నగరాన్ని అభివృద్ది చేయడం ద్వారా రాష్ట్రానికి ఒక ఆర్దిక గ్రోత్ ఇంజన్‌గా ఉపయోగపడుతుందన్న వాదనను బలంగా వినిపించారు. విశాఖను ఏ విధంగా అభివృద్ది చేసేది కూడా ఆయన డాక్యుమెంటరీ ద్వారా కూడా చూపించారు. అమరావతి రాజధానిగా తాను వ్యతిరేకం కాదని, శాసన రాజధానిగా కొనసాగుతుందని అంటూ విశాఖలో కార్యనిర్వహాక రాజధానిగా చేస్తామని, ఎన్నికల తర్వాత అది జరుగుతుందని ఆయన ధీమాగా చెప్పారు. ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పడంలో ఆయనకు ఉన్న విశ్వాసం అలాంటిది. ఆయన ధైర్యం అటువంటిది. నిజానికి ఎన్నిక ముందు ఇలాంటి విధాన ప్రకటనలు చేయడంలో రిస్కు ఉంటుందని మామూలు రాజకీయ నేతలు భావిస్తారు. కాని వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా చేయలేదు. తన కార్యాచరణ ఏమిటో స్పష్టంగా చెప్పేశారు. అమరావతిలో ప్రాధమిక వసతుల కల్పనకే లక్ష కోట్లు వ్యయం అవుతుందని, అదే విశాఖలో అభివృద్ది చెందిన వసతులు ఉన్నాయని, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు ధీటుగా విశాఖను తయారు చేస్తే రాష్ట్రానికి ప్రయోజనమని ఆయన స్పష్టం చేశారు. నిజంగానే ఏపీలో అతి పెద్ద నగరం విశాఖపట్నం. హైదరాబాద్ ప్రముఖ నగరంగా అభివృద్ది చెందబట్టే ప్రభుత్వానికి పన్నులు, తదితర రూపాలలో ఆదాయం బాగా వస్తోంది. విశాఖను కూడా ఆ స్థాయికి తీసుకురావాలన్న తన లక్ష్యాన్ని విజన్‌లో వివరించారు. ఐకానిక్ సచివాలయం, అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన అతి పెద్ద స్టేడియం, భోగాపురం విమానాశ్రయం, ఆ ఎయిర్ పోర్టు వరకు సముద్రం ఒడ్డున ఆరు లైన్ల రహదారి, పెద్ద కన్వెన్షన్ సెంటర్ మొదలైనవి రూపుదిద్దుకుంటే విశాఖ స్వరూపమే మారే అవకాశం ఉంటుంది. దానినే వైఎస్ జగన్మోహన్రెడ్డి తన విజన్ వైజాగ్‌లో తెలియచేశారు. విశాఖలో ఈ మద్యకాలంలో వేసిన రోడ్లు చూస్తే అక్కడ జరిగిన అభివృద్ది తెలుస్తుంది. బీచ్ రోడ్డుకాని, వ్యాలీ స్కూల్ రోడ్డు కాని ఎంతో బాగా అభివృద్ది చేశారని ఒక కారు డ్రైవర్ నాతో అన్నారు. రిషికొండ వద్ద నిర్మించిన టూరిజం భవనం కూడా విశాఖకు ఒక మణిదీపంగా కనిపిస్తుంది. వీటన్నటిని చెడగొట్టడానికి ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి చేయని దుర్మార్గం లేదు. వారు చెత్త రాయడం, దానిని పట్టుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడి విశాఖపై విషం చిమ్మడం వంటివి ఇంతకాలం చేశారు. ఎన్నికలు వచ్చినందున ఇప్పుడైనా ఆపుతారేమోనని అనుకుంటే ఈనాడు మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. విజన్ విశాఖ గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన రోజే ఈనాడు దానిని విమర్శిస్తూ అన్యాయంగా కధనాలు రాసింది. దీనివల్ల వారికి ఏమి వస్తుందో తెలియదు. వారి స్వార్ధ, రాజకీయ ప్రయోజనాలకోసం ఇంతగా దిగజారడం బాగోలేదు. భూముల కబ్జా అంటూ ఈనాడు పచ్చి అబద్దాలు రాసి ప్రజల మనసులలో విశాఖ అభివృద్ది జరుగుతున్న తీరును మర్చిపోయేలా చేయాలన్నది వారి లక్ష్యం. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో విశాఖలో కబ్జాలు, హుద్ హుద్ తుపానులో రికార్డులు గల్లంతయ్యాయని అధికారికంగా వెల్లడి చేసిన సంగతి అన్ని మర్చిపోయినట్లు ఈనాడు నటిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 400 ఎకరాల భూమిని కబ్జా నుంచి విడిపించింది. అయినా ఎక్కడైనా భూవివాదాలు ఉండవచ్చు. అంతమాత్రాన విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా మారకూడదని చెప్పడమే అత్యంత శాడిజం అని చెప్పాలి. అమరావతిలో వారికి ఉన్న వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న బాధ తప్ప, రాష్ట్రం గురించి ఆలోచనే ఈనాడు రామోజీ, చంద్రబాబు, పవన్ వంటివారికి లేకపోవడం దురదృష్టకరం. విశాఖకు వస్తున్న డేటా సెంటర్, ఐటి కంపెనీలు మొదలైనవాటి గురించి కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించి, విద్యుత్ రంగంలో 30 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. ఈ రకంగా అభివృద్దిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దూసుకుపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే వాటిని అడ్డుకోవడానికి విపక్షం, ఆ వర్గం మీడియా నానా పాట్లు పడుతోంది. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారో, ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తానని చెప్పారో, ఉత్తరాంద్ర అంతటా దాని ప్రభావం పడి వైసీపీ విజయావకాశాలు బాగా పెరుగుతాయన్నది టీడీపీ, ఆ వర్గం మీడియా భయం అని వేరే చెప్పనవసరం లేదు. విశాఖతో పాటు ఆయా చోట్ల పూర్తి చేసిన అభివృద్ది పనులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కలగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం ఇచ్చారు. నిజంగా ఇది ఏపీ ప్రజలంతా సంతోషించవలసిన సమయం. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఆయన తనయుడుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించడం గొప్ప సంగతే. 31 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించడం అంటే తమాషా కాదు. అయినా వైఎస్ఆర్ సాహసోపేతంగా దీనిని ఆరంభించారు. సీపీఐ నేతల కోరిక మేరకు దివంగత నాయకుడు పూల సుబ్బయ్య పేరు కూడా పెట్టారు. కృష్ణానదికి వరద వస్తే ఈ ప్రాజెక్టు కింద నిర్మించిన నల్లమల సాగర్‌కు నీరు చేరుతుంది. దానిని ఈ మూడు జిల్లాలకు పంపిణీ చేయవచ్చు. తద్వారా ఈ జిల్లాలలోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ఆ ప్రాంత రైతులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దానిని సాకారం చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇలా వివిధ కార్యక్రమాలను ఎన్నికల ముందు చకచకా ఆరంభిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సత్తా ఏమిటో తెలియచేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక విజన్‌తోనే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారనడానికి ఇవి ఉదాహరణలే అవుతాయి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూకశ్మీర్ నూతన శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అబివృద్ధికి అడ్డుగోడగా మారిన ఈ ఆర్టికల్‌ను రద్దు చేశాక ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, జమ్మూకశ్మీర్ హాయిగా ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. గురువారం జమ్మూకశ్మీర్‌లో మోదీ పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 1,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్’, ‘దేఖో ఆప్నా దేశ్ పీపుల్స్ చాయిస్ టూరిస్టు డెస్టినేషన్ పోల్’ అనే రెండు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ‘వికసిత్ భారత్–వికసిత్ జమ్మూకశ్మీర్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్ ప్రజలనే కాకుండా మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ ఆర్టికల్ రద్దయ్యాక జమ్మూకశ్మీర్ సంకెళ్లు తెగిపోయాయని అన్నారు. అద్భుతమైన శ్రీనగర్ ప్రజల్లో ఈరోజు తాను కూడా ఒకడినైనందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ రోజు తాను ప్రారంభించిన ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ ప్రగతిని మరింత వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ అనే స్వప్నం సాకారం కావాలంటే జమ్మూకశ్మీర్ అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని చెప్పారు. మోదీతో కశ్మీర్ యువకుడి సెల్ఫీ జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన యువకుడు నజీమ్ నజీర్ కల నెరవేరింది. సాక్షాత్తూ మోదీతో అతడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. అంతేకాదు నజీర్‌ను మోదీ తన స్నేహితుడిగా సంబోధించారు. గురువారం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది. నజీర్ తేనెటీగల పెంపకం, తేనె వ్యాపారం చేస్తున్నాడు. మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. దీంతో ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం లభించింది. నజీర్ గురించి తెలుసుకున్న మోదీ అతడిని అభినందించారు. మీతో సెల్ఫీ తీసుకోవాలని నజీర్ కోరగా మోదీ అంగీకరించారు. ఈ సెల్ఫీని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిత్రుడు నజీర్‌తో సెల్ఫీ దిగడం మరిచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు. తేనె వ్యాపారంతో నజీర్ తీపి విప్లవం తీసుకొచ్చాడని ప్రశంసించారు. మీ కుటుంబ సభ్యులను పంపించండి భారతదేశానికి కిరీటం లాంటి జమ్మూకశ్మీర్‌లో పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో ప్రగతికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ ఉద్ఘాటించారు. జమ్మూకశ్మీర్ కేవలం ఒక ప్రాంతం కాదని, ఇది మన దేశానికి శిరస్సు లాంటిదని చెప్పారు. తలెత్తుకొని నిలబడటం అభివృద్ధికి, గౌరవానికి గుర్తు అని పేర్కొన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ‘చలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు తమ కుటుంబాల నుంచి కనీసం ఐదుగురిని జమ్మూకశ్మీర్ పర్యటనకు పంపించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు మోదీ మహాశివరాత్రి, రంజాన్ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేశారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక ప్రధానమంత్రి కశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. -
విశాఖను ఎన్నిరకాలుగా అభివృద్ధి చెయ్యవచ్చు..?
-
విశాఖలోనే ప్రమాణ స్వీకారం.. అక్కడి నుంచే పాలన: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నం నుంచే పరిపాలన సాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి వైజాగ్ గ్రోత్ ఇంజన్ లాంటిదని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా సమగ్రాభివృద్ధి చెందాలంటే విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు చెప్పారు. అయితే తాను ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ఇప్పటికే కనీస మౌలిక సదుపాయాలున్న విశాఖ నగరంపై కొద్దిగా శ్రద్ధ పెడితే పదేళ్లల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడుతుందన్నారు. ‘విజన్ విశాఖ’సదస్సులో భాగంగా మంగళవారం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో 2 వేల మందికిపైగా పారిశ్రామిక, వాణిజ్య వర్గాలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ‘ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ విత్ సీఎం’అంశంపై ప్రసంగించి విజన్ విశాఖ డాక్యుమెంటరీని తిలకించారు. రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధి ప్రణాళికతో కూడిన ‘విజన్ విశాఖ’పుస్తకాన్ని ఆవిష్కరించారు. పరిపాలన రాజధాని విశాఖలో ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, అంతర్జాతీయ స్టేడియంతో పాటు ఐకానిక్ సెక్రటేరియట్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఐకానిక్ సెక్రటేరియట్ భవన నమూనాను కూడా సీఎం జగన్ ఆయన ఆవిష్కరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆర్థికాభివృద్ధిలో నగరాభివృద్ధి కీలకం రాష్ట్రానికి విశాఖ ఎందుకు అవసరం? నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలి? అనే అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది. విభజన తర్వాత ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశవ్యాప్తంగా జీఎస్డీపీలో వ్యవసాయం వాటా సగటున 17–18 శాతం ఉంటే మన రాష్ట్రంలో 35 శాతం ఉంది. ద్వితీయ, తృతీయ రంగాలైన తయారీ, సేవా రంగాలు వృద్ధి చెందకుంటే రాష్ట్రం ఆర్థికంగా నిలబడలేదు. అవి శరవేగంగా వృద్ధి చెందితేనే మన ముందున్న సవాళ్లను అధిగమించి ఆశించిన మేరకు ఆర్థికాభివృద్ధిని సాధించగలం. విభజనతో హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం వల్ల రాష్ట్రం మీద పెను ప్రభావం పడింది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఒక చోదకశక్తి అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ఆర్థిక చోదక శక్తి అయిన హైదరాబాద్‌ను మనం కోల్పోయాం. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఐడీపీఎల్, ఎన్ఎండీసీ, ఎన్ఎఫ్సీ, ఐఐసీటీ లాంటివన్నీ అక్కడే ఉండటంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సంస్థలు వస్తే అభివృద్ధి పరంగా వెంటనే మంచి మార్పు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి జీతాలు లభిస్తున్న ఉద్యోగులు ఉంటారు. మంచి సంస్థలు రావడం, మంచి ఆర్థిక ప్రగతి నమోదు ఒక సైకిల్ లాగా జరుగుతుంది. తద్వారా ఆ నగరం బాగా విస్తరిస్తుంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన ప్రభుత్వరంగ సంస్థల్లో 90 శాతం హైదరాబాద్‌లోనే స్థాపించడంతో అది వేగంగా అభివృద్ధి చెందింది. దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అలా జరగలేదు. విశాఖతో సేవా రంగం వాటా పెరుగుతుంది.. ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపేది సేవారంగమే. జాతీయ స్థాయిలో చూస్తే జీఎస్డీపీలో సేవారంగం వాటా 55 శాతంగా ఉంది. తెలంగాణలో సేవా రంగం వాటా దాదాపు 62.87 శాతం. ఇందులో మెజార్టీ హైదరాబాద్ నుంచే వస్తోంది. మన రాష్ట్రంలో సేవారంగం వాటా 40 శాతం మాత్రమే ఉంది. తయారీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే సమాన స్థాయి లో ఉన్నప్పటికీ సేవా రంగం విషయంలో మనం గణనీయ ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది. అది పెరిగినప్పుడే మన ఎకానమీ పెరుగుతుంది. 2022–23లో ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518 కాగా తెలంగాణలో రూ. 3,12,398 గా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఏపీలో సేవా రంగం వాటా పెరగాలంటే హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకోవాలి. మహానగ రాలతో పోటీపడే సత్తా ఉన్న నగరం విశాఖ మాత్రమే. మన బలం.. మన తీరమే దేశంలోనే రెండో అతిపెద్ద సముద్రతీర ప్రాంతం మనకు ఉంది. 974 కి.మీ పొడవైన తీరం వల్ల పోర్టు ఆధారిత అభివృద్ధికి అవకాశం ఉంది. తద్వారా తయారీ రంగానికి మంచి అవకాశాలుంటాయి. పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా తయారీ రంగానికి సహకారాన్ని అందిస్తూ తీరం వెంట పారిశ్రామిక వాడలు, విశాఖను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. 2019కు ముందు ఏపీలో కేవలం 4 చోట్ల నుంచే ఎగుమతులు జరగ్గా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.16 వేల కోట్లతో మరో 4 పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే రూ.4 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేశాం. రామాయపట్నం పోరు్టకు వచ్చే నెలలోనే షిప్పులు వచ్చే పరిస్థితి ఉంది. కాకినాడలోని ప్రైవేట్ పోర్టుతోపాటు మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. తీరం వెంట ప్రతి 50 కి.మీ లకు పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లనూ ఏర్పాటు చేస్తున్నాం. భారీ పారిశ్రామిక పార్కులు.. పారిశ్రామిక నోడ్స్లో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తిలో ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌ను నెలకొల్పాం. అచ్యుతాపురం, ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రమంతటా సమతుల్య అభివృద్ధి ఉండేలా చూస్తున్నాం. ప్రభుత్వ చర్యలు, వ్యాపార అనుకూల వాతావరణం వల్ల మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. విశాఖ జీఐఎస్‌లో రూ.13 లక్షల కోట్లకుపైగా విలువైన 352 ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. స్వయం ఉపాధికి ప్రోత్సాహం... కొత్తగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం భారీ పరిశ్రమల ద్వారా మాత్రమే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ స్వయం ఉపాధి మార్గాల వైపు నడిపిస్తోంది. లంచాలకు తావులేకుండా, దళారీలు లేకుండా డీబీటీ పద్ధతిలో ప్రయోజనాన్ని అందిస్తున్నాం. ఉదాహరణకు చేయూత పథకాన్నే తీసుకుంటే క్రమం తప్పకుండా ఒక్కో మహిళకు రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు స్థిరంగా ఇచ్చాం. లబ్ధిదారులైన ఆ మహిళలను బ్యాంకులతో అనుసంధానం చేశాం. అమూల్, ఐటీసీ, రిలయన్స్, పీ అండ్ జీ లాంటి పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇలాగే అమలు చేసింది. ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ రంగ వాటా కొద్ది శాతమే. మేం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 4 లక్షలు కాగా మేం వచ్చాక మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అదనంగా కల్పించాం. దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4 లక్షలే కాగా 50 శాతం కొత్త ఉద్యోగాలను మేం వచ్చాక సృష్టించగలిగాం. ఉపాధిలో వ్యవసాయానిది కూడా ప్రముఖ పాత్ర. మన వ్యవసాయ రంగంపై 62 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. 52 శాతం మంది రైతులకు అర హెక్టారు లోపే భూమి ఉంది. 70 శాతం మందికి హెక్టారు లోపే పొలం ఉంది. ఏపీలో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరు ఆదాయాలు పొందలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూప్పకూలిపోతుంది. అందుకే రైతులకు ఆర్బీకే లు, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా తోడుగా నిలుస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు అండగా.. అతి భారీ, భారీ పరిశ్రమల వల్ల 3 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తే ఎంఎస్ఎంఈలు 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 1.5 కోట్ల మందికి స్వయం ఉపాధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం వెనుక వీటి పాత్ర కీలకం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధికి సహకారాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో కోటిమందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. మన ప్రభుత్వం రాకముందు స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలు, ఎన్పీఏలు 80 శాతం వరకూ ఉంటే ఇప్పుడు 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. సొంతంగా కార్లు, వాహనాలు నడుపుతూ జీవించేవారికి వాహనమిత్ర ద్వారా అండగా నిలుస్తున్నాం. కులవృత్తులు చేసుకుంటున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లు లాంటి వారికి కూడా ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఆర్థికాభివృధ్ధిలో వీరందరిదీ కీలక పాత్ర. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ఎంఎస్ఎంఈలకు సకాలంలో ప్రోత్సాహకాలను విడుదల చేసి ప్రభుత్వం ఆదుకుంది. అందుకే వృద్ధి గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. 2018–19లో ఆర్థిక వృద్ధిరేటులో రాష్ట్రం చివరిలో ఉండగా గతేడాది మొదటి 5 రాష్ట్రాల్లో నిలవడం దీనికి నిదర్శనం. ఎందుకీ ఏడుపులు..? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. విశాఖ విషయంలో మనం ఏం చేయాలి? నగర అభివృద్ధి చరిత్రను ఎలా మార్చాలి? వచ్చే పదేళ్లలోగా మనం మహా నగరాలతో ఎలా పోటీపడాలన్నదానిపై దృష్టి సారించాలి. ఇదే విజన్ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి. ఈ ప్రాంతం, నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్తశుద్ధి లేకపోతే ఈ విజన్¯ సాకారం కాదు. వాస్తవంలోకి రాదు. అన్నిటికంటే ముందు.. ఒక సీఎంగా ఉన్న నేను ఇక్కడకు వచ్చి నివాసం ఉండాలి. నేను ఈ మాట చెప్పగానే ఏపీలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలున్న నెగెటివ్ మీడియా ఒక్కసారిగా భోరున విలపిస్తాయన్న సంగతి మీకు తెలిసిందే. వైజాగ్‌కు మారుస్తున్నామంటే చాలు.. భూములు కబ్జా చేయడానికే వస్తున్నారంటూ సిగ్గు లేకుండా కథనాలు వ్యాప్తి చేస్తున్నారు. కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నారు. ఇవన్నీ వాళ్లు ఎందుకు చేస్తున్నారంటే?..సీఎం అనే వ్యక్తి ఇక్కడకు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది! ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పురోగతి సాధిస్తుంది! అందుకే సీఎం ఇక్కడకు రాకూడదని అడ్డుపడుతున్నారు. దీనివెనుక వారికి స్వార్థ ప్రయోజనాలున్నాయి. అమరావతి రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలను బినామీల పేర్లతో కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారు. విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు ‘వైజాగ్ విజన్’డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అవి ఏమిటంటే... ► కనెక్టివిటీలో భాగంగా రూ.8,980.82 కోట్లతో 12 ఫ్లై ఓవర్ల నిర్మాణం, 6 లైన్ల బీచ్ కారిడార్ ప్రాజెక్టు, సబ్బవరం నుంచి షీలానగర్‌కు 6 లైన్ల రహదారి, షీలానగర్ నుంచి పోర్టు వరకు రోడ్డు నిర్మాణం. మరో రూ.1906.15 కోట్లతో నగరంలో వివిధ రోడ్ల నిర్మాణం. ► ప్రైట్ కారిడార్‌లో భాగంగా రూ.196 కోట్లతో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, శోంఠ్యాం నుంచి సింహాచలం వరకు ఫ్రైట్ కారిడార్. ► రూ. 14,309 కోట్లతో విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు ► రూ. 4,727 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం. ► పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రూ.2,633.47 కోట్లతో కనమాం వద్ద ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు, మురుగునీరు శుద్ధి ప్లాంటు, కోడూరు వద్ద ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం వగైరా. ► రూ. 10,823 కోట్ల పారిశ్రామిక పెట్టుబడుల్లో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు టీవీఎస్ లాజిస్టిక్స్, జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు తదితరాలు. ► రూ. 975 కోట్లతో విశాఖలో 24 గంటలు మంచినీటి సరఫరా పథకం ► రూ. 1,703 కోట్లతో నగరంలో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు ► సోషల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్లో భాగంగా రూ. 50 కోట్లతో 100 పార్కుల అభివృద్ధి, రూ. 250 కోట్లతో 151 చెరువుల అభివృద్ధి ప్రాజెక్టును రానున్న 5 ఏళ్లలో చేపట్టనున్నారు. ► రూ. 300 కోట్లతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం ► నగరంలో రూ.169.3 కోట్లతో ఇండోర్ స్టేడియంల నిర్మాణం ► రూ. 33.33 కోట్లతో అత్యాధునిక శ్మశానవాటికల నిర్మాణం ► రూ.40 కోట్లతో అమ్యూజ్మెంట్, ఫన్ జోన్లు ఏర్పాటు. ► రూ. 87.5 కోట్లతో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం. ► రూ. 108 కోట్లతో నేచురల్ హిస్టరీ పార్కు, రూ. 220 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, రూ. 18 కోట్లతో నేచురల్ కాటేజెస్ నిర్మాణం, రూ. 394.8 కోట్లతో బీచ్ డెక్, సైన్స్ మ్యూజియం నిర్మాణం. ► రూ.178.22 కోట్లతో ఎకో వైజాగ్ పేరుతో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటు నిర్మాణం, వనాల నిర్మాణం, రూ.16 కోట్లతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ► వీటితో పాటు రూ.4,039.20 కోట్లతో జగనన్న కాలనీల నిర్మాణం. రూ.1250 కోట్లతో మాల్స్, గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు స్వప్రయోజనం ఆశిస్తే కడప అనలేనా? హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో మనం పోటీపడాలంటే వైజాగ్ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ లాంటిది. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక చోదకశక్తి కావాల్సిందే. నిజంగా నాకేమైనా స్వప్రయోజనం ఉంటే నేను కడప గురించి మాట్లాడేవాడిని. భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది? ఏం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి? దేనివల్ల ఆర్థికంగా పురోగమిస్తాం? అనే ఆలోచన చేయకపోతే అన్యాయం చేసిన వాళ్లమవుతాం. ఈ కోణంలో మనం వైజాగ్ గురించి ఆలోచించలేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అని అంతా ప్రశ్నించుకోవాలి. నాయకుడి దార్శనికత సరిగా లేకపోతే వైజాగ్ అభివృద్ధి చెందదు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కోసం ఎవరైనా గట్టిగా నిలబడ్డారంటే.. అది నేను మాత్రమే. విశాఖ కోసం ప్రతిపక్షాలతో, ఎల్లో మీడియాతో పోరాడుతున్నాం. వారిలో ప్రతి ఒక్కరూ విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాకూడదని కోరుకుంటున్నారు. కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటా. నా ప్రమాణ స్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుంది. వైజాగ్ పట్ల నాకున్న కృతనిశ్చయం ఇది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన విశాఖలో రూ.1,528.92 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు నిర్వహించారు. ► రూ. 595 కోట్లతో మధురవాడలో పారిశ్రామిక, గృహ అవసరాల కోసం నీటి సరఫరా ప్రాజెక్టు పనులు ► రూ. 553 కోట్లతో మధురవాడలో సమగ్ర మురుగునీటి వ్యవస్థ పనులు, రూ. 99.47 కోట్లతో ముడసర్లోవ ప్రాంతంలో జీవీఎంసీ కొత్త సమీకృత కార్యాలయ నిర్మాణం. ► రూ. 231.04 కోట్లతో అమృత్ పథకం కింద వివిధ జోన్లలో సమగ్ర నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు పనులు. ► రూ. 15.65 కోట్లతో సాగర్‌నగర్ తాబేలు బీచ్ నిర్మాణ పనులు. ► రూ. 34.76 కోట్లతో ఎన్‌హెచ్–16కి సమాంతరంగా గిరి ప్రదక్షిణ రహదారి విస్తరణ పనులు. పదేళ్ల విజన్‌తో విశాఖ విశాఖ అభివృద్ధి కోసం పదేళ్ల విజన్‌తో వాస్తవిక దృక్పథంతో ప్రణాళిక రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రం,పీపీపీ పద్ధతుల్లో అందరూ ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు పోటీగా విశాఖను తీర్చిదిద్దేలా ఈ విజన్ ఉంటుంది. రాజధానిగా అమరావతి ఆలోచనను నేను ఎందుకు వ్యతిరేకించాలి? అలాంటి వ్యతిరేకత కూడా నాకేమీ లేదు. శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించిందీ, నిర్ణయించిందీ నేనే. కర్నూలును కూడా న్యాయ రాజధానిగా ప్రకటించిందీ నేనే. నాకేమీ ఎలాంటి వ్యతిరేకతా లేదు. ముందుగానే రూ.లక్ష కోట్లు ఖర్చు అమరావతి అనేది 50 వేల ఎకరాల ఖాళీ భూమి. రోడ్లు, నీళ్లు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాలు కల్పించడానికే వాళ్లు ఇచ్చిన డీపీఆర్ ప్రకారం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతి ప్రాంతంలో భవనాలు రావాలంటే ముందు కనీసం రూ.లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం ఒక లక్ష కోట్లు అనుకుంటే 20 ఏళ్లలో ఏటా రూ.5 వేల కోట్లు చొప్పున వేసుకుంటే సుమారుగా రూ.10 లక్షల కోట్లో, ఖర్చులు పెరిగి రూ.15 లక్షల కోట్లో అయినా అవుతుంది. అందుకనే అక్కడ అది చేయలేమని అంటున్నాం. అమరావతి ఆలోచనకు నేను వ్యతిరేకం కాదు. వైజాగ్‌లో ఇప్పటికే కనీస మౌలిక సదుపాయాలున్నాయి. మంచి రోడ్లు, కరెంటు, తాగునీటి సదుపాయం.. ఇలా అన్నీ ఉన్నాయి. కొన్ని మెరుగులు దిద్దితే సరిపోతుంది. వీటితో సిటీ రూపురేఖలు గణనీయంగా మారుతాయి. కార్యనిర్వాహక రాజధానిగా ఇక్కడకు మారే సమయంలో ఉద్యోగులు పనిచేసుకునేందుకు ఐకానిక్ సెక్రటేరియట్ ఉండాలి. అది దేశం దృష్టిని ఆకర్షించాలి. దేశం అంతా ఇటు చూసేలా ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, అహ్మదాబాద్ తరహాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉండాలి. వాటి రాకతో వైజాగ్ స్ధాయి పెరుగుతుంది. దేశమే కాకుండా ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంశాలను బోధించేలా ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ కూడా రావాలి. రానున్న 15–18 నెలల్లో పూర్తి చేసేలా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టును అనుసంధానించేలా 6 లేన్లతో అందమైన బీచ్ కారిడార్ రోడ్డు ప్రాజెక్టు కూడా రావాల్సి ఉంది. మెట్రో రైలు ప్రాజెక్ట్, ఏడాదిలోగా ప్రారంభమయ్యే మూలపేట పోర్టుతో హారిజాంటల్ గ్రోత్ కారిడార్ ఏర్పడుతుంది. డేటా సెంటర్‌తో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఆతిథ్య రంగంలో ఒబెరాయ్, మై ఫెయిర్ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. నగరానికి అత్యుత్తమ ఫైవ్ స్టార్ సదుపాయాలు సమకూరుతాయి. ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ రూపంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ప్రధాని తాజాగా దీనికి వర్చువల్‌గా శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ సాధ్యం కానివేమీ కాదు. ఇవన్నీ వాస్తవ రూపంలోకి వచ్చేవే. వచ్చే పదేళ్లలో ఇవన్నీ రాబోతున్నాయి. హైస్పీడ్ రైలు కారిడార్లపై కూడా ప్రధానితో మాట్లాడుతున్నాం. హైదరాబాద్ – వైజాగ్, విజయవాడ– బెంగళూరుల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లకోసం సంప్రదిస్తున్నాం. ఇవన్నీ రావడమే కాకుండా సీఎం కూడా ఇక్కడకు వస్తే పదేళ్లలో వైజాగ్ ప్రపంచంలో అత్యుత్తమ నగరాలతో పోటీపడుతుంది. ఎన్ని అడ్డంకులున్నా, అవరోధాలున్నా విశాఖ నగర వాసులకు నేను ఒకటే చెబుతున్నా.. మనం తప్పకుండా విజయం సాధిస్తాం. -
విశాఖ రాజధాని.. సీఎం జగన్ కీలక ట్వీట్
సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని.. ఇందుకోసం రానున్న పదేళ్లలో విశాఖ అభివృద్ధిపై స్పష్టమైన రూట్ మ్యాప్‌ని సిద్ధం చేశామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల అనంతరం సీఎంగా నా రెండవ ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుంది. నేను కూడా ఇక్కడే నివాసం ఉంటానని హామీ ఇస్తున్నా. వైజాగ్ మీద నా నిబద్ధత అదీ’’ అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. We will have a practical, pragmatic 10 year vision and roadmap for Vizag, the executive capital of Andhra Pradesh. I assure everyone, post the upcoming elections, my swearing in ceremony for my second term as the Chief Minister will be in Vizag and I will be staying in Vizag.… pic.twitter.com/ydVWD1bW3H — YS Jagan Mohan Reddy (@ysjagan) March 5, 2024 సీఎం జగన్ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమయ్యారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘భవిత’ పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. -
ఏపీ అభివృద్ధి సదస్సులో సీఎం జగన్ దృశ్యాలు
-
‘విజన్ విశాఖ’ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘విజన్ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్న కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ది చెందుతోందని.. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఏపీలో నిరుద్యోగం తగ్గింది ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. డీబీటీ పద్దతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. సముద్రతీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని.. ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్ పేర్కొన్నారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణం చేస్తా వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. విశాఖపై విషం కక్కుతున్నారు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సీఎం జగన్ తెలిపారు. స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్నిమీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని అన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని తెలిపారు. కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ది చెందదని అన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని సీఎం జగన్ అన్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్ తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాలా కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని.. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారుస్తామని సీఎం జగన్ తెలిపారు. -
2024 వృద్ధి 6.8 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ 2024 క్యాలెండర్ ఇయర్ వృద్ధి అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను 6.8 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ‘‘అంచనాల కంటే బలమైన’’ ఆర్థిక గణాంకాలు తమ తాజా అంచనా పెంపునకు కారణంగా పేర్కొంది. జీ20 దేశాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించింది. 2025లో దేశ వృద్ధి రేటును 6.4 శాతంగా రేటింగ్ దిగ్గజం పేర్కొంది. 2023లో దేశ ఎకానమీ ఊహించినదానికన్నా అధికంగా మంచి పురోగతిని సాధించినట్లు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, పటిష్ట తయారీ కార్యకలాపాలు 2023లో భారత్ బలమైన వృద్ధి ఫలితాలకు దోహదపడ్డాయని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. -
శృంగవరపుకోటలో ఎంఎస్ఎంఈ పార్కు..ఉత్తరాంధ్రకు ఊతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పారిశ్రామికంగా వెనుకబడిన విజయనగరం జిల్లాకే కాదు ఉత్తరాంధ్ర ప్రగతికే ఊతమిచ్చేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా వృథాగా ఉన్న జిందాల్ (జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్) సంస్థ భూముల సద్వినియోగం చేయాలని సంకల్పించింది. 1,166 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా సుమారు రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు ఈ జిల్లాకు రానున్నాయి. తద్వారా 45 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంతేకాదు.. పరోక్షంగా వివిధ అనుబంధ వ్యాపార, సేవా రంగాల ద్వారా మరింత మందికి ఉపాధి చేకూరుతుంది. ఈ పార్కు జిల్లా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో కీలకమవుతుందనడంలో సందేహం లేదు. తొలుత అల్యూమినియం శుద్ధి కర్మాగారం మహానేత వైఎస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంతో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేస్తూనే మరోవైపు పారిశ్రామికంగానూ విజయనగరం జిల్లాకు ఊతమివ్వాలని తలపోశారు. అదే సమయంలో విశాఖ–విజయనగరం జిల్లాల సరిహద్దు (ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా)లో విరివిగా ఉన్న బాక్సైట్ నిక్షేపాల సద్వినియోగంతో అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుచేయడానికి జిందాల్ గ్రూప్ యాజమాన్యం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో 2005లో పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. ఏటా 14 లక్షల టన్నుల అల్యూమినియం ఉత్పత్తి లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ సంస్థను 2005 జూలై 8న ఏర్పాటుచేసింది. అప్పట్లోనే భూసేకరణ పూర్తి అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకోసం జిందాల్ సంస్థ శృంగవరపుకోట మండలంలో కొనుగోలు చేసిన 180 ఎకరాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 985 ఎకరాలను కేటాయించింది. ఇందులో కొంత ప్రభుత్వ భూమి కాగా ఎక్కువ భాగం అసైన్డ్ భూములు. వాటిపై ఆధారపడిన రైతులకు చట్టప్రకారం పరిహారాన్ని జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ (జేఎస్డబ్ల్యూఏఎల్) యాజమాన్యం చెల్లించింది. 2007–08 నాటికల్లా భూసేకరణ పూర్తయింది. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు పురోగతి ఆగిపోయింది. తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలూ ఆ ప్రాజెక్టుపై దృష్టిపెట్టలేదు. గిరిజనుల సంక్షేమం కోసం.. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు వద్దంటూ గిరిజనులు చేస్తున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సైట్ తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జేఎస్‌డబ్ల్యూ అల్యూమియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. నాడు సేకరించిన విలువైన భూమిని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో జిందాల్ యాజమాన్యం ఇటీవల ఎంఎస్ఎంఈ పార్కు లేదా లాజిస్టిక్స్ పార్కు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఏయే పరిశ్రమలకు అవకాశమంటే.. టెక్స్టైల్స్, అపెరల్స్, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఇథనాల్ మాన్యుఫ్యాక్చరింగ్, షిప్పింగ్ కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్, కాయిర్ ఇండస్ట్రీ, లిథియం–ఆయాన్ బ్యాటరీ రీసైక్లింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, టాయ్ ఇండస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కు. వ్యూహాత్మక ప్రాంతంలో పార్క్ ► ఎంఎస్ఎంఈ పార్క్‌కు ప్రతిపాదించిన ప్రదేశం వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ► రాజమహేంద్రవరం–విజయనగరం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ► విశాఖపట్నం–అరకు రోడ్డుతో శరవేగంగా నిర్మాణమవుతున్న విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే ఉంది. ► విశాఖపట్నం పోర్టుకు, భోగాపురంలో నిర్మాణమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అందుబాటులో ఉంది. ► చెన్నై–హౌరా రైల్వేలైన్, విశాఖ–కిరండూల్ (కేకే) రైల్వేలైన్లకు సమీపంలో ఉంది. ► తాటిపూడి రిజర్వాయర్‌కు కూడా ఇది సమీపంలో ఉంది. .. ఇలా అన్నివిధాలా కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాంతంలో రూ.531 కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక వసతులతో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతిపాదించింది. తద్వారా రూ.15వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 45 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
అవినీతికి, అభివృద్ధికి మధ్య పోరు: నడ్డా
ముంబై: రానున్న లోక్‌సభ ఎన్నికలు ఒకవైపు వారసత్వ రాజకీయాలు, అవినీతికి, మరోవైపు అభివృద్ధికి మధ్య పోరుకు వేదికగా మారనున్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ముంబైలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో నడ్డా మాట్లాడారు. ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో స్థానానికి చేరుకుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలు, అవినీతితో కూరుకుపోయి ఉన్నాయని విమర్శించారు. ఇటువంటి పార్టీలతో జరిగేది వినాశనమేనని హెచ్చరించారు. -
స్విట్జర్లాండ్‌కు పోటీగా కశ్మీర్
జమ్మూ: ఆర్టీకల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సామాజిక న్యాయం, సమీకృత అభివృద్ధి అనే కొత్త శకంలోకి కశ్మీర్ అడుగుపెట్టిందన్నారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కశ్మీర్ లోయను పర్యాటకానికి గమ్యస్థానంగా, స్విట్జర్లాండ్‌కు పోటీగా అన్ని విషయాల్లోనూ అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో కొత్త శకం ఆరంభమైందని, ఇక్కడి ప్రజలు వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి పొందారని పేర్కొన్నారు. గతంలో అధికారం చెలాయించిన వారసత్వ పాలకులు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. మోదీ మంగళవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. రూ.32,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వోద్యోగాలు పొందిన వారితో, పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్‌లో దేశంలోనే అతిపెద్దదైన 12.77 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం జమ్మూలో బహిరంగ సభలో ప్రసంగించారు. గల్ఫ్ దేశాల నుంచి జమ్మూకశ్మీర్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా కన్యాకుమారితో అనుసంధానించే రోజు దగ్గర్లో ఉందన్నారు. ఆ అడ్డుగోడ కూల్చేశాం.. జమ్మూకశ్మీర్‌లో నిత్యం బాంబులు, తుపాకులు, కిడ్నాప్‌లు, వేర్పాటువాదం వార్తలొచ్చే రోజులు పోయాయని, సమతులాభివృద్ధితో కూడిన నూతన కశ్మీర్ కనిపిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక రంగ ప్రగతితోపాటు అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే భక్తుల సంఖ్య పెరుగుతుండడం పట్ల స్రంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీకల్ 370 రద్దు నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐఐఎం క్యాంపస్‌లు ప్రారంభం ఐఐఎం–జమ్మూ, ఐఐఎం–బోద్‌గయ, ఐఐఎం–విశాఖపట్నం క్యాంపస్‌లను మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఐఐటీ–భిలాయ్, ఐఐటీ–తిరుపతి, ఐఐటీ–జమ్మూ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల క్యాంపస్‌లను జాతికి అంకితం చేశారు. 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ పాఠశాలల శాశ్వత క్యాంపస్‌లకు శంకుస్థాపన చేశారు. విద్యా రంగంలో స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. -
భ్రమరావతిని వీడి.. కళ్లు తెరిచి నిజాలు చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదనేవారికి, సంపద సృష్టించడం లేదనేవారికి, పరిశ్రమలపై అబద్దాలు రాసే వారికి ఇది పెద్ద సమాధానమే అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక కధనం ప్రకారం గత మూడేళ్లలో ఆదాయపన్ను రిటర్న్ లు ఫైల్ చేస్తున్న వారిలో పెరుగుదల వివరాలు చూస్తే ఏపీ దేశంలోనే మొదటిస్థానం సాధించింది. ఈ మూడేళ్లలో ఏపీలో 18 లక్షల మంది అదనంగా ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేశారు. ఇదేదో ఊహాగానం కాదు. కల్పిత విషయం అంతకన్నా కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ITRలపై ఇచ్చిన తాజా నివేదిక వెల్లడించిన సంగతి. ఆదాయపన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉండే మహారాష్ట్రలో గడిచిన మూడేళ్లలో 13.9 లక్షల మంది కొత్త అస్సెసీలు పెరిగితే, ఉత్తరప్రదేశ్ లో 12.7 లక్షలు, గుజరాత్ లో 8.8 లక్షల మంది కొత్త అస్సెసీలు వచ్చారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో విచిత్రంగా ఆదాయపన్ను మదింపుదార్లు పెరగకపోగా తగ్గిందని SBI నివేదిక చెబుతోంది. మొత్తం అన్ని రాష్ట్రాల ర్యాంకింగ్ లలో తెలంగాణ 20వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళలలో సగటున 3.4 లక్షల మందే కొత్త ఆదాయపన్ను అసెసీలు వచ్చారని ఈ నివేదిక పేర్కొంది. దీనికి కారణాలు కూడా ఈ నివేదిక విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్ లో మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలు, సంస్థలు బాగా పెరగడం వల్లే అని అందులో స్పష్టం చేశారు. ఏపీలో మొత్తం మీద పదిన్నర లక్షల MSME రిజిస్ట్రేషన్ లు జరిగాయని నివేదికలో తెలిపారు. ఏతావాతా చూస్తే AP ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు కూడా ఇందుకు బాగా దోహదపడ్డాయని అర్ధం అవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిలను సుమారు వెయ్యి కోట్లకు పైగా విడుదల చేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన రాయితీలను చాలావరకు ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. దాంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో ఉపాది పొందేవారికి రక్షణ కల్పించినట్లయింది. ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి వేల కోట్లు అవసరం అవుతాయి. పరిశ్రమను నెలకొల్పడానికి సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూనే చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే లక్షల మదికి ఉపాధి కలుగుతుందన్నది ఆర్దిక రంగ నిపుణులు చెబుతారు. దానికి అనుగుణంగా YSRCP ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావించవచ్చు. ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేసే స్థాయికి పద్దెనిమిది లక్షల మంది వెళ్లారంటే వారి ఆర్దిక స్తోమత పెరిగిందన్నమాట. దీనిని ఒక రకంగా సంపద సృష్టించడం అన్నమాట. అందులోను కొత్త పరిశ్రమలు నెలకొల్పి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే స్థితికి వచ్చారని అర్ధం చేసుకోవచ్చు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నిత్యం ఏపీలో అసలు ఏమీ జరగడం లేదని విషం చిమ్ముతుంటుంది. వారు ఇలాంటి వార్తలను, అసలు నిజాలను కప్పిపుచ్చుతుంటారు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో సంపద అంటే రియల్ ఎస్టేట్ సంపదే అనే అభిప్రాయం కల్పించారు. అందులో ధనవంతులు మరింత ధనికులు అవడమే ఆ విదానం. కేవలం దళారులు బాగుపడడం అందులో జరుగుతుంది. కాని చిన్న పరిశ్రమలు ఎక్కువగా రావడం వల్ల పేద, మద్య తరగతివారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే GSDPలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి నాలుగు స్థానాలలో ఉంటోంది. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే అన్న విశ్లేషణ వస్తుంది. RBI మాజీ గవర్నర్ రఘురామరాజన్ దీనిని సమర్ధిస్తుంటారు. ఇందులో ఆయా స్కీముల కింద ప్రజల చేతులలోకి నేరుగా డబ్బు వెళ్లేటట్లు చేయడం, దీనివల్ల అవినీతి పూర్తిగా లేకుండా పోయి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో సొమ్ము జమ అవుతుంది. ఈ డబ్బు పొందినవారంతా పేదలు, మధ్య తరగతి వారే కనుక దానిని పొదుపు చేసుకునే పరిస్థితి ఉండదు. వెంటనే వారు తమ అవసరాల కోసం మార్కెట్ లో వెచ్చిస్తారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుంది. వ్యాపారాలు అధికం అవుతాయి. తద్వారా పన్నులు కూడా ప్రభుత్వానికి జమ అవుతుంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. పైకి చూస్తే డబ్బు పంపిణీనే అనుకుంటారు. కాని ఇందులో లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలు అర్ధం అవుతాయి. జగన్ చేపట్టిన మరో స్కీమ్ చేయూత కింద నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి మహిళకు ఏడాదికి 18,750 రూపాయలు చొప్పున ఆర్దిక సాయం చేశారు. ఈ డబ్బును తీసుకున్నవారు వ్యాపారులు, కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీలుగా బ్యాంకులతో టై అప్ చేశారు. వారి ఉత్పత్తుల విక్రయానికి గాను రిలయన్స్, ఐటిసి తదితర మల్టి నేషనల్ సంస్థలతో టై అప్ చేశారు. తద్వారా సుమారు నాలుగు లక్షల మంది యూనిట్లు నెలకొల్పుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది కూడా ఆర్ధిక అభివృద్దికి దోహదం చేసేదే. మరో అంశం చూద్దాం. జగన్ ప్రభుత్వం ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చింది. అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. సగటున గ్రామం, పట్టణం,నగరాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో లబ్దిదారుడికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆస్తి సమకూరింది. దీనిని లెక్క వేస్తే ఎన్ని వేల కోట్ల సంపద సృష్టించింది తెలుసుకోవచ్చు. చంద్రబాబు టైమ్ లో ఇలాంటివి ఒక్కటైనా చేసి తాను సంపద సృష్టించానని చెప్పగలరా? లేదా ఆయన తరపున ప్రచారం చేసే రామోజీరావు ,రాధాకృష్ణ వంటివారు టీడీపీ తెచ్చిన సంపద ఏమిటో వివరించగలుగుతారా? ఇవే కాదు. స్కూళ్లు బాగు చేయడం, అక్కడ డిజిటల్ క్లాస్ లు పెట్టడం తదితర చర్యల వల్ల ఎన్ని లక్షల టీవీలు,ఇతర పరికరాలు కొనుగోలు చేశారో అంచనా వేసుకోండి. అలాగే వేలాది స్కూళ్లను బాగు చేయడం ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారు. గ్రామ,వార్డు సచివాలయాలను వేల సంఖ్యలో నిర్మించారు. రైతు భరోసా కేంద్రాలను, విలేజ్ క్లినిక్స్ ను కొత్త భవనాలు ఏర్పాటు చేసి నెలకొల్పారు. మరి అదంతా సంపద కింద రాదా? కేవలం అమరావతిలో ఒక ఏభై అంతస్థుల భవనం కడతామని, అది కట్టలేకపోయిన చంద్రబాబు ఏమో సంపద సృష్టించినట్లు ప్రచారం చేస్తుంటారు. ప్రాక్టికల్‌గా గ్రామాలలో, నగరాలలో ప్రత్యక్షంగా కనిపించేలా సంపదను ప్రజలకు అందిస్తేనేమో జగన్ పై దుర్మార్గపు విష ప్రచారం చేస్తుంటారు. అదంతా విధ్వంసం అని అబద్దపు రాతలు రాస్తారు. అభివృద్ది పరంగా చూస్తే చంద్రబాబు టైమ్ లో నిర్మించలేకపోయిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ బాదితులకు ఆస్పత్రి, భారీ నీటి పధకం , విశాఖ అభివృద్ది , ఇన్ ఫోసిస్, అదాని డేటా సెంటర్, నక్కపల్లి ఫార్మాహబ్ మొదలైనవి జగన్ చేపట్టిన ప్రగతికి నిదర్శనంగా నిలుస్తాయి. విద్యుత్ రంగంలో లక్ష మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తికి గాను మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యక్షంగా అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం వల్ల ఏపీ అభివృద్ది పధంలో సాగుతోందని చెప్పవచ్చు. అందుకే ఏపీలో ఆదాయపన్నుశాఖ చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వాస్తవాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఏపీ వ్యతిరేక మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ, ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రం సంతోషం కలిగించే విషయమే అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
అభివృద్ధికి కేరాఫ్ గా లంగరురేవు యాంకరేజ్ పోర్ట్
-
దేశ గౌరవం పెంచిన మోదీ: అమిత్ షా
మైసూరు: ‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు. తద్వారా అంతర్జాతీయ వేదికలపై దేశ సాంస్కృతిక గౌరవాన్ని ఇనుమడింపజేశారు. దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంతోపాటు యోగ, ఆయుర్వేద, భారతీయ భాషల పరిరక్షణకు మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆదివారం ఆయన మైసూరు సమీపంలోని సుత్తూరు జాతరలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మైసూరులోని చాముండి హిల్స్‌పై కొలువుదీరిన చాముండేశ్వరీ మాతను దర్శించుకుని పూజలు చేశారు. -
విప్లవాత్మక సంస్కరణలతో దేవదాయ శాఖలో సువర్ణాధ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ళ పాలనలో దేవదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేవదాయ శాఖలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబరులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడచిన ఐదేళ్ళ జగన్మోహన్రెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సమర్ధవంతంగా జరిగిందని, అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు. ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శించడం బాధాకరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక దేవాలయాలను కూల్చేయగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిన్నంటిని పునరుద్ధరించడమే కాకుండా 4500 కొత్త ఆలయాలను నిర్మించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600 కోట్ల వ్యయంతో ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీశైలం దేవాలయంలో భక్తులకు సౌకర్యం కల్పించే దిశగా సాలమండపాలు నిర్మాణాలను త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. విజయవాడలో ఇటీవల జరిగిన మహాలక్ష్మి యజ్ఞం ఫలితంగా కేంద్రం నుంచి నిధులు వరదల్లా పారాయన్నారు. 2018 వరకు 1621 దేవాలయాలకు మాత్రమే ధూపదీప నైవేధ్యాల సౌకర్యం ఉండేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10వేల దేవాలయాల వరకు ధూపదీప నైవేధ్యాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేసే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వార, మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అర్చక వెల్ఫేర్ బోర్డు, ఆగమ సలహామండలి, అర్చక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేశామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ బుకింగ్ కోసం యాప్‌ను కూడా రూపొందించామన్నారు. దేవాలయాల భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎండోమెంట్ ఆస్తుల లీజు గడువు ముగిశాక ఖాళీ చేసే విధంగా ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఆ చట్టం ప్రకారం వారిని ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్చకులు పనిచేసే దేవాలయాల పరిధిలో వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించామన్నారు. అందులో భాగంగా ఇళ్ళు లేని పేద అర్చకులకు ఇళ్ళు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పదోన్నతులు కల్పించడమే కాకుండా ఆలయాల నిర్మాణాలలో క్వాలిటీని పెంచేందుకు ఇంజనీర్లను నియమిస్తున్నామన్నారు. ప్రీ ఆడిట్ సిస్టంను అమల్లోకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని పలు దేవాయాలకు చెందిన ఉద్యోగులు మంత్రి కొట్టు సత్యనారాయణకు అభినందనలు తెలిపి గజమాలతో సత్కరించారు. -
‘మూసీ’పై సీఎంతో సింగపూర్ సంస్థ భేటీ
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్వహణపై సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని తెలిపారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతోపాటు హైదరాబాద్‌లో మూసీ డెవలప్మెంట్ నమూనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో భవిష్యత్తులో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని.. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని కోరారు. ఇటీవల లండన్, దుబాయ్‌లలో పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించడం, పలు విదేశీ కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతోనూ చర్చించడం తెలిసిందే. ఇందులో భాగంగా సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. సీఎంను కలిసిన వారిలో మెయిన్‌హార్ట్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తదితరులు ఉన్నారు. ఈ భేటీలో సీఎస్ శాంతికుమారి, పురపాలన, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. -
అభివృద్ధి పథంలో ఏపీ విద్యావ్యవస్థ
విశాఖ (విద్య): ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ అభివృద్ధి పథంలో పయనిస్తోందని మేధావులు స్పష్టం చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నాన్–పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ‘ప్రగతి బాటలో ఏపీ విద్యావ్యవస్థ’ అంశంపై సోమవారం చర్చాగోష్టి నిర్వహించారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం) పూర్వ వీసీ హెచ్.లజపతిరాయ్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రాజమండ్రి) మాజీ వీసీ ఎం.జగన్నాథరావు, ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ కె.శ్రీరామమూర్తి, ఏయూ విద్యా విభాగాధిపతి టి.షారోన్‌రాజు, ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగం విశ్రాంత ఆచార్యులు పి.విశ్వనాథం, సీహెచ్.సూర్యనారాయణ, బీవీకే కళాశాల రిటైర్డ్ లెక్చరర్ సి.వెంకటరావు చర్చాగోష్టిలో మాట్లాడారు. నాణ్యమైన విద్యనందించే విధంగా పాఠశాల స్థాయినుంచి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలు యువతను ఉన్నత, సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్ది మెరుగైన ప్రగతిని సాధించాయని, ఇదే తరహాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఆయన ధృక్పథం, పనితీరు మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. నాలుగేళ్ల కాలంలో విద్యారంగానికి నిధుల కేటాయింపులు 33 శాతానికి పైగా పెంచారన్నారు. రానున్న కాలంలో ఏపీ యువత ప్రపంచంలోనే నంబర్–1గా నిలుస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేస్తున్న సంస్కరణల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాల పిల్లలు పాఠశాల బాట పడుతున్నారని చెప్పారు. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు, బైజూస్ కంటెంట్‌తో డిజిటల్ పాఠాల బోధన ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. అవాస్తవాలతో దుష్ప్రచారం ఈ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది అవాస్తవాలతో దుష్ప్రచారం చేయాలని చూడటం సరికాదని విద్యారంగ నిపుణులు హితవు పలికారు. పేద పిల్లలకు చదువుల్ని దూరం చేసేందుకు కొన్నిశక్తులు కుట్రపూరితంగా పనిచేస్తున్నాయని, దీనిని మేధావి వర్గాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, భవిష్యత్ తరాలకు జరగనున్న మేలుపై వాస్తవ గణాంకాలతో వివరించేందుకు ఏ వేదికపైన అయినా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. నూతన విధానాలతో బోధన, విద్యకు నైపుణ్యం జోడిస్తూ ప్రతి విద్యార్థి మెరుగైన ఉద్యోగాలు సాధించేవిధంగా విద్యావ్యవస్థను ప్రగతివైపు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నాన్–పొలిటికల్ జేఏసీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. -
నారావారి పల్లెలో జరిగిన అభివృద్ధిని వివరించిన మోహిత్ రెడ్డి
-
North East Sammelan: గ్రోత్ ఇంజిన్ ఈశాన్య రాష్ట్రాలే: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ది చెందకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి ఈశాన్య రాష్ట్రాలే గ్రోత్ ఇంజిన్ అని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషల్ సెంటర్లో నిర్వహించిన ‘నార్త్ ఈస్ట్ సమ్మేళన్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యే దృష్టి సారించారని చెప్పారు. పదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. స్థిరమైన ప్రభుత్వం, నాయకుడి వల్లే నార్త్ ఈస్ట్‌లో శాంతి నెలకొందని, అభివృద్ధి సాధ్యం అవుతోందన్నారు. -
పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా మాది చేనేత కుటుంబం. మా ఆయన అశ్వర్థ నారాయణ ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. మాకు ముగ్గురు కుమారులు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మగ్గం నేతతోపాటు నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. ఒంట్లో సత్తువ తగ్గి బయట పనులకు వెళ్లలేకపోతున్నా. గతంలో కేవలం రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ వచ్చేది. 2019లో జగన్ సీఎం అయ్యాక పెన్షన్ పెరిగింది. ఇపుడు రూ.3 వేలు వస్తోంది. చేనేత వృత్తిలో ఉండటంతో వలంటీరే ఇంటికొచ్చి మరీ వైఎస్సార్ నేతన్న నేస్తంలో నా పేరు నమోదు చేశారు. ఈ పథకం కింద ఏటా రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు ఐదుసార్లు కలిపి మొత్తం రూ.1.20 లక్షలు నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కూడా వర్తించింది. రూ.18,750 చొప్పున మూడుసార్లు డబ్బులు అందుకున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నాకు కొండంత భరోసానిచ్చాయి. నాలాంటి ఒంటరి మహిళలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా, సంతోషంగా బతికే ధైర్యాన్నిస్తున్నాయి. – శిరివెల్ల లక్ష్మీదేవి, జమ్మలమడుగు (నాయబ్ అబ్దుల్ బషీర్, విలేకరి, జమ్మలమడుగు) 30 ఏళ్ల కల నెరవేరింది కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామం నుంచి నరసన్నపేట మండలం ఉర్లాంకు 30 ఏళ్ల క్రితం వలస వచ్చాం. కొన్నాళ్లకు మా ఆయన కన్నుమూశారు. ఒక్కగానొక్క కొడుకుని చదివిస్తూ, షాపుల్లో పని చేస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించాను. గతంలో ఉన్న ప్రభుత్వాలకు పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనే స్తోమత లేక అద్దెలు చెల్లిస్తూ జీవనం కొనసాగించాం. జగన్ బాబు ముఖ్యమంత్రి అయ్యాక మా కోరిక తీరింది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా రుణం ఇప్పించారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సొంత ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఇదివరకు సొంత ఇల్లు లేదని ప్రైవేటు దుకాణంలో పని చేస్తున్న మా అబ్బాయి వైకుంఠరావుకు పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి. ఈ వేసవికి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఇదంతా ముఖ్యమంత్రి చలువే. ఆయన సీఎం కాకపోతే మా కల నెరవేరేదికాదు. అలాగే ఈ ప్రభుత్వం నుంచి నాకు ఎంతో మంచి జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీనే వితంతు పింఛన్ వస్తోంది. డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ ఆసరా కింద నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా రూ.18,750 చొప్పున వచ్చింది. సీఎం జగన్ రుణం తీర్చుకోలేం. – పైడిశెట్టి సత్యవతి, ఉర్లాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) పింఛన్ మా ఇంటికే వస్తోంది మాది నిరుపేద కుటుంబం. మేము పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉంటున్నాం. మా నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. పుట్టుకతోనే నా రెండు కాళ్లు చచ్చుబడటంతో దివ్యాంగుడినయ్యాను. సెంటు భూమి కూడా లేని నన్ను మా అమ్మ కూలి పనులు చేసి బతికించింది. దివ్యాంగుడిని కావడంతో నన్ను ఎవరూ పనులకు పిలిచేవారు కాదు. అమ్మ కష్టాన్ని చూడలేకపోయాను. పెళ్లి మండపాల డేకరేషన్ పనులు నేర్చుకొని అప్పుడప్పుడు ఆ పనులకు వెళ్తున్నాను. ఎనిమిదేళ్ల క్రితం సలోమి అనే దివ్యాంగురాలితో నాకు వివాహమైంది. మాకు రాకేష్, సతీష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. నా భార్య కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమె కూడా పనులకు వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇద్దరికీ వచ్చే పింఛనే జీవనాధారంగా మారింది. గతంలో పింఛను తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయం వద్ద రోజుల తరబడి నిరీక్షించేవాళ్లం. ట్రై సైకిల్ పై రోజూ అక్కడకు వెళ్లి రోజుల తరబడి తిరిగితే గాని పింఛను డబ్బులు వచ్చేవి కావు. కానీ నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు, నా భార్యకు మొత్తం రూ.6 వేలు మా వలంటీర్ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు తెచ్చి అందిస్తున్నారు. మా అమ్మకు వితంతు పింఛను కింద రూ.3 వేలు వస్తున్నాయి. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వస్తోంది. మా బాబు ఈ ఏడాదే ఒకటో తరగతిలో చేరాడు. విద్యాకానుక కింద బూట్లు, బ్యాగ్, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇచ్చారు. మాకు వస్తున్న పింఛను డబ్బులతోనే మేము బతుకుతున్నాం. మా కుటుంబానికి ప్రభుత్వ పథకాలే అండగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న సాయం ఎప్పటికీ మరచిపోలేం. – మేడి నాగరాజు, దాచేపల్లి(వినుకొండ అజయ్‌కుమార్, విలేకరి, దాచేపల్లి) -
లక్షద్వీప్ పై కీలక ప్రకటన: నిర్మలా సీతారామన్
-
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పని
-
డోన్ చరిత్రలో చెరగని ముద్రవేశాము: ఆర్థికశాఖ మంత్రి బుగ్గన
ప్యాపిలి: డోన్ నియోజకవర్గంలో దాదాపు రూ. 2,700 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గ చరిత్రలో చెరగని ముద్ర వేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని హుసేనాపురం గ్రామంలో రూ. 18.77 కోట్లతో నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, బాలుర, బాలికల వసతి గృహాలు, గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం తదితర భవనాలను ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులతో కలసి ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లలో డోన్ నియోజకవర్గం నుంచి ఎన్నికై న నాయకులు చేయలేని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. ఐదేళ్లకోసారి ఎన్నికల ముందు కంబగిరి స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లే నాయకులు కనీసం ఆ దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయారని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డోన్ నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్యాపిలి మండలంలో మారుమూల గ్రామమైన వంకమెట్టుపల్లికి సైతం ఇంటింటికి తాగునీరు ఇవ్వడమే తన ధ్యేయం అన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని భావించి హుసేనాపురంలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు. పశుసంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాకపోవడానికి కారణం వెటర్నరీ విభాగంలో ఉన్నత చదువులు స్థానికంగా అందుబాటులో లేవని తాను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ కారణం చేతనే హుసేనాపురంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశానని తెలిపారు. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వెంటనే సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో గొర్రెల పెంపకం ద్వారా సంపద సృష్టించుకున్న గొర్రెల పెంపకందార్లు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని మంత్రి తెలిపారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో షెప్పర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి గొర్రెల పెంపకందార్లకు ఈ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. హామీలతో మభ్య పెడతారు జాగ్రత్త.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చి ఉచిత హామీలు గుప్పిస్తారని ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్ విమర్శించారు. మహిళలకు కిలో బంగారం, ఇంటికో కారు కూడా ఇస్తామని హామీ ఇస్తారని..అటువంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్న దూరదృష్టి గల వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం డోన్ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. డోన్ అందరికీ ఆదర్శం డోన్ నియోజకవర్గ అభివృద్ధి అందరికీ ఆదర్శమని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు డోన్ నియోజకవర్గాన్ని చూసి అభివృద్ధి విషయంలో మంత్రిని ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు. తాను కొద్ది రోజులుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంట పర్యటిస్తూ అభివృద్ధి కార్యాక్రమాలు చూస్తేంటే మంత్రి చొరవ అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్, శ్రీవేంకటేశ్వర వెటర్నరి యూనివర్సిటి డీన్ వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్ రవి, డైరీ డీన్ సురేశ్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమేంద్రకుమార్, ఏడీ సింహాచలం, నోడల్ ఆఫీసర్ లావణ్యలక్ష్మి, జేడీ రామచంద్రయ్య, డీఏహెచ్ఓ గోవిందనాయక్, డీడీలు శాంతయ్య, రామమూర్తి, ప్రిన్సిపాల్ మాధవి, జేసీఎస్ కన్వీనర్ బొర్రా మల్లికార్జునరెడ్డి, హుసేనాపురం, కొమ్మేమర్రి సర్పంచులు మహేశ్వర్ రెడ్డి, దస్తగిరమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్యాంరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కమతం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
సింహపురి చిద్విలాసం
పినాకిని నది సాక్షిగా జిల్లా కేంద్రం నెల్లూరులో ప్రగతి పరుగులు పెడుతోంది. నగరం సరికొత్త హంగులను సంతరించుకుంటోంది. సింహపురి రూపురేఖలు మారిపోయి కొత్త సొబగులను అద్దుకుంది. ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. నెల్లూరులో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేసింది. నగరంలో ఇప్పటికే 90 శాతం రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు, పైపులైన్లు నిర్మాణం పూర్తి కాగా మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి కానున్నాయి. - చిలకా మస్తాన్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, నెల్లూరు నెల్లూరు కార్పొరేషన్ పరిధి – 149.20 చదరపు కి.మీ. జనాభా (2011 ప్రకారం) 6 లక్షలకు పైగా ప్రస్తుత జనాభా (అంచనా) 8 లక్షలకు పైగా నాడు టీడీపీ పాలనలో నేతల కుమ్ములాటలు, నిధులు మంజూరులో జాప్యం, ఖర్చు పెట్టడంలో నిర్లక్ష్యం. నీరు–చెట్టు, ఇసుక, మద్యంలో నిధుల స్వాహా, గుంతల రోడ్లు, అస్తవ్యస్త డ్రైనేజీ, మురికి కూపంలా పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి సమస్యలు. నగరం మొత్తం దుమ్ము, ధూళి, ఏ వీధి చూసినా చెత్త కుప్పలు. వెరసి పడకేసిన అభివృద్ధి. నేడు నగరంలోని జంక్షన్లు అభివృద్ధి చెందాయి. రోడ్లు విశాలంగా మారాయి. వివిధ ప్రాంతాల్లోని 12 జంక్షన్లను సుందరీకరించారు. అభివృద్ధి పనులకు రూ.వంద కోట్లు ఖర్చు పెట్టారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమయ్యాయి. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. క్రమంగా సింహపురి నగర రూపురేఖలు మారుతూ వచ్చాయి. ఈ మార్పు కేవలం నాలుగున్నరేళ్లలోనే సాధ్యమైంది. నగర వాసుల కష్టాలకు చెక్ పడింది. ఫ్లై ఓవర్ వంతెన.. సీసీ రోడ్ల నిర్మాణం కేంద్ర నిధులతో నగరంలోని మినీబైపాస్ రోడ్డు, రామలింగాపురం జంక్షన్ వద్ద రూ.41.88 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో 810 మీటర్ల పొడవున ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. తద్వారా ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాయి. రూ.9 కోట్లతో 2.7 కి.మీ. మేర మైపాడు ప్రధాన రహదారిని నాలుగు లేన్ల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. నగరంలోని జీఎన్టీ రోడ్డు, మినీబైపాస్ రోడ్డు, స్టోన్‌హౌస్‌పేట తదితర ప్రాంతాల్లో దాదాపు 23 కి.మీ. మేర రూ.60 లక్షలు వెచ్చించి సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. వేగంగా ప్రగతి బాటలు.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరా, డ్రైనేజీ, చెత్త సేకరణ, వీధిదీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్, సఫాయి మిత్ర ప్రైజ్ మనీ వంటి వివిధ వనరుల నుంచి రూ.8.5 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. బాగుపడ్డ ప్రభుత్వ బడులు నాడు–నేడు ఫేజ్–2 కార్యక్రమం మంజూరైన నిధులు – రూ.31 కోట్లు ►ఇందులో కొత్త ఏసీఆర్లు, అంగన్వాడీ కేంద్రాలు, మరమ్మతులు, పునరుద్ధరణలు, 47 పాఠశాలలు నిర్మాణాలు ఉన్నాయి. వాటితోపాటు 101 అదనపు తరగతి గదులు కూడా స్లాబ్ లెవల్‌కు పూర్తయ్యాయి. ►‘గడప గడపకు మన ప్రభుత్వం’లో మంజూరైన నిధులు – రూ.46.60 కోట్లు ►నగర వ్యాప్తంగా చేపట్టిన పనుల వివరాలు – 598 ►పూర్తయిన పనులు – 288 ►వీటికైన ఖర్చు – రూ.18.93 కోట్లు ►పురోగతిలో ఉన్న పనుల వివరాలు –182 ►చేపట్టాల్సిన పనులు – 128 సొంతింటి కల సాకారం ►టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లు: 22,512 ►నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాలు: వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి, కొండ్లపూడి ► నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఏర్పాటైన లే అవుట్లు: 10 ►ఇందుకోసం చేసిన ఖర్చు: రూ.176 కోట్లు ►నిర్మించిన గృహాలు: 9,293 ►రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేసిన గృహాలు: 10,237 ► ఇందుకైన వ్యయం:రూ.200 కోట్లు ప్రజారోగ్యానికి పెద్దపీట ►అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు మంజూరైన నిధులు రూ. 10.40 కోట్లు ►ఇప్పటికే పూర్తయిన యూపీహెచ్‌సీలు – 12 ►పూర్తయ్యే దశలో 1 ఉంది. 2020–21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు ►ప్రతిపాదించిన నిధులు రూ.43.60 కోట్లు ►గుర్తించిన పనులు – 140 ►పూర్తయిన పనులు – 70 ►ఇందుకు ఖర్చు చేసిన నిధులు రూ.16.61 కోట్లు 2021–22 సంవత్సరానికి రూ.10.22 కోట్లతో చేపట్టిన పనులు ►ప్రతిపాదించిన పనులు – 28 ►పూర్తయిన పనులు –8 ►ఖర్చు చేసిన నిధులు – రూ. 2.92 కోట్లు ప్రజ్వరిల్లే పురోగతి.. ►ప్రశాంతినగర్, నవాబుపేట, టీచర్స్‌కాలనీ, జ్యోతినగర్ తదితర ప్రాంతాల్లో రూ.94.79 కోట్ల వ్యయంతో 100 కి.మీ. మేర సీసీ, బీటీ రోడ్లను ఏర్పాటు ►15వ ఆర్థిక సంఘం నిధులు, నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.8.04 కోట్లతో 70 కి.మీ. మేర తాగునీటి పైపులైన్ల ఏర్పాటు ►బుజబుజనెల్లూరు ప్రాంతాల్లో రూ.59.82 కోట్ల వ్యయంతో 60 కి.మీ. మేర మురుగునీటి కాలువల నిర్మాణం ►నగరపాలక సంస్థ సాధారణ నిధులు, ఎన్సీఏపీ నిధులు రూ.0.67 కోట్లతో నగరంలోని వివిధ పార్కుల అభివృద్ధి, సుందరీకరణ పనులు ►నగరపాలక సంస్థ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.84 కోట్లతో రోడ్లకిరువైపులా 60 వేల మొక్కల ఏర్పాటు ►నగరపాలక సంస్థ సాధారణ నిధులు, సీఎస్ఆర్ నిధులు రూ.0.46 కోట్లతో 5.95 కి.మీ. మేర డివైడర్ల సుందరీకరణ పనులు ►నగరపాలక సంస్థ పరిధిలోని మైనారిటీలను దృష్టిలో ఉంచుకుని రూ.0.10 కోట్లతో 1078.23 చ.మీ. విస్తీర్ణంలో షాదీమంజిల్ (జీ+2) నిర్మాణం ►బీవీఎస్ పాఠశాల క్రీడామైదానంలో బాలికల కోసం రూ. 2.09 కోట్లతో ప్రత్యేకంగా ఇండోర్ షటిల్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టులు ఏర్పాటు ►రూ.5.5 కోట్ల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో 64 ప్రాంతాల్లో కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం ద్వారా గడిచిన 2020–21, 2022, 2023 సంవత్సరాల్లో ట్రాక్టర్ల కొనుగోలు, సీసీ ప్యాచ్ వర్క్‌లు, వాటర్ ఫౌంటెయిన్లు, రోడ్లు వేయడం, పార్కుల అభివృద్ధి పనుల కోసం రూ.7.82 కోట్లు విడుదలయ్యాయి. ► ఇందులో చేసిన ఖర్చు – రూ.5.84 కోట్లు ► మిగిలిన రూ.1.98 కోట్లు పనుల కోసం వినియోగించనున్నారు. ►2023–24 సంవత్సరానికి రూ.14.55 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు కాలుష్య నియంత్రణ మండలికి సమర్పించారు. కార్పొరేషన్ జనరల్ ఫండ్స్‌తో చేసిన పనులు ►2023–24 సంవత్సరానికి పురపాలక సాధారణ నిధుల నుంచి మంజూరైన నిధులు – రూ.19.75 కోట్లు ►ఇందులో రూ.4.83 కోట్లతో 67 పనులు పూర్తి ►రూ.4.83 కోట్లతో 49 పనుల పురోగతి ►రూ.5.69 కోట్లతో 74 పనులు ప్రారంభించాల్సి ఉంది. ►మరో రూ.4.43 కోట్లకు సంబంధించిన 40 పనులకు టెండర్ ప్రక్రియలో ఉంది. నగరాన్ని సుందరీకరిస్తున్నాం నెల్లూరు నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నాం. అవసరమైన ప్రాంతంలో రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాలు, పార్కులు తదితర పనులు చేపడుతున్నాం. నగరాన్ని ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరిస్తున్నాం. – వికాస్‌మర్మత్, కమిషనర్, నెల్లూరు నగర పాలక సంస్థ రోడ్డు బాగుపడింది నెల్లూరు నగరం నుంచి ఇందుకూరుపేట మండలం మైపాడుకు వెళ్లే ప్రధాన రహదారి మైపాడు రోడ్డును వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు లేన్ల సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. – సుబ్బారెడ్డి, బంగ్లాతోట, నెల్లూరు -
కాకినాడ.. ఆధునిక జాడ..
దేశంలోని అగ్రగణ్య నగరాల్లో కాకినాడ ఒకటి. రెండో మద్రాస్‌గా పిలుచుకునే ఈ నగరం గత పాలనలో కునారిల్లి... నేడు ప్రగతి పథంలో పయనిస్తోంది. ఊహించని అభివృద్ధి పనులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. విశాల రహదారులు... పచ్చదనం పరచుకున్న ఉద్యానవనాలు... ప్రతి రాత్రీ పట్టపగలుగా కనిపించేలా వెలుగులు విరజిమ్ముతున్న విద్యుద్దీపాలు... ఆధునికీకరించిన కూడళ్లతో సరికొత్తగా ఆవిష్కృతమవుతోంది. పక్కా ప్రణాళికతో ఊపందుకున్న ప్రగతి పనులతో నగర రూపురేఖలనే మార్చేసింది. చిరకాలంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. నాలుగున్నరేళ్లలో సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా టూటైర్ సిటీలలో దేశంలోనే మొదటి స్థానాన్ని... అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో దేశంలో నాలుగోస్థానాన్ని కైవశం చేసుకుంది. అధునాతనంగా రూపొందిన నగరాన్ని చూసి ఇక్కడి ప్రజలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ కాకినాడ నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్సీపీ హయాంలోనే మళ్లీ దానికి సరైన ప్రాధాన్యం లభించి అభివృద్ధి పరుగులు తీసింది. ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో పేర్రాజుపేట, సాంబమూర్తినగర్, కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో రెండింటిని ఆయన ఉండగానే పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో 14 ఏళ్లుగా నత్తనడకన సాగిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.65 కోట్లతో పూర్తిచేసి ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు అంకితమిచ్చారు. ► గత ప్రభుత్వ హయాంలో రహదారులన్నీ నిర్వహణపై నిరాసక్తత వల్ల గుంటలు, గతుకులమయమయ్యాయి. గడచిన నాలుగున్నరేళ్లలో వాటన్నింటికీ మహర్దశ పట్టింది. ఇరుకు రహదారులను విశాలంగా మార్చారు. ► చంద్రబాబు పాలనలో అధ్వానంగా ఉన్న గొడారిగుంట, ప్రతాప్‌నగర్, రేచెర్లపేట, దుమ్ములుపేట, ఏటిమొగ, రామకృష్ణారావు పేట, ప్రేజర్ పేట, జగన్నాథపురం ప్రాంతంలోని రహదారులకు ఇప్పుడు కొత్త సొగసులు అద్దారు. ప్రణాళికాబద్ధంగా విశాలమైన బీటీ, సిమెంట్ రోడ్లు వేయడంతో ప్రజల కష్టాలు తీరాయి. ► స్మార్ట్ సిటీ స్టేటస్‌కు తగ్గట్టుగా కాకినాడ నగర స్వరూపాన్నే మార్చేశారు. ప్రణాళికాబద్ధంగా చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన అత్యుత్తమ సేవలకు అత్యంత నివాస యోగ్యమైన నగరాల్లో దేశంలోనే నాలుగో స్థానం, మెరుగైన పారిశుద్ధ్య సేవలకు ఇటీవలనే దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. ► కార్పొరేషన్ కార్యాలయాన్ని రాగల 15 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని లక్షా 50వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.38 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల భవంతిని సకల సౌకర్యాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ► నాలుగేళ్లలో పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ భవనాలు నిరి్మంచారు. ఇంతవరకు నగరంలో రూ.17.75 కోట్ల వ్యయంతో 78 సామాజిక భవనాలు అందుబాటులోకి తెచ్చారు. నగరంలో రేచెర్లపేట, రెల్లిపేట, గొల్లపేట, దుమ్ములపేట, ప్రతాప్‌నగర్ తదితర ప్రాంతాల్లో కమ్యునిటీ హాళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతున్నాయి. సొంతింటి కల సాకారం గత ప్రభుత్వ హయాంలో కనీసం పేద వాడికి ఒక సెంటు భూమైనా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి కలను సాకారం చేశారు. ►రాష్ట్రంలో అతి పెద్ద లే అవుట్లలో ఒకటిగా కొమరగిరిలో 350 ఎకరాల లే అవుట్‌కు శ్రీకారం చుట్టారు. ► మొత్తం 32,927 మందికి స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా ఇప్పుడవి వివిధ దశల్లో ఉన్నాయి. ► రూ. 20.59కోట్లతో చేపట్టిన 2056 టిడ్కో ఇళ్లను చంద్రబాబు పాలనలో అటకెక్కించగా అందులో 904 ఇళ్లు లబి్థదారులకు అందించారు. స్నాతకోత్సవ భవన నిర్మాణం రూ.19.3 కోట్లు రోడ్లు, డ్రైనేజీకి ఖర్చు రూ.20 కోట్లు హాస్టల్ భవన నిర్మాణానికి వ్యయం రూ.6 కోట్లు ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించిన నిధులు రూ.97 కోట్లు సింథటిక్ కోర్టు నిర్మాణానికి ఖర్చు రూ. 9.50 కోట్లు కాకినాడ ముఖచిత్రం జీజీహెచ్‌లో కార్పొరేట్ వైద్యం ► కాకినాడ జీజీహెచ్‌లో గతంలో ఎన్నడూ జరగని రీతిలో గడచిన నాలుగున్నరేళ్లలో అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇందుకు దాతల సహకారం కూడా తోడయింది. ► రూ.15కోట్లతో జీజీహెచ్‌లో క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ సదుపాయాలతో, ఎంఆర్ఐ యూనిట్ కొత్తగా ఏర్పాటు చేశారు. ► ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణం జీజీహెచ్‌లో పూర్తి కావస్తోంది. మాతాశిశు వైద్య సేవలకు తలమానికం కానున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.50 కోట్లు. ► త్వరలో మదర్ అండ్ ఛైల్డ్ బ్లాక్ భవంతి సేవలు అందుబాటులోకి రానున్నాయి. – కోరమండల్ సంస్థ కేవలం ఏడాదిలోనే చిన్నపిల్లల వైద్య విభాగానికి రూ.40 లక్షల విలువైన వైద్య ఉపకరణాలను అందించింది. ► కాకినాడ సీ పోర్టు సామాజిక బాధ్యతగా రూ.76 లక్షల విలువైన వైద్య ఉపకరణాలను జీజీహెచ్ మత్తు విభాగానికి అందించింది. ► ఆపన్న మహిళలు, ఆధారం లేని యువతులు, బాలలకు అండగా నిలిచేలా 1600 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.50 లక్షల వ్యయంతో దిశ వన్‌స్టాప్ సెంటర్ సిద్దమవుతోంది. ► జిల్లా కేంద్రంలో అప్పటికే ఉన్న 5 పీహెచ్‌సీలకు అదనంగా తొమ్మిది యుపీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు. ► ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలనే సంకల్పంతో 14 డాక్టర్ వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిరి్మంచారు. సుమారు.రూ.9కోట్ల వ్యయంతో యుపీహెచ్‌సీలు నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. వైఎస్సార్ ఆరోగ్యకేంద్రాలు మొత్తం యూపీహెచ్‌సీలు 14 పాత పీహెచ్‌సీలు 5 కొత్తగా నిరి్మంచినవి 8 సీఎస్ఆర్తో నిర్మించినవి 1 నిర్మాణ వ్యయం రూ.10.40 కోట్లు ప్రగతికి చిరునామా ప్రగతికి చిరునామాగా కాకినాడ నగరం నిలిచింది. నగరంలో పక్కా ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపడుతుంటంతో ఇది సాధ్యమైంది. బ్రిటిష్ హయాం నుంచి కాకినాడ నగరానికి ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడా గుర్తింపును మరింతగా పెంచేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తున్నారు. శానిటేషన్–సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్లో కాకినాడ నగరం దేశంలో రెండో స్థానం సాధించడం... దానికి సంబంధించిన అవార్డును ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి నుంచి అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. – డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ సమష్టి కృషితోనే అభివృద్ధి గడచిన నాలుగున్నరేళ్లుగా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నాం. అందరి సహకారంతో అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేయగలిగాం. ప్రధానంగా ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డుల్లో దేశంలో కాకినాడకు రెండో ర్యాంక్ సాధించడం సమష్టి కృషికి నిదర్శనం. వచ్చే ఏడాది మొదటి స్థానం కోసం ప్రయతి్నస్తాం. – సీహెచ్ నాగనరసింహారావు, కమిషనర్, కాకినాడ నగరపాలక సంస్థ -
అయోధ్య: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో అయోధ్య అభివృద్ధికి అత్యధిక నిధులు ఖర్చుచేసింది. పలు అభివృద్ధి పనులకు సుమారు రూ.31 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. యూపీలోని ఏ జిల్లాలోనూ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు. అయోధ్యకు వచ్చే పర్యాటకుల సంఖ్య గత నాలుగేళ్లలో 2.25 లక్షల నుంచి 2.25 కోట్లకు పెరిగింది. భూముల ధరలు పదిరెట్ల మేరకు పెరిగాయి. ఈ నగరం సీతామాత శాపానికి గురైందని స్థానికులు అంటుంటారు. గతంలో ఇక్కడి యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు పయనమయ్యింది. అయితే రామ మందిరం నిర్మాణం ప్రారంభంతో అయోధ్య ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పర్యాటకులు, రామభక్తులతో సందడిగా మారింది. ప్రాపర్టీ డీలర్ బ్రిజేంద్ర దూబే పదేళ్లుగా అయోధ్యలో భూముల క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల కిందట చదరపు అడుగు భూమి రూ.1000కి లభించేదని, ఇప్పుడు రూ. రూ.4,000 వెచ్చించినా దొరకడంలేదని తెలిపారు. నగరంలోని రామ్పథంలో భూముల ధరలు భారీగా పెరిగాయని చదరపు అడుగు భూమి ధర రూ.1000 నుంచి రూ.6 వేలకు పెరిగిందన్నారు. అయోధ్యలోని రామమందిర్ ట్రస్ట్ వైకుంఠథామం సమీపంలో 14 వేల 730 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ భూముల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి రూ.55 కోట్ల 47 లక్షల 800 ఆదాయం వచ్చింది. ఇదేవిధంగా హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ 1,194 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. లోధా గ్రూప్ నగరంలోకి ప్రవేశించాక ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్ని అంటాయని ప్రాపర్టీ డీలర్ బ్రిజేంద్ర దూబే చెప్పారు. ఈ గ్రూపు అయోధ్య వెలుపల రాంపూర్ హల్వారా, రాజేపూర్ ప్రాంతం మధ్యలో సొసైటీని నిర్మించడానికి భారీగా భూములను కొనుగోలు చేసింది. గడచిన కాలంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన స్థానిక యువత అయోధ్య శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడికి తిరిగివస్తోంది. మలవన్కు చెందిన అనుప్ పాండే గుజరాత్లో పనిచేసేవాడు. అయోధ్యలో ఉపాధి అవకాశాలు పెరగడాన్ని చూసి, అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఇక్కడికి తిరిగివచ్చాడు. ఒక కారును కొనుగోలు చేసి, దానిని పర్యాటక ప్రాంతాలకు తిప్పుతూ ఉపాధి పొందుతున్నాడు. ఇదేవిధంగా ఇంజనీర్ బ్రిజేష్ పాఠక్ ప్రయాగ్‌రాజ్‌లో తన ఉద్యోగాన్ని వదిలి, అయోధ్యకు చేరుకుని ఆయుర్వేద ఔషధాల తయారీని ప్రారంభించాడు. అవినాష్ దూబే తన ఉద్యోగం వదిలిపెట్టి, అయోధ్యలో బెల్లం తయారీ పరిశ్రమను ప్రారంభించాడు. అరవింద్ చౌరాసియా చండీగఢ్ నుండి ఇక్కడకు తిరిగి వచ్చి, హోటల్ ప్రారంభించాడు. ఇది కూడా చదవండి: నేడు ఆలయ ప్రాంగణంలోకి బాలరాముని విగ్రహం! -
రాజమహేంద్రి ..రాత మారింది
పవిత్ర గోదావరి సమీపాన ఉజ్వరిల్లే నగరం రాజమహేంద్రవరం. ఇదొక చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా ప్రతీతి చెందిన ప్రాంతం. హోల్ సేల్ వస్త్ర వాణిజ్యానికి చుక్కాని. నవ్య తూర్పు గోదావరి జిల్లాకు కేంద్రం. ఐదు లక్షలు పైగా జనాభాతో తులతూగే సిరులు కలిగిన నగరం. గత పాలకులు కేవలం పుష్కరాల సమయంలోనే నామమాత్రంగా పనులు చేసేవారు. కానీ నాలుగున్నరేళ్లలో నగర అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సాధారణ, మున్సిపాలిటీ, ప్రత్యేక, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) నిధులు రూ.558 కోట్లు వెచ్చించింది. ఇందులో రూ.217 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పథకాల నిర్వహణ చేపడుతోంది. పచ్చదనం పెంపొందించి, పార్కులను అభివృద్ధి చేస్తోంది. అర్బన్ ఫుడ్ ప్లాజా, కంబాల చెరువు పార్కు, పుష్కర ఘాట్ వద్ద పుష్కర ప్లాజా, హ్యాపీ స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్లను వినియోగంలోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రూ.7 కోట్లతో 100 అడుగుల రోడ్ల అభివృద్ధి జరిగింది. నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.125 కోట్ల ప్రత్యేక నిధులు అందించారు. – షేక్ ఫయాజ్ బాషా, సాక్షి, రాజమహేంద్రవరం మెడికల్ కళాశాల నిర్వహణ ఇలా.. ► సెంట్రల్ జైల్ ప్రాంగణంలో రూ.475 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం ► అకడమిక్ కార్యకలాపాలకు ఉద్దేశించిన ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణం ► 2023–24 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి 150 మెడికల్ సీట్లు ► సిబ్బందికి టీచింగ్ స్టాఫ్ క్వార్టర్లు ► మెడికో హాస్టళ్లు ► నర్స్ హాస్టళ్లు ► ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, బోధనాసుపత్రిలో 54 మంది వైద్యులు, ► 484 మంది నర్సులు ► ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని 500 పడకల బోధనాసుపత్రిగా విస్తరణ నాలుగున్నరేళ్లలో వివిధ అభివృద్ధి పనులకు విడుదలైన నిధులు ► రహదార్లు రూ.98 కోట్లు ► డ్రెయిన్లు రూ.54కోట్లు ► మంచినీటి సరఫరా రూ.28 కోట్లు ► వీధి దీపాలకు రూ.9 కోట్లు ► పార్కులకు రూ.9కోట్లు ► సుందరీకరణకు రూ.13 కోట్లు ► సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ రూ.16కోట్లు ► భవనాలు రూ.6 కోట్లు ► ప్రత్యేక నిధులు రూ.100 కోట్లు ► సీఎం మంజూరు చేసిన నిధులు రూ.125 కోట్లు పురోగతి సాధించిందిలా.. ► రూ.4.3 కోట్లతో 7.3 కిలోమీటర్ల మేర డివైడర్ల మధ్యలో పచ్చదనం ► 17 కిలోమీటర్లలో 15,000 మొక్కలు ► ఎయిర్‌పోర్టు రోడ్డులో 12 కిలోమీటర్ల మేర రుడా, మున్సిపల్ నిధులతో ఉద్యానవనం ► 40 ఎకరాల విస్తీర్ణంలో 37 పార్కుల సుందరీకరణకు మరో రూ.4.3 కోట్లు ► కొత్తగా 5 పార్కులు (మహాలక్ష్మి పార్క్, గాదాలమ్మ నగర్ పార్క్, ఏకేసీ పార్క్, అంబేద్కర్ పార్క్, సాయిచైతన్య కాలనీ పార్క్, ఎస్బీఐ కాలనీ పార్క్) ► రూ.7.26 కోట్లతో జంక్షన్ల ఆధునీకరణ ► రూ. 7.26 కోట్లతో పుష్కర ఘాట్, దేవీచౌక్, దండి మార్చ్ వంటి 12 జంక్షన్లు ఆధునికీకరణ ► రూ.4.6 కోట్లతో అధునాతన కమాండ్ కంట్రోల్ రూము, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ► వై–జంక్షన్, హ్యాపీ స్ట్రీట్ వద్ద రూ.1.2 కోట్లతో వాటర్ ఫౌంటేన్లు ► ఆర్ట్స్ కళాశాల వద్ద ఈట్ స్ట్రీట్ అందుబాటులోకి తెచ్చారు. ► రూ.1.2 కోట్లతో ఆనం కళాకేంద్రం వద్ద అతి పెద్ద ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ► రూ. 2 కోట్లతో పద్మావతీ నగర్ పార్కు వద్ద చిన్నారులకు స్విమ్మింగ్ పూల్ ► రూ.53.85 కోట్లతో నగరంలో 51 కిలోమీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణాలు, ఆధునీకరణ పనులు ► ఇప్పటికే 39 కిలోమీటర్ల పనులు పూర్తి ► పురోగతిలో 12 కిలోమీటర్ల మేర పనులు ► రూ.5 కోట్లతో 5 అర్బన్ హెల్త్ సెంటర్ల మరమ్మతులు ► ఒక్కో కేంద్రానికి రూ.80 లక్షలు ► 6 యూపీహెచ్సీల నిర్మాణం పనులు ► గోదావరి నదిపై హేవలాక్ బ్రిడ్జిపై (పాత రైల్వే వంతెన) 2.7 కిలోమీటర్ల మేర ఆర్నమెంటల్ లైటింగ్ ‘నాడు–నేడు’తో నూతన రూపు ► రూ. 28 కోట్లతో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా 35 పాఠశాలలు ఎంపిక ► మొదటి దశలో శ్రీ పంతం సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్, లాలాచెరువు హైసూ్కళ్లు ఆధునికీకరణ. రెండో దశలో మరో 60 పాఠశాలల అభివృద్ధి ప్రతిపాదనలు, టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టులు ► నాగులగుట్ట చెరువు వద్ద రూ.12 కోట్లతో క్రికెట్ స్టేడియం నిర్మాణం ► రూ.23 కోట్లతో గోదావరి తీరం వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఆధునీకరణ ► వీఎల్‌పురం వద్ద రూ.23 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ► రానున్న రూ.80 కోట్లతో అమృత్ స్కీమ్‌తో చేపట్టనున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం ► ఖేలో ఇండియా పథకం కింద రూ.40 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ► రూ.3 కోట్లతో గాంధీ పురం వద్ద గ్లో గార్డెన్ నిర్మాణాలు పర్యాటక కేంద్రంగా కంబాలచెరువు కంబాల చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు పార్కులో 6 ఎకరాల్లో చెరువు అభివృద్ధి బోటింగ్ సదుపాయం 4 ఎకరాల్లో జాగింగ్ ట్రాక్, బోట్ సైక్లింగ్, 4 లేజర్ షో, 360 డిగ్రీ సైక్లింగ్, 360 డిగ్రీ అమ్యూజ్ మెంట్ రైడ్, ట్రాంపోలిస్ ఎక్విప్మెంట్, స్కై బెలూన్ (చిల్ర్డన్స్), స్కై రోలర్, వాటర్ వాకింగ్ బాల్స్, బాడీ బార్బింగ్ బాల్స్, 4 పురుషుల జిమ్, సీటింగ్ గ్యాలరీ, మెయిన్ ఎంట్రన్స్ ప్లాజా, ఓఏటీ జోన్, స్టేట్ ప్రైడ్ జోన్, చిల్ర్డన్స్ ప్లే ఏరియా ఆక్వా లేజర్ షో చౌడేశ్వర్ నగర్లో రూ. 3 కోట్లతో గ్లో థీమ్ పార్క్ రూ.90 లక్షలతో సివిల్ పనులు రూ.2 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టారు. అందుబాటులోకి 300 మీటర్ల వాకింగ్ ట్రాక్ బాపూజీ స్ఫూర్తికి నిదర్శనం దండి మార్చ్ మహాత్మా గాంధీ రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నగరాన్ని బాపూజీ ఐదుసార్లు సందర్శించారు. ఆ అనుబంధానికి ప్రతీకగా దండి మార్చ్ రూపుదిద్దుకుంది. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు వెచ్చించారు. 200 మీటర్ల పుష్కర ప్లాజా రోడ్డును పూర్తిగా ఆధునీకరించారు. సందర్శకులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైన్ బోర్డులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. పచ్చదనం పెంపొందించడంతో సెల్ఫీల కోసం యువత పోటీ పడుతోంది. ఏకేజీ కళాశాల వద్ద రూ. 80 లక్షలతో ఏర్పాటైన హ్యాపీ స్ట్రీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జగనన్న స్మార్ట్ రోడ్స్ ► రూ. 8.5 కోట్లతో ‘జగనన్న స్మార్ట్ రోడ్లు ► వై జంక్షన్ నుంచి లాలాచెరువు జంక్షన్ వరకూ 3 కిలో మీటర్లు అధునాతన రహదారి ► రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పున ఫుట్‌పాత్‌లు ► మధ్యలో ఆహ్లాదాన్ని నింపేలా ముచ్చటగొలిపే ఉద్యానవనాలు ► అక్కడక్కడా అందుబాటులోకి సెల్ఫీ స్పాట్లు ► గోడలపై రంగురంగుల బొమ్మలు ► రూ.5 కోట్లతో వై–జంక్షన్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఫుట్‌పాత్‌లు, పార్కింగ్, డస్ట్‌బిన్స్ ► రూ.12.6 కోట్లతో 16 కిలోమీటర్ల మేర 15 రకాల రహదారుల నిర్మాణం ప్రశాంత వాతావరణంలో జీవించాలి ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలి. రోడ్డు, డ్రెయిన్లు, వీధి దీపాలు, పార్కులను ఆధునీకరించాం. పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాం. తాగునీటి పనుల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నాం. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటాం. – కె.మాధవీలత, కలెక్టర్, తూర్పు గోదావరి హరిత నగరంగా తీర్చిదిద్దుతాం సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆహ్లాదకర ప్రదేశాలతో హరిత నగరంగా తీర్చిదిద్దుతున్నాం. న్యూయార్క్, ఇంగ్లండ్ దేశాల్లో ఓపెన్ ఆడిటోరియంలలో ఓపెన్ స్క్రీన్లపై చిత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఆనందంగా గడుపుతూంటారు. అలాంటి అనుభూతిని కల్పించేందుకు ఆనం కళాకేంద్రంలో ఓపెన్ స్క్రీనింగ్ ఆడిటోరియం తీర్చిదిద్దుతున్నాం – కె.దినేష్ కుమార్, కమిషనర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ -
ఆధ్యాత్మిక నగరం... అభివృద్ధికి ప్రతిరూపం
(తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి): ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతున్న తిరుపతి నగరం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలుగునేల ఖ్యాతి విశ్వాంతరాలకు విస్తరించడానికి దోహద పడింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఆతిథ్యమిస్తున్న ఈ నగరం ఒకప్పుడు గుంతల మయంగా... అస్తవ్యస్త డ్రైనేజీలతో దుర్గంధం వెదజల్లుతూ... ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులను తీసుకొచ్చే వాహనాలను కదలనీయని ట్రాఫిక్ కష్టాలతో నరక ప్రాయంగా మారగా... గడచిన ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో నగరవాసులతోపాటు... వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులనుంచి ఉపశమనం కలిగించింది. అత్యంత పొడవైన శ్రీనివాస సేతు నగరానికే ప్రత్యేక శోభను తీసుకొచి్చంది. రోడ్లు విశాలమయ్యాయి. కూడళ్లన్నీ ఆకర్షణీయంగా మారాయి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు నెలకొల్పడంతో విద్యారంగం మరింత పురోగమిస్తోంది. నగర వివరాలు: ► విస్తీర్ణం: 30.01చ.కి.మీ. ► గృహాలు: 92 వేలు ► జనాభా: 4.01లక్షలు ►డివిజన్లు: 50 ►రోజూ తిరుపతికి వచ్చి వెళ్లే వారి సంఖ్య సుమారు 1.50 లక్షల మంది ఐదేళ్ల కాలంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు పర్యాటకులను ఆకర్షిస్తున్న తిరుపతి విశాలమైన రహదారులు... అందంగా తీర్చిద్ధిన కూడళ్లు... మాస్టర్ ప్లాన్, సీసీ రోడ్ల నిర్మాణంతో కొత్తరూపు అసంపూర్తి భూగర్భ డ్రైనేజీ పనులకు మోక్షం నరకం నుంచి బయటపడిన నగర జనం ఐఐటీ, ఐసర్ విద్యా సంస్థలకు ఆతిథ్యం ఆధునిక వసతులు సమకూర్చుకున్న చిన్నపిల్లల, క్యాన్సర్ ఆస్పత్రులు రూ.650.50 కోట్లతో శ్రీనివాస సేతు నిర్మాణం పూర్తి ఫ్లై ఓవర్ నిర్మాణంతో తీరిన ట్రాఫిక్ కష్టాలు నాడు నరకం ► తిరుపతి పేరుకు ఆధ్యాత్మిక నగరమైనా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. వీధులన్నీ ఇరుగ్గా, రహదారులన్నీ గతుకులమయంగా ఉండేవి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో రోడ్డుపై ప్రవహించే మురికి నీరు వెదజల్లే దుర్వాసనతో భక్తులు సతమతమయ్యేవారు. ► ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు పచ్చదనం కరువై వెలవెలబోయేవి. ఆర్టీసీ బస్టాండ్, రైల్యేస్టేషన్‌లో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పేరుకే అంతర్జాతీయ విమానాశ్రయమైనా అభివృద్ధి కోలేదు. నేడు అభివృద్ధికి చిహ్నం ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆధ్యాత్మిక నగరాన్ని కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేసి చూపించింది. తిరుపతిని మహానగరంగా తీర్చిదిద్ధింది. ► రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా స్థానికులు, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ సమకూరుస్తున్నాయి. ► గడచిన నాలుగేళ్ల కాలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్డును అభివృద్ధి చేశారు. మూడవ విడత అభివృద్ధి ప్రణాళికల్లో రూ.132కోట్ల వ్యయంతో 150కి.మీల సీసీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. మరో రూ.30కోట్లతో సుమారు 65కి.మీ మేర బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. ► 2012కు ముందు తిరుపతి నగరం కేవలం 16.27చ.కి.మీ. విస్తీర్ణం కలిగివుండేది. ఇప్పుడు నగర విస్తీర్ణం 30.1చ.కి.వీు.కు చేరుకుంది. ► మాటలకే పరిమితమైన తిరుపతి మాస్టర్‌ప్లాన్ ఈ ప్రభుత్వ హయాంలో అమలుకు నోచుకుంది. ► రోడ్లతో పాటు అందమైన డివైడర్లు, విద్యుత్ వెలుగులు, ఆహ్లాదాన్ని పంచే పచ్చని మొక్కలు, జీబ్రా లైన్లతో నూతన రహదారులు అభివృద్ధి చేశారు. ఆధునిక వసతులతో హృదయాలయం.. ► నిరుపేదలకు అత్యంత ఖరీదైన గుండె వైద్యం అందించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నపిల్లల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని భావించి, టీటీడీ నిధులతో దానిని పూర్తిచేశారు. ఇక్కడ కొద్ది కాలంలోనే 2,160 శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ► టీటీడీ కార్డియాక్ కేర్ సెంటర్‌కు శ్రీకారం చుట్టిన సీఎం 2021 సెప్టెంబర్ 11న ప్రారంభించారు. ► అలిపిరి సమీపంలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.350 కోట్లతో 350 పడకలతో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. సుందరంగా వినాయక సాగర్ ► మురికి కూపంగా ఉన్న వినాయక సాగర్‌ను రూ.42 కోట్లతో అభివృద్ధి. ► శుద్ధిచేసిన నీటిని విడుదల చేసేందుకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు. ► బోటింగ్ పాయింట్, కిడ్స్ పార్క్, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్టు, ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు. ► రూ.1.63 కోట్లతో ప్రకాశం, బైరాగిపట్టెడలోని శ్రీపద్మావతి పార్కుల ఆధునికీకరణ. మణిహారం శ్రీనివాస సేతు ► రూ. 650 కోట్లతో నగరానికి మణిహారమైన శ్రీనివాస సేతు వంతెనను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి్డ ప్రారంభించారు. ► వంతెనపై గరుడ పక్షి ఆకారంతో విద్యుత్ స్తంభాలు, పిల్లర్లపై ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలతో కూడిన చిత్రాలను దిద్దారు. పిల్లర్లకు ఇరువైపులా తిరునామాలను ఏర్పాటు చేశారు. నగరంలో అభివృద్ధి పనులు ఇలా.. ► మహతి ఆడిటోరియం, ‘కచ్చపి’ ఆడిటోరియం నిర్మాణం: రూ.45 కోట్లు ► అలిపిరి డిపో నుంచి నడుపుతున్న విద్యుత్ బస్సులు: 100 ► తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం: రూ.11.75 కోట్లు ► నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు:రూ.21.97 కోట్లు ► శ్రీవారి వైభవం చాటిచెప్పేలా రైల్వే స్టేషన్లో ఆధునిక డిజైన్లు: రూ. 310 కోట్లు నాలుగున్నరేళ్లలో వెచ్చించిన నిధులు ► శ్రీనివాస సేతు నిర్మాణం: రూ.650.50 కోట్లు ► విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ కేబుల్:రూ.147 కోట్లు ► తాగునీటి సరఫరా: రూ.28.17 కోట్లు ► శ్రీనివాస స్పోర్ట్స్, ఇందిరా మైదానం స్పోర్ట్స్ ప్రాంగణం అభివృద్ధి:రూ.12.23 కోట్లు ► ఇండోర్ సబ్ స్టేషన్:రూ.20 కోట్లు ► స్మార్ట్ సిటీ మిషన్ అమలు: రూ.180 కోట్లు ► వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్: రూ.41.80 కోట్లు ► ట్రాన్స్ఫర్ స్టేషన్లు: రూ.17.50 కోట్లు ► సోలార్ వ్యవస్థ: రూ.21.97 కోట్లు ► మల్టీలెవల్ కార్ పార్కింగ్ భవన నిర్మాణం: రూ.50 కోట్లు ► సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణం: రూ.90 కోట్లు ► డంపింగ్ బయోమైనింగ్: రూ.20 కోట్లు ► కమ్యూనిటీ, ఈ–టాయ్‌లెట్స్, స్కూల్ టాయ్‌లెట్స్: రూ.13 కోట్లు కలియుగ వైకుంఠం తిరుమలలో.. ► రూ.4.90 కోట్లతో శ్రీవారి పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు. ► మూడో విడత రింగ్ రోడ్డు పనులు. ► రూ.79 కోట్లతో 2,500 మందికి సరిపడేలా పీఏసీ–5 పనులు. ► యాత్రికుల వసతి సముదాయం–3, పద్మనాభ నిలయం అందుబాటులోకి.. ► ఇక్కడ దాదాపు 2,400 లాకర్లు అందుబాటులోకి.. ► రూ.42.86 కోట్లతో 1400 మందికి వసతి కల్పించే వకుళాదేవిమాత విశ్రాంతి గృహం ► నారాయణగిరి ఉద్యానవనాల్లో రూ.39.41 కోట్లతో క్యూలైన్లు, మరుగుదొడ్లు ► తిరుమల–తిరుపతి రెండో ఘాట్ రోడ్డులో రూ.18 కోట్లతో ఆర్సీసీ క్రాష్ బారియర్లు తిరునగరి అభివృద్ధికి ‘మాస్టర్’ ప్లాన్ ► రహదారుల నిర్మాణానికి ఖర్చుచేస్తున్న మొత్తం: రూ.70.92 కోట్లు ► మొత్తం రహదారుల విస్తీర్ణం (మీటర్లలో):18,344 (18.34 కిలోవీుటర్లు) మొత్తం మాస్టర్ ప్లాన్ రహదారులు: 18 ► వంద అడుగుల రోడ్లు: 1 ► 80 అడుగుల రోడ్లు: 8 ► 60 అడుగుల రోడ్లు: 6 ► 40 అడుగల రోడ్లు: 3 ► అభివృద్ధి చేస్తున్నవి: 3 ► అందుబాటులోకి వచ్చినవి: 15 స్మార్ట్ సిటీ పథకం కింద: రూ.1,610 కోట్లు ► కేంద్ర నిధులు: రూ.500 కోట్లు ► రాష్ట్ర ప్రభుత్వ నిధులు: రూ.500 కోట్లు ► పీపీపీ భాగస్వామ్యం కింద: ► రూ.610 కోట్లు (టీటీడీ, ఏపీఎస్పీడీసీఎల్) ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు కేంద్రం ► తిరుపతికి కేటాయించిన ఐఐటీ, ఐజర్ విద్యా సంస్థలకు 2014, 2015లో శంకుస్థాపనలు చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ► 546 ఎకరాల్లో రూ.1,074 కోట్లతో ఐఐటీ విద్యా సంస్థను నెలకొల్పారు. పలు రాష్ట్రాల నుంచి 2500 మంది విద్యార్థులు, 250 మంది అధ్యాపకులు, 275 మంది సిబ్బందితో 2021లో ప్రారంభమైంది. ► 250 ఎకరాల్లో రూ.137.30 కోట్లతో ఐజర్ విద్యా సంస్థను నెలకొల్పారు. ఇందులో బీఎస్, ఎంయస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులతో పాటు పీహెచ్డీ కోర్సులను నడుపుతున్నారు. -
రెండేళ్లలోనే కొత్త వరి వంగడాలు
(సాక్షి సాగుబడి డెస్క్): సంప్రదాయ ప్రజనన (బ్రీడింగ్) పద్ధతిలో ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6–7 సంవత్సరాలు పడుతుంది. క్లైమెట్ ఛేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు దీటుగా తట్టుకునే వంగడాలు రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వంగడాన్ని రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) అభివృద్ధి చేసింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటు ఏ దేశంలో వంగడాలతోనైనా రెండేళ్లలోనే కొత్త వంగడం రూపొందించటం సాధ్యమేనని ‘ఇరి’పరిశోధనల్లో తేలింది. ‘ఇరి’ప్ర«దాన కార్యాలయంతో పాటు వారణాసిలో ‘ఇరి’దక్షిణాసియా పరిశోధనా స్థానంలో కూడా సాంబ వంటి అనేక రకాలతో రెండేళ్లలోనే ‘ఇరి’శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. కృత్రిమ వెలుగుల మధ్య ప్రయోగాలు నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్‌లో ముఖ్యభాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీల ద్వారా అందిస్తున్నారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్యాంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే, స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు, వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా, 60 రోజుల లోపలే అన్ని రకాలూ ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు ‘స్పీడ్ ఫ్లవర్’అని ‘ఇరి’పేరుపెట్టింది. ఏడాదికి నాలుగైదు పంటలు ఈ విధంగా ఏడాదికి 1–2 పంటలకు బదులు నాలుగైదు పంటలు పండిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట నూరి్పడికి వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. స్వర్ణ, సాంబ మసూరి సహా.. వారణాసిలోని దక్షిణాసియా ఇరి పరిశోధనా స్థానం సంచాలకులు డా. సుధాంశు సింగ్ మాట్లాడుతూ.. క్రాసింగ్, ఇన్‌బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ఉపయోగపడుతోంది. క్షేత్రస్థాయిలో 6–7 సంవత్సరాల సమయం పట్టే పని ఇప్పుడు 1.5–2 ఏళ్లలోనే పూర్తవుతోందని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో–51, ఐఆర్64, మధ్యకాలిక రకాలైన సర్జూ–52, డిఆర్ఆర్ ధాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబ మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చాయని, రెండేళ్లలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం సాధ్యమేనని తేలిందని సుధాంశు సింగ్ చెప్పారు. ఏడాదిలో స్వర్ణ వరిని వరుసగా 5.1 పంటలు, సాంబ మసూరిని 4.9 పంటలు వరుసగా సాగు చేయటం ఈ పద్ధతిలో సాధ్యపడిందని పేర్కొన్నారు. – డాక్టర్ సుధాంశు సింగ్ ఇది శాస్త్రపరంగా పెద్ద ముందడుగు.. ’’అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పుల్ని తట్టుకునే, పోషకాల పరంగా మెరుగైన సరికొత్త వరి వంగడాలను అతి తక్కువ కాలంలోనే రూపొందించడానికి అవకాశం దొరికిందిప్పుడు. వరికి జన్యుసుసంపన్నత చేకూరడానికి, ప్రపంచ మానవాళికి ఆహార భద్రతను అందించడానికి ఇది ఉపయోగకరం’అంటున్నారు పరిశోధకుల బృందం సారధి డాక్టర్ వికాస్ కుమార్ సింగ్. ’’ఈ పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆర్థిక తోడ్పాటు ఉంది. సమీప కాలంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని రైస్ బ్రీడర్లకు కూడా స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.’అని వెల్లడించారు. – డాక్టర్ వికాస్కుమార్ సింగ్ -
సుందర గుంటూరు
దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకప్పుడు.. ఎవరైనా గుం‘టూరు’కు వెళ్లాలంటే భయపడేవారు. కారణం అక్కడి రోడ్లు. నడవడానికే భయంకరంగా ఉండేవి. చీకటిపడితే ఏ గోతిలో పడతామో తెలియదు. ముక్కు మూసుకోకుండా నగరంలో తిరగడమూ కష్టమే. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పేరుతో సుమారు 120 కిలోమీటర్లు అస్తవ్యస్తంగా తవ్వేసి కొత్త ప్రభుత్వానికి అప్పగించింది. ఛాలెంజిగా తీసుకున్న వైసీపీ ప్రభుత్వం దాని ప్రాథమిక రిపేరుకే రూ50 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు ఊరట కల్పించింది. ఆ తరువాత గుంటూరు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో 537 పనులు ప్రారంభించింది. ఐఏఎస్‌లను మున్సిపల్ కమిషనర్లుగా తీసుకు వచ్చి అభివృద్ధి పట్టాలు ఎక్కించింది. రూ. 163 కోట్లతో పీవీకే నాయుడు మార్కెట్ నగరం నడి రోడ్డున 1.92 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన హంగులతో నగరానికే ఐకానిక్ బిల్డింగ్‌గా గ్రౌండ్, 8 అంతస్తులతో పీవీకే నాయుడు మార్కెట్ నిర్మాణానికి తుది దశలో టెండర్లు. దీని కోసం రూ.163 కోట్లు ఖర్చు. ఆహ్లాదానికి పెద్దపీట ► గాంధీపార్కు పునరుద్ధరణకు రూ.4.50 కోట్లు. ► నగరంలో 22 పార్క్‌ల అభివృద్ధికి రూ.9 కోట్లు. ► నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, రిజర్వ్ సైట్ల గుర్తింపు. ► వాటిలో ప్లే సెంటర్లు, వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి. ► నగరంలోని 15 ఐలాండ్ల అభివృద్ధికి రూ.2.56 కోట్లతో అంచనాలు. ఇందులో 8 సెంటర్లు ఇప్పటికే అందుబాటులోకి. ► జగనన్న హరిత వనాలలో భాగంగా 42 కిలోమీటర్ల పచ్చదనానికి రూ.6.24 కోట్ల వెచ్చింపు. ► స్వచ్ఛ సర్వేక్షణ్ పథకంలో నగరాన్ని సుందరీకరణకు రూ.48 లక్షలు ఖర్చు. అద్భుత పనితీరుతో జాతీయ స్థాయి ర్యాంకు కైవశం. పార్కుల కోసం రూ.11.5 కోట్లు సెంట్రల్ డివైడర్లు రూ. 7.64 కోట్లు నూతన రోడ్లు, డ్రైన్లు ఏర్పాటుకు రూ. 491 కోట్లు ఐలాండ్స్ అభివృద్ధి రూ. 3.75 కోట్లు పీవీకే నాయుడు మార్కెట్ రూ. 163 కోట్లు అర్బన్ హెల్త్ సెంటర్లు రూ.19.71 కోట్లు జగనన్న కాలనీలతో కొత్త రూపు ► అర్బన్ పరిధిలోని పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఏటుకూరు, కొర్నెపాడు, పేరేచర్ల, పొత్తూరు, బుడంపాడు, దామరపల్లి, లాం ప్రాంతాల్లో 1277 ఎకరాల్లో 60 వేల ప్లాట్స్‌తో జగనన్న కాలనీలు. ► గుంటూరు నగరంలో పేరేచర్ల, ఏటుకూరు వద్ద భారీ లేఅవుట్లు. 29,887 మందికి ఇళ్లు మంజూరు. ► తొలి విడతగా 28 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు. అందులో ఇప్పటికే 7 వేలు పూర్తి. ► ఈ ఏడు లే–అవుట్స్‌లో జంగిల్ క్లియరెన్స్ రూ.16.70 లక్షలు. అంతర్గత రోడ్లకు రూ.7.94 కోట్లు. అప్రోచ్ రోడ్లకు రూ.16.95 లక్షలు. సీసీ కల్వర్ట్లకు రూ.1.48 కోట్లు. మేజర్ డ్రెయిన్లకు రూ.21 లక్షలు. ఎల్ఈడీ లైట్లకు రూ.4.80 లక్షల ఖర్చు. దాహం తీరింది తాగునీటి ఎద్దడి సమస్య శాశ్వత పరిష్కారానికి సంజీవయ్యనగర్ వద్ద ట్రాక్ క్రాసింగ్ పూర్తి చేసి ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 800 డయాపైప్లైన్న్ అందుబాటులోకి. గోరంట్ల కొండ మీద రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణానికి రూ.33 కోట్ల ఖర్చు. విలీన గ్రామాలకు ఇది ఊరట. అభివృద్ధి పథంలో జీజీహెచ్ ► రూ. 5కోట్లతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నిర్మాణ పనులు. ► రూ. 35 లక్షలతో ఎస్ఎన్సీయూ క్లినిక్ నిర్మాణం. ► రూ.25 కోట్లతో పెట్‌సిటీ స్కాన్, రూ.4 కోట్లతో సీటీస్కాన్ ఏర్పాటు. ► సర్విస్ బ్లాక్ నిర్మాణం కోసం రూ. 7.5 కోట్లు మంజూరు. ► రూ.3.5 కోట్లతో ప్రహరీ నిర్మాణం. ► రూ.40 లక్షలతో సీఆర్మ్ వైద్య పరికరం, రూ. 30 లక్షలతో ఏబీజీ వైద్య పరికరాలు, రూ.25 లక్షలతో ఈఎన్టీ మైక్రోస్కోప్, రూ. 40 లక్షలతో ఆపరేషన్ థియేటర్ లైట్లు, రూ.12 కోట్లతో లీనియర్ యాక్సిలేటర్ క్యాన్సర్ వైద్య పరికరాల కొనుగోలు. ► రూ. 40 కోట్లతో గుంటూరు వైద్య కళాశాల వసతి గృహాల్లో భవన నిర్మాణాలు. ► రూ.19.70 కోట్లతో నగరంలో 16 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం. రోడ్లకు చికిత్స నగరంలోని ప్రధాన రోడ్లతోపాటు దెబ్బతిన్న అంతర్గత రోడ్లను పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.491.79 కోట్లతో తూర్పులో 792, పశ్చిమలో 918, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 150 అభివృద్ధి పనులు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు తొలివిడతగా నందివెలుగు రోడ్డు, కుగ్లర్ హాస్పిటల్ రోడ్, పెదపలకలూరు రోడ్, ఏటీ అగ్రహారం, డొంక రోడ్లను విస్తరించారు. సమగ్రాభివృద్ధి దిశగా... గుంటూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాం. రోడ్లు, డ్రెయిన్లు, డివైడర్లు, పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. నగరంలోకి రాగానే ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కూడా జాతీయస్థాయిలో ర్యాంకు తీసుకురాగలిగాం. నగరాన్ని హరిత నగరంగా, శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. – కీర్తి చేకూరి, కమిషనర్, నగరపాలక సంస్థ, గుంటూరు పార్కుల అభివృద్ధి చాలా బాగుంది గుంటూరు నగరంలో పార్కులను అభివృద్ధి చేయడం ఎంతో బాగుంది. గాంధీ పార్క్‌ను కూడా ఆధునికీకరించి పునః ప్రారంభించడంతో పిల్లలను పార్కుకు తీసుకు వెళ్తున్నాను. పార్కులో చాలా రకాల ఆట వస్తువులు పిల్లలు ఆడుకునేందుకు అనువుగా ఉన్నాయి. – పూరి్ణమ (గృహిణి), కొరిటెపాడు అభివృద్ధిని చూస్తున్నాం ప్రస్తుతం గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. రోడ్లు లేని చోట రోడ్లు వేస్తున్నారు. డివైడర్లలో మొక్కలు ఏర్పాటుచేసి పచ్చదనం సమకూర్చడం బా గుంది. గతంలో ఎప్పుడూ ఇటువంటి అభివృద్ధి చూడలేదు. – సిహెచ్. విజయ్‌కుమార్(పాత గుంటూరు) యూజీడీ పేరుతో తవ్వేశారు.. నల్లపాడు రైల్వేస్టేషన్ కి వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి గోతులతో ఉండేది. యూజీడీ పేరుతో రోడ్డు అంతా తవ్వి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా చేస్తే ప్రస్తుతం తారు రోడ్డు వేయడంతో ఇబ్బంది లేకుండా ఉంది. ఎప్పటి నుండో ఉన్న సమస్య పరిష్కారం చేసిన అధికారులకు, నాయకులకు ధన్యవాదాలు. –గేరా మణెమ్మ, శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ -
కర్నూలుకు కొత్తశోభ
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అవతరించిన తెలుగు రాష్ట్రాల తొలి రాజధాని కర్నూలు.. సీమ ముఖ ద్వారం. విశాఖ, విజయవాడ, గుంటూరు తర్వాత నాలుగో అతి పెద్ద నగరం. కానీ అభివృద్ధిలో వెనుకడుగు. అది నిన్నటి మాట. నేడు కర్నూలు స్వరూపం మారిపోయింది. పాలకుల చిత్తశుద్ధి లేక వెనుకబడిన ఈ ప్రాంతం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నాలుగున్నరేళ్లుగా కర్నూలు నూతన శోభను సంతరించుకుంది. థీమ్ పార్క్‌లు, ఫ్లైఓవర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, రోడ్లు, బ్యూటిఫికేషన్, శానిటేషన్, వీధిదీపాలు.... ఒక్కటి కాదు అన్ని రంగాల్లోనూ, అన్ని రకాలుగా మెట్రోనగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతోంది. క్లీన్‌సిటీగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెంది స్వచ్ఛతలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వీధి వ్యాపారులకు కూడా ‘హాకర్స్ జోన్’ ఏర్పాటైంది. –మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి కర్నూలు నాలుగున్నరేళ్లలో మారిన నగర రూపురేఖలు న్యాయ రాజధాని దిశగా అడుగులు లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఆర్సీ సంస్థల ఏర్పాటుతో కళకళ సైన్స్, మ్యూజిక్, కార్టూన్ వంటి 9 థీమ్ పార్క్‌లు ఏర్పాటు షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ స్పోర్ట్స్ అకాడమీలు కార్పొరేషన్లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులు.. రూ.500 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పెద్దాస్పత్రిలో అధునాతన పరికరాలతో పేదలకు మెరుగైన వైద్యం నూతన రహదారులతో రయ్.. రయ్ మంటూ వేగంగా నగరాభివృద్ధి ట్రాఫిక్ కష్టాలు తొలిగేలా ఫ్లై ఓవర్ల నిర్మాణం – తుంగభద్ర పుష్కరాల కోసం శాశ్వతంగా ఘాట్లు క్లస్టర్ యూనివర్శిటీగా రూపుమారిన సిల్వర్‌జూబ్లీ కళాశాల కర్నూలులో అభివృద్ధి పనులు ఇలా.. నాడు–నేడు కింద రూ.34.99కోట్లతో మున్సిపల్ స్కూళ్ల అభివృద్ధి కర్నూలు నగరంలో ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి చేసిన ఖర్చు: రూ.8 కోట్లు 15 వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన అభివృద్ధి ఖర్చు: రూ.45.60 కోట్లు రూ.13.22కోట్లతో డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించారు. రూ.82 కోట్లతో సుంకేసుల నుంచి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు పైపులైన్ నిర్మించారు. దీంతో నగరవాసులకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది. కార్పొరేషన్ పరిధిలోని మునగాలపాడులో రూ. 15కోట్లతో సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారు. దీంతో కల్లూరు, కార్పొరేషన్ పరిధిలోని కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు. రూ.26కోట్లతో నగరపాలక నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. 6.70 కోట్లతో తుంగభద్ర నది వద్ద 7 శాశ్వత పుష్కరఘాట్లు నిర్మించారు. రూ. 8 కోట్లతో వెంకటరమణ కాలనీలో మోడరన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. రూ. 2 కోట్లతో బిర్లాగేట్ వద్ద ‘ఖానా–ఖజానా’ పేరుతో ఈట్‌స్ట్రీట్ నిర్మించారు. నగరశివారులోని రుద్రవరంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు రూ. 252కోట్లతో అమృత్ కింద తాగునీటి పథకాలు, 16 ఉపరితల రక్షిత నీటి ట్యాంకులు నిర్మించారు. కర్నూలు మార్కెట్‌యార్డులో రూ.6.50కోట్లతో జంబోషెడ్డు నిర్మిస్తున్నారు. పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.16కోట్లతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలు పురోగతి ఇలా.. ► గడపగడపకు మొదటి దశలో మంజూరైన నిధులు (రోడ్లు, డ్రైనేజీలు, సచివాలయాలకు) రూ.17. 99 కోట్లు ► గడపగడపకు రెండో దశలో మంజూరైన నిధులు రూ.22.53 కోట్లు ► పట్టణ ఆరోగ్య కేంద్రాలు, భవనాలు, యూపీహెచ్సీ మరమ్మతులకు రూ. 14.82.కోట్లు ► నీటి శుద్ధి కేంద్రాలకు రూ. 13.18 కోట్లు ► రెండో దశ నీటి శుద్ధి కేంద్రాలకు రూ.47.93 కోట్లు ► నీటి శుద్ధి కేంద్రానికి (స్పెషల్ ప్రాజెక్ట్) రూ.15.00 కోట్లు ► థీమ్ పార్కులు (స్పెషల్ ప్రాజెక్ట్) రూ.7. 09.కోట్లు ► మంచినీటి సరఫరా , పైప్‌లైన్ పనులు రూ. 82.00కోట్లు జ్యుడీషియల్ సిటీ.. ► లోకాయుక్త ► మానవహక్కుల కమిషన్ ► ఏపీ ఈఆర్సీ ► వక్ఫ్ట్రిబ్యునల్ ► సీబీఐ కోర్టులు ► నేషనల్ లా యూనివర్శిటీ ► స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ► హైకోర్టు, ట్రిబ్యునల్స్ ► మరో 43 అనుబంధ కోర్టులు ► వీటన్నిటి కోసం 150 ఎకరాలు కేటాయింపు ► మొత్తంగా జ్యుడీషియల్ సిటీ నిర్మాణానికి శ్రీకారం ► టీడీపీ అడ్డుపడటంతో ఒక్క హైకోర్టు వ్యవహారం మాత్రం కొలిక్కి రావల్సి ఉంది మార్పు కోసం నిధుల వరద మొత్తం పనులు: 552 తొలిదశ: 219 పనులు పూర్తయినవి ఖర్చు చేసిన నిధులు: 11.64 కోట్లు రెండో దశ: 144 పనులు పూర్తయినవి ఖర్చు చేసిన నిధులు: 10.16 కోట్లు పురోగతిలో ఉన్నవి: 188 పనులు రోడ్లు, మురుగుకాలవల కోసం చేసిన ఖర్చు గుర్తించిన అభివృద్ధి పనులు: 426 ప్రతిపాదిత ఖర్చు: 54.72 కోట్లు పూర్తి చేసినవి: 272 పనులు చేసిన ఖర్చు: 26.16 కోట్లు వీధిదీపాల కోసం చేసిన ఖర్చు కాలనీల్లో ఏర్పాటు చేసిన వీధిలైట్లు: 220 సెంట్రల్ మీడియన్ లైట్లు: 96 వీటి కోసం చేసిన ఖర్చు: 66 లక్షలు పట్టణంలోని మొత్తం పార్కులు: 156 వీటిలో అభివృద్ధి చేసిన పార్కులు: 35 థీమ్ పార్క్ పేరుతో అభివృద్ధి చేస్తున్నవి: 8 పూర్తయినవి: 6 వీటి కోసం చేసిన ఖర్చు: రూ.7.70 కోట్లు శానిటేషన్ డివిజన్ కార్యాలయాల కోసం చేసిన ఖర్చు శానిటేషన్ డివిజన్ కార్యాలయాలు: 16 కొత్తగా నిర్మించినవి: 11 వీటి కోసం చేసిన ఖర్చు: 8.80 కోట్లు కొండారెడ్డి బురుజును ఆధునికీకరించడంతో పాటు పార్క్, లైటింగ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. ఇందుకోసం రూ.2కోట్లు ఖర్చు చేశారు. అక్కడే షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కృష్ణానగర్, సంతోషనగర్ వద్ద నేషనల్ హైవేపై ఫ్లైఓవర్లు నిర్మించారు. బిర్లాగేట్ నుంచి గుత్తి పెట్రోల్ బంకు వరకూ ఆర్వోబీ నిర్మించారు. నగరంలో ప్రధాన రోడ్లను రూ.65.30కోట్లతో అభివృద్ధి చేశారు. రూ.9.58 కోట్లతో కలెక్టరేట్ ఆధునికీకరణ ► టీడీపీ హయాంలో కర్నూలు నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకపోగా 2010 ఆగస్టులో పాలకవర్గం గడువు ముగిసింది. ఆ తర్వాత 11 ఏళ్లు పాలకవర్గం లేదు. వైఎస్. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించి 2021 మార్చిలో కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కర్నూలు అభివృద్ధి కోసం రూ.720కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో 1,736 పనులు పూర్తయ్యాయి. ► కలెక్టరేట్,జాయింట్ కలెక్టర్, సీపీఓ కార్యాలయాలు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, మినీ కాన్ఫరెన్స్ హాలు, కాన్ఫరెన్స్ హాలు, వ్యవసాయ, సమాచార, పౌరసంబంధాల కార్యాలయాల పనులు పూర్తి. మరో 15శాఖల కార్యాలయాలు త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు. ► స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, థీమ్ పార్క్‌లు ► షటిల్ బ్యాట్మింటన్ ఇండోర్ స్టేడియాలు ► సింథటిక్ టెన్నిస్‌కోర్టులు,క్రికెట్ అకాడమీలు ► మ్యూజిక్పార్క్, సైన్స్‌పార్క్, ► కల్చరల్ పార్క్, ఫ్రూట్ పార్క్, ► గ్లోగార్డెన్, చిల్ర్డన్స్పార్క్లు ► ఒక్కో పార్కు కోసం రూ.1.20 కోట్లు ► చిల్ర్డన్స్ పార్క్ కోసం రూ.1.70 కోట్లు రూ. 65.30కోట్లతో రహదార్లు పురోభివృద్ధి ఆనంద్ టాకీస్ నుంచి కేసీ కెనాల్ అక్విడిక్ట్ వరకూ బ్రిడ్జి!: రూ.3.50కోట్లు బళ్లారి చౌరస్తా నుంచి పెద్దపాడు రోడ్డు వరకూ రోడ్డు నిర్మాణం: 4కోట్లు కర్నూలు పట్టణంలో 9రోడ్లు ఆధునికీకరణకు రూ.9కోట్లు బిర్లా గేట్ నుండి గుత్తి పెట్రోల్ బంకు వరకూ ఆర్వోబీ నిర్మాణం: 18కోట్లు కర్నూలు–సుంకేసుల రోడ్డు: 1.30కోట్లు పీపుల్స్ పార్క్ నుంచి రాజ్ విహార్, కలెక్టరేట్ వరకూ రోడ్డు నిర్మాణం: 9.80కోట్లు (టెండర్ దశలో ఉంది) కర్నూలు–బళ్లారి రోడ్డు విస్తరణ నిర్మాణం: 13.20కోట్లు( పనులు జరుగుతున్నాయి) సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకూ రోడ్డు నిర్మాణం: రూ.3.50కోట్లు( పెండింగ్‌లో ఉంది. పూర్తి కావల్సి ఉంది) ఆసుపత్రిలో ఆధునాతన పరికరాలు ► స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం రూ.120 కోట్లు ► కేతలాబ్ మిషన్ కొనుగోలు కోసం రూ.6కోట్లు మంజూరు ► అకస్మాత్తుగా గుండెనొప్పి బారిన పడినవారి కోసం ‘స్టెమీ ప్రాజెక్టు’ రూపొందించారు. ► కర్నూలు మెడికల్ కాలేజీలో రూ.3.2కోట్లతో ఎగ్జామ్ హాల్ నిర్మిస్తున్నారు. ► రూ. 2.17కోట్లతో కాలిన రోగుల వార్డు నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ► రూ.12.9కోట్లతో డయాగ్నొస్టిక్ బ్లాక్ నిర్మాణం ► ఈ భవనంపై రూ.3 కోట్లతో మరో రెండు అంతస్తులతో ఐసీయూ నిర్మాణం ► రూ.4.5కోట్లతో బాలికల యూజి, పీజీ హాస్టల్ నిర్మాణ దశలో ఉంది. ► రూ.25 లక్షలతో పుల్లీ ఆటోమేటెడ్ మిషన్ కొనుగోలు ► రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి ► ఎస్ఎన్సియూ, ఎన్ఐసీయూను రూ.70 లక్షలతో ఆధునికీకరిస్తున్నారు. ► రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లేబరేటరీని రూ.1.79 కోట్లతో నిర్మిస్తున్న పనులు చివరి దశలో ఉన్నాయి. ► రూ.3.5 కోట్లతో ఆధునిక సిటీ స్కాన్ మిషన్ కొనుగోలు ► 3.5కోట్లతో రెండు న్యూరో మైక్రోస్కోప్స్ కొనుగోలు -
సుందర విశాఖ.. ప్రగతి వీచిక
కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహానగరంగా రూపుదిద్దుకున్న విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఓ వైపు కడలికెరటాల సవ్వడులు... మరోవైపు పచ్చదనం పరచుకున్న ప్రకృతి అందాలు... పెట్టని ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇటు విస్తరిస్తున్న ఐటీ రంగం... అటు విద్యాసుగంధాలు వెదజల్లుతున్న సరస్వతీ నిలయాలు నగరానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయి. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఫ్లై ఓవర్లు... మల్టీ లెవెల్ కారు పార్కింగ్ సౌకర్యాలు విశేష గౌరవాన్ని ఆపాదిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు... ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన జంక్షన్లు నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖ ఉక్కుకర్మాగారం... ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు... నగర సమీపంలో విస్తరిస్తున్న పారిశ్రామిక వాడలు విశాఖకు విశేష గుర్తింపునివ్వగా... గతేడాది మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సన్నాహక సదస్సులతో నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రగతి పథంలో నడుస్తూ కార్యనిర్వాహక రాజధానికి కావలసిన అర్హతలన్నీ పుణికిపుచ్చుకుంది. నాలుగేళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం విస్తరిస్తున్న ఐటీ రంగం ► రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను బీచ్ ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వాటికోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చింది. ఫలితంగా ప్రధాన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేసింది. దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు కంపెనీకి వెళ్లేందుకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేశారు. ► ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, వాటి అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. రుషికొండ ఐటీ సెజ్ లో హిల్ నెంబర్–2లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో 1000 మందితో ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2006లో విప్రో క్యాంపస్‌కు 750 మందితో ప్రారంభించేందుకు వీలుగా స్థలాన్ని కేటాయించారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో దశలవారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ► వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ► ఐటీ రంగంలో విశాఖను అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ► అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్.. విశాఖలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. భారత్‌లో ఢిల్లీ తర్వాత వైజాగ్‌లోనే చెగ్ సంస్థ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం. విశేషం. అంతర్జాతీయ సదస్సులకు వేదికగా... ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన అంతర్జాతీయ ఐటీ సదస్సు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సన్నాహక సదస్సులు సూపర్ సక్సెస్ అయ్యాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఇన్ ఇండియా(ఎన్‌ఎఫ్‌ఐసీఐ) 28వ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంతో పాటు 12వ సర్వ సభ్య సమావేశాలు, జైళ్ల శాఖ ఎనిమిదో జాతీయ సదస్సు, అగ్రిసదస్సు, ఇలా ప్రతి ఒక్కరికీ విశాఖ ఆహ్వానం పలుకుతోంది. డేటా సెంటర్లు.. స్టార్హోటల్స్కు కేరాఫ్ ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖపట్నంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం కలిగించేలా సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దారు. అందుకే.. ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు తానే స్వయంగా శంకుస్థాపన చేశారు. ► వైజాగ్ టెక్‌పార్క్ కూడా 39,815 మందికి ఉపాధి కల్పించేలా డేటాసెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీని రూ.21,844 కోట్లతో ఏర్పాటుకు ముందుకొచ్చింది. ► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపారు. సరికొత్తగా నగర రహదారులు గుంతల మయంగా ఉన్న రహదారులు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సరికొత్తగా రూపు దిద్దుకున్నాయి. నాలుగేళ్లలో మంజూరైన రహదార్లు: 2089 వెచ్చించనున్న నగదు: రూ.547.45 కోట్లు ఇప్పటివరకూ పూర్తయిన రోడ్లు: 1,216 వీటికి అయిన ఖర్చు: రూ. 202.59 కోట్లు పురోగతిలో ఉన్న రహదారులు: 873 వీటికి చేస్తున్న ఖర్చు: రూ.344.86 కోట్లు కొత్తగా వేస్తున్న రహదారుల పొడవు: 27 కి.మీ. వీటికి వెచ్చిస్తున్న మొత్తం: రూ.104 కోట్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్‌బేలు: 20 వీటికి చేసిన ఖర్చు: రూ.462.70 లక్షలు ట్రాఫిక్ కష్టాలకు ఫ్లైఓవర్‌తో చెక్ అత్యంత రద్దీ కూడలిగా ఉన్న ఎన్ఏడీలో ఫ్లైఓవర్ నిర్మాణానికి వీఎంఆర్డీఏ 2016 నుంచి ప్రయత్నిస్తున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం సరైన సహకారం అందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూతూ మంత్రంగా 2018 చివర్లో పనులు ప్రారంభించారు. కానీ.. ఎన్నికల ముందు నాటికే బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులు భుజానికెత్తుకొని రూ.150 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఎన్ఏడీ జంక్షన్.. నగర కూడళ్లలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. దీనివల్ల పూర్తిగా ట్రాఫిక్ కష్టాలకు తెరపడింది. పర్యాటకం...మరింత ఆకర్షణీయం.. ► గతంలో విశాఖ పేరు వింటేనే ఆర్కే బీచ్, రిషికొండ, భీమిలి బీచ్ ప్రాంతాలు గుర్తుకువచ్చేవి. ఇప్పుడు పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వం 11 కొత్త బీచ్‌లను అభివృద్ధి చేసింది. ► రూ.12.55 కోట్లతో మొత్తం 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలతో ఎప్పటికప్పుడు బీచ్‌లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఏరివేస్తూ శుభ్రం చేస్తున్నారు. ► ఈ 11 బీచ్‌లను అనుసంధానిస్తూ.. కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్‌లో జిల్లాలోని 25 బీచ్‌లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. భీమిలిలోని పాండవుల పంచ బీచ్, అన్నవరం, భీమిలి, నేరెళ్లవలస, ఎర్రమట్టిదిబ్బలు, ఐఎన్ఎస్ కళింగ, మంగమారిపేట, తొట్లకొండ, తిమ్మాపురం, ఎస్ఈజెడ్, రుషికొండ, ఇస్కాన్ టెంపుల్, సాగర్‌నగర్, జూపార్క్, జోడుగుళ్లపాలెం, తెన్నేటిపార్క్, ఆర్కేబీచ్, రాధాకృష్ణ బీచ్, రాక్‌బీచ్, దుర్గా బీచ్, యారాడ, ప్యారడైజ్, అప్పికొండ, అప్పికొండ–2, అప్పికొండ బ్రిడ్జ్ బీచ్‌లు కొత్తగా పర్యాటకుల్ని స్వాగతం పలకనున్నాయి. ఆరోగ్యప్రదాయినిగా కేజీహెచ్ ► గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌ను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో ఆధునికీకరంచింది. ► ఐదు దశాబ్దాల క్రితం ఏర్పడిన క్యాజువాలిటీయే ఇప్పటికీ కొనసాగుతుండగా రెండో క్యాజువాలిటీ నిర్మాణానికి కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున రూ.30 లక్షలు కేటాయించి చేసి 15 పడకలతో నిర్మించారు. ► సెకెండ్ క్యాజువాలిటీని రౌండ్‌ది క్లాక్ పనిచేసేగా తీర్చిదిద్దారు. రోగుల కోసం రూ.15 లక్షలతో లేబొరేటరీతో పాటు మొబైల్ ఎక్స్‌రే యూనిట్, అల్ట్రా స్కానింగ్ సిద్దం చేశారు. ఆధునిక సౌకర్యాలు,సెంట్రల్ ఎయిర్ కండిషన్, పడకలు, ఆక్సిజన్, ఇతర సదుపాయాలు కల్పించారు. ► కార్డియాలజీ విభాగాన్ని రూ.24 లక్షల సీఎస్సార్ నిధులతో పునర్నిర్మించారు. ఐసీయూ, ఈకో, స్టేర్ కేస్, ఏసీ సదుపాయం, పెయింటింగ్స్, మరుగుదొడ్లు కొత్తగా తీర్చిదిద్దారు. ► విద్యుత్ ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో కేజీహెచ్‌లో 120 కేవీ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ► ఓపెన్ హార్ట్ సర్జరీకి అవసరమైన పరికరం దశాబ్దం నుంచి పనిచేయకపోవడంతో శస్త్ర చిక్సితలు నిలిచిపోయాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని టెంపరేచర్ కంట్రోల్ మెషిన్ని మంజూరు చేసింది. ► అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పి బారిన పడేవారికోసం రాష్ట్ర ప్రభుత్వం స్టెమి ప«థకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో దీనిని అమలు చేస్తున్నారు. కార్డియాలజీ వైద్యుల సూచన మేరకు సుమారు రూ.30 వేల విలువైన ఇంజక్షన్ కేజీహెచ్‌లో ఉచితంగా రోగులకు అందిస్తున్నారు. రెండింతల అభివృద్ధి...! 2014–19 వరకూ టీడీపీ చేసిన ఖర్చు: రూ.1450 కోట్లు టీడీపీ ఐదేళ్ల హయాంలో చేపట్టిన పనులు: 4450 2019–2023 వరకూ వైఎస్సార్సీపీ చేసిన ఖర్చు: రూ.2490 కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో నాలుగేళ్ల కాలంలో చేపట్టిన పనులు: 9920 గడపగడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన పనులు: 708 దీనికోసం వెచ్చిస్తున్న నగదు: రూ. 66 కోట్లు జంక్షన్లు... జిగేల్ ! ► మహావిశాఖ పరిధిలోని జంక్షన్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారులు కలిసే జంక్షన్లను విశాలంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా కూడళ్ల వద్ద అందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి చేశారు. ► రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద రైల్వే కోచ్‌తో కూడిన జంక్షన్ నగరవాసులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక బస్టాండ్లను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దారు. -
రాష్ట్రాలతోనే దేశాభివృద్ధి
తిరుచిరాపల్లి/లక్షద్వీప్: రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనేది కేంద్ర ప్రభుత్వం విశ్వసించే విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్దిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆయన మంగళవారం తమిళనాడులో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పౌర విమానయానం, ఓడ రేవులు, రైల్వే, హైవేలు, పెట్రోలియం, సహాయ వాయువు, అణు శక్తి, ఉన్నత విద్యకు సంబంధించిన రూ.20,140 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొలుత భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఏడాది కాలంలో 40 మందికిపైగా కేంద్ర మంత్రులు తమిళనాడులో 400సార్లు పర్యటించారని చెప్పారు. తమిళనాడు అభివృద్ధితో ఇండియా అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశ విదేశాలతో బహుళ అనుసంధానం అభివృద్ధికి కీలక మార్గమని అన్నారు. దీనివల్ల కీలక రంగాల్లో పెట్టుబడులు, తద్వారా వ్యాపారం, వాణిజ్యం పెరుగుతాయని, ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి యువతకు ఇది మంచి సమయమని చెప్పారు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలన్నారు. లక్షద్వీప్‌లో మోదీ.. రూ1.1,50 కోట్లకుపైగా విలువైన పలు జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మోదీ మంగళవారం లక్షద్వీప్‌కు చేరుకున్నారు. అగత్తీ ఎయిర్‌పోర్టు వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. లక్షద్వీప్‌లో గత పదేళ్లలో ఎన్నో ప్రాజెక్టులను అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడి ద్వీపాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. -
‘పీఎం జన్ మన్’తో గిరిజనుల అభివృద్ధికి కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు)తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని.. వారిని ఇప్పటివరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదన్నారు. అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023–24 నుంచి 2025–26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా రూ.8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మలీ్టపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, ఒకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌లకు రాజీవ్ గౌబ సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగుడ, పాత బల్లుగుడకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడ్‌లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నతాధికారులు కె.విజయానంద్, బి.రాజశేఖర్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాశ్, జి.జయలక్షి్మ, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, లక్ష్మీశా, జె.వెంకట మురళి, బాలూ నాయక్, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. -
గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం చేయడం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. దీనికోసమే గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు. అంతరిక్షంలో సుదూర తీరాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి అక్కడి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించినంత పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్రహశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన రాబర్ట్ వింగ్లీ బృందం అభివృద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో ఇప్పుడు చూద్దాం... ఈటెలు రువ్వి... నమూనాలు సేకరించి.. చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది. దీంతో హార్పూన్‌ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారనే విషయానికొస్తే రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్‌ను వ్యోమనౌకకు మైళ్లకొద్ది పొడవుండే దృఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది. హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్‌తో కూడిన హార్పూన్‌ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్ని బ్లాక్‌రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు. ప్రయోజనాలు చాలానే... స్పేస్ హార్పూన్లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 2023లో ఎవరెస్టును ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి? -
భారత్‌ను చైనాతో పోల్చొద్దు: మోదీ
న్యూఢిల్లీ: అభివృద్ధి విషయంలో భారత్‌ను పొరుగు దేశమైన చైనాతో పదేపదే పోలుస్తుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి తప్ప చైనాతో కాదని తేలి్చచెప్పారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందని చెప్పారు. భారత్‌ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చమే సముచితమని సూచించారు. ఇండియాలో నిరుద్యోగం, అవినీతి, పరిపాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల లేమి వంటివి పెద్దగా లేవని మోదీ పేర్కొన్నారు. నిజంగా ఇలాంటి అంశాలు ఉండి ఉంటే, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే హోదా మన దేశానికి దక్కేది కాదని స్పష్టం చేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో భారత సంతతి సీఈఓలు సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇండియాలో నైపుణ్యాల లేమి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మోదీ వెల్లడించారు. ప్రఖ్యాత విదేశీ సంస్థలను ఆకర్శించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో మైనార్టీలను అణచివేస్తున్నారన్న ఆరోపణల్లో పస లేదని స్పష్టం చేశారు. మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. 20 కోట్ల మంది మైనార్టీలు ఇక్కడ క్షేమంగా జీవిస్తున్నారని చెప్పారు. -
‘నా టూల్స్.. నా ఇష్టం’.. సొంత సత్తా చాటుతున్న ఏఐ!
ఈ ఏడాది ప్రారంభం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఇటీవలే తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ఇవి మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేడు కోట్లాది మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ సంవత్సరం ఏఐ నూతన సాంకేతిక అభివృద్ధి ఫలాలను మనకు అందించింది. ఇటీవల గూగుల్ ‘జెమిని’ని ప్రవేశపెట్టింది. ఇది పలు బెంచ్‌మార్క్ పరీక్షలలో చాట్ జీపీటీని ఓడించింది. అయితే కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చిన ఒక రిపోర్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏఐ స్వయంగా తన టూల్స్‌ను తానే సృష్టించుకోగలదని తేలింది. మనిషి అవసరం లేకండానే ఈ ప్రక్రియ జరుగుతందని వెల్లడయ్యింది. బిజినెస్ ఇన్సైడర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం ఏజిప్ (ఏజెడ్ఐపి) అనే ఏఐ టెక్ కంపెనీతో జతకట్టింది. ఈ నేపధ్యంలో నిపుణులు చిన్నపాటి ఏఐ సైడ్‌కిక్‌లను సొంతంగా రూపొందించడానికి పెద్ద ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా కోడ్‌ను ఛేదించారు. దీంతో ఏఐ స్వయంగా తన టూల్స్‌ను తయారు చేసుకుంటోంది. ఈ సందర్బంగా అజిప్ కంపెనీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ చాట్ జీపీటీని వినియోగిస్తున్న మెగా ఏఐ మోడళ్లు వాటికవే చిన్న ఏఐ టూల్స్‌ను సృష్టిస్తాయని తెలిపారు. ఏఐ టూల్స్ స్వీయ అభివృద్ధిలో ఇది మొదటి అడుగు అని అన్నారు. ఇది ఎంత అద్భుతమో అంత ప్రమాదకరం కూడా కావచ్చన్నారు. అయితే ఏఐ చేతికి వీటి నియంత్రణ ఇవ్వడం సరైనది కాదని భావిస్తున్నామన్నారు. గూగుల్‌లో అందుబాటులో ఉన్న డేటాను ఏఐ స్వయంగా ఎలా ఉపయోగిస్తుందినే దానిపై అనేక సందేహాలున్నాయన్నారు. ఈ విధమైన ఏఐ అభివృద్ధిపై కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం! -
పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘గత పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం..’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రి అయ్యాక మొదటి సారి ఆయన సోమవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. అంతకుముందు ఆయన ఆంథోల్ మైసమ్మగుడి వద్ద, నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. మూడేళ్లలోనే ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తామని, ఆరు నెలల్లో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నా రు. నల్లగొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తామని పేర్కొన్నారు. అక్రమ ఇసుక దందా, బెల్టు షాపుల ఆట కట్టిస్తామన్నారు. గత పాలకుల్లాగా అధికారు లను తాము ఇబ్బంది పెట్టబోమని, అంతా కలిసి పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. కలెక్టరేట్లో కలెక్టర్ కర్ణన్ అధ్యక్షతన మిషన్ భగీరథ, నీటిపారుదల, రోడ్డు భవనాలు, ఇతర శాఖల ఈఎన్సీలతో సమీక్షించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ చేపట్టినా ఇంకా చాలా గ్రామాలకు నీరందడం లేదని, సంబంధిత ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు విద్యుత్ సర ఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన సబ్ స్టేషన్లు, ఇతర విస్తరణ పనులు చేయించాలని, దీనిపై నివేదికలు ఇస్తే ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో విద్యు త్ ప్రమాదాల్లో 32 మంది చనిపోయినా వారికి గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడం బాధాకర మని చెప్పారు. వెంటనే వారికి న్యాయం చేయాల న్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు అనిల్‌రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, జైవీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కీలకం... వికేంద్రీకరణ
ఏ రాష్ట్రమైనా సుసంపన్నం కావాలంటే పంచాయతీ రాజ్ వ్యవ స్థను పటిష్ఠపరచాలి. మొత్తంగా దేశం అభివృద్ధి పంచాయతీ రాజ్ వ్యవస్థ బలంపైనా, అది ఏ మేర పాలనను వికేంద్రీకరిస్తుంది అన్న అంశాల పైనా ఆధారపడి ఉంటుంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని ప్రాథమిక స్థాయి సంస్థలకు అధికారాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో గుర్తించారు. స్థానిక సంస్థలకు అధికారాలు పంచడం కోసం రాజ్యాంగ సవరణకు సైతం వెనుకాడలేదు. ఫలితంగా 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థ రూపు దిద్దుకొంది. ఈ వ్యవస్థే గత 30 ఏళ్లుగా కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చింది.కేరళ వంటి రాష్ట్రాల సామా జిక, ఆర్థిక అభివృద్ధికి అక్కడి చైతన్య వంతమైన పంచాయతీ వ్యవస్థ ముఖ్య కారణం. గ్రామ పంచాయతీ స్థాయిలోనే పాలన సమర్థంగా అందడం, మరికొన్ని ఇతర అంశాలు దీనికి కారణం. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్థల బలోపేతం, పాలన వికేంద్రీకరణ అంశాల్లో ముందు వరుసలోనే ఉన్నాయి.పరిమితమైన వనరులను దృష్టిలో పెట్టుకుంటే గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీలకు అందే నిధులు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే ఈ నిధులు తలసరి లెక్కలో విడుదల అవుతూంటాయి. పోనీ పంచాయతీలు సొంతంగా ఏవైనా వినూత్నమైన ఆదాయ వనరులను సమకూర్చుకోగలవా? ఇది కూడా వీలు కాని విషయమే. ఇలా చేసుకోగలిగితే ఆ గ్రామపంచాయతీ చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. కేరళలో కొన్ని గ్రామ పంచాయతీలు వినూత్నమైన పద్ధతుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తూండటం ఇక్కడ చెప్పుకోవా ల్సిన విషయం. 2030 నాటికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామ పంచాయతీల బలోపేతం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవు తుంది. ఆర్థిక సహకారం, పాలన పరంగా స్వాతంత్య్రం కూడా అవసరమవుతాయి. వీటితోపాటు గ్రామ పంచాయతీల స్థాయిలో సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో సమర్థమైన, వికేంద్రీకృతమైన పరిపాలన సాగేందుకు కింది సూచనలను కూడా పరిగ ణనలోకి తీసుకోవచ్చు. దీనివల్ల మానవ వనరుల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ‘2022 నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్’ ఇచ్చిన సలహా సూచనల సాయంతో పనులు చేపట్టాలి. ప్రణా ళిక రూపకల్పన, అమలులో గ్రామపంచాయతీల్లోని ప్రజలందరూ భాగ స్వాములయ్యేలా చూడాలి. ఇందుకు తగ్గట్టుగా గ్రామ పంచాయ తీలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చాలి. దాతృత్వసంస్థల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు సమ కూరేలా వ్యస్థలను ఏర్పాటు చేయాలి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించగలవని నా విశ్వాసం. – డా.డబ్ల్యూ. రాంపుల్లా రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఎన్ఐఆర్డీ మాజీ డైరెక్టర్ జనరల్ -
సింహాచలం స్టేషన్‌కు ‘అమృత’ భాగ్యం!
సాక్షి,విశాఖపట్నం : సింహాచలం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టింది. అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. ‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దేశంలో 5జీ మొబైల్ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగువేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయి’అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదీచదవండి..విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ -
4 ఏళ్లలో భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది. -
పేదల సుఖసంతోషాలే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
సింగరాయకొండ: పేద ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2047 సంవత్సరం నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తు న్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం 17 రకాల పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆయా పథకాల గురించి అందరికీ తెలిసేలా చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని వివరించారు. కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల పంచాయతీ భూతంవారిపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు కొమ్మాలపాటి వెంకట రమణమ్మతో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. డ్రోన్ ద్వారా సాంకేతిక పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం ద్వారా ఆమెకు కలిగిన లబ్ధిని, అనుభవాలను చెప్పాలని మోదీ కోరారు. రమణమ్మ మాట్లాడుతూ తాను ఎంఏ బీఈడీ చదివానన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల ద్వారా డ్రోన్ ద్వారా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. అందుకోసం ఆచార్య రంగా యూనివర్సిటీలో 12 రోజుల పాటు శిక్షణ పొందానన్నారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకుంటున్నానని, నీటి అవసరం కూడా బాగా తగ్గిందని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి రైతూ సాంకేతిక పద్ధతిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. అలాగే సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలోని మరికొంతమందితోనూ ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నదని కొనియాడారు. అనంతరం 24 స్వయం సహాయ గ్రూపులకు రూ.4.80 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందించారు. పారిశుధ్య పనులు చేస్తున్న క్లాప్ మిత్రలను సత్కరించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఉజ్వల భారత్ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. డ్రోన్ వినియోగంలో శిక్షణ పొందిన రమణమ్మకు లైసెన్స్ పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ దినేష్‌కుమార్, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం జిల్లా ఇన్చార్జి ఎం.రామచంద్రుడు, జేసీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో మచిలీపట్టణం
-
గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో భాగం కండి
న్యూఢిల్లీ: ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో భాగం కావాలని గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ పిలుపునిచి్చంది. జీవఇంధనాల అభివృద్ధికి సంబంధించిన నైపుణ్యాలను వర్ధమాన దేశాలు, అంతగా అభివృద్ధి చెందని దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో పాల్గొన్న కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు పిలుపునిచ్చారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ని కలిపి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యాన్ని అయిదు నెలల ముందుగా 2022 మేలో భారత్ సాధించిందని, దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని అయిదేళ్లు ముందుకు జరిపి 2025కి మార్చుకుందని ఆయన చెప్పారు. బయోమాస్‌ను ఇంధనంగా మార్చడం ద్వారా ఇటు రైతులకు అదనపు ఆదాయ వనరును అందుబాటులోకి తేవడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపునకు కూడా భారత్ కృషి చేస్తోందని పురి వివరించారు. ఇందుకు సంబంధించి టెక్నాలజీ బదలాయింపు, సంయుక్త పరిశోధన .. అభివృద్ధి కార్యకలాపాలు, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో ఇతర గ్లోబల్ సౌత్ దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. బయోమాస్ నుంచి తయారు చేసే జీవ ఇంధనాలను ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయెన్స్ ఏర్పడింది. ఇందులో అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు భాగంగా ఉన్నాయి. కొన్ని దేశాలు మినహా ఉత్తరార్ధగోళంలో ఉన్న మెజారిటీ దేశాలను గ్లోబల్ నార్త్గాను, దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలను గ్లోబల్ సౌత్గాను వ్యవహరిస్తున్నారు. -
సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్: విజయసాయిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాషష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 890కోట్లు , రూ. 300 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇదే మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చన్నారు. ఉన్నది లేనట్టు అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసిందే చెప్పండని ఇన్ఫ్లూయెన్సర్లకు సూచించారు. -
స్త్రీశక్తి వినిమయంతోనే అభివృద్ధి!
ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ కర్షకుల అసమానతల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, పోరాటం కూడా జరుగుతోంది. నిజానికి అనాది కాలం నుంచి ప్రధానమైన అసంఘటిత శ్రామికులుగా స్త్రీలు ఉన్నారు. వారు కేవలం శ్రామికులే కాదు, ఉత్పత్తి శక్తులు కూడా! కానీ వారిని రానురాను పురుషాధి పత్యంతో అన్ని రంగాల్లోనూ తొక్కివేశారు. శ్రామిక స్త్రీ ప్రపంచానికి ఊపిరి. స్త్రీ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకోకుండా మనం అభివృద్ధి పథంలో పయనించలేం. కుల, మత, లింగ బేధాలు లేకుండా ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళవలసిన సందర్భం ఇది. నిజానికి మానవాళి చరిత్రలో జరిగిన మార్పులన్నీ స్త్రీలు ఉత్పత్తికి దగ్గరయ్యే క్రమంతోనే ముడిపడి వున్నాయి. పురుషులతోనూ, తన పిల్లలతోనూ, తల్లిదండ్రులతోనూ స్త్రీకుండే సంబంధ బాంధ వ్యాలే మానవాళి చరిత్ర. స్త్రీలకూ, పురుషులకూ మధ్య వ్యక్తమయ్యే ఐక్యత, ఘర్షణల్లో సామాజిక సంబంధాలు నిర్ణయమయ్యాయి. ఒక సారి మనం చరిత్ర పూర్వ యుగానికి వెళితే, ఉత్పత్తిలో తనకు సహకరించే పురుషుణ్ణి స్త్రీయే ఎన్నుకునేది. ఈ విధమైన పద్ధతి భారత సమాజంలో ఆర్యులు రాకపూర్వం వుండేది. ఆర్యులు వచ్చాక ఉత్పత్తి రంగం నుండి వారిని తప్పించి బానిసత్వంలోకి నెట్టారు. ఆదిమ సమాజం నుండి స్త్రీ గణనాయికగా, సామాజిక శ్రామిక శక్తిగా,పంపిణీదారుగా వేలాది సంవత్సరాల పాటు సమసమాజ భావనతో సమాజాన్ని నడిపించింది. హెన్రీ మోర్గాన్ తన ‘ప్రాచీన సమాజం’లో ఈ సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషించారు. 2018–19 పరిస్థితులతో 2022–23 పరిస్థితులను పీఎల్ఎఫ్ఎస్ (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) నివేదికతో సరిపోల్చితే పనిపరంగా స్త్రీల ముఖచిత్రం ఎలా మారిందో అర్థమవుతుంది. స్వీయ ఉపాధిపై ఆధారపడే మహిళలు 53 శాతం నుంచి 65 శాతానికి పెరిగితే, రెగ్యులర్ మహిళా ఉద్యోగులు 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గారు. క్యాజువల్ ఉద్యోగులు 25 శాతం నుంచి 19 శాతానికి తగ్గిపోయారు. యజమానులుగా వుండే మహిళలు 23 శాతం నుంచి 28 శాతానికి పెరిగితే, జీతాలు లేని పనివారి వాటా 31 శాతం నుంచి 38 శాతానికి చేరుకుంది. అదే పురుషులలో ఈ శాతాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. స్వీయ ఉపాధి పొందే పురుషులు ఈ ఐదేళ్లలో 52 శాతం నుంచి 54 శాతానికి పెరగగా, యజమానులు 44 శాతం నుంచి 44.3 శాతానికి, జీతాల్లేని సహాయకులు 7.6 శాతం నుంచి 9.3 శాతానికి పెరిగారు. వ్యవసాయంపై ఆధారపడే కార్మికుల వాటా 41 శాతం నుంచి 43 శాతానికి, నిర్మాణరంగ పనులను నమ్ముకునే వారి వాటా 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. స్త్రీ, పురుషుల మధ్య ఉపాధి, ఆదాయాలలో వ్యత్యాసాలకు సంబంధించిన 200 సంవత్సరాల రికార్డు లను విశ్లేషించి... నోబెల్ బహుమతి గ్రహీతలు ఎంతో ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా సుమారు 120 కోట్ల మంది పేదవారున్నారు. వీరిలో భారతదేశం, పాకిస్తాన్‌తో కూడిన దక్షిణాసియా ప్రాంతంలో అత్యధికంగా వున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్రికాలో 38 శాతం మంది పేదలు వున్నారు. అలాగే బహువిధ పేదరిక సూచీని నీతి ఆయోగ్ ఇటీవల వెలువరించింది. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు వంటి 12 అంశాల ఆధారంగా రూపొందే ఈ సూచీ ప్రకారం, 2015–16లో 25 శాతం వున్న బహువిధ పేదరికం 2019–21 నాటికి 15 శాతానికి తగ్గింది. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజ స్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశాలలో పేదరిక నిర్మూలనలో మంచి పురోగతి కనిపించింది. బిహార్‌లో 34 శాతం, జార్ఖండ్‌లో 28.8 శాతం, ఉత్త రప్రదేశ్‌లో 23 శాతం, మధ్యప్రదేశ్‌లో 21 శాతం, అస్సామ్‌లో 19 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 16 శాతం మేర బహువిధ పేదరికం తగ్గింది. అయినప్పటికీ, ఈ రాష్ట్రాల్లో పేదరికం జాతీయ సగటు కన్నా ఎక్కువే. ప్రపంచంలో పనిచేసే జనాభాలో మూడింట రెండొంతుల మంది అసంఘటిత రంగంలోనే వున్నారన్నది అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా. వీరు లాటిన్ అమెరికా, సహారా ఎడారి దిగువ దేశాలు, దక్షిణాసియా దేశాల్లోనే ఎక్కువగా ఉన్నారు. అసంఘటిత కార్మికుల్లో 58 శాతం మహిళలే. పురుషులతో పోలిస్తే వారి వేతనాలు తక్కువ. డిజిటల్ వేదికల ద్వారా ఉపాధి పొందేవారిని ప్లాట్‌ఫామ్ కార్మికులని అంటారు. అసంఘటిత రంగంలో వీరిని కొత్త వర్గంగా పరిగణిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థలు వచ్చిన తర్వాత ఐటీ రంగంలో యువతులు ముమ్మరంగా ప్రవేశించారు. అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా, ఇంగ్లాండ్ దేశాల్లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి అనుగుణంగా ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, మంగుళూరు, కొచ్చిన్‌లలో భారతీయ యువతులు రాత్రివేళల్లో పని చేస్తున్నారు. దీంతో అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్‌ఫోన్ విప్లవం ద్వారా ఇప్పుడు పరిమిత కాల పనులు వచ్చాయి. భారత్‌లో ఈ తరహా గిగ్ వర్కర్ల సంఖ్య 80 లక్షలు. యువ జనులు, వలస వచ్చిన వారు ఈ ఉద్యోగాలను ఆశ్రయిస్తున్నారు. వీరి పని పరిస్థితులు మెరుగుపడాలనీ, వీరికి ఆరోగ్య బీమా, పింఛన్ సౌకర్యాలు అందించాలనీ ఆర్థికవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. గిగ్ వర్కర్లలో కేవలం 12.2 శాతానికే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. నాలుగు శాతం అటల్ పెన్షన్ పథకంలో చేరారు. సామాజిక భద్రత అంటే ఫించన్, ఆరోగ్య బీమా సదుపాయాలు రెండూ ఉండడం. దీన్ని ఎవరు కల్పించాలనేది ప్రశ్న. కేంద్ర ప్రభుత్వమా లేక డిజిటల్ ప్లాట్‌ఫామ్ కంపెనీలా? కంపెనీల నుంచి కొంత రుసుము వసూలు చేసి ప్రభుత్వ సంక్షేమ నిధిలో జమ చేయాలి. గిగ్ వర్కర్ల నైపుణ్య శిక్షణకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్లాట్‌ఫామ్ కంపెనీలు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలసి సాగాలి. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాధిపత్యం, పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థలు స్త్రీని ఇంకా బలహీనమైనదిగా చూస్తున్నాయి. ఈ ధోరణి అంతం కావాలంటే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా ఫూలే ఆలోచనలతో ముందుకు సాగాలి. రాజ్యాంగ స్ఫూర్తిని అందు కోవాలి. కుల, మత, లింగ భేదాలు లేకుండా ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్ళవలసిన సందర్భం ఇది. సంకెళ్ళు తెంచుకోవాల్సింది స్త్రీలే, ఎవరో కాదు. స్త్రీలు ఆత్మగౌరవ పోరాట పతాకాన్ని ఎగర వేయాలి. శ్రామిక స్త్రీ ప్రపంచానికి ఊపిరి! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
మాస్టర్‌ప్లాన్.. అమలు చేస్తేనే మేలు
హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం వరంగల్. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర అభివృద్ధి కోసం రచించిన ప్రణాళికలు అంతే వేగంగా అమలు కావడం లేదు. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు కాగా జనాభా 10.90 లక్షలకు చేరింది. ఉమ్మడి వరంగల్ అనేక మందికి నివాసయోగ్య నగరంగా మారింది. ఇక్కడి ప్రజల ఎజెండాను అమలు చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, వరంగల్ అల్లంతదూరాన ‘మాస్టర్‌ప్లాన్’... వరంగల్ మాస్టర్‌ప్లాన్–2042 సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 42 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి ఫైల్ కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద సిటీగా.. 10.90 లక్షలకు మించిన జనాభా ఉన్న గ్రేటర్ వరంగల్‌లో 50 ఏళ్ల నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. వెంటనే మాస్టర్‌ప్లాన్ – 2042ను అమల్లోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్‌లో ‘ఇన్నర్ రింగ్‌రోడ్డు’.... 1972లో ‘కుడా’ఆవిర్భావంలో ఏర్పడిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు పొందుపర్చారు. భూ సేకరణకు 2013లో రూ.13 కోట్లు ఆర్డీఓ పేరిట జమ చేశారు. తదుపరి మరో రూ.50 కోట్ల నిధులు రెవెన్యూ శాఖకు అప్పగించారు. కానీ ఇంత వరకు భూ సేకరణ పూర్తి కాలేదు. పనులు పూర్తి కాలేదు. కలగా రోప్ వే... ఏపీలోని విశాఖ నగరంలో కైలాసగిరి పైకి ఎలాగైతే రోప్‌వే (వేలాడే పెట్టె) ఉందో అలాంటిదే వరంగల్ నగరంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. భ«ద్రకాళి గుడికి వచ్చిన వారు భద్రకాళి చెరువు అందాలను వీక్షిస్తూ హనుమకొండ పద్మాక్ష్మి గుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి హంటర్ రోడ్డు జూపార్కు ఎదురుగా ఉన్న రీజినల్ సైన్స్ కేంద్రం గుట్టపై వరకు రోప్‌వే డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు 2007లో టెండర్లు పిలిచారు. వైజాగ్ రోప్‌వే ప్రాజెక్టు చేసిన కోల్‌కతాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత పనులు ముందుకెళ్లలేదు. మామునూరు ఎయిర్‌పోర్టు... నియో రైలు.. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్నది ఎన్నో ఏళ్ల కల. ఒకప్పుడు ఇక్కడ విమానాలు ఎగిరాయి. ఇప్పటికీ రన్‌వే, విమానాశ్రయం ఉన్నాయి. మట్టి నమూనా పరీక్షలను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు ఏడాదిన్నర క్రితం చేపట్టారు. ఇక మిగిలిన స్థలసేకరణ బాధ్యత రాష్ట్రానిది. ఈ ప్రక్రియపై వేగం పెరిగి పూర్తయితే రెండు, మూడేళ్లలో ఈ ప్రాంత ప్రజలకు విమానయానయోగం సులువవుతుంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు, ప్రణాళికలు ఇంకా కాగితాలపైనే ఉన్నాయి. ‘ఔటర్ రింగ్‌రోడ్డు’అలాగే... ఔటర్ రింగు రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. మొత్తంగా నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇంకా 40 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ముసురు మొదలయ్యిందంటే ‘ముంపు’భయం.. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం 408 చదరపు కిలోమీటర్లు. నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. సుమారు 1,500 పైగా కాలనీలుంటాయి. ఇందులో 40 శాతం కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. భూ కబ్జాలు, ఆక్రమణలతో 40కి పైగా లోతట్టు కాలనీలు ప్రమాదపు అంచులో ఉంటున్నాయి. కాస్త వర్షం కురిస్తేనే కాలనీలు ఏరులై వరంగల్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. -
కౌలు చెల్లించాల్సింది సీఆర్డీఏ.. రాష్ట్ర ప్రభుత్వం కాదు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బైరెడ్డి సాయి ఈశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కౌంటర్లు దాఖ లు చేయాలని భూములిచ్చిన పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించినందుకు ‘మీరు పిటిషనర్ల పట్ల ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారం’టూ న్యాయమూర్తిపై రాజధాని రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర ఆరోపణ చేశారు. రాజధానికి భూములిచ్చినందుకు మేలో చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇప్పటివరకు చెల్లించలేదంటూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితితో సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం మరోసారి విచారణ జరి పారు. ఈ సందర్భంగా బైరెడ్డి సాయి ఈశ్వరరెడ్డి తరపున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. రాజధానికి భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని కోసం సేకరించిన భూముల కోసం రూ.1,000 కోట్లతో డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారని, ఇది సీఆర్డీఏ వద్ద ఉంటుందని తెలిపారు. ఈ ఫండ్ నుంచి సీఆర్డీఏనే కౌలు చెల్లించాలన్నారు. ఇందుకు విరుద్ధంగా 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయని, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కోట్ల రూపాయలను రాజధానికి భూములిచ్చారన్న పేరుతో కేవలం ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే చెల్లించడం సరి కాదని అన్నారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ఎలాంటి క్లెయిమ్స్ లేవనెత్తడానికి వీల్లేదన్నారు. సీఆర్డీఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరడానికి వీల్లేదని, రాజధాని విషయంలో నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందని చెప్పా రు. వాదనలు వినిపించేందుకు తమను ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తున్న ట్లు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకే... ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించడంపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఎప్పుడో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండా ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించడం సరికాదన్నారు. రైతులకు కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇందులో భాగంగానే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైందని తెలిపారు. మీరు (జస్టిస్ కృష్ణమోహన్) తమ పట్ల ప్రతికూల అభిప్రాయం (ప్రిజుడీస్) కలిగి ఉన్నారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. రాజకీయాలతో ఈ పిటిషన్‌కు సంబంధం లేదని, పిటిషనర్ న్యాయవాది అని వివేకానంద వివరించారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ తరువాత పూర్తి విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
2035 నాటికి ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్ డి లిటిల్ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ ప్రపంచ కేంద్రంగా మారవచ్చు. దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది. నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్వేర్ మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ సాఫ్ట్వేర్ హబ్‌గా, ఆఫ్‌షోర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది. -
పరిశోధనలపై దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దిగ్గజాలుగా ఎదగాలంటే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు పెద్ద పీట వేయాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. వినూత్న ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం కీలక యంత్రపరికరాలను తయారు చేయాలని అటు మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు సూచించారు. ఫార్మా–మెడ్ టెక్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, నవకల్పనలపై జాతీయ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు తమ లాభాల్లో 20–25 శాతాన్ని పరిశోధన, ఆవిష్కరణలపై వెచ్చిస్తుంటాయి. కానీ దేశీ కంపెనీలు సుమారు 10 శాతమే వెచ్చిస్తున్నాయి. మనం పరిశోధన ఆధారిత వినూత్న ఉత్పత్తులను తయారు చేయనంతవరకూ అంతర్జాతీయంగా ఈ విభాగానికి సారథ్యం వహించలేము‘ అని ఆయన చెప్పారు. 2047 నాటికి ఫార్మా పరిశ్రమ స్వావలంబన సాధించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. నాణ్యత కూడా ముఖ్యమే.. భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యతపై కూడా ఫార్మా పరిశ్రమ దృష్టి పెట్టాలని మాండవీయ చెప్పారు. మరోవైపు, ఫార్మా మెడ్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకాన్ని (పీఆర్ఐపీ) కూడా కేంద్రం ఆవిష్కరించింది. ఈ స్కీము బడ్జెట్ రూ. 5,000 కోట్లని మాండవీయ చెప్పారు. పరిమాణంపరంగా 50 బిలియన్ డాలర్లతో భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో 120–130 బిలియన్ డాలర్లకు ఎదగగలదని అంచనాలు ఉన్నాయి. -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సాక్షి, విశాఖపట్నం : నీతి ఆయోగ్ గ్రోత్ హబ్స్ జాబితాలో విశాఖ ఎంపికైన నేపథ్యంలో అభివృద్ధికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ, టూరి జం ఆర్డీ శ్రీనివాస్‌పాణి, మెట్రోరైల్ ఎండీ యూజేఎం రావు తదితరులతో మాట్లాడారు. విశాఖ అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై ప్ర త్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగు విభాగాలుగా రూ పొందుతోందని మెట్రో ఎండీ యూజేఎంరావు తెలిపారు. లైట్ కారిడార్, మోడరన్ కారిడార్ పేర్లతో రూపొందుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని జవహర్‌రెడ్డి సూచించారు. జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర్బన్ గ్రోత్ హబ్ సిటీస్ జాబితాలో విశాఖ చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. 2047 నాటి కి వికసిత్ భారత్‌గా వెలుగొందాలంటే అర్బన్ సిటీ స్ గ్రోత్ సెంటర్స్ ముఖ్యమని నీతి ఆయోగ్ గుర్తించిందని తెలిపారు. ఇందుకోసం నీతి ఆయోగ్ బృందం టోక్యో, న్యూయార్క్ వంటి 20 ప్రపంచస్థాయి నగరాల్ని అధ్యయనం చేసి రోడ్ మ్యాప్ సిద్ధం చే సిందని, ఇందులో భాగంగా విశాఖని ఎంపిక చేసిందని వివరించారు. విశాఖ నుంచి సీఎం పరిపాలనపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామన్నారు. -
ఆ బిల్లులు ఆమోదించాలి
మహిళలకు సమానావకాశాలతోనే అభివృద్ధి మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకా శాలు లభించినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీఆర్ఎస్పీపీ పేర్కొంది. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తీరుపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీ సమావేశా ల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశా రు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని కూడా బీఆర్ఎస్పీపీ ఆమోదించింది. సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మహిళలకు పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (బీఆర్ఎస్ పీపీ) సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లోనే వీటిని ఆమోదించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశా లు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్ఎస్పీపీ సంయుక్త సమావేశం జరిగింది. పార్లమెంటు, శాసన సభల్లో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారి హక్కులు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుంద న్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ డిమాండ్లను ఎంపీలు లేవనెత్తాలని, అందుకు అవసరమైన సమాచారంతో సిద్ధం కావాలని సూచించారు. దేశ సంపదలో ఓబీసీల కీలక భాగస్వామ్యం తమ వృత్తుల ద్వారా దేశ సంపదను సృష్టించడంలో కీలక భాగస్వాములైన ఓబీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేలా 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని బీఆర్ఎస్పీపీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటున్న ఓబీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందనే అభి ప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ మంచి ఫలితాలు ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని ఎంపీలు అన్నారు. రాజకీయ అధికారంలో ఓబీసీ ల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వా రు పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతారని బీఆర్ ఎస్పీపీ పేర్కొంది. పార్లమెంటు ప్రత్యేక సమావే శాల్లో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చిత్తశు ద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే (14 జూన్ 2014) ఓబీసీ రిజర్వే షన్ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. తొమ్మిదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. 17న కేంద్రం ఏమంటుందో చూద్దాం ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమా వేశాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులు చర్చకు వస్తాయని కేంద్రం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఎజెండాలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సీఎం కేసీఆర్ బీఆర్ఎస్పీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘ఈ నెల 17న కేంద్రం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై వ్యూహాన్ని రూపొందించుకుందాం. ఒకవేళ జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలు ప్రస్తావనకు వస్తే మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేద్దాం. ఈడీ నోటీసులు జారీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నందున ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడేది లేదు. మహిళలు, ఓబీసీల రిజర్వేషన్ బిల్లులపై ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ అసలు స్వరూపం పడుతుంది..’ అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. వారికి 33% రిజర్వేషన్ కల్పించండి ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖలు చట్టసభల్లో మహిళలు, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లులు ప్రవేశ పెట్టాలని శుక్రవారం బీఆర్ఎస్పీపీ తీర్మానించిన నేపథ్యంలో ముఖ్య మంత్రి ఈ లేఖలు రాశారు. ‘శతాబ్దాలుగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమా పేందుకు ముందుచూపుతో రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. పార్లమెంటు, శాసనసభల్లోనూ మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చొరవను తీసుకోలేదు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనైనా బిల్లు ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను..’ అని ఒక లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఓబీసీలకు కోటాపై సీఎం మరో లేఖ రాశారు. ‘విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఫలాలు కొంతమేర దక్కినా చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికైనా కేంద్రం 33 శాతం కోటా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలి..’ అని కోరారు. -
అభివృద్ధికి అడ్డంకిగా టీడీపీ అండ్‌కో
శ్రీకాకుళం: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి టీడీపీ, ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది. చెప్పినవన్నీ సీఎం జగన్ చేసేస్తుండటంతో బాబు అండ్ కో తట్టుకోలేకపోతున్నారు. రోజుకో రకంగా విషం చిమ్మడం, స్థానికులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు కిడ్నీ రీసెర్చ్ కమ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఇప్పటికే నిర్మితమైంది. ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు పూర్త యింది. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు వంశధార లిప్ట్ ఇరిగేషన్ యూ నిట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇంకోవైపు మూలపేట పోర్టు పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. ఇంకేముంది టీడీపీ అండ్‌కోకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. చూసి ఓర్వలే క మూల పేట పోర్టు పనులపై పడ్డారు. విషం చిమ్ముతూ స్థానికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక రకంగా మూలపేట పోర్టునైనా అడ్డుకుని, పనులు జరగకుండా బ్రేక్ వేయాలని చూస్తున్నారు.వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయరనే భ్రమలో ఇన్నాళ్లూ పచ్చగుంపు ఉండేది. కొన్నాళ్లు పనులు జరగలేదని దుమ్మెత్తిపోసింది. మరికొన్నాళ్లు పనులు పడకేశాయని దు ష్ప్రచారం చేసింది. ఇంకొన్నాళ్లు పనులు నిలిచిపోయాయని విష ప్రచారానికి ఒడిగొట్టింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభు త్వం ఇవేవీ పట్టించుకోలేదు. అనుకున్నవన్నీ చేసేసింది. పది పైసల పనిచేసి వంద రూపాయల ప్రచారం చేసుకున్నట్టుగా కాకుండా సైలెంట్‌గా చేయాల్సిన కార్యక్రమాలన్నింటికీ శ్రీకారం చుట్టింది. రూ.50కోట్లతో కిడ్నీ రీసెర్స్ కమ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసేసింది. రూ.700కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేసింది. ఇప్పుడీ రెండూ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ముందే చెప్పినట్టుగా వంశధార జలాలను నిర్దేశిత ఆయకట్టుకు నీరందించే ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీటితో పాటు సాగునీరు అందించేందుకు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపడుతోంది. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తోంది. నాగావళి–వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. వంతెనలు, రోడ్లు, పక్కా ఆస్పత్రి భవనాలు,విద్యాలయాలు.. ఇలా ఒకటేంటి అన్నీ ఏకకాలంలోనే జరుగుతున్నాయి. నాడు వైఎస్సార్ హయాంలో ఏ రకంగానైతే ల్యాండ్ మార్క్ ఉండేలా అభివృద్ధి పనులు జరిగాయో అంతకుమించి ఇప్పుడు జరుగుతున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో టీడీపీ నాయకులకు, ఎల్లో మీడియాకు వణుకు పుట్టింది. దీంతో ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావాలని, గందరగోళం సృష్టించి రెచ్చగొట్టేందుకు ప్రేరేపిత కార్యక్రమాలు చేపడుతున్నాయి. చంద్రబాబు సభలకు, లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన లేక డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ఎక్కడికక్కడ దాడులకు పాల్పడుతున్నట్టు.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై కూడా లేనిపోని దుష్ప్రచారం చేసి, ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో స్పీడ్‌గా జరుగుతున్న మూలపేట పోర్టు పనులను అడ్డుకోవాలని టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర పన్నాయి. ఇది కూడా పూర్తయితే టీడీపీ పుట్టి మునగడమే కాకుండా అచ్చెన్నాయుడు, గౌతు ఫ్యామిలీ రాజకీయాలకు ఫుల్స్టాప్ పడుతుందన్న భయంతో అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. ఓ మాజీ సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడిని ముందు పెట్టి, వారి వెనక ఓ 20 మందిని పంపించి తరుచూ పోర్టు పనులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ సానుకూలత రాకపోవడంతో స్థానికులను రెచ్చగొట్టేందుకు దుష్ప్రచారం చేస్తోంది. ఒకరోజు టీడీపీ నాయకులు, మరో రోజు వారికి వత్తాసు పలుకుతున్న రాజకీయ నాయకులతో కలిసి పోర్టు పనులకు ఆటంకం కల్పిస్తుండగా, వారికి కొనసాగింపుగా ఈనాడు పత్రిక విషం చిమ్మే కథనాలు ప్రచురిస్తోంది. దాని వత్తాసుగా ఆంధ్రజ్యోతి అసత్యాలను వల్లె వేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేసేలా కథనాలు వండి వార్చుతోంది. వీరి గూబ గుయ్యమన్నట్టుగా జిల్లా యంత్రాంగం అసత్య రాతలను ఖండించడమే కాకుండా వారి ఉద్దేశాలను కడిగిపారేసేలా, కుట్రలను చిత్తు చేసేలా బహిరంగ ప్రకటనలను విడుదల చేస్తోంది. తామెన్నీ రాసినా ఏ ఒక్కరూ అడగరు.. పట్టించుకోరు అన్నట్టుగా రాస్తున్న కథనాలకు అధికారులు సైతం చెక్ పెట్టడం వారు ఊహించలేదు. జిరాయితీ భూముల్లో ఉన్న చెట్లకే పరిహారం ఇస్తామని యంత్రాంగం మొదటి నుంచి చెబుతుండగా దాన్నీ వక్రీకరించి ప్రభుత్వ భూము ల్లో ఉన్న చెట్లకు కూడా పరిహారం ఇస్తామని చెప్పి అన్యా యం చేశారని ‘ఈనాడు’ తప్పుడు కథనాలను రాసింది. ఇలాంటివి అనేక ఇవ్వని హామీలను ఇచ్చినట్టు పత్రికలో రాసి ప్రజల్ని గందరగోళానికి గురిచేసి, రెచ్చగొట్టే ప్రయ త్నం చేస్తోంది. మూడు అడుగుల ఎత్తు చేసిన భూముల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తుంటే... ముంపు ప్రాంతంలో పునరావాసం కల్పిస్తున్నారని అవాస్తవాలతో ‘ఆంధ్రజ్యోతి’ తప్పుడు కథనాలు వండి వార్చింది. ఇలా రోజూ మూలపేట పోర్టుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూనే ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కనుసన్నల్లో ఆయన అనుచర వర్గం అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు రాసి ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాయి. కాకపోతే, స్థానికులెవరూ ఆ కథనాలను, దుష్ప్రచారాన్ని, టీడీపీ నేతల కుట్రలను నమ్మడం లేదు. కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తున్నారు. ముంపు లేదు మూలపేట పోర్టు నిర్వాసితులకు కేటాయించిన పునరావాస స్థలం ముంపు ప్రాంతం కాదు. రేటు అయిన మా వ్యవసాయ భూములను అభివృద్ధికి సహకరించి ఇచ్చాము. పునరావాస ప్రాంతం అంతా మట్టి వేసి మూడు అడుగులు ఎత్తు చేశారు. – కర్రి కాంతారావు, రైతు, నౌపడ నిరాటంకంగా పనులు పునరావాస కాలనీలో పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి. నాణ్యతతో కూడిన పనులను చేపడుతున్నారు. మట్టి వేసి ఆ ప్రాంతం అంతా ఎత్తు చేశారు. యంత్రాల సాయంతో పను లు వేగంగా జరుగుతున్నాయి. – పి. రవికుమార్‌రెడ్డి, నౌపడ -
అభివృద్ధి అంటే పక్క రాష్ట్రాలతో పోలికా?
సాక్షి, అమరావతి : నిజాలతో పనిలేదు. వాస్తవాలు అసలే పట్టవు. కేవలం బురద జల్లడమే లక్ష్యం. అధికారంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి కాబట్టి... ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా, ప్రజల్లో విష బీజాలు నాటేలా నిత్యం ఈనాడు పత్రికలో అబద్ధాలతో కథనాలు రాయడమే రామోజీరావు పనిగా పెట్టుకున్నారు. ఏ రంగంలోనైనా అభివృద్ధిని అంచనా వేయాలంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది, ఏ మేరకు పురోగతి సాధించింది అని బేరీజు వేస్తారు. అలా చేస్తే గత సీఎం చంద్రబాబు బండారం బయటపడుతుంది. ఆయన రైతులకు చేసిన మోసాలు, అన్నదాతల పేరిట చేసిన అక్రమాలు బట్టబయలవుతాయి. ఇదే రామోజీ భయం. అందుకే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో బేరీజు వేస్తూ ఓ కథనం ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధుతో ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని పోలుస్తూ తలాతోక లేని ఓ పనికి మాలిన కథనాన్ని ప్రచురించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక విత్తు నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పలు పథకాలతో ఆర్థికంగ ఆదుకొంటూనే, సాగులో, పంట ఉత్పత్తుల అమ్మకాల వరకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా సహాయం చేస్తున్నారు. వీటన్నింటినీ విస్మరించి రామోజీ ఓ నేలబారు కథనాన్ని అల్లి, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. అసలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు కలుగుతున్న మేలును తెలుసుకుందాం.. బాబుకంటే మిన్నగా పెట్టుబడి సాయం చంద్రబాబు అంటేనే వంచన.. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు.. పట్టెడన్నం పెట్టే రైతునూ ఆయన వంచించిన తీరు నభూతో నభవిష్యతి. పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.15 వేలు ఇస్తానని నమ్మబలికిన చంద్రబాబు.. 2018–19లో రెండు విడతల్లో రూ.4 వేల చొప్పున 46.76 లక్షల మందికి అందించిన సాయం రూ.2,440.29 కోట్లు. దాంట్లో అన్నదాత సుఖీభవ పథకం కింద బాబు ఇచ్చింది రూ.1,765 కోట్లు మాత్రమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నమ్మకం. అందరికీ ఓ భరోసా. ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు అర్హత ఉన్న ప్రతి రైతుకూ ఇస్తామని వైఎస్ జగన్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా.. దానికంటే ఎక్కువగా ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లకు బదులు ఐదేళ్ల పాటు రూ. 67,500 అన్నదాతకు అందిస్తున్నారు. అంటే రూ.17,500 అదనంగా ఇస్తున్నారు. భూ యజమానులకే కాదు.. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద కౌలు రైతులతో పాటు అటవీ, దేవదాయ భూ సాగుదారులకు సైతం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2019–20 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల లబ్ధి చేకూర్చారు. ఇది రైతుకు మేలు కాదా? ఈ పోలిక ఎందుకు తేలేదు రామోజీ? 2023–24లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం జొన్న, రాగి, సజ్జ, అపరాలు, నూనె గింజలకు ఎకరాకు అయ్యే కనీస పెట్టుబడి రూ.13,000 ఉంటుంది. ఇందులో రైతు భరోసా సాయం రూ.13,500 ప్రభుత్వమే అందిస్తోంది. ఇతర పంటలకు అయ్యే పెట్టుబడిలో 80 శాతం ప్రభుత్వమే అందిస్తోంది. మరో వైపు ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనడమే కాకుండా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. ఇదంతా రైతుకు ఆదా అయ్యేదే. మొక్కజొన్న ఎకరాకు రూ.30 వేల నుండి రూ.45 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుండగా, బహిరంగ మార్కెట్లో ప్రభుత్వమే మంచి ధర ఇప్పిస్తోంది. ధాన్యం సేకరణలో విప్లవాత్మక మార్పులు ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థను, మిల్లర్ల జోక్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నివారించింది. ప్రస్తుత ప్రభుత్వం 2019 నుంచి 2023 వరకు ఈ నాలుగేళ్లలోనే ఇప్పటివరకు 32,78,099 రైతుల నుంచి 3,10,69,061 టన్నుల ధాన్యాన్ని రూ.58,766 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. రైతులకు చెల్లించాల్సిన నగదును నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తోంది. ధాన్యం కొనుగోలు గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితమయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. వీటి వరకు ధాన్యం తేవాల్సిన ఖర్చంతా రైతుదే. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా రైతు క్షేత్రం వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతు భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. సరిపడా సంచులు దొరక్క రైతులు ఇబ్బంది పడేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాటికి చెక్ పెట్టింది. ఏపీఎస్సీఎస్సీఎల్, పీఏసీఎస్‌లు కొరత లేకుండా గోనె సంచులను రైతులకు సమకూ రుస్తున్నాయి. గతంలో ఏ– గ్రేడ్, సాధారణ రకం అనే రెండు రకాలుగానే కొనే వారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం రకాల ప్రకారం గ్రేడెడ్ ఎంఎస్పీ ఇచ్చి కొంటోంది. ఇది రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంది. గతంలో రైతులు మిల్లుల వద్దకు వెళ్లి అక్కడే ధాన్యం కొలవాల్సి వచ్చేది. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు ఈ ఇబ్బందిని పూర్తిగా తొలగించింది. రైతుల వద్దే తూకం సహా అన్ని రకాల కొలమానాలు పూర్తి చేసి అక్కడే రశీదు ఇస్తున్నారు. రశీదు వెనుక టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఇస్తున్నారు. గతంలో రైతుల కు జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా) ఖర్చు లు అందేవి కావు. ఈ ప్రభుత్వం తొలిసారిగా ఈ ఖర్చులను రైతులకు అందిస్తోంది. తద్వారా క్వింటాలుకు కనీస మద్దతు ధరకు అదనంగా రూ.252 వరకూ రైతులకు లభిస్తోంది. దేశంలోనే వినూత్నం‘‘ఈ–క్రాప్’’ బుకింగ్ దేశంలోనే తొలిసారి ఎలక్ట్రానిక్ క్రాపింగ్ (ఈ – క్రాప్) ద్వారా రైతుల కమతాలలో విత్తిన పంటలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేయడాన్ని 2019 రబీలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ –క్రాప్‌లో వీఏఏ, వీహెచ్ఏ, వీఆర్ఏతో పాటు సాగు చేసే రైతుల వేలి ముద్రలు (ఈ కేవైసీ) నమోదు చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే మొబైల్ ఫోన్లకు డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ çపంపిస్తున్నారు. పంటల వివరాల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రాప్ ప్రామాణికంగా రైతు సంక్షేమ పథకాలైన వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, కనీస మద్దతు ధరకు పంటల ఉత్పత్తుల కొనుగోలు వంటివి అమలు చేస్తున్నారు. నాణ్యత కలిగిన ఉత్పాదకాలను రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా 13 జిల్లా, 147 నియోజకవర్గ స్థాయి అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రూ.115.57 కోట్లతో 127 నియోజకవర్గ ల్యాబ్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఏటా సగటున 20 వేల నమూనాలు పరీక్షించగా.. ప్రస్తుతం ఏటా 50 వేల చొప్పున రెండేళ్లలో లక్ష నమూనాలను పరీక్షించారు. వీటిలో 11 వేల నమూనాలు రైతులు తీసుకొచ్చినవే. ఆర్బీకేల ద్వారా రైతు ముంగిట సేవలు రైతుకు మొక్కుబడిగా కొంత ఆర్థిక సహాయం అందించి గాలికి వదిలేయకుండా, వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలవాలనే సంకల్పంతో గ్రామ సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఏర్పాటు చేసింది. 10,778 ఆర్బీకేల ద్వారా రైతాంగానికి వ్యవసాయ సాంకేతిక విజ్ఞానం, సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతుల ముంగిట్లోనే అందిస్తోంది. విత్తనాలు, ఎరువుల సరఫరాలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2019 నుండి ఇప్పటివరకు 41.46 లక్షల క్వింటాళ్ళ విత్తనాలను రూ.1,208.60 కోట్ల రాయితీపై 70.87 లక్షల మందికి సరఫరా చేసింది. గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలను ప్రతి ఏటా అందిస్తోంది. నాణ్యమైన ఎరువులను కూడా రైతుల ముంగిట్లోకే అందించడం వల్ల ఒక బస్తాకి రూ.20 నుంచి రూ.30 వరకు హమాలీ, రవాణా ఖర్చును రైతులు ఆదా చేసుకోగలుగుతున్నారు. సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి ఖర్చు, నిర్వహణ భారం లేకుండా తక్కువ అద్దెకే వారికి కావల్సిన యంత్ర పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఆర్బీకేలకు అనుసంధానంగా 10,936 గ్రామాల్లో రూ.1,052.42 కోట్ల విలువైన యంత్ర పరికరాలతో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. యంత్ర పరికరాలకు 40 శాతం రాయితీగా రూ.366.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దేశానికే ఆదర్శంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజి ద్వారా బీమా రక్షణ కల్పిస్తోంది. రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా రూపాయి ప్రీమియంకే పంటల బీమా అమలు చేస్తున్నాయి. బాబు హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పంటల బీమా పరిహారం అందిస్తే.. ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా పరిహారం చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రూ. 715.84 కోట్ల బకాయిలు కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. వైపరీత్యాల వేళ పంట నష్టపోయిన రైతులకు అదే పంట కాలం ముగిసేలోగా పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిటీ) అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 22.85 లక్షల రైతులకు రూ.1,976.45 కోట్ల పంట నష్ట పరిహారం (పెట్టుబడి రాయితీ)ని అందించింది. అధిక, అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తోంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంట రుణం తీసుకొని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు పూర్తి స్థాయిలో వడ్డీ రాయితీని రైతుల ఖాతాలోనే జమ చేస్తోంది. చంద్రబాబు హయాంలో 40.60 లక్షల మంది రైతులకు రూ.685 కోట్ల వడ్డీ రాయితీనిస్తే, ఈ నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం 73.88 లక్షల రైతులకు రూ.1,834.55 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ) వడ్డీ రాయితీని అందించింది. బాబు హయాంలో సగటున 153.95 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులొస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 165.87 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఇలా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే.. రామోజీ మాత్రం పక్క రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో పోలుస్తూ పొంతన లేని కధనాలు వండి వారుస్తున్నారు. -
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేం
హఫీజ్‌పేట్: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేమని, ఇంజినిరింగ్ ఫీల్డ్ ఎంతో విలువైనదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) ప్రాంగణంలో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ–20 సమ్మిట్, అంతర్జాతీయ సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంజినీర్లు భారతదేశంతోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి వారికి అందరికీ అందేలా చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలన్నారు. ఇంజినీరింగ్ రంగంలో ఉండే వాళ్లు మొదట వారి అమ్మను సంతోషపరిచేలా చేస్తే దేశాన్ని కూడా సంతోషపరిచేలా చేస్తారన్నారు. 2030 నాటికి విద్యుత్‌కు ప్రత్యామ్నాంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్నారు. ప్రతియేటా దశాబ్దాలుగా విద్యుత్ రంగంలో 50 మిలియన్ కొత్త కనెక్షన్లు అందిస్తున్నామని, ఇవి మరింత పెరిగేలా చూడాలన్నారు. విద్యుత్‌కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతుందన్నారు. 2070 ఎనర్జీ డిమాండ్ గణనీయంగా పెరగడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం సంతోషించదగ్గవిషయమని, 70 నుంచి 80 శాతం విద్యుత్‌ను సోలార్ ద్వారా వినియోగించేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. భారత దేశం ఆర్థిక రంగం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మరింత పటిష్టంగా మారుతోందన్నారు. చంద్రుడిపై అడుగిడడం కూడా శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల పాత్ర మరువలేనిదని, అందరినీ అభినందిం చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు బ్రోచర్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అధ్యక్షుడు శివానంద్ రాయ్, ఆర్టనైజింగ్ కమిటీ చైర్మన్ పి సూర్యప్రకాశ్, ‘ఎస్కీ’ డైరెక్టర్ డాక్టర జి రామేశ్వరరావు ప్రసంగించారు. తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కీరిట్పారిఖ్, ఐఈఐ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఐ సత్యనారాయణరాజు, సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ ప్రొగ్రెస్ సీనియర్ ఫెల్లో రాహుల్టాంగియా,రీ సస్టేనబిలిటీ లిమిటెడ్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర పీజీ శాస్త్రి, హడ్కో సీఎండీ వి సురే‹Ù, ప్రణాళికాసంఘం మాజీ కమిషనర్ అశోక్‌కుమార్ జైన్ పాల్గొన్నారు. -
రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు..
ఢిల్లీ: రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్‌ను చేపట్టారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్లో ప్రస్తుతం రహదారులు ఎలా ఉన్నాయో..? బైక్ రైడ్ ద్వారా తెలుపుతూ ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్యు అంటూ కామెంట్ పెట్టారు. 2012కి పూర్వం అక్కడ ఉన్న రోడ్ల దుస్థితిని ప్రస్తుతం ఉన్న రహదారులను పోల్చుతూ ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రధాని మోదీ హయాంలో హిమాలయాల్లో ఎలాంటి రోడ్లను నిర్మించారో జాతి మొత్తం చూస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా అన్నారు. రాహుల్ యాత్ర చేపడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్లో లాల్ చౌక్ వద్ద జాతీయ జెండా నేడు స్వేచ్ఛగా రెపరెపలాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే కశ్మీర్లో సరైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. Thanks to Rahul Gandhi for promoting excellent roads of Ladakh built by the @narendramodi govt. Earlier, he also showcased how Tourism is booming in Kashmir Valley & reminded all that our "National Flag" can be peacefully hoisted at Lal Chowk in Srinagar now! pic.twitter.com/vta6HEUnXM — Kiren Rijiju (@KirenRijiju) August 19, 2023 లద్ధాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్.. తాను ఇటీవల కొనుగోలు చేసిన కేటీఎమ్ బైక్‌పై పాంగాంగ్ లేక్ వరకు రైడ్ చేపట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.' ప్రపంచంలో అత్యంత సుందరమైన ప్రదేశం హిమాలయాల్లో ఉన్నాయని మా నాన్న తెలిపారు' అని రాహుల్ పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం రాహుల్ యాత్రకు కేంద్ర మంత్రులు స్పందించారు. To witness and spread the word about post-Article 370 developments in Leh and Ladakh, Shri Rahul Gandhi himself has taken a trip to the valley. We are elated and delighted to watch glimpses of his road trip. pic.twitter.com/X0mC18C40j — Pralhad Joshi (@JoshiPralhad) August 19, 2023 ఇదీ చదవండి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి -
అభివృద్ధి అనకొండ!
విపరీతమైన వానలు, దాంతో వరదలు, విలయం. బీభత్సం ముగిసిందని అనుకొనే లోగానే నెల రోజుల్లో రెండోసారి హిమాచల్‌ప్రదేశ్‌పై ప్రకృతి పంజా విసిరింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు, విరిగిపడుతున్న కొండచరియలు, పేకముక్కల్లా కూలుతున్న భవనాలు, నేలవాలుతున్న భారీ వృక్షాలు, కోసుకుపోయిన రోడ్లు, వంతెనలు, శిథిలాల్లో చిక్కుకున్న ప్రాణాలతో పర్వత ప్రాంత రాష్ట్రం అతలాకుతలమైంది. పెరుగుతున్న గంగమ్మ వరదలో ఉత్తరాఖండ్ ఉసూరుమంటోంది. ప్రమాదకర స్థాయిలో సాగుతున్న యమున మళ్ళీ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్ని భయపెడుతోంది. జూన్ ద్వితీ యార్ధం నుంచి జూలై చివరి వరకు వానలు, వరదలు ఒక్క హిమాచల్‌లోనే 150 మందిని బలిగొని, రూ. 10 వేల కోట్ల పైగా నష్టం కలిగిస్తే, తాజా విలయం ఇప్పటికే 60 మందిని పొట్టబెట్టుకొంది. హిమాలయాలు, దేశ కోస్తా ప్రాంతాలపై వాతావరణ పర్యవసానాలు గట్టి దెబ్బ కొట్టనున్నాయని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) 6వ నివేదిక పేర్కొంది. హిమాలయాల్లో సగటు ఉష్ణోగ్రత మిగతా దేశంతో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ఈ వర్షాకాలం అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలు అందుకు తగ్గట్టే ఉన్నాయి. స్వల్పవ్యవధిలో భారీ వర్షం కురిపించే మేఘపతనం, ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పులు కొంత కారణమే. అయితే, మనసును కుది పేసే ఈ బీభత్సానికి మతి లేని అతి అభివృద్ధికి దిగిన మానవ తప్పిదాలే ప్రధాన హేతువు. పుడమి తల్లిని పట్టించుకోకుండా కొండల్ని తొలిచి, శిథిలావశేషాల్ని నదుల్లో పడేసి, ఇష్టారాజ్యంగా సాగిన అక్రమ గనుల తవ్వకాలు, సహజమైన నదీ ప్రవాహాల్ని నిరోధించిన నిర్మాణాలు, అశాస్త్రీయంగా చేపట్టిన భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు కలిసి హిమాచల్ మెడకు ఉరితాళ్ళయ్యాయి. హిమాలయాల్లో వరదలు, విరిగిపడే కొండచరియలు కొత్త కాదు. అందులోనూ హిమాచల్‌లోని మొత్తం 12 జిల్లాల్లో కొండచరియల పతనం తరచూ తప్పదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎప్పుడో తేల్చింది. అంత సున్నితమైన ఈ హిమాలయ పర్వతశ్రేణుల్లో ప్రగతి పేరుతో పాలకులు చేతులారా ప్రకృతి విధ్వంసం చేశారు. ఫలితంగా కొన్నేళ్ళుగా ఏటవాలు ప్రాంతాలు మరింత అస్థిర మయ్యాయి. కేవలం 2020 నుంచి 2022 మధ్య కొండచరియల పతనాల సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని డేటా. ఈ పర్వతసానువుల్లో గత పదేళ్ళలో ఇష్టారాజ్యంగా రోడ్లు విస్తరించారు. ఏకంగా 69 నేషనల్ హైవే ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. నాలుగు లేన్ల హైవేలు వాటిలో అయిదున్నాయి. హిమా లయాల్లో ఇప్పటికే 168 జల విద్యుత్కేంద్రాలుంటే, 2030 నాటికి 1088 కేంద్రాలు రానుండడం శోచనీయం. పర్యావరణాన్ని పట్టించుకోని ఈ అంధ ఆర్థికాభివృద్ధి మంత్రం ఇక్కడికి తెచ్చింది. పద్ధతీ పాడూ లేకుండా కొండల తవ్వకాలు, మతి లేకుండా రోడ్ల నిర్మాణం, నిర్మాణ వ్యర్థాలను ఏమి చెయ్యాలనే ఆలోచనైనా లేకపోవడంపై హిమాచల్ హైకోర్ట్ నిరుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గమనిస్తే – దాదాపు ప్రతి వర్షాకాలం ఉత్తరాదిలో అస్సామ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ లాంటి రాష్ట్రాలు వానలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. గతంతో పోలిస్తే వరదల సంఖ్య, ఆస్తి, ప్రాణనష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరదల నివారణకు సమర్థమైన ప్రణాళిక లోపిస్తోంది. ఈ తప్పు కూడా పాలకులదే తప్ప ప్రకృతిది కాదు. మన దేశంలో 4 కోట్ల హెక్టార్లకు పైగా ప్రాంతం, అంటే దేశ భూభాగంలో దాదాపు 12 శాతానికి వరదల ముప్పుందని లెక్క. భూకంపాల లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే వరదల్ని ముందే అంచనా వేయడం, అడ్డుకోవడం చేయదగిన పనే. కానీ ప్రభుత్వాలు ఆ పనీ చేయట్లేదు. అనేక రాష్ట్రాల్లో వరద ముంపు నకు ఇష్టారాజ్యంగా అడవుల నరికివేత, నదీ పరివాహక ప్రాంతాల్లోని వృక్షచ్ఛాయల విధ్వంసం, పేరుకున్న పూడికలతో నదికి నీటిని నిల్వచేసే సామర్థ్యం తగ్గిపోవడం... ఇలా అనేక కారణాలు. దానికి తోడు నదీ తలాలు, నదీ మైదానాల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డ్యామ్‌ల వరద గేట్ల నిర్వహణలో సమన్వయ లోపాలు సరేసరి. ఈ స్వయంకృతాలన్నీ శాపాలవుతున్నాయి. విచిత్రం ఏమిటంటే – వరద పరిస్థితుల్లో సత్వర చర్యలు పర్యవేక్షించేందుకు దేశంలో ఒకే విభాగమంటూ ఏదీ లేకపోవడం! ఆ మాటకొస్తే, వరదల నిర్వహణకు మన రాజ్యాంగంలో నిర్ణీత ఏర్పాటేదీ లేదు. వాతావరణ శాఖ వర్షసూచనలు చెబితే, వరద ముప్పు సూచనలు చెప్పే బాధ్యత కేంద్ర జల సంఘానిది. వరద ముంపునకు గురయ్యాక సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ప్రకృతి వైపరీత్యాల సహాయ సంస్థలున్నాయి. బాధితుల పునరావాసం, దెబ్బతిన్న ప్రాథమిక వసతుల పునరుద్ధరణ బాధ్యత స్థానిక సంస్థలది. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కీలకం. ఇంకా విడ్డూరం – నీరు, సాగునీటి పారుదల, తదితర అంశాలన్నీ రాష్ట్ర జాబితాలోవే కానీ, వరదల్లో సహాయ బాధ్యతల నిర్వహణ మాత్రం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు వేటిలోనూ లేకపోవడం! పదే పదే వరదల ముప్పు తలెత్తుతున్న వేళ ఈ కీలక అంశాలపై కేంద్ర పెద్దలు తక్షణం సమగ్రంగా దృష్టి పెట్టాలి. 1970లలో నెలకొల్పిన ‘వరదలపై జాతీయ కమిషన్’ తరహాలో వరదల సమస్యలపై ఆచరణాత్మక వ్యూహాన్ని సూచించేలా ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇకనైనా వరదలపై అన్ని విభాగాలనూ సమన్వయ పరిచే సమగ్ర విధానం అత్యవసరం. అదే సమయంలో సున్నితమైన పర్యావరణాన్ని గౌరవించాలి. లేకపోతే తలెత్తే దుష్పరిణామాలకు హిమాలయ బీభత్సం ప్రతీక. మరి, ఈ మాటైనా హిమాలయాల మాట చెవికెక్కించుకుంటారా? -
హార్బర్లకు సమాంతరంగా ఆహ్లాదం
సాక్షి, అమరావతి : ఫిషింగ్ హార్బర్లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వాటి పక్కనే రిసార్టులు, వెల్నెస్ సెంటర్లు, వాటర్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటకుల డిమాండ్ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పర్యాటక ఏర్పాట్లు చేయడం ద్వారా ఏటా రూ.131 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అలాగే ఫిషింగ్ హార్బర్లలో పట్టే చేపలను ప్రోసెసింగ్ చేయడం ద్వారా ఆదాయం తెచ్చేందుకు ఏర్పాట్లూ చేస్తోంది. తొలి దశ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తుండటంతో పీపీపీ విధానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో టూనా చేపలు, రొయ్యల కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మూలంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఏటా రూ.225.18 కోట్ల ఆదాయం వస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు చెబుతోంది. కేవలం చేపల వేట కాకుండా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.357 కోట్ల ఆదాయం పొందొచ్చని అంచనా వేసింది. జువ్వలదిన్నెలో 90 శాతం పనులు పూర్తి సుమారు రూ.1523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేవాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో ఈ సెప్టెంబర్ నాటికి సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిగిలిన మూడు హార్బర్లు నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో 60 శాతానికి పైగా పనులు పూర్తి కావడంతో వీటిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా 5,900 బోట్లు నిలుపుకొనే అవకాశం రావడంతో పాటు ఏటా 2,37,350 టన్నుల చేపలను పడతారని అంచనా. ఈ ఫిషింగ్ హార్బర్ల ద్వారా రాష్ట్రంలోని 555 మత్స్యకార గ్రామాల్లోని 6.3 లక్షల మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు. -
టెక్స్టైల్స్ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం జౌళి పరిశ్రమ. జౌళి రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ వేగంగా పురోగమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔళి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా జౌళి మిల్లులు ఉన్నాయి. వీటికి ఏటా వందలాది మంది నిపుణులు అవసరం. అయినా ఏడాదికి 50 మంది కూడా దొరక ట్లేదు. భవిష్యత్తులో జౌళి రంగంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాల్లో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని గవర్న మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ సంస్థ జౌళి రంగ నిపుణులను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సు టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులు చదివిన వారికి మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిప్లొమా కోర్సు మూడేళ్లు ఉంటే.. టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సు మాత్రం మూడున్నరేళ్లు ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన వారికి స్పిన్నింగ్, వీవింగ్, కెమికల్ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్ టెక్స్టైల్, అపారల్ మాన్యుఫాక్చరింగ్ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కోర్సు పూర్తి చేసిన వెంటనే స్థానికంగా ప్రారంభ వేతనం కనీసం రూ.20 వేలు ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సైతం ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తూ సిలబస్‌ను ఆధునీకరించింది.ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణనిస్తూ నెలకు రూ.7 వేల వరకు స్టైపెండ్ ఇస్తోంది. ‘పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కి సగటున మూడు సంస్థల్లో రూ.20 వేలకు పైగా జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. 8 నుంచి 10 ఏళ్ల అనుభవంతో కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు’ అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ శాఖాధిపతి కె.మహమ్మద్ తెలిపారు. గుంటూరులోని టెక్స్టైల్స్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పరిశ్రమల్లో సుమారు రూ.3 లక్షల జీతంతో జనరల్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, మిల్ మేనేజర్, గ్రూప్ మేనేజర్ హోదాల్లో రాణిస్తుండటం విశేషం. ఇది మంచి అవకాశం గుంటూరులో 1986లో స్థాపించిన ఈ కాలేజీ 1997కి స్వయం ప్రతిపత్తి సాధించింది. 2023 పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసి ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అధ్యాపకులుగా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా రాణించవచ్చు. ఇందులో అత్యధిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమితో విద్యార్థులు నష్టపోతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, ప్రాక్టికల్స్, ఇండ్రస్టియల్ ట్రైనింగ్, పరిశ్రమ ప్రముఖుల ద్వారా సెమినార్స్ ద్వారా సమగ్ర శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు, వివరాలకు 9848372886, 8500724006 నంబర్లను సంప్రదించవచ్చు. – కేవీ రమణ బాబు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ, గుంటూరు -
ఏపీలో వాళ్లకు కనీసం ఇల్లు కూడా లేదు: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: విశాఖను పాలనారాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు విషం చిమ్ముతున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తాజాగా విశాఖలో పవన్ పర్యటించడం, రుషికొండలో ఓవరాక్షన్ తదితరాలపై శనివారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రుషికొండపై నిర్మాణాలు చేపట్టడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు నిబంధనలకు లోబడి నిర్మాణాలు కొనసాగిస్తున్నాం. పైగా నిర్ణీత విస్తీర్ణంలో కంటే తక్కువలోనే కట్టడాలు నిర్మిస్తున్నాం. 69 ఎకరాలు టూరిజం 9 ఎకరాల్లో నిర్మాణాలు, 159 చెట్లు తొలగించాము, 13 వేల చెట్లు నాటాం. అయినా పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి కట్టాడాలు కడుతుంటే ఎందుకు అంత బాధ?. కోర్టుల కంటే పవన్ గొప్పా?. పైగా కొండలపై ఏం కట్టొద్దని పవన్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండల మీద ఉన్నాయ్ కదా. అసలు రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పలేకపోయారు. బోడి వెధవలు.. బోడి ప్రచారం చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని మంత్రి రోజా అన్నారు. సీఎం జగన్ గురించి ఎందుకు? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లపైనా పవన్ చేసిన కామెంట్లకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌కు ఏపీలో ఇల్లు ముందు నుంచే ఉంది. ఆయన తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. పవన్ చంద్రబాబుకు బానిస. బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేస్తుంటాడు. ఈ ఇద్దరికీ ఏపీలో కనీసం ఇల్లు లేనే లేదు అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. సీఎం జగన్ సంక్షేమాలు దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అసలు జగన్ గురించి మాట్లాడే అర్హత ఏం ఉంది? అని పవన్‌ను ప్రశ్నించారామె. చంద్రబాబుది అవినీతి.. నిలదీయాలనుకుంటే చంద్రబాబు అవినీతి గురించి నిలదీయమని పవన్‌ను ఉద్దేశించి మంత్రి రోజా వ్యాఖ్యానించారు. కరకట్ట చంద్ర బాబు అక్రమ నిర్మాణం గురించి ఎందుకు మాట్లాడరు. మొత్తం187.58 కోట్లు మాజీ సీఎం చంద్రబాబు ఖర్చు చేస్తే పవన్ కల్యాణ్ నోరు మెదపలేదు. గీతం కబ్జాలు పవన్‌కు కనబడడం లేదా?. దమ్ము ధైర్యం ఉంటే.. ఈ విషయంలో పశ్నించాలని పవన్‌కు సవాల్ విసిరారు మంత్రి రోజా. నువ్వొక ప్రతిపక్ష నేతవా? పవర్‌స్టార్ కాదు.. ప్యాకేజీ స్టార్. నువ్వు.. చంద్రబాబు పనికిమాలిన పార్టీలకు అధ్యక్షులు. ఒక్క ఎమ్మెల్యే లేడు నువ్వేం ప్రతిపక్ష నేతవి. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. పక్క పార్టీ జెండాలు మోసే సంస్కృతి మీది. నిన్ను పవన్ కల్యాణ్ అనాలా.. పనికిమాలిన కళ్యాణ్ అనాలా అర్థం కావడం లేదు. ఆటలో అరటి పండు లాంటి వాడివి.. నువ్వు ప్యాకేజీ పడినప్పుడు ఒక వింత జీవిలా ప్రవర్తిస్తున్నావు. వాలంటీర్లపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తొలగించిన వాలంటీర్ హత్య చేస్తే.. బోడి గుండుకు మోకాలికి లింకు వేయడమేనా? అని పవన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైజాగ్ అభివృద్ధి ఓర్వలేకే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విశాఖను క్రైమ్ సిటీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని రాకూడదనే కుట్రతో ముందుకెళ్తున్నారు. టీడీపీ విశాఖలో కబ్జా చేసిన 450 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సీఎం జగనన్న విశాఖకు అదానీ డేటా సెంటర్ తెచ్చారు. ఆరు వేల కోట్లతో బీచ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. వెనుక బడిన ఉత్తరాంద్ర అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేస్తుంటే ఒర్వ లేక కుట్ర చేస్తున్నారు అని మంత్రి రోజా ప్రతిపక్షాల కుట్రకు ఏకేశారు. -
అభివృద్ధికి కేరాఫ్.. పులివెందులా? కుప్పమా?
ఆంధ్రప్రదేశ్‌కు ఆయన దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఆయన సుమారు 35 ఏళ్లు ఎమ్మెల్యే. అందువల్ల కుప్పం అద్భుతమైన ప్రగతి సాధించి ఉంటుందని ప్రజలు అనుకోవచ్చు. కానీ కుప్పం వెళ్లి చూస్తే పనికి తక్కువ ప్రచారానికి ఎక్కువ అన్నట్లుగా అర్థమవుతుంది. మీడియా అకాడమీ చైర్మన్ హోదాలో నేను ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని.. అలాగే కుప్పం ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంను పరిశీలిద్దామని వెళ్లాను. పులివెందుల-కుప్పం మధ్య పోల్చి ఎవరి అభివృద్ధి ఎలా ఉంది అనేది విశ్లేషించాలన్నది నా ఈ ప్రయత్నం. ఈ రెండిటిలో పులివెందుల అభివృద్ధి అద్భుతంగా ఉందనిపిస్తుంది. అదే టైంలో కుప్పం ప్రగతి జరగలేదని చెప్ప జాలం. కానీ.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పులివెందులలో సైలెంట్‌గా పనులు జరిగితే.. కుప్పంలో మాత్రం అభివృద్ధి కన్నా ప్రచారానికే అధిక ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తుంది. ✍️ వైఎస్సార్ జిల్లాలో పులివెందుల ఒక మూల ఉంటుంది. దానికి సమీపంలోనే బెంగళూర్ చెన్నై లాంటి నగరాలు గాని ఇతర రాష్ట్రాల సరిహద్దులు గాని ఉండవు. కుప్పం కూడా చిత్తూరు జిల్లాలో ఒక మూలకున్నట్టుగా అనిపించినా.. బెంగళూరుకు అతి సమీపంలో, అలాగే తమిళనాడుకి దగ్గరలో ఉండడం తోటి అదొక సెంటర్ పాయింట్‌గానే ఉందని చెప్పాలి. అలాంటి చోట చంద్రబాబునాయుడు అనేక పరిశ్రమలను తీసుకొని వచ్చి ఉండాలి. కానీ అక్కడ అసలు పారిశ్రామిక ప్రగతి అన్నదే తు.. తూ.. మంత్రంగానే ఉన్నది. ✍️అలాగే అనేక విద్యా సంస్థలను కూడా నెలకొల్పి ఉండవచ్చు. కానీ కేవలం ప్రైవేట్ రంగంలో ఒక మెడికల్ కళాశాల ఒక ఇంజనీరింగ్ కళాశాల వంటివి మాత్రం కనబడ్డాయి. కాకపోతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ద్రావిడ విశ్వవిద్యాలయం మాత్రం ఉంది. అక్కడ 1600 ఎకరాల స్థలం ఉన్న దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు చాలా తక్కువ మంది విద్యార్థులు ప్రస్తుతం అక్కడ అభ్యసిస్తున్నారు. దానికి కారణం కోర్సులు తక్కువగా ఉండడమే. దాన్ని జనరల్ యూనివర్సిటీగా కూడా మార్చి మరింత వెలుగులోకి తీసుకురావాలని అక్కడ స్థానికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇక కుప్పం వేరే కార్యక్రమాలు చూస్తే.. కుప్పానికి రింగ్ రోడ్ ఒకటి ప్రతిపాదించి చంద్రబాబు తన సమయంలో దాన్ని పూర్తి చేయలేకపోయారు. దానితోటి అది ఉపయోగంలోకి రాకుండా పోయింది. పైగా ప్రతిపాదిత రింగ్ రోడ్డు సమీపాన తెలుగుదేశం నేతల భూ దందా కూడా సాగిందట!. ఒక మాజీ మంత్రి అక్కడ ముందస్తుగానే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని కొందరు చెబుతున్నారు. కుప్పానికి ప్రధానమైన సమస్యలలో సాగునీరు తాగునీరు కొరత ఉంది. అయితే.. హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకువెళ్లాలని గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించాయి. రాజశేఖర్ రెడ్డిది ఒరిజినల్ స్కీం. ఆ స్కీం లేకపోతే కుప్పానికి నీరు వచ్చే అవకాశం లేదు. ✍️ చంద్రబాబు 1995 నుంచి 2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దానికి సంబంధించి పెద్ద కదలిక లేదు. 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేగంగా కాలువ పనులు చేపట్టి పథకానికి అవసరమైన లిఫ్ట్‌ను కూడా పూర్తి చేసి ఉంటే.. ఈపాటికే కుప్పంకు నీరు వచ్చుండేది. తద్వారా ఆయన ప్రజల అభిమానాన్ని చూరకొనేవారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కుప్పానికి నీటిని తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనిని పూర్తి చేయగలిగితే ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి నీరిచ్చిన ఘనత జగన్‌కు దక్కుతుంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రచారం హడావిడి చేసారు. అంతేతప్ప వాస్తవానికి నీరు రాలేదు. కాకపోతే అప్పట్లో అక్కడ కాంట్రాక్టు చేసిన ఒక టీడీపీ ఎంపీకి బాగా గిట్టుబాటు అయిందని చెబుతారు. ✍️ ఇక సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే చంద్రబాబు టైం లో అమలు చేసిన స్కీములకన్నా కనీసం ఐదారు రెట్లు జగన్ పాలనలో ప్రజలు లబ్ధి పొందారు. ఒక్క కుప్పం పట్టణంలోనే అమ్మబడి చేయూత పలు స్కీముల కింద 100 కోట్లు ప్రజలు పొందారు కుప్పంలో ఇది ఒక రికార్డు గాని భావించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అన్నేళ్లు ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయాలన్న ఆలోచన చేయలేదు. కుప్పం సెంటర్ లోనే ఉన్న ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంతో అధ్వాన్నంగా ఉండేది. దాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద పూర్తిగా మార్చివేసి అభివృద్ధి అంటే ఇది అని ప్రజలకు తెలియచెప్పింది. ఆ స్కూలుకు ఇప్పుడు వెళ్లి చూస్తే మంచి బల్లలు మంచి ఆహారం ఇతర సదుపాయాలతో కళకళలాడుతోంది. అక్కడ టాయిలెట్లు ఫైవ్ స్టార్ హోటల్లో టాయిలెట్ల రేంజ్ లో ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఒకే తరహాలో అభివృద్ధి చేస్తున్నారు జగన్. ✍️ అంతేకాదు.. ఆ మధ్య కుప్పం వెళ్లి సుమారు 70 కోట్ల మేర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వచ్చారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలో కూడా జగనే ముందంజలో ఉన్నారు. చంద్రబాబు టైంలో కేవలం అతి తక్కువ మందికి మాత్రమే ఇళ్లు ప్రభుత్వపరంగా లభించగా.. ఇప్పుడు 800 లకు పైగా ఇళ్లను జగన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. తెలుగుదేశం టైంలో ఎంత ప్రయత్నం చేసినా ఇంటి జాగా ఇవ్వలేదని.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కులం, మతం, పార్టీ వంటివి చూడకుండా అర్హులైనటువంటి వారికి ఇచ్చారని కొందరు లబ్ధిదారులు చెప్పారు. కుప్పాన్ని పులివెందులని పోల్చి చూస్తే పులివెందుల అభివృద్ధి ముందు.. కుప్పం అసలు నిలబడలేదు. ✍️ ఎందుకంటే.. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల అభివృద్ధికి పునాదులు వేయడమే కాకుండా పరుగులు పెట్టించారు. అక్కడ రింగ్ రోడ్లు పలు పరిశోధనా సంస్థలు విద్యాసంస్థలు పరిశ్రమలు నైపుణ్య అభివృద్ధి సంస్థ తదితర ఎన్నో సంస్థలు అక్కడ కనిపిస్తాయి. నగరవనం పేరిట ఏర్పాటు చేసిన పార్కు అందరిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు కొత్తగా నిర్మించిన బస్టాండ్ ఒక కొత్త ఆకర్షణగా మారింది. మార్కెట్ యార్డునూ ఆధునికరించారు. ఇవేవీ కుప్పంలో జరగలేదు. కుప్పం పులివెందుల రెండిటికీ నీటి సమస్య ఉన్నా వైఎస్సార్ చూపించిన చొరవతో సొరంగ మార్గం ద్వారా గండికోట వరకు నీరు తెచ్చి అక్కడి నుంచి లిఫ్టులు కూడా అమలు చేసి పులివెందులకు నీరు ఇచ్చి చూపించారు. అదే చంద్రబాబు కుప్పంలో కాలవలు కూడా పూర్తి చేయలేకపోయారు. పులివెందుల బస్టాండ్ ✍️ పులివెందులలో కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసిన స్కూలు చూస్తే ముచ్చట వేస్తుంది. పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే.. కుప్పంలో అలా లేదు. ఒకప్పుడు చంద్రబాబు వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటూ హడావిడి చేశారు. కానీ అది ఇప్పుడు ఏమైందో తెలియదు. గత టర్మ్‌లో ఆ ఊసే వచ్చినట్టుగా లేదు. అయితే కుప్పంలో బోగస్ ఓటర్ల విషయంలో మాత్రం తెలుగుదేశందే రికార్డ్ అని చెబుతున్నారు. ఇప్పటికే సుమారు 17 వేల బోగస్ ఓట్లు తొలగించినా.. ఇంకా ఉన్నాయని, పైగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల వారిని కూడా చేర్చిన ఘనత టీడీపీదేనని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కుప్పంకిచ్చిన ప్రాధాన్యతతో ఎన్నో పనులు చేపట్టామని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వివరించారు. దానికి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పై ప్రత్యేక దృష్టి సారించారని.. అందువల్లే వైఎస్సార్సీపీ స్థానిక ఎన్నికలలో ఘన విజయం సాధించిందని చెప్పారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికలలో మొత్తం ఏకగ్రీవంగా వైసిపి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే చంద్రబాబు తన మున్సిపాలిటీలో ఓటమికి గురి అయ్యారు. దానితో అసెంబ్లీ ఎన్నికలలో ఏమవుతుందో అన్న భయం ఆయనను వెంటాడుతుండగా.. పులివెందులలో జగన్ నిబ్బరంగా ముందుకు సాగుతున్నారు. పులివెందులలో సైలెంట్ గా అభివృద్ధిని చేసి చూపిన ఘనత రాజశేఖర్ రెడ్డి.. ఆ తరువాత జగన్‌లకు దక్కితే.. చంద్రబాబు అట్టహాసం ప్రచార ఆర్భాటంతో కుప్పం ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నారన్న విషయం ఈ పరిశీలన ద్వారా ఎవరికైనా అర్థమైపోతుంది. కుప్పంలో ప్రచార ఆర్భాటం.. పులివెందులలో ప్రగతిపై విశ్లేషణ ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఏపీలో 11 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల పునరాభివృధ్ధి పనులకు ఈ నెల 6న ప్రధాని మోదీవర్చువల్ పద్ధతిన శంకుస్థాపన చేయనున్నారని. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎమ్ నరేంద్ర ఆనందరావు పాటిల్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తొలిదశలో విజయవాడ డివిజన్లో రూ.270 కోట్లతో 11 రైల్వే స్టేషన్ల్లో పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రెండో దశలో మరో 9 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు వివరించారు. తొలి దశ పనుల్లో అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్ల్లో పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఏబీఎస్ఎస్లో భాగంగా తెలంగాణలో తొలి దశలో 21 స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నారు. -
రూపు మారుతున్న ఉత్తరాంధ్ర
రాష్ట్రంలోని నాయకత్వం వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలందిస్తోంది. ఇనార్బిట్ మాల్తో మరింత అభివృద్ధికి బాటలు పడాలని ఆకాంక్షిస్తున్నా. ఇక్కడ త్వరలో నిర్మించబోయే ఐటీ స్పేస్ ద్వారా ఐటీ రంగం అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. హిందూపురంలో 350 ఎకరాల్లో టెక్స్టైల్స్, ఎల్రక్టానిక్ హార్డ్‌వేర్‌పార్కు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా 15 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. – నీల్ రహేజా, రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి ఎంతో అనువైన వాతావరణం ఉంది. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం శుభ పరిణామం. ఇనార్బిట్ మాల్ ప్రజల షాపింగ్ అవసరాలు తీర్చడమే కాకుండా ఆహ్లాదకరమైన, వినోదాత్మక ప్రదేశంగా అందరినీ ఆకట్టుకుని అలరిస్తుంది. – రజనీష్ మహాజన్, ఇనార్బిట్ మాల్ సీఈవో ఇనార్బిట్ మాల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ అభివృద్ధికి మరింత దోహదపడేలా నగరానికి ఆణిముత్యంలా ఇనార్బిట్ మాల్ నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. విశాఖలో మరో ప్రాజెక్టుకు శ్రీ కారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంగళవారం విశాఖ పర్యటన సందర్భంగా కైలా సపురం ప్రాంతంలో రూ.600 కోట్ల పెట్టుబడు లతో రహేజా గ్రూప్ చేపట్టిన ఇనార్బిట్ మాల్ ని ర్మాణ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ.134.58 కోట్లతో జీవీఎంసీ తలపెట్టిన అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏయూలో రూ.130 కోట్లతో నిర్మించిన 5 భవనాలను సీఎం ప్రారంభించారు. దక్షిణాదిలో అతి పెద్దదైన ఇనార్బిట్ మాల్తో పాటు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్, కన్వెన్షన్ సెంటర్‌ను కూడా తర్వాత దశలో రహేజా సంస్థ నిర్మించనుందని సీఎం జగన్ చెప్పారు. లగ్జరీ హో టళ్ల నిర్మాణానికి కూడా రహేజా ఆసక్తి చూపుతోందన్నారు. కేటాయించిన మొత్తం స్థలం విస్తీర్ణం 17 ఎకరాలు కాగా 12–13 ఎకరాల్లో మాల్ ఏర్పాటు కావడం చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే జరు గుతుందన్నారు. ఇదే రహేజా గ్రూప్ హైదరాబాద్ లో ఇనార్బిట్ మాల్‌ను 7–8 ఎకరాల్లో నిర్మించగా విశాఖలో 12–13 ఎకరాల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని గుర్తు చేశారు. గత పర్యటన సందర్భంగా విశాఖలో అదానీ డేటా సెంటర్, ఐటీ స్పేస్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశామన్నారు. అలాగే అంతకుముందు శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేసుకున్నామని గుర్తు చేశారు. ఇవన్నీ రానున్న రోజుల్లో విశాఖ, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చుతాయన్నారు. మాల్ కూడా అదే కోవలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... ఏయూలో అల్గారిథమ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దక్షిణాదిలో అతిపెద్దది.. ఇంత భారీ మాల్ ఏర్పాటుతో విశాఖ రూపురేఖలు మారడమే కాకుండా దక్షిణాదిలో అతి పెద్దదిగా నిలవనుంది. 8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 12–13 ఎకరాల్లో మాల్ నిర్మాణం పూర్తయ్యాక రెండో దశ కింద మిగిలిన 4 ఎకరాల్లో 2.5 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ స్పేస్ కూడా అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందించారు. ఐటీ స్పేస్ ద్వారా మరో 3 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. సాగర తీరంలో 7 స్టార్ హోటళ్లు.. రహేజా›గ్రూప్ దేశంలో పలు చోట్ల ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్మించింది. ఏపీలో కూడా రాజ్ విలాస్ తరహాలో సూపర్ లగ్జరీ ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే ఒబె రాయ్ సంస్థ రాజ్ విలాస్ తరహాలో 7 స్టార్ కేట గిరీలో రిసార్ట్, మే ఫెయిర్ సంస్థ సూపర్ లగ్జరీ 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చా యి. అదే తరహాలో నీల్ రహేజా కూడా 7 స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇవన్నీ విశా ఖ రూపురేఖలను మార్చే గొప్ప ప్రాజెక్టులు. హిందూపూర్‌లో 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ కు సంబంధించిన పార్క్ రా నుంది. దీని ద్వారా 15 వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభి స్తాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నీల్ రహేజా చెప్పారు. దీనికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న వారికి ప్రతి అడు గులోనూ తోడుగా ఉంటాం. కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో వారికి అందుబాటులో ఉంటాం. ఈ విష యాన్ని మనసులో పెట్టుకోవాలని కోరుతున్నా. మి గిలిన రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీలో పారి శ్రామికవేత్తలకు ఎలా సహాయ, సహకారాలను అందిస్తామో మీరే చూస్తారు. దేవుడి దయ వల్ల వారు బాగుపడటంతోపాటు విశాఖలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నా. దీన్ని సాకా రం చేసిన నీల్ రహేజా, సీఈవో రజనీష్ మహాజన్, సీవోవో శ్రావణ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్ రూ. 134.58 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన జీవీఎంసీ పరిధిలో రూ.134.58 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అమృత్ పథకంలో భాగంగా రూ.107.42 కోట్లతో 32 పనులను చేపడుతున్నారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా రూ.16.10 కోట్లతో 7 పనులు చేపడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 11.06 కోట్లతో 8 పనులను తలపెట్టారు. మొత్తం 47 అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఏయూలో ఐదు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం ఇనార్బిట్ మాల్, జీవీఎంసీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం రోడ్డు మార్గంలో నేరుగా ఏయూ వద్దకు చేరుకున్నారు. గత మూడే ళ్లుగా ఏయూలో 18 ప్రాజెక్టులను చేపట్టగా వీటిలో ఐదు ప్రాజెక్ట్‌లు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఆ హబ్), ఫార్మా ఇంక్యుబేషన్ ఎలిమెంట్, ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ (అల్గారిథమ్), ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ సిబ్), ఏయూ అవంతి ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ స్కిల్ హబ్స్ వీటిలో ఉన్నాయి. యువత నైపుణ్యాలను ఇతోధికంగా పెంచేలా ఇది దోహదం చేయనున్నాయి. వీటి పని తీరును ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి సీఎంకు వివరించారు. ఎలిమెంట్ భవనంలో నెలకొల్పిన ఫార్మసీ లేబరేటరీని పరిశీలించిన సీఎం జగన్ వివిధ పరికరాల పనితీరును తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, రజని,అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారా యణ, మేయర్ వెంకటకుమారి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, కలెక్టర్ మల్లికార్జున, జీవిఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, సీపీ త్రివిక్రమ్ వర్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. దారి పొడవునా పూల వర్షం సాక్షి, విశాఖపట్నం: అందరి అభిమాన నేతపై కుంభవృష్టిని తలపించేలా పూల వర్షం కురిసింది! సంక్షేమ సారథిపై అనురాగం వెల్లువెత్తింది. మంగళవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా మహిళలు నీరాజనం పలికారు. ఉదయం 11.13 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ కొద్దిసేపటి తర్వాత బయలుదేరారు. విమానాశ్రయం నుంచి పోర్టు ఆస్పత్రి జంక్షన్ వరకు జాతీయ రహదారి పక్కన సీఎం సార్‌కు స్వాగతం అంటూ ప్లకార్డులతో కిలోమీటర్ల మేర పెద్ద సంఖ్యలో మహిళలు స్వాగతం పలికారు. 7 కి.మీ. మేర భారీ మానవహారంగా ఏర్పడి జై జగన్ అంటూ నినదించారు. ఈ స్థాయిలోఘన స్వాగతం పలకడం ఇదే మొదటిసారి అని పేర్కొంటున్నారు. హైవేపై వాహనంలో వస్తున్న సీఎం జగన్‌పై దారి పొడవునా పూల వర్షాన్ని కురిపించారు. ముఖ్య కూడళ్లలో తన వాహనాన్ని కొద్దిసేపు నిలిపిన ముఖ్యమంత్రి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేసే పోర్టు ఆస్పత్రి జంక్షన్‌కు చేరుకునేందుకు 45 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పార్టీ నాయకులు విమానాశ్రయం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం వరకు సీఎం కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యమంత్రి జగన్‌ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జాతీయ రహదారిపైకి రావడంతో కిక్కిరిసిపోయింది. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విశాఖ పర్యటనను ముగించుకుని సీఎం జగన్ మధ్యాహ్నం 2.28 గంటలకు విమానంలో గన్నవరం పయనమయ్యారు. ఏపీలో ఎంతో అనువైన వాతావరణం ముంబైలో 2004 జనవరిలో అద్దె ప్రాతిపదికన ఆరంభమైన ఇనార్బిట్ మాల్ సరికొత్త బెంచ్ మార్కును సృష్టించింది. రెండు దశాబ్దాలుగా ఉన్న మాల్స్ రంగంలో కొనసా గుతూ తాజాగా మరో మూడు మాల్స్‌ను ప్రారంభించాం. 100కిపైగా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీ య బ్రాండ్లు భారతీయ మార్కెట్లో రిటైల్ ప్రయా ణాన్ని ప్రారంభించేందుకు ఒక వేదికను సృష్టించాం. విశాఖలో కొత్త చాప్టర్‌ను ప్రారంభించాం. దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి ఎంతో అనువైన వాతావరణం ఉంది. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం శుభ పరిణామం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ వరుసగా అగ్ర స్థానంలో నిలవడానికి ఇవే కారణం. ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రితో ముంబైలో పలు విషయాలపై చర్చించాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతం. ఇనార్బిట్ మాల్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడంతోపా టు స్థానికంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన విశాఖ పో ర్టు అథారిటీకి కృతజ్ఞతలు. రూ.600 కోట్లతో 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఈ మాల్ ద్వారా 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది ప్రజల షాపింగ్ అవసరాలు తీర్చడమే కాకుండా ఆహ్లాద కరమై న, వినోదాత్మక ప్రదేశంగా అందరినీ ఆకట్టుకుని అలరిస్తుంది. – రజనీష్ మహాజన్, ఇనార్బిట్ మాల్ సీఈవో సీఎం జగన్‌తో మాట్లాడుతున్న నీల్ రహేజా మాల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతాం విశాఖలో మా ఉత్సాహవంతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఇనార్బిట్ మాల్ భూమి పూజ కార్యక్రమం మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఏపీలో దివంగత సీఎం వైఎస్సార్ సమక్షంలో జరిగిన శంకుస్థాపనలో పాల్గొన్నా. ఇనార్బిట్ మాల్స్ ఏర్పాటు ద్వారా వ్యాపార ఒరవడిని మార్చాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 221 డిపార్ట్మెంట్ స్టోర్ లున్నాయి. విశాఖలో మా డిపార్టుమెంటల్ స్టోర్లున్నాయి(షాపర్స్‌స్టాప్). విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలోనూ ఉన్నాయి. త్వరలోనే కాకినాడ, నెల్లూరు, తిరుపతిలో ప్రారంభించనున్నాం. ఇటీవల విశాఖను సందర్శించిన సందర్భంగా నగర అభివృద్ధి, మౌలిక సదు పాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆకట్టు కున్నాయి. ఇక్కడ త్వరలో నిర్మించబోయే ఐటీ స్పేస్ ద్వారా ఐటీ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. మాకు ప్రపంచవ్యాప్తంగా రాజ్విల్లాల తరహాలో లగ్జరీ హోటళ్లున్నాయి. అదే కాన్సెప్ట్‌ను విశాఖతో పాటు ఏపీలో తేవాలనుకుంటున్నాం. హిందూ పూర్లో 350 ఎకరాల్లో టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్కు అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా 15 వేల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలోని నాయకత్వంతో సంతోషంగా ఉన్నాం. వాణిజ్య, వ్యాపార, పా రిశ్రామికాభివృద్ధికి పూర్తి సహాయసహకారాలను అందిస్తున్నా రు. విశాఖలో ఇనార్బిట్ మాల్‌ను ప్రపంచ స్థాయి మాల్గా అభివృద్ధి చేస్తున్నాం. మాల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతాం. – నీల్ రహేజా, రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ -
వైఎస్సార్ నేతన్న నేస్తంతో చేనేతల జీవితాల్లో వెలుగులు
మంగళగిరి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిందని పలువురు చేనేత ప్రముఖులు ప్రశంసించారు. నగరంలోని జాతీయ రహదారి వెంట గల ఆర్ఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సదస్సు–2023 నిర్వహించారు. ముఖ్య అతిథి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని, నేతన్నలంతా ఆయనకు అండగా నిలవాలని కోరారు.వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అంజన్ కర్నాటి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సహాయ సహకారాలు అందిస్తోందని, కార్మికులకు అవసరమైన మగ్గాలు, రాట్నాలతో పాటు పేద కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, పంచుమర్తి అనురాధ, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు అంజన్ కర్నాటి(అమెరికా), డాక్టర్ హరనాథ్ పోలిచర్ల(డెట్రాయిట్), రమేష్ మునుకుంట్ల(కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో), సారథి కార్యంపూడి(డల్లాస్), మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి నరహరి, పద్మశాలీయ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, కుర్ణిశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ బుట్టా శారద, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. కేంద్ర చేనేత సంస్థలను పునరుద్ధరించాలి సదస్సులో ప్రతినిధులు పలు తీర్మానాలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకు చట్ట సభల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. చీరాల, రాజమహేంద్రవరం రూరల్, ఎమ్మిగనూరు, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, గాజువాక, పిఠాపురం అసెంబ్లీ స్థానాలతో పాటు, హిందూపురం, కర్నూలు, రాజమండ్రి పార్లమెంట్ స్థానాలను చేనేతలకు కేటాయించాలని తీర్మానించారు. చేనేత ఉత్పత్తులు చిలపల నూలుపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వ చేనేత సంస్థలను పునరుద్ధరించాలని, చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించాలని తీర్మానించారు. -
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరం అడుగులు.. భారీ ప్రాజెక్టులతో కళకళ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధిలో దూసుకెళుతున్న విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 1వతేదీన శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు నిర్వహించనున్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాల్ని అందించే లక్ష్యంతో ఇవి రూపుదిద్దుకున్నాయి. రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌కు మంగళవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ అదేరోజు జీవీఎంసీ పరిధిలో మరో 50 పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధి, నైపుణ్య అవకాశాల్ని కల్పించే నాలుగు ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఐటీ టవర్స్‌పై సానుకూలం.. ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా అడుగులు వేస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే విశాఖను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రణాళికలు, ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఐటీ హబ్‌గా మార్చేందుకు బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో దిగ్గజ సంస్థలను ఆహ్వనించిన ప్రభుత్వం పర్యాటక రంగంలోనూ అదే ఒరవడిని అనుసరిస్తోంది. ఇప్పటికే అన్నవరం సమీపంలో రూ.350 కోట్లతో ఒబెరాయ్ లగ్జరీ రిసార్టుల ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది. తాజాగా దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ భారీ మాల్ని నిర్వించనుంది. మాల్ శంకుస్థాపనకు ఆహ్వనించేందుకు రహేజా గ్రూప్స్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ఇటీవలే ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న మాల్ని మూడేళ్లలోగా పూర్తి చేయాలని రహేజా లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణంలో భాగంగా ఐటీ టవర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ రహేజా గ్రూప్ ప్రతినిధులకు సూచించారు. దీనిపై కంపెనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ ప్రాజెక్టులు ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన అనంతరం అదే ప్రాంగణంలో విశాఖ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగర సుందరీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. అమృత్ 2.0, స్మార్ట్ సిటీ, 15వ ఆరి్థక సంఘం నిధులు రూ.135.88 కోట్లతో చేపట్టనున్న 50 పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. శివారు, జీవీఎంసీ విలీన ప్రాంతాలైన మధురవాడ, లంకెలపాలెం, గాజువాక, అనకాపల్లి తాగునీటి కష్టాలను తీర్చేలా పైప్‌లైన్ ప్రాజెక్టులు, మురికివాడల్లో అభివృద్ధి పనులు, రూ.30 కోట్లతో జీవీఎంసీ పరిధిలోని 10 చెరువుల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.6.4 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో యూరోపియన్ స్టైల్లో సాగర్‌నగర్, డిఫెన్స్ కాలనీ వద్ద నిర్వించనున్న ఈట్ స్ట్రీట్స్తో పాటు రూ.6 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్, రూ.12 కోట్లతో విశాఖ నగరంలోని పలు ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవీఎంసీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపాధి, నైపుణ్యాలను పెంచేలా.. ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రూ.129 కోట్లతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఏయూ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఏయూలో రూ.21 కోట్లతో 30,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన ఏయూ స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్(అ–హబ్)ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో ప్రస్తుతం 121 స్టార్టప్ కంపెనీలకు చోటు కల్పించారు. రూ.44 కోట్లతో 55 వేల చ.అడుగుల విస్తీర్ణంలో బయోటెక్, ఫార్మా, జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం నిర్మించిన ఎలిమెంట్ (ఏయూ ఫార్మా ఇంక్యుబేషన్ అండ్ బయోలాజికల్ మానిటరింగ్ హబ్)ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రూ.35 కోట్లతో 60 వేల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన అల్గారిథమ్ (ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్)ని సీఎం జగన్ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. ఐఐఎంతో ఒప్పందంలో భాగంగా రూ.18 కోట్లతో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్‌లో ప్రత్యేక కోర్సులందించేందుకు నిర్వించిన ఏయూ–సిబ్(ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్)ని సీఎం ప్రారంభించనున్నారు. రూ.11 కోట్లతో అవంతి సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ.11 కోట్లతో మెరైన్ అగ్రికల్చర్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లో యువతకు నైపుణ్యం అందించేందుకు నిర్వించిన ఏయూ అవంతి ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్ హబ్‌ని ముఖ్యమంత్రి జగన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలివీ.. నిర్మిస్తున్న సంస్థ : రహేజా గ్రూప్ విస్తీర్ణం : 17 ఎకరాలు (6 లక్షల చ.అడుగులు) ఎక్కడ : విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సాలిగ్రామపురంలో ఎవరి స్థలం : విశాఖపట్నం పోర్టు అథారిటీ లీజు వ్యయం: 30 ఏళ్లకు రూ.125 కోట్లు శంకుస్థాపన : ఆగస్ట్ 1వ తేదీన పూర్తి : మూడేళ్ల వ్యవధిలో నిర్మాణం ఇలా: రెండు బేస్మెంట్ ప్లస్ 3 స్టిల్ట్ ఫ్లోర్స్, 5 ఫ్లోర్లు రీటైల్ కోసం, 6వ ఫ్లోర్ మల్టీలెవల్ కార్ పార్కింగ్ కోసం, 7, 8వ ఫ్లోర్లు ఆఫీస్ స్పేస్ కోసం, 9వ ఫ్లోర్లో హోటల్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సరికొత్త విశాఖ ఆవిష్కృతం విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సరికొత్త నగరం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా మొదలయ్యాయి. పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఐటీ సంస్థల రాకతో నగరం కళకళలాడుతోంది. ఆగస్ట్ 1 న దాదాపు రూ.865 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్ -
వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
కొంచెం నెమ్మదిస్తేనే... నిలవగలం!
గడచిన శతాబ్దాల్లో మనిషి అనూహ్యమైన ప్రగతి సాధించాడు. బొగ్గు, వంటగ్యాస్, సహజ వాయువుల శక్తిని ఒడిసిపట్టి, ఇంధన విప్లవం సాధించడంతో సమాజం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. ఆర్థిక అభివృద్ధి అనేది సామాజిక ఆకాంక్షలు పెరిగేందుకు దోహదపడింది. అదే సమయంలో మానవజాతి భవిష్యత్తు కూడలికి చేరింది. అభివృద్ధి వెంట పరుగులు పెట్టడాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. మానవజాతి మరిన్ని కాలాలు మనుగడ సాగించాలంటే ఈ ఆలోచన, సమీక్ష అత్యవసరం. అభివృద్ధితో వచ్చిన ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కేన్స్ చెప్పినట్లు, మనిషి జీవన ప్రమాణం కొన్ని వేల ఏళ్లపాటు స్తబ్ధుగానే ఉండింది. శిలాజ ఇంధనాల వాడకం మొదలుకావడం అంటే 18, 19వ శతాబ్దం నుంచే దీంట్లో పెను పురోగతి మొదలైంది. బొగ్గు, వంటగ్యాస్, ముడిచమురు అందుబాటులోకి రావడం మన జీవితాలను సమూలంగా మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దాల్లోనే సగటు ఆయుష్షు రెట్టింపు అయ్యింది. వేల కిలోమీటర్ల దూరాన్ని గంటల్లో దాటేయగలుగుతున్నాం. ప్రపంచం మూలమూల ల్లోని వారితోనూ సమాచార వినిమయం చిటికెలో జరిగిపోతోంది. వృద్ధి చెందుతున్న టెక్నాలజీ, దాని విపరిణామాలూ ప్రపంచ రూపు రేఖలను మార్చేశాయి అనడంలో సందేహం లేదు. కానీ ఈ అనూహ్య వేగానికి మనం మూల్యం కచ్చితంగా చెల్లిస్తున్నాం. మరింత ఎక్కువ ఉత్పత్తి చేయాలి... అది కూడా సమర్థంగా జరగాలన్న ఆదుర్దా మనల్ని మనం సమీక్షించుకునే, విమర్శించు కునే... ప్రకృతితో మనకున్న సంబంధాన్ని మదింపు చేసుకునే సమ యమూ ఇవ్వడంలేదు. పైగా... వలసలు, మనిషి చలనశీలతలకు ముడిపడి ఉన్న రాజకీయ సవాళ్లు కూడా కాలంతోపాటు సంక్లిష్టమ వుతూ పోయాయి. ఇప్పుడు ప్రయాణమూ సులువే, పెద్ద ఎత్తున వలస వెళ్లిపోవడమూ సులభమే. వీటి ప్రభావం వనరులపై పడుతోంది. వలస వెళ్లిన ప్రాంతాల సంస్కృతులతో ఘర్షణలకు కారణ మవుతున్నాయి. సామాజిక సమన్వయమూ దెబ్బతింటోంది. సరి హద్దులు పలుచనైపోయి ప్రపంచం కుంచించుకుపోతున్న కొద్దీ పరిస్థి తులు మరింత ముదురుతున్నాయి. అందుకే ఒక క్షణం ఆగి ఈ సవాళ్లను దీర్ఘాలోచనలతో, సమతుల దృష్టితో పరిష్కరించాల్సి ఉంటుంది. సుస్థిరత–అభివృద్ధి మనిషి శతాబ్దాలుగా ఇంధన వినియోగమనే వ్యసనానికి బానిస. శిలాజ ఇంధనాలు మనల్ని ముందుకు పోయేలా చేసినా ప్రపంచాన్ని వాతావరణ మార్పుల అంచున నిలబెట్టింది కూడా ఇవే. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు పెద్దపీట వేయాల్సిన సమయం ఇదే. అయితే ఈ మార్పు జరగాలంటే గనుల తవ్వకాలు, నిర్మాణాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్నది విమర్శకుల అలోచన. పర్యావరణ అనుకూల టెక్నాలజీల కోసం అవసరమైన రాగి, నికెల్, కోబాల్ట్, ఇతర ఖనిజాలు మన అవసరాలకు తగినన్ని ఉన్నాయా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యల్లో కొంత నిజం లేకపోలేదు. కానీ.. మనిషి తన సృజ నాత్మకతతో వీటిని అధిగమించడం పెద్ద కష్టమూ కాదు. భూమిలో ఈ అత్యవసరమైన లోహాలు తగినన్ని ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. కాకపోతే వీటి శుద్ధీ కరణ పద్ధతులు మాత్రం సమస్యాత్మకమైనవి. వీటిని అధిగమించ డమూ కష్టమేమీ కాదు. డిమాండుకు తగ్గట్టు సరఫరాలను పెంచగలిగే పెట్టుబడిదారీ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే ఈ సవాళ్లను ఎదుర్కోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఈ క్రమంలో పర్యావరణ, సామాజిక సమస్యలను విస్మరించడం సరికాదు. ‘రేర్ ఎర్త్మెటల్స్’ ఉత్పత్తిలో, గ్రీన్ టెక్నాలజీల్లో ముందువరసలో ఉన్న చైనాలో పర్యావరణ పరిస్థితి దిగజారిపోవడం, కాలుష్యం, కొన్ని వర్గాల సామాజిక బహిష్కరణ, ఆరోగ్య అంశాలు మనకు హెచ్చరికలుగా నిలవాలి. ఇంకో కీలకమైన విషయం... పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకోవాలంటే మన ఆలోచనా ధోరణుల్లోనూ మార్పులు రావాలి. సుస్థిరత అనేది అభివృద్ధికి అడ్డంకి కాదనీ, మెరుగైన భవిష్యత్తుకు మార్గమనీ గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధులకు పొంతన కుదరదన్న ద్వైదీభావం సరికాదని తెలుసుకోవాలి. నిజానికి పర్యావరణ అనుకూల విధానాలు ఆర్థిక వృద్ధిని పెంచుతాయనీ, నూతన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందనీ అర్థం చేసుకోవడం ముఖ్యం. పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడి పనిచేసే కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇదో మేలి అవకాశం. జీవన విధానంలో నిదానం పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు కాస్త నెమ్మదైన జీవన విధానమూ తోడైతే శిలాజ ఇంధనాల దుష్పరిణామాలను తగ్గించడం వీలవుతుంది. ప్రపంచంపై, సమాజంపై సరైన అవగాహన కలిగి ఉంటూ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఫలాలను అనుభవించడం అవసరం. అభివృద్ధి సాధించే ప్రయాసలో మన చర్యల పర్యవసానా లను గుర్తించి తదనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం కూడా అవసరం. ఆధునిక జీవితంపై మోజు తాత్కాలికంగా కొన్ని ప్రయో జనాలు కల్పించవచ్చునేమోగానీ... దీర్ఘకాలంలో భూమ్మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదముంది. అభివృద్ధిని సాధించాలన్న వ్యామోహంలో ప్రస్తుతం 800 కోట్లు దాటిన మానవ జనాభాకు ఆహారం అందివ్వడం ఎలా అన్నది మరవకూడదు. మానవ మనుగడ కోసం మన వేగాన్ని తగ్గించు కోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ, అందరికీ ఆహార కల్పన అన్న అంశాల మధ్య సమతౌల్యత సాధించాలి. ప్రస్తుతం ఆహారాన్ని పండించడం అనేది ఒక పరిశ్రమలా సాగు తోంది. అయితే ఇందుకు పర్యావరణం మూల్యం చెల్లిస్తోంది. విచ్చల విడి రసాయన ఎరువుల వాడకం, అడవుల నరికివేతవంటివన్నీ పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యతలు, భూమి సారాల విషయంలో చెడు ప్రభావం చూపాయి. సుస్థిరాభివృద్ధి కావాలంటే ఇదే పద్ధతిని కొనసాగించడం మంచిది కాదు. నిదానమే ప్రధానము అందరికీ ఆహారమన్న సవాలును ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలను వెత కాల్సి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ... వ్యవసాయ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయాలి. వనరులు అందరికీ అందుబాటులో ఉండేలా అవకాశాలను కల్పించాలి. కాక పోతే ఇదో సంక్లిష్టమైన సవాలే. ఎన్నో సౌకర్యాలు కల్పించిన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనూ కొంచెం జాగరూకతతో వ్యవహరించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్లు భవిష్యత్తులో ఉద్యోగాలను తగ్గిస్తాయన్న ఆందోళన కూడా ఒకవైపు ఏర్పడుతోంది. ఈ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. విద్యపై పెట్టే పెట్టుబడులు పెరగాలి. అదే సమయంలో కొత్త టెక్నాలజీల గురించి అందరికీ శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు కావాలి. విధానాల ద్వారా సామాజిక అసమతుల్యతలను రూపుమాపే ప్రయత్నం జరగాలి. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఈ ఉరుకుల జీవితాన్ని కాస్త మందగింపజేస్తే ఆత్మవిమర్శకు అవకాశం ఏర్పడుతుంది. మానసిక, భావోద్వేగ సంక్షేమాలను మన ప్రాథమ్యాలుగా ఉంచుకుని పనిచేసేందుకు పనికొస్తుంది. ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు వీలేర్పడుతుంది. ప్రాపంచిక సౌఖ్యాల వెంబడి పరుగులో సామాజిక బంధాలను దాదాపుగా విస్మ రించాం. బంధుత్వాలు, సహానుభూతి, మానవ సంబంధాలను మరో సారి ఆచరించేందుకు, కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తుంది. డా‘. శ్రీనాథ్ శ్రీధరన్ - వ్యాసకర్త కార్పొరేట్ సలహాదారు, ‘టైమ్ ఫర్ భారత్’ రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
పచ్చ పత్రికలు ఎంత విషం కక్కినా అభివృద్ధి ఆగదు
-
గండికోటకు మహర్దశ
-
Arvind, IAS Opinion : పట్టణీకరణలో ఒక మెట్టు పైనే!
సహజ వనరులపై ఆధారపడిన ప్రాథమిక రంగం వాటా తగ్గి... ఉత్పత్తి, సేవల రంగం వాటా పెరిగిన ఆర్థిక వ్యవస్థలో పట్టణీ కరణ అనివార్యం అవుతుంది. పట్టణాలు ఆర్థికవృద్ధికి ఇంజిన్లు అవుతాయి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి, ఆదాయ స్థాయులు అనేక రెట్లు అధికం అవుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాలు ఎక్కువ. ‘తెలంగాణ సోషియో, ఎకనమిక్ అవుట్‌లుక్ 2022’ నివేదిక ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా వాటా జాతీయ సగటు అయిన 31.16 కన్నా ఎక్కువగా 48.6 శాతంగా ఉంది. ఇది దేశంలోని మొదటి మూడు పట్టణీకరణ రాష్ట్రాలలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపింది. తమిళనాడు 48.45 శాతం, కేరళ 47.23 శాతం, మహారాష్ట్ర 45.23 శాతం పట్టణ జనాభాను కలిగి ఉన్నాయి. సంతోషకరమైన విషయం ఏమిటంటే, తెలంగాణలో పట్టణీకరణ వేగం కూడా దేశంలోని ఇతర ప్రాంతాలకంటే ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ GSDP (స్థూల రాష్ట్ర జాతీయోత్పతి) శీఘ్ర శిఖర గమనానికీ, తెలంగాణలో ఉద్యోగావకాశాల పెరుగుదలకూ సూచిక. 2028 నాటికి తెలంగాణ 50 శాతం కంటే ఎక్కువగా పట్టణ జనాభాను కలిగి ఉంటుందని అంచనా. ఒక్క హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమరేషన్ (HUA – హైదరాబాద్ సహా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం) లోనే అప్పటికి రాష్ట్ర జనాభాలో కనీసం 40 శాతం ఉంటారు. మన పట్టణీకరణ మాత్రమే కాదు, మన GSDP కూడా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలకంటే ఎక్కువగా వృద్ధి చెందుతోంది అనడానికి ఇది నిదర్శనం. ప్రణాళికాబద్ధంగా పటిష్ఠమైన పట్టణీకరణను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వాటిలో కొన్ని. ఎ) ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అపరిమితంగా ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్’ను ఆమోదిస్తోంది. అంటే భవన నిర్మాణ స్థలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే సదుపాయం. ఇది పట్టణ ప్రాంతాలలో నిటారు వృద్ధిని సూచిస్తుంది. అగ్ని మాపక భద్రత, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ ప్రభావ అంచనాల పరంగా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుని నిర్మాణాన్ని ప్లాన్ చేసేందుకు అపరిమిత FSI వీలు కల్పిస్తుంది. బి) టి.ఎస్–బి.పాస్: తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన TS-B Pass (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) ఆన్లైన్లో స్వీయ ధ్రువీకరణతోనే భవన నిర్మాణానికి అను మతిని మంజూరు చేస్తోంది. ఇందులో 600 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు తక్షణమే, అంతకు మించి ఉంటే 21 రోజుల లోపు అనుమతులు లభిస్తాయి. ఇందు కోసం ఏ అధికారినీ నేరుగా కలవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు. 2.1 లక్షల భవన నిర్మాణ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం జరిగింది. సి) ఇన్నొవేటివ్ ప్రాజెక్ట్ ఫండింగ్ మెకానిజం: ఏదైనా మౌలిక సదుపాయాల పనిని చేపట్టాలంటే పట్టణ స్థానిక సంస్థలకు ఇన్ఫ్రా నిధులు అవసరం. అందుకే జి.హెచ్.ఎం.సి. రహదారులకు ఇరు వైపుల భవన నిర్మాణ ఛార్జీలు, ఆస్తిపన్ను వాటికవే పెరిగేలా ఒక మెకానిజంను తీసుకొచ్చింది. దాంతో స్థానిక సంస్థల ఆదాయం మెరుగై ఆ పరిధిలోని భవన నిర్మాణాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. డి) ప్రాజెక్ట్ ఆధారిత SPVలు : పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారి ప్రాజె క్టులకే పూర్తిగా నిర్దేశించిన SPV (స్పెషల్ పర్పస్ వెహికిల్ – ప్రాజెక్టు నిధుల సమీకరణ కోసం ఏర్పాటైన వ్యవస్థ)లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1. రెండు వైపులా దారి ఉన్న ప్రధాన వాహన మార్గాల్లో రద్దీని తగ్గిస్తూ, అదే సమయంలో సగటు వాహన వేగాన్ని గంటకు 15 నుంచి 35 కిలోమీటర్లకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ అర్బన్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) పథకానికి రూపకల్పన చేసింది. 2. రోడ్డు మార్గాలను గుర్తించడం, కొత్త లింకు రోడ్లను వేయడం ద్వారా ఇన్ఫ్రా పెట్టుబడికి గరిష్ఠ విలువను తీసుకురావడమే లక్ష్యంగా 2017లో ‘హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్’ (HRDC)ను ఏర్పాటు చేసింది. 3. కాంప్రెహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రాజెక్టు (CRMP) కింద హైదరాబాద్‌లోని 930 కి.మీ.ల ముఖ్యమైన ప్రధాన ఆర్డెరియల్ రోడ్లు (మూడు లేదా అంతకంటే ఎక్కువ లైన్లు ఉన్నవి) గుర్తించి ప్రైవేట్ ఇన్ఫ్రా ఏజెన్సీలకు ఓపెన్ బిడ్ ద్వారా అప్పగించింది. 4. స్ట్రాటెజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ (SNDP) కింద నీటి వనరుల పరస్పర అనుసంధానం కోసం, వరద ముంపు ప్రమాదాన్ని నివారించడానికి 2021లో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రాజధాని వరకే కాకుండా రాష్ట్ర స్థాయిలో పట్టణీ కరణను నడిపిస్తున్న కొన్ని ప్రణాళికలు కూడా ఎంతో కీలకమైనవి. 2019లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ మున్సిపాలిటీల చట్టం (TMA) పౌరులకు పార దర్శకంగా మున్సిపల్ సేవలు అందిస్తోంది. అలాగే మున్సిపల్ బడ్జెట్‌ను తయారు చేయడంలో, నిర్వహించ డంలో ఈ చట్టం వృత్తి నైపుణ్యాన్ని తెస్తుంది. మున్సిపల్ బడ్జెట్లో తప్పని సరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా ఉంటుంది. అన్ని మున్సిపల్ సేవలు అన్లైన్లో సమయానుకూలంగా జరిగిపోతుంటాయి. పట్టణ శ్వాసావరణ స్థలం ఏ విధంగానూ ప్రభావితం కాకుండా, వాస్తవానికి మరింత పెరగకుండా చూసేందుకు హైదరాబాద్ పరిసరాల్లో 19 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లు (అభి వృద్ధి చేయాలనుకున్న మొత్తం 129లో) ఒక్కొక్కటి 500 నుంచి 2,500 ఎకరాలలో విస్తరించాయి. ఇవి హరితా వరణాన్ని, వారాంతపు విహార అనుభూతులను అందిస్తు న్నాయి. హైదరాబాద్ సహా అన్ని ULB (అర్బన్ లోకల్ బాడీ)లలో గత దశాబ్దంలో గ్రీన్ కవర్ పెరిగింది. 2020, 2021లలో హైదరాబాద్ రెండుసార్లు ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా ఎంపిక అయింది. ది ఆర్బర్ డే ఫౌండేషన్, యునైటెడ్ నేషన్స్ వారి FAO నుండి రెండుసార్లు భారతీయ విజేతగా నిలిచిన ఏకైక నగరం హైదరాబాద్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన AIPH వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు – 2022ను కూడా హైదరాబాద్ గెలుచుకుంది. భవిష్యత్తులోనూ తెలంగాణలో పట్టణాభివృద్ధి అత్యంత వేగంగా ఉండబోతోంది. పట్టణీకరణ జీవన నాణ్యతను మెరుగుపరుస్తోంది. ప్రజలకు సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాలను బలమైన భద్రతను అందిస్తోంది. వారిని ఆర్థిక, సామాజిక సాధికారత వైపు నడిపిస్తోంది. గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తోంది. అరవింద్ కుమార్, IAS తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్), మెట్రోపాలిటన్ కమిషనర్ (HMDA) -
దేశాభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల కీలకపాత్ర
సాక్షి, విశాఖపట్నం: దేశాభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన ప్రాక్టీసింగ్ సెక్రటరీస్ 24వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో జస్టిస్ సోమయాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘న్యాయవ్యవస్థలు, వృత్తి నిపుణుల నుంచి అంచనాలు.. ప్రాక్టికల్ టిప్స్’ అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక సెషన్లో ఆయన మాట్లాడారు. కంపెనీ సెక్రటరీలు.. న్యాయ వ్యవస్థకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నియమ నిబంధనల్ని పాటిస్తూ.. దేశ ఆర్థి క వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడాలన్నారు. ముగింపు సదస్సులో ఐసీఎస్ఐ ఇండియా చైర్మన్ మనీష్ గుప్తా, ప్రతినిధులు గిరిధరన్, ద్వారకానా«థ్, నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ సోమయాజుల్ని ఐసీఎస్ఐ ప్రతినిధులు సత్కరించారు. -
ప్రతిభకు మారు పేరు ఆ ఊరు
అది ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి సర్పంచ్ ఓ మహిళ. అక్కడ రాజకీయాల్లేవు. ఉన్నదంతా జనంలో ఐకమత్యమే. ఊరిలో అవినీతికి తావు లేదు. అభివృద్ధికి చిరునామాగా మారింది. ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. జీవవైవిధ్యతకు ప్రతీకగా నిలిచింది. సర్పంచ్ ప్రతిభకు మారుపేరయింది. తెలంగాణ, కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మార్లవాయి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్ ప్రతిభ మంగళవారం నాడు (మే, 23వ తేదీ) ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ డే సందర్భంగా ‘తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ’ అవార్డు అందుకున్నారు కనక ప్రతిభ. తన ప్రతిభతో గ్రామాన్ని నందనవనంగా మార్చిన ఆమె సాక్షితో పంచుకున్న విశేషాలివి. ‘‘మహిళా రిజర్వేషన్లో భాగంగా మా పంచాయితీని మహిళలకు కేటాయించారు. చదువుకున్న వాళ్లయితే బాగుంటుందని మా ఊరి వాళ్లందరూ 2019లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగని నేను ఎక్కువేమీ చదువుకోలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. ఊరిని బాగు చేయాలనే సంకల్పం ఉంటే ఈ చదువైనా చాలు. మా ఊరి జనాభా 708, మొత్తం కుటుంబాలు 130. ప్రాథమిక పాఠశాల, ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ భవనం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 26 మంది మహిళలకు చేతన ఫౌండేషన్ ద్వారా టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి, ఎస్బీఐ– ఆర్‌ఎస్‌ఈటీ సహకారంతో కుట్టు మిషన్లు ఇప్పించాను. వాళ్లకు చేతిలో పని ఉండడానికి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశాం. డ్వాక్రా గ్రూపులు పదకొండున్నాయి. డ్వాక్రా డబ్బుతో కొంతమంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. వీథి వీథీ తెలుసు! మా ఊరిలో ప్రతి వీథీ, ప్రతి కుటుంబమూ తెలుసు. బడి వయసు పిల్లలందరినీ బడికి పంపించాలని ఇంటింటికీ వెళ్లి చెబుతుంటాను. అలాగే పదేళ్లలోపు ఆడపిల్లలందరికీ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిపించాను. పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగుంది. వీథులన్నీ సిమెంట్ రోడ్లు వచ్చాయి. అన్ని ఇళ్లకూ టాయిలెట్లున్నాయి. కిరోసిన్ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, అన్ని ఇళ్లకూ కరెంట్ ఉంది. వందకు పైగా ఇళ్లలో దీపం పథకం గ్యాస్ సిలిండర్లున్నాయి. చదువుకున్న వాళ్ల కోసం చిన్నపాటి వీథి గ్రంథాలయం కూడా పెట్టాం. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాం. గ్రామంలో ఏ మూలకెళ్లినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. మంచినీటి సౌకర్యం, పరిశుభ్రతలో భాగంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీ శుభ్రం చేయించడం, ప్లాస్టిక్ వాడకంలో విచక్షణ, తడిచెత్త– పొడి చెత్త పట్ల అవగాహన వంటివన్నీ జీవవైవిధ్య పురస్కారం ఎంపికకు ప్రమాణాలయ్యాయి. అందరూ ఇంటిపన్ను కడతారు మా ఊరిలో అంతా క్రమశిక్షణతో నడుచుకుంటారు. అందరూ ఇంటి పన్ను కడతారు. అంతకుముందెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఎక్కువమందికి మంచి ఇళ్లున్నాయి. కొంతమంది పెంకుటిళ్లలో ఉంటే, ఇప్పటికీ కొంతమంది మట్టికప్పు ఇళ్లలోనే ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రాలేదు. మా ఊరి వాళ్ల గొప్పమనసు ఏమిటంటే... ఊరి బాగు కోసం ఏ పని చేపట్టినా అంతా కలసి వస్తారు. అందరూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. జీవవైవిధ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సంతోషంగా ముందుకు వస్తారు. వీథులకు రెండువైపులా రకరకాల మొక్కలు నాటాం. గిరి వికాస్ పథకం ద్వారా వ్యవసాయానికి 30 బావులు తవ్వించాం. అంతకు ముందు ఇరవై బావులుండేవి. ఊరిలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్కరికి పదెకరాలకు తక్కువ లేకుండా భూమి ఉంది. అసలే భూమి లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపాధి హామీ పనుల కార్డు ఉంది. పొలాలకు గట్లు, చెరువు పూడిక తీయడం, పొలాల్లోకి వెళ్లడానికి మట్టిరోడ్లు వేయడం వంటి పనులు ఉపాధి హామీలో చేయిస్తాం. ఆకలి, పేదరికం మా ఊరి పొలిమేరలకు కూడా రావు. వ్యవసాయంతోపాటు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు పెంచుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేస్తారు. సంతోషంగా జీవిస్తారు. ► ఉత్తమ గ్రామ పంచాయితీ 2021 అక్టోబర్ ► ఉత్తమ మహిళా సర్పంచ్ 2021 మార్చి 8 ► జాతీయ స్థాయిలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయితీ ► పేదరికరహిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానం ► బెస్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అవార్డు 2023 మా ఊరికి సర్పంచ్‌గా నేను తొలి మహిళను. మహిళ అయిన కారణంగా నన్ను తక్కువ చేసి చూడడం మా దగ్గర ఉండదు. అంతా అభిమానంగా ఉంటారు. ఊరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను’’ అని గ్రామ తొలి మహిళగా తన అనుభవాలను వివరించారు ప్రతిభ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప ఎవ్వరూ ఇవ్వలేదు
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్రం తర్వాత వెనుకబడిన వర్గాలకు ఇన్ని అవకాశాలు సీఎం జగన్ తప్ప మరెవ్వరూ ఇవ్వలేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం సీఎం జగన్ వల్ల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం అనంతరం ఈమేరకు మాట్లాడారు. 'ఈరోజు పేదరిక నిర్ములన కోసం సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన ఓట్ల కోసం కాదు మార్పు కోసం పని చేస్తున్నారు. పాలన లో అవినీతి ని నిర్ములించిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. విద్య, వైద్యంలో మార్పులు గొప్ప విప్లవం. జగన్ బటన్ నొక్కుతున్నారని కొందరు హాస్యంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ బటన్ వల్లనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమం అందుతోంది.' అని ధర్మాన అన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
TS: రాష్ట్రానికి పదేళ్ల పండుగ! సంవత్సరమంతా దశాబ్ది ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ‘దశాబ్ది ఉత్సవాల’ నిర్వహిణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడగా.. 2023 జూన్ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో గత తొమ్మిదేళ్ల అవలోకనాన్ని గుర్తుచేసుకుంటూ.. ఉత్సవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన రోజున వివిధ రంగాల్లో తెలంగాణ పరిస్థితి, ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను గణాంకాలతో సహా ప్రజల ముందుంచాలని భావిస్తోంది. ఎన్నికల ఏడాదికావడంతో.. క్షేత్రస్థాయిలో ఉత్సవాలతో ప్రజల మన్ననలు పొందాలనే ఆలోచనకు వచ్చింది. ఈ కార్యక్రమానికి జూన్ 1వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అప్పుడు.. ఇప్పుడు.. వివరాలివ్వండి! ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ ఏడాదిలో సాధించిన పురోగతికి సంబంధించిన వివరాలను అన్ని శాఖలు ప్రభుత్వానికి అందజేసేవి. ఈసారి కూడా అలా వివరాల సేకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. అయితే ఒక్క ఏడాది కాకుండా.. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో జరిగిన పురోగతి వివరాలను సేకరిస్తోంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రతి శాఖ నుంచి పూర్తిస్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్నారు. రెండు రోజుల్లో డేటా పంపాలని ఆర్థిక శాఖ నుంచి అన్ని శాఖలకు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా ఈ పనిని పర్యవేక్షిస్తున్నారు. సేకరించిన వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరించనున్నారు. సీఎస్ సూచనల మేరకు ప్రతి శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన సావనీర్లను రూపొందించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ఈ సావనీర్లు, కాఫీ టేబుల్ కేలండర్లలో ఆయా శాఖల్లో 2014 నాటి పరిస్థితి ఏమిటి? ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న వివరాలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే కసరత్తు జరుగుతోంది. ప్రతిష్టాత్మక పథకాలపై ఫోకస్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సబ్సిడీ గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, ధాన్యం ఉత్పత్తిలో రికార్డు, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, బీసీ గురుకులాల ఏర్పాటు వంటివి.. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో అనేక మార్పులు తీసుకువచ్చాయి. ఈ పథకాలకు సంబంధించిన గణాంకాలతోపాటు.. వాటి అమలు ద్వారా వచి్చన మార్పును కళ్లకు కట్టినట్టు ప్రజలకు వివరించేలా ఈ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల మనన్నలు పొందేలా.. ప్రజల మనన్నలు పొందేలా.. ఎన్నికల ఏడాది కావడంతో గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా వారి మన్ననలు పొందడమే ఈ దశాబ్ది ఉత్సవాల ఉద్దేశమని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏ పథకం అమలు చేసినా గణంకాలు మారుతుంటాయని.. కానీ ఆయా పథకాలు, ప్రాజెక్టుల ద్వారా సమాజంలో వచి్చన మార్పును వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు పాలనను చేరువగా తీసుకువచ్చామని.. ప్రతీ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల ద్వారా జిల్లా అధికార యంత్రాంగమంతా ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించనున్నట్టు సమాచారం. అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయం, తెలంగాణ ఏర్పాటుకు స్ఫూర్తి నిచి్చన బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ స్థాపన, తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేలా అమరవీరుల స్మారకం, అమరజ్యోతి వంటి వాటిని సగర్వంగా చాటాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏడాది పాటు ఉత్సవాలు.. దశాబ్ధి ఉత్సవాలను ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ వరకు నిర్వహించాలని.. చివరి రోజున ప్రత్యేకంగా వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మధ్యలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తొలుత ఈ ఏడాది జూన్ 1 నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ వారం రోజుల పాటు గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ దాకా వివిధ దశల్లో ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ప్రభుత్వ వర్గాలు త్వరలో ఖరారు చేయనున్నాయి. చదవండి: వైద్యంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్ చేయాలి -
దక్షిణాదిన తలసరి ఆదాయంలో దూసుకుపోతున్న ఏపీ: ఆర్బీఐ గణాంకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదో సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల కృషి, వాటి వాటాపై సంతోషకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం తోటి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంలో ముందుకు దూసుకుపోతోంది. 2014 ఫిబ్రవరి-జూన్ మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా అనేక రకాలుగా అననుకూల పరిస్థితులు ఎదుర్కొన్న నవ్యాంధ్ర ప్రదేశ్ ఆర్థిక పనితీరు సంతృప్తికరంగా ఉంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయి మెట్రోపాలిటన్ నగరం రాజధానిగా లేనప్పటికీ ఏపీ గణనీయమైన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) సాధించిందని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ.13.2 లక్షల కోట్లు. పారిశ్రామికంగా, విద్య, సామాజిక రంగాల్లో మొదటి నుంచీ ముందున్న తమిళనాడు రూ.24.8 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధించగా, తర్వాత కర్ణాటక రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ రూ.13.3 లక్షల కోట్లు, కేరళ రూ.కేరళ రూ. 10 లక్షల కోట్లతో ముందుకు సాగుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 9 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల జీఎస్డీపీలను కలిపితే రూ.26.5 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఒకవేళ రాష్ట్ర విభజన జరిగి ఉండకపోతే– జీఎస్టీడీపీ విషయంలో తమిళనాడు కన్నా ఉమ్మడి ఏపీ ముందుండేది.ఒక ఆంగ్ల వాణిజ్య పక్షపత్రిక 2022కు సంబంధించి ఆర్బీఐ, ఇకనామిక్ సర్వే నుంచి లభించిన గణాంకాల ఆధారంగా కొన్ని అంచనాలు వేసింది. తలసరి ఆదాయంలోనూ ఏపీ పరుగులు తీస్తోంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో ఐటీ, ఔషధాల పరిశ్రమల కేంద్రం హైదరాబాద్ అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రూ.2,65,623 తలసరి ఆదాయంతో అగ్రభాగాన నిలవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాని, హైదరాబాద్ వంటి పారిశ్రామిక మహానగరం ఆంధ్రప్రదేశ్ లో లేకున్నా ఈ రాష్ట్రం రూ. 2,07,771 తలసరి ఆదాయం నమోదు చేసుకోవడం నిజంగా ఘనవిజయమే. ఎందుకంటే, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర సాంకేతిక, వైద్య విద్యలకు సంబందించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా ఆలస్యంగా విద్యాసంస్థలు నెలకొల్పారు. ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలు, అత్యధిక జీతాలు చెల్లించే రంగాలు కూడా ఏపీలో ఇంకా చెప్పుకోదగ్గస్థాయికి ఎదగలేదు. ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ చదువుల కోసం అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి స్థిరపడడం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీ రూ.2,07,771 తలసరి ఆదాయం సాధించడం నిజంగా ప్రశంసనీయం. ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాలు, గట్టి పునాదులున్న ఫార్మా రంగాల ద్వారా 21వ శతాబ్దపు నగరంగా రూపుదిద్దుకున్న గ్లోబల్ సిటీ హైదరాబాద్ అంతర్భాగం కావడం వల్ల తెలంగాణ దక్షిణాదిన తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచింది. అయితే, తొమ్మిదేళ్ల క్రితం సొంత ప్రయాణం మళ్లీ ప్రారంభించిన ఏపీ తలసరి ఆదాయంలో మంచి ప్రగతి సాధించిందనే చెప్పవచ్చు. కాగా, తలసరి ఆదాయంలో జాతీయ సగటు అయిన రూ.1,50,007ను ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాటì అందనంత ముందుకెళ్లడం ఈ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాల పునాదులకు అద్దంపడుతోంది. దక్షిణాదిన ఈ ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మధ్య ఆర్థికాభివృద్ధికి సంబంధించి గట్టి పోటీ ఉందని కూడా ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, మిగిలిన మూడు రాష్ట్రాలూ ఈ రెండింటితో పోటీపడుతూ ముందుకు పరిగెడుతున్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ సహా ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలూ భారత ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్లుగా ఉపయోగపడుతున్నాయి. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
రజనీకి అర్థమైనా.. గజనీలకు అర్థం కావడంలేదు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి వేరే రాష్ట్రంలో ఉన్న రజనీకాంత్‌కు అర్థమైంది కానీ.. ఇక్కడే ఉన్న గజనీలకు అర్థం కావడం లేదు’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడారని, సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ న్యూయార్క్‌లా ఉందని ప్రశంసించారని ఆయన పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలో వీరశైవలింగాయత్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ సర్కా రును ఎందుకు గద్దెదించుతారని ప్రశ్నించారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు గద్దెదించుతారా? అని ప్రశ్నించారు. లింగాయత్‌లను ఓబీసీల్లో చేర్చేందుకు మద్దతు తెలంగాణలో లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ఈ అంశంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఇతర బీజేపీ నేతలు లింగాయత్‌లను ఓబీసీల్లో చేర్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బి.బి.పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీసీఎం చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కుంభమేళాలో భాగంగా మంత్రి హరీశ్‌రావు పంచవటిలో మంజీర నది వద్ద గంగాదేవికి పూజలు చేశారు. అనంతరం మహా మంగళ హారతి నిర్వహించారు. -
కారు చీకటి బతుకులు.. అంతరం అలాగే!
చెలిమ నీళ్లే ఇంకా.. కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గోవెన పరిధిలో ఐదు గూడేలకు విద్యుత్ వెలుగే లేదు. ఇందులో నాయకపుగూడ, కుర్సీ గూడాల పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ మిషన్ భగీరథ కోసం నిర్మించిన వాటర్ ట్యాంకులు అలంకారప్రాయమే. దీంతో నాయకపుగూడ గిరిజనులకు వాగులోని చెలిమ నీళ్లే గొంతు తడుపుతున్నాయి. గోవెన పరిధిలోని ఐదు గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఐటీడీఏ ఎప్పుడో ఏర్పాటు చేసిన సోలారు లైట్లు ఆరేళ్ల క్రితమే పనిచేయకుండా పోయాయి. పోలీసులు ఏర్పాటు చేసిన నాలుగు సోలారు వీధి లైట్లు మాత్రం వెలుగుతున్నాయి. కారు చీకటి బతుకులు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు గ్రామానికి చేరాలంటే ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లాలి. సరైన దారే లేని అలాంటి ఊరికి కరెంటు కూడా లేదు. పెంబిమండల కేంద్రం నుంచి 25 కి.మీ. దూరంలో ఉండే ఈ పల్లెలో 35 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. ఇంకా పెద్దరాగిదుబ్బ, సోముగూడ, కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్ గ్రామాలవీ చీకటి బతుకులే. శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి : వెనుకబాటుపైనే తిరుగుబాటు చేసి పుట్టిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు వస్తాయన్న నినాదమూ తెలంగాణదే. అయితే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లవుతున్నా.. రాష్ట్రంలో ఇంకా 13.74% పేదలు ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జాతీయ సగటు (25.01%)ను మించి పేదరికం ఉందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచిక (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్–2021) వెల్లడించడం గమనార్హం. విద్య, వైద్యం, విద్యుత్ ప్రాతిపదికగా.. విద్య, వైద్యం, పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్, పక్కా ఇళ్లు, సొంత ఆస్తులు, బ్యాంక్ ఖాతా తదితర పన్నెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. దేశ జనాభాలో 25.01% పేదలుండగా, తెలంగాణలో ఇది 13.74%గా ఉంది. అయితే ఆదిలాబాద్ (27.43%), మహబూబ్‌నగర్ (26.11%) జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరీ నిరాశాజనకంగా ఉంది. ఆయా జిల్లాల్లో 25% మందికి ఇప్పటికీ విద్య, వైద్యం, పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందటం లేదని నివేదిక తేల్చింది. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం, రాజకీయ అవసరం, ప్రాబల్యం ఉంటేనే నిధుల వరద పారుతున్న వైనం.. వెనుకబడిన ప్రాంతాల్లో మరోసారి అసహనానికి కారణం కాబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించటం, రాజకీయ సిఫారసులు, అవసరాలు లేని ప్రత్యేక కార్యాచరణ అమలుతోనే సమ అభివృద్ధి సాధ్యమని ప్రొఫెసర్ సి.నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రాధాన్యం ఏదీ? తెలంగాణ వచ్చినా కూడా పాలమూరు వెతలు తీరటం లేదు. మా జిల్లాలో సహజ వనరుల దోపిడీ పెరిగింది. వలసలు ఇంకా ఆగనే లేదు. గుంపు వలసల స్థానే వ్యక్తిగత వలసలు కొనసాగుతున్నాయి. జీవన ప్రమాణాలు పెంచే ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో పాలమూరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదే కొనసాగితే పాలమూరు పేదల జిల్లాగానే మిగిలిపోతుంది. –ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ప్రణాళికా బద్ధమైన కేటాయింపులు ఉండాలి సంక్షేమ రాజ్యం ప్రధాన సూత్రం..అందరికీ సమన్యాయం. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించి దాని ని నిరీ్ణత కాలంలో అమలు చేయాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రణాళిక – కేటాయింపులు–సమీక్షలు అంత అర్థ్ధవంతంగా లేవు.అందుకే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దేశ సగటును మించి పేదరికం నమోదైంది. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ పేదలే లేని కొట్టాయం కేరళలోని కొట్టాయం జిల్లాలో పేదలే లేరు. ఎర్నాకులం జిల్లాలో 0.1%, కోజికోడ్‌లో 0.26% ఉన్నారు. దేశంలోనే పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ (0.71) నిలిచింది. ఇక అత్యధిక పేదరికం బిహార్‌లో (51.91%) ఉంది. దేశంలో అత్యధిక పేదరికం యూపీలోని శ్రావస్తి జిల్లాలో (74.38%) నమోదైంది. బహరైచ్‌లో 71.81%, మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్‌లో 71.31% పేదరికం ఉంది. మా జీవితాలకు వెలుగెప్పుడో..! అడవిలో మూడు కిలోమీటర్లు నడిస్తేనే.. బయటి ప్రపంచానికి మేమంటూ ఉన్నామని తెలుస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నరు కరెంటు వస్తదని. కానీ రాలే.. సోలారు లైట్లు పెడుతున్నా.. అవి కొన్నిరోజులే వెలుగుతున్నయి. మా పిల్లల జీవితాల్లోనైనా వెలుగు వస్తుందో లేదో..! – ఆత్రం శ్రీరాములు, ఠిమిద్దెచింత, నిర్మల్ బడి లేక..కూలీకి.. అమ్మా నాయిన ముంబైకి వలస వెళ్లిండ్రు. నేను మా తండా బడిలోనే 5వ తరగతి వరకుచదివిన. 6వ తరగతి చదవాలంటే రోజూ 14 కి.మీ వెళ్లిరావాలి. రోడ్డు బాగా లేదు, ప్రయాణ సౌకర్యం కూడా లేదు. దీంతో రోజూ నడుచుకుంటూ వెళ్లలేక గత ఏడాది బడి మానేసిన. ఇప్పుడు మా అవ్వ ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు కూలీ పనులకెళ్తున్న. మా అమ్మా నాయిన లాగే తండాలో 95 కుటుంబాలు ముంబైకి వలస వెళ్లాయి. నాలా చానామంది నడుచుకుంటూ బడికి వెళ్లలేక కూలీ పని చేస్తుండ్రు. – సోనమ్మ, పాతతండా, నారాయణపేట జిల్లా -
తిరువూరులో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు : ఎమ్మెల్యే రక్షణనిధి
-
మునుగోడులో పెద్దదిక్కుగా ఉండే ఆస్పత్రిపై పాలకుల నిర్లక్ష్యం
-
అభివృద్ధికి బాటలు
(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తీర ప్రాంతాలు, వాటి సమీపంలోని పట్టణాల శాశ్వత ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో అడుగులు ముందుకు వేస్తోంది. పూర్వపు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని జాతీయ రహదారులతో ఎక్కడికక్కడ కొత్త మార్గాలతో అనుసంధానించాలనే ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలతతో అభివృద్ధి వేగం అందుకోనుంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పోర్టు/ఫిషింగ్ హార్బర్.. ఏదో ఒకటి ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారు. దీనికి తోడు లాజిస్టిక్ పార్కులు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు రూపు దిద్దుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు చెన్నై– కోల్‌కతా, కత్తిపూడి– త్రోవగుంట తదితర జాతీయ రహదారులు, రైలు మార్గాలు ఇప్పటికే ఉన్నాయి. పోర్టులు, హార్బర్లతో ఎన్‌హెచ్‌ల అనుసంధానానికి భారత్‌మాల పరియోజనలో భాగంగా నూతన రోడ్ల నిర్మాణం.. నాలుగు, ఆరు వరుసలకు విస్తరించడం ద్వారా సమీప పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. సరుకు రవాణా వేగవంతం, పరిశ్రమల ఏర్పాటు.. తద్వారా వర్తక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా వ్యవహరించాలని ఢిల్లీ పర్యటనల సమయంలో ప్రధానితో పాటు సంబంధిత శాఖల మంత్రుల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదిస్తూ వచ్చారు. ఫలితంగా నెలల వ్యవధిలోనే పోర్టుల అనుసంధానానికి నిర్ణయాలు వేగవంతమయ్యాయి. 22 పోర్టు అనుసంధాన ప్రాజెక్టులు రాష్ట్రంలోని పోర్టులను అనుసంధానిస్తూ 22 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.18,896 కోట్ల అంచనాలతో 446 కిలోమీటర్ల మేర విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నుంచి ఎన్హెచ్లను అనుసంధానిస్తూ నూతన రహదారులు నిర్మితం కానున్నాయి. రెండు మార్గాలకు సంబంధించి పురోగతిలో ఉన్న వాటిలో.. అచ్చంపేట జంక్షన్ (ఎన్‌హెచ్ –216) నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు – వాకలపూడి లైట్ హౌస్ (ఎన్‌హెచ్–516 ఎఫ్) వరకు రూ.140.50 కోట్లతో 13.19 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలోగా పనులు పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టు సంస్థకు సూచించింది. విశాఖపట్నం పోర్టును అనుసంధానించేలా ఈస్ట్ బ్రేక్ వాటర్ (ఎన్‌హెచ్–216) నుంచి కాన్వెంట్ జంక్షన్ (ఎన్ హెచ్–516సి) వరకు 3.49 కి.మీలను రూ.40 కోట్లతో ఫేజ్–1 కింద నాలుగు లేన్ల రహదారి పనులను నిర్మాణ సంస్థ చేపట్టాల్సి ఉంది. బిడ్ల పరిశీలన.. డీపీఆర్ కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి మూడు ప్రాజెక్టుల కింద రూ.2,109.61 కోట్లతో 58.50 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి సంబంధించిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో భాగంగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు 12.50 కి.మీ మేర రూ.1,028.26 కోట్లతో ఆరు లైన్ల మార్గాన్ని భారతమాల పరియోజన కింద విశాఖ పోర్టు వరకు చేపట్టనున్నారు. విశాఖ, కృష్ణపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, నిజాంపట్నం, గంగవరం పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి 148.08 కి.మీ మేర రహదారి నిర్మాణానికి రూ.8,963 కోట్లతో ఆరు ప్రాజెక్టులుగా చేపట్టడానికి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం, వైజాగ్ పోర్టు కంటెయినర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు, గుంటూరు– నారాకోడూరు– తెనాలి– చందోలు మీదుగా నిజాంపట్నం పోర్టుకు, గంగవరం పోర్టు నుంచి తుంగలం వరకు, ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి పవిత్ర సంగమం మీదుగా కృష్ణా రివర్ టెర్మినల్ వరకు, విశాఖ పోర్టుకు సంబంధించి ఈస్ట్ బ్రేక్ వాటర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. కాగా, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అనుసంధానానికి 106.7 కి.మీ మేర రూ.2,870 కోట్లతో ఐదు ప్రాజెక్టుల కింద రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెంట్లను ఎన్హెచ్ఏఐ నిర్ణయించాల్సి ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో భరోసా విశాఖలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) దేశంలోనే పారిశ్రామిక ప్రగతికి భవిష్యత్ వేదిక ఆంధ్రప్రదేశ్ అనే విశ్వసనీయతను పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో కల్పించింది. రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 386 ఒప్పందాల ద్వారా దాదాపు 20 రంగాలలో ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఉండటం, సుదీర్ఘ సముద్రతీరంతో తూర్పు ఆసియా దేశాలకు ముఖ ద్వారం కావడం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైలు కనెక్టివిటీ కలిగి ఉండటం ప్రగతికి సోపానాలే. తద్వారా చెన్నై–కోల్‌కతా ఎన్‌హెచ్ వెంబడి, ఈ రెండింటికి మధ్యలో విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు గూడూరు తరహా పట్టణాలు, పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి. ఆక్వా అదనపు అవకాశం కోస్తా జిల్లాల్లో 5.30 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆక్వా రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆక్వా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు దేశీయ ఎగుమతుల్లో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటా ఐదు శాతం నుంచి రానున్న ఏడేళ్లలో పది శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఏపీ నుంచి వివిధ ఆహార ఉత్పత్తులు, అన్ని రంగాల వర్తక వాణిజ్యాల ముడి సరుకుల ఎగుమతులు, దిగుమతులను పెంచే ప్రణాళికతో వ్యవహరిస్తోంది. అగ్రిమెంట్ దశలో ఐదు ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లోని జాతీయ రహదారులతో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులను నాలుగు, ఆరు వరుసల రహదారులతో అనుసంధానించే ఐదు ప్రాజెక్టుల కాంట్రాక్టులు అవార్డు పూర్తయి అగ్రిమెంటు దశలో ఉన్నాయి. వీటిని రూ.3,745 కోట్లతో 104 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ♦ కాకినాడ పోర్టును అనుసంధానించేలా 12.25 కి.మీ మేర సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు రహదారి ♦ కృష్ణపట్నం పోర్టును కనెక్టు చేసే చిలకర్రు క్రాస్ రోడ్డు నుంచి తూర్పు కనుపూరు మీదుగా పోర్టు దక్షిణ గేటు వరకు 36.06 కి.మీ రోడ్డు ♦ నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు (ఎన్‌హెచ్–71) వరకు 34.88 కి.మీ రోడ్డు ♦ 11 కి.మీ మేర విశాఖ పోర్టు రోడ్డు అభివృద్ధి ♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ జంక్షన్ (ఎన్‌హెచ్–516సీ) రోడ్డు అభివృద్ధి 22 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు 446 కి.మీ మొత్తం దూరం రూ.18,896 కోట్లు ప్రాజెక్టుల వ్యయం పోర్టులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరింగ్, కాకినాడ రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం రానున్నవి మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ గేట్‌వే ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. -
ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రముఖ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ గిట్‌హబ్ మొత్తం భారతీయ ఇంజనీరింగ్ బృందాన్ని తొలగించనుంది. ఈ మేరకు గిట్‌హబ్ సీఈవో థామస్ దోమ్కే ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఖర్చులను తగ్గించుకొనే క్రమంలో మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్‌హబ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. "పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక" లో భాగంగా తీసుకున్న ఈ చర్యతో కనీసం 100 మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోనున్నారు. అమెరికా తరువాత రెండో అతిపెద్ద డెవలపర్ సెంటర్‌గా ఉన్న భారతీయ టీం మొత్తాన్ని తొలగించడం ఆందోళన రేపింది. అయితే ప్రతి వ్యాపారానికి స్థిరమైన వృద్ధి ముఖ్యమని సీఈవో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో వెల్లడించారు. ప్రస్తుతం 100 మిలియన్ల డెవలపర్లున్నారు. రేపటి ప్రపంచానికి డెవలపర్-ఫస్ట్ ఇంజినీరింగ్ సిస్టమ్‌గా సంస్థ మారాల్సి ఉందన్నారు. తమ కస్టమర్లు GitHubతో వృద్ధి చెందేందుకు, వారి క్లౌడ్ అడాప్షన్ జర్నీని వేగవంతం, సరళీకృతం చేయడంలో సహాయపడటం కొనసాగించాలని సీఈవో తెలిపారు. (ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ: సోర్స్ కోడ్ లీక్ కలకలం) గత నెల ప్రారంభంలో గిట్‌హబ్ ప్రకటించిన విస్తృత క్రమబద్ధీకరణ ప్రయత్నంలో ఈ తొలగింపు భాగం కావచ్చని అంచనా. మార్చితో ముగిసే త్రైమాసికం నాటికి దాదాపు 10శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు ఇంతకుముందే (ఫిబ్రవరిలో) సంస్థ ప్రకటించింది. GitHub slashes engineering team in India https://t.co/8K2toOvzZm by @refsrc — TechCrunch (@TechCrunch) March 28, 2023 (ఇదీ చదవండి: Disney Layoffs: మరో నాలుగు రోజులే, ఉద్యోగులకు ఈమెయిల్ బాంబు!) -
రూ.2,516 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి
‘దారి’్రద్యాన్ని తొలగిస్తూ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు మంజూరు చేస్తోంది. ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య రాకపోకలను సులువు చేసే విధంగా జాతీయ రహదారులను సైతం తీర్చిదిద్దుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ పనులు చేపట్టేందుకు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే ‘హాయి’వేలపై ప్రయాణం బడలిక లేకుండా సాగనుంది. కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోడ్లను మెరుగు పరుస్తూనే ... మరో వైపు కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో ఐదు జాతీయ రహదారులను అభివృద్ధి చేయనుంది. ఈ ఐదు జాతీయ రహదారుల పనులు పూర్తి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మంజూరైన ఐదు జాతీయ రహదారుల పనులకు సంబంధించి మరో నెలన్నర రోజుల్లో నాలుగు పనులకు టెండర్లు ఆహా్వనించనుండగా, మరో పనికి సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి ఖరారు కానుంది. మొత్తం రూ.2516 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్ నంబర్: 167 కే, 765, 167 , 340బీలో 208.781 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చెందనున్నాయి. ఈ వ్యయంలో రూ.461 కోట్లను భూ సేకరణకు వెచ్చిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి భూములను ఇచ్చిన రైతులకు పరిహారంగా ఈ నిధులను అందించనున్నారు. మరమ్మతులకు అధిక ప్రాధాన్యం జిల్లా పలు ఆర్అండ్బీ రోడ్లకు కాలానుగుణంగా మరమ్మతులు చేపట్టేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి రూ.43.35 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఈఎన్సీ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పూర్తి అధ్వానంగా తయారైన రోడ్లను ఎంపిక చేసి ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రహదారులు కూడా ఉన్నాయి. రాష్ట్ర రహదారులకు సంబంధించి 16 రోడ్లలో 102.668 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. ఆయా రోడ్లకు ప్యాచ్ వర్కులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్లను కూడా వేయనున్నారు. కర్నూలు – బళ్లారి, కోడుమూరు – ఎమ్మిగనూరు, బిల్లేకల్ – ఎమ్మిగనూరు, గుత్తి – పత్తికొండ ( ఆదోని రోడ్డు ), పెద్దతుంబలం – కోసిగి ( హాల్వి– రాంపురం రోడ్డు ), మద్దికెర – పత్తికొండ, ఆలూరు – హోళగుంద ( కర్ణాటక సరిహద్దు వరకు ) తదితర రోడ్లను ఈ ప్రతిపాదనల్లో చేర్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన అనంతరం ఈ రోడ్ల పనులను ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి చెందనున్న హైవేల వివరాలు.. ♦ సంగమేశ్వరం నుంచి నల్లకాల్వ (93/819 నుంచి 124/530 కిలోమీటరు) వరకు, వెలుగోడు నుంచి నంద్యాల (141/700 నుంచి 173/560 కి.మీల) వరకు మొత్తం రూ.776.17 కోట్లతో 62.571 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనులు జరగనున్నాయి. ఇందులో భూ సేకరణకు రూ.165 కోట్లు ఖర్చు చేయనున్నారు. ♦ ప్రకాశం జిల్లాకు సంబంధించి దోర్నాల నుంచి కుంట (244/0 నుంచి 268/700 కి.మీల) వరకు మొత్తం రూ.244.83 కోట్లతో 24.20 కి.మీల మేర పనులు చేపట్టనున్నారు. ఇందులో భూసేకరణకు రూ.51 కోట్లు వెచ్చించనున్నారు. ♦ నంద్యాల నుంచి జమ్మలమడుగు (186/02 నుంచి 248/010 కి.మీల) వరకు మొత్తం రూ.690 కోట్లతో 62.01 కి.మీల మేర పనులు చేయనున్నారు. ఇందులో భూసేకరణకు రూ. 135 కోట్లు వెచ్చించనున్నారు. ♦ రూ.155 కోట్లతో 7 కి.మీల మేర ఆదోని బైపాస్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ♦ సోమయాజులపల్లె నుంచి డోన్ (0/0 నుంచి 53/0 కి.మీల) వరకు రూ.650 కోట్లతో 53 కి.మీల మేర రోడ్డును వేయనున్నారు. ఇందులో భూసేకరణకు రూ.110 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రోడ్డు పనులకు సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి పూర్తి కానుంది. నాలుగు రోడ్లకు త్వరలోనే టెండర్లు జిల్లాకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నాలుగు రోడ్ల పనులకు నెలన్నర రోజుల వ్యవధిలోనే టెండర్లను ఆహా్వనించేందుకు చర్యలు చేపట్టాం. టెండర్లు పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభం అవుతాయి. సోమయాజులపల్లె – డోన్ జాతీయ రహదారికి సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి ఖరారు కానుంది. ఈ పనులు పూర్తి అయితే ఇటు వైఎస్సార్, అటు ప్రకాశం జిల్లాలకు మన జిల్లా నుంచి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. – ఏ ఇందిర, ఈఈ, ఎన్‌హెచ్ కర్నూలు -
చంద్రగిరిలో రూ.430 కోట్ల అభివృద్ధి పనులు చేశాం : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
బీజేపీ పవర్ ప్లే..ఎలా పట్టు సాధించింది ?
భారతీయ జనతా పార్టీ దేశాన్ని చుట్టేస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ఇమేజ్‌ని పెట్టుబడిగా పెట్టి, డబుల్ ఇంజిన్ నినాదంతో రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు కమలం దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభివృద్ధి, శాంతి స్థాపన లక్ష్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల్ని ఎదుర్కొని, అధికార వ్యతిరేకతను ఎదురొడ్డి త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా ఒకప్పటి మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడం ద్వారా 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు బలమైన పునాదులు వేసుకుంటోంది. ఎలా పట్టు సాధించింది ? ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, త్రిపురలో హిందూ జనాభా ఎక్కువ. మిగి లిన రాష్ట్రాల్లో గిరిజనులు, క్రిస్టియన్లదే పట్టు. ఆయా రాష్ట్రాల్లో అత్యధికులు బీఫ్ తింటారు. ఇంగ్లిష్ మాట్లాడతారు. దీంతో ఇతర పార్టీలు బీజేపీ హిందూత్వ, హిందీ ఎజెండాను పదే పదే ఎత్తి చూపుతూ కాషాయ దళాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. అయినప్పటికీ ఈశాన్యంలో కాషాయ జెండా రెపరెపలాడింది. త్రిపుర లో శాంతి స్థాపన, అభివృద్ధికే బీజేపీ మొదట నుంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. మౌలిక సదుపాయాలు, హైవేల నిర్మాణం, సురక్షిత మంచి నీరు, ఉచిత రేషన్ , విద్యుత్ సౌకర్యం వంటివన్నీ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణాలే. ఎన్నికలకు కాస్త ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 12% డీఏ ప్రకటించి వారిని తమ వైపు తిప్పుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో నాగాలాండ్‌లో కూడా శాంతి చర్చలు చేసి వారి సమస్య పరిష్కారానికి హా మీలు ఇచ్చింది. ఎన్డీపీపీతో పొత్తుతో అధికారా న్ని మళ్లీ నిలబెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ బీఫ్ తినడం రాష్ట్ర ప్రజల జీవనశైలిలో ఒక భాగమంటూ వ్యాఖ్యానించి ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ తినడాన్ని బీజేపీ అడ్డుకోదన్న సందేశాన్ని ఇచ్చారు. మైనార్టీ వ్యతిరేక పార్టీ అని విపక్షాలు ప్రచారం చేసినప్పటికీ నాగాలాండ్‌లో 15% నుంచి 19 శాతానికి ఓటు షేర్‌ను పెంచుకోగలిగింది. మేఘాలయలో 9% ఓట్లను రాబట్టింది. నాగాలో శాంతి మంత్రం.. నాగాలాండ్‌లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం చేస్తున్న నాగాలతో శాంతి చర్చలు జరుపుతూ వారి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంలో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) పరిమితమైన సీట్లలో పోటీ చేశాయి. 60 అసెంబ్లీ స్థానాల్లో ఎన్పీఎఫ్ 22 స్థానాల్లో పోటీ చేస్తే, కాంగ్రెస్ 23 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. నాగా సమస్యని ఎన్డీపీపీతో కలిసి సమష్టిగా పరిష్కరిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు తిరిగి ఆ కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేలా చేశాయి. పక్కా వ్యూహంతో సీఎంల మార్పు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల జరగడానికి ఏడాది ముందు ముఖ్యమంత్రుల్ని హఠాత్తుగా మార్చి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో బీజేపీ విజయం సాధిస్తోంది. త్రిపురలో కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి, తిప్రా మోథాలను దీటుగా ఎదుర్కొని అధికార వ్యతిరేకతను ఎదు రొడ్డడానికి ముఖ్య కారణం నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న విప్లవ్‌దేవ్‌ను పది నెలల క్రితం మార్చడమే. ఆయన స్థానంలో మిస్టర్ క్లీన్‌గా పేరున్న మాణిక్ సాహాను సీఎంను చేయడంతో అధికార వ్యతిరేకత తుడిచిపెట్టుకుపోయింది. గతంలో ఉత్తరాఖండ్‌లో ఇద్దరు సీఎంలను, గుజరాత్లో సీఎంను మార్చి నెగ్గింది. హిమాచల్‌లోనూ సీఎంను మార్చాలని ఎన్నో గళాలు వినిపించినా జైరామ్ ఠాకూర్‌నే కొనసాగించి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది. చిన్న నియోజకవర్గాలున్న త్రిపురలో అభివృద్ధిని చేసి చూపించడంతో పాటు సీఎంను మార్చడం కూడా బీజేపీకి కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం కూడా ఒక కారణం. అసోం నుంచి త్రిపుర వరకు ► 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ 15 ఏళ్ల పరిపాలనకు తెర దించింది. ► 2017లో మణిపూర్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ మాజీ సభ్యుడు ఎన్. బైరాన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ► 2018లో త్రిపుర ఎన్నికల్లో బీజేపీ 25ఏళ్ల లెఫ్ట్ పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చింది ► అదే ఏడాది బీజేపీ మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. ► 2019లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలను కైవశం చేసుకొని విజయ ఢంకా మోగించింది. ► 2021లో అసోంలో మళ్లీ అధికారాన్ని కాపాడుకుంది. ► 2022లో బీజేపీ మణిపూర్‌లో కూడా తిరిగి అధికారంలోకి వచ్చింది. ► 2023లో త్రిపుర, నాగాలాండ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా అధికారంలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాజ్‌పేయి హయాంలోనే అభివృద్ధికి బీజం ► 2016లో అసోంతో మొదలైన బీజేపీ జైత్రయాత్ర 2023 వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం వాజ్‌పేయి హయాంలో తొలి బీజం పడింది. కేంద్రంలో మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్టులకు రూప కల్పన చేశారు. అప్పుడు మొదలైన అభివృద్ధి పథం 2014లో నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయ్యాక పరుగులు తీసింది. అభివృద్ధి కంటికి కనిపించేలా సాగింది.ప్రజల్లో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ నాయకుడు హిమాంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళానికి పట్టు పెరిగింది. ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రి అయిన శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్(ఎన్‌డీపీఏ)తో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ జత కట్టాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే బిశ్వ శర్మ మూడు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ తమకు అనుకూలంగా ఉండే చిన్న పార్టీలను ఎన్‌డీపీఏ గూటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ తనకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతూ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కొల్లగొడుతూ వచ్చింది. ఎన్. బైరాన్ సింగ్, ప్రేమ ఖాండూ వంటి నాయకులు కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీ ఉనికి కూడా కోల్పోసాగింది. ఎన్‌డీపీఏ కంటే ముందే ఆరెస్సెస్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తండాల్లో పని చేస్తూ పట్టు పెంచుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చక్కని ప్రణాళిక, మెరుగైన నగరాలు
న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. -
పర్యావరణ పరిరక్షణ మన విధి: మోదీ
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ అనేది భారత్‌కు అంకితభావంతో నిర్వర్తించే విధి తప్ప బలవంతంగా చేసే పని కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రకృతి, అభివృద్ధి అనేవి కలిసి ముందుకు సాగాలని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ అవసరాలను పునరుత్పాదక, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి తీర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని ద ఎనర్జీ, రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్(టీఈఆర్ఐ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సదస్సు(డబ్ల్యూఎస్డీఎస్)లో చదివి వినిపించారు. నగరాలు, పట్టణాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆధునిక సాంకేతికత, నవీన ఆవిష్కరణ ద్వారా పరిష్కార మార్గాలు కనుగొంటున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. భూమిని తల్లిగా, మనమంతా ఆ తల్లి బిడ్డలమని మన ప్రాచీన గ్రంథాలు అభివర్ణించాయని గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణలో మన దేశం ముందంజలో నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. -
కొండగట్టు ఆలయ అభివృద్ధిలో ‘గ్రీన్ ఇండియా’
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని దేశంలోనే ప్రముఖ దేవాలయంగా పునర్ నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని దత్తత తీసుకోవాలని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ నిర్ణయించారు. ఫిబ్రవరి 17న కేïసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున గురువారం తన నిర్ణయాన్ని ఎంపీ ప్రకటించారు. స్వరాష్ట్రం సిద్ధించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఆయన తపనను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కొడిమ్యాల అభివృద్ధి ఇలా... కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్ట్మెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటారు. మొదటి విడతగా రూ.కోటి వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని సంతోష్ ప్రకటించారు. దశలవారీగా మిగతా నిధులు కూడా అందించి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఔషధ, సుగంధ మొక్కలు నాటు తామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్దఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
అభివృద్ధి పథంలో ఒంగోలు