(తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి): ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతున్న తిరుపతి నగరం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలుగునేల ఖ్యాతి విశ్వాంతరాలకు విస్తరించడానికి దోహద పడింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఆతిథ్యమిస్తున్న ఈ నగరం ఒకప్పుడు గుంతల మయంగా... అస్తవ్యస్త డ్రైనేజీలతో దుర్గంధం వెదజల్లుతూ... ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులను తీసుకొచ్చే వాహనాలను కదలనీయని ట్రాఫిక్ కష్టాలతో నరక ప్రాయంగా మారగా... గడచిన ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో నగరవాసులతోపాటు... వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులనుంచి ఉపశమనం కలిగించింది. అత్యంత పొడవైన శ్రీనివాస సేతు నగరానికే ప్రత్యేక శోభను తీసుకొచి్చంది. రోడ్లు విశాలమయ్యాయి. కూడళ్లన్నీ ఆకర్షణీయంగా మారాయి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు నెలకొల్పడంతో విద్యారంగం మరింత పురోగమిస్తోంది.
నగర వివరాలు:
► విస్తీర్ణం: 30.01చ.కి.మీ.
► గృహాలు: 92 వేలు
► జనాభా: 4.01లక్షలు
►డివిజన్లు: 50
►రోజూ తిరుపతికి వచ్చి వెళ్లే వారి సంఖ్య సుమారు 1.50 లక్షల మంది
ఐదేళ్ల కాలంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు
- పర్యాటకులను ఆకర్షిస్తున్న తిరుపతి విశాలమైన రహదారులు...
- అందంగా తీర్చిద్ధిన కూడళ్లు...
- మాస్టర్ ప్లాన్, సీసీ రోడ్ల నిర్మాణంతో కొత్తరూపు
- అసంపూర్తి భూగర్భ డ్రైనేజీ పనులకు మోక్షం
- నరకం నుంచి బయటపడిన నగర జనం
- ఐఐటీ, ఐసర్ విద్యా సంస్థలకు ఆతిథ్యం
- ఆధునిక వసతులు సమకూర్చుకున్న చిన్నపిల్లల, క్యాన్సర్ ఆస్పత్రులు
- రూ.650.50 కోట్లతో
- శ్రీనివాస సేతు నిర్మాణం పూర్తి ఫ్లై ఓవర్ నిర్మాణంతో తీరిన ట్రాఫిక్ కష్టాలు
నాడు నరకం
► తిరుపతి పేరుకు ఆధ్యాత్మిక నగరమైనా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. వీధులన్నీ ఇరుగ్గా, రహదారులన్నీ గతుకులమయంగా ఉండేవి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో రోడ్డుపై ప్రవహించే మురికి నీరు వెదజల్లే దుర్వాసనతో భక్తులు సతమతమయ్యేవారు.
► ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు పచ్చదనం కరువై వెలవెలబోయేవి. ఆర్టీసీ బస్టాండ్, రైల్యేస్టేషన్‌లో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పేరుకే అంతర్జాతీయ విమానాశ్రయమైనా అభివృద్ధి కోలేదు.
నేడు అభివృద్ధికి చిహ్నం
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆధ్యాత్మిక నగరాన్ని కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేసి చూపించింది. తిరుపతిని మహానగరంగా తీర్చిదిద్ధింది.
► రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా స్థానికులు, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ సమకూరుస్తున్నాయి.
► గడచిన నాలుగేళ్ల కాలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్డును అభివృద్ధి చేశారు. మూడవ విడత అభివృద్ధి ప్రణాళికల్లో రూ.132కోట్ల వ్యయంతో 150కి.మీల సీసీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. మరో రూ.30కోట్లతో సుమారు 65కి.మీ మేర బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు.
► 2012కు ముందు తిరుపతి నగరం కేవలం 16.27చ.కి.మీ. విస్తీర్ణం కలిగివుండేది. ఇప్పుడు నగర విస్తీర్ణం 30.1చ.కి.వీు.కు చేరుకుంది.
► మాటలకే పరిమితమైన తిరుపతి మాస్టర్‌ప్లాన్ ఈ ప్రభుత్వ హయాంలో అమలుకు నోచుకుంది.
► రోడ్లతో పాటు అందమైన డివైడర్లు, విద్యుత్ వెలుగులు, ఆహ్లాదాన్ని పంచే పచ్చని మొక్కలు, జీబ్రా లైన్లతో నూతన రహదారులు అభివృద్ధి చేశారు.
ఆధునిక వసతులతో హృదయాలయం..
► నిరుపేదలకు అత్యంత ఖరీదైన గుండె వైద్యం అందించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నపిల్లల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని భావించి, టీటీడీ నిధులతో దానిని పూర్తిచేశారు. ఇక్కడ కొద్ది కాలంలోనే 2,160 శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు.
► టీటీడీ కార్డియాక్ కేర్ సెంటర్‌కు శ్రీకారం చుట్టిన సీఎం 2021 సెప్టెంబర్ 11న ప్రారంభించారు.
► అలిపిరి సమీపంలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.350 కోట్లతో 350 పడకలతో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు.
సుందరంగా వినాయక సాగర్
► మురికి కూపంగా ఉన్న వినాయక సాగర్‌ను రూ.42 కోట్లతో అభివృద్ధి.
► శుద్ధిచేసిన నీటిని విడుదల చేసేందుకు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు.
► బోటింగ్ పాయింట్, కిడ్స్ పార్క్, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్టు, ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు.
► రూ.1.63 కోట్లతో ప్రకాశం, బైరాగిపట్టెడలోని శ్రీపద్మావతి పార్కుల ఆధునికీకరణ.
మణిహారం శ్రీనివాస సేతు
► రూ. 650 కోట్లతో నగరానికి మణిహారమైన శ్రీనివాస సేతు వంతెనను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి్డ ప్రారంభించారు.
► వంతెనపై గరుడ పక్షి ఆకారంతో విద్యుత్ స్తంభాలు, పిల్లర్లపై ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలతో కూడిన చిత్రాలను దిద్దారు. పిల్లర్లకు ఇరువైపులా తిరునామాలను ఏర్పాటు చేశారు.
నగరంలో అభివృద్ధి పనులు ఇలా..
► మహతి ఆడిటోరియం, ‘కచ్చపి’ ఆడిటోరియం నిర్మాణం: రూ.45 కోట్లు
► అలిపిరి డిపో నుంచి నడుపుతున్న విద్యుత్ బస్సులు: 100
► తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం: రూ.11.75 కోట్లు
► నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు:రూ.21.97 కోట్లు
► శ్రీవారి వైభవం చాటిచెప్పేలా రైల్వే స్టేషన్‌లో ఆధునిక డిజైన్లు: రూ. 310 కోట్లు
నాలుగున్నరేళ్లలో వెచ్చించిన నిధులు
► శ్రీనివాస సేతు నిర్మాణం: రూ.650.50 కోట్లు
► విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ కేబుల్:రూ.147 కోట్లు
► తాగునీటి సరఫరా: రూ.28.17 కోట్లు
► శ్రీనివాస స్పోర్ట్స్, ఇందిరా మైదానం స్పోర్ట్స్ ప్రాంగణం అభివృద్ధి:రూ.12.23 కోట్లు
► ఇండోర్ సబ్ స్టేషన్:రూ.20 కోట్లు
► స్మార్ట్ సిటీ మిషన్ అమలు: రూ.180 కోట్లు
► వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్: రూ.41.80 కోట్లు
► ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు: రూ.17.50 కోట్లు
► సోలార్ వ్యవస్థ: రూ.21.97 కోట్లు
► మల్టీలెవల్ కార్ పార్కింగ్ భవన నిర్మాణం: రూ.50 కోట్లు
► సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణం: రూ.90 కోట్లు
► డంపింగ్ బయోమైనింగ్: రూ.20 కోట్లు
► కమ్యూనిటీ, ఈ–టాయ్‌లెట్స్, స్కూల్ టాయ్‌లెట్స్: రూ.13 కోట్లు
కలియుగ వైకుంఠం తిరుమలలో..
► రూ.4.90 కోట్లతో శ్రీవారి పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు.
► మూడో విడత రింగ్ రోడ్డు పనులు.
► రూ.79 కోట్లతో 2,500 మందికి సరిపడేలా పీఏసీ–5 పనులు.
► యాత్రికుల వసతి సముదాయం–3, పద్మనాభ నిలయం అందుబాటులోకి..
► ఇక్కడ దాదాపు 2,400 లాకర్లు అందుబాటులోకి..
► రూ.42.86 కోట్లతో 1400 మందికి వసతి కల్పించే వకుళాదేవిమాత విశ్రాంతి గృహం
► నారాయణగిరి ఉద్యానవనాల్లో రూ.39.41 కోట్లతో క్యూలైన్లు, మరుగుదొడ్లు
► తిరుమల–తిరుపతి రెండో ఘాట్ రోడ్డులో రూ.18 కోట్లతో ఆర్‌సీసీ క్రాష్ బారియర్లు
తిరునగరి అభివృద్ధికి ‘మాస్టర్’ ప్లాన్
► రహదారుల నిర్మాణానికి ఖర్చుచేస్తున్న మొత్తం: రూ.70.92 కోట్లు
► మొత్తం రహదారుల విస్తీర్ణం (మీటర్లలో):18,344 (18.34 కిలోవీుటర్లు)
మొత్తం మాస్టర్ ప్లాన్ రహదారులు: 18
► వంద అడుగుల రోడ్లు: 1
► 80 అడుగుల రోడ్లు: 8
► 60 అడుగుల రోడ్లు: 6
► 40 అడుగల రోడ్లు: 3
► అభివృద్ధి చేస్తున్నవి: 3
► అందుబాటులోకి వచ్చినవి: 15
స్మార్ట్ సిటీ పథకం కింద: రూ.1,610 కోట్లు
► కేంద్ర నిధులు: రూ.500 కోట్లు
► రాష్ట్ర ప్రభుత్వ నిధులు: రూ.500 కోట్లు
► పీపీపీ భాగస్వామ్యం కింద:
► రూ.610 కోట్లు (టీటీడీ, ఏపీఎస్‌పీడీసీఎల్)
ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు కేంద్రం
► తిరుపతికి కేటాయించిన ఐఐటీ, ఐజర్ విద్యా సంస్థలకు 2014, 2015లో శంకుస్థాపనలు చేసినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణాలు
పూర్తయ్యాయి.
► 546 ఎకరాల్లో రూ.1,074 కోట్లతో ఐఐటీ విద్యా సంస్థను నెలకొల్పారు. పలు రాష్ట్రాల నుంచి 2500 మంది విద్యార్థులు, 250 మంది అధ్యాపకులు, 275 మంది సిబ్బందితో 2021లో ప్రారంభమైంది.
► 250 ఎకరాల్లో రూ.137.30 కోట్లతో ఐజర్ విద్యా సంస్థను నెలకొల్పారు. ఇందులో బీఎస్, ఎంయస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులతో పాటు పీహెచ్‌డీ కోర్సులను నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment