జూన్‌ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవ టికెట్లు, శ్రీవారి సేవ కోటా విడుదల  | Srivariseva Quota Tickets Details | Sakshi
Sakshi News home page

జూన్‌ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవ టికెట్లు, శ్రీవారి సేవ కోటా విడుదల 

Published Thu, Mar 14 2024 4:30 AM | Last Updated on Thu, Mar 14 2024 3:08 PM

Srivariseva Quota Tickets Details  - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్‌ నెలకు సంబంధించి ఈ నెలలో ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవ టికెట్లు, శ్రీవారిసేవ కోటా వివరాలను టీటీడీ తెలిపింది. https://ttdevasthanams.ap.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరింది. విడుదల చేయనున్న టికెట్లు, శ్రీవారిసేవ కోటా వివరాలు..  

♦ ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జితసేవ టికెట్ల లక్కీడిప్‌ కోసం నమోదు చేసుకోవచ్చు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలో­పు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలి.  
♦ 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్ల కోటా విడుదల చేస్తారు. 
♦ జూన్‌ 19 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిõÙకం ఉత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. 
♦ ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్‌ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ  టికెట్లు, దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. 
♦ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.  
♦ 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దా­తల దర్శనం, గదుల కోటా విడుదల చేస్తారు.  
♦ 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, ది­వ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. 
♦ 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.  
♦ 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటా విడుదల చేస్తారు. 
♦ 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారిసేవ కోటాను, అదేరోజు మధ్యా­హ్నం 12 గంటలకు నవనీతసేవ కోటాను, మద్యాహ్నం ఒంటిగంటకు పరకామణిసేవ కోటా­ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement