సాక్షి, విజయవాడ: తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతలకే నెలకు టీటీడీ 60వేల దర్శనాలు ఇవ్వనుంది.
తిరుమలపై సీఎం చంద్రబాబు మాట మార్చేశారు. దేవుడి సన్నిధిలో చెప్పిన మాట తప్పిన చంద్రబాబు. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు అందేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలకే నెలకు 60వేల దర్శనాలను వారికి టీటీడీ ఇవ్వనుంది. వారానికి ఆరు రోజులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల దర్శనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ప్రస్తుతం వారంలో నాలుగు రోజులు ఎమ్మెల్యేల లేఖలకు అనుమతి ఉంది. ఇప్పుడు వారంలో ఆరు రోజుల పాటు లేఖలకు అనుమతి ఇస్తున్నారు. వీఐపీ బ్రేక్‌తో పాటు సుపథం టిక్కెట్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వారంలో ఆరు రోజుల పాటు సుపథం టిక్కెట్లు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. టీడీపీ నేతల పైరవీల కోసం తిరుమలలో భక్తులను గాలికొదిలేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. శుక్ర, శని వారాల్లో ఇక సామాన్య భక్తులకు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది.
కాగా, తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గిస్తానంటూ గత నెలలోనే సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నెల తిరగకుండానే దేవుడి సన్నిధిలో చెప్పిన మాటకి సీఎం చంద్రబాబు తిలోదకాలు పలికారు. ప్రతీ ఎమ్మెల్యే, ఎంపీలకు నెలకు 300 వరకు దర్శనాలకు సీఎం అనుమతి ఇచ్చారు. దీంతో, సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment