tickets
-
Pushpa The Rule: వేలం ద్వారా 'పుష్ప 2' టికెట్.?
-
పుష్ప 2 మరో రికార్డ్.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో పుష్ప మూవీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది.తాజాగా ఈ మూవీ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీమియర్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్నా మరోసారి అలరించనుంది. 𝐓𝐡𝐞 𝐅𝐀𝐒𝐓𝐄𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 𝐭𝐨 𝐡𝐢𝐭 $𝟏𝐌+ 𝐏𝐫𝐞-𝐒𝐚𝐥𝐞𝐬 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐔𝐒 𝐁𝐨𝐱 𝐎𝐟𝐟𝐢𝐜𝐞 💥💥PUSHPA RAJ’s dominance is redefining the BOX OFFICE with a NEW DIMENSION 💥🪓 #Pushpa2TheRule pic.twitter.com/lzGvlwTeqr— Pushpa (@PushpaMovie) November 19, 2024 -
రైల్వేశాఖ సరికొత్త కార్యక్రమం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైలులో సీటు లేదా బెర్త్ దక్కని ప్రయాణికులు ఆఖరి నిమిషంలో అంటే చార్ట్ తయారైన తర్వాత కూడా సీటు పొందే అవకాశం కల్పిస్తోంది. ఖాళీ బెర్త్‌ల గురించిన సమాచారాన్ని రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందిస్తోంది.హాజీపూర్ రైల్వే జోన్లో ఈ సదుపాయం ప్రారంభమైంది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని జోన్ పరిధిలోని ఐదు రైల్వే డివిజన్లలోనూ ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్)లో ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇంట్లో కూర్చొనే రైలులో ఖాళీగా ఉన్న సీట్ల గురించి నాలుగు గంటల ముందుగానే తెలుసుకుంటారు. ఏ రైలులో ఏ తరగతిలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునే వీలుంది.రిజర్వేషన్ ఇలా.. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, ఖాళీగా ఉన్న సీట్లను కేటాయించే కరెంట్ రిజర్వేషన్ ఆన్లైన్లో జరగదు. ఇందుకోసం స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. దానాపూర్ రైల్వే డివిజన్ నుంచి బయలుదేరే రైళ్ల ప్రస్తుత స్థితిని తెలిపే వ్యవస్థను ప్రారంభించారు. రైలు ఎక్కడ నుండి బయలుదేరుతుందో అదే స్టేషన్ నుండి కరెంట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే రైలు ఆలస్యమైతే ఆ రైలు ఏ స్టేషన్ గుండా వెళుతుందో తెలిసిపోతుంది. అంతే కాదు ఏ ప్రత్యేక రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ రోజు నడుస్తుందనే సమాచారాన్ని కూడా ఇక్కడ అందజేస్తున్నారు.మొబైల్లో మొత్తం సమాచారం రైలు రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, అన్ని తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల పూర్తి సమాచారం ‘ఎక్స్’, ఫేస్బుక్ ద్వారా ప్రయాణికుల మొబైల్ ఫోన్ స్క్రీన్‌పైకి వస్తుంది. దీని ఆధారంగా ఖాళీ సీట్లకు అప్పటికప్పుడు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే రిజర్వేషన్‌కు రిజర్వేషన్, తత్కాల్ రిజర్వేషన్ టిక్కెట్ మధ్య వ్యత్యాసం ఉంది. రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు బుక్ చేసుకునేది తత్కాల్ టికెట్. అదే కరెంట్ రిజర్వేషన్ కోసం ఆ రైలు చార్ట్ సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలి. చార్ట్ తయారు చేసిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల స్థితని కూడా ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో తెలియజేస్తారు. -
అల్లు అర్జున్ పుష్ప-2.. రిలీజ్‌కు ముందే ప్రభంజనం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2 ది రూల్'. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ డిసెంబర్ 5న పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే నెల రోజల కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే రిలీజ్‌కు ఇంకా నెల రోజులు సమయం ఉండడంతో వరుసగా అప్డేట్లతో మేకర్స్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ నెల 15న ట్రైలర్ భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే అందరికంటే ముందుగా ఓవర్సీస్లో పుష్ప-2 ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల రోజులు ముందుగానే టికెట్స్ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌తో రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా 15వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్ ద్వారా పంచుకుంది. అమెరికాలో ఇంత వేగంగా టికెట్స్ అమ్ముడైన భారతీయ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్రాండ్‌గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద ప్లానింగే వేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఈనెల 15న ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇది కాకుండా బాహుబలి-2 తర్వాత అత్యధిక బజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. Shattering records, one at a time 💥💥#Pushpa2TheRule becomes the fastest Indian Film to sell 15K+ tickets in the USA ❤🔥USA Premieres on 4th December 🤩GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/dFsrLtg5zV— Pushpa (@PushpaMovie) November 6, 2024 -
చంద్రబాబు నిర్ణయం.. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు!
సాక్షి, విజయవాడ: తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతలకే నెలకు టీటీడీ 60వేల దర్శనాలు ఇవ్వనుంది.తిరుమలపై సీఎం చంద్రబాబు మాట మార్చేశారు. దేవుడి సన్నిధిలో చెప్పిన మాట తప్పిన చంద్రబాబు. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు అందేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలకే నెలకు 60వేల దర్శనాలను వారికి టీటీడీ ఇవ్వనుంది. వారానికి ఆరు రోజులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల దర్శనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.ప్రస్తుతం వారంలో నాలుగు రోజులు ఎమ్మెల్యేల లేఖలకు అనుమతి ఉంది. ఇప్పుడు వారంలో ఆరు రోజుల పాటు లేఖలకు అనుమతి ఇస్తున్నారు. వీఐపీ బ్రేక్‌తో పాటు సుపథం టిక్కెట్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వారంలో ఆరు రోజుల పాటు సుపథం టిక్కెట్లు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. టీడీపీ నేతల పైరవీల కోసం తిరుమలలో భక్తులను గాలికొదిలేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. శుక్ర, శని వారాల్లో ఇక సామాన్య భక్తులకు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది.కాగా, తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గిస్తానంటూ గత నెలలోనే సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నెల తిరగకుండానే దేవుడి సన్నిధిలో చెప్పిన మాటకి సీఎం చంద్రబాబు తిలోదకాలు పలికారు. ప్రతీ ఎమ్మెల్యే, ఎంపీలకు నెలకు 300 వరకు దర్శనాలకు సీఎం అనుమతి ఇచ్చారు. దీంతో, సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. కాగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి కోటాను అక్టోబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.23న అంగప్రదక్షిణ టోకెన్లు: జనవరికి సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు ఆన్లైన్ టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా: జనవరికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిల్లో జనవరి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
'అన్నింటి కంటే చీప్ సినిమా టిక్కెట్స్ మాత్రమే'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
టాలీవుడ్లో సినిమా టిక్కెట్లపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్నింటితో పోలిస్తే ఒక్క సినిమా రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. మూడు గంటల పాటు ఎంటర్టైన్ చేసేందుకు ఆ మాత్రం టిక్కెట్ రేట్ పెట్టలేరా అని ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఓ కుటుంబంలో నలుగురు కలిసి సినిమాకెళ్తే కేవలం రూ.1500 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు.దేవర సినిమాకు ఒక్క టికెట్ రూ.250 రూపాయలు అనుకుంటే నలుగురికి వెయ్యి రూపాయలు, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్‌కు కలిపి రూ.500 దాకా అవుతుందన్నారు. ఇంతకన్నా తక్కువ ధరలో మూడు గంటల పాటు ఎంటర్ టైన్మెంట్ అందించేది ఎక్కడా లేదన్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత తక్కువ ధరకు ఏక్కడైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందేమో చెప్పండి అని నాగవంశీ ప్రశ్నించారు.కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ దేవర కలెక్షన్స్ గురించి నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల సంతోషం కోసమే తాము కలెక్షన్స్ వెల్లడిస్తామని తెలిపారు. వారు సంతోషంగా ఉంటే మాకు కూడా హ్యాపీ అని అన్నారు. కానీ డబ్బులు వచ్చాయని చెబుతుంటే కొందరు మాత్రం నమ్మడం లేదన్నారు. ఎప్పుడు కూడా వసూళ్ల విషయంలో అసత్యాలు ప్రచారం చేయలేదన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సైతం వసూళ్లపై ఫుల్ క్లారిటీ ఉన్నారని నాగవంశీ తెలిపారు.సినిమా టికెట్ రేట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి...ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి కనీసం 1500 కూడా పెట్టలేరా అంటున్న నాగ వంశీ...VC: Great Andhra pic.twitter.com/UovWMmoJdi— Movies4u Official (@Movies4u_Officl) October 13, 2024 -
Ind vs Ban: హైదరాబాద్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం షురూ
సాక్షి, హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో ఈ నెల 12న మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం గం. 2:30 నుంచి ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అభిమానులు paytm insider వెబ్సైట్/యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ట ధర రూ. 15 వేలు. ఆన్లైన్లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో మార్పిడి చేసుకొని మ్యాచ్ టికెట్లను పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏదైనా ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అన్ని టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే అమ్ముతున్నామని...ఆఫ్‌లైన్‌లో/కౌంటర్ల వద్ద ఎలాంటి టికెట్లూ విక్రయించడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు గతంలో రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2019లో వెస్టిండీస్‌పై, 2022లో ఆ్రస్టేలియాపై జరిగిన ఈ మ్యాచ్‌లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో భారత్–ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచి్చంది. -
మహారాష్ట్ర: హస్తం పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్
ముంబై: త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది.మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో భాగంగా ఎన్సీపీ,శివసేన(ఉద్ధవ్)పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుంది. పొత్తులో కాంగ్రెస్‌కు సుమారు 100 నుంచి 110 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి.ఈ సీట్లలో టికెట్ల కోసం ఇప్పటికే 1800కుపైగా దరఖాస్తులు వచ్చాయని నేతలు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.20వేల రుసుము నిర్ణయించారు.ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకముందే ఇన్ని దరఖాస్తులు వచ్చాయంటే తేదీలు ప్రకటించాక వీటి సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సుందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్అఘాడీ కూటమి మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రభావంతోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించనుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనా ఫలితంగానే పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొందని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు.ఇదీ చదవండి: హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి షాక్ -
నేడు తిరుమల డిసెంబర్ కోటా టికెట్లు ఆన్లైన్లో విడుదల
తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ కోటాను సెపె్టంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం సెపె్టంబర్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్లను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. 24న ఎస్ఈడీ కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల డిసెంబర్ కోటాను సెపె్టంబర్ 24న ఉదయం 10 గంటలకు..తిరుమల, తిరుపతిల్లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 27న తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు https:// ttdevasthanams.ap.gov.in లో టీటీడీ విడుదల చేయనుంది -
బ్లాక్‌బస్టర్ మూవీకి బంపరాఫర్.. కేవలం ఒక్క రోజు మాత్రమే!
రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అయితే ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (ఇది చదవండి: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది?)తాజాగా స్త్రీ-2 సినిమా టికెట్లపై చిత్ర బృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ టికెట్ ఆఫర్ 1+1 పొందేందుకు బుక్ మై షో యాప్‌లో STREE2 ప్రోమో కోడ్ వినియోగించాలని సూచించింది. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబరు 13న మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో థియేటర్లలో ఈ మూవీ చూడాలనుకునేవారు ఎంచక్కా ఆఫర్‌ను ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Maddock Films (@maddockfilms) -
TTD: నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…! నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తోంది. ఇప్పటికే అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేసేసింది. అయితే ఇవాళ(ఆగస్టు 24) ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను కూడా టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఆగష్టు 27వ తేదీన తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లను మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 69,098 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,707 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
chhattisgarh: 72 రైళ్లు రద్దు.. రూ. 29 కోట్లు నష్టం
జార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదం తర్వాత ఈ మార్గంలోని అరడజనుకు పైగా రైళ్లు రద్దు కావడంతో ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు రైల్వేశాఖ ఆదాయానికి గండిపడింది.తాజాగా రాజ్‌నంద్‌గావ్-కల్మనా రైల్వే సెక్షన్ మధ్య మూడవ రైల్వే లైన్‌ను కలమన రైల్వే స్టేషన్‌కు అనుసంధానించేందుకు రైల్వేశాఖ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, ప్రీ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్, మెమూ రైళ్లు ఆగస్టు 4 నుండి 20 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో రక్షాబంధన్ సందర్భంగా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.బిలాస్పూర్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు ప్రభావం అటు ప్రయాణికులపైన, ఇటు రైల్వే ఆదాయంపైన పడనుంది.అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గత మూడు నెలలుగా రాయ్‌పూర్ మీదుగా వెళ్లే రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఈసారి ఏకంగా 72 రైళ్లను (416 ట్రిప్పులు) రద్దు చేయడంతో ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో కన్ఫర్మ్ చేసిన 4 లక్షల 32 వేల టిక్కెట్లను రద్దు చేయడంతో, రైల్వేశాఖ ప్రయాణికులకు రూ.28 కోట్ల 86 లక్షలు వాపసు చేయాల్సి ఉంటుంది. -
నేడు శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం మూడు గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు, తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటా ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. కాగా, అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లను రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
ఇండియన్-2 బుకింగ్స్.. టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవ్వగా.. చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇండియన్-2 చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయుడు2 టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 చొప్పున టికెట్‌పై పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ నెల 12 నుంచి 19 వరకు వారం రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది.కాగా.. ఇటీవల తెలంగాణ సీఎం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోను తయారు చేసి ఇవ్వాలని సినీ ఇండస్ట్రీని కోరారు. అందులో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని లాంటి యాంటి డ్రగ్స్‌పై వీడియోను రిలీజ్ చేశారు. దీంతో టికెట్స్ పెంపుతో పాటు బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతులు జారీ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయాలు
సాక్షి, తిరుమల: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ నెల దర్శన టిక్కెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. గంట 25 నిముషాల వ్యవధిలోనే ఆర్జిత సేవా టిక్కెట్లను భక్తులు పొందారు. 2 నిముషాల 30 సెంకడ్ల వ్యవధిలోనే అంగప్రదక్షణ టికెట్ల విక్రయాలు జరిగాయి.10 నిముషాల 11 సెకండ్ల వ్యవధిలోనే వయో వృద్దులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు పొందారు. 2 గంటల 6 నిముషాల వ్యవధిలోనే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు భక్తులు పొందారు. గంటా 40 నిముషాల వ్యవధిలోనే వసతి గదులు కోటాను భక్తులు పొందారుకాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 71,824 మంది స్వామివారిని దర్శించుకోగా, 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు. -
‘రథయాత్ర’కు రైల్వేశాఖ సన్నాహాలు
దేశంలోని ప్రజలు దూర ప్రయాణాలు సాగించాలనుకున్నప్పుడు రైలునే ముందుగా ఎంచుకుంటారు. రైల్వేశాఖ కూడా ప్రజల ప్రయాణ అవసరాలను గుర్తించి, ప్రత్యక రైళ్లను కూడా నడుపుతుంటుంది. జూలై ఏడు నుంచి ఒడిశాలో ప్రారంభమయ్యే రథయాత్ర ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఎంతో ఉత్సాహంతో పూరీకి తరలివెళుతుంటారు. అయితే ఈ సమయంలో అందరికీ రైలులో రిజర్వేషన్ దొరికే అవకాశం ఉండదు. దీంతో చాలామంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వస్తుంది. దీనిని గుర్తించిన రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, భక్తుల అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది.ఈసారి జగన్నాథ యాత్ర వేడుకలు జూలై 7న ప్రారంభమై జూలై 16న ముగియనున్నాయి. దీనిలో ప్రధానంగా జరిగే రథయాత్ర జూలై 7న జరగనుంది. రథయాత్ర నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ కూడా పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది.జగన్నాథ యాత్రను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే పూరీ వరకు అనేక రైళ్లను పొడిగించనుంది. పూరీ యాత్రకు వెళ్లే ప్రయాణికుల కోసం వివిధ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్లను కూడా భక్తులకు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచనన్నారు. తద్వారా ప్రయాణికులు టిక్కెట్లను సలభంగా పొందవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
కల్కి 2898 ఏడీ.. కారులో కూర్చొని సినిమా చూసేయొచ్చు!
ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసిన ఆ పేరే వినిపిస్తోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆ సినిమా కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అదే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే కల్కి సినిమాకు సంబంధించి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మూవీ టికెట్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ముంబయిలో కల్కి సినిమా టికెట్ ధరలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ముంబయిలోని మల్టీప్లెక్స్‌లో కల్కి టికెట్ ధర ఏకంగా రూ.2000 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబయి నగరంలోని మైసన్ పీవీఆర్: జియో వరల్డ్ డ్రైవ్-ఇన్ మల్టీప్లెక్స్‌లో ఈ ధరను నిర్ణయించారు. అయితే ప్రత్యేక డ్రైవ్-ఇన్ థియేటర్లో ప్రేక్షకులు తమ సొంత స్నాక్స్‌తో పాటు తమ కారులోనే కూర్చొని సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. ముంబయిలో రెండో అత్యంత ఖరీదైన టిక్కెట్ ఐనాక్స్: ఇన్సిగ్నియాలో వర్లీస్ అట్రియా మాల్లో రాత్రి 9:30 గంటలకు షో టిక్కెట్ ధర రూ.1,760 గా నిర్ణయించారు. దీంతో కల్కి టికెట్ ధరలు చూసిన అభిమానులు ఇది ప్రభాస్ రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇంత ధర వెచ్చించి సినిమా చూడాలా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. కల్కి మూవీ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
ఫ్యాన్స్‌కు టెన్షన్.. పొరపాటున కల్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం క్రేజీ రికార్డ్ సృష్టించింది. టికెట్స్ అమ్మకాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిగమించింది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండడంతో ఇండియాలోనూ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపటికే టికెట్స్ అమ్ముడుపోయాయి.అయితే హైదరాబాద్‌లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రభాస్ కల్కి 2898 ఏడీకి బదులు.. రాజశేఖర్ నటించిన కల్కి మూవీ టికెట్స్ బుక్ అయినట్లు చూపించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. టికెట్స్ బుక్ చేసుకోవాలన్న తొందరలో ఫ్యాన్స్ ఈ విషయాన్ని గమనించలేదు. టికెట్ లావాదేవి పూర్తయ్యాక చూస్తే కల్కి పోస్టర్ కనిపించడంతో అవాక్కయ్యారు. కాగా.. 2019లో ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ కాంబోలో కల్కి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అలా టికెట్స్ బుక్ అయిన వారికి బుక్‌మై షో వివరణ ఇచ్చింది. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కల్కి టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. కల్కి 2898 ఏడీ టికెట్గానే భావించండి. సాంకేతిక లోపం వల్లే ఈ సమస్య వచ్చిందని వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కల్కి 2898 ఏడీ ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.స్పందించిన రాజశేఖర్అయితే తన సినిమా కల్కి టికెట్స్ బుక్ కావడంపై హీరో రాజశేఖర్ స్పందించారు. ఈ విషయంలో తనకేలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ సందర్భంగా కల్కి 2898 ఏడీ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. Naaku assalu sammandham ledhu 😅🤣Jokes apart...Wishing dear #Prabhas @nagashwin7, Maa #AshwiniDutt garu @VyjayanthiFilms, The stellar cast and crew all the very very best!May you create history and take the film industry a step ahead #kalki2898ad https://t.co/P00OyIZFVE— Dr.Rajasekhar (@ActorRajasekhar) June 23, 2024 -
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను మంగళవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందాక ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు, తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 69,870 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమరి్పంచారు. దర్శన టికెట్లు లేని వారికి స్వామివారి దర్శనం 24 గంటల సమయం పడుతోంది. -
తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేడు ఆగష్టు కోటా టికెట్లుతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలమే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన. -
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అపరిచితుడు. సదా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రాన్ని రూ.20 కోట్లతో తెరకెక్కించగా.. రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ రి రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు అభిమానులను అలరించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. త్రిపాత్రాభినయంతో రెమో, అపరిచితుడు, బ్రాహ్మణుడిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు హరీశ్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. -
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య పోటీ.. ఆర్థిక నేరగాళ్లతో నిండిన టీడీపీ కూటమికి.. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జైత్రయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వానికి మధ్య పోటీ.. ఈ ఎన్నికల్లో ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడమే కాకుండా..తన బినామీలను పక్క పార్టీలోకి పంపి అక్కడ కూడా వారిని బరిలో నిలిపారు. వ్యాపార వేత్తల ముసుగులో బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఈ వైట్‌కాలర్ ఆర్థిక నేరగాళ్లు సూచించిన వారికీ చంద్రబాబు టికెట్లిచ్చారు. రుణాల పేరుతో బ్యాంకులకు కన్నం పెట్టిన ఈ కేటుగాళ్లలో భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉండి నుంచి రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా.. 2019 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేశ్, సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపిన చంద్రబాబు.. వారికి టికెట్లు దక్కేలా ప్లాన్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి సీఎం రమేశ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ నలుగురు బ్యాంకుల నుంచి సుమారు రూ.4,563 కోట్ల రుణాలు ఎగ్గొట్టి, సీబీఐ ఈడీ, బ్యాంకు జప్తు కేసులు ఎదుర్కొంటున్నారు. మోసాల్లో దిట్ట రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలో విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ సరసన నిలిచే కేటుగాడు రఘురామ కృష్ణరాజు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలు తీసుకున్నాడు. వీటిని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కదారి పట్టించాడు. వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేశాడని, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వా«దీనం చేసుకున్నాయి. కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఇండ్–భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల్లో తీసుకున్న రుణాల్ని భారత్‌కు అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్(ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మైయింటెనెన్స్ యాక్ట్(ఫెమా) దృష్టిలో పడింది. ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రూ.202 కోట్లు ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి అందినట్లు గుర్తించారు. మరుసటి రోజే బదిలీ చేసినట్లు నిర్ధారించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రఘురామ కంపెనీకి రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. సుజనా చౌదరి.. ఎగవేతలో నంబర్ వన్ బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకుని మోసగించిన ఘనుడు సుజనా చౌదరి. ఈ కేసులో ఈడీ దర్యాప్తుతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.1,289 కోట్ల జీఎస్టీ ఎగవేతతో పాటు రూ.700 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్ల ఇన్వాయిస్లు సుజనా కంపెనీలు తయారుచేశాయి.ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నా్చ్ఠరు. దొంగ ఇన్వాయిస్లు చూపి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో గ్రూపునకు చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. బ్యాంకు రుణాలు తీర్చడం లేదని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంటును బ్యాంకులు సీజ్ చేశాయి. విదేశీ బ్యాంకులకు కూడా సుజనా టోపీ పెట్టారు. మారిషస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకొని చెల్లించకపోవడంతో ఆ బ్యాంక్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు ఏకంగా అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టిన వారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇవ్వడానికి ప్రధాని మోదీ నిరాకరించినా చంద్రబాబు అతనికే ఇవ్వాలని పట్టుబట్టారు.బీజేపీ తీర్థం పుచ్చుకొని విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నారు. రూ. 500 కోట్లు ఎగవేతకు సంబంధించి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో ఎస్బీఐ 2021లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్సీఎల్టీ ఆ పిటిషన్‌కు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులిచి్చంది.బినామీ ‘బాబు’..సీఎం రమేశ్చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బినామీ సీఎం రమే‹శ్.. అతని అక్రమ లావాదేవీలను ఆదాయపన్ను శాఖ వెలికి తీసింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.800 కోట్ల నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లించారు. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు తీసుకుని వాటిని చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి ఆ కంపెనీల నుంచి సీఎం రమే‹శ్ సంస్థ నగదును వెనక్కి తీసుకుంది. అతనికి చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపారు. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. రిత్విక్ ప్రాజెక్టులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, సీల్ దొరకడంతో గుట్టు రట్టయ్యింది. దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పార్టీకి ఇచ్చి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సీటు దక్కించుకున్నారనేది అందరికీ తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు.. రూ.390.7 కోట్ల ఎగవేత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.390.7 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో అతని ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు సంబంధించిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.390.7 కోట్లకుపైగా రుణం తీసుకొని ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఆస్తుల స్వాధీనానికి ఇండియన్ బ్యాంకు రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా హామీ ఉండడంతో ఆయనకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు జారీ చేసింది. గత నెలలో ఇండియన్ బ్యాంకు విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని గంటా స్థలాన్ని వేలం వేసేందుకు పత్రికా ప్రకటన ఇచ్చింది. -
బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్.. ఆ సినిమాను టచ్ కూడా చేయలేకపోయాయి!
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతోంది. కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్కు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి. కానీ.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, జవాన్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ రికార్డ్‌ను అధిగమించలేకపోయాయి. నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డ్‌ను ఇప్పటివరకు ఏ చిత్రం దాటలేకపోయింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం. అప్పట్లోనే అంటే.. నాలుగు దశాబ్దాల క్రితం సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆ మూవీనే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడైన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. అదే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని నటించిన షోలే మూవీ. రమేశ్ సిప్పీ డైరెక్షన్లో 1975లో వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్స్ విక్రయించిన సినిమాగా రికార్డులకెక్కింది. అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఇండియన్ సినిమా షోలే చిత్రాన్ని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లలో వీక్షించారు. బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం 1975-80 మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో 18 కోట్ల టిక్కెట్లను విక్రయించారు. అంతే కాకుండా ఈ సినిమా 60 థియేటర్లలో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. బొంబాయి మినర్వా థియేటర్లో ఏకంగా ఐదేళ్లపాటు ప్రదర్శించారు. ఈ మూవీ ఓవర్సీస్లో దాదాపు 2 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అప్పటోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా..4.8 కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపితే మొత్తం ఈ చిత్రం 25 కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి. షోలే ఫ్లాప్ టాక్.. అయితే థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల వసూళ్లు సాధించింది. మొఘల్-ఎ-ఆజామ్, మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది. మొదట ఈ చిత్రానికి హిట్ టాక్ రాలేదు. మొదటి రెండు వారాల్లో ఫ్లాప్ మూవీగా ముద్ర వేశారు. కానీ చివరికీ అన్నింటిని అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్లు, కేజీఎఫ్ సినిమాలు సైతం షోలేను దాటలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి. బాహుబలి -2 ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల ప్రేక్షకులు వీక్షించగా.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ -2 చిత్రాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం దంగల్ కూడా 10 కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించారు. గతేడాది రిలీజైన షారూక్ ఖాన్ జవాన్ కేవలం రూ.4 కోట్ల మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టిక్కెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి. -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టారు. పెట్టిన మరునిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన చెందుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో సన్‌రైజర్స్ యాజమాన్యం లెక్క చెప్పడం లేదు. టిక్కెట్లు దొరక్క అభిమానుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో)