సాక్షి, ముంబై: రానున్న ఫెస్టివ్ సీజన్‌లో ఫారిన్ చెక్కేయ్యాలని న్ చేస్తున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్. కేవలం 9 రూపాయలలో విదేశాలకు వెళ్లే అవకాశం ఎదురుచూస్తోంది. వియత్నాంకు చెందిన విమానయాన సంస్థ వియట్‌జెట్ చాలా చౌకగా విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు ఇతర నాలుగు విమానయాన సంస్థలు కూడా పర్ తగ్గింపు ఆఫర్లు అందిస్తున్నాయి. ‘సీజన్ సేల్’ పేరుతో స్పైస్‌జెట్ కస్టమర్ల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా. బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో, స్పైస్‌జెట్, గోఫస్ట్, ఎయిర్ ఏషియా ఇండియా ఇలాంటి ఆఫర్‌లతో ముందుకొచ్చాయి. ఈ సేల్‌లో కేవలం రూ.1498కే విమాన ప్రయాణ టిక్కెట్లను అందిస్తున్నాయి.
రూ.9కే విమాన టికెట్లు: వియట్ జెట్
ఈ ఆఫర్‌లో కేవలంరూ.9కే (ట్యాక్స్‌లు మినహాయించి)విమాన ప్రయాణ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌లోదాదాపు 30,000 ప్రమోషనల్ టిక్కెట్‌లను అందిస్తోంది. వియట్‌జెట్ ఎయిర్ కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 26 ఆగస్టు 2022 వరకు ప్రతి బుధ, గురు శుక్రవారాల్లో ప్రయాణీకులు ఈ చౌక ప్రమోషనల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 2022 ఆగస్టు 15 నుంచి 2023 మార్చి 26 వరకు ప్రయాణం చేయవచ్చు.
ఎయిర్ ఏషియా ఇండియా పే డే సేల్
ఎయిర్ ఏషియా ఇండియా తన కస్టమర్ల కోసం ‘పే డే సేల్’ను తీసుకొచ్చింది. ఇందులో ఢిల్లీ-జైపూర్ వంటి రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1,499 నుంచి అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు జూలై 28 జూలై 31 మధ్య బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి ఆగస్టు 15 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఇది కాకుండా, ఎయిర్ ఏషియా ఇండియా తన నెట్‌వర్క్‌లో మరిన్ని డిస్కౌంట్ సేల్ ఆఫర్‌లను కూడా తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment