సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తామంటూ సైబర్ ముఠా మోసాలకు తెర తీసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి, క్యూఆర్ కోడ్‌లు పంపి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇప్పటికే చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌కి టికెట్లు మొత్తం అమ్ముడుపోగా, ఆన్‌లైన్‌లో అమ్మకాలను పేటీఎం నిలిపివేసింది. సోషల్ మీడియా వేదికగా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. టికెట్లపై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్రికెట్ అభిమానుల అప్రమతంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment