Uppal Stadium
-
ఉప్పల్‌లో ప్రాక్టీస్ అదరగొట్టిన SRH, పంజాబ్ ప్లేయర్స్ (ఫొటోలు)
-
IPL 2025: ఇలా అయితే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతాం: సన్‌రైజర్స్ యాజమాన్యం
ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు కూడా వెనకాడము. వారి ప్రవర్తన చూస్తే మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాను. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మరియు మా యాజమాన్యానికి తెలియజేయగలము. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదారబాద్ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ ఈ విషయాలను కూడా తన ఈ-మెయిల్లో రాశారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.అయినా పట్టించుకోకుండా హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్‌కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో పేర్కొన్నారు.కాగా, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
#IPL2025 : ఉప్పల్ స్టేడియంలో వాళ్ళ సందడి వేరే లెవెల్...(ఫొటోలు)
-
సన్‌రైజర్స్ VS రాజస్తాన్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో హీరో వెంకటేష్ సందడి (ఫొటోలు)
-
2700 మంది పోలీసులు, 450 సీసీ కెమెరాలు
-
IPL మ్యాచ్ టికెట్ల దందా.. ఉప్పల్ మెట్రో వద్ద బ్లాక్‌లో అమ్మకం
సాక్షి, ఉప్పల్: నేటి నుంచి ఐపీఎల్ సీజన్-18 ప్రారంభం కానుంది. ఇక, రేపు హైదరాబాద్ వేదికగా రాజస్థాన్, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మడం కలకలం రేపింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఐపీఎల్ సందడి వేళ ఉప్పల్‌లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు తిలకించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. మ్యాచ్ టికెట్స్ కోసం ఎగబడతారు. కానీ, కొందరు మాత్రం మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్మడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేపు జరగబోయే RR Vs SRH మ్యాచ్ టికెట్లను ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఓ వ్యక్తి అమ్మడం కలకలం రేపింది. మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి టికెట్లను అమ్మడం కొందరు గుర్తించారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడిని చేరుకుని భరద్వాజ్‌కు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, అతడి వద్ద ఉన్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. -
#IPL2025కు ఉప్పల్ స్టేడియం సిద్ధం.. పటిష్ట భద్రతా (ఫొటోలు)
-
SRH: హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్ ప్రాక్టీస్ ఆరోజే మొదలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం కొత్త హంగులతో సిద్ధం కానుంది. రెండు వారాల్లోపు పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ప్రాక్టీస్ సెషన్ తేదీని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగాకాగా గతేడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా ఎదురైన వైఫల్యాలను అధిగమించి.. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కమిన్స్ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి రికార్డులు కొల్లగొట్టింది. అయితే, ఆఖరి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన రైజర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.అయితే, టైటిల్ చేజారినా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్ ఆర్మీ మనసులు గెలుచుకుంది. ఇక ఈ ఏడాది సన్‌రైజర్స్ సరికొత్తగా అభిమానుల ముందుకు రానుంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకున్న రైజర్స్ యాజమాన్యం.. హెన్రిచ్ క్లాసెన్(దక్షిణాఫ్రికా) కోసం అత్యధికంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది.కమిన్స్ సారథ్యంలోనేఅదే విధంగా ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)ను రూ. 18 కోట్లు, అభిషేక్ శర్మ(భారత్)ను రూ. 14 కోట్లు, ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా)ను రూ. 14 కోట్లు, నితీశ్ రెడ్డి(భారత్)ని రూ. 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇక వేలంపాటలో భాగంగా టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, మహ్మద్ షమీలను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ కమిన్స్ సారథ్యంలోనే తాము ఈసారీ బరిలోకి దిగుతామని ప్రకటించింది.ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్ పద్దెమినిదవ సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ 2025 ఎడిషన్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానం ఉప్పల్‌లో రాజస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.హైదరాబాదీలకు పండుగే.. సన్‌రైజర్స్ ప్రాక్టీస్ ఆరోజే మొదలుఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తాజాగా వెల్లడించారు. వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ఈసారి హైదరాబాద్ ప్రజలకు పండుగే. మనకు ఇక్కడ తొమ్మిది మ్యాచ్‌లు జరుగబోతున్నాయి.ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు రెనోవేషన్ చేస్తున్నాం. గతంలో అద్భుతమైన పిచ్‌లు రూపొందించినందుకు గానూ అవార్డు అందుకున్నాం. రానున్న పదిహేను రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు మైదానం సిద్ధమవుతుంది. మార్చి 2 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలుపెడుతుంది’’అని జగన్ మోహన్ రావు తెలిపారు.ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్👉మార్చి 23- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)👉మార్చి 27 - సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)👉మార్చి 30- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్)👉ఏప్రిల్ 3- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (కోల్‌కతా)👉ఏప్రిల్ 6- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 12 - సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 17- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)👉ఏప్రిల్ 23- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 25- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే (చెన్నై)👉మే 2- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్)👉మే 5- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)👉మే 10- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (హైదరాబాద్)👉మే 13- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ (బెంగళూరు)👉మే 18- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో (లక్నో)ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుఅథర్వ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమ్రన్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేశ్ ఉనాద్కట్, బ్రైడన్ కార్సే.చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు #WATCH | Hyderabad, Telangana: Rajiv Gandhi International Cricket Stadium being renovated for upcoming IPL matchesJagan Mohan Rao, President, Hyderabad Cricket Association, says, " There is good news for Hyderabad people, this time we are getting 9 matches (of IPL)...for that… pic.twitter.com/qyQ3CKOd44— ANI (@ANI) February 27, 2025 -
IPL 2025: కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్
ఐపీఎల్–2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ హోం గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. అదే రోజు ఆదివారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది.మే 25న ఫైనల్‌కు కూడా కోల్‌కతానే వేదిక కానుండగా... క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే జరుగుతాయి. పది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో పది టీమ్‌ల సొంత మైదానాలతో పాటు రెండు ఇతర వేదికలు (ధర్మశాల, గువహటి) కలిపి మొత్తం 12 చోట్ల లీగ్‌ను నిర్వహిస్తారు. రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు గువహటి తమ రెండో సొంత వేదిక కాగా...ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడుతుంది. -
రాణించిన విజయ్, స్టీఫెన్
సాక్షి, హైదరాబాద్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు త్రిపురాణ విజయ్ 8 పరుగులిచ్చి 4 వికెట్లు... స్టీఫెన్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నాగాలాండ్‌ను దెబ్బ తీశారు. శశికాంత్, సత్యనారాయణ రాజు, వినయ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం ఆంధ్ర జట్టు 9.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు కోన శ్రీకర్ భరత్ (26 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), అశ్విన్ హెబ్బర్ (24 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక షేక్ రషీద్ (4 నాటౌట్), వంశీకృష్ణ (5 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో గోవాతో ఆంధ్ర తలపడుతుంది. -
India vs Bangladesh: దసరా ధమాకా
హైదరాబాద్‌లో విజయదశమి రోజున సాయంత్రం...పండగ సంబరాలను కాస్త పక్కన పెట్టి క్రికెట్ వైపు వచి్చన అభిమానులు అదృష్టవంతులు! అటు స్టేడియంలో గానీ ఇటు ఇంట్లో గానీ మ్యాచ్ చూసినవారు ఫుల్ దావత్ చేసుకున్నట్లే! అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చి భారత క్రికెటర్లు పారించిన పరుగుల ప్రవాహంతో పండగ ఆనందం రెట్టింపు అయిందంటే అతిశయోక్తి కాదు. 25 ఫోర్లు, 23 సిక్స్‌లు...ఈ 47 బౌండరీలతోనే ఏకంగా 232 పరుగులు...రెండు ఓవర్లు మినహా మిగతా 18 ఓవర్లూ పదికి పైగా పరుగులు వచి్చన పవర్‌ప్లే ఓవర్లే! 43 బంతులకే 100, 84 బంతులకే 200 వచ్చేశాయి...అలా వెళ్లిన స్కోరు 300కు కాస్త ముందు ఆగింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు బద్దలు...సరికొత్త రికార్డులు నమోదు. అంతర్జాతీయ టి20ల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత కూడా 2 అర్ధసెంచరీలు, ఇరవై లోపు లోపు 20 స్కోర్లతో తన సెలక్షన్‌పై సందేహాలు రేకెత్తిస్తూ వచి్చన సంజు సామ్సన్ ఎట్టకేలకు అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా అతని మెరుపు సెంచరీ హైలైట్‌గా నిలిచింది. అతి భారీ లక్ష్యం ముందుండగా ముందు చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి లాంఛనం ముగించింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సమరాన్ని భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో ముగించింది. టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా 3–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లోనే 86 పరుగుల ఓటమి తర్వాత సిరీస్ కోల్పోయి కునారిల్లిన బంగ్లాకు చివరి పోరులో అంతకంటే పెద్ద దెబ్బ పడింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ 133 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఎప్పటిలాగే చెలరేగాడు. సామ్సన్, సూర్య రెండో వికెట్‌కు 70 బంతుల్లోనే 173 పరుగులు జోడించడం విశేషం. వీరిద్దరికి తోడు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా దూకుడు కనబర్చడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేయగలిగింది. తౌహీద్ హృదయ్ (42 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), లిటన్ దాస్ (25 బంతుల్లో 42; 8 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 6, 6, 6, 6, 6... అభిషేక్ (4)ను తొందరగా అవుట్ చేయడం ఒక్కటే బంగ్లాకు దక్కిన ఆనందం. ఆ తర్వాత 69 బంతుల పాటు వారికి సామ్సన్, సూర్య చుక్కలు చూపించారు. తస్కీన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 4 ఫోర్లు కొట్టగా, తన్జీమ్ ఓవర్లో సూర్య వరుసగా 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలోనే జట్టు 82 పరుగులు చేసింది. 22 బంతుల్లో సామ్సన్ అర్ధసెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత బంగ్లా స్పిన్నర్ రిషాద్ బాధితుడయ్యాడు. రిషాద్ తొలి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన సామ్సన్...అతని తర్వాతి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. తొలి బంతికి పరుగు తీయని సామ్సన్ తర్వాతి ఐదు బంతుల్లో 6, 6, 6, 6, 6తో చెలరేగాడు. మరో వైపు 23 బంతుల్లో సూర్య హాఫ్ సెంచరీ పూర్తయింది. మహేదీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా ఫోర్ కొట్టడంతో సామ్సన్ 40 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు సెంచరీ తర్వాత సామ్సన్ను ముస్తఫిజుర్ వెనక్కి పంపడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. తర్వాతి ఓవర్లోనే సూర్య అవుటయ్యాడు. ఆ తర్వాతా భారత్‌ను నిలువరించడం బంగ్లా వల్ల కాలేదు. పాండ్యా తన జోరును చూపిస్తూ తన్జీమ్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టగా...మహేదీ ఓవర్లో పరాగ్ వరుసగా 6, 4, 6 బాదాడు. వీరిద్దరు 26 బంతుల్లోనే 70 పరుగులు జత చేశారు. మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచి్చన నితీశ్ కుమార్ రెడ్డి (0) తొలి బంతికే వెనుదిరగ్గా...300కు 3 పరుగుల ముందు భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహీద్, దాస్ నాలుగో వికెట్‌కు 38 బంతుల్లో 53 పరుగులు జోడించి కాస్త పోరాడటం మినహా చెప్పుకునేందుకు ఏమీ లేకపోయింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) మహేదీ (బి) ముస్తఫిజుర్ 111; అభిషేక్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 4; సూర్యకుమార్ (సి) రిషాద్ (బి) మహ్ముదుల్లా 75; పరాగ్ (సి) దాస్ (బి) తస్కీన్ 34; పాండ్యా (సి) రిషాద్ (బి) తన్జీమ్ 47; రింకూ (నాటౌట్) 8; నితీశ్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 0; సుందర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 297. వికెట్ల పతనం: 1–23, 2–196, 3–206, 4–276, 5–289, 6–289. బౌలింగ్: మహేదీ 4–0–45–0, తస్కీన్ 4–0–51–1, తన్జీమ్ 4–0–66–3, ముస్తఫిజుర్ 4–0–52–1, రిషాద్ 2–0–46–0, మహ్ముదుల్లా 2–0–26–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (సి) పరాగ్ (బి) మయాంక్ 0; తన్జీద్ (సి) వరుణ్ (బి) సుందర్ 15; నజ్ముల్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 14; లిటన్‌దాస్ (సి) (సబ్) తిలక్ (బి) బిష్ణోయ్ 42; తౌహీద్ (నాటౌట్) 63; మహ్ముదుల్లా (సి) పరాగ్ (బి) మయాంక్ 8; మహేదీ (సి) పరాగ్ (బి) నితీశ్ 3; రిషాద్ (సి) అభిషేక్ (బి) బిష్ణోయ్ 0; తన్జీమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–0, 2–35, 3–59, 4–112, 5–130, 6–138, 7–139. బౌలింగ్: మయాంక్ 4–0–32–2, పాండ్యా 3–0–32–0, సుందర్ 1–0–4–1, నితీశ్ 3–0–31–1, రవి 4–1– 30–3, వరుణ్ 4–0–23–0, అభిషేక్ 1–0–8–0. -
ఉప్పల్ మ్యాచ్ పై VHP కీలక వార్నింగ్
-
భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్ నెలకొంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరో వైపు, మ్యాచ్‌ను అడ్డుకుంటామంటూ వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో స్టేడియం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు.ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుభారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.ఇదీ చదవండి: ఉప్పల్‌లో గెలుపెవరిదో!వరంగల్ వైపు నుంచి ఎల్బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి. -
IND VS BAN: మూడో టీ20కి వర్షం ముప్పు..?
భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరగాల్సిన మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని వారు పేర్కొన్నారు. నగరంలో ఇవాళ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని అంచనా.నిన్న సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
బంగ్లాతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తాము: టీమిండియా కోచ్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శనివారం సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌టెన్ డోస్చేట్ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్నదే మా జట్టు, అభిమానుల కోరిక. కచ్చితంగా అలాగే ముగించేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనస్తత్వం గురించి మాట్లాడాడు.దేశం తరపున ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని గంభీర్ భావిస్తాడు. ప్రతీసారి ఆటగాళ్లని కూడా ఒత్తిడికి గురిచేస్తాడన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌కు కూడా అన్ని మ్యాచ్‌లకు సన్నద్దమైనట్లే సిద్దమయ్యాము. ప్రస్తుతం భారత జట్టు అద్బుతంగా ఆడుతోంది. కుర్రాళ్లు కూడా బాగా రాణిస్తున్నారు. తొలిసారి భారత జట్టు తరపున ఆడుతున్న కుర్రాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జితేష్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రానాలకు ఆడే అవకాశం ఇంకా రాలేదు. మూడో టీ20 జట్టు ఎంపిక కు ఈ యంగ్ ప్లేయర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. కుర్రాళ్లందరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్‌టెన్ డోస్చేట్ పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
భారత్– బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12న (శనివారం) భారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.వరంగల్ వైపు నుంచి ఎల్బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: ఒక్కసారిగా వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షంరామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి. -
బంగ్లాతో మూడో టీ20.. హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా
బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది.గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జట్లు తమకు కేటాయించిన హోటల్స్‌కు పయనమయ్యారు. ఇందుకు సబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భాగ్యనగరానికి చేరుకున్న భారత్, బంగ్లా జట్లు శుక్రవారం ఉప్పల్‌లో ప్రాక్టీస్ చేయనున్నాయి. కాగా తొలి రెండు టీ20ల్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.చదవండి: విండీస్ మహిళల ధనాధన్ విక్టరీ -
ప్లే ఆఫ్‌కు సన్ రైజర్స్ : థాంక్యూ హైదారబాద్ (ఫొటోలు)
-
SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
-
ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
-
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్‌లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
SRH Vs LSG Photos: సన్‌రైజర్స్ విధ్వంసం..లక్నోపై 10 వికెట్లతో ఘనవిజయం (ఫొటోలు)
-
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
-
ఉప్పల్‌లో ఉల్లాసంగా SRH,RR ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
SRH Vs RCB Photos: నిన్న హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌కు వెళ్ళలేదా అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
SRH Vs RCB: ఐపీఎల్ ఫీవర్... హోటల్ రెంట్లు డబుల్!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్‌తో హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్ల గదుల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని స్టార్ హోటళ్లు బుక్ అయిపోయాయి. దీనికితోడు రేట్లు కూడా సాధారణం కంటే రెట్టింపు అంతకంటే ఎక్కువయ్యాయి. హోటల్ గదులు బుక్ చేసుకోవడానికి ఉపకరించే ప్రముఖ వెబ్సైట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య ఫేవరేట్ మ్యాచ్ జరుగనుండటంతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అత్యధిక స్కోర్లతో హాట్ ఫేవరేట్లుగా... ప్రసుత్తం ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్–ఆర్సీబీ జట్లు హాట్ ఫేవరెట్స్‌గా మారిపోయాయి. ఈ రెండింటి మధ్య ఈ నెల 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కేంద్రంగా ఓ మ్యాచ్ జరిగింది. అందులో ఎస్ఆర్హెచ్ 287, ఆర్సీబీ 262 పరుగులు చేసి రికార్డు సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇవి అత్యధిక స్కోర్లు కావడంతో ఈ రెండు జట్ల పైనా ఐపీఎల్ ప్రియులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలోనూ ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. వీరి కోసం రెండు స్టార్ హోటళ్లలో చాలా భాగం నిర్వాహకులు బుక్ చేశారు. దీంతో పాటు ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి అనేక మంది క్రికెట్ అభిమానులు వస్తున్నారు. వీళ్లు సైతం ఆన్లైన్లో, ప్రముఖ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లోని అనేక స్టార్ హోటళ్లలో శుక్రవారం వరకు గదులు ఖాళీ లేవని ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. సరాసరిని మించిన బుకింగ్... హోటళ్లల్లో గదులు బుక్ కావడం, అందులో అతిథులు బస చేయడాన్ని ఆక్యుపెన్సీగా పిలుస్తారు. స్టాటిస్టా సంస్థ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లల్లో ఆక్యుపెన్సీ రేటు సరాసరి గరిష్టంగా 50 నుంచి 60 శాతం మాత్రమే ఉంటోంది. 2021–22 ఆరి్థక సంవత్సరంలో ఇది 51 శాతంగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో 73 శాతంగా నమోదైంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌తో పాటు పెళ్లి ముహుర్తాలు కూడా ఉండటంతో ప్రస్తుతం అనేక స్టార్ హోటళ్లు ‘నో రూమ్’గా మారిపోయాయి. ఉన్న వాటిలోనూ అద్దెలు సాధారణ సమయం కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ వెబ్సైట్లు, యాప్స్ సూచిస్తున్నాయి. గురువారం రాత్రి క్రికెట్ మ్యాచ్ ఉండటంతో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో కంటే వీకెండ్స్‌లో హోటల్ రూముల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూసినా శని–ఆదివారాల్లో ఆయా హోటళ్ల అద్దెల కంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఎక్కువగా ఉన్నాయి. సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న షెరిటన్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ అద్దె మంగళ–బుధవారాల్లో రూ.1.28 లక్షలుగా ఉండగా... శుక్రవారం నుంచి ఇది రూ.64 వేల నుంచి రూ.67 వేల వరకు మాత్రమే ఉన్నట్లు ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. ఇదే హోటల్లో సాధారణ గది అద్దె మంగళ–బుధవారాల్లో రూ.21,500గా, శని–ఆదివారాల్లో రూ.11,250గా ఉంది. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్లో మంగళ–బుధవారాలకు అద్దె రూ.32 వేలుగా చూపిస్తోంది. శని–ఆదివారాలకు ఈ మొత్తం రూ.9,800గా ఉంది. వెస్టిన్ హోటల్లో మంగళ–బుధవారాలకు రూ.22,500గా, శని–ఆదివారాలకు రూ.10 వేలుగా కనిపిస్తోంది. సోమాజీగూడలోని ది పార్క్ హోటల్లో గది అద్దె మంగళ–బుధవారాలకు రూ.11,587గా, శని–ఆదివారాలకు రూ.5,071గా ఉంది. గురు–శుక్రవారాల్లో ఆయా హోటళ్లలో నో రూమ్ అని కనిపిస్తోంది. (అద్దె మొదటి రోజు చెక్ ఇన్ సమయం నుంచి రెండో రోజు చెక్ ఔట్ సమయం వరకు... పన్నులు దీనికి అదనం) -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ మీడియా సమావేశం
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సెక్రెటరీ దేవ్ రాజ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సన్‌రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు తలెత్తిన పవర్ కట్ సమస్య, బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయం తదితర విషయాలపై వివరణ ఇచ్చారు. స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మాట్లాడుతూ..ఈ సమస్య ఇప్పటిది కాదని, 2015 నుంచి ఉందని తెలిపారు. తమ ప్యానెల్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ బకాయిల విడతల వారీగా కడుతున్నామని, ఇప్పటికే మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించామని చెప్పారు. బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయంపై మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం అనేది పూర్తిగా సన్‌రైజర్స్‌కి సంబంధించిందని, ఈ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు రెండు లక్షల టికెట్ల డిమాండ్ ఉందని.. స్టేడియం కెపాసిటీ కేవలం 38 వేలు మాత్రమేనని తెలిపారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తమ ప్యానెల్ వచ్చాక టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామని, ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్టేడియంలో కొత్తగా టీవీలు, ఏసీలు పెడుతున్నామని.. వాష్ రూమ్‌లు, లిఫ్ట్‌లు, లాంజ్‌లు రేనోవేట్ చేసామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో పార్కింగ్ సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ ద్యేయమని.. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. భవిషత్లో లక్ష సీటింగ్ కెపాసిటీ గల స్టేడియం నిర్మిస్తామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు. స్టేడియం లీజ్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని.. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
Uppal Stadium: టికెట్ ఉన్నా సీటే లేదు!
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్లక్షం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. శుక్రవారం ఉప్పల్ స్డేడియంలో సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. అతడికి టికెట్ ఉన్నా స్టేడియంలో సీటు లభించలేదు. నగరానికి చెందిన జునైద్ అహ్మద్ రూ.4,500 వెచి్చంచి టికెట్ కొన్నాడు. టికెట్లో జే– 66 సీట్ నంబర్ అలాట్ చేశారు. తీరా స్టేడియంలోకి వెళ్లగా జే–65 తర్వాత 67 సీటు ఉండటంతో షాక్ తిన్నాడు. జే–66 సీట్ ఎంత వెతికినా లభించలేదు. ఎవరిని ఆరా తీసినా ఫలితం లేకుండాపోయింది. చేసేదేమీలేక మ్యాచ్ ఆసాంతం నిలబడే చూడాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. హెచ్‌సీఏ, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యం కారణంగానే తాను 4 గంటల పాటు నిలబడాల్సి వచి్చందని జునైద్ ఆరోపించాడు. ఈ విషయాన్ని న్యాయస్థానం, వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్తానన్నాడు. -
SRH Vs CSK Highlights Pics: సన్‌రైజర్స్‌ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్.. ఫొటోలు
-
IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. టాటా ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్ -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
IPL 2024: సన్‌రైజర్స్, సీఎస్కే మ్యాచ్‌కు తొలగిన కరెంటు కష్టం
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు బిల్లులు చెల్లించని కారణంగా ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ చేశారు అధికారులు. స్టేడియం నిర్వహకులు రూ. 1.67 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, అందుకే విద్యుత్ సరఫరా నిలిపివేశామని సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అభిమానులు ఆందోళన చెందుతుండగా అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం విద్యుత్ పునరుద్దరణ జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా బిల్లులు చెల్లించేందుకు ఒక రోజు గడువు ఇచ్చినట్లు తెలుస్తుంది. విద్యుత్ అధికారులు వెసులుబాటును ఇవ్వడంతో సన్‌రైజర్స్, సీఎస్కే మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. -
IPL 2024: ఉప్పల్‌లో నేడు బిగ్ ఫైట్.. సీఎస్కేతో తలపడనున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 5) బిగ్ ఫైట్ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విన్యాసాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రవిస్ హెడ్, అబిషేక్ శర్మ, క్లాసెన్ ఊచకోతను మరో సారి చూసేందుకు హైదరాబాద్ అభిమానులు తహతమలాడిపోతున్నారు. సన్‌రైజర్స్ చివరిసారి ఉప్పల్‌లో ఆడిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేసిన స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే భారీ స్కోర్‌గా రిజిస్టర్ అయ్యింది. ఇదే మ్యాచ్ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ ముంబై ఇండియన్స్ కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. ముంబై ఇండియన్స్ కూడా సన్‌రైజర్స్ తరహాలోనే మెరుపులు మెరిపించింది. అయితే లక్ష్యం పెద్దది కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఉప్పల్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో మరోసారి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయమని తెలుస్తుంది. సన్‌రైజర్స్‌తో పోలిస్తే సీఎస్కే బ్యాటింగ్ లైనప్‌లో పెద్ద స్టార్లు లేనప్పటికీ మూకుమ్మడిగా రాణించడమే ఆ జట్టు స్పెషల్. ఈ సీజన్లో కొత్త కెప్టెన్ రుతురాజ్ నేతృత్వంలో ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. సీఎస్కే బ్యాటింగ్‌లో వ్యక్తిగతమై భారీ ప్రదర్శనలు లేనప్పటికీ రుతురాజ్, రచిన్, రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే తలో చేయి వేస్తూ మ్యాచ్‌లను గెలిపిస్తున్నారు. వైజాగ్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోని పాత రోజులను గుర్తు చేయడం సీఎస్కేకు అదనపు బలంగా మారనుంది. అయితే ధోని నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందిగ్దంగా మారింది. ధోని ప్రాక్టీస్ సెషన్లో ఎక్కడా కనిపించకపోవడంతో అతను నేటి మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగతుంది. ధోని విషయం ఏమో కాని నేటి మ్యాచ్‌కు ఫామ్‌లో ఉన్న పేసర్ ముస్తాపిజుర్ రెహ్మాన్ దూరం కానున్నాడు. వరల్డ్‌కప్ వీసా కోసం అతను యూఎస్ఏకు వెళ్లాడు. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయని చెప్పలేం కాని.. కలిసికట్టుగా ఆడితే సీఎస్కేకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. ఒకవేళ సన్‌రైజర్స్ బ్యాటర్లు గత మ్యాచ్ తరహాలో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడితే ఆ జట్టుకే గెలిచే ఛాన్స్‌లు అధికంగా ఉంటాయి. ఏదిఏమైనా హైదరాబాద్ అభిమానులకు నేటి మ్యాచ్ కనువిందు చేయడం ఖాయం. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్కే స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. ఈ జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. సన్‌రైజర్స్ కేవలం 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ/ అరవెల్లి అవనీశ్, దీపక్ చాహర్, మతీషా పతిరణ సన్‌రైజర్స్: మయాంక్ అగర్వాల్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ -
ఉప్పల్ దంగల్ : హైదరాబాద్ Vs చెన్నై మ్యాచ్‌కు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్
సాక్షి, హైదరాబాద్: కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా పవర్ కట్ అయ్యింది. కీలక మ్యాచ్‌కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ వెల్లడించింది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చిన కానీ హెచ్‌సీఏ పట్టించుకోలేదని, నోటీసులకు స్పందించకపోవడంతోనే విద్యుత్ సరఫరాను కట్ చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండా విద్యుత్ వాడుకున్నారన్న విద్యుత్ శాఖ.. 15 రోజుల క్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడ ఎస్ఈ రాముడు వెల్లడించారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జనరేటర్‌తో పవర్‌ను సరఫరా చేస్తున్నారు. -
IPL టికెట్లు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారా?.. పోలీసుల హెచ్చరిక ఇదే
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తామంటూ సైబర్ ముఠా మోసాలకు తెర తీసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి, క్యూఆర్ కోడ్లు పంపి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌కి టికెట్లు మొత్తం అమ్ముడుపోగా, ఆన్లైన్లో అమ్మకాలను పేటీఎం నిలిపివేసింది. సోషల్ మీడియా వేదికగా టికెట్లు ఆన్లైన్లో అమ్ముతున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. టికెట్లపై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్రికెట్ అభిమానుల అప్రమతంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
IPL 2024 SRH Vs MI Photos: సొంతగడ్డపై సన్‌రైజర్స్ విజయగర్జన (ఫొటోలు)
-
IPL 2024: సమరానికి సిద్ధం అంటున్న సన్‌రైజర్స్
హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైంది. లీగ్ ప్రారంభానికి రెండు వారాలకు పైగా సమయం ఉండగానే సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇవాళ తొలి టీమ్ మీటింగ్ జరిగింది. స్టార్ బౌలర్ టి నటరాజన్, లోకల్ ఆటగాళ్లు కొందరు ఇవాళ జరిగిన ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. First team huddle of the season at Uppal ft. a whole lotta orange 🥹🧡 pic.twitter.com/JV4dvzwicE — SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024 ఆటగాళ్లకు చెందిన కొన్ని ఫోటోలను సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ లోకల్ టీమ్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. తొలి విడతలో విడుదల చేసిన ఫిక్షర్స్లో సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. Nattu's #FlameComing 𝘢𝘯𝘵𝘦 wickets incoming 🤩 Welcome back, @Natarajan_91 🧡 pic.twitter.com/sPyVJAGlVb — SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024 మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31 గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 5 చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వీటిలో ముంబై ఇండియన్స్, సీఎస్కే మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనుండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. Mark your dates, #OrangeArmy 😍 We start our 🔥 days against the Knights 🧡💜 And we’ll see you at Uppal on the 27th 😍#IPL2024 #IPLSchedule pic.twitter.com/j9kuIIDyfE — SunRisers Hyderabad (@SunRisers) February 22, 2024 కొద్ది రోజుల కిందటే సన్‌రైజర్స్ యాజమాన్యం పాత కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ను తప్పించి పాట్ కమిన్స్‌ను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఈ సీజన్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో సన్‌రైజర్స్ టీమ్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతుంది. సన్‌రైజర్స్ జట్టు వివరాలు.. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్) భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ వివరాలు.. హెడ్ కోచ్: డేనియల్ వెటోరీ బ్యాటింగ్ కోచ్: హేమంగ్ బదానీ స్పిన్ బౌలింగ్ మరియు స్ట్రాటజిక్ కోచ్: ముత్తయ్య మురళీథరన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్: జేమ్స్ ఫ్రాంక్లిన్ (తాత్కాలికం) అసిస్టెంట్ కోచ్: సైమన్ హెల్మట్ ఫీల్డింగ్ కోచ్: ర్యాన్ కుక్ -
Ranji Trophy: విజయం దిశగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మరో 127 పరుగులు సాధిస్తే హైదరాబాద్ క్రికెట్ జట్టు 2023–2024 రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్‌గా అవతరిస్తుంది. ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ప్లేట్ డివిజన్ టైటిల్ పోరులో మేఘాలయ జట్టు హైదరాబాద్‌కు 198 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు సాధించింది. తన్మయ్ అగర్వాల్ (0) ఖాతా తెరవకుండా అవుటవ్వగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (29 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తనయ్ త్యాగరాజన్ (35 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 0/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మేఘాలయ జట్టు 71.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆర్ఆర్ బిస్వా (100; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... జస్కీరత్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మేఘాలయను కట్టడి చేశాడు. ఈ రంజీ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన తనయ్ మొత్తం 56 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. తనయ్ ఏడుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. -
కోహ్లి నామస్మరణతో మార్మోగుతున్న ఉప్పల్ స్టేడియం
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు రెండో సెషన్ (32.5 ఓవర్లు) సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 121/4గా ఉంది. జాక్ క్రాలే (20), బెన్ డకెట్ (35), ఓలీ పోప్ (1), జానీ బెయిర్‌స్టో (37) ఔట్ కాగా.. జో రూట్ (26), బెన్ స్టోక్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, రవి జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. Hyderabad crowd cheering "Kohli, Kohli, Kohli". 🐐 - Fans are missing Kohli in the first Test. pic.twitter.com/WFcdR6OxOQ — Johns. (@CricCrazyJohns) January 25, 2024 కాగా, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడకపోయినా అతని నామస్మరణతో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోతుంది. తమ ఆరాధ్య క్రికెటర్‌ను స్మరించుకుంటూ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. ముఖ్యంగా యువత అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. కోహ్లి ఫోటోలను పట్టుకుని ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. ఇవాళ వర్కింగ్ డే కావడంతో స్టేడియంలో జనాలు పలచగా కనిపించినా.. అక్కడున్న వారు మాత్రం కోహ్లి పేరును జపిస్తూ మ్యాచ్‌ను చూస్తున్నారు. ఓ పక్క భారత బౌలర్లు వికెట్లు తీస్తున్నా ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. లోకల్ బాయ్ సిరాజ్ అద్బుతమైన క్యాచ్ పట్టినప్పుడు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చింది. కోహ్లికి అచ్చొచ్చిన ఉప్పల్.. డబుల్‌తో చెలరేగిన రన్ మెషీన్ 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్‌లో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (108; 12 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టారు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
టాస్ ఓడిన భారత్.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 25) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిధి
టీమిండియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా వాలిపోయే వీరాభిమాని సుదీర్ గౌతమ్ చౌధరీ హైదరాబాద్‌కూ వచ్చేశాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో అతను తనదైన శైలిలో భారత్–ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం సమర శంఖం పూరించాడు. సచిన్‌కు అతిపెద్ద ఫ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ... సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆటపై తన ప్రేమను కొనసాగిస్తూ ప్రతీ మైదానంలో కనిపిస్తూ వస్తున్నాడు. మొత్తానికి భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌లో సుదీర్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. కాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలుపు లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌లో చాలాకాలం తర్వాత జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో స్థానిక అభిమానులు మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. -
నేటి నుంచి ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్మ్డ్ ఫోర్స్, ఎస్బీ, సీసీఎస్, ఎస్ఓటీ, ఐటీ సెల్ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుంచి 1,500 పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు బుధవారం రాచకొండ కమిషనర్ జి.సుధీర్‌బాబు వెల్లడించారు. మైదానం చుట్టూ, 360 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గేట్ నంబరు–1 కేవలం ఆటగాళ్ల కోసమే కేటాయించాం. మ్యాచ్‌కు 3 గంటల ముందు మాత్రమే వీక్షకులకు మైదానంలోకి అనుమతిస్తారు. మ్యాచ్ సమయంలో రహదారులు, కూడళ్లలో సాధారణ ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ రద్దీని క్రమబదీ్ధకరించేందుకు 250 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. టీఎస్ ఐలా, జెన్‌ప్యాక్ట్, ఎన్జీఆర్ఐ ప్రాంతాలలో 15 పార్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేశాం. మ్యాచ్ సమయంలో ఎల్బీనగర్, వరంగల్ మార్గం నుంచి హబ్సిగూడ మీదుగా భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ఈ నెల 29 వరకు ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని సీపీ సు«దీర్‌బాబు పేర్కొన్నారు. -
IND vs ENG: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. స్టార్ బౌలర్‌కు నో ఛాన్స్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ హైవోల్టేజ్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టును ఒక రోజు ముందే ప్రకటించింది. తొలి టెస్టుకు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. ఆండర్సన్ స్ధానంలో స్పీడ్ స్టార్ మార్క్ వుడ్‌కు మేనెజ్మెంట్ ఛాన్స్ ఉంది. కాగా ఈసీబీ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్‌లో స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక్కడే కావడం గమనార్హం. అనూహ్యంగా ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. స్పినర్ల కోటాలో రెహన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హర్ట్లీ చోటు దక్కింది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
అచ్చొచ్చిన ఉప్పల్.. ఇక్కడ టీమిండియాకు తిరుగేలేదు..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్ నగర వాసులు ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ మైదానంలో టీమిండియాకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. పరుగుల వరద...వికెట్ల జాతర.. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐదు టెస్టులు అభిమానులకు పసందైన క్రికెట్ అందించాయి. ఒకవైపు పరుగుల వరద పారడంతో పాటు వికెట్ల జాతర కూడా కనిపించింది. ఈ వేదికపై తొలిసారిగా 2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. అయితే ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. టిమ్ మెకింటోష్ (102; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ నాలుగేసి వికెట్లు తీశారు. ధోని కెపె్టన్సీలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 143.4 ఓవర్లలో 472 పరుగులకు ఆలౌటైంది. హర్భజన్ సింగ్ (111 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 122 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టును ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (225; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో ఆదుకున్నాడు. న్యూజిలాండ్ 135 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి భారత జట్టుకు 327 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. అశ్విన్ మాయాజాలం.. 2012 ఆగస్టు 23 నుంచి 26 వరకు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు రెండో టెస్టు ఆడింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ (6/31, 6/54) మ్యాచ్ మొత్తంలో 12 వికెట్లు తీసి భారతజట్టు ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (159; 19 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. పుజారా ధమాకా.. 2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఈ వేదికపై మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 237 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. భువనేశ్వర్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 154.1 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (204; 30 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (167; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. 266 పరుగులతో వెనుకబడిన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా అశి్వన్ (5/63), రవీంద్ర జడేజా (3/33) దెబ్బకు 67 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కోహ్లి కేక.. 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ వేదికపై నాలుగో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (108; 12 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టారు. పది వికెట్లతో విజయం.. 2018 అక్టోబర్ 12 నుంచి 14 వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈ వేదికపై ఐదో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది. ముందుగా విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (92), అజింక్య రహానే (80), పృథ్వీ షా (70) అర్ధ సెంచరీలు చేశారు. 56 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. ఉమేశ్ యాదవ్ (4/45), అశి్వన్ (2/24), జడేజా (3/12) విండీస్‌ను కట్టడి చేశారు. అనంతరం విండీస్ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ కోల్పోకుండా ఛేదించి గెలిచింది. -
India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో, www.insider.in వెబ్సైట్లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్‌లైన్‌లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు. టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 4000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 16000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్ చేసుకోవాలి. -
ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
Ind vs Aus 2023 T20 Series: ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్‌ను హైదరాబాద్‌లో నేరుగా వీక్షించాలనుకున్న అభిమానులకు బ్యాడ్‌న్యూస్! టీ20 సిరీస్‌లో భాగంగా డిసెంబరు 3న ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా- టీమిండియాతో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు సిద్ధంకానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా.. వైజాగ్ వేదికగా నవంబరు 23న తొలి మ్యాచ్ జరుగనుండగా.. డిసెంబరు 3న హైదరాబాద్‌లో చివరి మ్యాచ్ నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేశారు. ఎన్నికల ఫలితాల హడావుడి కారణంగా బందోబస్తు ఇవ్వలేమని పోలీసులు తెలిపిన నేపథ్యంలో.. మ్యాచ్ వేదికను బెంగళూరుకు మార్చారు. బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. నవంబరు 23న వైజాగ్, నవంబరు 26న తిరువనంతపురం, నవంబరు 28న గువాహటి, డిసెంబరు 1న నాగ్‌పూర్. డిసెంబరు 3న హైదరాబాద్‌లో భారత్ -ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లకు బీసీసీఐ గతంలో షెడ్యూల్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 30న జరుగనుండగా.. ఫలితాలు డిసెంబరు 3న వెల్లడి కానున్నాయి. చదవండి: పాపం రూట్.. చెత్త షాట్‌కు తప్పదు భారీ మూల్యం! వీడియో వైరల్ -
ముగిసిన హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల పోలింగ్
-
అజారుద్దీన్‌పై మరో కేసు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది. అజహార్ నేతృత్వంలోని గత హెచ్‌సీఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) సీఈఓ సునీల్ కాంతే ఇవాళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజహార్ అండ్ టీమ్.. 2020-2023 మధ్యలో జిమ్ వస్తువుల కొనుగోలు, క్రికెట్ బాల్స్ కొనుగోలు, అగ్ని ప్రమాద సామాగ్రి కొనుగోలు, బకెట్ చైర్స్ కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడిందని సునీల్ కాంతే ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్ పోలీసులు అజార్ అండ్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. కాగా, కొద్ది రోజుల కిందట జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. దీంతో అజహార్ రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
CWC 2023: ఉప్పల్ స్టేడియం సిబ్బందిపై ప్రేమను చాటుకున్న పాక్ కెప్టెన్
శ్రీలంకపై చారిత్రక విజయంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ నగరానికి వీడ్కోలు పలికింది. ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు, రెగ్యులర్ మ్యాచ్‌ల కోసం గత రెండు వారాలుగా నగరంలో బస చేస్తున్న పాక్ జట్టు ఇక్కడి ఆతిథ్యానికి, ఇక్కడి ప్రజల అభిమానానికి, ప్రత్యేకించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్) సిబ్బంది సేవలకు ఫిదా అయ్యింది. ఓ రకంగా చెప్పాలంటే పాక్ క్రికెటర్లు ఇక్కడి వాతావరణంతో, ఇక్కడి ప్రజలతో మమేకమైపోయారు. వారికి హైదరాబాద్ నగరం స్వదేశానుభూతిని కలిగించింది. ఇక్కడి భాష, ఇక్కడి ఆచార వ్యవహారాలు, తిండి, ప్రత్యేకించి క్రికెట్ అభిమానుల ఆదరణ పాక్ క్రికెటర్లకు హోం టౌన్ ఫీలింగ్ కలిగించాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు (వార్మప్ మ్యాచ్‌లతో కలిపి) ఆడిన పాకిస్తాన్.. నిన్నటి మ్యాచ్ అనంతరం హైదరాబాద్‌ను వదిలి అహ్మదాబాద్‌కు పయనమైంది. అక్టోబర్ 14న పాక్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాతో తలపడాల్సి ఉంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయానంతరం పాక్ క్రికెటర్లు ఉప్పల్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్‌పై తమ ప్రేమను చాటుకున్నారు. గత రెండు వారాలుగా తమ బసను ఆహ్లాదకరంగా మార్చిన మైదాన సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. స్టేడియం సిబ్బంది యొక్క ఎనలేని సేవలను కొనియాడారు. మ్యాచ్ అనంతరం వారితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వారికి తన జెర్సీని బహుకరించి ప్రత్యేకంగా ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. Pakistan players saying "Thank you to the ground staff".- A beautiful gesture. pic.twitter.com/xIhwiYHeea— Johns. (@CricCrazyJohns) October 10, 2023 ఇదిలా ఉంటే, శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా పాక్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్‌ను మొహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (113) సూపర్ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సమరవిక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. -
WC 2023: పాక్ బౌలర్లను చితకబాదిన లంక బ్యాటర్లు.. ఫ్యాన్స్ సందడి
-
కివీస్ గెలుపు జోరు...
ప్రపంచకప్‌లో మరో ఏకపక్ష విజయం... గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సమష్టి ప్రదర్శన ముందు అసోసియేట్ టీమ్ నెదర్లాండ్స్ నిలవలేకపోయింది... బ్యాటింగ్ పిచ్‌పై ముందుగా భారీ స్కోరు నమోదు చేసిన న్యూజిలాండ్ విసిరిన సవాల్‌కు పసికూన నెదర్లాండ్స్ వద్ద జవాబు లేకపోయింది... ఫలితంగా కివీస్ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా... హైదరాబాద్ వేదికగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ డచ్ బృందానికి ఓటమే ఎదురైంది. బ్యాటింగ్‌లో విల్ యంగ్, లాథమ్, రచిన్ రవీంద్ర, బౌలింగ్‌లో సాన్‌ట్నర్ న్యూజిలాండ్ విజయసారథులుగా నిలిచారు. సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ జట్టు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మళ్లీ సత్తా చాటింది. విడిగా చూస్తే విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రతీ ఒక్కరూ రాణించడంతో క్వాలిఫయర్ జట్టు నెదర్లాండ్స్‌పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (80 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ లాథమ్ (46 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (51 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... డరైల్ మిచెల్ (47 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కొలిన్ అకెర్మన్ (73 బంతుల్లో 69; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ సాన్‌ట్నర్ (5/59) ఉప్పల్ స్టేడియంలో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సమష్టి బ్యాటింగ్‌తో... ఆశ్చర్యకర రీతిలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదిగా ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లూ ఒక్క పరుగు లేకుండా మెయిడిన్లుగా ముగియడం విశేషం. అయితే ఆ తర్వాత జట్టు ధాటిని పెంచింది. కాన్వే (40 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), యంగ్ చక్కటి బ్యాటింగ్‌తో తర్వాతి 7 ఓవర్లలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు రాబట్టారు. ఈ జోడీ విడిపోయిన తర్వాత వచ్చిన రచిన్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 59 బంతుల్లో యంగ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, రచిన్‌కు హాఫ్ సెంచరీ కోసం 50 బంతులే సరిపోయాయి. మరో ఎండ్‌లో మిచెల్ కూడా జోరు ప్రదర్శించాడు. కానీ ఈ దశలో డచ్ బౌలర్లు ప్రత్యర్థిని కొద్దిసేపు నిలువరించారు. 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. అయితే మరోవైపు లాథమ్ దూకుడు కివీస్ స్కోరును 300 వందలు దాటించింది. సాన్‌ట్నర్ (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో చివర్లో భారీ స్కోరు చేయడంలో న్యూజిలాండ్ సఫలమైంది. ఆఖరి 10 ఓవర్లలో 84 పరుగులు సాధించిన న్యూజిలాండ్ వీటిలో చివరి 3 ఓవర్లలోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు రాబట్టడం విశేషం. అకెర్మన్ మినహా... భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఏ దశలోనూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ వేగంగా సాగలేదు. పాక్‌తో మ్యాచ్‌తో పోలిస్తే జట్టు బ్యాటింగ్ ఈ సారి పేలవంగా కనిపించింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ (12), డౌడ్ (16) విఫలం కాగా, అకెర్మన్ ఒక్కడే పోరాడగలిగాడు. అకెర్మన్, తేజ నిడమనూరు (26 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మధ్య నమోదైన 50 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌లో పెద్దది. క్రీజ్‌లో నిలదొక్కుకొని చక్కటి షాట్లతో జోరుపెంచిన దశలో తేజ లేని రెండో పరుగు కోసం అనవసరంగా ప్రయత్నించాడు. అకెర్మన్తో సమన్వయ లోపంతో అతను రనౌటయ్యాడు. 55 బంతుల్లో అకెర్మన్ అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో స్కాట్ ఎడ్వర్డ్స్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), సైబ్రాండ్ (34 బంతుల్లో 29; 3 ఫోర్లు) కొంత వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. లక్ష్యానికి చాలా దూరంలో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) డి లీడ్ (బి) వాండర్ మెర్వ్ 32; యంగ్ (సి) డి లీడ్ (బి) మీకెరెన్ 70; రచిన్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాండర్ మెర్వ్ 51; మిచెల్ (బి) మీకెరెన్ 48; లాథమ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) దత్ 53; ఫిలిప్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 4; చాప్మన్ (సి) వాండర్ మెర్వ్ (బి) దత్ 5; సాన్‌ట్నర్ (నాటౌట్) 36; హెన్రీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–67, 2–144, 3–185, 4–238, 5–247, 6–254, 7–293. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–2–62–2, ర్యాన్ క్లీన్ 7–1–41–0, మీకెరెన్ 9–0–59–2, వాండర్ మెర్వ్ 9–0–56–2, అకెర్మన్ 4–0–28–0, డి లీడ్ 10–0–64–1, విక్రమ్‌జిత్ 1–0–9–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (బి) హెన్రీ 12; డౌడ్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 16; అకెర్మన్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 69; డి లీడ్ (సి) బౌల్ట్ (బి) రచిన్ 18; తేజ (రనౌట్) 21; ఎడ్వర్డ్స్ (సి అండ్ బి) సాన్‌ట్నర్ 30; సైబ్రాండ్ (సి) కాన్వే (బి) హెన్రీ 29; వాండర్‌మెర్వ్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 1; క్లీన్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 8; ఆర్యన్ దత్ (బి) హెన్రీ 11; మీకెరెన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–21, 2–43, 3–67, 4–117, 5–157, 6–174, 7–180, 8–198, 9–218, 10–223. బౌలింగ్: బౌల్ట్ 8–0–34–0, హెన్రీ 8.3–0–40–3, సాన్‌ట్నర్ 10–0–59–5, ఫెర్గూసన్ 8–0–32–0, రచిన్ రవీంద్ర 10–0–46–1, ఫిలిప్స్ 2–0–11–0. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి పాకిస్తాన్ X శ్రీలంక వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
PAK vs NED: ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానుల హంగామా (ఫొటోలు)
-
PAK vs NZ: ఉప్పల్ స్టేడియంలో పాక్, న్యూజిల్యాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
న్యూజిలాండ్- పాక్ వార్మప్ మ్యాచ్.. బీసీసీఐ కీలక ప్రకటన
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వార్మప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 29న న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించ కూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి మొత్తం డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. "ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్-పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. స్థానిక భద్రతా సంస్థల సలహా మేరకు ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌ను నిర్వహించనున్నాం. ఒకే రోజు రెండు పండగలు రావడంతో భద్రత విషయంలో ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి రిఫెండ్ చేస్తామని" బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు -
ప్రపంచకప్‌కు ఉప్పల్ స్టేడియం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం అన్ని విధాలా సిద్ధమైందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. హెచ్‌సీఏ పర్యవేక్షకుడు, ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ కె. దుర్గాప్రసాద్ వరల్డ్ కప్‌కు సంబంధించి ఏర్పాట్ల గురించి వెల్లడించారు. బీసీసీఐ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో స్టేడియంలో కొత్తగా అనేక అభివృద్ధి చేపట్టినట్లు ఆయన వివరించారు. ‘స్టేడియంలో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా చక్కటి అవుట్ ఫీల్డ్‌ను సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలను ఎంతో మెరుగుపర్చాం. వారి కోసం స్టేడియంలో మూడు వైపులా నార్త్, సౌత్, ఈస్ట్లలో కనోపీలను ఏర్పాటు చేశాం. సౌత్‌లో కొన్నాళ్ల క్రితం పాడైపోయిన కనోపీని పునరుద్ధరించాం. పాతవాటి స్థానంలో కొత్తగా ఫ్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశాం. ఎల్ఈడీ లైట్లు ఉండటం ఈసారి ప్రత్యేకత’ అని దుర్గా ప్రసాద్ చెప్పారు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా, 11 వేలు పాత సీట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఎలాంటి సమస్యా లేదని, వాటిని సమర్థంగా నిర్వహించగలమని విశ్వాసం వ్యక్తం చేసిన దుర్గాప్రసాద్... అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌లపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉన్నాయి. -
CWC 2023: పాకిస్తాన్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ
ఈనెల 29న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్‌కప్-2023 వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగనుంది. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు సెక్యూరిటీ ఇవ్వలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు (సెప్టెంబర్ 28) నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉండటంతో తగినంత భద్రత ఇవ్వలేమని నగర పోలీసులు హెచ్‌సీఏకు తెలిపారు. వీలైతే మ్యాచ్‌ను వాయిదా వేయాలని వారు హెచ్‌సీఏని కోరారు. అయితే, ఇదివరకే షెడ్యూల్‌ను ఓ సారి సవరించి ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్‌సీఏకు తేల్చి చెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాక్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఇదివరకే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ వరల్డ్‌కప్ టికెటింగ్ పార్డ్నర్ బుక్ మై షోకు సూచించింది. కాగా, వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు మొత్తం 10 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా సెప్టెంబర్ 29న 3 మ్యాచ్‌లు, సెప్టెంబర్ 30న 2, అక్టోబర్ 2న 2, అక్టోబర్ 3న 3 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ డే అండ్ మ్యాచ్‌లుగా సాగనున్నాయి. సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక (గౌహతి, మధ్యాహ్నం 2 గంటలకు) ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) అక్టోబర్ 2: బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) అక్టోబర్ 3: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గౌహతి) ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) -
హెచ్‌సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. అక్రమాలకు కేరాఫ్‌గా మారిన హెచ్‌సీఏ మరో వివాదంలో చిక్కుకుంది. మంగళవారం ఉప్పల్‌లో నిర్వహించిన అండర్-19 సెలక్షన్స్‌లో గందరగోళం చోటుచేసుకుంది. సెలక్షన్ ట్రయల్స్ కావడంతో తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరయ్యారు. అయితే మన రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రికెటర్లను హెచ్‌సీఏ వెనక్కి పంపించింది. ఈ నేపథ్యంలో పద్దతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించలేదని అక్కడికి వచ్చిన యువ క్రికెటర్లు ఆరోపించారు. అంతేకాదు ఒక యువ క్రికెటర్ దగ్గర హెచ్‌సీఏ డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. వన్‌డౌన్ ప్లేయర్‌గా అవకాశం ఇస్తామంటూ యువ క్రికెటర్ దగ్గర రూ. లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాధితుడు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. కాగా హెచ్‌సీఏ తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''హెచ్ సీయూ ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదు. ఈ సెలక్షన్ ఒక్కో జిల్లాకు ఒకరోజు ఇస్తే క్రికెటర్లు ఆ రోజు వచ్చేవారు. కానీ అందరూ ఒకటే రోజు రావడంతో ఉదయం 6 గంటలకు వచ్చిన పిల్లలు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు'' అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! ఏమో.. టీమిండియాపై అదే రిపీట్ చేస్తామేమో! స్టోక్స్ ఓవరాక్షన్ వద్దు! ఇక్కడికొచ్చాక.. -
ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం
బీసీసీఐపై హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనేది మీకు ఈ పాటికే అర్థమయి ఉండాలి. ఇవాళ(జూన్ 27న) ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023కి సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేసింది. పది ప్రధాన వేదికల్లో మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌కు కూడా చోటు దక్కింది. అయితే పేరుకు హైదరాబాద్ ఉన్నా పెద్దగా ఆసక్తి చూపించే మ్యాచ్‌లు మాత్రం లేవు. అందునా టీమిండియాకు సంబంధించి ఒక్క మ్యాచ్‌కు కూడా ఉప్పల్ స్టేడియం వేదికగా కాలేదు. కనీసం పెద్ద జట్ల మ్యాచ్ అయినా ఇస్తారేమో అని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పాకిస్తాన్ ఆడే రెండు మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఇక్కడ ఆడనున్నాయి. అయితే ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్‌లు క్వాలిఫయర్స్‌తోనే షెడ్యూల్ చేయడం అభిమానులకు కోపం తెప్పించింది. షెడ్యూల్ విడుదలైన నిమిషాల్లోనే హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందన్న మాట తెరమీదకు వస్తోంది. తెలుగు గడ్డపై బీసీసీఐ వివక్ష చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరల్డ్ కప్ 2023 టోర్నీకి 8 జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో రెండు జట్లు జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా అర్హత సాధించనున్నాయి. ఆ రెండు జట్ల మ్యాచులే ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా అక్టోబర్ 6న పాకిస్తాన్ - క్వాలిఫైయర్ 1జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. అక్టోబర్ 9న న్యూజిల్యాండ్- క్వాలిఫైయర్-1 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 12న పాకిస్తాన్ - క్వాలిఫైయర్-2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పేరుకే హైదరాబాద్.. ఇంతదానికి ఎందుకీ మ్యాచ్‌లు? జరిగేదే మూడు మ్యాచులు అంటే.. వాటిని టోర్నీ ప్రారంభమైన వారం రోజుల్లోనే ముగిసేలా షెడ్యూల్ చేశారు. పోనీ వీటిలో ఏమైనా చూడగలిగే మ్యాచ్ ఉందా? అంటే.. అదీ కనిపించడం లేదు. ఒకవేళ జింబాబ్వే కనుక క్వాలిఫైయర్-1 లేదా క్వాలిఫైయర్-2గా వస్తే.. పాకిస్తాన్‌తో వారి మ్యాచ్ చూడొచ్చు. అనంతరం పసికూన జట్టుతో తలపడనున్న కివీస్ మ్యాచ్‌పై ఎవరూ ఆసక్తి చూపకపోవచ్చు. ఇలాంటి మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించడం పట్ల తెలుగు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.''ఇంతదానికి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు పెట్టడం ఎందుకు''.. ''ఏదో ముష్టి పడేసినట్లు మూడు మ్యాచ్‌లు మా ముఖానా పడేశారు''.. ''హైదరాబాద్‌పై బీసీసీఐకి ఎందుకింత వివక్ష'' అంటూ కామెంట్స్ చేశారు. హెచ్‌సీఏలో అవినీతి హైదరాబాద్‌లో కీలక మ్యాచులు లేకపోవడానికి హెచ్‌సీఏ తీరు కూడా ఒక కారణమన్నది క్రికెట్ విశ్లేషకుల మాట. హెచ్‌సీఏలో అవినీతి పేరుకుపోయిందని.. ఆధిపత్య పోరు కోసం బోర్డు సభ్యులు రెండు వర్గాలుగా విడిపియి పట్టించుకోవడం లేదనే మాటలు వినపడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచుల సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలు, టికెట్ల కుంభకోణం వంటి విషయాలను అందుకు కారణాలుగా ప్రస్తావిస్తున్నారు. చదవండి: విస్తుపోయే నిజాలు.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణ -
World Cup: హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే.. పాకిస్తాన్‌వే రెండు మ్యాచ్‌లు
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్వి కావడం విశేషం. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్వాలిఫయర్-1తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-2 హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, జింబాబ్వే ప్రత్యర్ధులుగా ఉండే అవకాశం ఉంది. -
ఉప్పల్ స్టేడియంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
-
World Cup 2023: భారత మ్యాచ్ ‘భాగ్యం’ లేదు!
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చే పరిణామం...వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా ఖాయమై రూ. 117 కోట్లతో ఆధునీకరణకు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోందని, మెగా ఈవెంట్లో టీమిండియా మ్యాచ్‌ను వీక్షించవచ్చని భావించిన ఫ్యాన్స్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఆడే అవకాశం లేదని తేలింది. మ్యాచ్ వేదికలు, తేదీలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి బీసీసీఐ షెడ్యూల్ డ్రాఫ్ట్ సమర్పించింది. ఇందులో టీమిండియా లీగ్ దశలో ఆడే 9 మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్ పేరు లేదు. ఉప్పల్ స్టేడియాన్ని భారత మ్యాచ్ కోసం పరిగణలోకి తీసుకోలేదు. బోర్డు పంపిన జాబితాను వరల్డ్ కప్ ఆడే అన్ని జట్లకూ పంపించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఐసీసీ అధికారిక ప్రకటన చేస్తుంది. అయితే... సాధారణంగా ఆతిథ్య దేశం ఇచ్చిన డ్రాఫ్ట్‌లో మార్పులు లేకుండానే ఐసీసీ ఆమోదిస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకటన లాంఛనమే. భారత జట్టు ఆడకపోయినా... 2011 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగడమే అభిమానులకు కాస్త ఊరట. డ్రాఫ్ట్ ప్రకారం పాకిస్తాన్ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్‌లోనే... లక్షకు పైగా సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియం సహజంగానే వరల్డ్‌కప్‌కు ప్రధాన వేదిక కానుంది. 2019 వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే మ్యాచ్‌లో ఈ విశ్వ సమరం మొదలవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్లో లీగ్ దశకే పరిమితం కాగా... నవంబర్ 15, 16న జరిగే సెమీ ఫైనల్ వేదికల గురించి ఇంకా పేర్కొనలేదు. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి పోరుతో భారత్ వరల్డ్ కప్ వేట మొదలవుతుంది. నిజానికి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ఎప్పుడో ప్రకటించాల్సింది. అయితే భారత గడ్డపై తమ మ్యాచ్‌ల వేదికల విషయంలో పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలు, ఆసియా కప్‌లో తాము పాల్గొనే అంశంతో ముడిపెట్టడంతో ఇంత ఆలస్యమైంది. పాక్ విజ్ఞప్తిని బట్టి ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల విషయంలో బోర్డు కాస్త సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాకౌట్ దశకు వెళ్లి తప్పనిసరైతే తప్ప అహ్మదాబాద్‌లో ఆడమని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోనే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మినహా తమ 8 మ్యాచ్‌లలో పాకిస్తాన్ తాము సూచించిన నాలుగు వేదికలు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనే ఆడనుంది. భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను దాదాపు ఏడాది క్రితమే ఐసీసీ ప్రకటించింది. దీని ప్రకారం శ్రీలంక, బంగ్లాదేశ్ కాకుండా భారత్‌లో 8 వేదికల్లో 29 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ఖరారు చేసింది. అప్పట్లోనే అన్ని రకాలుగా సిద్ధమైన హైదరాబాద్ స్టేడియం 3 వన్డేలకు ఆతిథ్యమిచ్చింది కూడా. అయితే వరల్డ్ కప్ మైదానాల్లో మాత్రం ఉప్పల్‌కు చోటు దక్కలేదు. ‘టెస్టు హోదా ఉన్న స్టేడియాలను మాత్రం బోర్డు పరిశీలించింది’ అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారి ఒకరు దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు మ్యాచ్‌లు దక్కాయన్న ఆనందంలో అభిమానులు ఉండగా, ఇప్పుడు భారత్ మ్యాచ్ లేకపోవడం సహజంగానే నిరాశపర్చే అంశం. క్రికెట్ పట్ల చూపించిన ఆదరణను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియం ఎప్పుడూ నిరాశపర్చలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే కాదు...ఐపీఎల్ హోం టీమ్ సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన ఇచ్చినా సరే, స్టేడియంలో వారి ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా చూస్తే చక్కటి అవుట్‌ఫీల్డ్, ఫిర్యాదులు లేని పిచ్‌తో సహా సౌకర్యాలపరంగా చూస్తే ఇతర అన్ని స్టేడియాలతో పోలిస్తే మేలైన వసతులు ఉన్నాయి. అయితే ఇదంతా బోర్డు పట్టించుకున్నట్లుగా లేదు. వరల్డ్ కప్‌లో వేదికల ఖరారు గురించి గత నెలలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. కార్యదర్శి జై షా నేతృత్వంలో ఇది పని చేసింది. భారత మ్యాచ్‌లకు కేటాయించిన 9 వేదికలను చూస్తే వేర్వేరు కారణాలతో వీటిని ఖాయం చేసినట్లుగా అర్థమవుతుంది. భారత క్రికెట్లో మొదటినుంచి ‘ప్రధాన’ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వేదికల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. సహజంగానే పెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లో అన్నింటికంటే పెద్ద మ్యాచ్ (పాక్‌తో) నిర్వహించాలని బోర్డు భావించింది. మిగతా మూడు వేదికల విషయంలో బోర్డు అంతర్గత రాజకీయాలు పని చేశాయి. బోర్డు ఉపాధ్యక్షుడైన రాజీవ్ శుక్లా తన సొంత మైదానమైన లక్నోలో, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తమ అసోసియేషన్‌కు చెందిన ధర్మశాలలో మ్యాచ్‌లను తీసుకున్నారు. పుణేకు కూడా మ్యాచ్ కేటాయించుకోవడంలో మహారాష్ట్ర క్రికెట్ సంఘం గట్టిగా ప్రయత్నం చేసి సఫలమైంది. నిజానికి ముందుగా షార్ట్ లిస్ట్ చేసిన 12 వేదికల్లో పుణే పేరు లేదు. ఆ తర్వాత దానిని అదనంగా చేర్చడంలోనే పరిస్థితి అర్థమైంది. బహుశా ఈ మ్యాచ్ ఉప్పల్‌కు దక్కేదేమో. కానీ బోర్డులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎలాంటి ప్రాతినిధ్యమే లేదు. నిత్య కలహాలతోనే అసోసియేషనే లేకుండా మాజీ న్యాయమూర్తి చేతుల్లో ఉన్న వ్యవస్థ మ్యాచ్‌పై పట్టుబట్టే పరిస్థితిలో అసలే లేదు! -
కోహ్లి ఫిదా.. తెలుగోళ్ల అభిమానమే వేరప్పా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్హెచ్ ఓడినప్పటికి మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకులు మాత్రం బాధపడలేదు. కారణం ఆర్సీబీ గెలిచింది కాబట్టి. ఎలాగూ ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.. ఆర్సీబీకి మద్దతు ఇస్తే సరిపోతుంది అని ప్రతి అభిమాని భావించాడు. Photo: IPL Twitter ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఔట్ అయితే బాధపడాల్సింది పోయి సంతోషపడ్డారు. అలా అని ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేయలేదని కాదు.. ఎందుకంటే క్లాసెన్ సెంచరీ చేయగానే స్టేడియం హోరెత్తిపోయింది. ఇక ఇటు కోహ్లి సెంచరీ చేయగానే కోహ్లి నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. ఇక మ్యాచ్ ఆద్యంతం కోహ్లి నామస్మరణతో మార్మోగిపోయింది. అలా మన తెలుగు అభిమానులు అటు ఎస్ఆర్హెచ్.. ఇటు ఆర్సీబీకి బ్యాలెన్స్‌గా మద్దతిచ్చి అందరిని ఆకట్టుకున్నారు. Photo: IPL Twitter ఈ అభిమానమే కోహ్లిని ఫిదా చేసింది. అందుకే సెంచరీ చేయగానే స్టేడియంలో ఉన్న ప్రతీ స్టాండ్‌వైపు తన బ్యాట్‌ను చూపి తన అభిమానాన్ని చెప్పకనే చెప్పాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం సిబ్బందితొ కోహ్లి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Photo: IPL Twitter ఈ సందర్భంగా స్టేడియం సిబ్బందిపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ''ఆటలో 11 మంది ఎంత ముఖ్యమో.. 12వ ఆటగాడిగా సిబ్బంది అంతే కీలకపాత్ర పోషిస్తారు. మేము మ్యాచ్ ఆడడానికి ముందు సిబ్బంది పడే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు.. వాళ్లపై ఎల్లప్పుడు ప్రేమను చూపించాలి.. వాళ్లు మా దృష్టిలో 12th Man Army'' అంటూ పేర్కొన్నాడు. ఈ ఫోటోను ఆర్సీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. Photo: IPL Twitter King Kohli’s appreciation to the fine groundstaff of the Rajiv Gandhi International Stadium 🏟️ Show them some love, 12th Man Army 🫶 #PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #SRHvRCB pic.twitter.com/dEeT3IWwOZ — Royal Challengers Bangalore (@RCBTweets) May 19, 2023 Virat Kohli's classic sixes in the run-chase.pic.twitter.com/GXDFzfxJWH — Johns. (@CricCrazyJohns) May 19, 2023 చదవండి: #ViratKohli: అనుష్కకు వీడియోకాల్.. కోహ్లి ఎమోషనల్ -
IPL 2023: కోల్‌కతా ప్రతీకారం
సన్‌రైజర్స్ విజయానికి ఒకదశలో 30 బంతుల్లో 38 పరుగులే కావాలి... చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ మార్క్రమ్ కూడా అప్పుడే జోరు పెంచాడు... సొంత గడ్డపై గెలుపు ఖాయమనిపించింది. కానీ అంతా తలకిందులైంది. ఓటమి దిశగా వెళుతున్న కోల్‌కతా ఒక్కసారిగా పుంజుకుంది. పదునైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి చివరి వరకు ఆటను తీసుకొచ్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా 3 పరుగులే వచ్చాయి. దాంతో నైట్‌రైడర్స్ ఊపిరి పీల్చుకోగా, రైజర్స్ నిరాశలో మునిగింది. సాక్షి, హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్‌లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా 5 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు), క్లాసెన్ (20 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించినా ఫలితం దక్కలేదు. కీలక భాగస్వామ్యం... ఒక్కరూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడకపోయినా... కీలక ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో కోల్‌కతా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. మార్కో జాన్సెన్ తన తొలి ఓవర్లోనే గుర్బాజ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. జేసన్ రాయ్ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఈ దశలో కెప్టెన్ రాణా, రింకూ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 61 పరుగులు జోడించారు. కార్తీక్ త్యాగి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6తో రాణా దూకుడు ప్రదర్శించాడు. అయితే మార్క్రమ్ అద్భుత క్యాచ్‌కు రాణా వెనుదిరగ్గా... ఆండ్రీ రసెల్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇన్నింగ్స్ చివర్లో కూడా కేకేఆర్ ఆశించినన్ని పరుగులు చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు 42 పరుగులే సాధించింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో రైజర్స్ కూడా తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (18), అభిషేక్ శర్మ (9)లతో పాటు తక్కువ వ్యవధిలో రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (0) వికెట్లను జట్టు కోల్పోయింది. అయితే మార్క్రమ్, క్లాసెన్ భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చక్కటి షాట్లతో, సమన్వయంతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. తన తొలి ఫోర్ కొట్టేందుకు మార్క్రమ్ 23 బంతులు తీసుకున్నా... అనుకూల్ రాయ్ ఓవర్లో రెండు సిక్సర్లతో క్లాసెన్ దూకుడు ప్రదర్శించాడు. ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 70 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వెనుదిరిగాడు. అయితే మార్క్రమ్ క్రీజ్‌లో ఉన్నంత వరకు రైజర్స్ గెలుపుపై ధీమాగానే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో కెప్టెన్ వెనుదిరిగారు. తర్వాతి బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేయలేకపోయారు. సమద్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొంత పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) కార్తీక్ త్యాగి 20; గుర్బాజ్ (సి) బ్రూక్ (బి) జాన్సెన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 7; నితీశ్ రాణా (సి అండ్ బి) మార్క్రమ్ 42; రింకూ సింగ్ (సి) సమద్ (బి) నటరాజన్ 46; రసెల్ (సి) నటరాజన్ (బి) మార్కండే 24; నరైన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) భువనేశ్వర్ 1; శార్దుల్ ఠాకూర్ (సి) సమద్ (బి) నటరాజన్ 8; అనుకూల్ రాయ్ (నాటౌట్) 13; హర్షిత్ (రనౌట్) 0; వైభవ్ అరోరా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–8, 2–16, 3–35, 4–96, 5–127, 6–130, 7–151, 8–168, 9–168. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–0–24–2, కార్తీక్ త్యాగి 2–0–30–1, మార్క్రమ్ 3–0–24–1, నటరాజన్ 4–0–30–2, మార్కండే 4–0–29–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 9; మయాంక్ అగర్వాల్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 18; రాహుల్ త్రిపాఠి (సి) వైభవ్ అరోరా (బి) రసెల్ 20; మార్క్రమ్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ అరోరా 41; హ్యారీ బ్రూక్ (ఎల్బీ) (బి) అనుకూల్ రాయ్ 0; క్లాసెన్ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 36; సమద్ (సి) అనుకూల్ రాయ్ (బి) వరుణ్ చక్రవర్తి 21; జాన్సెన్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 1; భువనేశ్వర్ (నాటౌట్) 5; మార్కండే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–53, 4–54, 5–124, 6–145, 7–152, 8–165. బౌలింగ్: హర్షిత్ 4–0–27–1, వైభవ్ 3–0–32–2, శార్దుల్ 3–0– 23–2, రసెల్ 1–0–15–1, అనుకూల్ రాయ్ 3–0–26–1, నరైన్ 2–0–16–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–1. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
SRHvsKKR : ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
IPL2023: రైజర్స్ జోరుకు బ్రేక్....
వరుసగా రెండు విజయాలతో జోరు పెంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంతగడ్డపై అడ్డుకట్ట పడింది. కొంత పోరాటపటిమ కనబర్చినా చివరకు విజయం మాత్రం దక్కలేదు. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ‘హ్యాట్రిక్’ గెలుపుతో సత్తా చాటింది. కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ విజయంలో కీలకపాత్ర పోషించగా... ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో రైజర్స్ ఉప్పల్‌లో చతికిలపడింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (17 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48; 4 ఫోర్లు,1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (16 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సూర్యకుమార్ విఫలం... కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 28; 6 ఫోర్లు) ముంబై ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలు పెట్టాడు. సుందర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను ఈ క్రమంలో ఐపీఎల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, అదే ఓవర్లో వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో ముంబై 53 పరుగులు చేసింది. అనంతరం రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో ముంబై స్కోరు వేగం మందగించింది. జాన్సెన్ ఒకే ఓవర్లో కిషన్, సూర్యకుమార్ (7)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఈ రెండు క్యాచ్‌లను మార్క్రమ్ అద్భుతంగా అందుకున్నాడు. 14 ఓవర్లలో ముంబై 109 పరుగులు చేసింది. అయితే చివరి 6 ఓవర్లలో చెలరేగిన ఆ జట్టు 83 పరుగులు రాబట్టింది. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో వరుస బంతుల్లో గ్రీన్ 4, 4, 4, 6 తో చెలరేగడం విశేషం. ఈ క్రమంలో 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చినా, ఇతర బౌలర్లు విఫలమయ్యారు. తిలక్ జోరు... సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టు హైదరాబాద్‌పై తిలక్ వర్మ సత్తా చాటాడు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో ఉన్న 24 నిమిషాల్లో ఫటాఫట్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. జాన్సెన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను... మర్కండే, భువీ బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాదాడు. భువీ బౌలింగ్‌లో మరో షాట్‌కు ప్రయత్నించి కవర్స్‌లో చిక్కడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. సమష్టి వైఫల్యం... ఛేదనలో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో బ్రూక్ (9), రాహుల్ త్రిపాఠి (7)లను బెహ్రన్‌డార్ఫ్ తన వరుస ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్‌లో మయాంక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 6 ఓవర్లలో జట్టు స్కోరు 2 వికెట్లకు 42. మార్క్రమ్ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, అభిషేక్ (1) కూడా వెంటనే అవుటయ్యాడు. రైజర్స్ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్న దశలో చావ్లా వేసిన 14వ ఓవర్ ఆశలు రేపింది. ఈ ఓవర్లో క్లాసెన్ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. అయితే చివరి బంతికి అతను అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. తర్వాతి ఓవర్లో మయాంక్ వెనుదిరిగాక జట్టు ఓటమి లాంఛనమే అయింది. అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ వికెట్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగించగానే ముంబై సంబరాల్లో మునిగిపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 28; ఇషాన్ కిషన్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 38; గ్రీన్ (నాటౌట్) 64; సూర్యకుమార్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 7; తిలక్ (సి) మయాంక్ (బి) భువనేశ్వర్ 37; డేవిడ్ (రనౌట్) 16; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–41, 2–87, 3–95, 4–151, 5–192. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, జాన్సెన్ 4–0–43–2, సుందర్ 4–0–33–0, నటరాజన్ 4–0–50–1, మర్కండే 4–0–35–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (సి) సూర్యకుమార్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 9; మయాంక్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 48; త్రిపాఠి (సి) ఇషాన్ కిషన్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 7; మార్క్రమ్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 22; అభిషేక్ (సి) డేవిడ్ (బి) చావ్లా 1; క్లాసెన్ (సి) డేవిడ్ (బి) చావ్లా 36; సమద్ (రనౌట్) 9; జాన్సెన్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 13; సుందర్ (రనౌట్) 10; భువనేశ్వర్ (సి) రోహిత్ (బి) అర్జున్ 2; మర్కండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–11, 2–25, 3–71, 4–72, 5–127, 6–132, 7–149, 8–165, 9–174, 10–178. బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2.5–0–18–1, బెహ్రన్‌డార్ఫ్ 4–0–37–2, మెరిడిత్ 4–0–33–2, షోకీన్ 1–0–12–0, చావ్లా 4–0–43–2, గ్రీన్ 4–0–29–1. -
వన్డే వరల్డ్ కప్ కోసం ఉప్పల్ స్టేడియానికి 117 కోట్లు
-
నగరంలో ఐపీఎల్ ధమాకా..
-
ఉప్పల్ స్టేడియం వద్ద ప్రాక్టీస్ చేస్తున్న SRH టీం
-
హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్.. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. మంగళవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గుప్తా, మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వివరాలు Ðð ల్లడిస్తున్న రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ► 2,500 మంది పోలీసులు, 250 మందితో సెక్యూరిటీ వింగ్ , 403 మంది ట్రాఫిక్ సిబ్బంది, 1091 మంది లా అండ్ ఆర్డర్, నాలుగు ప్లాటూన్ల టీఎస్ఎస్పీ బృందాలు, ఆరు ప్లటూన్ల ఆర్మ్డ్ సిబ్బంది, రెండు ఆక్టోపస్ టీంలు, మౌంటెడ్ పోలీస్, వజ్రా తదితర సిబ్బందితో భారీ బందోబస్తు. ►అలాగే ఎస్బీ, సీసీఎస్, ఎస్ఓటీ, రెండు ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. స్టేడియం పరిసర ప్రాంతాలు, స్డేడియంలో, ప్రేక్షకులు కూర్చునే చోటు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో కలిసి మొత్తం 300 సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ టీవీలతో గస్తీ.. ►సీసీ టీవీల దృశ్యాలను ఎప్పటికప్పుడు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ రూం. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో నిరంతర గస్తీ. ►పేలుడు పదార్థాలను గుర్తించేలా ప్రత్యేక టీంల ఏర్పాటు. బ్లాక్ టికెట్లను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్‌లకు పాల్పడుతున్నవారిపై ఇప్పటికే 4 కేసులు బుక్ చేశాం. చదవండి: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి ఎక్కడ మహిళలుంటే అక్కడ షీ టీం ►ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి వచ్చే మహిళల భద్రతకు ప్రాధాన్యం. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ షీటీంలు అందుబాటులో ఉంటాయి. వీఐపీలకే గేట్ నంబర్ వన్.. ఈసారి గేట్ నంబర్ వన్ను వీఐపీలకే అనుమతి ఉంటుంది. 12 నంబర్ గేట్‌ను గేట్ 1ఏగా గుర్తించి.. దాని ద్వారా జనరల్ పబ్లిక్‌ను అనుమతి ఇవ్వనున్నాం. భారీ వాహనాల దారి మళ్లింపు ►బుధవారం ఉదయం నుంచే ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు, సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలను దారి మళ్లిస్తాం. ►వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను చెంగిచెర్ల, మల్లాపూర్‌ల మీదుగా దారి మళ్లిస్తాం. సెల్ఫోన్లకు మాత్రమే అనుమతి ప్రేక్షకులు కేవలం సెల్ఫోన్లు తప్ప మరే ఇతర వస్తువులను స్టేడియంలోకి అనుమతి ఉండదు. ►తాగునీరు, తినుబండారాల విక్రయం ►తిను బండారాలు, తాగునీరు.. అన్ని రకాల ఆహార పదార్థాలను హెచ్‌సీఏ ద్వారా స్టేడియంలో విక్రయిస్తారు. ►సూచించిన రేట్లకే స్టాల్స్ నిర్వాహకులు వీటిని విక్రయించాలి. లేనిపక్షంలో పోలీసులు చర్యలు తీసుకుంటారు. సూచించిన స్థలాల్లోనే పార్కింగ్.. ►హబ్సిగూడ చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు, రామంతాపూర్ విశాల్ మార్ట్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు రోడ్డుకిరువైపులా ఎలాంటి వాహనాలను పార్క్ చేయొద్దు. ►కేటాయించిన స్థలాల్లోనే పార్కు చేయాల్సి ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చినవారు టీఎస్ఐఐసీ స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలి. ఏ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో సూచించే బోర్డులను ఏర్పాటు చేశాం. -
హైదరాబాద్ లో క్రికెట్ సందడి
-
హైదరాబాద్‌లో కివీస్‌తో మ్యాచ్.. ఆ కిక్కే వేరు.. టీమిండియాదే పైచేయి! ఈసారి..
India vs New Zealand, 1st ODI - Hyderabad- Head To Head Records: అనగనగా భారత్, కివీస్... క్రికెట్లో ఈ రెండు జట్లు తలపడితే ఆ మజానే వేరు. అదీ భాగ్యనగరంలో అయితే మరింత కిక్కే కిక్కు.... వీటి మధ్య ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. అన్నింటా భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఈ రెండు జట్ల నడుమ జరిగిన పోటీల్లో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో చిరస్మరణీయమైన గుర్తులకు హైదరాబాద్ వేదిక అయింది. పాలిఉమ్రిగర్ నుంచి మొదలుకుంటే విజయ్ మంజ్రేకర్, ఎరాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, ఆబిద్ అలీ, అజహరుద్దీన్, కపిల్ దేవ్, శ్రీకాంత్, అర్షద్ అయూబ్ , నరేంద్ర హిర్వాణీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ,కోహ్లి , పుజారా, అశ్విన్... రిచర్డ్ హ్యాడ్లీ, మార్క్ గ్రేట్ బ్యాచ్, జాన్‌రైట్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియఅమ్సన్.. ఇలా ఎందరో టాప్‌మోస్ట్ ఆటగాళ్లు తమ ఆటతో హైదరాబాద్ ప్రేక్షకులను హుషారెత్తించారు. ఇక నేడు జరగబోయే మ్యాచ్ సైతం భాగ్యనగర ప్రేక్షకులను అలరించనుంది. స్టార్ ప్లేయర్లతో ఇండియా, కివీస్ జట్లు బరిలో దిగనున్నాయి. హైదరాబాదీస్.. లెట్స్ ఎంజాయ్ స్టేడియంలో భారత ఆటగాళ్లు సాక్షి క్రీడా విభాగం: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భాగ్యనగరంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 1955లో తొలిపోరు జరిగింది. చివరిసారి ఈ రెండు జట్లు 2012లో ఇక్కడ తలపడ్డాయి. 1955 నుంచి 2012 మధ్య కాలంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో (ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం) ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. ఐదు టెస్టుల్లో భారత్ రెండు టెస్టుల్లో గెలిచి, మిగతా మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ఇక రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది. తద్వారా హైదరాబాద్ గడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ ఇప్పటి వరకు ఓటమి రుచి చూడలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు భాగ్యనగరంలో ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. 2012 తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ కోసం అడుగుపెట్టిన న్యూజిలాండ్ నేడు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌తో తొలి వన్డే ఆడనుంది. గతంలో ఎల్బీ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన న్యూజిలాండ్ ఉప్పల్ స్టేడియంలో తొలిసారి వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ టిమ్ సౌతీ లేకుండానే భారత్‌తో వన్డే సిరీస్‌లో పోటీపడుతున్న న్యూజిలాండ్ తాత్కాలిక కెపె్టన్ టామ్ లాథమ్ సారథ్యంలో ఈసారైనా తమ రికార్డును మెరుగుపర్చుకుంటుందా లేక భారత్‌కు దాసోహమంటుందా అనే విషయం నేడు తేలిపోతుంది. పిచ్‌ను పరిశీలిస్తున్న రోహిత్, అజహర్ ఇప్పటి వరకు హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలా.. ►ఎప్పుడు: 1955, నవంబర్ 19– 24 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 498/4 డిక్లేర్డ్ (పాలీ ఉమ్రిగర్ 223, విజయ్ మంజ్రేకర్ 118, కృపాల్ సింగ్ 100 నాటౌట్); న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 326 ఆలౌట్ (జాన్ గయ్ 102, సుభాష్ గుప్తే 7/128); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 212/2 (బెట్ సట్‌క్లిఫ్ 137 నాటౌట్). ► ఎప్పుడు: 1969, అక్టోబర్ 15–20 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 181 ఆలౌట్ (బ్రూస్ ముర్రే 81, ఎరాపల్లి ప్రసన్న 5/51), భారత్ తొలి ఇన్నింగ్స్: 89 ఆలౌట్ (వెంకట్రాఘవన్ 25 నాటౌట్, బిషన్ సింగ్ బేడీ 20, డేల్ హ్యాడ్లీ 4/30, బాబ్ కునిస్ 3/12), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 175/8 డిక్లేర్డ్ (డౌలింగ్ 60, సయ్యద్ ఆబిద్ అలీ 3/47, ప్రసన్న 3/58), భారత్ రెండో ఇన్నింగ్స్: 76/7 (భారత విజయ లక్ష్యం 268). ►ఎప్పుడు: 1988, డిసెంబర్ 2–6 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ 10 వికెట్లతో విజయం సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 254 ఆలౌట్ (మార్క్గ్రేట్బ్యాచ్ 90 నాటౌట్, ఇయాన్ స్మిత్ 79, అర్షద్ అయూబ్ 4/55, సంజీవ్ శర్మ 3/37), భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ (కృష్ణమాచారి శ్రీకాంత్ 69, అజహరుద్దీన్ 81, కపిల్ దేవ్ 40, మార్టిన్ స్నెడెన్ 4/69), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 124 ఆలౌట్ (జాన్ రైట్ 62, రిచర్డ్ హ్యాడ్లీ 31, కపిల్ దేవ్ 3/21, అర్షద్ అయూబ్ 3/36, నరేంద్ర హిర్వాణీ 3/43), భారత్ రెండో ఇన్నింగ్స్: 22/0 (భారత విజయ లక్ష్యం 21). న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రాక్టీస్ ►ఎప్పుడు: 2010, నవంబర్ 12–16 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 350 ఆలౌట్ (టిమ్ మెకింటోష్ 102, మార్టిన్ గప్టిల్ 85, జెస్సీ రైడర్ 70, జహీర్ ఖాన్ 4/69, హర్భజన్ సింగ్ 4/76), భారత్ తొలి ఇన్నింగ్స్: 472 ఆలౌట్ (వీరేంద్ర సెహ్వాగ్ 96, గౌతమ్ గంభీర్ 54, వీవీఎస్ లక్ష్మణ్ 74, హర్భజన్ సింగ్ 111 నాటౌట్, డానియల్ వెటోరి 5/135), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 448/8 డిక్లేర్డ్ (బ్రెండన్ మెకల్లమ్ 225, కేన్ విలియమ్సన్ 69, శ్రీశాంత్ 3/121, సురేశ్ రైనా 2/38), భారత్ రెండో ఇన్నింగ్స్: 68/0 (భారత విజయ లక్ష్యం 327). ►ఎప్పుడు: 2012, ఆగస్టు 23–26 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్ (చతేశ్వర్ పుజారా 159, విరాట్ కోహ్లి 58, ఎమ్మెస్ ధోని 73, జీతన్ పటేల్ 4/100), న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్ (జేమ్స్ ఫ్రాంక్లిన్ 43 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ 6/31, ప్రజ్ఞాన్ ఓజా 3/44), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 164 ఆలౌట్ (కేన్ విలియమ్సన్ 52, రవిచంద్రన్ అశ్విన్ 6/54, ప్రజ్ఞాన్ ఓజా 3/48). మరుపురాని వన్డే మ్యాచ్ ఎప్పుడు: 1999, నవంబర్ 8 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 174 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 376/2 (50 ఓవర్లలో) (సచిన్ టెండూల్కర్ 186 నాటౌట్, రాహుల్ ద్రవిడ్ 153), న్యూజిలాండ్: 202 ఆలౌట్ (33.1 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 43, వెంకటేశ్ ప్రసాద్ 2/38, అనిల్ కుంబ్లే 2/39). సచిన్, సెహ్వాగ్‌ల వీర విహారం ఎప్పుడు: 2003, నవంబర్ 15 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 145 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 353/5 (50 ఓవర్లలో) (వీరేంద్ర సెహ్వాగ్ 130, సచిన్ టెండూల్కర్ 102, రాహుల్ ద్రవిడ్ 50 నాటౌట్), న్యూజిలాండ్: 208 ఆలౌట్ (47 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 54, జహీర్ ఖాన్ 3/30, అజిత్ అగార్కర్ 2/28, అనిల్ కుంబ్లే 2/36, మురళీ కార్తీక్ 2/38). ఉప్పల్‌లో భారత్ ఇలా.. 2005 నుంచి 2022 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు వివిధ జట్లతో అన్ని ఫార్మాట్లలో కలిపి 13 మ్యాచ్‌లు (6 వన్డేలు, 5 టెస్టులు, 3 టి20) ఆడింది. 9 మ్యాచ్‌ల్లో (4 టెస్టులు, 3 వన్డేలు, 2 టి20) గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో (వన్డేలు) ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’ (టెస్ట్) అయింది. -
టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
బుధవారం హైదరాబాద్ వేదికగా భారత్‌తో తొలి వన్డేలో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. సోధి ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో ఆఖరి వన్డేలో గాయపడిన సోధి ఇంకా పూర్తిగా కోలకోలేదని న్యూజిలాండ్ స్టాండింగ్ కెప్టెన్ టామ్ లాథమ్ సృష్టం చేశాడు. " దురదృష్టవశాత్తూ సోధి తొలి వన్డే జట్టు ఎంపికకు అందుబాటులో ఉండడు. తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అయితే చివరి రెండు మ్యాచ్‌లకు జట్టు సెలక్షన్‌కు సోధి అందుబాటులో ఆశిస్తున్నాను" అని మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాథమ్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌కు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వెటరన్ ఆటగాడు టిమ్ సౌథీ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఆ జట్టు పేసర్లు మాట్ హెన్రీ, జామిసన్ గాయం కారణంగా భారత పర్యటన మొత్తానికి దూరమయ్యారు. న్యూజిలాండ్ తుది జట్టు(అంచనా): లాథమ్ (కెప్టెన్), అలెన్, హెన్రీ నికోల్స్, కాన్వే, చాప్మన్, మిచెల్, ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, డౌగ్ బ్రేస్‌వెల్. చదవండి: Rohit Sharma: 'సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్.. వరల్డ్‌కప్‌కు బలమైన జట్టే లక్ష్యంగా' -
తొలి వన్డేకు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం
-
హెచ్‌సీఏలో మరోసారి బయటపడ్డ విభేదాలు.. అజహర్‌పై తీవ్రస్థాయి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో (హెచ్‌సీఏ) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్‌పై జనరల్ సెక్రెటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (జనవరి 18) వన్డే మ్యాచ్ జరుగనుండగా.. జనరల్ సెక్రెటరీని అయిన నన్ను సంప్రదించకుండా అజహర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజహర్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దళితుడినని అజహర్ తనను చిన్న చూపు చూస్తున్నాడని, బెదిరించి చెక్కులపై సైన్ చేయించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హెచ్‌సీఏలో నియంతలా వ్యవహరిస్తున్న అజహర్.. రేపు జరిగే వన్డే మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టించాడని, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్ చేశాడని ఆరోపించాడు. తనతో పాటు తన ప్యానెల్ మొత్తాన్ని అజహర్ పక్కకు పెట్టాడని, ఎవరి ప్రమేయం లేకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని అన్నాడు. -
భారత్- న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ : హైదరాబాద్ లో బ్లాక్ టిక్కెట్ల దందా
-
హైదరాబాద్‌లో వన్డే సందడి.. పూర్తిగా అమ్ముడుపోయిన టికెట్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలలలోపే భాగ్యనగర క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ వచ్చేసింది. భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం ఉప్పల్‌లో జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. నాలుగు రోజుల పాటు ‘ఆన్లైన్’లో టికెట్లు అందుబాటులో ఉంచగా, పూర్తిగా అమ్ముడుపోవడంతో స్టేడియం ‘హౌస్‌ఫుల్’ కావడం ఖాయమైంది. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి టికెట్లను ‘ఆన్లైన్’కే పరిమితం చేయడంతో టికెట్ల అమ్మకం విషయంలో ఎలాంటి గందరగోళం, రచ్చ జరగలేదు. పాకిస్తాన్ పర్యటన నుంచి శనివారమే నేరుగా హైదరాబాద్ వచ్చిన కివీస్ జట్టు రెండు రోజులుగా ప్రాక్టీస్ చేస్తుండగా... లంకతో మూడో వన్డే తర్వాత సోమవారం సాయంత్రం టీమిండియా నగరానికి చేరుకుంది. మంగళవారం ఇరు జట్లు పూర్తి స్థాయిలో సాధన చేస్తాయి. గతంలో ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య 2 టెస్టులు జరగ్గా... కివీస్ జట్టు వన్డే ఆడనుండటం ఇదే మొదటిసారి కానుంది. సిరాజ్ తొలిసారి... సొంతగడ్డపై హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి భారత్ తరఫున మ్యాచ్ ఆడనున్నాడు. గతంలో ఐపీఎల్లో ఆడినా... అతని 42 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్లో హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌తో భారత జట్టులో కీలకంగా ఎదిగిన దశలో ఉప్పల్ మైదానంలో తన ఆటతో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకతో సిరీస్‌లో కేవలం 10.22 సగటుతో 9 వికెట్లు తీసిన సిరాజ్‌పై ‘అరుదైన ప్రతిభగలవాడు’ అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. చదవండి: IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్ -
Ind Vs NZ: ఉప్పల్ మ్యాచ్.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు
India Vs New Zealand- 1st ODI- Tickets Details- సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 22, 2022... భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టి20 మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసేందుకు సికింద్రాబాద్ జింఖానా మైదానానికి వచ్చిన అభిమానులు... సరైన ఏర్పాట్లు లేక తోపులాట... పోలీసుల రంగప్రవేశం... ఏడుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు... ఈ ఘటనను క్రికెట్ అభిమానులు ఎవరూ మరచిపోలేరు. గతానుభవం నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పాఠం నేర్చుకుంది. ఫ్యాన్స్ అడిగారంటూ గత మ్యాచ్ సమయంలో ‘ఆఫ్‌లైన్’లో కౌంటర్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్ల అమ్మకాలు ప్రారంభించి తీవ్ర రచ్చకు కారణమైన హెచ్‌సీఏ ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా టికెట్ల అమ్మకంపై ముందే స్పష్టతనిచ్చేసింది. ‘ఆన్లైన్’ ద్వారానే ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన మొత్తం టికెట్లన్నీ ‘ఆన్లైన్’ ద్వారానే అమ్ముతామని... ‘పేటీఎం’ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ వెల్లడించారు. హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్, పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వంకా ప్రతాప్‌తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. 2019 మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా తలపడిన తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్ ఇదే. కలెక్షన్ పాయింట్ల వద్ద కూడా ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అజహర్ చెప్పారు. టికెట్ల అమ్మకాల వివరాలు మ్యాచ్ తేదీ: జనవరి 18, మధ్యాహ్నం గం.1:30 నుంచి అందుబాటులో ఉన్న టికెట్లు: 29,417 టికెట్ల ధరలు (కార్పొరేట్ బాక్స్ టికెట్ సహా): రూ. 850, రూ.1000, రూ. 1250, రూ. 1500, రూ. 2,500, రూ. 5,000, రూ.7,500, రూ.9,000, రూ.10,000, రూ. 17,700, రూ. 20,650. అమ్మకాల తేదీలు: జనవరి 13, 14, 15, 16 (ప్రతి రోజూ సా. 5 గంటల నుంచి)... తొలి రోజు 6 వేలు, రెండో రోజు 7 వేలు, మూడో రోజు 7 వేలు, నాలుగో రోజు మిగిలిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎక్కడ: ‘పేటీఎం’ వెబ్సైట్లో : ఒక్కొక్కరు గరిష్టంగా 4 టికెట్లే కొనవచ్చు ఫిజికల్ టికెట్ కోసం.. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే దానిని మార్చుకునే ‘కలెక్షన్ పాయింట్’ను ఎంచుకోవాలి. క్యూఆర్ కోడ్ చూపిస్తే అక్కడ ‘ఫిజికల్ టికెట్’ ఇస్తారు. ఇది ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తారు. మార్చుకునే సమయంలో ఏదైనా గుర్తింపు పత్రం (ఐడీ కార్డు) తప్పనిసరి. కలెక్షన్ పాయింట్లు ఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి స్టేడియం–గచ్చిబౌలి (జనవరి 15 నుంచి ఉదయం. గం. 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య) చదవండి: PAK VS NZ 2nd ODI: కాన్వే సూపర్ సెంచరీ.. పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్ -
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ వన్డే.. టికెట్ల విక్రయం ఎప్పుడు, ఎలా అంటే..?
IND VS NZ 1st ODI: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిశాక, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కివీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 18న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే, 21న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. అనంతరం జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి, టీ20లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం, మ్యాచ్‌కు ముందు షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో (పేటీయం) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్లో టికెట్లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39,112 అయితే, 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు. -
Ranji Trophy: 28 బంతుల్లోనే 78 పరుగులు సహా.. 8 వికెట్లు కూల్చి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Assam: రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో తొలి విజయం సాధించాలన్న హైదరాబాద్ ఆశలపై అస్సాం నీళ్లు చల్లింది. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 18 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అజేయ సెంచరీ వృథాగా పోయింది. రాణించిన బౌలర్లు! కాగా ఎలైట్ బీ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అస్సాం జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో మంగళవారం టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రవితేజ(4/53), కార్తికేయ(3/43)కు తోడుగా అజయ్ దేవ్ గౌడ్, త్యాగరాజన్, భగత్ వర్మ ఒక్కో వికెట్‌తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో అస్సాంను 205 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 60, తొమ్మిదో స్థానంలో వచ్చిన భగత్ వర్మ 46 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 208 పరుగుల వద్ద ముగించగలిగింది. తన్మయ్ ఒంటరి పోరాటం వృథా ఇక రెండో ఇన్నింగ్స్‌లో అస్సాం 252 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 61 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. ఈ క్రమంలో విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచిన హైదరాబాద్.. శుక్రవారం కార్తికేయ అవుట్ కావడంతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో జట్టును గెలిపించాలని తాపత్రయపడ్డ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (158 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 126 పరుగులు- నాటౌట్) ఒంటరి పోరాటం వృథాగా పోయింది. అదరగొట్టిన రియాన్ పరాగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 88 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేయడం విశేషం. అంతేకాదు రియాన్.. ఏకంగా 8 వికెట్లు కూల్చడం గమనార్హం. కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అస్సాం గెలుపొందడంలో తన వంతు సాయం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రియాన్ ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌లో సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: Rishabh Pant Health: ప్లాస్టిక్ సర్జరీ?! పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే.. Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. -
Ranji Trophy: హైదరాబాద్ బతికిపోయింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తమిళనాడు విజయలక్ష్యం 144 పరుగులు...అదీ 11 ఓవర్లలో...అంటే ఓవర్‌కు 13కు పైగా పరుగులు...సాధారణంగానైతే రంజీ ట్రోఫీలో ఇలాంటి స్థితిలో కష్టసాధ్యమైన లక్ష్యం కాబట్టి ఇరు జట్ల కెప్టెన్లు ‘షేక్‌హ్యాండ్’తో ‘డ్రా’కు సిద్ధమవడం సహజం. కానీ తమిళనాడు భిన్నంగా ఆలోచించింది. టి20 తరహాలో ఛేదనకు సిద్ధమై అంతకంటే వేగంగా పరుగులు సాధించింది. 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 108 పరుగులు (ఓవర్‌కు 15.42 పరుగుల చొప్పున) చేసింది. ఎన్.జగదీశన్ (22 బంతుల్లో 59 నాటౌట్; 8 సిక్సర్లు), సాయి సుదర్శన్ (20 బంతుల్లో 42; 5 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు. ఉప్పల్ స్టేడియంలో సిక్సర్లతో పండగ చేసుకున్నారు. 24 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన ఈ దశలో ఖాయంగా తమిళనాడు గెలుస్తుందనిపించింది. అయితే హైదరాబాద్‌కు అదృష్టం కలిసొచ్చింది. వెలుతురు తగ్గిందంటూ ‘రీడింగ్’ చూసి అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. దాంతో మ్యాచ్ డ్రా కాగా, తమిళనాడు బ్యాటర్లు నిరాశగా వెనుదిరిగారు. వెలుతురులేని తమకు అనుకూలంగా మారుతుందని ఊహించిన హైదరాబాద్ ‘వ్యూహాత్మకంగానే’ చివర్లో సమయం వృథా చేసింది. ఫీల్డర్లందరూ బౌండరీ వద్ద చేరగా, లాంగాఫ్నుంచి కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ బంతి బంతికీ బౌలర్ వద్దకు వచ్చి సూచనలు ఇస్తూ పోయాడు. ఒక దశలో సిక్సర్‌గా మారిన బంతిని వెనక్కి ఇవ్వడంలో హైదరాబాద్ ఫీల్డర్లు బాగా ఆలస్యం చేస్తుండటంతో తమిళనాడు ఆటగాళ్లే స్టాండ్స్‌లోకి వెళ్లిపోయి బంతులు అందించారు. కానీ చివరకు ఫలితం మాత్రం రాలేదు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కో రు 28/0తో ఆట కొనసాగించిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. -
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో సూపర్ మ్యాచ్
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు రానుంది. హోం సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జనవరి 18న ఉప్పల్ వేదికగా జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. కాగా చివరగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ ఆఖరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చారు. అయితే మరోసారి హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండడంతో అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇక న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంక భారత పర్యటన: జనవరి 3- జనవరి 15 టీ20 సిరీస్‌తో ఆరంభం- వన్డే సిరీస్‌తో ముగింపు న్యూజిలాండ్ భారత పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1 వన్డే సిరీస్‌తో మొదలు- టీ20 సిరీస్‌తో ముగింపు ఆస్ట్రేలియా భారత పర్యటన: ఫిబ్రవరి 13- మార్చి 22 టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు -
ఉప్పల్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ..!
-
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో కీలక మ్యాచ్!
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్టులు ఆడనున్నాయి. ఇందులో ఒకటి పింక్ బాల్ టెస్టుగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఈ సిరీస్‌కు ఇంకా బీసీసీఐ వేదికలను ఖారారు చేయలేదు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం అతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా రెండో టెస్టు ఢిల్లీ, మూడో టెస్టుకు ధర్మశాల, ఆఖరి టెస్టుకు ఆహ్మదాబాద్ వేదికలుగా నిర్ణయించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఏడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ ఆఖరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలివచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ముహార్తం ఫిక్స్! ఎప్పుడంటే? -
ఇండియా-ఆసీస్ మ్యాచ్‌లో లైగర్.. సందడి చేసిన బాలీవుడ్ హీరో
భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీనటులు కూడా మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో బాలీవుడ్, టాలీవుడ్ నటులు సందడి చేశారు. సోనూ సూద్‌తో కలిసి విజయ్ దేవరకొండ మ్యాచ్‌ను తిలకించారు. విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా ఉప్పల్ మ్యాచ్‌ను వీక్షించారు. వీరంతా టీమిండియాను సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన విజయ్ దేవరకొండ మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూాడ నటుడే. టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. టీమిండియా మ్యాచ్ చూస్తున్న వీడియో క్లిప్‌ను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆగస్టులో దుబాయ్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన 2022 ఆసియా కప్ మ్యాచ్‌లోనూ విజయ్ దేవరకొండ సందడి చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. THE #VijayDeverakonda Cheering & Clapping Along With @ananddeverkonda & @SonuSood Team INDIA 🇮🇳 ❤️🔥🤙@TheDeverakonda #INDvAUS pic.twitter.com/twUN8iI3Ug — Vijay Deverakonda Online Fans (@VDRowdiesOnline) September 25, 2022 -
Hyderabad: ఉప్పల్ స్టేడియానికి క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్
-
అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం.. సామర్థ్యానికి మించి లోపలికి
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆదివారం అభిమానులతో కిక్కిరిసింది. భారత్– ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ–20 మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఉప్పెనలా తరలివచ్చారు. మూడేళ్ల తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మైదానానికి క్రికెటర్లు రాకముందే దాదాపుగా రెండు గంటల ముందు నుంచి వారిని చూసేందుకు అభిమానులు ఉప్పల్‌కు బారులుదీరారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు భిన్న విభిన్న వేషధారణలతో ఉప్పల్‌కు తరలివచ్చారు.క్రికెటర్ల పేర్లతో ఉన్న టీ షర్టులను గ్రౌండ్ బయట విక్రయిస్తుండటంతో వాటిని కొనేందుకు యువత ఎగబడ్డారు. గ్రౌండ్లో నుంచి వచ్చే శబ్దాలతో బయట ఉన్న అభిమానులు సైతం ఎంజాయ్ చేశారు. వీఐపీ బాక్స్‌లోకి ప్రజాప్రతినిధులు? ఉప్పల్ క్రికెట్ స్టేడియం టికెట్ల విషయంలో అంతా పారదర్శకమని చెబుతున్న హెచ్‌సీఏ అధికార పార్టీ నేతలను అందలమెక్కించుకుంది. ఎమ్మెల్యే స్థాయి నేతలతో కలిసి వచ్చిన, కార్పొరేటర్లు, కార్యకర్తలు, నేరుగా వీఐపీ బాక్స్‌లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. దీంతో టికెట్లు కొనుక్కున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు లోపలికి వెళ్లినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
Ind Vs Aus: ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత!
Ind vs Aus 3rd T20 Hyderabad Virat Kohli- Rahul Dravid: ఆస్ట్రేలియాతో మూడో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం ఆసీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ద్రవిడ్‌ను అధిగమించి.. ఈ క్రమంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండుల్కర్((34357 పరుగులు) తర్వాత అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. కాగా ద్రవిడ్ తన ఇంటర్నేషనల్ కెరీర్లో మొత్తంగా 24064 పరుగులు సాధించాడు. ఇక ఆదివారం నాటి ఇన్నింగ్స్‌తో రన్‌మెషీన్ కోహ్లి 24,078 పరుగుల మైలురాయిని చేరుకుని ద్రవిడ్‌ను అధిగమించాడు. కాగా భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్, కోహ్లి, ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని టాప్-5లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున అత్యధిక పరుగుల వీరులు(ఆల్‌టైం) 1. సచిన్ టెండుల్కర్- 664 మ్యాచ్‌లలో 34,357 పరుగులు 2. విరాట్ కోహ్లి- 471 మ్యాచ్‌లలో 24,078(ఇప్పటివరకు) 3. రాహుల్ ద్రవిడ్- 404 మ్యాచ్‌లలో 24,064 పరుగులు 4. సౌరవ్ గంగూలీ- 421 మ్యాచ్‌లలో 18,433 పరుగులు 5. మహేంద్ర సింగ్ ధోని- 538 మ్యాచ్‌లలో 17,092 పరుగులు చదవండి: Pak Vs Eng 4th T20: పాక్ వర్సెస్ ఇంగ్లండ్.. ఉత్కంఠ పోరు.. ఆఖరికి మూడు పరుగుల తేడాతో! Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్ ఆలింగనం.. వీడియో వైరల్ -
Ind Vs Aus 3rd T20: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్ ఆలింగనం.. వీడియో వైరల్
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad- Virat Kohli: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలోనూ ఆకట్టుకోలేకపోయాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. మొహాలీ మ్యాచ్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన ఈ వన్‌డౌన్ బ్యాటర్.. నాగ్‌పూర్‌లో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, తనకు కలిసి వచ్చిన ఉప్పల్ స్టేడియంలో మాత్రం అదరగొట్టాడు ఈ రన్‌మెషీన్. పాత కోహ్లిని గుర్తుచేస్తూ.. చివరిసారి ఉప్పల్‌లో ఆడిన మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొని 94 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి.. మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్‌తో మూడో టీ20లో 48 బంతుల్లో 63 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్(69 పరుగులు)తో కలిసి జట్టును గెలిపించాడు. ఇక ఆఖరి వరకు పట్టుదలగా నిలబడ్డ కోహ్లి.. చివరి ఓవర్ రెండో బంతికి డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో క్రీజును వీడిన కోహ్లి డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తుండగా.. అక్కడే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లిని అభినందించాడు. .@imVkohli 🤝 @ImRo45 Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/FLvsIGc9sg — BCCI (@BCCI) September 25, 2022 రోహిత్- కోహ్లి బ్రొమాన్స్.. వీడియో వైరల్ ఇదిలా ఉంటే.. ఆఖరి ఓవర్ ఐదో బంతికి హార్దిక్ పాండ్యా ఫోర్ బాదడంతో టీమిండియా విజయం ఖరారైన సమయంలో అక్కడే మెట్లపై కూర్చున్న కోహ్లి, రోహిత్ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. రోహిత్‌ను దగ్గరకు లాక్కొని మరీ ఆలింగనం చేసుకున్న కోహ్లి.. అతడి వీపును తడుతూ మనం సాధించాం అన్నట్లుగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన విరాట్- రోహిత్ ఫ్యాన్స్.. ఇంతకంటే కన్నులపండుగ ఏముంటుంది అంటూ మురిసిపోతున్నారు. చదవండి: Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్‌ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్‌లో మ్యాచ్ ప్రత్యేకం.. ఎందుకంటే! Ind Vs Aus 3rd T20- Rohit Sharma: హైదరాబాద్ బిర్యానీకి రోహిత్ ఫిదా Virat Kohli and Rohit Sharma, divided by fans united by passion and love towards country and TEAM INDIA 🇮🇳#INDvAUS #SuryakumarYadav #KingKohli #HardikPandya pic.twitter.com/JJEj2XF09N — Anshul Talmale (@TalmaleAnshul) September 25, 2022 -
Ind Vs Aus: ఫ్యాన్స్ అరుపులు, కేకలతో హోరెత్తిన స్టేడియం.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ!
Ind vs Aus 3rd T20- Hyderabad Uppal- సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: క్రికెట్ ఫీవర్‌కు నగరం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆదివారం ఓ వైపు బతుకమ్మ సంబురాలు మొదలవగా.. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ సంబరం ఊపేసింది. ఉరిమే ఉత్సాహంతో అభిమానులు మధ్యాహ్నం నుంచే స్టేడియానికి బారులు తీరారు. స్టేడియం వెలుపల తమ బుగ్గలకు త్రివర్ణాలను వేయించుకున్నారు. చేతుల్లో జెండాలతో సందడి చేశారు. జింఖానా తొక్కిసలాట నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), రాచకొండ పోలీస్ కమిషనరేట్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ, చెకింగ్ పాయింట్ల వద్ద కాస్త నిరీక్షణ మినహా మిగతా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు, అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇక సూర్యాస్తమయానికి ముందే స్టేడియం దాదాపుగా నిండిపోయింది. అభిమానుల కోలాహలం, చప్పట్లు, అరుపులు, కేకలతో స్టేడియం హోరెత్తింది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసినప్పటికీ ప్రేక్షకులంతా క్రీడాస్ఫూర్తి చాటారు. ఆటగాళ్లను హుషారెత్తించారు. ప్రతి బౌండరీకి, సిక్సర్‌కు మైదానం దద్దరిల్లిపోయింది. మొత్తానికి మ్యాచ్‌ను ఫలితంతో సంబంధం లేకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదించారు. గంటల తరబడి ఎదురుచూపులు క్రికెటర్లను చూడటానికి అభిమానులు ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మధ్యాహ్నం నాలుగు గంటల నుంచే నిలబడ్డారు. ఎన్జీఆర్ గేట్–1నుంచి ఉప్పల్ స్టేడియం వద్దకు దాదాపు కిలో మీటరు పొడవునా రోడ్డుపై నిలబడి వేచి చూశారు. స్టేడియానికి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉప్పల్ ఏక్ మినార్ వద్దకు క్రికెటర్లు బస్సులో చేరుకున్నారు. బస్సు చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ అభివాదం చేస్తూ ఆల్‌ది బెస్ట్ చెప్పారు. జోరుగా బ్లాక్ టికెట్ల దందా.. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా నడించింది. కొందరు యువకులు స్టేడియం పరిసరాల్లో రూ.850 టికెట్‌ను దాదాపు రూ.11000 వరకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు టికెట్లు విక్రయించే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఆరు టికెట్లు, రెండు సెల్ఫోన్లు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పజెప్పారు. గతంలో అభిమానులకు టాయిలెట్ సౌకర్యం ఉండేదికాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ అధికారులు దాదాపు ఎనిమిది మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు. భారీ సంఖ్యలో విదేశీయులు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా విదేశీయులు కూడా భారీ సంఖ్యలో రోడ్లపై కనిపించారు. కొందరు యువకులు వారితో సెల్ఫీలు దిగారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు వివిధ రకాల వేషధారణలతో తరలి వచ్చారు. మరి కొందరు అభిమాన క్రికెటర్ల బొమ్మలున్న టీ షర్టులు ధరించారు. మెట్రో అదనపు ట్రిప్పులు నడపడంతో అందుబాటులో ఉన్న పీఐపీలు కూడా మెట్రో సర్వీస్‌ను వాడుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా స్టేడియం స్టేషన్ వద్ద వరద లాగా క్రీడాభిమానులు మెట్రో రైలు నుంచి కిందకు దిగడం కనిపించింది. స్టేడియం ప్రాంగణంలో ఆకట్టుకున్న బతుకమ్మ క్రికెట్ స్టేడియం పరిసరాల్లో గేటు నంబర్ – 4 వద్ద బతుకమ్మలను ఏర్పాటు చేశారు. విదేశీయులు బతుకమ్మలను ఆసక్తిగా తిలకించారు. అంతా గందరగోళం.. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే స్డేడియం వద్దకు పంపుతామన్న పోలీసులు.. అలాంటిదేమీ లేకుండా అందరినీ స్టేడియం గేట్ల వద్దకు పంపడంతో వేలాది మంది క్రికెట్ స్టేడియం ప్రాంగణంలోకి వచ్చారు. ఏక్ మినార్ మజీద్ వద్ద, రామంతాపూర్ నుంచి వచ్చే వారిని ఎల్జీ గోడాన్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడుల వద్ద టికెట్లను చెక్ చేయలేదు. దీంతో అందరినీ స్టేడియం వద్దకు పడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. టికెట్ లేని వేలాది అభిమానులు గేట్ల వద్ద పడిగాపులు కాశారు. దీంతో లోనికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాయపడిన వారితో స్టేడియానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 22న జింఖానాలో టికెట్ క్యూ లైన్లలో తొక్కిసలాట, తదనంతరం లాఠీచార్జిలో గాయపడిన వారిని క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక వాహనంలో ఉచితంగా మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ తీసుకొచ్చారు. ముందుగా రవీంద్రభారతిలో బాధితులను పలకరించిన ఆయన మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు వారందరినీ స్వయంగా పోలీసు మినీ బస్సులో ఎక్కించిమరీ స్టేడియం వరకు వెంట వచ్చారు. చదవండి: IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు -
India vs Australia 3rd T20 : ఉత్కంఠపోరులో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
టీమిండియాపై గ్రీన్ సరికొత్త చరిత్ర.. తొలి ఆటగాడిగా!
హైదరాబాద్ వేదికగా టీమిండియాతో మూడో టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ గ్రీన్ విధ్వంసం సృష్టించాడు. ఆది నుంచే ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. తద్వారా ఓ అరుదైన రికార్డును గ్రీన్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టుపై టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా గ్రీన్ రికార్డులకెక్కాడు. అంతుకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ పేరిట ఉండేది. 2016లో లాడర్‌హిల్ వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చార్లెస్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 52 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. చదవండి: Ind A vs NZ A 2nd ODI: కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ .. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం -
India Vs Australia: హోరెత్తిన ఉప్పల్ స్టేడియం (ఫొటోలు)
-
IND vs AUS 3rd T20: కోహ్లి, సూర్య మెరుపులు.. ఆసీస్‌పై భారత్ ఘన విజయం
కోహ్లి, సూర్య మెరుపులు.. ఆసీస్‌పై భారత్ ఘన విజయం హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో భారత్ సొంతం చేసుకుంది. కాగా 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(69), విరాట్ కోహ్లి(63) అర్ధ సెంచరీలతో చెలరేగారు. సామ్స్ వేసిన అఖరి ఓవర్లో 11 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికే విరాట్ సిక్స్ బాది లక్ష్యాన్ని తగ్గించాడు. అయితే ఆ తర్వాతి బంతికే విరాట్ ఔటయ్యాడు. కాగా అఖరి నాలుగు బంతుల్లో 5 పరుగులు కావల్సిన నేపథ్యంలో హార్దిక్ ఫోర్ బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలరల్లో సామ్స్ రెండు వికెట్లు, హాజిల్ వుడ్,కమ్మిన్స్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(52), టిమ్ డేవిడ్(54) అర్ధసెంచరీలతో మెరిశారు. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు, భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 166/3 18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత్ విజయంలో 12 బంతుల్లో 21 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి, హార్దిక్ ఉన్నారు. అర్ధ సెంచరీతో చెలరేగిన కోహ్లి ఆస్ట్రేలియాతో మూడో టీ20లో విరాట్ కోహ్లి అర్ద సెంచరీతో చెలరేగాడు. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్.. మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో విరాట్(50),హార్దిక్(3) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 134 పరుగులు వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న సూర్యకుమార్ యాదవ్(69).. హాజల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చేలరేగి ఆడుతున్న భారత బ్యాటర్లు ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత విజయం దిశగా అడుగులు వేస్తోంది 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(58), విరాట్ కోహ్లి(39) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు భారత్ స్కోర్: 67/2 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(26), సూర్యకుమార్ యాదవ్(16) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 30 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. కమిన్స్ బౌలింగ్‌లో సామ్స్‌కు క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ ►5పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (1) ఔట్ చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ 187 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(52), టిమ్ డేవిడ్(54) అర్ధసెంచరీలతో చెలరేగారు. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు, భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. 18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 161/6 18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్లు నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో టిమ్ డేవిడ్(41), సామ్స్(16) పరుగులతో ఉన్నారు. వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆస్ట్రేలియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 14 ఓవర్లో తొలి బంతికి ఇంగ్లీష్(24) ఔట్ కాగా.. ఐదో బంతికి వేడ్(1) పెవిలియన్‌కు చేరాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. స్మిత్ ఔట్ ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన స్మిత్.. చాహల్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 75 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 8 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 76/3 రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. గ్రీన్ ఔట్ 62 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న గ్రీన్(52).. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో స్మిత్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 40 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు గ్రీన్ మాత్రం దూకుడుగా ఆడుతోన్నాడు. 18 బంతుల్లో 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 23/0 2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(21),ఫించ్(2) పరుగులతో ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో తుదిపోరుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో భారత్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు పంత్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో వచ్చాడు. మరోవైపు ఆసీస్ కూడా తమ జట్టులో ఒక మార్పు చేసింది. అబాట్ స్థానంలో ఇంగ్లీష్ జట్టులోకి వచ్చాడు. భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), డేనియల్ సామ్స్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ చదవండి: Ind A vs NZ A 2nd ODI: కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ .. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం -
ఉప్పల్ స్టేడియానికి క్రీడామంత్రి.. వారందరికీ ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: క్రీడా అభిమానుల జీవితాలతో ఆటలు ఆడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. టికెట్లు గోల్‌మాల్‌పై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. జింఖానా గ్రౌండ్లో టికెట్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన క్రీడాభిమానులతో కలిసి మంత్రి ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. గాయపడిన క్రీడాభిమానులందరికీ బాక్స్ టికెట్లు ఇచ్చి ఈ రోజు మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఆమెకు క్రీడా శాఖ తరపున ప్రమోషన్ ఇవ్వడంతోపాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డీజీపీకి కూడా లెటర్ రాశామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. చదవండి: (India Vs Australia: బ్లాక్ దందా.. రూ.850 టికెట్ రూ.11,000) -
ఉప్పల్ స్టేడియంకు చేరుకున్న భారత్, ఆసీస్ ఆటగాళ్లు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టీ20లో తాడాపేడో తెల్చుకోవడానికి భారత్- ఆసీస్ జట్లు సిద్దమయ్యాయి. ఇరు జట్లు మధ్య సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈక్రమంలో ఇరు జట్లు తమ హోటల్ నుంచి భారీ భద్రత మధ్య స్టేడియం చేరుకున్నారు. ఇక స్టేడియం చేరుకున్నాక ఇరు జట్లు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. కాగా ఉప్పల్ వేదికగా ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది. భారత్- వెస్టిండీస్ మధ్య 2019లో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇదే వేదికలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖిగా నాలుగుసార్లు (మూడు వన్డేలు, ఒక టెస్టు) తలపడ్డాయి. రెండుసార్లు భారత్... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచి సమవుజ్జీగా ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో మాత్రం ఈ రెండు జట్ల మధ్య సిటీలో తొలిసారి పోరు జరగనుంది. చదవండి: బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల -
టీ 20 మ్యాచ్ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
-
మ్యాచ్ నిర్వహణలో మరోసారి బయటపడిన HCA నిర్లక్ష్యం
-
ఇవాళ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆసీస్ చివరి టీ20
-
India vs Australia 3rd T20: సిరీస్ ‘భాగ్యం' ఎవరిదో!
సాక్షి, హైదరాబాద్: అగ్రశ్రేణి జట్లు భారత్, ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ క్లైమాక్స్‌కు చేరింది. పరుగుల వరద పారిన తొలి పోరులో ఆసీస్ పైచేయి సాధించగా, ఎనిమిది ఓవర్ల తర్వాతి మ్యాచ్‌లో భారత్ ఫటాఫట్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సొంతగడ్డపై మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ భావిస్తుండగా, టి20 వరల్డ్ కప్ ఆతిథ్య జట్టు సిరీస్ నెగ్గి స్వదేశం చేరాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం సమరం మరింత ఆసక్తికరంగా మారింది. భాగ్యనగరంలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. హైదరాబాద్ పిచ్ అన్ని విధాలా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది కాబట్టి పరుగుల వరద ఖాయం. 2019 డిసెంబర్ 6న రాజీవ్‌గాంధీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిసారిగా జరిగిన అంతర్జాతీయ టి20లో మొత్తం 416 పరుగులు నమోదయ్యాయి. మళ్లీ భువనేశ్వర్... ఎనిమిది ఓవర్లకే పరిమితమైన గత మ్యాచ్‌లో భారత్ పూర్తి బలాబలాలు పరీక్షించలేకపోయింది. బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు పేసర్ భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి పంత్‌ను తీసుకున్నా అతనికి బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అయితే గరిష్టంగా ఒక బౌలర్ రెండు ఓవర్లే వేయడంతో ఐదో బౌలర్ విషయంలో సమస్య రాలేదు. కానీ పూర్తి స్థాయి మ్యాచ్‌లో అలా సాధ్యం కాదు కాబట్టి భువ నేశ్వర్ మళ్లీ జట్టులోకి రావడం ఖాయం. బుమ్రా తన స్థాయికి తగినట్లుగా అద్భుతంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం కాగా, మ్యాచ్ మ్యాచ్ కూ మెరుగవుతున్న అక్షర్ పటేల్ మరో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అయితే వరల్డ్‌కప్‌కు ముందు హర్షల్ పటేల్, చహల్ బౌలింగ్ భారత్‌ను ఆందోళన పెడుతోంది. చహల్ వికెట్లు తీయలేకపోగా, హర్షల్ ధారాళంగా పరుగులిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల లోనూ విఫలమైన హర్షల్‌కు మరో అవకాశం ఇస్తారా లేక దీపక్ చహర్‌తో ప్రయత్నిస్తారా చూడాలి. బ్యాటింగ్‌కు సంబంధించి భారత్ మెరుగైన స్థితి లో ఉంది. నాగపూర్‌లో రోహిత్ ఆడిన షాట్లు చూస్తే అతను ఎంత ప్రమాదకర బ్యాటరో తెలుస్తుంది. రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ రాణించడం కీలకం. హార్దిక్ బ్యాటింగ్ మెరుపులు తొలి టి20లో కనిపించగా... కార్తీక్ మరోసారి తన ఫిని షర్ పాత్రకు గత మ్యాచ్‌లో న్యాయం చేకూర్చాడు. బౌలింగ్ సమస్యలు... పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఫించ్ ఫామ్‌లోకి రాగా, వేడ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన మ్యాక్స్‌వెల్ గాడిలో పడాలి. టిమ్ డేవిడ్ కూడా ధాటిగా ఆడితే ఆ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. రెండో టి20లో ఒక అదనపు బౌలర్ కోసం బ్యాటర్‌ను తగ్గించిన ఆసీస్ మళ్లీ బ్యాటర్ వైపు మొగ్గు చూపితే ఇన్‌గ్లిస్ జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కంగారూలకు ఇబ్బందికరంగా మారింది. ఇద్దరు టాప్ బౌలర్లలో హాజల్‌వుడ్ ఫర్వాలేదనిపించినా, కమిన్స్ ఘోరంగా విఫలమవుతున్నాడు. కమి న్స్ భారీగా పరుగులిస్తున్నా ఎలిస్, రిచర్డ్సన్ గాయపడి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆడించక తప్పడం లేదు. లెగ్ స్పిన్నర్ జంపా పదునైన బౌలింగ్ కంగారూలకు అదనపు బలం. అబాట్, స్యామ్స్లలో ఒకరికే చోటు జట్టులో చోటు ఉంటుంది. కొన్ని చినుకులు... వాతావరణ శాఖ అంచనా ప్రకారం హైదరాబాద్‌లో ఆదివారం మ్యాచ్‌కు ఇబ్బంది లేకుండా సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి. శనివారంలాగే ఆకాశం మేఘావృతమై ఉంటూ అప్పుడప్పుడు స్వల్ప చినుకులు కురిసినా ఆటకు అంతరాయం ఉండకపోవచ్చు. -
Ind Vs Aus: ఉప్పల్‌లో నాడు కోహ్లి అద్భుత ఇన్నింగ్స్! 50 బంతుల్లోనే ఏకంగా..
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్‌కు హైదారాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో మొత్తం 12 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఆరు వన్డేలు, ఐదు టెస్టులు, ఒక టీ20 మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేదికపై ఆదివారం(సెప్టెంబరు 25) మరో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు, పిచ్ స్వభావం, లైవ్ స్ట్రీమింగ్ తదితర విషయాలు తెలుసుకుందాం! మొదటి మ్యాచ్ ఎవరితో అంటే! ►2005లో నవంబర్ 16న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఈ వేదికపై జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. ►2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ►2017లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌కు షెడ్యూల్ ఖారారైనా ఆ మ్యాచ్ రద్దైంది. ►ఈ క్రమంలో 2019 డిసెంబర్ 6న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఏకైక టీ–20 మ్యాచ్ జరిగింది. ►ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ►ఇక ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 55 వేలు ఎవరిది పైచేయి..? ఉప్పల్ వేదికగా జరిగిన 5 టెస్టు మ్యాచ్‌లలో టీమిండియా నాలుగింటిలో గెలిచింది. మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. అదే విధంగా.. ఆరు వన్డేల్లో భారత్ మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. ఏకైక టీ20లో... నాడు చెలరేగిన కోహ్లి! ఏకంగా.. వెస్టిండీస్‌తో జరిగిన టీ–20 మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు సాధించింది. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ఇక కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), నాటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ స్టేడియంలో టీ20 ఫార్మాట్(ఇంటర్నేషనల్)లో నమోదైన స్కోర్లు: ►అత్యధిక స్కోరు: 209/4- భారత్ ►అత్యల్ప స్కోరు: 207/5- వెస్టిండీస్ ►అత్యధిక పరుగులు సాధించింది(అత్యధిక వ్యక్తిగత స్కోరు): 94- నాటౌట్- విరాట్ కోహ్లి ►అత్యధిక సిక్సర్లు: కోహ్లి- 6 ►అత్యధిక వికెట్లు: యజువేంద్ర చహల్(భారత్), ఖరీ పియర్(వెస్టిండీస్)- చెరో రెండు వికెట్లు ►బౌలింగ్ అత్యుత్తమ గణాంకాలు: యుజువేంద్ర చహల్(4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు) ►అత్యధిక భాగస్వామ్యం: కోహ్లి- కేఎల్ రాహుల్(100 పరుగులు) పిచ్ స్వభావం పాతబడే కొద్ది నెమ్మదిస్తుంది. స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. గతంలో ఇక్కడ టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపిన సందర్భాలు ఉన్నాయి. మ్యాచ్ సమయం, లైవ్ స్ట్రీమింగ్ ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్- ఆసీస్ మ్యాచ్ ఆరంభం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం. మ్యాజిక్ రిపీట్ చేయాలి! ఇక ఉప్పల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాలని కింగ్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో ఆసీస్ విజయం సాధించగా.. నాగ్‌పూర్‌లో రోహిత్ సేన గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. చదవండి: హైదరాబాద్‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్; స్టేడియానికి ఇలా వెళితే బెటర్! Ind Vs Aus 2nd T20: పాక్ రికార్డును సమం చేసిన రోహిత్ సేన! ఇక విరాట్ వికెట్ విషయంలో.. -
హైదరాబాద్‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్; స్టేడియానికి ఇలా వెళితే బెటర్!
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల కోసం పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణాను వినియోగిస్తే స్టేడియానికి సులువుగా చేరుకోవచ్చని సూచించారు. అభిమానుల కోసం మెట్రో రైల్, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 25న ఒంటి గంట వరకూ మెట్రో రైళ్లు ఉప్పల్‌లో సెప్టెంబర్ 25న జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం పలు చర్యలు చేపట్టింది. స్టేడియం మెట్రో స్టేషన్ నుండి ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. అమీర్‌పేట్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి కనెక్టింగ్ రైళ్లు ఉంటాయి. ప్రత్యేక రైళ్ల సేవ సమయంలో, ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ప్రవేశాలు అనుమతిస్తారు. అన్ని ఇతర స్టేషన్లు నిష్క్రమణల కోసం మాత్రమే తెరుస్తారు. మ్యాచ్‌కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి నిష్క్రమించేటప్పుడు ముందుగానే లేదా కనీసం రిటర్న్ టిక్కెట్లను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ప్రయాణ సౌలభ్యం కోసం, క్యూలో నిలబడకుండా ఉండటానికి స్మార్ట్ కార్డులను ఉపయోగించాలని కోరారు. టీ–20 మ్యాచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న టీ–20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ఉప్పల్ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు 50 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్, హకీంపేట్, మెహిదీపట్నం, కోఠి, ఘట్కేసర్ తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుపనున్నారు. (క్లిక్ చేయండి: టి-20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు) -
Sakshi Cartoon 24-09-2022
-
భారత్-ఆసీస్ మ్యాచ్: ప్రతీ వ్యక్తిని జూమ్ చేస్తాం.. వాటికి అనుమతి లేదు: సీపీ
సాక్షి, హైదరాబాద్: భారత్-ఆసీస్ మ్యాచ్‌కు పూర్తి భద్రత కల్పించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభిమానులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలన్నారు. మ్యాచ్ రోజున మెట్రో అదనపు సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు కూడా అదనంగా ఏర్పాటు చేశారని సీపీ పేర్కొన్నారు. 300 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. చదవండి: అవన్నీ అవాస్తవాలు.. ఒక్కొక్కరు నాలుగు టికెట్లు కొంటే: అజారుద్దీన్ 2500 పోలీస్ సిబ్బంది.. ‘‘ఎల్లుండి జరిగే మ్యాచ్‌కి 2500 పోలీస్ సిబ్బందితో సెక్యురిటి ఏర్పాటు చేశాం. 40 వేలకు పైగా ప్రేక్షకులు వస్తారు. ప్లేయర్స్ రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం ప్రాక్టీస్‌కి వస్తారు. ఎల్లుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఎక్కువ మెట్రో సర్వీసులు నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. 300 సీసీ కెమెరాలు ఉన్నాయి.. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేస్తామని తెలిపారు. వాటికి అనుమతి లేదు.. గ్రౌండ్లో ఉండే ప్రతీ వ్యక్తిని జూమ్ చేసి చూసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లకి అనుసంధానం చేస్తాం. ప్రేక్షకుల మొబైల్స్, బ్లూటూత్ హెడ్ సెట్ అనుమతిస్తాం. సిగరెట్, కెమెరాలు, షార్ప్ ఆబ్జెక్ట్, ఆల్కహాల్, వాటర్ బాటిల్స్, హెల్మెట్స్, పెట్స్, ఫైర్ క్రాకర్స్, బయట ఫుడ్, బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్స్, డ్రగ్స్‌కి అనుమతి లేదని’’ సీపీ పేర్కొన్నారు. -
Ind Vs Aus: అవన్నీ అవాస్తవాలు.. ఒక్కొక్కరు నాలుగు టికెట్లు కొంటే: అజారుద్దీన్
India Vs Australia 3rd T20 Tickets- Mohammad Azharuddin Comments: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌లో మూడో టీ20 నేపథ్యంలో టికెట్ల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. టికెట్ల అమ్మకాల విషయంలో కొంతమంది కావాలనే వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న ఆయన.. అవేమీ నిజం కావన్నారు. పేటీఎం ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు జరిగాయని... పేటీఎం తన పనిని చక్కగా నెరవేర్చిందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నాలుగు టికెట్లు కొంటే.. టికెట్ల అమ్మకం, జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అజారుద్దీన్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆన్లైన్లో పారదర్శకంగా టికెట్ల అమ్మకం జరిపినపుడు ఇలాంటి అక్రమాలు జరిగాయని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు. ఒకవేళ ఓ వ్యక్తి ఆన్లైన్లో నాలుగు టికెట్లు కొన్నారనుకోండి. వారికి ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేసేటపుడు ఆధార్ కార్డు వంటి ఐడీలను పరిశీలిస్తాం. అంతేగానీ ఆ నాలుగు టికెట్లను వారు ఏం చేస్తున్నారో మాకేం తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బ్లాక్‌లో అమ్మకాలు జరిపారని తెలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టికెట్ల వివరాలివే! కాంప్లిమెంటరీ కిందే ఎక్కువ టికెట్లు ఇచ్చామన్న అజారుద్దీన్.. టికెట్ల అమ్మకాలకు సంబంధించిన లెక్కలను మీడియాకు వివరించారు. ‘‘సెప్టెంబరు 15 ఆన్లైన్లో పేటీఎం ద్వారా 11,450 టికెట్లు, పేటీఎం కార్పొరేట్ బుకింగ్ 4000, మిగతా ఆన్లైన్ సేల్స్ 2100, ఆఫ్‌లైన్ సేల్స్ సెప్టెంబరు 22న 3000, మిగతా 6 వేల టికెట్లు(ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, స్పాన్సర్స్, కార్పొరేట్స్) అమ్మినట్లు తెలిపారు. చికిత్స చేయిస్తాం జింఖానాలో తొక్కిసలాట దురదృష్టకరమని.. గాయపడిన వారికి తమ వంతు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటనకు హెచ్‌సీఏ మాత్రం కారణం కాదని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇందులో తమ తప్పేమీ లేదని.. తమ పొరపాటు లేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో మా ప్రమేయం లేదు ఇక హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాల్లో తమ ప్రమేయం లేదన్నారు. ఆ పనిని పేటీఎంకు అప్పగించామని.. తాము మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీఏలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని.. అయితే, ప్రతీ వ్యవస్థలోనూ ఇలాంటివి సహజమేనన్నారు. ఏదేమైనా మ్యాచ్ నిర్వహణను విజయవంతం చేయడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తొక్కిసలాటపై స్పందిస్తూ.. గాయపడిన వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. చదవండి: Dewald Bravis: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! -
IND VS AUS 3rd T20 Tickets: జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట.. ఏడుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్/ రాంగోపాల్‌పేట్: గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతం. ఒక్కసారిగా వర్షం. జింఖానా గ్రౌండ్స్ వద్ద అప్పటివరకు కిలోమీటర్ పొడవు క్యూ లైన్లలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు ఒకేసారి మైదానం ప్రధాన గేటు వైపు దూసుకువచ్చారు. లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఫలితం.. తీవ్రమైన తొక్కిసలాట. ఊపిరే అందని పరిస్థితి. కొందరు కింద పడిపోయారు. కాళ్ల కింద నలిగిపోయారు. గుమిగూడిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు గాయపడ్డారు. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే భారత్–ఆ్రస్టేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం జింఖానా మైదానంలో నేరుగా (ఆఫ్‌లైన్) టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన హెచ్‌సీఏ ఆ మేరకు సరైన ఏర్పాట్లు, బందోబస్తు చేయలేదని, అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల తర్వాత మ్యాచ్‌తో.. మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బుధవారం వరకు ఆన్లైన్లోనే టికెట్ల అమ్మకాలు అంటూ చెప్పిన హెచ్‌సీఏ.. గురువారం మాత్రం కౌంటర్ ద్వారా టికెట్లు అమ్మాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలు జరుగుతాయని ప్రకటించింది. మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన గేట్ వద్ద కుడివైపు పురుషులు, ఎడమవైపు మహిళలకు లైన్లు కేటాయించారు. గేటు దాటి లోపలకు వచ్చిన తర్వాత మాత్రం ఒకే లైన్లో టిక్కెట్ కౌంటర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం బుధవారం రాత్రి నుంచే అభిమానులు గ్రౌండ్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. గురువారం తెల్లవారుజాముకే వీరి సంఖ్య పది వేలు దాటింది. ఒక్కోటి దాదాపు కి.మీ. మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. ప్రధాన గేట్‌ను మూసి ఉంచిన పోలీసులు విడతల వారీగా కొందరి చొప్పున లోపలి క్యూ లైన్లోకి పంపిస్తున్నారు. వర్షంతో పరుగులు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో తలదాచుకునేందుకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్లకు ఇదే గేటు కావడంతో లోపల నుంచి వచ్చే వారి కోసం పోలీసులు కొద్దిగా దాన్ని తెరిచారు. అదే సమయంలో బయట ఉన్న దాదాపు 1,000 మంది ఒకేసారి లోపలకు దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ముందు వరుసల్లో ఉన్న వాళ్లు కింద పడిపోయారు. అదే అదనుగా కొందరు పోకిరీలు.. మహిళలు, యువతులపై పడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. తొక్కిసలాట, లాఠీచార్జిలో ఒక కానిస్టేబుల్, ఒక అగ్నిమాపక సిబ్బందితో పాటు ఏడుగురికి గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఉదంతంతో గ్రౌండ్స్ వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. టిక్కెట్ల విక్రయానికి మరో కౌంటర్ ఏర్పాటు చేయించారు. సాయంత్రం టిక్కెట్ల విక్రయం పూర్తయ్యే వరకు భారీ బందోబçస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జీ తర్వాత బయట ఉన్నవారిని పోలీసులు పంపేయగా.. సాయంత్రం వరకు ఉండి టిక్కెట్ల దొరకని వారు నిరసనకు ప్రయత్నించడంతో అధికారులు నచ్చజెప్పి పంపేశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స తొక్కిసలాటలో గాయపడిన ఏడుగురిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జింఖానా మైదానంలో స్వీపర్‌గా పనిచేసే బోరబండకు చెందిన రంజిత, బేగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్, కవాడీగూడకు చెందిన విద్యార్థి ఆదిత్యనాథ్, తిరుమలగిరి ఇందిరానగర్‌కు చెందిన విద్యారి్థని సయ్యదా ఆలియా, కొంపల్లి బహుదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్, సికింద్రాబాద్ కంట్రోల్ రూమ్‌కు చెందిన అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ శ్రీనాథ్ యాదవ్, కేపీహెచ్‌బీ (జేఎన్టీయూ)కి చెందిన సుజాత ఉన్నారు. వీరిలో సాయి కిశోర్, సుజాతలను ప్రా£ýథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామని, చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో మూడు కేసులు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జింఖానా వద్ద జరిగిన తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చికిత్స పొందుతున్న వారు ఫిర్యాదు చేయడంతో, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై బేగంపేట పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ యాక్ట్, 420, 21,22/76 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నట్లు ఫిర్యాదులందాయి. హెచ్‌సీఏ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని, వారిపై చర్యలు ఉంటాయని, నోటీసులు జారీ చేస్తామని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్ చెప్పారు. కనీస ఏర్పాట్లు లేకపోవడం వల్లే.. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం సుమారు 39,800లో అన్నిరకాల పాస్‌ల సంఖ్య 20 శాతానికి మించదు. మిగిలిన వాటిని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచే విషయంలో హెచ్‌సీఏలో నెలకొన్న గందరగోళం తాజా పరిస్థితికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లోనా అనే విషయంలో బుధవారం వరకు స్పష్టత లేకుండా పోయింది. హెచ్‌సీఏలో చాలా కాలంగా ఉన్న విభేదాల కారణంగా గతంలో టికెట్ల విషయంలో కీలకంగా, చురుగ్గా వ్యవహరించినవారు అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సహకరించలేదని సమాచారం. దీంతో ఆయన పూర్తిగా దిగువ స్థాయి ఉద్యోగులపై ఆధారపడ్డారు. బుధవారం జింఖానా మైదానం వద్దకు ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో వచ్చి హడావుడి చేసిన నేపథ్యంలో.. ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్ముదామని అజహర్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద కనీస ఏర్పాట్లు, బందోబస్తు లేకపోవడం, వర్షం నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్ నిర్వహణ సులువు కాదు: అజారుద్దీన్ గురువారం చోటు చేసుకున్న ఘటనలో తన తప్పేమీ లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత సులువు కాదని పేర్కొన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమరి్పస్తామని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. అందరం క్రికెట్ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నామని అన్నారు. మ్యాచ్ టికెట్లు అన్నీ అమ్ముడుబోయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగితే సహించం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం సందర్భంగా జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో టీ20 క్రికెట్ మ్యాచ్ ఏర్పాట్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌సీఏ పాలకమండలి ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వ సహకారాన్ని కోరిఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 25న జరిగే మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని విజ్ఞప్తి చేశారు. జింఖానా వద్ద గాయపడిన వారికి హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యసేవలు అందజేస్తామన్నారు. సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, టీఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమా రెడ్డి, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు నాలుగు కౌంటర్లు అని చెప్పినా డిజిటల్ పేమెంట్లు పని చేయలేదు. మధ్యాహ్నం వరకు ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు. మరో కౌంటర్ కేవలం పోలీసుల కోసమే కేటాయించినట్టుంది. చాలామంది అడ్డదారిలో అక్కడకు వెళ్లి కొనుక్కున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వేచి చూసినా నాకు టికెట్ దొరకలేదు. – సాయి ప్రవీణ్, గాజులరామారం -
లాఠీచార్జ్ కు బాద్యులు ఎవరు ..?
-
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) ఘోర వైఫల్యంతో పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది హెచ్‌సీఏ. అయితే.. ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తరుణంలో.. అభిమానులతో పాటు పోలీసులు గాయపడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఇక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని ప్రచారం ఊపందుకుంది. అయితే తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అడిషనల్ సీపీ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని నార్త్ జోన్ అడిషనల్ సీపీ చౌహాన్ తెలిపారు. సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, కౌంటర్లు పెంచుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కాసేపు కౌంటర్లు మూసేశారు. ప్రస్తుతం గ్రౌండ్లో లైన్లలో ఉన్నవాళ్లకు టికెట్ల విక్రయం కొనసాగించేందుకు యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు గురువారం ఉదయం ఎగబడ్డారు. వేలాది మందిగా ఎగబడిపోవడం.. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోగా అభిమానులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీఛార్జ్‌కు దిగారు. ఈ క్రమంలో గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఈ పరిస్థితికి హెచ్‌సీఏ ఘోర వైఫల్యమే కారణమన్న విమర్శ వినిపిస్తోంది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ఈ మూడు వేల టికెట్ల కోసమే వేలాదిగా అభిమానులు ఎగబడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. టికెట్ల అమ్మకంలో మొదటి నుంచి హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నా హెచ్‌సీఏ నుంచి స్పందన కరువైంది. అయితే.. మొదట పేటీఎం ద్వారా టికెట్ల విక్రయమని మాట మార్చిన హెచ్‌సీఏ.. తర్వాత ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయమంటూ ప్రచారం చేసింది. హెచ్‌సీఏ సభ్యుల మధ్య వివాదాలతో టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొందనే ఆరోపణ వెల్లువెత్తుతోంది. తొక్కిసలాట నేపథ్యంలో.. హెచ్‌సీఏ తీరుపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. -
జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం నగరంలోని జింఖానా మైదానంలో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, మ్యాచ్ వీక్షేందుకు టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూ లైన్లలో బారులుతీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో నలుగురు త్రీవంగా గాయపడ్డారు. పలువురు స్పృహ తప్పపడిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు సైతం గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పి ఉద్రికత్త చోటుచేసుకుంది. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదిలా ఉండగా.. టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్‌పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్రికెట్ అభిమానులకు హెచ్సిఏ శుభవార్త
-
IND Vs AUS: జింఖానాలో ఇవాళ టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ‘ఆఫ్‌లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్సైడర్’ యాప్ ద్వారా ఆన్లైన్లో హెచ్‌సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్సైడర్’తో చర్చలు జరిపిన హెచ్‌సీఏ టికెట్లను నేరుగా కౌంటర్లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్‌సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బ్లాక్‌లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్‌సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్‌సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Ind Vs Aus: హైదరాబాద్ మ్యాచ్.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు!
India Vs Australia T20 Series- 3rd T20 Hyderabad- Uppal: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 25న భారత్– ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ–20 క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా టికెట్ల కోసం ఎదురుచూసినప్పటికీ నిరాశే మిగిలింది. కేవలం కొన్ని క్షణాల్లోనే వేలాది టికెట్లు అమ్ముడుపోవడం.. కనీసం టికెట్లు అందుబాటులో ఉన్నట్లు పేటీమ్ యాప్‌లో చూపకపోవడం అభిమానులు నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. టికెట్లు చూపకుండానే అమ్ముడుపోయినట్లు ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. ఉప్పల్ స్టేడియంలో 55వేల సీట్ల సామర్థ్యం కాగా, టికెట్లను మాత్రం 38వేలలోపు మాత్రమే విక్రయిస్తారు. మిగతా టికెట్లు నిర్వాహకులు, స్పాన్సర్లకు కేటాయిస్తారు. ఈ మేరకు రూ.850 మొదలు రూ.10వేల వరకు టికెట్ల విక్రయించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తొలుత గురువారం ఉదయం 11 గంటలకు టికెట్లు పేటీమ్‌లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో వాయిదా వేసిన నిర్వాహకులు.. శుక్రవారం రాత్రి 8 గంటలకు టికెట్లను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ప్రకటించిన సమయానికే యాప్‌లను ఓపెన్ చేసి లాగిన్ అయిన క్రికెట్ అభిమానులకు.. హైదరాబాద్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు.. స్క్రీన్‌పై 10 గంటలకు ప్రత్యక్షమయ్యాయి. టికెట్ కోసం ఓపెన్ చేసిన అభిమానులకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయని స్క్రీన్‌పై సమాచారం రావడంతో నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -సాక్షి, సిటీబ్యూరో చదవండి: Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం -
ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. టికెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే..?
IND VS AUS 3rd T20: రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వనుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఈ నెల 20 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్.. ఉప్పల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 25న జరిగే మూడో టీ20లో టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు రేపటి (సెప్టెంబరు 15) నుంచి అందుబాటులోకి వస్తాయి. పేటీయం ఇన్సైడర్ (ఆన్లైన్) ద్వారా, అలాగే స్టేడియం వద్దనున్న ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా వీటిని అభిమానులు కొనుగోలు చేయవచ్చు. టికెట్ ధరలు రూ. 800 నుంచి ప్రారంభమవుతాయి. జీఎస్టీ అదనంగా ఉంటుంది. టికెట్ల ధరల్లో విద్యార్ధులకు ప్రత్యేక డిస్కౌంట్ ఉండనుంది. కాగా, టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగే టీ20 సిరీస్ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా.. సౌతాఫ్రికాతో మరో టీ20 సిరీస్, వన్డే సిరీస్ కూడా ఆడనుంది. అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్ -
భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్‌లో మ్యాచ్ ఎప్పుడంటే..?
IND VS AUS T20 Series Schedule: టీ20 ప్రపంచకప్ 2022కు ముందు భారత క్రికెట్ జట్టు ఊపిరి సడలని షెడ్యూల్‌తో ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రస్తుతం విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత జింబాబ్వే పర్యటన, ఆ వెంటనే ఆసియా కప్‌తో బిజీబిజీగా గడపనుంది. ఆసియా కప్ ముగిసిన తర్వాత టీమిండియా దాదాపు నెలన్నర ఖాళీగా ఉండటంతో బీసీసీఐ ఈ మధ్యలో రెండు సిరీస్‌లను ప్లాన్ చేసింది. Take a look at #TeamIndia's home series fixture against Australia. 👍#INDvAUS pic.twitter.com/zwNuDtF32R — BCCI (@BCCI) August 3, 2022 సెప్టెంబర్ 20-25 మధ్యలో ఆస్ట్రేలియా, సెప్టెంబర్ 28-అక్టోబర్ 11 మధ్యలో సౌతాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. భారత పర్యటనలో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుండగా.. దక్షిణాఫ్రికా 3 టీ20లు, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. Check out the #INDvSA home series schedule. 👌#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq — BCCI (@BCCI) August 3, 2022 ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు పంజాబ్‌లోని మొహాలీ వేదిక కాగా.. రెండో టీ20 నాగ్‌పూర్‌లో జరుగనుంది. చివరిదైన మూడో టీ20కి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) వేదిక కానుంది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. దీంతో స్థానికులు ఉబ్బితబ్బుబ్బిపోతున్నారు. సౌతాఫ్రికా పర్యటన విషయానికొస్తే.. సెప్టెంబర్ 28- తొలి టీ20 (తిరువనంతపురం) అక్టోబర్ 2- రెండో టీ20 (గౌహతి) అక్టోబర్ 4- మూడో టీ20 (ఇండోర్) అక్టోబర్ 6- తొలి వన్డే (లక్నో) అక్టోబర్ 9- రెండో వన్డే (రాంచీ) అక్టోబర్ 11- మూడో వన్డే (ఢిల్లీ) చదవండి: Asia Cup 2022: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. త్రిబుల్ ధమాకా..! -
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నివారణ చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పులువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కోరారు. స్టేడియంలో 40 పెద్ద రూమ్‌లు ఉన్నాయని, పార్కింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఇది ఐసోలేషన్ కేంద్రంగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మేరకు హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్ విజయానంద్ బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాటానికి తమ వంతు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
జోరుగా బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయాలు
-
బ్లాక్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తుది సమరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌ను వీక్షించాలని భావించిన వేలాది మంది నగరవాసులకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే సామాన్యునికి అందుబాటులో ఉండగా అవి కూడా వారికి లభించలేదనే తెలుస్తోంది. అయితే మరోవైపు కొందరు కేటుగాళ్లు మాత్రం ఈ మ్యాచ్ టికెట్లను ముందుగానే బ్లాక్ చేశారు. స్టేడియం చుట్టు నంబర్ ప్లేట్లు లేని బైక్‌లపై చక్కర్లు కొడుతు జోరుగా బ్లాక్ టికెట్లను విక్రయిస్తున్నారు. వెయ్యి రూపాయల టికెట్‌ను ఐదు వేలకు, రెండు వేల టికెట్‌ను పదివేలకు అమ్ముతున్నారు. అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ ముఠా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా తెలస్తోంది. టికెట్లు బ్లాక్‌లో దర్శనమివ్వడంతో మ్యాచ్ నిర్వాహకుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో లభించాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లడంపై నగరంలోని కిక్రెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లో టికెట్ విక్రయాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంటే వాటిలో 35 వేలకు పైగా సీట్లను చెన్నై, ముంబై జట్ల యాజమాన్యాలు తీసుకున్నాయి. మిగిలిన 4,450 టికెట్లలో 2,500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
చెన్నై చెడుగుడు ఆడుకుంటుందా? ముంబై మెరిపిస్తుందా?
-
రాజధానికి ఐపీఎల్ ఫీవర్
సాక్షి హైదరాబాద్: రాజధానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ తుది మ్యాచ్‌ను వీక్షించేందుకు టిక్కెట్ల కోసం ప్రయత్నించిన వేలాది మంది హైదరాబాదీలకు నిరాశే ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి ఇక్కడ ఫైనల్ పోరు సాగనుంది. తమ జట్లు ఫైనల్ చేరే అవకాశాన్ని ముందే ఊహించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్ జట్టు యాజమాన్యాలు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 90 శాతం టికెట్లు బ్లాక్ చేశాయి. ముందుగా అనుకున్నట్లు ఈ జట్లు ఫైనల్‌కు రావడంతో ఈ రెండు జట్ల యాజమాన్యాలు తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారితో స్టేడియాన్ని నింపుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంటే వాటిలో 35 వేలకు పైగా సీట్లను చెన్నై, ముంబై జట్ల యాజమాన్యాలు తీసుకున్నాయి. మిగిలిన 4,450 టికెట్లలో 2,500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలోనూ చాలా వరకూ తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. కొద్దిమంది హైదరాబాదీలు మాత్రమే ఈ మ్యాచ్ చూసేందుకు అతి కష్టం మీద టికెట్లు సంపాదించుకున్నారు. దీంతో ఈ మ్యాచ్ చూడాలని ఆశపడ్డ వేలాది మంది స్థానిక క్రికెట్ ప్రియులకు తిలకించే అవకాశం లేకుండా పోయింది. నేడు జరగనున్న ఫైనల్ పోరు చూసేందుకు మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన దాదాపు 25 వేల మంది శనివారం మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకున్నారు. రాజధానిలోని 3, 4, 5 నక్షత్రాల హోటళ్లు పూర్తిగా వీరితో నిండిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు 5 వేల మంది ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్‌లో హోటళ్లను బుక్ చేశారు. టికెట్ల కోసం వీవీఐపీల ఒత్తిడి... ఉప్పల్ స్టేడియంలో ఆదివారం నాటి ఫైనల్ పోరు తిలకించేందుకు పాసుల కోసం ప్రయ త్నించిన వీవీఐపీలకు చుక్కెదురైంది. ముంబై ఫైనల్‌కు రావడంతో పరిస్థితులు మారిపోయాయని, అన్ని బాక్స్‌లు దాదాపుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బుక్ చేసుకుందని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు టికెట్ల కోసం ఆరా తీసినా ఫలితం లేకపోయింది. చివరకు బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారులకు కూడా వీవీఐపీ పాసులు లభించలేదు. ఐపీఎల్ నిర్వాహకులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు కొద్ది పాసులే ఇవ్వడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీట్లు బ్లాక్.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంది. వీటిలో 35 వేలకు పైగా సీట్లను ‘చెన్నై, ముంబై’ తీసుకున్నాయి. 2,500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన వారికి ఇచ్చారు. సామాన్యులకు మిగిల్చింది 2 వేల టికెట్లు మాత్రమే. హోటళ్లు ఫుల్.. మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన దాదాపు 25 వేల మంది ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నా రు. రాజధానిలోని 3, 4, 5 నక్షత్రాల హోటళ్లు పూర్తిగా వీరితో నిండిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 5 వేల మంది ఎగ్జిక్యూటివ్‌లు మ్యాచ్‌ను తిలకించనున్నారు. వీవీఐపీలకు నిల్... రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు టికెట్ల కోసం ఆరా తీసినా ఫలితం లేకపోయింది. చివరకు బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారులకు కూడా వీవీఐపీ పాసులు లభించలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు కూడా కొద్ది పాసులే ఇచ్చారు. -
ఐపీఎల్ ఫైనల్.. సీపీ కీలక ప్రెస్‌మీట్
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బందోబస్తు విషయమై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం లోపల, పరిసరాల్లో 300 కెమెరాలు ఏర్పాటు చేసి.. నిత్యం పర్యవేక్షిస్తామని, ఇందుకోసంస్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2,850 మంది పోలీసులతో మ్యాచ్‌కు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పార్కింగ్ సంబంధించిన వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రేక్షకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నారని తెలిపారు. స్టేడియం, పిచ్ అంత ఇప్పటికే తనిఖీ చేశామని, నిషేధిత వస్తువులను ఎవ్వరూ మైదానంలోకి తీసుకుసరావొద్దని సూచించారు. హెల్మెట్, పవర్ బ్యాంక్, సిగరెట్లు, లాప్టాప్, మద్యం, తినే ఆహార పదార్థాలతోపాటు బయటినుంచి తీసుకొచ్చే వాటర్ బాటిళ్లను సైతం లోపలికి అనుమతించమని వెల్లడించారు. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని, అన్ని ప్రవేశద్వారాల వద్ద చెకింగ్ పాయింట్స్ ఉంటాయని తెలిపారు. -
ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్‌లో
న్యూఢిల్లీ: ఐపీఎల్–12 ఫైనల్ నిర్వహణ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం మే 12న చెన్నైలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానానికి తరలించారు. చెన్నై చెపాక్ స్టేడియంలో మూడు స్టాండ్ల వినియోగానికి సంబంధించి అనుమతులు పొందడంలో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) విఫలం కావడంతో మార్పు తప్పనిసరైనట్లు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ పరిణామం డిఫెండింగ్ చాంపియన్, స్థానిక జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కొంత నిరాశ పర్చేదే. అయితే, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడం ద్వారా చెన్నై క్వాలిఫయర్–1ను సొంత మైదానంలో ఆడే అవకాశం ఉంది. గతేడాది విజేత జట్టుకు చెందిన మైదానం అయినందున క్వాలిఫయర్–1 వేదికను మార్చే వీలు లేకపోయింది. మరోవైపు ఎలిమినేటర్, క్వాలిఫయర్–2లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికితోడు మూడు జట్లతో కూడిన మహిళల మినీ ఐపీఎల్‌కు మే 6 నుంచి 10వ తేదీ మధ్య జైపూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్‌కు తోడు కొత్తగా వెలాసిటీ జట్టు ఇందులో పాల్గొననుంది. -
ఐపీఎల్ ఫైనల్ మనదగ్గరే..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ఫైనల్ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికకానుంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ వేదిక హైదరాబాద్‌ను ఖరారు చేస్తూ బీసీసీఐ పాలకుల కమిటీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. మే 12న జరగనున్న ఈ మ్యాచ్ కోసం చెన్నై స్టేడియంలో ఐ, జే, కే స్టాండ్స్‌ని ప్రారంభించడానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇవ్వకపోవడంతో ఫైనల్ మ్యాచ్ వేదికను హైదరాబాద్‌కు మారుస్తున్నామని అధికారులు తెలిపారు. చెన్నైలోని చెపాక్‌లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుండగా విశాఖపట్నం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనున్నాయి. మే 7న చెన్నైలో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు రెండూ హైదరాబాద్ లోనే జరుగుతాయని భావించినప్పటికీ.. మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున భద్రతా పరమైన చిక్కులు తలెత్తె అకాశం ఉండటంతో మ్యాచ్‌లను విశాఖకు తరలించినట్టు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మే 8న ఎలిమినేటర్, మే 10న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు రెండూ విశాఖలో జరగనున్నాయి. -
ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్‌లో!
న్యూఢిల్లీ: ఐపీఎల్–2019 తుది పోరు హైదరాబాద్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్‌కు వేదికగా ఉప్పల్ స్టేడియాన్ని సీఓఏ దాదాపుగా ఖరారు చేసింది. చెన్నైలో ‘స్టాండ్స్’ సమస్యకు పరిష్కారం లభించకపోతే ఇదే ఖాయమవుతుంది. వాస్తవానికి గత ఏడాది సూపర్ కింగ్స్ విజేతగా నిలవడంతో చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగాలి. అయితే చిదంబరం స్టేడియంలో ఏడేళ్లుగా కొనసాగుతున్న ‘స్టాండ్స్’ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మధ్య గొడవ కారణంగా ఏ మ్యాచ్ జరిగినా కూడా మూడు స్టాండ్లు అప్పటినుంచి ఖాళీగానే ఉంటున్నాయి. అయితే దీనిని తేల్చుకునేందుకు అసోసియేషన్‌కు సీఓఏ వారం రోజులు గడువిచ్చింది. ‘మూడు స్టాండ్లు అంటే 12 వేల మంది ప్రేక్షకులు. ఇంత మంది కనిపించకపోతే మైదానం బోసిపోతుంది. ప్లే ఆఫ్‌కు వెళితే సొంత మైదానంలో ఆడే అవకాశం చెన్నై కోల్పోరాదని మేమూ కోరుకుంటున్నాం. అయితే క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకు రాకపోతే 2018 రన్నరప్ హైదరాబాద్‌లోనే ఫైనల్ నిర్వహిస్తాం. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మహిళలతో మినీ ఐపీఎల్... సీఓఏ సమావేశంలో మరికొన్ని ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎల్‌తో సమాంతరంగా నిర్వహించనున్న మహిళల మినీ ఐపీఎల్లో మూడు జట్లు ఉంటాయి. గత ఏడాది జరిగిన ఒకే ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు భిన్నంగా ఈసారి మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వీటిలో ఒక మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుండగా...మిగిలిన మూడు మ్యాచ్‌లు బెంగళూరులో జరిగే అవకాశం ఉంది. మరో వైపు భారత్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ మ్యాచ్‌ల కోసం ఇప్పటి వరకు టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న పేటీఎమ్ ఒప్పంద గడువు ముగిసింది. దాంతో కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే రెండు వారాల్లో భారత క్రికెట్‌కు సంబంధించి ‘ప్లేయర్స్ అసోసియేషన్’ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. -
రైజింగ్ స్టార్స్
-
ఉప్పల్ వన్డేలో టీమిండియా విజయం
-
నేడు హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే
-
కౌంట్‌డౌన్ 5..4..3..2..1...
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అనేది పేరుకు మాత్రమే. అటు భారత ఆటగాళ్ల దృష్టిలో, మన అభిమానుల కోణంలో కూడా రాబోయే వరల్డ్ కప్ గురించే ఆలోచనలన్నీ. ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు మనవాళ్లు ఎలా ఆడతారు? మిగిలిపోయిన లోపాలేమైనా ఉంటే వాటిని ఎలా సరిదిద్దుకుంటారు? అన్ని బాగా కుదిరాయి అనుకున్నా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయేమో? ఆసీస్‌తో సిరీస్‌ను కెప్టెన్ కోహ్లి సహా టీమ్ మేనేజ్మెంట్ ఇదే రీతిలో చూస్తోంది. ప్రపంచ కప్ కోసం దాదాపుగా ఇదే జట్టు అయినా చివరి ఒకటి లేదా రెండు స్థానాలు దక్కించుకునే ప్రయత్నంలో అవకాశం అందుకున్న వారు ఎలా రాణిస్తారనేది కీలకం కానుంది. ఈ నేపథ్యంలో విశ్వపోరుకు కౌంట్‌డౌన్‌గా సాగబోతున్న సిరీస్ తొలి మ్యాచ్‌కు భాగ్యనగరం వేదికైంది. టి20 సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా 50 ఓవర్ల పోరును ఎలా ప్రారంభిస్తుందనేది ఆసక్తికరం. సాక్షి, హైదరాబాద్:వన్డే ప్రపంచ కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు దాదాపు వంద రోజుల సమయం ఉంది. అయితే మెగా టోర్నీకి ముందు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్‌తో ఇప్పటి నుంచే వరల్డ్ కప్ వేడి కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తో పోరుకు తెర లేవనుంది. అనూహ్యంగా స్వదేశంలో టి20 సిరీస్ ఓడిన అనంతరం కోహ్లి సేన తన అసలు సత్తాను ప్రదర్శించాలని పట్టుదలగా ఉండగా, అటు విజయం ఇచ్చిన కొత్త ఉత్సాహంతో కంగారూలు ఆటకు సిద్ధమయ్యారు. రాహుల్‌కు అవకాశముందా! కోహ్లి నాయకత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో చివరిసారిగా ఆడింది. సిరీస్ గెలిచాక జరిగిన తర్వాతి రెండు వన్డేలలో టీమిండియా ప్రయోగాలు చేసింది. కాబట్టి మూడో వన్డే జట్టునే తీసుకుంటే తుది 11 మంది విషయంలో సందేహాలు అనవసరం. రోహిత్, ధావన్‌ల ఓపెనింగ్‌కు తోడు కోహ్లి మూడో స్థానంలో ఎప్పటిలా చెలరేగితే భారత్ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. నాలుగో స్థానాన్ని ఖాయం చేసుకున్న అంబటి రాయుడు సొంతగడ్డపై తనదైన శైలిలో మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలతో ఉన్నాడు. మిడిలార్డర్లో ఆ తర్వాత జాదవ్, ధోని అతడిని అనుసరిస్తారు. వీరిద్దరినుంచి జట్టు మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. హార్దిక్ పాండ్యా గైర్హాజరు నేపథ్యంలో ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్‌కు మరో అవకాశం దక్కడం ఖాయం. ఇద్దరు స్పిన్నర్లుగా చహల్, కుల్దీప్ యాదవ్ మళ్లీ చెలరేగితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. బుమ్రా, షమీ ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగుతారు. కాబట్టి మూడో పేసర్‌గా సిద్ధార్థ్ కౌల్ తొలి రెండు వన్డేలకు ఎంపికైనా... అతనికి తుది జట్టులో చోటు కష్టమే. మరోవైపు వన్డేల్లో సత్తా నిరూపించుకోవాలని ఆశిస్తున్న కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు మేనేజ్మెంట్ ఎలా అవకాశం కల్పిస్తుందనేది చూడాలి. విజయ్ శంకర్‌కు బదులుగా వీరిద్దరిలో ఒకరికి చోటిస్తే ఐదో బౌలర్ కోటా పూర్తి చేయడం కష్టమవుతుంది. రాహుల్‌పై జట్టు పెంచుకున్న నమ్మకం, కోహ్లి మద్దతు చూస్తే అతడిని ఈ సిరీస్‌లో తగిన విధంగా పరీక్షించాలని జట్టు భావిస్తోంది. అదే జరిగితే రాయుడు స్థానంలో ఆడించవచ్చు. మరోవైపు అనూహ్యంగా వన్డేల్లో చోటు కోల్పోయిన దినేశ్ కార్తీక్ కూడా టీమ్ బయట నుంచి జట్టు ప్రదర్శన చూస్తూ తన ఆశలు పెంచుకుంటాడనడంలో సందేహం లేదు. ఫించ్తోనే సమస్య! టి20 సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న జోరులో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. భారత గడ్డపై వన్డేల్లో మంచి రికార్డు ఉండటం ఆసీస్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఆసీస్ టి20, వన్డే సిరీస్‌ల కోసం ఒకే జట్టుతో భారత్‌కు వచ్చింది. అయితే కొందరు ప్రధాన ఆటగాళ్లు వన్డేల్లోకి బరిలోకి దిగనున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లు ఫించ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, హ్యాండ్స్కోంబ్లను మినహాయిస్తే కొన్ని మార్పులు ఉంటాయి. వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా, మూడో స్థానంలో ఉస్మాన్ ఖాజా ఆడతాడు. ఇద్దరు స్పిన్నర్ల కూర్పు అయితే∙ఆడమ్ జంపాతో పాటు ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ బరిలోకి దిగుతాడు. టెస్టుల్లో అద్భుతమైన ఆటగాడైన లయన్ భారత గడ్డపై తెల్ల బంతితో ఎలా రాణిస్తాడో చూడాలి. వన్డే స్పెషలిస్ట్ ఆస్టన్ టర్నర్‌పై కూడా ఆసీస్ బాగా ఆశలు పెట్టుకుంది. అయితే టి20లతో పోలిస్తే భారత బౌలింగ్‌ను ఎదుర్కొని 50 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా నిలబడగలదా అనేదే సమస్య. ఇటీవల సొంతగడ్డపైనే ఆ జట్టు భారత్ చేతిలో సిరీస్ కోల్పోయింది. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు చెలరేగుతుండగా ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా తన ముద్ర వేయలేకపోయారు. సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన షాన్ మార్‡్ష వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమయ్యాడు. శుక్రవారం ఉదయమే అతను హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అన్నింటికి మించి కెప్టెన్ ఫించ్ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. గత 7 వన్డేల్లో అతను ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. టాపార్డర్‌లో అతను చెలరేగితేనే ఆసీస్ విజయంపై ఆశలు పెంచుకోవచ్చు. పేస్‌లో కమిన్స్‌తో పాటు కూల్టర్‌నీల్, రిచర్డ్సన్లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. పిచ్, వాతావరణం రాజీవ్‌గాంధీ స్టేడియంలో చక్కటి బ్యాటింగ్ వికెట్ సిద్ధం. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంది. నగరంలో మార్చి తొలి వారం ఎండలు ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి వాతావరణం వల్ల ఆటకు ఎలాంటి సమస్య లేదు. ఆ ‘175’ గుర్తుందా? 463 వన్డేలాడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్లో డబుల్ సెంచరీ తర్వాతి స్థానం 175 పరుగుల ఇన్నింగ్స్‌దే. దానికి వేదికగా నిలిచింది ఉప్పల్ మైదానమే. నాటి ప్రత్యర్థి కూడా ఆస్ట్రేలియానే కావడం విశేషం. 2009 నవంబరు 5న జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో తొలుత వీరేంద్ర సెహ్వాగ్ (38), తర్వాత సురేశ్ రైనా (59) తోడుగా సచిన్ వీరోచిత ఇన్నింగ్స్ (141 బంతుల్లో 175; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడాడు. కానీ, లక్ష్యానికి 18 బంతుల్లో 19 పరుగులు అవసరమైన స్థితిలో సచిన్ ఔటవడంతో టీమిండియా 347 పరుగుల వద్దే ఆగి 3 పరుగులతో ఓడింది. అయినా సరే భారీ స్కోర్ల ఈ మ్యాచ్ అభిమానులకు, ముఖ్యంగా హైదరాబాదీలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 0–2 ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 వన్డేలు జరగ్గా రెండూ ఆసీస్ గెలిచింది. 2007లో 47 పరుగులతో, 2009లో 3 పరుగులతో నెగ్గింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు/రాహుల్, జాదవ్, ధోని, విజయ్ శంకర్, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఖాజా, టర్నర్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, కారీ, జంపా, కమిన్స్, రిచర్డ్సన్, బెహ్రన్‌డార్ఫ్/లయన్. ఓటమి ఎదురైనా ప్రయోగాలు చేయాలని లేదు... ఒక్కో ఆటగాడిని వేర్వేరు పరిస్థితుల్లో పరీక్షిస్తున్నాం. ప్రతీ జట్టులాగే వరల్డ్ కప్‌కు ముందు అన్నీ చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. నాలుగో స్థానంలో ఆడేందుకు నాకెలాంటి సమస్య లేదు. çవరల్డ్ కప్ తుది జట్టు ఎలా ఉంటుందో నేను చెప్పలేను కానీ రాహుల్ తన ఆటతో కచ్చితంగా అవకాశం సృష్టించుకున్నాడు. టి20 సిరీస్ ముగిసిన కథ. బాగా ఆడలేదు కాబట్టే ఓడాం. ఓటమి ఎదురైనా ప్రయోగాలు చేయాలని నేను అనుకోను. మేమంతా గెలవడం కోసమే ఆడుతున్నాం. వరల్డ్ కప్ జట్టు ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శన పాత్ర ఏమీ ఉండదు. ఎందుకంటే ఐపీఎల్ మొదలయ్యే సమయానికే జట్టు ఏమిటో తెలిసిపోతుంది. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ ►మధ్యాహ్నం గం.1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
నేటి నుంచి కౌంటర్లలో...
సాక్షి, హైదరాబాద్: మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి వన్డే కోసం నేటి నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నేరుగా కౌంటర్లలో టికెట్లు అమ్మనుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. మరోవైపు ఈనెల 11 నుంచే ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉండగా... ఇప్పటికే కొన్నవారు 23 నుంచి జింఖానా మైదానంలోనే వాటిని ‘రిడీమ్’ చేసుకొని అసలు టికెట్లను పొందవచ్చని హెచ్‌సీఏ పేర్కొంది. -
ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సాధన
-
ఉమేశ్ ఉప్పెన...
సాక్షి, హైదరాబాద్: ‘నేనెప్పుడైనా పొదుపుగా బౌలింగ్ చేసి బయట పడిపోవాలని ప్రయత్నించను... నా చేతిలో బంతి ఉందంటే వికెట్లు తీయడంపైనే దృష్టి పెడతా’... ఇటీవల తన బౌలింగ్ గురించి ఉమేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అతని బౌలింగ్ పదును ఏమిటో తాజాగా హైదరాబాద్ టెస్టులో కనిపించింది. జీవం లేని భారత పిచ్‌లపై ఒక ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం అంత సులువు కాదు. విదేశాల్లో మన పేసర్లు చెలరేగిపోవడం కూడా కొత్త కాదు. కానీ సత్తా ఉంటే భారత్‌లో కూడా పేసర్లు సత్తా చాటగలరని ఉమేశ్ నిరూపించాడు. బౌన్స్‌కు అనుకూలించిన ఉప్పల్ పిచ్‌పై అతను చక్కటి ఫలితం రాబట్టాడు. భారత్‌లో 5 వికెట్లు, 10 వికెట్లు తీసిన బౌలర్ అంటే ఏ అశ్వినో, జడేజానో అని అలవాటుగా మారిపోయిన అందరికీ నేనున్నానని ఉమేశ్ గుర్తు చేశాడు. స్వదేశంలో 19 ఏళ్ల తర్వాత 10 వికెట్ల ఘనత సాధించిన పేసర్‌గా కపిల్, శ్రీనాథ్‌ల సరసన నిలిచాడు. సొంతగడ్డపై వచ్చేసరికి భారత ప్రధాన పేసర్‌గా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు దక్కాయి. ఆగస్టు 2016 నుంచి భారత్ ఇక్కడ 18 టెస్టులు ఆడితే అతను 17 ఆడాడు. సొంతగడ్డపై తన ఎంపికకు ప్రతీసారి న్యాయం చేశాడు. మొత్తంగా భారత్‌లో 24 టెస్టుల్లో ఉమేశ్ పడగొట్టిన 73 వికెట్లలో 38 బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూలే ఉన్నాయి. ఇది అతని బౌలింగ్ సత్తాను చూపించింది. హైదరాబాద్ టెస్టులో ఉమేశ్ ప్రదర్శన అతని కఠోర శ్రమకు, పట్టుదలకు నిదర్శనం. భారత్‌లో గత రెండేళ్లుగా అద్భుతమైన రికార్డు ఉన్నా విదేశాలకు వెళ్లేసరికి అతనికి తుది జట్టులో స్థానం లభించడమే గగనంగా మారిపోయింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో కలిపి ఎనిమిది టెస్టుల్లో అతనికి రెండు మ్యాచ్‌లు మాత్రమే లభించాయి. సుదీర్ఘ కాలంగా జట్టుతో ఉన్నా ఇషాంత్, షమీ, భువనేశ్వర్‌ల తర్వాతే అతనికి అవకాశం దక్కేది. ఇప్పుడు పైజాబితాలో బుమ్రా కూడా చేరడంతో ఉమేశ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అయితే దీనికి అతను కుంగిపోలేదు. ఏ దశలోనూ సహనం కోల్పోని ఉమేశ్... ‘వారంతా బాగా ఆడుతుంటే నేను చోటు ఆశించడం తప్పు. నాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం చెలరేగాల్సిందే’ అంటూ నిజాయితీగా వ్యాఖ్యానించాడు. వరుసగా అవకాశాలు దక్కకపోయినా... ఎప్పుడో ఒకసారి మ్యాచ్ అవకాశం దక్కినా 100 శాతానికి పైగా శ్రమిస్తూ పూర్తి ఉత్సాహంతో బౌలింగ్ చేయడం ఉమేశ్‌కు బాగా తెలుసు. రెండో టెస్టులో శార్దుల్ గాయంతో సింగిల్ హ్యాండ్ పేసర్‌గా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఒక రోజులో భారత గడ్డపై ఒక పేసర్ ఏకంగా 23 ఓవర్లు బౌలింగ్ చేయడం అసాధారణం. కానీ ఉమేశ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇది అతని ఫిట్నెస్ సామర్థ్యానికి సూచిక. అతని 118 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్లో ఇదే మొదటి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కావడం విశేషం. వేగానికి స్వింగ్ జోడిస్తే ఆ బౌలింగ్‌కు ఏ ఫార్మాట్లోనైనా తిరుగుండదని నమ్మే ఉమేశ్ ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై అత్యంత కీలకంగా మారతాడనడంలో సందేహం లేదు. 2012లో పెర్త్ వికెట్‌పై ఐదు వికెట్లు తీసిన అతను ఈసారి మరింత జోష్‌తో అక్కడికి వెళ్లడం ఖాయం. పదో వికెట్ కోసం... విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ ఉమేశ్ వేశాడు. అప్పటికే విండీస్ 6 వికెట్లు కోల్పోతే అతను 3 వికెట్లు తీశాడు. అయితే తర్వాతి 13 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. విండీస్ 9 వికెట్లు కోల్పోయిన దశలో 47వ ఓవర్ జడేజా వేయడానికి సిద్ధమయ్యాడు. బంతిని తీసుకొని ఇక ఓవర్ మొదలు పెట్టడమే ఆలస్యం. అయితే అప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టని కోహ్లికి ఒక్కసారిగా ఉమేశ్ పదో వికెట్ ఘనత గుర్తుకొచ్చినట్లుంది. దాంతో జడేజా నుంచి బంతి తీసుకొని లాంగాన్‌లో ఉన్న ఉమేశ్‌ను పిలిచాడు. జడేజా కూడా నవ్వుతూ అతని భుజం చరిచి బెస్టాఫ్ లక్ చెప్పాడు. ఒకే ఒక్క బంతి... అంతే గాబ్రియెల్ క్లీన్ బౌల్డ్, ఉమేశ్ కెరీర్లో తొలిసారి 10 వికెట్ల ఘనత.. సహచరులంతా గట్టిగా అభినందిస్తూ అతని జుట్టు ముడి తీసి సరదాగా నవ్వుతుండగా ఉమేశ్ సగర్వంగా పెవిలియన్ వైపు చేరాడు. -
హైదరాబాద్: భారత్-విండీస్ మ్యాచ్ దృశ్యాలు
-
మూడు సెక్షన్ల కింద కేసు నమోదు...
మైదానంలోకి దూసుకెళ్లి కోహ్లితో సెల్ఫీ దిగి హల్చల్ చేసిన యువకుడిని కడప జిల్లా వాసి మొహమ్మద్ ఖాన్‌గా గుర్తించారు. అతనిపై సెక్షన్–341, 448, 506ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కోహ్లికి వీరాభిమాని అయిన 19 ఏళ్ల మొహమ్మద్ ఖాన్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడని... అతని తండ్రి మొహమ్మద్ జమీల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. టెస్టు మ్యాచ్ చూసేందుకు గురువారం కడప నుంచి రైలులో బయలుదేరిన ఖాన్ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడని... అక్కడి నుంచి మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్న జింఖానా మైదానానికి చేరుకొని అక్కడ రూ. 100 టికెట్ కొనుగోలు చేసి ఉప్పల్ స్టేడియానికి వచ్చాడని ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు... ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో విధులు నిర్వహిస్తూ నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లి వీరాభిమాని గ్రౌండ్లోకి దూసుకెళ్లడాన్ని సీపీ తీవ్రంగా పరిగణించారు. కోహ్లి వీరాభిమాని మహ్మద్ ఖాన్ గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తున్న నేరెడ్మెట్ ఎస్ఐ ప్రభాకర్, జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ శ్రీను, కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ హోంగార్డు నారాయణలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
రెండో టెస్ట్: పుంజుకున్న వెస్టిండీస్ జట్టు
-
తొలిరోజు విండీస్‌దే
సాక్షి, హైదరాబాద్: తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత పర్యాటక వెస్టిండీస్ జట్టు పుంజుకుంది. శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్‌మెన్ తొలుత తడబడినా.. చివరికి నిలబడి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. టీమిండియాతో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోస్టన్ ఛేజ్ (98 బ్యాటింగ్), కెప్టెన్ హోల్డర్(52) రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి కరీబియన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక్క వికెట్ సాధించాడు. రాణించిన కుల్దీప్, ఉమేశ్ టాస్ గెలిచిన విండీస్ సారథి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అరంగేట్ర టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ పది బంతులేసిన అనంతరం గాయపడటంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను సారథి విరాట్ కోహ్లి రంగంలోకి దింపాడు. అశ్విన్ వచ్చీ రాగనే ఓపెనర్ పావెల్(22)ను వెనక్కి పంపించారు. మరో వైపు ఆచితూచి ఆడుతున్న బ్రాత్‌వైట్(14)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కుల్దీప్ దెబ్బకి విండీస్ మిడిలార్డర్ మరోసారి విఫలమవ్వడంతో 113 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు పేసర్ ఉమేశ్ యాదవ్ వీలు చిక్నిప్పుడల్లా వికెట్లు తీస్తూ కరీబియన్ జట్టుపై ఒత్తిడి పెంచాడు. చేజ్, హోల్డర్ల పోరాటం అదుర్స్ విండీస్ తొలి రోజు నిలబడిందంటే క్రెడిట్ మొత్తం రోస్టన్ చేజ్దే. ఓ వైపు వికెట్లు పడుతున్న పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. వికెట్ కీపర్ డౌరిచ్(30)తో కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించాడు. డౌరిచ్ ఔటైన అనతంరం క్రీజులోకి వచ్చిన సారథి జాసన్ హోల్డర్(52) చేజ్‌కు జతకలిశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ ఇరువురూ అర్థశతకాలు సాధించారు. ప్రమాదకరంగా మారుతున్న హోల్డర్‌ను ఉమేశ్ ఔట్ చేశాడు. దీంతో ఏడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆటముగిసే సమయానికి ఛేజ్కు తోడుగా దేవేంద్ర బిషూ(2 బ్యాటింగ్)క్రీజ్‌లో ఉన్నాడు. చదవండి: హైదరాబాద్ టెస్ట్: శార్ధుల్ ఠాకుర్ అరంగేట్రం అరంగేట్రం అంతలోనే గాయం! -
రూ. 100 ... రూ. 3000
సాక్షి, హైదరాబాద్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ప్రేక్షకులకు అమ్మకానికి ఉంచారు. నేటి (బుధవారం) నుంచి ఈ టికెట్లు ఆన్లైన్ eventsnow.com)తో పాటు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో లభిస్తాయి. ఒక రోజు ఆటకు సంబంధించి కనిష్ట ధర రూ. 100 కాగా, గరిష్టంగా రూ.1000గా నిర్ణయించారు. ఐదు రోజుల కోసం ఒకే సారి సీజన్ టికెట్ కొనుక్కుంటే రూ. 300 నుంచి రూ. 3000 వరకు విలువ గల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం కేవలం 10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాస్లుగా నిర్ణయించారు. దాంతో దాదాపు 39 వేల సామర్థ్యం గల రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సుమారు 35 వేల వరకు టికెట్లు ప్రేక్షకులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. -
కూర్పులో మార్పు!
‘ఈ కుర్రాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం. సరిపడా అవకాశాలిస్తాం. కుదురుకునేంత వరకు వారు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం’ తొలి టెస్టు అనంతరం ఓపెనింగ్ స్థానాల విషయమై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యలివి. అతడి ఆలోచనలకు తగ్గట్లు యువ ఓపెనర్ పృథ్వీ షాకు ఇప్పటికే అనూహ్యంగా అవకాశం దక్కింది. ఇక మిగిలింది మయాంక్ అగర్వాల్! టన్నులకొద్దీ పరుగులతో జాతీయ జట్టు తలుపును బలంగా బాదిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ రాజ్‌కోట్‌లోనే అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. చివరి క్షణంలో బెంచ్‌కు పరిమితమైనా... హైదరాబాద్‌లో మాత్రం అతడి కల నెరవేరే సూచన కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడినీ పరీక్షించి చూద్దామని భావిస్తుండటం దీనికి ఓ కారణంగా తెలుస్తోంది. ఇదే జరిగితే... ఉప్పల్‌లో కోహ్లి సేన తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సాక్షి క్రీడా విభాగం: ఐదుగురు బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, ఐదుగురు బౌలర్ల వ్యూహంతో తొలి టెస్టు బరిలో దిగి మూడు రోజుల్లోపే ప్రత్యర్థి చుట్టేసిన టీమిండియా... సిరీస్‌లో చివరిదైన హైదరాబాద్ టెస్టులో మాత్రం భిన్న కూర్పుతో ఆడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరంగేట్రం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. అయితే, అతడు ఇన్నింగ్స్ ప్రారంభించకపోవచ్చు. ఆ బాధ్యతను లోకేశ్ రాహుల్, పృథ్వీ షాల పైనే ఉంచి మయాంక్‌ను వన్‌డౌన్‌లో పంపాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. అలాగైతే, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు తప్పనిసరి అవుతోంది. మయాంక్‌ను తీసుకుంటూనే, ఐదుగురు బౌలర్లూ ఉండాలనుకుంటే ఒక బ్యాట్స్‌మన్‌పై వేటు వేయాలి. అలా కాదంటే బౌలర్ (బహుశా పేసర్)ను కుదించుకుని బరిలో దిగాలి. దీనికి కోహ్లి పెద్దగా మొగ్గుచూపడు. ఎలాగూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బ్యాటింగ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తే తప్ప... బలహీనమైన విండీస్‌పై ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడటం అనవసరం. ఈ నేపథ్యంలో పక్కనపెట్టేది ఎవరినో? అతడివైపే వేళ్లన్నీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టులో ఇబ్బంది నెలకొంది వైస్ కెప్టెన్ అజింక్య రహానేకే. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో ఒక్క శతకం కూడా చేయలేక నిరాశపర్చిన అతడికి రాజ్‌కోట్‌లో భారీ ఇన్నింగ్స్‌తో ఆ లోటు పూడ్చే అవకాశం దక్కింది. ఉన్నంతసేపు బాగానే ఆడినా మోస్తరు స్కోరు మాత్రమే చేసి తేలిగ్గా వికెట్ ఇచ్చేశాడు. విండీస్‌పై ఓ పెద్ద ఇన్నింగ్స్‌తో ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవడంతో పాటు బ్యాట్స్‌మన్‌గానూ టచ్‌లోకి వచ్చే మంచి చాన్స్‌ను అతడు చేజార్చుకున్నాడు. ఇప్పుడు మయాంక్ రాకతో తప్పించే బ్యాట్స్‌మన్ ఎవరంటే ముందుగా అందరి వేళ్లు రహానేనే చూపుతున్నాయి. కావాలనుకుంటే చతేశ్వర్ పుజారానూ పక్కన పెట్టొచ్చు కానీ, ఇంగ్లండ్ పర్యటన నుంచి చూపుతున్న ఫామ్‌రీత్యా దానిపై ఆలోచన చేయపోవచ్చు. ఇలా చూస్తే మిగులుతోంది రహానేనే. అయితే, కీలకమైన ఆసీస్ పర్యటనకు ముందు అతడిని తీయడం అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే. లోపాన్ని అధిగమించు... రాహుల్ గత 8 ఇన్నింగ్స్‌ల్లో అయితే బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ. ఇదీ కేఎల్ రాహుల్ ఔటైన తీరు. వీటిలో కొన్ని మంచి బంతులున్నాయని సర్దిచెప్పుకొన్నా... రాహుల్ స్థాయి నాణ్యమైన ఆటగాడు వాటిని ఆడగలడు. అయితే, పాదాలను ఆలస్యంగా కదుపుతూ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బౌలర్లకు దొరికిపోతున్నాడు. ఇప్పటివరకు 30 టెస్టుల్లో 49 ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్... 23 సార్లు 25 బంతులు కూడా ఆడకుండానే అవుటయ్యాడు. దీన్నిబట్టి ఒకటీ అరా సాంకేతిక లోపాలను దిద్దుకుని ‘ప్రారంభ బలహీనత’ను అధిగమించాల్సి ఉంది. కొంత ఆత్మవిశ్వాస లోపంతోనూ కనిపిస్తున్న రాహుల్ మరిన్ని ఓవర్లు ఆడటం ద్వారా దానిని దాటే వీలుంది. పైగా, హైదరాబాద్ వికెట్ ఓపెనర్లకు బాగా కలిసొస్తుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఉప్పల్ పిచ్‌పై గత ఐదేళ్ల ఓపెనింగ్ సగటు భాగ స్వామ్యం 40 కావడం గమనార్హం. ఇదే అనుకూలతతో లోకేశ్ రాహుల్ ఓ చక్కటి ఇన్నింగ్స్ ఆడతాడేమో చూద్దాం. ఆసీస్ టూర్ సన్నాహాలపై చర్చ! సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్‌కు సంబంధించి కొన్ని కీలకాంశాలను చర్చించేందుకు పరిపాలకుల కమిటీ (సీఓఏ) బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, సెలక్షన్ కమిటీ సభ్యులతో వేర్వేరు అంశాలపై సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ చర్చిస్తారు. ఇటీవల జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం సెలక్టర్లు తమతో మాట్లాడలేదంటూ మురళీ విజయ్, కరుణ్ నాయర్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాలకు సంబంధించి ఆటగాళ్లు, సెలక్టర్ల మధ్య మరింత మెరుగ్గా సమాచార మార్పిడి ఉండాలని సీఓఏ భావిస్తోంది. ఈ సమావేశంలోనే రాబోయే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు సంబంధించి సన్నాహకాలపై కూడా చర్చ జరగనుంది. దీంతో పాటు విదేశాల్లో మన స్పిన్నర్ల ప్రదర్శనను మెరుగుపర్చేందుకు స్పెషలిస్ట్ స్పిన్ బౌలింగ్ కోచ్‌ను తీసుకోవాలనే చర్చ నడుస్తోంది. -
ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్
టీమిండియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తలపడబోయే వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కోర్ట్నీ బ్రౌన్ నేతృత్వంలోని సెలక్షన్ బోర్డు జాసన్ హోల్డర్ సారథ్యంలోని 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అక్టోబర్‌లో కరీబియన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విండీస్ జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో ఆకట్టుకున్న 36 ఏళ్ల సీనియర్ ఆటగాడు, టాపార్డర్ బ్యాట్స్‌మన్ డెవోనో స్మిత్‌కు జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా గత సిరీస్‌లకు దూరమైన సునీల్ ఆంబ్రిస్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్న జాసన్ హోల్డర్‌పై సెలక్షన్ కమిటీ ప్రశంసల వర్షం కురిపించింది. తొలి టెస్టు మ్యాచ్‌కు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుండగా.. రెండో టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి టెస్టు: అక్టోబర్ 3 నుంచి 8 వరకు, రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం రెండో టెస్టు: అక్టోబర్ 12 నుంచి 16 వరకు, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం విండీస్ టెస్టు జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, బ్రాత్‌వైట్, రోస్టన్ చేస్, షేన్ డౌరిచ్, షెన్నాన్ గాబ్రియల్, జహ్మార్ హామిల్టన్, షిమ్రాన్ హెట్మెర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కీమర్ రోచ్, జోమెల్ వరికన్. -
మ్యాన్ హోల్లోకి దిగి ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
-
ఉప్పల్ స్టేడియం వద్ద విషాదం
సాక్షి, హైదరాబాద్: భావి విశ్వనగరం.. భాగ్యనగరం మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులను పొట్టనపెట్టుకుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ 1 వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. మ్యాన్ హోల్ లోపలికి దిగిన కార్మికులు ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మ్యాన్‌హోల్ నుంచి మృతదేహాలను బయటికి తీశారు. మృతులు సంతోష్(28), విజయ్(25)లు హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి స్వస్థలం ఒడిశా అని పోలీసులు తెలిపారు. జలమండలి వాటర్ పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం సెంట్రింగ్ కర్రలు తొలగించే క్రమంలో దిగిన కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తప్పు ఎవరిది?: రెండేళ్ల కిందట హైటెక్ సిటీ సమీపంలో మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పెద్ద ఎత్తున మినీ ఎయిర్‌టెక్ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన సందర్భంలో ‘‘ఇక నుంచి కార్మికులు మ్యాన్ హోల్స్‌లో దిగే పరిస్థితి ఉండదు’’ అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, బుధవారం ఉప్పల్ స్టేడియం వద్ద చోటుచేసుకున్న ఘటనలో తప్పు జలమండలిదా, ఎల్ అండ్ టీ సంస్థదా అన్నది తేలాల్సిఉంది. తోటి కార్మికుల మరణవార్త ఆ సంస్థలో పనిచేస్తోన్న మిగతావారిని కలవరపాటుకు గురిచేసంది. -
సన్‌రైజర్స్‌ను మేమే గెలిపించాం: కోహ్లి
హైదరాబాద్: ప్రేక్షకుల హాజరు, టీఆర్పీ రేటింగ్స్ పరంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్.. ఈ ఐపీఎల్ సీజన్‌లోకెల్లా ‘ది బెస్ట్’గా నిలిచింది. ఆఖరి బంతి దాకా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగళూరు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలు మూటగట్టుకున్న ఆర్సీబీ.. ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. మ్యాచ్ ఫలితంపై బెంగళూరు సారధి విరాట్ కోహ్లి అనూహ్య వ్యాఖ్యలు చేశాడు. ‘‘నిజానికి మ్యాచ్‌పై సన్‌రైజర్స్ పట్టుసాధించింది అనడంకంటే మేమే వాళ్లకా అవకాశం కల్పించాం..’’అన్నాడు. ఇది మా దీనగాథ..: ‘‘చేతిలో నాలుగు వికెట్లు పెట్టుకుని 5 పరుగులు సాధించలేకపోయాం. ముమ్మాటికీ ఓటమికి అర్హులమే! మా బలాన్ని ప్రదర్శించడంలో దారుణంగా విఫలం చెందాం. స్లో వికెట్‌పై చెత్తషాట్లు ఆడాం. కొద్దిగా నిలదొక్కుకుని ఉంటే మంచి భాగస్వామ్యం నిర్మించొచ్చని ‘మన్దీప్-గ్రాండ్‌హోమ్’లు నిరూపించారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. బౌలింగ్ పరంగానూ 10-15 పరుగుల్ని కట్టడిచేసి ఉండాల్సింది. వాస్తవానికి దీన్ని హైదరాబాద్ గెలుపు అనడంకంటే మా ఓటమి అనడమే సమంజసం. ఇదీ.. టోర్నీలో మా దీనగాథ..’’ అని కోహ్లి అన్నాడు. కోహ్లి లెక్కలో బెస్ట్ టీమ్స్ ఏవంటే..: ‘తక్కువ స్కోర్లను కూడా డిఫెండ్ చేసుకుంటున్న సన్‌రైజర్స్‌ను బెస్ట్ టీమ్‌గా భావిస్తారా?’ అన్న కామెంటేటర్ ప్రశ్నకు కోహ్లి ఒకింత తెలివిగా సమాధానమిచ్చాడు. ‘‘అవును. బౌలింగ్ పరంగా సన్‌రైజర్స్ బెస్ట్ టీమే. వాళ్లకు(హైదరాబాద్ టీమ్‌కు) వాళ్ల బలం, పరిధులు పక్కాగా తెలుసు. ప్రదర్శన కూడా ఆ మేరకే ఉంటుంది. అది వారి విజయగాథ. అయితే ఆల్‌రౌండ్ ప్రతిభ పరంగా మాత్రం చెన్నై సూపర్ కింగ్సే బెస్ట్ టీమ్’’ అని విరాట్ ముగించాడు. కేన్ కెప్టెన్ ఇన్నింగ్స్: సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, షకీబ్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. సిరాజ్, సౌతీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 141 పరుగులే చేసి ఓడిపోయింది. కోహ్లి (30 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), గ్రాండ్‌హోమ్ (29 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. విలియమ్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
పోలీసుల ఆధీనంలో ఉప్పల్ స్టేడియం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఉప్పల్ స్టేడియానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్‌లో మొత్తం 7 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో రేపటి నుంచి స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. 2,500 మంది పోలీసులతో ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పిస్తామన్నారు. స్టేడియం ప్రాంగణంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. మ్యాచ్ ఉన్న రోజు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 9, 12, 22, 26, మే 5, 7, 19 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న మ్యాచ్( ఏప్రిల్ 22)కి వచ్చే వారికి మధ్యాహ్నం 1 గంట నుంచి అనుమతి ఉంటుందని , రాత్రి 8 గంటల మ్యాచ్‌లకి సాయంత్రం 5 గంటల నుంచి అనుమతి ఇస్తామన్నారు. మ్యాచ్‌లకు వచ్చేవారు ఒక సెల్ ఫోన్ మినహా, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, తిను బండరాలు కానీ అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడి వారం రోజుల్లో మొదలు కానుంది. ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లను అర్థరాత్రి 12.30 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌తో పాటు మే నెలలో కూడా ఈ పొడిగింపు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో మెట్రో రైళ్లను రాత్రి 10.00 గంటల వరకే నడుపుతున్నారు. గతంలో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇపుడు మెట్రో అధికారుల నిర్ణయంతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. అభిమానుల కోసం.. ఐపీఎల్ అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పొడిగింపుకు సంబంధించి సీబీటీసీ అనుమతి కోరగా, వారి నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నారు. అమీర్‌పేట నాగోల్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు... అమీర్‌పేట మియాపూర్ మార్గంలో 8 నిమిషాలకు రైలు నడుస్తుందన్నారు. -
మన హైదరాబాద్‌లో భారత తొలి డే-నైట్ టెస్ట్?
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇది కచ్చితంగా శుభవార్తే. నెలల వ్యవధిలోనే ఇక్కడ టెస్టు, వన్డే జరగనుంది. పైగా ఆ టెస్టును డేనైట్‌గా నిర్వహించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. హైదరాబాద్ లేదంటే రాజ్‌కోట్‌లో డేనైట్ మ్యాచ్ నిర్వహణకు బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ఆమోదిస్తే భారత్‌లో తొలి డేనైట్ టెస్టుకు రంగం సిద్ధమవుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్వదేశంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లకు వేదికలు ఖరారు చేసింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో అక్టోబర్‌లో ఒక టెస్టు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ జరుగనుంది. టెస్టులతో పాటు కొన్ని మ్యాచ్‌లకు సంబంధించి తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. బీసీసీఐ ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది భారత్‌లో కేవలం మూడు టెస్టులే జరుగనున్నాయి. అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ జూన్‌లో జరుగుతుంది. అనంతరం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు హైదరాబాద్, రాజ్‌కోట్‌ల్లో జరుగుతాయి. తర్వాత నవంబర్‌లో ఐదు వన్డేల సిరీస్‌ను ముంబై, గువాహటి, కొచ్చి, ఇండోర్, పుణే వేదికల్లో నిర్వహిస్తారు. మూడు టి20లు కోల్‌కతా, చెన్నై, కాన్పూర్లలో జరుగుతాయి. కోల్‌కతా మ్యాచ్ నవంబర్ 4న జరుగుతుంది. శనివారం జరిగిన బీసీసీఐ పర్యటనల ఖరారు కమిటీ సమావేశానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు గంగూలీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యాడు. దుబాయ్‌లో ఉన్న సీఈఓ రాహుల్ జోహ్రి, వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఈ మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. వచ్చే ఏడాది భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా ఇక్కడ ఐదు వన్డేలు, రెండు టి20లు ఆడుతుంది. మొహాలీ (ఫిబ్రవరి 24), హైదరాబాద్ (ఫిబ్రవరి 27), నాగ్‌పూర్ (మార్చి 2), ఢిల్లీ (మార్చి 5), రాంచీ (మార్చి 8)లో వన్డేలు, బెంగళూరు (మార్చి 10), విశాఖపట్నం (మార్చి 13) వేదికల్లో రెండు టి20లు జరుగుతాయి. -
మ్యాచ్ మజా మిస్సయితేనేం...
సాక్షి, హైదరాబాద్ : నిర్ణయాత్మక టీ-20 మ్యాచ్.. ఉప్పల్ మైదానం అనుకూలించకపోవటంతో రద్దు కావటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే ఫ్యాన్స్ ను ఊరడించేందుకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చేసిన ఓ పని మాత్రం అమితంగా ఆకట్టుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, హర్దిక్ పాండ్యా కలిసి మైదానంలో సరదాగా ప్రాక్టీస్ చేశారు. మాములుగా చేస్తే ఏం కిక్కుంటుందో అనుకున్నారో ఏమో ఎడమ చేతి వాటంను ప్రదర్శించారు. సరదాగా ఎడమ చేతి బ్యాటింగ్‌తో కాసేపు అలరించారు. ముందు మైదానంలోకి దిగిన రోహిత్ శర్మ కాస్త తడబడినప్పటికీ.. తర్వాత వచ్చిన కోహ్లీ మాత్రం ఫర్వాలేదనిపించాడు. ఇక తర్వాత దిగిన హర్దిక్ బ్యాట్‌ను బాగానే ఝుళిపించాడు. అటుపై వచ్చిన ధోనీ కూడా కాస్త కష్టపడ్డాడు. మొత్తానికి నలుగురిలో పాండ్యానే బెటర్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడన్న మాట. బీసీసీఐ తన అధికార ట్విట్టర్ లో ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇక పాపం కోహ్లీ ఎడమ చేతి వాటంను చూపించేస్తూ.. డీసెంట్ ప్రదర్శన అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Some left handed batting practice for the Captain and vice-captain as we wait for a further update on the start of play #INDvAUS pic.twitter.com/pG82JVyZIP — BCCI (@BCCI) October 13, 2017 And @msdhoni joins the party #INDvAUS pic.twitter.com/slN7dJqIdr — BCCI (@BCCI) October 13, 2017 Decent shot that by a left handed @imVkohli ! pic.twitter.com/clMoX4M5SQ — Saurabh Malhotra (@MalhotraSaurabh) September 4, 2017