Virat Kohli Appreciated Uppal Rajiv Gandhi International Stadium Ground Staff - Sakshi
Sakshi News home page

కోహ్లి ఫిదా..  తెలుగోళ్ల అభిమానమే వేరప్పా!

Published Fri, May 19 2023 6:05 PM | Last Updated on Fri, May 19 2023 6:22 PM

Kohli Appreciated Groundstaff-Uppal-Rajiv Gandhi International Stadium - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్‌సీబీ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడినప్పటికి మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకులు మాత్రం బాధపడలేదు. కారణం ఆర్‌సీబీ గెలిచింది కాబట్టి. ఎలాగూ ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి తప్పుకుంది..  ఆర్‌సీబీకి మద్దతు ఇస్తే సరిపోతుంది అని ప్రతి అభిమాని భావించాడు.


Photo: IPL Twitter

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు ఔట్‌ అయితే బాధపడాల్సింది పోయి సంతోషపడ్డారు. అలా అని ఎస్‌ఆర్‌హెచ్‌కు సపోర్ట్‌ చేయలేదని కాదు.. ఎందుకంటే క్లాసెన్‌ సెంచరీ చేయగానే స్టేడియం హోరెత్తిపోయింది. ఇక ఇటు కోహ్లి సెంచరీ చేయగానే కోహ్లి నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. ఇక మ్యాచ్‌ ఆద్యంతం కోహ్లి నామస్మరణతో మార్మోగిపోయింది. అలా మన తెలుగు అభిమానులు అటు ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇటు ఆర్‌సీబీకి బ్యాలెన్స్‌గా మద్దతిచ్చి అందరిని ఆకట్టుకున్నారు. 


Photo: IPL Twitter

ఈ అభిమానమే కోహ్లిని ఫిదా చేసింది. అందుకే సెంచరీ చేయగానే స్టేడియంలో ఉన్న ప్రతీ స్టాండ్‌వైపు తన బ్యాట్‌ను చూపి తన అభిమానాన్ని చెప్పకనే చెప్పాడు. ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం సిబ్బందితొ కోహ్లి దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Photo: IPL Twitter

ఈ సందర్భంగా స్టేడియం సిబ్బందిపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ''ఆటలో 11 మంది ఎంత ముఖ్యమో.. 12వ ఆటగాడిగా సిబ్బంది అంతే కీలకపాత్ర పోషిస్తారు. మేము మ్యాచ్‌ ఆడడానికి ముందు సిబ్బంది పడే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు.. వాళ్లపై ఎల్లప్పుడు ప్రేమను చూపించాలి.. వాళ్లు మా దృష్టిలో 12th Man Army'' అంటూ పేర్కొన్నాడు. ఈ ఫోటోను ఆర్‌సీబీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.


Photo: IPL Twitter

చదవండి: #ViratKohli: అనుష్కకు వీడియోకాల్‌.. కోహ్లి ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement