cricket fans
-
SRH Vs KKR IPL 2024 Final: జై జై రైజర్స్
ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్‌కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్‌గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్‌గా కమిన్స్ నిలుస్తాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్‌కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు. గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్లో 2 బిగ్ స్క్రీన్స్‌తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. -
SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. టాటా ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్ -
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం...జయహో టీం ఇండియా (ఫొటోలు)
-
పాక్‌పై భారత్ గెలుపు.. ఫ్యాన్స్ సంబురాలు (ఫొటోలు)
-
భారత్ పాకిస్థాన్ మ్యాచ్..అభిమానుల సందడి
-
PAK vs NED: ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానుల హంగామా (ఫొటోలు)
-
'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే తొలగించండి'
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వని జట్టు చేతిలో ఓడిపోయి రోహిత్ సేన పరువు పోగొట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనవసర ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకుంటుంది. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్, కోహ్లిలకు విశ్రాంతినివ్వడం ఏంటని తప్పబట్టారు. పనిలో పనిగా టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కూడా అభిమానులు ఒక రౌండ్ వేసుకున్నారు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియాకు ఏది కలిసి రావడం లేదని.. ఒక్క పెద్ద టోర్నీని కూడా గెలవలేకపోయిందని పేర్కొన్నారు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత అదే ప్రొటిస్ జట్టుకు వన్డే సిరీస్‌ను కూడా అప్పగించింది. అటుపై ఆసియా కప్‌ను నెగ్గడంలో విఫలమైన టీమిండియా టి20 వరల్డ్‌కప్‌లోనూ సెమీస్‌లోనే చేతులెత్తేసింది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను నెగ్గినా వన్డే సిరీస్‌ను.. ఆ తర్వాత జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ ఫైనల్ 2023)లో ఆసీస్ చేతిలో దారుణ పరాజయం చవిచూసింది. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత గెలుపు శాతం కంటే ఓటముల పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం ఆసక్తి కలిగించింది. ఈ లెక్కన టీమిండియా ద్రవిడ్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా ఓడిన సిరీస్‌లు ► బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ► సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ ► ఆసియా కప్‌లో ఓటమి ► టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓటమి ► స్వదేశంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఓటమి ► డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయం దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ద్రవిడ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ద్రవిడ్ పిచ్చి ప్రయోగాలు వల్ల టీమిండియాకు లాభాల కంటే నష్టమే ఎక్కువని ఆరోపణలు చేస్తున్నారు. #SackDravid.. అంటూ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. ''సచిన్ 194 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇప్పుడు కోహ్లి రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి విశ్రాంతి ఇస్తున్నారు. అనేక సమస్యలు.. ఒకటే పరిష్కారం.. ద్రవిడ్‌ను తొలగించండి'' అని ఓ నెటిజన్ కోరారు. అయితే ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. ఆసియా కప్, ఆ తర్వాత వరల్డ్ కప్‌కు వెళ్లే ముందు వెస్టిండీస్ సిరీస్ తమకు ఈ ప్రయోగాలను చేయడానికి చివరి అవకాశంగా ఉపయోగపడిందని వివరించాడు. గాయపడిన ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి రావడం గురించి అనిశ్చితి కారణంగా.. వారిని వారు మ్యాచ్ సిద్ధంగా ఉంచుకోవడానికి బ్యాకప్ ఎంపికలకు కొంత సమయం ఇవ్వవలసి ఉంటుందని సమర్థించుకోవడం ఆసక్తి రేపింది. declared innings when sachin was batting on 194 now resting kohli in every other series when he's in red hot form many problems , one solution#SackDravid pic.twitter.com/ptfyTCTECb — flick (@onlykohly) July 29, 2023 Now ive become death, the destroyer of Indian Cricket team with my politics.#sackdravid💔 pic.twitter.com/oaNSKfy83q — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨𝐂𝐒𝐊 (@SergioCSKK) July 29, 2023 Rahul Dravid as a coach : - lost odi series against ban - lost test series against sa - lost odi series aginst sa - lost asia cup - lost 2022 T20 wc - lost ODI series against aus - lost WTC final - lost ODI Agaisnt WI who didn't qualify for Wc Dravid Destroyed ICT #SackDravid pic.twitter.com/T6Zx8a6KMk — Laksh Sharma (@im_laksh_18) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: వరల్డ్‌కప్ జరిగేది మన దగ్గర.. విండీస్‌లో కాదుగా; ఈ ప్రయోగాలేంది? Carlos Alcaraz: సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్‌టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా -
'బ్రా' ధరించిన పాక్ కెప్టెన్.. షాక్ తిన్న ఫ్యాన్స్; వీడియో వైరల్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమాని అడగ్గానే జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. అయితే అతను ఇచ్చిన గిఫ్ట్ కంటే బాబర్ ఆజం తాను వేసుకున్న ఇన్నర్ వేర్‌ను చూసి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. సాధారణంగా పురుషులు బనియన్ లేదా ట్రక్ వేసుకోవడం చూస్తుంటాం. అయితే మహిళలు ధరించే బ్రాను పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ధరించడం ఆశ్చర్యపరిచింది. నిజానికి బాబర్ ఆజం వేసుకున్నది స్పోర్ట్స్ బ్రా. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ బ్రా మార్కెట్లో ట్రెండింగ్ లిస్టులో ఉంది. స్పోర్ట్స్ బ్రా లాగా ఉండే దీనిని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారు. ఇది భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వాడుతుంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది ధరించిన వ్యక్తి కూడా దానిని గుర్తించలేనంత తేలికగా ఉంటుంది. ఈ పరికరంలో GPS ట్రాకర్ ఉంటుంది. ఇది ప్లేయర్ తన రన్నింగ్ స్పీడ్‌ని లెక్కించుకునేందుకు వాడుతుంటారు. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇది ఆటగాళ్ల కదలికలను 3Dలో కొలుస్తూ.. వారి స్థానాలను ట్రాక్ చేస్తుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. దీని నుంచి అందుకున్న సమాచారంతో సెంట్రల్ డేటాబేస్ అనుసంధానిస్తుంటారు. ఇది విశ్లేషకులు పరిశీలన చేసి, ప్లేయర్ ఫిట్నెస్ను అంచనా వేస్తుంటారు. టీమిండియా ఆటగాళ్లు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. 2018లో భారత కండిషనింగ్ కోచ్ శంకర్ బసు దీనిని టీమిండియాకు తీసుకువచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టు ఇటీవలే శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి లంకకు గట్టిషాక్ ఇచ్చింది. సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ టీమిండియాను రెండో స్థానంలోకి నెట్టేసింది. లంకతో సిరీస్ ముగిశాకా పాక్‌కు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ వరకు ఆ జట్టుకు విశ్రాంతి లభించినట్లే. Babar Azam Gifted his Test Jersey to a Young Fan So Cute🇵🇰💯. #BabarAzam #NoChangeNeededPCB pic.twitter.com/KBMtBAYFcE — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 27, 2023 చదవండి: Major League Cricket 2023: 'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!' -
ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్
ఏషియన్ గేమ్స్ 2023కి ఈసారి చైనా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది. ఈసారి గేమ్స్‌లో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ టీమిండియా పరుషుల, మహిళల జట్లను పంపనుంది. ఇప్పటికే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా జట్లను ప్రకటించింది. పురుషుల జట్టును రుతురాజ్ గైక్వాడ్ నడిపించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యం వహించనుంది. ఇక చైనాలో క్రికెట్ ఆడడం చాలా తక్కువ. అక్కడి వాళ్లు ఎక్కువగా ఇండోర్ గేమ్స్ సహా ఇతర క్రీడలు ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే చైనాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు లేవు. ఉన్నా ఏదో మొక్కుబడిగా నిర్మించినట్లుగా అనిపిస్తుంది. అయితే తాజాగా ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడంతో హాంగ్జూ నగరంలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. మాములుగా క్రికెట్ ఆడే మైదానాలు గుండ్రంగా ఉండడమే లేదంటే కాస్త స్క్కేర్ షేప్‌లో ఉండడం చూస్తాం. కానీ ఆసియా గేమ్స్ కోసం హాంగ్ఝౌలో నిర్మించిన క్రికెట్ స్టేడియం కాస్త వింతగా అనిపిస్తుంది. హాకీ మైదానాన్ని తలపించేలా ఉన్న స్టేడియంలో స్ట్రెయిట్స్ ఎక్కువ దూరం ఉంటే.. ఆఫ్‌సైడ్, లెగ్ సైడ్ బౌండరీలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. స్టేడియం షేపు వింతగా ఉన్నా.. ఇక్కడి అత్యాధునిక సౌకర్యాలు మాత్రం ప్రేక్షకులకు ఓ కొత్త క్రికెట్ మ్యాచ్ అనుభవాన్ని అందించనున్నాయి. హాంగ్జూలోని ఈ క్రికెట్ స్టేడియంలో 12 వేల మంది కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. దీని అద్భుతమైన డిజైన్, చుట్టూ పచ్చదనం, అత్యాధునిక సౌకర్యాలు ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి. పైగా బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో ఆసియా గేమ్స్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. చైనాలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం. ఇక ఐదేళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2010 ఏషియన్ గేమ్స్ లో తొలిసారి క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అయితే 2018లో జకార్తాలో జరిగిన గేమ్స్ నుంచి క్రికెట్ ను తొలగించారు. 2010, 2014లలో టి20 ఫార్మాట్ లో క్రికెట్ గేమ్స్ నిర్వహించారు. చివరిసారి ఆసియా గేమ్స్ జరిగినప్పుడు ఇండియా జట్టును పంపలేదు. ఈసారి రుతురాజ్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ను పంపిస్తోంది. ఈసారి ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడమే తన లక్ష్యమని రుతురాజ్ అన్నాడు. గతంలో బంగ్లాదేశ్, శ్రీలంకలు గోల్డ్ మెడల్స్ గెలిచాయి. వుమెన్స్ కేటగిరీలో రెండుసార్లూ పాకిస్థాన్ ఖాతాలోకే మెడల్స్ వెళ్లాయి. The Cricket Stadium for Asian Games in Hangzhou, China. Massive Score on Cards..! pic.twitter.com/38AgLsZP6U — Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2023 చదవండి: Lionel Messi: సీజన్‌కు రూ.492 కోట్ల చొప్పున.. మియామి క్లబ్‌కు మెస్సీ -
'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఐపీఎల్ 16వ సీజన్లో ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదోసారి టైటిల్ నెగ్గింది. అయితే ధోని ఐపీఎల్ 16వ సీజన్ సందర్భంగా మోకాలి గాయంతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే తలా నీ-క్యాప్(Knee Cap)పెట్టుకొని ఆడాడు. నాకౌట్ దశకు చేరుకునే సరికి ధోని పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అందుకే బ్యాటింగ్ సమయంలో క్రీజులోకి వస్తే ఎక్కువగా బౌండరీలు, సిక్సర్ల మీదనే దృష్టి సారించేవాడు. ఇప్పటికైతే మోకాలి గాయం తగ్గినప్పటికి సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనబెడితే ఇటీవలే చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ధోని ప్రొడక్షన్ హౌస్ నుంచి LGM(ఎల్జీఎం) అనే తమిళ సినిమా తెరకెక్కుతుంది. కాగా ధోని సోమవారం తన భార్య సాక్షితో కలిసి సినిమా లాంచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చాడు. విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అందులో ఒక అభిమాని.. మహీ భయ్యా నీ మోకాలి నొప్పి ఎలా ఉంది.. తర్వాతి ఐపీఎల్ ఆడతావా అంటూ ప్రశ్నించాడు. కానీ ధోనికి ప్రశ్న సరిగ్గా వినిపించలేదు. అభిమానులు ఏది అడిగినా అది మన మంచి కోసమే అయి ఉంటుందని ధోనికి తెలుసు.. అందుకే బాగానే ఉన్నా అన్నట్లు చేతులు ఊపుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జూలై 7న ధోని 42వ పుట్టినరోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు పురస్కరించుకొని ధోనికి అభిమానులు సహా వివిధ దేశాల క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని స్థితి. తొమ్మిది నెలల తర్వాత తాను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ఐపీఎల్ 2024 ఆడుతానని ధోని ఇదివరకే తెలిపాడు. చదవండి: David Warner: హుందాగా తప్పుకుంటాడా లేక తప్పించే దాకా తెచ్చుకుంటాడా..? -
హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆటలో ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. ముఖ్యంగా కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ ఇంగ్లండ్ భరతం పట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో సెషన్లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులతో ఆడుతుంది. స్టోక్స్ 60 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తుండగా.. కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదాన్ని ఇంగ్లండ్ అభిమానులు అంత తొందరగా మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్.. జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు హద్దుమీరి ప్రవర్తించారు. ఆసీస్ ఆటగాడు అలెక్స్ కేరీని ఉద్దేశించి ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అలెక్స్ కేరీ ఔటయ్యి పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఇంగ్లండ్ అభిమానులు అతన్ని గేలి చేశారు.. ''గుడ్ బై.. ఇక మైదానంలోకి రాకు.. వస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది'' అంటూ చప్పట్లు కొట్టారు. మరి కొంతమంది అభిమానులు తన షూస్ విప్పి చేతిలో పట్టుకొని కేరీ వైపు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే ఆసీస్ అభిమానులు కూడా కాస్త దీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు తొలిసెషన్ ఆటలో ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆసీస్ ‘క్రీడా స్ఫూర్తి’ ప్రదర్శించలేదని ఇంగ్లాండ్ అభిమానులు విమర్శలు గుప్పించారు. తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే ఔట్ చేసినట్లు ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు కౌంటర్ ఇచ్చారు. The Western Terrace is alive as Alex Carey departs 👋#Ashes pic.twitter.com/t6bWvcQRpF — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 6, 2023 “Welcome” Alex Carey pic.twitter.com/tCNv1bKEsY — Justin it for the Cloutinho (@JUSTIN_AVFC_) July 6, 2023 -
ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం
బీసీసీఐపై హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనేది మీకు ఈ పాటికే అర్థమయి ఉండాలి. ఇవాళ(జూన్ 27న) ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023కి సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేసింది. పది ప్రధాన వేదికల్లో మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌కు కూడా చోటు దక్కింది. అయితే పేరుకు హైదరాబాద్ ఉన్నా పెద్దగా ఆసక్తి చూపించే మ్యాచ్‌లు మాత్రం లేవు. అందునా టీమిండియాకు సంబంధించి ఒక్క మ్యాచ్‌కు కూడా ఉప్పల్ స్టేడియం వేదికగా కాలేదు. కనీసం పెద్ద జట్ల మ్యాచ్ అయినా ఇస్తారేమో అని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పాకిస్తాన్ ఆడే రెండు మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఇక్కడ ఆడనున్నాయి. అయితే ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్‌లు క్వాలిఫయర్స్‌తోనే షెడ్యూల్ చేయడం అభిమానులకు కోపం తెప్పించింది. షెడ్యూల్ విడుదలైన నిమిషాల్లోనే హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందన్న మాట తెరమీదకు వస్తోంది. తెలుగు గడ్డపై బీసీసీఐ వివక్ష చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరల్డ్ కప్ 2023 టోర్నీకి 8 జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో రెండు జట్లు జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా అర్హత సాధించనున్నాయి. ఆ రెండు జట్ల మ్యాచులే ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా అక్టోబర్ 6న పాకిస్తాన్ - క్వాలిఫైయర్ 1జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. అక్టోబర్ 9న న్యూజిల్యాండ్- క్వాలిఫైయర్-1 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 12న పాకిస్తాన్ - క్వాలిఫైయర్-2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పేరుకే హైదరాబాద్.. ఇంతదానికి ఎందుకీ మ్యాచ్‌లు? జరిగేదే మూడు మ్యాచులు అంటే.. వాటిని టోర్నీ ప్రారంభమైన వారం రోజుల్లోనే ముగిసేలా షెడ్యూల్ చేశారు. పోనీ వీటిలో ఏమైనా చూడగలిగే మ్యాచ్ ఉందా? అంటే.. అదీ కనిపించడం లేదు. ఒకవేళ జింబాబ్వే కనుక క్వాలిఫైయర్-1 లేదా క్వాలిఫైయర్-2గా వస్తే.. పాకిస్తాన్‌తో వారి మ్యాచ్ చూడొచ్చు. అనంతరం పసికూన జట్టుతో తలపడనున్న కివీస్ మ్యాచ్‌పై ఎవరూ ఆసక్తి చూపకపోవచ్చు. ఇలాంటి మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించడం పట్ల తెలుగు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.''ఇంతదానికి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు పెట్టడం ఎందుకు''.. ''ఏదో ముష్టి పడేసినట్లు మూడు మ్యాచ్‌లు మా ముఖానా పడేశారు''.. ''హైదరాబాద్‌పై బీసీసీఐకి ఎందుకింత వివక్ష'' అంటూ కామెంట్స్ చేశారు. హెచ్‌సీఏలో అవినీతి హైదరాబాద్‌లో కీలక మ్యాచులు లేకపోవడానికి హెచ్‌సీఏ తీరు కూడా ఒక కారణమన్నది క్రికెట్ విశ్లేషకుల మాట. హెచ్‌సీఏలో అవినీతి పేరుకుపోయిందని.. ఆధిపత్య పోరు కోసం బోర్డు సభ్యులు రెండు వర్గాలుగా విడిపియి పట్టించుకోవడం లేదనే మాటలు వినపడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచుల సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలు, టికెట్ల కుంభకోణం వంటి విషయాలను అందుకు కారణాలుగా ప్రస్తావిస్తున్నారు. చదవండి: విస్తుపోయే నిజాలు.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణ -
వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. జైషాపై ట్రోల్స్, మీమ్స్
క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరం దాదాపు 50 రోజులపాటు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మొత్తం 10 వేదికల్లో గ్రూప్ దశలో 48 మ్యాచ్‌లు జరగనుండగా.. నాకౌట్ దశలో మూడు మ్యాచ్‌లు ముంబై(సెమీఫైనల్-1), కోల్‌కతా(సెమీఫైనల్-2), అహ్మదాబాద్(ఫైనల్) జరగనున్నాయి. ఇక ఆరంభమ్యాచ్ 2019 వన్డే ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్ మొత్తంగా ఐదు మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లతో పాటు మధ్యలో చిరకాల ప్రత్యర్థులుగా భావించే టీమిండియా-పాకిస్తాన్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లకు కూడా ఇదే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక మరో మ్యాచ్ సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికి మిగతా నాలుగు మ్యాచ్‌లకు టీఆర్పీ రేటింగ్ బద్దలవడం ఖాయం. కాగా అహ్మదాబాద్‌కు కేటాయించిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఆసక్తికరంగానే సాగుతాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా మ్యాచ్‌ల ఎంపికలో ఏ మేరకు చక్రం తిప్పాడో స్పష్టంగా అర్థమవుతుంది. తన ఆధిపత్యాన్ని చూపిస్తూ తన సొంత ఇలాకాలో జరిగే ఐదు మ్యాచ్‌లు మంచి ఆసక్తి కలిగించేవే. అందుకే జై షాను సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేయడంతో పాటు మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''సొంత ఇలాకాలో మంచి మ్యాచ్‌లు పెట్టుకున్నాడు.. బయటి వేదికలకు మాత్రం పనికిరాని మ్యాచ్‌లు కొన్ని ఇచ్చాడు.. తన ఆధిపత్యం ఎంతలా ఉందనేది అర్థమవుతుంది.. మోదీ ఉన్నంతవరకు ప్రతి ప్రతిష్టాత్మక మ్యాచ్ అహ్మదాబాద్‌కే వెళుతుందన్నది సత్యం'' అంటూ పేర్కొన్నారు. ఈసారి అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేడియం సామర్థ్యం లక్ష మంది కాగా.. దాయాదుల మ్యాచ్‌కు లక్షకు పైగా వచ్చే అవకాశముంది. ప్రతిష్టాత్మక ఫైనల్‌తో పాటు మిగతా మ్యాచ్‌లు పరిశీలిస్తే ఆరంభమ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలిమ్యాచ్ తొలిరోజే ఆసక్తిగా మొదలయ్యే చాన్స్ ఉంటుంది. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నవంబర్ 4న అహ్మదాబాద్‌లో ఆడనున్న మ్యాచ్‌కు కూడా యమా క్రేజ్ ఉంది. వీటితో పాటు ప్రతిష్టాత్మక ఫైనల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Proud moment for India! Hosting the ICC Men's Cricket World Cup for the fourth time is an incredible honor. With 12 cities as the backdrop, we'll showcase our rich diversity and world-class cricketing infrastructure. Get ready for an unforgettable tournament! #CWC2023 @ICC @BCCI pic.twitter.com/76VFuuvpcK — Jay Shah (@JayShah) June 27, 2023 Jay Shah selecting venues for Pakistan matches pic.twitter.com/EKdSr3rn7h — Rajabets India🇮🇳👑 (@smileandraja) June 18, 2023 #ICCWorldCup2023 schedule pic.twitter.com/Ii7OIoWbMC — Rajabets India🇮🇳👑 (@smileandraja) June 27, 2023 Jay Shah after scheduling Pakistan match against Afghanistan in Chennai #PakistanCricket #WorldCup2023 pic.twitter.com/Wiky1eyRD8 — Rishabh (@Pun_Intended___) June 19, 2023 చదవండి: 'అప్పుడు సచిన్ కోసం.. ఇప్పుడు కోహ్లి కోసం' -
'జట్టు గెలుపుకన్నా ఇదెక్కువ ఆనందాన్నిస్తోంది'
జింబాబ్వేలో ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్(ICC CWC Qualifiers 2023) మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. జింబాబ్వేలో జరుగుతున్న టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మెయిన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా ఆ రెండు స్థానాల కోసం 8 జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. కాగా క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, నేపాల్ తలపడ్డాయి. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ ఆటతో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.ఇక జింబాబ్వే జట్టుకు మద్దతిస్తూ పెద్ద ఎత్తున్నఅభిమానులు తరలివచ్చారు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు ఇంటికి వెళ్లే ముందు స్టేడియం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా జింబాబ్వే అభిమానుల చర్య అందరిని ఆకట్టుకుంటుంది. ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్స్ షువావ్ బర్టెల్, ఆసిఫ్ షేక్ మెుదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, కుశాల్ 95 బంతుల్లో 99 పరుగులు చేసి.. సెంచరీకి 1 పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఆసిఫ్ 66 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున నగరవా 4 వికెట్లు తీశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 44.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి గెలిచింది. జొలార్డ్ గుంబి(25), వెస్లీ మాధేవేర్(32) త్వరగానే ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు గెలుపుని అందించారు. క్రెయిగ్ ఎర్విన్ 128 బంతుల్లో 121 పరుగులు చేయగా.. విలియమ్స్ 70 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. Shout out and respect to @ZimCricketv fans for remaining behind and clearing the litter.@AdamTheofilatos @GodwillMamhiyo @bayhaus @CastleCornerZW pic.twitter.com/pquPDTznRY — Gildredge (@gillmbaku_zw) June 18, 2023 చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం' -
#RetireRohit: 'కెప్టెన్‌గా దిగిపో.. కాదంటే రిటైర్ అయిపో'
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవ్వగానే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓటమికి తొలి బాధ్యుడిగా కెప్టెన్ రోహిత్ శర్మనే టార్గెట్ చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం #Retire #Rohitsharma హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయంటేనే కోపం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇక అభిమానులు కూడా రోహిత్‌ను ట్రోల్ చేశారు. ''నువ్వు కెప్టెన్‌గా పనికిరావు.. నువ్వు ఏదో చేస్తావని కోహ్లి నుంచి నీకు ఇచ్చారు.. కానీ కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నావు.. చేతగాకపోతే కెప్టెన్‌గా దిగిపో.. అదీ కాదంటే రిటైర్ అయిపో బాగుంటుంది.. ప్లీజ్రిటైర్ వడాపావ్'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కనీసం పోరాడే ప్రయత్నం కూడా చేయకుండా ఆలౌట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఏదో చేస్తారనుకున్న కోహ్లి, రహానేలు కూడా జట్టును రక్షించడంలో విఫలమయ్యారు. ఇక రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేది. ఐపీఎల్లో నమోదు చేసిన చెత్త ప్రదర్శననే ఇక్కడా కొనసాగించాడు. ఒక కెప్టెన్ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం అతనికే చెల్లింది. ఒక బ్యాటర్‌గా విఫలమైన రోహిత్.. తాజాగా కెప్టెన్‌గానూ పనికిరాలేకపోయాడు. కోహ్లి నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్.. తాను నాయకుడిగా ఒక్క మేజర్ ట్రోఫీని గెలవలేకపోగా కొన్ని సిరీస్‌లు కోల్పోయాడు. రోహిత్ కెప్టెన్ అయ్యాకా టీమిండియా టి20 ప్రపంచకప్‌తో పాటు ఆసియా కప్‌ను గెలవలేకపోయింది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ నిరాశే ఎదురైంది. దీనికి తోడు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలకు అతని కెప్టెన్సీలోనే టీమిండియా సిరీస్ కూడా కోల్పోయింది. ఇన్ని ప్రతికూలతల మధ్య రోహిత్ మరో నాలుగు నెలల్లో వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను నడిపించనున్నాడు. ఇక్కడ కూడా రోహిత్ విఫలమైతే కెప్టెన్సీ పోవడమే కాదు కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని చెప్పలేం కానీ ఆ అవకాశముంది. ఒకవేళ రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తే అతని స్థానంలో అజింక్యా రహానే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే క్రమంగా టి20 కెప్టెన్సీ హార్దిక్ పాండ్యా చేతుల్లోకి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. రానున్న టి20 సిరీస్‌ల్లో రోహిత్ ఆడడం అనుమానమే.. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా జట్టును నడిపించడం దాదాపు ఖాయమే. ఇక వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని రోహిత్‌ను కేవలం వన్డేలకే కెప్టెన్‌గా పరిమితం చేసే చాన్స్ కూడా ఉంది. ఈ లెక్కన రోహిత్ ఒకవేళ వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను విజేతగా నిలపకపోవతే కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగానూ అతని కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే! Rohit Sharma after becoming full time captain : Lost Asia Cup Lost T20 World Cup Lost WTC final .. RETIRE VADAPAV SACK ROHIT...... pic.twitter.com/oj4eQo5PI5 — ☞➸♕ ηίςհαηt☜⚓♕ (@Nishant__907) June 11, 2023 @ImRo45 Do this 1) Retire from T20Is. No need for that format again 2) Step down from Test captaincy. Better focus on batting. He isn't Test captaincy material 3) BIGGEST POINT - Work on fitness 4) Stop that intent thing. The day when he stops this he'll automatically improve — Aadvik (@thecoolguy03) June 11, 2023 No true ICT fan will pass without liking this post !! RETIRE VADAPAV SACK ROHIT SHARMA#WTCFinals #WTCFinal2023 #WTC2023Final pic.twitter.com/SwYcjf7ooN — Cric_uneeb (@GOAT_Virat18) June 11, 2023 చదవండి: 'ఇదొక గుణపాఠం.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ మా కొంపముంచింది' ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా -
#MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంపై దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్ మొత్తం ధోని నామస్మరణతోనే మార్మోగిపోయింది. సీఎస్కే ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు తండోపతండాలుగా వచ్చేవారు. దీనికి ప్రధాన కారణం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని. ధోని భజన మరీ ఎక్కువైపోయిందన్నా పర్లేదు.. కానీ ఒక విషయం మాత్రం తప్పక తెలుసుకోవాల్సిందే. సీఎస్కే విజేతగా నిలవడంపై మన దేశ అభిమానులే కాదు.. దాయాది దేశం పాకిస్తాన్ అభిమానులు కూడా తెగ సంతోషపడిపోయారు. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత పాకిస్తాన్లో కొన్నిచోట్ల క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. ధోని కటౌట్స్తో వీధుల్లో తిరుగుతూ భారీ ఎత్తున కేక్ కటింగ్స్ నిర్వహించారు. ఈ చర్యతో వైరం అనేది దేశాల మధ్యే కానీ ఆటపై కాదని తెలియజేశారు. ఇక పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రమీజ్ రజా, సక్లెయిన్ ముస్తాక్, షోయబ్ అక్తర్, సయీద్ అన్వర్ సహా మరికొంతమంది సీఎస్కే టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక ధోని టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ కాస్త ఎమోషన్‌కు గురయ్యాడు. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అనిపించినప్పటికి వచ్చే సీజన్ ఆడాలా వద్దా అనే దానిపై మరో ఏడు, ఎనిమిది నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటా. అప్పటికి శరీరం సహకరించి ఫిట్‌గా ఉంటే అభిమానుల కోసం మరో ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ పేర్కొన్నాడు. చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు! -
'ఈసారి కప్ మనదే'.. రోహిత్ శర్మ సిగ్నల్!
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్‌ను గెలిచి కానీ వెళ్లలేదు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరుకోవడానికి మరో అడుగు దూరంలో ఉంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో గెలిస్తే ఏడోసారి ఫైనల్లో అడుగుపెట్టనుంది. అయితే గతంలో ముంబై ఇండియన్స్ ఆరుసార్లు ఫైనల్ చేరిన సందర్భాల్లో ఒక్కసారి మినహా మిగతా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఒకవేళ ఈసారి ఫైనల్‌కు వస్తే మాత్రం ముంబై ఆరోసారి విజేతగా నిలవడం గ్యారంటీ అని ఆ జట్టు అభిమానులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ చేసిన నెంబర్ సిగ్నల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూం నుంచి బస్‌లో బయలుదేరిన సమయంలో.. ముంబై కెప్టెన్ రోహిత్ బస్సు కిటికీలోనుంచి అభిమానులను చూస్తూ ఆరు సంఖ్యను సిగ్నల్‌గా చూపిస్తూ ఈసారి కప్ మనదే అన్నట్లుగా సైగ చేశాడు. రోహిత్ అలా చూపించగానే ముంబై ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆర్సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్ఆర్హెచ్పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. ఇక ఎలిమినేటర్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ను 81 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాన్ని దక్కించుకొని క్వాలిఫయర్-2కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చిందా కప్ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. చూద్దాం మరి ముంబై ఇండియన్స్ ఆరోసారి కప్ కొడుతుందో లేదో.. Rohit Sharma gives signal to their fans, Hopefully 6th trophy loading 😌.#MIvsGT pic.twitter.com/LG88i1z8My — 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 𝗙𝗮𝗻𝗰𝗹𝘂𝗯 (@LoyleRohitFan45) May 26, 2023 చదవండి: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరంటే? -
అంతులేని అభిమానం.. ఒక్కడి కోసం బస్సును చుట్టుముట్టారు
ఐపీఎల్ ఏ ముహుర్తానా మొదలైందో తెలియదు కానీ క్రికెట్ అభిమానులకు ధోని ఫీవర్ పట్టుకుంది అని మాత్రం చెప్పగలం. ధోని ఎక్కడికి వెళ్లినా వస్తున్న క్రేజ్ మాత్రం ఒక లాగానే ఉంటుంది. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు సీఎస్కే స్టేడియానికి వస్తున్న వీధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. కారణం బస్సులో ధోని ఉండడమే. స్టేడియానికి వెళ్లే దారి పొడవునా సీఎస్కే జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును చుట్టుముట్టారు. కొందరు కార్ల బానెట్లపై నిలబడి తమ అభిమాన ఆటగాడికి చేతులూపారు. ధోని చూడడానికి చాలా మంది రావడంతో బస్సు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికి ఆ తర్వాత బస్సుకు దారి ఇచ్చారు. అయితే అభిమానానికి హద్దులుండవని ఈ సంఘటనతో మరోసారి రుజువు అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. సరిహద్దు లేని అభిమానం అంటే ఇదే అంటూ కామెంట్ చేశారు. ఇక సీఎస్కే కూడా బస్సును చుట్టుముట్టిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఒక్కడి కోసం రాజధాని నగరం జనంతో నిండిపోయింది.. ఈ దృశ్యం చూడడానికి మా కళ్లు చాలడం లేదు అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక సీఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం సీఎస్కే 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నప్పటికి.. లక్నో కూడా 15 పాయింట్లతోనే ఉంది. Fans behind the CSK bus in Delhi. This is madness. pic.twitter.com/P594b5r8QL — Johns. (@CricCrazyJohns) May 20, 2023 Thaana Serndha Kootam at ThalaiNagaram! 🦁#DCvCSK #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/LrgHw3SQYM — Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2023 చదవండి: ఏందీ క్రేజ్.. బంతులు వేయాలంటే భయపడుతున్నారు! -
ఏందీ క్రేజ్.. బంతులు వేయాలంటే భయపడుతున్నారు!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. దీనిలో భాగంగా తొలి అంకం దిగ్విజయంగా పూర్తైంది. శనివారం ఢిల్లీతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సీఎస్కే 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రుతురాజ్, కాన్వేలు అర్థసెంచరీలతో రాణించగా.. మధ్యలో శివమ్ దూబే, ఆఖర్లో జడేజా విలువైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే మ్యాచ్‌లో మాత్రం వీరందరిని దాటి ధోని మరోసారి హైలెట్ అయ్యాడు. తాను ఆడింది ఐదు బంతులు.. చేసింది నాలుగు పరుగులు.. అయినా స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. మ్యాచ్ ఢిల్లీలో జరుగుతున్నా సపోర్ట్ మాత్రం సీఎస్కేకే. ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడో ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. అందుకే స్టాండ్స్ అన్ని సీఎస్కే జెర్సీలతో నిండిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ధోనిపై ఉన్న అభిమానం మరొక ఎత్తు. సీజన్లో ధోని క్రేజ్ ఎలా ఉందంటే అతను ఒక్క బంతి ఆడినా చాలు మాకు అదే మహాభాగ్యం అన్నట్లుగా అభిమానులు పరవశించిపోతున్నారు. అయితే ధోని క్రేజ్‌కు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలో సరైన బంతులు వేయడంలో విఫలమవుతున్నారు. తాజాగా సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన చేతన్ సకారియా బౌలింగ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఓవర్ చివరి రెండు బంతులు వేయాల్సిన చోట ఒక నోబాల్, వైడ్‌బాల్ వేశాడు. కారణం ఎదురుగా క్రీజులో ఉంది ధోని. దీంతో అటు స్టేడియం మొత్తం ధోని.. ధోని అరుపులతో దద్దరిల్లడంతో ఒత్తిడికి లోనవుతున్న బౌలర్లు బంతులను సరిగా వేయడం లేదని అభిమానులు వాపోయారు. చదవండి: '16.25 కోట్లు పట్టుకుపోతున్నాడు.. ఇంపాక్ట్‌గా కూడా పనికిరాలేదా?' -
కోహ్లి ఫిదా.. తెలుగోళ్ల అభిమానమే వేరప్పా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్హెచ్ ఓడినప్పటికి మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకులు మాత్రం బాధపడలేదు. కారణం ఆర్సీబీ గెలిచింది కాబట్టి. ఎలాగూ ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.. ఆర్సీబీకి మద్దతు ఇస్తే సరిపోతుంది అని ప్రతి అభిమాని భావించాడు. Photo: IPL Twitter ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఔట్ అయితే బాధపడాల్సింది పోయి సంతోషపడ్డారు. అలా అని ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేయలేదని కాదు.. ఎందుకంటే క్లాసెన్ సెంచరీ చేయగానే స్టేడియం హోరెత్తిపోయింది. ఇక ఇటు కోహ్లి సెంచరీ చేయగానే కోహ్లి నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. ఇక మ్యాచ్ ఆద్యంతం కోహ్లి నామస్మరణతో మార్మోగిపోయింది. అలా మన తెలుగు అభిమానులు అటు ఎస్ఆర్హెచ్.. ఇటు ఆర్సీబీకి బ్యాలెన్స్‌గా మద్దతిచ్చి అందరిని ఆకట్టుకున్నారు. Photo: IPL Twitter ఈ అభిమానమే కోహ్లిని ఫిదా చేసింది. అందుకే సెంచరీ చేయగానే స్టేడియంలో ఉన్న ప్రతీ స్టాండ్‌వైపు తన బ్యాట్‌ను చూపి తన అభిమానాన్ని చెప్పకనే చెప్పాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం సిబ్బందితొ కోహ్లి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Photo: IPL Twitter ఈ సందర్భంగా స్టేడియం సిబ్బందిపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ''ఆటలో 11 మంది ఎంత ముఖ్యమో.. 12వ ఆటగాడిగా సిబ్బంది అంతే కీలకపాత్ర పోషిస్తారు. మేము మ్యాచ్ ఆడడానికి ముందు సిబ్బంది పడే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు.. వాళ్లపై ఎల్లప్పుడు ప్రేమను చూపించాలి.. వాళ్లు మా దృష్టిలో 12th Man Army'' అంటూ పేర్కొన్నాడు. ఈ ఫోటోను ఆర్సీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. Photo: IPL Twitter King Kohli’s appreciation to the fine groundstaff of the Rajiv Gandhi International Stadium 🏟️ Show them some love, 12th Man Army 🫶 #PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #SRHvRCB pic.twitter.com/dEeT3IWwOZ — Royal Challengers Bangalore (@RCBTweets) May 19, 2023 Virat Kohli's classic sixes in the run-chase.pic.twitter.com/GXDFzfxJWH — Johns. (@CricCrazyJohns) May 19, 2023 చదవండి: #ViratKohli: అనుష్కకు వీడియోకాల్.. కోహ్లి ఎమోషనల్ -
'బ్యాటింగే కాదు మాటలతోనూ మనసు దోచుకుంటాడు'
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు మంచి ఆరంభం లభించినప్పటికి మధ్యలో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి టాప్ ప్లేస్‌ను సీఎస్కేకు కోల్పోయింది. తాజాగా గురువారం సొంత మైదానం జైపూర్‌లో సీఎస్కేను ఎదుర్కోనుంది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ధోని సేనను రాజస్తాన్ ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కెప్టెన్ సంజూ శాంసన్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటివరకు శాంసన్ ఏడు మ్యాచ్‌లాడి 181 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. అయితే గత ఐదు మ్యాచ్‌లు కలిపి కేవలం 85 పరుగులు మాత్రమే చేసిన సంజూ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరి సీఎస్కేతో మ్యాచ్‌లో రాణిస్తాడేమో చూడాలి. ఇక సీఎస్కేతో మ్యాచ్‌ను పురస్కరించుకొని బుధవారం శాంసన్ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లను చూడడానికి అభిమానులు స్టేడియానికి వచ్చారు. ప్రాక్టీస్ ముగించుకునే సమయంలో అభిమానులు శాంసన్‌ను ఒక్క సెల్ఫీ అని పిలిచారు. దీనికి అంగీకరించిన శాంసన్ వెంటనే అభిమానులతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అభిమాని ఫోన్లో స్వయంగా శాంసన్ సెల్ఫీ తీస్తుండగా.. ఫోన్ రింగైంది. దీంతో సంజూ కాల్ లిఫ్ట్ చేశాడు. దీంతో పక్కనున్న అభిమాని.. ''అరె సంజూ భయ్యా మాట్లాడుతున్నాడు.. హలో చెప్పు'' అని పేర్కొన్నాడు. దీనికి ఫోన్లో ఉన్న అవతల వ్యక్తి ''నిజమా .. హలో సంజూ భయ్యా'' అని అడిగాడు. దీంతో సంజూ..''అవును నేనే.. హలో బ్రదర్ ఎలా ఉన్నావు'' అంటూ చెప్పడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ''సంజూ బ్యాటింగ్‌తోనే కాదు మాటలతోనూ అభిమానుల మనసు దోచుకుంటాడు'' అంటూ కామెంట్ చేశారు. Calls > Text because you never know, Sanju Samson might just pick up 😂😂 pic.twitter.com/fJwGMbvmt2 — Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2023 చదవండి: #RCB: గెలిస్తే ఓకే.. గెలవకపోతే నీ పరిస్థితి ఏంటో! -
RCB Vs LSG: మ్యాచ్ ఓడిపోతే ఇంతలా ఏడుస్తారా!
ఐపీఎల్ 16వ సీజన్లో సోమవారం మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ చూస్తున్న అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో జరిగిన హైడ్రామా బహుశా ఇంతకముందు ఐపీఎల్ చరిత్రలో చూసింది లేదనుకుంటా. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్‌లు మ్యాచ్‌ను దాదాపు వన్‌సైడ్ చేశారు. వీరికి ఆయుష్ బదోని కూడా తోడయ్యాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీవైపు మొగ్గినట్లుగా అనిపించింది. ఇక ఆఖరి ఓవర్లో లక్నోకు ఐదు పరుగులే కావాల్సినప్పటికి హర్షల పటేల్ చక్కగా బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు కూడా తీశాడు. అయితే బిష్ణోయ్‌ను మన్కడింగ్ చేసే క్రమంలో చేసిన పొరపాటు.. దానికి తోడు కీపర్ కార్తిక్ తడబాటుతో ఆర్సీబీ మ్యాచ్‌ను లక్నోకు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో ఓటమి. మాములుగానే ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. పైగా సొంత స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే ఆర్సీబీ మరింత బలంగా కనిపిస్తుంది. అయితే మ్యాచ్ తమ చేతులోకి వచ్చేసిందని సంబరపడేలోపు లక్నో మ్యాచ్‌ను లాగేసుకోవడంతో ఆర్సీబీ అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే ఆఖరి బంతికి ఆవేశ్ ఖాన్ సింగిల్ తీసి లక్నోను గెలిపించగానే స్టేడియం ఒక్క నిమిషం పాటు సైలెంట్ అయిపోయింది. ఎవరి మొహాల్లో తొంగి చూసినా దుఃఖమే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీకి డైహార్డ్ అభిమాని అయిన ఒక యువతి కంటతడి పెట్టడం అందరిని బాధించింది. ఆర్సీబీ ఓడింది ఫైనల్ మ్యాచ్ కానప్పటికి.. అరె గెలిచే మ్యాచ్ ఓడామే అన్న బాధ ఆ యువతిలో కనిపించింది. అందుకే ఎంత ఓదారుస్తున్న యువతి ఏడ్వడం ఆపలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ''యువతిని చూస్తే జాలేస్తోంది.. లీగ్ మ్యాచ్ ఓడితే ఇంతలా ఏడుస్తారా''.. ''ఒకవేళ ఆర్సీబీకి ఫైనల్ మ్యాచ్‌లో ఇలా జరిగి ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో'' అంటూ కామెంట్ చేశారు. Virat kolhi is not a player 🤞,he is emotion for the RCB fans🙏💪😭, After the loss RCB match,then fans crying 😭😭😭,@imVkohli pic.twitter.com/cVlfLguqDl — CSK fans ❣️❣️ (@Cskfans34) April 11, 2023 చదవండి: ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ -
IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది'
క్రికెట్లో అత్యంత విజయవంతమైన లీగ్సలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి స్థానంలో ఉంటుంది. అలా ఉంది కాబట్టే ఇప్పటికే 15 సీజన్లు విజయవంతగా ముగించుకొని ప్రస్తుతం 16వ సీజన్లో అడుగుపెట్టింది. టి20 ఫార్మాట్లో సాగే మ్యాచ్‌లు కాబట్టి మూడున్నర గంటల్లోనే ఫలితం తేలుతుంది. అందుకే జనాలకు ఇది బాగా ఎక్కేసింది. అయితే రాను రాను ఐపీఎల్లో మ్యాచ్‌లు సాగిపోతున్నాయి. మూడున్నర గంటల్లోగా ముగిసిపోవాల్సిన మ్యాచ్‌లు నాలుగు గంటలు దాటిపోతున్నాయి. ఒకరకంగా టైం సెన్స్ లేకుండా సాగిపోతున్న మ్యాచ్‌లు చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది. Photo: IPL Twitter అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న కఠిన నిబంధనలు ఇక్కడ లేకపోవడం, నిర్వాహకులు కూడా దీనిని పెద్దగా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఐపీఎల్ కు అసలు టైమ్ సెన్స్ లేకుండా పోతోంది. అంతర్జాతీయ క్రికెట్ లో లేని స్ట్రేటజిక్ టైమౌట్.. ఐపీఎల్లో ఉంటుంది. ఒక్కో ఇన్నింగ్స్ లో రెండుసార్లు, మొత్తం ఐదు నిమిషాల పాటు ఈ స్ట్రేటజిక్ టైమౌట్ ను వాడుకుంటున్నారు. దీనికితోడు ఫీల్డింగ్ లో తరచూ మార్పులు, ఉత్కంఠ సమయాల్లో ప్రతి బంతికీ వ్యూహాలతో అసలు టైమ్ ను పట్టించుకున్న నాథుడు లేకుండా పోతున్నాడు. ఈ సీజన్ లో ఒక్క ఇన్నింగ్స్ కూడా నిర్ధారిత 90 నిమిషాల్లో పూర్తి కాలేదు. Photo: IPL Twitter అలా చేయకపోతే ఆ తర్వాత మిగిలిన ఓవర్లకు 30 గజాల సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లనే అనుమతించాలన్న నిబంధన ఉన్నా దానిని అమలు చేయడం లేదు. ఇక ఈ సీజన్ లో అంపైర్లు ఇచ్చిన వైడ్లు, నోబాల్స్ ను కూడా ఛాలెంజ్ చేస్తుండటం వల్ల మరింత టైమ్ వేస్ట్ అవుతోంది. ప్లేయర్స్ రివ్యూలు, అంపైర్లు రివ్యూలు, గాయాలు.. ఇలా మ్యాచ్ లు నాలుగు గంటల పాటు సాగడానికి కారణాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్‌కు కొత్తగా తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కూడా సమయం వృథా అవుతుంది. Photo: IPL Twitter మొన్న రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమై.. రాత్రి 11.42కు ముగిసిందంటే ఈ మ్యాచ్ లు ఎంతగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఓ వైడ్ బాల్ ను వైడో కాదో తేల్చడానికి కూడా మూడో అంపైర్ చాలా సమయం తీసుకున్నాడు. చివరికి రెండున్నర నిమిషాల తర్వాత కూడా ఆ థర్డ్ అంపైర్ ఇచ్చింది తప్పుడు నిర్ణయమే అని మాజీ క్రికెటర్ టామ్ మూడీ ట్వీట్ చేశాడు. అసలు టి20 కాన్సెప్ట్ తెచ్చిందే వేగంగా క్రికెట్ మ్యాచ్ ను పూర్తి చేసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం. ఎంత మన ఐపీఎల్ అయినా చూసేవారికి విసుగు పుట్టించేలా మాత్రం తయారు కాకూడదు. కానీ ఐపీఎల్లో ఇలా సుదీర్ఘంగా సాగుతున్న మ్యాచ్ లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి 11.30 వరకూ మేలుకొని మ్యాచ్ లు చూడటం ఎవరికైనా ఇబ్బందే. రాత్రిళ్లు ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతోనే గతంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ ను 7.30 కే ప్రారంభిస్తున్నారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. చదవండి: ప్రతిసారీ వాళ్లమీదే ఆధారపడితే ఎలా? బెటర్ ఆప్షన్ ఉంటే అతడి స్థానంలో.. నీరజ్‌చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్'ను భలే వాడింది పో! -
ఎక్కడైనా అంతే.. కేఎల్ రాహుల్‌ను తిట్టడం ఆపండి!
టీమిండియా స్టార్... లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వైఫల్యం కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాహుల్ కథ మొదటికే వచ్చింది. అయితే జాతీయ జట్టు తరపున ఆడకున్నా ఐపీఎల్లో మాత్రం దుమ్మురేపుతాడని అభిమానులు ట్రోల్ చేసేవారు. అయితే ఇకపై రాహుల్‌ను ట్రోల్ చేయడం ఆపేయాల్సిందే. ఐపీఎల్‌కు మాత్రమే పనికొస్తాడనే ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే కేఎల్ రాహుల్.. ఐపీఎల్ అయినా టీమిండియా అయినా తన ఆటతీరులో ఏ మార్పు ఉండదని మరోసారి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 12 బంతులెదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో స్లో బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతే రాహుల్ కథ ముగిసింది. వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ఇక్కడ మాత్రం ఓపెనర్‌గా వచ్చేశాడు. తనకు ఓపెనింగ్ కంటే ఐదో స్థానం కరెక్ట్ అని రాహుల్ భావించి వచ్చే మ్యాచ్‌ల నుంచి ఐదో స్థానంలో వస్తే మంచిది. ఇక రాహుల్ తక్కువ స్కోరుకే వెనుతిరగడంపై అభిమానులు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ఎక్కడైనా రాహుల్ ఆటతీరు ఇంతే.. అతన్ని తిట్టడం, ట్రోల్ చేయడం ఆపండి.. 12 బంతుల్లో 8 పరుగులు... పొరపాటున టెస్టు మ్యాచ్ అనుకోలేదు కదా రాహుల్.. ఓపెనర్ వద్దు.. ఐదో స్థానమే నీకు ముద్దు.. అంటూ కామెంట్ చేశారు. -
IPL 2023: తొలిరోజే అట్టర్‌ప్లాఫ్.. ఏకిపారేసిన అభిమానులు
ఐపీఎల్ 16వ సీజన్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్‌ను ప్రసారం చేసే హక్కులను రెండు సంస్థలు తీసుకున్నాయి. టీవీ రైట్స్‌ను డిస్నీ స్టార్ దక్కించుకోవగా.. డిజిటిల్ సహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ రైట్స్‌ను రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18 కొనుగోలు చేసింది. డిస్నీ స్టార్ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తే.. వయాకామ్ 18 మ్యాచ్‌లను జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం ఇవ్వడం మంచిదే అయినప్పటికి అభిమానులకు తొలిరోజే జియో సినిమాలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. తొలి రోజు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఇరజట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఇరుజట్ల ఆటగాళ్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అయితే జియో సినిమాలో మ్యాచ్ చూసినవారికి మాత్రం కష్టాలు ఎదురయ్యాయి. ప్రతి పది నిమిషాలకోసారి సైట్ క్రాష్ అవడం లేదా బఫర్ అవడం జరిగింది. అభిమానులకు ఇది తలనొప్పిగా మారి మ్యాచ్‌ను కూడా సరిగ్గా వీక్షించలేకపోయారు. దీంతో జియో సినిమాపై అభిమానులు ట్విటర్ వేదికగా ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. తొలిరోజే జియో సినిమా యాప్ అట్టర్‌ప్లాఫ్ అయింది.. పదేపదే అంతరాయం కలిగిస్తూ మ్యాచ్ చూడకుండా చేసింది.. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ జియో సినిమా.. ఐపీఎల్ 16వ సీజన్లో ఇదో కొత్త రూల్ అనుకుంటా.. ప్రతి 15 సెకన్లకు రీప్రెష్ చేయాల్సి వచ్చింది.. బఫరింగ్.. బఫరింగ్.. బఫరింగ్ ఇది తప్ప ఇంకేమి కనిపించలేదు అంటూ విరుచుకుపడ్డారు. Haven’t been able to connect at all @JioCinema - it hangs every time I try to watch live streaming of #CSKvsGT. I am on Airtel — Vikrant Gupta (@vikrantgupta73) March 31, 2023 Is this also a new IPL rule that you have to click refresh on #JioCinema after every 15 seconds? #IPL2023 pic.twitter.com/I6c1qZQKdb — ansHU MOR (@anshuMor) March 31, 2023 Buffering buffering buffering @JioCinema Very Bad experience with your app #IPLonJioCinema #JioCrash #IPL2023 pic.twitter.com/GkYOxGx68w — Mahendra Bhadru (@Itsmk33402293) March 31, 2023 Subpar commentary, poor watching experience :/#IPLonJioCinema could be a classic oversell case study. #JioCrash pic.twitter.com/oRXBdWUaUz — Harsh Joshi (@josharsh1) March 31, 2023 చదవండి: '#Ee sala Cup Nahi'.. జట్టు కెప్టెన్ అయ్యుండి ఆ మాట అనొచ్చా! -
భారత్, ఆసీస్ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్ మైదాన్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రశాంతంగా సాగుతున్నప్పటికి.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మాత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్ రణరంగాన్ని తలపించింది. మ్యాచ్‌కు సంబంధించిన ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని ఆజాద్ మైదానంలోనే ఏర్పాటు చేశారు. కరోనా తదనంతరం పరిస్థితులు మారడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆన్లైన్ టికెట్స్‌వైపే మొగ్గుచూపారు. అయితే నిర్వాహకులు ఒకటే కౌంటర్ ఏర్పాటు చేయడం.. అభిమానులు మాత్రం ఊహించనిస్థాయిలో వచ్చారు. టికెట్ల కోసం క్యూలో నిలబడినప్పటికి రెండు గంటలకు పైగా కౌంటర్ తెరవలేదు. దీంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టికెట్ కౌంటర్ కిటికీ గ్రిల్‌ను ఊడగొట్టి విధ్వంసం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అభిమానులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పలువురిపై లాఠాచార్జీ చేశారు. అయితే కాసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు క్యూలో నిల్చున్నవారికి మ్యాచ్ టికెట్లు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Scenes at the Azaad Maidan in Mumbai. Online tickets are supposed to be collected from here. Number of counters should be increased if they know that a large no. of people are expected. Horrible management 👎 Won't suggest to anyone.@MumbaiCricAssoc @NorthStandGang @BCCI pic.twitter.com/rP51wcFDJj — Ojas Naidu (@Cricky_Nerd) March 17, 2023 చదవండి: జడేజాతో అట్లుంటది మరి.. డైవ్ చేస్తూ సంచలన క్యాచ్! వీడియో వైరల్ Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ.. -
క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా
క్రికెట్ అయినా.. సినిమా అయినా అభిమానం ఎప్పుడు తారాస్థాయిలో ఉంటుంది. తమకు నచ్చిన మ్యాచ్ లేదా సినిమా నటుడిని చూడడానికి ఎంతవరకైనా వెళ్తారు. తాజాగా నేపాల్‌లో క్రికెట్‌పై అభిమానం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. ఎంతలా అంటే ఒక మ్యాచ్ చూడడం కోసం అక్కడి ఫ్యాన్స్ ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా లెక్క చేయకుండా ఏకంగా చెట్లు ఎక్కి మరీ మ్యాచ్‌లు వీక్షిస్తున్నారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2(2019-23)లో భాగంగా గురువారం నేపాల్‌లోని కిర్తీపూర్ క్రికెట్ గ్రౌండ్లో నేపాల్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు పోటెత్తారు. స్టాండ్స్ మొత్తం ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయారు. టికెట్లు దొరకని వారు గ్రౌండ్ బయట బారికేడ్ల నుంచి మ్యాచ్‌ను వీక్షించారు. అయితే కొంతమంది మాత్రం మ్యాచ్ క్లియర్‌గా కనపడాలన్న ఉద్దేశంతో చెట్లపైకి ఎక్కి వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నేపాల్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి నేపాల్ జట్టు 44 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని అమలు చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నేపాల్ జట్టు చేయాల్సినదానికన్నా తొమ్మిది పరుగులు ఎక్కువగా చేయడంతో ఆ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. బీమ్ షార్కీ 67 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఆరిఫ్ షేక్ 52, గుల్షన్ జా 50 నాటౌట్, కుషాల్ బుర్తెల్ 50 పరుగులు రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఆసిఫ్ ఖాన్ 42 బంతుల్లోనే 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అర్వింద్ 94 పరుగులు చేయగా.. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 63 పరుగులతో రాణించాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023కి అర్హత సాధించడం నేపాల్, యూఏఈలకు అవసరం. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో నేపాల్ నాలుగో స్థానంలో ఉండగా.. యూఏఈ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్, ఒమన్‌లు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. 2023 క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు మరొక జట్టుకు మాత్రమే అవకాశం ఉంది. ఇక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో టీమిండియా అర్హత దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లు తాము ఆడే వన్డే సిరీస్‌ల్లో విజయాల ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది. एउटा गतिलो स्टेडियम बनाउन नसक्नेहरु किन खेल हेर्न मैदान पुगेका!? यो तस्वीरले गिज्याउँदैन!? लज्जित बनाउँदैन!? अन्तर्राष्ट्रिय मिडियाले कभर गरिरहेका छन् यहाँ!! pic.twitter.com/Cm6hHcAzPG — Nirmal Prasai🇳🇵 (@NirmalPrasai5) March 16, 2023 मैदान बाहिर यत्रो भिड, निश्वार्थ प्रेम र लगाव।💚#NEPvUAE , #nepalcricket , #nepalvsuae pic.twitter.com/UyL8DEfM99 — Nirmal Prasai🇳🇵 (@NirmalPrasai5) March 16, 2023 Update on the #CWCLeague2 match in Nepal: Nepal beat UAE by nine runs via the DLS Method UAE 310/6, 50 overs Nepal 269/6, 44 overs pic.twitter.com/ZgZMbtF7nc — UAE Cricket Official (@EmiratesCricket) March 16, 2023 చదవండి: ఆసీస్ సుందరికి ఎంత కష్టమొచ్చే! చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు -
అభిమానులను ఆశ్చర్యపరిచిన 'కింగ్' కోహ్లి పోస్ట్
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి ఖాళీగా ఉంటే చాలు టూర్లు చుట్టేయడం అలవాటుగా చేసుకున్నాడు. కివీస్‌తో టి20 సిరీస్ సందర్భంగా విరామం దొరకడంతో భార్య అనుష్క, కూతరు వామికాతో కలిసి రిషికేశ్ టూర్లో బిజీగా ఉన్నాడు. బుధవారం కోహ్లి రిషికేశ్ టూర్‌కు సంబంధించిన ఫోటోలు విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఆలోచింపజేసేలా ఉంది. ప్రస్తుతం అతని మనసు ఎంత ప్రశాంతతను కోరుకుంటుందనేది క్యాప్షన్‌గా జత చేశాడు. '' మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ డైరక్షన్లోనే వెళ్లండి'' అంటూ పేర్కొన్నాడు. కోహ్లి చేసిన పోస్ట్‌పై అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం కోహ్లి ప్రశాంతతో కనిపిస్తున్నాడని.. రాబోయే ఆసీస్‌తో టెస్టు సిరీస్ కోసం మానసికంగా సన్నద్దమవుతున్నాడని కామెంట్ చేశారు. ఇక ఆసియా కప్‌లో సెంచరీ ద్వారా తిరిగి ఫామ్‌ను అందుకున్న కోహ్లి తన జోరును చూపిస్తున్నాడు. టి20 వరల్డ్‌కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి.. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంకలతో జరిగిన సిరీస్‌ల్లో వరుస శతకాలతో హోరెత్తించాడు. అయితే ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లో మాత్రం మూడు మ్యాచ్‌లు కలిపి కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. అంతమాత్రానా కోహ్లి ఫామ్‌ను సందేహించాల్సిన అవసరం లేదు. ఇక విశ్రాంతి మోడ్‌లో ఉన్న కోహ్లి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. Instagram story of Virat Kohli pic.twitter.com/gC7DvuFfvg — Virat Kohli Fan Club (@Trend_VKohli) February 1, 2023 చదవండి: తిట్టినోళ్లే మెచ్చుకున్నారు.. శెభాష్ జోఫ్రా ఆర్చర్ గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్ బయటపడ్డ బెయిల్స్! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి -
'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది'
టీమిండియా వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేయగానే అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. అలా వన్డే సిరీస్ ముగిసి ఇలా టి20 సిరీస్ ప్రారంభం కాగానే భారత్ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో ఆటగాళ్లకు, అభిమానులకు ఇది సాధారణమే. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే టీమిండియాపై ఎక్కడలేని కోపాన్ని చూపిస్తారు అభిమానులు. ఆరోజు మ్యాచ్‌లో ఎవరి ప్రదర్శనైతే బాగుండదో వారికి సోషల్ మీడియాలో మూడినట్లే. అర్ష్‌దీప్ సింగ్ అత్యంత చెత్త బౌలింగ్‌తో ఇప్పటికే విమర్శలు మూటగట్టుకోగా.. తాజాగా రాహుల్ త్రిపాఠిని కూడా నెటిజన్లు ఆడేసుకున్నారు. మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన త్రిపాఠి ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. పైగా జాకబ్ డఫీ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి కీపర్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నాళ్లు టి20ల్లో మూడో స్థానంలో విరాట్ కోహ్లి వచ్చేవాడు. అతని బ్యాటింగ్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. తాజాగా కోహ్లి టి20లకు క్రమంగా దూరమవుతున్న వేళ సూర్యకుమార్ ఆ స్థానాన్ని తీసుకున్నాడు. కానీ కివీస్‌తో తొలి టి20లో సూర్య నాలుగో స్థానంలో వస్తేనే కరెక్టని.. కోహ్లి స్థానంలో రాహుల్ త్రిపాఠిని పంపించారు. కానీ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాల్సిన బాధ్యతను పక్కనబెట్టి నిర్లక్ష్యమైన షాట్ ఆడి డకౌట్ అవ్వడం అభిమానులను బాగా హర్ట్ చేసింది. అయితే ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో త్రిపాఠి మూడో స్థానంలోనే వచ్చి బ్యాటింగ్‌లో మెరిశాడు. దీంతో త్రిపాఠిని టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''కోహ్లి స్థానాన్ని అప్పగిస్తే ఇలాగేనా ఔటయ్యేది''.. ''త్రిపాఠిలో ఒక బ్యాటర్ కాకుండా జోకర్ కనబడుతున్నాడు''.. ''అతను తన టాలెంట్‌ను ఐపీఎల్ కోసం దాచుకుంటున్నట్లున్నాడు''.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు మాత్రం త్రిపాఠికి మద్దుతు తెలిపారు. ''లంకతో సిరీస్‌లో రాణించాడు కాబట్టే జట్టులో ఉన్నాడు.. ఇది అతనికి మూడో మ్యాచ్ మాత్రమే. వచ్చే మ్యాచ్‌లో రాణించే అవకాశం ఉంది.. ఒక్క మ్యాచ్‌కే తప్పు బట్టడం సరికాదు'' అంటూ పేర్కొన్నారు. Nothing just Rahul Tripathi is saving his batting talent for IPL and @SunRisers 😬 — Sanam Patel (@patelsanam) January 27, 2023 Rahul tripathi fanbois be like pic.twitter.com/wgsrdD3Az2 — Manu (@Manu_k333) January 27, 2023 Rahul Tripathi the way he played compelled us to think that , Is he a batsman or a joker ? Same way Arshdeep is also a joker Who has got nothing to do with bowling.. — Dharam (@Dharram03) January 27, 2023 చదవండి: రెండేళ్ల తర్వాత పునరాగమనం.. వన్డే కెరీర్లో చెత్త రికార్డు ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు -
ఏ మాత్రం తగ్గని ధోని మేనియా
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతనిపై ఉన్న క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. దానికి ఉదాహరణే రాంచీ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టి20. సొంత ఇలాకాలో మ్యాచ్ జరగడంతో ధోని తన ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌కు హాజరయ్యాడు. అంతకముందు ఒకరోజే టీమిండియా ఆటగాళ్లను కలిసిన ధోని వారిని సర్ప్రైజ్ చేశాడు. ఇక మ్యాచ్ సందర్భంగా ధోని స్క్రీన్‌పై కనబడగానే స్టేడియం మొత్తం ధోని.. ధోని అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధోనీ ధోనీ అంటూ అభిమానులు నినదిస్తుండగా అతడు అభివాదం చేశాడు. క్రికెట్లో దిగ్గజ కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు. అయితే ఆటకు దూరంగా ఉన్న ఏదో ఒక రూపంలో క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవలి కాలంలో టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లకు హాజరవుతున్నాడు. ఇక శుక్రవారం జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ చేతితో భారత్ ఓడిపోయింది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 లో మాత్రం ఓడిపోవడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్ ముందు న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేక చతికిలపడింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. సుందర్ ఒక్కడే అర్థశతకంతో ఒంటరిపోరాటం చేశాడు. MSD + Ranchi = 🤩 When the Ranchi crowd welcomed the legendary @msdhoni in style 😃👌#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/40FoEDudSv — BCCI (@BCCI) January 27, 2023 చదవండి: ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్.. -
లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి
పీసీబీకి సంకటస్థితి ఏర్పడింది. లేక లేక పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుంటే ఆదరణ కరువయింది. అభిమానులు మైదానాలకు వచ్చి మ్యాచ్‌లు చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో స్టేడియాలన్నీ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌కు అంతో ఇంతో ఆదరణ దక్కగా.. తాజాగా కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులే కరువయ్యారు. దీనికి తోడూ పాక్ వరుస ఓటములు కూడా అభిమానులకు నిరాశకు గురి చేశాయి. కరాచీ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ప్రేక్షకులు లేక స్టేడియం వెల వెల బోయింది. దీంతో రెండో టెస్టు నుంచి ఉచితంగా ఆడియెన్స్‌ను అనుమతించనుంది. ఈ మేరకు పీసీబీ ప్రకటన విడుదల చేసింది. "మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఒరిజినల్ ఐడీ కార్డు లేదా బీ ఫారం తీసుకుని స్టేడియానికి వస్తే ఉచితంగా ఎంట్రీ లభిస్తుంది. ఇమ్రాన్ ఖాన్, క్వాద్, వసీం అక్రమ్, జహీర్ అబ్బాస్ పేరిట ఉన్న ప్రీమియం లాంజ్‌లకు వెళ్లి చూసే అవకాశం కూడా ఉంది. ప్రీమియం, ఫస్ట్ క్లాస్, జనరల్ విభాగంలో ఏ ప్రదేశంలోనైనా కూర్చుని మ్యాచ్‌ను వీక్షించవచ్చు. పీసీబీ నేషనల్ బ్యాంక్ క్రికెట్ ఎరీనా, గరీబ్ నవాజ్ పార్కింగ్ ఏరియాలోనూ ప్రేక్షకులకు అనుమతి ఉంది. అంటూ పేర్కొంది. మరి ఉచిత ఎంట్రీ అయినా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పిస్తుందేమో చూడాలి. ఇక కరాచీ వేదికగా జరిగిన తొలి టెస్టు పేలవ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 438 పరుగులు చేయగా.. అనంతరం న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో రాణించడంతో 612 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను పాక్ 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కివీస్ విజయానికి 15 ఓవర్లలో 138 పరుగులు అవసరం కాగా.. 7.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేయగా.. వెలుతురు లేకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. చదవండి: నిలకడగా రిషబ్ పంత్ ఆరోగ్యం -
పేరుకు మాత్రమే అమెరికా.. జట్టు మొత్తం మనోళ్లే
వచ్చే ఏడాది జనవరిలో తొలిసారి ఐసీసీ అండర్-19 వుమెస్స్ టి20 వరల్డ్‌కప్ జరగనుంది. సౌతాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొననున్నాయి. కాగా 11 దేశాలు ఐసీసీ ఫుల్‌టైం మెంబర్స్ కాగా.. మిగతా ఐదు దేశాలను మాత్రం ఐసీసీ రీజియన్స్ నుంచి ఎంపిక చేశారు. వాటిలో అమెరికా(యూఎస్ఏ) కూడా ఒకటి. తాజాగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్-19 వుమెన్స్ టి20 టోర్నమెంట్‌కు యూఎస్ఏ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే క్రికెట్ అమెరికా ప్రకటించిన జట్టు చూస్తుంటే.. అసలు ఆడుతుంది అమెరికా లేక భారత్ అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే జట్టుకు ఎంపికచేసిన 15 మంది భారత సంతతికి చెందినవాళ్ల కావడం గమనార్హం. ఇక రిజ్వర్స్ కేటగిరలో ఎంపిక చేసిన ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారత్‌కే చెందిన వారే ఉన్నారు. ఇలా జట్టు మొత్తం భారతీయుల పేర్లతో నిండిపోయింది. ఇది గమనించిన క్రికెట్ ఫ్యాన్స్.. అమెరికా జట్టులాగా లేదు.. ఇండియా-బి టీమ్ స్క్వాడ్లాగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇక జట్టు హెడ్‌కోచ్‌గా విండీస్ మాజీ క్రికెటర్ శివ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఎంపిక చేసింది. ఇక ఐసీసీ తొలి అండర్-19 వుమెన్స్ టి20 వరల్డ్‌కప్ 2023 జనవరి 14 నుంచి జనవరి 29 వరకు జరగనుంది. జనవరి 27న జరిగే సెమీఫైనల్స్‌కు జేబీ మార్క్స్ ఓవల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత జనవరి 29న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. U-19 టోర్నమెంట్ కోసం యూఎస్ఏ ప్రకటించిన జట్టు: గీతిక కొడాలి (కెప్టెన్), అనికా కోలన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), అదితి చూడసమా, భూమిక భద్రిరాజు, దిశా ధింగ్రా, ఇసాని వాఘేలా, జీవన అరస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేష్ (వికెట్ కీపర్), పూజా షా, రీతూ సింగ్ ,సాయి తన్మయి ఎయ్యుణ్ణి,స్నిగ్ధా పాల్, సుహాని తడాని, తరణం చోప్రా రిజర్వ్ ప్లేయర్స్: చేతన ప్రసాద్, కస్తూరి వేదాంతం, లిసా రామ్‌జిత్, మిటాలి పట్వర్ధన్, త్యా గొన్సాల్వేస్ కోచింగ్, సహాయక సిబ్బంది: ప్రధాన కోచ్: శివనారాయణ్ చంద్రపాల్ టీమ్ మేనేజర్: జాన్ ఆరోన్ జట్టు విశ్లేషకుడు: రోహన్ గోసాల అసిస్టెంట్ కోచ్: బర్ట్ కాక్లీ ఫిజియో/మెడికల్: డా. ఆడ్రీ ఆడమ్స్ అసిస్టెంట్ టీమ్ మేనేజర్: జోన్ అలెగ్జాండర్-సెరానో 📡MEDIA RELEASE: USA Cricket Women's U19s Squad for Historic First World Cup Appearance Named 15-player squad to represent Team USA is named for the inaugural ICC Under-19 Women’s T20 World Cup in South Africa next month ➡️: https://t.co/xB789FYppc#WeAreUSACricket🇺🇸 #U19CWC pic.twitter.com/x6Y00UXrE7 — USA Cricket (@usacricket) December 14, 2022 United States of India — Rahul Goyal (@rahulgoyalactor) December 14, 2022 USA Cricket team or India B team?? — Vignesh (@vickki93) December 14, 2022 The USA women's cricket team is a more diverse representation of India than the Indian women's cricket team!:) — Sandeep Ramesh (@SandeepRamesh) December 14, 2022 చదవండి: కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది -
12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు
విశాఖ స్పోర్ట్స్: విశాఖ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్‌లో పర్యటించనున్న ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో వన్డే మ్యాచ్ ఆడేందుకు రానుంది. ఆ్రస్టేలియా జట్టు ఈ సిరీస్‌లో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌లాడనుండగా.. రెండో వన్డే మార్చి19న వైఎస్సార్ స్టేడియం వేదికగా జరగనుంది. 17న తొలి వన్డే ముంబయిలో, 22న మూడో వన్డే చెన్నై వేదికగా బీసీసీఐ ఖరారు చేసింది. ఇక 12 ఏళ్ల విరామం అనంతరం మరోసారి ఆస్ట్రేలియా జట్టు విశాఖ క్రీడాభిమానులను అలరించనుంది. 2010 అక్టోబర్ 10న కంగారు జట్టు భారత్‌తో ఆడింది. అప్పట్లోనూ సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలోనే ఇరు జట్లు ఇక్కడ తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ ఏడు బంతులుండగా విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌తో భారత్ సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించింది. విరాట్‌కోహ్లీ విశ్వరూపం చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత్ తరఫున శిఖర్‌ధావన్ ఈ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేశాడు. చదవండి: మొక్కుబడిగా ఆడుతున్నారు.. గెలవాలన్న తపనే లేదు! ఖతర్‌లో వరల్డ్‌కప్.. ప్రపంచానికి తెలియని మరణాలు! -
హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సహనం కోల్పోయాడు. తనను హేళన చేసిన కొంతమంది అభిమానులతో బహిరంగ గొడవకు దిగాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ఫామ్ కోల్పోయిన జట్టుకు దూరమైన హసన్ అలీ ఒక లోకల్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. పంజాబ్ ఫ్రావిన్స్‌లోని పక్‌పత్తన్ జిల్లాలో ఆదివారం ఈ మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో హసన్ అలీ బౌండరీ లైన్ వద్ద నిల్చున్నాడు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు హసన్ అలీని టీచ్ చేశారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్ ఆడడానికి సిగ్గులేదా.. అంటూ ఆటపట్టించారు. చాలాసేపు ఓపికతో భరించిన హసన్ అలీపై కొంతమంది గడ్డి, పేపర్లను విసిరారు. దీంతో సహనం కోల్పోయిన హసన్ అలీ తనను టీచ్ చేసిన వారితో గొడవకు దిగాడు. వారిని కొట్టడానికి ప్రయత్నించగా మిగతావారు హసన్ అలీని అడ్డుకున్నారు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు వచ్చి హసన్ అలీని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. ఒక లోకల్ మ్యాచ్‌లో ఆడేందుకు ఒప్పుకున్న అంతర్జాతీయ క్రికెటర్‌ను ఇలానే అవమానిస్తారా అంటూ మ్యాచ్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్ అలీతో గొడవకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కాగా 2021 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో హసన్ అలీ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటినుంచి హసన్ అలీని ట్రోల్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన అతను జట్టుకే దూరమయ్యాడు. దీంతో అభిమానుల ట్రోల్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. మంచిగా ఉన్నంతవరకు ఏం కాదు కానీ ఆటగాళ్లు రివర్స్ అయితే మాత్రం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని హసన్ అలీ ఉదంతం హెచ్చరిస్తుందంటూ కొంతమంది పేర్కొన్నారు. ఒకప్పుడు హసన్ అలీ పాక్ తరపున నెంబర్‌వన్ బౌలర్‌గా రాణించాడు. ఆ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ నెంబర్‌వన్‌గా కొంతకాలం కొనసాగాడు. ఇక పాకిస్తాన్ తరపున హసన్ అలీ 60 వన్డేల్లో 91 వికెట్లు, 21 టెస్టుల్లో 77 వికెట్లు, 50 టి20ల్లో 60 వికెట్లు తీశాడు. You gotta feel for Hasan Ali. He is out of the team but never gave any toxic statement always kept supporting the team. Once a No 1 ODI bowler and now he is facing such things in a random club game. pic.twitter.com/L2OLjVPRQd — zayn (@ZaynMahmood5) December 4, 2022 Hassan Ali's fight with the crowd😱#HassanAli #PakvEng #Cricket pic.twitter.com/G4mji06uwa — Muhammad Noman (@nomanedits) December 3, 2022 చదవండి: FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! ENG Vs PAK: ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్ కోసం చకోర పక్షుల్లా -
సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే.. అభిమానుల ఆగ్రహం
టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ మరోసారి అన్యాయానికి గురయ్యాడు. సీనియర్ జట్టుకు విశ్రాంతి ఇచ్చినప్పుడు అతన్ని జట్టుకు ఎంపిక చేయడమే తప్ప మ్యాచ్‌లు ఆడించడం లేదు. తాజాగా న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లోనూ సంజూకు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. తొలి టి20లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శాంసన్‌కు ఆదివారం జరిగిన రెండో టి20లోనూ మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ను ఆడించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అసలు మ్యాచ్‌లు ఆడిస్తే కదా సంజూ శాంసన్ ప్రతిభ తెలుస్తుంది. అన్ని సిరీస్‌లకు ఎంపిక చేయడం.. మ్యాచ్ సమయానికి మాత్రం పక్కనబెడితే ఏం లాభం.. అతని టాలెంట్‌ను తొక్కేస్తున్నారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అతనేంటో చూపిస్తాడు.. మీ చిల్లర రాజకీయాలకు ఒక్క మంచి ఆటగాడి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.'' అంటూ పేర్కొన్నారు. ఇదే విషయమై మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటేటర్స్ టాక్‌లో రవిశాస్త్రి కూడా సంజూ శాంసన్‌పై స్పందించాడు.''ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్లను బెంచ్‌కు పరిమితం చేసి సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. వరుసగా 10 మ్యాచ్‌లు ఆడించాలి.. అంతేకాని రెండు మ్యాచ్‌లకే పక్కనబెట్టకూడదు. 10 మ్యాచ్‌ల తర్వాత అతని ప్రదర్శనను చూసి అప్పడు ఆలోచించాలి. అతనికి కూడా అవకాశాలు ఇస్తేనే కదా టాలెంట్ ఏంటో తెలిసేది'' అంటూ తెలిపాడు. ఇక సంజూ శాంసన్ టాలెంట్‌లో మాత్రం కొదువ లేదు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. వరుసగా రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే వస్తున్నాడు. అయినప్పటికి సంజూకు అన్యాయం జరుగుతూనే ఉంది. Bench all these senior players and give sanju samson at least 10 matches continuously. Don't drop him after 2 matches. Decide after 10 matches. Give that boy also a fair chance - Ravi shastri You are right Ravi But why didn't you give him those chances? Virat kohli said No? pic.twitter.com/DPxVJkMjQI — BRUTU (@Brutu24) November 17, 2022 చదవండి: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన మళ్లీ విఫలం.. ఇతన్ని టీమిండియా కెప్టెన్ చేయాలట..! -
'అనుష్కతో వీడియో కాల్లో ఉన్నా.. డిస్టర్బ్ చేయకండి'
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్య చేధనలో రోహిత్, కోహ్లిలు విఫలమైనప్పటికీ.. కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌లు అర్థశతకాలతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకముందు టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్‌లు తొలి మూడు ఓవర్లలోనే ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను శాసించారు. వీరికి తోడు హర్షల్ పటేల్, అక్షర్ పటేల్‌లు చెలరేగడంతో ప్రొటిస్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇదిలా ఉంటే మ్యాచ్ విజయం అనంతరం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్పోర్ట్ వరకు టీమిండియా బృందం బస్సులో బయలుదేరింది. అయితే హోటల్ బయట అప్పటికే అభిమానులు భారీగా గూమిగూడారు. భారత్ క్రికెటర్లు బస్సు ఎక్కగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక కోహ్లిని చూడగానే అభిమానుల్లో మరింత జోష్ వచ్చింది. '' కోహ్లి.. కోహ్లి'' అంటూ గట్టి గట్టిగా అరిచారు. అయితే ఆ సమయంలో కోహ్లి.. తన భార్య అనుష్క శర్మతో ఫోన్లో వీడియో కాల్లో ఉన్నాడు. అభిమానుల పిలుపుకు స్పందించిన కోహ్లి వెంటనే బస్సు అద్దంలో నుంచి.. ''అనుష్కతో వీడియో కాల్లో ఉన్నా.. డిస్టర్బ్ చేయకండి'' అంటూ ఫోన్ చూపిస్తూ నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య రెండో టి20 అక్టోబర్ 2న(ఆదివారం) జరగనుంది. @imVkohli In Video Call With @AnushkaSharma While Returning From Match And Shows It To Fans 😂🤣💖#Virushka #INDvSA pic.twitter.com/YRVLNwZCiq — virat_kohli_18_club (@KohliSensation) September 29, 2022 చదవండి: నా జీవితంలో ఆరోజును మర్చిపోలేను: కోహ్లి ఉద్వేగం.. వీడియో వైరల్ -
HCA ఘోర వైఫల్యం
-
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ ఫ్యాన్స్ క్యూ
-
IND Vs AUS: టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు పోటెత్తిన అభిమానులు (ఫొటోలు)
-
క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిన జింఖానా గ్రౌండ్ పరిసరాలు
-
Asia cup 2022: బంగ్లాదేశ్ అవుట్! ఏడ్చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్!
ఆసియాకప్-2022 టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంక సూపర్-4కు అర్హత సాధించిగా.. బంగ్లాదేశ్ మాత్రం ఇంటిముఖం పట్టింది. కాగా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ స్వీయ తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోయారు. ఓ బుడ్డోడు అయితే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. బంగ్లాదేశ్ ఓటమి పాలైన అనంతరం బంగ్లా జెర్సీ ధరించి ఉన్న ఓ బాలుడు ఏడుస్తూ కనిపించాడు. పక్కన అతడి తల్లి ఓదారుస్తూ కనిపించింది. తమ జట్టు గెలుపు ఖాయమనుకున్న ఆ యువ ఆభిమాని.. తమ జట్టు ఆఖరికి ఓడిపోవడంతో.. తట్టుకోలేకపోయాడు. కాగా గతంలో కూడా బంగ్లా జట్టు ఓటమి పాలైతే అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. #BANVSSL #SLvBAN emotions pic.twitter.com/j0zUbBojz9 — Wasif (@Wasif_93) September 1, 2022 చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ -
టీమిండియాతో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. కళ్లన్నీ ఆ యువతిపైనే!
ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. లీగ్ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్‌పై సంచలన విజయాలు నమోదు చేసిన అఫ్గానిస్తాన్ సూపర్-4కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒక అందమైన యువతి హాజరైంది. ఆమె అందానికి ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్ చూసినవారు కూడా ఫిదా అయ్యారు. అంతగా కుర్రకారు మనసులు దోచుకున్న ఆ యువతి పేరు వాజ్మా అయూబీ. అఫ్గానిస్తాన్ అభిమాని అయిన వాజ్మా బౌండరీ లైన్ వద్ద అఫ్గాన్ జెండా పట్టుకొని ఆటగాళ్లతో పాటు వీక్షకులను తన అందరంతో కట్టిపడేసింది. కాగా మ్యాచ్ గెలిచిన తర్వాత అఫ్గానిస్తాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. కంగ్రాట్స్ బ్లూ టైగర్స్ అంటూ వాజ్మా ఆయూబీ తన ట్విటర్లో పేర్కొంది. అంతే ఆమె ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొంతమంది టీమిండియా అభిమానులు కూడా వాస్మా ఆయూబీ అందానికి ముగ్దులై.. ''టీమిండియా, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌కు కూడా వస్తారా..'' అంటూ కామెంట్ చేయడం విశేషం. అలా వాజ్మా ఆయూబీ తన అందంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. టీమిండియా, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌కు ఆమె వస్తుందో లేదో తెలియదు కానీ.. ఒకవేళ వాజ్మా హాజరైతే మాత్రం అందరి కళ్లు ఆమెవైపు ఉంటాయని మాత్రం చెప్పొచ్చు. ఇక బుధవారం హాంకాంగ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూఫ్ టాపర్‌గా సూపర్-4లోకి అడుగుపెట్టింది. మంగళవారం(సెప్టెంబర్ 6న) టీమిండియా.. అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అంతకముందే.. అన్ని సక్రమంగా జరిగితే ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మరోసారి తలపడే అవకాశముంది. అయితే పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే శుక్రవారం హాంకాంగ్‌తో మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. Congratulations blue tigers #AFGvsBAN #AsiaCup2022 pic.twitter.com/ia7X8slfjJ — Wazhma Ayoubi (@WazhmaAyoubi) August 30, 2022 -
'మరి అంత పనికిరాని వాడా?.. బీసీసీఐ కావాలనే చేస్తోంది'
యూఏఈ వేదికగా ఈనెల 27 నుంచి జరగనున్న ఆసియా కప్‌లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే 15 మందితో కూడిన ఈ జట్టులో వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ పేరు లేకపోవడంపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు ప్రకటించిన తర్వాత బీసీసీఐపై అభిమానులు విమర్శలు గుప్పించారు. ''బీసీసీఐ కావాలనే సంజూ శాంసన్‌ను అణిచివేస్తుంది. అవకాశం ఇచ్చిన ప్రతీసారి తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అయినా కూడా అతనిపై వివక్ష చూపించడం బాధాకరం. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ కంటే శాంసన్ మెరుగైన ఆటగాడు.కేఎల్ రాహుల్ రాకతో ఓపెనింగ్ జోడీ (రోహిత్ శర్మ-రాహుల్)కి అవసరం లేకపోవడంతో ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టారు. వన్ డౌన్లో కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తాడు. మిడిలార్డర్ కోసం సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లు ఉన్నారు. దీంతో శ్రేయాస్ అయ్యర్‌ను బ్యాకప్‌గా ఎంపిక చేశారు. నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లకు అవకాశమిచ్చారు. అయితే కనీసం బ్యాకప్ ప్లేయర్‌గా కూడా శాంసన్ పనికిరాడా..?'' అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2022 ఏడాదిలో సంజూ శాంసన్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకసారి బ్యాటింగ్ అవకాశం రాలేదు. మిగతా ఐదు ఇన్నింగ్స్‌లు కలిపి 179 పరుగులు చేశాడు. ఈ ఆరు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు శ్రీలంకపై, ఒక మ్యాచ్ ఐర్లాండ్‌పై, మరో రెండు విండీస్‌పై ఆడాడు. ఇందులో అత్యధిక స్కోరు 77 పరుగులు(ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో) సాధించాడు. It's pure Injustice to Sanju Samson By BCCI selectors side lining him every now & Then! It's up to Ashwin now that he has the ability to Take Wickets as well Dry runs against Quality spin players from Pakistan Sri Lanka & B'desh in Asia Cup 2022#AsiaCup2022#IndianCricketTeam pic.twitter.com/HcaveQyXnF — MTvalluvan (@MTvalluvan) August 8, 2022 An expected exclusion from asia cup squad but the real stroy behind is.👇🏻#sanjusamson #AsiaCup2022#TeamIndia pic.twitter.com/CyDdMfCnsD — Mahi Bishnoi (SanjusamsonFan) (@Sanjusamsonf11) August 8, 2022 Performance of Wicketkeepers in T20is in 2022 SANJU-158.40 SR& 44.75 AVG ISHAN-130.30 SR& 30.71 AVG PANT-135.42 SR& 26 AVG DK-133.33 SR& 21.33 AVG Best performers- Sanju Samson and Ishan Kishan. Picked in Asia Cup- Pant and DK Does that make sense?#AsiaCup2022 #Sanjusamson pic.twitter.com/hCgIxOKmd2 — Anurag (@RightGaps) August 8, 2022 చదవండి: Rudi Koertzen Death: క్రికెట్లో విషాదం.. దిగ్గజ అంపైర్ కన్నుమూత Hundred 2022: ఆరు సెకన్ల పాటు గాల్లోనే.. సెకన్ల వ్యవధిలో రెండు అద్భుతాలు Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్ అయితే..: మాజీ కెప్టెన్ -
లండన్ వీధుల్లో ధోనికి వింత అనుభవం
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంలో ధోని ఎక్కడైనా బయట కనిపిస్తేనే క్రికెట్ ఫ్యాన్స్హడావిడి మాములుగా ఉండదు. తాజాగా లండన్ వీధుల్లోనూ ధోనికి అదే అనుభవం ఎదురైంది. ఒక పని ముగించుకొని తన కారు వద్దకు వస్తున్న ధోనిని గుర్తుపట్టిన అభిమానులు అతనితో సెల్ఫీలు దిగేందుకు పరిగెత్తుకొచ్చారు. వారి నుంచి తప్పించుకునేందుకు ధోని కాస్త వేగంగా నడవడంతో అభిమానులు చేజింగ్ చేయడం మొదలెట్టారు. అయితే సెక్యూరిటీ సాయంతో ధోని తన కారులో అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని శనివారం ట్విటర్లో షేర్ చేశాడు. కాగా ధోని రెండు వారాల క్రితం తన కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి సరదాగా గడపడానికి ఇంగ్లండ్‌కు వెళ్లాడు. తన 41వ పుట్టినరోజు(జూలై 7న) కూడా అక్కడే జరుపుకున్నాడు. అటుపై టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడేందుకు రావడంతో ఆ మ్యాచ్‌లు వీక్షించేందుకు కూడా ధోని వెళ్లాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేకు ధోని సందడి చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్‌రూమ్‌లో పలువురు టీమిండియా ఆటగాళ్లను కలిసిన ఫోటోలు షేర్ చేసుకున్నాడు. . @MSDhoni in the streets of london 🔥🔥pic.twitter.com/aLEurgsClH — Dhoni Army TN™🦁 (@DhoniArmyTN) July 16, 2022 చదవండి: ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. సందడి చేసిన ధోని, రైనా -
ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు
టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య గురువారం(జూన్ 9న) ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మైదానంలో మ్యాచ్ సీరియస్‌గా సాగుతుంటే.. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఒక వర్గం మాత్రం రెండుగా చీలిపోయి కొట్టుకు చచ్చారు. గొడవకు కారణం ఏంటో తెలియదు గాని రెండు గ్రూఫులు ఒకరిపై ఒకరు పంచుల వర్షం కురిపించుకున్నారు. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల్లో చాలా మంది ఫైటింగ్‌ను కనీసం ఆపాలనే విషయాన్ని మరిచిపోయి ఆసక్తిగా తిలకించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ కొట్టుకున్నారు. చివరికి ఢిల్లీ పోలీసుల ఎంట్రీతో వీరి గొడవకు బ్రేక్ పడింది. మ్యాచ్ ముగిశాక పోలీసులు గొడవకు సంబంధించిన ఇరు వర్గాలను ఆరా తీసి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇదంతా ఒక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అంతలా కొట్టుకున్నారంటే కచ్చితంగా ఏదైనా బలమైన కారణం ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టి20లో బౌలింగ్ ఫెయిల్యూర్‌తో టీమిండియా ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 76 పరుగులు సహా శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టును మిల్లర్(64*), డుసెన్(75*)లు గెలిపించారు. భారత బౌలర్లను చీల్చి చెండాడుతూ నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించిన ఈ జంట విజయంలో కీలకపాత్ర పోషించారు. డుసెన్ 29 పరుగుల వద్ద ఉన్నప్పుడు అయ్యర్ వదిలేసిన క్యాచ్ టీమిండియా పాలిట శాపంగా మారింది. ఇక రెండో టి20 ఆదివారం(జూన్ 12న)న జరగనుంది. Exclusive video from #QilaKotla yesterday East Stand pic.twitter.com/CXgWMOse87 — Pandit Jofra Archer (@Punn_dit) June 10, 2022 చదవండి: T20 Blast: చేతిలో 8 వికెట్లు.. విజయానికి 29 పరుగులు; నెత్తిన శని తాండవం చేస్తే -
'అర్థం పర్థం లేని ట్వీట్స్.. మాకేదో తేడా కొడుతోంది'
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి శుక్రవారం ఎప్పుడు లేనంత కొత్తగా కనిపించాడు. ఎక్కువగా క్రికెట్ సంబంధిత అంశాలపై చర్చలు జరిపే రవిశాస్త్రి ఉన్నట్లుండి తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఫ్లెష్ జాకెట్.. కూలింగ్ గ్లాసెస్.. మెడలో గోల్డ్ చైన్.. స్వాగ్లుక్ దుమ్మురేపాడు. అయితే ఈ ఫోటోలు షేర్ చేయడం వరకు ఓకే.. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. హుందాగా కనిపించే రవిశాస్త్రిలో ఇన్ని వేరియషన్స్ ఉన్నాయా అన్న అనుమానం క్రికెట్ ఫ్యాన్స్‌కు కలిగింది. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైందంటూ పేర్కొన్నారు. ఎప్పుడు లేనంతగా రవిశాస్త్రి సింగిల్ లైన్ క్యాప్షన్స్ ఎక్కువగా జత చేశారు. మూడు ఫోటోలు షేర్ చేసిన ఆయన.. మూడు విభిన్నమైన లైన్స్‌ను క్యాప్షన్‌గా పెట్టారు. చివరగా..''నేను చిల్ అవ్వాలంటే ఏమి చెయ్యాలి''.. ''మంచి మూడ్‌లో ఉన్నా.. నన్ను ఏమైనా అడగొచ్చు'' అంటూ శాస్త్రి నుంచి ట్వీట్ వచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ''అర్థం పర్థం లేని ట్వీట్స్.. కచ్చితంగా రవిశాస్త్రి అకౌంట్ హ్యాక్ అయినట్లే'' అంటూ కన్ఫర్మ్ చేశారు. కాగా రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్ 2022(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బ్రాడ్కాస్ట్ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. ఆటగాళ్ల బ్యాటింగ్, ఆటతీరు, ఫామ్ తదితర అంశాలపై చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు. కాగా గతేడాది టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితేఘా టోర్నీలో టీమిండియా సూపర్-12 దశను దాటలేక చతికిలపడింది. అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా అతని హయాంలో టీమిండియా మేజర్ టోర్నీల్లో గెలవనప్పటికి స్వదేశంలో, విదేశాల్లో చారిత్రాక సిరీస్‌లు గెలిచింది. ఇక టీమిండియా తరపున మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Ravi Shastri New Look: న్యూలుక్స్తో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కోచ్ Mujhe kya mein toh chill hun 🍻 — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 I’m in a good mood today, ask me anything. #AskRavi — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 -
ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్కే పని అంతే!
ఐపీఎల్ 2022లో సీఎస్కేకు ఘనమైన ఆరంభం లభించలేదు. గతేడాది సీజన్లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సీఎస్కే నాలుగోసారి చాంపియన్స్‌గా నిలిచింది. అదే ఆటతీరును ప్రస్తుతం కనబరచలేకపోతుంది. ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో జడేజా ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పటికి జడేజా ఘోరంగా విఫలమవుతున్నాడు. ధోని మార్క్ కెప్టెన్సీని జడ్డూ చూపెట్టలేకపోతున్నాడు. దీనికి తోడూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటములను మూటగట్టకుంది. దీంతో సీఎస్కే అభిమానులు రైనాను మళ్లీ సీఎస్కేలోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ మెగావేలానికి ముందు సురేశ్ రైనాను సీఎస్కే రిలీజ్ చేసింది. ఆ తర్వాత మెగావేలంలో రైనాను కొనుగోలు చేయడానికి సీఎస్కేతో పాటు ఏ జట్టు ఆసక్తి చూపించలేదు. దీంతో రైనా అమ్ముడపోని జాబితాలో చేరిపోయాడు. అయితే ప్రస్తుతం రైనా ఐపీఎల్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. రైనా జట్టులో లేకపోవడంతోనే సీఎస్కే ఈ సీజన్‌ను ఓటములతో ప్రారంభించిదని ఒక వర్గం అభిమానులు అభిప్రాయపడ్డారు. 2020లో రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరమయ్యాడు. యూఏఈ వేదికగా జరిగిన ఆ సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన సీఎస్కే తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాతి సీజన్లో రైనా అందుబాటులోకి రావడం.. సీఎస్కే విజేతగా నిలవడం యాదృశ్చికంగా జరిగిపోయాయి. అంతేగాక చాలా మంది అభిమానులు సీఎస్కే ప్రదర్శనను ఐపీఎల్ 2020 సీజన్‌తో పోలుస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ రైనా జట్టులో లేకపోవడంతో సీఎస్కే వరుసగా ఓటములు చవిచూసింది. అందుకే రైనాను వెనక్కి తీసుకురావాలని.. ఒకవేళ జట్టులో ఆటగాడిగా కాకున్నా.. కనీసం బ్యాటింగ్ మెంటార్గానైనా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మీరు ఏమనుకున్నా సరే.. రైనా లేని జట్టును ఊహించకోవడం కష్టంగా ఉంది.. వెంటనే అతన్ని ఏదో ఒక రూపంలో వెనక్కి పిలిపించండి. రైనా సీఎస్కేతో పాటు ఉంటే కచ్చితంగా ఐపీఎల్ టైటిల్ కొడుతుంది.. లేదంటే అంతే సంగతులు అంటూ సీఎస్కే అభిమానులు కామెంట్ చేశారు. ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం రైనా పేరు మరోసారి మార్మోగిపోతుంది. ఇంకో విషయమేంటంటే.. రైనా జట్టులో లేని సందర్భాల్లో సీఎస్కే 22 మ్యాచ్‌ల్లో 14 సార్లు ఓడిపోయింది. కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. సీఎస్కేకు రైనా ఇంపాక్ట్ ఎంత ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక రైనా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో రైనా 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు సెంచరీలు ఉన్నాయి. ధోని తర్వాత సీఎస్కే జట్టులో అంతలా పేరు సంపాదించిన రైనాను అభిమానులు ముద్దుగా చిన్న తలా అని పిలుచుకుంటారు. చదవండి: IPl 2022: 'ధోని అలా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది' Can You Imagine a Body without it's soul...? A Heart Without Heartbeat...? It's CSK without Suresh Raina....💔#CSK #Dhoni #ChennaiSuperKings #CSKvsPBKS #CSK𓃬 #Raina #SureshRaina #WhistlePodu #IPL#IPL2022 #WhistlePodu #chinathala pic.twitter.com/zWpbuzfo7z — chaitali♡ॐ (@Chaitali67) April 4, 2022 No hate just a fact@ChennaiIPL in IPL 2022 without @ImRaina and @faf1307 is like Zimbabve in World Cup 😭 #fact #nohate #IPL2022 #FafDuPlessis #Raina #Cricket — Aditya (@Aditya_Nikam23) April 4, 2022 A family is completed with a wife... So @ImRaina is the wife of @ChennaiIPL . Without china thala csk family is incomplete...china thala we miss u.. #CSKvsPBKS — CRIC-FACTS (@SanjitKumarSw12) April 4, 2022 -
ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి మూడు రోజుల ముందు క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు 25 శాతం ప్రేక్షకులకు అనుమతినిస్తూ ఐపీఎల్ తన అధికారిక వెబ్సైట్లో బుధవారం పేర్కొంది. ఫ్యాన్స్‌కు ఇది సంతోషం కలిగించే విషయం.. ఎందుకుంటే ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభ వేడుకలను ఈసారి కూడా నిర్వహించడం లేదని బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసి ఫ్యాన్స్‌ను నిరాశ మిగిల్చింది. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే ఈసారి మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు గుడ్‌న్యూస్ చెప్పింది. అయితే పూర్తిస్థాయి ప్రేక్షకులను కాకుండా కేవలం 25 శాతం మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది సీజన్‌ను ముంబై, పూణే వేదికల్లో నిర్వహించనున్నారు. మార్చి 26న గత సీజన్ విజేత సీఎస్కే.. రన్నరప్ కేకేఆర్ మధ్య మ్యాచ్‌తో సీజన్ ప్రారంభం కానుంది. ''ఐపీఎల్ 15వ సీజన్‌కు ప్రేక్షకులను అనుమతిస్తున్నాం. అయితే కోవిడ్-19 నిబంధనల ప్రకారం 25 శాతం మందికే ఎంట్రీ ఇచ్చాం. తమ అభిమాన క్రికెటర్ల ఆటను దగ్గర్నుంచి చూడాలనే అభిమానుల కోరికను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. కాగా ప్రోటోకాల్స్ కచ్చితంగా అమలవుతాయి. ''అంటూ ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు. కాగా గతేడాది సీజన్లో తొలి అంచె పోటీలకు ప్రేక్షకులను అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే ఆటగాళ్లకు కరోనా సోకడం.. సిబ్బందిలో కూడా చాలా మందికి పాజిటివ్ అని తేలడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత నవంబర్‌లో మళ్లీ ఐపీఎల్ రెండో అంచె పోటీలను నిర్వహించినప్పటికి ప్రేక్షకులను అనుమతించలేదు. చదవండి: IPL 2022: అందరూ ధోని కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటారు.. కానీ నేను మాత్రం: రషీద్ ఖాన్ IPL 2022: వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ ఇప్పటికీ అతడి పేరిట చెక్కు చెదరని రికార్డు! టాప్-5లో ఉన్నది వీళ్లే -
'నీ బౌలింగ్ వల్ల ఒరిగేదేం లేదు'.. హార్దిక్‌ను ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్
ఐపీఎల్ కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఇటీవలే తమ జెర్సీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా, బీసీసీఐ కార్యదర్శి జై షా.. జట్టు ఇతర అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.ఇక జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. సమావేశంలో భాగంగా బౌలింగ్ చేస్తారా లేదా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పాండ్యా బదులిస్తూ.. ‘‘సర్.. అది సర్ప్రైజ్.. సర్ప్రైజ్లాగే ఉండనివ్వండి’’ అంటూ సమాధానం దాటవేశాడు. ఇప్పుడు ఈ సమాధానమే పాండ్యా కొంపముంచింది. పాండ్యా బౌలింగ్ చేయాలా వద్దా అన్న దానిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.''పాండ్యా ఏదో గ్రేట్ బౌలర్లా ఫీలవుతున్నాడు. ఆల్‌రౌండర్ అని చెప్పుకుంటున్న హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌ను దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌తో పోల్చుకుంటున్నాడు'' అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. ''నువ్వు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ స్టార్క్వి మాత్రం కాదు బ్రో.. నీ బౌలింగ్ చూడడం వల్ల మాకు ఒరిగేదేం లేదు''.. ''అందులో సర్ప్రైజ్ ఏముంది.. బౌలింగ్ వేస్తావా.. వేయవా అనేదానికి అవును.. కాదు అనే సమాధానం ఇస్తే సరిపోయేదిగా..'' అంటూ ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. ఇక ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో ఉన్నాడు. ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్ వస్తేనే హార్ధిక్ ఐపీఎల్ 2022 సీజన్లో బౌలింగ్ వేసే అవకాశముంది.కాగా గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యాను మెగా వేలానికి ముందే 15 కోట్లు చెల్లించి గుజరాత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: గుజరాత్ టైటాన్స్ జెర్సీ ఆవిష్కరణ.. సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా Lewis Hamilton: పేరు మార్చుకోనున్న స్టార్ ఆటగాడు.. కారణం? 46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్ Hardik 😂😂 pic.twitter.com/805zI9e8ac — Sports Hustle (@SportsHustle3) March 13, 2022 -
ఇదేం చిత్రం.. కోహ్లి సెంచరీ కోసం పాక్ ఆటగాళ్ల మొక్కులు
టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లి సెంచరీ మార్క్ సాధించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. కోహ్లి సెంచరీ లేకుండా ఇన్నేళ్లు ఉండడం ఇదే తొలిసారి. అతను ఎప్పుడు సెంచరీ కొడతాడా అని క్రికెట్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులే గాక.. పాక్ క్రికెటర్లు సహా ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లి సెంచరీ కోసం పరితపిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పీఎస్ఎల్(పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్)లో పాల్గొంటున్న ఇస్లామాబాద్ యునైటెడ్ స్ట్రాటెజీ మేనేజర్ హసన్ చీమా తన ట్విటర్లో వెల్లడించాడు. చదవండి: ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్ ''పీఎస్ఎల్ గురించి ఎక్కువగా ట్వీట్ చేయకూడదు అనుకున్నా. కానీ ఒక విషయం నాకు జీర్ణం కావడం లేదు. పీఎస్ఎల్లో ఆడుతున్న పాక్ ఆటగాళ్ల దగ్గర నుంచి అభిమానుల వరకు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు. అదేంటంటే.. కోహ్లి 71వ సెంచరీ అందుకోవాలని. దీనికోసం పాక్ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. పేరుకే ప్రత్యర్థులం కానీ క్రికెట్లో రాణించే ఆటగాడికి ఏ దేశం నుంచైనా అభిమానులు ఉంటారన్న దానికి కోహ్లియే ఉదాహరణ. కోహ్లి కచ్చితంగా 71వ సెంచరీ సాధిస్తాడు.'' అని ట్వీట్ చేశాడు. ఇది విన్న టీమిండియా అభిమానులు.. ''ఇదేం చిత్రమో.. బయటకు మాత్రం మా చేతిలో పాక్ ఓడిపోతే.. మన దేశాన్ని తిడతారు.'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక కోహ్లి ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే వన్డే, టి20 కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఇకపై సీనియర్ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో కోహ్లి పర్వాలేదనిపించాడు. అందరు విఫలమైనచోటు తాను కాస్త సక్సెస్ అయ్యాడు. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ 21 పరుగుల తేడాతో ఆ ముచ్చట తీరకుండానే 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే , మూడో వన్డేలో హాఫ్ సెంచరీలు సాధించినప్పటికి.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. 71వ సెంచరీ సాధిస్తాడని ఎదురుచూస్తున్న కోహ్లి అభిమానుల కల.. విండీస్‌తో సిరీస్‌లోనైనా తీరుతుందేమో చూడాలి. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనుంది. చదవండి: సిక్స్ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్ -
ప్రాక్టీస్‌లో పాకిస్తాన్ జెండా.. క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం
Bangla Fans Troll Pakistan Team Plants National Flag During Practice.. టి20 ప్రపంచకప్ 2021లో సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టిన పాకిస్తాన్ నేరుగా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టింది. బంగ్లా పర్యటనలో పాకిస్తాన్ జట్టు మూడు టి20లు.. రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 19 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇప్పటికే సిరీస్‌లో ఆడనున్న ఆటగాళ్లు శనివారం ఢాకాకు చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇక షోయబ్ మాలిక్, బాబర్ అజమ్‌లు మాత్రం మంగళవారం ఢాకాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ ప్రారంభించిన పాక్ ఆటగాళ్లు మైదానంలో వారి జాతీయ జెండాను పెట్టడం వివాదాస్పదంగా మారింది. చదవండి: T20 WC 2021: నా కెప్టెన్ బాబర్ ఆజమ్.. అతడే అత్యుత్తమ బౌలర్.. పాకిస్తాన్ కోచ్ సక్లెయిన్ ముస్తాక్ ఆటగాళ్లకు దేశంపై గౌరవం ఎల్లవేలలా కనపడాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''బంగ్లాదేశ్‌లో క్రికెట్ ఆడడానికి ఎన్నో జట్లు వచ్చాయి. కానీ ఏ జట్టు తమ జాతీయ జెండాను ప్రాక్టీస్ సందర్భంగా మైదానంలోకి తీసుకురాలేదు. కానీ పాకిస్తాన్ మాత్రమే ఎందుకు ఈ పని చేసింది. పాక్ చర్య మాకు నచ్చలేదు.. బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు చేసుకొని మీ దేశానికి వెళ్లిపోండి..'' అంటూ ఒకరు కామెంట్ చేశారు. '' బంగ్లాదేశ్‌లో పాకిస్తానీ ఫ్లాగ్‌ను బ్యాన్ చేయండి'' అంటూ ట్విటర్లో మరొక అభిమాని ఆగ్రహంతో పేర్కొన్నాడు. ఇక టి20 ప్రపంచకప్ 2021లో సూపర్ 12 దశలో దుమ్మురేపిన పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి సెమీస్‌కు చేరింది. అయితే సెమీస్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. చదవండి: Usman Shinwari Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన పాక్ క్రికెటర్ Pakistan started preparation ahead of three-match T20I and two-match Test series against Bangladesh. Pakistan team hoists a national flag there-- surely a new scene here. Cannot remember any team doing it here in recent past. Finally some int'l cricket in Mirpur. #BANvPAK pic.twitter.com/922Alf4LeC — Saif Hasnat (@saifhasnat) November 15, 2021 పాకిస్థాన్ టి20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వాసిం, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్ , షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, షోయబ్ మాలిక్, ఉస్మాన్ ఖాదిర్ పాకిస్థాన్ టెస్టు జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబిద్ అలీ, అజహర్ అలీ, ఫవాద్ ఆలం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, బిలాల్ ఆసిఫ్ , హసన్ అలీ, మహ్మద్ అబ్బాస్, నసీమ్ షా, నౌమాన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, జాహిద్ మహమూద్, సాజిద్ ఖాన్ Bangladesh cricket fans not impressed as Pakistan players carry national flag to training ground pic.twitter.com/BZrOGAqMV3 — greaterjammuvirtual (@gjvirtual) November 16, 2021 Different countries have come to #Bangladesh innumerable times, many matches have been played by practicing.But neither party needed to practice burying their national flag on the ground.But why did #Pakistan do that... What does it indicate?#BANvPAK pic.twitter.com/bxUyTq5K1s — Misbah ur Rahman (@95MRahman) November 15, 2021 -
ఫ్యాన్స్‌తో కళకళలాడుతున్న చెపాక్
చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకు బీసీసీఐ 50 శాతం ప్రేక్షకులను మైదానాల్లోకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చెపాక్ స్టేడియం అభిమానులతో కళకళలాడుతుంది. దాదాపు ఏడాది విరామం తర్వాత భారత్‌లో మ్యాచ్ జరగడంతో మైదానంలో మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. 50వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న చిదంబరం స్టేడియంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో 15వేల మందికి మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పించడంతో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఈ సందర్భంగా బీసీసీఐ వీడియోను రిలీజ్ చేసింది. 'చెన్నై స్టేడియానికి కొత్త కళ వచ్చింది. సుధీర్ఘ కరోనా విరామం తర్వాత మైదానంలో అభిమానులను చూడడం సంతోషంగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫేస్ మాస్క్ ఉన్న ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించినట్లు తెలిపారు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎవరు రూల్స్ పాటించడకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో మాత్రం ఓపెనర్ రోహిత్ శర్మ 80 పరుగులతో దాటిగా ఆడుతుండడంతో లంచ్ విరామం సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రహానే 5 పరగులతో రోహిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు కెప్టెన్ కోహ్లి, గిల్లు డకౌట్‌గా వెనుదిరగ్గా.. పుజారా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. It's good to have you back #TeamIndia fans 💙 Chepauk 🏟️ has come alive courtesy you 🤗 #INDvENG @Paytm pic.twitter.com/QVYISf40O1 — BCCI (@BCCI) February 13, 2021 -
ఎవరులేని స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల అనుమతి లేదన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల కేరింతలు, కోలాహలం లేక స్టేడియం బోసిపోతుందని ఐపీఎల్ యాజమాన్యం భావించింది. దీంతో వినూత్నంగా ఆలోచించి.. ప్రేక్షకుల కేరింతలు, చీర్ గర్ల్స్ సందడికి సంబంధించి రికార్డు చేసిన శబ్దాలను మ్యాచ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న అనుభూతిని కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చోని టీవీల్లో ఐపీఎల్ చూసే క్రికెట్ అభిమానులకు కొంత మేరకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఆటకు, రికార్డు చేసిన ప్రేక్షకులకు అరుపులకు బాగా సింక్ కుదురుతోంది. ఐపీఎల్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. అయితే ఇలా చేయడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమతున్నాయి. ఈ అసహజ ప్రేక్షకులు కేరింతలు,శబ్దాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నకిలీ సమూహాలు, నకిలీ చీర్ గర్ల్స్, ప్రేక్షకుల అరుపులు మీద రకరకాల మీమ్స్, జోకులు పేల్చుతున్నారు. తాజాగా ఐపీఎల్ మీద వస్తున్న జోకులు సోషల్ మీడియాలో టేండ్ అవుతున్నాయి. (ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది) ‘సాధారణంగా టీవీ నెట్‌వర్క్‌లు ఉపయోగించే ఈ నకిలీ శబ్దాలు బాగానే ఉన్నాయి. కానీ, ఎవరు లేని క్రికెట్ స్టేడియంలో లక్షల మంది ప్రేక్షకులు ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక జోక్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘క్రికెట్ అభిమానులు ఐపీఎల్ నకిలీ సమూల శబ్దాలాను ద్వేహిస్తున్నారు. 1994లో జరిగిన ఓ మ్యాచ్‌లోని నవ్వులను జోడించడం కొత్తగా ఉన్నప్పటికీ సహజంగా లేదు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘క్రికెట్ అభిమానులైన నా స్నేహితులు డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌లను చూస్తే.. అవి ఎందుకు చూస్తున్నావు నిజమైన ఆట కాదు అది, నకిలీ క్రీడ అనేవారు. కానీ, నాకు ఇప్పుడు ఐపీఎల్ కూడా అలానే అనిపిస్తోంది’ అని మరో నెజటిన్ కామెంట్ చేశారు. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కి మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. (ఫ్యాన్స్ లేరు.. స్టేడియం మాత్రం గోలగోల) Generally, I've been okay with the fake crowd noise used by TV networks. As long as it doesn't take over the coverage, it has been pretty good. But I'm just checking out a replay of last night's IPL game and it's a joke. There are zero fans and it sounds like there's 100,000 in. — Ian Harkin (@sportznut67) September 20, 2020 Yeah F.R.I.E.N.D.S fans are hating these fake crowds in IPL because it was trendy in 1994 to add recorded laughs it's not common now. — Darshit Dave (@Darshitdave02) September 20, 2020 IPL creating fake crowd noise for fans sitting in india . * IPL : pic.twitter.com/3JPHbsUNX2 — Hridyansh rai (@HridyanshRai) September 20, 2020 -
ఫ్యాన్స్ లేరు.. స్టేడియం మాత్రం గోలగోల
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి బంతికే ఫోర్.. ఆ తర్వాత డి కాక్ భారీ షాట్లు, ఆపై వికెట్లు... ఇలా మ్యాచ్‌లో ఏం జరిగినా.... ప్రేక్షకుల చప్పట్లు, కేరింతలతో స్టేడియంలో హోరెత్తిపోతోంది!. అదేంటి ఈ ఐపీఎల్‌కు అభిమానులను మైదానంలోకి అనుమతించలేదు కదా అనుకుంటున్నారా... ఐపీఎల్ నిర్వాహకులు టీవీ ప్రేక్షకుల కోసం చేసిన మాయ ఇది. లీగ్ ఆరంభానికి ముందే రికార్డు చేసిన శబ్దాలను మ్యాచ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న అనుభూతిని కలిగించేందుకు ఐపీఎల్ టీమ్ ప్రయత్నించింది. చాలా వరకు అందులో సఫలమైంది కూడా.. సరిగ్గా చెప్పాలంటే ఆటకు, అరుపులకు సింక్ బాగా కుదిరింది. (చదవండి : ఫీల్డింగ్‌లో మెరుపులు.. జరజాగ్రత్త!) అయితే ఇలా చేయడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆకట్టుకుందని కొందరంటే... లీగ్‌ను సహజంగా చూపిస్తేనే బాగుండేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరు జట్లకు చెందిన కొందరు అభిమానుల స్పందనలను కూడా మ్యాచ్ సాగుతున్న సమయంలో లైవ్ కెమెరాల ద్వారా ప్రసారకర్తలు చూపించడం విశేషం. కరోనా నేపథ్యంలో మైదానంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో లీగ్ నిర్వాహకులు ఇలాంటి ప్రయత్నం చేపట్టడం కాస్త ఆసక్తికరంగా మారింది.(చదవండి : ముంబైపై విజయంతో ధోని కొత్త చరిత్ర) -
ఆ క్షణం ఇంకా రాలేదు
ముంబై: స్మృతి మంధాన... క్రీజ్‌లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాదు, మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్‌గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన స్మృతి క్రికెట్ ముగిశాక తన సొంత ప్రపంచంలో చేసే అల్లరికి అంతే ఉండదు. సహచరురాలు జెమీమా రోడ్రిగ్స్ కూడా జత కలిసిందంటే అంతు లేని ఆటపాటలతో ఇక ఫుల్ బిజీ. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరూ అందించే వినోదం ప్రత్యేకం. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఆటగాళ్లంతా తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సరదాగా మాట్లాడుకుందామని అభి మానులకు స్మృతి పిలుపునిచ్చింది. ట్విట్టర్ వేదికగా ఆస్క్ స్మృతి అంటూ సాగిన సంభాషణలో మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన మనసు విప్పి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. విశేషాలు స్మృతి మంధాన మాటల్లోనే.... ► మైదానంలో దిగాక అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. బ్యాటింగ్ సమయంలో కూడా ఒకేసారి ప్రణాళిక రూపొందించుకోకుండా ఒక్కో బంతికి అనుగుణంగా నా ఆటతీరును మార్చుకుంటా. ► అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొన్నా... వారిలో మరిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా పేసర్) బౌలింగ్‌లో పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డాను. ► కెరీర్‌కు సంబంధించి భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన రోజు నా కెరీర్లో మరచిపోలేనిది. అయితే చిరస్మరణీయ క్షణం మాత్రం ఇంకా రాలేదు. బహుశా భవిష్యత్తులో మేం ప్రపంచ కప్ సాధించిన రోజు అది కావచ్చు. ► సరదాగా చెప్పాలంటే నా మొహం ఇన్ని రోజులు చూస్తూ మా ఇంట్లో వాళ్లే అలసిపోయారు. ఎప్పుడెప్పుడు తర్వాతి టోర్నీ ఉంటుందా అంటున్నారు. అయితే ఈ సమయాన్ని చాలా బాగా గడుపుతున్నామనేది మాత్రం వాస్తవం. ► చిన్నప్పుడు నాకిష్టమైన కార్టూన్ల జాబితాలో నాడీ, బాబ్ ద బిల్డర్, నింజా హటోరి ఉన్నాయి. ఇప్పుడు కూడా సమయం దొరికితే వాటిని చూస్తుంటా. ► అరిజిత్ సింగ్ కాకుండా నాకు ప్రస్తుతం ఇష్టమైన బాలీవుడ్ గాయకుడు ప్రతీక్ బచ్చన్ (సరిలేరు నీకెవ్వరులో సూర్యుడివో, చంద్రుడివో పాట పాడాడు) నా హోటల్ (ఎస్ఎం 18 పేరుతో సాంగ్లీలో ఉంది)లో ఏం బాగుంటాయని అడిగారు. మా మెనూలో అన్ని ఐటమ్స్ మీకు నచ్చుతాయి. ఒకసారి తెరిచాక వచ్చి రుచి చూడవచ్చు. ► అందంగా ఉంటావు కాబట్టి సినిమాల్లో చేయవచ్చు కదా అని ఒక అభిమాని అడిగాడు. అయితే నన్ను చూడటానికి ఎవరైనా థియేటర్‌కు వస్తారని నేను అనుకోవడం లేదు. కాబట్టి మీరు కూడా అలాంటివి అస్సలు ఆశించవద్దు. ► ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నానా అని అడుగుతున్నారు.... ఏమో చెప్పలేను. నాకైతే తెలీదు. ► నా జీవిత భాగస్వామి కావాలనుకునే వ్యక్తి నన్ను ప్రేమించేవాడై ఉండాలనేది మొదటి షరతు. ఈ మొదటి షరతుకు కావాల్సిన నిబంధనలను పాటించాలనేది నా రెండో షరతు. ► ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా (లవ్ ఆర్ అరేంజ్డ్) అని అడిగితే లవ్–రేంజ్డ్ అని చెబుతా. నాకు దగ్గరలో జెమీమా లేకపోవడం వల్ల లోటేమీ తెలియడం లేదు. ఇంకా కాస్త ప్రశాంతంగా ఉంటున్నా (దీనిపై స్పందించిన జెమీమా... నువ్వు మోసగత్తెవంటూ ట్విట్టర్లోనే సరదాగా బదులిచ్చింది). గతంలో కళ్లద్దాలు పెట్టుకొని నేను బ్యాటింగ్ చేసేదాన్ని. అయితే మూడేళ్ల క్రితం అది మారింది. 2017లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను చాలా సౌకర్యవంతంగా ఉన్నా. తల్లిదండ్రులతో... -
రోహిత్ డ్యాన్స్ విత్ జమైకా ఫ్యాన్స్
-
రోహిత్ డ్యాన్స్ విత్ జమైకా ఫ్యాన్స్
కింగ్స్టన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాడు రోహిత్‌శర్మకు తుది జట్టులో ఆడే అవకాశం రానప్పటికీ అభిమానులకు వినోదం పంచడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా రోహిత్ తన అభిమానులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి బీసీసీఐ తమ ట్విటర్లో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తరువాత రోహిత్‌శర్మ స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులను కలిసేందుకు వచ్చాడు. అక్కడ ఉన్న వారిలో నుంచి ఇద్దరిని బయటకు రమ్మని కోరాడు. ప్రేక్షకుల నుంచి ఇద్దరు యువకులు హిట్‌మ్యాన్ వద్దకు వచ్చి వన్డే,టీ20ల్లో రోహిత్ ఉపయోగించే జెర్సీని వేసుకొని పలు డ్యాన్స్ మూమెంట్లను షేర్ చేసుకున్నారు. అందులోనూ విండీస్ ఆల్‌రౌండర్ బ్రేవో 'చాంపియన్' పాటకు నృత్యం చేయడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఇది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, తాజాగా విండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో టీమిండియా 120 పాయింట్లతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఈ సిరీస్ విజయంతో టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించి విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్‌కోహ్లి.. ధోనిని అధిగమించడం విశేషం. భారత పేస్ బౌలర్లు బుమ్రా, ఇషాంత్, షమీ తమ బౌలింగ్‌తో చెలరేగిపోవడం, విరాట్ కోహ్లి, రహానేలు సెంచరీలతో మెరవడం, ముఖ్యంగా ఆంధ్ర బ్యాట్సమెన్ హనుమ విహారి మిడిలార్డర్లో విశేషంగా ఆడి సెంచరీ, రెండు అర్థ సెంచరీలతో టీమిండియా గెలుపులో భాగమయ్యాడు. This is awesome from @ImRo45 when he randomly pulled out two of his loyal fans from the crowd in Jamaica🕺🕺 #TeamIndia 😁👌👌 pic.twitter.com/PqRV1xtjgH — BCCI (@BCCI) September 2, 2019 -
‘మదర్’ మిమిక్రీకి ఫిదా అయిన బుమ్రా..!
న్యూఢిలీ : టీమిండియా యార్కర్కింగ్, స్పీడ్‌గన్ జస్ప్రీత్ బుమ్రా ఆటకే కాదు.. విభిన్నమైన అతని బౌలింగ్ శైలికి కోట్లాది మంది అభిమానులున్నారు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బుమ్రా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తక్కువ లెంగ్త్ తీసుకుని వేగంగా బంతులు విసిరే బుమ్రా బౌలింగ్‌ను ఓ క్రికెట్ వీరాభిమాని తల్లి అనుకరించారు. ఆమె మిమిక్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘యువత మాదిరిగానే.. పెద్దవాళ్లు కూడా ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. అందుకే మా అమ్మ అతని బౌలింగ్ శైలిని అనుకరించారు’అని ఓ అభిమాని ట్విటర్లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఇది వైరల్ అయింది. పెద్దావిడ బౌలింగ్ అనుకరణకు బుమ్రా ఫిదా అయ్యాడు. ‘మీ ఉత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నింది’అని రిప్లై ఇచ్చాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మూడేళ్లకాలంలోనే బుమ్రా టాప్ బౌలర్‌గా మారాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఇక తాజా ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లాడి 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జట్టు విజయాల్లో ‘రోహిత్‌కు సమానంగా బుమ్రా’ కీలక పాత్ర పోషించాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొనడం గమనార్హం. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. Just like the rest of us, the mothership was so impressed with Bumrah's performance in the world cup, that she decided to mimic his run-up. 😂😂😍 pic.twitter.com/bJYGUqzJvd — Shanta Sakkubai (@himsini) July 13, 2019 -
హనుమ విహారికి ఘన సన్మానం
యైటింక్లయిన్‌కాలనీ: భారత క్రికెట్ హనుమ విహారిని ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. తన సోదరి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనడానికి యైటింక్లయిన్‌కాలనీకి వచ్చిన క్రికెటర్ హనుమ విహారిని సీఈఆర్‌క్లబ్, దృవపాండవ్ క్రికెట్ టీం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ క్రికెట్లో మరింత రాణించి భారత్‌కు కీర్తిప్రతిష్టలు తేవాలని వక్తలు అన్నారు. చిన్ననాటి నుంచి కఠోర శ్రమతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన విహారి ఈ తరం యువతకు ఆదర్శం అని కొనియాడారు. పట్టుదల ఉంటే సాధించనిది ఏమి లేదని, ప్రతీ ఒక్కరు తమ లక్ష్యం వైపు అలుపెరుగని శ్రమ చేస్తే విజయం వరిస్తుందన్నారు. విహారీ మాట్లాడుతూ తనను సాదరంగా సన్మానించిన క్లబ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో క్లబ్ గౌరవ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కార్యదర్శి హమీద్, సింగరేణి డాక్టర్ రమేష్‌బాబు, ఓసీపీ–2 ఎస్ఈ చంద్రశేఖర్, దృవపాండవ క్రికెట్ టీం సభ్యులు నర్సింహారెడ్డి, ముఖేశ్, తిరుపతిరెడ్డి, హరీష్, రవిశంకర్, వేణుమాదవ్, పాశం ఓదెలు, ఆరీఫ్, శ్రీధర్, అంజి పాల్గొన్నారు. -
ఆసీస్ 158, భారత్ 169.. విజేత?
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కారణమైన డక్‌వర్త్ లూయిస్ విధానంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆసీస్ కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘ప్రత్యర్థి కంటే 11 పరుగులు ఎక్కువగా చేసిన జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింద’ని బాధ పడ్డారు. ట్విటర్లో కామెంట్లు, ఫొటోలతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఆసీస్ కంటే ఎక్కువ స్కోరు చేసినా.. ఓడిన భారత్!) ఆసీస్ స్కోరు మీద జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధించడం వల్లే టీమిండియా ఓడిపోయిందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎకసెక్కమాడారు. ఏదేమైనప్పటికీ సిరీస్ ఆరంభ మ్యాచ్ మజా అందించిందని పేర్కొన్నారు. ఏ ఆటలోనైనా డక్‌వర్త్ లూయిస్ విధానం లోపభూయిష్టమైందని అభిమానులు ధ్వజమెత్తారు. డీ/ఎల్ గురించి ఎవరైనా మాకు వివరించండి అంటూ మొరపెట్టుకున్నారు. పనిలో పనిగా టీమిండియా ఆటగాళ్ల వైఫల్యాలపైనా సెటైర్లు వేశారు. పాండ్యా బ్రదర్స్‌ను సాగనంపే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ రోజు మ్యాచ్‌లో టీమిండియాలో ఇద్దరు మాత్రమే స్థాయికి తగ్గటు ఆడారని మిగతా వారంతా ఏమీ చేయలేక చూస్తుండి పోయారని జోకులేశారు. ధోని లాంటి ఫినిషర్ లేకపోవడం వల్లే మ్యాచ్ చేజారిందని మహి ఫ్యాన్స్ నిష్టూరమాడారు. తమ ఓటమికి 11 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కారణం కాదని, ఇద్దరు ఇంగ్లీషు వ్యక్తులు డక్‌వర్త్, లూయిస్ వల్లే విజయం సాధించలేకపోయామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పడం కొసమెరుపు Oily hands after eating food made from #SaffolaOil is not good for fielding. You miss catches & fielding like me & my boys. Make sure you clean your hands with #Lifebuoy soap & dry them with #BombayDyeing towel before taking the field else the #Kookaburra ball may slip. #AUSvIND pic.twitter.com/LHo7ESxr6i — Virat Kolhi (@imVlkohli) 21 November 2018 👉1st Wicket: c Kuldeep b Khaleel 👉2nd Wicket: c Khaleel b Kuldeep 👉3rd Wicket: c&b Kuldeep Yadav Seems India Is Playing With Only 2 Players On Field, Others Are Watching #Zero In Dressing Room 🤔😂😭 #INDvAUS #AUSvIND #INDvsAUS — Sir Jadeja (@SirJadeja) 21 November 2018 -
100 కోట్ల మంది క్రికెట్ అభిమానులు!
దుబాయ్: క్రికెట్‌ను విశ్వవ్యాపితం చేసేందుకు టి20నే సరైన ఫార్మాట్‌గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుర్తించింది. ఇటీవలి కాలంలో వేర్వేరు దేశాల్లో క్రికెట్ గురించి ఆదరణ పెరగడానికి టి20 కారణమైందని ఐసీసీ నిర్ధారణకు వచ్చింది. ఐసీసీ భారీ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ మార్కెట్ సర్వే ఈ అంశాలను వెల్లడించింది. 12 టెస్టు దేశాలతో పాటు భవిష్యత్తులో క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేయగలిగే అవకాశమున్న అమెరికా, చైనా దేశాలలో ఈ సర్వే జరిపారు. వంద కోట్ల మంది అభిమానుల్లో 95.2 కోట్ల మంది ఈ 14 దేశాల్లోనే ఉంటే (ఇందులో 90 శాతం మంది ఉపఖండానికి చెందిన వారే) 8.7 కోట్ల మంది ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఉన్నారు. 87 శాతం మంది టి20 ఫార్మాట్‌తో ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని కోరుకోవడం విశేషం. ఐసీసీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ విశేషాలు ► ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు: సుమారు 100 కోట్లకు పైగా (16–69 మధ్య వయసువారు) ► సర్వేలో పాల్గొన్నవారు: సుమారు 30 కోట్ల మంది æ మహిళా అభిమానుల సంఖ్య: 39 శాతం ► మూడు ఫార్మాట్లు ఇష్టపడేవారు: 64 శాతం æ టి20లు: 92 శాతం, వన్డేలు: 88 శాతం, టెస్టులు: 69 శాతం (విడివిడిగా) ► ప్రపంచకప్ లాంటి ఐసీసీ ఈవెంట్లు బాగా ఇష్ట పడే వారు: 95 శాతం ► మహిళల క్రికెట్ కవరేజి కోరుకుంటున్నవారు: 70 శాతం. -
ఆ క్రికెటర్‌పై డీకే అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో జట్టుకు విజయం అందించిన దినేశ్ కార్తిక్‌కు అభిమానులతో పాటు, సహచర ఆటగాళ్లు, సీనియర్లు ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీంతో డీకే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కానీ వారికి ఇప్పుడు కోపం వచ్చింది. ఎందుకంటే దేశమంతా డీకేను కొనియాడుతుంటే ఒక క్రికెటర్ మాత్రం జట్టును మాత్రమే పొగిడి కనీసం డీకే పేరును ప్రస్తావించకపోవడంతో ట్విటర్ వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే సహచర ఆటగాడు, ఒకప్పటి స్నేహితుడు మురళీ విజయ్ భారత విజయాన్ని అభినందిస్తూ ‘ఇదొక గొప్ప విజయం.. భారత క్రికెట్ బ్రాండ్ విలువను పెంచేందుకు బీసీసీఐ చేస్తున్న కృషికి ఇది నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశాడు. జట్టు విజయానికి కారణమైన కార్తిక్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడంతో డీకే అభిమానులు మురళీ విజయ్‌కు కౌంటర్‌గా ట్వీట్ల ద్వారానే సమాధానం ఇస్తున్నారు. ‘విజయ్ నీకు ఇదేమీ కొత్త కాదు.. ఇంతకు ముందు తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన డీకేని విస్మరించావు. నువ్వింకా ఎదగాలి’ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ‘మీ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. నిజాయితీగా స్పందించడం నేర్చుకో’ అని మరొకరు సలహా ఇచ్చారు. కాగా భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా.. ‘డీకే పేరును ప్రస్తావించక పోవడానికి ఉన్న స్పష్టమైన కారణాలేంటో’ అంటూ ట్వీట్ చేశాడు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఈ తమిళనాడు ఆటగాళ్లు... దినేశ్ కార్తిక్ మాజీ భార్య నిఖిత.. మురళీ విజయ్ను పెళ్లాడినప్పటి నుంచి దూరమయ్యారు. కాగా 2015లో దినేశ్ కార్తిక్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌ను పెళ్లి చేసుకున్నాడు. Remarkable win boys @bcci 🌟 pretty much typifies the brand of cricket we play 🤙🏽 #INDVBAN #Champions #TeamIndia #supremacy #NidahasTrophy #NidahasTrophyFinal pic.twitter.com/ewUKclUX29 — Murali Vijay (@mvj888) March 18, 2018 -
వినూత్నంగా వివాహం
చామరాజనగర (బొమ్మనహళ్లి) : క్రికెట్‌పై ఉన్న అభిమానంతో ఓ జంట భారతీయ జెండా చేతపట్టుకుని, బాసింగాలకు బదులు జాతీయ జెండా రిబ్బన్లు కట్టుకుని బంధువుల సమక్షంలో శనివారం ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక్కడి చామరాజనగర భ్రమరాంబ కళ్యాణమంటపంలో శనివారం ఉదయం కార్తీక్, శ్వేతల పెళ్లికి పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇద్దరికి క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. పెళ్లి తంతు జరుగుతుండగా భారత్ అండర్–19 ప్రపంచ కప్ గెలుచుకున్న సమాచారం తెలుసుకున్న వధూవరులు పెళ్లి వేదికపై అప్పటికప్పుడు భారత్ అండర్–19 జట్టు సభ్యుల ఫ్లెక్సీని తెప్పించి తలకు బాసింగాలకు బదులు జాతీయ జెండా రిబ్బన్లు కట్టుకుని అందరి సమక్షంలో కార్తీక్, శ్వేతలు వివాహం చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులు ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. క్రికెట్ పిచ్చి అంటే ఇదే మరి అంటూ పెళ్లి భోజనం ఆరగించి దీవించి వెళ్లిపోయారు. -
క్రికెటర్ల బెస్ట్ ట్వీట్స్ ఇవే..
సాక్షి, స్పోర్ట్స్ : టెక్నాలజీ ఆటలో కూడా ఓ భాగమైంది. భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన క్రికెట్లో మాత్రం దీని ప్రభావం మరింత ఎక్కువే. ఒకప్పుడు తమ అభిప్రాయాలు తెలియజేయాలంటే.. ఆటగాళ్లు మీడియా ముందుకు రావల్సిందే. సోషల్‌మీడియా వచ్చిన తర్వాత ఒక్క ట్వీట్, పోస్ట్‌లతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలా క్రికెటర్లు తమ అభిమానులకు మరింత చేరువయ్యేలా చేసింది.. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్. ప్రతి విషయాన్ని ఒక్క ట్వీట్‌తో తెలియజేస్తూ అభిమానులను అలరిస్తున్నారు క్రికెటర్లు. అభిమానుల సైతం తమ భావాలను ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇలా ఈ ఏడు ట్రెండ్ అయిన ట్వీట్ల గురించి ఓ లుక్కేద్దాం. టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు కోహ్లి చేసిన ట్వీట్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్, టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ల మధ్య నడిచిన ధర్జీ ట్వీట్లు నెట్టింట్లో బాగా పేలాయి. చాంపియన్స్ ట్రోఫి సందర్భంగా ధోని పాక్ ప్లేయర్ సర్ఫరాజ్ బేబీతో దిగిన ఫోటోపై జర్నలిస్టు రాజ్‌దీప్ సర్ధేశాయ్ చేసిన ట్వీట్, మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామి, పాక్ మహిళా క్రికెటర్‌తో దిగిన ఫోటోకు ఐసీసీ చేసిన ట్వీట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాయి దాడి జరిగినప్పుడు ఆ దేశ క్రికెటర్ హెన్రీక్స్ చేసిన ట్వీట్.. ధోని బ్యాక్ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్లు సైతం ట్రెండ్ అయ్యాయి. విరుష్క పెళ్లి ప్రకటన ట్వీట్ అయితే ఏకంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. ‘చుట్టు కుర్రాళ్లను కోరుకునే నాయకుడికి ధన్యవాదాలు. నువ్వేప్పుడు మా నాయకుడివే ధోని భాయ్’- విరాట్ కోహ్లి ‘చాంఫియన్స్ ట్రోఫీలో అద్భుత చిత్రం. దేశాలకతీతంగా సర్ఫరాజ్ బేబీతో ధోని’- రాజ్‌దీప్ సర్ధేశాయ్ ‘మహిళల ప్రపంచకప్‌లో అద్భుత క్రీడా స్పూర్తి.. తన రోల్‌మోడల్ గోస్వామితో పాక్ ప్లేయర్’- ఐసీసీ ‘బస్సుపై జరిగిన దాడి ఆదర్శంగా లేదు. కానీ భారత అభిమానులు, అస్సాం యువకులు మాకు మద్దిత్వడం సంతోషంగా ఉంది’- హెన్రీక్స్ ‘బాగా ఆడావూ.. ధర్జీజీ( టేలర్ ని కాస్త టైలర్ గా మార్చి).. దీపావళి సీజన్ ఆర్డర్ ఒత్తిడిలో సైతం బానే ప్రయత్నించావు’.-వీరేంద్ర సేహ్వాగ్ ‘సింహాల అరుపులు మొదలయ్యాయి.. జట్టులోకి ఎవరుస్తున్నారో ఊహించండి’- చెన్నైసూపర్ కింగ్స్ ‘మేమిద్దరం కలకాలం కలిసుంటామనే పెళ్లి ప్రమాణం చేశాం. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలతో ఈ అందమైన రోజు మాకెంతో ప్రత్యేకం. మా పెళ్లి ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్’. – కోహ్లి, అనుష్క శర్మ -
సచిన్.. సచిన్ అన్న తొలివ్యక్తి ఎవరో తెలిసింది
ముంబయి: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేసి ఉండొచ్చు.. కానీ, ఆయనగానీ, ఆయన ఫొటోగానీ ఒక్కసారి కనిపించిందంటే చాలు ఇప్పటికీ చెప్పలేనంత క్రేజ్.. సచిన్.. సచిన్ అంటూ ఆయన ఉన్న క్రీడా ప్రాంగణంగానీ, చోటుగానీ మార్మోగిపోతోంది. అంతగా ప్రజల నాలుకల్లో మిగిలిపోయాడు మాస్టర్ బ్లాస్టర్. అయితే, సచిన్.. సచిన్ అంటూ మొత్తం ప్రపంచంలోని ఆయన క్రికెట్ అభిమానులు అంటున్నప్పటికీ మొట్టమొదటిసారి అలా అన్నది ఎవరూ అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అలా పిలవడం ఎవరు ప్రారంభించారనే వివరాలు కూడా తెలియదు. ఆ రహస్యాన్ని స్వయంగా సచినే ఇప్పుడు ప్రకటించాడు. వాస్తవానికి మొట్టమొదటిసారి సచిన్.. సచిన్ అంటూ కీర్తించడం తన తల్లి ప్రారంభించిందంట. ‘సచిన్..సచిన్ అనే మాట నేను ఆడుతున్నన్నీ రోజులు నాతోనే ఉంటుందని, నాకు వినిపిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు అది సినిమా థియేటర్లలోకి వెళ్లింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని సచిన్ చెప్పారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సచిన్:ఏ బిలియన్ డ్రీమ్స్ అనే చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఒక పాట విడుదల సందర్భంగా సచిన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సమయంలో ఆయనతోపాటు ఏఆర్ రెహ్మాన్ కూడా ఉన్నారు. -
ఓటమి ఓ మజిలీ
మరో మూడేళ్ల తరువాత - 1974లో అదే టీమ్ అదే కెప్టెన్‌తో ఇంగ్లండ్‌లో పర్యటించింది. అప్పుడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈసారి క్రికెట్ అభిమానులు అజిత్ వాడేకర్ ఇంటి మీద చెప్పులతో, రాళ్లతో వర్షాన్ని కురిపించారు. మొన్న ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా తో ఆడి చిత్తుగా ఓడిపోయింది. అంతకు ముందు అవిచ్ఛి న్నంగా ఏడుసార్లు గెలిచింది. అయినా దేశంలో టీవీలు బద్ద లుకొట్టారు. ప్రదర్శనలు చేశా రు. ధోనీ సామర్థ్యం మీదా, టీమ్ అసమర్థత మీదా, కోహ్లీ శృంగారం మీదా దుమ్మెత్తి పోశారు. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ, తుమ్ముకి తమ్ము డు లేడని నానుడి. విజయాన్ని నెత్తిన వేసుకుని గెంతులు వేసేవారు బోలెడుమంది ఉంటారు గానీ, ఓటమిని అర్థం చేసుకుని ఓదార్చేవారు ఒక్కరూ కనిపించరు. అం దుకే ఒకాయన అన్నాడు: ‘అపజయం కారణంగా నిశ్చే ష్టుడిని చేసే నిశ్శబ్దం విజయాన్ని చూసి విరగబడే వెర్రి నినాదాల కంటే పెద్ద పాఠం నేర్పుతుంది’ అని. ఇంగ్లిష్‌లో చెబితే ఇంకా రుచిగా ఉంటుంది- stunning silence of a defeat has taught me more than the rejoicing noise of a success. క్రికెట్ అన్నది క్రీడ అని గుర్తుంచుకుంటే రెండేళ్ల క్రితం భారతదేశం బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయిన విష యం గుర్తుకురావాలి. 1971లో అజిత్ వాడేకర్ భారత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ దేశాలతో ఆయా దేశాలలో ఆడి ఘనమైన విజయాన్ని సాధించింది. ముంబైలో అజిత్ వాడేకర్కీ, ఆయన టీమ్కీ ఘనమైన స్వాగతాన్ని ఇస్తూ మోటార్ కార్లతో ఊరేగించారు. మరో మూడేళ్ల తరువాత - 1974లో అదే టీమ్ అదే కెప్టెన్‌తో ఇంగ్లండ్‌లో పర్యటించింది. అప్పు డు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈసారి క్రికెట్ అభిమానులు అజిత్ వాడేకర్ ఇంటి మీద చెప్పులతో, రాళ్లతో వర్షాన్ని కురిపించారు. విజయాన్ని పంచుకోవడం ‘దొమ్మీ’ ఆవేశం. అపజయానికి సాను భూతి ‘పరిణతి’కి సంకేతం. రెండు ఉదాహరణలు: 1962లో జరిగిన సంఘటన ఇది. నేనప్పుడు ఒకానొక దినపత్రికలో పనిచేస్తున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయ వైద్యకేంద్రం డాక్టరు ఈశ్వరమా ర్తాండ శాస్త్రిగారు. గొప్ప వ్యక్తి. చండశాసనుడు. మిలట రీలో పనిచేసి వచ్చారు. మాట కటువు. కాని మనసు వెన్న. నాకూ ఆయనకీ తేలికగా 30 సంవత్సరాల దూ రం. అయినా మేమిద్దరం మిత్రులమయ్యాం. ఆయన డ్యూటీలో లేనప్పుడు ఒక విద్యార్థి ఏదో బాధతో అసు పత్రిలో చేరాడు. మందులిచ్చారు. పరిస్థితి అర్థమయ్యే లోగా ఆ కుర్రాడు కన్నుమూశాడు. దానికి శాస్త్రిగారి బాధ్యత బొత్తిగా లేదు. తీరా ఆ కుర్రాడు హాస్టల్లో ఉన్న వాడు కాదు. సరే. డాక్టర్ని బర్తరఫ్ చెయ్యాలని కొందరు విద్యార్థులు పెద్ద అల్లరి చేశారు. అప్పటి వైస్‌చాన్సలర్ ఏఎల్ నారాయణగారు. నిజాయితీపరుడూ, ముక్కుకు సూటిగా పోయే శాస్త్రి గారి మనసు గాయపడింది. వైస్ చాన్సలర్ నిర్ణయానికి ముందే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయనకి జరిగిన అన్యాయాన్ని గురించి ఆ రోజుల్లో హిందూ పత్రిక సంపాదకీయం రాసింది. నేనప్పుడు చిత్తూరులో పనిచేస్తున్నాను. విష యం తెలుసుకుని బాధపడి విశాఖపట్నం వస్తూనే ఆయ న్ని చూడడానికి వెళ్లాను. గొంతు ఆవేశంతో పూడుకు పోగా ఒకమాట అన్నారు: ‘మారుతీరావుగారూ! మీరు వచ్చి పలకరించకపోతే నేను చాలా బాధపడేవాడిని’ అంటూ జర్మనీ నుంచి ఒక మిత్రుడు రాసిన ఓదార్పు ఉత్తరాన్ని చదివారు. ‘డియర్ మార్టిన్! (మార్తాండశాస్త్రి ని అలా పిలిచేవారు) సంవత్సరాల క్రిందట ఓ మహా త్ముడిని అన్యాయంగా సిలువ ఎక్కించారు. మానవ స్వభావం అప్పటికీ ఇప్పటికీ మారలేదని మీకు జరిగిన అన్యాయం రుజువు చేస్తోంది.’ కష్టంలో ఉపశమనం ప్రాణవాయువు. అపజయంలో అండగా నిలిచిన గొప్ప ఉదాహ రణ. మాయాద్యూతంలో పాండవులు ఓడిపోయారు. దారుణంగా పరాభవం పాలయ్యారు. కట్టుబట్టలతో అడవుల పాలయ్యారు. అప్పుడు ఏకఛత్రాధిపతి సుయో ధనుడు. అయినా ధర్మం అడవుల పాలైంది. రుషులు ఆశ్రమంలో ఉన్న ధర్మరాజుని సందర్శించి గాయపడిన మనస్సుకీ, జరిగిన అన్యాయానికీ, జరిగిన అనర్థానికీ అనునయంగా -గతంలో అంతకన్నా ధర్మానికి నిలబడి కష్టాలపాలయిన హరిశ్చంద్రుడు, నల మహారాజు వం టివారి చరిత్రలను ఉటంకించి వారిని సముదాయిం చారు. అది పరిణతికి పరాకాష్ట. సమాజంలో మేధావి కష్టంలో అండగా నిలవడం రుషిత్వం-అన్నది పురాణం. విజయం మన అహంకారాన్ని రెచ్చగొడుతుంది. అపజయం-నిజమైన హితులెవరో తేల్చి చెప్తుంది. చైనాలో ఒక సామెత ఉంది. పెద్దలు దుమ్ము పడిన ముఖాన్ని కడుక్కుని శుభ్రంగా ఉందో లేదో అద్దాన్ని చూస్తారు. కాని పసివాడు ముఖాన్ని తుడుచుకున్న తువాలును చూస్తాడు. క్రికెట్లో ఓటమి బాధాకరమే- దేశంలో అందరికీ. కాని ఆ విజయాన్నీ, ఓటమినీ ఆనాటి తమ ప్రయత్నంతో మాత్రమే కాక, ఆనాటి ఎదుటి టీమ్ సామర్థ్యానికీ చోటు కల్పించే అభిమాని విచక్షణ- ఆటగాడి అద్భుతమైన కవచం. - గొల్లపూడి మారుతీరావు -
అభిమానులకు యువరాజ్ విన్నపం
క్రీడాకారులు వ్యక్తిగత విషయాల్ని ఆటకు ముడిపెట్టి ఇబ్బందికి గురిచేయొద్దని స్లార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ క్రీడాభిమానులను కోరారు. ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్చాచ్‌లో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యానికి అతని గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి అనుష్క శర్మే కారణమంటూ కొందరు వ్యక్తులు సోషల్నెట్ వర్క్‌లో కామెట్లు చేయడంపై స్పందిస్తూ 'విరాట్, అనుష్కల పర్సనల్ లైఫ్‌ని గౌరవిద్దాం' అని సోమవారం ట్విట్టర్లో పోస్ట చేశాడు. 'విజయమైనా, పరాజయమైనా ఎప్పుడూ వెన్నంటి ఉండే అభిమానులూ.. కాస్త ఆలోచించండి' అని అర్ధించాడు. -
టీవీలు పగిలాయి .. శవయాత్ర .. అంత్యక్రియలు
ఇస్లామాబాద్: ఒకసారి కాదు... వరుసగా రెండో సారి కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓటిమి పాలవడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు తట్టుకోలేక పోయారు. ఆగ్రహాంతో ఊగిపోయారు. వీళ్లేప్పుడు ఇంతే నంటూ చూస్తున్న టీవీలను ముక్కలు ముక్కలుగా పగలు కొట్టారు. బ్యాట్లు, వికేట్లు, బంతులు మూట కట్టి శనివారం నగర వీధుల్లో శవయాత్ర నిర్వహించారు. అనంతరం సదరు క్రీడా సామాగ్రి మొత్తానికి అంత్యక్రియలు నిర్వహించారు. మీరు క్రికెట్ ఆటకు స్వస్తి చెప్పి... జాతీయ క్రీడలు హకీ, ఫూట్ బాల్‌పై దృష్టి సారించండి అంటూ పాక్ క్రికెట్ జట్టుకు క్రీడాభిమానులు హితవు పలికారు. ఇదంతా పాకిస్థాన్‌లోని ముల్తాన్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో వెస్టిండీస్‌తో శనివారం జరిగిన పూల్-బి మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. పాక్ 150 పరుగుల తేడాతో విండీస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. 311 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 39 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. అలాగే గత ఆదివారం భారత్ చేతిలో పాక్ ఓటమి పాలైంది. దీంతో పాక్ క్రికెట్ జట్టుపై ఆ దేశ ప్రజలు కారాలుమిరాయలు నూరుతున్నారు. దీంతో పాకిస్థాన్ క్రికెటర్లు నివాసాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఐపీఎల్ ‘వేలం’ వీక్షణలో రికార్డు
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా... ఆదరణ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. టోర్నీ ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా ఐపీఎల్ పట్ల అభిమానులు అత్యంత ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈసారి ఆటగాళ్ల వేలంతోనే అది తారస్థాయికి చేరింది. ఐపీఎల్-7 కోసం ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించిన ఆటగాళ్ల వేలాన్ని స్టార్‌స్పోర్ట్స్ డాట్‌కామ్ వెబ్సైట్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించగా రికార్డు స్థాయిలో 6.8 లక్షల హిట్లు నమోదయ్యాయి. గత ఏడాది సోనీ సిక్స్ ద్వారా వేలాన్ని 4.04 లక్షల మంది వీక్షించగా, 25 నిమిషాల సగటు నమోదైంది. కాగా, ఈసారి ఒక్కొక్కరు 31 నిమిషాలు వెబ్ ద్వారా వేలాన్ని వీక్షించారు. యువరాజ్, పీటర్సన్ వంటి స్టార్ ఆటగాళ్లను వేలం వేసిన సమయంలో వీక్షకుల సంఖ్య ఎక్కువగా నమోదైనట్లు స్టార్‌స్పోర్ట్స్ తెలిపింది.