దుబాయ్: క్రికెట్‌ను విశ్వవ్యాపితం చేసేందుకు టి20నే సరైన ఫార్మాట్‌గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుర్తించింది. ఇటీవలి కాలంలో వేర్వేరు దేశాల్లో క్రికెట్ గురించి ఆదరణ పెరగడానికి టి20 కారణమైందని ఐసీసీ నిర్ధారణకు వచ్చింది. ఐసీసీ భారీ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ మార్కెట్ సర్వే ఈ అంశాలను వెల్లడించింది. 12 టెస్టు దేశాలతో పాటు భవిష్యత్తులో క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేయగలిగే అవకాశమున్న అమెరికా, చైనా దేశాలలో ఈ సర్వే జరిపారు. వంద కోట్ల మంది అభిమానుల్లో 95.2 కోట్ల మంది ఈ 14 దేశాల్లోనే ఉంటే (ఇందులో 90 శాతం మంది ఉపఖండానికి చెందిన వారే) 8.7 కోట్ల మంది ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఉన్నారు. 87 శాతం మంది టి20 ఫార్మాట్‌తో ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని కోరుకోవడం విశేషం.
ఐసీసీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ విశేషాలు
► ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు: సుమారు 100 కోట్లకు పైగా (16–69 మధ్య వయసువారు)
► సర్వేలో పాల్గొన్నవారు: సుమారు 30 కోట్ల మంది æ మహిళా అభిమానుల సంఖ్య: 39 శాతం
► మూడు ఫార్మాట్‌లు ఇష్టపడేవారు: 64 శాతం æ టి20లు: 92 శాతం, వన్డేలు: 88 శాతం, టెస్టులు: 69 శాతం (విడివిడిగా)
► ప్రపంచకప్ లాంటి ఐసీసీ ఈవెంట్లు బాగా ఇష్ట పడే వారు: 95 శాతం
► మహిళల క్రికెట్ కవరేజి కోరుకుంటున్నవారు: 70 శాతం.
Comments
Please login to add a commentAdd a comment