global market
-
స్పల్పంగా తగ్గిన ఎగుమతులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎగుమతులు వరుసగా రెండో నెలా క్షీణించాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్లో స్వల్పంగా ఒక్క శాతం తగ్గి 38.01 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా దిగుమతులు 5 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బుధవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. డిసెంబర్లో పెట్రోలియం, రత్నాభరణాలు, రసాయనాల ఎగుమతుల వృద్ధి నెమ్మదించింది. అయితే, జౌళి, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, బియ్యం, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా నమోదయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఎగుమతుల గణాంకాలు మెరుగ్గా ఉన్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. వాణిజ్య గణాంకాలను సమగ్రంగా విశ్లేషించే విదంగా కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫాంను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా వాణిజ్యానికి సవాళ్లతోపాటు కమోడిటీలు, లోహాల ధరల్లో హెచ్చుతగ్గులే ఎగుమతుల క్షీణతకు దారి తీసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 1.6 శాతం పెరిగి 321.71 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 5.15 శాతం పెరిగి 532.48 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 189.74 బిలియన్ డాలర్ల నుంచి 210.77 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర వివరాల్లోకి వెళ్తే.. → డిసెంబర్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 29 శాతం క్షీణించి 4.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ఏకంగా 35.11 శాతం పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. 24 నెలల్లో ఇది గరిష్ట స్థాయి. → బంగారం దిగుమతులు 55 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులు 211 శాతం పెరిగి 421.91 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → సేవల రంగం ఎగుమతులు 31.63 బిలియన్ డాలర్ల నుంచి 32.66 బిలియన్ డాలర్లకు పెరిగాయి. → సవరించిన గణాంకాల ప్రకారం 2024 నవంబర్‌లో ఎగుమతులు 5 శాతం తగ్గి 32.03 బిలియన్ డాలర్లకు క్షీణించగా, దిగుమతులు 16 శాతం పెరిగి 63.86 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 31.83 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్‌లో పసిడి దిగుమతులను 9.84 బిలియన్ డాలర్లకు సవరించారు. → డిసెంబర్లో అమెరికా, సౌదీ, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, శ్రీలంకకు భారత్ అత్యధికంగా ఎగుమతులు చేయగా .. చైనా స్విట్జర్లాండ్, థాయ్‌ల్యాండ్, జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. -
రూపాయి బలహీనపడినా.. ఎగుమతిదారులకు లాభాలు అంతంతే..!
న్యూఢిల్లీ: ఒక దేశం కరెన్సీ బలహీనపడితే, ఆ దేశం ఎగుమతిదారులకు లాభాలు భారీగా వచ్చిపడతాయన్నది ఆర్థిక సిద్దాంతం. అయితే భారత్ ఎగుమతిదారుల విషయంలో ఇది పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదు. రూపాయి బలహీనపడినా.. వారికి వస్తున్న లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. వారు చేస్తున్న విశ్లేషణల ప్రకారం ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల తయారీ.. ముడి వస్తువుల దిగుమతులపై ఆధారపడుతుండడం.. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుండడం దీనికి ఒక కారణం. దీనికితోడు ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ ఎగుమతిదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పతనమైంది. గత ఏడాది జనవరి 1వ తేదీన రూపాయి విలువ 83.19 పైసలు అయితే 2025 జనవరి 13వ తేదీన ఒకేరోజు భారీగా 66 పైసలు పడిపోయి 86.70కి చేరింది. అన్ని రకాలుగా ఇబ్బందే... రూపాయి దిగువముఖ ధోరణులు ఎగుమతిదారులకు లాభాలు పంచలేకపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతయ్యే ముడి పదార్థాలు, విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల ధరలు డాలర్లలో పెరుగుతాయి. ఈ వ్యయాల పెరుగుదల బలహీనమైన రూపాయి నుండి పొందిన పోటీ ప్రయోజనాన్ని దెబ్బతీస్తోంది. ఫార్మా, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంకా షిప్పింగ్, బీమా, మార్కెటింగ్ వంటి ఖర్చులు కూడా డాలర్–డినామినేట్ అవుతాయి. ఇది కూడా క్షీణించిన రూపాయి ప్రయోజనాలు ఎగుమతిదారుకు దక్కకుండా చేస్తోంది. ఇక డాలర్ మారకంలో చైనీస్ యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసో వంటి ఇతర పోటీ దేశాల కరెన్సీలు కూడా భారత రూపాయితో పోలిస్తే మరింత క్షీణించాయి. ఎగుమతిదారులకు ఇదీ ఒక ప్రతికూల అంశమే. చాలా మంది ఎగుమతిదారులు కరెన్సీ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనడానికి హెడ్జింగ్ కవర్ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్పుట్ ఖర్చు పెరుగుతుంది. రూపాయి బలహీనత వల్ల వారికి తగిన ప్రయోజనం లభించడం లేదు. – సంజయ్ బుధియా, సీఐఐ (ఎగ్జిమ్) నేషనల్ కమిటీ చైర్మన్అనిశ్చితిని భరించలేం.. రూపాయి విలువ పడిపోతోందా? పెరుగుతోందా? అన్నది ఇక్కడ సమస్య కాదు. బాధ కలిగిస్తున్న అంశం రూపాయి విలువలో అస్థిరత. కరెన్సీలో స్థిరత్వం ఉండాలి. అస్థిరత ఉంటే అనిశ్చితిని ఎలా నిర్వహించాలో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. – ఎస్ సి రాల్హాన్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిదారు (లూథియానా) -
ప్రొఫెసర్ జగదీష్ షేత్‌కు 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు
గ్లోబల్ మార్కెటింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (SIG).. 'ప్రొఫెసర్ జగదీష్ షెత్' 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ మార్కెటింగ్ రంగంలో ఈయన చేసిన కృషిని గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించినట్లు వెల్లడించింది.2024లో ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీకి లీడ్స్ యూనివర్శిటీ బిజినెస్ స్కూల్ కాన్స్టాంటైన్ ఎస్. కాట్సికేస్ నాయకత్వం వహించారు. కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి రాబిన్ కౌల్టర్, మోల్డే యూనివర్సిటీ నుంచి కార్లోస్ సౌసా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.సుమారు 40 సంవత్సరాలుగా ప్రపంచ మార్కెటింగ్‌లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన ప్రొఫెసర్ షెత్.. ఈ రంగానికి సంబంధించి అనేక రచనలు కూడా చేశారు. ఇందులో ఒకటి 'ది గ్లోబల్ రూల్ ఆఫ్ త్రీ'. ఈ పుస్తకాన్ని 2020లో ప్రచురించారు. ఇది అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క జార్జ్ ఆర్. టెర్రీ అవార్డుకు నామినేట్ అయింది. ఇప్పటికే ఈయన 2020లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. -
అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్‌లో తగ్గని ఈవీ సేల్స్
ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాల వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా మందగిస్తోందని.. ఇటీవలి గోల్డ్‌మన్ సాక్స్ పేర్కొంది. ఇంతకీ ఈవీల వృద్ధి ఎందుకు తగ్గుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం.. నిర్వహణ సంస్థల అధిక మూలధన వ్యయాలు, ఎన్నికల అనిశ్చితులు మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ల కొరత అని తెలుస్తోంది.వెహికల్ వాల్యుయేషన్ అండ్ ఆటోమోటివ్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం.. అమెరికన్లు 2024 మొదటి త్రైమాసికంలో 2,00,000 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసారు. ఈవీల అమ్మకాలు 2023 కంటే 2024లో 7.3 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విక్రయాలు కొంత పెరిగినప్పటికీ.. వృద్ధి రేటు మాత్రం గణనీయంగా తగ్గింది.యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ACEA ) నివేదిక ప్రకారం.. EV రిజిస్ట్రేషన్లు తగ్గడం, ఈస్టర్ సెలవుల సమయం కారణంగా ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారిగా యూరప్‌లో కొత్త కార్ల అమ్మకాలు క్షీణించాయని తెలిసింది. యూరోపియన్ యూనియన్ (EU)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మార్చిలో 11.3 శాతం తగ్గి 134,397 యూనిట్లకు చేరుకున్నాయి. ఐరోపాలో అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో కూడా EV అమ్మకాల్లో 29 శాతం తగ్గుదలను నమోదు చేసింది.ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో.. మిడ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని నెలలోగా అమెరికాలో వీటి వృద్ధి ఎలక్ట్రిక్ వాహనాల కంటే గణనీయంగా పెరిగింది.భారతదేశంలో ఏం జరుగుతోంది?జీఎంకే రీసెర్చ్ & అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1.7 మిలియన్ యూనిట్లను అధిగమించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. మన దేశమ్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2023 కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసాయి. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి. -
భారత్.. మూడో అతిపెద్ద ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత భారత్ ఎకానమీ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది. పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగే వీలుంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో భారత్ ఎకానమీ వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా నివేదిక ఏమి చెబుతోందంటే.. 2023, 2024ల్లో ఎకానమీ వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుంది. దేశీయంగా బలమైన వినియోగం దీనికి దోహదపడే అంశం. గత దశాబ్ద కాలంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం వేగవంతమైంది. భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం కొనసాగుతోంది. యువత అధికంగా ఉండడం, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దేశ పురోగతికి దోహదపడే అంశాలు. మధ్య తరగతి ప్రజల సంఖ్య దేశంలో పెరుగుతుండడం మరో సానుకూల అంశం. సేవా రంగం సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ వినియోగ మార్కెట్, పారిశ్రామి క, తయారీ, మౌలిక రంగాలు దేశ పురోగతికి బాటలు వేస్తున్నాయి. ఆయా సానుకూలతలు బహుళజాతి కంపెనీలకు విస్తృతస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ గమ్యస్థానంగా మార్చుతోంది. ప్రస్తుతం దేశంలో పురోగమిస్తున్న డిజిటలైజేషన్ ఈ–కామర్స్ వృద్ధిని వేగవంతం చేస్తుంది. రాబోయే దశాబ్దంలో రిటైల్ వినియోగదారుల మార్కెట్ ధోరణుల మార్పునకు ఆయా అంశాలు దోహదపడతాయి. ఈ పరిణామాలు టెక్నాలజీ, ఈ–కామర్స్‌లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్‌కు ఆకర్షిస్తాయి. 2030 నాటికి 110 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 2020లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు ఇది రెట్టింపు. ఈ–కామర్స్ వేగవంతమైన వృద్ధి, 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీకి వినియోగదారులు అధిక సంఖ్యలో మారడం వంటి అంశాలు ఆన్లైన్ ద్వారా సేవలను విస్తృతం చేసే యూనికార్న్ సంస్థల పురోగతికి దోహదపడతాయి. భారత్‌లో చోటుచేసుకుంటున్న పలు సానుకూల ఆర్థిక పరిణామాలు ఆటో, ఎల క్ట్రానిక్స్, కెమికల్స్ వంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సేవా రంగాల పురోగతికి దోహదపడతాయి. పెట్టుబడులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా దేశం మారుతుంది. భారత్ పురోగతి బాట పటిష్టం: ఆర్థికశాఖ భారత్ 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సెపె్టంబర్ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగిరావడంసహా భారత్ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ప్రభావం చూ పుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్ మార్కె ట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైనా ఈ ప్రభావం పడవచ్చని వివరించింది. ప్రస్తుతం అయిదో స్థానంలో.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. -
వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!
Today Gold and Silver Price: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్లో పసిడి ధరలు పడిపోయాయి. దీంతో వరుసగా నాల్గో వారంలో కూడా దిగి వచ్చింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ తదుపరి రివ్యూలో కూడా వడ్డీ రేటు పెంపుదల ముందుకు సాగవచ్చని అంచనా. అలాగే తాజా డేటా ప్రకారం నిరుద్యోగ ప్రయోజనాల కోసం కొత్త క్లెయిమ్‌లను దాఖలు చేసే అమెరికన్ల సంఖ్య గత వారం పడిపోయింది. దీంతో లేబర్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగవచ్చని మరో అంచనా. అమెరికా 10-సంవత్సరాల ట్రెజరీ నోట్‌పై దిగుబడి ఆగస్ట్‌లో 4.2శాతం మార్కు కంటే పెరిగింది, 2007లో చివరిసారిగా ఈ స్థాయికిచేరింది. (బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్) గ్లోబల్‌గా గోల్డ్ ధర ఔన్స్ ధర 1918 డాలర్లకు పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం 0.16 శాతం పెరిగి 1,919 డాలర్లు ట్రేడవుతున్నాయి, అటు సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగాపెరిగాయి. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) దేశీయంగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా లాభపడుతున్నాయి. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం పుత్తడి రూ.59,170 వద్ద కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.54,150 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.59,070 పలుకుతోంది. వెండి కిలోధర 76,500 వద్ద కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. రూపాయి అమెరికా డాలరుతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుండి కోలుకుంది. సోమవారం 5 పైసలు పెరిగి 83.05 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం 88.09 వద్ద కొనసాగుతోంది. అటు ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.73శాతం పెరిగి 85.42 డాలర్ల వద్దకు చేరుకుంది. -
భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న మరో ఫ్రెంచ్ కారు, ఇదే! లాంచ్ ఎప్పుడంటే?
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్లో మరో కొత్త SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే సి3 హ్యాచ్‌బ్యాక్, సి5 ఎయిర్ క్రాస్ వంటి వాటిని విడుదల చేసి మంచి అమ్మకాలు పొందుతున్న ఈ కంపెనీ త్వరలోనే తన మూడవ మోడల్ విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ పేరుతొ విడుదలకానున్న ఈ లేటెస్ట్ ఎస్యువి ఎట్టకేలకు దేశీయ విఫణిలో గ్లోబల్ అరంగేట్రం చేసింది. కాగా 2023 ద్వితీయార్థంలో ఈ కొత్త కారు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారు సుమారు 90 శాతం స్థానీకరణను కలిగి ఉంటుంది. డిజైన్: కొత్త సిట్రోయెన్ సి3 CMP మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతుంది. కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక డిజైన్ పొందుతుంది. పొడవు వెడల్పు మాత్రమే కాకుండా గణనీయమైన వీల్ బేస్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!) దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 4.3 మీటర్ల పొడవు కలిగి హ్యుందాయ్ క్రెటా కంటే పొడవుగా ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే బ్రాండ్ మోడల్స్ గుర్తుకు తెచ్చినప్పటికీ ముందు భాగంలో లోగో గ్రిల్ భాగంలో నిక్షిప్తం చేశారు. అంతే కాకుండా హాలోజన్ హెడ్ లాంప్స్ కలిగి ఫ్రంట్ బంపర్ పొడవుగా రౌండ్ ఫాగ్ లాంప్స్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, రియర్ ప్రొఫైల్ పొవాడైన టెయిల్ గేట్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్స్: ఇంటీరియర్ విషయానికి వస్తే, సి3 ఎయిర్‌క్రాస్ రెండు సీటింగ్ ఆప్షన్స్ పొందుతుంది. 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ కలిగి మూడు వరుసలతో వస్తుంది. 5 సీటర్ కారులో 444 లీటర్ల బూట్ స్పేస్, 7 సీటర్ కార్లు 511 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదే సమయంలో 10.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అలాగే ఉంటుంది. అయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బాగా అప్డేట్ పొందుతుంది. మిగిలిన అన్ని ఫీచర్స్ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) ఇంజిన్ వివరాలు: సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 110 హెచ్‌పి పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటాయి. ఆటోమాటిక్ గేర్ బాక్స్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త SUVలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉండదు. ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సిట్రోయెన్ సి3 ఇప్పటికే విక్రయానికి ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ లేటెస్ట్ SUV ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. ఈ కొత్త సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
అక్షయ తృతీయకు ముందు పసిడి ప్రియులకు భారీ షాక్! రికార్డ్ హై
న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పుంజు కోవడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా వారం రోజుల్లో అక్షయ తృతీయ రానున్న తరుణంలో కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆల్‌టైం హైకి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.480 పెరిగి రూ.61,780కి చేరింది. వెండి సైతం కిలో రూ.410 పెరిగి రూ.77,580 స్థాయికి ఎగిసింది. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2,041డాలర్ల వద్ద, వెండి ఔన్స్ 25.88 డాలర్లుగా ఉంది. (27వేల మంది తొలగింపు: అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు) దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 600 రూపాయలు ఎగిసి 61,200 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 550పెరిగి 56, 650 వద్ద ఉంది. అలాగే మరో విలువైన లోహం వెండి ఏకంగా కిలోకి 1200 రూపాయలు పెరిగి రూ.83,800గా ఉంది. మార్చి1న రూ. 70వేలుగా ఉన్న కిలో వెండి ధర మార్చి 31 నాటికి 77500 స్థాయికి చేరింది. తాజాగా 83వేలకు చేరడం విశేషం. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్) అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగానూ ప్రభావం చూపుతున్నట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. అటు ఆరు కరెన్సీల బాస్కెట్‌కు వ్యతిరేకంగా గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 101 మార్క్ దిగువకు పడి పోయింది. మార్చిలో అమెరికా పీపీఐ ఇండెక్స్ ఊహించని విధంగా క్షీణించడంతో వారంవారీ జాబ్‌లెస్ క్లెయిమ్‌ల సంఖ్య 2,39,000 పెరిగింది. దీంతో ట్రెజరీ దిగుబడులు కూడా తగ్గినట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) -
సుందరం ఫాస్టనర్స్: 60 ఏళ్ల కంపెనీ చరిత్రలో అతిపెద్ద డీల్!
చెన్నై: వాహన పరిశ్రమకు కావాల్సిన విడిభాగాల తయారీలో ఉన్న సుందరం ఫాస్టనర్స్ రూ.2,044 కోట్ల భారీ కాంట్రాక్ట్‌ను ఓ విదేశీ ఆటో కంపెనీ నుంచి దక్కించుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన సబ్ అసెంబ్లీస్, డ్రైవ్ గేర్ సబ్ అసెంబ్లీస్ను సుందరం ఫాస్టనర్స్ సరఫరా చేయనుంది. 60 ఏళ్ల కంపెనీ చరిత్రలో అతిపెద్ద ఈవీ కాంట్రాక్ట్ అని సంస్థ బుధవారం తెలిపింది. నూతన ఆర్డర్‌ను అనుసరించి తయారీ కోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సుందరం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ, తమిళనాడులోని చెంగల్పట్టు వద్ద ఉన్న మహీంద్రా వరల్డ్ సిటీలో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. డీల్‌లో భాగంగా 2026 నాటికి ఏటా 15 లక్షల యూనిట్ల ట్రాన్స్మిషన్ సబ్–అసెంబ్లీస్ సరఫరా చేసే అవకాశం ఉందని సుందరం అంచనా వేస్తోంది. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
పాపం.. మిలియనీర్ల పుట్టి ముంచుతున్న బిట్‌కాయిన్
Bitcoin Crash Effect Thousands Of Investors Vanished: బిట్‌కాయిన్.. క్రిప్టోకరెన్సీలో అత్యంత విలువైంది. దీని దరిదాపుల్లో మరే కరెన్సీ లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి వీటికి నమ్ముకున్న వాళ్లకు అదృష్టం కలిసొచ్చి.. ఇప్పుడు విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యకాలంలో పరిణామాలతో బిట్‌కాయిన్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది!. ప్రస్తుతం ఇది చేస్తున్న నష్టం మాత్రం మామూలుగా ఉండడం లేదు. సుమారు 30 వేలమంది బిట్‌కాయిన్ మిలియనీర్లు క్రిప్టో మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయారు. కారణం.. గత మూడు నెలల్లో బిట్‌కాయిన్ డిజిటల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు. నవంబర్‌లో 69,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ తాజాగా(గురువారం) 36,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీపై పలు దేశాల నియంత్రణ పరిశీలన, భౌగోళిక రాజకీయ అశాంతి, అల్లకల్లోలం అవుతున్న మార్కెట్లు, కరోనా పరిస్థితుల వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిన్బోల్డ్ అనే పోర్టల్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ ఉన్న బిట్‌కాయిన్ కలిగి ఉన్న వాలెట్లు 28,186( 24.26 శాతం) తగ్గాయి. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో గతంలో బిట్‌కాయిన్ ద్వారా ధనవంతులైన ఎంతో మంది.. భారీ నష్టంతో బికారీలుగా మారిపోయారు. అంతేకాదు ‘‘1,00,000డాలర్లు కంటే ఎక్కువ ఉన్న వాలెట్లు 30.04 శాతం పడిపోయి 505,711 నుండి 353,763కి చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్, అంతకు మించి ఉన్నవి 105,820 నుండి 80,945కి 23.5 శాతం పడిపోయి 80,945కి పడిపోయింది. 10 మిలియన్ల డాలర్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాలెట్లు కూడా 32.08 శాతం తగ్గి 10,319 నుండి 7,008కి పడిపోయాయి’’ అని ఫిన్బోర్డ్ నివేదిక పేర్కొంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా బిట్‌కాయిన్‌ను అభివర్ణిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. బిట్‌కాయిన్ చేస్తున్న డ్యామేజ్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్తూ.. ముందు మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు కనిష్టానికి చేరుకోవడంతో పాటు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లజేశాయి మరి!. చదవండి: బిట్‌కాయిన్ చెల్లదంటే చెల్లదు- ఐఎంఎఫ్ -
నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం
స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9గం.50ని. సమయంలో సెన్సెక్స్ 390 పాయింట్ల నష్టంతో 57,510 వద్ద.. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,116 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.19 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టైటన్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. కారణాలు ఏంటంటే.. ►అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్ల మీద కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ► దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ► అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. ► అమెరికా ఫెడ్ వచ్చే ఏడాది వడ్డీరేట్లను పెంచుతామని ప్రకటించడం, అలాగే బాండ్ల విక్రయాల ద్వారా 30 బిలియన్ డాలర్లు సేకరిస్తామని చెప్పడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1800 డాలర్లు దాటింది. ► ఇక ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం ఇప్పుడు మదుపర్లను కలవరపెడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. -
రూపాయి ‘రికార్డు’ పతనం! కారణం ఏంటంటే..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట పతనం దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం 44 పైసలు పతనమై, 76.32 వద్ద ముగిసింది. గడచిన 20 నెలల్లో (2020 ఏప్రిల్ తరువాత) రూపాయి ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. అలాగే ఒకేరోజు రూపాయి ఈ స్థాయి పతనం కూడా గడచిన ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి. భారత్ కరెన్సీ మంగళవారం ముగింపు 75.88. డిసెంబర్లో గడచిన 11 ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిది రోజుల్లో రూపాయి 119 పైసలు (1.58 శాతం) నష్టపోయింది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కారణాలు ఏమిటి? ►అమెరికాసహా పలు దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్ర రూపంలో ఉంది. అమెరికాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో 31 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత రిటైల్ ద్రవ్యోల్బణం (వరుసగా 6.2 శాతం, 6.8 శాతం) నమోదయ్యింది. ఈ పరిస్థితుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ సరళతర విధానానికి త్వరలో ముగింపు పలకనున్నదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం) పెంచే అవకాశం ఉందని అంచనా ఉంది. ►ఈ పరిస్థితుల్లో సరళతర ఆర్థిక విధానాలతో విదేశీ మార్కెట్లను ముంచెత్తిన డాలర్లు వెనక్కు మళ్లడం ప్రారంభమైంది. ఫలితంగా ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ గడచిన నెల రోజులుగా భారీగా బలపడుతోంది. తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులకు డాలర్ సురక్షిత ఇన్స్ట్రమెంట్గా కూడా కనబడుతోంది. ►దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అనిశ్చితికి గురవుతున్నాయి. మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెనక్కు మళ్లుతున్నాయి. ఈ ప్రభావం రూపాయి సెంటిమెంట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ►ఇక అంతర్జాతీయంగా క్రూడ్ ధర భయాలు, దేశంలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాలూ రూపాయిని వెంటాడుతున్నాయి. ►దీనికితోడు కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ►ఈ వార్తా రాస్తున్న రాత్రి 8 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ నష్టాల్లో 76.31 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 96.50 వద్ద ట్రేడవుతోంది. -
రూపాయి డౌన్.. 16 నెలల తర్వాత కనిష్టానికి!
Indian Rupee Value Falling Reasons: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో పడిపోయింది. ఏకంగా 10 పైసలు బలహీనపడి 75.60కి పడిపోయింది. గడచిన 16 నెలల నెలల్లో (2020 జూలై 1 తర్వాత) రూపాయి ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల బయటకు వెళుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పటిష్టత వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు గ్లోబల్ ఎకానమీని వెంటాడుతుండడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడ్డం కూడా భారత్ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ట్రేడింగ్‌లో రూపాయి 75.45 వద్ద ప్రారంభమైంది. మొదట్లో వచ్చిన లాభాలను నిలబెట్టుకోలేక పోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిపై భయాలు ఒకవైపు– వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు మరోవైపు నెలకొన్న నేనథ్యంలో డాలర్ ఇండెక్స్ కూడా పటిష్టంగా కొనసాగుతుండడం గమనార్హం. గత రాత్రి 11 గంటల సమయంలో.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 75.65వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96 ఎగువన ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కొత్త వేరియంట్ పరిణామాలు, దేశంలోకి విదేశీ నిధుల రాక వంటి అంశాలపై ఆధారపడి రూపాయి తదుపరి కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చదవండి: మూడో రోజూ ముందుకే! -
కుప్పకూలుతున్న క్రిప్టో మార్కెట్.. భారత్ వల్లే!
క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సస్పెన్స్ నడుమ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ తరుణంలో భవిష్యత్తు ఆందోళనల నడుమ గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో కరెన్సీలు దారుణమైన పతనాన్ని చవిచూస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళన నేపథ్యంలో గ్లోబల్ స్టాక్ మార్కెటన్నీ దారుణంగా కుదేలు అయిన వేళ.. క్రిప్టో మార్కెట్ మాత్రం లాభాల బాట నడిచింది. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు మార్కెట్ పతనం దిశగా కొనసాగుతోంది. అందుకు కారణం.. క్రిప్టో కరెన్సీ మీద భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో అనే బెంగ. అవును.. క్రిప్టో కరెన్సీపై ప్రత్యేక చట్టం తేవాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఊపందుకున్న వేళ.. అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ భారీ పతనం చవిచూస్తోంది. ఈ ఏడాది నవంబర్ 10న 69వేల డాలర్ల హై వాల్యూతో ఆల్‌టైం హైలో బిట్‌కాయిన్ నిలిచిన విషయం తెలిసిందే. అలాంటి కరెన్సీ ఇప్పుడు ఏకంగా 31 శాతం పతనం చవిచూసింది. శనివారం మధ్యాహ్నానికి ఏకంగా 12.50 శాతం పతనంతో ట్రేడ్ అవుతోంది. ఇక ఎథెరియం దాదాపు 10 శాతం, కార్డానో 14 శాతం పతనంతో కొనసాగుతున్నాయి. టెథెర్ కొంచెం మెరుగైన ఫలితం (3.94 లాభం)తో, యూఎస్డీ కాయిన్ 3.91 శాతం పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ► బిగ్గెస్ట్ గెయినర్: కోక్స్స్వాప్(COX) ► బిగ్గెస్ట్ లాసర్: జెమ్(DGM) గరిష్టంగా పతనం అయ్యింది ఇదిలా ఉంటే క్రిప్టో కరెన్సీని ‘క్రిప్టో అస్సెట్’గా మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోందని, మనీ లాండరింగ్‌ను అరికట్టడానికి ఈ బిల్లులో ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’(పీఎమ్ఎల్ఏ) నిబంధనలను సైతం పొందుపరచనున్నారని ఆ కథనాలు ఉటంకిస్తున్నాయి. ఇక ‘ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ బిల్లుకు సంబంధం లేకుండా ఇది విడిగా ఉంటుందని, డిజిటల్ కరెన్సీకి, క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా వర్గీకరించడానికి మధ్య అంతరం ఉండేందుకు ఇలా చేయనున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో మీమ్ కాయిన్స్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే కొనసాగుతోంది. డోజ్కాయిన్, షిబా ఇను, డోజ్లన్ మార్స్, సామోయెడ్కాయిన్లు కూడా పతనం దిశగానే కొనసాగుతున్నాయని కాయిన్‌మార్కెట్ క్యాప్ డాట్ కామ్ వెల్లడించింది. ► డోజ్కాయిన్ 4.53 శాతం పతనం అయ్యింది ► షిబా ఇను 4.22 శాతం పతనం అయ్యింది మొత్తంగా ఈ ఉదయానికి క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్(2.43 ట్రిలియన్ డాలర్లు విలువ) 6.16 శాతం పతనం చవిచూసింది. అయితే గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 20 శాతం క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ పెరిగి.. 137 బిలియన్ డాలర్లపైకి చేరుకుంది. చదవండి: చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్! -
చైనా ‘ఎవర్‌గ్రాండ్’: దెబ్బ మీద దెబ్బ
China Evergrande shares fall: కరోనా సవాళ్లకు తోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (చైనా) మందగమనంలో ఉంది. ఈ తరుణంలో తాజాగా మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న ఎవర్‌గ్రాండ్.. డిఫాల్టర్ మరకను అంటించుకునే టైం దగ్గర పడింది. చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్’(ఎవర్‌గ్రాండే) షేర్లు భారీగా పతనం అయ్యాయి. పదిహేడు రోజుల విరామం అనంతరం.. గురువారం ఉదయం హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 14 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్‌గ్రాండ్.. యూనిట్లలో ఒకదానిని 2.6 బిలియన్ డాలర్లకు అమ్మేయాలనుకున్న ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో షేర్లు ఒక్కసారిగా పతనం అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో వణుకు పుట్టిస్తోంది. ఈ ప్రభావంతో గృహ నిర్మాణ రంగం మందగమనంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా మెటల్ షేర్లకు డిమాండ్ తగ్గవచ్చనే ఆందోళనలు అధికమయ్యాయి. ఎవర్‌గ్రాండే ప్రాపర్టీస్ సర్వీసెస్‌లో 51 శాతం భాగాన్ని.. హోప్‌సన్ డెవలప్మెంట్ హోల్డింగ్స్‌కు అమ్మాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన చేసింది కూడా. అయితే హోప్‌సన్ డెవలప్మెంట్ మాత్రం ఎవర్‌గ్రాండ్ విధించిన తలాతోకలేని షరతుల వల్లే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. చైనాకు చెందిన అతిపెద్ద(రెండవ) రియల్ ఎస్టేట్ డెవలపర్.. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉండేది. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్లవడ్డీని చెల్లించలేనని ఎవర్‌గ్రాండ్ కిందటి నెలలో ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు 305 బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు నిర్ధారణ కావడంతో రియల్టీ రంగం ఉలిక్కిపడింది. అయితే ఈ సంక్షోభాన్ని తాము తట్టుకుని నిలదొక్కుకుంటామన్న ఎవర్‌గ్రాండ్ ఫౌండర్ క్జూ జియాయిన్(హుయి కా యాన్) హామీ ఫలించడం లేదు. తాజాగా షేర్లు భారీగా పడిపోతుండడంతో.. చైనాలో అతిపెద్ద కార్పొరేట్ పతనం తప్పదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే గ్లోబల్ మార్కెట్ కుదేలు కావడం ఖాయం. ఇక ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో కనిష్ట స్థాయిలో ట్రేడ్ కాగా.. ఇప్పుడు అంతకు మించే పతనం కావడం మరో విశేషం. షెంజెన్ కేంద్రంగా చైనా రియల్ ఎస్టేట్ రంగంలో రెండో స్థానంలో ఉన్న ఎవర్‌గ్రాండే.. పోయిన నెలలో పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో చేరాల్సి ఉండగా.. అది కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. షేర్ల పతనంతో కుదేలు అవుతున్న తరుణంలో.. కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. బకాయిల్లో 83.5 మిలియన్ డాలర్ల చెల్లింపులు చేపట్టాలని 30 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ అది జరగకుంటే ఎవర్‌గ్రాండ్‌ను డిఫాల్టర్‌గా ప్రకటిస్తారు. ఘనం నుంచి పతనం ఎవర్‌గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్గ్జౌ ఫుట్‌బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. అయితే కిందటి ఏడాది అగష్టులో ప్రభుత్వం డెవలపర్స్ మీద ఉక్కుపాదం మోపడం, అడ్డగోలు డిస్కౌంట్లతో అమ్మకాల నుంచి ఎవర్‌గ్రాండ్ పతనం మొదలైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. డిఫాల్ట్ గండం నుంచి ఎవర్‌గ్రాండ్ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే?
Apple iPhone 13: టెక్ దిగ్గజం యాపిల్‌కి షాక్ తగిలింది. నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ తాజా లెక్కలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తగ్గిన అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ట్రెండ్ ఫోర్స్ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్‌కి సంబంధించి గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్‌సెట్ పేర్కొంది. నాలుగో స్థానానికి ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో యాపిల్ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసినికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్‌తో యాపిల్ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది. ఐఫోన్ 13పైనే భారం యాపిల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్ ఐఫోన్ 13ను రిలీజ్ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌తో పని లేకుండా లో ఎర్త్ ఆర్బిట్ టెక్నాలజీపై ఐఫోన 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 13కి మరింత క్రేజ్ తెచ్చేందుకు యాపిల్ వాచ్ 7 సిరీస్‌ను సైతం రిలీజ్ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్ షేర్‌ను దక్కించుకునేందుకు ఐఫోన్ 13పైనే ఆ సంస్థ భారం వేసింది. చదవండి: గూగుల్ సెర్చ్‌లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం -
ఒడిదుడుకులు ఉండొచ్చు..!
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ గురువారం(ఈ నెల 26న) ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగుస్తుండటం ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. దేశీయంగా ఈక్విటీ మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలేవీ లేకపోవడంతో మన స్టాక్ సూచీలకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దిశానిర్దేశం చేస్తాయని అంటున్నారు. ఫెడ్ రిజర్వ్ ట్యాపరింగ్, డెల్టా వేరియంట్ కోవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రత అంశాలూ సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగురోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సూచీలు రెండురోజులు లాభాల్ని ఆర్జించి, మరో రెండురోజులు నష్టాలను చవిచూశాయి. విస్తతృస్థాయి మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో వారం మొత్తంగా సెన్సెక్స్ 108 పాయింట్లు,నిఫ్టీ 78పాయింట్లను కోల్పోయాయి. మూడు లిస్టింగ్‌లు.., ప్రాథమిక, సెకండరీ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో మూడు లిస్టింగ్‌లతో పాటు నిధుల సమీకరణకు మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకున్న విస్టాస్ షేర్లు నేడు (సోమవారం).., కెమ్‌ప్లాస్ట్ సన్మార్, అప్టాస్ షేర్లు మంగవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిరతతో గ్రే మార్కెట్లో ఈ కంపెనీల షేర్ల ధరలు దిగివచ్చాయి. స్వల్ప ప్రీమియం ధరతో లిస్ట్‌కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఐపీఓకు అమి ఆర్గానిక్స్... ప్రత్యేక రసాయన, ఏపీఐ మానుఫ్యాక్చరర్ అమి ఆర్గానిక్స్ కంపెనీ ఇదే వారంలో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఓ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.300 కోట్ల తాజా విలువైన షేర్లను జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతి ద్వారా ప్రమోటర్లు 60లక్షల ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెట్టారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు... ఈ గురువారం(ఈ నెల 26న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. విదేశీ పెట్టుబడుల జోరు... మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)జోరు కొనసాగుతోంది. ఈ ఆగస్ట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో ఇప్పటిదాకా(ఆగస్ట్ 1–23 తేదీల మధ్య) రూ.7,245 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.5,001 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.2,244 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ అవుట్‌లుక్‌ను కేటాయిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వైస్ చైర్మన్ వీకే విజయకుమార్ తెలిపారు. -
సెన్సెక్స్ తక్షణ మద్దతు 38,240, నిరోధం 38,990
సెప్టెంబర్ చివరివారంలో ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, లాభాలతో ముగిసాయి. అయినా ఈ హెచ్చుతగ్గులన్నీ ఆగస్టు 31 నుంచి కొనసాగుతున్న పరిమితశ్రేణికి లోబడే వున్నందున, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్ను ఇప్పట్లో అంచనా వేయలేము. అయితే అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరగనున్న ఎన్నికలపై ఇక నుంచి ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నందున, ఆయా వార్తలకు అనుగుణంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. ఇక భారత్ స్టాక్ సూచీల సాంకేతిక అంశాలకొస్తే.... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... గత నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో 38,738 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,308 పాయింట్ల భారీ లాభంతో 38,697 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పాజిటివ్‌గా ప్రారంభమైతే 38,990 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు. ఈ అవరోధస్థాయిని దాటి, ముగిస్తే 39,235–39,560 పాయింట్లశ్రేణి వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 40,010 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 38,240 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 37,830 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే 37,545 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. నిఫ్టీ తక్షణ నిరోధం 11,535 గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,428 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 367 పాయింట్ల లాభంతో11,417 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే, 11,535 పాయింట్ల వద్ద నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,590–11620 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని దాటితే తిరిగి 11,795 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోతే 11,295 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,185 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 11,100 పాయింట్ల వద్ద ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది. – పి. సత్యప్రసాద్ -
‘డిజిటల్ వేదికగా ప్రపంచానికి చేరువ’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత ఉత్పత్తులనే కాకుండా మన గళాన్ని కూడా ప్రపంచం ఆదరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జైపూర్‌లో పత్రికా గేట్‌ను, పత్రికా గ్రూప్ చీఫ్ గులాబ్ కొఠారీ రాసిన రెండు పుస్తకాలను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాతినిథ్యం పెరిగిన క్రమంలో భారత మీడియా కూడా అంతర్జాతీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మన వార్తాపత్రికలు, మేగజీన్లకు అంతర్జాతీయంగా ఆదరణ ఉందని, డిజిటల్ శకంలో మనం డిజిటల్ వేదికగా ప్రపంచానికి చేరువ కావాలని అన్నారు. కోవిడ్-19పై భారత మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించిందని ప్రశంసించారు. సోషల్ మీడియా మాదిరిగా మీడియా సైతం కొన్ని సందర్భాల్లో విమర్శలు గుప్పించినా విమర్శల నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలని, ఇదే దేశ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని అన్నారు. ప్రజలు పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు ఆథ్యాత్మిక, వేదాంత విజ్ఞానానికే పరిమితం కాదని, విశ్వం, శాస్త్రాల లోతులనూ అందిపుచ్చుకునే సామర్థ్యం కలిగినవని చెప్పుకొచ్చారు. చదవండి : ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలి : మోదీ -
కరోనా.. టెర్రర్!
కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలం కారణంగా ప్రపంచం మాంద్యంలోకి జారిపోతోందనే ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో శుక్రవారం మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం 74 స్థాయికి చేరువ కావడం, ముడి చమురు ధరలు 2.5 శాతం మేర క్షీణించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 1,459 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్ చివరకు 894 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 280 పాయింట్లు పతనమై 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 1,014 పాయింట్లు కోల్పోయి 27,801 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 2.3 శాతం, నిఫ్టీ 2.4 శాతం, బ్యాంక్ నిఫ్టీ 3.5 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్టానికి, బ్యాంక్ నిఫ్టీ ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 721 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయాయి. చివర్లో తగ్గిన నష్టాలు.... గురువారం అమెరికా మార్కెట్, శుక్రవారం ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మన మార్కెట్ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్ 857 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,460 పాయింట్లు, నిఫ్టీ 442 పాయింట్ల మేర క్షీణించాయి. చివర్లో నష్టాలు కొంత తగ్గాయి. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ తీసుకున్న చర్యల నేపథ్యంలో బ్యాంక్ షేర్లు బేర్మన్నాయి. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో విమానయాన, లోహ షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1–3 శాతం, యూరప్ మార్కెట్లు 3–4 శాతం రేంజ్లో క్షీణించగా, అమెరికా సూచీలు 2–3 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ మాత్రమే లాభపడ్డాయి. ► యస్ బ్యాంక్‌లో వాటాను ఎస్బీఐ కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 6 శాతం నష్టంతో రూ.270 వద్దకు చేరింది. ► చైనాలో రిటైల్ అమ్మకాలు 85 శాతం తగ్గడంతో టాటా మోటార్స్ షేర్ 9% నష్టంతో రూ.114 వద్ద ముగిసింది. ► దాదాపు 600కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, పీఎన్బీ, ఇండిగో, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మొత్తం ఐదు షేర్లు సెన్సెక్స్‌ను 510 పాయింట్ల మేర పడగొట్టాయి. సెన్సెక్స్ నష్టాల్లో హెచ్డీఎఫ్సీ వాటా 140 పాయింట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 125 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 113 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 68 పాయింట్లు, ఎస్బీఐ వాటా 64 పాయింట్లుగా ఉన్నాయి. ► దాదాపు 400 మేర షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. కార్పొరేషన్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.3.30 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.3.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.29 లక్షల కోట్లు తగ్గి రూ.144.3 లక్షల కోట్లకు పడిపోయింది. -
బంగారం 1,530 డాలర్ల పైన... ర్యాలీయే
బంగారం గత మంగళవారం ఆరున్నరేళ్ల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత వారం మొత్తం మీద ఆర్జించిన లాభాలను కోల్పోయింది. డిసెంబర్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం నష్టపోయి ఔన్స్‌కు 1532.60 డాలర్లుగా ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలను చైనా వాయిదా వేయడం సానుకూల స్పందనకు దారితీసినట్టు టీడీ సెక్యూరిటీస్ గ్లోబల్ స్ట్రాటజీ హెడ్ బార్ట్ మెలెక్ తెలిపారు. వారం మొత్తం మీద లాభాలను కోల్పోయినప్పటికీ, బంగారం కీలక మద్దతు స్థాయి 1,530 డాలర్లకు పైనే నిలిచింది. ఇది కొనసాగితే భవిష్యత్తులో ధరలు పెరిగేందుకే అవకాశం ఉందని బ్లూలైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బరూచ్ తెలిపారు. బంగారం 1,530 డాలర్ల పైన ఉన్నంత వరకు తాను బుల్లిష్‌గానే ఉంటానని, 1,530 డాలర్లకు దిగువన ముగిస్తే 1,500 దిశగా తగ్గుతుందని బరూచ్ చెప్పారు. ఈ వారంలో బంగారం మరింత కన్సాలిడేషన్‌కు అవకాశాలు లేకపోలేదని ఎక్కువ మంది అనలిస్టులు భావిస్తున్నారు. ‘‘బంగారం కొంత మేర దిగువకు వెళ్లొచ్చు. అమెరికా డేటా క్షీణతను సూచిస్తే, ఫెడ్ మరింత డోవిష్‌గా వ్యవహరిస్తుంది. దాంతో ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు పెరగడంతోపాటు, బంగారం అధిక స్థాయికి వెళుతుంది. గణనీయంగా పెరగడాన్ని చూడొచ్చు. దిగువ వైపున 1,488 మద్దతుగా వ్యవహరిస్తుంది’’ అని మెలెక్ వివరించారు. పావెల్ వ్యాఖ్యలపై దృష్టి... స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్‌లో వచ్చే శుక్రవారం అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు. దీనికంటే ముందు ఆగస్ట్ నెలకు సంబంధించి అమెరికా ఉద్యోగ గణాంకాల డేటా బయటకు రానుంది. సెప్టెంబర్ 18 నాటి ఫెడ్ రేట్ల నిర్ణయానికి ముందు పావెల్ చివరి ప్రసంగం ఇదే. ఈ నెలలో మరో విడత రేట్ల కోత ప్రణాళికను ఆయన ప్రకటించొచ్చని క్యాపిటల్ ఎకమనిక్స్ యూఎస్ ఎకనమిస్ట్ ఆండ్రా్యూ హంటర్ తెలిపారు. -
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావం
మూడు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించవద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 329 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 248 పాయింట్లు పతనమై 39,502 పాయింట్ల వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 11,861 పాయింట్ల వద్ద ముగిశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీ ఘన విజయం నేపథ్యంలో గత మూడు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్లో క్లోజవుతున్నాయి. ఈ రికార్డ్ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని, బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయని నిపుణులంటున్నారు. తగ్గుతున్న బాండ్ల రాబడులు... మూడు నెలల అమెరికా బాండ్ల రాబడులు కన్నా, పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గాయి. ఇది మాంద్యానికి సూచన అని విశ్లేషకులంటున్నారు. మరోవైపు అమెరికా–చైనాల మధ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం కూడా ప్రభావం చూపడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. భారత్‌లో కూడా బాండ్ల రాబడులు తగ్గాయని, ఆర్బీఐ వచ్చేవారంలో కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలు దీనికి కారణమని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. అమెరికా, భారత్‌ల్లో బాండ్ల రాబడులు తగ్గుతుండటంతో మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు అభివృద్ది చెందిన దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 347 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఒక దశలో 18 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 329 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 347 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► ఇటీవలే జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన ఎస్బీఐలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ షేర్ 3.2 శాతం నష్టపోయి రూ.348 వద్ద ముగిసింది. త్వరలోనే ఈ బ్యాంక్ క్యూఐపీ విధానంలో రూ.15,000–18,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదన్న వార్త కూడా ప్రభావం చూపింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ ర్యాలీ నెలే! ఈ ఏడాది చివరి కల్లా సెన్సెక్స్ 42,000 పాయింట్లకు చేరగలదన్న గతంలో వెల్లడించిన లక్ష్యాలను ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ, బీఎన్పీ పారిబా కొనసాగించింది. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన ర్యాలీ నెల రోజుల్లో సమసిసోతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
100 కోట్ల మంది క్రికెట్ అభిమానులు!
దుబాయ్: క్రికెట్‌ను విశ్వవ్యాపితం చేసేందుకు టి20నే సరైన ఫార్మాట్‌గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుర్తించింది. ఇటీవలి కాలంలో వేర్వేరు దేశాల్లో క్రికెట్ గురించి ఆదరణ పెరగడానికి టి20 కారణమైందని ఐసీసీ నిర్ధారణకు వచ్చింది. ఐసీసీ భారీ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ మార్కెట్ సర్వే ఈ అంశాలను వెల్లడించింది. 12 టెస్టు దేశాలతో పాటు భవిష్యత్తులో క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేయగలిగే అవకాశమున్న అమెరికా, చైనా దేశాలలో ఈ సర్వే జరిపారు. వంద కోట్ల మంది అభిమానుల్లో 95.2 కోట్ల మంది ఈ 14 దేశాల్లోనే ఉంటే (ఇందులో 90 శాతం మంది ఉపఖండానికి చెందిన వారే) 8.7 కోట్ల మంది ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఉన్నారు. 87 శాతం మంది టి20 ఫార్మాట్‌తో ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని కోరుకోవడం విశేషం. ఐసీసీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ విశేషాలు ► ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు: సుమారు 100 కోట్లకు పైగా (16–69 మధ్య వయసువారు) ► సర్వేలో పాల్గొన్నవారు: సుమారు 30 కోట్ల మంది æ మహిళా అభిమానుల సంఖ్య: 39 శాతం ► మూడు ఫార్మాట్లు ఇష్టపడేవారు: 64 శాతం æ టి20లు: 92 శాతం, వన్డేలు: 88 శాతం, టెస్టులు: 69 శాతం (విడివిడిగా) ► ప్రపంచకప్ లాంటి ఐసీసీ ఈవెంట్లు బాగా ఇష్ట పడే వారు: 95 శాతం ► మహిళల క్రికెట్ కవరేజి కోరుకుంటున్నవారు: 70 శాతం. -
కొరమీనును మించేలా మురిమీను
• ఆరెంజ్స్పాట్స్తో గ్రూపర్ఫిష్ • ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ • సీఎంఆర్ఎఫ్ మూడేళ్ల కృషికి తగిన ఫలితం • దేశీయ హేచరీలో ఉత్పత్తికి సన్నాహాలు • చేపలపెంపకందారులకు ఇదో వరం సాక్షి, ఒంగోలు: ఇంత వరకు కోరమీను రుచికే మాంసాహార ప్రియులు లొట్టలేసేవారు. ఇప్పుడు దానికి మూడురెట్ల రుచితోపాటు ధర పలికే మురిమీను రుచి మురిపించనుంది. ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న ఈ మురిమీను (గ్రూపర్ ఫిష్) దేశీయ చేపల చెరువుల్లో పెంపకం చేపట్టేందుకు వీలుగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎం ఎఫ్ఆర్ఐ) మూడేళ్లుగా చేసిన పరిశోధనకు ఫలితం దక్కింది. ఆరెంజ్ స్పాట్స్‌తో చూడముచ్చటగా కనిపించే మురిమీను మాంసప్రియులకు కొత్త రుచిని అందించనుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈసందర్భంగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సైంటిస్టులు మురిమీను గురించి ఇలా వివరించారు. మూడేళ్ల పరిశోధన ఫలించింది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎం ఎఫ్ఆర్ఐ) 2013 నుంచి గ్రూపర్షిష్ లార్వాను ఉత్పత్తి చేయడంలో మంచి పురోగతి సాధించిందని విశాఖ రీజనల్ సెంట్రల్ ఆఫ్ సీఎం ఎఫ్ఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుభదీఫ్ ఘోష్ తెలిపారు. సాంకేతిక బృందంతోపాటు, సిబ్బంది పడిన కష్టానికి మంచి ఫలితం దక్కిందన్నారు. సముంద్రపు నీటితోపాటు, వివిధ రకాల నీట్లో లార్వా వృద్ధితోపాటు ఉత్పత్తి చెందేలా చాలా ప్రయోగాలను చేశామన్నారు. ప్రయోగాలఫలితంగా మురిమీను 42రోజుల వ్యవధిలో సుమారు 3 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగిందన్నారు. ఏడాదికి లక్షల మురిమీను పిల్లల పంపిణీ సంవత్సరానికి లక్షల మురిమీను పిల్లల చేపల పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం ఎప్ఆర్ఐ డెరైక్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ చేపల పెంపకంగా విస్తారంగా పెంపకంచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హై ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆరెంజ్ స్పాట్స్( గ్రూపర్ ఫిష్) మురిమీను అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. దీని ఎగుమతికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఉష్ణమండల వాతావరణంలో మురిమీను చేపల పెంపకానికి అనువుగా వుంటుందన్నారు. ఆసియా దేశాలైన హాంగ్‌కాంగ్, చైనా, తైవాన్, సింగపూర్,మలేషియా దేశాలలో మంచి డిమాండ్ ఉందన్నారు. దీని ఆయా దేశాలలో అమూర్గా పిలుస్తారన్నారు. చేపల పెంపకం దారులు అధిక లాభాలు మురిమీను దేశీ చెరువులలో విస్తారంగా పెంపకంగా చేసేందుకు చేపల పిల్లలను పంపిణీ చేయనున్నామన్నారు. దీని పెంపకం ద్వారా చేపల పెంపకందారులు అధిక ఆధాయాన్ని సాధింగలరని సీ ఎంఎఫ్ ఆర్ఐ డెరైక్టర్ డాక్టర్ గోపాలకృష్ణణ్ తెలిపారు. తక్కువ వ్యవధిలో అమ్మకానికి సిద్ధంగా చేప పెరుగుతుందన్నారు. దీంతో అనతికాలంలో ఎక్కువ దిగుబడి సైతం సాధించగవచ్చనని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ చేపల మార్కెట్లో మురిమీను కిలో ధర రూ.400- 500వరకు పలుకుతుందన్నారు. ఇదే అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కడి ధరకు మూడు,నాలుగు రెట్లు అధికంగా ఉందన్నారు. -
గ్లోబల్ మార్కెట్లలో రైల్వే ‘రూపీ’ బాండ్లు
నిధుల సమీకరణ కోసం కొత్త రూట్.. న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ఇక గ్లోబల్ మార్కెట్ల బాట పట్టనున్నాయి. రైల్వే మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17)లో రూ.1.21 లక్షల కోట్ల భారీ వ్యయ ప్రణాళికలను ప్రకటించిన నేపథ్యంలో రైల్వే శాఖ నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ మార్కెట్లలో రూపీ బాండ్లను జారీ చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్లో ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు, కొత్తగా ప్రభుత్వ-ైప్రైవేటు భాగస్వామ్యాలు(పీపీపీ), వివిధ సంస్థలతో జట్టుకట్టడం ద్వారా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమకూర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది రైల్వేల సగటు పెట్టుబడి వ్యయాలు దాదాపు రెట్టింపు కానున్నాయని.. గతంలో ఎన్నడూ ఇంతగా పెంచలేదని చెప్పారు. 2009-14 వరకూ రైల్వేల సగటు వార్షిక పెట్టుబడి వ్యయాలు రూ.48,100 మాత్రమేనని ప్రభు వివరించారు. ‘దేశంలో మౌలిక వృద్ధికి రైల్వేలు ఇంజిన్‌గా పనిచేయనున్నాయి. తొలిసారిగా భారతీయ రైల్వేలు పెట్టుబడి నిధుల కోసం అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టనున్నాయి. వెచ్చించే ప్రతి రూపాయికీ ఆర్థిక వ్యవస్థలో ఐదు రూపాయల మేర ఉత్పాదకతను పెంచే సామర్థ్యం రైల్వేలకు ఉంది. దేశ ఆర్థిక వృద్ధి రేటుపై రైల్వేల పెట్టుబడి ప్రణాళికలు అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతాయి’ అని ఆని ప్రభు వ్యాఖ్యానించారు.