
పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శివకుమార్
ఈక్విటీల్లో దీర్ఘకాల పెట్టుబడులకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. అయితే 50–60 శాతం పెట్టుబడులను మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌తో పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25 - 30 శాతానికి పరిమితం అవుతాయి.
లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70 శాతం మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి 50–60 శాతం కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలకు గురవుతుంది.
చైనా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని ఉంది. ఇందుకు ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయా? – యోగితా రాణా
ఈక్విటీ పెట్టుబడులను భౌగోళికంగా వైవిధ్యం చేసుకోవాలన్న మీ ఆలోచన అభినందనీయం. అయితే ఈ వైవిధ్యం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు. కేవలం చైనాలో ఇన్వెస్ట్ చేసేవి లేదా కేవలం యూఎస్‌లో ఇన్వెస్ట్ చేసే వాటితో కాన్సన్‌ట్రేషన్ రిస్క్ (పెట్టుబడి ఒకే చోట ఉండిపోవడం) ఏర్పడుతుంది. విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది చక్కటి వైవిధ్యంతో ఉండాలి. ఇన్వెస్టర్లు కేవలం ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసే వాటికి దూరంగా ఉండడం మంచిది.
యూఎస్ ఫండ్స్‌కు ఇందులో కొంత మినహాయింపు ఉంది. యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కంపనీల్లో అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. యూఎస్ కంపెనీలను పరిశీలిస్తే అవి కేవలం యూఎస్‌కే పరిమితం కాకపోవడాన్ని గుర్తించొచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు (గూగుల్, మెటా, యాపిల్ తదితర) అంతర్జాతీయంగా కస్టమర్లు ఉంటారు. ఆయా కస్టమర్లు కేవలం యూఎస్‌లోనే ఉండరు. కనుక యూ ఎస్‌కు చెందిన ఫండ్ ఒకే ప్రాంతానికి చెందినది అయినప్పటికీ, అంతర్జాతీయ ఎక్స్‌పోజర్‌ను ఇస్తుంది.
ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో 5 - 10% మించకుండా చైనా స్టాక్స్‌కు కేటాయించుకునేట్టు అయితే.. యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ డైరెక్ట్ ఫండ్, ఎడెల్‌వీజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్‌షోర్ డైరెక్ట్, మిరే అస్సెట్ హ్యాంగ్‌సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ డైరెక్ట్, మిరే అస్సెట్ హ్యాంగ్‌సెంగ్ టెక్ ఈటీఎఫ్, నిపాన్ ఇండియా ఈటీఎఫ్ హ్యాంగ్‌సెంగ్ బీస్ పథకాలు అందుబాటులో ఉన్నాయి.
ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్.
Comments
Please login to add a commentAdd a comment