Funds
-
2025–26లో పథకాల వారీగా రాష్ట్రానికి వచ్చే నిధులపై ఆర్థిక శాఖ అంచనా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఉప పథకాలకు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన గ్రాంట్లు కలిపి రాష్ట్రానికి రూ.38,788 కోట్లు నిధులు వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల్లో కేవలం నాలుగు శాఖలకే 81శాతం మేర వస్తాయని తేల్చారు. కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయా పథకాలకు కేటాయించిన నిధుల ఆధారంగా మన రాష్ట్రానికి ఎంత వస్తాయనేది అంచనా వేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆయా పథకాల కోసం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చేసిన కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని ఈ అంచనాలు రూపొందించినట్లు పేర్కొంది. కేంద్ర బడ్జెట్లో వివిధ పథకాలకు రూ.5,20,61 కోట్లు కేటాయించగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.38,788 కోట్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,750 కోట్లకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. అయితే గత రెండేళ్ల కేటాయింపులను పరిశీలిస్తే రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనల్లో సగం కన్నా తక్కువగా రూ.6,078 కోట్ల వరకు రావొచ్చని అధికారులు అంచనా వేశారు. -
ముందు చూపే లేదు డబ్బులొద్దంట!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ముందుచూపు కరువైంది. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని డప్పు కొట్టీ కొట్టీ.. అలవిగాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు నాలుక తిరగేస్తోంది. సరిపడా డబ్బుల్లేనందున హామీలు అమలు చేయలేమని సిగ్గు విడిచి చెబుతోంది. కేంద్ర పథకాల అమలు కోసం వచ్చే నిధులనూ వదులుకుంటోంది. ఎందుకంటే ఆ పథకాలు నిరాటంకంగా కొనసాగితే గత సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందన్న కసే కారణంసాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదని స్పష్టమైంది. కేంద్ర ప్రాయో జిత పథకాల కింద నిధులు రాబట్టడంలో విఫలమవ్వ డమే ఇందుకు నిదర్శనం. గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం అమలు చేసిన పథకాలను నిలుపుదల చేయాలన్న కసే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ వినియోగ పత్రాలను పంపించినట్లయితే ఆయా పథకాల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేసేది.వినియోగ పత్రాలు పంపక పోవడంతో జాతీయ హెల్త్ మిషన్, పీఎంఏవై, గ్రామీణ సడక్ యోజన, మధ్యాహ్న భోజన పథకం తదితర కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులు అందలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది జనవరి ఆఖరు నాటికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి కేవలం రూ.5,524.48 కోట్లు విడుదలవ్వగా, గత ఆర్థిక ఏడాది వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏకంగా రూ.14,669.63 కోట్లు వచ్చాయి.కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధుల రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందడం గమనార్హం. పొరుగు రాష్ట్రం తెలంగాణ కన్నా అధ్వాన్నంగా రాష్ట్రానికి కేంద్ర నిధులు వచ్చాయి. తెలంగాణకు ఈ ఆర్థిక ఏడాది జనవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.12,281.60 కోట్లు వచ్చాయి. ప్రతిపాదనలు పంపనందునే.. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపక పోవడంతోనే మిగతా రాష్ట్రాల కన్నా అతి తక్కువగా నిధులు విడుదలయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలుత రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపిన తర్వాతే కేంద్ర ప్రభుత్వంలోని ఆయా మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలుపుతాయని, అనంతరమే నిధులు వస్తాయని అర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం కేంద్ర పథకాల నుంచి నిధులు తెచ్చుకోవడంపై దృష్టి సారించకుండా ఇన్ని రోజులు గత ప్రభుత్వంపై నిందలు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చిందని తెలుస్తోంది.గత ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధి కోసం చేపట్టిన మన బడి నాడు–నేడు, మౌలిక సదుపాయాల కల్పన పనులను ఈ ప్రభుత్వం నిలుపుదల చేసిందని, దీంతో ఆయా పథకాలకు కేంద్రం నుంచి నిధులు రాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బిహార్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల కన్నా అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు విడుదలయ్యాయి.ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర పథకాల నిధులను మళ్లించేసిందంటూ కూట మి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు ఈ ఆర్థిక ఏడాది జనవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రూ.2,51,294.84 కోట్లు విడుదలైతే ఇందులో ఏపీకి వచ్చింది కేవలం రూ.5,524.48 కోట్లేనని, ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
రూ. 20,000 కోట్ల నిధులు వాడుకోండి..
పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పై దేశీ కార్పొరేట్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తాజాగా పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన రూ. 20,000 కోట్లు నాణ్యమైన ప్రతిపాదనకు వినియోగించుకోవాలని సూచించారు.ప్రయివేట్ రంగ ఆధారిత ఆర్‌అండ్‌డీకి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయించిన విషయాన్ని బడ్జెట్ తదుపరి సీఐఐ సభ్యులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టి సందర్భంగా ప్రస్తావించారు. ఏడాది చివరికల్లా మొత్తం నిధులను వినియోగించుకునేలా అత్యుత్తమ ప్రతిపాదనలతో తరలిరావలసిందిగా ఆహ్వానించారు.పర్యావరణహిత ఇంధనాలవైపు ప్రయాణంలో ప్రయివేట్ రంగం చేయూత నివ్వాలని కోరారు. ఇదేవిధంగా అణు విద్యుత్ విషయంలో ప్రభుత్వం పరిశ్రమతో కలసి పనిచేయనున్నట్లు తెలియజేశారు.2025-26 బడ్జెట్‌ను ప్రకటిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ రంగ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక కార్పస్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.20,000 కోట్లు కేటాయించారు. గత జూలై బడ్జెట్లోనూ ఆమె రూ. లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
Trump: సాయం కోసం ఇంత ఏడుపులు దేనికి?
‘‘అది మీ ప్రభుత్వం కాదు. మీ దేశం అంతకన్నా కాదు. మీరేం అక్కడ పన్నులూ కట్టడం లేదు. ఏదైనా సాయం అందించడానికి వాళ్లకు కారణాలు అక్కర్లేదు కదా. అలాంటప్పుడు ఈ ఏడుపులు దేనికి? ముమ్మాటికీ ఇది మనకు ఓ మేలుకొలుపే..’’ అని ఓ సదస్సులో ఆఫ్రికా దేశాలను ఉద్దేశించి కెన్యా మాజీ అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఫెడరల్ గ్రాంట్లు, రుణాల నిలిపివేత నిర్ణయమే ఆయన అలా మాట్లాడటానికి కారణం. సాయాన్ని నిలిపివేస్తానని ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచమంతా ఆగమాగమైంది. పలువురు దేశాధినేతలు ట్రంప్‌ను బహిరంగంగానే తిట్టిపోశారు. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం ఇచ్చే సాయం మీద ఆధారపడి బతుకుతున్న చిన్న దేశాల తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.అమెరికా నుంచి వెళ్తున్న అన్ని గ్రాంట్లపై సమీక్ష జరపాలని ట్రంప్ ప్రభుత్వం భావించింది. దీంతో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్ మినహా అమెరికా అందిస్తున్న అన్ని సాయాలు ఆపేద్దామనుకుంది. ఈ విధానం అమెరికాకు ప్రయోజకారిగా లేకపోగా.. విలువలకు విరుద్ధంగా ఉందని ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేశారు. అందుకే మూడు నెలలపాటు వాటిని సమీక్షించాలనుకున్నారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం వెలువడిన కాసేపటికే.. మ్యాటర్ కోర్టు గడప తొక్కింది. దీంతో విచారణ వేళ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అయితే కెన్యా మాజీ అధ్యక్షుడు చెబుతున్నట్లు అమెరికా సాయం నిజంగా ఈ ప్రపంచానికి అవసరమా?.కిందటి ఏడాది అమెరికా నుంచి వివిధ దేశాలకు వెళ్లిన సాయం పరిశీలిస్తే.. ఉక్రెయిన్‌కు 16.5 బిలియన్ల డాలర్ల సాయానికిగానూ.. 16.2 బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది.ఇథియోపియాకు 1.6 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 2 బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది.జోర్దాన్‌కు 1.2 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. అందజేసింది.డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. 1 బిలియన్ డాలర్ సాయం ప్రకటించి, 982 మిలియన్ డాలర్లు ఇచ్చిందిసోమాలియాకు 1 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి, 1.1 బిలియన్ డాలర్లను పంపిణీ చేసిందియెమెన్కు 939 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 1.1 బిలియన్ డాలర్లు అందజేసింది.నైజీరియాకు 904 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 886 మిలియన్ డాలర్లు ఇచ్చిందిఅఫ్గనిస్థాన్కు 815 మిలియన్ డాలర్ల సాయానికిగానూ.. 1.2 బిలియన్ డాలర్ల సాయం అందజేసిందిదక్షిణ సూడాన్‌కు 794 మిలియన్ డాలర్ల సాయానికిగానూ 891 మిలియన్ డాలర్లు అందజేసిందిసిరియాకు 748 మిలియన్ డాలర్లకుగానూ.. 894 మిలియన్ డాలర్ల సాయం అందించిందిమానవతా కోణంలో సాయం అందించడం, ఆయా దేశాల అభివృద్ధిలో భాగంగా అమెరికా ఈ సాయం అందించింది. అయితే అమెరికాతో పాటు వివిధ దేశాలకు ఎంత గ్రాంట్లు కేటాయించాలన్నది మాత్రం అక్కడి చట్ట సభలే నిర్ణయిస్తాయి. ఈ అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని ఈ పద్ధతి మారాలని ట్రంప్ అనుకుంటున్నారు.ట్రంప్ నిర్ణయంతో విదేశాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపోవడంతోపాటు విద్య, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, నిర్మాణ, విపత్తు నిర్వహణ కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆహారం, ఆశ్రయం, వైద్య సేవల్లాంటి మానవతా సాయం ఆగిపోతుంది. ఇది నేరుగా ఉద్యోగాల తొలగింపు.. అవసరమైతే ఆ వ్యవస్థల రద్దుకు దారి తీయొచ్చు. పౌష్టికాహార లోపం, రకరకాల జబ్బుల.. వైరస్‌లతో బాధపడుతున్న ఆఫ్రికన్ దేశాలకు ఇది ముప్పుగా మారచ్చు. మరికొన్ని దేశాల్లో సంక్షోభాలు ముదిరేలా చేయొచ్చు. అయితే సామాజిక భద్రత, మెడికేర్ చెల్లింపులు, వ్యక్తులకు నేరుగా అందించే ఆర్థికసాయంపై ప్రభావం చూపదని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నా.. ఎక్కడా రాతపూర్వకంగా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అమెరికాలోనే మాత్రం కాదు.. ఆ దేశం నుంచి సాయం పొందుతున్న దేశాలకూ వర్తించనుంది. ఆర్థికంగా, సామాజికంగా ఆ దేశాలు సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఎదురుకానున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు.. ప్రత్యేకించి ఆఫ్రికన్ దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.నిజంగా అమెరికా ఈ సాయం చేయడం అవసరమా? అంటే.. లేదు. కానీ, ఈ తరహా సాయంతో అమెరికాకు ఎంతో మేలు చేకూరుతుంది. దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపర్చుకోవడం, వ్యాపార రంగంలో కీలక ఒప్పందాలు, అంతర్యుద్ధాలు-సంక్షోభాల నివారణ.. ఉగ్రవాద అంతం.. తద్వారా ఆ దేశాల్లో జాతీయ భద్రతను పెంపొందించడం ద్వారా మిత్రపక్షాలుగా మార్చుకోవడం, జబ్బుల నివారణకు మానవతా కోణంలో సాయం.. అందుకోసం పరిశోధనలకు భారీగా నిధులు వెచ్చించడం, ఇలా ఇతరత్రా సాయాలతో ప్రపంచదేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ వస్తోంది అమెరికా. Hilarious. Former President of Kenya on Trump cutting off foreign aid: “Why are you crying? It’s not your government. It’s not your country. He has no reason to give you anything. You don’t pay taxes in America. This is a wake up call for you to ask what are we going to do”. pic.twitter.com/tfjETD2qkS— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 29, 2025అయితే.. ప్రపంచవ్యాప్తంగా వైద్య సాయాన్ని కూడా నిలిపివేయాలనుకున్న ట్రంప్ నిర్ణయం.. తూర్పు ఆఫ్రికా దేశాల ఐకమత్యానికి, పరస్పర సాయానికి ఓ పిలుపులాంటిదని ఉహురు కెన్యట్టా అభిప్రాయపడ్డారు. అమెరికాను, ట్రంప్‌ను విమర్శించడం కన్నా స్వీయ సమీక్ష చేసుకోవాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఇతరుల సాయంపై ఆధారపడే బదులు.. ఉన్న వనరులతోనే ఇక్కడి దేశాలు ఒకరికొకరు సాయం చేసుకోవడం, తద్వారా ఆర్థిక పురోగతికి దోహదపడడం ఏనాటికైనా మంచిదని అంటున్నారాయన. మానవతా సాయం విషయంలో భారత్ కూడా ఏం తీసిపోలేదు. 2021-2022లో 2.1 బిలియన్ డాలర్ల(రూ.18,154 కోట్లు) సాయాన్ని పొరుగుదేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘనిస్థాన్ల అభివృద్ధికి భారత్ అందజేసింది. -
ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. గత క్యాలండర్ ఏడాది(2024)లో రూ. 3.94 లక్షల కోట్ల నిధులు లభించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ఇది మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని, దీర్ఘకాలిక పెట్టుబడులపట్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ప్రధానంగా ఇందుకు క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ఉపయోగపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొత్త ఏడాది(2025)లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్ ప్రారంభం నుంచి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమలో పెట్టుబడులు తగ్గడం ప్రారంభమైనట్లు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సరీ్వసెస్ సీఈవో, సహవ్యవస్థాపకుడు సంతోష్ జోసెఫ్ పేర్కొన్నారు. ఇందుకు స్టాక్ మార్కెట్ల ఆటుపోట్లు కారణమైనట్లు తెలియజేశారు. చరిత్ర ప్రకారం మార్కెట్ల ఆధారంగానే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ప్రవహిస్తుంటాయని వివరించారు. మార్కెట్ల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతుంటాయని అందువల్ల ప్రస్తుత హెచ్చుతగ్గుల కారణంగా 2025లో కొత్త ఫండ్ ఆఫర్లు(ఎన్‌ఎఫ్‌వోలు), ఈక్విటీ ఫండ్ల నిధుల సమీకరణ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు కొనసాగవచ్చు పరిస్థితులు సర్దుకున్నాక పెట్టుబడులపై లబ్ది చేకూరే వీలుండటంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించే వీలున్నదని సంతోష్ తెలియజేశారు. గతేడాది మొత్తం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాలకు రూ. 3.94 లక్షల కోట్లు లభించినట్లు మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించింది. 2023లో రూ. 1.61 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే అందుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 40 శాతం ఎగశాయి. దీంతో 2024 డిసెంబర్‌కల్లా రూ. 30.57 లక్షల కోట్లకు ఏయూఎం చేరింది. 2023లో రూ. 21.8 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లు నిలకడగా బలపడటం, ఆరి్ధక అవగాహన మెరుగుపడటం, ఇన్వెస్టర్లు సిప్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు 2024లో ఈక్విటీ ఫండ్ల ఉత్తమ పనితీరుకు తోడ్పాటునిచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై అవగాహన పెంచుకోవడం ద్వారా సంపద వృద్ధికి వీలు దోహదపడినట్లు బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ సీఈవో గణేశ్ మోహన్ పేర్కొన్నారు. మార్కెట్లు నిలకడగా బలపడటం, పెట్టుబడుల్లో డిజిటైజేషన్‌తో ఈక్విటీ ఎంఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. థిమాటిక్ ఫండ్స్ స్పీడ్ గతేడాది ఈక్విటీ పథకాలలో థిమాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రూ. 32,465 కోట్లు, రూ. 34,223 కోట్లు చొప్పున అందుకున్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 19,415 కోట్లు ప్రవహించాయి. పెట్టుబడుల్లో రూ. 2.5 లక్షల కోట్లతో సిప్‌లు ప్రధాన పాత్ర పోషించాయి. -
ఈసారీ..భారీగానే..
సాక్షి, హైదరాబాద్: పరిమిత ప్రాజెక్టులు.. మొత్తం కేటాయింపుల్లో వాటికే సింహభాగం నిధులు.. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తున్న విధానం. ఈ ప్రయోగం ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది.దీనివల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో మూడు కీలక ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే దిశగా రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో రైలు సేవలు బాగా మెరుగుపడబోతున్నాయి. బల్లార్షా–కాజీపేట–విజయవాడఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే కీలక మార్గం ఇది. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్‌గా పిలుస్తారు. ఈ మార్గంలో నిత్యం 460 వరకు రైళ్లు పరుగు పెడుతుంటాయి. ప్రస్తుతం దాని ట్రాఫిక్ సాంద్రత ఏకంగా 160 శాతంగా ఉంది. ఈ మార్గంలో కనీసం మరో 250 ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లను నడపాల్సి ఉన్నా, సాంద్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యం కావటం లేదు. దీంతో మూడో లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.కాజీపేట– విజయవాడ మధ్య మూడో లైన్ 2012–13లో మంజూరు కాగా, కాజీపేట–బల్లార్షా లైన్ 2015–16లో మంజూరైంది. కానీ పనులు వెంటనే మొదలు కాలేదు. గత మూడేళ్లుగా వీటికి భారీగా నిధులు కేటాయిస్తుండటంతో ఇప్పుడు పనులు కొలిక్కి వచ్చాయి. ఈ మార్గంలో వంతెనల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతా పనులు వేగం పుంజుకున్నాయి. దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు. కాజీపేట–బల్లార్షా మధ్య 202 కి.మీ. నిర్మాణాన్ని రూ.2,063 కోట్ల అంచనాతో ప్రారంభించారు. రాఘవాపురం–కొలనూరు, కొలనూరు–పోత్కపల్లి, విరూరు–మాణిక్‌ఘర్, బిజిగిర్ షరీఫ్– ఉప్పల్, విరూరు–మాకుడి, పోత్కపల్లి–బిజిగిర్ షరీఫ్, మాకుడి–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఇప్పటికే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈసారి కొంత సవరించే అవకాశం ఉంది. భారీగా నిధులు ఇవ్వటంతో హసన్‌పర్తి రోడ్డు–ఉప్పల్, ఆసిఫాబాద్–రేచినిరోడ్, హసన్‌పర్తి–కాజీపేట పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 173.27 కి.మీ. రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. 28 కి.మీ. పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బల్లార్షా– మాణిక్‌ఘర్, రేచిని రోడ్–బెల్లంపల్లి– మందమర్రి, ఆసిఫాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య పూర్తి కావాల్సి ఉంది. కాజీపేట–విజయవాడ మూడో లైను ఈ లైన్ పూర్తి నిడివి 220 కి.మీ. గత బడ్జెట్లో దీనికి రూ.310 కోట్లు కేటాయించగా, తర్వాత కొన్ని నెలలకే ఆ మొత్తాన్ని రూ.500కు పెంచారు. దీంతో ఒక్కసారిగా పనుల్లో వేగం పెరిగింది. 104 కి.మీ. నిడివిలో మూడో లైన్ పనులు పూర్తి చేయటంతోపాటు, అన్ని వంతెనలను సిద్ధం చేశారు. మిగతా పనులు మూడొంతులు పూర్తి కాగా, తుదిదశ పనులు మాత్రమే మిగిలాయి. విజయవాడ–కొండపల్లి, కొండపల్లి–చెరువు మాధవరం, చెరువు మాధవరం–గంగినేని–ఎర్రుపాలెం, నెక్కొండ–చింతలపల్లి, చింతలపల్లి–వరంగల్ మధ్య ఇప్పటికే మూడో లైన్ వినియోగంలోకి రాగా, పందిళ్లపల్లి–బోనకల్, ఎర్రుపాలెం–మధిర, విజయవాడ–బెజవాడ క్యాబిన్ మధ్య గత ఏడాది కాలంలో పూర్తయ్యాయి. బోనకల్–మధిర, నెక్కొండ–పందిళ్లపల్లి మధ్య పనులు జరగాల్సి ఉంది. మరో ఏడాదిలో పనులు దాదాపు పూర్తి కానున్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి సిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే 151 కి.మీ. కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా వేగంగా జరుగుతున్నాయి. గత బడ్జెట్లో దీనికి రూ.350 కోట్లు కేటాయించారు. ఇప్పటికే సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ఫార్మేషన్, కటింగ్, లింకింగ్ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రెయిల్స్ పరవనున్నారు. ఈ సెక్షన్లో దాదాపు 60 వరకు మైనర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. నాలుగు ఆర్ఓబీల నిర్మాణం పూర్తి కావచ్చింది. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో సిరిసిల్ల వరకు రైలు నడిపేందుకు వీలు కలగనుంది. మరికొన్ని మార్గాల్లో..» సిరిసిల్ల–కరీంనగర్ మధ్య 40 కి.మీ. మార్గానికి భూ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవటంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అక్కడ పనులు జరగటం లేదు. భూ పరిహారం రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూమిని రైల్వేకు అప్పగించి ఉంటే ఈపాటికి చాలా పని జరిగి ఉండేది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. » నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని రెండు వరుసలకు విస్తరించే ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించారు. 248 కి.మీ. ఈ మార్గంలో కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పూర్తయింది. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. మిగతా చోట్ల భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. » 2023–24లో బడ్జెట్లో మంజూరు చేసిన ముద్ఖేడ్–డోన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను సవరించి మధ్యలో రూ.550 కోట్లు మంజూరు చేశారు. » 2023–24లో మంజూరు చేసిన భద్రాచలం–డోర్నకల్, మోటమర్రి–విష్ణుపురం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు మొదలయ్యాయి. గత బడ్జెట్లో వీటికి రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. » గత బడ్జెట్లో మంజూరు చేసిన పాండురంగాపురం–మల్కాజిగిరి కొత్త లైన్, ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. -
గాజాలో కండోమ్‌ల పంపిణీకి నో..ట్రంప్ కీలక ఆదేశాలు
వాషింగ్టన్:అమెరికాలో ట్రంప్ యంత్రాంగం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులతో యుద్ధంతో విధ్వంసానికి గురైన గాజాలో కండోమ్‌ల పంపిణీకి ట్రంప్ సర్కారు నిధులు నిలిపివేసింది. గాజాలో కండోమ్‌ల పంపిణీకి గత బైడెన్ సర్కారు ఏకంగా 50 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించడం గమనార్హం. అయితే ప్రభుత్వ ఖర్చులు తగ్గించే క్రమంలో ట్రంప్ గాజాలో కండోమ్‌ల పంపిణీకి బైడెన్ కేటాయించిన నిధుల పంపిణీ నిలిపివేశారని వైట్‌హౌజ్ తెలిపింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డీఓజీఈ కండోమ్‌ల నిధుల వ్యవహారాన్ని గుర్తించిందని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు.అయితే బైడెన్ ప్రభుత్వం నిజంగా కండోమ్‌లకు నిధులకు కేటాయించిందన్నదానికి వైట్‌హౌజ్ ఆధారాలు చూపకపోవకపోవడం చర్చనీయాంశమవుతోంది. బైడెన్ పేషీలో పనిచేసిన ఒక అధికారి ఈ విషయాన్ని కొట్టిపారేయడం గమనార్హం. కండోమ్‌లలో మండే వాయువులను నింపి ఆ బెలూన్లను హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌పై వదిలేవారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఒక ఆసక్తికర పోస్టు చేయడం విశేషం. Explains why all condom orders were “Magnum” 😂 https://t.co/eKKRsfkgjY— Elon Musk (@elonmusk) January 28, 2025 -
స్టార్టప్స్‌కు ఏటా రూ.1.24 లక్షల కోట్ల నిధులు
స్టార్టప్(Startup)లకు ప్రభుత్వం అద్భుత మద్దతు ఇస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఈ సంస్థల సామర్థ్యాలను, విలువను దేశీయ ఇన్వెస్టర్లు గుర్తించారని అన్నారు. తొమ్మిదేళ్లలో భారతీయ స్టార్టప్స్ సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని వెల్లడించారు. ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు వెల్లువెత్తుతున్నాయన్నారు.‘ఏటా సగటున 15 బిలియన్ డాలర్ల(రూ.1.24 లక్షల కోట్లు) నిధులు స్టార్టప్‌ల్లోకి వస్తున్నాయి. గరిష్టంగా ఇది 22–25 బిలియన్ డాలర్లను తాకుతోంది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సిడ్బీ నిర్వహిస్తున్న ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (FFS) వంటి నిధుల సాధనాలు ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడానికి ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి పరివర్తన సాధనంగా పనిచేస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా స్టార్టప్‌లను ఆలోచన నుండి కార్యరూపం దశ వరకు ప్రోత్సహించడానికి పని చేస్తున్నాయి. 2024లో 76 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. జనవరి 15 నాటికి 1,59,157 నమోదిత స్టార్టప్‌లతో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించింది. 2016లో దాదాపు ఈ సంఖ్య 500 మాత్రమే. పరిశ్రమ 17.2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించింది’ అని మంత్రి వివరించారు. కాగా, భారత్ స్టార్టప్ చాలెంజ్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.ఇదీ చదవండి: అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు దేశీయంగా మెషీన్ల తయారీఆటో విడిభాగాల పరిశ్రమలు తయారీ మెషీనరీలను దేశీయంగా తయారు చేసుకోవాలని గోయల్ సూచించారు. ఆటో పరికరాల తయారీలో వినియోగిస్తున్న మెషీన్లను దేశీయంగా రూపొందించుకోవాలని తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. కొన్ని కంపెనీలు విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయని, ఇవి తదుపరి దశలో పోటీ నుంచి తప్పుకోవలసి వస్తుందని పేర్కొ న్నారు. భవిష్యత్‌లో దేశీ ప్రొడక్టులు దిగుమతులకు పోటీగా రూపొందుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని కంపెనీలు ఇప్పటికే దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులపై ఆధారపడుతున్నాయన్నారు. దేశీయంగా అందుబాటు ధరలలో అధిక నాణ్యతగల ప్రెసిషన్ ఇంజినీరింగ్‌తో విడిభాగాలను తయారు చేయగలవని, దీంతో దిగుమతులపై ఆధారపడే సంస్థలకు మనుగడ కష్టంకాగలదని ఆటో విడిభాగాల ఎక్స్పో 2025 సందర్భంగా గోయల్ స్పష్టం చేశారు. -
స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం పెరిగితే..?
ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం (నిర్వహణలోని ఆస్తులు/ఏయూఎం) పెరిగే కొద్దీ దాని పనితీరుపై ప్రభావం పడుతుందా? – ఊర్మిళా సానుస్మాల్క్యాప్ పథకాలు పెద్దగా మారే క్రమంలో.. బలమైన పనితీరు కారణంగా అవి మరింత పెట్టుబడులను ఆకర్షించడం సహజంగానే చూస్తుంటాం. ఈ పరిణామం వినూత్నమైన సవాళ్లను తెచ్చి పెడుతుంది. దీనిపై ఇన్వెస్టర్లలో అవగాహన ఉండాలి. స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.1,000–2,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రూ.100–200 కోట్ల ఏయూఎం నిర్వహించే స్మాల్‌క్యాప్ ఫండ్స్ తమకు ఆకర్షణీయం అనిపించిన కంపెనీల్లో చెప్పుకోతగ్గ మేర ఎక్స్పోజర్ తీసుకుంటాయి. కానీ, వాటి ఏయూఎం సైజు పెరుగుతున్న కొద్దీ అదే మాదిరి పెట్టుబడులు సవాలుగా మారతాయి. ఉదాహరణకు రూ.200 కోట్ల ఏయూఎం నిర్వహించే ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ రూ.1,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీలో ఏకంగా 5 శాతం పెట్టుబడులు పెట్టగలదు. లేదా రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేయగలదు. ఇలా రూ.10 కోట్ల పెట్టుబడితో తన పనితీరుపై, లిక్విడిటీపై పెద్దగా ప్రభావం లేకుండా చూసుకోగలదు. ఒకవేళ స్మాల్‌క్యాప్ ఫండ్ ఏయూఎం రూ.2,000 కోట్లకు పెరిగితే, అప్పుడు ఒక కంపెనీలో 5 శాతం ఎక్స్పోజర్ కోసం రూ.100 కోట్లు కేటాయించాల్సి వస్తుంది. రూ.1,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన చిన్న కంపెనీల్లో రూ.100 కోట్ల పెట్టుబడి అంటే 10 శాతానికి సమానం. అంత చిన్న కంపెనీలో 10 శాతం సమానమైన వాటాలను విక్రయించాల్సి వచ్చినప్పుడు కొనుగోలుదారులను గుర్తించడం కష్టం (లిక్విడిటీ సమస్య) కావచ్చు. ఎందుకంటే స్మాల్‌క్యాప్ కంపెనీలు తక్కువ వ్యాల్యూమ్‌తో ట్రేడ్ అవుతుంటాయి.మితిమీరిన వైవిధ్యం కాబట్టి లిక్విడిటీ సమస్య రాకుండా ఫండ్ మేనేజర్లు మరిన్ని స్టాక్స్‌లో పెట్టుబడులను వైవిధ్యం చేస్తుంటారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. కానీ, మొత్తం మీద రాబడులు ప్రభావితం అవుతాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్ అసాధారణ రాబడుల పనితీరుతో ఇన్వెస్టర్ల నుంచి మరింత భారీగా పెట్టుబడులు వచ్చి పడుతుంటాయి. దీంతో ఆయా పథకాల సైజు మరింత పెరిగే రిస్క్ ఉంటుంది. ఇది భవిష్యత్ పనితీరుపై ప్రభావం చూపించొచ్చు. అదే సమయంలో స్మాల్‌క్యాప్ ఫండ్ పెట్టుబడులు రాబట్టుకోవడంలో విఫలమైతే, కోల్పోయే రిస్క్ కూడా ఉంటుంది. స్మాల్‌క్యాప్ ఫండ్ ఏయూఎం పెరగడాన్ని ప్రతికూలంగా చూడక్కర్లేదు. పెరిగిపోతున్న ఏయూఎం విషయమైన వాటికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల వ్యూహం ఉండొచ్చు. కనుక ఇన్వెస్టర్లు ఫండ్స్ ఏయూఎం కాకుండా, వాటి పనితీరుపై దృష్టి సారించడమే నయం. సిప్ ద్వారా దీర్ఘకాల పెట్టుబడుల్లో 50% నుంచి 60% మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ ఈక్విటీల్లో దీర్ఘకాల పెట్టుబడులకు (సిప్) పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం అనుకూలం. అయితే, 50–60 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25–30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70 శాతం మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. అధిక అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
కూటమి పాలనలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగం’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో యథేచ్ఛగా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగం జరుగుతోందని, గ్రామాల్లో సర్పంచ్ల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం లభిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆక్షేపించారు.ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కూటమి పార్టీ నేతలు తమ సొంత నిర్మాణాలకు వాడుకుంటున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు వేసినట్లు చెప్పారు. కూటమి నేతలకు దమ్ముంటే, ఉపాధి హామీ నిధుల వినియోగంపై చర్చకు రావాలని రవీంద్రారెడ్డి సవాల్ చేశారు.వెన్నపూస రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం తన ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఎంపీపీకి పంపితే, వారు జిల్లా పరిషత్‌కి పంపితే జిల్లా పరిషత్ అధికారులు కలెక్టర్‌కు పంపడం అనేది నిబంధన. కానీ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి అధికార పార్టీ ఎమ్మల్యేలు చెప్పిన వారికే పనులు కేటాయిస్తున్నారు. చివరకు ఉపాధి హమీ పథకంలో పని చేసే దాదాపు 12 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను తెచ్చుకుంటున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రతి పంచాయతీకి రూ.10 వేలు ఇస్తామని ఆర్బాటంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ఒక్క పంచాయతీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కు కూడా రూ.1800 కోట్లు ఇస్తే, అది వారి ఘనత అన్నట్లు సీఎం, డిప్యూటీ సీఎం నిసిగ్గుగా ప్రచారం చేసుకున్నారు. వారికి నిజంగా గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్లో అదనంగా ఒక్క రూపాయైనా తెచ్చారా?ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్ గ్రామాల్లో సర్పంచ్ల తీర్మానం లేకుండా ఎమ్మెల్యేల సిఫార్సులతో ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. అలా స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల విషయంలో తమ వైఖరి ఏమిటో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి గ్రామంలో దాదాపు రూ.2 కోట్ల వరకు వెచ్చించి సచివాయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలా గ్రామాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించి సంపద సృష్టించాం. టీడీపీ కూటమి పాలనలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల దుర్వినియోగంపై మూడు జిల్లాల పరిధిలో జరిగిన పనులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం’’ అని వెన్నపూస రవీంద్రారెడ్డి వివరించారు. -
రాష్ట్ర వాటా విడుదల ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కేంద్రం 75% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. 40% రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు విడుదల చేయలేదు. విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎదురుచూస్తూనే ఉన్నారు. రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు ప్రస్తుతం రూ.450 కోట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.275 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.175 కోట్లు ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో గత ఆర్థిక సంవత్సర నిధులు విడుదలలో జాప్యం జరిగింది. అయితే నెలన్నర క్రితం అప్పటి నిధులను క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేసిన వెంటనే ఈ నిధిని వినియోగించాలనే నిబంధన విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో వినియోగించుకోకుంటే వాటిని కేంద్రం వెనక్కు తీసుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో తాజా దరఖాస్తుల ప్రక్రియ మరోవైపు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 31తోనే ఈ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందలేదు. దీంతో గడువు పొడిగింపు కోసం సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. -
ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీ
ప్యాసివ్ ఫండ్స్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ మ్యూచువల్ ఫండ్స్ లైట్ (ఎంఎఫ్ లైట్) నిబంధనల కార్యాచరణను ప్రకటించింది. ప్యాసివ్ ఫండ్స్ విభాగంలో కొత్త సంస్థల ప్రవేశాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల వైవిధ్యాన్ని విస్తృతం చేయడమనే లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు), ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) సహా ప్యాసివ్ పథకాలకు ఈ కార్యాచరణ అమలవుతుందని సెబీ తెలిపింది.ప్యాసివ్ ఫండ్స్‌ను మాత్రమే నిర్వహించే సంస్థలకు అవరోధాలను తొలగించడం, మార్కెట్లో లిక్విడిటీని పెంచడం, కొత్త సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం ఇందులో లక్ష్యాలని పేర్కొంది. ఎంఎఫ్ లైట్ నిబంధనలు 2025 మార్చి 16 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ సైతం ఎంఎఫ్ లైట్ సంస్థలకు మద్దతుగా (స్పాన్సర్) నిలవొచ్చని ప్రకటించింది. కాకపోతే కీలక స్థానాల్లోని ఉద్యోగులకు 20 ఏళ్ల అనుభవాన్ని అర్హతగా ఖరారు చేసింది. స్పానర్లకు సంబంధించి భిన్నమైన అర్హత ప్రమాణాలను నిర్ణయించింది. ఎంఎఫ్ లైట్ కార్యాచరణ తొలుత దేశీ ఈక్విటీ సూచీల ఆధారిత ప్యాసివ్ ఫండ్స్‌కు వర్తిస్తుందని తెలిపింది. యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అందించే ప్రస్తుత సంస్థలు సైతం నూతన కార్యాచరణ కింద తమ ప్యాసివ్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను వేరొక సంస్థ కింద నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?ఏమిటీ ఫ్యాసివ్ ఫండ్స్?నిఫ్టీ 50 లేదా ఎస్ అండ్ పీ 500 వంటి ఒక నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ పనితీరును ప్రతిబింబించడానికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలే ప్యాసివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్ల(ప్రత్యేకంగా ఫండ్ మేనేజర్ ఉండే మ్యుచువల్ ఫండ్స్) మాదిరిగా కాకుండా, ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్ ఇండెక్స్‌ను అనుసరిస్తాయి. వీటికి ఎక్కువగా నిర్వహణ ఖర్చులు అవసరం లేదు. కాబట్టి కొంత యాక్టివ్ ఫండ్లతో పోలిస్తే రాబడులు మారవచ్చు. ఇది ఇండెక్స్‌ను అనుసరిస్తూ ఆయా విభాగాల్లోని మెరుగైన స్టాక్లను కలిగి ఉంటాయి. దాంతో డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. నష్టభయం తక్కువగా ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. -
కొత్త సంవత్సరంలో ఎవరు ఏం చేయాలో తెలుసా..
ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. పాత రోజుల్లాగే ఈ ఏడాదీ గడిచిపోతే కిక్కేముంటుంది. వైవిధ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఆర్థికంగా ఈ ఏడాదిలో మరింత రాణిస్తూ, పెట్టుబడులను కాపాడుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే కొందరు వయసురీత్యా రిస్క్ చేయలేకపోవచ్చు. ఏ వయసువారు ఎలాంటి పెట్టుబడి పంథాను ఎంచుకోవాలో..తమ ఇన్వెస్ట్మెంట్ ఎలా కాపాడుకోవాలో ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.20-30 ఏళ్ల వయసువారు..ఈ వయసువారు కాస్త దూకుడుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వీరు తమ పెట్టుబడుల్లో సుమారు 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత సురక్షితంగా ఉండాలంటే 70 శాతం వరకు చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని నష్టం తక్కువగా ఉంటే లిక్విడ్, డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మూడేళ్లలోపు నగదు అవసరం ఉందని భావిస్తే ఈ పథకాల్లో నుంచి డబ్బు తీసుకునే వీలుంటుంది. ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.30-40 ఏళ్ల గ్రూప్ వారు..వీరికి స్థిరంగా ఆదాయం ఉంటుంది. ఈ వయసులోవారు ఇల్లు కొనడం, పిల్లల చదువులు, కుటుంబ పెద్దల ఆరోగ్య ఖర్చులు, పెళ్లిళ్లు, బంధువుల ఇంటికి వెళ్లడం.. వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. దాంతోపాటు ప్రధానంగా పదవీ విరమణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి, రిస్క్‌తో కూడిన ఈక్విటీ పెట్టుబడులను కొంత తగ్గించుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో గరిష్ఠంగా 70 శాతం వరకే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతాది సురక్షితంగా ఉండే వివిధ మార్గాల్లో మదుపు చేయాలి.40-50 ఏళ్లవారు..ఈ వయసులో రిస్క్ తీసుకోవడం సరికాదు. ఇది ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను తగ్గించుకుని స్థిరాదాయం ఇచ్చే డెట్ పథకాల్లోకి పెట్టుబడిని మళ్లించాలి. మొత్తం మదుపులో ఈక్విటీ పెట్టుబడులు 60 శాతం మించకుండా జాగ్రత్తపడాలి.ఇదీ చదవండి: మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?50 దాటిన వారు..ఈ వయసులో అసలు రిస్క్ తీసుకోకూడదు. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితానికి ఏర్పాట్లు చేసుకోవాలి. పదవీ విరమణ మరో మూడేళ్లు ఉందనుకున్నప్పుడే క్రమంగా మీ ఈక్విటీ పెట్టుబడులను స్థిర ఆదాయం వచ్చే డెట్ ఫండ్స్‌లోకి మళ్లించాలి. లేదంటే ఏదైనా అనిశ్చితులు ఏర్పడి మార్కెట్ పడిపోయినా, కొంత కాలంపాటు ఎలాంటి పెరుగుదల లేకుండా కదలాడినా భారీగానే నష్టపోవాల్సి ఉంటుంది. పదవీవిరమణ తర్వాత ఆదాయం ఉండదు కాబట్టి డబ్బును కాపాడుకోవడం ఉత్తమం. -
బీఆర్ఎస్కు విరాళాల వెల్లువ.. అగ్రస్థానంలో బీజేపీ
ఢిల్లీ : గడిచిన ఎన్నికల్లో స్థానిక పార్టీల్లో బీఆర్ఎస్కు ఊహించని విధంగా విరాళాలు అందాయి. విరాళాలు పొందే విషయంలో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా..రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్సైట్లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? అందులో వివరించింది. ఈసీ నివేదిక ప్రకారం.. 2023-24లో దాతలు బీజేపీకి రూ. 20,000 అంత కంటే ఎక్కువ మొత్తం దాదాపు రూ.2,244 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం 2022-23లో అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. బీఆర్ఎస్ రూ.580 కోట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్ రూ.289 కోట్లతో మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు అంతకుముందు సంవత్సరం రూ.20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో రూ.79.9 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం కాంగ్రెస్ కంటే బీజేపీకి అందిన విరాళాలు 776.82 శాతం ఎక్కువ.ట్రస్ట్ (Satya Electoral Trust)లు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ అత్యధిక విరాళాలు అందించాయని భారత ఎన్నికల సంఘం (eci) డేటా చెబుతోంది. అందులో బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్ రూ. 156 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళంగా వచ్చాయి. ఇతర పార్టీలలో, ఆమ్ ఆద్మీ 2023-24లో రూ. 11.1 కోట్ల విలువైన విరాళాలు పొందింది. అంతకు ముందు ఏడాది ఆప్ రూ.37.1 కోట్లు అందుకుంది. 2023-24లో సీపీఎం విరాళాలు రూ. 6.1 కోట్ల నుండి రూ. 7.6 కోట్లను పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈసీ ఆయా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది. -
ట్రంప్ హుకుం.. మూత పడనున్న అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్‌లు కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ సంస్థల నిర్వహణ కోసం తాత్కాలికంగా నిధులు కేటాయించే స్టాప్‌గ్యాప్ ఫండింగ్‌ను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లును వ్యతిరేకించాలని యూఎస్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ పార్టీ సెనేటర్లకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లుకు ఆమోదం లభిస్తే.. ప్రభుత్వ సంస్థల నిర్వహణకు నిధుల కేటాయించడం అసాధ్యం. నిధులు లేకపోతే ప్రభుత్వ సంస్థలు తాత్కాలికంగా మూతపడతాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ట్రంప్ పాలక వర్గం కసరత్తు చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.ఈ లోపు స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును నిలిపివేస్తే నిధులు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోన్నాయి. ఆ ప్రభావం క్రిస్మస్తో పాటు ఇతర ప్రజా సేవలపై ప్రభావం పడనుంది. దీంతో పాటు పలు ప్రభుత్వ సంస్థలు తాత్కాలికంగా మూతపడే అవకాశం ఉంది. విమానయానం,పాస్‌పోర్ట్ సేవలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ట్రాన్స్‌ఫోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో స్క్రీనర్లు పనిచేయవు. ఫలితంగా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికులు ఎదురు చూపులు తప్పవు. ప్రభుత్వ షట్‌డౌన్ సమయంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుంది. వారందరూ విధులు ఆపేసి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. నిధులు పునరుద్ధరించబడిన తర్వాత వారికి జీత భత్యాల చెల్లింపులు జరగనున్నాయి. సిబ్బందిని తగ్గించడం వల్ల విమానాలు ఆలస్యం, రద్దు కావచ్చు. కస్టమ్స్, సరిహద్దు రక్షణ వంటి ఇతర విమానాశ్రయ సేవలు కూడా ప్రభావితం కావచ్చు. రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రయాణ ఛార్జీలు పెరుగుతాయి. దీంతో పాటు ప్రభుత్వ సేవలు అందించే అన్నీ రంగాలపై దెబ్బ పడనుంది. -
ఎడతెగని ఎదురుచూపు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన సంగీత గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలో దరఖాస్తు చేయగా.. 2023 ఆగస్టులో ఆమెకు అడ్మిషన్ లభించింది. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు పరిశీలన పూర్తి చేసుకుని పీజీ కోర్సులో చేరిపోయింది. స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పు చేసి అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెస్ మొదటి సంవత్సరం పూర్తయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో రెండో సంవత్సరం కూడా పూర్తవుతుంది. కానీ విద్యానిధి పథకానికి ఆమె అర్హత సాధించిందా? లేదా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సంగీత తండ్రి మాసాబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించగా.. అర్హుల జాబితా ఇంకా సిద్ధంకాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనకు అధికారుల నుంచి ఇదే సమాధానం వస్తోంది. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు.. దాదాపు ఆరువేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదురు చూపులివి.సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతి బా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హుల ఎంపిక ఏడా దిన్నరగా నిలిచిపోయింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణే తప్ప అర్హులను తేల్చటంలేదు. దీంతో ఈ స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకొన్న చాలామంది విద్యార్థులు ఇప్పటికే సగం కోర్సు కూడా పూర్తిచేశారు. కానీ తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు సీజన్లలో వచ్చిన దరఖాస్తుల విషయం ఎటూ తేల్చకుండానే.. ఇప్పుడు మరోమారు దరఖాస్తుల స్వీకరణ సైతం చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ నాన్చుడు ధోరణి వల్ల దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కూడా ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకాన్ని అందిస్తున్నాయి. ఆ శాఖలు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి స్కాలర్షిప్లు అందిస్తుండగా, బీసీ సంక్షేమ శాఖలో మాత్రం ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నది.డిమాండ్ ఎక్కువ.. కోటా తక్కువపూలే విదేశీ విద్యానిధి పథకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర శాఖలతో పోలిస్తే బీసీ సంక్షేమ శాఖలో వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద ఏటా రెండు దఫాలుగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్ అని ఏటా రెండుసార్లు ఉంటుంది. సెప్టెంబర్ వరకు మొదటి దఫా, జనవరిలో రెండో దఫా దరఖాస్తులను సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత... విద్యార్థుల డిగ్రీ మార్కులతోపాటు జీఆర్ఈ/జీమ్యాట్‌లో మార్కులు, ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు శాఖలవారీగా ప్రత్యేక కమిటీలుంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో పోటీ తక్కువగా ఉండడంతో అర్హుల ఎంపిక ఆలస్యం లేకుండా సాగిపోతున్నది. బీసీ సంక్షేమ శాఖలోవిపరీతమైన పోటీ ఉండడంతో ఉప కులాలవారీగా కోటాను విభజిస్తూ అర్హులను ఎంపిక చేస్తున్నారు. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేస్తారు. ఏటా (రెండు సీజన్లు కలిపి) 300 మందికి స్కాలర్షిప్లు ఇస్తారు. ఒక్కో సీజన్‌కు సగటున 3 వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన గత రెండు సీజన్లలో 6 వేలకు పైబడి దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. కోటా పెంపు కోసమేనట!పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రస్తుతం 300 యూనిట్లుగా ఉన్న కోటాను కనీసం వెయ్యికి పెంచాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పలు సమీక్షలు నిర్వహించిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కోటా పెంపు ప్రతిపాదనలు పంపింది. ఏటా కనీసం 800 మంది విద్యార్థులకైనా ఈ పథకం కింద స్కాలర్íÙప్లు ఇవ్వాలని సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైలు సీఎం వద్దకు చేరి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు. కోటా పెంపు తర్వాతే అర్హుల ఎంపిక చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి ప్రస్తుత పరిస్థితి2023–24 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు 6 వేలకుపైగా ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్షిప్ రూ.20 లక్షలు సంవత్సరానికి ఇచ్చే మొత్తం స్కాలర్íÙప్లు 300 -
రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?
చాలామంది ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ఆఫీసులో తాము ఎదుర్కుంటున్న పని ఒత్తిడి, బాస్ టార్చర్ వంటి సమస్యలను గురించి పేర్కొంటూ ఉంటారు. వీటన్నింటికీ భిన్నంగా ఒక ఉద్యోగి ఆఫీసులో సృష్టించిన అల్లకల్లోలం గురించి.. కంపెనీ ఓనర్ వెల్లడించారు.ఇటీవల ఉద్యోగంలో చేరిన లిలీ అనే 26ఏళ్ల ఉద్యోగి.. ప్రారంభంలో చాలా చురుగ్గా ఉండేది. అయితే కొన్ని సార్లు ఆఫీసులో పాటించాల్సిన నియమాలను పాటించేది కాదు. అయితే ఓ పనిమీద నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో లిలీ ఆఫీసులోని అందరికీ పార్టీ ఇచ్చింది. దీనికోసం కంపెనీ క్రెడిట్ కార్డును ఉపయోగించి 2000 డాలర్లు (దాదాపు రూ. 1.70 లక్షలు) ఖర్చు చేసింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను, అందుకే అందరికీ ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాను, అందరూ తప్పకుండా రావాలని లిలీ మెయిల్ చేసి.. అందరికీ పార్టీ ఇచ్చిందని ఆ కంపెనీ మహిళా ఓనర్ రెడ్డిట్ వేదికగా వెల్లడించింది.ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని పార్టీ ఇచ్చిన లిలీ.. జాబ్‌కు రిజైన్ చేయలేదు. నేను విదేశాల నుంచి తిరిగి వచ్చాక.. ఆఫీసులో జరిగిన అల్లకల్లోలం గురించి తెలుసుకున్నాను. దీనికి కారణమైన లిలీని పిలిచి.. ఆఫీసులో పార్టీ ఏంటి? దీనికి కంపెనీ డబ్బును ఎందుకు ఉపయోగించావని అడిగాను. దీనికి ఆమె బదులిస్తూ ఇదొక 'సోషల్ ఎక్స్పర్మెంట్' అని చెప్పింది.ఆఫీసులో ఎక్స్పర్మెంట్ ఏమిటి? అని అడిగితే.. నేను రాజీనామా చేసి వెళ్లే సమయంలో పార్టీ ఇస్తే ఎంతమంది వస్తారో అని తెలుసుకోవడానికి అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలతో చిర్రెత్తిపోయిన బాస్.. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించేసింది.నేను లిలీను తొలగించడం కరెక్టేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లను అడిగింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. లిలీపై దొంగతనం, చీటింగ్ కేసు పెట్టమని కొందరు చెబుతున్నారు. ఆమె నమ్మక ద్రోహం చేసిందని మరికొందరు పేర్కొన్నారు. కంపెనీ డబ్బుతో లిలీ ఎంజాయ్ చేసింది.. మీరు కాబట్టి ఉద్యోగంలో నుంచి తొలగించారు. మరో కంపెనీలో అయితే ఆమెపై కఠినమైన చర్యలు తీసుకుని ఉండేవారని ఇంకొందరు పేర్కొన్నారు. -
పంచాయతీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లలో.. గత ఐదేళ్లలో భారీ వృద్ధి
రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు, రుణాల రూపంలో ఇచ్చే నిధులు 2017–18తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరానికి గణనీయంగా పెరిగినట్టు కాగ్ వెల్లడించింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థానిక సంస్థల నిధుల వినియోగంపై కాగ్ నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2017–18లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రూ.151.67 కోట్లు విడుదల చేయగా, 2021–22లో రూ.281.12 కోట్లు ఇచ్చినట్టు కాగ్ తెలిపింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు మొత్తం 2017–18లో రూ.1,922.05 కోట్లు అందగా.. 2021–22లో రూ.3,666.30 కోట్లు అందినట్లు పేర్కొంది. – సాక్షి, అమరావతి 14, 15 ఆర్థిక సంఘాల నిధులకు ఎప్పటికప్పుడు యూసీలు ఆర్థికసంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) అందజేసిందని కాగ్ పేర్కొంది. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు కేంద్రం 2023 సెప్టెంబర్ నాటికి వివిధ సంవత్సరాల్లో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిన 8,124.42 కోట్లు, 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు విడుదల చేసిన రూ.3,594.51 కోట్లకు వినియోగ ధ్రువపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చినట్లు కాగ్ వివరించింది. 2017–22 మధ్య ఆర్జీఎస్ఏ ద్వారా విడుదల చేసిన రూ.190.27 కోట్లకు కేంద్రానికి యూసీలను సమర్పించారని తెలిపింది. 2016–22 మధ్య రుర్బన్ పథకం కోసం కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన రూ.187 కోట్లలో రూ.45.71 కోట్లకు యూసీలను 2023 సెప్టెంబర్ నాటికి కేంద్రానికి ఇంకా సమర్పించాల్సి ఉందని పేర్కొంది. సామాజిక తనిఖీల్లో ఉల్లంఘనల గుర్తింపు 2021–22లో గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పథకం ద్వారా జరిగిన రూ.వేలకోట్ల పనులకు సంబంధించి నిర్వహించిన సామాజిక కనిఖీల్లో రూ.232.99 కోట్ల విలువైన పనుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు మండలస్థాయి తనిఖీ బహిరంగ సమావేశాల్లో నిర్ధారించినట్లు తెలిపింది. అందులో రూ.89.35 కోట్ల విలువైన పనుల్లో (38.35 శాతం) ఆర్థిక దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలను అధికారులు ఆమోదించారని పేర్కొంది. ఆ ఆమోదం చేసిన మేర మొత్తం 2023 ఆగస్టు నాటికి సంబంధీకుల నుంచి వసూలు కాలేదని కాగ్ తెలిపింది. -
వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లపై జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికార వర్చువల్ ట్రేడింగ్ లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కేవలం రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీల (మధ్యవర్తిత్వ సంస్థలు) ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సూచించింది. యాప్‌లు/వెబ్ అప్లికేషన్లు/ప్లాట్‌ఫామ్‌లపై లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరల ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ లేదా ఫాంటసీ గేమ్‌లు ఆఫర్ చేస్తున్నట్టు సెబీ దృష్టికి వచ్చింది.ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీస్ చాంట్రాక్ట్ (రెగ్యులేషన్స్) చట్టం, 1956, సెబీ చట్టం 1992కు విరుద్ధమని, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాలను తీసుకొచ్చినట్టు సెబీ తెలిపింది. రిజిస్టర్డ్ సంస్థల ద్వారానే పెట్టుబడులు, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది. ‘‘అనధికారిక పథకాల్లో పాల్గొనడం, వ్యక్తిగత కీలక సమాచారాన్ని పంచుకోవడం ఇన్వెస్టర్ల సొంత రిస్క్, పైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలకు ఇన్వెస్టర్లే బాధ్యులు. ఎందుకంటే ఆయా సంస్థలు సెబీ వద్ద నమోదైనవి కావు. కనుక ఆయా సంస్థలతో నిర్వహించే లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్టర్లకు పెట్టుబడిదారుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కార విభాగం తదితర సెబీ యంత్రాంగాలు అందుబాటులో ఉండవు’’ అని స్పష్టం చేసింది.విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విషయంలో సెబీ కొంత ఉపశమనాన్ని కల్పించనుంది. భారత సెక్యూరిటీల్లో విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టిన మేరకు.. ఆయా విదేశీ పథకాల్లో భారత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ తాజాగా ప్రకటించింది. అయితే ఆయా విదేశీ ఫండ్స్ భారత పెట్టుబడులు వాటి నిర్వహణ ఆస్తుల్లో 25 శాతానికి మించకూడదని పేర్కొంది.మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు సెబీ తాజా నిర్ణయం వీలు కల్పించనుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. ఫండ్స్ పెట్టుబడుల విలువ సెబీ పరిమితులను మించితే నిబంధనలకు అనుగుణంగా తగ్గించుకునేందుకు ఆరు నెలల వ్యవధి ఉంటుంది. -
అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?
ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్రావుఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్‌తో వస్తాయి. ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు.లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపికఅత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్‌సైడ్ రిస్క్ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నంఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్‌సైడ్ (నష్టం) రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్పోజర్ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్‌సైడ్ రిస్క్ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిధుల మళ్లింపు నిజమే... నిర్ధారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
-
‘సెట్’ చేసేశారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం నిర్వహించిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) నిధులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. వీసీలు మారడంతో సెట్ కన్వీనర్లపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులొస్తున్నాయి. ‘సెట్’కు కేటాయించిన నిధులు కన్వినర్లు, ఆయా యూనివర్సిటీ వీసీలు అడ్డగోలు లెక్కలతో కాజేశారని పెద్దఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ వ్యవహారం ఇప్పటికే తీవ్ర వివాదంగా మారింది. జేఎన్టీయూహెచ్ నేతృత్వంలో సాగిన ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై మండలి చైర్మన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవాలు తెలియజేయాలని కొత్త వీసీలను కోరారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపాలని చైర్మన్ భావిస్తున్నట్టు తెలిసింది. అసలేం జరిగింది? రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏటా ఈఏపీ, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పాలిసెట్, పీజీసెట్ నిర్వహిస్తారు. వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెట్ నిర్వహణను ఒక్కో వర్సిటీకి అప్పగిస్తారు. ప్రతీ సెట్‌కు ఒక కన్వీనర్, కొంతమంది సభ్యులను ఎంపిక చేస్తారు. అతిపెద్ద సెట్ అయిన ఈఏపీ సెట్‌ను సాధారణంగా జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది. మరికొన్ని కీలకమైన సెట్స్‌ను ఉస్మానియా వర్సిటీకి అప్పగిస్తారు. ఐసెట్‌ను కొన్నేళ్లుగా కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. సెట్ రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత విద్యామండలి కాన్ఫిడెన్షియల్ నిధులు ఇస్తుంది. సెట్ ప్రశ్నపత్రం కూర్పు, ప్రింటింగ్, రవాణా, నిర్వహణకు వీటిని ఉపయోగిస్తారు. ఈ వ్యవహారం మొత్తం రహస్యంగా ఉంటుంది. కాబట్టి ఏ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నారనేది ముందే చెప్పరు. పరీక్ష పూర్తయిన తర్వాత బిల్లులు పెట్టడం, ఆడిట్ నిర్వహించి, వాటిని ఉన్నత విద్యా మండలి అనుమతించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధం లేని వ్యక్తులు, ఊహించని విధంగా కంప్యూటర్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లు చేపట్టినట్టు బిల్లులు ఉండటంతో కొత్త వీసీలు సందేహాలు లేవనెత్తుతున్నారు. ఐసెట్ నిధులు గందరగోళం కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ నిధుల లెక్కలపై ప్రస్తుత వీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్టు సమాచారం. దీనిపై అందిన ఫిర్యాదులను మండలి చైర్మన్‌కు పంపినట్టు తెలిసింది. ఐసెట్ నిర్వహణ కోసం ఈ వర్సిటీ రూ.99.50 లక్షలు ప్రతిపాదించగా, మండలి రూ. 92.76 లక్షలు మంజూరైంది. ఈ నిధులను కన్వినర్ ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకూ ఖర్చు చేసినట్టు గుర్తించారు. దాదాపు రూ.16 లక్షలు సెల్ఫ్ చెక్కుల ద్వారానే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని మండలి వర్గాలు సందేహిస్తున్నాయి. సంబంధమే లేని ఓ వ్యక్తికి రూ.2 లక్షలు ఇవ్వడం, అవసరం లేని రవాణాకు రూ. 40 వేలు వెచ్చించడం, కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చిన్న ఉద్యోగి ఖాతాలో నగదు జమవ్వడం, ఏ సంబంధం లేని మహిళకు రూ.82 వేలు వెళ్లడం, సరైన ప్రమాణాలు లేకున్నా రూ.87 వేల చొప్పున 6 కంప్యూటర్లు కొనడం అనుమానాలకు తావిస్తోంది.ఇందులో రూ.29 లక్షల వరకూ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈఏపీసెట్ నిర్వహణ నిధుల విషయంలోనూ పలు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో మండలి వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు రూ.3 కోట్లు వెచ్చించారు. పరిశీలిస్తున్నాంకాకతీయ నిర్వహించిన ఐసెట్పై ఆరోపణలు వచ్చిన మాట నిజమే. ఇందులో వాస్తవాలు ఏమిటనేది పరిశీలిస్తున్నాం. ఇతర సెట్ల విషయంలోనూ ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఏం జరిగిందనేది వెల్లడిస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
అదానీకి కొత్త ఊపు.. రూ.4200 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) ఇష్యూ ద్వారా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,200 కోట్లు) సమీకరించినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. కార్యకలాపాల విస్తరణ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. క్విప్ ఇష్యూకి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, దేశీ మ్యుచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి 4.2 రెట్లు బిడ్లు వచ్చినట్లు సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: సగానికి పడిపోయిన టాటా కంపెనీ లాభంఅదానీ ఎంటర్ప్రైజెస్ గతేడాది జనవరిలోనే రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ప్రకటించినప్పటికీ, సరిగ్గా అదే సమయంలో గ్రూప్ కార్యకలాపాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదల చేయడం ప్రతికూల పరిణామాలకు దారి తీసింది. ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ, కంపెనీ దాన్ని రద్దు చేసుకుని, ఇన్వెస్టర్లకు సొమ్ము వాపసు చేసింది. -
అడిగింది రూ.10,320 కోట్లు.. ఇచ్చింది 416 కోట్లే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల రూ. 10,320.72 కోట్ల భారీ నష్టం జరగ్గా కేంద్రం మాత్రం జాతీయ విపత్తుల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేవలం రూ. 416.8 కోట్ల అత్తెసరు నిధులనే విడుదల చేసింది. కేంద్రం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో భీకర వరదలు ఎన్నడూ రాలేదని, తగిన రీతిలో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం నామమాత్రంగా నిధుల కేటాయింపులు జరిపిందని విమర్శిస్తున్నాయి. ఇటీవల వరదల బారిన పడిన 14 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్)లో కేంద్రం వాటా కింద మొత్తం రూ. 5,858.6 కోట్లను ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర హోంశాఖ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, అస్సాం, బిహార్, గుజరాత్‌కు అధిక నిధులు అందించింది. విపక్షాల పాలనలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.5,858.60 కోట్లు వరద సాయం నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది.అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. Ministry of Home Affairs releases ₹ 5858.60 crore to 14 flood-affected as a central share from the State Disaster Response Fund (SDRF) and an advance from the National Disaster Response Fund (NDRF)Government stands shoulder to shoulder with the states affected by natural…— PIB India (@PIB_India) October 1, 2024 -
ఫండ్స్ కంటే పీఎంఎస్ నయమా?
మ్యూచువల్ ఫండ్స్‌లో నాకున్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసేసుకుని, తమ పీఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలని ఓ ఫిన్‌టెక్ యాప్ అడుగుతోంది. నేను రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నాను. కనుక పీఎంఎస్ సేవలు వినియోగించుకోవడం సరైనదేనా? – విష్ణు నివాస్పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా పోర్ట్‌ఫోలియో రక్షణ బాధ్యతలను ఫండ్ మేనేజర్ తీసుకుంటారు. పీఎంఎస్ అయితే ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణమైన సేవలను అందించగలదు. కాకపోతే పీఎంఎస్లో పెట్టుబడులకు కనీసం రూ.50 లక్షలు ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో కొనసాగడం వల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే, ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియో పరంగా ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వీటిపై ఇన్వెస్టర్ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కేవలం పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే పీఎంఎస్ అనుకోండి.. మీ డీమ్యాట్ ఖాతా నుంచే స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహిస్తుంది. కనుక లావాదేవీల చార్జీలు, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అధిక వ్యయాలకు, పన్నులకు దారితీస్తుంది. ఫలితంగా రాబడులపై ప్రభావం పడుతుంది. ఏ పెట్టుబడి సాధనం అయినా పారదర్శకత కీలకం.మ్యూచువల్ ఫండ్స్ రోజువారీ యూనిట్ ఎన్ఏవీలను ప్రకటించాల్సిందే. నెలవారీగా తమ పోర్ట్‌ఫోలియో వివరాలను సైతం వెల్లడించాలి. దీంతో తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పెట్టుబడుల విధానం, పనితీరు ఇన్వెస్టర్లకు స్పష్టంగా తెలిసిపోతుంది. పీఎంఎస్ ఖాతాల్లో ఇదే స్థాయి పారదర్శకత ఉండదు.నాకు గడిచిన మూడేళ్లలో ఈక్విటీ పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చాయి. కనుక ఇప్పుడు వీటిని విక్రయించి, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అద్వైత్మీ నిధుల అవసరాలపైనే పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించడం ఆధారపడి ఉంటుంది. సమీప కాలంలో (6–12 నెలలు) మీకు డబ్బులతో పని ఉంటే, ఈక్విటీ ఫండ్స్ నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే, మీ ఆర్థిక లక్ష్యానికి చేరువ అయినప్పుడు కూడా ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి తీసుకుని, డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ పథకం పోటీ పథకాలతో వరుసగా మూడేళ్ల పాటు రాబడుల విషయంలో వెనుకబడి ఉంటే, అప్పుడు కూడా ఆ పథకం నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఏడాది, రెండేళ్ల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయానికి రావద్దు. మరో ఐదేళ్ల వరకు మీకు నిధుల అవసరం లేకపోతే ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించడమే సరైనది. ఎందుకంటే ఇప్పుడే వాటిని వెనక్కి తీసుకుంటే మిగిలిన ఐదేళ్ల కాలంలో మరింత రాబడులు పొందే అవకాశం కోల్పోతారు. అస్సెట్ అలోకేషన్ (డెట్–ఈక్విటీ తదితర సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక)కు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో క్రమానుగతంగా మార్పులు చేసుకోవడంపై దృష్టి సారించండి.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీఎన్బీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 103.75 ధరలో 48.19 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఫ్లోర్ ధర రూ. 109.16తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్‌గా పీఎన్బీ పేర్కొంది. ఈ నెల 23–26 మధ్య క్విప్ సబ్ర్స్కిప్షన్ పూర్తయినట్లు వెల్లడించింది.మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, బీమా కంపెనీలు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి రూ. 41,734 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. ఇవి క్విప్ ప్రాథమిక పరిమాణం రూ. 2,500 కోట్లకు 16.7 రెట్లు అధికంకాగా.. మొత్తం సమీకరణ పరిమాణం రూ. 5,000 కోట్లకు 8.3 రెట్లు అధికమని వివరించింది. క్విప్ నిధులను బ్యాంక్ సీఈటీ–1 నిష్పత్తి మెరుగుకు, కనీస మూలధన నిష్పత్తి పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. -
రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు, నమ్రత.
-
టర్మ్ డిపాజిట్లకే ఆదరణ
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ డిపాజిట్లకు బదులు, అధిక రాబడినిచ్చే టర్మ్ డిపాజిట్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంకులకు నిధులపై వ్యయాలు పెరిగిపోయి, వాటి నికర వడ్డీ మార్జిన్లకు చిల్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఐదు ప్రముఖ బ్యాంక్‌ల్లో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.7–3 శాతం మధ్య ఉండగా, ఏడాది కాల టర్మ్ డిపాజిట్లపై అవే బ్యాంకులు 7.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే టర్మ్ డిపాజిట్ల రూపంలో 18.64 శాతం అధికంగా రూ.116 లక్షల కోట్లను సమీకరించాయి. అదే కాలంలో బ్యాంకుల సేవింగ్స్ డిపాజిట్లు కేవలం 6 శాతం పెరిగి రూ.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 13.5 శాతంగా ఉంటే, సేవింగ్స్ డిపాజిట్లలో పరుగుదల 4.9 శాతంగానే ఉండడం గమనార్హం. 2021–22లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 9.6 శాతంగానే ఉంది. అదే ఏడాది సేవింగ్స్ డిపాజిట్లు ఇంతకంటే అధికంగా 12.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 13.5 శాతం వృద్ధి చెందాయి. అంతకుముందు వరుస ఆర్థిక సంవత్సరాల్లో ఈ వృద్ధి వరుసగా 9.6 శాతం, 8.9 శాతం చొప్పున ఉంది.అధిక రాబడుల కోసమే..పొదుపు నుంచి టర్మ్ డిపాజిట్లకు పెట్టుబడుల మరళింపు స్పష్టంగా కనిపిస్తున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో టర్మ్ డిపాజిట్లలోకి పొదుపు నిధులు మళ్లించుకోవడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ (డిపాజిట్లలో 22.6 శాతం వాటా) ఎస్బీఐ డిపాజిట్ బేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.13 శాతం వృద్ధితో రూ.49.16 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘2023–24లో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టర్మ్ డిపాజిట్లు 16.38 శాతం మేర వృద్ధి చెంది రూ.27.82 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు (కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు) 4.25 శాతం పెరిగి రూ.19.42 లక్షల కోట్లకు చేరాయి’’అని ఎస్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నుంచి డిపాజిట్లు కేవలం టర్మ్ డిపాజిట్లలోకే కాకుండా, ఇంకా మెరుగైన రాబడులు వచ్చే ఈక్విటీలు, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లోకి వెళుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకు రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి క్షీణించడం పట్ల ఆర్బీఐ సైతం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. డిపాజిట్లు ఆకర్షించేందుకు బ్యాంకులు వినూత్నమైన మార్గాలను అన్వేíÙంచాలని సైతం ఆర్బీఐ సూచించింది. ‘‘బ్యాంక్‌లు డిపాజిటర్లను ఆకర్షించేందుకు మెరుగైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలు సైతం మారాల్సిందే. కేవలం డిపాజిట్ల స్వీకరణకే పరిమితం కాకుండా, సంపద నిర్వహణ సేవలు, క్లయింట్లతో పూర్తి సంబంధాల దిశగా వ్యవహరించాల్సిందే’’అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొనడం గమనార్హం. -
‘ఉపాధి’ పనుల కోసం కూటమి నేతల సిగపట్లు
మేడిపల్లి కోటిరెడ్డి, సాక్షి ప్రతినిధి సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కేటగిరి నిధులతో చేపట్టే సిమెంట్ (సీసీ)రోడ్లు, సిమెంట్ మురుగు కాల్వల(సీసీ డ్రెయిన్లు)తో పాటు మట్టి, తారు రోడ్ల పనుల కోసం కూటమి నేతలు సిగపట్లు పట్టుకుంటున్నారు. ఏ పనులు ఏ పార్టీ నేతలకు చేపట్టాలి అనే విషయంలో ఆధిపత్య పోరాటం కొనసాగుతోంది. దీంతో 20 రోజులుగా ఎటూ తేలక అనుమతుల కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిధులు పదుల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే.. గ్రామాల నుంచి అందిన ప్రతిపాదనలు వందల కోట్ల రూపాయల మేర ఉండటంతో ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో పనుల మంజూరులో మూడు పారీ్టల నాయకులను ఎలా సంతృప్తి పరచాలో తెలియక ఎమ్మెల్యేలు పనుల జాబితాలను ఆమోదం కోసం పంపకుండా కాలయాపన చేస్తున్నారు. ఇక బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలున్న చోట కూడా పనులన్నీ తమకే కావాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఉపాధి పథకంలో కాంట్రాక్టర్లే ఉండరు సాధారణంగా ఉపాధి హామీ నిధులతో చేపట్టే పనులకు, ఇతర అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియకు తేడా ఉంటుంది. కేంద్రం నిబంధన ప్రకారం.. ‘ఉపాధి’ నిధులతో మంజూరు చేస్తే, రోడ్ల పనులైనా కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండదు. సర్పంచ్ల ఆధ్వర్యంలో పంచాయతీ ద్వారా నిధులు చెల్లిస్తూ ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది. దీనికి తోడు జిల్లా ప్రాతిపదికన ఆర్థిక సంవత్సరంలో ఆయా జిల్లాల్లో కూలీల ద్వారా జరిగిన ఉపాధి పనుల ఆధారంగా 60–40 నిష్పత్తిన మెటీరియల్ కేటగిరి నిధులను లెక్కగట్టి, ఆ మేరకే మెటీరియల్ నిధులతో పనులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కూలీలతో సంబంధం ఉండని రోడ్ల పనులను సాధారణంగా మెటీరియల్ కేటగిరి« నిధుల నుంచి చేపడతారు. ఈ నిబంధనల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ. 4,500 కోట్ల మేర ఉపాధి మెటీరియల్ నిధులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఖర్చు పెట్టిన నిధులు పోను, ఇంకా రూ. 1,980 కోట్లు అందుబాటులో ఉంటాయన్న అంచనాతో కొత్తగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మట్టి రోడ్ల పనులను గ్రామాల్లో కూటమి నాయకులకు నామినేషన్ పద్ధతిన మంజూరు చేసే కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం గత నెల 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు.గ్రామసభ ఆమోదం జాబితాలు ఎమ్మెల్యేల చేతికి.. గ్రామసభలో ఆమోదం పొందిన పనుల జాబితాలను ప్రభుత్వ పెద్దల సూచనతో జిల్లాల అధికారులు స్థానిక ఎమ్మెల్యేలకు అందజేశారు. గ్రామసభలో ఆమోదం పొందిన పనులలో ఎన్ని పనులను ఏ గ్రామానికి ఎంత మొత్తం మేర మంజూరు చేయాలి.. గ్రామానికి మంజూరు చేసిన పనులనూ ఏ పనిని గ్రామంలో ఎవరికి అప్పగించాలన్నది తుది ఆమోదం ఆయా ఎమ్మెల్యేలు తెలపనున్నారు. నిధులు తక్కువ, ప్రతిపాదనలు ఎక్కువ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో విజయనగరం జిల్లాలో ఇంకా కేవలం రూ. 55 కోట్ల మేర మంజూరుకు అవకాశం ఉండగా.. ఆ జిల్లాలో దాదాపు రూ. 1,000 కోట్లకు పైబడి పనులను మంజూరు చేయాలంటూ అధికారులకు ప్రతిపాదించినట్టు సమాచారం. గుంటూరు జిల్లా మొత్తంలోనూ ప్రస్తుత ఏడాది కేవలం రూ. 10 కోట్ల మేర నిధుల వెసులుబాటు ఉంటుందని అధికారులు తేల్చగా.. తన నియోజకవర్గానికి దక్కే నిధులతో చేపట్టే పనులను టీడీపీ, జనసేన నాయకులకు ఎలా పంచాలో తెలియక తెనాలి ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ కాలయాపన చేస్తున్నట్టు సమాచారం. గోదావరి జిల్లాల్లో ఒక్కో జిల్లాకు కేవలం రూ. 15 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య నిధులు అందుబాటులో ఉండగా.. టీడీపీ, జనసేన నేతల పోటీతో ఒక్కో నియోజకవర్గం నుంచే రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మేర పనులకు ప్రతిపాదనలు ఎమ్మెల్యేలకు చేరుతున్నట్టు సమాచారం. ఇక నిడదవోలు నియోజకవర్గంలో రూ. 11 కోట్లు పనులను స్థానిక నేతలకు కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ తన సొంత రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన నేతలకు పనులు అప్పగిస్తున్నట్లు తెలిసింది. అనకాపల్లి జిల్లాలో రూ. 120 కోట్ల వరకు నిధులు అందుబాటులో ఉండగా.. తమ నియోజకవర్గాలకే ఎక్కువ వాటా కావాలంటూ జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. -
కేంద్ర అధికారాలను పరిమితం చేయకపోవడంతో అంతరాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర అధికారాలను పరిమితం చేయకపోవడం వల్ల రాష్ట్రాల అభివృద్ధికి తగినన్ని నిధులు లేకుండా పోయాయని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి 50శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో గురువారం తిరువనంతపురం లో జరిగిన ‘కేరళ కాంక్లేవ్’కు భట్టి హాజరయ్యారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భట్టి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను, దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కేంద్రం, రాష్ట్రం దేనికదే బలంగా ఉంటూ తమ విధులు నెరవేర్చడానికి అవసరమైన వనరులతో కూడిన వ్యవస్థను రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారని, కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాష్ట్రాలతో వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ 14వ ఆర్థిక సంఘం చేసిన నిర్ణయం తప్పుదోవ పట్టించేదేనని మండిపడ్డారు. సెస్సులు, సబ్ చార్జీల ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోవడం లేదన్నారు. వాటిపై ఆధారపడటం వల్ల కేంద్రం స్థూల పన్ను ఆదాయం 28 శాతానికి పెరిగిందని, దీంతో రాష్ట్రాల వనరుల్లో గణనీయంగా కోత పడిందని చెప్పారు. జీఎస్టీలో అవలంబిస్తున్న విధానం వల్ల రాష్ట్రాల ఆర్థిక స్థితి దెబ్బతింటోందన్నారు.దేశ జనాభాలో 19.6 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు జీడీపీలో 30 శాతంతో గణనీయమైన సహకారం అందిస్తున్నప్పటికీ, ఫైనాన్స్ కమిషన్ పన్నుల పంపిణీలో వాటాను 21.073 శాతం నుంచి 15.800 శాతానికి తగ్గించారన్నారు. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల కఠినమైన నిబంధనలు, మ్యాచింగ్ గ్రాంట్ షరతులు రాష్ట్ర బడ్జెట్లను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. దక్షిణాది స్వరాన్ని అణగదొక్కే కుట్ర రాబోయే నియోజకవర్గాల పునరి్వభజన కసరత్తు 2011 జనాభా ఆధారంగా జరిపితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ నిర్ణయాధికారంలో దక్షిణాది రాజకీయ స్వరాన్ని అణగదొక్కే కుట్ర చేస్తున్నారన్నారు. జనాభా నియంత్రణ, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రాలు అన్యాయానికి గుర య్యే అవకాశం ఉందని, అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు అసమాన ప్రాతినిధ్యాన్ని పొందే అవకాశం ఉందని చెప్పారు. ఒక శతాబ్దంలో ప్రతినిధుల సభలో సభ్యుల సంఖ్య గరిష్టంగా 435గా ఉండాలని నిర్ణయించిన అమెరికా విధానాన్ని మనం అనుసరించాలన్నారు. -
ఈక్విటీ ఫండ్స్ అదే జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్‌లోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ముఖ్యంగా థీమ్యాటిక్ ఫండ్స్, కొత్త పథకాల (న్యూ ఫండ్ ఆఫర్లు/ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఎక్కువ పెట్టుబడులను సమీకరించాయి. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్‌లో వృద్ధి నమోదైంది. జూన్‌లో వచి్చన రూ.40,608 కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు నెలవారీ గరిష్ట రికార్డు కాగా, ఆగస్ట్‌లో పెట్టుబడులు రెండో గరిష్ట రికార్డుగా ఉన్నాయి. ఈ గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా అన్ని రకాల పథకాల్లోకి కలిపి ఆగస్ట్‌లో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో ఇవి రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ జూలై చివరికి ఉన్న రూ.65 లక్షల కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి రూ.66.7 లక్షల కోట్లకు చేరింది. కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.23,547 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో ఇవి రూ.23,332 కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా పెట్టుబడులు.. → థీమ్యాటిక్ ఫండ్స్ (రంగాలు/ప్రత్యేక థీమ్‌లలో ఇన్వెస్ట్ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జూలైలో రూ.18,336 కోట్లు, జూన్‌లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించడం గమనార్హం. → ఆగస్ట్‌లో ఆరు కొత్త పథకాలు ప్రారంభం కాగా, అందులో ఐదు సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి రూ.10,202 కోట్లను సమీకరించాయి. → లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,637 కోట్లు వచ్చాయి. మిడ్‌క్యాప్ పథకాలు రూ.3,055 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.3,209 కోట్ల చొప్పున ఆకర్షించాయి. అన్ని రకాల పథకాల్లోకి పెట్టుబడుల రాక ఇన్వెస్టర్లలో మార్కెట్ల పట్ల ఉన్న సానుకూల ధోరణిని తెలియజేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక రూ.3,513 కోట్లుగా ఉంది. → కేవలం ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. → డెట్ పథకాల్లోకి నికరంగా రూ.45,169 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.1.2 లక్షల కోట్ల కంటే 62 శాతం తక్కువ. → డెట్‌లో ఓవర్‌నైట్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,106 కోట్లను ఆకర్షించాయి. ఆ తర్వాత లిక్విడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. మొత్తం పెట్టుబడుల్లో 86 శాతం ఈ మూడు విభాగాల్లోని పథకాల్లోకే వచ్చాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.1,611 కోట్లను ఆకర్షించాయి. జూలైలో వచ్చిన రూ.1,337 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తోంది. → మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) జూలై చివరకి ఉన్న 19.84 కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి 20 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. -
ఆర్థిక విజయాలకు గణేశుడి బాసట: భవిష్యత్తుకు బాటలు
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మనకు ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్పుతాడు. దారిలో ఉన్న అడ్డంకులను తొలగించి విజయాలకు మార్గం ఏర్పరుస్తాడు. ఇదే ప్రేరణతో మనం కూడా మ్యుచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌గా పెట్టుబడులు పెట్టే విషయంలో వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితమైనదిగా తీర్చిదిద్దుకోవడానికి బాటలు వేసుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ : శుభారంభంవినాయకుడు అంటే వివేకం, దూరదృష్టికి ప్రతీక. మన జీవితాల్లో ఎదురయ్యే విఘ్నాలను తొలగిస్తాడనే నమ్మకం. తగినంత డబ్బు లేకపోవడం లేదా ఆర్థిక భద్రతపరమైన సమస్యలతో మనలో చాలా మంది సతమతమవుతుంటారు. ఆర్థికపరమైన అడ్డంకులనేవి ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల వచ్చే సమస్యలని మనం గుర్తించాలి.వివేకవంతమైన నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించాలి. మనం పొదుపు చేసుకునే మొత్తాన్ని ద్రవ్యోల్బణం అనేది పగలు, రాత్రి చెదపురుగులా తినేస్తుంది కాబట్టి ఆర్థిక భద్రతకు పొదుపు ఒక్కటే సరిపోదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక భద్రతను సాధించాలన్నా, సంపదను పెంచుకోవాలన్నా మన పొదుపును అర్థవంతమైన విధంగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పటికప్పుడు లాభాలు వచ్చేయాలనే తాపత్రయంతో ట్రేడింగ్ టిప్స్, స్పెక్యులేటివ్ పెట్టుబడులపై ఆధారపడకుండా వివేకవంతంగా, క్రమం తప్పకుండా మ్యుచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు.తప్పిదాల నుంచి నేర్చుకోవడంగణేశుడి పెద్ద తల వివేకాన్ని, పాండిత్యాన్ని సూచిస్తుంది. దీన్నే పెట్టుబడులకు అన్వయించుకుంటే, గత తప్పిదాల నుంచి నేర్చుకుని, మెరుగైన ఇన్వెస్టర్లుగా మారే వివేకం కలిగి ఉండాలని అ ర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణ లేకపోవడం లేదా మరీ ఎక్కువ రిస్కులు తీసుకోవడం లేదా అస్సలు రిస్కే తీసుకోకపోవడం, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు. అయితే, దీనితో కుంగిపోకుండా, ఈ అనుభవాలన్నింటినీ విలువైన పాఠాలుగా భావించి, విజయాల వైపు బాటలు వేసుకోవాలి. ప్రొఫెషనల్ సలహా తీసుకోవడంవినాయకుడి పెద్ద చెవులు మనం చక్కని శ్రోతగా ఉండాలనేది సూచిస్తాయి. ఆర్థిక ప్రపంచం విషయాన్ని తీసుకుంటే అర్హత పొందిన ఫైనాన్షియల్ ప్లానర్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఇచ్చే ఆర్థిక సలహాలను స్వీకరించే ఆలోచనా ధోరణిని కలిగి ఉండాలని ఇది సూచిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా మీ డబ్బును సరైన విధంగా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చనేది ఆర్థిక సలహాదార్లు మెరుగైన సలహాలు ఇవ్వగలరు.జీవిత పాఠాలువినాయకుడి ఎడమ దంతం విరిగి ఉంటుంది. మహాభారతాన్ని రాసేందుకు వేదవ్యాసుడు అత్యంత వేగంగా రాయగలిగే సామర్థ్యాలు గల వినాయకుడి సహాయం తీసుకున్నట్లు మన పురాణాలు చెబుతాయి. ఒక దశలో రాస్తున్న ఘంటం విరిగిపోవడంతో గణేశుడు తన దంతాన్నే విరగగొట్టి దాన్నే ఘంటంగా ఉపయోగించి రాయడాన్ని కొనసాగించాడు. అలా వినాయకుడి పట్టుదల, నిబద్ధతతో మనకు మహోత్కృష్టమైన మహాభారతం అందింది. అద్భుతమైన ఆర్థిక లక్ష్యాలతో మొదలెట్టిన పెట్టుబడుల ప్రయాణంలోనూ ఎలాంటి ఆటంకాలు వచ్చినా వెరవకుండా క్రమానుగత పెట్టుబడులు పెడుతూ, నిబద్ధతతో ముందుకు సాగాలని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది.నెలకు కేవలం రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తూ వెడితే 20 ఏళ్లలో ఏకంగా రూ. 1 కోటి మొత్తాన్ని సమకూర్చుకునేందుకు (13 శాతం వడ్డీ రేటు అంచనా), అలాగే నెలకు రూ. 45,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలోనే అంత మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సిప్ సహయపడగలదు. కాబట్టి వాయిదాలు వేయకుండా సాధ్యమైనంత త్వరగా సిప్‌ను ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనాలను అత్యధికంగా పొందవచ్చు. సురేష్ సోని - సీఈవో, బరోడా బీఎన్పీ పారిబా ఏఎంసీ -
మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవంటే..
జీవిత బీమా విషయానికొస్తే మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఎంపిక ఉత్తమం? – జితేంద్రజీవిత బీమా పాలసీ కొనుగోలు చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం. ఆర్థికంగా తమపై ఆధారపడిన వారుంటే తప్పకుండా దీన్ని తీసుకోవాలి. తమకు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు కుటుంబ అవసరాలను ఆదుకుంటుంది. మనీబ్యాక్, యులిప్, పెన్షన్ ప్లాన్లు ఇవన్నీ హైబ్రిడ్ బీమా ఉత్పత్తుఉలు. ఇవి జీవిత బీమాతోపాటు పెట్టుబడుల ప్రయోజనాన్ని ఆఫర్ చేస్తుంటాయి. దీంతో చూడానికి ఆకర్షణీయంగా అనిపిస్తాయే కానీ, వాస్తవంలో కాదు. ఎందుకంటే ఈ తరహా పాలసీలు తగినంత జీవిత బీమా రక్షణను ఇవ్వవు.భారీ రక్షణ కోరుకుంటే ప్రీమియం చాలా ఖరీదుగా మారుతుంది. ఇక ఈ ప్లాన్లలో పెట్టుబడులపై రాబడులు చాలా తక్కువ. కనుక బీమా, పెట్టుబడులను వేర్వేరుగా నిర్వహించుకోవడం మంచిది. పెట్టుబడుల కోసం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా కోసం అచ్చమైన టర్మ్ ప్లాన్‌ను పరిశీలించాలి.హైబ్రిడ్ ప్లాన్లతో పోల్చి చూస్తే టర్మ్ ప్లాన్ల ప్రీమియం ఎంతో అందుబాటులో ఉంటుంది. 35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన పురుషుడికి రూ.కోటి కవరేజీకి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం రూ.15,000. చాలా మంది బీమా పాలసీని ఏజెంట్ లేదా బ్రోకర్ ద్వారా తీసుకుంటుంటారు. దీంతో వారు తమకు అధిక కమీషన్ లభించే హైబ్రిడ్ ప్లాన్లను అంటగడుతుంటారు.అచ్చమైన టర్మ్ ప్లాన్‌లో జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం రాదు. అలాంటివి టర్మ్ ప్లాన్లు అని సులభంగా గుర్తించొచ్చు. కేవలం పాలసీదారు మరణించిన సందర్భంలోనే ఈ ప్లాన్ల కింద పరిహారం అందుతుంది. కానీ, హైబ్రిడ్ ప్లాన్లు జీవించి ఉన్నా కానీ, చివర్లో కొంత మొత్తాన్ని వెనక్కిస్తాయి. ఇందుకోసం అవి అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవి? – వినయడెట్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ స్వల్పకాల అవసరాలకు ఉద్దేశించిన నిధులను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రక్షణ ఉంటుంది. అస్థిరతలు లేకుండా ఊహించతగిన ఆదాయం కోసం షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఎంపిక చేసుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్లకు షార్డ్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి సురక్షితమైనవి. స్థిరత్వంతోపాటు నిలకడైన రాబడులు అందిస్తాయి.డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటే.. ముందుగా ఆ విభాగంలోని పథకాల పనితీరు వివిధ వడ్డీ రేట్ల సైకిల్స్‌లో ఎలా ఉందన్నది విశ్లేషించండి. సంబంధిత ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని డెట్ పత్రాల క్రెడిట్ నాణ్యతను కూడా పరిశీలించాలి. నిర్వహణ ఆస్తుల పరంగా టాప్–10 డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో ఐసీఐసీఐ, కోటక్, ఎస్బీఐ పథకాలు మెరుగ్గా ఉన్నాయి. హెచ్ఎస్బీసీ ఇండియా ఎక్స్పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్హెచ్ఎస్బీసీ మ్యుచువల్ ఫండ్ కొత్తగా హెచ్ఎస్బీసీ ఇండియా ఎక్స్పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 19తో ముగుస్తుంది. ఉత్పత్తులు లేదా సర్వీసుల ఎగుమతుల వల్ల లబ్ధి పొందే సంస్థల షేర్లు, అలాగే ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తయారీ, ఆటోమొబైల్స్, పారిశ్రామికోత్పత్తులు, ఫార్మా, రసాయనాలు, టెక్స్టైల్స్, నిర్మాణం మొదలైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపార ఫండమెంటల్స్, పరిశ్రమ స్వరూపం, వేల్యుయేషన్, ఆర్థిక బలా లు వంటి అంశాల ప్రాతిపదికన షేర్ల ఎంపిక ఉంటుందని సంస్థ సీఐవో–ఈక్విటీ వేణుగోపాల్ మంగత్ తెలిపారు. కోటక్ నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా కోటక్ నిఫ్టీ ఇండియా టూ రిజం ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది సెప్టెంబర్ 16తో ముగుస్తుంది. నిఫ్టీ500లో ట్రావెల్, టూరిజం థీమ్ ఉన్న షేర్లను ఎంచుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ఇండెక్స్‌లోని ఒక్కో స్టాక్‌కి వెయి టేజీ ఉంటుంది. పర్యాటక రంగానికి చోదక విభాగాలు ఇందులో ఉంటాయి. విహారయాత్రలు, వ్యాపార సంబంధ ప్రయాణాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందవచ్చని సంస్థ ఎండీ నీలేశ్ షా తెలిపారు. యూటీఐ నుంచి రెండు ఇండెక్స్ ఫండ్ ఆఫర్లుయూటీఐ ఫండ్ 2 ఇండెక్స్ ఫండ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూటీఐ నిఫ్టీ ప్రైవేటు బ్యాంక్ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ200 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ ఆఫర్లను (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఇండెక్స్ ఫండ్ నిర్వ హణలో తమకున్న విస్తృతమైన అనుభవంతో తక్కువ వ్యయాలతో కూడిన అత్యధిక నాణ్యమైన పెట్టుబడుల ఆప్షన్లు అందిస్తున్నట్టు ఫండ్ పేర్కొంది. యూటీఐ నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్ఫండ్ అన్నది ఇదే సూచీలోని స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ 2 పథకాల ఎన్‌ఎఫ్‌వోలు 16న ముగుస్తాయి. కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ లేదు.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పెట్టుబడులకు ‘రుణ’ పడదాం!
ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. రుణం తీసుకోవడమే ఎక్కువ మంది అనుసరించే మార్గం. అవసరాన్ని వెంటనే గట్టెక్కడమే ముఖ్యంగా చూస్తుంటారు. వడ్డీ రేటు గణనీయంగా ఉండే క్రెడిట్‌కార్డు రుణాలే కాదు, వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తుంటారు. దీంతో అప్పటికి అవసరం తీరుతుందేమో కానీ, ఆ తర్వాత ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తుంది. కొందరు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉంటే వాటిని ఉపసంహరించుకుంటారు. కానీ, వీటికంటే మెరుగైన ఆప్షన్ ఉంది. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించాల్సిన అవసరం లేకుండా, వాటిపై చౌక వడ్డీకే రుణం పొందొచ్చు. దీనివల్ల పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏర్పడదు. పైగా రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ ఫండ్స్/స్టాక్స్.. మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం పొందడాన్ని లోన్ ఎగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ (ఎల్ఏఎంఎఫ్)గా.. షేర్లపై రుణం పొందడాన్ని లోన్ ఎగైనెస్ట్ సెక్యూరిటీస్ (ఎల్ఏఎస్)గా చెబుతారు. ఇవి సెక్యూర్డ్ రుణాలు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు/õÙర్లు లేదా బాండ్లు తదితర సెక్యూరిటీలను తనఖా పెట్టుకుని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలు మంజూరు చేస్తాయి. కనుక రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. స్వల్పకాల అవసరాల కోసం ఈ రుణాలు తీసుకోవచ్చు. వీటిపై 9–11 శాతం మధ్య వడ్డీ రేటు అమలవుతుంటుంది. మిరే అస్సెట్ సంస్థ 10.5 శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేస్తోంది. డిజిటల్‌గా, నిమిషాల వ్యవధిలోనే రుణం పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. అర్హతలు..⇒ సెబీ అనుమతించిన కంపెనీల షేర్లకే రుణాలు పరిమితం. దాదాపు అన్ని బ్లూచిప్ షేర్లకు, టాప్–250 షేర్లకు రుణాలు లభిస్తాయి. డీలిస్ట్ అయిన వాటికి అవకాశం లేదు. ఏఏ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం లభిస్తుందో.. ప్రతి బ్యాంక్, ఎన్బీఎఫ్సీ ఒక జాబితాను నిర్వహిస్తుంటాయి. ⇒ ఒక్కసారి వీటిపై రుణం తీసుకున్నారంటే, అవి తనఖాలోకి వెళ్లినట్టు అర్థం చేసుకోవాలి. కనుక రుణం తీర్చే వరకు వాటిని విక్రయించలేరు. ⇒ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ విలువలో నిర్ణీత శాతం వరకే రుణం లభిస్తుంది. ఇక్కడ కూడా లోన్–టు–వేల్యూ (ఎల్టీవీ) వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఆర్బీఐ నిర్దేశించిన ఎల్టీవీ 75 శాతంగా ఉంది. చాలా సంస్థలు ఈక్విటీ ఫండ్స్‌పై 50– 60% మేరకే రుణం ఇస్తున్నాయి. మిరే అస్సెట్ సంస్థ 45 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తోంది. రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ విడిగా రుణగ్రహీత తిరిగి చెల్లింపుల సామర్థ్యాలను అంచనా వేసుకున్న తర్వాత ఇంతకంటే తక్కువే మంజూరు చేయవచ్చు. ⇒పెట్టుబడుల విలువలో రుణం 50 శాతం మించకుండా ఉంటేనే నయం. ఎందుకంటే తనఖాలో ఉంచిన షేర్లు, సెక్యూరిటీలు, ఫండ్స్ యూనిట్ల విలువను రుణం ఇచి్చన సంస్థలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. ముఖ్యంగా మార్కెట్లు కరెక్షన్కు లోనైతే ఈ పనిని వెంటనే చేస్తాయి. అప్పుడు లోన్–టు–వేల్యూని మించి రుణం విలువ పెరిగిపోతుంది. దీంతో అదనపు సెక్యూరిటీలు/ఫండ్స్ యూనిట్లను తనఖా ఉంచాలని అవి కోరతాయి. లేదా నగదు సర్దుబాటు చేయాలని కోరతాయి. లేదంటే అదనపు వడ్డీని విధిస్తాయి. లేదా తనఖాలో ఉంచిన వాటిని వెంటనే విక్రయించి సొమ్ము చేసుకుంటాయి. రుణం తీసుకున్న వ్యక్తి స్పందన ఆధారంగా ఈ చర్యలు ఉంటాయి. ⇒ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఈ రుణం మంజూరు అవుతుంది. ఉదాహరణకు తనఖా పెట్టిన సెక్యూరిటీలు, ఫండ్స్ యూనిట్లపై రూ.5 లక్షల రుణానికి ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం లభించిందని అనుకుందాం. అప్పుడు రూ.2 లక్షలే వినియోగించుకుంటే ఆ మొత్తంపైనే వడ్డీ పడుతుంది. ఎన్ని రోజులు వినియోగించుకుంటే, అంతవరకే వడ్డీ పడుతుంది. కాకపోతే తీసుకున్న రుణంపై వడ్డీని ప్రతినెలా చెల్లించాల్సిందే. ⇒ రుణంపై కనిష్ట, గరిష్ట పరిమితులను బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అమలు చేస్తున్నాయి. ⇒ వ్యక్తిగత రుణాలను ముందస్తుగా తీర్చివేస్తే ప్రీక్లోజర్ చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తుంటాయి. కానీ, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రుణాలపై ప్రీ క్లోజర్ చార్జీల్లేవు. ⇒ వ్యక్తిగత రుణాల మాదిరే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌పై రుణాలను ఎందుకు వినియోగించుకోవాలనే విషయంలో షరతులు ఉండవు. చట్టవిరుద్ధమైన, స్పెక్యులేటివ్ అవసరాలకే వినియోగించుకోకూడదు. ⇒ తనఖాలోని షేర్లు, స్టాక్స్‌కు సంబంధించి డివిడెండ్లు, బోనస్, ఇతరత్రా ప్రయోజనాలు ఇన్వెస్టర్‌కే లభిస్తాయి. ⇒ గడువు ముగిసిన తర్వాత షేర్లు, ఫండ్స్ యూనిట్లపై రుణాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ⇒ రుణంపై వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైతే తనఖాలో ఉంచిన సెక్యూరిటీలు, స్టాక్స్‌ను విక్రయించే అధికారం రుణం ఇచి్చన సంస్థలకు ఉంటుంది. విక్రయించగా వచి్చన మొత్తాన్ని రుణంతో సర్దుబాటు చేసుకుంటాయి. మిగులు ఉంటే రుణగ్రహీతకు చెల్లిస్తాయి. ఇంకా బకాయి మిగిలి ఉంటే రుణగ్రహీత నుంచి రాబట్టేందుకు తదుపరి చర్యలు తీసుకుంటాయి.డెట్ ఫండ్స్‌పై వద్దు.. డెట్ ఫండ్స్‌లో రాబడులు 6–8 శాతం మధ్యే ఉంటాయి. వీటిపై రుణం తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ 10–12 శాతం మధ్య ఉంటుంది. దీనికి బదులు ఆ పెట్టుబడులను విక్రయించుకోవడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. కేవలం ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌పై రుణానికే పరిమితం కావాలి. ఎందుకంటే, ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌లో దీర్ఘకాలంలో రాబడులు 15 శాతం స్థాయిలో ఉంటాయి. కనుక వడ్డీ చెల్లింపులు పోను ఎంతో కొంత మిగులు ఉంటుంది. చార్జీలు.. సకాలంలో చెల్లింపులు చేయనప్పుడు పీనల్ చార్జీలు విధిస్తాయి. అలాగే, సెక్యూరిటీ ఇన్వొకేషన్ చార్జీ, కలెక్షన్ చార్జీ, లీగల్ చార్జీ, స్టాంప్ డ్యూటీ, చెక్ బౌన్స్ చార్జీలు కూడా ఉంటాయి. రుణ కాల పరిమితి సాధారణంగా ఒక ఏడాది ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. దీనిపైనా చార్జీలు విధిస్తాయి. రుణం తీసుకోవడానికి ముందే ఈ చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఇతర ఆప్షన్లు బంగారం, ప్రాపర్టీ (ఇల్లు లేదా స్థలం), జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లపైనా సెక్యూర్డ్ రుణాలు పొందొచ్చు. కాకపోతే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై డిజిటల్‌గా, వేగంగా రుణం లభిస్తుంది. కనుక ఇది అత్యవసర నిధిగానూ అక్కరకు వస్తుంది. తక్కువ రేటుకే రుణం తీసుకోవాలని భావిస్తే, భిన్న సంస్థల మధ్య వడ్డీ రేటును పరిశీలించాలి. అలాగే, బంగారం, జీవిత బీమా ప్లాన్లు ఉంటే వాటి రేట్లను విచారించి, చౌక మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణం చివరి ఎంపికగానే ఉండాలి.విక్రయించడం మార్గం కాదు.. రిటైల్ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుండటం చూస్తున్నాం. ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారిలో 59 శాతం మంది 24 నెలలకు మించి కొనసాగిస్తున్నారు. మిగిలిన వారు ఆ లోపే విక్రయిస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేయడం దీర్ఘకాల లక్ష్యాలకు విరుద్ధం.పెట్టుబడులు ఉపసంహరించుకోకుండా, ఓవర్‌డ్రాఫ్ట్ రుణ సదుపాయం ద్వారా స్వల్పకాల అవసరాలను అధిగమించడమే మంచి ఆప్షన్ అవుతుంది. మిరే అస్సెట్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ డేటా ప్రకారం.. ఫండ్స్, షేర్లపై రుణాలను 30 శాతం మంది వ్యాపార అవసరాల కోసం, 19 శాతం మంది ఇంటి నవీకరణ కోసం, 18 % మంది పిల్లల స్కూల్/కాలేజీ ఫీజుల కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఎస్బీఐ యోనో నుంచే.. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ సైతం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం ఇస్తోంది. అది కూడా యోనో యాప్ నుంచే దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌గా రుణాన్ని పొందొచ్చు. క్యామ్స్ వద్ద నమోదైన అన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు) మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై, ఆకర్షణీయమైన రేట్లకే రుణాన్ని ఇస్తున్నట్టు ఎస్బీఐ చెబుతోంది. గతంలో కేవలం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై, అది కూడా బ్యాంక్ శాఖకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు యోనో నుంచి పది నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రుణం విలువపై 0.50 శాతం ప్రాసెసింగ్చార్జీ, జీఎస్టీ చెల్లించుకోవాలి. -
రిలయన్స్ హోమ్‌పై సెబీ
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల అక్రమ మళ్లింపులో అనిల్ అంబానీ ప్రధాన పాత్ర పోషించినట్లు సెబీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆడిటింగ్ తదితరాల వివరాలను బయటపెట్టింది. వీటి ప్రకారం అప్పటి కంపెనీ బోర్డు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సంబంధిత యాజమాన్యం వీటిని పట్టించుకోలేదు. కంపెనీ విధానాలను వ్యతిరేకంగా రుణాలను విడుదల చేసింది. అసంపూర్తి డాక్యుమెంటేషన్, క్రెడిట్ పాలసీ నిబంధనల ఉల్లంఘన ద్వారా రుణ మంజూరీ జరిగింది. రుణ విడుదల అంశాలను సమీక్షిస్తూ బోర్డు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. వెరసి సాధారణ కార్పొరేట్ రుణ విధానాలకు పాతరవేశారు. వీటన్నిటి వెనుక మాస్టర్‌మైండ్ అనిల్ అంబానీదేనని సెబీ అభిప్రాయపడింది. ఇతర వివరాలు ఇలా.. ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధుల అక్రమ మళ్లింపు జరిగినట్లు కంపెనీకి చట్టబద్ధ ఆడిటర్‌గా వ్యవహరించిన పీడబ్ల్యూసీ, ఫోరెన్సిక్ ఆడిటర్ గ్రాంట్ థార్న్టన్ వెల్లడించాయి. గ్రాంట్ థార్న్‌టన్‌ను రుణదాతల కన్సార్షియంకు అధ్యక్షత వహించిన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నియమించింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం సాధారణ కార్పొరేట్ లోన్ ప్రొడక్ట్‌లో భాగంగా విడుదల చేసిన రుణాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. 2018 మార్చి31కల్లా రూ. 900 కోట్ల రుణాలు విడుదలకాగా.. 2019 మార్చి31కల్లా రూ. 7,900 కోట్లకు జంప్‌చేశాయి. రుణగ్రహీత సంస్థలలో నెగిటివ్ నెట్‌వర్త్, అతితక్కువ ఆదాయం, బిజినెస్ కార్యకలాపాలు, లాభార్జన లేకపోవడం తదితర పలు ప్రతికూలతలున్నాయి. ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి మాత్రమే రుణాలను పొందడం, రుణాలతో పోలిస్తే తక్కువ ఈక్విటీ మూలధనం, రుణాలు అందుకునే ముందుగానే ఏర్పాటుకావడం, రుణ దరఖాస్తు రోజునే రుణ మంజూరీ తదితర అక్రమాలు నెలకొన్నాయి. ఇక 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్‌వరకూ బీవోబీ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ తొలి నివేదిక 2020 జనవరిలో వెలువడింది. ఈ కాలంలో కార్పొరేట్ రుణ విధానాలకింద ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ. 14,577 కోట్లకుపైగా రుణాలు విడుదలయ్యాయి. వీటిలో రూ. 12,487 కోట్లకుపైగా నిధులు సంబంధిత 47 సంస్థలకే చేరాయి. 2019 అక్టోబర్ 31కల్లా రూ. 7,984 కోట్ల రుణాలు వసూలుకావలసి ఉంటే.. దాదాపు రూ. 2,728 కోట్లు మొండిబకాయిలుగా నమోదయ్యాయి. తదుపరి నివేదికలలో గ్రూప్‌లోని పలు ఇతర కంపెనీలకు సైతం రుణాలు విడుదలైనట్లు నివేదిక పేర్కొంది. -
డయాఫ్రమ్ వాల్‌కు మళ్లీ నిధులు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మొదటి దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతోపాటు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి మళ్లీ నిధులు ఇవ్వాలని కోరారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. పునరావాసం.. పరిహారం తదితర అంశాలపైనా చర్చించారు.రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతరత్రా అంశాలపై సుమారు 45 నిమిషాలు చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల బదిలీతోపాటు 2020 వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. ఇది గత ప్రభుత్వ తప్పిదమే అని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండుసార్లు జలశక్తి మంత్రితో భేటీ అయ్యారన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చ జరిగిందని, నిర్మాణ బాధ్యతను 2022లో ముందుకొచ్చిన ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. స్పిల్‌వేకు రక్షణగాఉండే గైడ్ బండ్ కూడా కుంగిపోయిందని చెప్పారు. సీడబ్ల్యూసీ డిజైన్ల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నేడు ప్రధానితో బాబు భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం నిధులతో పాటు రాష్ట్రానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా లతోనూ భేటీ కానున్నారు. -
టీటీడీ నిధుల మళ్లింపుపై భక్త జనాగ్రహం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలపై భక్త జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిధులతో చంద్రగిరి నియోజక వర్గంలో రహదారుల నిర్మాణం కోసం ఈవోకు ఆదేశాలు జారీ చేయడంపై.. ఇది నిధుల మళ్లింపు కిందకే వస్తుంది కదా! అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.2021నవంబర్‌లో జవాద్ తుఫాన్ వల్ల స్వర్ణ ముఖి నదిపై దెబ్బతిన్న కాజ్ వే నిర్మాణాలకు నిధులు కేటాయించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రబాబు కోరారు. దీనిపైన స్పందించిన బాబు.. తిరుపతి కొత్తపల్లి మిట్ట మార్గంలో చిగురు వాడ వద్ద స్వర్ణముఖి నదిపై కాజ్ వే నిర్మాణం, తనపల్లి రోడ్ తాజ్ హోటల్ సమీపంలో కాజ్ వే నిర్మాణం, తిరుపతి పూడి మార్గం తిరుచానూరు వద్ద కాజ్ వే నిర్మాణం, ఐతేపల్లి రంగం పేట రోడ్ ఐతేపల్లి వద్ద కాజ్ వే నిర్మాణానికి టీటీడీ నిధులుతో నిర్మాణం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని అభ్యర్థన మేరకు సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. అయితే టీటీడీ నిధులతో చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కేటాయించడంపై ప్రజలు, టీటీడీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపత్యంలో టీటీడీ నిధులు కేవలం ధార్మిక కార్యక్రమాలు మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
నిందలతో సరి.. అయినా నిధులివ్వరు మరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌ల కోసమని కేంద్రం మొన్న ఎన్నికల ముందు విడుదల చేసిన రూ.998 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం రెండున్నర నెలలుగా వాటి ఖాతాల్లో జమచేయకుండా జాప్యం చేస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత నిధులను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేంద్రం విడుదల చేసింది. వీటిని 70 : 15 : 15 నిష్పత్తిన రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు–మండల–జిల్లా పరిషత్‌లకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేయాల్సి ఉంది. అప్పట్లో ఎన్నికల కోడ్ ఉందని అనుకున్నా.. ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ఎత్తివేసిన తర్వాత కూడా కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకూ వాటి ఊసెత్తడంలేదు. కానీ, గత ఐదేళ్లలో ఈ నిధులను అప్పటి ప్రభుత్వం మళ్లించిందంటూ ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు అప్పట్లో నానా యాగీ చేశారు. ఇప్పుడు తమ బాధ్యతగా విడుదల చేయాల్సిన వాటి గురించి మాత్రం కిక్కురుమనడంలేదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యం క్షీణించి డయేరియా ప్రబలడంతో పలువురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పవన్‌కళ్యాణ్ గ్రామాల్లో పారిశుధ్య పనుల నిమిత్తం బ్లీచింగ్ కొనడానికి కూడా డబ్బుల్లేవంటూ విమర్శలు చేస్తున్న ఆయన.. కేంద్రం ఎప్పుడో విడుదల చేసిన నిధులపై మాత్రం మాట్లాడడంలేదు.కొత్త నిధులిచ్చినా, ఏపీకి మాత్రం..ఇదిలా ఉంటే.. కేంద్రం ఇప్పటికే విడుదల చేసిన రూ.998 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జమచేయకపోవడంతో కొత్త చిక్కొచ్చి పడింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,152 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే మొదటి విడత కింద కొన్ని రాష్ట్రాలకు విడుదల చేసిన కేంద్రం మన రాష్ట్రానికి మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే.. గతంలో విడుదల చేసిన నిధులను విడుదల చేస్తేనేగానీ కొత్తగా కేంద్ర ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్ శాఖ సిఫార్సు చేయదు. ఈ నేపథ్యంలో.. రూ.998 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థలకు చెల్లిస్తేనే ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి విడత నిధులు వచ్చే అవకాశముందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. -
కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, గిరిజన ఉత్పత్తులు..ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్స్‌లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలన్నారు. నెలలు నిండిన గర్భిణిల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలిఅరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి ఎక్కడా కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. -
ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్ క్లారిటీ
సాక్షి, విశాఖపట్నం: అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లపై బీజేపీ నేత జివీల్ నరసింహారావు స్పష్టతనిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 వేల కోట్లు రూపాయలు అప్పేనని తేల్చి చెప్పేశారు. ఈ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని.. అప్పు కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా? అనే దానిపై మీద స్పష్టత రావాలన్నారు.కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సాయమా లేక అప్పా అనేది చెప్పకుండా సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టించిన సంగతి తెలిసిందే. రుణమా లేక గ్రాంటా అనేది స్పష్టంగా ప్రకటించకుండా బీజేపీ నాయకత్వం పదాల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. మన రాష్ట్రం విషయంలో ఉత్తి మాటలు చెప్పిన కేంద్రం.. బీహార్‌కి మాత్రం భారీగా నిధులను కేటాయించింది. అధికార పార్టీ ఎంపీలు ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారని, ఏం సాధించారని పలువురు నిలదీస్తున్నారు. -
విన్నపాలు వినవలె
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. నిధులు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, ప్రల్హాద్ జోషిలతో సీఎం సమావేశమయ్యారు.మూసీ సుందరీకరణపై రాష్ట్ర సర్కారు దృష్టిమూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మొత్తం రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని దేశంలో మరెక్కడా లేని విధంగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. మూసీ సుందరీకరణతో పాటు దానిలో చేరే మురికినీటి శుద్ధికి, వరద నీటి కాల్వల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ రెండు చెరువులను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు తీరడంతో పాటు మూసీ నది పునరుజ్జీవనానికి తోడ్పడుతుందని వివరించారు. నల్లా కనెక్షన్లకు రూ.16,100 కోట్లు అవసరంజల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. 2019 లెక్కల ప్రకారం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో 77.60 శాతం ఇళ్లకు నల్లా నీరు అందుతోందని, అయితే ఇటీవల తాము చేపట్టిన సర్వేలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని తేలిందని వివరించారు. ఆ ఇళ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, ఇందుకు మొత్తం రూ.16,100 కోట్లు అవసరమని తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2019లోనే ప్రారంభించినా నేటి వరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని, ఈ ఏడాది నుంచైనా నిధులు విడుదల చేయాలని కోరారు. సిలిండర్‌కు రూ.500 చెల్లించేలా చూడండితెలంగాణలో రూ.500కే గ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని సీఎం కోరారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తోందని తెలిపారు.అయితే వినియోగదారులు సిలిండర్‌కు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత సబ్సిడీ అందుతుండడంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. కాబట్టి సబ్సిడీని ముందుగానే ఓఎంసీలకు చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అప్పుడు వినియోగదారులు రూ.500 మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఒకవేళ అలా వీలుకాని పక్షంలో 48 గంటల్లోపు సబ్సిడీ మొత్తం వినియోగదారులకు అందేలా చూడాలని కోరారు.బియ్యం బకాయిలు విడుదల చేయండిధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని రేవంత్ కోరారు. 2014–15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని కోరారు. అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, సురేష్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. -
మూసీ ప్రక్షాళన: కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి,ఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం(జులై 22) భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. -
హామీలిచ్చాం.. నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఎన్డీయే కూటమి హామీలు ఇచ్చిందని, ఇవి సాధ్యం చేయాలంటే కేంద్రం నిధులు సమకూర్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్లు తెలిసింది. అమరావతి అభివృద్ధికి నిధులు కావాలని చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా ఈ సమావేశం సాగింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే బసకు చేరుకున్నారు. ఎన్నికల హామీలు, వాటికి సమకూర్చాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. హామీల అమలు, అమరావతి అభివృద్ధి.. ఇలా అన్నీ పూర్తి కావాలంటే ఏటా కనీసం రూ.20 వేల కోట్లు అయినా అవసరం ఉంటుందని, ఆ మేరకు ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అలాగే విభజన హామీలకు సంబంధించి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బాబు కోరినట్లు సమాచారం. సీఎం బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. -
నిధులిచ్చి ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, త్వరితగతిన నిధులు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులతో కలిసి చంద్రబాబు వివిధ శాఖల కేంద్ర మంత్రులకు వినతి పత్రాలను అందచేశారు. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రాజధాని, పోలవరం, ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను సీఎం చంద్రబాబు కలుసుకున్నారు. అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. కేంద్ర సామాజిక సాధికారిత సహాయ మంత్రి రాందాస్ అఠావాలేను కలిశారు. అశోకా రోడ్డులోని నివాసంలో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్, ఎనీ్టపీసీ సీఎండీ గురుదీప్ సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. పారిశ్రామిక వేత్తలతో చర్చల అనంతరం హైదరాబాద్‌కు పయనమయ్యారు. -
ఓ వైపు జూడాల సమ్మె.. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్ : ఓ వైపు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తుండగా.. మరో వైపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల అభివృద్ది కోసం భారీ మొత్తంలో నిధుల్ని మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీలలో సివిల్ వర్క్ కోసం రూ.204కోట్లు నిధులను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ కోసం రూ.121 కోట్లు, గాంధీ మెడికల్ కాలేజీ కోసం రూ. 79 కోట్లు, హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజ్ కోసం రూ. 6 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆయా మెడికల్ కాలేజీలలో హాస్టల్స్ నిర్మాణల కోసం రూ.204 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. -
హైదరాబాద్‌లో 11 చోట్ల ఈడీ సోదాలు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆపరేషన్ మోబిలైజేషన్ గ్రూప్ పై 11చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని మోబిలైజేషన్ గ్రూప్ విదేశాల నుంచి రూ.300 కోట్ల విరాళాలు సేకరించింది. ఆ నిధుల్ని ఓం ఫౌండేషన్ పేరుతో దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణ, కేరళ మహారాష్ట్ర,కర్ణాటకలో ఈడీ సోదాలు జరిపారు.ఈ సోదాల్లో బినామీ పేర్లతో నిధుల్ని స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. -
రూ. 20,000 కోట్ల ఇన్ఫ్రా బాండ్ల జారీ
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనుంది. ఇందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేయనుంది. ఈ బాటలో మరో పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రమోట్ చేసిన పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సైతం బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోనుంది. రూ. 20,000 కోట్లు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టనుంది. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీకి తెరతీయనుంది. ఈ ఆరి్థక సంవత్సరం(2024–25)లోగా బాండ్ల విక్రయాన్ని నిర్వహించేందుకు ఎస్బీఐ బోర్డు తాజాగా అనుమతించింది. పబ్లిక్ ఇష్యూ లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 20,000 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు ఆమోదించింది. వెరసి దీర్ఘకాలిక బాండ్ల జారీకి జులై మొదటి వారంలో బిడ్స్‌ను ఆహా్వనించవచ్చని మర్చంట్ బ్యాంకర్లు తెలియజేశారు. ఇప్పటికే ఎస్బీఐ మార్కెట్ వర్గాలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 10–15 ఏళ్ల కాలావధితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ యోచనలో ఉంది. జనవరిలో పెర్పెట్యువల్ బాండ్ల జారీ ద్వారా రూ. 5,000 కోట్లు అందుకున్న సంగతి తెలిసిందే. వీటికి కూపన్ రేటు 8.34 శాతంకాగా.. ఇంతక్రితం 15ఏళ్ల కాలపరిమితితో గతేడాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టి రూ. 20,000 కోట్లు సమీకరించింది. ఎస్బీఐలో కేంద్ర ప్రభుత్వం 57.49 శాతం వాటాను కలిగి ఉంది.పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా..మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)ను జారీ చేయనున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా ఎన్సీడీల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. నిధులను బిజినెస్ వృద్ధికి వినియోగించనున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తెలియజేసింది. ఈ మారి్టగేజ్ సంస్థ అందుబాటు ధరల గృహ విభాగంపై దృష్టిపెట్టడం ద్వారా ఈ ఏడాది లోన్‌బుక్‌లో 17 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది(2023–24)లో లోన్‌బుక్ రూ. 63,000 కోట్లకు చేరింది. బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1 శాతం బలహీనపడి రూ. 836 వద్ద నిలవగా.. పీఎన్బీ హౌసింగ్ షేరు 1 శాతం నీరసించి రూ. 784 వద్ద ముగిసింది. -
రష్యా చేసిన నష్టానికి రష్యా నిధులే వాడతారట.!
యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ ఆదుకునేందుకు G7 దేశాలు కొత్త వ్యూహం అనుసరిస్తున్నాయి. వేర్వేరు దేశాల్లో స్తంభింపజేసిన రష్యా నిధులను ఉక్రెయిన్‌కు కేటాయించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 50 బిలియన్ డాలర్లు సాయం చేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత.. 300 బిలియన్ యూరోల రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను G7 దేశాలు స్తంభింపజేశాయి. దీనిపై వచ్చిన వడ్డీలో 50 బిలియన్ డాలర్లను రుణం కింద అందించాలని ఈయూ ప్రతిపాదించింది.యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్ను పునర్ నిర్మించాలంటే 486 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులనే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులైన ఒలిగార్చ్ ఆస్తులను కూడా EU, G7 దేశాలు స్తంభింపజేశాయి. పడవలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ 397 బిలియన్ డాలర్లుగా యుక్రేనియన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఐడియాస్ అంచనా వేసింది.ఇక రష్యాకు చెందిన మెజార్టీ ఆస్తులను ఈయూ దేశాలు స్తంభింపచేశాయి. దాదాపు 185 బిలియన్ యూరోలు బెల్జియంలోని అంతర్జాతీయ డిపాజిట్ సంస్థ అయిన యూరోక్లియర్ జప్తు చేయగా.. మిగతా ఆస్తులను బ్రిటన్, ఆస్ట్రియా, జపాన్, స్విట్జర్లాండ్, యూఎస్ దేశాలు సీజ్ చేశాయి. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఈయూ దేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నిజానికి.. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ డబ్బును పశ్చిమ దేశాలు జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధిం విధించింది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకునేందుకు సీజ్ చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్‌కు రుణం కింద అందించాలని భావిస్తున్నాయి.ఉక్రెయిన్‌కు రుణం అందించే విషయంలో పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇంతకుముందు యూఎస్ రుణాలు అందిస్తుందని భావించగా.. ఇప్పుడు G7 దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ఈ దేశాల నుంచి ఎవరు రుణాన్ని అందిస్తారనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. రుణం మంజూరు చేయాలంటే ఈయూ సభ్య దేశాలన్నింటి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం నుంచి రష్యా విరమించుకొని ఆస్తులను తిరిగి ఇవ్వాల్సి వస్తే ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆయా దేశాల మధ్య స్పష్టత లేన్నట్లు తెలుస్తోంది. చైనా వంటి దేశాలు పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. -
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు ఎవరి హయాంలో ఎక్కువ నిధులొచ్చాయో చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసి రారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 2004–14 మధ్య యూపీఏ సర్కార్ ఇచ్చిన నిధులు, 2014–24 మధ్య తమ ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అందించిన నిధులపై అర్థవంతమైన చర్చ చేపడదామన్నారు. ఎవరి పాలనలో ఎక్కువ నిధులొచ్చాయో ఆధారాలతో ప్రజల ముందు చర్చిద్దామని సూచించారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులు అందించిందని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో విభేదిస్తే తనతో సీఎం చర్చకు రావాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘కొడంగల్ లేదా అమరవీరుల స్తూపం లేదా కృష్ణా, గోదావరి ఒడ్డునైనా సరే తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. స్థలం, సమయం, తేదీ నిర్ణయించాలని రేవంత్‌ను లేఖలో కోరారు. అయితే చర్చ సందర్భంగా ఉపయోగించే భాష హుందాగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సవాల్‌ను స్వీక రించి అర్థవంతమైన చర్చలో పాల్గొనేందుకు సీఎం సాను కూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుడదామన్నారు.‘గాడిద గుడ్డు’ను ఖండిస్తున్నాం..‘2014–24 కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ మీరు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ కేబినెట్లో భాగస్వామిగా వ్యక్తిగతంగానూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’అని కిషన్‌రెడ్డి లేఖలో స్పష్టంచేశారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి పదవినే దిగజారుస్తుందని మండిపడ్డారు. అబద్ధాల ప్రచారం సరికాదు..‘పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా గతంలో యూపీఏ సాధించిన ఘనతలు, విజయాలను మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఎన్డీయే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కూడా మీరు విమర్శించవచ్చు. కానీ మీరు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలను ఆశ్రయించడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే’అవుతుంది అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చింది రూ. 45 వేల కోట్లే‘మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. కేవలం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కిందనే ఏకంగా రూ. 2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి రూ. 1.32 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా రూ. 45,000 కోట్లు మించదు. అంటే యూపీఏ హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ కు 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చింది. 1947 నుంచి 20 14 వరకు 67 ఏళ్లలో తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్లకుపైగా వెచ్చించి కొత్తగా మరో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించింది. నిర్మాణానికి 100%, భూసేకరణకు 50% కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు సహా మరో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాం. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చాం’అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఎంఎఫ్ ఆస్తులు రూ. 53.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో 35% జంప్ చేశాయి. రూ. 53.4 లక్షల కోట్లను తాకాయి. వార్షికంగా రూ. 14 లక్షల కోట్లమేర ఎగశాయి. ఇందుకు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, లాభాల పరుగు తీస్తున్న ఈక్విటీ మార్కెట్లు ప్రభావం చూపాయి. వెరసి 2020–21 ఏడాది(41 శాతం వృద్ధి) తదుపరి గరిష్టస్థాయిలో ఎంఎఫ్ ఆస్తులు బలపడినట్లు వార్షిక నివేదికలో ఫండ్స్ దేశీ అసోసియేషన్(యాంఫి) వెల్లడించింది. ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) పురోగతి.. ఫండ్స్ పరిశ్రమలో పెరుగుతున్న ఇన్వెస్టర్లను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా మార్చి చివరికల్లా ఫోలియోల సంఖ్య 17.78 కోట్లను తాకింది. ఇది సరికొత్త రికార్డు కాగా.. ఇన్వెస్టర్ల బేస్ 4.46 కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో మహిళల వాటా 23 శాతంకావడం గమనార్హం! సిప్ దన్ను క్రమబద్ధ పెట్టుబడుల(సిప్) పథకాలను ఇన్వెస్టర్లు ఆదరిస్తుండటంతో వీటి సంఖ్య బలపడుతోంది. దీంతో నెలవారీ నికర పెట్టుబడులు మార్చిలో రూ. 19,300 కోట్లకు చేరాయి. పూర్తి ఏడాదిలో సిప్ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్ల నికర పెట్టుబడులు లభించాయి. ఇది ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని పట్టిచూపుతోంది. అంతేకాకుండా క్రమశిక్షణతోకూడిన పెట్టుబడులను ప్రతిబింబిస్తోంది. దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు గతేడాది మైలురాయివంటిదని యాంఫి నివేదిక పేర్కొంది. ఏయూఎం చెప్పుకోదగ్గవిధంగా రూ. 14 లక్షల కోట్లమేర పెరిగి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 53.4 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది. 2022–23లో ఫండ్స్ ఏయూఎం విలువ రూ. 39.42 లక్షల కోట్లుమాత్రమేనని ప్రస్తావించింది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఆధారిత పథకాలు తదితరాలలో ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. పరిశ్రమ ఆస్తుల్లో వీటి వాటా 58 శాతంకాగా.. ఫోలియో సంఖ్యలో 80 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ఎంఎఫ్‌ల ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో పెరుగుతున్న కుటుంబ మదుపును ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ఈక్విటీకే ఓటు గతేడాది పెట్టుబడుల్లో ఈక్విటీ ఆధారిత పథకాలు 55 శాతం వృద్ధిని అందుకుని ఆస్తులలో రూ. 23.5 లక్షల కోట్లకు చేరాయి. ఇందుకు పెట్టుబడులతోపాటు.. మార్క్‌టు మార్కెట్(ఎంటుఎం) లాభాలు సహకరించాయి. అయితే మరోవైపు రుణ పథకాల ఫండ్స్ 7 శాతమే బలపడ్డాయి. ఏయూఎంలో రూ. 12.62 లక్షల కోట్లకు చేరాయి. అయినప్పటికీ అంతక్రితం రెండేళ్లలో ఆస్తులు తగ్గుతూ వచ్చిన అంశంతో పోలిస్తే మెరుగేనని నివేదిక తెలియజేసింది. -
రూ. వేయి కోట్లు ఇస్తేనే ‘గృహ’ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో నిర్మించని తరహాలో నిరుపేదల కోసం రూపుదిద్దుకున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మూడొంతులు సిద్ధమైనా ఇప్పటికిప్పుడు ప్రజలు నివాసం ఉండే పరిస్థితి కనిపించటం లేదు. ఆ కాలనీలకు మంచినీళ్లు, కరెంటు, మురిగునీటి పారుదల, రోడ్లు.. లాంటి అతి ముఖ్య ప్రాథమిక వసతులు కూడా లేవు. ఇవన్నీ సిద్ధం కావాలంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.వేయి కోట్లు కావాలి. కనీస వసతుల కల్పనకు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. సొంత జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల చొప్పున, సొంత జాగా లేనివారికి ముందుగా భూమి ఇచ్చి ఇంటి నిర్మాణ యూనిట్ కాస్ట్ నిధులు ఇస్తామని ఈ ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ ఏడాది సొంత జాగా లేని వారిని పక్కన పెట్టేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 66 లక్షలను మించి వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో కూడా రూట్ మ్యాప్ సిద్ధం కాలేదు. 1.49 లక్షల ఇళ్లు సిద్ధమైనా.. రాష్ట్రవ్యాప్తంగా 2.29 లక్షల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 1.49 లక్షల ఇళ్లు సిద్ధమయ్యాయి. మరో 80 వేలు తుది దశలో, వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల కిందనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తాజాగా ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్లు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మాత్రం వాటిల్లో ఉండే పరిస్థితి మాత్రం ప్రస్తుతం లేదు. ఆయా కాలనీల్లో ఇళ్లనైతే నిర్మించారు గానీ, వాటిల్లో మంచినీళ్లు, విద్యుత్ కనెక్షన్లు లేవు. వాననీళ్లు, మురుగునీళ్లు వెళ్లే వ్యవస్థ లేదు. రోడ్లతో అనుసంధానం కాలేదు. చాలా కాలనీలు ప్రస్తుత జనావాసాలకు దూరంగా ఉన్నందున.. చాలా వసతులు కల్పించాల్సి ఉంది. ఇటీవల అధికారులు వాటిపై సమీక్షించి లెక్కలు వేసి రూ.వేయి కోట్లకుపైగా నిధులు ఉంటే తప్ప ఆ ఏర్పాట్లు చేయటం సాధ్యం కాదని తేల్చారు. వాటి నిర్మాణం ప్రారంభించిన సమయంలో నాటి ప్రభుత్వం వేసిన అంచనాలు ఇప్పుడు పెరిగిపోయాయి. దీంతో వాటిని సవరించాల్సి ఉంది. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం, దాని శివారు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్లను నిర్మించారు. వీటిల్లో కొన్నింటిలో లబ్ధిదారులు ఉంటుండగా, మిగ తా కాలనీలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆయా కాలనీల్లో మంచినీటి, మరుగునీటి పారుదలకు కావా ల్సిన ట్రంక్‌లైన్లు, విద్యుత్ అనుసంధాన వ్యవస్థ, వరదనీటి కాలువల కోసం దాదాపు రూ.650 కోట్లు కావాలి. పోలీసు స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాపులు, రేషన్ దుకాణాలు లాంటి వాటిని కూడా సమకూర్చాల్సి ఉంది. అందుకు మరికొన్ని నిధులు కా వాల్సి ఉంటుంది. ఇక జీహెచ్ఎంసీ వెలుపల.. జిల్లా ల్లో నిర్మించిన కాలనీల్లో మంచినీరులాంటి కనీస వస తులు కూడా లేవు. కాలనీలను నివాసయోగ్యంగా మార్చాలంటే రూ.456 కోట్లు కావాల్సి ఉంది. మిగిలిన నిధులు ఏమయ్యాయో? గత ప్రభుత్వం రూ.201 కోట్లను విడుదల చేసింది. వాటిల్లో రూ.39 కోట్లు మాత్రమే ఖర్చ య్యాయి. మిగతా నిధులేమయ్యాయో తేలాల్సి ఉంది. గత ప్రభుత్వం విడుదల చేయగా పోనూ మిగిలిన మొత్తాన్ని ఇప్పుడు విడుదల చేయాల్సి ఉంది. అంచనా వ్యయాలు పెరిగినందున అదనంగా వాటి అవసరం ఏర్పడింది. నిధులు ఇవ్వటంలో జాప్యం జరిగే కొద్దీ.. ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండాల్సిందే. మరింత ఆలస్యమైతే.. నిర్మాణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. -
విదేశాలకు వెళ్లాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్‌లో పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి. మెరిట్ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అప్పు చేసి మరీ... ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విమానం టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. -
సైకిల్‌పై ‘డాలర్’ సవారీ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అతనో ఎన్ఆర్ఐ.. మారుపేరు డాలర్ రాజా.. వృత్తి రీత్యా డాక్టర్.. అయితే పూర్తిగా టీడీపీ కోసమే పని చేస్తుంటాడు. అతను పుట్టింది గుంటూరులో.. ఉండేది అమెరికాలో.. ఎక్కువగా వచ్చేది కోవెలకుంట్లకు.. ఇతని తండ్రి గతంలో ఇక్కడ ఎంఈవోగా పని చేయడంతో పరిచయాలు ఎక్కువ. అతనికి కోవెలకుంట్లలో ఓ మిత్ర మండలి ఉంది. సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బలమైన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రతీ ఎన్నికకు టీడీపీకి భారీగా నిధులు సమకూరుస్తుంటారు. ప్రతిగా తనకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. చంద్రబాబు, లోకేశ్ అమెరికా వెళితే ఆయన ఇంట్లోనే బస చేస్తారు. ఈసారి రూ.250 కోట్లకు పైగా ఫండింగ్ సమకూర్చడమే కాకుండా టికెట్ల కేటాయింపులోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఆశావహులు అధిష్టానాన్ని కాకుండా ‘డాలర్ రాజా’ను సంప్రదించడం వరకు ఈ జోక్యం వెళ్లిందంటే ఈ ‘రాజా’ మాటే చంద్రబాబుకు శాసనం అని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. రాజా మాటే బాబు మాటట! నంద్యాల జిల్లా టీడీపీలో బీసీ జనార్ధనరెడ్డి అంతా తానై నడిపిస్తున్నాడని, ఇతనివల్ల పార్టీ నష్టపోతోందనే అంచనాకు ఈ ఎన్ఆర్ఐ వచ్చినట్లు సమాచారం. నంద్యాల, డోన్ టికెట్లు ఫరూక్, ధర్మవరం సుబ్బారెడ్డికి తొలుత ప్రకటించడం వెనుక జనార్ధన్‌రెడ్డి ఉన్నారని ఇతని భావన. దీంతోనే డోన్ టికెట్ సుబ్బారెడ్డికి తప్పించి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి దక్కేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జనార్దనరెడ్డి వ్యతిరేకులను ఒకతాటిపైకి తెచ్చేందుకు ఈ ‘రాజా’ తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. ఆదోని టికెట్ కోసం జనసేన పట్టుబట్టినా, చివరకు దాన్ని బీజేపీకి ఇవ్వాలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘రాజా’ మాత్రం తన సామాజికవర్గ నేత మీనాక్షినాయుడుకో లేక ఆయన కుమారుడికి ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో కోడుమూరు స్థానాన్ని బీజేపీకి ఇచ్చి, ఆదోనిలో టీడీపీ తరఫున మీనాక్షినాయుడు కుమారుడు భూపాల్నాయుడును బరిలోకి దింపాలని చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. ఈ దెబ్బతో కోడుమూరు టీడీపీ అభ్యర్థి దస్తగిరితోపాటు నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డికి కూడా చెక్ పెట్టొచ్చన్నది ఈ ‘రాజా’ ఆలోచనట. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టికెట్ రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని సురేంద్రబాబుకు రావడం వెనుక కూడా ఇతని హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం సీటు కూడా రాప్తాడు మాజీ మండలాధ్యక్షుడు దగ్గుబాటి ప్రసాద్‌కు ఖరారు చేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతను పార్టీకి రూ.50 కోట్లు ఫండ్ ఇస్తానని చెప్పడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీని వెనుక కూడా ఈ ఎన్ఆర్ఐ పావులు కదిపినట్లు చర్చ జరుగుతోంది. -
సీఎం గారూ.. నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు. కొండపైన విశిష్టత కాపాడాలని.. భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నష్టం.. అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాని గెస్ట్ హౌస్‌లు.. టెంపుల్ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్ నిరుపయోగంగా ఉంది. స్థానికులకు ఉపాధి దూరం.. ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. సగంలో నిలిచిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్‌లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు ఇవి చదవండి: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2 -
జగనన్న విద్యా దీవెన విడుదల
-
పల్లె ముంగిట కొత్త ‘పద్దు’
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల తరహాలోనే పంచాయతీల స్థాయిలోనూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) పేరుతో బడ్జెట్లను పకడ్బందీగా రూపొందించే ప్రక్రియ మొదలైంది. ఈమేరకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో అంచనాల తయారీ ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు ఇక పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆ గ్రామ జీపీడీపీలో పేర్కొన్న పనులకే కేటాయించాల్సి రావడంతో ఈ బడ్జెట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా గ్రామస్థాయిలో పాలకవర్గం గుర్తించిన పనులను బడ్జెట్లో పొందుపరుచుకునే వెసులుబాటు లభించింది. సప్లిమెంటరీ ప్రణాళిక పేరుతో సవరణ చేసుకునే అవకాశమూ లభించింది. వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,3326 గ్రామ పంచాయతీలతోపాటు 660 మండల పరిషత్‌లు, 13 ఉమ్మడి జిల్లాల పరిషత్‌లకు కలిపి మొత్తంగా రూ.2,152 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిని గ్రామ బడ్జెట్లో పెట్టిన పనులకే వాడుకోవాలి. ఏడాది మొదట్లో గానీ లేదంటే మధ్యలో సప్లిమెంటరీగాగానీ ఆ గ్రామ బడ్జెట్లో పేర్కొనని పనులకు ఆర్థిక సంఘ నిధులను వాడుకునే అవకాశమే ఉండదు. ఇంటి పన్ను రూపంలో అందజేసే జనరల్ ఫండ్స్ తదితర ఇతర నిధులను మాత్రం బడ్జెట్ ప్రకారం ఖర్చుపెట్టాలన్న నియమేమీ లేదు. అయితే వీలైనంత మేర బడ్జెట్ ప్రణాళికల ఆధారంగానే ఖర్చు చేసేలా ప్రోత్సహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో సర్పంచులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కార్యదర్శులకు మండలస్థాయి అధికారుల సహకారం గ్రామ బడ్జెట్ రూపకల్పన, అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి మండలంలో ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండే నిధులకు, ఇతర పథకాల వచ్చే నిధులనూ అవసరమైన మేర అనుసంధానం చేసుకునేలా ఈ ఆరుగురు మండల స్ఙాయి అధికారులు తోడ్పాటు అందిస్తారని వివరించారు. కమిటీల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఉపాధి పథకం ఏపీఓ, సెర్ప్ ఏపీఎంలు ఉంటారు. మూడొంతుల పంచాయతీల్లో పూర్తి ఇప్పటికే దాదాపు మూడోంతులకుపైగా అంటే 11,403 గ్రామ పంచాయతీల్లో 2024–25 సంవత్సరపు గ్రామ బడ్జెట్ ప్రణాళికల రూపకల్పన పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అన్ని పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 660 మండలాలు, 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ మండల, జిల్లా పరిషత్‌ల వారీగా బడ్జెట్ ప్రణాళికలను మార్చి నెలలో రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. -
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాది తోఫా ఐదో విడత నిధుల విడుదల
-
స్మార్ట్ సిప్ అంటే ఏంటి?
ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను తాకుతోంది. కనుక ఈ పరిస్థితుల్లో స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని సూచిస్తారా..? డి. వెంకట రమణ స్మార్ట్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (స్మార్ట్ సిప్) అనేది రెగ్యులర్ సిప్‌తో పోలిస్తే వినూత్నమైనది. ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే మొత్తం అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్మార్ట్ గా మారిపోతుంది. కొన్ని పారామీటర్ల ఆధారంగా మార్కెట్ల విలువలు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌక గా ఉన్నాయా అన్నది ఆల్గోరిథమ్ నిర్ణయిస్తుంది. మార్కెట్లు పూర్తి విలువ మేర ట్రేడ్ అవుతున్నాయని ఆల్గోరిథమ్ (సాఫ్ట్వేర్) భావిస్తే, అప్పుడు సిప్‌లో కొంత భాగమే ఈక్విటీ పెట్టుబడిగా వెళుతుంది. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌కు తరలిస్తుంది. ఒకవేళ స్టాక్ విలువలు చౌకగా ఉన్నాయని భావిస్తే అప్పుడు పెట్టుబడిలో అధిక భాగం స్టాక్స్‌కే కేటాయిస్తుంది. లిక్విడ్ ఫండ్‌కు పరిమితంగానే వెళుతుంది. స్మార్ట్ సిప్ ఇదే మాదిరిగా పనిచేస్తుంది. ఈ విధానం ఇన్వెస్టర్లకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తమే పెట్టుబడిగా వెళుతుంది. అదే ఈక్విటీ వ్యాల్యూషన్ చౌకగా మారినప్పుడు సిప్‌లో అధిక భాగం ఈక్విటీలకు వెళుతుంటుంది. మార్కెట్లో అనుకూల సమయాన్ని ఎవరూ అంచనా వేయ లేరు. ఓ పద్ధతి ప్రకారం, క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే కీలకం. ఇందుకు స్మార్ట్‌సిప్ వీలు కల్పిస్తుంది. నిజానికి సాధారణ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉద్దేశం కూడా పెట్టుబడులకు సంబంధించి రిస్‌్కను తగ్గించడమే. మార్కెట్లు ఎప్పుడు దిద్దుబాటుకు గురవుతాయి? ఎప్పటి వరకు ర్యాలీ చేస్తాయి? అని ఎవరూ చెప్పలేదు. అటు ర్యాలీల్లోనూ, ఇటు పతనాల్లోనూ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం సిప్ ద్వారా సాధ్యపడుతుంది. మార్కెట్లు ఖరీదుగా మారా యా? చౌకగా ఉన్నాయా? అని చూడక్కర్లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. స్టాక్స్ ధరలు దిద్దుబాటుకు గురైనప్పుడు సిప్ పెట్టుబడితో ఎక్కువ ఫండ్ యూనిట్లు సమకూరుతాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి కావాల్సినది క్రమశిక్షణ. అందుకు సిప్ వీలు కల్పిస్తుంది. కనుక మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నాయని చెప్పి స్మార్ట్సిప్ను పరిశీలించక్కర్లేదు. మీరు రెగ్యులర్ సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా పెట్టుబడుల్లో సింహ భాగం ఈక్విటీల్లోనే ఉన్నా యి. రిటైర్మెంట్కు మూడేళ్లు మిగిలి ఉంది. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడులను డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవచ్చా? నా లాభం రూ.లక్షకు మించే ఉంటుంది. కనుక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇలా డెట్‌లోకి మళ్లించిన త ర్వాత ప్రతి నెలా ఇంత చొప్పున సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ద్వారా తీసుకుందామని అనుకుంటున్నాను. డెట్ ఫండ్ నుంచి ప్రతి నెలా బ్యాంక్ ఖాతాకు జమ అయ్యే మొత్తంపైనా పన్ను పడుతుందా? త్యాగన్ నరేంద్రన్ అవును. రెండు సందర్భాల్లోనూ మూలధన లాభంపై పన్ను పడుతుంది. అయినప్పటికీ రెండింతల పన్ను చెల్లించినట్టు కాదు. పెట్టుబడిపై వచ్చే రాబడిపైనే పన్ను అమలవుతుంది. దీర్ఘకాల లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో మూడేళ్ల ముందుగానే ఈక్విటీ పెట్టుబడులను స్థిరాదాయ సాధనాల్లోకి మళ్లించుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. లక్ష్యానికి చేరువ అవుతున్నప్పుడు పెట్టుబడులు తక్కువ అస్థిరతలతో కూడిన సాధనాల్లో ఉండడం ఎంతో అవసరం. ఇలాంటప్పుడే సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అక్కరకు వస్తుంది. ఈక్విటీ ఫండ్స్ నుంచి మీ పెట్టుబడులను ఎస్‌డబ్ల్యూపీ ద్వారా డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవడం వల్ల మార్కెట్ కనిష్టంలో ఉన్నప్పుడు వైదొలిగే రిస్క్‌ను తప్పిస్తుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఉక్రెయిన్‌కు మరోసారి గూగుల్ సపోర్ట్ ఫండ్.. ఈసారి ఎంతంటే?
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ ఆర్ధిక వ్యవస్థ భారీగా దెబ్బతినింది. ఉక్రెయిన్ను ఆదుకోవడానికి టెక్ దిగ్గజం గూగుల్ 10 మిలియన్ డాలర్ల (రూ. 83 కోట్ల కంటే ఎక్కువ) విలువైన స్టార్టప్ సపోర్ట్ ఫండ్‌ను ప్రకటించింది. చాలా మంది ప్రజలు దేశాన్ని దాటి వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోని వ్యాపారాలను నిర్వహించుకోవడానికి గూగుల్ ఈ సపోర్ట్ ఫండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంలో పెద్దపెద్ద భవనాలు, హాస్పిటల్స్, స్కూల్స్ వంటివి కూడా బాగా దెబ్బతిన్నాయి. నిత్యావరాలకే కష్టమైన ఉక్రెయిన్ను ఆదుకోవడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ 2022 మార్చిలో ఫండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ను గూగుల్ ఇప్పటికి కూడా తన మద్దతు అందిస్తూనే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి సహాయక చర్యలకు మద్దతుగా 45 మిలియన్ డాలర్ల నగదు అందించినట్లు సమాచారం. గూగుల్ ఫండింగ్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ ఫండ్ సపోర్ట్‌తో స్టార్టప్‌లు 15.8 మిలియన్ ఫాలో ఆన్ ఫండింగ్‌ను పొందాయి. దీంతో ఆ దేశంలో ఉపాధి గణనీయంగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదీ చదవండి: విల్లాగా మారిన విమానం.. ఫిదా అవుతున్న జనం - వీడియో -
కొత్త లైన్లు లేవు.. ఉన్నవాటికే నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో రైల్వే శాఖకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల మంజూరు, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల సర్వేలాంటి కొత్తవాటి జోలికి కేంద్రప్రభుత్వం పోలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతోనే సరిపెట్టింది. ఆర్మూరు–ఆదిలాబాద్, వికారాబాద్–కృష్ణా లైన్లు సహా సికింద్రాబాద్–కాజీపేట మూడో లైన్లాంటి వాటి ఊసే లేకుండా రాష్ట్రానికి కేటాయింపులు చేసింది. తేడాది బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.4418 కోట్లు కేటాయించగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం మధ్యంతర బడ్జెట్లో రూ.5,071 కోట్లను ప్రతిపాదించింది. ఇది అంతకుముందు బడ్జెట్ కంటే 15 శాతం ఎక్కువ కావటం విశేషం. 2022–23లో రూ.2,038 కోట్లు కేటాయించారు. ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా... కాజీపేట–విజయవాడ మూడో లైను: రూ.310 కోట్లు. ఇది 2012–13లో మంజూరైంది. పూర్తి నిడివి 219 కి.మీ.. దీని అంచనా వ్యయం రూ.1857 కోట్లు. విజయవాడ–కొండపల్లి వైపు పని పూర్తి కాగా, ఇప్పుడు విజయవాడ–ఖమ్మం మధ్య నిర్వహిస్తున్నారు. గత బడ్జెట్లో రూ.337 కోట్లు కేటాయించారు. కాజీపేట–బల్లార్షా మూడో లైను: రూ.300 కోట్లు. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. కాజీపేట హసన్‌పర్తి మధ్య పనులు జరగాల్సి ఉండగా, ఎగువ భాగంలో దాదాపు పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.350 కోట్లు ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరు కాగా, నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ.. అంచ నా వ్యయం రూ.1160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భ రించనుండగా, రాష్ట్రప్రభుత్వం ఒకవంతుతో పాటు భూసేకరణ వ్యయాన్ని భరిస్తుంది. సిద్దిపేట వరకు పనులు పూర్తి కా వటంతో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సర్విసులు మొ దలయ్యాయి. సికింద్రాబాద్–సిరిసిల్ల మధ్య భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం నిధులు డిపాజిట్ చేయకపోవటంతో పనులు ఆగాయి. గత బడ్జెట్లో రూ.185 కోట్లు కేటాయించారు. భద్రాచలం–సత్తుపల్లి:రూ.6 కోట్లు ఇది 2010–11లో మంజూరైంది. నిడివి 54 కి.మీ. అంచనా వ్యయం రూ.704 కోట్లు. సింగరేణితో కలిపి రైల్వే ఈ సంయుక్త ప్రాజెక్టును చేపట్టింది. బొగ్గు తరలింపు ప్రధాన లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ: రూ.50 కోట్లు నగర ట్రాఫిక్‌కు ఊరటనిచ్చే ఈ ప్రాజెక్టును 2012–13లో మంజూరు చేశారు. అంచనా వ్యయం రూ.817 కోట్లు. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా రూ.450 కోట్లు. కానీ రాష్ట్రప్రభుత్వం రూ.130 కోట్లతోనే సరిపుచ్చింది. గత బడ్జెట్లో భారీగా నిధులు విడుదల కావటంతో పనులు వేగంగా సాగాయి. దీంతో ప్రాజెక్టు సిద్ధమైంది. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్: రూ.10 కోట్లు రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులివ్వలేదన్న ఉద్దేశంతో రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. గత బడ్జెట్లో నామమాత్రంగా రూ. 10 లక్షలతో సరిపెట్టింది. కానీ ఈసారి రూ.10 కోట్లు కేటాయించటంతో పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. చర్లపల్లి శాటిలైట్ టెర్మి నల్:రూ.46 కోట్లు సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయంగా చర్లపల్లిలో టెర్మి నల్ నిర్మించారు. ఇందులో 6 ప్లాట్‌ఫామ్స్, 5 పిట్ లైన్లు ఉంటాయి. రైల్వే కోరినంత భూమిని రాష్ట్రప్రభుత్వం కేటాయించలేదన్న విమర్శ ఉంది. దీంతో దీన్ని ఆశించినస్థాయిలో కాకుండా చిన్నదిగానే నిర్మించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. భద్రాచలం–కొవ్వూరు: రూ.10 లక్షలు ఇది కీలకప్రాజెక్టు అయినప్పటికీ నిధుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. గత బడ్జెట్లో రూ.20 కోట్లు కేటాయించగా ఈసారి నామమాత్రపు నిధులతోనే సరిపెట్టారు. మణుగూరు–రామగుండం: రూ.5 కోట్లు కీలక ప్రాజెక్టుకు తొలిసారి భారీ నిధులు కాజీపేట మీదుగా సికింద్రాబాద్–విజయవాడ మార్గం ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయ లైను అవసరం ఏర్పడింది. నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. 248 కి.మీ. మేర రెండోలైన్ నిర్మించాల్సి ఉంది. రూ.2853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. రెండు లైన్లు పూర్తయితే ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచుతారు. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. గత బడ్జెట్లో రూ.60 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల్లో దాన్ని రూ.10 కోట్లకు కుదించారు. అవి కూడా విడుదల కాలేదు. తొలిసారిగా ఆ ప్రాజెక్టుకు రూ.200 కోట్లను తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కాజీపేటలో నిర్మిస్తున్న వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.140 కోట్లు ప్రతిపాదించారు. తొలుత వ్యాగన్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపుగా మంజూరు చేసిన దీన్ని.. గత బడ్జెట్లో వ్యాగన్ తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అంచనా వ్యయాన్ని రూ.521 కోట్లకు పెంచారు. గతేడాది నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చదును చేయటం, కొన్ని షెడ్లు నిర్మించటం, ఒక ఆర్యూబీని సిద్ధం చేయటం.. తదితరాలు పూర్తి చేశారు. ఇప్పుడు మెరుగ్గానే నిధులు వచ్చినందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు వేగంగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. ఆ తదుపరి సంవత్సరం నాటికి అది పూర్తయి పని ప్రారంభించనుంది. -
రూ. 37 వేల కోట్లు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరం (2024–25)లో నీటిపారుదల రంగానికి రూ.37 వేల కోట్లను కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. మంగళవారం నీటిపారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. 2024– 25లో కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల నిమిత్తం రూ.14,462.17 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది కాక రూ.3000 కోట్లను తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ కింద తీసుకున్న రుణాలకు చెల్లింపులున్నాయని అధికారులు నివేదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సృష్టించేలా ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్‌సాగర్, నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్), మొడికుంటవాగు, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ, పెద్దవాగు (జగన్నాధపూర్), చనాకా కొరాటా, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) మురళీధర్ రావు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం.. విద్యుత్ సంస్థల్లో మరో ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌కో, జెన్కో, దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ నిధులెందుకు?
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు వెచ్చిస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల కొరతతో ప్రాథమిక దశలోనే పలు నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపింది. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు సంబంధించిన 19 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా కింద ఇవ్వాల్సిన రూ. 394 కోట్లను విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని సూచించింది. రాష్ట్ర విభజన తరువాత న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేసింది. నిధుల విడుదల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు అడిషనల్ జనరల్ (ఏఎస్జీ) బి.నరసింహ శర్మ హై కోర్టుకు తెలిపారు. ఇందుకు కొంత గడువునిస్తే కేంద్రం నిర్ణయం ఏమిటో తెలియచేస్తానన్నారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 4.82 కోట్లు మాత్రమే విడుదల కృష్ణాజిల్లా గన్నవరంలో పలు కోర్టుల కోసం భవన నిర్మాణాలను చేపట్టడం లేదని, పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడం లేదని, తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ, నిధుల కొరత వల్ల కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. 19 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం రూ. 656 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో కేంద్రం వాటా రూ. 394 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 83.33 కోట్లు కోసం హైకోర్టు కేంద్రానికి లేఖ రాసిందన్నారు. కేంద్రం తరఫున ఏఎస్జీ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ, ఈ విషయాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళతానన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం కేటాయించిన సొమ్ములో ఇంకా రూ. 14.44 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఈ మొత్తం విడుదల చేసినా కూడా ఇప్పటికే నిలిచిపోయిన 19 ప్రాజెక్టులు పూర్తి కావని తెలిపింది. అందువల్ల పూర్తిస్థాయి నిధుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఏఎస్జీకి స్పష్టం చేసింది. -
పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఫండ్స్
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. అయితే, ప్రతి నెలా ప్రణాణళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా, ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా సాధనాల్లో ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అలాంటి వారు ఈ తరుణంలో ఈక్విటీ పెట్టుబడులతోపాటు, పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ ఒకటి. మూడేళ్ల లాకిన్ ఉండే ఈ పథకంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను మినహాయింపులు సొంతం చేసుకోవచ్చు. రాబడులు ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా 18.73 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గడిచిన ఆరు నెలల కాలంలో రాబడులు 14.51 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడి 17.30 శాతంగా ఉంది. మూడేళ్లలో 18 శాతం, ఐదేళ్లలో 19.21 శాతం, ఏడేళ్లలో ఏటా 18.55 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 500 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్)తో పోలిస్తే ఐదు, ఏడేళ్ల కాలంలో ఈ పథకంలో రెండు శాతం అధిక రాబడులు ఉన్నాయి. ఈక్విటీ ఎల్ఎస్ఎస్ విభాగం కంటే కూడా ఇవే కాలాల్లో ఈ పథకమే మెరుగ్గా పనిచేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 20431 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పెట్టుబడిపై ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఎక్స్పెన్స్ రేషియో 1.58 శాతంగా ఉంది. 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తన నిర్వహణలోని ఆస్తుల్లో 98.35 శాతం ఈక్విటీలకు కేటాయించింది. మిగిలిన 1.65 శాతం నగదు నిల్వల రూపంలో ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 67 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 25 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 8.41 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు పెద్ద పీట వేసింది. 30.50 శాతం మేర పెట్టుబడులు ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది. మొదటి నుంచి ఈ పథకం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సేవల రంగ కంపెనీలకు 10 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.57 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.40 శాతం చొప్పు పెట్టుబడుల్లో కేటాయింపులు చేసింది. -
పెండింగ్ పనులకు నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్ఎఫ్ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. సినీ భూములను కాపాడాలని ఆదేశాలు సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్ అశోక్‌రెడ్డి, ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్ రెడ్డి, సతీష్, మోహన్ నాయక్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు.. ఏం చేయబోతోంది?
తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారెంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. సవాళ్ళను అధిగమించడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోంది? పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించింది. మిగతా నాలుగు గ్యారెంటీల అమలు కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న పథకాలకే నిధుల కొరతతో అల్లాడుతోంది. నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు రైతు బంధు నిధులు రైతుల ఖాతాలోకి పూర్తి స్థాయిలో చేరలేదు. దీనికి తోడు వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని కూడా ఎంతో కొంతమేర తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పథకాల అమలుకు ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం. నిధుల సమీకరణలో భాగంగానే ప్రధానమంత్రి, మంత్రులను సీఎం కలిసారట. ఇదే కాకుండా ఆర్దిక భారం లేని నిర్ణయాలకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రజా పాలనలో స్వీకరించిన ధరఖాస్తుల్లో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయగలిగే పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలుపై దృష్టి సారించారట. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయాలన్నా ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకోక తప్పదు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి పథకాల అమలుపై ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు. ప్రజా పాలనలో కోటి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ అమలు చేయాలంటే 60 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం అవుతుంది. వీటిని సమకూర్చుకోవడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే వంద రోజుల గడువు ముగియనుండడంతో పథకాల అమలుచేయడం అనివార్యం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పథకాలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు. అలాగని అమలు చేయాలనుకుంటే నిధుల సమస్య.. దీంతో ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు. చూడాలి మరి తెలంగాణ సర్కార్ గ్యారెంటీల అమలు గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో? చదవండి: చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ? -
ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక
సాక్షి, విజయవాడ: ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు 2,006 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు. లక్ష 77 వేల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, 4 లక్షల 9 వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం రూ.ఐదు వేల కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించింది. 21 రోజులు దాటకుండానే నిధులు చెల్లించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు 2024: వైఎస్సార్సీపీ కీలక సమావేశాలకు ముహూర్తం ఖరారు -
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్‌లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్‌గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్‌లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్‌టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్‌లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
మరో 68,990 మందికి సంక్షేమ ఫలాలు
సాక్షి, అమరావతి : జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ► అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ► అవసరమైతే వలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902కి ఫోన్‌చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు. ► సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు. ► ఆ తర్వాత ఆరు నెలలకోసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత.. ► సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ను ప్రదర్శిస్తారు. ► లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. ► నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాల లబ్ధి చేకూరుస్తోంది. -
తెరపైకి తెలంగాణ పార్కు
జిల్లా కేంద్రంలో తెలంగాణ పార్కు నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మళ్లించడంతో పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవలే నిధులు విడుదల చేసిన నూతన ప్రభుత్వం త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ అర్బన్: జిల్లా కేంద్రం వికారాబాద్‌కు ముక్కుపుడక లాంటి తెలంగాణ పార్కు ఏర్పాటు ఐదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గత ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు స్థలం గుర్తించి వదిలేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఇటీవలే జిల్లా కేంద్రం అభివృద్ధికి తెలంగాణ అర్భన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల నుంచి పార్కు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్ స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌కు సూచించారని వినికిడి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున స్పీకర్ జిల్లా కేంద్రంలోనే ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకల అనంతరం పార్కు నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. నిధుల మల్లింపుతో నిలిచిన పనులు 2019 జనవరి 29న అప్పటి కలెక్టర్ ఉమర్ జలీల్ తెలంగాణ పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో 13 ఎకరాల స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. 2020లో పార్కు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి లభించింది. ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ కింద వికారాబాద్ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి 25 శాతం పార్కు అభివృద్ధికే కేటాయించినట్లు ప్రచారం సాగింది. 2021 జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికే పార్కు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే ఇట్టి నిధులు అప్పటి పాలకులు, అధికారులు ఇతర అభివృద్ధి పనులకు మల్లించడంతో పార్కు నిర్మాణం పనులు ప్రారంభించలేదనే ప్రచారం ఉంది. పర్యాటకులు పెరిగే అవకాశం హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రమైన వికారాబాద్ వచ్చే ప్రధాన రోడ్డు పక్కనే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో ఈ పార్కు నిర్మిస్తే పర్యాటకులు పెరగడంతో పాటుగా స్థానికులకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. చెరువులో ఎప్పుడు నీరు ఉండటంతో పాటు, పట్టణానికి కొంత దూరంగా ఉండటం, హైదరాబాద్ ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో అనంతగిరికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పర్యాటకులు వచ్చే ప్రధాన రహదారి వెంటే పార్కు నిర్మిస్తే జిల్లా కేంద్రానికి మరింత వన్నె వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక హంగులతో పార్కును ఏర్పాటు చేసేందుకు అధికారులు గతంలోనే ప్రణాళికలు తయారు చేశారు. పార్కును ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై ఓ ప్రైవేటు కంపెనీ నమూనా గ్రాఫ్ తయారు చేసింది. ఈ తెలంగాణ పార్కులో ప్రత్యేకంగా చిన్న పిల్లల ఆటస్థలం వారు ఆడుకునేందుకు క్రీడా సామగ్రి ఏర్పాటు, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేశారు. ఆకట్టుకునే విధంగా గ్రీనరీ ఏర్పాటు, సుమారు వంద రకాల పూల మొక్కలు, పార్కు చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో మెరిసేలా ఏర్పాటు చేయాలని గ్రాఫ్‌లో పొందుపరిచారు. పార్కు నుంచి చెరువు అందాలు వీక్షించేందుకు కొంత ఎత్తులో నిచ్చెనలతో కూడిన ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కేంద్రానికి ముక్కుపుడక లాంటి ఈ పార్కు నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వమైనా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తొలి ప్రాధాన్యత పట్టణానికి అందాన్ని తీసుకొచ్చే తెలంగాణ పార్కు నిర్మాణం పూర్తి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. పార్కు నిర్మాణం పూర్తయితే మున్సిపల్‌కు ఆదాయంతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం వచ్చిన టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి పార్కుకు నిర్మాణానికి ఎక్కువ శాతం కేటాయించాలని స్పీకర్‌ను కోరాం. – మంజుల, మున్సిపల్ చైర్పర్సన్, వికారాబాద్ -
విదేశీ విద్యా దీవెన స్కాలర్షిప్ తో మా కల నెరవేరింది: విద్యార్థులు
-
తక్కువ రిస్క్.. స్థిరమైన రాబడికి బెస్ట్ ఆప్షన్..
ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు సర్వ సాధారణం. ఆటుపోట్లతో చలిస్తూ ఉంటాయి. కానీ, దీర్ఘకాలానికి నికర ప్రతిఫలం సానుకూలంగానే ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం అందరు ఇన్వెస్టర్లలోనూ ఉండాలని లేదు. కొందరు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికి ఈక్విటీ, డెట్‌తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా ఒకటి. రిస్క్ తక్కువ ఉండాలని కోరుకునే వారు ఈ పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిన ఏడాది కాలంలో ఈ పథకం 9 శాతం రాబడులను అందింంది. మూడేళ్ల కాలంలో రాబడి ఏటా 13.56 శాతంగా ఉంది. ఐదేళ్ల కాలంలో చూసుకుంటే 13 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడులను ఈక్విటీ, డెట్ మధ్య వర్గీకరిస్తాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండు మార్కెట్లలోని ప్రయోజనాలను ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్న సమయంలో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీలు అధిక రాబడులకు, డెట్ పెట్టుబడులు రక్షణకు సాయపడతాయి. పైగా అచ్చం డెట్ పథకాల్లో చేసే దీర్ఘకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం పరంగా ఉన్న పన్ను ప్రయోజనాన్ని ఇటీవల ఎత్తివేశారు. దీంతో హైబ్రిడ్ ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఈక్విటీకి ఉండే పన్ను మినహాయింపు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్‌కు కేటాయిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపుల్లో మార్పులు చేస్తుంటుంది. ఈక్విటీల్లోనూ 50 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌కే కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు కొంత తక్కువగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ర.59,302 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో ఈక్విటీలకు 76.76 శాతం కేటాయింంది. డెట్ పెట్టుబడులు 20.32 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో 0.91 శాతం ఇన్వెస్ట్ చేయగా, 2 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీలకు 75 శాతం మిం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు. డెట్ కంటే ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ర్యాలీకి అవకాశం ఉన్నప్పుడు అధికంగా కేటాయింపులు చేయడం ద్వారా రాబడులు పెంచుకునే విధంగా ఫండ్ మేనేజ్మెంట్ బృందం పనిచేస్తుంటుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోన 85 శాతం మేర ప్రస్తుతం లార్జ్‌క్యాప్ కంపెనీలోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 14.56 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయింపులు 0.68 శాతంగానే ఉన్నాయి. డెట్‌లో రక్షణ ఎక్కువగా ఉండే ఎస్‌వోవీ, ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే అధిక పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 35 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 24 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. సేవల రంగ కంపెనీలకు 7.45 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.23 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 6.12 శాతం, కమ్యూనికేషన్ కంపెనీలకు 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. -
యాక్సిస్ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘యాక్సిస్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. డిసెంబర్ 1 నుంచి 15 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. నూతన పథకం ద్వారారూ.2,500 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. దేశ తయారీ రంగంలోని అవకాశాలపై ఈ పథకం పెట్టుబడులు పెడుతుందని తెలిపింది. నిఫ్టీ మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్‌ను ఈ పథకం ట్రాక్ చేస్తుంది. శ్రేయాష్ దేవాల్కర్, నితిన్ అరోరా ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో చేసిన పెట్టుబడిని 12 నెలల్లోపు ఉపసంహరించుకుంటే 10 శాతంపై ఎలాంటి ఎగ్జిట్ లోడ్ విధించరు. మిగిలిన మొత్తంపై 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి నాటికి సంస్థ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.2.25 లక్షల కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి.గోప్‌కుమార్ తెలిపారు. -
మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
మనసుంటే మార్గమూ ఉంటుంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఓఎన్జీసీ పైపులైన్ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నిధులు విడుదల చేశారు. దీంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్ల లబ్ధి చేకూరింది. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ ఏమన్నారంటే: ‘‘ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. ఒక మంచి కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేసేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.’’ ‘‘నిజానికి ఇవాళ తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతాం. ఇవాళ ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7500 మంది, మొత్తంగా 23,458 మంది ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం. నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడి, వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మత్స్యకారుల తరపున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో రూ. 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించాం. ఈ రోజు 4వ విడతగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 6 నెలలకు సంబంధించి రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోంది. నాలుగో విడతలో ఇవాళ మనం ఇస్తున్న రూ.161 కోట్లు కలుపుకుంటే మొత్తంగా రూ.485 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాం. ఇంతకుముందు 2012లో కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జీఎస్పీసీ అప్పట్లో ఇదే రకమైన కార్యక్రమం చేయడం వలన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగింది. రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. అప్పటి నుంచి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి. మనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఆలోచన చేయలేదు. ఈ డబ్బులు పడకపోతే ఆ మత్స్యకార కుటుంబాలు ఏ రకంగా బతకగలుగుతాయి ? వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాలన్న ఆలోచన గతంలో జరగలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఫస్ట్ మనం ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేసి.. తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ డబ్బును వెనక్కు ఇప్పించుకోగలిగాం. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలనే తపన ఉంటుందో అక్కడ దేవుడి సహకారం ఉంటుంది. దానికి నిదర్శనమే జీఎస్పీసీ పరిహారం ఉదంతం. ఇవాళ కూడా ఉభయగోదావరి జిల్లాల్లో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా, ప్రతి సంవత్సరం వచ్చేటట్టుగా అడుగులు వేస్తూ.. నాలుగోదఫా రూ.161 కోట్లు ఇప్పిస్తూ... మొత్తంగా రూ.485 కోట్లు ఇప్పించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇవాళ మత్స్యకారుల సంక్షేమం పట్ల ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందన్నది చెప్పడానికి.. నిన్న విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఉదాహరణ. 40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వస్తే వెంటనే వాళ్లని ఆదుకోవాలని తపన, తాపత్రయం పడ్డాం. వాటికి ఇన్సూరెన్స్ ఉందా ? లేదా ? అని విచారణ చేశాం. ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదని.. వాళ్లకు మేలు చేయాలని, ప్రతి బోటు విలువ లెక్కగట్టమని చెప్పాం. ఆ బోటుకు సంబంధించి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించాం. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది. ఈ కార్యక్రమంలో సహకరించిన, తోడుగా ఉన్న ఓఎన్జీసీ అధికారులందరికీ మనస్పూర్తిగా నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని సీఎం తన ప్రసంగం ముగించారు. చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి -
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి కన్నుమూత!
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి రోజ్లిన్ కార్టర్(96) ఆదివారం స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతిపై అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకూ ఏది సాధించినా దానివెనుక రోజ్లిన్ నాకు అండగా నిలిచారు. నేను నిరాశకు గురైనప్పుడల్లా, ఆమె నాకు ప్రోత్సాహాన్ని అందించారు. నాకు నిరంతరం మంచి సలహాలు ఇచ్చేవారు. ఆమె నాకు ఉత్తమ సలహాదారు’ అని పేర్కొన్నారు. గత ఏడాది(2022) మేలో ఆమెకు డిమెన్షియా అనే వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో ఆమె చికిత్స అందుకుంటోంది. అయితే గత ఫిబ్రవరి నుంచి ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. జిమ్మీ తన పదవీకాలంలో ఇజ్రాయెల్- ఈజిప్టు మధ్య శాంతి ఒప్పందం కుదిర్చారు. ఈ విజయంపై ప్రపంచ వేదికపై ఆయనకు ప్రశంసలు అందాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, ఇరాన్ వివాదాల కారణంగా జిమ్మీ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రోజ్లిన్ తన భర్తకు అండగా నిలిచారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం కార్టర్ దంపతులు కార్టర్ సెంటర్ అనే సంస్థను స్థాపించారు. జిమ్మీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ దంపతులు క్యూబా, సూడాన్, ఉత్తర కొరియాలను సందర్శించారు. జిమ్మీ కార్టర్‌కు 2002లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. 1999లో నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్.. కార్టర్ దంపతులను అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌తో సత్కరించారు. ఇది కూడా చదవండి: పాక్‌నూ కాటేస్తున్న వాయుకాలుష్యం -
మీరే తెలంగాణ ద్రోహులు
లక్డీకాపూల్(హైదరాబాద్):‘అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు’’అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రో హులంటూ తననుద్దేశించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన వెన్నుపోటుదారులనీ, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి తమ కుటుంబాన్నే అభివృద్ధి చేసుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి దివాలా తీయించి, కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని చెప్పి పనికి రాని ప్రాజెక్ట్ కట్టి రూ.లక్ష కోట్లు కాజేశారు’అని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉ ద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫాంహౌస్‌కే.. నియామకాలు మీ ఇంట్లోకే పరిమితం చేశారు’అని షర్మిల ఆరోపించారు. -
భీకర యుద్దం..పాలస్తీనియన్ల కోసం ఈ చిన్నారి చేసిన పని తెలిస్తే!
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 8,525వేల మంది పాలస్తీనియన్లు బలయ్యారు. ఈ నేపథ్యంలో దాడులను ఆపివేయాలని ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తున్నాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు. అయితే ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్‌ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. కాల్పులు ఆపడమంటే హమాస్ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర యుద్దం నేపథ్యంలో వర్తక, వాణిజ్యాల్లో కుదుపులకు కారణమవుతోంది. ఈ క్రమంలో పాలస్తీనియన్ల కోసం భారీగా నిధులు సమకూరుతున్నాయి. సిరియాలోని ఓ మసీదులో పాలస్తీయన్ల కోసం పలువురు విరాళాలు ఇస్తుండగా, ఓ చిన్నారి సైతం తనకు తోచినంత సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Crowd funding was being done for Palestinians in a Mosque in Syria when this little girl arrived with her small gift❤️#StopGenocideInGaza #Palestine pic.twitter.com/njxeUyLH7R — هارون خان (@iamharunkhan) November 1, 2023 -
ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి?
రాజకీయ పార్టీల విరాళాల సేకరణ విషయంలో ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు నూతన విధానంలో విరాళాలు స్వీకరిస్తున్నాయి. దీనినే ఎలక్టోరల్ బాండ్స్ అని అంటారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అంశంపై మరోసారి దుమారం చెలరేగడంతో పాటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. అయితే ఎన్నికల విరాళాలు స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు జారీకావు. ఎలక్టోరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. వీటిలో అతి తక్కువ విలువ కలిగిన బాండ్ రూ. 1,000. కోటి రూపాయలది అత్యధిక విలువ కలిగిన బాండ్. ఈ బాండ్ల కొనుగోలు సంఖ్యపై పరిమితి లేదు. ఎన్నికల సమయంలో, ఎలక్టోరల్ బాండ్ల విక్రయం విపరీతంగా పెరుగుతుంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుతాయి. ఎన్నికల విరాళాలను స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీలు ఏవి అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన అంటే రిజిస్టర్ అయిన పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు. ఇంతేకాకుండా లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల విరాళాలు స్వీకరించే పార్టీ ఓట్ షేర్ ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎన్నికల విరాళాలకు సంబంధించిన నియమాలు చాలా సులభతరం అయ్యాయి ఒక వ్యక్తి, సమూహం లేదా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. సంబంధిత రాజకీయ పార్టీ ఈ బాండ్‌ను జారీ చేసిన 15 రోజుల్లోగా ఎన్‌క్యాష్ చేసుకోవాలి. ప్రతి లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు భారీగా విరాళాలు అందుతాయి. ఇది కూడా చదవండి: పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం? -
పథకం ఒకటే.. ప్రయోజనాలు రెండు
వేతన జీవులు సెక్షన్ 80సీ కింద ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల పన్ను ఆదా కోసం సంప్రదాయ సాధనాలైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, బీమా పాలసీలు, పీపీఎఫ్, ఎన్ఎస్ఈ తదితర సాధనాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికంటే కూడా దీర్ఘకాలానికి పన్ను ఆదా సౌలభ్యంతో కూడిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మ్యూచువల్ ఫండ్ పథకాలు రాబడుల దృష్ట్యా ఎంతో మెరుగైనవి. కనీసం ఐదేళ్లు, అంతకుమించి దీర్ఘకాలం కోసం పెట్టుబడులను కొనసాగించే సౌలభ్యం ఉన్న వారు ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులపై రెండంకెల స్థాయిలో రాబడులను అందుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు ఉన్నప్పుడే సంపద సృష్టి సాధ్యపడుతుంది. మరి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇచ్చేవి ఈక్విటీ సాధనాలే. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో పరాగ్ పారిఖ్ ట్యాక్స్‌సేవర్ కూడా ఒకటి. రాబడులు ఈ పథకం 2019 జూలై 24న ఇది ప్రారంభమైంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు సగటు వార్షిక రాబడులు 21 శాతానికిపైనే ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో 12 శాతం, ఏడాది కాలంలో పెట్టుబడిపై 13.55 శాతం రాబడిని ఈ పథకం తెచ్చిపెట్టింది. పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్‌కు.. ఈ రంగంలో ఎంతో పేరున్న రాజీవ్ ఠక్కర్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉంది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ పథకాన్ని సైతం ఆయనే నిర్వహిస్తున్నారు. ఇక ఈ పథకం గడిచిన మూడేళ్ల కాలంలో ఏటా 22 శాతానికి పైనే రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథ కం ఎక్స్పెన్స్ రేషియో (పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఏటా చెల్లించాల్సిన మొత్తం) 1.86 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం.. ఈ పథకం పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అనుసరిస్తుంది. వ్యాల్యూ ఇన్వెస్టింగ్ విధానంలో స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. కనీసం 80 శాతం పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 20 శాతం మేర పెట్టుబడుల విషయంలో ఈ పథకానికి స్వేచ్ఛ ఉంటుంది. ఈక్విటీల్లోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. మంచి యాజమాన్యం, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధిని చూపించే కంపెనీలను ఎంపిక చేసుకుని, దీర్ఘకాలం పాటు వాటిల్లో పెట్టుబడులను కొనసాగిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. మూడేళ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది కూడా పెట్టుబడులు, రాబడుల స్థిరత్వానికి అనుకూలించే అంశమే. ఈ పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సమయంలో లాభం రూ.లక్షకు మించి ఉన్నట్టయితే.. రూ.లక్షకు మించి ఉన్న మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ నెలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి ఆశించొచ్చు. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.2065 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 85 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 15 శాతం పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం నగదు నిల్వలు పెద్దగా లేవు. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురై, ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తే, అప్పుడు డెట్‌లో పెట్టుబడులు తగ్గించుకుని ఈక్విటీలకు కేటాయింపులు పెంచుతుంది. పెట్టుబడుల పరంగా ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. 50 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీలకే కేటాయించింది.