14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం | Ministry of Home Affairs releases 5858.60 crore to 14 flood affected | Sakshi
Sakshi News home page

14 రాష్ట్రాలకు వరదసాయం నిధులువి డుదల చేసిన కేంద్రం

Published Tue, Oct 1 2024 8:16 PM | Last Updated on Wed, Oct 2 2024 9:33 AM

Ministry of Home Affairs releases  5858.60 crore to 14 flood affected

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.5,858.60 కోట్లు వరద సాయం నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు మంజూరు చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్‌ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు  కేటాయించింది.

అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement