flood effected areas
-
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025 -
210కి పెరిగిన స్పెయిన్ వరద మృతులు
మాడ్రిడ్: స్పెయిన్‌లో ఆకస్మిక భారీ వరదలకు బలైన వారి సంఖ్య 210 దాటింది. చాలామంది గల్లంతయ్యారు. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీస్తున్నాయి. శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు, నేలకూలిన చెట్లు, కూలిన విద్యుత్ లైన్లు, గల్లంతైనవారి గురించి ఆత్మీయుల ఆందోళనలు... ఇలా ఎక్కడ చూసినా ఈ విషాద దృశ్యాలే కనబడుతున్నాయి. ఆకస్మిక తుఫాను కలిగించిన భారీ నష్టం సునామీ అనంతర పరిణామాలను తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.Rescuer rescuing a women and her pet dog from flooded area in Spain.There is severe flash floor occurred serval region in Spain. The worst affected area is Valencia which records highest rainfall in 28 years. The death toll from the flood in Valencia alone has risen to 92.… pic.twitter.com/nUOcwBM4nW— Eagle EyE (@mkh_nyn) October 31, 2024 🤯The worst flood in the last 37 years: at least 72 people died in Spain, dozens went missing, RTVE.Three days of mourning have been declared in the country. There is still no normal access to some areas. pic.twitter.com/KLQQSuniCa— Nurlan Mededov (@mededov_nurlan) October 30, 2024Catastrophic flooding in Spain.#Flood#Spain pic.twitter.com/32Vwotrv4F— Jennifer Coffindaffer (@CoffindafferFBI) October 30, 2024⚠️Devastating images aftermath flood in the Alfafar in the province of Valencia, Spain63 reported deaths so far in Spain due to catastrophic floods…#Valencia #Spain pic.twitter.com/rnsexKKI3P— Culture War (@CultureWar2020) October 30, 2024 -
బాబుకు బాధిత అవ్వ మాస్ వార్నింగ్..
-
ప్రతి అర్జీని పరిశీలించి నష్ట పరిహారం అందిస్తాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్ట పరిహారం అందిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మెయిన్ ఎడిషన్‌లో మంగళవారం ‘అర్జీలు బుట్టదాఖలు ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్‌ఛార్జి కలెక్టర్ స్పందించారు. మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బుడమేరు వరద నష్టంలో భాగంగా గృహ, ఎంఎస్ఎంఈ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.235.72 కోట్లను జమ చేశామని వివరించారు. 179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పిజిఆర్ఎస్ ఫ్లడ్ మాడ్యూల్లో నమోదు చేశారన్నారు. ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేశారన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 24వ తేదీలోగా అర్హులైన బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కాగా.. సాయం కోసం కలెక్టరేట్‌కు ఎన్ని దరఖాస్తులొచ్చాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. -
వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ నేతలు నిరాహార దీక్ష
-
వరదలు చూసి వసూలు చేసిన చందాలు పేద వారికి పంచకుండానే మింగేశారు
-
వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్.. ఆ తర్వాత ఏమైందంటే?
పాట్నా: వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన భారత ఆర్మీకి చెందిన ఐఏఎఫ్ హెలికాప్టర్ అదుపు తప్పి నీటిలో పడిపోయింది. హెలికాప్టర్ వరద నీటిలో పడిపోవడంతో పైలట్, జవాన్లను స్థానికులు పడవల సాయంలో సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకరారం.. కొద్దిరోజులుగా బీహార్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. కోసీ బ్యారేజ్ నుంచి భారీగా నీటి విడుదల కారణంగా అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి సామాగ్రి ఇవ్వడానికి ఐఏఎఫ్ హెలికాప్టర్ బయలుదేరింది. Bihar: IAF chopper carrying flood relief material from Sitamarhi crashes in Muzaffarpur#greaterjammu pic.twitter.com/blHtCpMtxe— Greater jammu (@greater_jammu) October 2, 2024 బుధవారం ఒక ఐఏఎఫ్ హెలికాప్టర్ ద్వారా సీతామర్హి నుంచి వరద సహాయ సామగ్రిని పంపారు. అయితే ఔరాయ్‌లోని నయా గావ్‌లో వరద మయమంగా మారిన ప్రాంతంలో ఆ హెలికాప్టర్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ సడెన్‌గా వరద నీటిలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో నీటిలోనే సగం వరకు హెలికాప్టర్ మునిగిపోయింది. అయితే, పైలట్, అందులోని జవాన్లు సురక్షితంగా ఉన్నారు, దీంతో, స్థానికులు పడవల్లో హెలికాప్టర్ వద్దకు చేరుకుని వారిని కాపాడారు. ఆ హెలికాప్టర్లో ఉన్న సహాయ సామగ్రిని మరికొందరు ఎత్తుకెళ్లారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. मुजफ्फरपुर में वायु सेना का हेलीकॉप्टर हुआ क्रैश, बाढ़ राहत सामग्री पहुंचाने के लिए भरा था उड़ान, Watch Video #HelicopterCrash #Muzaffarpur #BiharNews #BiharFlood #FloodNews pic.twitter.com/DqteaZ4Fkp— News4Nation (@news4nations) October 2, 2024 మరోవైపు.. ఈ ఘటనపై ఐఏఎఫ్ స్పందించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్, జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. ప్రమాదం ఎలా జరిగిందో అధికారులు విచారణ చేపట్టనున్నారు. An ALH helicopter of the #IAF, which was engaged in flood relief operations in the Sitamarhi sector in Bihar, executed a precautionary landing in inundated area due to a technical issue. All crew are reported to be safe, with no damage to civilian life or property reported. #IAF…— Indian Air Force (@IAF_MCC) October 2, 2024ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై బాంబు పేలుడు.. ఎగిరిపడిన ట్రాక్ -
14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.5,858.60 కోట్లు వరద సాయం నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది.అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. Ministry of Home Affairs releases ₹ 5858.60 crore to 14 flood-affected as a central share from the State Disaster Response Fund (SDRF) and an advance from the National Disaster Response Fund (NDRF)Government stands shoulder to shoulder with the states affected by natural…— PIB India (@PIB_India) October 1, 2024 -
సాయం అందక.. నిస్సహాయంగా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) / విజయవాడ స్పోర్ట్స్: ‘‘ఇప్పటికి ఎనిమిది సార్లు అర్జీలు ఇచ్చా.. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. ఇంకెక్కడికని తిరగాలి..? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ల నుంచి బయటపడ్డాం. సర్వం కోల్పోయాం. మాకు నష్ట పరిహారం రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం ఏమిటి..? ఈ వయసులో పడుతూలేస్తూ కలెక్టరేట్‌కు వచ్చాం. ఇదేం ఖర్మ..? రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నాం. ఆయన (సీఎం చంద్రబాబు) వచ్చి న్యాయం చేయాలి కదా..?’’ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి కన్నీటి వేదన ఇదీ! సరిగ్గా నెల క్రితం బుడమేరు వరద నగరంపై విరుచుకుపడింది. జీవిత కాలం కష్టార్జితం అంతా నీటి పాలైంది. పది రోజులకుపైగా వరద, బురదలోనే బాధితులు మగ్గారు. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నివ్వెరపోతున్నారు. పొంతన లేని విధంగా సర్వే వివరాలున్నాయి. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా పరిహారం అందలేదు. సచివాలయాలకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనూ అర్జీలు అందచేసినా కనీస స్పందన లేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బాధితులు సోమవారం విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, బాలింతలు చంటి బిడ్డలను చంకనేసుకుని వేల సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వరద నీటిలో చంటి బిడ్డలను పెట్టుకుని పది రోజులు గడిపామని.. కనీసం పిల్లల ముఖాలు చూసైనా పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.చివరి రోజు కావడంతో..బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని సెప్టెంబర్ 25న ప్రభుత్వం ప్రకటించింది. 30వతేదీ లోగా బాధితులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొంది. అయితే గడువు ముగుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం.. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారని ప్రచారం జరగడంతో బాధితులంతా కలెక్టరేట్‌కు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున చేరుకుని పడిగాపులు కాసినా సీఎం చంద్రబాబు రాలేదు. చివరి రోజు కావడంతో దరఖాస్తుల కోసం బాధితులు పరుగులు తీశారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు కనీస సౌకర్యాల లేక వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులు, గర్భిణులు నానా ఆగచాట్లు పడ్డారు.జాబితాలో చిత్ర విచిత్రాలు..‘‘ప్రియమైన పైడి సాయిదీపక్...! మీ బ్యాంకు ఖాతా ఆధార్ నంబరుతో లింక్ కాకపోవడం వల్ల వరద నష్ట పరిహారం ఖాతాలో జమ కాలేదు. వెంటనే మీ బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాను ఆధార్‌తో లింకు చేసుకోవాలి..!’’ ఓ బాధితుడి మొబైల్‌కు ప్రభుత్వం పంపిన సందేశం ఇదీ! చిత్రమేమిటంటే సాయిదీపక్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి బ్యాంకులో ఖాతా లేదు. ఇక ఆధార్ లింక్ అయ్యే అవకాశమే లేదు. నష్ట పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని దీపక్ తండ్రి వాపోయాడు. ఇలాంటి సందేశమే ఐదేళ్ల మరో బాలికకు కూడా వచ్చింది.పొంతన లేని లెక్కలు..ప్రభుత్వం 90 శాతం మందికి నష్ట పరిహారం అందజేసినట్లు ప్రకటించింది. మిగిలిన 10 శాతం మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నట్లు తేల్చింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలు కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరినీ కదిలించినా తమకు పరిహారం అందలేదని.. ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. బ్యాంకు ఖాతా వివరాలు సరిగానే ఉన్నా.. పరిహారం అందలేదని చెబుతున్నారు.జగన్ ప్రభుత్వమే ఉంటే..కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు బాధితులు గత ప్రభుత్వ పాలన, వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుని చర్చించుకోవడం కనిపించింది. ‘‘కరోనా లాంటి విపత్తులోనూ ఇంటింటికీ తిరిగి సేవలందించారు. ఏరోజూ మాకు ప్రభుత్వ సాయం అందలేదని రోడ్డెక్కలేదు. ఇప్పుడు వరదల్లో సర్వం కోల్పోయి పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అదే వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉండి ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు. పారదర్శకంగా అందరికీ సాయం అందేది..’’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం గమనార్హం.అమ్మకు రిక్త హస్తం..వాంబే కాలనీ హెచ్ బ్లాక్‌లో ఉంటున్నాం. నా భర్త కూలీ. వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాం. జాబితాలో నా పేరుకు బదులు మా ఐదేళ్ల పాప ఉషశ్రీ పేరు వచ్చింది. పాప పేరుతో బ్యాంకు ఖాతా లేనందున డబ్బులు రాలేదు. కలెక్టరేట్లో అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. – కురిటి సుజాత, వాంబే కాలనీగతంలో ప్రతిదీ ఇంటి వద్దే..జగన్ ప్రభుత్వమే ఉంటే కష్ట కాలంలో మాకు అండగా నిలిచేది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా గతంలో ప్రతిదీ ఇంటి వద్దే అందజేశారు. కరోనా లాంటి కష్టంలోనూ ఇబ్బందులు పడనివ్వలేదు. వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. కాళ్లు అరిగేలా సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తుంటే.. జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. – పాముల పద్మ, వాంబే కాలనీఇదిగో.. అదిగో అంటున్నారుప్రకాష్ నగర్లో అద్దెకు ఉంటున్నా. వరదతో ఇంట్లో సామాన్లు మొత్తం పోయాయి. అధికారులు ఇంటికి వచ్చి రాసుకుని ఫోటోలు తీసుకున్నా డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ ఇప్పటికి పది సార్లు తిరిగాను. ఇదిగో పడతాయి.. అదిగో పడతాయని ఆశ పెట్టి రోజూ తిప్పుకుంటున్నారు. కలెక్టరేట్లో అర్జీ ఇద్దామని వచ్చా. – షేక్ ఫాతిమా, ప్రకాష్నగర్ఏ ఒక్కరూ పట్టించుకోలేదు..కూలీ పనులు చేసుకుని బతికే వాళ్లం. కనీసం సొంత ఇల్లు లేదు. వాంబే కాలనీలో అద్దెకు ఉంటున్నాం. వరద వల్ల చాలా నష్టపోయాం. అపరిశుభ్రతతో పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆదుకోవాలని నాయకుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మాలాంటి వాళ్లకు సాయం అందకుండా చేశారు. కాస్తయినా కనికరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – ఏల్చూరు సతీష్, మల్లీశ్వరి దంపతులుకాళ్లు అరిగేలా తిరిగా..పరిహారం కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా. ఇదిగో అదిగో అంటూ రోజుకు నాలుగైదు సార్లు తిప్పారు. ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు వచ్చా. సచివాలయంలో ఇప్పటికి పది అర్జీలు ఇచ్చా. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – వెంకాయమ్మ, పైపుల రోడ్డుఈ ఫొటోలో కనిపిస్తున్న వై.సీతకు కళ్లు కనిపించవు. ఆమె భర్త కూడా అంధుడే. గత ఆగస్టు 25న ఇందిరా నాయక్‌నగర్ కాలనీలోని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 30వతేదీన ఆ ఇంటిని వరద ముంచెత్తింది. ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల పిల్లలతో పాటు నీళ్లలోనే గడిపారు. చుట్టుపక్కల వారి సాయంతో ఎట్టకేలకు బయట పడ్డారు. పది రోజులు నీళ్లలో నానడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. కొత్త ఇంటికి డోర్ నెంబర్ లేదని పరిహారం ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ సమర్పించినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అర్జీ ఇచ్చేందుకు భర్తతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. -
‘వరద’ సాయం పంపిణీలో హాహాకారాలు!
పాయకాపురం (విజయవాడరూరల్): వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కుక్కర్లు, గ్యాస్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభించి.. ఒక్కసారిగా గేట్లు తీయడంతో బాధితులంతా కల్యాణ మండపంలోకి ప్రవేశించడంతో జరిగిన తొక్కిసలాటలో వృద్ధులు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 64వ డివిజన్ కండ్రికలోని కల్యాణమండపంలో వరద బాధితుల సహాయార్థం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గ్యాస్‌స్టవ్‌లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.అయితే గురువారం రాత్రే టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కూపన్లు పంపిణీ చేశారు. సర్వం కోల్పోయిన బాధితులంతా అక్కడికి చేరుకుని క్యూలైన్లలో నిలబడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా, అధికార ప్రతినిధి పట్టాభి, బుద్ధా వెంకన్న పంపిణీ ప్రారంభించారు. కల్యాణ మండపం గేట్లు తెరవడంతో బాధితులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో భారీ ఎత్తున తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు కిందపడిపోయారు. వారిపై బారికేడ్లు పడడం, వెనుక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లడంతో ఊపిరాడక హాహాకారాలు చేశారు. ఆ ప్రాంతమంతా బాధితుల ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో వారు తోపులాటలో చిక్కుకుని గాయపడ్డారు. పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు. మహిళా పోలీసులు బారికేడ్లను తొలగించడంతో ప్రాణ నష్టం తప్పింది. టీడీపీ జనసేన కార్యకర్తలకే టోకెన్లు పంచుకున్నారు. ముఖాలు చూసి మరీ టోకెన్లు ఇచ్చారు. టీడీపీ జనసేన కార్యకర్తలే వరద బాధితులా? మేం బాధితులం కాదా అంటూ కండ్రిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్షం ఎఫెక్ట్.. మీర్పేట్లో ఇళ్లలోకి వరద నీరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మీర్పేట్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ పరిధిలోని మిథిలా నగర్, సత్యసాయి నగర్ సహా పలు కాలనీల్లోకి చెరువు నీరు వచ్చి చేరుతోంది. నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక.. ఎస్ఎన్డీపీ నాలా మూసుకుపోవడంతో మ్యాన్‌హోల్స్ నుంచి నీరు ఉప్పొంగుతోంది. రాత్రి నుంచి క్రమంగా నీరు పెరిగి ఉదయానికి నీరు ఇళ్లలోకి చేరుకుంది.ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గత ముడు రోజులుగా మా కాలనిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. బయటికి రాలేము, ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. వర్షాల కారణంగా మంత్రాల చెరువు, పెద్ద చెరువు నిండి వరదనీరు కాలనీలోకి వస్తోంది. వరద నీటి కోసం గతంలో వేసిన ట్రాంక్ పైప్ లైన్లు మూసుకుపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ.. శాశ్వత పరిష్కారం లేదని తెలిపారు. -
ఇంకా అందని సాయం..
-
వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్‌గా మార్చి..
చంపావత్: ఉత్తరాఖండ్‌లో హృదయవిదారక ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా చంపావత్ జిల్లాలోని సీల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. అయితే ఇదే సమయంలో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు లక్ష్మీదేవి(60)ని ఆస్పత్రికి తరలించడంలో చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ గ్రామస్తులు.గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లే రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో గ్రామస్తులు డోలీ సాయంతో బాధితురాలు లక్ష్మీదేవిని సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు తీసుకువెళ్లి, ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీల్ గ్రామంలో ఉంటున్న జోగా సింగ్ భార్య లక్ష్మీదేవి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం సరిగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డోలీ సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గంగలి, నేత్ర సలాన్‌ల మధ్య రోడ్డు పూర్తిగా మూసుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. सड़क बंद एंबुलेंस बनी 'डोली'..उत्तराखंड: चंपावत में ग्रामीणों ने तीन किलोमीटर पैदल चलकर सड़क तक बीमार महिला को ऐसे पहुंचाया.#Uttarakhand । #Champawat । #Ambulance pic.twitter.com/7sL9cnRqCL— NDTV India (@ndtvindia) September 23, 2024ఇది కూడా చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో! -
రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం లడ్డూ వేలం విరాళాలు
-
7 వేల కోట్లు నష్టం..700 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు
-
వాళ్లకి సన్న బియ్యం.. దళితులకు కోటా బియ్యం.. పవన్ ఎంత మోసం చేశాడు...!
-
ఇదండీ ‘బాబు సర్కార్’ డొల్లతనం.. నారాయణను నిలదీసిన జనం
సాక్షి, విజయవాడ: ప్రచారార్భాటమే తప్ప.. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అసంపూర్తిగా సాగుతున్నాయి. వరదలు సంభవించి 15 రోజులైనా రోజులైనా వరద కష్టాలు వీడటంలేదు. నిన్న రాత్రి(శనివారం) కండ్రిగ సాయిబాబానగర్‌లో మంత్రి నారాయణ పర్యటనలో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. మంత్రి నారాయణను వరద బాధితులు నిలదీశారు. తమకు కనీసం మంచినీరు కూడా అందడం లేదని మండిపడ్డారు. ఎక్కడ చెత్త అక్కడే వదిలేశారని ప్రజలు నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోయిన మంత్రి నారాయణ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, సింగ్‌నగర్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సంబంధిత వార్త: మానని గాయం.. తీరని నష్టంబుడమేరు వరదకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. అందుకూ పనికిరాని వస్తువులను బాధితులు రోడ్లపై పడేస్తున్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది.బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్నారు. పాడైపోయిన విలువైన సామాగ్రితో వీధులన్నీ నిండిపోయాయి. డాబాలపైనే బాధితులు బతుకీడుస్తున్నారు. పేరుకున్న చెత్త, మురుగుతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎమ్మెల్యేలు, అధికారులు ఏమైపోయారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Vijayawada: సాయంలోనూ ‘పచ్చ’పాతం
సాక్షి, విజయవాడ: వరద బాధితులకు దాతలు సమకూర్చిన సరుకులను సైతం టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. వరద బాధితులకు అందించే సాయంలోనూ టీడీపీ నేతలు పక్షపాతం ప్రదర్శిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాలను స్వచ్ఛంద సంస్థలు భారీగా అందిస్తున్నాయి.అయితే, స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకులు.. దాతలు ఇస్తున్న సాయాన్ని తామే పంచుతామని నమ్మించి తీసుకుంటున్నారు. ఆ తరువాత వాటిని బాధితులకు ఇవ్వకుండా.. టీడీపీ కార్యకర్తలకు, తమ బంధువులు, స్నేహితులకే ఇచ్చుకుంటున్నారు. స్లిప్పులు ఇచ్చి మరీ టీడీపీ పార్టీ వారికే పంపిణీ చేయడంపై బోండా అనుచరులపై 62వ డివిజన్, హరిహరక్షేత్రం ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. బాధితులను వదిలేసి టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మానని గాయం.. తీరని నష్టంబోండా ఉమా కార్యాలయం వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులపై బోండా ఉమా అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరోసారి తమ కార్యాలయం దగ్గరకు రానివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. బోండా ఉమా, టీడీపీ కార్యకర్తల తీరుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినపుడు మాత్రమే మేం కనిపిస్తామా అంటూ మహిళలు దుమ్మెత్తిపోశారు. ఇంటింటికి తిరిగి ఓట్లడిగిన వాళ్లు ఇప్పుడెందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వరదల సమయంలో మమ్మల్ని గాలికి వదిలేశారు. వరద తగ్గిన తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోరా అంటూ టీడీపీ నేతలపై మహిళలు మండిపడ్డారు. -
తెలుగు రాష్ట్రాల్లో క్లెయిమ్స్ సరళతరం: ఐసీఐసీఐ ప్రు లైఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్స్ ప్రక్రియను సరళతరం చేసినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మూడు ప్రాథమిక డాక్యుమెంట్లను సమరి్పస్తే సరిపోతుందని వివరించింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న బ్యాంకు అకౌంటు నంబరు లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ, డెత్ సరి్టఫికెట్ లేదా ఆస్పత్రులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు జారీ చేసిన మృతుల జాబితా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వొచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్‌ను రైజ్ చేయొచ్చని వివరించింది. ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ క్లెయిమ్కేర్ హెల్ప్‌లైన్ 1800–2660ని ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. -
నీకు 15వేలు.. నీకు 15వేలు ఎక్కడ?
-
ఇక నా జగన్నామం ఆపవా చంద్రం
-
విజయవాడను ముంచేసినట్టే.. ఇక్కడా చేశారు.. జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
ధైర్యంగా ఉండండి నేనున్నా.
-
రైతులకు జగన్ భరోసా..
-
జగన్ అమలు చేసిన పథకాలు ఇప్పుడు లేవు.. బాగా నష్టపోతున్నాం
-
జగన్ పర్యటనలో జన సందోహం
-
Updates: అందని సాయం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
AP And Telangana Floods News Latest Updates In Teluguహైదరాబాద్‌ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్లు విరాళంగా అందించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ.సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. నారాయణరెడ్డి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు క్రమంగా పెరుగుతున్న వరద10 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 125943 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.90 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 311.7462 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిలీన మండలాల్లో తగ్గుముఖం పట్టిన వరద ప్రభావంజాతీయ రహదారి-30 పై కొనసాగుతున్న రాకపోకలుజాతీయరహదారిపై కొనసాగుతున్న వరద ఉధృతిఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలుచింతూరు డివిజన్ పరిధిలో వరదలకు ప్రభావితమైన 113 గ్రామాలలోని 19766 కుటుంబాలుముంపులో ఉన్న 54 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేతమొత్తం నాలుగు మండలాల్లో 38 చోట్ల రహదారులపై చేరిన వరదనీరుదిక్కుతోచని స్థితిలో అన్నదాతలుఏపీవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలుఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పోటెత్తిన కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులుప్రభుత్వ నిర్వాకంతో విరుచుకు పడ్డ బుడమేరు, ఏలేరు, కొల్లేరు పంట పొలాలను ముంచెత్తాయిప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంట వరదపాలైంది.దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలుప్రాథమిక అంచనా ప్రకారం 19 జిల్లాల్లో 5.93లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వీటిలో 18 రకాల ఆహార, వాణిజ్య పంటలు 5.42లక్షల ఎకరాల్లో, మరో 51వేల ఎకరాల్లో 21 రకాల ఉద్యాన పంటలు పాడైపోయాయిమొత్తం 3.08 లక్షల మంది రైతులు నష్టపోయారుముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం నేడు మరో అల్పపీడనం!బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది 15న పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావం ఏపీపై ఉండబోదని స్పష్టం చేశారు.ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో వేడి ఎక్కువవుతోంది. గురువారం అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.మరో వారం ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు తెలిపారు. -
ఏలేరు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలం అయిన మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతులను అడిగి తెలుసున్నారు.వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం.. జరిగిన నష్టం గురించి తెలుసుకుని జగన్ ఓదార్చారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదని బాధితులు జగన్ వద్ద వాపోయారు. ఈ విషయంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: పవన్‌కు పెద్దగా ఏమీ తెలియదు: వైఎస్ జగన్ ఇక.. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం రమణక్కపేటకు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ముంపునకు గురైన పంటపొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జి వంగా గీత, స్థానిక నేతలు ఉన్నారు.ఇదీ చదవండి: బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. -
నిండా మునిగాం.. ఆదుకోండి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: ‘‘అర్ధరాత్రి దాటాక అకస్మాత్తు వరద.. మెలకువ వచ్చి చూస్తే నీళ్లలో ఉన్నాం.. దిక్కుతోచని పరిస్థితిలో ఇంటిపైకి ఎక్కి, ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తి ప్రాణాలు మాత్రం కాపాడుకున్నాం.. కానీ సర్వం కోల్పోయాం.. నిత్యావసరాల నుంచి ఇంట్లో వస్తువుల దాకా అన్నీ కొట్టుకుపోయాయి.. ఉన్నా పాడైపోయాయి.. మా బతుకులకు ఆధారమైన పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. నిండా మునిగిపోయాం.. ఆదుకోండి’’ అని ముంపు బాధితులు కేంద్ర బృందానికి గోడు వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పరిధిలో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించి, నష్టం అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది. రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి.. ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర వరద పరిశీలన బృందం.. తొలిరోజు బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి, హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్‌సింగ్ నేతృత్వంలోని ఈ బృందంలో.. ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్‌కుమార్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతినాథ్ శివప్ప, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.కె.కుశ్వంగ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి టి.నియల్ ఖాన్సూన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్త శశివర్ధన్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి.. ఒక సబ్ టీమ్ పంట, ఆస్తి నష్టాలను పరిశీలించగా, మరో సబ్ టీమ్ తెగిపోయిన రోడ్లు, చెరువులు, వంతెనలు, కాల్వలు వంటివాటిని పరిశీలించింది. ఎక్కడిక్కడ రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు వరద నష్టాలను కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ఖమ్మంలో జిల్లాలో.. కేంద్ర బృందం సభ్యులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం భగవత్వీడ్ తండాలో కోతకు గురైన, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఖమ్మం, సూర్యాపేట మధ్యలో దెబ్బతిన్న జాతీయ రహదారిని, మల్లాయిగూడెంలో దెబ్బతిన్న రోడ్డును, పాలేరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు పడిన గండిని, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌లను పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు, తనకంపాడు, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండా, కస్నాతండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాలేరు, మున్నేరు వరదలతో తీవ్రంగా నష్టపోయామంటూ బాధితులు కేంద్ర బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యారు. రాకాసితండాలో దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. సమీపంలో ఆకేరు వరదతో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని చూశారు. ఈ సందర్భంగా తమ ఇళ్లు, పంట పొలాలు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయని.. తమను ఆదుకోవాలని మహిళలు కేంద్ర బృందం సభ్యులకు దండం పెట్టి వేడుకున్నారు. తమకు మరో ప్రాంతంలో నివాసం కల్పించాలని విన్నవించారు. మానుకోట జిల్లాలో పరిశీలించి.. కేంద్ర బృందం సభ్యులు మహబూబాబాద్ జిల్లాలోనూ రెండు సబ్ టీమ్‌లుగా పర్యటించారు. ఒక సబ్ టీమ్ సభ్యులు తొలుత మరిపెడ మండలం ఉల్లెపల్లిలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. సీతారాంతండాలో వరదతో సర్వం కోల్పోయిన ఇస్లావత్ మంగీలాల్ కుటుంబంతో మాట్లాడారు. వరద వచ్చినప్పుడు సమయమెంత? మీకు మెలకువ ఎలా వచ్చింది? సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లారు? ఎంత నష్టం జరిగింది అంటూ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మరో సబ్ టీమ్ సభ్యులు.. మరిపెడ మండలం అబ్యాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమాయ గూడెం, ముల్కలపల్లి గ్రామాల్లో తెగిన చెరువులు, రోడ్లు, వరద ప్రవాహం తీరును పరిశీలించారు. నష్టం ఫొటో ఎగ్జిబిషన్లను పరిశీలించారు. నేడు మున్నేరు ముంపు, సూర్యాపేట జిల్లాలో పర్యటన కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు. -
చెరువుల ఆక్రమణలతోనే వరదలు: సీఎం రేవంత్
-
Updates: మళ్లీ గోదావరి ఉగ్రరూపం
AP And Telangana Floods News Latest Updates In Telugu తూర్పుగోదావరి జిల్లా:ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద భారీగా పెరిగిన గోదావరి వరద15.10 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం15 లక్షల 6 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలకొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పోటెత్తి ప్రవహిస్తున్న గౌతమి,వశిష్ట, వైనతేయ నదులునీట మునిగిన కాజ్వేలులంక గ్రామాలకు నిలచిపోయిన రాకపోకలు కృష్ణాజిల్లాభారీవర్షాలు , వరదలతో కృష్ణాజిల్లాకు భారీ నష్టంజిల్లాలో 1200 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసిన అధికారులుజిల్లా వ్యాప్తంగా 2 లక్షల 37వేల మంది పై ప్రభావంవ్యవసాయం (44521 హెక్టార్లు) 385.24 కోట్లు నష్టంహార్టికల్చర్ (4070.26 హెక్టార్లు) 108 కోట్లు నష్టంఆక్వాకల్చర్ 4.23 కోట్లు నష్టంపశుసంవర్ధక(పశువులు , గొర్రెలు ,కోళ్లు) 22.1 లక్షలు నష్టంపరిశ్రమలకు నష్టం 34.43 లక్షలుఇరిగేషన్ కు నష్టం 506 కోట్లురోడ్లు , భవనాలు 69 కోట్లు నష్టంపంచాయతీరాజ్ 60 కోట్లు నష్టంగ్రామీణ నీటి సరఫరా విభాగం 51.40 కోట్లువిద్యుత్ శాఖకు 15 కోట్లు నష్టంమున్సిపాల్టీలకు 2.03 కోట్లు నష్టం నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 1,41,879 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 68,210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుతం : 884.10 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 210.5133 టీఎంసీలు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఅల్లూరి సీతారామరాజు జిల్లాకూనవరం గిన్నెల బజారులో వరద బాధితుల నిరసన... నడుము లోతు వరద నీటిలో నివాసాల ముందు నిర్వాసితుల జలదీక్ష... తక్షణం పోలవరం పరిహారం, పునరావాసం కల్పించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న బాధిత మహిళలుకృష్ణా జిల్లా :విజయవాడ రూరల్ మండలం గుడవల్లి వద్ద బుడమేరు కాలువలో వ్యక్తి గల్లంతు. కేసరపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తిగా గుర్తింపు. చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బుడమేరులో గల్లంతైన వ్యక్తిఘటనా స్థలానికి చేరుకొని ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు. జల దిగ్బంధంలో చింతూరు ఏజెన్సీఅల్లూరి జిల్లా: విలీన మండలాలను చుట్టుముట్టిన శబరి, గోదావరి నదులునాలుగు మండలాల్లో 37 ప్రాంతాల్లో ముంపునకు గురైన ప్రధాన, అంతర్గత రహదారులుసుమారు 80కు పైగా గ్రామాలకు నిలిచిన రాకపోకలుపూర్తిగా ముంపునకు గురైన 18 గ్రామాలలోని 1467 కుటుంబాలువరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపుచింతూరు మండలంలో ఎన్ హెచ్-30, 326 లపై ప్రవహిస్తున్న వరద నీరుఆంధ్రా-తెలంగాణా-ఒడిశా-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య స్థంభించిన రవాణా వ్యవస్థ.. భారీగా నిలిచిన వాహనాలుముకునూరు వద్ద రహదారిపై ప్రవహిస్తున్న సోకిలేరు వాగుచింతూరు-వీఆర్ పురం మండలాల మధ్య పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్కూనవరం మండలం, పోలిపాక వద్ద కూనవరం-భద్రాచలం ప్రధాన రహదారిపై చేరిన గోదావరి వరదఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలుపండ్రాజుపల్లి వద్ద ప్రధాన రహదారిపై చేరిన వరద... కూనవరం-చింతూరు మధ్య రాకపోకలు బంద్కొండ్రాజుపేట కాజ్వే పై ప్రవహిస్తున్న వరదనీరు.. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్వీఆర్ పురం మండలంలో పూర్తిగా వరదలకు ప్రభావితమైన శ్రీరామగిరి, రామవరం, చిన్నమాట్టపల్లి, తుమ్మిలేరు, జీడిగుప్ప గ్రామాలుగ్రామాల మధ్య నిలిచిన రాకపోకలువరదల దృష్ట్యా విలీన మండలాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులుపోటెత్తుతున్న గోదావరితూర్పుగోదావరి జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తుతున్న గోదావరిధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.2 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం13 లక్షల 37వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదలబ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదులుకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలులోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసిన అధికారులుఅమలాపురం కలెక్టరేట్ కార్యాలయంతో ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు⇒గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీకి 10,31,640 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 12.10 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 10,28,640 క్యూసెక్కులను బ్యారేజీ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి వరద ఉద్ధృతికి శబరి తోడవడంతో కూనవరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.⇒వరద నీటితో రహదారులు మునిగిపోవడంతో చింతూరు నుంచి చట్టి, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు అలాగే ఎటపాక, చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో సుమారు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టులోకి 10.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఏలేరు, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ⇒మంగళవారం రాత్రి ఏలేరు రిజర్వాయర్‌లోకి 19,813 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు ఎత్తి 18,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 24,700 క్యూసెక్కులు చేరుతుండగా 27,283 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట నుంచి 12,900 క్యూసెక్కుల నాగావళి జలాలు సముద్రంలోకి కలుస్తున్నాయి.⇒పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణాలో వరద మరింత తగ్గింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,93,237 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 1,512 క్యూసెక్కులు వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 1,91,725 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.ఉత్తరాంధ్ర: వర్షాలు తగ్గుముఖం పట్టినా..భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. -
నిండా మునిగిన పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం
-
సీఎం వచ్చినా నో చేంజ్.. వరద బాధితుల ఆగ్రహం..
-
AP Floods: పట్టెడన్నం కోసం పరితపిస్తూ..
పటమట/చిట్టినగర్ (విజయవాడ): బుడమేరు వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలను కాపాడుకున్న జక్కంపూడి కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ ప్రజలు ఆహారం అందక అలమటిస్తున్నారు. సర్వం కోల్పోయిన వారంతా తిండి, తాగునీరు, పాల కోసం అర్రులు చాస్తున్నారు. ట్రాక్టర్, కారు వంటి వాహనం ఏది వచ్చిన ఆహారం పొట్లాలు ఇచ్చేందుకు వచ్చాయని భావించి వాటివెంట పరుగులు పెడుతున్నారు. జక్కంపూడి కాలనీలో సోమవారం ఉదయానికి కాలనీలో వరద నీరు అడుగు మేర తగ్గింది. బాధితులు తమ ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటూ భోజనం కోసం ఆతృతగా ఎదురు చూశారు.ఉదయం ఆల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా అందకపోవడంతో కాలనీ వాసులు రోడ్డెక్కారు. కాలనీలోకి ట్రాక్టర్, కారు వచ్చినా అందులో తమ కోసం భోజనం తీసుకొచ్చారేమోనని భావిస్తూ ఆతృతతో ఆ వాహనాలను చుట్టుముడుతున్నారు. దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు పట్టుకుని పిల్లలతో కలిసి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా అవి తాగేందుకు ఉపయోగించవద్దని ముందుగానే కార్పొరేషన్ అధికారులు మైక్‌లో ప్రచారం చేయడంతో వాటర్ బాటిళ్ల కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం నుంచి స్వచ్ఛంద సంస్థలు సైతం తమ సేవలను నిలిపివేశాయి.జక్కంపూడి కాలనీలో కారు వెంట పరుగులు పెడుతున్న వరద బాధితులు ఒకటి, రెండు స్వచ్ఛంద సంస్థలు కాలనీ వాసులకు భోజనం అందించేందుకు రాగా మహిళలు, యువకులు ఆహార పదార్థాలు తీసుకొచ్చిన వాహనాలను చుట్టుముట్టి కదలనివ్వడం లేదు. సోమవారం కాలనీ మెయిన్ రోడ్డులో నివాసం ఉండే వారికే ఆహారం అందింది. శివారు ప్రాంతాలతో పాటు బుడమేరు కాలువకు అవతలి వైపున ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందలేదు. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు కాలనీలో నివాసం ఉండే కుటుంబాలకు ఆహారం అందించాలని అక్కడి వారంతా వేడుకుంటున్నారు.ఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితిఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కూలి పనులు, ఆటోలు నడుపుకుంటేనే కానీ పొట్టగడవని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయిన తామంతా యాచకుల మాదిరిగా తాగునీరు, ఆహారం కోసం అవస్థలు పడాల్సి వస్తోందని ఈ ప్రాంత పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రభ కాలనీలో పేద, మధ్య తరగతికి చెందిన 600 కుటుంబాల్లో కనీసం రెండు వేల మంది నివాసం ఉంటున్నారు. వరద కారణంగా ఉండే వంట సామాగ్రితో, వస్త్రాలు, జీవనో«పాధి కల్పంచే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వరదలో కొట్టుకుపోగా.. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. మహిళల స్వయం ఉపాధి ఆసరాగా నిలిచే కుట్టు మెషిన్లు, టిఫిన్ బండ్లతోపాటు ఇళ్లల్లోని గ్రైండర్లు, మిక్సీలు, గ్యాస్ పొయ్యిలు మరమ్మతులకు గురయ్యాయి. ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా దాతలిచ్చే ఆహార పొట్లాలపైనే ఆధారపడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాయని భావించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహారం సరఫరాను చాలా వరకు తగ్గించేశాయి. దీంతో ఆహారం, పాలు, తాగునీరు దొరక్క ఇక్కడి పేదలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు ఈ రెండు కాలనీల్లోని కుటుంబాలకు ప్రభుత్వమే ఆహారం అందించాలని ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.అన్నీ కోల్పోయాం ఇదేం వరదో. కనీసం ఇంట్లో సామాన్లు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మా కాలనీలోని ప్రతి ఇంట్లో అన్నీ కొట్టుకుపోయాయి. ఆహారం దొరక్క చాలామంది అవస్థలు పడుతున్నారు. పేదలు పూర్తిగా తేరుకునే వరకు ప్రభుత్వమే ఆహారం, పాలు, నీళ్లు అందించాలి. ఇంటిసామగ్రి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కనీసం రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. – వసంత, ఆంధ్రప్రభ కాలనీ జగనన్న ఇళ్లపట్టా కూడా కొట్టుకుపోయింది మాది చిన్న కుటుంబం. గృహోపకరణాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఆధార్, రేషన్, పాన్ కార్డులు, పిల్లల బర్త్ సర్టిఫికెట్లు, పుస్తకాలతోపాటు జగనన్న ఇచ్చిన ఇంటిపట్టా కూడా కొట్టుకుపోయింది. మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవాలన్నా కార్డులు అడుగుతున్నారు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. అన్నీ కోల్పోయిన వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. – వెంకటదుర్గా సూర్యకుమారి, ఆంధ్రప్రభ కాలనీ అర్థగంటలో అంతా నాశనమయ్యింది. అర్థగంటలో మా జీవితాలన్నీ తారుమారయ్యాయి. ఊహించలేనంత ముప్పు మా ఇంటిలోకి వచ్చింది. మా కష్టం అంతా బుడమేరులో కొట్టుకుపోయింది. మమ్మల్ని ప్రభుత్వమే రక్షించాలి. – లక్ష్మీ సరోజ, ఆంధ్రప్రభ కాలనీ -
Updates: ఉగ్రగోదావరి
AP And Telangana Floods News Latest Updates In Teluguరేపు తెలంగాణకు కేంద్ర బృందంతెలంగాణకు రానున్నకేంద్ర బృందంవరద నష్టాన్ని అంచనా వేయనున్న బృందంములుగుగోదావరికి బారీగా పెరుగుతున్న వరద ఉధృతిరామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ15.80 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి వరద ప్రవాహం15.83మీటర్లు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులుముంపు ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగంజాతీయ రహదారి పైకి చేరిన గోదావరి వరద నీరుఛత్తీస్గడ్-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ కష్టతరంగా బోట్ల తొలగింపుప్రకాశం బ్యారేజీలో కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంరేపు కూడా కొనసాగనున్న చర్యలుబోట్లను రంధ్రాలు చేసి తొలగించేందుకు చూస్తున్న ఇంజనీర్లుకుదరకపోతే.. బెలూన్ల ద్వారా బోట్లను తరలించే యత్నంభద్రాద్రి కొత్తగూడెంభద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ48 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టంక్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి ప్రవాహం53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు నల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టు కు పెరిగిన భారీ వరద26 క్రస్ట్ గేట్లు ఎత్తివేతఇన్ ఫ్లో:& అవుట్ ఫ్లో : 234810 క్యూసెక్కులుప్రస్తుత నీటి మట్టం: 589.40 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.2522 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎన్టీఆర్గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుకు తగ్గిన వరద ఉధృతిభారీ వర్షాలకు డైవర్షన్ రహదారిపై మూడుచోట్ల పడ్డ గండ్లుకృష్ణాఅవనిగడ్డ మండలం పులిగెడ్డ గురుకుల పాఠశాలలో వైరల్ ఫీవర్స్ కలకలం విషజ్వరాలతో బాధపడుతున్న 20 మందికి పైగా విద్యార్ధులు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పది మంది విద్యార్ధులను ఇళ్లకు పంపించేసిన ప్రిన్సిపల్పాఠశాలలోని విద్యార్ధులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వేకనూరు పీహెచ్.సీ వైద్య బృందం వరదల సమయంలో ఇళ్లకు వెళ్లి వచ్చిన వారిలోనే ఎక్కువ జ్వరాల తీవ్రత ఉందంటున్న ప్రిన్సిపల్ కుమార్జ్వరం ఉన్న వారందరికీ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేస్తున్న వైద్యులువాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించనున్న వైద్యులుప్రకాశం బ్యారేజ్..ఆ బోట్ల తొలగింపు యత్నంప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టిన బోట్ల తొలగింపు ప్రయత్నాలురెండు భారీ క్రేన్లతో తొలగించేందుకు అధికారుల యత్నంబ్యారేజీకి ప్రమాదం లేకుండా వరదవైపు బోట్లను తిప్పేందుకు ప్రయత్నాలుముగ్గురు గజ ఈతగాళ్లతో పని చేయించిన ఇంజనీర్లుబ్యారేజ్ను ఢీ కొట్టాక బోల్తా పడ్డ పడవలుసంబంధిత వార్త: బ్యారేజ్‌ను ఢీ కొట్టిన బోట్లు టీడీపీ నేతలవే!అల్లూరి సీతారామరాజువరద ముంపు లోనే చింతూరు వాసులుపంపు ప్రాంతాలు ఖాళీ చేయాలని ఆలస్యంగా ప్రకటించిన అధికారులుఉన్నపలంగా చేతి కందిన సామాగ్రితో శబరివంతెనపై చేరి తల దాచుకున్న చింతూరు వాసులుతాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసుకుని కాలం గడుపుతున్న స్థానికులుఅధికారులు , ప్రజాప్రతినిధులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదంటూ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్న వరద బాధితులుతాగునీరు పాలు కూడా అందించలేదంటూ ఆవేదనవరద ప్రాంతాల పరిశీలనకే సమయం వెచ్చిస్తున్న అధికారులుచింతూరు మండల పరిధిలో 13 చోట్ల రహదారుల పైకి వచ్చిన వరద నీరువిజయవాడప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్డేట్ప్రకాశం బ్యారేజ్ కు క్రమంగా తగ్గుతున్న వరదఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో 2,02,409 క్యూసెక్కులు2 గేట్లు పూర్తిగా ఎత్తివేత,5 అడుగుల మేర 45 గేట్లు,4 అడుగుల మేర 20 గేట్లు ఎత్తివేతఅల్లూరిచింతపల్లి మండలం చింతలూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్న విష జ్వరాలు.విష జ్వరాలు వాంతులు విరేచనాలతో ఐదుగురు మృతి.వారం రోజుల వ్యవధిలో మృతి చెందిన ఐదుగురువిష జ్వరాలతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులుతమను ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదనఅధికారులు వెంటనే స్పందించి తమను కాపాడాలంటున్న గ్రామస్తులుచింతపల్లి, నర్సీపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న మరి కొంతమంది గ్రామస్తులువిజయవాడమాచవరంలో విరిగిపడ్డ కొండచరియలుఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలుకొనసాగుతున్న సహాయక చర్యలుమృతుడు రాముగా గుర్తింపుక్షతగాత్రులు దేవినేని నగర్‌కు చెందిన కూలీలుగా గుర్తింపుఅల్లూరి జిల్లా: జలదిగ్బంధంలో విలీన మండలాలుపోటెత్తి ప్రవహిస్తున్న శబరి సిలేరు, కొండబాగులుసీలేరు ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న శబరిచింతూరు-వీఆర్‌పురం-కూనవరం-ఎటపాక మండల కేంద్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలునాలుగు మండలాల పరిధిలో అనేక నివాస ప్రాంతాలు జలమయంనీట మునిగిన జాతీయ రహదారి 326ఆంధ్ర ఒరిస్సాల మధ్య రాకపోకలు బంద్చిట్టి వద్ద ఎన్‌హెచ్ 35 చేరుకున్న వరద నీరుఆంధ్ర- తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు⇒ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చినా ఆ తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడవచ్చని, అది ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.⇒అలాగే, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది.⇒మరోవైపు.. తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది.⇒అనకాపల్లి జిల్లా గోలుగుండలో 11.2, విజయనగరం పూసపాటిరేగలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురలో 6.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. -
నష్టం అంచనా.. 11న తెలంగాణకు కేంద్ర బృందం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా కేంద్ర బృందం సభ్యులతో కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, కేంద్ర బృందానికి హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేపీ సింగ్ నేతృత్వం వహించనున్నారు.ఇక, ఈనెల 11న(బుధవారం) రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరు పర్యటించి నష్టం అంచనా వేయనున్నారు. అలాగే, బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.అయితే, ఆరుగురు సభ్యులతో కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. -
TG: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. డబ్బు, ఇల్లు ఇంకా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముంపు ప్రాంతాల వరద బాధితులకు నష్టపరిహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. అలాగే, తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది.కాగా.. భారీ వర్షాలు, వరదలపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ‘చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తాం. భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం అందజేస్తాం. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ.5 లక్షల సహాయం చేస్తాం. వరద ముప్పునకు గురైన ప్రతీ ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తాం. వరదల కారణంగా తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం. యుద్ధ ప్రతిపాదికన తాత్కాలికంగా రహదారుల మరమత్తులు చేపడతాం. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందకండి. ప్రతీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
Updates: బలపడిన వాయుగుండం.. ఫ్లాష్ ఫ్లడ్స్ టెన్షన్!
AP And Telangana Floods News Latest Updates In Teluguవిశాఖ, గోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదలు!వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది.విశాఖ, తూర్పు గోదావారి జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం.24 గంటలపాటు నదీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ప్రజలను విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అలర్ట్ చేసింది.పూరీ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం..మరో 24 గంటలపాటు ఉత్తరాంధ్రలో కొనసాగనున్న భారీ వర్షాలు.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలులు.మత్స్యకారులకు కొనసాగుతున్న హెచ్చరికలు.వైఎస్సార్ జిల్లా..మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి 1000 క్యూసెక్కుల నీటి విడుదలదశల వారీగా రోజు 5000వేల క్యూసెక్కుల నీటి విడుదల చేయనున్న అధికారులులోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశాలు ఏపీలో 46 మంది మృతి!ఏపీలో భారీ వర్షాలకు, వరదలతో ఇప్పటిదాకా 46 మంది మృతిఅత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోనే 36 మంది4,53, 845 వేల ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం49, 217వేల ఎకరాల్లో ఉద్యానవన పంట నష్టంరాష్ట్రవ్యాప్తంగా 3,913 కిలోమీటర్లు దెబ్బ తిన్న రోడ్లుఇదీ చదవండి: ‘విజయవాడ వరద మరణాలు.. సర్కారీ హత్యలే’తెలంగాణలో 33 మంది మృతితెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో 33 మంది మృతిఅధికారికంగా ప్రకటించిన ప్రభుత్వంమృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లుతెలంగాణలో 358 గ్రామాలను ముంచెత్తిన వరదదాదాపు 2 లక్షల మంది జీవనంపై ప్రభావంతెలంగాణకు కేంద్రబృందంఈనెల 11న తెలంగాణలో పర్యటించనున్న కేంద్రబృందంహైదరాబాద్: ఈనెల 11న రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్రబృందంవరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్రబృందంరాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్రబృందంఅనంతరం వరద బాధితులు, అధికారులతో కేంద్రబృందం సమావేశంకీర్తిప్రతాప్ సింగ్ నేతృత్వంలో రానున్న ఆరుగురు సభ్యుల కేంద్రబృందంకీర్తిప్రతాప్ సింగ్‌తో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిముంపు ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: పవన్ కల్యాణ్పిఠాపురం: కాకినాడ జిల్లా ఏలేరు వదర ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటనగొల్లప్రోలు మండలంలో పర్యటించిన పవన్ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడా: పవన్ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలిసుద్దగడ్డ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం ఎన్టీఆర్ జిల్లాప్రాణాల మీదకు తెచ్చిన పందెంమున్నేరులో దూకి ఒడ్డుకు వస్తే రూ. 2 వేలు ఇస్తానంటూ పందెంనందిగామ పెద్ద బ్రిడ్జి వద్ద మున్నేరులో దూకిన ఇద్దరు యువకులుమద్యం మత్తులో రోశయ్యతో 2 వేలు పందెం కాసిన మాడుగుల గోపీచంద్(చంటి)పందెంలో భాగంగా గోపీచంద్ తో పాటు నీటిలో దూకిన రోశయ్యనీటిలో మునిగిపోయిన గోపీచంద్గోపీచంద్ ను కాపాడేందుకు యత్నించిన రోశయ్యసాధ్యం కాకపోవడంతో వెనక్కి వచ్చేసిన రోశయ్యనీటిలో మునిగిపోయిన గోపీచంద్ కోసం పోలీసుల గాలింపుప్రకాశం బ్యారేజ్ కేసు.. ఇద్దరి అరెస్ట్ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన.. ఇద్దరు అరెస్ట్ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటనకుట్ర కోణం కేసుతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులులుకొట్టుకొచ్చిన మూడు పడవలూ.. గొల్లపూడి వాసి కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తింపు ఉషాద్రితోపాటు, సూరాయపాలెం వాసి కోమటి రెడ్డి రామ్మోహన్ అరెస్ట్నిందితులను విజయవాడలోని కోర్టుకు తరలించిన పోలీసులు14 రోజులు రిమాండ్ విధించిన సీఎంఎం కోర్టువిజయవాడ సబ్ జైలుకు నిందితులను తరలించిన పోలీసులు ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ కేసులో.. A1 గా ఉషాద్రి A2 గా కోమటి రామ్మోహన్సంబంధిత వార్త: ఆ బోట్లు టీడీపీ వాళ్లవే!ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తిప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తి 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద మరమ్మతులు పూర్తిదెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసిన ఇంజినీర్లు ఐదు రోజులు కష్టపడి మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటురేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను సన్మానించిన కన్నయ్యనాయుడు మార్గదదర్శనం చేసిన నిపుణుడు కన్నయ్యనాయుడిని సన్మానించిన ఇంజినీర్లు, అధికారులుప్రమాదకరంగా మూసీమూసీకి పోటెత్తిన వరదప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నీరుమూసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నకృష్ణాగన్నవరం మండలం కేసరపల్లి వద్ద మూడు రోజుల క్రితం బుడమేరు కాలువలో గల్లంతైన కలదిండి ఫణి ఆచూకీ లభ్యం.కారుకి కొద్ది దూరంలో మృతదేహాన్ని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.హైదరాబాదు నుండి స్వగ్రామం వెళుతుండగా కేసరపల్లి-ఉప్పులూరు మధ్య బుడమేరు వరదలో గల్లంతైన ఫణి.ఫణి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణికి భార్య, ఇద్దరు పిల్లలుమృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు.పోస్టుమార్టం అనంతరం ఫణి మృతదేహాన్ని స్వగ్రామం మచిలీపట్నం దగ్గర హుస్సేన్ నగర్‌కు తరలింపు కాకినాడ ఏలేరు ప్రాజెక్టు కు పెరుగుతున్న వరదఎగువ నుండి ప్రాజెక్టు లోకి చేరుతున్న 45,019 క్యూసెక్ ల వరద నీరుప్రాజెక్టు లో 22.96 టీఎంసీల నీటి నిల్వలుదిగువకు 21,775 క్యూసెక్ ల వరద నీరు.ఏలేశ్వరం-అప్పన్న పాలెం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు కాలువకిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి.పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద కొట్టుకుపోయిన డబ్బకాలువ తాత్కలిక వంతెనకిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం,గొల్లప్రోలు మండలాల్లో నీట మునిగిన పంట చేలు.గొల్లప్రోలు మండలంలో నీట మునిగిన కాలనీలను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ఏలేరు కాలువ ముంపు ప్రాంతాల్లో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు.పిఠాపురం మండలం గొర్రి ఖండి కాలువకు గండి ఏలేరు వరద.. వైస్సార్సీపీ శ్రేణులు సిద్ధంఏలేరు వరదను పరిశీలించిన పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంచార్జి వంగా గీతాపెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలిముంపు ప్రజలను శిబిరాలకు తరలించాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ , అధికారులను కోరుతున్నాఏలేరు కాలువకు గండ్లు పడడంతో పంట చేలు నీట మునుగుతున్నాయినీరు లాగిన వెంటనే నష్టపరిహం త్వరిత గతిన అందించేలా ఎన్యూమరేషన్ చేపట్టాలి.ప్రజలకు ఇబ్బందులు వస్తే.. సహయం అందించేందుకు వైస్సార్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి నల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టు కు క్రమంగా తగ్గుతున్న వరద12 క్రస్ట్ గేట్లు ఎత్తివేతఇన్ ఫ్లో: & అవుట్ ఫ్లో : 137871 క్యూసెక్కులుప్రస్తుత నీటి మట్టం: 588.20 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 306.6922 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వోవిజయవాడలో వరద బాధితుడితో దురుసుగా ప్రవర్తించిన వీఆర్వో విజయలక్ష్మిఅజిత్ సింగ్ నగర్ షాదీఖానాలో ఆహారం, తాగునీరుఇవ్వలేదని బాధితుల ఆవేదనప్రభుత్వం చెప్పినా వీఆర్వో పట్టించుకోవడం లేదంటూ నిరన259 వార్డు వరద బాధితులకు, వీఆర్వోకు మధ్య తీవ్ర వాగ్వాదాంకోపంతో ఊగిపోతూ ఓ వ్యక్తి చెంపపై కొట్టిన వీఆర్వో విజయలక్ష్మి విశాఖ వద్ద పరిస్థితివిజయ పాల ఫ్యాక్టరీకి భారీ నష్టంసుమారు రూ.75 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కంపెనీ ప్రకటనఇంకా వరద నీటిలోనే పాల ఫ్యాక్టరీఫ్యాక్టరీకి మరమ్మత్తులు చేపట్టిన సిబ్బందిమరో యూనిట్‌తో ఉత్పత్తిని కొనసాగిస్తున్న కంపెనీ మరికొద్ది సేపట్లో పూరీ తీరం దాటనున్న తీవ్ర వాయుగుండంభూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడితీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలువిశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశంశ్రీకాకుళం, పార్వతి పురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్కాకినాడ, ఎన్టీఆర్ , ఏలూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్చింతపల్లిలో 13, పూసపాటిరేగ 10, వైజాగ్ ఎయిర్ పోర్ట్ 09 సెం.మీ వర్షపాతం నమోదుకళింగపట్నం నుంచి కాకినాడ వరకు పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అల్లూరి సీతారామ రాజు జిల్లాజీకే వీధి మండలం గాలికొండ పంచాయతి చట్రాపల్లిలో కొండ చరియలు విరిగిపడి మహిళ మృతిమరో ముగ్గురికి గాయాలుగాయపడిన కొర్ర పండన్న (60), కొర్ర సుమిత్ర (18), కొర్ర సుబ్బారావు (25)లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సవిజయవాడ:ప్రకాశం బ్యారేజ్ వరద అప్డేట్..ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరదమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,72,952 క్యూసెక్కులు70 గేట్లు ఎత్తివేతఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టుకు స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 30.110 మీటర్లుస్పిల్ వే దిగువన 20.995 మీటర్లు నీటిమట్టం48 రేడియల్ గేట్ల ద్వారా 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల పూరి వద్ద తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండంమరికొద్ది సేపట్లో తీరాన్ని దాటనున్న తీవ్ర వాయుగుండం..పూరి నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు..తీరం దాటిన అనంతరం.. చత్తీస్ఘడ్ మీదుగా తీవ్రవాయుగుండం పయనించే అవకాశం విరిగిపడ్డ కొండచరియలుకొండ చరియలు విరిగిపడి గిరిజనుల ఇళ్లు ధ్వంసంముగ్గురు గల్లంతు,నలుగురిని రక్షించిన స్థానికులుసీలేరు-ధారకొండ మధ్య 12 చోట్ల విరిగిపడ్డ కొండచరియలుదాదాపు 16 కి.మీ మేర విరిగిపడ్డ కొండచరియలుగూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీలో ఘటనమధ్యాహ్నానికి తీరం దాటనున్న వాయుగుండంబంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంపూరీ సమీపంలో తీరం దాటే అవకాశంవాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచనఏపీలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలువిశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలుఉత్తర కోస్తా తీరంలో కొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలుకళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ హెచ్చరికభారీ వర్షాలతో ఏపీలో నేడు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలువుఅనకాపల్లి రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ 9491998293నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ 7075356563 పొంగి పొర్లుతున్న మహేంద్ర తనయ.. శ్రీకాకుళం: రణస్థలం మండలం వల్లభరావుపేటలో రెండు పూరిళ్లు నేలమట్టమయ్యాయిసుభలయ కాలనీలో పాఠశాల ప్రహరీ కూలిపోయింది.నాగావళి నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీర గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారుపొందూరు మండలం చిన్నబొడ్డేపల్లి గ్రా మం వద్ద రైల్వే అండర్ పాసేజ్లో భారీగా నీరు చేరడంతో కారు, ట్రాక్టర్, ద్విచక్రవాహనాలు చిక్కుకున్నాయనరసన్నపేట మండలంలోని గుండవల్లిపేటకు చెందిన ఓ ఆగ్రోఫుడ్ మిల్లుకు చెందిన ప్రహరీ కూలిందిపోలాకి మండలం, సారవకోట మండలాల్లో తంపర భూములు నీట మునిగాయిఅరసవల్లి సమీపంలో లక్ష్మీనగర్, కామేశ్వర నగర్, రాజీవ్‌నగర్ కాలనీ, ఇందిరానగర్ కాలనీల గుండా వస్తు న్న మిర్తిబట్టి పొంగి పొర్లేలా ఉందికుప్పిలి ఊట గడ్డ పో టెత్తింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పశువైద్య కేందం, అంగన్ వాడీ కేంద్రాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది.మహేంద్ర తనయ నది పొంగి పొర్లుతుండడంతో పాతపట్నం నీలకంఠేశ్వరం ఆలయం వద్ద ఉన్న కాజ్వే బ్రిడ్జిపై నుంచి ఆదివారం సాయంత్రం మూడు అడుగుల మేరు నీరు పారింది.ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షంవాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 నుంచి 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.విద్యా సంస్థలకు సోమవారం సెలవుఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మట్టి కోతకు గురవుతోంది. గోపాలపట్నంలోని రామకృష్ణనగర్ వద్ద మట్టి కోతకు గురవుతుండటంతో.. 15కు పైగా ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ఇళ్లన్నీ ఖాళీ చేయించి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గడిచిన 48 గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 168.5 మి.మీ., చీపురుపల్లిలో 167.75 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 158.75, ఆమదాలవలసలో 142 మి.మీ. వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా వై.రామవరంలో 133.5, నెల్లిమర్లలో 129.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
Telangana: మళ్లీ 'మున్నేరు' ముంపు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోనూ శనివారం నుంచి వర్షం కురుస్తుండడం, వర్షాలు మరో రెండురోజుల పాటు కొనసాగే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనలతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకేరు, మున్నేరుల్లో పెరుగుతూ తగ్గుతున్న వరద కలవరపరుస్తోంది. కనీవిని ఎరుగని కుండపోత నేపథ్యంలో ఈనెల 1న మున్నేరు, ఆకేరు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రధానంగా ఖమ్మం నగరంలోని 50 కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలను ముంచెత్తి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం సాయంత్రం 8.25 అడుగులుగా ఉన్న మున్నేరు నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 14.80 అడుగులుగా నమోదైంది. ఆదివారం 15.75 అడుగులకు చేరుకుని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, ఈనెల 1నాటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా శనివారం రాత్రి నుంచే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు కూడా ఇటీవలి భయానక పరిస్థితిని తలుచుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ భారీ వర్షం.. ఇక్కడ భయం ఖమ్మం జిల్లాకు ఎగువన మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఏ ప్రాంతంలో భారీ వర్షం పడినా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది. ఆ విధంగానే ఈ నెల 1న భారీయెత్తున వరద ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు, గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మండలాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్‌లో భారీ వర్షాలు కురిస్తే ఖమ్మం జిల్లాలోని 11 మండలాలు వరద తాకిడికి గురవుతున్నాయి. ఇక ఆకేరు పరీవాహకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మండలాలు, ఖమ్మం జిల్లాలో రెండు మండలాలు ఉంటాయి. ఆకేరు వరద మున్నేరులోకి చేరుతుండటంతో మున్నేరు ఉధృతి మరింత తీవ్రమై ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని మండలాల్లో గత పది రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గత నెల 31న, ఈనెల 1న పలు ప్రాంతాల్లో 40.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలోనూ ఈ రెండు రోజుల్లో సగటు వర్షపాతం అన్ని మండలాల్లో కలిపి 20 సెం.మీ. పైగా నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయి వర్షం ఈ రెండు ఏర్ల పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయి వర్షాల నేపథ్యంలోనే వరద ఉప్పెనలా పోటెత్తి లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ రెండు వాగుల వేగ ఉధృతి కూడా గతంతో పోలిస్తే పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఎన్ని గంటల్లో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవలి వరదలతో ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్‌నగర్, ధంసలాపురం కాలనీ.. ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. నాటి వరదతో అప్రమత్తం మున్నేరు, ఆకేరు వరదలు అధికార యంత్రాంగాన్ని షాక్‌కు గురి చేశాయి. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. శని, ఆదివారాల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిõÙక్ అగస్త్య.. వరద ముప్పు ఉన్నందున ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఇంకొన్ని రోజులు ఉండాలంటూ సూచించారు. శనివారం రాత్రి కాలనీల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అర్ధరాత్రి ముంపు ప్రాంతాల ఇళ్లల్లో ఉన్న వారందరినీ మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత ఆయా కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. ఆదివారం కొందరు బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుని రాత్రికి తిరిగి వచ్చారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు, మందుల పంపిణీని వేగవంతం చేశారు. -
బాబు సర్కార్ మొద్దు నిద్ర.. విజయవాడ వరదల్లో భారీ ప్రాణనష్టం
సాక్షి, విజయవాడ: వరదలు సమాచారం ఉన్నా కానీ చంద్రబాబు సర్కార్ అలర్ట్ చేయకపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. 45 మంది మరణించినట్టు కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక్క విజయవాడ నగరం, రూరర్లోనే 25 మంది మృతి చెందగా, ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు 35 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది. 8 రోజులుగా వరద ముంపులోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఉపద్రవం ముంచుకొస్తుంటే పాలకులు మొద్దునిద్రలో ఉండటం వల్లనే విజయవాడలో వరదలకు భారీ నష్టం వాటిల్లింది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం మూటకట్టుకుంది. విజయవాడ, ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానుందని భారత వాతావరణ శాఖ (ఐంఎండీ) గత నెల 28నే (బుధవారం) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది.కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. శుక్రవారం, శనివారం వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. శనివారం(31వ తేదీ) రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అర్థరాత్రి దాటిన తరువాత భారీ వరద ముంచెత్తి విలయం సృష్టించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.సంబంధింత వార్త: వరదను మించిన విపత్తు బాబే!విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో వేలాదిమంది బాధితులు ఆకలి కేకలు పెడుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది నాలుగైదు రోజులుగా కనీసం అన్నం కూడా కడుపునిండా తినకుండా వరదల్లో కొట్టుమిట్టాడిన దయనీయ దృశ్యాలు అడుగడుగునా కనిపించాయి. -
Updates: భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు పలు జిల్లాల్లో స్కూల్స్‌కు సెలవు
AP And Telangana Floods News Latest Updates In Teluguపలు జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవు..భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ.రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు. విశాఖలో భారీ వర్షం.. విశాఖపట్నం..ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం.విశాఖ నగరంలో అత్యధికంగా వర్షపాతం.జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు.అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల వర్షాలతో నీట మునిగిన పంటలు.గరిష్ట నీటి మట్టానికి చేరుకున్న పెద్దేరు, కోణం, రైవాడ కళ్యాణపులోవ తాండవ, మేఘాద్రి గడ్డ రిజర్వేయర్లు.ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి.ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు..కృష్ణా..ఉప్పులూరు వద్ద బుడమేరు ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర రావు.కంకిపాడు - గన్నవరం మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలుబుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుందిఅధికారులు అప్రమత్తంగా ఉండాలిఅలసత్వం వహిస్తే సహించేది లేదు.మంతెన, తెన్నేరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత..విజయవాడప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్డేట్..ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4,28,322 క్యూసెక్కులు70 గేట్లు పూర్తిగా ఎత్తివేతవిశాఖపట్నం..గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండ చరియలు.రెండు ఇళ్ళు కూలిపోయే ప్రమాదం.ఇంట్లో వారిని ఖాళీ చేయిస్తున్న అధికారులు. కృష్ణాజిల్లా:గన్నవరం మండలం కేసరపల్లి వద్ద గత రాత్రి బుడమేరు కాలువలో చిక్కుకున్న కారుకారులో ప్రయాణిస్తున్న వ్యక్తి గల్లంతుపెడన మండలం హుస్సేన్ పాలెంకు చెందిన ఫణి కృష్ణగా గుర్తింపుసంఘటనా స్థలానికి చేరుకున్న గుడివాడ ఆర్డీవో పద్మావతిఫణి కృష్ణ కోసం గాలిస్తున్న అధికారులువిజయవాడ వరదల్లో భారీ ప్రాణ నష్టం45 మంది మృత్యువాత45 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వంఒక్క విజయవాడ నగరం, రూరల్ లోనే 25 మంది మృతిఎన్టీఆర్ జిల్లాలో వరదలకు 35.మంది మృతిఇంకా మరణాలు పెరిగే అవకాశం8 రోజులుగా వరద ముంపులోనే ప్రజలుప్రభుత్వం వరదలు సమాచారం ఉన్నా అప్రమత్తం చేయకపోవడం తో సంభవించిన మరణాలువిజయవాడకు బుడమేరు టెన్షన్గన్నవరం-కంకిపాడు రహదారిపైకి బుడమేరు వరదగన్నవరం-కంకిపాడు రోడ్డులో నిలిచిన రాకపోకలుబంగాళాఖాతంలో వాయుగుండంవాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం..ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశంవాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిబారీ వర్షాలు..ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరో రెండు రోజులపాటు కొనసాగనున్న భారీ వర్షాలుతీరం వెంబడి బలమైన ఈదురు గాలులుకొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలుకృష్ణానది వరద ఉధృతికాసేపట్లో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీశ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2.86, ఔట్ ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులునాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.99లక్షల క్యూసెక్కులుపులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.75 ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులుప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులువాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలిలోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థఖమ్మం చేరుకున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కఖమ్మం పట్టణంలోని స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎంప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీసిన భట్టిప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించిన డిప్యూటీ సీఎంమళ్లీ మొదలైన భారీ వర్షాలుఎన్టీఆర్ జిల్లా: నందిగామ నియోజకవర్గవ్యాప్తంగా మళ్లీ మొదలైన భారీ వర్షాలుపొంగిపొర్లుతున్న నందిగామ మున్నేరులోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులువర్షాలు మళ్లీ భారీగా పడటంతో ఆందోళన చెందుతున్న రైతన్నలుబిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో లోతట్టు ప్రాంత ప్రజలుఖమ్మం జిల్లాలో భారీ వర్షంమున్నేరు వాగుకు పొంచిఉన్న వరద ముప్పులోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులుమైక్ల ద్వారా ప్రజలకు పోలీసులు సూచనలుపరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపుఅధికారులను అప్రమత్తం చేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటికలెక్టర్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్న మంత్రులు కోస్తా జిల్లాల్లో కుండపోత వానవిశాఖ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడననేడు వాయుగుండంగా మారే అవకాశంఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్కొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలుమరో రెండు రోజులు కొనసాగనున్న వర్షాలుప్రకాశం బ్యారేజ్‌కు మళ్లీ పెరుగుతున్న వరదఎగువ నుంచి భారీగా కృష్ణానదికి వచ్చి చేరుతున్న వరదనందిగామ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులుభారీ వర్షాల నేపథ్యంలో తిరువూరు, నందిగామ, విజయవాడ రూరల్ మండలాల తహసీల్దార్లను, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజనలోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలుఓ వైపు వరద.. మరోవైపు వర్షాలతో భయపడుతున్న బెజవాడ ప్రజలుబుడమేరు గండ్లు పూడ్చినప్పటికీ భారీ వర్షంతో వరద ముంపు ప్రాంతాల్లో ఆందోళనవిజయవాడలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో బెజవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. 8 రోజులుగా నగర వాసులు వరద కష్టాలు పడుతున్నారు. ఇంకా వరద ముంపులోనే పలు కాలనీలు ఉన్నాయి.ఇదీ చదవండి: సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో తిరువూరులో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఏపీలో నేడు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎనిమిది జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణాకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. -
సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం విజయవాడను ముంచేసిన వరదల విషయంలో సాయం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వరద బాధితులు పడుతున్న కష్టాలు, నష్టాల తీవ్రతను తగ్గించడం సంగతి ఎలా ఉన్నా మూడు నాలుగు రోజుల నిష్క్రియాపరత్వంతో దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకే తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.వాస్తవానికి ప్రచారం చేసుకునే విషయంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరు. కానీ.. ఆచంట మల్లన్న టైపు నేతలకు కూటమి ప్రభుత్వంలో లోటేమీ లేనట్టు స్పష్టమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంతి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్లు కూడా బాబును పొగడ్డమే తమ కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ భజన కాస్తా వికటించి ఆయన పరువే తీసినట్టుగా కనిపిస్తోంది.ఐదు రోజుల క్రితం విజయవాడను వరద చుట్టేసిన తరువాత చంద్రబాబు చేయని విన్యాసమంటూ లేదు. రోజూ రెండు మూడు సార్లు మీడియాతో మాట్లాడటం, జేసీబీపై ఎక్కి ఒకసారి.. పడవలో వెళ్లి ఇంకోసారి, మోకాలి లోతు నీళ్లలో మరోసారి వెళ్లి తాను జనంలోనే ఉన్నట్లు.. వారి కోసమే పని చేస్తున్నట్లు గట్టి కృషే చేశారు. ఏదో ఒక పేరుతో వరద ప్రాంతాల్లో తిరుగుతూండటంతో అధికారులే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బాబు గారు మాత్రం మీడియా కవరేజీ కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.భజన మీడియా కూడా తనవంతుగా బాబుగారి ప్రచారానికి పోటాపోటీలు పడుతున్నాయి. అదేదో సినిమాలో ఉన్నట్లు.. ‘‘అన్న నడిచొస్తే మాస్.. అన్న మడతేస్తే.. మాస్.. మ మ మాస్’’ అనేలా ఉంది వీరి రాతలు. వరదలొచ్చిన ఐదు రోజులకు ఈనాడు ఓ కథనంలో... బుడమేరు వరదకు చంద్రబాబు చలించిపోయారని, బాధితులు, రైతుల కష్టాలు విన్నప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయని, రాసుకొచ్చింది. విజయవాడలో వరదల కారణంగా ఇప్పటి వరకూ యాభై మంది మరణించారన్న సమాచారానికి మాత్రం అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మొక్కుబడిగా కొన్ని వార్తలు రాసి చేతులు దులుపుకుంది.వరద సహాయ చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకునే చర్యల గురించి రాయడం తప్పు కాదు. కానీ ప్రజల బాధల కన్నా చంద్రబాబు గురించే ఈనాడు, తదితర మీడియాలు కొన్ని తెగ దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అతిగా చేసే ప్రచారం ఒక్కోసారి నష్టం కూడా చేయవచ్చు. కేంద్ర మంత్రి చౌహాన్ వరద బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శ చేశారో, లేదో కాని, టీడీపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేశారు. వరద సహాయ చర్యలు బాగానే చేసిందని తేల్చేశారు. మిత్రపక్షం కనుక మర్యాద కోసం ఒక మాట అంటే ఫర్వాలేదు కాని, డబ్బా కొట్టినట్లు మాట్లాడితే ప్రజలలో బీజేపీ నవ్వులపాలు కాదా? చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని చౌహాన్ కితాబు ఇచ్చారు. ఇల్లు మునిగిపోయి చంద్రబాబు తన బస కలెక్టరేట్‌కు మార్చిన విషయాన్ని చెప్పకుండా చెప్పకుండా, ఆయన సారథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని చేస్తోందని వ్యాఖ్యానించడం విశేషం.వరదల వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగినా ప్రాణ నష్టం మాత్రం స్వల్పంగా ఉందని కేంద్ర మంత్రి స్వయంగా చెబితే ఏమని అనుకోవాలి? వరదల కారణంగా యాభై మంది మరణిస్తే అది తక్కువ సంఖ్య అవుతుందా? మృతులు ఎందరో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంటే... చౌహాన్ మాత్రం ఇలా విడ్డూరంగా మాట్లాడారు. పైగా తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు సాయం అందించారన్న చౌహాన్ మెచ్చుకోలు కూడా ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఉత్తరాఖండ్, కేరళల్లోనూ వరద సహాయక చర్యలకు డ్రోన్లను వాడిన విషయం కేంద్ర మంత్రికి తెలియదా? అని నెటిజన్లు ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర మంత్రి వరద నీటిలో అల్లాడుతున్న ప్రజలను పలకరిస్తే వారి బాధలు తెలుస్తాయి.పైపైన తిరిగి, ఎగ్జిబిషన్ పోటోలు చూసి, చంద్రబాబును పొగిడి, తన బాధ్యత తీరిపోయిందని అయిందని అనుకున్నట్లుగా ఉంది చౌహాన్ వ్యవహారం. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఈయనతై బాధితులను స్వయంగా చూడలేదు కానీ చంద్రబాబును మాత్రం ఆకాశానికి ఎత్తుతూ పొగిడేస్తున్నారు. పవన్ ఈ స్థాయిలో బాబుకు లొంగిపోతారని ఊహించ లేదు. గతంలో నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం ఎమ్మెల్యే ఒకరు ఉండేవారు. పవన్ కళ్యాణ్‌లా లొంగిపోయే వారిపై సామెతలు కొన్ని చెబుతుండేవారు.. ‘‘పొగడరా, పొగడరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత’’ అని చెప్పాడని ఎద్దేవ చేసేవారు. పవన్ కళ్యాణ్ తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సృష్టించిన ఫోటోలను ఎక్స్‌లో పవన్ పెట్టి చంద్రబాబుకు బాకా ఊది ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు.ఒక వృద్దురాలు డ్రోన్ ద్వారా నడుం లోతు నీళ్లలో ఆహారపొట్లం అందుకున్నట్లు ఉన్న పోటోను పోస్టు చేశారు. ఇది తనకు సంతృప్తి ఇచ్చిందని, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కానీ అది కృత్రిమ ఫోటో కావడంతో ఆయన నవ్వుల పాలవయ్యారు. సోషల్ మీడియాలో దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో పవన్ తన వ్యాఖ్యను మార్చేశారు. చంద్రబాబుతోపాటు తిరగకుండా ఈయన ఏమి నేర్చుకున్నారో అర్ధం కాదు. చంద్రబాబే అధికార యంత్రాంగం విఫలం అయిందని ఒప్పుకుంటే ఈయన మాత్రం ప్రభుత్వం బాగా పనిచేసిందని గొప్పలు చెబుతున్నారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వరదల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చి.. అవి అమలయ్యాక జనం వద్దకు వెళ్లడాన్ని కూడా పవన్ తప్పుపట్టిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నాడు. వరదపీడిత ప్రాంతాలకు వెళితే అధికారుల విధులకు ఆటంకం అవుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు పదే,పదే తిరుగుతూ అధికారులకు ఇబ్బంది కలిగించడం లేదా అని అంటే మాత్రం బాజా వాయిస్తారు.మీడియా తలచుకుంటే ఎలా ప్రచారం చేయవచ్చనడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు బుడమేరు వంతెనపై నిలబడి ఉంటే ,ఆ పక్కగుండా రైలు వెళ్లింది. దానికి ఏమని ప్రచారం చేశారో తెలుసా! చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. అదేమిటా అని పరిశీలిస్తే ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే రైలు వెళ్లింది. ఆ టైమ్ లో ఆయన చుట్టూరా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆయన రైలు వస్తున్న విషయం గమనించి ,అటువైపు తిరిగి చూస్తూ నిలబడ్డారు. మరి ఇందులో ప్రమాదం ఏమిటో అర్థం కాదు. ఇలా రాయమని చంద్రబాబు చెప్పి ఉండకపోవచ్చు.అయినా అతి భక్తి కల మీడియా ఇలా ప్రచారం చేసిందన్నమాట. ఈ నేపధ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మీడియాలో ప్రచారం కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నది లేదని వ్యాఖ్యానించారు. పత్రికలు చేతిలో ఉండడంతో ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నాయని ఎద్దేవ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ బుడమేరు ఆక్రమణల గురించి మాట్లాడడాన్ని ప్రస్తావించి, చంద్రబాబుతో మాట్లాడి కృష్ణా కరకట్టే మీద ఉన్న అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించాలని రాంబాబు సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ ధైర్యంగా ఆ విషయం మాట్లాడగలరా? ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అది అయ్యే పని కాదనిపిస్తుంది.తెలుగుదేశం నేతలకన్నా ఎక్కువగా పోటీపడి చంద్రబాబును పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. వరద ప్రాంతాలవారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలోను, వరద బాధితులను ఆదుకోవడంలోను విఫలం అవడంతో నాలుగైదు రోజులపాటు ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లలోని సామానంతా పాడైపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారుంటే చంద్రబాబు, ప్రభుత్వ నేతలు తమ జబ్బలు తామే చరుచుకుని మురిసిపోతున్నారు.వరద బాధితులు అందరికి రేషన్ ఇవ్వలేకపోయామని అంటారు. వారి ఇళ్లకు రేషన్ చేర్చకుండా రేషన్ షాపుల వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం మాత్రం శోచనీయం. ఇది పెద్ద వైఫల్యం కాదా! అయినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నేతలు ఒకరినొకరు పొగుడుకుని ఆత్మవంచన చేసుకుంటున్నారు. అనుకూల మీడియా ప్రచారం ద్వారా బాధితుల కష్టాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. జనం ఈ ప్రచారానికే అన్నీ బాధలు మర్చిపోతారా!- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కొల్లేరును ముంచేసిన బుడమేరు వరద నీరు
-
నందిగం సురేష్ అరెస్ట్ పై పేర్నినాని రియాక్షన్
-
విజయవాడ వరద బాధితుల కోసం వైఎస్ జగన్ రేషన్ వాహనాలు..
-
చంద్రబాబును బుడమేరులో ముంచిన ఈనాడు
-
విజయవాడ వరద ప్రమాదానికి చంద్రబాబే కారణం
-
ప్రభుత్వం ఫెయిల్ అంటూ, విజయవాడలో వరద బాధితుల ధర్నా
-
చంద్రబాబు వల్లే సహాయక చర్యలు ఆలస్యం: టీజేఆర్ సుధాకర్ బాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు వరదల్లో అల్లాడి పోతుంటే సీఎం చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వరద్లలో ప్రజల మరణాలకు చంద్రబాబే కారణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, టీజేఆర్ సుధాకర్ బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కొంచెం కూడా బాధ్యత లేదు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ కాలం గడిపారు. ఆగస్టు 28వ తేదీనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదు. వెలగలేరు వద్ద గేట్లు ఎత్తాలని అధికారులు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలను కొనుగోలు చేయటం, ముంబై నటి వ్యవహారాల మీదనే చంద్రబాబు దృష్టి పెట్టారు.సరైన సమయంలో ఎలాంటి నిర్ణయంలో తీసుకోకపోవడం వల్లే ప్రజల అవస్థలకు కారణమయ్యారు. వరదల్లో మరణాలకు చంద్రబాబే కారణం. బుడమేరు ఆధునికీకరణ పనులను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు?. టీడీపీ నేతలకు చెందిన భూములు పోతాయనే కారణంగానే భూసేకరణ కూడా చేయలేదు. ఏబీఎన్ రాధాకృష్ణకు చెందిన పవర్ ప్రాజెక్టుకి నష్టం జరుగుతుందనే వరద నీటిని జనం మీదకు వదిలారు. రోజూ చంద్రబాబు అధికారులను వెంటేసుకుని తిరగటం వలనే సహాయ చర్యలు జరగటం లేదు. రాజకీయ క్రీడలను టీడీపీ నేతలు ఆపాలి. అధికార అహంకారంతో మంత్రులు వ్యవహరించవద్దు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.వరదల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు మళ్ళీ వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగమే నందిగం సురేష్‌ను అరెస్టు చేశారు. ఇలాంటివి ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటాం. డైవర్షన్ రాజకీయాలు ఆపి బుడమేరు ముంపు ఎలా తప్పించాలో ఆలోచించండి. వరద రాకముందే చంద్రబాబు సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నారు. మరి జనాన్ని ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు?. వరదకంటే ముందే పవన్ కళ్యాణ్, లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోయారు. వారికి బాధ్యత అనేదే లేదా?. అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. ఇన్ని రోజులుగా వరద సహాయ చర్యలు ఎందుకు చేపట్టలేదు? అని ప్రశ్నించారు. -
వాళ్ళ టార్గెట్ ఒక్కటే.. చంద్రబాబు నీచ రాజకీయం : MLC Bharath
-
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
-
వరద బాధితుల చిన్నారి సాయం.. వైఎస్ జగన్ ఫిదా..
-
వరద గుప్పిట్లో సర్వం కోల్పోయి
-
జగన్ కు ప్రాణహాని హైకోర్టుకు నివేదిక
-
చంద్రబాబు బిగ్ ఫెయిల్యూర్..
-
డ్రైనేజీలో బతుకుతున్నట్టుంది..అటు వరద నీరు - ఇటు మురుగు నీరు
-
వరద వస్తుందని ముందే తెలుసు: వెలగలేరు డీఈ మాధవ్
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాల కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. బుడమేరు కారణంగా విజయవాడ జల దిగ్భందమైంది. ఈ నేపథ్యంలో బుడమేరు, వరదల గురించి వెలగలేరు డీఈ మాధవ్ సంచలన కామెంట్స్ చేశారు.తాజాగా డీఈ మాధవ్ సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘బుడమేరు వరద మానవ తప్పిదమే. ఫ్లడ్ వస్తుందని మాకు ముందే తెలుసు. శనివారం మధ్యాహ్నమే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాం. గేట్లు తెరవాల్సి వస్తుందని అధికారులకు సమాచారం ఇచ్చాం. 45వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గేట్లు ఎత్తుతాం.. నీళ్లు వదులుతున్నాం అని కూడా చెప్పాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు విజయవాడ వరదలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. ఈ వరదలు కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వచ్చినవేనని అన్నారు. ఇది ప్రకృతి విపత్తు కాదు. మానవ తప్పిదమే దీనికి కారణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఉంటే ప్రమాదం తప్పేదని చెప్పారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు ఇలా చేశారని మండిపడ్డారు. విజయవాడ ప్రజలను ఇంతటి ఇబ్బందులకు గురిచేసి, 32 మంది ప్రాణాలను బలితీసుకున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఈ విజనరీ బాబు ఇంట్లో నిద్రపోతా వరదలు ముంచాకే మేల్కొన్నాడు
-
జగన్‌ను చూసి చిన్నారి భావోద్వేగం.. కన్నీళ్లు తుడిచిన జననేత
-
మీ సీఎంకు ఒక సారి చెప్పండి అంబటి రాంబాబు సెటైర్లు
-
AP: అల్పపీడనం టెన్షన్..
-
తండ్రి,కొడుకులు ఎన్ని కేసులు పెట్టిన తగ్గేదేలే నందిగామ సురేష్ రియాక్షన్
-
వరదబాధితులకు సాయం చేసిన బాలుడికి వైఎస్ జగన్ ప్రశంస
-
5 రోజుల నుండి నరకయాతన తిండి లేదు.. నీళ్లు లేవు..
-
నా 8 ఏళ్ళ కష్టం 30 లక్షలు వరదపాలు.
-
ప్రభుత్వం ముందే హెచ్చరిక చెయ్యాలి కదా మా ఇంట్లో మనిషిని కోల్పోయాం
-
వరద బాధితులకు చిన్నారి అభయ్ రామ్ విరాళం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాలకు వరదల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జన జీవనం స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో బాధితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతో డబ్బును విరాళంగా ఇస్తున్నారు.తాజాగా విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం సాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చాడు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉయ్యూరుకు చెందిన రాజులపాటి అభయ్ రామ్ కలిశాడు. ఈ సందర్భంగా విరాళం అందజేశాడు. తన వంతు సాయంగా కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న నగదు రూ. 10వేలను వైఎస్ జగన్‌కు అందించాడు. వరద బాధితులకు సాయం చేయాలనే లక్ష్యంతోనే తాను ఈ డబ్బు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా పెద్ద మనసుతో ముందుకు వచ్చిన అభయ్ రామ్‌ను వైఎస్ జగన్ అభినందించారు. భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. కాగా, అభయ్ ఉయ్యూరులో ఒకటో తరగతి చదువుతున్నాడు. విరాళం అందజేసిన సందర్భంగా బాలుడితో అభయ్ రామ్ కుటుంబ సభ్యులు, పెనమలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వైఎస్ జగన్‌ను కలిశారు.మరోవైపు.. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా పలువురు వైఎస్సార్సీపీ నేతలు కూడా తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన వైఎస్సార్సీపీ నేత కట్టా మహేష్ తన వంతు సాయంగా వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50వేలు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్‌ను వైఎస్ జగన్‌కు అందజేశారు. -
అధికారం అండతో అదనపు కట్నం కోసం కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత
-
రాజధాని మునిగిందా... లేదా..? అసలు నిజాలు
-
ఏపీలో కేంద్ర బృందం పర్యటన
-
ట్వీట్ చేశాడు.. డిలీట్ కొట్టేశాడు.. ‘పవన్’ దొరికిపోయాడు!
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. సీఎం చంద్రబాబును పైకెత్తబోయి బోల్తా పడ్డారు. వరదల సమయంలోనూ చంద్రబాబు భజన మానలేదు. వరద సహాయ చర్యలపై ఎక్స్‌లో పెట్టిన ట్వీట్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యం బయటపడింది.సీఎం చంద్రబాబుని పొగిడేందుకు ఫేక్ ఫోటోలను పవన్ పోస్ట్ చేశారు. ఏఐ ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్.. విమర్శలు రావడంతో మళ్ళీ ఆ ఫోటో ఎక్స్ నుంచి తీసేశారు. ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన ఫేక్ ఫొటోను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్ విమర్శల పాలయ్యాడు.వరద బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడ పవన్ కల్యాణ్ తీరిగ్గా స్పందించిన సంగతి తెలిసిందే. విమర్శలు రావడంతో కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులతో కలిసి మానిటరింగ్ నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో తప్పులు కప్పి పుచ్చుకునేందుకు పవన్.. ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ, అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేశారు. -
మేకప్ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మండీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024కాగా ఇటీవేల హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
#VijayawadaFloods : చెప్పలేనంత కష్టం.. చెప్పుకోలేనంత నష్టం! (ఫొటోలు)
-
Updates: బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. హైదరాబాద్‌లో వర్షం షురూ
Telugu States Heavy Rains Latest News Updates:వరద పరిస్థితిని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వివరించిన సీఎం చంద్రబాబు.చంద్రబాబు కామెంట్స్..ఊహించని వర్షాలు పడ్డాయి.భారీ వరదలతో పాటు మానవ తప్పిదాలు కూడా ఈ సమస్యకు కారణాలు.కృష్ణా నది కరకట్టలను మరింత బలపరిచేలా చర్యలు తీసుకోవాలి.బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగుతోంది.15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజ్‌ను పటిష్ట పరచాలి.వరదలు వచ్చిన పరిస్థితిని కేంద్రానికి వివరించాం.శివరాజ్‌సింగ్ కామెంట్స్..ఏపీకి కేంద్రం అండగా ఉంటుంది.సహాయక చర్యలను చంద్రబాబు చూసుకుంటున్నారు.రైతులు, సామాన్యులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. హైదరాబాద్‌లో ఒక్కసారిగా వర్షంహైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది.వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.సాయంత్రం సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం,ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్ సహా తదితర ప్రాంతాల్లో వరద కురుస్తోంది.బుడమేరుకు పెరిగిన వరదబుడమేరులో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది.రామకృష్ణాపురంలోకి చేరిన వరద నీరుఈరోజు మధ్యాహ్నం నుంచి మళ్లీ కాలనీలోకి వరద నీరు.రెండు అడుగులకు చేరుకున్న వరద నీరువరదల నుంచి ఇప్పుడే తేరుకుంటున్న రామకృష్ణకాలనీ.అంతలోనే వరద వస్తుందటంతో కాలనీవాసుల్లో ఆందోళనభారత్ బయోటెక్ భారీ విరాళంఏపీలో వరద బాధితుల సహాయార్థం భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళంముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమచేసినట్ వెల్లడించిన భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్లఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్న భారత్ బయోటెక్త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్టు ప్రకటన విడుదల రేపు ఖమ్మంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పర్యటనరేపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లాలో పర్యటనభారీ వర్షాలు, వరదలతో నష్ట పోయిన పంట పొలాల పరిశీలనమధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటనకూసుమంచి మండలం జుజ్జులారావుపేటలో రైతులతో ముఖాముఖికేంద్రమంత్రి పర్యటన వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల సీఎం చంద్రబాబుకు తప్పిన ప్రమాదం!!విజయవాడ మధురానగర్ రైల్వే ట్రాక్‌పై చంద్రబాబుకు తప్పిన ప్రమాదంట్రాక్పై చంద్రబాబు ఉండగానే వచ్చిన రైలు, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బందిరైల్వే ట్రాక్ అవతలి పక్కకు వెళ్లిపోయిన సీఎం చంద్రబాబురైలు వెళ్లిపోయిన తర్వాత పర్యటన కొనసాగించిన చంద్రబాబుప్రకాశం బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్రమంత్రివిజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ను పశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద పరిస్థితులను తెలుసుకుంటున్న కేంద్ర మంత్రిభారీ వర్షాలతో దెబ్బతిన్న పంటను పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులుగుంటూరు:తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గం వరద భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి మెరుగు నాగార్జున, తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుల శివకుమార్వేమూరు ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావుజూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.06 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో : 85 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 77 వేల 739 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 317.910 మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 8.434 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది.వరద బాధితులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆహార పంపిణీవిజయవాడ ముంపు గ్రామాల ప్రజలకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో10,000 వాటర్ బాటిళ్లు12 క్వింటాల పులిహార రైస్విజయవాడలో బాధితులకు పంపిణీభద్రాద్రి కొత్గూడెం జిల్లాభద్రాచలం వద్ద ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి 45.1 అడుగులు వద్ద ప్రవాహం ఏలూరు జిల్లాప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరు సరస్సుచిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు ప్రవాహంజాతీయరహదారిపై మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు అంతరాయంపాదచారులు,ద్విచక్రవాహనదారులు రావద్దంటూ పోలీసుల హెచ్చరికఇవాళ సాయంత్రానికి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద3 గేట్లు ఎత్తి నీటిని విడుదలఇన్ ఫ్లో 15.000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో. 15.000పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17 టీఎంసీలుప్రస్తుత నీటిమట్టం 1404 అడుగులు, 17టీఎంసీలుతప్పులో కాలేసిన పవన్కల్యాణ్విజయవాడ:వరద సహాయ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంఫేక్ ఫోటోలతో అధికారులతో సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్అవ్వే ఫేక్ ఫొటోతో పబ్లిసిటీ చేసుకోబోయిన పవన్ ఎక్స్‌లో చేసిన ట్వీట్‌తో బయటపడ్డ అవగాహన రాహిత్యంసీఎం చంద్రబాబుని పొగిదేందుకు ఫేక్ ఫోటోలు పోస్ట్ చేసిన పవన్ ఏఐ ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్విమర్శలు రావడంతో మళ్ళీ ఆ ఫోటో ఎక్స్ నుంచి తీసేసిన పవన్ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన ఫేక్ ఫొటోను పోస్ట్ చేసి విమర్శల పాలైన పవన్ కళ్యాణ్మరో అల్ప పీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..పశ్చిమ మధ్య బంగాళాఖాతం-వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్ప పీడనంరానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశంకోస్తాంధ్ర అంతట విస్తారంగా వర్షాలు పడనున్నాయి.పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులురానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు. ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్లు..కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్ పనులు.బోట్లు ఢీకొనడంతో డ్యామేజ్ అయిన బ్యారేజ్ 69వ గేటుధ్వంసమైన కౌంటర్ వెయిల్ స్థానంలో మరొకటి ఏర్పాటుకు అధికారుల చర్యలు. విజయవాడ:ఆరు రోజులుగా వరద నీటిలోనే పాయకాపురం,బర్మా కాలనీ వాసులునడుము లోతుకు పైగా ఇళ్ల చుట్టూ వరద నీరుఅరకొరగానే ప్రభుత్వ సహాయక కార్యక్రమాలుఇళ్ల వద్దకే అన్నీ పంపిస్తామని చెప్పిన సీఎంనడుము లోతు నీటిలో కిలోమీటర్ దూరం వెళితేకానీ దొరకని ఆహారం,నీరులోపల కాలనీ వాసులను పట్టించుకోకపోవడం పై వరద బాధితులు ఆగ్రహంసర్వం కోల్పోయామంటున్న వరద బాధితులువరద ఇళ్లల్లోకి చేరడంతో మొదలైన బురద కష్టాలుఇంట్లో వస్తువులు..సర్టిఫికెట్లు తడిచిపోవడంతో ఆందోళనలో వరద బాధితులుతమ కష్టార్జితం బురదపాలైందంటూ ఆవేదనతమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న వరద బాధితులు ఏలూరు జిల్లా:ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరు సరస్సుచిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు ప్రవాహంజాతీయరహదారిపై మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు అంతరాయంపాదచారులు, ద్విచక్రవాహనదారులు రావద్దంటూ పోలీసుల హెచ్చరికఇవాళ సాయంత్రానికి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశంఏపీలో కేంద్ర బృందం పర్యటన..వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందంభారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందంనేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనున్న కేంద్ర బృందంఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న కేంద్ర బృందంభారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి వివరిస్తున్న అధికారులుడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:లంక గ్రామాల ప్రజలకు మరల మొదలైన వరద కష్టాలువరద నీటిలో మునిగిన కనకాయలంక కాజ్ వేచాకలిపాలెం - కనకాయిలంక కాజ్వే మునిగి పోవడంతో నిలిచి పోయిన రాకపోకలు పడవల పైనే ప్రయాణం సాగిస్తున్న లంక ప్రజలుగత నెలలో నెల రోజులు పాటు వరద నీటిలో అవస్థలు పడ్డ లంక గ్రామాల ప్రజలువిజయవాడ: మళ్లీ పెరుగుతున్న వరదఅడుగు మేర పెరిగిన వరదభయాందోళనలో సింగ్‌నగర్, అజిత్నగర్, వాంబే కాలనీ వాసులుఇప్పటికే 5 రోజులుగా వరద నీటిలోనే ఉన్న ప్రజలువిజయవాడ: వరదల్లో మరణ మృదంగంమరో 15 మంది వరదలకు మృతినిన్న 15 మృతదేహాలు వరదల్లో తేలిన వైనం47 కి చేరిన మృతుల సంఖ్యనాలుగు రోజులు నీట ముంగడంతో గుర్తు పెట్టలేని రీతిలో పలు మృతదేహాలువరద తగ్గడంతో సింగ్ నగర్ నుండి వెళ్లిపోతున్న బాధితులునాలుగు రోజులు నరకం అనుభవించడంతో విజయవాడ వదిలి వెళ్లిపోతున్నా బాధితులుఇళ్లు బురదమయం, కాలనీలు దుర్గంధభరితం కావడంతో వెళ్లిపోతున్నా బాధితులుప్రభుత్వ పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితిప్రభుత్వ సేవలపై నమ్మకం లేక ఊళ్లకు, బంధువుల ఇళ్లకు కట్టు బట్టలతో వెళ్లిపోతున్న బాధితులు40 పునరావాస కేంద్రాలు మూసేసి ప్రభుత్వం3 లక్షల మంది బాధితుల్లో కనీసం 15 వేల మందికి కూడా పునరావాసం కల్పించని ప్రభుత్వంబురద, దుర్గంధమైన ఇళ్ళ ను, కాలనీలు ఫైర్ ఇంజన్ల తో శుభ్రం చేయాల్సిన దుస్థితికార్లు, బైక్ లు, ఆటో లు, ఫ్రీజ్‌లు, టీవీలు, మంచాలు అన్నీ వరద పాలువరద నీటిలో కలిసిపోయిన డ్రైనేజీలువ్యాధులు ప్రబలుతాయన్న ఆందోళనలో వరద బాధితులుగోదావరికి పెరుగుతున్న వరదధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10.70 అడుగుల వరద నీటిమట్టం నమోదుఎనిమిది లక్షల 36 వేల క్యూసెక్కులు నీరు సముద్రంలో విడుదల1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరావరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులుమరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంక్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశంవాయుగుండం ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశంఉత్తరాంధ్రకు భారీ వర్షసూచననేటి నుంచి 4 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుఆదివారం వరకు మత్స్యకారుల వేటపై నిషేధంవిజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఐదు రోజులుగా జల దిగ్భందంలోనే విజయవాడ ఉంది. మళ్లీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.వరద తగ్గు ముఖం పట్టే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. గల్లంతైన వారి లెక్క తేలటం లేదు. బంధువుల అచూకి తెలియక పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వీరి గోడు మాత్రం ఆలకించడం లేదు. మంగళవారం వరకు 32 మంది మృతి చెందినట్లు వెల్లడికాగా, బుధవారం మరో 15 మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఇంకా పలు మృతదేహాలు నీటిలో తేలియాడుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ వాటి లెక్క తేలడం లేదు. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఎవరూ వెళ్లలేదు.ఆ ప్రాంతంలో పరిస్థితి ఏమిటో తెలియదు. ఇంకెన్ని శవాలు బురదలో ఉన్నాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి బుధవారం సాయంత్రం వరకు 22 మృతదేహాలు వచ్చాయి. 11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఆరు మృతదేహాలు కుళ్లిపోయి, పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. కాగా, పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులు ప్రైవేటు అంబులెన్స్లలోనే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయలేదు. -
ఏపీలో వరద నష్టం.. కమిటీ వేసిన కేంద్రం
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారుకాగా, అమిత్ షా ట్విట్టర్ వేదికగా..‘విజయవాడ ముంపు, వరదలపై కేంద్ర కమిటీ నియామకం. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో నిపుణుల కమిటీ నియామకం జరుగుతుంది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో ఈ కమిటీ పర్యటిస్తుంది. వరద నష్టం, వరద నివారణ, డ్యామ్‌ల భద్రతపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రేపు(గురువారం) కమిటీ ఏపీకి రానున్నట్టు సమాచారం. The Modi government is closely monitoring the ongoing flood situation in Andhra Pradesh. The MHA today constituted a central team of experts, led by the Additional Secretary (Disaster Management), MHA. The team will visit the flood-affected areas for an on-the-spot assessment…— Amit Shah (@AmitShah) September 4, 2024 -
బాబూ.. ఇదేనా నీ అనుభవం?
సాక్షి, తాడేపల్లి: బుడమేరు కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకుని ప్రజలు బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై ప్రజలు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలపై హెచ్చరించలేదని కొందరు చెబుతుండగా.. మరికొందరు వరదల్లో చిక్కుకున్న తమకు కనీస సాయం కూడా అందించలేదని మండిపడుతున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు ఇదేనా నీ అనుభవం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.గత నెల 28వ తేదీన ఐఎండీ అలర్ట్ వస్తే ముందస్తు చర్యలపై సమీక్షలు నిర్వహించారా?.ఐఎండీ హెచ్చరికలపై రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారా?.లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారా?.వరదలు వచ్చిన తర్వాత ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు బోట్లు, హెలికాప్టర్లను సిద్ధం చేశారా?.వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలు, శిబిరాలకు తరలించే ఏర్పాట్లు జరిగాయా?.శిబిరాల దగ్గర వరద బాధితులకు నీళ్లు, ఆహారం, పాలు అందించే ఏర్పాట్లు చేశారా?.విపత్తు నిర్వహణకు సంబంధిత శాఖలతో చర్చించి చర్యలు తీసుకున్నారా?. -
వరద బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
-
రిటైనింగ్ వాల్ లేకుంటే.. పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేవి
-
నా హయాంలో ఇదే చేశా.
-
చంద్రబాబు ఇలు మునిగిపోతుందని చేసిన పని
-
అవ్వా ఏమైనా తిన్నావా?
-
జగన్ తో వరద బాధితుల ఆవేదన..
-
వరద బాధితులకు జగన్ పరామర్శ
-
తెలంగాణ సీఎస్‌పై కేంద్రం సీరియస్
సాక్షి, ఢిల్లీ: కొద్ది రోజులుగా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయి, ఇంట్లోకి నీరు చేరడంతో బాధితులకు తీవ్ర నష్టం జరిగింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పంటలకు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వరద నష్టం వివరాలు రాష్ట్రం పంపించక పోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.తాజాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ సందర్భంగా తెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని హోం శాఖ సూచించింది. రూ.1,345 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, వరదల సందర్భంగా సాయం కోసం ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు లేఖలో పేర్కొంది.ఇక, ఎస్డీఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని ఆదేశించింది. ఇదే సమయంలో జూన్‌లో రూ.208కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది వరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫిటెక్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరింది. వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపించాలని లేఖలో పేర్కొంది. -
విజయవాడ: వరద బాధితులకు జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: వరద బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఇప్పటిదాకా సహాయం అందించకపోవడంపై వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా.. బుధవారం సాయంత్రం ఓల్డ్ ఆర్ఆర్(రాజరాజేశ్వరిపేట) పేటకు వెళ్లిన ఆయన.. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్: ఆహారం, మంచి నీళ్లు అందుతున్నాయా?.. అధికారులు ఎవరైనా వచ్చారా?ఆర్ఆర్ పేట స్థానికులు: లేదు సర్.. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందలేదు. కనీసం ఇటుగా ఏ అధికారి రాలేదు కూడా!బాధితులకు ఇప్పటిదాకా సహాయక చర్యలు అందకపోవడంపై చంద్రబాబు సర్కార్‌పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు . తమ ప్రభుత్వం ఉండి ఉంటే ఇలా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరఫున అవసరమైన సాయం అందిస్తామని మాటిచ్చారాయన. మొన్న సింగ్ నగర్లోనూ ఆయన బాధితుల్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతంలో బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైంది చూస్తున్నాం. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం వైఎస్సార్సీపీ తరఫున వైఎస్ జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని.. అయినా నింద గత ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. -
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా..
-
చంద్రబాబు ‘బురద’ రాజకీయం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన రెండు ప్రకటనలు గమనించారా! విజయవాడ వరద బాధితులందరికి ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన చెప్పారు. కరకట్టలోని తన అక్రమ నివాసంలోకి నీరు వచ్చిన సంగతిని ఆయన ఒప్పుకున్నారు. కానీ.. ఈ రెండు విషయాలను ఆయన ఒప్పుకున్న తీరు మాత్రం విమర్శలకు తావిచ్చేదే. తప్పంతా ఇతరులదే కానీ తనది ఏమాత్రం కాదన్న రీతిలో మాట్లాడే ప్రయత్నం చేశారాయన. పైగా.. వరద బాధితులకు ఆహారం అందకపోవడం వారి తప్పే అన్నట్లు ప్రత్యారోపణ చేసేశారు. కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీళ్లు రావడంపై కూడా ఆయన తనదైన వ్యాఖ్య చేశారు. తన ఇంట్లోకి నీళ్లు వస్తే ఏమిటట? అని ఎదురు ప్రశ్నించి అక్కడ ఉన్న మీడియాను ఆశ్చర్యపరిచారు. విజయవాడను వరద ముంచెత్తిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి బాగా పొద్దు పోయాక ప్రభుత్వ వైఫల్యం, తనింట్లోకి నీళ్లు చేరడాన్ని ఒప్పుకుంటూనే తనకే సాధ్యమైన శైలిలో బుకాయింపులకు దిగారు.చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే వయసులో పెద్దవాడైనందుకైనా ఆయనకు గౌరవం దక్కేది. కానీ ఈ సందర్భాన్ని కూడా ప్రతిపక్ష వైసీపీపై, జగన్‌పై విమర్శలకు వాడుకోవడం, బురద రాజకీయాలకు దిగడం చేశారు. బాబు మాటలకు తందాన పలిక ఈనాడు, ఆంధ్రజ్యోతులు యథా ప్రకారం వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.వైఫల్యం ఉందని బాబు స్వయంగానైనా ఒప్పుకున్నారేమో కానీ.. ఆయనకు వంతపాడే మీడియా మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. పునాదులు, భవంతులు నీట మునిగి ఉన్నది ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సరే.. రాజధాని ప్రాంతం అమరావతికి ఏం కాలేదని అబద్ధాలు రాసేశాయి. ఇదే నిజమని అనుకుంటే చంద్రబాబు ఇల్లు ఉన్నదెక్కడ? రాజధాని ప్రాంతంలోనే కదా? ఈ విషయంపై మాత్రం సదరు పత్రికలు నోరు విప్పవు. కరకట్ట నివాసంలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరిందన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ మీడియా నానా ప్రయత్నాలూ చేసింది. ఆంగ్ల పత్రికలు కొన్ని మాత్రమే ఈ సమాచారాన్ని అందించాయి.చంద్రబాబు వరద బాధితుల పరామర్శకు పలుమార్లు వెళ్లారు. కానీ ఈ పర్యటనల వల్ల ప్రజల కష్టాలు మరిన్ని పెరిగాయే కానీ తగ్గింది లేదు. ఆయన బోటు ‘షికార్ల’కు ఏడెనిమిది మంది అధికారులు వెంట రావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇబ్బంది అయ్యిందని కొందరు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జేసీపీ పొక్లెయిన్ ఎక్కి ఏదో ఊరేగింపుగా వరద ప్రాంతాల్లో పర్యటించడం కూడా విమర్శలకు గురైంది. ప్రచారం కోసం ఇలాంటి గిమ్మిక్కులు మామూలు రోజుల్లో చేస్తే ఓకేనేమో కానీ.. ఒక పక్క ప్రజలు పీకల్లోతు నీటి కష్టాల్లో ఉండగా... వీడియో షూట్ల కోసమో, ఫోటోల కోసమో ఇలా చేయడం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలే ఎక్కువ.బాధితులకు ఆహారం అందించే విషయంలో తాను ఎంత సిద్ధం చేసినా అధికారులు అందరికీ అందించడంలో విఫలమయ్యారని.. ముందున్న కాలనీల్లోని బాధితులు ఎక్కువ ప్యాకెట్లు తీసుకోవడంతో అందరికీ అందలేదని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడవచ్చా! సరిపడినన్ని వాహనాలు రెడీ చేసి, ఆయా ప్రాంతాలకు పంపించి ఉంటే జనం ఎందుకు ఎగబడతారు? మూడు రోజులుగా భోజనం, నీరు, పాలు వంటివి సరిగా అందక ప్రజలు అల్లాడుతున్నారు. వీరిని రక్షించేందుకు తగినన్ని పడవలూ ఏర్పాటు చేయలేదు. దాంతో ప్రైవేటు బోట్ల వారు ప్రజలను అప్పనంగా దోచుకున్నారని కూడా సమాచారం. ఈ విషయాలన్నిటిలో ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా చంద్రబాబు మాత్రం అదేదో అధికారుల వైఫల్యంగా చిత్రించి తప్పుకునే యత్నం చేశారు.తుఫాను, వాయుగుండం వంటివి వస్తున్నప్పుడు వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు చేస్తుంది. ఆ వెంటనే ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులను, అధికారులను అప్రమత్తం చేసి చేసి సమీక్షలు నిర్వహించి తగు భద్రతా చర్యలు తీసుకోవాలి. ముందస్తుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను తరలించాలి. వీటిలో ఒక్కటి కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించలేదన్నది వాస్తవం. బుడమేరుకు వెలగలేరు గేట్లను ఎత్తడానికి ముందు ప్రజలను ఎందుకు హెచ్చరించలేదు? గతంలో వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం పంపేవారు. చంద్రబాబు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దాని ప్రభావం ఇప్పుడు తెలిసింది. తీరా సమస్య తీవ్రమైన తర్వాత చంద్రబాబు వరద పీడిత ప్రాంతాలలో తిరిగితే ఏమి ప్రయోజనం? సరిగ్గా అదే జరిగింది. ముఖ్యమంత్రి తిరిగినా, ప్రజల కష్టాలు తీరలేదని అంటున్నారు. అధికారులు సీఎం చుట్టూరా తిరగడానికే టైమ్ కేటాయించాల్సి వచ్చింది. తెలుగుదేశం మీడియా ఇదంతా జిల్లా స్థాయి అధికారుల వైఫల్యంగా చిత్రీకరించింది. నిజానికి ఇప్పుడు ఉన్న అధికారులంతా టీడీపీ ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న వారే. గతంలో కలెక్టర్లు, ఎస్పీలుగా ఉన్న పలువురిని రెడ్ బుక్ పేరుతో బదిలీ చేశారు. పలువురికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇప్పుడేమో కొత్తగా వచ్చిన అధికారులు సరిగా పని చేయలేదని వీరే అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి?‘‘కరకట్ట లోపల ఉన్న ఇంటిలోకి నీరు వస్తే ఏంటట? అందరి ఇళ్లలోకి వచ్చాయి’’ అని చంద్రబాబు అనడం విడ్డూరమే. ఆయన అక్రమ కట్టడంలో ఉంటున్నారా? లేదా? నది తీరంలో నిషేధిత జోన్లో నివసిస్తున్నారా లేదా? వీటి గురించి మాట్లడకుండా ప్రజలను ప్రశ్నించడం ద్వారా ఏమి చెప్పదలచుకున్నారు? సీఎం వరద బాధితుడిగా మారి కలెక్టరేట్ కు వెళ్లి పోతే సాధారణ ప్రజలను ఏలా రక్షిస్తారు అన్న ప్రశ్న రాదా ? బుడమేరు రెగ్యూలేటర్ గేట్లను ఎత్తివేయడం గురించి జగన్ చేసిన ఆరోపణలు తోసి పుచ్చడానికి యత్నించారు .ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకువచ్చిన పడవల గురించి మాట్లడుతూ ఒక వైపు ప్రమాదం అంటూ, మరోవైపు కుట్ర అంటూ అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. అన్ని చోట్ల ఆవు కథలు చెప్పినట్టు... ఇక్కడ కూడా మాజీ మంత్రి వివేక హత్య కేసును ప్రస్తావించడం ఏ మాత్రం బాధ్యతగా లేదు. అలాగే గుడ్లవెల్లెరు కాలేజీ విషయం కూడా ఇక్కడ మాట్లాడడం ఎందుకో అర్ధం కాలేదు.బుడమేరు వరదలపై ముందస్తు హెచ్చరికల గురించి అడిగితే ...గత ప్రభుత్వం టైంలో గండ్లు పూడ్చకపోవడం వల్ల వరదలు వచ్చాయని సంబంధం లేని సమాధానం చెబుతారు. అమరావతి రాజధాని ప్రాంతం వరదకు గురి అవుతోందని చెప్పడంపై ఆయన మండిపడుతున్నారు. దాన్ని దుష్పప్రచారం అంటున్నారు. అక్కడ వర్షం వల్లే నీరు వచ్చింది అని... వరద కాదని ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ప్రచారం చేసింది.దీన్ని బట్టి వారు ఎంత కంగారు పడుతుందన్నది చెప్పవచ్చు. ఎంత సేపూ అమరావతి రియల్ ఎస్టేట్ గొడవ తప్ప.. అక్కడ వరద రాకుండా ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టలేకపోతున్నారు.రాజధాని ప్రాంతం అంతా బాగుంటే సచివాలయ ఉద్యోగులను ముందుగా ఎందుకు ఇంటికి పంపించారు? అలాగే హైకోర్టు మధ్యాహ్న రెండు గంటలకే ఎందుకు వాయిదా పడింది? నది ఒడ్డున ఉన్న భవనాలకు నీరు ఏలా చేరింది? అదంతా రాజధాని ప్రాంతం కాదా? కృష్ణ లంక వద్ద వరద నీరు రాకుండా జగన్ నిర్మించిన భారీ గోడను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. తెలుగు దేశం మీడియా కూడా అలాంటి ప్రచారం చేయడానికి తంటాలు పడింది. కానీ స్థానికులకు వాస్తవం తెలుసు కనుక జగన్ ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటించి ప్రజల సమస్యలను వాకబు చేసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారని, అర్ధరాత్రి వేళ వెలగలేరు లాక్‌లు ఎత్తివేయడంతోనే ఈ సమస్య వచ్చిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రజలకు క్షమపణ చెప్పి... బాధితులను అదుకోవాలన్నారు. జగన్ టూర్ ఎఫెక్ట్ కొంత పనిచేయ బట్టి, చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నట్టు ప్రకటించారన్న అభిప్రాయం ఏర్పడింది. అయినా మంగళవారం, బుధవారం సైతం ప్రజలు తగు రీతిలో సదుపాయాలు అందక అల్లాడుతూనే ఉన్నారు.రెడ్ బుక్ రాజ్యంగం అంటూ పెద్ద ఎత్తున హింసాకాండకు దిగిన తెలుగు దేశం ప్రభుత్వం ఇలాంటి సంక్షోభాల్లో ప్రజలకు వరదల రెడ్ అలెర్ట్ ఇవ్వడంలో విఫలం అయ్యింది. అందువల్లే ప్రజలు గతంలో జగన్ టైంలో వరద సహయ చర్యలను భాదితులను అదుకున్న తీరును గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం యథా ప్రకారం వైసీపీని విమర్శిస్తూ ఇలాంటి సమయంలో కూడా తన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా, విమర్శలు కురిపించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో కీలక మంత్రి లోకేష్ వంటివారు ఈ వరదల సమయంలో ఎక్కడ ఉన్నారో తెలియదు. అదే కొసమెరుపు. తాను పర్యటిస్తే అధికారుల విధులకు ఆటంకం కలుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే వరద ప్రాంతాలలో తిరుగుతూ చంద్రబాబు తప్పు చేస్తున్నారని ఆయన అంటున్నారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నెల జీతం విరాళంగా ఇస్తాం: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేట: కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీల అందరి నెల జీతం వరద బాధితులకు ఇస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ల నెల జీతం కూడా ఇస్తామని చెప్పారు. ‘ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలి. సిద్దిపేట మున్సిపల్ కమిషర్ రూ.11 వేల విరాళం ఇచ్చారు. రేపు సిద్దిపేట నుంచి వెళ్లే సరుకులను ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తాం. 6 లారీల్లో ఖమ్మంకు సరుకులను పంపుతున్నాం. రాష్ట్రంలో వరదలు వచ్చాయి. నేను ఖమ్మం వెళ్ళాను. వరద బాధితులు 24 గంటలు నీటిలో ఉన్నారు. వాళ్ళను చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. వాళ్లకు ఏమి లేవు. అన్నీ కొట్టుకుపోయాయి. వాళ్లకు మన సిద్దిపేట నుంచి 500 గ్రాసరి కిట్లు పంపించడానికి అమర్ నాథ్ సేవా సమితి ముందుకు వచ్చింది. అమర్నాథ్ సేవా సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సిద్దిపేట నిలయం. చెరువులను కాపాడం మన అందరి బాధ్యత. ఆకర్షణ కన్నా ఆధ్యాత్మికత ముఖ్యం..మట్టి వినాయకులను పూజిద్దాం’అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. -
వరద బాధితులకు అండగా కేఏ పాల్..
-
జగన్ ఆపన్న హస్తం.. బాబు ప్రచార అస్త్రం
సాక్షి, అమరావతి: గద్దెనెక్కిన వారందరూ నాయకులు అవుతారేమోగానీ.. వారిలో కొందరే మనసున్న పాలకులుగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారు. ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు మీడియా ముందు హడావుడి చేసి ప్రచారం కోసం పాకులాడే వారు కొందరైతే.. తాము తెరవెనుక ఉన్నా పర్వాలేదు బాధితులకు తక్షణం సహాయం అందడం ప్రధానం అని భావించే మనసున్న పాలకులు కొందరే.ప్రస్తుతం విజయవాడను భారీ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో అందరూ ఈ అంశం ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మీడియా హడావుడి లేకుండా బాధితులకు తక్షణం సహాయం సమర్థంగా అందించడంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కనబరిచిన నిబద్ధతను.. ప్రస్తుతం కేవలం మీడియా కోసం హడావుడి చేస్తూ బాధితులను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చిని పోల్చిచూస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో నాడు–నేడు ముఖ్యమంత్రుల తీరు ఎలాగుందంటే.. అధికారులకు వారం గడువు.. బాధితులకు తక్షణ సాయం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గోదావరి తదితర వరదలు సంభవించినప్పుడు ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో పరిణతితో వ్యవహరించారు. వరద బాధిత ప్రాంతాలకు తాను తక్షణం వెళ్తే అధికార యంత్రాంగం అంతా తన చుట్టే ఉంటూ బాధితులను పట్టించుకోరని ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచే కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికార యంత్రాంగం మధ్య సమన్వయం సాధిస్తూ సహాయ, పునరావాస చర్యలను సమర్థంగా పర్యవేక్షించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించడమే కాదు.. అక్కడ వారికి తగిన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు.ప్రతి కుటుంబానికి తక్షణం నగదు సహాయం చేసి నిత్యావసర వస్తువులు అందేలా చూశారు. వరదలు తగ్గుముఖం పట్టిన తరువాతే బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. ఆ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి ఏమన్నారంటే.. “కలెక్టర్‌కు వారం రోజుల గడువు ఇస్తున్నా. ఆ తరువాతే వరద బాధిత ప్రాంతాలకు వస్తా. ఒక్క బాధితుడు కూడా తనకు సహాయం అందలేదని చెప్పకూడదు’ అని కరాఖండీగా చెప్పారు. దాంతో యావత్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. వారం రోజుల తరువాత జగన్ పర్యటించారు. ఎలాంటి ఇబ్బందుల్లేవని బాధితులంతా ముక్తకంఠంతో చెప్పారు. అంతా నేనే.. అంతటా నేనే.. ఇక వైఎస్ జగన్‌కు భిన్నంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పుడు క్షణాల్లో వాలిపోయారు. యావత్ అధికార యంత్రాంగం ఆయన పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైపోయింది. మారుమూల ప్రాంతాల్లో బాధితుల గోడును ఏమాత్రం పట్టించుకోవడంలేదు. విజయవాడ నడిరొడ్డున వరద బీభత్సం సృష్టించినా 72 గంటల తరువాత కూడా బాధితులకు నిత్యావసర వస్తువులు అందించలేదు. తాగునీరు, పాల ప్యాకెట్ల సరఫరా చేయాలనే ధ్యాసే అధికార యంత్రాంగానికి లేకుండాపోయింది. తగినన్ని సహాయ శిబిరాలు ఏర్పాటుచేయలేదు.విజయవాడ వీధుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో తిరుగుతున్న సీఎం చంద్రబాబుబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించనూ లేదు. కానీ, ఆయన అంతా నేనే.. అంతటా నేనే అన్నట్లుగా వ్యవహరించారు. మీడియా అంతా తనచుట్టూ ఉండేలా చూసుకుంటున్నారు. మరోవైపు.. వరదలతో ఏకంగా 19 మంది మృత్యువాత పడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. మనసులేని ముఖ్యమంత్రి చంద్రబాబు, చేవచచి్చన ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్ముకుంటే ఇక లాభంలేదని బాధితులే తమ సామాన్లు పట్టుకుని వరద నీటిలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి జిల్లాలో.. ⇒2019–20లో 1,604 మంది రైతులకు సంబంధించి 653 ఎకరాల్లో పంట నష్టపోతే రూ.90.20 లక్షలు పరిహారం ఇచ్చారు.⇒2020–21లో 8,441 మంది రైతులకు సంబంధించి 4,084 ఎకరాల్లో పంటలు కోల్పోయారు.రూ.6.03 కోట్లు పరిహారం చెల్లించారు. ⇒2021–22లో వరదల కారణంగా 4,447 మంది రైతులకు చెందిన 1,387 ఎకరాల్లో పంటను కోల్పోయారు. కేవలం నెలరోజుల్లో రూ.2.47 కోట్లు పరిహారం చెల్లించారు.⇒2022–2023 మధ్య కాలంలో 985 మంది రైతులకు సంబంధించిన 476 ఎకరాల్లోని పంటను కోల్పోయారు. రూ.72.34 లక్షల పరిహారం చెల్లించారు. 2022 జూలైలో వచ్చిన వరదలపై అధికారులతో సమీక్షిస్తున్న అప్పటి సీఎం జగన్ జగన్ సమర్థతకు ఈ ఉదంతాలే నిదర్శనం..2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లా అతలాకుతలమైంది. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నగరం, పట్టణాలు, గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం స్పందించి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. వలంటీర్లు, సచివాలయ ఏఎన్ఎం, పీహెచ్సీ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు మంచినీరు, భోజనం, అత్యవసర, ప్రాథమిక చికిత్సలు అందించారు. తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు. అంతా అయ్యాక జగన్ బాధితులను పరామర్శించారు. తమకు ప్రభుత్వ సహాయం అందిందని బాధితులు సంతోషంతో చెప్పారు. ఇక పంటలు నష్టపోయిన రైతులకు 25 రోజుల వ్యవధిలోనే పరిహారం చెల్లించారు.⇒2023 డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 60 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆనాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాధితులను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సుమారు 60 వేల కుటుంబాలకు రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ ఒక లీటరు, కేజీ ఉల్లిపాయలు, బంగాళా దుంపలు అందించారు. ప్రతి కుటుంబానికి రూ.2,500 ఆరి్థక సాయం చేశారు. ప్రతిరోజూ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది బాధితుల వద్దకు వెళ్లారు. వారికి కావల్సిన అవసరాలను అందించారు. 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు పంపిణీ చేసింది. యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించారు.⇒డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2022 జూలైలో గోదావరికి రికార్డు స్థాయి వరద వచి్చంది. స్వయంగా నాటి సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయడంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులతో సమీక్షించారు. జిల్లా యంత్రాంగం హుటాహుటిన కదిలింది. వలంటీర్ నుంచి కలెక్టర్ వరకు ఒక్క తాటిమీదకు వచ్చి బాధితులను ఆదుకుని సమర్థవంతంగా సేవలందించారు. మరోవైపు.. హోంగార్డు, వలంటీర్ల బృందాలతో ఏటిగట్లకు రక్షణ కల్పించారు. దీని ఫలితంగానే వివిధ ప్రాంతాల్లో గట్లకు ఊలలు పడిన విషయాన్ని సకాలంలో గుర్తించి గండ్లు పడకుండా చూశారు.అప్పట్లో 45 వేల కుటుంబాలు వరద బారిన పడగా, వీరిలో 37,128 మందిని తరలించారు. ఇక వరద బాధితులకు రెండు విడతలుగా నిత్యావసరాలు అందించారు. ఇలా 36,801 మందికి అందజేశారు. నగదు సాయం కుటుంబానికి రూ.2వేల చొప్పున సుమారు రూ.6.50 కోట్ల వరకు నేరుగా బాధితుల అకౌంట్లలో జమచేశారు. మృతులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున అందించారు. మరోవైపు పాడి రైతులను సైతం ప్రభుత్వం ఆదుకుంది. 33,570 పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 1,374 మెట్రిక్ టన్నుల దాణాను పంపిణీ చేశారు. 31,295 పశువులకు వ్యాక్సిన్లు అందించారు.⇒2023 డిసెంబరు మొదటి వారంలో వచి్చన మిచాంగ్ తుపానుతో ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది. తీరప్రాంత మండలాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలోనే నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందే అలర్ట్ అయింది. ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. 46 పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించారు. 685 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. ⇒2022 జూలై 11న అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పోలవరం నిర్వాసిత గ్రామాల్లో వరదలు ముంచెత్తాయి. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల పరిధిలో 217 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పట్లో జగన్ స్పందించి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున 37 వేల కుటుంబాలకు తక్షణ ఆరి్థక సహాయంగా రూ.7 కోట్ల 40 లక్షలు అందించారు. వీటిలో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు ఉచితంగా అందించారు. ఆ నెలంతా కలెక్టర్‌తోపాటు యావత్ అధికార యంత్రాంగం ముమ్మరంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టింది. జూలై 27న జగన్ ఆయా ప్రాంతాల్లో పర్యటించగా బాధితులు పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. -
వరద సహాయక చర్యల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం
-
వరద బాధితులకు రూ.కోటి సాయం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఆయన నాయకులతో సమీక్షించారు. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని చెప్పారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.కూటమి ప్రభుత్వ «ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని.. అయినా తమపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ తరఫున ఉడతా భక్తిగా కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. వరద బాధితులకు అండగా వైఎస్సార్సీపీ విజయవాడలో వరద బాధితులకు వైఎస్సార్సీపీ తరఫున రూ.కోటి సాయం చేయబోతున్నామని, అందులో భాగంగా బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని, ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ తర్వాత స్థానిక అవసరాలు గుర్తించి, పార్టీ నుంచి సాయం అందిస్తామని, మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. మంగళవారం విజయవాడ బ్రాహ్మణవీధిలోని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ నేతలు వెలంపల్లి, సామినేని ఉదయభానులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. -
వరద బాధితులకు వైఎస్సార్సీపీ భారీ విరాళం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని నిన్న స్వయంగా వైఎస్ జగన్ సమీక్షించిన సంగతి తెలిసిందే. బాధితులతో మాట్లాడిన ఆయన.. వాళ్లకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఇవాళ అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన విరాళ ప్రకటన చేశారు. ‘‘వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదు. లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు’’ అని సమావేశంలో పలువురు నాయకులు జగన్‌కు తెలిపారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవన్నారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని చెప్పారు. ఫలితంగా.. వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా.. వారికి మందులు కూడా లభించడం లేదన్నారు. జగన్ స్పందిస్తూ.. తన పర్యటనలో వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న జగన్.. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లనే వరదలు ముంచెత్తాయని.. అయినా నింద వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని నేతలతో ఆయన అన్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నామని.. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతో జగన్ చెప్పారు. ఈ సమావేశంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ముందుచూపు.. చంద్రబాబుకు అదే దిక్కు
సాక్షి, విజయవాడ: వరద బాధితులకు ఎండీయూ వాహనాలు అండగా నిలుస్తున్నాయి. అందులోనే ఆహారం, మంచినీరును చంద్రబాబు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎండీయూ వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో చౌక డిపోల దగ్గర వేచిచూసే పని లేకుండా ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల దగ్గరకే వైఎస్ జగన్ రేషన్ పంపిణీ చేయించారు. సీఎం అయ్యాక ఆ వాహనాలను చంద్రబాబు పక్కన పెట్టించారు. ఇప్పుడు వరద బాధితుల కోసం కూటమి ప్రభుత్వానికి అవే వాహనాలు దిక్కు అయ్యాయి. ఇరుకు మార్గంలో కూడా వెళ్లి ఆహారం నీళ్లు అందించటానికి ఎండీయూ వాహనాలు ఉపయోగపడుతున్నాయి.అయితే, వాహనాల వాడకంలోనూ చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసింది. వాహనాలపై ఉన్న వైఎస్ జగన్ ఫోటోలు కనపడకుండా స్టిక్కర్లను అంటించిన అధికారులు.. జగన్ పేరు ఉన్న చోట ఏకంగా స్టిక్కర్లను చించివేశారు. నిన్నటి వరకు వాలంటీర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. నేడు వరద సహాయక చర్యల కోసం వాలంటీర్లను పిలుస్తున్నారు. ఆహారం సరఫరా కోసం ఎండీయూ వాహనాల వాడకం.. వైఎస్ జగన్ ముందు చూపు కార్యక్రమాలే చంద్రబాబుకు దిక్కయ్యాయని స్థానికులు అంటున్నారు. -
తోపుడుబండిపై భార్య మృతదేహం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
సాక్షి, విజయవాడ: సింగ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి వరద నీరు రావడంతో పద్మావతి (48) అనే మహిళ గుండె ఆగి మృతి చెందింది. నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన జరిగింది. హార్ట్ ఎటాక్ అని చెప్పినా కూడా పడవలు, అంబులెన్స్‌లు రాలేదు. దీంతో బయటకు రాలేక, మెడిసిన్ అందక.. తీవ్ర బాధను పద్మావతి అనుభవించింది. చివరికి భర్త, కుమారుల కళ్లెదుటే కన్నుమూసింది.నిన్నటి నుంచీ ఇంట్లోనే డెడ్‌బాడీతో కుటుంబ సభ్యులు ఉన్నారు. చివరికి వరద నీటిలోనే తోపుడిబండిపై మృతదేహంతో భర్త శ్రీనివాసరావు బయలుదేరారు. 4 కిలోమీటర్లు భార్య మృతదేహాన్ని తోపుడుబండిపై తోసుకుంటూ వరదలో నీటిలోనే ప్రయాణం సాగించారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వరకు వచ్చి అధికారులను ప్రాధేయపడినా ఊరట దక్కలేదు.నాలుగు కిలోమీటర్లు వచ్చారుగా ఇంకో కి.మీ. వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందంటూ ఉచిత సలహాను అధికారులు ఇచ్చారు. దీంతో చేసేదిలేక తోపుడు బండిపై మృతదేహంతో కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. పద్మావతి మృతి ఘటన చూపరులను కంట తడి పెట్టించింది. -
AP: బురదలో ఆహార పొట్లాలు.. సాయం ఇలాగేనా?
సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఆహారం, నీరు లేకపోవడంతో హెలికాప్టర్ వద్దకి ప్రజలు పరుగులు తీస్తున్నారు. వాంబే కాలనీలో ఆహార పొట్లాలను హెలికాప్టర్ ద్వారా బురదలోకి జారవిడుస్తున్నారు. దీంతో ఆహారం, వాటర్ కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నా బురదలో పడేయడం ఏంటి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బురదలో పడి ఆహారం కోసం కుక్కలా కొట్టుకొనేటట్లు ప్రభుత్వం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదలో ఆహార ప్యాకెట్లు పడటంతో సగం పైనే బురదమయం అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు.మరో వైపు, వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. వరద బాధితులను తరలించేందుకు అధికారులు బోట్లను రప్పించారు. తిండీ తిప్పల్లేకుండా ఆకలితో అలమటిస్తూ.. బోట్లతో మత్స్యకారులు వచ్చారు. ముస్తాబాద్ వద్ద వరద బాధితుల కోసం బోటు ఏర్పాటు చేయగా, బోటుతో పాటు మచిలీపట్నం నుంచి ముగ్గురు మత్స్యకారులు వచ్చారు.అధికారులు తీసుకొచ్చి తమను వదిలేశారని.. ఒక్కరు కూడా తమను పట్టించుకోవడమ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని మత్స్యకారులు వాపోతున్నారు. -
14 మందికి ఒక్క ప్యాకెట్? చంద్రబాబుకు మహిళ కౌంటర్
-
Amaravati Roads Close: కృష్ణా నది ఉగ్రరూపం.
-
ఆహార పొట్లాల కోసం కొట్లాట..
-
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
సాక్షి,ఖమ్మం: వరద బాధితులకు తక్షణసాయం కింద రూ. 10 వేలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం వరదల ప్రాంతాల్లో సీఎం రెండో రోజు పర్యటన సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. అనంతరం మహబూబాబాద్‌లో పర్యటించి వరద బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఖమ్మంలో కూడా వరదలు ఆక్రమణల వల్లే వచ్చాయి. మున్నేరు రిటెయినింగ్ వాల్ ఎత్తు పెంచడంపై ఇంజనీర్లతో మాట్లాడి చూస్తాం. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే ఆక్రమణలు తొలగిస్తాం. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశాం అన్నారు.మరి గతంలో తెగని చెరువులు ,ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయి.75 సంవత్సరాలలో ఇంత వర్షం ఎప్పుడూ పడలేదు. అంత విపత్తు జరిగినా ప్రాణ నష్టాన్ని తగ్గించామంటే అది ప్రభుత్వ ముందు చూపే. వరదలపై హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. ముందు మీ పార్టీ నాయకుడు పువ్వాడ అజయ్ ఆక్రమించిన హాస్పిటల్లో కాలువల విషయంలో హరీశ్‌రావు నిలబడి తొలగించి ఆదర్శంగా ఉండాలి. కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాశాం. వారి నుంచి స్పందన రావాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నాం. వరదల సహాయంతో మా మంత్రులు ప్రజలతో ఉంటున్నారు. మా ప్రజలు మమ్ముల్ని అడుగుతారు.. నిలదీస్తారు.. వారు మా వారే.. మాకు ఓటు వేసి గెలిపించారు. ఫాంహౌస్‌లో పడుకున్న వారిని అడుగుతారా? ఇటువంటి విపత్తుల సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు. అమలు చేయలేదు. మాది చేతల ప్రభుత్వం. గత ప్రభుత్వ హామీలు కూడా మేమే అమలు చేస్తాం. రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నాం’అని సీఎం తెలిపారు. మహబూబాబాద్‌లో సీఎం కామెంట్స్.. యువ సైంటిస్టు అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అశ్విని సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాంఆకేరు వాగు పొంగిన ప్రతిసారి మూడు తండాలు మునుగుతున్నాయి.వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం. -
AP: వచ్చీ ఉపయోగం లేదు
సాక్షి ప్రతినిధి: వరద నీరు ముంచెత్తి ప్రజలు దిక్కుతోచక ఇళ్లలోనే బందీలై సాయం కోసం హాహాకారాలు చేస్తుంటే ఒక రోజు తరువాత తీరిగ్గా బోట్లను తెప్పించింది ప్రభుత్వం. పోనీ అప్పుడైనా అన్నింటినీ రంగంలోకి దిగి బాధితులను ఒడ్డుకు చేర్చిందా అంటే అదీ లేదు. ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన పడవలను లారీల నుంచి కిందకు దించలేదు. రోడ్లమీదే ఆ లారీలను నిలిపివేశారు. దీంతో అవి వచ్చినా ఉపయోగంలేకపోయింది. కొన్ని బోట్లు అధికారులు, రాజకీయ నాయకులను తిప్పడానికే సరిపోయాయి. దీంతో ప్రైవేటు బోట్ల నిర్వాహకులు పలువురు బాధితులను దోచుకొన్నారు. ఒడ్డుకు చేర్చడానికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ డిమాండ్ చేశారని బాధితులు సాక్షి బృందం వద్ద తమ గోడును చెప్పుకున్నారు. ‘ఆదివారం నుంచి వరదలోనే ఉన్నాం. అధికారులెవరూ పట్టించుకోలేదు. స్థానికంగా ఉండే కుర్రాళ్లు కొందరు నన్ను, నా మనమరాళ్లను బయటకు తీసుకువచ్చారు. మనుమడు ఇంకా వరదలోనే ఉన్నాడు. బోట్ల వారిని అడిగితే రూ.10 వేలు అడిగారు. అంత డబ్బు మా దగ్గర ఎలా ఉంటుంది? సింగ్ నగర్ వంతెనపైనే తిండి, నీరు లేకుండా కూర్చున్నాం. ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని పోలీసులు తరుముతున్నారు. ఎక్కడికిపోవాలి? ఎలా బతకాలి?’ అంటూ రాజరాజేశ్వరిపేటకు చెందిన దుర్గమ్మ కన్నీరు పెట్టుకుంది. ఎంతగా బతిమిలాడినా పంపలేదు: 10 మంది చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారని, బోట్లు పంపాలంటూ ఎంతగా బతిమిలాడినా పంపలేదని నందమూరి నగర్ 10వ లైన్‌కు చెందిన రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. -
తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు?
(విజయవాడ వరద ప్రాంతం నుంచి ‘సాక్షి’ బృందం) ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా కండ్రిక, రాజీవ్‌నగర్ కాలనీలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు సంధ్యారాణి, వంగలపూడి అనితలకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వారిని చూడగానే ముంపు బాధితులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మూడ్రోజులుగా వరద నీటిలో అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం తాగునీరు, భోజన వసతులు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి నానా అగచాట్లు పడుతున్నామని విరుచుకుపడ్డారు. రాజీవ్ నగర్, కండ్రిక, గుణదల వంద అడుగుల రోడ్డు, గుణదల ఫ్లిప్‌కార్ట్ గోదాము, బ్రిటానియా గోదాములతో పాటు గుణదల రోడ్డు వంటి ప్రాంతాల్లో సహాయక చర్యలులేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తీరికలేనప్పుడు రావడమెందుకు? మంత్రి సంధ్యారాణితో వచ్చిన ఆహార పొట్లాల వాహనాన్ని ఆమె చేతుల మీదుగా ఇప్పించేందుకు టీడీపీ శ్రేణులు యతి్నంచారు. అయితే, బాధితులు అప్పటికి భోజనంలేక మూడ్రోజులుగా ఇబ్బందులు పడుతుండటంతో ఆహార పొట్లాల వాహనం వద్దకు గుంపులుగా చేరుకున్నారు. దీంతో టీడీపీ వారు ఆహార పొట్లాలను గాలిలోకి ఎగరేయడంతో తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇలా మంత్రులు కొద్దిదూరం ట్రాక్టర్‌పై వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగారు. -
Vijayawada Floods: ‘కన్నీటి’ వరద
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సింగ్‌నగర్ పరిధిలోని వాంబే కాలనీలో నివసించే శ్రావణి రెండు రోజులుగా ఇద్దరు బిడ్డల ఆచూకీ తెలియక తల్లడిల్లుతోంది. శనివారం ఉదయం కూలి పనుల కోసం వెళ్లిన శ్రావణికి కొద్దిసేపటికే వాంబే కాలనీ మునిగిపోయిందన్న సమాచారం తెలియడంతో గుండెలు అవిసిపోయాయి. 36 గంటల నుంచి తన కుమారుడు, కుమార్తె ఇంట్లో చిక్కుకుని ఉన్నారని.. కనీసం వారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియడం లేదంటూ విలపిస్తోంది. చిన్నారులు ఇద్దరూ పదేళ్లలోపు వారే కావటంతో ఎలా ఉన్నారో అంతుబట్టక నిద్రాహారాలు లేకుండా కుమిలిపోతోంది. అధికారులకు తన మొర చెప్పుకుందామని వెళ్తే వినిపించుకునే నాథుడే లేకుండా పోయాడని కన్నీరు మున్నీరు అవుతోంది. ‘నా కన్నీటిని ఎవరూ పట్టించుకోవటంలేదు. కడుపున పుట్టిన బిడ్డలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వ పెద్దనా సమస్యను ఆలకించడం లేదు’ అంటూ రోదిస్తోంది!! వరద ప్రాంతాల్లో బాధితుల దుస్థితికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే! సహాయ చర్యల్లో సర్కారు వైఫల్యంతో పలుచోట్ల మహిళలు, పిల్లలను వారి బంధువులు, వలంటీర్లు పీకల లోతు నీళ్లలో భుజాలపైకి ఎక్కించుకుని కాపాడి తెస్తున్న దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. వరద నీటిలో వస్తుండగా కాళ్లకు పాములు, విష జంతువులు చుట్టుకోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. నీట మునిగిన సింగ్‌నగర్ ఏరియల్ వ్యూ తెల్లారేసరికి ప్రాణాలతో ఉంటారో లేదో..‘ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచేశారు. కనీసం ముందుగా చెబితే కట్టుబట్టలతో ఒడ్డుకైనా చేరేవాళ్లం. ఆదివారం తెల్లారేసరికి నీరు చుట్టుముట్టింది. ఎంతోమంది చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులున్నారు. ఆహారం మాట దేవుడెరుగు.. ప్రాణం కాపాడుకునేందుకు గుక్కెడు మంచినీళ్లూ దొరకటం లేదు. చిన్నపిల్లలు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నారు. మెయిన్ రోడ్డు మీద కొన్ని పడవలు తిరుగుతున్నాయి. వాళ్లను ఎంత బతిమాలినా లోపల సందులోకి రావటం లేదు. ఆహారం, పాలు, నీళ్లు.. రోడ్డుపైన ఉన్న కొన్ని ఇళ్ల వారికి మాత్రమే అందుతున్నాయి. లోపల వేలాది కుటుంబాలున్నాయి. తెల్లారేసరికి ప్రాణాలతో ఉంటాయో లేదో! ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాలనీల్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోవడంతో మిద్దెలు, పై ఫ్లోర్లలో తలదాచుకుంటున్నారు. ఏదైనా బోటు కనిపిస్తే నీళ్లు, పాల ప్యాకెట్లు పైకి వేయాలని వేడుకుంటున్నారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఆహారం, పాలు, తాగునీటి కోసం వరద బాధితుల అవస్థలు కట్టుబట్టలతో కొంతమంది ఎలాగోలా బయటపడగా చాలామంది ధైర్యం చాలక మిద్దెలపైన బిక్కుబిక్కుమంటు బతుకీడుస్తున్నారు. వరద ప్రభావిత కాలనీల్లో విద్యుత్ లేదు. ఫోన్లు పనిచేయడంలేదు. రాత్రిళ్లు నరకయాతన అనుభవిస్తున్నారు’ అంటూ వరద నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారు చెబుతుంటే కళ్లు చెమరుస్తున్నాయి. రాజీవ్‌నగర్, కండ్రిక, గుణదల, లూనాసెంటర్, పాయకాపురం, తోటవారివీధి తదితర కాలనీల్లో ఇప్పటికీ సహాయ చర్యలు అందలేదు. పశువుల షెడ్లు కూలిపోవడంతో రెండు రోజులుగా మూగజీవాలు నీరు, తిండిలేక రోడ్లపైనే ఉన్నాయి. ఇళ్లు నీట మునిగిపోవడంతో సామగ్రి పూర్తిగా దెబ్బతింది. దుకాణాల్లోకి నీరు చేరడంతో సరుకులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. బాధితులు లక్షల్లో.. బోట్లు పదుల్లోవరద బాధితులు లక్షల్లో ఉండగా ప్రభుత్వం తెప్పించామని చెబుతున్న బోట్లు ఏ మూలకూ సరిపోవటం లేదు. రోడ్లపైన బాధితులకు నీరు, పాలు, ఆహారం తరలించేందుకే పరిమితం అవుతున్నాయి. పలు బోట్లకు పంక్చర్లు కావడంతో వెనక్కి వస్తున్నాయి. ఇదే అదునుగా కొందరు వెల కడుతూ బోట్ల వ్యాపారానికి తెగబడుతున్నారు. కుటుంబం అయితే రూ.5 వేలు, మనిషికి రూ.1,000–1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. పేదలను మాత్రం బోట్లు ఎక్కనివ్వడం లేదు. 5 నియోజకవర్గాల పరిధిలో..బుడమేరు పొంగటంతో ఐదు నియోజక వర్గాలు.. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, మైలవరం, గన్నవరం పరిధిలో కాలనీలు నీట మునగడంతో సుమారు 4.5 లక్షల మందికి పైగా ముంపు బారినపడ్డారు. ఇప్పటికీ పూర్తిగా నీటిలో చిక్కుని 2.5 లక్షల మందికిపైగా బాధితులు అల్లాడుతున్నారు. వివిధ కాలనీలకు సంబంధాలు తెగిపోయి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రానికి 20వేల మందిని కూడా∙బయటకి తరలించలేని దుస్థితి.కనుచూపు మేర నీళ్లే 48 గంటల తరువాత కూడా లక్షల మందిని వరదల్లో వదిలేసి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. బాధితుల ఇళ్లల్లో వంట సామగ్రి, గ్యాస్ స్టవ్‌లు, బీరువాలు, బట్టలు, ఫర్నిచర్, పుస్తకాలు.. బురదమయమైపోయాయి. ఇంట్లో ఉండలేక బయటకు వద్దామంటే కనుచూపు మేర నీళ్లే కనిపిస్తుండటంతో అల్లాడుతున్నారు. ప్రభుత్వం కనీసం కొవ్వొత్తులు కూడా సరఫరా చేయలేదు. బాధితులను హెలికాప్టర్లలో ఎయిర్ లిఫ్ట్ చేస్తామని సీఎం చంద్రబాబు ఆదివారం చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. సహాయ చర్యల కంటే వీఐపీల హడావుడి బాధితుల ఇక్కట్లను మరింత పెంచుతోంది. వీఐపీల వాహనాలు కి.మీ. కొద్దీ బారులు తీరాయి. అంబులెన్సులు వెళ్లే మార్గం కనిపించడంలేదు. పాలు, ఇతర నిత్యావసరాల ధరలు రెండు మూడు రెట్లు పెంచేసి దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.అన్నం పెట్టండంటే.. బాబు అభివాదంరెండు రోజులుగా ఆహారం లేక అల్లాడుతున్న బాధితులు తమ ప్రాంతానికి వస్తున్న ప్రజాప్రతినిధులను కనీసం తినడానికి ఏదైనా అందించాలంటూ నిస్సహాయంగా అర్థిస్తున్నారు. సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు బోటులో పర్యటిస్తుండగా ఓ వృద్ధురాలు చిన్నారిని చూపిస్తూ ఆహారం అందించాలని ప్రాథేయపడింది. అయితే చంద్రబాబు నవ్వుతూ ఆమెకు అభివాదం చేస్తూ బోటులో వెళ్లిపోయారు. ఆమెకు ఆహారం అందించాలని అధికారులను కనీసం ఆదేశించకపోవడం విభ్రాంతి కలిగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పునరావాస కేంద్రాల జాడేదీ..?వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిలో కొందరు ఎలాగోలా ధైర్యం చేసి వలంటీర్లు, బంధువుల సాయంతో కర్రలు, తాళ్ల ద్వారా బయటికి వచ్చినా తలదాచుకునేందుకు ప్రభుత్వం కనీసం సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేదు. అరకొర శిబిరాలు సైతం నీళ్లలో మునగడంతో రోడ్లపై దయనీయంగా ఉన్నారు. తిండి లేక అల్లాడుతున్నారు. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడుతున్నారు. వరద ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో బాధితులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.మంత్రులపై మండిపాటు.. ఫొటోల కోసం టూరిస్టుల్లా వచ్చారా?సింగ్‌నగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మంత్రులు అనిత, సంధ్యారాణి అచ్చెన్నాయుడు, డీజీపీని వరద బాధితులు నిలదీశారు. సహాయ చర్యలు అందటం లేదని, విజయవాడను కాపాడలేనివారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని, టూరిస్టుల్లా బోట్లలో వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారని నిలదీశారు. మంత్రులు అనిత, సంధ్యారాణి బాధితుల ఆగ్రహం చూసి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు.‘నా భార్య మౌనిక సింగ్‌నగర్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో ఆగస్టు 31న బిడ్డకు జన్మనిచ్చింది. 15 రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఆసుపత్రి చుట్టూ నీళ్లు చేరడంతో మమ్మల్ని బయటకు పంపేశారు. మాతోపాటు మరో 15 మంది బాలింతలు పురిటి బిడ్డలతో ఒడ్డుకు చేరుకున్నాం. మమ్మల్ని కాపాడేందుకు ఒక్క బోటూ రాలేదు. మేమే ఈదుకుంటూ వచ్చాం. పచ్చి బాలింతైన నా భార్యను ఒక చేత్తో, అమ్మను మరో చేత్తో పట్టుకుని ఈదుకుంటూ ఫైఓవర్ వరకు తీసుకొచ్చా. మళ్లీ వెనక్కి ఈదుకుంటూ వెళ్లి మాకోసం ఆస్పత్రికి వచ్చిన బంధువును, సామాన్లను తెచ్చా. ఇక్కడ నుంచి కనీసం అంబులెన్స్ కూడా దొరకడం లేదు. ఏం చేయాలో.. ఎక్కడకి వెళ్లాలో అర్ధం కావట్లేదు’’ – రాగబాబు, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం ‘‘పక్షవాతంతో బాధపడుతున్న నా భర్తతోపాటు కుమారుడు, కోడలు, మనవడితో కలసి ఉంటున్నాం. ఉన్నట్టుండి ఇల్లు మునిగిపోయింది. చుట్టూ పీకల్లోతు నీళ్లు. ఒడ్డుకు చేర్చేందుకు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ రాత్రంతా డాబాపై వర్షంలో నిరీక్షించాం. చివరకు నా భర్తను ఓ చెక్కపై కూర్చోబెట్టి చంటి బిడ్డను భుజాన వేసుకుని కర్రల సాయంతో ఒడ్డుకు చేరాం. పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు మా పక్క నుంచే బోట్లలో వెళ్లారు. రక్షించాలని అరుస్తున్నా వినపడనట్లు వెళ్లిపోయారు. ఫైఓవర్ దగ్గరకు వచ్చిన తరువాతనైనా కనీసం మంచి నీళ్లు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది’’ – నందమూరి లక్ష్మి, వాంబే కాలనీమమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి మేం బుడమేరు మధ్య కట్టలో ఉంటున్నాం. ఓ వైపు వరద నీరు.. మరోవైపు పాములు, తేళ్ల భయం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికాం. రెండు రోజుల నుంచి భోజనం లేదు. తాగటానికి నీరు కూడా లేదు. భోజన ప్యాకెట్లు ఇచ్చారంటా. కానీ మా వరకు రాలేదు. ఇచ్చే ప్యాకెట్లు కూడా కొంతమందికే అందుతున్నాయి. సహాయం చేయటానికి వచ్చిన అధికారులు, సింబ్బంది మమల్ని కసురుతున్నారు. ఎలాంటి సహాయం అందలేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. – మంగ, సరస్వతి, బడమేరు మధ్య కట్ట ఏరియా పిల్లలు తప్పిపోయారు నేను రిక్షా బండి తోలుకుని బతుకుతా. మమల్ని చూడటానికి మా అమ్మాయి ఊరి నుంచి వచ్చింది. ఆమె కూడా వరదలో చిక్కుకుపోయింది. ఇంట్లో వారికి భోజనం తీసుకువెళదామని ఒడ్డుకు వచ్చా. ఇప్పుడు పోలీసులు నన్ను లోపలికి వెళ్లనీయటంలేదు. లోపల పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. తాగటానికి నీరు లేదు. తినటానికి తిండిలేదు. నేను బయటకు వచ్చాక నన్ను వెతుకుంటూ మావాళ్లు వచ్చారంటా. వారు తప్పిపోయారు. ఎక్కడ ఉన్నారో తెలియడంలేదు. – కృష్ణ, రిక్షా కార్మికుడు, బొంబాయి కాలనీ, పాయకాపురంప్రభుత్వం చెప్పేవన్నీ డొల్ల మాటలేనా భార్య రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటంతో సింగ్‌నగర్‌లోని అమెరికన్ ఆస్పత్రికి వస్తే టైఫాయిడ్ అన్నారు. అక్కడే ఆస్పత్రిలో చేర్పించాను. ఆకస్మికంగా వరద రావడంతో జర్వంతో బాధపడుతున్న నా భార్యను, పిల్లను తీసుకుని ఒడ్డుకు రావాలని ప్రయత్నించగా, ఎవరూ సాయం చేయలేదు. నిన్నటి నుంచి తిండిలేదు. తాగటానికి నీరులేదు. అతి కష్టం మీద చేతికర్ర సాయంతో వరద నీటి నుంచి ఒడ్డుకు చేరాం. మాతోపాటు ఉన్న రోగులందరూ అలాంటి పరిస్థితే. గర్భిణులు, బాలింతల కూడా నీటిలో నడిచే వస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టామని చెబుతున్నవన్నీ డొల్ల మాటలే. – శంకర్, మమత, సింగ్‌నగర్ ఏరియా ఆర్భాటం.. హడావుడే.. సాయం శూన్యం శుభకార్యం ఉందని బెంగళూరు నుంచి నాలుగు రోజుల క్రితం విజయవాడ వచ్చా. వరదలో చిక్కుకుపోయా. ఆర్భాటం, హడావిడి తప్పా బాధితులను పట్టించుకునేవారే లేరు. ఎవరెవరో వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్తున్నారు.. కానీ సహాయం మాత్రం శూన్యం. నీరు, తిండి కోసం అల్లాడాం. – సాధిక్, బెంగళూరు కట్టుబట్టలతో మిగిలాం రెండు రోజుల నుంచి నరకం చూశాం. వరదతో కట్టుబట్టలతో వయటకు వచ్చేశాం. రాజరాజేశ్వరిపేటకు బోట్లు రావటం లేదు. లోపల ఉన్నవారంతా గగ్గోలు పెడుతున్నారు. మా ఇంటిలో సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు మా పరిస్థితేంటో అర్థం కావటంలేదు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. కానీ మమల్ని అక్కడికి తీసుకెళ్లేనాథుడు ఏరి? – ధనలక్ష్మి, దుర్గాప్రసాద్, రాజరాజేశ్వరిపేట -
పవన్.. కొంచమైనా బాధ్యత ఉందా?
ఏపీలో వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి జన జీవనం స్తంభించి పోయింది. విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం సృష్టించింది. కృష్ణమ్మ నీటి ప్రవాహం ధాటికి సిటీ జల దిగ్బంధమైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. పవన్ ఎక్కడ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా.. సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తుంటే పవన్ ఎక్కడ అని అడుగుతున్నారు. గతంలో చిన్న చిన్న విషయాలకే గొంతు చించుకుని, చొక్కా ఎగరేసుకుంటూ పెద్దగా అరిచే పవనాలు సార్.. ఇలాంటి ఆపదలో ఎక్కడికి వెళ్లారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇంతటి నిర్లక్ష్యం వహించడమేంటని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. సరే ఈరోజు ఆయన పుట్టినరోజు. కుటుంబంతో ఒకవేళ బయటకు వెళ్లి ఉంటే తాను అందుబాటులో లేను అనే విషయామైన తెలియజేయాలి కదా?. సోషల్ మీడియా వేదికగా అయినా ప్రజల బాగోగులు అడుగవచ్చు కదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో విషెస్ తెలిపిన వారిని కృతజ్ఞతలు చెప్పే సమయం ఉంది కానీ.. ప్రజలను పరామర్శించే టైమ్ లేదా? అని మండిపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండి.. ముందుండి నడిపించాల్సిన పవన్.. ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలి. సాధారణ రోజుల్లో తన ఆఫీసులో గంటల తరబడి అధికారులతో చర్చలు జరుపుతారు. ఇలాంటి సందర్భంలో మాత్రం బయటకు రాకపోవడమేంటి?. పవన్ ఎక్కడున్నా వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒరే @murthyscribe నీ ఓవర్ యాక్షన్ నీ ఓనర్ మీద బాగానే చూపిస్తున్నావురా. మరి పిల్ల బత్తయి @naralokesh వదిలేసావే. అంటే @ncbn తోనే మన వ్యాపారవ్యవహారాల జరుగుతాయా ? మన షష్ఠి పూర్తి వీరుడు @PawanKalyan ఎక్కడ కనపడటం లేదే pic.twitter.com/WWN4MXCUJM— Madhav (@nenunaaistam) September 2, 2024 -
ప్రజలకు ఏం చేశారు.. సీఎంను హెలికాప్టర్ అడగలేరా?: జగదీష్ రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మండిపడ్డారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఓ మంత్రి చెప్పడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 20 జిల్లాల్లో వర్షం ప్రభావం ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్ర పోయింది. గంటల తరబడి బాధితులు ప్రభుత్వం సహాయం కోసం చూశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. సీఎం నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేశారు?. ప్రజలే రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఓ మంత్రి చెప్తున్నారు. మంత్రిగా మీరు ఫెయిల్యూర్ అయ్యారు.. రాజీనామా చేయండి.హెలికాప్టర్ మాట్లాడకుండా నిన్న ముఖ్యమంత్రి ఏం చేశారు. ఖమ్మంలో సహాయం కోసం ప్రజలు 9 గంటలు వేచి చూసినా సహాయం అందలేదు. ఒక మంత్రి హెలికాప్టర్ కోసం ఏపీ సీఎంతో మాట్లాడాను అని అంటున్నారు. తెలంగాణ సీఎంతో ఎందుకు మాట్లాడలేదు. వర్షాలపై సీఎస్ హెచ్చరికను ఫాలో అయ్యి సీఎం, మంత్రులు బయటకు రాకుండా ఉన్నారా?. పరిపాలన మాకు చేతకావడం లేదని మంత్రులు అంటున్నారు. ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదు. సీఎంతో అమిత్ షా, మోదీ మాట్లాడితే తెలంగాణకు హెలికాప్టర్ కావాలని ఎందుకు అడగలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ 🚁 దొరుకుతుంది కానీ ప్రజలకు హెలికాప్టర్ దొరకదా❓ప్రజల ప్రాణాలను ప్రకృతికి వదిలేస్తారా❓ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా❓వరదలతో సంభవించిన మరణాలకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే❗- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS… pic.twitter.com/N2qXHnoznh— BRS Party (@BRSparty) September 2, 2024ప్రభుత్వం వైపు నుండి హెచ్చరికలు ఉంటే ప్రజలు బయటకురారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. మంత్రులు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుంది కానీ ప్రజలకు హెలికాప్టర్ దొరకదా?. వర్షాలతో సంభవించిన మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడుగా అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని కోరుతున్నాం. బాధితులకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ప్రజల మధ్యన ఉండాలి. నిన్న జరిగిన సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం సోయితో పని చేయాలి. వరదలపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్లో ఒక్క రాజకీయ పదం కనిపించిందా?. ఖమ్మంలో ప్రజలు గజ ఈతగాళ్లకు డబ్బులు ఇచ్చి ప్రాణాలు రక్షించుకున్నారు. కోదాడలో ఎవరి హయాంలోకబ్జాలు జరిగాయో ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చకు సిద్దం’ అని సవాల్ విసిరారు. -
బాబు క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలి..
-
విజయవాడ వరద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
ప్రభుత్వ తప్పిదం వల్లే వరదలు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందని మండిపడ్డారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాగే, వరద బాధితులను ఆదుకోవడంలో కూడా కూటమి సర్కార్ విఫలమైందన్నారు. వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉండేవి కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వైఎస్ జగన్ పర్యటించారు. విజయవాడలోని సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్బంగా నడుము లోతు ఉన్న వరద నీటిలో బాధితులను కలుస్తూ.. వారికి భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. కనీసం తినడానికి తిండి కూడా లేదు. బాధితులకు సరిపడే బోట్లు ప్రభుత్వం ఇవ్వలేదు. చాలీచాలని విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం దారుణం. బాధితులకు రిలీఫ్ క్యాంప్‌లు కూడా లేవు. ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయి. లక్షల మంది బాధితులకు ఆరు రిలీఫ్ క్యాంపులు ఎలా సరిపోతాయి?. ఒక్కరికి కూడా ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. తాగడానికి నీరు లేదు. తినేందుకు తిండి కూడా లేదు. బాధితులు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. రిలీఫ్ క్యాంపులు ఎక్కడ ఉన్నాయో కూడా వారికి తెలియదు. బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వారి ఆవేదన చంద్రబాబు ప్రభుత్వానికి కనిపించడం లేదా?. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. గతంలో ఇంతకంటే ఎక్కువగా భారీ వర్షాలు కురిశాయి. కానీ మనుషులు చనిపోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. వాయుగుండం, వర్షాలు వస్తున్నాయని ఆగస్టు 28వ తేదీనే వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ, హెచ్చరికను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవి ప్రభుత్వ తప్పిదం వల్ల వచ్చిన వరదలు. ప్రభుత్వ అజాగ్రత్త వల్లే వరదలు వచ్చాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ నిర్లక్ష్యంపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. బాధితులను ఆదుకుని వారిని సౌకర్యాలు అందించాలి’ అని డిమాండ్ చేశారు. 11 లక్షల క్యూసెక్కుల వరద రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇదే స్థాయిలో వరదలు వచ్చాయి. వైఎస్సార్సీపీ నేతలంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గతంలో వాలంటీర్లంతా సహాయక చర్యలు అందించేవారు. గతంలో ప్రతీ కుటుంబానికీ ఆర్థిక సహాయం అందించాం. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో గడపగడపకూ సహాయం చేశాం. రిలీఫ్ క్యాంపులను ముందే ఏర్పాటు చేసే వాళ్లం. ఇప్పుడు బాధితులకు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం.. వరదల్లో చిక్కుకున్న ప్రజలను పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
నాడు జగన్ హయాంలో... నేనున్నా...!
వస్తున్న వర్షాన్నో... వచ్చే వరదనో ఆపటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ముందుగా తెలుసుకుని హెచ్చరించే వ్యవస్థలొచ్చాయి. వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగే సామర్థ్యం ఉండనే ఉంది. శిబిరాలకు చేరిన వారికి ఆహారం, నీళ్లు అందిస్తే చాలు. అప్పటికి వాళ్ల ప్రాణాలు కుదుటపడతాయి. వరద తగ్గాక మళ్లీ వారి జీవితాలు మొదలవుతాయి. ఈ ప్రక్రియలోనే వాళ్లకి ప్రభుత్వ అండ కావాలి. ముందుగా హెచ్చరించి... శిబిరాలకు తరలించి... సాయం అందించగలిగే యంత్రాంగం ప్రభుత్వానికే ఉంటుంది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. గత జగన్ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల వ్యవస్థ ఎలా పని చేసిందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటోనే నిదర్శనం నాడు జగన్ హయాంలో బాధితులకు పునరావాసం ఇలా.. రెండేళ్ల కిందట ఇదే స్థాయిలో వరదలు ఉభయగోదావరి జిల్లాలను ముంచెత్తినపుడు... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ ఒక్కరినీ కన్నీరు పెట్టనివ్వలేదు. ముందుగా హెచ్చరించి శిబిరాలకు తరలించడానికి, శిబిరాల వద్ద అప్పటికప్పుడు వండిన ఆహారం అందించడానికి వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా అక్కరకొచ్చింది. ముఖ్యమంత్రి తన కార్యాలయం నుంచే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలివ్వటంతో సహాయ కార్యక్రమాలు పక్కాగా జరిగాయి. సహాయ కార్యక్రమాలకు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో నాలుగు రోజుల తరవాత పరిస్థితి ఉపశమించాక ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్లారు. బాధితుల్లో ఏ ఒక్కరైనా ఫిర్యాదు చేస్తే ఒట్టు!!. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లేటపుడు చేతిలో రూ.2వేలు పెట్టి మరీ పంపింది నాటి ప్రభుత్వం.నేడు బాబు హయాంలో... ఎక్కడన్నా..?మరిప్పుడో..? ఇదేమీ అకస్మాత్తుగా పడిన వర్షాల వల్ల వచ్చిన ముప్పు కూడా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నా... ఎగువ నుంచి వస్తున్న వరదను ప్రస్తుత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో కృష్ణా నదికి ఉధృతంగా ప్రవాహం వచ్చి ఎగదన్నింది. దీంతో బుడమేరుకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. ఇది చాలదన్నట్లు... ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారు. దీంతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు రూరల్ ప్రాంతాలూ దారుణంగా మునిగిపోయాయి. ఒక్కరినైనా ముందుగా హెచ్చరిస్తే ఒట్టు. ఇక శిబిరాలూ లేవు.. వాటికి తరలించటాలూ లేవు. సహాయ కార్యక్రమాల ఊసేలేదు. పైపెచ్చు కరకట్టపై కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికే దిక్కులేదు. ఆ విషయం బయటపడకుండా ఆయన సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ పేరిట కలెక్టరేట్లో మకాం వేశారు. అక్కడికొక క్యారవాన్ తెప్పించుకుని... దాన్లోనే బస చేశారు. తన ఇల్లు మునుగుతోందన్న వార్తలపై అడ్డంగా దబాయిస్తూ... చరిత్రలో ఎన్నడూ ఎరుగని వర్షం వచ్చింది కాబట్టి పరిస్థితి ఇలా అయిందని బుకాయిస్తూ... తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తప్పవని బెదిరిస్తూ హుంకరింపులకు దిగారు. ఎల్లో మీడియా... సేమ్ టు ‘షేమ్’చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా వైఖరి షరా మామూలే. ఉభయగోదావరి వరదల్లో ఎక్కడో ఒకరికో, ఇద్దరికో సాయం అందకపోతే ఆ ఒక్కరి గురించే పేజీలకు పేజీలు వండేసి అబద్ధాలతో నాటి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఎల్లో మీడియా... ఇప్పుడు కూడా ముందస్తు సమాచారం ఉన్నా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టలేకపోయిందంటూ... అనుకున్న విధంగా సహాయక చర్యలు లేవంటూ సుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కింది. ముఖ్యమంత్రి కలెక్టరేట్లో బస చేసిన వార్తలకే పెద్దపీట. అక్కడ బస చేయటం వల్ల ఉపయోగం ఏంటన్నది దుర్గమ్మకెరక. బాధితుల్లో ఎవరిని పలకరించినా... తమ చెంతకు ఎవరూ రాలేదని, ఎలాంటి సహాయమూ చేయలేదనే చెబుతున్నారు. బోట్లు లేవు.. తరలింపులు లేవు... నీళ్లు లేవు.. ఆహారం లేదు.. సహాయ సామగ్రి లేవు. అసలు ప్రభుత్వ యంత్రాంగమే కనిపించలేదు. ఈ విషయం వరద ప్రాంతాలను సందర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లినపుడు స్పష్టంగా బయటపడింది. బాధితుల ఆవేదనంతా బయటపడింది. ‘‘ఇప్పటిదాకా మీరు తప్ప ఇక్కడకు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్లు ఎవ్వరూ లేరు’’ అని విజయవాడలోని సింగ్ నగర్ వాసులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి చెప్పకనే తెలుసుకోవచ్చు.కృష్ణలంక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్(ఫోటో గ్యాలరీ) -
వీడియో: సాయం అందించడంలో ప్రభుత్వం విఫలం.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ వరద నీటిలో మునిగిపోయింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సందర్భంగా వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని టీడీపీ కార్యకర్తలు, బాధితులు మండిపడుతున్నారు.వరద బాధితులు(టీడీపీ అభిమాని) మాట్లాడుతూ.. విజయవాడలో వర్షాలు, వరద ముంపుపై మాకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. మమ్మల్ని ఎవరూ అలర్ట్ చేయలేదు. బాధితులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫేయిల్ అయ్యింది. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము వెళ్లి వారిని తీసుకువస్తాం అంటే వెళ్లనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క బోటు కూడా మా కోసం రాలేదు. కనీసం ప్రైవేటు బోట్లు అయినా తెప్పించాల్సింది. అది కూడా ప్రభుత్వం చేయడం లేదు. ప్రైవేటు బోట్లకు మేమే డబ్బులు ఇస్తాం. మా వాళ్లను రక్షించుకుంటాం. ఇప్పటికైనా వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడండి అంటూ వేడుకున్నాడు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ అంటున్న టీడీపీ కార్యకర్తలు..విజయవాడలో వరద ముంపుపై కనీసం అలెర్ట్ కూడా ఇవ్వలేదుబాధితులకి కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ ఫెయిల్@JaiTDP కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న టీడీపీ కార్యకర్తలు. pic.twitter.com/oTQdOAaSbb— YSR Congress Party (@YSRCParty) September 2, 2024మరోవైపు.. కనీసం వరద ఉద్ధృతిపై అప్రమత్తం చేసి ఉన్నా జాగ్రత్తలు తీసుకునే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి తిండి, నీరు లేదని.. కూటమి నేతలు తమని అస్సలు పట్టించుకోలేదని ఎల్లో మీడియా ముందే బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న వరద బాధితులుకనీసం వరద ఉద్ధృతిపై అప్రమత్తం చేసి ఉన్నా.. జాగ్రత్తలు తీసుకునేవాళ్లమని ఆవేదననిన్నటి నుంచి తిండి, నీరు లేదని.. కూటమి నేతలు తమని అస్సలు పట్టించుకోలేదని ఎల్లో మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు pic.twitter.com/c0AjKStFZw— YSR Congress Party (@YSRCParty) September 2, 2024 .@JaiTDP కూటమి ప్రభుత్వం మమ్మల్ని గాలికొదిలేసింది.. విజయవాడలో తిట్టిపోస్తున్న వరద బాధితులు సహాయక చర్యల్లేవు.. కనీసం తిండి, మంచి నీరు కూడా తమకి ఇవ్వడం లేదంటూ ఆవేదనప్రజల్ని అప్రమత్తం చేయడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం pic.twitter.com/aFuRVMBGFd— YSR Congress Party (@YSRCParty) September 2, 2024 -
విజయవాడకు వైఎస్ జగన్
-
వరదల్లో ప్రైవేట్ బోట్ల దందా..
-
ప్రతీ ఎకరాకు పది వేల సాయం: సీఎం రేవంత్
CM Revanth Khammam Tour Updates..👉వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.ఖమ్మం జిల్లాకు వెళ్తూ సూర్యాపేట జిల్లాలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష.మోతే మండలం రాఘవపురం వద్ద రైతులు, అధికారులతో సీఎం రేవంత్ సమీక్షసమీక్షకు హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, మందుల సామెల్, పద్మావతి, వేం నరేందర్ రెడ్డిసీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్సూర్యాపేట జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడిందిపంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదికను అధికారులు ఇచ్చారు.ప్రభుత్వం నిరంతరంగా మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం.ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.ఖమ్మం, నల్లగొండ పరిస్థితిపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరానువర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారంపశువులు చనిపోతే 50 వేల సాయంపంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయంఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లుసూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా ఐదు కోట్లుపాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్లకు నిర్ణయాధికారంవరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలుఅమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్ పోస్టులు పెడుతున్నాడుఒకాయన ఫాంహౌస్‌లో ఉన్నాడువరద సమయంలో బురద రాజకీయాలు వద్దు.బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళతారు కానీ వరద బాధితులను పరామర్శించరు.మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్న.వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ను ప్రారంభించుకుంటున్నాం.జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించాంరాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయి.తక్షణమే కేంద్రం రెండు వేల కోట్లు కేటాయించాలని కోరుతున్న.కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలి.రాజకీయాలకు ఇది సమయం కాదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..నాకు ఊహ తెలిసింత వరకు ఇంతలా మున్నేరు వాగు ఉధృతిని చూడలేదు.వరద ఒక ప్రళయంగా విరుచుకుపడింది.జనం చిగురు టాకులా వణికిపోయారు.అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం.ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది.ఇది ప్రకృతి వైపరీత్యం.ప్రతిపక్ష పార్టీలు వరదలను కూడా రాజకీయం చేస్తున్నాయి.సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తుంది.ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.జనం ఎవరు ఆందోళన చెందవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం..బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది.జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి సీఎం ఖమ్మం రావడాన్ని ఖమ్మం ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.తాత్కాలిక ఉపశమనం కోసం వరద బాధితులకు 10వేలు ఇస్తున్నాం.నష్టం తీవ్రత ఎంత అన్నది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. మంత్రి ఉత్తమ్ కామెంట్స్..రెండు రోజులుగా భారీ వర్షాలతో ప్రజల ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనప్రకృతి వైపరీత్యాలతో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండేందుకు రాష్ట్ర యంత్రాంగం సమాయత్తం అయిందిదురదృష్టవశాత్తు కోదాడలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారుకొన్ని ఇండ్లకు నష్టం జరిగాయిజిల్లా యంత్రాంగం అద్భుతంగా స్పందించిందిజిల్లా అధికారులకు అభినందనలుచనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.వ్యవసాయ పొలాల్లో నీరు వచ్చి నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..అనుకోని వర్షాలతో ప్రజా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.మరో మూడు రోజులు వర్షాలు నేపధ్యంలో దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్లను మరమ్మతులు చేపిస్తాం. దెబ్బ తిన్న నేషనల్ హైవే వారం తరువాత పునరిద్దరిస్తాం.నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి.అధికారులు లీవ్‌లు పెట్టకుండా 24గంటలు అందుబాటులో ఉండాలి మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో వారి ఇళ్లలో ఉన్న పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయి.సీఎం గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.మున్నేరు ఉధృతికి సంబంధించి టీవీల్లో వార్తలను చూసి తాను కూడా ఖమ్మం రావాలనుకున్నాను.అంతలా ఖమ్మంలో వర్ష బీభత్సం కొనసాగింది.మున్నేరు ఉధృతిని చూస్తే ఊహించని ప్రళయమే అన్నట్లు అనిపించింది.వరదల నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.ప్రతిపక్ష పార్టీల విమర్శలను మీడియా వాళ్ళు పట్టించుకోవద్దు. 👉తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అలాగే, ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. 👉ఇక, సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్.. భారీ వర్ష సూచన ఉన్న చోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.👉అనంతరం, సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లాలోనే బస చేయనున్నారు. ఇక, రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్గం మధ్యలో కోదాడలోనూ పర్యటించనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో పర్యటనకు వెళ్లూ సూర్యాపేట, పలు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. -
పచ్చి బూతులు తిట్టిన జనం పారిపోయిన చంద్రబాబు..
-
వరద నీటిలో ఏపీ రాజధాని అమరావతి
-
తెలంగాణ అంతటా మరోసారి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగాయి. వర్షం బీభత్సంతో వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. పలువురు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మహబూబాబాద్‌లో కురస్తున్న భారీ వర్షాలకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఐఎండీ గుజరాత్‌తో పాటు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న తెలంగాణా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం రాష్ట్రంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి దారి మళ్లించింది. హైదరాబాద్‌లోనూ శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. 2020 వరదల మాదిరిగానే 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్న అనుకూల వాతావరణంతో నగరానికి ఉపశమనం కలిగినట్లు తెలిపింది.ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం సహా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గుజరాత్లో సైతం1976 తర్వాత అరేబియా సముద్రంలో తొలిసారి తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. గుజరాత్లో ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 29 వరకు కురిసింది. ఈ వర్షం ధాటికి 47 మంది మరణించారు. ఈ తరుణంలో ఆదివారం (సెప్టెంబర్1) వాతవారణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన వర్షాలు సెప్టెంబర్ 5వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. చంద్రబాబు ఇంటికి వరద ముప్పు!
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది.ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. వరద నీటి కారంగా విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి పూర్తిగా నీటిని విడుదల చేశారు. అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు దాటితే కరకట్ట వైపు నీళ్లు వెళ్లే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో వరద ఇంట్లోకి నీరు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా గంట గంటకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. ఇక, వాయుగుండం బలపడటంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
త్రిపురను ముంచెత్తిన వరదలు.. రూ. 15 వేల కోట్ల నష్టం
త్రిపురను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో వరదల కారణంగా రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాకు తెలిపారు. వరదల కారణంగా 24 మంది మృతిచెందినట్లు తెలిపారు. 1.28 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు.అఖిలపక్ష సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా ఏర్పడిన నష్టం రూ.15 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. క్లిష్ట సమయాల్లో కలిసికట్టుగా పని చేస్తామని అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు సరిపడా ఆహార ధాన్యాలు, ఇంధనం నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మార్కెట్లపై నిఘా సారిస్తుందని అన్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం త్రిపురలో వరద పరిస్థితులు నెమ్మదించాయి. పలు నదులు ప్రమాద స్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయి. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారి కోసం వైమానిక దళం హెలికాప్టర్ల నుండి నాలుగు వేలకు పైగా ఆహార ప్యాకెట్లను జారవిడిచింది. ఇదిలావుండగా బంగ్లాదేశ్‌లో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. ఆ దేశంలోని 11 జిల్లాల్లో వరదలకు దాదాపు 49 లక్షల మంది ప్రభావితులయ్యారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ తమ దేశానికి సహాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలను కోరుతున్నారు. -
కాశీలో గంగానది ఉగ్రరూపం.. 84 ఘాట్లు నీట మునక
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. వరదల కారణంగా గంగానది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఘాట్లకు సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాశీలోని మొత్తం 84 ఘాట్లు నీట మునిగాయి. ప్రస్తుతం హరిశ్చంద్ర ఘాట్ వీధుల్లో దహన సంస్కారాలు జరుగుతున్నాయి.గత 10 రోజులుగా వారణాసిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీధుల్లో దహన సంస్కారాలు చేయడం వల్ల కర్మకాండలు చేసేవారు సరైన సంప్రదాయాలను పాటించలేకపోతున్నారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. సాయంత్రం పూట దహన సంస్కారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మణికర్ణిక ఘాట్‌లో దహన సంస్కారాల కోసం జనం చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. -
విజయవాడ : ప్రకాశం బ్యారేజి వద్ద సందర్శకుల సందడి (ఫొటోలు)
-
కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత,లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070,112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,30,632, ఔట్ ఫ్లో 3,74,309 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.5056 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరదసూర్యాపేట జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,57,779, అవుట్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం: 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 167.94 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ: 31.89 టీఎంసీలుగా కొనసాగుతోంది. -
వయనాడ్‌లో 100 ఇళ్లు కట్టిస్తాం : రాహుల్ గాంధీ
కేరళ వయనాడ్ విషాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండచరియల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున 100 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 300లు దాటింది. దాదాపు 300 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బాధితుల్ని పరామర్శించేందుకు వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భాంగా వియనాడ్ విషాదంపై రాహుల్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదం తానెక్కడ చూడలేదన్న ఆయన..బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.కాగా, భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గోదావరిలో నీటి మట్టం పెరిగింది. దీంతో, రానున్న 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం అలాగే కొనసాగుతోంది. ఇక, భద్రాచలం వద్ద ఈరోజు ఉదయం ఆరు గంటలకు గోదావరి వరద 53.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులకు నేడు సెలవును రద్దు చేశారు. అధికారులందరూ నేడు విధుల్లోనే ఉండనున్నారు.మరోవైపు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. గోదావరి నీటి మట్టం 15 అడుగులు నమోదైంది. దీంతో, 14 లక్షల 83 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వెళ్తోంది. ఇక, అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, గోదావరి వరద రోజుల తరబడి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అప్పన రాముని లంక, గంటి పెదపూడి లంకల వద్ద అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన లంక ప్రాంతాల్లో ట్రాక్టర్లు, కాలినడకన లంకవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. -
కృష్ణమ్మకు జలకళ.. భారీగా వరద ఉధృతి (ఫొటోలు)
-
ఉరకలేస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, తూర్పుగోదావరి/ఖమ్మం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా వస్తోంది. నీటిమట్టం 13.9 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 13 లక్షల 9వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అన్నంపల్లి అక్విడెట్, యానాం దగ్గర గౌతమి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.భద్రాచలంలో కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రస్తుతం 52 అడుగులకు నీటిమట్టం చేరింది. 13 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 53 అడుగులకు చేరితే చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో గోదారి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.గోదావరి నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వెళ్లే మార్గంలో తూరుబాక బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం మొండికుంట నుంచి ఇరవెండి రహదారిపై గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రామచంద్రాపురం స్టేజి వద్ద గల కడియాలబుడ్డి వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రభావం తగ్గింది. ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 6470 క్యూసెక్కులు ఉండగా, అడుగు మేర 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా: మిడ్ మానేరుకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 640 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 62 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ సామర్థ్యం 27.5 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 5.80 టీఎంసీలు.అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం, తెన్నేటి విశ్వనాథం పెద్దేరు జలాశయంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం కెపాసిటి 137 కాగా. ప్రస్తుతం 136కి చేరుకుంది. జలాశయం లోకి ఇన్ ఫ్లో 518 క్యూసెక్కుల నీరు. మూడు గేట్లు ద్వారా 456 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.కర్నూలు జిల్లా: తుంగభద్ర డ్యామ్‌కు వరద కొనసాగుతోంది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 90 టీఎంసీలు. ఇన్ ఫ్లో.. 92,636, ఔట్ ఫ్లో..11,657 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భద్రాచలం: గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తుతున్న వరద
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఉదయo 10 గంటలకు 37.7 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో 7 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.పర్ణశాల వద్ద నారా చీరల ప్రాంతం నీట మునిగింది. తెలంగాణాతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న సరిహద్దు రాష్ట్రలైన ఛత్తీస్గడ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగి గోదావరిలోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే భారీ వరదల కారణంగా అనేక చోట్ల రవాణకీ తీవ్ర అంతరాయం కాగా, పలుగ్రామాల్లో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. అధికారులు అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు.భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీటిమట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి సోకిలేరు వాగు, అన్నవరం వాగు కొండరాజుపేట, వాగు చీకటి వాగు, అత్త కోడళ్ళ వాగు ఉదృతంగా ప్రవహించడంతో రహదారులపైకి వరద నీరు చేరుకుంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శబరి నది కూడా పోటెత్తి ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. -
భద్రాద్రి: వరద నీటిలో 30 మంది కూలీలు.. హెలికాప్టర్ సాయంతో..
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దండికొడుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, తాజాగా భద్రాద్రి జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో నీటిలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించారు.కాగా, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. దీంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెంలోని నారాయణపురం వద్ద 30 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు.వారంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో ఈ విషయం చెప్పడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితులను రక్షించేందుకు సీఎంవోతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపారు. హెలికాప్టర్ ద్వారా బాధితుల్ని రక్షించాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో, ఘటన స్థలానికి హెలికాప్టర్ చేరుకుని వారిని రక్షించారు.మరోవైపు.. పెద్దవాగు వరద ఉధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు ఆయన ఫోన్ చేశారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. -
UP Flood: నీట మునిగిన 900 గ్రామాలు
ఉత్తరప్రదేశ్‌లోని గంగా, గోమతి, ఘఘ్రా నదుల నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. అలాగే రామగంగ, గర్రా, ఖానౌట్, రాప్తి, బుధి రాప్ట్, కానో, శారదా నదులు కూడా ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో లఖింపూర్ ఖేరీ, బల్రాంపూర్, అయోధ్య, ఉన్నావ్, బల్లియా, బస్తీ సహా 20 జిల్లాల్లోని దాదాపు 900 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. బల్లియాలో ఘఘ్రా నది కోతకు గురికావడంతో 13 గ్రామాలు నీట మునిగాయి.వారణాసిలోని గంగా నది నీటిమట్టం 48 గంటల్లో రెండు మీటర్ల మేర పెరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష జరిపేందుకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, 24 గంటల్లో పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 1,571 గ్రామాలతో పాటు బరేలీ, పిలిభిత్, షాజహాన్‌పూర్ పట్టణ ప్రాంతాలు వరదల బారిన పడ్డాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.కాశీలో గంగానది నీటిమట్టం వరుసగా రెండో రోజు కూడా పెరుగుతూనే ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం గంగానది నీటిమట్టం 61.79 మీటర్లుగా నమోదైంది. రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పురాతన దశాశ్వమేధ ఘాట్‌లో సాయంత్రం జరగాల్సిన గంగా హారతి వేదికను కూడా మార్చాల్సి వచ్చింది. విశ్వనాథ్ ధామ్ గంగా గేట్ పక్కనే ఉన్న లలితా ఘాట్, మణికర్ణికా ఘాట్ ర్యాంప్‌పైకి నీరు చేరుకుంది. -
బీహార్‌ను భయపెడుతున్న వరదలు
పట్నా: బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. వివిధ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోసి, గండక్ సహా పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరదల నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గండక్ బ్యారేజీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద సహాయక చర్యలకు సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బోటు ఆపరేషన్లు, పాలిథిన్ షీట్లు, సహాయక సామగ్రి, మందులు, పశుగ్రాసం, వరద షెల్టర్లు, కమ్యూనిటీ కిచెన్లు, డ్రై రేషన్ ప్యాకెట్లు/ఆహార ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు సహాయాన్ని అందించాలని, రాష్ట్ర ఖజానాపై విపత్తు బాధితులకు మొదటి హక్కు ఉంటుందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలావుండగా రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ వరదల కారణంగా ఏటా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ బాధితులను ఆదుకోవడం లేదని ఆరోపించారు. -
మణిపూర్‌లో భారీ వర్షాలు.. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేత
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ఈ నేపధ్యంలో మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, అటానమస్ బాడీలు, ప్రభుత్వ పరిధిలోని సొసైటీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, పాఠశాలలను మూసివేశారు.మరోవైపు మణిపూర్ విద్యాశాఖ డైరెక్టరేట్ రాష్ట్రంలో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా జూలై 3, 4 తేదీల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.మణిపూర్‌లోని ప్రధాన నదుల నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బలహీనమైన కట్టడాల్లో నివాసం ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. ఐఎండీ హెచ్చరిక ఇదే..
ఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.ఇదిలా ఉండగా.. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వరదల కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షాల కారణంగా 11 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా బాదలీ ప్రాంత అండర్‌పాస్ వద్ద నిలిచిన నీటమునిగి ఇద్దరు బాలురు మృతిచెందగా, వోఖలా అండర్‌పాస్ నీటిలో స్కూటీతో చిక్కుకుపోయి దిగ్విజయ్‌కుమార్ చౌధరీ (60) అనే వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.दिल्ली लाल क़िले के नज़दीक बना नियाग्रा फ़ॉल्सMust Visit 😬#DelhiRains pic.twitter.com/avDSu5tbDp— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) June 29, 2024 మరోవైపు.. ఢిల్లీ నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం కురిసిన భారీవర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద సూఖీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. అస్సాంలో వరదల పరిస్థితి శనివారం మరింత దారుణంగా మారింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. There is no system in the world with heavy rains like in Delhi that can withstand even New York, China faced same wrath. Attached New York … anywhere it is same the best systems failed … Nothing can withstand nature wrath. pic.twitter.com/VeUmtwWf4S— UltraSaffron3 (@UltraSaffron3) June 30, 2024 दिल्ली की एक बस का हाल देखिए। बारिश का पानी यात्रियों की सीट तक पहुंच गया है।#DelhiRains #viralvideo pic.twitter.com/jmhPiaXxJw— 𝐃𝐞𝐬𝐢 𝐏𝐚𝐧𝐝𝐚 🐼 (@The90sPanda) June 30, 2024 -
దక్షిణ చైనాలో భారీ వరదలు.. 47 మంది మృతి
చైనాలోని దక్షిణ ప్రాంతం భారీ వరదలకు విలవిలలాడిపోతోంది. దీనికితోడు పలుచోట్లు కొండ చెరియలు విరిగిపడుతూ పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలకు వందలాది ఇళ్లు నీటమునగగా, కొండ చెరియలు విరిగిపడిన ఘటనల్లో పలు ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి.దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే లెక్కకుమించినంత మంది గాయపడివుంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.దక్షిణ చైనాలో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో బాధితులకు ప్రభుత్వం సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, బాపట్ల జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో తుపాను బాధితులతో మాట్లాడారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులు, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు. ‘‘ఇంతటి బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ.. మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ ప్రభుత్వంలో ఏదైనా సంభవించరానిది సంభవిస్తే ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్న నమ్మకం మీ ప్రతి చిరునవ్వులో కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం మీది అని ఈ సందర్భంగా కచ్చితంగా చెబుతున్నా. ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుంది తప్ప.. ఏ ఒక్కరికీ చెడు జరగదని కచ్చితంగా చెబుతున్నా’’ అని సీఎం పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ♦ఈ రోజు ఇక్కడికి రాకముందు తిరుపతి జిల్లాలో సందర్శించాను. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ♦ఈ తుపాను తిరుపతి నుంచి మొదలుపెడితే సుదీర్ఘంగా కోస్తా తీరంలో తగులుకుంటూ పోయిన పరిస్థితులు ♦విపరీతమైన, ఎప్పుడూ చూడని వర్షం నాలుగు రోజుల వ్యవధిలోనే పడింది ♦దాని వల్ల వాటర్ లాగింగ్ జరిగి ఇబ్బందులు పడ్డాం ♦మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది, మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నది ఒక గొప్ప వ్యవస్థ. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ♦ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకొని నడిపించి సహాయం చేయించే ఒక గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది ♦వివక్షకు తావుండదు. నష్టం ఎవరికి జరిగినా కూడా, చివరికి మనకు ఓటు వేయని వారికి జరిగినా ఈ ప్రభుత్వం అందరికీ తోడుగా ఉంటుంది ♦ట్రాన్స్పరెంట్గా నష్టం జరిగిన వారిని గుర్తించి సచివాలయంలో సోషల్ ఆడిట్‌కు పేర్లు పెట్టడం జరుగుతోంది ♦పొరపాటు జరిగి ఉంటే మీ పేరు నమోదు చేసుకోవాలని లిస్టులు డిస్ప్లే చేసి మరీ సహాయం అందిస్తున్న ప్రభుత్వం మనది ♦ఇంతకు ముందు కరువు, వరదలు వచ్చినా పట్టించుకున్న పరిస్థితులు లేవు ♦గతంలో ఏరోజు ఇన్ పుట్ సబ్సిడీ వస్తుందో తెలియదు, ఎంత మందికి వస్తుందో తెలియదు ♦ఈ నాలుగున్నరేళ్ల మీ బిడ్డ పరిపాలనలో పూర్తిగా చరిత్ర మారిన పరిస్థితి కనిపిస్తోంది ♦నీళ్లతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరినీ ఆదుకొనేందుకు, వాళ్లకు ఇవ్వాల్సిన రేషన్ తోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు ♦ఇప్పటికే రేషన్, రూ.2,500 ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీ చేయడం పూర్తవుతుంది ♦దాదాపు 12 వేల మందికి, వారికి ఇవ్వాల్సిన 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికీ రూ.2చ500 ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ♦ప్రతి ఇంటికీ వాలంటీర్ వచ్చి దగ్గరుండి ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ♦రెండోది.. పంట నష్టానికి సంబంధించి.. ప్రతి రైతన్నకు ఒకటే చెప్పదల్చుకున్నా ♦ఎవరైనా మీకు ఇన్ పుట్ సబ్సిడీ రాదనో, ఇంకొకటి రాదనో చెబితే దయచేసి నమ్మవద్దండి ♦ఇక్కడ ఉన్నది మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరగదు అనేది గుర్తు పెట్టుకోవాలి ♦మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు! ♦పనిగట్టుకొని అదేపనిగా అబద్ధాలనే నిజం చేయాలని, అబద్ధాలనే పనిగట్టుకొని చూపించేవాళ్లు, రాసేవాళ్లు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం ♦ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమం చేస్తున్నారు ♦ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు ♦ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే, మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే ఇన్సూరెన్స్ ఇచ్చినది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే ♦ఈ ఖరీఫ్ సీజన్‌కు ఇన్సూరెన్స్ వచ్చేది ఎప్పుడు? వచ్చే ఖరీఫ్ మొదలయ్యేనాటికి ♦జూన్‌కు రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ♦ఇంతకు ముందు ఇన్సూరెన్స్ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు ♦అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈక్రాప్ చేసి ఏ ఒక్క రైతు మిస్ కాకుండా ఈ క్రాప్‌లోకి నమోదు చేసి రైతు తరఫున కట్టాల్సిన ప్రీమియం సొమ్ము కూడా ప్రభుత్వమే కడుతూ రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే ♦గతంలో చంద్రబాబు పాలనలో మీకు గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లూ వరుసగా కరువు కాటకాలే ♦అయినా కూడా ఇన్సూరెన్స్ ఎంత అంటే.. కేవలం 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు ♦అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో దేవుడి దయ వల్ల ఎక్కడా కరువు కాటకాలు ఏమీ లేకపోయినా కూడా రైతన్నలు సమృద్ధిగా వ్యవసాయంలో బాగుపడినా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చినది 55 లక్షల మందికి రూ.7,800 కోట్లు ♦బాబు హయాంలో ఎక్కడ 3400 కోట్లు? మీ బిడ్డ హయాంలో ఎక్కడ 7800 కోట్లు? ♦చంద్రబాబు ఐదు సంవత్సరాల లెక్కలు, మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల లెక్కలే చెబుతున్నా. ♦ఏ సంవత్సరం అయినా ఈ ఖరీఫ్‌లో రైతన్న ఇబ్బంది పడితే, వచ్చే ఖరీఫ్ నాటికి ఇన్సూరెన్స్ కచ్చితంగా వస్తోంది ♦ఇన్ పుట్ సబ్సిడీ కూడా దేశంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సీజన్ లో మీకు నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం దేశంలో మన ప్రభుత్వం. ♦వెంటనే కలెక్టర్లు అందరూ స్పందిస్తున్నారు. ఎన్యుమరేషన్ కార్యక్రమం రేపో మరునాడో మొదలు పెడతారు ♦కలెక్టర్లు ఎన్యుమరేషన్ పూర్తి చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత 15 రోజులపాటు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లిస్టును ప్రదర్శిస్తారు ♦గ్రామ సచివాలయంలో ఎవరైనా రైతు మిస్ అయితే, మీరు పేరు చూసుకోండి.. పొరపాటున మిస్ అయి ఉంటే మళ్లీ అవకాశం ఇస్తున్నాం, మళ్లీ వచ్చి చూసుకొని రీవెరిఫై చేసి మీకు వచ్చేట్టుగా చేస్తామని సమయం ఇస్తారు ♦వచ్చే నెలా సంక్రాంతి లోపు మీ అందరికీ ఇన్ పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది ♦ఇది ఇప్పుడు మాత్రమే జరుగుతున్నది కాదు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇది జరిగిస్తున్నాం ♦విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచి సప్లయ్ చేస్తూ వెంటనే ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం ♦మీ అందరితో విన్నవించేది ఒక్కటే దయచేసి అపోహలు నమ్మొద్దు ♦మరీ ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దండి. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూడొద్దండి. వీళ్లంతా అబద్ధాలు చెబుతున్నారు ♦కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం, వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించాలి, ఆ మనిషిని తీసుకొచ్చేయాలని దురుద్దేశంతో కావాలనే అబద్ధాలాడుతున్నారు ♦ఇలాంటి వారిని దయచేసి నమ్మొద్దని కోరుతున్నా ♦కచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది ♦మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి నష్టం, ఇబ్బంది జరిగినా కచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక పద్ధతి తీసుకొచ్చాం ♦సోషల్ ఆడిట్, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తెచ్చి, కలెక్టర్ల వ్యవస్థను డీసెంట్రలైజేషన్ చేసి, 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి, ఆర్డీవోల సంఖ్యను డబుల్ చేసి, జేసీల ♦సంఖ్యను డబుల్ చేసి, సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చి, వాలంటీర్ల వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం ♦ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా, ముఖ్యమంత్రిగా నేను వచ్చి జరిగే పని చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకొని, ఫొటోలకు పోజులిచ్చి, టీవీల్లోనూ, పేపర్లలోనూ నేను రావాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి ఇప్పుడు లేడు ♦ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా అది. ♦మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలిస్తాడు ♦మీకు వారం రోజులు సమయం ఇస్తున్నా, వారం తర్వాత నేనే వచ్చి ప్రజలను అడుగుతా. నేనొచ్చి అడిగినప్పుడు మా కలెక్టర్ బాగా పని చేశాడు, గొప్పగా పని చేశాడనే మాట ప్రజల నుంచి రావాలి అని చెప్పాను ♦ఇంతకు ముందు చంద్రబాబు కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. టీఆర్27కు అర్థమే చంద్రబాబుకు తెలియదు ♦కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి, వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్లందరికీ సఫిషియంట్ టైమ్ ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేందుకు మీ బిడ్డ వారం తర్వాత నేను వస్తానని చెప్పినప్పుడు, ప్రజలను అడుగుతాడు అని చెప్పినప్పుడు కలెక్టర్లు, సచివాలయాలు, ఎమ్మార్వోలు, వాలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ పరుగెత్తి ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు మాత్రమే జరుగుతోంది. ♦జరిగిన నష్టం అపారమైనది, కాదని నేను అనను, జరగాల్సిన, చేయాల్సిన సహాయం అంతా పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. వేగంగా జరుగుతుంది ♦గత ప్రభుత్వాల కంటే మిన్నగా, ఎక్కువగా జరుగుతుంది ♦ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా ♦ఇక టెంపరరీ డామేజ్లకు సంబంధించి, రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు, ఇటువంటి వాటికి సంబంధించి ఎలాగూ జరుగుతాయి ♦వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన టెంపరరీ రిలీఫ్ గా చేయాల్సినవన్నీ ముమ్మరంగా మొదలు పెట్టించే కార్యక్రమం వెంటనే చేస్తాం ♦పర్మినెంట్‌గా రెగ్యులర్‌గా చేయాల్సిన పనులు కూడా టేకప్ చేసే కార్యక్రమాలు చేస్తాం ♦మీ అందరి ఆప్యాయతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇదీ చదవండి: వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్ -
వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి రైతులతో మాట్లాడారు. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ క్రమంలో నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. కాగా, సీఎం జగన్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసింది. మనకు వచ్చిన కష్టం.. మనకు వచ్చిన నష్టం వర్ణణాతీతమే. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారు. సాయం కోసం 92 రిలీఫ్ కేంద్రాలను పెట్టడం జరిగింది. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతీ ఇంటికి రూ. 2,500 ఇచ్చాము. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ మన దగ్గరే ఉంది. ప్రతీ ఇంటికి వాలంటీర్ వచ్చి రూ. 2,500 ఇస్తారు. పంట నష్టంపై కూడా ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. స్వర్ణముఖిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. వారంలో అందరికీ సాయం చేస్తాను. నష్టపోయిన ప్రతీ రైతును ఆందుకుంటాం. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతాం. తుపాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని అన్నారు. సీఎం జగన్ కామెంట్స్.. ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, జిల్లాలో మొత్తం యావరేజ్‌తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిశాయి. దాదాపు 40-60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితులు. మనందరికీ జరిగిన నష్టం, వచ్చిన కష్టం ఎవరైనా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే. దాదాపు ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టాం. 8,364 మందిని రిలీఫ్ క్యాంపులకు షిప్ట్ చేయడం జరిగింది. దాదాపు 60 వేల మందికి పైచిలుకు, వారికి రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ లీటరు, కేజీ ఆనియన్లు, బంగాళాదుంపలు.. ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా. ఏ ఒక్కరికీ నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా ఎదుటివాడికి వచ్చింది, నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాని వల్ల మీ ఇళ్లలో నీళ్లు వచ్చిన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఈ డబ్బుతో కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఈరోజు మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 డబ్బులిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఉపశమనం. ఎవరెవరు పంట వేశారో, నష్టపోయారో 80 శాతం సబ్సిడీతో సీడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నాలుగైదు రోజుల్లో అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి వారం పట్టొచ్చు. ప్రతి ఒక్కరికీ జరగాల్సినమంచి జరుగుతుంది. కరెంటు చాలా ఫాస్ట్‌గా రీస్టోర్ చేశారు. యంత్రాంగం అంతా ఇక్కడే పని చేస్తున్నారు. రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. టీమ్స్ ను మొబిలైజ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కరెంటు రీస్టోర్ అయ్యింది. కొన్ని కాలనీల్లో రీస్టోర్ కాని పరిస్థితి ఉంటే అవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా రీస్టోర్ అయ్యిందా అనే డీటెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికీ ఆ సమస్య లేకుండా చేస్తారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి రాకముందు స్వర్ణముఖిలో జరిగిన బ్రీచ్ కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో చూశాను. దానికి పర్మినెంట్ సొల్యూషన్ వెతకాలని చెప్పాను. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని చెప్పారు. దాని కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా. జిల్లాలో 110 ట్యాంకులు ఉంటే కొన్ని చోట్ల బ్రీట్చ్ అయ్యాయి. రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్లు, చిన్న చిన్న ట్యాంకుల రిపేరీ కోసం రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి. యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్య అయినా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉందంటే జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి.. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది. అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నాలుగైదు రోజుల్లో అన్నీ పూర్తి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మిగిలిన ప్రాంతాలకు వెళ్లే కార్యక్రమం చేస్తాను. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
Updates.. 3:44 PM, Dec 8, 2023 తుపాను వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటాం: సీఎం జగన్ ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసుకుంటాం బాధితులను గుర్తించి పారదర్శకంగా సాయం అందిస్తాం రేషన్‌తో పాటు రూ.25,00 ప్రతి ఇంటికి అందిస్తున్నాం గత టీడీపీ ప్రభుత్వంలో కరువు వచ్చినా, వరద వచ్చినా పట్టించుకోలేదు సంక్రాంతిలోపు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తాం రైతు భరోసాతో పాటు కరీఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తున్నాం అపోహలను ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవకండి ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్ల ప్రసారాలను చూడకండి ఎల్లో మీడియా అసత్య కథనాలతో ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారు బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో పర్యటించిన సీఎం జగన్ తుపాను వల్ల దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన సీఎం తుపాను బాధితులు, రైతులతో సీఎం జగన్ సంభాషణ బాపట్ల జిల్లా పాతనందాయపాలెంలో సీఎం జగన్ పర్యటన 2:51 PM, Dec 8, 2023 మరుప్రోలువారి పాలెంలో దెబ్బతిన్న పంటల ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం జగన్ 2:45PM, Dec 8, 2023 బాపట్ల జిల్లా మరుప్రోలు వారి పాలెంలో సీఎం జగన్ పర్యటన కర్లపాలెం మండలం పాతనందాయ పాలెం, బుద్ధాం గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన తుపాను వల్ల దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్న సీఎం జగన్ 12:00PM, Dec 8, 2023 బాలిరెడ్డిపాలెం(తిరుపతి జిల్లా): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా బాధితులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి.. ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, జిల్లాలో మొత్తం యావరేజ్‌తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిశాయి. దాదాపు 40-60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితులు. మనందరికీ జరిగిన నష్టం, వచ్చిన కష్టం ఎవరైనా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే. దాదాపు ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టాం. 8,364 మందిని రిలీఫ్ క్యాంపులకు షిప్ట్ చేయడం జరిగింది. దాదాపు 60 వేల మందికి పైచిలుకు, వారికి రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ లీటరు, కేజీ ఆనియన్లు, బంగాళాదుంపలు.. ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా. ఏ ఒక్కరికీ నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా ఎదుటివాడికి వచ్చింది, నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాని వల్ల మీ ఇళ్లలో నీళ్లు వచ్చిన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఈ డబ్బుతో కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఈరోజు మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 డబ్బులిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఉపశమనం. ఎవరెవరు పంట వేశారో, నష్టపోయారో 80 శాతం సబ్సిడీతో సీడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నాలుగైదు రోజుల్లో అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి వారం పట్టొచ్చు. ప్రతి ఒక్కరికీ జరగాల్సినమంచి జరుగుతుంది. కరెంటు చాలా ఫాస్ట్‌గా రీస్టోర్ చేశారు. యంత్రాంగం అంతా ఇక్కడే పని చేస్తున్నారు. రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. టీమ్స్ ను మొబిలైజ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కరెంటు రీస్టోర్ అయ్యింది. కొన్ని కాలనీల్లో రీస్టోర్ కాని పరిస్థితి ఉంటే అవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా రీస్టోర్ అయ్యిందా అనే డీటెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికీ ఆ సమస్య లేకుండా చేస్తారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి రాకముందు స్వర్ణముఖిలో జరిగిన బ్రీచ్ కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో చూశాను. దానికి పర్మినెంట్ సొల్యూషన్ వెతకాలని చెప్పాను. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని చెప్పారు. దాని కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా జిల్లాలో 110 ట్యాంకులు ఉంటే కొన్ని చోట్ల బ్రీట్చ్ అయ్యాయి. రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్లు, చిన్న చిన్న ట్యాంకుల రిపేరీ కోసం రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి. యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్య అయినా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉందంటే జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి.. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది. అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నాలుగైదు రోజుల్లో అన్నీ పూర్తి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మిగిలిన ప్రాంతాలకు వెళ్లే కార్యక్రమం చేస్తాను. ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్బించిన సీఎం జగన్ ►తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన. ►తిరుపతి జిల్లా వాకాడు మండలం విద్యానగర్ చేరుకున్న సీఎం జగన్ ►తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయి పర్యటన ►బాధితులు, రైతులను కలిసి వారితో మాట్లాడనున్న సీఎం జగన్ ►స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలన ► తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (శుక్రవారం) తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మిఛాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం జగన్. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. ► అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లి బాధితులతో మాట్లాడనున్నారు. ► తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. -
మహావిషాదానికి 115ఏళ్లు, వందల మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు
‘సెప్టెంబర్ 28’... ఈ తేదీ రాగానే 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్ గంజ్ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న ఓ చింత చెట్టునాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు... ఈ ఏడాది సైతం సెప్టెంబర్ 28న అలనాటి వరద సమయంలో ఎంతో మందిని రక్షించిన చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒక నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ... నేటి పరిస్థితుల్లో నగరాభివృద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానుంది. ప్రాణాలు కాపాడిన చింతచెట్టు.. మూసీ నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి. కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనివిని ఎరుగనిది.ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. 80 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.లక్షన్నర మందికి గూడు లేకుండా పోయింది. వందలకొద్దీ చెట్లు నెలకొరిగాయి. కొందరైతే భవనల పైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. తాము బతికుంటామో లేదో తెలియదు అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. అలాంటివారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది. ఒక చింత చెట్టు. అది ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింతచెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. రెండు రోజుల పాటు వారు తిండితిప్పలు లేకుండా అలాగే ఉండిపోయారని చెబుతారు. ఆ చెట్టుకు 400ఏళ్లనాటి చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఆ వరదలు వచ్చిన మూడేళ్లకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దెనెక్కారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్ రూపొందించాలని, మౌలిక వసతులు కల్పించాలని సంకల్పించారు. 1914 లోనే సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లానర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో సీఐబీ అనేక పథకాలను అమలు చేసింది. అప్పట్లో నగర ప్రణాళిక... బాగ్ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్ (చెరువులు)తో ముడిపడి ఉండింది. పచ్చదనం, జలాశ యాలు నగరప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్.. ఎన్నో సమస్యలు ఈ శతాబ్ది కాలంలో నగరం ఎంతో అభివృద్ధి సాధించింది కాకపోతే... నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. జనాభా బాగా పెరిగిపోయింది. నగరంలో అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్ట గొడుగుల్లా మురికివాడలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’, ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’ సంస్థలు ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్ ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివృద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేశాయి. 1908 నాటి వరదల భయంకర పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. 2008 సెప్టెంబర్ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం,మంచి నీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ నది కలుషితం కావడం... మూసీ తీరంలో ఆక్రమణల తొలగింపు ఇలా చెబుతూపోతే... ఈ జాబితాకు అంతు ఉండదు. ఈ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించేది హైదరాబాద్‌కు చక్కటి ‘ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్’ మాత్రమే. హైదరాబాద్‌లో మంచినీటి సమస్య పరిష్కారమయ్యింది. రహదారులు వృద్ధి చెందాయి. ఓ.ఆర్.ఆర్. లాంటివి ఎన్నో వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్.లు వస్తున్నాయి. ఫ్లై ఓవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎయిర్ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నాలాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున సదుపాయాలను పెంచవలసి ఉంది. రాబోయే రోజుల్లో మంచిరేవుల నుంచి ఘట్ కేసర్ దాకా మూసీ మీదుగా రూ.10 వేల కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్, విమానాశ్రయంతో పాటు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎక్స్ ప్రెస్ వే కూడా రానుంది. ఇది ఒక్కటే కాదు. నగరానికి నాలుగు వైపులా సుమారుగా 100 కి.మీ దాకా ఇదే తరహా అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ మనకు సానుకూల సంకేతాలే అనడంలో సందేహం లేదు. అభివృద్దితో పాటు సమస్యలూ.. అభివృద్ధితో పాటూ సమస్యలూ తలెత్తుతాయి. వీటిని దుర్కొనడానికి మాస్టర్ ప్లాన్ అత్యంత కీలకం. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్‌కు 6 మాస్టర్ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అమలుచేయాలి. హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి. వీటిని నివారించేందుకు ప్రజా రవాణా ఒక్కటే మార్గం. అందులోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. రెండవ దశ ఎమ్ఎమ్ టీఎస్ వ్యవస్థను మరింతగా విస్తరించాలి. దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న లోకల్ రైల్ లాంటి వాటిని అభివృద్ధి చేయాలి. నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. మిగులు నీటిని (శుద్ధి అయినవి మాత్రమే) స్థానిక చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. హైదరా బాద్‌కు వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రాజధానికి 100 కి.మీ. వెలుపల కౌంటర్ మాగ్నెట్స్గా వివిధ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాలి. వారసత్వాన్ని కాపాడుకోవాలి ఈ రోజున హైదరాబాద్ యావత్ దేశపు గ్రోత్ఇంజిన్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి. హైదరాబాదు నగరంలో నేటికీ ఎన్నో చారిత్రక భవనాలు వారసత్వ జాబితాలోకి ఎక్కవలసి ఉన్నాయి. అలాంటి వాటిని పరిరక్షించుకోవాలి. కనీసం 5 లేదా 6 ప్రాంతాలు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. అఫ్జల్ గంజ్ పార్క్ లో ఉన్న చింత చెట్టునూ, ఆ స్థలాన్నీ నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ‘నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహా సముద్రంలా ఉండాలి’ అని అప్పట్లో కులీ కుతుబ్ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింతగా అందించడం. హైదరాబాద్ నగరం కూడా శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పరిస్థితి ఇలానే కొనసాగితే 115 ఏళ్ల క్రితం వరదలే మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది. పైన పేర్కొన్న అన్ని సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక లతో ముందుకెళ్లడం నేటి తక్షణావసరం. వ్యాసకర్త: ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఛైర్మన్ మొబైల్: 98480 44713 -
జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: జీ20 వేదిక భారత మండపం వద్ద వర్షపు నీరు వరదలుగా పారుతోందని విపక్షాలు చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పుబట్టింది. ప్రతిపక్షాల వ్యాఖ్యలు అవాస్తవాలని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తేలికపాటి వర్షం నీరు భారత మండపం బయట నిలిచిందని పేర్కొంది. వెంటనే ఆ నీటిని మోటర్లను ఉపయోగించి బయటకు పంపినట్లు వెల్లడించింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. అటు టీఎంసీ నేత సాకేత్ గోఖలే కూడా కేంద్రాన్ని విమర్శించారు. రూ.4000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వర్షం నీరు వరదలుగా పారుతోందని విమర్శించారు. నిధులను మోదీ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో తెలుస్తోందని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కేంద్రం స్పందించింది. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇదీ చదవండి: జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగింత -
నార్సింగిలో నీట మునిగిన విల్లాలు
-
సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ పలకరింపుతో ప్రజల్లో భావోద్వేగం
-
సీఎం వైఎస్ జగన్ బాధితుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు: విశ్వరూప్
-
రూ.200 కోట్లతో గ్రామాలకు రక్షణ గోడ
సాక్షి అమలాపురం: గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతినే ప్రాంతాల్లో గ్రోయెన్లు, రివిట్మెంట్ నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లంక గ్రామ వాసుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనలంక రామాలయంపేట, లంకాఫ్ ఠానేల్లంక రామాలయంపేట, అయినవిల్లి మండలం కొండుకుదురులంకలోని తొత్తరమూడివారిపేటలో నదీ కోత తీవ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ముమ్మిడివరం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబులు కోత తీవ్రత గురించి సీఎంకు వివరించారు. ఈ ప్రాంతంలో గ్రోయెన్లు, రివిట్మెంట్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో. బహిరంగంగా వారితో మాట్లాడినప్పుడు పలువురు ఇదే సమస్యను ప్రస్తావించారు. దీనిపై కూనలంకలో సీఎం జగన్.. అప్పటికప్పుడే స్పందిస్తూ ఆరు గ్రామాల్లో కోతకు పరిష్కారం చూపేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జనం నివాసముండే ఆవాస ప్రాంతాల్లో సుమారు 3.5 కిలోమీటర్ల మేర బిట్లు బిట్లుగా గ్రోయెన్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. పొట్టిలంకలో వెయ్యి మీటర్లు, కొండుకుదురులంక వద్ద 400 మీటర్లు, వివేకానంద వారధి వద్ద 300 మీటర్లు, లంకాఫ్ ఠానేల్లంకలో 400 మీటర్లు, కూనలంక వద్ద 800 మీటర్లు, గురజాపులంక వద్ద 600 మీటర్లు చొప్పున నిర్మిస్తామని చెప్పారు. ప్రజల సమక్షంలోనే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు సతీష్‌తో మాట్లాడారు. ఎప్పటికి పూర్తి స్థాయిలో అంచనాలు తయారు చేస్తారని ప్రశ్నించారు. అంచనాలు పూర్తి చేసి, నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి చేయాలని, ఆ తర్వాత నెల రోజులకు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనులు మొదలైన తర్వాత కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌లు తనకు ఫొటోలు పంపాలని ఆదేశించారు. -
జనంతో జననేత మమేకం
సాక్షి అమలాపురం/అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండవ రోజు మంగళవారం డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించారు. వరద సహాయక చర్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఆంక్షలు పక్కన పెట్టి బాధితులతో మమేకమయ్యారు. అభిమానంతో చొచ్చుకువస్తున్న మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులను భద్రతా సిబ్బంది అడ్డుకోగా.. వారిని వారించి తన దగ్గరకు రప్పించుకుని మరీ మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. జగనన్నా.. అని ఆప్యాయంగా పిలుస్తూ వచ్చిన వారిని అక్కన చేర్చుకున్నారు. ‘జగన్ మావయ్యా’ అని బిగ్గరగా అరిచిన చిన్నారులను పిలిపించుకుని సెల్ఫీలు తీయించుకున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా, చెమటలు కక్కుతూన్నా బాధితుల బాధలు ఓపికగా విన్నారు. వరద బాధతులను స్థానిక వలంటీర్లు సీఎం జగన్‌కు పరిచయం చేశారు. వరద సహాయం సరిగ్గా అందిందా లేదా? అని వారి సమక్షంలోనే సీఎం తెలుసుకున్నారు. లంకాఫ్ ఠాన్నేలంకకు చెందిన జయలక్ష్మి అనే మహిళ తన పెన్షన్ వేరే ఊరిలో ఉందని, ఇబ్బంది పడుతున్నానని చెప్పగానే సీఎం స్పందించి.. స్థానిక వలంటీర్‌ను పిలిచి దరఖాస్తు చేయించాలని చెప్పారు. తనను కలిసిన విద్యార్థులను విద్యా కానుక వచ్చిందా? అని అడిగారు. వరద సాయం పంపిణీలో పొరపాటులుంటే చెబితే సరిదిద్దుకుంటామన్నారు. ప్రభుత్వం, అధికారులు, వలంటీర్లు ఇంటింటికీ వచ్చి వరద సాయాన్ని అందించారని, ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకుందని ముంపు గ్రామాల ప్రజలు సీఎంకు తెలిపారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రామాలయంపేటలో ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీరే మా ధైర్యం వరదలతో చాలా కష్టపడుతున్నాం. నష్టపోతున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వరద వచ్చిన ప్రతిసారీ ఎంతో సాయం చేస్తోంది. ఊరు చుట్టూ వరదనీరు చేరినా పడవల్లో వచ్చి మరీ అధికారులు మాకు భోజనాలు, తాగునీరు అందించారు. గ్రామస్తులకే కాదు పశువులకు సైతం దాణా అందజేశారు. పేద, ధనిక తేడా లేకుండా ఇంటింటికీ రెండు వేల సాయం చేసి, దెబ్బతిన్న పూరిగుడిసెలకు 10 వేలు అందించారు. మీరే మా ధైర్యం. మీ మేలు ఎప్పటికీ మరచిపోం. – దుర్గాదేవి, కూనలంక, ముమ్మిడివరం మండలం మాకేం లోటు లేదు ఈ నాలుగేళ్లలో జగనన్న వచ్చిన దగ్గర నుండి మా పేదలందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మాకేం లోటు లేదు. కలెక్టర్ నుండి వలంటీర్ వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి సాయం అందించారు. నిత్యావసరాలు మొదలు భోజనాలు, తాగునీళ్ల దాకా సమస్తం మాకు లోటు లేకుండా పంపించారు. డ్యామేజ్ అయిన ఇళ్లకు రూ.10 వేలు అందించారు. మా లంక గ్రామాల ప్రజలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – పోతుల భారతి, కొండుకుదురులంక గ్రామం, తొత్తరమూడివారిపేట, అయినవిల్లి మండలం మాట నిలబెట్టుకున్నారు జగనన్న పాలనలో మాకెప్పుడూ అన్నివిధాలా సహాయ సహకారాలు అందుతున్నాయి. అమ్మ ఒడి, విద్యాదీవెన వస్తున్నాయి. ఎంత వరకూ కావాలన్నా చదువుకోండి చదివిస్తాను అని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. వరద సహాయక చర్యల్లో ఏ లోపం లేకుండా సమస్తం మాకు అందించి ఆదుకున్నందుకు ప్రభుత్వానికి, జగనన్నకు ధన్యవాదాలు. – పట్టా రజనీ, పొట్టిలంక మళ్లీ మీరే సీఎం కావాలి మీ నాన్నగారు నాకు చాలా మేలు చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే అటెండర్లను పంపించారు. 16 ఏళ్లు అయ్యింది. బాగా ఉన్నాను. మీరు వచ్చాక íపింఛన్ అందుతోంది. వరద వచ్చినప్పుడల్లా వెంటనే 25 కేజీల బియ్యం, పప్పు, ఆయిలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలిచి మళ్లీ సీఎంగా రావాలి. – నల్లా వెంకాయమ్మ, కూనలంక, ముమ్మిడివరం మండలం జగనన్న పాలన ఒక వరం జగనన్న పంపిన అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చి వరదల సమయంలో మమ్మల్ని ఆదుకుంది. అందుకు మా కొండుకుదురు ప్రజలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. మా ఎమ్మెల్యే, కలెక్టర్, రెవిన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అందరూ మాకు వెన్నంటి నిలిచారు. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన జగనన్న పాలన మావంటి వారికి ఒక వరం. – నక్కా శ్రీనివాస్, పొట్టిలంక మీరే వస్తారని అనుకోలేదు వరదల సమయంలో చాలా కష్టపడుతున్నాం. పశువులకు మేత అందక మా మగవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి మేత తెస్తున్నారు. అప్పుడు మీరే మేత పంపి చాలా మంచి పని చేశారు. ఈసారి రెండు రోజులు అన్నం పెట్టారు. తినని వాళ్లకు బతిమాలి అన్నం పెట్టారు. మా జగన్ ఉండగా మాకు లోటు ఉండదు. గతంలో ఎంతోమంది వచ్చి రోడ్డు మీద నుంచే వెళ్లేవారు. మా బిడ్డ మా దగ్గరకు ఇలా వస్తారని అనుకోలేదు. ఎంతో సంతోషంగా ఉంది. – బుద్దా నాగవేణి, కూనలంక, ముమ్మిడివరం మండలం మా గ్రామానికి వచ్చిన తొలి సీఎం మీరే ఎన్నిసార్లు వరద వచ్చి మా ఊళ్లు మునిగినా ఒక్క ముఖ్యమంత్రి కూడా మా గ్రామానికి వచ్చిన పాపాన పోలేదు. మా దగ్గరకు వచ్చి మా బాగోగులు అడిగిన తొలి ముఖ్యమంత్రి మీరే. మాకు ఏం కావాలో అది ఇచ్చారు. నవరత్నాలన్నింటిని ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు. చమురు సంస్థల నుంచి మత్స్యకార భరోసా ఇచ్చిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. – శేరు గంగ, లంకాఫ్ ఠానేల్లంక,ముమ్మిడివరం మండలం -
సాయంలో కొత్త ఒరవడి
వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భోజనం, నీరు, వైద్యం అందించాలి. తొలుత ఆ పని చేయండి. ఆ తర్వాతే ఆయా గ్రామాల్లో ఉన్న నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను నేనే స్వయంగా వచ్చి అడుగుతాను. ఏ ఒక్కరి నుంచి కూడా నాకు అందాల్సింది అందలేదు.. కలెక్టర్ సరిగా స్పందించ లేదు.. వ్యవస్థలు సరిగా పని చేయలేదన్న మాట ఎక్కడా వినపడకూడదని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇందులో భాగంగానే ఇప్పుడు పరిశీలించడానికి వచ్చాను. దీన్నొక సరికొత్త విధానంగా అమలు చేస్తూ కొత్త ఒరవడి సృష్టించాం. తక్షణ సాయం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. – లంక వాసులతో సీఎం జగన్ సాక్షి అమలాపురం: ‘గతంలో చాలాసార్లు వరదలు వచ్చాయి. నాయకులు అప్పటికప్పుడు రావడం, అధికారులంతా వారి చుట్టూ తిరగటం జరిగేది. పేపర్లలో.. టీవీల్లో ఫొటోల కోసం పోజులిచ్చి వెళ్లిపోయేవారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. కానీ వారు మంచి జరిగిందా లేదా అని చూడలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని మార్చాం. ప్రతి బాధితునికి సాయం అందుతోంది. నాలుగేళ్లుగా ఈ మార్పు కనిపిస్తోంది. సాయం చేయడం, ఆదుకోవడం అంటే ఇదీ..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గోదావరి వరదల బారిన పడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గురజాపులంక, లంకాఫ్ ఠానేల్లంక, కొండుకుదురులంకల్లో బాధితులతో మమేకమయ్యారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతి సందర్భంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కావాల్సిన డబ్బులు వారి చేతుల్లో పెట్టామని చెప్పారు. వరద నష్టం ఎక్కువా, తక్కువా అని చూడకుండా బాధితులను ఉదారంగా ఆదుకోండని చెప్పామని తెలిపారు. ‘ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు వారం రోజుల సమయం ఇచ్చాం. ప్రతి గ్రామంలోకి వెళ్లాలని, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవస్థను చైతన్యం చేయాలని చెప్పాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిందీ లేనిదీ చూస్తానని చెప్పాను. నేను వచ్చినప్పుడు నాకు సహాయం అందలేదని ఏ ఒక్కరి నోటి నుంచి రాకూడదు’ అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. వరదలు వచ్చినప్పుడే మిమ్మల్ని పలకరించేందుకు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని భావించే ఇలా చేశానని వివరించారు. కష్టాలలో ఉన్నప్పుడు మీ బిడ్డ వేగంగా ఆదుకుంటాడని పునరుద్ఘాటించారు. తొత్తరమూడివారిపేటలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా ఉండాలన్నాను.. పేదలకు సాయం అందించడంలో ఉదారంగా ఉండాలన్న తన సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం పనిచేసిందని సీఎం కొనియాడారు. ఈ రోజు ప్రతి వ్యక్తికి పరిహారం అందించామంటే అందుకు మీ బిడ్డ జగన్ గ్రామీణ స్థాయిలో గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడమేనన్నారు. సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, ఆర్బీకేలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల వరదల సమయంలో వేగంగా సాయం అందించడానికి మార్గం సుగమం అయిందన్నారు. ఈ వ్యవస్థ వల్లే ప్రతి పనిలోను పారదర్శకత చూపిస్తున్నామని తెలిపారు. నెలాఖరుకు పంట నష్ట పరిహారం పంట నష్టపోయిన రైతులకు నెలాఖరుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘రైతులకు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో జాబితా సిద్ధమవుతుందని, రైతుల పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్బీకేలలో ఉంటాయన్నారు. ఎవరి పేరు అయినా కనిపించకపోతే ఆర్బీకేలో ఫిర్యాదు చేస్తే, తిరిగి పరిశీలిస్తారని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. అనంతరం గురజాపులంక, కూనలంకల్లో నష్టపోయిన వంగ, మునగ, బెండ, ఇతర కూరగాయ పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. విలేజ్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పశువులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, టీఎంఆర్ (టోటల్ మిక్స్డ్ రేషన్–సమగ్ర పశు దాణా) దాణా అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని సచివాలయం, వలంటీర్ వ్యవస్థలు, విలేజ్ క్లినిక్‌లు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయని వివరించారు. ‘ఓఎన్జీసీ పరిహారం గురించి మీ అందరికీ తెలుసు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అది మీకు అందింది. అన్ని విధాలా మీకు మంచి చేసే విషయంలో దేవుడు మరింత అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్‌ను చూసేందుకు మహిళలు, యువత ఆసక్తి చూపించారు. సీఎం.. సీఎం.. అంటూ నినా దాలు చేశారు. గురజాపులంకలో పలువురు యువ కులు జగన్‌ను చూసి ‘వైనాట్ 175 జగనన్నా..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గురజాపులంకలో ఓ కుటుంబంతో మాట్లాడుతున్న సీఎం జగన్ సీఎంకు ఘన స్వాగతం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు, నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జోగి రమేష్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, పెండెం దొరబాబు, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్‌లు పాల్గొన్నారు. నేరుగా జనం మధ్యకే.. మంగళవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ నేరుగా గురజాపులంకకు హెలికాప్టర్లో చేరుకున్నారు. సాధారణంగా వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లాకు వచ్చారు. అప్పట్లో డివిజన్ కేంద్రమైన అమలాపురం, వరద ప్రభావిత ప్రాంతాల మండల కేంద్రాలలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఎంపిక చేసిన బాధితులను పరామర్శించి వెనుదిరిగేవారు. సీఎం జగన్ ఇందుకు భిన్నంగా నేరుగా లంక గ్రామాలలోకే రావడం బాధి తులను, పంట నష్టపోయిన రైతులను పరా మర్శించడంతోపాటు జరిగిన నష్టాన్ని స్వయంగా వీక్షించడం గమనార్హం. ఐదారు గంటలపాటు లంకవాసులతో సీఎం మమేకమ య్యారు. ఇదే విషయాన్ని లంకవాసులు, వరద బాధితులు గొప్పగా చెప్పుకున్నారు. తమ బాధలను తెలుసుకునేందుకు వచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని వారు సంబర పడ్డారు. 1996లో పెను తుపానుకు తమ గ్రామాలు ధ్వంసమైనప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తమ గ్రామాలకు రానేలేదని వారు గుర్తు చేశారు. తమనే ఠానేలంకకు పిలిపించి మాట్లాడారని చెప్పారు. గత ఏడాది గోదావరికి రికార్డు స్థాయిలో వరద వచ్చిన సమయంలో కూడా సీఎం జగన్ జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని జి.పెదపూడిలంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పర్యటించారని గుర్తు చేశారు. -
ప్రతి ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించిన సీఎం
-
కోనసీమ వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్
తోటరాముడివారిపేటలో బాధితులకు సీఎం జగన్ భరోసా ►బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం ►పంట నష్టం జరిగిన వెంటనే లెక్కలు కట్టి సాయం అందిస్తున్నాం ►పేదలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ►ఇళ్లు దెబ్బతింటే సాయం అందించాలని ఆదేశించాం ►ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గురజపులంక, కూనలంకలో పర్యటిస్తున్న సీఎం.. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం జగన్ అన్నారు. ‘‘గతంలో పేపర్లో ఫొటోలు వస్తే చాలు అనుకునేవారు.. కానీ ఇప్పుడు ఇలా కాదు, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చాం. వరద బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించాం. నేనే స్వయంగా వచ్చి వరద బాధితులను కలుస్తా అని చెప్పా. రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నాను’’ అని సీఎం పేర్కొన్నారు. ►వరద సాయం అందని ఇళ్లు లేదు: సీఎం జగన్ ►పంట నష్టం జరిగితే ఆర్భీకేల్లో నమోదు చేసుకోవాలి ►రెండురోజుల్లో ఆర్భీకే కేంద్రాల్లో వరద బాధితుల జాబితా ►నెలలోపే పంట నష్ట సాయం ►గతంలో ఎప్పుడూ ఇలా పారదర్శకంగా, వేగంగా అందించలేదు ►అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం మండలంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన. ►ముమ్ముడివరం మండలంలో గురజపులంక, రామాలయపేట గ్రామాలలో కాలినడనక తిరుగుతూ.. వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో మమేకమైన సీఎం జగన్. ►ప్రతి గడప వద్దకూ వెళ్లి వరద సహాయంపై నేరుగా ప్రజలనుంచే తెలుసుకుంటూ... వారి విజ్ఞప్తులను స్వీకరించిన ముఖ్యమంత్రి. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురజపులంకకు సీఎం చేరుకున్నారు. కాసేపట్లో వరద బాధితులను కలవనున్నారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాల వద్ద హెలికాప్టర్లో బయలుదేరి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి చేరుకుంటారు. తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి వెళతారు. ►కాగా, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బాధితులకు అండగా.. హెలిపాడ్ నుంచి గెస్ట్ హౌస్‌కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనారోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు. -
రాజమహేంద్రవరానికి సీఎం జగన్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బాధితులకు అండగా.. హెలిపాడ్ నుంచి గెస్ట్ హౌస్‌కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనారోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు. కోనసీమ జిల్లాలో పర్యటన ఇలా.. సీఎం జగన్ మంగళవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. 9.10కి ఆర్ట్స్ కళాశాల వద్ద హెలికాప్టర్లో బయలుదేరి 9.40కి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. 10.25 వరకు గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 10.35కు రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, 11.10 వరకు రామాలయపేటలో వరద బాధితులతో మాట్లాడతారు. 11.10 గంటలకు అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.50 గంటల వరకు అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి 12.15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తాడేపల్లికి వెళతారు. -
డబ్బులు మిగుల్చుకోవాలని కాదు.. అర్హులు మిగలకూడదనే తపన!
సాక్షి, విశాఖపట్నం: ‘మనందరి ప్రభుత్వానికి డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనే తాపత్రయం లేదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన మాత్రమే ఉంది. మీ జగన్‌లో కల్మషం లేదు.. ఎప్పుడైనా సరే మంచి చేయడం కోసమే ఆరాట పడతాడని, పోరాటం చేస్తాడని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నికలకు వెళ్లేలోపు ఆరేడు నెలల్లో పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ప్యాకేజీ అందుతుంది. మీ బిడ్డ మీకోసం గట్టిగా కృషి చేస్తున్నాడు. లైడార్ సర్వేతో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాడు. గత పాలకులకు జ్ఞానోదయం కలిగిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ బాధితులను కలుసుకుని పరామర్శించారు. క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను స్వయంగా పరిశీలించారు. సీఎం జగన్ తొలుత ఉదయం 10.50 గంటలకు కూనవరం మండలం కోతులగుట్టకు హెలికాప్టర్లో చేరుకున్నారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం కూనవరం బస్టాండ్ సెంటర్‌కు వెళ్లి కూనవరం, వీఆర్‌పురం మండలాల వరద బాధితులతో సమావేశమయ్యారు. ఆ తరువాత పోలవరం నియోజకవర్గం కుకునూరు మండలంలో పూర్తిగా దెబ్బతిన్న గొమ్ముగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫొటోల కోసం నా చుట్టూ తిప్పుకోకుండా.. వారం క్రితం గోదావరి పొంగి ప్రవహించడంతో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కలెక్టర్ సుమిత్కుమార్ను ముందుగానే అప్రమత్తం చేశాం. అధికారులకు కావాల్సిన వనరులను సమకూర్చి వారం పాటు సహాయ కార్యక్రమాలను ఏమాత్రం అలసత్వం లేకుండా నిర్వహించాలని చెప్పాం. కలెక్టర్లకు సదుపాయాలు కల్పించి గ్రామ సచివాలయాల నుంచి వలంటీర్ల దాకా అందరినీ యాక్టివేట్ చేశాం. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. వరదలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు హడావుడిగా పర్యటించి ఫొటోలు దిగి వెళ్లిపోవడం కాకుండా కలెక్టర్లకు తగినన్ని నిధులు, సమయం ఇచ్చి సహాయ చర్యల్లో యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేశాం. వారం రోజుల్లో వారంతా ప్రతి గ్రామంలోకి వెళ్లి ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా బాధితులందరికీ సహాయం అందించే కార్యక్రమాలు జరిగాయి. అధికార యంత్రాంగాన్ని నా చుట్టూ తిప్పుకోకుండా బాధితుల వద్దకు పంపించి సహాయ చర్యలను సమర్థంగా పర్యవేక్షించాం. ఇంతకు ముందూ ఇదే చేశాం.. ఇప్పుడూ చేస్తున్నాం. సాయం అందకుంటే చెప్పండి మీ కలెక్టర్ బాగా పని చేశారా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. ఎవరైనా నిర్భయంగా ముందుకు రావచ్చు. మీకు జరగాల్సిన మంచి జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే నేరుగా నాకు చెప్పవచ్చు. ఇంత గొప్పగా, పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయపడే ప్రభుత్వం మనది. మనందరి ప్రభుత్వానికి డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనే తాపత్రయం లేదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయమే ఉంది. ఇళ్లలోకి నీళ్లు వస్తే బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు చొప్పున అందించాం. అలా జరగకపోతే నాకు చెప్పవచ్చు. ఇళ్లలోకి నీళ్లు రాకపోయినప్పటికీ గ్రామాలు కటాఫ్ అయిపోయి ఉంటే ఆ ఇళ్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, కూరగాయలు లాంటి ఐదు రకాలు కలిపి ఇవ్వాలని సూచించాం. బాధితులు ఎవరికైనా అందకపోతే చెప్పవచ్చు. ప్రభుత్వం దానికి జవాబుదారీతనం తీసుకుంటుంది. పొరపాటున పేరు లేకపోతే.. కచ్చా ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బ తిన్నాయనే వ్యత్యాసం ఉండకూడదని చెప్పాం. పేదల పట్ల ఎలాంటి వ్యత్యాసం చూపవద్దని, నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. ఒకవేళ ఎన్యుమరేషన్ ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే అవుతుంది. నష్టం జరిగినా పొరపాటున జాబితాలో పేరు లేకపోతే వెంటనే అందులో చేర్చి మంచి జరిపించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరకు వచ్చాడు. ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా.. ఈ ప్రభుత్వం మీది అని తెలియజేస్తున్నా. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నాడు. మీలో ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా దాన్ని తీర్చడం కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. పోలవరానికి సంబంధించిన విషయాలన్నీ ఈ పద్ధతిలోనే జరిగిపోతాయి. వరద సమయంలో మీకు ఎలా సాయం అందింది? కలెక్టర్ ఎలా చేశారో మీరే చెప్పారు. కూనవరం ఎస్ఐ వెంకటేశ్ గురించి మంచి విషయాలు విన్నా. గొప్పగా ఆదుకున్నారని విన్నా. ఆగస్టు 15న ఇచ్చే పతకాల్లో ఆయన పేరు ఉండాలని కలెక్టర్‌కు సూచించా. అధికారులను నిలదీసేందుకు రాలేదు నేను ఇక్కడకు అధికారులను నిలదీయడానికి రాలేదు. అధికారులను శభాష్ అని వెన్ను తట్టేందుకు, మీ దగ్గర నుంచి మంచి సమాధానాలు వస్తాయని వినడం కోసం వచ్చా. కలెక్టర్ మాత్రమే కాకుండా ఎస్పీ నుంచి ఎస్ఐ దాకా సచివాలయ సిబ్బంది నుంచి వలంటీర్ దాకా రెవెన్యూ సిబ్బంది నుంచి మొత్తం అందరూ బాగా కష్టపడ్డారు. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. సీఎం పర్యటనలో హోంమంత్రి తానేటి వనిత, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్షి్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితుల చేతుల్లో చెయ్యి కలిపి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నిరుపేదలకు అండగా ఉండటంలో, వారిలో భరోసా నింపడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటిరారు. సోమవారం ఏలూరు జిల్లా పర్యటనలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని కుకునూరు మండలం గొమ్ముగూడెం గ్రామానికి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ రాలేదు. ఇక్కడి ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏ సీఎం గ్రామానికి రాలేదు. తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామానికి వచ్చారు. నిర్వాసితుల చేతుల్లో చేయి కలిపి గ్రామంలో వీధి వీధీ నడిచారు. కిలోమీటరున్నర దూరం కాలినడకన గ్రామంలో తిరిగారు. కష్టాల్లో ఉన్న గ్రామస్తులను పలకరించారు. వారి కష్టాలు విన్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హెలిప్యాడ్ నుంచి నేరుగా గ్రామానికి వెళ్ళారు. కాలినడకన గ్రామంలో తిరిగారు. గోదావరి వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడారు. వారికి అందుతున్న ప్రభుత్వ సాయం గురించి తెలుసుకున్నారు. కందిపప్పు, బియ్యం, పాలు, కూరగాయలు, రూ.2 వేల నగదు అందరికీ అందాయా? ఇంకా ఎవరైనా అందని వారున్నారా? అధికారులు పూర్తిగా సాయం చేస్తున్నారా? లేదా? అని ప్రజలను సీఎం ప్రశ్నించగా.. అందరూ ముక్తకంఠంతో అన్నీ బాగా అందాయని చెప్పారు. ఈ గ్రామంలో మొత్తం 250 కుటుంబాలున్నాయి. వీరందరికీ ఆర్ అండ్ ఆర్ వ్యక్తిగత పరిహారం రూ.6.36 లక్షలు, ఇంటి విలువలు (స్ట్రక్చర్ వాల్యూస్) మొత్తం రూ.18 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఏలూరు జిల్లా గొమ్ముగూడెంలో వరదల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ అన్నీ ఇచ్చారు మా గ్రామం మారుమూల ప్రాంతం. ఏ ముఖ్యమంత్రీ రాలేదు. ఈ రోజు మీరు వచ్చినందుకు పాదాభివందనాలు. మీరు సీఎంగా వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా వరదల సమయంలో మమ్మల్ని ముందుగానే ఆదుకుంటున్నారు. మీరు చేపట్టిన చర్యల వల్ల మాకే నష్టం జరగలేదు. మాకు అన్నీ వస్తున్నాయి. వరదలకు ముందే ట్రాక్టర్లు పంపించి మా సామాన్లు మొత్తం రాయకుంట కాలనీ, ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించారు. అక్కడ మాకు అన్ని సదుపాయాలు వచ్చాయన్నా. కూరగాయలు, నిత్యావసర సరుకులు, రూ.2 వేల డబ్బు ఇచ్చారు. భోజనాలను ఆర్డీవో, పీవో దగ్గరుండి వండించి పెట్టారు. రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు అందించారు. మంచి నీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. అన్నీ సమకూర్చుతున్న మీరే ఎప్పటికీ ముఖ్యమంత్రి కావాలి. – కె.ప్రమీల, గొమ్ముగూడెం ఇంతలా ఎవరూ పట్టించుకోలేదు మమ్మల్ని ఇంతలా ఎవరూ పట్టించుకోలేదు. సంతోషంగా ఉంది. ఈ రోజు ఆర్ అండ్ ఆర్, స్ట్రక్చర్ వాల్యూ అన్నీ పడ్డాయి. అందరి తరపునా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం ప్రజలు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు వరద బాధితుల కోసం వచ్చారు. మీరు అందించే ప్రతి ఒక్కటీ మాకు అందుతోంది. వరద ముంపు బాధలు మాకు లేవు. గతంలో వైఎస్సార్ హయాంలో నష్టపరిహారం అందింది. మళ్లా ఇప్పుడు మీ హయాంలో అందింది. 18 సంవత్సరాలు ఉన్నవారికి పరిహారం ఇస్తామని చెప్పారు. ఇదే సమయంలో 41 కాంటూరు లెవల్లో ఉన్న సుమారు 10 గ్రామాలు వరద ముంపునకు త్వరగా గురవుతున్నాయి. వాటిని ఫస్ట్ ఫేజ్‌లో తీసుకోవాలి. 45 లెవల్లో ఉన్న వాటిలో మౌలిక వసతులు కల్పించుకునేలా మాకు అవకాశాలు కల్పించండి. రోడ్లు, డ్రెయిన్లు ఏమీ లేవు. మేము ఉన్నంత వరకు ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. – రావు మీనా, కుకునూరు, సర్పంచ్ గొమ్ముగూడెంలో ఓ అవ్వతో సీఎం జగన్ సీఎం జగన్మోహన్రెడ్డి: ముంపు గ్రామాలకు సంబంధించి లైడార్ సర్వే చేశారు. కేంద్ర ప్రభుత్వం లైడార్ సర్వే ప్రకారం పరిహారం చెల్లిస్తారు. ఒక సంవత్సరం ఆగితే రెండో ఫేజ్‌లో సమస్య పూర్తవుతుంది. అలాగే 45 లెవల్ ఉన్న వాటిపై పరిశీలిస్తాం. నా కష్టాలు తీర్చారు అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, డ్వాక్రా, వెలుగు, రైతు భరోసా పథకాలతో ఆనందం ఇచ్చావు. నాకు కష్టాల్లో ఆదుకుంది ఇద్దరే ఇద్దరు. నన్ను కన్న నా తల్లి, మా అన్న జగనన్న. నా కష్టాలు తీర్చారు. – ధరాల తరుణ, గొమ్ముగూడెం ఉద్యోగాలు వచ్చాయంటే ఆ ఘనత మీదే సార్ వేలేరుపాడు వచ్చినప్పుడు మా సమస్యను మీ దృష్టికి తెచ్చాం. ఏడు మండలాల్లో మున్నూరు కాపు రిజర్వేషన్ కోల్పోయి ఉద్యోగాలన్నీ కోల్పోతున్నామని మీకు చెప్పాం. ఆ రోజు స్టేజ్ మీదే అమలు చేయించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చాయంటే అది మీ ఘనతే సార్. మాకు ఒకటే నమ్మకం. మీ దృష్టికి సమస్య వస్తే అది క్షణాల్లో పరిష్కారమవుతుందని మా నమ్మకం. భద్రాచలం – అశ్వారావుపేట రోడ్డు సమస్య మీ దృష్టికి తీసుకువచ్చాం. తక్షణమే జీవో పాస్ చేసి చేశారు. ఈ విషయంలో మీకు రుణపడి ఉంటాం. – మాదిరాజు వెంకన్నబాబు, కుకునూరు న్యాయం చేయండి నాన్ రెసిడెంట్ పేరుతో గత ప్రభుత్వంలో పేర్లు తీసివేశారు. చదువు కోసం, ఉపాధి కోసం వేరే చోటికి వెళ్లాం. గత ప్రభుత్వంలో కక్షసాధింపుగా పేర్లు తీసివేశారు. కట్కూరు, కొయిదా, చిగురుమామిడి తదితర ప్రాంతాలకు చెందిన వారిని పరిహారానికి అనర్హులుగా డిక్లేర్ చేశారు. వారికి ఇక్కడే ఆధార్, రేషన్‌కార్డు, ఇతర పత్రాలు ఉన్నాయి. కటిక పేదరికంతో ఉన్న కుటుంబాలు. వారికి న్యాయం చేయండి. – కాసగాని శ్రీనివాస గౌడ్, వేలేరుపాడు సీఎం జగన్మోహన్రెడ్డి: ఆధారాలు అన్నీ సక్రమంగా ఉంటే రీవెరిఫికేషన్ చేయండని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మానవతా దృక్పథంతోనే ఉండాలని, వారికి న్యాయం జరిగేలా చూడండని చెప్పారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)