సాక్షి, తాడేపల్లి: బుడమేరు కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకుని ప్రజలు బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై ప్రజలు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలపై హెచ్చరించలేదని కొందరు చెబుతుండగా.. మరికొందరు వరదల్లో చిక్కుకున్న తమకు కనీస సాయం కూడా అందించలేదని మండిపడుతున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు ఇదేనా నీ అనుభవం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత నెల 28వ తేదీన ఐఎండీ అలర్ట్ వస్తే ముందస్తు చర్యలపై సమీక్షలు నిర్వహించారా?.
ఐఎండీ హెచ్చరికలపై రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారా?.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారా?.
వరదలు వచ్చిన తర్వాత ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు బోట్లు, హెలికాప్టర్లను సిద్ధం చేశారా?.
వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలు, శిబిరాలకు తరలించే ఏర్పాట్లు జరిగాయా?.
శిబిరాల దగ్గర వరద బాధితులకు నీళ్లు, ఆహారం, పాలు అందించే ఏర్పాట్లు చేశారా?.
విపత్తు నిర్వహణకు సంబంధిత శాఖలతో చర్చించి చర్యలు తీసుకున్నారా?.
Comments
Please login to add a commentAdd a comment