Budameru
-
‘బుడమేరు వరద సాయం ఇదేనా బాబూ?’
విజయవాడ, సాక్షి: ఏపీలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పే పరిస్థితి ఇది. విజయవాడ ఎంపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుడమేరు వరద సాయం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదంటూ బహిరంగంగానే పెదవి విరిచారు. ఈ క్రమంలో.. ఇవాళ జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు వాళ్లు.బుడమేరు వరద సాయం ఇంకా చాలామందికి అందలేదంటూ డీఆర్సీలో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని),ఎమ్మెల్యేలు నిజాలు ఒప్పుకున్నారు. బుడమేరు వరద ముంపు బాధితుల్లో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. మరోమారు ఎన్యుమరేషన్ చేయాలి అని ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) అన్నారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కొండ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి అని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.వరద బాధితులను ఇంకా కొంత మందికి నగదు అందలేదు. మేము బయటకు వస్తుంటే ప్రజలు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వాటర్ డ్యామేజ్ జరిగింది. బుడమేరు డైవర్షన్ చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ నీళ్లు వదిలినప్పుడు బుడమేరులోకి వస్తున్నాయి. బుడమేరు వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది. జి.కొండూరులో 13,800 ఎకరాల రైతులు ఇబ్బది పడుతున్నారు. 1 కోటి 20 లక్షల మోటార్లు రిపేర్లు ఉన్నాయి అని మైలవరం ఎమ్మెల్యే,వసంత కృష్ణప్రసాద్ అన్నారు.నందిగామ ఎమ్మెల్యే,తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు నష్ట పరిహారం అందించాలని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యే,యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. విజయవాడ, అంబాపురం , గన్నవరంలో 200 కోట్లు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయంచాలి. విజయవాడ రూరల్ మండలంలో అభివృద్ధి చేయాలి అని అన్నారు.ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే,శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రాగునీరు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరువూరు,ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆలోచన చేయాలి. తిరువూరులో పత్తి పంట కొనేవారు లేదు. పత్తి పండుతున్నా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు..గుంటూరులో ఉంది అని గుర్త చేశారాయన.ఇక.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. కండ్రిక, జక్కంపూడి ప్రాంతంలో ఇంకా ఆటో డ్రైవర్లకు పరిహారం అందలేదన్నారు. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
బాబూ.. 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: విజయవాడలో బుడమేరు వరద కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు వందల కోట్లు మిగిల్చిందన్నారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. అలాగే, వరద బాధితుల కోసం దేవస్థానాల నుంచి భోజనాలు పెడితే 368 కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు వరదతో విజయవాడ ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలితే.. కూటమి నాయకులకు, చంద్రబాబుకి కోట్ల రూపాయలు మిగిలాయి. చంద్రబాబుకి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరుకు వరద వచ్చింది. చంద్రబాబుకి ఒక పక్క ఫోటో షూట్స్.. మరోపక్క విరాళాల వరద వచ్చింది. బుడమేరు, చంద్రబాబు మిలకత్ అయ్యారు. బుడమేరు వరద చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చింది.వరదలో వందల కోట్లు ఖర్చు చేశారంట. పునరావాసం కోసం కోటి 40 లక్షలు ఖర్చు చేశారు. రూ.368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారు. బాధితులకు నష్ట పరిహారం 200 కోట్లు ఇవ్వలేదు. కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారు. వరద బాధితులకు ఆహారం అమ్మవారు ఇచ్చారు, ద్వారక తిరుమల, సింహాద్రి అప్పన్న నుండి వచ్చింది. దేవుడు భోజనాలు పెడితే 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.రూ.26కోట్లతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని చెప్పారు. ఆరు లక్షల మంది వరదలో ఉంటే కోటిన్నర ఎవరికి ఇచ్చారు. వైఎస్ జగన్ కోటి రూపాయలతో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్స్ ఇచ్చారు. గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రూ.52కోట్లు శానిటేషన్ కోసం ఖర్చు చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టాల కోసం 23 కోట్లు ఖర్చు చేశారు. డ్రోన్స్ కోసం రెండు కోట్లు ఖర్చు అయింది. సరిగ్గా 10 మందికి కూడా ఆహారం అందించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డ్రోన్స్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు ఫోటో వదిలారు. దానికి రెండు కోట్లు. 534 కోట్లకు టెండర్ వేశారు. వచ్చిన విరాళాలకు ఖర్చులు చూపించారు. ఎవరికి కాంట్రాక్టు ఇచ్చారో.. ఎంతకీ ఇచ్చారో లెక్కలు బయటపెట్టాలి. నష్ట పరిహారం చెల్లించారా?. నష్ట పరిహారం కోసం ప్రజలు రోడ్డెక్కితే లాఠీ ఛార్జ్ చేశారు.కలెక్టర్ వద్ద బాధితులు క్యూ కడుతున్నారు. కలెక్టరేట్‌కి రోజుకు వేల మంది వస్తున్నారు. పేదల జీవితాలు చిన్నాభిన్నం అయితే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నష్టపోతే గంటల వ్యవధిలోనే బాధితుల అకౌంట్లో డబ్బులు వేసేవారు. వైఎస్ జగన్‌పై అక్కసుతో సచివాలయ వ్యవస్థను, వలంటీర్ వ్యవస్థని నీరు కార్చాడు చంద్రబాబు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు కూటమి సర్కార్‌కు ఉన్న వ్యత్యాసం ప్రజలు గమనించాలి.విజయవాడ ప్రజలు కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయి అంటే చంద్రబాబు చేసిన తప్పిదమే. మళ్ళీ వరద ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ చేయాలి. నష్ట పోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించాలి. బాధితుల తరపున వైస్సార్సీపీ పోరాటం చేస్తుంది. వరద బాధితులను పరామర్శించని పవన్.. మత విద్వేషాలను రెచ్చకొడుతున్నాడు. పవన్‌కి ప్రజలే బుద్ధి చెబుతారు. విజయవాడ ముందే మునిగిపోతుందని తెలిసి కూడా సిసోడియా ఎందుకు చెప్పలేదు’ అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఉచిత ఇసుక ఎక్కడ?: ఎంపీ విజయసాయిరెడ్డి -
నాడు ఇంటింటికీ వలంటీర్లు.. నేడు పేదల బతుకులు నడిరోడ్డు పాలు
గత ఐదేళ్లు ఏ విపత్తు వచ్చినా... బాధితులు కాలు బయట పెట్టకుండానే ప్రభుత్వ సాయం అందింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ... వలంటీర్లు వెంటనే వచ్చి భరోసా కల్పించేవారు. కానీ... నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘రెడ్‌బుక్’ పాలనలో కనీసం బాధితుల నుంచి అర్జీలు కూడా స్వీకరించే నాథుడే కరువయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు వరద బాధితులు పరిహారం కోసం వార్డు సచివాలయం... తహసీల్దార్ కార్యాలయం... కలెక్టరేట్ చుట్టూ మండుటెండలో కాళ్లరిగేలా తిరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. చివరికి గురువారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతించలేదు. ఏకంగా కలెక్టరేట్ గేట్లు మూసేశారు. గేటు బయటే బాధితుల నుంచి సిబ్బంది, పోలీసులు అర్జీలు స్వీకరించారు. వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలతో వచి్చన బాధితులు విధిలేక మురుగు కాలువల పక్కన, ఫుట్‌పాత్‌లపైన కూర్చుని నరకయాతన అనుభవించారు. పనులు మానుకుని పరిహారం కోసం తిరుగుతున్నాం.. దయచేసి మా గోడు వినండి.. అంటూ బాధితులు వాపోతున్నారు. గత ఐదేళ్లు కాలు కదపకుండానే వలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ... కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు. – గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) -
AP: పరిహారం.. పంపిణీ అస్తవ్యస్తం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: బుడమేరు వరదల్లో దారుణంగా దెబ్బతిన్న విజయవాడ నగరంలోని కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అప్రమత్తంగా లేక వారిని వరద నీటిలో నిలువునా ముంచి ఘోర తప్పిదం చేయడమే కాకుండా ఇప్పుడు పరిహారం పంపిణీలోనూ తీవ్రమైన తప్పులు చేస్తోంది. ఉద్దేశ పూర్వకంగా చాలా మంది బాధితులకు సాయం ఎగ్గొడుతోంది. సాయం అందించడంలోనూ వివక్ష చూపుతూ సరికొత్త రాజకీయం చేస్తోంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంటూ నష్టపోయిన వారికి రూ.25 వేలు, పై అంతస్థుల్లో ఉండే వారికి రూ.10 వేలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పై అంతస్థుల్లో ఉండే కూటమి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు మాత్రం ఇప్పటికే పరిహారం జమ అయింది. వారంతా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నట్లు నమోదు చేసుకుని ఎక్కువ పరిహారం పొందారు. వాస్తవంగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే వారిలో చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదు. నష్టం అంచనాలను గుర్తించడం దగ్గర నుంచి బాధితులకు ప్రకటించిన సాయాన్ని అందించడం వరకూ అన్నింటా ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. జరిగిన నష్టంతో పోల్చితే ప్రకటించిన పరిహారం ఏ మూలకూ సరిపోదని బాధితులు చెబుతున్నారు. చివరికి ఇస్తామని చెప్పిన పరిహారాన్ని కూడా అందరికీ సక్రమంగా ఇవ్వకపోవడంతో బాధితుల ఆందోళన వర్ణనాతీతం. తమను పట్టించుకునే నాథుడు లేడని, తమ గోడు ఎవరూ వినడంలేదని, తమకు సాయం అందడంలేదంటూ విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కి వేలాది మంది బాధితులు పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. తమకు పరిహారం ఎందుకు ఇవ్వలేదంటూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సమస్యలే. వరద వచ్చిన నెల రోజుల తర్వాత కూడా ఆ ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొరగా ఉండడం, అదీ అందరికీ అందకపోవడంతో అన్నిచోట్లా ఆందోళన వెల్లువెత్తుతోంది. విజయవాడ సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు అడుగడుగునా బాధితుల కష్టాలే కనిపించాయి. అంతా షో చేశారు..⇒ ‘పది రోజులుగా వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని కాలం గడిపాం. తీరా వరద తగ్గాక సాయం కోసం 20 రోజులుగా కుస్తీ పడుతున్నా పట్టించుకొనే నాథుడే లేరు. ఇంటి వద్దకు సర్వే బృందాలు వచ్చి, ఫొటోలు, వివరాలు తీసుకున్నారు. తీరా జాబితాలో చూస్తే మాత్రం పేర్లు కనిపించలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాం. అయినా జాబితాలోకి పేర్లు ఎక్కలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లి కూడా మా గోడు చెప్పుకున్నాం. కనికరం, జాలి లేదు’ అని బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ⇒ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు బయట ప్రాంతాల నుంచి సచివాలయ ఉద్యోగులను తీసుకువచ్చి నష్టాన్ని అంచనా వేయించారు. ఒక యాప్‌లో వివరాలు నమోదు చేయాలని చెప్పినా అందుకు సరైన సమయం ఇవ్వలేదు. దీంతో వారికి అన్ని ఇళ్ల గురించి తెలియకపోవడంతో ఎన్యుమరేషన్ అస్తవ్యస్తంగా సాగింది. పది రోజులపాటు నీళ్లు నిలవడంతో ఇళ్లు, ఇళ్లలోని సామాన్లు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంత నష్టం జరిగినా ఎన్యుమరేషన్లో మాత్రం చాలా తక్కువ నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ⇒ వాస్తవానికి 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2.32 కుటుంబాలకు సంబంధించి 1700 సర్వే బృందాలతో సర్వే చేయించింది. 78,558 ఇళ్లు మాత్రమే మునిగాయని, అందులోనూ పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64,799 మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ లక్షకుపైగా ఇళ్లు మునిగిపోయినట్లు స్థానిక బృందాల ద్వారా తెలుస్తోంది. ⇒ మునిగాయని గుర్తించిన ఇళ్లకు సైతం సరిగా పరిహారం ఇవ్వలేదు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయినా ఆ ఇల్లు దెబ్బతినలేదని రాశారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు కుటుంబాలు ఉంటే ఒకరికే నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ఇల్లు, వస్తువులు, వాహనాలు మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతే ఏదో ఒక దానికే పరిహారం ఇచ్చారు. రెండు వాహనాలు ఉంటే ఒక దానికే ఇచ్చారు. వాహనానికి పరిహారం ఇస్తే ఇంటికి ఇవ్వలేదు. ఎన్యుమరేషన్లో అంతా కోతలే⇒ కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు రాశారు. కొంతమంది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నా నష్టాల జాబితాలో రాయలేదు. ముఠా కార్మికులకు నాలుగు చక్రాల ట్రక్కులు ఉంటే వాటిని పట్టించుకోలేదు. ఎన్యుమరేషన్ బృందాలు నష్టాన్ని అంచనా వేసినప్పుడు చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకోవడంతో ఆ కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. దీంతో వారికి పరిహారం అందలేదు.⇒ 25 వేలకుపైగా ఆటోలు దెబ్బతింటే కేవలం 4348 ఆటోలకు మాత్రమే పరిహారం ప్రకటించింది. లక్షన్నరకుపైగా ద్విచక్ర వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోతే 44,402 వాహనాలు మాత్రమే దెబ్బతిన్నట్లు గుర్తించారు. తోపుడు బండ్లు, కిరాణా షాపులు, చిన్న పరిశ్రమలు, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు వేలాదిగా నీట మునిగినా వాటి సంఖ్య తగ్గించి చూపించారు. ట్రేడ్ లైసెన్సులు ఉంటేనే చిన్నపరిశ్రమలకు పరిహారం ఇస్తామని చెప్పడంతో వేలాది బీరువా పరిశ్రమలకు ఒక్క పైసా పరిహారం అందలేదు. ⇒ ఎన్యుమరేషన్ బృందాలకు ప్రభుత్వం ముందే పరిమితులు పెట్టడంతో ఎక్కడికక్కడ కోతలు పెట్టేశారు. జరిగిన నష్టానికి, అంచనా వేసిన నష్టానికి సంబంధం లేకుండా పోయింది. చాలా మంది బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింకవకపోవడంతో పరిహారం జమ కాలేదు. డబ్బులు ఎకౌంట్లో పడని వారికి మళ్లీ ఎన్యుమరేషన్ చేస్తామని ప్రకటించినా, ఇంతవరకు అధికారులు బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం బ్యాంకు సమస్యలతో 20 వేల కుటుంబాలకు పరిహారం అందలేదు.జాబితాలోనే కుట్ర⇒ జాబితాలో పేర్లు లేవని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో, మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు 18 వేల దరఖాస్తులు రాగా, 13,700 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. గత నెల 30వ తేదీ అందరికి పరిహారం అందుతుందని సీఎం ప్రకటించినా అందలేదు. దీంతో కలెక్టరేట్‌కు బాధితులు పోటెత్తారు. ⇒ అర్జీలు సమర్పించిన వారిలో 90 శాతం మంది గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే వారే ఉండటం గమనార్హం. నష్టం అంచనా జాబితా తయారీలోనే ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నా.. ఫోర్త్ ఫ్లోర్ అని నమోదు చేశారని, ఇల్లంతా బురదమయం అయి కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని.. ఆధార్, బ్యాంక్ ఖాతాలు అన్నీ సక్రమంగానే ఉన్నా.. నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ నిరుపేదలు ఎక్కవగా ఉండే వాంబేకాలనీ, వడ్డెరకాలనీ, శాంతినగర్, పైపులరోడ్డు, సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట, కండ్రిక, రాజీవ్‌నగర్, జక్కంపూడి, అంబాపురం, భవానిపురం, అంబాపురం, కెల్రావు నగర్, పాయకాపురం, రామలింగేశ్వరనగర్ కట్ట, మధ్యకట్ట, రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు ఎక్కువగా వచ్చారు. ⇒ కాగా, సీఎం సహాయ నిధికి దాతలు రూ.400 కోట్లు అందజేశారు. ఇందులో బాధితులకు అందించిన సాయం రూ.202 కోట్లు మాత్రమే. ఈ ప్రభుత్వానికి కనికరం లేదుఈ ప్రభుత్వానికి పేదలంటే అలుసు. కాస్త అయినా కనికరం లేదు. ఇల్లు మొత్తం మునిగిపోవడంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బయటపడ్డాం. వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి రాసుకున్నారు. కానీ డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ పది సార్లు తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. కూలీ పనులు చేసుకుని బతికేవాళ్లం. మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు. – జమ్ము సన్యాసమ్మ, న్యూ రాజరాజేశ్వరిపేట -
బుడమేరు వరదలో పడి మరో మహిళ మృతి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద ముంపులో వ్యక్తులు మృతి చెందిన ఘటనలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీన వరద ముంపులో కొట్టుకుపోయిన విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన వ్యక్తి 15 రోజుల తర్వాత మరణించి కనిపించారు. ఇప్పుడు తాజాగా అదే తరహాలో సింగ్‌నగర్ ఇందిరానాయక్నగర్లోని ఐదో రోడ్డులో బుడమేరు వెంబడి ఉన్న ముళ్ల చెట్ల మధ్య ఓ మహిళ మృతదేహాన్ని అజిత్ సింగ్‌నగర్ పోలీసులు గుర్తించారు.తీవ్ర దుర్వాసనఇందిరానాయక్నగర్ ఐదో రోడ్డులో ఉన్న బుడమేరు వెంబడి ప్రాంతం నుంచి రెండు రోజులుగా తీవ్ర దుర్వాసన వస్తోంది. స్థానికులు దీనిపై సింగ్‌నగర్ పోలీసులకు సమాచారమివ్వగా వారు సోమవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళ మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించి ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి తీవ్రంగా శ్రమించారు. చనిపోయి సుమారు 20 రోజుల పైనే కావడంతో ఆమె రెండు చేతుల ఎముకలు బయటకు వచ్చేశాయి. తల భాగం పురుగులు తినివేయడంతో గుర్తు పట్టలేనంత దారుణంగా తయారైంది. మృతురాలి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరద బాధితులపై సర్కార్ దమనకాండ
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన భవానీపురం కరకట్టవాసులపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండకు దిగింది. పోలీసులతో లాఠీచార్జి చేయించి, అణచివేసేందుకు ప్రయత్నించింది. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగివచ్చిన అధికారులు ఎన్యూమరేషన్ చేస్తామని చెప్పారు. ఇందుకు రేషన్ కార్డులు కావాలని చెప్పడంతో వరదలో పోయిన కార్డులను ఎక్కడ తెమ్మంటారంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి బుడమేరు వరదకు భవానీపురం కరకట్ట ప్రాంతం మునిగిపోయింది. అయినా ఇప్పటివరకు ఈ ప్రాంతంలోని బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. వరద బాధితులకు పరిహారమిచ్చేందుకు ఎన్యూమరేషన్ కూడా చేయడంలేదు. అదేమంటే ఈ ప్రాంతం రెడ్ జోన్లో లేదని అధికారులు చెబుతున్నారు. 15 రోజుల క్రితం ఈ బాధితులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేయగా తహసిల్దార్ వారికి రేషన్ మాత్రం అందించారు. ఎన్యూమరేషన్ చేయించలేదు. దీంతో బాధితులంతా రోడ్డెక్కారు. బుడమేరు వరద కారణంగా మా ఇళ్లు మునగ లేదా.. మేం బాధితులం కాదా అంటూ సోమవారం సాయంత్రం దాదాపు 500 మంది బాధితులు విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే తాము ఎన్యూమరేషన్ అధికారులు వస్తారేమోననని పనులకి కూడా వెళ్లకుండా ఇళ్ల దగ్గరే ఉంటున్నామని, అయినా ఇంతవరకు ఎవరూ తమ గోడు వినలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అదేమంటే తమ ప్రాంతం రెడ్ జోన్ కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. రెండు గంటలపాటు సాగిన ఈ ఆందోళనతో కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా బాధితులు వెనక్కి తగ్గలేదు. ఇంతలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ వచ్చారు. ఆయన ఆదేశాలో ఏమిటో తెలియదుగానీ వెంటనే పోలీసులు రెచ్చిపోయి బాధితులపై లాఠీచార్జ్ చేశారు. అయినా బాధితులు వెరవకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోప్ పార్టీ వచ్చి వారిని వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నించినా బాధితులు లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. పశ్చిమ తహసిల్దార్‌ను పిలిపించి మాట్లాడిస్తానని ఏడీసీపీ రామకృష్ణ బాధితులకు చెప్పి రోడ్డు మీదున్న వారందరినీ ఒక పక్కకు మళ్లించారు. చివరకు వెస్ట్ తహసిల్దార్ ఇంతియాజ్ పాషా వచ్చి బాధితులతో మాట్లాడారు. కలెక్టర్‌కు విషయం తెలిసి తనను పంపించారని, మంగళవారం ప్రత్యేక బృందాలతో ఎన్యూమరేషన్ చేయిస్తానని చెప్పారు. రేషన్ కార్డ్ తదితర ధృవపత్రాలను తీసుకురావల్సి ఉంటుందని చెప్పారు. ఇళ్లన్నీ మునిగిపోతే అవన్నీ ఎక్కడ నుంచి వస్తాయని బాధితులు ప్రశ్నించారు. చివరకు అధికారుల హామీతో ఆందోళన విరమించారు. -
శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా .. చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సవాల్
-
బాబు ‘బీమా మాటలు’ బోగస్..
సాక్షి, అమరావతి : ‘నా ఆటో వరదలో మునిగి వారం రోజులు ఉండిపోయింది. అన్ని భాగాలు పాడైపోయాయి. ఇంజిన్ సీజ్ అయిపోయింది. దాన్ని బాగుచేయాలంటే రూ.60 వేలు వరకు అవుతుందని మెకానిక్ చెప్పాడు. బండికి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్లు చూసి ఇంజిన్ సీజ్ అయితే ఇన్సూరెన్స్ ఇవ్వలేమని చెప్పారు. గట్టిగా అడిగితే రూ.4 వేలు ఇస్తామంటున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి సంబంధంలేదు. ఆటోనే నా జీవనాధారం. పైగా.. ఇంట్లో అన్ని వస్తువులు వరదలో మునిగి పాడైపోయాయి. ఏం చేయాలో, ఎలా బతకాలో తెలీడంలేదు’.. ఇదీ విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలోని శాంతినగర్‌లో ఉంటున్న వేల్పుల మురళి ఆవేదన. .. ఇలా బుడమేరు వరదలో మునిగి విజయవాడలో దాదాపు రెండు లక్షల వాహనాలు పాడైపోయినట్లు అంచనా. అందులో సుమారు లక్షన్నర ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ఆటోలు 15 వేలు, కార్లు 20 వేల వరకూ ఉండొచ్చని అంచనా. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ముంపు వాహనాలే కనిపిస్తున్నాయి. వరద నీటిలో మునగడంతో చాలా వాహనాల ఇంజన్లు సీజ్ అయిపోయాయి. కానీ, ఇన్సూరెన్స్ ఉన్న ఇలాంటి వాహనాలకు ఇబ్బందుల్లేకుండా క్లెయిమ్‌లు ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బీమా సంస్థలతో సమావేశం నిర్వహించి క్లెయిమ్‌ల పరిష్కారంలో ఉదారంగా ఉండాలని చెప్పామని, వాళ్లు ఒప్పుకున్నారనీ చెప్పారు. ఈయన మాటలు నమ్మి పూర్తి ఇన్సూరెన్స్ వస్తుందన్న ధీమాతో బాధితులు దెబ్బతిన్న తమ వాహనాలను కంపెనీలకు తీసుకెళ్తున్నారు. అక్కడ కంపెనీల ప్రతినిధులు వీటికి అసలు బీమా ఎలా వస్తుందని బాధితుల్ని ఎదురు ప్రశి్నస్తున్నారు. బీమా నిబంధనలతో ఆందోళన.. వాహనాలు వరద నీటిలో ఉన్నప్పుడే తాము చూడాలని, కడిగి తీసుకొస్తే బీమా క్లెయిమ్ చేయడం కుదరదని చెబుతుండడంతో వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. వాహనాలను చూసేందుకు సైతం కంపెనీల ప్రతినిధులు రావడంలేదు. 10–15 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. అప్పటివరకు ఆగలేమని చెబుతుండడంతో ఎంతోకొంత క్లెయిమ్ ఇస్తామని చెప్పి రూ.2 నుంచి రూ.5 వేల వరకూ నిర్థారించి పంపేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మీ వాహనం మునిగిందని గ్యారంటీ ఏమిటని చాలామందిని ప్రశ్నిస్తున్నారు. అలాగే, వరదలో బండి మునిగిన ఫొటోను అడుగుతుండడంతో బాధితులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే నరసింహారావు ఇంజన్, ఎలక్ట్రిక్ వైరింగ్, గేర్‌బాక్స్ ఇతర పరికరాలు పనికిరాకుండా పోవడంతో రిపేర్‌కు రూ.30 వేలు అవుతుందని షోరూమ్‌లో కొటేషన్ ఇచ్చారు. కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం వాహనాన్ని కడిగేసి తీసుకొచ్చారు కాబట్టి తామేమీ చేయలేమని చేతులెత్తేసింది. అతను ప్రాథేయపడితే రూ.3 వేలు ఇవ్వడానికి ఒప్పుకుంది. మరోవైపు.. ఇలాంటి ద్విచక్ర వాహనాల్లో దాదాపు 70 శాతానికి పైగా ఇన్సూరెన్స్ లేదని చెబుతున్నారు. వారంతా సొంత డబ్బుతోనే వాహనాలను బాగుచేయించుకుంటున్నారు. ఆటోవాలాల పరిస్థితి దయనీయం.. ఇక పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు తీసుకెళ్లే ఆటోవాలాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వెంటనే ఆటో మరమ్మతు చేయించుకోకపోతే ఉన్న వ్యాపారం పోయి రోడ్డు మీద పడతామని గగ్గోలు పెడుతున్నారు. కంపెనీల వాళ్లు కనీసం 10 రోజుల సమయం అడుగుతుండడం, వేచి ఉన్నా నామమాత్రంగా ఎంతోకొంత ఇచ్చే పరిస్థితి ఉండడంతో దానిపై ఆశలు వదిలేసుకుని అప్పుచేసి ఆటోలను బాగు చేయించుకుంటున్నారు. -
మానని గాయం.. తీరని నష్టం
సాక్షి, అమరావతి : బుడమేరు వరద బాధితుల్లో ఎవరిని కదిపినా ఒకటే వేదన. 15 రోజులైనా వరద కష్టాలు వీడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, సింగ్‌నగర్ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఈమె పేరు లావణ్య. ఆమె భర్త నర్సింహారావు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. ఆమె ప్రస్తుతం రెండు నెలల బిడ్డకు తల్లి.వీరంతా సింగ్ నగర్ శాంతినగర్‌లో రూ.5 వేలకు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గత నెల 31 అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చిన వరద ఇంటిని ముంచేసింది. సామాన్లు తీసుకునే సమయం కూడా లేదు.చంటిబిడ్డను తీసుకొనిఅందరూ డాబా పైకి పరిగెత్తారు. కేవలం ఓ బరఖాని పైకప్పుగా మార్చుకుని దాని కిందే మూడు రోజులు బతికారు. వీరి అవస్థ చూసి బాలింతరాలికి పక్కింటి వారు ఆశ్రయమిచ్చారు. సహాయక చర్యలకు వచ్చిన హెలికాప్టర్ గాలికి బరఖా చిరిగిపోవడంతో వారం రోజులు వానలోనే గడిపారు. సరైన తిండి, నిద్ర లేవు. వరద తగ్గాక కిందకొచ్చి చూస్తే ఇల్లంతా బురద. ఏ వస్తువూ మిగల్లేదు. మిషన్ కుడితే గానీ ఇల్లు గడవదు. ఇప్పుడదీ పాడైంది. సెప్టిక్ ట్యాంకు నిండా బురద చేరడంతో కనీసం కాలకృత్యాలకూ నరకం చూడాల్సి వస్తోందని ఆ కుటుంబం విలపిస్తోంది.జీవిత కాలం కష్టం.. చెత్త కుప్పల పాలుఏళ్ల తరబడి పేద ప్రజల రెక్కల కష్టం.. ఇదిగో.. ఇలా వరద పాలై రోడ్డు పక్కకు చేరింది. బుడమేరు వరదకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. అందుకూ పనికిరాని వస్తువులను బాధితులు రోడ్లపై పడేస్తున్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. వాటిని ప్రభుత్వ సిబ్బంది దాదాపు 400 ట్రాక్టర్లలో పైపులరోడ్డు వద్దకు తరలిస్తున్నారు. గుంటూరు, గన్నవరం, ఏలూరు, రాజమండ్రి నుంచి కూడా వరదల్లో మునిగి పనికిరాని సామగ్రిని విజయవాడ పైపులరోడ్డుకు తరలిస్తున్నవారు. అక్కడి నుంచి మేజర్ డంపింగ్ యార్డ్ అయిన ఎక్సెల్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. – సాక్షి, అమరావతిడాబాలపైనే జీవనంఅర్ధరాత్రి వేళ విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద దాదాపు 60 మంది ప్రాణాలను మింగేసింది. మరునాడే సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారార్భాటం మొదలెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో సాయమంటూ ఊదరగొట్టారు. చేసింది శూన్యం. లక్షలాది మంది నిరాశ్రయుల్లో ఒక్కరికీ ఒక్క రూపాయి తక్షణ సాయం ఇవ్వకుండా తప్పించుకు తిరిగారు. 10 రోజులయ్యాక వరదను జయించేశామని ప్రకటించేసుకుని వెళ్లిపోయారు. ప్రభుత్వ యంత్రాంగమూ మాయమైంది. ఇప్పుడక్కడ మిగిలింది బురద, బాధితులే. బాధితుల పరిస్థితిలో మార్పు లేదు. అక్కడక్కడా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం కనిపిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ విలువైన సామాగ్రి మొత్తం నీటిపాలైంది. అనేక ఇళ్లు నివాసానికి పనికిరాకుండా పోయాయి. బురద కడుగుతామన్న ఫైరింజన్లు కూడా అదృశ్యమైపోయాయి. ఇంట్లో పేరుకున్న బురదను ప్రజలే తొలగించుకుంటున్నారు. ఇందుకు ఇంటికి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురద తొలగకపోవడంతో ఇప్పటికీ డాబాలపైనే ప్లాస్టిక్ సంచుల గుడారాల కిందే జీవిస్తున్నారు.ఈ సమయంలో ఓటీపీలా?వరద నష్టం అంచనాల్లోనూ ఓటీపీ అడగడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో సెల్ ఫోన్లే పోతే ఓటీపీలు ఎలా వస్తాయని అంటున్నారు. భవిష్యత్తుపై బెంగతో దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు లాటరీ పద్ధతిలో కొన్ని ఇళ్లను దత్తత తీసుకుంటామని చెబుతున్నాయి.ఇక అన్నీ పాత సామాన్లేవరదకు ఇంట్లో గిన్నెల నుంచి విలువైన టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, మంచాలు, కుర్చీలు.. ఇలా అన్ని వస్తువులూపనికిరాకుండా పోయింది. పుస్తకాలు, దుస్తులను వీధుల్లో ఆరబెట్టుకొంటున్నారు. పనికి రావనుకున్న టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఇతర సామాగ్రిని రోడ్ల పక్కన పడేశారు. వాటిని కేజీల లెక్కన అమ్ముకుంటున్నారు. దీంతో పాత సామాన్లు కొనే వారు గతంలో కేజీకి రూ.20 ఇస్తే ఇప్పుడు రూ.10 కే అడుగుతున్నారు. పుస్తకాలన్నీ పాడవడంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లడంలేదు. వీధుల్లో పేరుకున్న చెత్త, మురుగు, దుర్గంధంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అనేక మంది జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఇంత కష్టంలో తాముంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఏమైపోయారని బాధితులు మండిపడుతున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందే తమను బతికించారని చెబుతున్నారు.ఓట్లేయించుకున్న వారేరి?ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయాయి. కట్టు బట్టలు మినహా ఏమీ మిగల్లేదు. ఏ ఒక్కరూ సాయం చేయలేదు. కనీసం తిండి కూడా పెట్టలేదు. రోడ్డు వరకూ వరదలోనే వెళ్లి తెచ్చుకున్నాం. ప్రభుత్వం ముందుగానే హెచ్చరించి ఉంటే ఎక్కడికైనా వెళ్లిపోయేవాళ్లం. మా ఏరియా వలంటీర్, సచివాలయ సిబ్బంది తప్ప మా బాగోగులు చూసేందుకు ఎవరూ రాలేదు. ఓట్లేయించుకున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్ కన్నెత్తి చూడలేదు. – పావని, శాంతినగర్స్కూలుకి వెళ్లడంలేదుప్రైవేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. వరదకు మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. పక్కింటి వాళ్లు ఆశ్రయం ఇచ్చారు. పుస్తకాలన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు వాటిని ఆరబెట్టుకుంటున్నా. స్కూలుకు వెళ్లడంలేదు. – ప్రణవి, వాంబేకాలనీఆరోగ్యం పాడైందిఇల్లు మొత్తం మునిగిపోవడంతో డాబాపైకి వచ్చేశాం. బరఖా కిందే ఉంటున్నా. నా ఆరోగ్యం పాడైంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాను. నా కుమారుడికి ఇటీవలే పోలియో వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఇలా అయ్యింది. ఎలా బతకాలో ఏమీ అర్ధం కావడం లేదు. – నాగమణి, శాంతి నగర్ఏదీ మిగల్లేదుఇంట్లో వాషింగ్ మెషిన్లు, కూలర్లు, మోటర్, టీవీ.. ఇలా ఏదీ మిగల్లేదు. రూ.2 లక్షల వరకూ నష్టం వచ్చింది. మూడు రోజులు వరద నీటిలోనే ఉన్నాం. ప్రభుత్వం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు. అతికష్టం మీద వరద నుంచి బయటపడి బంధువుల ఇంటికి వెళ్లిపోయాం. తిరిగొచ్చి చూస్తే ఇల్లంతా బురద. సామానంతా పాడైపోయింది.– దివ్యభారతి, పాయకాపురం -
బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట/కృష్ణలంక: విజయవాడ ముంపు ప్రాంతాల్లోని పేదల జీవితాలు పదేళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు తగ్గినా.. అక్కడి పేదలను కష్టాలు చుట్టుముట్టడంతో ఎలా బయటపడాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు. కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామగ్రి అంతా వరదపాలైంది. రెక్కలు ముక్కలు చేసుకుని బతికే ఒక్కో పేద కుటుంబం సైతం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన సామాన్లను కోల్పోయింది. ఇంటి సామగ్రిని సమకూర్చుకోవాలంటే మరో పదేళ్లు శ్రమించినా కష్టమే అవుతుందని తల్లడిల్లిపోతున్నారు. పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ముంపు కాలనీల్లో లక్ష మందికి పైగా ఆటో, మోటార్, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, షాపు వర్కర్లు, రోజువారీ కూలీలే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఇంట్లో పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం వంట పాత్రలైనా సమకూర్చుకునే వరకు భోజనాల ప్యాకెట్లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సరఫరా చేసే భోజనం ప్యాకెట్లను సోమవారం నుంచే నిలిపివేసింది. దీంతో వారు దాతలు ఇచ్చే భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కాలనీలను వీడని ముంపుజక్కంపూడి వైఎస్సార్ కాలనీ, రాజీవ్‌నగర్ కండ్రిక, కుందావారి కండ్రిక, ఉడా కాలనీ, అంబాపురం కాలనీల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. దీంతో కొందరు చర్చిలు, కమ్యూనిటీ హాళ్లలో తలదాచుకుంటున్నారు. జవసత్వాలు కూడదీసుకుని నెమ్మదిగా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు. సుందరయ్య నగర్లో ఇళ్లు దెబ్బ తినడంతో ఇంట్లో ఉండలేక వృద్ధ దంపతులైన బండి రమణమ్మ, ఆమె భర్త వెంకటేశ్వరరావు బయటే చిన్న గుడారం వేసుకుని ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పది రోజులపాటు బయటే ఉన్నారు. రమణమ్మ దివ్యాంగురాలు కావడంతో మంచంపైనే ఉండిపోయింది. దాతలు ఇచ్చే ఆహారంతో కాలం వెళ్లదీస్తున్నారు. బుధవారం ఆమె భర్త ఆహారం తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆ వృద్ధురాలు మృతిచెందగా.. ఈ ఘటన కాలనీవాసుల్లో విషాదం నింపింది. చాలా కాలనీల్లో మురుగు పేరుకుపోయింది. చెత్త ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోవడంతో పలు కాలనీల్లోని రోడ్లు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. తాగునీటి పైపులు మురుగులో ఉండటంతో నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని తాగటం లేదు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. విష పురుగుల సంచారంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు నిన్నటి వరకు వరద తమను వణికిస్తే... ఇప్పుడు దొంగలు భయపెడుతున్నారని.. మిగిలిన కొద్దిపాటి సామాన్లు కాపాడుకునేందుకు ఇంటిలో ఒకరు కాపలా ఉండాల్సి వస్తోందని ముంపు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. మరోవైపు వరద నష్టంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వే బృందాలు తమ ఇళ్లకు రాకుండా వీధి మొదట్లో ఉండి తమను ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెబుతున్నారని కండ్రిక ప్రాంత ప్రజలు వాపోతున్నారు.10 రోజులుగా పనుల్లేవు కండ్రిక ప్రాంతానికి చెందిన ఈమె పేరు ఎన్.నాగమణి. వరద ముంపు నుంచి ఇంట్లోని సామగ్రి కాపాడుకునే ప్రయత్నంలో ఆమె భర్త కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి, నాగమణి ఇంటికి వచ్చింది. ‘వరద తగ్గినా ఇంట్లోకి వెళ్లలేకపోతున్నాం. సర్వం కోల్పోయి పది రోజులుగా పనిలేకుండా ఉన్నాం. ఓ వైపు భర్త ఆస్పత్రి పాలయ్యాడు. వరదలో మునిగిన ఇంటిని చూస్తూ ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నా. వరద వస్తుందని ముందుగా చెప్పి ఉంటే సామాన్లు సర్దుకుని వెళ్లిపోయేవాళ్లం. ఇలా మునిగిన ఇళ్లను కాపలాకాసే పరిస్థితి వచ్చేది కాదు. ఇంట్లో సామగ్రి సమకూర్చుకోవడం పదేళ్లకైనా మాలాంటోళ్లకు కష్టమే’ అని నాగమణి ఆవేదన చెందుతోంది.వంట పాత్రలైనా ఇవ్వండయ్యావరద వచ్చినప్పుడు ప్రభుత్వం మాకు సమాచారం ఇవ్వాలి కదా.. ఒక్కసారిగా వచ్చిన వరదతో సామాన్లన్నీ వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లాం. ఇంట్లో ఇంకా వరద తగ్గలేదు. ఒక్క సామాను కూడా పనికివచ్చేలా లేదు. ప్రభుత్వం స్పందించి వంట పాత్రలు, బకెట్లు వంటివి ఇవ్వాలి. – శైలజ, కండ్రిక ఇంట్లో ఉండలేం.. బయటకు వెళ్లలేం ఇల్లంతా వరద నీరు. నీరు తోడటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. చర్చిలో తలదాచుకుంటున్నాం. మాకు ఆహారం ఇవ్వడం ప్రభుత్వం మానేసింది. దాతలు పంపిన ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నాం. మా అమ్మకు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. ఎక్కడికి వెళ్లలేని స్థితి. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. – దేవర నాగమల్లేశ్వరి, కండ్రిక -
మిగిలింది బురదే!
‘వరద నీళ్లు పోయాక వచ్చి చూస్తే మోకాటి లోతు బురద పేరుకుపోయి ఉంది.. ఇంట్లో, బయట కంపు కొడుతోంది.. కట్టుబట్టలతో మిగిలిపోయాం.. దాతలిచ్చింది తిని బతుకుతున్నాం.. మీరు (ఎన్యూమరేషన్ బృందం) ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం.. ఇదిగో చూడండి మా కష్టం, నష్టం.. అక్కడ బురదలో కూరుకుపోయి ఉన్నది పరుపు.. దాని కింద మంచం ఉంది.. ఇంకా దాని కింద పిల్లల పుస్తకాలున్నాయి.. ఆ పక్కనున్న బీరువాలో మా అందరి దుస్తులున్నాయి.. సర్టిఫికెట్లు కూడా అందులోనే పెట్టాం.. పది రోజులుగా నీళ్లలో నాని నాని అవన్నీ పేలికలుగా మారాయి.. అదిగో అది ఫ్రిజ్.. తీద్దామంటే డోర్ తెరుచుకోవడం లేదు.. ఇక్కడ కిచెన్‌లో ఏది ఏ వస్తువో తెలియడం లేదు. ఇదంతా కల అయితే బావుండనిపిస్తోంది’ అని నష్టం వివరాల నమోదు కోసం వచ్చిన బృందంఎదుట ఓ ఇల్లాలు కన్నీటి పర్యంతమైంది.సాక్షి, అమరావతి/పటమట/సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఒక్కో కుటుంబానిది ఒక్కో దీన గాథ. ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. విజయవాడలో బుడమేరు వరద మిగిల్చిన విషాదం మాటలకందడం లేదని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కళ్లెదుటే పలు వస్తువులు నీట కొట్టుకుపోతుంటే అచేతనంగా చూస్తూ ఉండి పోయామని వాపోతున్నారు. కట్టు బట్టలతో బయట పడ్డామని, కంటి మీద కునుకు కరువైందని చెబుతున్నారు. వరద తమకు ఎంత నష్టాన్ని, కష్టాన్ని మిగిలి్చందో ఎన్యుమరేషన్ బృందాల ఎదుట కన్నీటి పర్యంతమై వివరిస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న ప్రతి పేద కుటుంబం చితికిపోయింది. వారికి కన్నీరు తప్ప మిగిలిందంటూ ఏమీ లేదు. రోజువారీ పనులు చేసుకునే వారి ఇళ్లలో జరిగిన నష్టాన్ని చూస్తుంటే పగ వాడికైనా ఇంతటి కష్టం రాకూడదనిపిస్తుంది. ఇళ్లు మునిగి పోవడంతో వరద తగ్గే వరకు బంధువుల ఇళ్లలో, అక్కడక్కడా తల దాచుకున్న కుటుంబాల వారు.. ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చి చూసుకుని భోరున విలపిస్తున్నారు. ఇంట్లోని బట్టలు, మంచం, టీవీ, ఫ్రిజ్, వంట సామాన్లు, పుస్తకాలు, ఇతరత్రా పరికరాలన్నీ పనికి రాకుండా పోవడం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే కుటుంబాలు కనీసం రూ.50 వేలకుపైగా నష్టపోయాయి. పది రోజులుగా పని లేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక, పిల్లలను ఎలా చదివించాలో.. మళ్లీ ఇంటిని ఎలా గట్టెక్కించాలో తెలియక ఆ ఇంటి యజమానులు పడే బాధ వర్ణణాతీతం. ఇంటింటికీ ప్రత్యేక బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి (ఎన్యుమరేషన్) ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల బృందాలు వలంటీర్ల సహాయంతో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించి ఇచ్చిన ప్రత్యేక యాప్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లల్లో దెబ్బతిన్న ఎల్రక్టానిక్, మోటార్, ఇతర సాధారణ వస్తువుల గురించి నమోదు చేస్తున్నాయి. ఈ సందర్భంగా బాధితులు పది రోజులు పడిన కష్టం, వారికి జరిగిన నష్టం గురించి వివరిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల ఇళ్ల వద్ద కనీసం నిలబడి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఒక అంతస్తు ఉండే ఇళ్లలో ఉంటున్న ఒక్కో కుటుంబానికి కనీసంగా రూ.50 వేలు, గరిష్టంగా లక్షన్నరపైనే నష్టం కనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలకైతే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకైతే రూ.10 లక్షల నుంచి అంతకు మించి నష్టం కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలు 37 » నగరంలోని 20 కిలోమీటర్ల మేర 37 ప్రాంతాలను మూడు సర్కిళ్లుగా విభజించి అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలుగా మ్యాపింగ్ చేశారు. » 32 డివిజన్లలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వైద్య శాఖల నుంచి ఒక్కొక్కరుగా బృందం ఏర్పాటు చేశారు. అయితే రెవెన్యూ–మున్సిపల్–విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపంతో అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సర్వే జరగటం లేదు.» 1,487 మంది వార్డు వలంటీర్లు, వార్డు సచివాలయాల సిబ్బంది, ఏఎస్పీ క్యాడర్ పోలీస్ అధికారి, గ్రూప్–1 కేడర్ అధికారి, ఓ సీనియర్ ఐఏఏస్ అధికారి ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ సాగుతోంది. వాణిజ్య నష్టాన్ని అంచనా వేయటానికి ఏర్పాటైన 200 బృందాలు ఇప్పటి వరకు ఆ పనే ప్రారంభించలేదు.నేడు కేంద్ర బృందం పర్యటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన వరద తీవ్రత, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధ, గురువారాల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం ఇప్పటికే విజయవాడకు చేరుకుంది. బుధవారం రెండు బృందాలుగా ఏర్పడి ఒక బృందం ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లో.. మరో బృందం గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనుంది. కాగా, వరద ప్రభావిత జిల్లాల్లో ఇళ్లకు జరిగిన నష్టం లెక్కింపు బుధవారం సాయంత్రానికి పూర్తి కావాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి ఆయన వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయం, దాని అధారిత రంగాల నష్టం లెక్కింపు కూడా ఈ నెల 14వ తేదీకి పూర్తి కావాలని సూచించారు.రూ.వేల కోట్లలో నష్టం..ప్రభుత్వ శాఖలకు జరిగిన నష్టం రూ.6,800 కోట్లని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే దీనికి నాలుగైదు రెట్ల నష్టం సాధారణ ప్రజలకు జరిగినట్లు ఎన్యుమరేషన్ బృందాల ద్వారా స్పష్టమవుతోంది. విజయవాడ నగరం, రూరల్ ప్రాంతాల్లో 2.32 లక్షల ఇళ్లు మునిగి పోవడంతో నష్టం అపారంగా ఉంది. ఆ ఇళ్లల్లోని ఫరీ్నచర్, ఎల్రక్టానిక్, మోటార్ వాహనాలు, ఇతర వస్తువుల నష్టం భారీగా కనిపిస్తోంది. బయట పార్క్ చేసిన వాహనాలే సుమారు రెండు లక్షల వరకు ఉంటాయని అంచనా. అందులో లక్షన్నర ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. 30 వేలకుపైగా కార్లు, పది వేల వరకు ఆటోలున్నాయి. మిగిలినవి లారీలు, బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయి. వాటిలో సగానికిపైనే మరమ్మతులకు సైతం పనికిరాని విధంగా పాడైపోయాయి. ఇలా ఇళ్లకు జరిగిన నష్టమే ఊహకు అందని విధంగా ఉంది. ఇవిగాక 5 లక్షల ఎకరాలకుపైగా పంటలు దెబ్బ తిన్నాయి. ఆ నష్టం వ్యవసాయ రంగాన్ని కుదిపేసేలా ఉంది.భోజనం కోసం ఎదురు చూపు మా వీధిలోకి ఏడు అడుగులకుపైగా వరద నీళ్లు వచ్చాయి. కట్టుబట్టలతో నా ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి స్నేహితుడి మేడపైకి ఎక్కేశాం. నీళ్లు తగ్గుముఖం పట్టాయని ఇంటికి వచ్చి చూస్తే సర్వం నీళ్లలో నానిపోయాయి. మంచం, ఫ్రిజ్ పనికొచ్చే పరిస్థితి లేదు. పిల్లలు కట్టుకోవడానికి గుడ్డ పేలిక కూడా మిగల్లేదు. రాడ్ బెండింగ్ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే నాకు మళ్లీ జీవితాన్ని ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. మావీధి అంతా మురుగు వాసన వస్తోంది. గతిలేక అలానే ఉంటున్నాం. – ఏలియా, వరద బాధితుడు, ఏవీఎస్ రోడ్డు, ప్రకాశ్‌నగర్ రూ.1.50 లక్షలు నష్టపోయాం మా జీవితం చిన్నది. జీవనోపాధి కోసం నూజివీడు నుంచి ఆరు నెలల కిందట ఇక్కడికి వచ్చి అద్దె ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నాం. వరద దెబ్బకు జీవితం చిన్నాభిన్నం అయ్యింది. నా భర్త కాలేశ్వరరావు మార్కెట్లో చెప్పులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్టాక్ అంతా ఇంటిలోనే పెట్టారు. అంతా నీటి పాలైంది. మంచం, పురుపు దుర్వాసన రావడంతో బయట పడేశాం. ఫ్రిజ్, టీవీ, బియ్యం, దుస్తులు, పిల్లల పుస్తకాలతో సహా ఏమీ మిగల్లేదు. మరో వైపు స్టాకు అంతా దెబ్బతింది. రూ.1.50 లక్షల వరకు నష్టపోయాం. – సుమలత, వరద బాధితురాలు, పాయకాపురం» 32 డివిజన్ల పరిధిలోని మూడు సర్కిళ్లలో లక్షన్నరకు పైగా ఇళ్లకు నష్టం » ఒక్కో డివిజన్‌కు ఒక ఐఏఎస్ అధికారి ఇన్చార్జ్ » 32 డివిజన్ల పరిధిలో 1,700 సర్వే బృందాల ఏర్పాటు » ఒక్కో బృందం ద్వారా 50–100 ఇళ్లు సర్వే » ప్రతి బృందంలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వైద్య సిబ్బంది » వీరికి తోడుగా సచివాలయ కార్యదర్శి, ఆ ప్రాంత వలంటీర్ » ప్రత్యేక యాప్‌లో మాత్రమే వివరాలు నమోదు » వాణిజ్య నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు -
బెజవాడలో శాంతించి పల్లెలపై ప్రతాపం
(బుడమేరు పరీవాహక ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) : ‘బుడమేరు వరద ఉధృతి దిగువ ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలకు ఆనుకుని ఉన్న పొలాలన్నీ మునిగిపోయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. మన పక్క ఊరిలో మెయిన్ రోడ్డుపైకి నీరు వచ్చేసింది. మన ఊరికి అటూ ఇటూ కూడా రోడ్డు మునిగిపోయింది. చుట్టూ నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏ క్షణమైనా మన గ్రామాన్ని వరద నీరు ముంచెత్తవచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండాలి..! ’’ బుడమేరు పరీవాహక గ్రామాల్లో పదకొండు రోజులుగా ఇలా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడు వరద విరుచుకుపడుతుందోననే భయంతో నిరంతరం కాపలా కాస్తున్నారు. బుడమేరు వరద ఉధృతితో గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. వరదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బెజవాడను ముంచెత్తిన బుడమేరు క్రమంగా శాంతిస్తున్నప్పటికీ పరీవాహక గ్రామాలను మాత్రం బేజారెత్తిస్తోంది. ఖమ్మం–కృష్ణా జిల్లాల నడుమ కొండల్లో మొదలయ్యే బుడమేరు వరద నీరంతా విజయవాడ నుంచి దిగువకు ప్రవహించి కొల్లేరులో కలిసే వరకు అనేక గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో పలు గ్రామాలు పదకొండు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రధాన రహదారులపైకి బుడమేరు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. పదుల సంఖ్యలో గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.ఉంగుటూరు మండలం తేలప్రోలు నుంచి గుడివాడ మండలం నందమూరు వెళ్లే ప్రధాన రహదారిపై బుడమేరు వరద నీటి ఉధృతి పదకొండు రోజులుగా తగ్గకపోవడంతో అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంచె వేసి పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రాత్రి పగలు గస్తీ కాస్తున్నారు. దీనివల్ల 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అటువైపు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి వచ్చేందుకు అవస్థ పడుతున్నారు. గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారిపై కొయ్యగూరపాడు రోడ్డు ఇరువైపులా మునిగిపోయింది. దీంతో గన్నవరం, నందివాడ మండలాల్లోని పది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ శివారు ఎనికేపాడు నుంచి దోనేటుకూరు, నిడమానూరు సరిహద్దుల మీదుగా గూడవల్లి, ఉప్పులూరు, మంతెన, తరిగొప్పుల, ఉంగుటూరు, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడు, పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఇల్లపర్రు చివరకు ప్రవహించే బుడమేరు వెంకటలక్ష్మీ నరసింహపురం సమీపంలో కొల్లేరులో కలిసే వరకు పలు గ్రామాలను కలవరపెడుతోంది. ఊరి చుట్టూ నీళ్లు.. పదకొండు రోజులుగా బుడమేరు మా గ్రామాన్ని జల దిగ్బంధం చేసింది. ఊరి చుట్టూ వరద నీటి ఉధృతితో రోడ్లు మునిగిపోయాయి. దాదాపు 1,500 మందికిపైగా ఊరిలోనే ఉండిపోయాం. రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకులేకుండా గడిపాం. ఇప్పుడిప్పుడే వరద దిగువకు వెళ్తుండటంతో గ్రామంలో నీళ్లు తగ్గుతున్నాయి. –జంజన వెంకటేశ్వరరావు, కొయ్యగూరపాడు గ్రామస్తుడుఎప్పుడూ చూడలేదు.. నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత వరద ఎప్పుడూ చూడలేదు. వరద చుట్టుముట్టడంతో పిల్లలు, పెద్దలు అంతా గ్రామంలోనే ఉండిపోయాం. పదకొండు రోజులుగా యువకులు వరద ప్రాంతాల్లో గస్తీ కాశారు. దాతల సహకారంతో రోజూ భోజనం సమకూర్చారు. –జుజ్జువరపు వెంకట్రావు, కొయ్యగూరపాడు -
కష్టాల ఊబిలో..
బెజవాడలో బుడమేరు వరద తగ్గింది. కానీ, ముంపు ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు మాత్రం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఏ వీధిలో చూసినా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు... ఇళ్లలో చేరిన బురద... పాడైపోయిన వస్తువులు... వాటిని శుభ్రం చేసుకుంటున్న జనం... ఇళ్ల ముందు కంపు కొడుతున్న మురుగు... మొరాయిస్తున్న వాహనాలు... సర్వం కోల్పోయి షాపులను చూసి విలపిస్తున్న చిరు వ్యాపారులు... చేతి వృత్తులవారు... ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కష్టాల్లో మునిగిపోయారు. ముంపు ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా లక్షల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. కుటుంబమంతా 10 నుంచి 15 ఏళ్లుగా కష్టపడి పని చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న వాహనాలు, టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, మంచాలు వంటి వస్తువులన్నీ పాడైపోయాయని కన్నీరుపెడుతున్నారు. ఇప్పుడు కోల్పోయినవన్నీ మళ్లీ సమకూర్చుకోవాలంటే మరో 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని కుమిలిపోతున్నారు.మరోవైపు ప్రభుత్వం ఆహారం, తాగునీరుపంపిణీ చేస్తున్నా... అవన్నీ దాదాపు మెయిన్ రోడ్లకే పరిమితమయ్యాయని, చిన్న చిన్న వీధుల్లో ఉన్న తమకు అందడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు సాయం అందిస్తున్న ఫైర్ సిబ్బంది సేవలు కూడా ప్రధాన వీధులకే పరిమితమయ్యాయని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అంటువ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పాడి గేదెలను బలి తీసుకున్న వరద బుడమేరు వరద పశుపోషకులను నట్టేట ముంచింది. రూ. లక్షల విలువైన పశువులు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాయి. దీంతో వాటిపై ఆధారపడినవారు అల్లాడిపోతున్నారు. సింగ్‌నగర్ లెనిన్ సెంటర్లో నివాసం ఉంటున్న వెల్లబోయిన నాగేశ్వరమ్మ, మల్లేశ్వరరావు దంపతులతోపాటు వారి కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె రాజేశ్వరి కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ 9 గేదెలను పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. వారి 4 గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. తాము చూస్తుండగానే గేదెలు కొట్టుకుపోయాయని, వాటి విలువ రూ.1.50లక్షలు ఉంటుందని నాగేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.రైల్వేస్టేషన్.. బస్టాండ్‌లో బతికాంఈ వ్యక్తి పేరు ఉప్పు శ్రీను. విజయవాడ సింగ్‌నగర్‌లోని కృష్ణా హోటల్ సెంటర్లో నివాసం ఉంటున్నారు. తండ్రి ఇచ్చిన కొద్దిపాటి స్థలంలోనే పక్కపక్కన శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు ఇళ్లు నిర్మించుకుని తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను ఆటో నడిపితే.. భార్య, ఇద్దరు పిల్లలు మట్టి పనులు చేసుకుని పైసాపైసా కూడబెట్టుకున్నారు. శ్రీను తమ్ముళ్లు కూడా మట్టి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. యథావిధిగా ఈ నెల ఒకటో తేదీ అందరూ పనికి వెళ్లగా, అకస్మాత్తుగా వారి ఇంటి చుట్టూ వరద వచ్చింది. ఇంట్లో ఉన్న మగ పిల్లలు శ్రీను తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను పక్కింటి గోడ దూకించి సురక్షితంగా బయటకు చేర్చారు. కట్టుబట్టలతో కొంత మంది రైల్వేస్టేషన్, మరికొంత మంది బస్టాండ్‌లో వారానికిపైగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. దొరికింది తింటూ ఆకలి తీర్చుకున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో రెండు రోజుల కిందట తిరిగి ఇంటికి వచ్చి శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు ముగ్గురి ఇళ్లలోని మంచాలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు మొత్తం పాడైపోయాయి. కొత్త బైక్ కాస్తా నీటిలోని ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఆటోకు, బైక్‌కు ఇన్సూరెన్స్ కోసం ఫోన్లు చేస్తుంటే కంపెనీల ప్రతినిధులు మళ్లీ ఫోన్ చేస్తామంటూ పెట్టేస్తున్నారని శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఒక్క కుటుంబంలోనే రూ.4లక్షలకు పైగా నష్టం జరిగింది. ‘మేం మనుషులం మాత్రమే బతికున్నాం. సర్వస్వం కోల్పోయాం. వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా బురదలో కొట్టుకుపోయాయి..’ అని శ్రీను కుటుంబ సభ్యులు విలపించారు.నీటి కొరతతో ఇబ్బందులు కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, సింగ్‌నగర్, డాబాకొట్లు.. ఇలా అనేక ముంపు ప్రాంతాల్లో బాధితులను నీటి కొరత వెంటాడుతోంది. పది రోజులపాటు జలదిగ్భందంలో ఆయా ప్రాంతాలు ఉండటంతో మున్సిపల్ వాటర్ పైప్లైన్లోకి మురుగు నీరు చేరింది. దీంతో చాలాచోట్ల నీటి సరఫరా పునరుద్ధరించినప్పటికీ కుళాయిల ద్వారా వస్తున్న నీటిని వాడుకోలేకపోతున్నామని ప్రజలు తెలిపారు. మరికొన్ని చోట్ల నీటి సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. విద్యుత్ సరఫరా మొదలైనప్పటికీ ఇళ్లలోకి నీరు చేరడంతో మోటార్లు సైతం దెబ్బతిని భూగర్భ జలాలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. నీళ్ల కోసం ముంపు ప్రాంతాల ప్రజలు నేటికీ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.ప్రధాన వీధులకే ఫైర్ ఇంజన్ పరిమితంనీట మునిగిన ఇళ్లను ఫైర్ ఇంజన్ల సాయంతో శుభ్రం చేస్తున్నామని పదేపదే ప్రభుత్వం చెబుతోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సింగ్‌నగర్, ఉడా కాలనీ, వాంబేకాలనీ, కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్ కాలనీతోపాటు చాలా ప్రాంతాల్లోని అనేక వీధుల్లో ఇప్పటి వరకు ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రధాన వీధులకు మాత్రమే ఫైర్ ఇంజన్లు పరిమితమయ్యాయి. ఎక్కువ మంది ఇప్పటికీ రోడ్లపై ఉన్న మురుగు నీటితోనే ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరివరదల్లో కొట్టుకుని వచ్చిన చెత్తాచెదారంతో డ్రెయిన్లలో నీరు బయటకు వెళ్లడం లేదు. రాజీవ్‌నగర్, పాయకాపురం, ప్రకాష్‌నగర్, రాధానగర్, కండ్రిక, కృష్ణా హోటల్, డాబాకొట్లు సెంటర్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, పాత, కొత్త రాజరాజేశ్వరీపేటలు... ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్ల మధ్యలో మురుగు నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో అల్లాడుతున్నారు.కట్టుకోవడానికి బట్టల్లేవు... పొయ్యి వెలగడం లేదులోతట్టు ప్రాంతాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు వారం రోజులకు పైగానే నీట మునిగే ఉన్నాయి. ముంపు వీడాక ప్రజలకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. చిరువ్యాపారులు, రోజువారీ కూలీలకు 10 రోజుల నుంచి ఉపాధి లేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. బయట అప్పు కూడా పుట్టని దుస్థితి. కనీసం పాడైపోయిన గ్యాస్ స్టౌ రిపేరు చేయించుకోవడానికి డబ్బులు లేని దీనస్థితి అనేక కుటుంబాల్లో నెలకొంది. గ్యాస్ ఏజెన్సీలు ఉచితంగా సర్వీస్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాయి. కానీ, స్పేర్ పార్ట్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటోంది. వరద నీరు ఇంట్లో చేరడంతో బీరువాలు, ర్యాక్లలోకి దుస్తులు వేసుకోవడానికి వీల్లేకుండా పాడైపోయాయి. ఈ నెల ఒకటో తేదీన కట్టుబట్టలతో ఇళ్లు వదిలిన అనేక మంది బాధితులు నేటికీ వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తుతున్నాం..నీళ్ల కోసం చీటీలు రాయించుకోవాలా? ఆడవాళ్లంబిందెలు పట్టుకుని రోడ్డు చివరకు ఎలా వెళ్తాం. ఇన్నీ రోజులు వరద నీటిలో మగ్గిపోయాం. బాగాలేని నీళ్ల కోసం కూడా ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తాల్సి వస్తోంది. ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ జీవిస్తున్నా. నా కుట్టుమిషన్ కూడా వరదలో పొయింది. సరుకు మొత్తం మునిగిపోయింది. నా భర్త వాచ్‌మెన్‌గా పని చేస్తారు. పది రోజులుగా ఇద్దరి ఉపాధి పోయింది. తిండికి గతిలేని పరిస్థితి. మా ఇంటిలో చిన్న పాప (మనవరాలు) ఉంది. కనీసం దానికి స్నానం చేయించడానికైనా నీళ్లు కావాలి. లేకుంటే పాపకు ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందోనని భయమేస్తోంది. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటుంటి సాయం అందలేదు. – కుమారి, జక్కంపూడి వైఎస్సార్ కాలనీమెకానిక్ షెడ్‌కు వెళ్లాలంటే గుబులువరద వస్తుందని ముందే తెలిసినప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేసిన పాపాన పోలేదు. అలా చేసి ఉంటే ఇంట్లో వస్తువులు, బైక్‌లను అయినా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకునే వాళ్లం అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో బైక్‌లు, స్కూటీలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుత రోజుల్లో ఇంటి నుంచి బయట అడుగు పెడితే బైక్ అనేది సర్వసాధారణం. అలాంటి బైక్ ముంపునకు గురై పనిచేయలేని దుస్థితిలో ఇంటి ముందే పడి ఉంది. దాన్ని మెకానిక్ షెడ్ వరకూ నెట్టుకుని వెళ్లి రిపేర్ చేయించడానికి ఎంత బిల్లు అవుతుందోనని భయపడుతున్నారు. ప్రస్తుత కష్టాల్లో అంత ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చాలా మంది అలాగే బైక్‌లను వదిలేశారు. 70 శాతం బైక్‌లకు ఇన్సూరెన్స్ ఉండదుఒకపక్క సీఎం చంద్రబాబు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి పాడైపోయిన వాహనాలను రిపేర్ చేయించి పెడతామని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే పాడైపోయిన బైక్‌లలో ఎన్నింటికి ఇన్సూరెన్స్ ఫోర్స్‌లో ఉంటుంది? అనే చర్చ బాధితుల్లో నడుస్తోంది. సాధారణంగా బైక్‌ను కొత్తగా కొనుగోలు చేసినప్పుడు మాత్రమే యజమానులు ఇన్సూరెన్స్ చేయిస్తారు. అనంతరం 70 శాతం మంది సమగ్ర ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించరని వాహన, ఇన్సూరెన్స్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటనలతో తమకు మేలు జరగదని చాలామంది బైక్ యజమానులు వాపోతున్నారు.రక్తం పీలుస్తున్న దోమలుముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. లేదంటే దోమల వ్యాప్తి అధికమై డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కానీ ఆశించినంత వేగంగా ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సాగడం లేదు. మురుగు, చెత్త మేటలతో దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. దోమల నియంత్రణకు ఫాగింగ్ కూడా సక్రమంగా చేయడంలేదని వరద బాధితులు చెబుతున్నారు. చీకటిపడితే చాలు దోమలు రక్తం పీల్చేస్తున్నాయని, ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్నామని, దోమ కాటుతో తమ ఆరోగ్యాలు కూడా గుల్ల అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాతల కోసం ఎదురు చూపులు ముంపు ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్టు ప్రచారం చేస్తోంది. పది రోజులుగా జలదిగ్భందంలో ఉండి చేతిలో చిల్లిగవ్వలేని రోజువారీ కూలీలు, చేతివృత్తిదారులు కూరగాయలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొందరు అప్పు చేసి కూరగాయలు, సరుకులు కొనుగోలు చేస్తున్నారు. అప్పు పుట్టని వారు దాతలు పంపిణీ చేసే ఆహారం కోసం ప్రధాన రహదారుల వెంబడి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.రాకపోకలకు అవస్థలే...అజిత్‌సింగ్‌నగర్ నుంచి కొత్త రాజరాజేశ్వరీపేట వైపు వచ్చేందుకు ఉన్న వంతెనపై గుర్రపు డెక్క, బురద పెద్ద పేరుకుపోయింది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలు ఎక్కువగా నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరీపేట ప్రాంత ప్రజలు ఎక్కువగా పని కోసం సింగ్‌నగర్ వెళుతుంటారు. అటువైపు నుంచి నగరంలోకి వస్తారు.దుర్వాసన భరించలేకపోతున్నాం..వరద తగ్గినా మురుగు సమస్య తీరలేదు. సైడు కాలువల్లో వరద ముందుకు పారకపోవడంతో దుర్వాసనవస్తోంది. ఆ వాసన భరించలేకపోతున్నాం. ఒకవైపు వరద నీటిలో ఇల్లు మునిగి వంట సామాన్లు, మంచాలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, పిల్లల పుస్తకాలు అన్నీ తడిసి పాడైపోయి బాధపడుతుంటే.. మరోవైపు ఈ మురుగు సమస్య వేధిస్తోంది. వరద గురించి ముందుగా హెచ్చరించి ఉంటే అప్రమత్తమయ్యేవాళ్లం. పగలు వరద వచ్చింది కాబట్టి బతికాం. అదే రాత్రివేళ అయితే ఊహించడమే కష్టం. – ఎం.దేవకుమారి, మసీదు రోడ్డు, శాంతినగర్పుస్తకాలన్నీ నీటిలో నానిపోయాయి తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లోకి వరద నీరు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. నా పుస్తకాలతోపాటు ఇద్దరు చెల్లెళ్ల పుస్తకాలు, రికార్డులను ఇంట్లో నుంచి తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు. పుస్తకాలన్నీ వరద నీటిలోనే నానిపోయాయి. వరద తగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే అవి ఎందుకూ పనికి రాకుండాపోయాయి. స్కూలులో ఉన్నప్పుడు జగనన్న ఇచి్చన డిక్షనరీలు మా చదువులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అవి నీళ్లలో నాని చిరిగిపోవడంతో ఇప్పుడు డబ్బులు పెట్టి కొనే పరిస్థితి లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది మా అక్కచెల్లెళ్ల లక్ష్యం. పుస్తకాలు మళ్లీ కొనాలంటే మా తల్లిదండ్రులకు ఇబ్బందే. – వర్ష, ఇంటర్ విద్యార్థిని, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, విజయవాడ -
AP Floods: పట్టెడన్నం కోసం పరితపిస్తూ..
పటమట/చిట్టినగర్ (విజయవాడ): బుడమేరు వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలను కాపాడుకున్న జక్కంపూడి కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ ప్రజలు ఆహారం అందక అలమటిస్తున్నారు. సర్వం కోల్పోయిన వారంతా తిండి, తాగునీరు, పాల కోసం అర్రులు చాస్తున్నారు. ట్రాక్టర్, కారు వంటి వాహనం ఏది వచ్చిన ఆహారం పొట్లాలు ఇచ్చేందుకు వచ్చాయని భావించి వాటివెంట పరుగులు పెడుతున్నారు. జక్కంపూడి కాలనీలో సోమవారం ఉదయానికి కాలనీలో వరద నీరు అడుగు మేర తగ్గింది. బాధితులు తమ ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటూ భోజనం కోసం ఆతృతగా ఎదురు చూశారు.ఉదయం ఆల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా అందకపోవడంతో కాలనీ వాసులు రోడ్డెక్కారు. కాలనీలోకి ట్రాక్టర్, కారు వచ్చినా అందులో తమ కోసం భోజనం తీసుకొచ్చారేమోనని భావిస్తూ ఆతృతతో ఆ వాహనాలను చుట్టుముడుతున్నారు. దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు పట్టుకుని పిల్లలతో కలిసి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా అవి తాగేందుకు ఉపయోగించవద్దని ముందుగానే కార్పొరేషన్ అధికారులు మైక్‌లో ప్రచారం చేయడంతో వాటర్ బాటిళ్ల కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం నుంచి స్వచ్ఛంద సంస్థలు సైతం తమ సేవలను నిలిపివేశాయి.జక్కంపూడి కాలనీలో కారు వెంట పరుగులు పెడుతున్న వరద బాధితులు ఒకటి, రెండు స్వచ్ఛంద సంస్థలు కాలనీ వాసులకు భోజనం అందించేందుకు రాగా మహిళలు, యువకులు ఆహార పదార్థాలు తీసుకొచ్చిన వాహనాలను చుట్టుముట్టి కదలనివ్వడం లేదు. సోమవారం కాలనీ మెయిన్ రోడ్డులో నివాసం ఉండే వారికే ఆహారం అందింది. శివారు ప్రాంతాలతో పాటు బుడమేరు కాలువకు అవతలి వైపున ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందలేదు. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు కాలనీలో నివాసం ఉండే కుటుంబాలకు ఆహారం అందించాలని అక్కడి వారంతా వేడుకుంటున్నారు.ఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితిఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కూలి పనులు, ఆటోలు నడుపుకుంటేనే కానీ పొట్టగడవని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయిన తామంతా యాచకుల మాదిరిగా తాగునీరు, ఆహారం కోసం అవస్థలు పడాల్సి వస్తోందని ఈ ప్రాంత పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రభ కాలనీలో పేద, మధ్య తరగతికి చెందిన 600 కుటుంబాల్లో కనీసం రెండు వేల మంది నివాసం ఉంటున్నారు. వరద కారణంగా ఉండే వంట సామాగ్రితో, వస్త్రాలు, జీవనో«పాధి కల్పంచే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వరదలో కొట్టుకుపోగా.. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. మహిళల స్వయం ఉపాధి ఆసరాగా నిలిచే కుట్టు మెషిన్లు, టిఫిన్ బండ్లతోపాటు ఇళ్లల్లోని గ్రైండర్లు, మిక్సీలు, గ్యాస్ పొయ్యిలు మరమ్మతులకు గురయ్యాయి. ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా దాతలిచ్చే ఆహార పొట్లాలపైనే ఆధారపడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాయని భావించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహారం సరఫరాను చాలా వరకు తగ్గించేశాయి. దీంతో ఆహారం, పాలు, తాగునీరు దొరక్క ఇక్కడి పేదలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు ఈ రెండు కాలనీల్లోని కుటుంబాలకు ప్రభుత్వమే ఆహారం అందించాలని ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.అన్నీ కోల్పోయాం ఇదేం వరదో. కనీసం ఇంట్లో సామాన్లు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మా కాలనీలోని ప్రతి ఇంట్లో అన్నీ కొట్టుకుపోయాయి. ఆహారం దొరక్క చాలామంది అవస్థలు పడుతున్నారు. పేదలు పూర్తిగా తేరుకునే వరకు ప్రభుత్వమే ఆహారం, పాలు, నీళ్లు అందించాలి. ఇంటిసామగ్రి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కనీసం రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. – వసంత, ఆంధ్రప్రభ కాలనీ జగనన్న ఇళ్లపట్టా కూడా కొట్టుకుపోయింది మాది చిన్న కుటుంబం. గృహోపకరణాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఆధార్, రేషన్, పాన్ కార్డులు, పిల్లల బర్త్ సర్టిఫికెట్లు, పుస్తకాలతోపాటు జగనన్న ఇచ్చిన ఇంటిపట్టా కూడా కొట్టుకుపోయింది. మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవాలన్నా కార్డులు అడుగుతున్నారు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. అన్నీ కోల్పోయిన వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. – వెంకటదుర్గా సూర్యకుమారి, ఆంధ్రప్రభ కాలనీ అర్థగంటలో అంతా నాశనమయ్యింది. అర్థగంటలో మా జీవితాలన్నీ తారుమారయ్యాయి. ఊహించలేనంత ముప్పు మా ఇంటిలోకి వచ్చింది. మా కష్టం అంతా బుడమేరులో కొట్టుకుపోయింది. మమ్మల్ని ప్రభుత్వమే రక్షించాలి. – లక్ష్మీ సరోజ, ఆంధ్రప్రభ కాలనీ -
ప్రభుత్వానికి ముందే తెలుసు
⇒ బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని ముందు రోజే మాకు తెలుసు. 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే.. మాకు తెలుసు, తగ్గిపోతుందిలే అని లంక గ్రామాల ప్రజలు చెబుతారు. ప్రజలు వెళ్లరనే మేము వారికి చెప్పలేదు. – శనివారం మీడియాతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ⇒ బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) నా కంటే ముందే ఎస్ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం నేను తహసీల్దార్లకు ఫోన్ చేసి చెప్పా. – వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ ⇒ బుడమేరు ప్రవాహ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. అలాంటిది 40 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో గండ్లు పడ్డాయి. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తారు. రెండు వైపుల నుంచి వచి్చన వరద విజయవాడను చుట్టుముట్టింది. వరద వస్తుందనే సమాచారం మాకు లేదు. – మీడియాతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనసాక్షి, అమరావతి: బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోందని ఒక రోజు ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. అయితే 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ అన్నారు. ‘వరద వస్తోందని చెబితే గోదావరి జిల్లాల్లోని లంకల్లో ప్రజలెవరూ వెళ్లరు.. మాకు తెలుసులే.. ఇలాంటి వరదలెన్నిటినో చూశాం అంటారు.. అందుకే మేం ప్రజలకు చెప్పలేదు’ అని ఆర్పీ సిసోడియా శనివారం మీడియాకు అసలు విషయం చెప్పేశారు.అలాగే.. బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం తన కంటే ముందే ఎస్ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ వెల్లడించారు. ఆ తర్వాత మధ్యాహ్నం తాను తహసీల్దార్లకు ఫోన్ చేసి విషయం చెప్పానన్నారు. దీన్నిబట్టి తమకు సమాచారం లేదని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెబుతున్న మాటలు అబద్ధమని ఆర్పీ సిసోడియా, మాధవ్ నాయక్ మాటలతో తేటతెల్లమైంది.బుడమేరుకు భారీ వరద ప్రవాహం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి ముందే తెలిసినా.. దానివల్ల ఉధృతికి భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు తప్పవని తెలిసినా వారిని నిర్లక్ష్యంగా వరదకొదిలేసింది. తద్వారా 57 నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరోవైపు కృష్ణా కరకట్టలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వరదకు నీట మునగడంతో ఆయన తన మకాంను విజయవాడ కలెక్టరేట్‌కు మార్చారు. అక్కడ నుంచే బాధితులకు సాయం పేరిట తన ‘షో’ మొదలుపెట్టారు. ఆగస్టు 31 మధ్యాహ్నమే సమాచారం ఇచి్చనా.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని వదిలేస్తామని జలవనరుల శాఖ అధికారులు శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం లోపే సమాచారం ఇచి్చనా.. విజయవాడ, ఎనీ్టఆర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాలనే ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగా విజయవాడలో బుడమేరు జలప్రళయం సృష్టించింది.ఇప్పటివరకూ వెల్లడైన సమాచారం మేరకు వరదల వల్ల 57 మంది మరణించారు. రూ.6,882 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. చంద్రబాబు సర్కార్ ముందే తమను అప్రమత్తం చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేవారమని బాధితులు వాపోతున్నారు. తమకు జరిగిన తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలకు ఎవరిది బాధ్యతని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం వ్యవహరించి ఉంటే ఇలాంటి విపత్తు సంభవించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యం వల్లే జలప్రళయం చోటుచేసుకుందని నీటిపారుదలరంగ నిపుణులు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విపత్తు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆగస్టు 30, 31 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆగస్టు 28నే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి కృష్ణా నది భారీ వరదతో పోటెత్తింది. దీనికి తెలంగాణ, మన రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ, మున్నేరు, కట్టలేరు, పాలేరు తదితర వాగుల వరద కూడా తోడవడంతో ఆగస్టు 31 కృష్ణా మహోగ్రరూపం దాలి్చంది. అదే సమయంలో మరోవైపు బుడమేరు ఉప్పొంగింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తామని ప్రభుత్వానికి జలవనరుల శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.దీన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ధ్రువీకరించారు కూడా. వరద వస్తుందని ముందే తెలిసినా.. ప్రోటోకాల్ ప్రకారం లోతట్టు ప్రాంతాలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస శిబిరాలకు ఎందుకు తరలించలేదు? అన్నది అంతుచిక్కడం లేదు. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే విపత్తు సంభవించిందని, అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నాన్న ఎక్కడికి వెళ్లాడమ్మా? ఎప్పుడు వస్తాడమ్మా? చెప్పమ్మా?’ అంటూ చిన్నారులు తల్లడిల్లిపోతుండగా.. భర్త ఏమయ్యాడో.. ఎక్కడ ఉన్నాడో.. పిల్లలకు ఏం జవాబు చెప్పాలో తెలియని స్థితిలో విజయవాడ ఊరి్మళానగర్‌కు చెందిన పాయల నందిని ఆందోళన చెందుతోంది. వరద వచ్చినప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియక కన్నీరుమున్నీరవుతోంది. ఊర్మిళానగర్‌లోని రెడ్డి కాలనీకి చెందిన పాయల శేఖర్, నందిని దంపతులకు పిల్లలు మధుప్రియ(4), చైత్రిక (2) ఉన్నారు. శేఖర్ తాపీమేస్త్రీగా పనిచేస్తుంటాడు. ఆదివారం ఉదయం బుడమేరు వరద పెరుగుతుందని తెలియడంతో శేఖర్ తన భార్య, ఇద్దరు పిల్లలను సమీపంలోని తన చెల్లెలి ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు.తన వద్ద పనిచేసే వారి సాయంతో ఇంట్లోని వస్తువులను బయటకు చేర్చాడు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో వెంటనే భవానీపురం పోలీస్ కాలనీలో తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో చెల్లెలికి ఫోన్ చేసి.. ‘వరద ఎక్కువగా ఉంది. నాకు కొంచెం భయంగా ఉంది. వరద తగ్గాక వస్తా’ అని చెప్పాడు. చెల్లెలి భర్తకు ఫోన్ చేసి.. తన కాలికి గాజు పెంకులు గుచ్చుకున్నాయని వాపోయాడు.ఆ తర్వాత శేఖర్ ఫోన్ స్విచాఫ్ అయ్యింది. అప్పటి నుంచి శేఖర్ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య నందిని, పిల్లలు రోదిస్తున్నారు. ‘వారం రోజులు గడిచిపోయింది. నగరంలోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. ప్రభుత్వాసుపత్రి మార్చురీకి రోజూ వెళ్తున్నాం. ఎక్కడ గుర్తు తెలియని శవం ఉందని చెబితే అక్కడి వెళ్లి చూసి వస్తున్నాం. మా అన్న అసలు ఉన్నాడో.. లేడో అని ఆందోళనగా ఉంది’ అంటూ శేఖర్ చెల్లెలు భారతి కన్నీరుమున్నీరయ్యింది. -
జగన్ హయాంలోనే బుడమేరు ఆధునికీకరణ పనులు
సాక్షి, అమరావతి: వరద నియంత్రణతోపాటు సహాయక చర్యల్లోనూ ఘోరంగా విఫలమైన సీఎం చంద్రబాబు.. ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేందుకు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తున్నారు. బుడమేరు డైవర్షన్ చానల్ (బీడీసీ) ఆధునికీకరణ పనులను 2014–19 మధ్య వేగవంతం చేస్తే.. వాటిని రద్దు చేయడం వల్లే ఇప్పుడు గండ్లు పడ్డాయంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ ఉన్నచోట మినహా బీడీసీ మట్టి తవ్వకం పనులను 2024 మార్చి నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. యాక్టివ్ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేస్తూ 2021 జనవరి 6న జారీ చేసిన ఉత్తర్వులపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించి.. ఆ ఉత్తర్వులు అమలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. రాధాకృష్ణ అడ్డుపడకపోయి ఉంటే 2024 మార్చి నాటికే బీడీసీ ఆధునికీకరణ పనులు మొత్తం పూర్తయ్యేవని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ హయాంలోనే పనులకు శ్రీకారం కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం జమ్ములవోలు దుర్గం కొండల్లో పుట్టే బుడమేరు 130 కి.మీ. దూరం ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. బుడమేరుకు గరిష్టంగా 24,500 క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. విజయవాడకు ముంపు ముప్పును తప్పించేందుకు వెలగలేరు వద్ద రెగ్యులేటర్‌ను నిరి్మంచి.. అక్కడి నుంచి 7,500 క్యూసెక్కులను కృష్ణా నదిలో కలిపేలా 11.9 కి.మీ. పొడవున బీడీసీని 1957లో తవ్వారు. వెలగలేరు రెగ్యులేటర్‌కు 11 గేట్లను ఏర్పాటుచేసి.. దిగువకు 17,500 క్యూసెక్కులు వదిలేలా బుడమేరును అభివృద్ధి చేశారు.1990లో బీడీసీ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచుతూ పనులు చేపట్టారు. వెలగలేరు రెగ్యులేటర్ ఎగువన పోలవరం కుడి కాలువ ద్వారా 11,255 క్యూసెక్కులను కలపాలని 2005లో నిర్ణయం తీసుకున్న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులు (బుడమేరు 24,500, పోలవరం కుడి కాలువ 11,255, ఎన్టీటీపీఎస్ 1,800 క్యూసెక్కులు) పెంచే పనులను 2008లో రూ.241.45 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనుల కారణంగా బీడీసీపై 10.375 కి.మీ. వద్ద ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్‌ను తొలగించాలి. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు 2009 ఆగస్టు 29న ఆ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని ప్రభుత్వం రద్దు చేసింది. వేగంగా లైనింగ్ పనులు బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో భాగంగా ఐదో రీచ్‌లో అంటే 10.3 నుంచి 11.9 కి.మీ. వరకూ చేపట్టిన పనుల్లో రాధాకృష్ణకు చెందిన పవర్ ప్లాంట్ ఉన్న 10.3 కి.మీ. నుంచి 10.475 కి.మీ. వరకూ మినహా మిగతా పనులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే బీడీసీకి రూ.206.79 కోట్లతో లైనింగ్ పనులను కూడా చేపట్టింది. రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌ను తొలగించి.. బీడీసీ ఆధునికీకరణ పనులు పూర్తి చేసేందుకు 2021 జనవరి 6న ప్రభుత్వం నోటీసులు ఇచి్చంది.కానీ.. వాటిపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల (స్టే) చేయాలని హైకోర్టు ఆదేశించడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. బీడీసీ లైనింగ్ పనుల్లో చేసిన పనులకు 2019 మే నాటికి రూ.23.89 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇది వాస్తవం. రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం 2014–19 మధ్య బీడీసీ ఆధునికీకరణ పనులను ఆపేసిన చంద్రబాబు.. ఇప్పుడు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్ఫచారం చేస్తుండటం గమనార్హం. రాధాకృష్ణ కోసం ఆధునికీకరణకు చంద్రబాబు మోకాలడ్డు మహానేత వైఎస్ మరణానంతరం సీఎ కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని తెలుగు–కాంగ్రెస్ ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఎన్వోసీని 2014 జనవరి 25న పునరుద్ధరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన టీడీపీ ప్రభుత్వం బీడీసీ ఆధునికీకరణ పనులను ఆపేసింది. 2019లో అధికారంలోకి వచి్చన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచే పనుల్లో.. ఐదు రీచ్‌లలో 0–2.5 కి.మీ., 2.5 నుంచి 6 కి.మీ., 6.5 నుంచి 8.3 కి.మీ. వరకూ పూర్తి చేసింది. నాలుగో రీచ్‌లో 8.3 నుంచి 10.3 కి.మీ. గానూ ఎన్టీటీపీఎస్ అధికారులు అభ్యంతరం చెప్పిన 8.3 నుంచి 9.375 కి.మీ. మినహా మిగతా పనులు పూర్తి చేసింది. -
వదలని వరద.. తొలగని బురద
(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షిప్రతినిధి): ఊహకందని విలయం..మాటలకందని విషాదం నుంచి ఎనిమిది రోజులైనా విజయవాడ నగరం తేరుకోలేకపోతోంది. బుడమేరు చేసిన వరద గాయం నుంచి మానకపోగా, బురద చేస్తున్న కొత్త గాయాలతో అల్లాడుతోంది. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకూ కంటిమీద కునుకు లేకుండా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్న సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీలతో పాటు వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీ, పాలఫ్యాక్టరీ ఫ్లై ఓవర్ కింద రామరాజ్యనగర్, పంజాసెంటర్, చిట్టినగర్ సొరంగం, కబేళారోడ్డు, సితార సెంటర్, నిజాంగేట్ సెంటర్, వించిపేట, కంసాలిపేటలో వరద తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. బుడమేరు ఉగ్రరూపంగత నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షానికి పరీవాహకప్రాంతం నుంచి బుడమేరుకు భారీగా నీరు వచ్చి చేరింది. మూడు చోట్ల గండి పడింది. వెలగలేరు నుంచి ఆ వరదంతా వచ్చి విజయవాడ నగరాన్ని ఈనెల 1వ తేదీ ఉదయం ముంచెత్తింది. ఆ వరద నీరు ముందుగా ప్రవేశించిన వైఎస్సార్‌కాలనీ, జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతానికి చేరుకున్న తొలిమీడియా ‘సాక్షి’కి అడుగడుగునా బాధితుల కష్టాలు కనిపించాయి. అక్కడ బుడమేరు నేటికీ ఉగ్రరూపంలోనే ఉంది. పూర్తిగా మునిగిపోయిన ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. రాకపోకలు లేక అక్కడి ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. ఎనిమిది రోజులుగా నీటిలోనే ఇళ్లు నానిపోతుండటంతో గోడలు ఏ క్షణాన కూలిపోతాయోనని తప్పనిసరై పై అంతస్తుల్లోనే ఆశ్రయం పొందుతున్న బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.కన్నీరేగాని... మంచి నీరేదిబుడమేరు వరదలకు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన లక్షలాది మందికి తమ భవిష్యత్తు ఏమిటో అర్ధం కావడం లేదు. ముంపు ప్రాంతాల్లో చిధ్రమైన వారి జీవితాలు ఇప్పట్లో కోలుకునేలా లేవు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజల కన్నీరు ఇంకిపోతుందేమోగానీ ఆ అభాగ్యుల కష్టాలు తీరేలా కనిపించడం లేదు. కనీసం బురదైనా తొలగడం లేదు. వన్‌టౌన్ ప్రాంతంలో వరద నీటిలో రోజుల తరబడి మునిగిపోయిన కాలనీలు, వీధులు, రోడ్లు, ఇళ్లు బురద, చెత్తతో నిండిపోయాయి. ఆదివారం ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో వాటిని తొలగించుకునేందుకు బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, కంసాలిపేటలో బురదతో పాటు డ్రెయినేజీ నీటితో పాటు, కాలకృత్యాలు కూడా అదే నీటిలో కలిసిపోవడంతో అదంతా భారీగా దుర్ఘందాన్ని వెదజల్లుతోంది.వరద నీటిలోనే రోజుల తరబడి నరకయాతన అనుభవించిన వారిలో కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే, మరికొందరు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ వీరికి కనీసం తాగేందుకు మంచి నీరు దొరకడం లేదు. వంట సరుకులు, కూరగాయలు తెచ్చుకున్నాగానీ వాడుకునేందుకు నీళ్లు లేక పొయ్యి వెలిగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీరూ మురుగుతో నిండి ఉంటోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధుల భయంతో చాలా మంది ఇళ్లకు తిరిగిరావడం లేదు. దీంతో వారంగా వేలాది ఇళ్లకు తాళాలు వేసే ఉన్నాయి. పూర్తిగా ఇళ్లు కూలిపోయి గూడు కోల్పోయిన వారిలో కొందరు చిట్టినగర్ వద్ద సొరంగంలో తలదాచుకుంటున్నారు. స్ఫూర్తినింపుతున్న ప్రజలువరద వల్ల లక్షలాది మంది ఉపాధి, వ్యాపారాలు లేక రోడ్డున పడ్డారు. వారిలో కొందరు చిరు వ్యాపారులు విషాదం నుంచి తేరుకుంటున్నారు. దుకాణాల్లో పేరుకుపోయిన బురదను తొలగించుకుని, పాడైపోయిన వస్తువులు, సరుకులు బయటపడేసి మళ్లీ కొత్తగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోలుకోలేని కష్టం నుంచి తేరుకుని దుకాణాలను తెరిచి స్ఫూర్తినింపుతున్నారు. వృద్ధులు, చిన్నారులను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సితార సెంటర్, కబేళ రోడ్డు, రామరాజ్య నగర్, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీలు నేటికీ వరద నీరు పూర్తిగా తొలగలేదు.ఇక్కడ పలు వీధులకు ఇప్పటికీ ప్రజల రాకపోకలకు అవకాశం లేదు. అలాంటి చోటికి ప్రభుత్వం నుంచి ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు చేరడం లేదు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ వేలాది వాహనాలు నీళ్లలోనే ఉండిపోయాయి. అవన్నీ పాడైపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వదిలేస్తున్నారు. తరలించేందుకు అవకాశం ఉన్నవాటిని అతి కష్టం మీద మరమ్మతులకు తీసుకువెళుతున్నారు. ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నప్పటికీ అవి నీటిలో మొరాయిస్తున్నాయి.సర్వం కోల్పోయాం ఆదుకోవాలిమేము కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆదివారం ఉదయం బుడమేరు వరద ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కట్టుబట్టలతో బిల్డింగ్‌పైకి పరుగులు పెట్టాం. రెండు రోజుల పాటు ఆహారం, మంచినీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాం. కరెంట్ లేదు. ప్రభుత్వ సహాయక చర్యలు మాదాకా రాలేదు. తెలిసిన వాళ్ల ద్వారా పడవను తెప్పించుకుని ఒడ్డుకు చేరాం. బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నాం. వారం రోజుల తర్వాత ఇంటిలోకి వెళ్లి చూస్తే గృహోపకరణాలన్నీ వరదలో తడిసి పాడైపోయాయి. ఇళ్లంతా బురద పేరుకుపోయింది. సర్వం కోల్పోయి తీవ్రంగా నష్ట పోయాం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి. – రేగాని సామ్రాజ్యం, వాంబేకాలనీ, సింగ్‌నగర్ లంటీర్లు ఉంటే ఈ కష్టాలు ఉండేవి కాదుఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నా. వరదలో ఇల్లు మునిగిపోయింది. ఆటో వరదలో మునిగి పాడైపోయింది. మా దగ్గర చిల్లిగవ్వలేదు. వారం రోజులుగా ఆహారం లేక, మంచినీరు అందక నరకం చూస్తున్నాం. వలంటీర్లు ఉంటే కుటుంబంలో అందరికీ ప్రభుత్వంఅందిస్తున్న సహాయ చర్యలు సక్రమంగా అందేవి. ఇప్పుడు ప్రధాన రోడ్డు వరకే ట్రాక్టర్ వస్తోంది. అక్కడకు వెళితే భోజనం ప్యాకెట్లు, వాటర్ ఇస్తున్నారే తప్ప చిన్న వీధుల్లోకి రావడం లేదు. భోజనం ప్యాకెట్లు తెరిచి చూస్తే వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. – పలిశెట్టి సురేష్, సింగ్‌నగర్ -
బుడమేరు వరదపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: బుడమేరు వరదపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా సంచలన కామెంట్స్ చేశారు. రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం. వరద వస్తుందని మా అధికారులకు ముందే తెలుసు. కానీ, వారిని అక్కడి నుంచి తరలించే చర్యలు తీసుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వరద వస్తుందని మాకు ముందే తెలుసు. కానీ, రెండు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది అసాధ్యమైన ప్రక్రియ. 35వేల క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగా తెలుసు. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే మాకు తెలుసులే అని చెబుతారు. అలాంటి సమస్య బుడమేరు దగ్గర ఎదురైంది. ప్రజలు వెళ్లరు అని మేము వారికి చెప్పలేదు. ఇదే సమయంలో బుడమేరుకు గండ్లు పడుతాయన్న సంగతి మాకు తెలియదు. వదరల తర్వాత 24/7 అప్రమత్తంగానే ఉన్నాం.సింగ్ నగర్ ఇంకా వరద నీటిలోనే ఉంది. బుడమేరు గండ్లను జలవనరుల శాఖ వారు పూడ్చారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్లకు భారీగా గండ్లు పడ్డాయి. తొమ్మిదో తేదీ నుండి మూడు రోజులు నష్టం అంచనాలు వేస్తాం. ఆరోజు ఇంటి యజమాని కచ్చితంగా ఆ ఇంట్లోనే ఉండాలి. వరద వలన చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కానీ, తొమ్మిదో తేదీ నుండి మీరు మీ ఇళ్ల దగ్గరే ఉండాలి’ అని తెలిపారు. -
మాటలకందని మహా విషాదం
మానవ తప్పిదంతో విలయం సృష్టించిన బుడమేరు బెజవాడలో అంతులేని విషాదాన్ని మిగి ల్చింది. ఎవరిని కదిలించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే తమను ముంచేసిందని ఆక్రోశిస్తున్నారు. భారీ వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడంతో ఎన్నో ప్రాణాలు నీట్లో కలిసిపోయాయి. పిల్లలను రక్షించేందుకు వెళ్లిన తండ్రులు... తండ్రులను కాపాడుకొనేందుకు వెళ్లిన పిల్లలు కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయారు. పలు కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోవడంతో అనాధలుగా మారాయి. తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కన్నీటి పర్యంతం అయ్యారు. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. విజయవాడ వరదల్లో ఇప్పటికే 50 మందికి పైగా మృతి చెందారు. మృతుల కుటుంబాల కన్నీటి గాథలు హృదయ విదారకంగా ఉన్నాయి. – సాక్షి నెట్వర్క్ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నాం.. నా భర్త కరుభుక్త పోలినాయుడు (52) ముఠా పనులు చేస్తుంటాడు. మేము న్యూరాజరాజేశ్వరీపేటలో ఉంటున్నాం. మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూలానే శనివారం పనికి వెళ్లిన నా భర్త ఆదివారం తెల్లవారుజామున మాకు ఫోన్ చేసి పని అయిపోయింది..ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. కానీ ఇంతవరకు రాలేదు. నా భర్త తన స్నేహితులతో కలిసి సింగ్‌నగర్ నుంచి న్యూరాజరాజేశ్వరీపేటకు వస్తుండగా బుడమేరు కాలువ వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహాన్ని దాటుదామని ప్రయత్నించాడు. కొంతదూరం ముందుకు వెళ్లాడని..ప్రవాహ తాకిడి అధికం అవ్వడంతో అదుపుతప్పి కిందపడిపోయి కొట్టుకుపోయాడని నా భర్త స్నేహితులు చెబుతున్నారు. ఇందిరానాయక్‌నగర్, దేవినగర్, బుడమేరు వంతెన పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ నా భర్త ఆచూకీ లభించలేదు. అధికారులను ఎంత బతిమాలినా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. – గల్లంతైన పోలినాయుడు భార్య రామలక్ష్మి, న్యూ రాజరాజ్వేరిపేటమమ్మల్ని కాపాడి.. మృతి చెందారు సీఎస్ఐ సంఘ కాపరి రెవ.తగరం శ్యామ్‌బాబు (48) మా నాన్నగారు. గత ఆదివారం నేను,అమ్మ ఇంటిలోనే ఉన్నాం. డాడీ చర్చిలో ప్రార్థన కోసం అని బయటకు వెళ్లారు. ఇంతలో వరద వచ్చి0ది. వెంటనే ఆయన ఇంటికి అతికష్టం మీద వచ్చారు. ఆ రాత్రి అంతా చీకట్లోనే ఉన్నాము. నాకు ఒంట్లో బాగోకపోవడంతో నన్ను, అమ్మను చుట్టుపక్కల వారి సాయంతో మా బంధువలు ఇంటికి చేర్చారు. తాను తరువాత వస్తానని చెప్పారు. కానీ రాలేదు. డాడీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవడంతో చుట్టుపక్కలవారిని అడిగాం. అక్కడ చెట్ల మధ్యలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారని తెలిసింది. అక్కడకు వెళ్లి చూడగా ఆ మృతదేహానికి ఉన్న ఉంగరం, వేసుకున్న టీషర్టు చూసి చనిపోయింది మా డాడీనే అని గుర్తించాం. సెపె్టంబర్ 6న మా డాడీ పుట్టినరోజు.. ఆ రోజు మా చుట్టాలందరిని పిలిచి వేడుకలు చేసుకుందామనుకున్నాం.. కానీ డాడీ చనిపోయారు.. ఇదంతా కలలా ఉంది.. మా కుటుంబానికి మా నాన్నే జీవనాధారం. ఇప్పుడు మేం ఎలా బ్రతకాలి? – దైవ ప్రజ్వల్, శ్యామ్‌బాబు కుమారుడుమూడు రోజులుగా మృతదేహంతోనే..మా అమ్మ గుంజా రమణమ్మ (52) నగర పాలక సంస్థలో శానిటేషన్ కార్మికురాలిగా పనిచేసేది. ప్రమాదంలో కాలు విరగడంతో సరిగా నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో ఆమె స్థానంలో ఆమె కుమార్తె అయిన నన్ను (డేరంగుల బుజ్జి) విధుల్లో చేర్చింది. నాకు ఇద్దరు సోదరులున్నారు. సింగ్‌నగర్ డాబాకొట్లు సెంటర్లో ఉంటున్న నా దగ్గరే మా అమ్మ ఉంటుంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు వరద ముంచెత్తింది. ఇంట్లో ఉన్న నేను, నా పిల్లలు చెక్కను అడ్డుపెట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. అమ్మకు కాలు విరగడంతో నడవలేని స్థితిలో ఉంటూ వరద ముంపులో మునిగిపోయి ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. మూడు రోజులుగా ఒకే చెక్కపై నాతో పాటు నా పిల్లలు అలాగే ఉండిపోయాము. అటుగా వచ్చిన బోట్లు వారిని ఎంత బ్రతిమిలాడినా మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అదే ప్రాంతానికి చెందిన ఒకాయన థర్మోకోల షీట్లతో ఫంటులా తయారు చేసి మమ్మల్ని బయటకు తీసుకువచ్చి అమ్మ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. – మృతురాలు రమణమ్మ కూతురు బుజ్జి చెల్లి పెళ్లి చేద్దామన్నాడు.. ఇంతలోనేమా బావ బీసులు లక్ష్మీరాజు (20). మాది తెలంగాణలోని కరీంనగర్. వైఎస్సార్ కాలనీ సమీపంలోని పాముల కాలువ వద్ద లక్ష్మిరాజు ఫ్లెక్సీ పనులు చేస్తుంటాడు. ఆయన తండ్రి శంకర్ మృతి చెందడంతో...తల్లి నిర్మల, ఇద్దరు చెల్లెళ్లను కరీంనగర్‌లోనే ఉంచి ఇక్కడ మా బావ డబ్బులు సంపాదించి వాళ్లకు పంపుతుండేవాడు. ఇతను పంపే డబ్బులతోనే వారు జీవనం సాగిస్తుంటారు. త్వరలోనే ఒక చెల్లి పెళ్లి కూడా చేయాలని నాతో తరచుగా చెప్పేవాడు. సెప్టెంబర్ 1న పాముల కాలువ వద్ద వరదలో గల్లంతయ్యాడు. అతని ఫోన్ నంబరు కూడా పనిచేయక పోవడంతో మా బావ కుటుంబసభ్యులు నాకు చెప్పారు. మార్చురీలో ఉన్న మృతదేహాల్లో ఒకటి మా బావగా బుధవారం గుర్తించాను. సమాచారాన్ని కరీంగనర్‌లో ఉన్న మా బావ కుటుంబీకులకు చెప్పాను. అక్కడ వారి పరిస్థితి ఏంటో తలుచుకుంటే బాధగా ఉంది.. – శివరామకృష్ణ, లక్ష్మీరాజు బావ, ఇతర సహచరులుఏమయ్యాడో..ఆచూకీ కోసం మేము గాందీనగర్‌లో ఉంటున్నాం. నా భర్త దారా మహే‹Ùబాబు (42) నగరంలోని ఓ ప్రైవేట్ ఇమేజింగ్ సెంటర్లో పనిచేస్తుంటాడు. మాకు ఇద్దరు పిల్లలు. ప్రతి ఆదివారం నా భర్త వాంబేకాలనీలో చర్చికి వెళ్తుంటాడు. ఈ నెల 1న ఉదయం చర్చికి అని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. వాంబేకాలనీ వెళ్లిన తర్వాత చర్చి తెరవలేదని చెప్పడంతో వెనుతిరిగాడు. సింగ్‌నగర్ డాబాకొట్లు సెంటర్‌కు వచ్చేసరికి వరద రావడంతో పెట్రోలు బంకు వద్ద ఆగానని, కొద్దిసేపట్లో ఎలా అయినా వచ్చేస్తానని నాతో చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సింగ్‌నగర్‌లోనే ఆయన బంధువులు ఉండటంతో అక్కడికి వెళ్లి ఉండవచ్చునని అనుకున్నాను. అయితే నా భర్త వాళ్లింటికి రాలేదని నాతో చెప్పారు. నా భర్త ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు. ఏమయ్యాడో అని భయంగా ఉంది. – మహే‹Ùబాబు భార్య శాంతికుమారి, తమ్ముడు మనోజ్ , కుటుంబసభ్యులు తండ్రీ, కొడుకులిద్దరూ జల సమాధి మా అన్న కొల్లిపర వెంకటేశ్వరరావు (65) గుణదల కార్మెల్నగర్ ప్రాంతంలో డైరీ ఫామ్ నిర్వహిస్తుంటాడు. గత ఆదివారం అక్కడికి వెళ్లాడు. ఆయన ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆయన కుమారుడు సాయి సందీప్ (33) కూడా అక్కడికి వెళ్లాడు. సందీప్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉదోగం చేస్తున్నాడు. సందీప్‌కు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. సందీప్ కూడా ఎంతకీ రాకపోవడంతో వదిన నాకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. నేను అక్కడికి వెళ్లి వెతికాను. వరద ఉధృతి పెరుగుతుండటంతో మళ్లీ సోమవారం ఉదయం కార్మెల్నగర్కి వెళ్లి ఇద్దరి కోసం గాలించాను. రోడ్డు పక్కన ఓ మృతదేహం కనిపించగా దగ్గరకు వెళ్లి చూస్తే అది నా అన్నదే. మరునాడు ఉదయం డైరీ సమీపంలోనే సందీప్ మృతదేహం కూడా కనిపించింది. – కొల్లిపర సత్యనారాయణ.. మృతుని బంధువు పెద్ద దిక్కును కోల్పోయాంనా భర్త నల్లూరి శ్రీనివాసరావు(45) అజిత్‌సింగ్‌నగర్‌లోని ఓ హోటల్లో పనిచేస్తుంటాడు. మేము కంసాలిపేటలోని అద్దె ఇంట్లో ఉంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఇంటర్, కుమార్తె పదో తరగతి చదువుతున్నారు. నా భర్త రెక్కల కష్టంపైనే ఇద్దరి పిల్లల్ని చదివిస్తూ..వృద్ధ్యాప్యంలో ఉన్న అత్తను మా వద్దే ఉంచుకుని బతుకుతున్నాం. ఆదివారం వేకువజామునే నా భర్త హోటల్లో పనిచేసేందుకు వెళ్లి, మధ్యాహ్నం వరకూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. వరద నీరు బాగా ఎక్కువగా ఉందని, తగ్గిన తర్వాత సాయంత్రం ఇంటికి వస్తానని చెప్పాడు. సాయంత్రం ఫోన్ చేయగా సెల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, ప్రభుత్వాస్పత్రికి మృతదేహాలను వెళ్తున్నాయని, అక్కడకు వెళ్లి గుర్తుపట్టమని చెప్పారు. 3 రోజులుగా తిరుగుతున్నాం.. గురువారం తీసుకువచ్చిన మృతదేహాల్లో నా భర్త మృతదేహాన్ని గుర్తించాం. నా భర్తే మా కుటుంబానికి పెద్ద దిక్కు. ఇప్పుడు పిల్లల చదువు, అత్తను ఎవరు చూసుకుంటారు. – నల్లూరి లక్ష్మిపద్మావతి, మృతుని భార్య, కొడుకు, కూతురు, అత్త రెండో కొడుకునూ పోగొట్టుకున్నాం..మాది విజయవాడ రూరల్ మండలం పాతపాడు. మాది పేద కుటుంబం. మాకు ముగ్గురు సంతానం. ఆడపిల్లకు పెళ్లి చేశాం. నేను రాడ్‌బెండింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నా. పెద్దకొడుకు శ్యామ్‌కుమార్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో రోజూవారీ కూలీపై వర్కర్‌గా పనిచేçస్తూ ఐదేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.చిన్న కుమారుడు సతీష్ గతేడాది పదో తరగతి పరీక్షల్లో సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. గత ఆదివారం సాయంత్రం సతీష్ తన ఇద్దరి ఫ్రెండ్స్‌తో కలిసి పాతపాడు–కండ్రిక రహదారిలో వరద చూసేందుకు వెళ్లాడు. అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరిని స్థానికులు కాపాడగా..సతీష్ గల్లంతయ్యాడు. మేం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నెల 3న సన్‌సిటీ లేఅవుట్ ప్రహరీ గోడ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉందన్న విషయం తెలిసింది. అక్కడికి వెళ్లి చూసి ఆ మృతదేహం సతీ‹Ùదేనని గుర్తించాం. ఇప్పుడు మేం ఎవరి కోసం బతకాలి? – జాన్సన్, పరిమళ కుమారి దంపతులు ప్రభుత్వ నిర్లక్ష్యమే.. మమ్మల్ని చిదిమేసింది నా భర్త పేరు పోతల దుర్గారావు (45). మాకు ఇద్దరు కుమారులున్నారు. అంబాపురంలోని రైతు బజారు ఎదురురోడ్డులో ఉంటున్నాం. నా భర్త కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఆరి్థకంగా ఎదుగుతున్నాడు. పెద్ద కొడుకు డిగ్రీ, చిన్న కొడుకు ఇంటర్ చదువుతున్నారు. వరద ప్రవాహంలో మా ఇల్లు పూర్తిగా మునిగింది. మమ్మల్ని రక్షించేందుకు నన్ను, పెద్ద కుమారుడిని తీసుకుని పడవలో వైఎస్సార్ కాలనీలోని ఫ్లైవోవర్ వద్ద దుర్గారావు దింపాడు. చిన్న కుమారుడిని తీసుకువచ్చేందుకు మళ్లీ పడవలో వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నా భర్త, చిన్న కుమారుడు గల్లంతయ్యారు. చిన్న కుమారుడికి ఒక దుంగ దొరకడంతో దాన్ని పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. నా భర్త నీట మునిగి మృత్యువాత పడ్డారు. ముందస్తు సమాచారం లేకపోవడంతోనే మేం వరదలో చిక్కుకున్నాం. ఫలితంగా నా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. – వరలక్ష్మి మృతుని భార్య -
మళ్లీ ముంచారు..
(విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధులు, నెట్వర్క్) : వరద వస్తుందని వారం క్రితం చెప్పలేదు..! రెండో సారి నిన్న కూడా చెప్పలేదు! అసలు ప్రభుత్వం ఉందా? ఆ మాత్రం సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా?.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల ఆక్రందన ఇదీ!! ఆరు రోజులవుతున్నా విజయవాడలో పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉండగా.. గురువారం రాత్రి నుంచి బుడమేర వరద మళ్లీ పోటెత్తడంతో పలు ప్రాంతాలను ముంచెత్తింది. కొన్ని కాలనీల్లో వరద ప్రవాహంతో 6–7 అడుగుల మేర నీళ్లు నిలిచాయి. జక్కంపూడి కాలనీలో వరద నీరు గంట గంటకూ పెరుగుతోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న వరద బాధితులతో అజిత్‌సింగ్‌నగర్ మొదలుకొని పైపుల రోడ్డు వరకు కిక్కిరిసిపోయింది. గత ఆదివారం వరద నీరు చుట్టుముట్టడంతో కేఎల్ పురానికి చెందిన నూలి అయ్యన్న గుప్తా కుటుంబం పీకల్లోతు నీటిలో రెండు రోజులు నరకం చవి చూసింది. మంగళవారం ఎలాగోలా బయట పడి బంధువుల ఇంటికెళ్లి తలదాచుకున్నారు. ముంపు తగ్గిందని చెప్పడంతో గురువారం ధైర్యం చేసి ఇంటికి చేరుకున్నారు. తెల్లారి చూసేసరికి మళ్లీ వరద ఇంటిని ముంచేసింది. చూస్తుండగానే నాలుగుడుగులు నీరొచ్చేసింది. ఏం చేయాలో దిక్కు తోచక మళ్లీ కాలినడకన మూడు కిలోమీటర్లు ముంపు నీటిలోనే నడుచుకుంటూ నందమూరి నగర్ క్రాస్‌కు చేరుకున్నారు. గుప్తా భార్య పద్మావతి వరద ఉధృతిని చూసి తీవ్ర ఆందోళనకు గురైంది. వరద గురించి ప్రభుత్వం కనీస సమాచారం ఇవ్వలేకపోతే ఇంతమంది అధికారులు, పోలీసులు ఉండి ప్రయోజనం ఏమిటని గుప్తా కుటుంబం ఆక్రోశిస్తోంది. మ్యాచిస్ రోడ్డులో ఉండే మురళి కుటుంబం తమ ఇల్లు పూర్తిగా ముంపు నీటిలో చిక్కుకోవడంతో బంధువుల ఇంట్లో తలదాచుకుని తిరిగి వచ్చి శుభ్రం చేసుకుంది. శుక్రవారం తెల్లారి చూసేసరికి మళ్లీ వరద ఇంటిని చుట్టుముట్టేయడంతో వారి ఆవేదన వర్ణనాతీతం. ఆదివారం వరద వచి్చనప్పుడు చెప్పలేదు. ఈరోజు వరద వచ్చినప్పుడూ చెప్పలేదు. పైగా మళ్లీ వరద వచ్చే ప్రశ్నే లేదు..వర్షం పడే చాన్స్ లేదంటూ అధికారులు గంభీరంగా ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ప్రజల్ని చంపేయాలనుకుంటున్నారేమో అర్ధం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం కాక ఇంకేమిటి? ఇందిరా నగర్, నందమూరి నగర్, భరతమాత కాలనీ, పైపుల రోడ్, డాబాకొట్ల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ.. ఇలా సింగ్‌నగర్ ఎగువ ప్రాంతాలలో ఉంటున్న వారంతా ఒకటే అడుగుతున్నారు. మొన్న.. అనుకోకుండా వరద ముంచెత్తిందన్నారు.. ఇప్పుడు మళ్లీ ముంచుకొస్తోంది. ముందుగా ఎందుకు అప్రమత్తం చేయలేదు? పైగా పుకార్లు నమ్మొద్దంటూ జిల్లా కలెక్టర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంటి వద్దే ఉండండి.. ఆహారం, మంచినీళ్లు, నిత్యావసరాలు అందిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. బుడమేరుకు మళ్లీ గండి పడిందని, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తుతుందని ఎందరో చెబుతున్నారు. ఎవరి మాట నమ్మాలి? ప్రభుత్వం వద్ద ఎందుకు సమాచారం లేదు? ఎందుకు అప్రమత్తం చేయలేక పోతున్నారో అర్ధం కావడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాక ఇంకేమిటి? అని నిలదీస్తున్నారు. ప్రభుత్వం మాటలు నమ్మి ఇంటి పట్టునే ఉన్నందుకు ఈ రోజు నరకం చూస్తున్నాం. సింగ్‌నగర్ లోపల ప్రాంతాలకు కనీసం పాల ప్యాకెట్ అందించిన పాపాన పోవడం లేదని వాపోతున్నారు. బయటకు వెళ్లి తిరిగి రాగానే.. స్వల్పంగా తగ్గిందనుకున్న బుడమేర వరద అనూహ్యంగా మళ్లీ పోటెత్తడంతో విజయవాడ ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. గురువారం రాత్రి నుంచి బుడమేరు వరద నీరు విజయవాడలోని పలు ప్రాంతాలను మంచెత్తింది. ఉదయం వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న బాధితులు ఇళ్లు శుభ్రం చేసుకోవడం, నిత్యావసరాలు, ఇతర అవసరాల కోసం బయటకు రావడం ప్రారంభించారు. బయట ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు కూడా తిరిగి ఇళ్లకు వచ్చారు. కానీ మళ్లీ ఒక్కసారిగా ఇళ్లను వరద ముంచెత్తడంతో పరిస్థితి భయానకంగా మారింది. వారం రోజులుగా వరద వీడకపోవడం, ఎలాంటి సాయం అందకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. సింగ్‌నగర్ సమీపంలోని ఇందిరా నాయక్ నగర్ మొత్తం వరద ఉధృతికి వణుకుతోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇళ్ల మధ్య నుంచి బుడమేరు వేగంగా ప్రవహిస్తుండడంతో అపార్టుమెంట్లు, బిల్డింగ్లపైన నిలబడి తమను ఎవరైనా బయటకు తీసుకెళతారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాంతంలోకి ఎన్డీఆర్ఎఫ్ బోట్లు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ప్రాణాపాయం ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు వరదకు ఎదురు వెళ్లాల్సి రావడంతో సమస్యాత్మకంగా ఉంది. కొన్ని బృందాలు అతి కష్టం మీద కొందరిని బయటకు తెస్తున్నాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్న ఇలాంటి లోపలి ప్రాంతాలకు ఆహారం, మంచినీరు కూడా అందకపోవడంతో అల్లాడుతున్నారు. పునరావాస కేంద్రాలేవి? ఎలాగోలా వరద నుంచి బయటపడిన వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వేలాది కుటుంబాలు ఎటు వెళ్లాలో తెలియక దూర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి పయనమవుతున్నాయి. ఆహారం ఇవ్వకపోగా కనీసం పునరావాసం కూడా కల్పించకపోవడం ఏమిటని విపత్తుల నిర్వహణ నిపుణులు నివ్వెరపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నానా కష్టాలు పడుతున్న ఉద్యోగులను ప్రభుత్వం విధుల్లోకి రావాలని ఒత్తిడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సింగ్ నగర్ వడ్డెర కాలనీలో 300 మందికిపైగా పారిశుద్ధ్య కారి్మకులు వరద ముంపులో చిక్కుకోగా వారిని విధుల్లోకి రావాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. తక్షణం విధుల్లోకి రాకుంటే నోటీసులిస్తామని బెదిరిస్తుండడంతో నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఒకవైపు తమ ఇళ్లు మునిగిపోయి సర్వం పోగొట్టుకుని కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో దుస్థితిలో ఉంటే విధులకు రమ్మనడం ఏమిటని కార్మికులు వాపోతున్నారు. కొరవడిన సమన్వయం... సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ మందకొడిగా సాగుతోంది. సరుకుల కోసం రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి తేవాలని లబోదిబోమంటున్నారు. ఆహార పదార్థాలు సకాలంలో అందించకపోవడంతో పాడైపోతున్నాయి. దాతలు అందచేసిన ఆహార పదార్థాల పంపిణీకి ప్రభుత్వం నుంచి పర్యవేక్షణ కరువైంది. కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది నామాత్రంగా ఉండటంతో సహాయ శాఖ చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. చివరకు అన్ని పనులకు సచివాలయ సిబ్బందే దిక్కు అవుతున్నారు. ప్రధానంగా సహాయక చర్యల్లో మున్సిపల్, రెవెన్యూ, పోలీసుశాఖల మధ్య సమన్వయం కొరవడిందని స్పష్టంగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు వెంట తిరగడానికే ఉన్నతాధికారులకు సరిపోతోంది. దీంతో తమ పని చేయలేకపోతున్నామని, ఫలితంగా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. మంచినీళ్లు.. కొవ్వొత్తులకు కటకట జక్కంపూడి కాలనీలో కిలోమీటరు దూరం నడుం లోతు నీటిలో నడిచి వచ్చి న వారికే మంచి నీళ్లు అందుతున్నాయి. వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుండటంతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆరు రోజులుగా కరెంట్ లేకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేస్తున్న అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కోసం క్యూ కడుతున్నారు. భోజనం, మంచినీళ్లు, పాలు ‘ఈ’ బ్లాకు వరకు చేరడంలేదు. కాలనీ మధ్య నుంచి బుడమేరు వేగంగా ప్రవహిస్తుండటంతో దాటేందుకు సాహసించడం లేదు.మేనకోడలి పిల్లలను చూడటానికి వచ్చి వరద బారిన పడ్డాను.. మా మేనకోడలి పిల్లలను చూసేందుకు బావాజీపేట నుంచి శనివారం కండ్రిక వెళ్లా. వారు బలవంతం చేయటంతో అక్కడే ఉండిపోయా. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వరద ప్రారంభమైంది. ఇంటిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం. రెండ్రోజుల పాటు నీరు, ఆహారం లేదు. నేను వాడాల్సిన మందులు కూడా లేకపోవడంతో అవస్థ పడ్డా. బోటుపై బయటకు తీసుకెళ్లాలని ప్రాథేయపడ్డా పట్టించుకోలేదు. వరద కొద్దిగా తగ్గుముఖం పట్టగానే కండ్రిక నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేశా. – ఎం నగేష్, కండ్రిక తాళాలు వేసి వెళ్లిపోతున్నాం.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఆదివారం ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టింది. పీక ల్లోతుకు చేరుకోవటంతో ప్రాణ భయంతో ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్లాం. మా ఇల్లు వీధి చివరిలో ఉండటంతో బిక్కుబిక్కుమంటూ గడిపాం. విద్యుత్ లేక, కనీసం తాగేందుకు నీరు లభించక అవస్థలు పడ్డాం. మూడో రోజు బోరు నీటిని తాగి ప్రాణాలు నిలుపుకొన్నాం. మావైపు వచ్చిన హెలికాప్టర్లు, బోట్లను ఎంత పిలిచినా స్పందించలేదు. వరద మరింత పెరిగే ప్రమాదంతోపాటు మృత దేహాలు, జంతువులు కొట్టుకురావటంతో ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోతున్నాం. ఇప్పటికే మా చుట్టుపక్కల వారు చాలామంది వెళ్లిపోయారు. – జి. నారాయణరెడ్డి, తోటవారి వీధిబాధ్యత లేని ప్రభుత్వం» వరద హెచ్చరికల విషయంలో నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం»మొదటిసారే ముంపు గురించి హెచ్చరించలేదు»మరలా బుడమేరు పొంగుతోందంటే వినిపించుకోలేదు»అవన్నీ వదంతులేనని సాక్షాత్తూ కలెక్టర్ చేత చెప్పించారు» ప్రభుత్వం మాటలు నమ్మి నిండా మునిగిన బాధితులుసాక్షి, అమరావతి: ఉపద్రవం ముంచుకొస్తుంటే పాలకులు మొద్దునిద్రలో ఉండటం వల్లనే విజయవాడలో వరదలకు భారీ నష్టం వాటిల్లిందనడానికి మరో ఉదాహరణ ఇది. శనివారం వరదపై అంచనా తప్పిన ప్రభుత్వం.. వాంబేకాలనీ, వైఎస్సార్ నగర్, రాజీవ్‌నగర్, అజిత్‌సింగ్‌నగర్, ఇందిరానగర్ కాలనీ, పాయకాపురం, శాంతినగర్, గాంధీనగర్, డాబాకొట్లు సెంటర్‌తో పాటు అనేక ప్రాంతాలను ముంచేసింది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం మూటకట్టుకుంది. అయినా బుద్ధి తెచ్చుకోలేదు. బుడమేరుకు పడిన మూడు ప్రధాన గండ్లు పూడ్చడంలో విఫలమవుతున్న యంత్రాంగం, శుక్రవారం నాటికి కూడా అతిపెద్దదైన గండికి అడ్డుకట్ట వేయలేదు. ఈ విషయంపై గురువారం నగరమంతా చర్చ జరిగింది. మళ్లీ వరద పెరుగుతోందని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పోటెత్తాయి. కానీ ప్రభుత్వం దానిని తేలిగ్గా తీసుకుంది. ‘‘బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దు. మళ్లీ వరద వస్తే సమాచారం ఇస్తాం’’ అంటూ సాక్షాత్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన చేత కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేయించింది. స్వయానా కలెక్టర్ చెప్పడంతో ఆ మాటలు నమ్మి బాధితులు చాలామంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేదు. వెళ్లినవారు సైతం ఇళ్లకు తిరిగివచ్చారు. తీరా వచ్చాక వరద నీరు పెరిగిపోవడంతో మళ్లీ ముంపులో చిక్కుకుపోయారు. విజ్ఞత మరచి వరద హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించి చంద్రబాబు సర్కారు చాలా పెద్ద తప్పు చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పింఛన్ కోసం.. నడుం లోతు నీళ్లలోవరద ప్రభావిత ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్ డబ్బుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆగస్టు 31న పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో లబ్ధిదారులను విస్మరించింది. ముంపు ప్రాంతాలైన సింగ్‌నగర్, లూనా సెంటర్, యార్డ్ రోడ్డు, కృష్ణా హోటల్ సెంటర్, వాంబే కాలనీ, న్యూ ఆర్‌ఆర్‌పేట, పాయకాపురం, ప్రశాంతినగర్, సుందరయ్య నగర్, కండ్రిక, రాజీవ్‌నగర్, జక్కంపూడి కాలనీ, అంబాపురం తదితర ప్రాంతాల్లో పింఛన్ డబ్బుల కోసం నడుం లోతు నీళ్లలో మూడు నుంచి ఆరు కిలోమీటర్లు నడవా ల్సిన దుస్థితి నెలకొంది.పింఛన్ కోసం సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు రావాలని ఆదేశించడంతో ఆయా ప్రాంతాల్లో 25 వేల మందికిపైగా పింఛన్‌దారులు వరద నీటిలో నడుచుకుంటూ వెళుతున్న దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వృద్ధులు, దివ్యాంగుల పట్ల కనీస మానవత్వం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. – విజయవాడ స్పోర్ట్స్ -
కొల్లేరును ముంచేసిన బుడమేరు వరద నీరు
-
బుడమేరు ఎఫెక్ట్.. కొల్లేరు కొత్త టెన్షన్
సాక్షి, ఏలూరు: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, బుడమేరు కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు విజయవాడ నగరాన్ని ఉక్కిరిబిక్కిరిచేశాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో చనిపోయారు. మరోవైపు.. తాజాగా బుడమేరు ఉధృతి ఎఫెక్ట్‌తో కొల్లేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లంక గ్రామాలకు ముంపు భయల నెలకొంది.కొల్లేరులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పల్లెల్లోకి నీరు చేరుతోంది. దీంతో, లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మండపల్లి, ఏలూరు, కైకలూరు మండలాల్లో కొల్లేరు వరద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే మండవల్లి మండలంలో నుచ్చుమిల్లి, ఇంగిలిపాకలంక, పెనుమాక లంక, నందిగామలంక, ఉనికిలి, తక్కెళ్లపాడు, మణుగునూరు, కొవ్వాడలంక గ్రామాలను కొల్లేరు వరద చుట్టేసింది. మరోవైపు.. కోమటిలంక సమీపంలో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.ఇక, చిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో, రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరు ప్రస్తుత నీటిమట్టం 3.3 మీటర్లుగా ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 3.5 మీటర్లు దాటితే కొల్లేరులో గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు సమీపవాసులు ఆందోళనకు గురవుతున్నారు. -
AP: భయం గుప్పిట్లో కొల్లేరు
సాక్షి,విజయవాడ: కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది.బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు. మూడో గండిని పూడ్చివేస్తే విజయవాడకు ముంపు ముప్పు తప్పనుందని చెబుతున్నారు. అయితే కొల్లేరుకు వరద పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. -
విజయవాడలో బుడమేరు విలయం..ఈ ఫోటోలు చూడండి