బాబూ.. 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి: పోతిన మహేష్‌ | YSRCP Pothina Mahesh Serious Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బుడమేరు వరద బాబుకు వందల కోట్లు మిగిల్చింది: పోతిన మహేష్‌

Published Mon, Oct 7 2024 2:43 PM | Last Updated on Mon, Oct 7 2024 3:24 PM

YSRCP Pothina Mahesh Serious Comments On Chandrababu Govt

సాక్షి, విజయవాడ: విజయవాడలో బుడమేరు వరద కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు వందల కోట్లు మిగిల్చిందన్నారు వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌. అలాగే, వరద బాధితుల కోసం దేవస్థానాల నుంచి భోజనాలు పెడితే 368 కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు వరదతో విజయవాడ ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలితే.. కూటమి నాయకులకు, చంద్రబాబుకి కోట్ల రూపాయలు మిగిలాయి. చంద్రబాబుకి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరుకు వరద వచ్చింది. చంద్రబాబుకి ఒక పక్క ఫోటో షూట్స్.. మరోపక్క విరాళాల వరద వచ్చింది. బుడమేరు, చంద్రబాబు  మిలకత్ అయ్యారు. బుడమేరు వరద చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చింది.

వరదలో వందల కోట్లు ఖర్చు చేశారంట. పునరావాసం కోసం కోటి 40 లక్షలు ఖర్చు చేశారు. రూ.368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారు. బాధితులకు నష్ట పరిహారం 200 కోట్లు ఇవ్వలేదు. కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారు. వరద బాధితులకు ఆహారం అమ్మవారు ఇచ్చారు, ద్వారక తిరుమల, సింహాద్రి అప్పన్న నుండి వచ్చింది. దేవుడు భోజనాలు పెడితే 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.

రూ.26కోట్లతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని చెప్పారు. ఆరు లక్షల మంది వరదలో ఉంటే కోటిన్నర ఎవరికి ఇచ్చారు. వైఎస్‌ జగన్ కోటి రూపాయలతో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్స్ ఇచ్చారు. గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రూ.52కోట్లు శానిటేషన్ కోసం ఖర్చు చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టాల కోసం 23 కోట్లు ఖర్చు చేశారు. డ్రోన్స్ కోసం రెండు కోట్లు ఖర్చు అయింది. సరిగ్గా 10 మందికి కూడా ఆహారం అందించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డ్రోన్స్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు ఫోటో వదిలారు. దానికి రెండు కోట్లు. 534 కోట్లకు టెండర్ వేశారు. వచ్చిన విరాళాలకు ఖర్చులు చూపించారు. ఎవరికి కాంట్రాక్టు ఇచ్చారో.. ఎంతకీ ఇచ్చారో లెక్కలు బయటపెట్టాలి. నష్ట పరిహారం చెల్లించారా?. నష్ట పరిహారం కోసం ప్రజలు రోడ్డెక్కితే లాఠీ ఛార్జ్ చేశారు.

కలెక్టర్ వద్ద బాధితులు క్యూ కడుతున్నారు. కలెక్టరేట్‌కి రోజుకు వేల మంది వస్తున్నారు. పేదల జీవితాలు చిన్నాభిన్నం అయితే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నష్టపోతే గంటల వ్యవధిలోనే బాధితుల అకౌంట్‌లో డబ్బులు వేసేవారు. వైఎస్‌ జగన్‌పై అక్కసుతో సచివాలయ వ్యవస్థను, వలంటీర్ వ్యవస్థని నీరు కార్చాడు చంద్రబాబు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు కూటమి సర్కార్‌కు ఉన్న వ్యత్యాసం ప్రజలు గమనించాలి.

విజయవాడ ప్రజలు కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయి అంటే చంద్రబాబు చేసిన తప్పిదమే. మళ్ళీ వరద ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ చేయాలి. నష్ట పోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించాలి. బాధితుల తరపున వైస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. వరద బాధితులను పరామర్శించని పవన్.. మత విద్వేషాలను రెచ్చకొడుతున్నాడు. పవన్‌కి ప్రజలే బుద్ధి చెబుతారు. విజయవాడ ముందే మునిగిపోతుందని తెలిసి కూడా సిసోడియా ఎందుకు చెప్పలేదు’ అంటూ ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఉచిత ఇసుక ఎక్కడ?: ఎంపీ విజయసాయిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement