
సాక్షి, విజయవాడ: కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిరూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. చిన్ని పంపించిన లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.
‘‘విజయవాడ ప్రజలు నాకు పది ఏళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. నేను ప్రజలతో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయతీతో ఉంటాను. సీఎంకు రాసిన లేఖలోని ప్రతీ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు. విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి.. నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను’’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుంది. భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, అక్రమాలపై ఆరోపణలు, ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశిస్తాం. కానీ బెదిరింపులు కాదు. నేను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశాను. నేని దేనికోసం నిలబడ్డానో నాకు తెలుసు. నేను భయంతో కాదు.. వాస్తవాలతో స్పందిస్తాను.. రాజీ పడను. సత్యం బెదిరింపులకు భయపడదు.. నేను కూడా భయపడను’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz
— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025