NTR District
-
దందాలో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ ఎంపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ ప్రజాప్రతినిధికి, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ ఎన్నికల ముందు అతి వినయం ప్రదర్శించి, నాయకులను, కార్యకర్తలను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశారని.. ఎన్నికల్లో గెలుపొందాక ఆయన నిజస్వరూపం బయట పడుతోందని.. సొంత పార్టీ నాయకులకే చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జరిగే అక్రమ దందాలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరుగుతోందని వినికిడి. ఎన్నికల సమయంలో తనతో సన్నిహితంగా మెలిగిన నాయకులను సైతం పార్టీ ఆఫీసుకు వెళ్తే ఎందుకు వస్తున్నారని అక్కడి సిబ్బంది ముఖం మీదే అడుగుతుండటంతో.. ఇంతలోనే ఎంత తేడా అని వారు నిట్టూరుస్తున్నారు. ⇒ మైలవరం నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ నేతలకు కాసులు కురిపించే కల్ప వృక్షం. ఎన్నికల ముందు వరకు ఎంపీ, ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే చాలా సఖ్యతగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. తీరా ఎన్నికలయ్యాక వాటాల విషయంలో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ తనకు అన్నింటిలోనూ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. వీటీపీఎస్‌లో బూడిదపై ఇద్దరి మధ్య షేర్ కుదిరినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ఎన్నికల సమయంలో ఖర్చంతా నేనే పెట్టుకున్నానని. నీకేం సంబంధం. మిగతా వాటిలో మీకు వాటా ఇవ్వలేను. నా నియోజకవర్గ సరిహద్దులోకి రావద్దు’ అని ఎమ్మెల్యే కరాఖండిగా చెప్పడంతో వారి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ⇒ నందిగామ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇరువురు నేతలు పైకి బాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ రోజురోజుకు అంతరం పెరుగుతోందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని రెండు ఇసుక రీచ్‌లను ఎంపీ తన కంట్రోల్లో ఉంచుకొని, పెద్ద ఎత్తున ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు చివరకు రైతుబజార్లలో కూరగాయల సరఫరా కాంట్రాక్టుకు సంబంధించి వచ్చే మామూళ్లలో సైతం ఇద్దరికీ తేడాలు వచ్చినట్లు ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ⇒ తిరువూరులో నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఉప్పు, నిప్పు మాదిరి ఉన్నారు. అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక, మద్యం, పేకాట వంటి మామూళ్లకు సంబంధించిన విషయాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే తనను కేర్ చేయకపోవడంతో, ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీనే ఓ వర్గాన్ని రెచ్చగొట్టి, నియోజకవర్గ పెద్దలకు స్థానిక నేతలతో ఫిర్యాదులు చేయిస్తున్నట్లు, అక్కడ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ⇒ జగ్గయ్యపేటలో పాగా వేసేందుకు ఎంపీ ప్రయత్నించారు. అయితే అక్కడ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇసుక క్వారీల విషయంలో కొన్నింటిని తన వాటాగా తీసుకున్నారు. అక్కడ పరిశ్రమలు ఉండటంతో, ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకొనేందుకు ఎంపీ ప్రయతి్నస్తుండటంతో వారి మధ్య వివాదం చెలరేగుతోంది. ⇒ విజయవాడలోని ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, ఎంపీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాము సీనియర్లం అనే భావనలో ఎమ్మెల్యేలు ఉంటే, తన పెత్తనం సాగాల్సిందేనని రీతిలో ఎంపీ వ్యవహరిస్తున్నారు. చినబాబు అండతోనేనా? ఎన్నికల ముందు వరకు ఎంపీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలందరికీ ఆయన చుక్కలు చూపిస్తుండటంతో లోలోన వారి మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయంలో ఎంపీ జోక్యాన్ని వారు సహించలేకపోతున్నారు. కొంత మంది టీడీపీ నేతలైతే చినబాబు అండతోనే ఎంపీ తన ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారనే భావన వ్యక్తం అవుతోంది. -
దండుపాళ్యం ముఠా తరహాలోనే..
ఖమ్మంక్రైం: కర్ణాటకలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తీసిన దండుపాళ్యం సినిమాలో మహిళలు, పురుషులు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడతారు. బాగా డబ్బు ఉన్న ఒంటరి వృద్ధులు, మహిళలను ఎంచుకుని వారిని మహిళలు మాటల్లో పెడుతుండగా పురుషులు లోపలికి దూసుకొచ్చి ఇంట్లో ఉన్న వారిని హతమార్చి బంగారం, డబ్బు దోచుకెళ్తుంటారు. ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందారో ఏమో కానీ నేలకొండపల్లిలో గతనెల 26వ తేదీన వృద్ధ దంపతులు ఎర్ర వెంకటరమణ, కృష్ణకుమారిని ఇదే తరహాలో ఓ ముఠా హతమార్చింది. వీరెవరికీ పరిచయం లేకపోగా ఒకరి నుంచి ఒకరు కలుస్తూ ముఠాగా ఏర్పడి దోపిడీకి పథకం పన్నారు. కానీ దంపతులు ముందు జాగ్రత్తగా ఇంట్లో పెద్దగా నగదు, ఆభరణాలు ఉంచకపోవడంతో ముఠాకు నిరాశ ఎదురైనా ఇద్దరిని హతమార్చగా... బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఫోన్ కాల్‌డేటా ఆధారంగా అరెస్ట్ చేశారు. ఈమేరకు నిందితుల వివరాలను పోలీసు కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం వెల్లడించారు. జీవిత ఖైదు.. పెరోల్‌పై బయటకుఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం ముగూలూరుకు చెందిన షేక్ ఆబిద్ అలియాస్ అబియాద్ అలీ 2011 ఏడాదిలో ఒకరిని హత్య చేసి బంగారం, డబ్బు ఎత్తుకెళ్లాడు. ఈకేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకు వచ్చిన ఆబిద్ మళ్లీ జైలుకు వెళ్లకుండా తిరుగుతున్నాడు. అనంతరం కోదాడలో గది అద్దెకు తీసుకుని సోహైల్‌గా పేరు మార్చుకుని అప్పుడప్పుడు కూలీకి వెళ్తుండేవాడు. ఆయన ఇంటి ఎదురుగా ఉన్న భర్త లేని షేక్ హుస్సేన్‌బీతో పరిచయం పెంచుకోగా అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఆపై చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన చిట్టిప్రోలు సురేష్(గే)తో మరోపేరుతో పరిచయం చేసుకుని ఆయనతోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో ట్యాక్సీ నడిపే జగ్గయ్యపేటకు చెందిన స్నేహితుడు ఫరీద్ అహ్మద్ ద్వారా ఖమ్మంలో అబిద్ గది అద్దెకు తీసుకున్నాడు. కాగా, ఆబిద్తో వివాహేతర సంబంధం సాగిస్తున్న హుస్సేన్‌బీ ద్వారా నేలకొండపల్లి మండలం బుద్దారానికి చెందిన జమాల్‌బీ, ఆమెతో పైనంపల్లికి చెందిన షేక్ షబానా పరిచయమైంది. కాగా, షబానా ప్రస్తుతం అనంతగిరి మండలం తమ్మరబండపాలెంలో ఉంటోంది. ఆమెతో కూడా ఆబిద్ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు.హత్యకు పథకం సిద్ధమైంది ఇలా...ఒకేసారి రూ.లక్షలు సంపాదిస్తే విలాసవంతంగా జీవనం గడపొచ్చని, అందుకు దోపిడీ సరైన మార్గమని షబానాకు ఆబిద్ చెప్పగా ఆమె తన మేనత్త జమాల్బీకి చెబితే ఆమె సైతం అంగీకరించింది. అయితే, ధనవంతులై ఒంటరిగా ఉండే వారి వివరాలు చెప్పాలని కోరగా ఆమె ఆరు నెలల క్రితం నేలకొండపల్లిలోని కొత్తకొత్తూరుకు చెందిన రేషన్ బియ్యం వ్యాపారం చేసే వెంకటరమణ పేరు సూచించింది. వృద్ధుడైన ఆయన భార్యతో ఉంటాడని, దోపిడీ చేయడం సులువని చెప్పింది. అనంతరం కోదాడలో ఉన్న హుస్సేన్‌బీ, గే అయిన సురేష్‌ను పిలిపించి వారినీ ఒప్పించాడు. ఆపై ఖమ్మంలో సెల్‌ఫోన్ సిమ్‌లు విక్రయించే మణికంఠతో పరిచయం పెంచుకుని డబ్బు ఆశ చూపి ఎలాంటి ఆధారాలు లేకుండా 10 సిమ్ కార్డులు, ఇంకో చోట ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. అయితే, ఇంకో వాహనం నంబర్ ప్లేట్ చోరీ చేసి తాను కొన్న వాహనానికి అమర్చాడు. ఇంతలోనే నేలకొండపల్లి లోని వెంకటరమణ ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉండగా సురేష్‌ను పంపించగా ఆయన తన కుటుంబం మూడు నెలల తర్వాత వస్తుందని చెప్పినా వెంకటరమణ అద్దెకు ఇవ్వలేదు. ఆతర్వాత హుస్సేనీబీ, షబానాను పంపగా వారికి ఇల్లు అద్దెకు ఇచ్చాడు. ఆతర్వాత మణికంఠ వద్ద మరో ఐదు సిమ్‌లను తీసుకోగా.. హుస్సేన్‌బీ, షబానాలు వెంకటరమణ, కృష్ణ కుమారితో పరిచయం పెంచుకుని తరచూ వారి ఇంట్లో టీవీ చూస్తూ భోజనం చేసేవారు. వృద్ధ దంపతుల వద్ద భారీగా బంగారం, డబ్బు ఉందనే భావనతో నవంబర్ 25వ తేదీన రాత్రి అబిద్, సురేష్‌లు షబానా, హుస్సేన్‌బీ ఉంటున్న పోర్షన్లోకి ప్రవేశించారు. కానీ ఆరోజు హత్య చేయడం కుదరలేదు. మరుసటి రోజు 26వ తేదీన రాత్రి వెంకటరమణ ఇంట్లోకి వెళ్లిన షబానా, హుస్సేన్‌బీ టీవీ చూస్తూ కృష్ణకుమారితో మాటలు కలిపారు. ఆపై అబీద్, సురేష్ ఇంట్లోకి జొరబడి షబానా, హుస్సేన్‌బీ సహకారంతో కృష్ణకుమారి గొంతు పిసికి హత్య చేశారు. ఆతర్వాత ఆమె ఒంటిపై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అనంతరం ఇంట్లో బంగారు, డబ్బుకోసం వెతుకుతుండగా శబ్దానికి నిద్ర లేచిన వెంకటరమణ పక్క గది నుంచి రావడంతో ఆయననూ హత్య చేశారు. ఇలా చిక్కారు...దంపతుల హత్య కేసును ఛేదించేందుకు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యాన 45 మంది సిబ్బందితో ఐదు బృందాలను నియమించారు. దీంతో వారు అన్ని కోణాల్లో పరిశీలిస్తూ అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారించారు. మృతుడు వెంకటరమణకు ఫోన్ చేసిన వారి నంబర్ల ఆధారంగా 15 సిమ్ల కాల్‌డేటా వెలికితీశారు. దీంతో ఆబిద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈమేరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఎనిమిది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులను సీపీ అభినందించి రివార్డులు ప్రకటించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఇంటి అద్దె కోసం వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని తెలి పారు. ఈసమావేశంలో ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్ఐలు జగదీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.రాత్రంతా అక్కడే..దంపతులను హత్య చేశాక బయటకు వెళ్తే పోలీసులకు పట్టుబడతామని భావించి నిందితులంతా ఇంట్లోనే గడిపారు. డాగ్ స్క్వాడ్‌కు వాసన పసిగట్టకుండా ఇంటి చుట్టూ, మృతదేహాల వద్ద కారం పొడి చల్లాడు. ఇక 27న తెల్లవారుజామున అబీద్ బైక్‌పై హుస్సేన్‌బీ, షబానాను తీసుకెళ్లి ఆటోలో ఖమ్మం పంపించాడు. అనంతరం సురేష్‌కు బంగారంలో కొంత, నగదు కొంత ఇచ్చి కోదాడకు పంపాడు. ఆతర్వాత ఖమ్మం వెళ్లిన అబీద్ పాత బస్టాండ్ వద్ద హుస్సేన్‌బీ, షబానాతొ ఖమ్మంలో తాను ఉండే గదికి వెళ్లాడు. రెండు రోజుల పాటు కూడా వారు నేలకొండపల్లి కి వచ్చివెళ్తూ ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. ఆపై ఉన్న బంగారాన్ని అమ్మితే వాటా ఇస్తానని హైదరాబాద్‌లో ఉన్న స్నేహితుడైన ఫరీద్‌కు చెప్పాడు. దీంతో ఆయన ఖమ్మంలోని స్టోన్‌క్రషర్‌లో పనిచేసే విజయ్‌నగర్‌కాలనీకి చెందిన అనుమోల అనిల్కుమార్ని పరిచయం చేయడంతో ఆయనకు వాటా ఇస్తామని నమ్మబలికి బంగారం అమ్మాలని అప్పగించారు. -
సుప్రీంకోర్టు తీర్పుపై కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఎన్టీఆర్: సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో కొలికపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కులాలకు రిజర్వేషన్లు అందిస్తే.. సుప్రీంకోర్టు మతాలకు ముడిపెట్టడం దారుణం. ఇలాంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినా.. ఎవరిచ్చినా తప్పు అవుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
AP: దారుణం.. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి
సాక్షి,ఎన్టీఆర్జిల్లా: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో సోమవారం(నవంబర్ 11) దారుణం జరిగింది. రెండేళ్ల బాలుడు బాలతోటి ప్రేమ్ కుమార్ తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.దాడి చేసిన తర్వాత కుక్కలు బాలుడిని పొలాల్లోకి లాక్కెళ్లాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో పెనుగంచిప్రోలు గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: రంగరాయలో ర్యాగింగ్ కలకలం -
అంగన్వాడీల సదస్సుకు మంత్రి డుమ్మా!
సాక్షి, విజయవాడ: అంగన్వాడీల రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి డుమ్మా కొట్టారు. మంత్రి, కూటమి ప్రభుత్వ తీరుపై అంగన్వాడీ సదస్సు అసహనం వ్యక్తం చేసింది. ‘‘అంగన్వాడీలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. మా సదస్సుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణిని, అధికారులను ఆహ్వానించాం. సదస్సుకు కనీసం అధికారులు కూడా రాలేదు’’ అని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వస్తున్నామని చెప్పి మొహం చాటేశారు.. ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఎవరొచ్చినా రాకపోయినా మా ఉద్యమాలు ఆగవు. డిసెంబర్ 12వ తేదీన అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని బేబి రాణి డిమాండ్ చేశారు.మంత్రి రాకపోతే మాకేమీ నష్టంలేదు.. ఆవిడకే నష్టంగతంలో అంగన్వాడీలను చంద్రబాబు గుర్రాలతో తొక్కించారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు గుర్తు చేశారు. ‘‘2014-19 మధ్య కూడా చంద్రబాబు అంగన్వాడీలను పట్టించుకోలేదు. ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వస్తానన్నారు. ఆమె రాకపోతే మనకేమీ నష్టంలేదు.. ఆవిడకే నష్టం. ప్రభుత్వాలు ఏవైనా ఉద్యమాల ద్వారానే అంగన్వాడీల సమస్యలు పరిష్కారమవుతాయి. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి. శాసనమండలి సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలపై ప్రస్తావిస్తాం. అంగన్వాడీల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చా. 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని నిలదీస్తాం’’ అని లక్ష్మణరావు తేల్చి చెప్పారు.మంచి చేస్తామని చెప్పి.. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మౌనంగా ఉండాలనుకుంటున్నట్లు అనిపిస్తోందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మండిపడ్డారు. ‘‘ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సదస్సుకు రాకపోవడం అలానే అనిపిస్తోంది. అంగన్వాడీల టెంట్ల వద్దకు వచ్చి మద్దతిచ్చిన టీడీపీ.. ఒక్క హామీ ఇవ్వలేదు. మన టెంట్ల వద్దకు వచ్చి మంచి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మనల్ని ఎలా బంధించాలా అని ప్రభుత్వం చూస్తోంది. మీ మౌనానికి.. మీ సంఖ్యా బలానికి అంగన్వాడీలు తలొగ్గరు’’ అని రమాదేవి పేర్కొన్నారు.ఇదీ చదవండి: వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలుఆ హామీలేమైపోయాయి..అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ‘‘నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయాలి. ప్రభుత్వం ప్రకటన చేయకపోతే నవంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తాం. జూలైలో అంగన్వాడీలను చర్చకు పిలవాలని మినిట్స్ లో రాసుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలయ్యింది...ఇంతవరకూ ఎలాంటి చర్చలకు పిలవలేదు. అంగన్వాడీల సమ్మె టెంటుల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలేమైపోయాయి’’ అంటూ ఆమె ప్రశ్నించారు.‘‘టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంగన్వాడీలకు గ్యాడ్యువిటీ హామీని నెరవేర్చాలి. అంగన్వాడీల సమస్యలను. పరిష్కరించకపోతే డిసెంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి.. మేం ఏ పెన్షనూ అడగం. మా ప్రభుత్వం ఇప్పుడే వచ్చిందంటున్నారు. చనిపోయిన అంగన్వాడీలకు మట్టి ఖర్చులకు జీవో ఇవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది. అంగన్వాడీలకు కూడా దీపం పథకం అమలు చేయాలి. అంగన్వాడీలకు పెన్షన్ పంపిణీ డ్యూటీలు రద్దు చేయాలి‘‘ అని సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. -
వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం వీరప్పన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దొంగకోళ్లు పట్టేవాడికి, టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌కు తేడా లేదని.. మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణ ప్రసాద్‌ను మైలవరం వీరప్పన్‌గా అభివర్ణించారు. మైలవరంలో బ్రాందీ షాపులు పెట్టుకున్నా వసంత కృష్ణప్రసాద్‌కు కమీషన్లు ఇవ్వాలి’’ అంటూ దుయ్యబట్టారు.‘‘గతంలో కృష్ణప్రసాద్ ఏడుస్తున్నాడనే నేను మైలవరానికి ఏనాడూ రాలేదు. వసంత కృష్ణప్రసాద్‌కు మీడియా సమక్షంలో నాతో చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ జోగి రమేష్ సవాల్ విసిరారు. ‘‘పర్వతనేని ఇంటి ముందు సీటు కోసం అబ్బా కొడుకులు తిట్టుకుని, కొట్టుకున్నారు. ఎన్ని పుస్తకాలు రాసినా మీ చరిత్రకి సరిపోవు. సిగ్గుమాలిన, సంస్కారం లేని కుటుంబం మీది. వసంత కృష్ణప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతాం’’ అని జోగి రమేష్ హెచ్చరించారు.జగన్, జోగి రమేష్ ఫోటోలు చూస్తే భయమా? బ్యానర్లు తీసేయమని అధికారులకు చెబుతున్నారు. నేను మా పార్టీ అధ్యక్షుడిని ఒప్పిస్తా.. నువ్వు కూటమికి రాజీనామా చెయ్యి. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా మైలవరంలో పోటీచేద్దాం... సిద్ధమా?. రాబోయే ఎన్నికల్లో మైలవరం నుంచి వైఎస్సార్సీపీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 2027 తర్వాత కృష్ణ ప్రసాద్ చాప, దిండు సర్దుకుని వెళ్లిపోతాడు’’ అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
వారిని వదిలిపెట్టను.. జోగి రమేష్ వార్నింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేసులకు భయపడను.. నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇబ్రహీంపట్నం గడ్డమీదే ఉన్నా.. నా మీదకు రాకుండా.. నా కుమారుడిపై కేసు పెట్టారు. ఈ రోజుతో అయిపోదని గుర్తు పెట్టుకోండి’’ మాజీ మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. బుధవారం.. మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరమని గుర్తుంచుకోండి. నా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టనని తేల్చి చెప్పారు.మంచి మనసున్న నేత వైఎస్ జగన్. ఆయన చెప్పాడనే 2019లో నేను మైలవరం నుంచి పక్కకు వెళ్లా.. ఈ క్యాండెట్ చివరి వరకూ ఉండడని జగనన్నతో ఆరోజే నేను చెప్పా.. ఆయనను నమ్మించి మోసం చేసి ఎన్నికల ముందు గోడ దూకేశాడు. రావాల్సిన బిల్లులన్నీ రాగానే పార్టీ మారిపోయాడు’’ అంటూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్ మండిపడ్డారు.‘‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు. మా మోచేతి నీళ్లు తాగి.. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే కారు కూతలు కూస్తున్నాడు. ఇక పై జగనన్న గురించి మాట్లాడితే తాటతీస్తాం. కేసులకు మేం భయపడం.. మా వాళ్లజోలికి వస్తే చూస్తూ ఊరుకోం’’ అని జోగి రమేష్ చెప్పారు.‘‘జనవరిలో మైలవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించుకుందాం. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. ఈ రోజు ఓడిపోయాం.. కానీ మళ్లీ వైఎస్ జగన్‌ని సీఎంగా చేసుకుందాం. ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వచ్చింది. 2027లో ఎన్నికలు రాబోతున్నాయ్.. మళ్లీ గెలిచేది మనమే’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
మరింత బలోపేతం చేద్దాం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని.. ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తల ఆలోచనలకు దగ్గరగా మన పనితీరు ఉండాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సూచించారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుందామన్నారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించారు.అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలతో బిహార్‌లా మారుస్తున్నారని.. సూపర్‌సిక్స్‌కు బొందపెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేసుకోవాలని.. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశముందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మన మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులు టీడీపీ పల్లకీ మోస్తున్నారు : పేర్ని నానిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను ఓడిస్తే తమకు మంచి జరుగుతుందని జనసేన కార్యకర్తలు భ్రమపడ్డారని.. కానీ, ఇప్పుడేమో వారు టీడీపీ పల్లకీలు మోస్తున్నారని ఎద్దేవా చేశారు. మానసికంగా వారంతా చచ్చి బతుకుతున్నారని, వాళ్ల పరిస్థితి పగోడికి కూడా రాకూడదన్నారు. వైఎస్సార్సీపీకి ఆధారం, మూలం, బలం కార్యకర్తలేనన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రజలను మోసంచేశారని ఆరోపించారు.వాళ్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని.. కేసులు పెట్టారని, రోడ్ల మీద కొట్టి దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. ఇలా ఓవరాక్షన్ చేసిన వారెవరినీ వదిలిపెట్టబోమని, వాళ్లని పరిగెత్తించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అధికార మదంతో వైఎస్సార్సీపీని అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. ఇక మూడు పార్టీలు కాదు.. 30 పార్టీలు కలిసొచ్చినా వైఎస్సార్సీపీకి ఏమీకాదని, తాము తగ్గేదేలేదని పేర్ని నాని స్పష్టంచేశారు. ఎవరూ అధైర్యపడొద్దని.. తాము అండగా ఉంటామని పార్టీ శ్రేణులకు పేర్ని భరోసా ఇచ్చారు.ప్రజలకు కష్టమొస్తే జగన్‌ను తలుచుకుంటున్నారు : అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తలుచుకుంటున్నారని.. ఆయన ఉంటే ఇలా జరిగేది కాదని గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయడమే అందుకు కారణమన్నారు. టీడీపీ సోషల్ మీడియా, వారి అనుకూల మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని.. మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
‘కూటమి’ కనుసన్నల్లో.. పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు సర్కార్ అండదండలతో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మున్నేరు నుంచి లారీల్లో ఇసుక తరలిపోతోంది. జేసీబీలతో ఇసుకను తోడేస్తున్నారు. అనుమతులు లేని ప్రదేశంలో ఇసుక అక్రమ తవ్వకాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.అక్రమ తవ్వకాలను పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు రైతులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు జరిగితే మున్నేరులో కోత ఏర్పడి తమ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల మంచినీటి స్కీం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.మరోవైపు, నిషేధిత యనమలకుదురు ఇసుక క్వారీలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. టీడీపీ నాయకుల అండదండలతో విజయవాడకు కూతవేటు దూరంలో ఇసుకమాఫియా పేట్రేగిపోతున్నా.. అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తిచూడటం లేదు. ఇసుక మాఫియా ఇక్కడ్నుంచి భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ముచేసుకుంటుండగా, టీడీపీ నేతలు అక్రమార్కులకు సహకరిస్తూ ఇసుకను కాజేస్తుండటం గమనార్హం.పొంచి ఉన్న ప్రమాదంకృష్ణానదిపై కనకదుర్గ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత దశాబ్దకాలం కిందట యనమలకుదురు క్వారీని ప్రభుత్వం నిషేధిత క్వారీగా ప్రకటించింది. అపట్నుంచి ఇక్కడ ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.అయితే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక యనమలకుదురు క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ఇసుక అక్రమ తవ్వకాలతో కనక దుర్గవారధితోపాటు యనమలకుదురు గ్రామానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. -
అర్జీలన్నీ అట్టపెట్టెల్లోకే..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితుల అర్జీల పరంపర శుక్రవారం కూడా అనేక ఇక్కట్ల మద్య కొనసాగింది. కలెక్టరేట్‌కు వేలాదిగా బాధితులు శుక్రవారం కూడా అర్జీలతో చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ వీరెవర్నీ కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. రోజూలాగే మండుటెండలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై, మురుగుకాల్వగట్లపై అవస్థలు పడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకోవడంతో అధికారులు చేసేదిలేక హడావుడిగా బాధితులను లోపలికి అనుమతించారు. అయితే, శుక్రవారం కౌంటర్లలో అర్జీలు తీసుకోబోమని తెగేసి చెప్పారు. అట్టపెట్టెలు ఏర్పాటుచేసి ఎవరికి వారు తమ అర్జీలను అందులో పడేసి వెళ్లిపోవాలన్నారు. మరోవైపు.. అప్పటివరకూ ఎండనపడి వచ్చిన బాధితులు చెట్ల నీడలో సేదతీరుతుండగా పోలీసులొచ్చి వారిని కనికరం లేకుండా తరిమేశారు. తమతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారంతా మండిపడుతూ.. సర్కారుకు శాపనార్ధాలు పెడుతూ వారంతా ఉసూరుమంటూ బయటకొచ్చారు. -
ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. కొలికపూడిపై భగ్గుమన్న మహిళలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చిట్టేల మహిళలు భగ్టుమంటున్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడి సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.కాగా, తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వారం రోజులుగా జరుగుతున్న రగడకు ఫుల్స్టాప్ పెట్టేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దిగుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తలంటి దూకుడు తగ్గించుకోవాలని, నాయకులను కలుపుకొని పోవాలని పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరువూరు మండలంలోని చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యే బహిరంగంగా దూషించడమే కాక గుడ్డలూడదీసి కొడతానంటూ అసభ్య పదజాలంతో తిట్టడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గాలు నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును సైతం నాయకులు కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.ఇంతవరకు నియోజకవర్గంలోని సీనియర్ల ముఖం సైతం చూడని ఎమ్మెల్యే శ్రీనివాసరావు వైఖరిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ‘తిరువూరును రక్షించండి’ నినాదంతో సోమవారం సాయంత్రం పట్టణంలో పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే, అధిష్టానం ఆదేశాలతో విరమించుకున్నారు. దీనికి తోడు ఫేస్బుక్ వేదికగా ‘అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ ఎమ్మెల్యే పోస్టింగ్ పెట్టడంతో టీడీపీ నాయకులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబట్టడం, విలేకరులను ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించడం తదితర ఘటనలతో పార్టీకి, ప్రజలకు ఎమ్మెల్యే దూరమవుతున్నారని గ్రహించిన అధిష్టానం వెంటనే నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. -
Vijayawada: సాయంలోనూ ‘పచ్చ’పాతం
సాక్షి, విజయవాడ: వరద బాధితులకు దాతలు సమకూర్చిన సరుకులను సైతం టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. వరద బాధితులకు అందించే సాయంలోనూ టీడీపీ నేతలు పక్షపాతం ప్రదర్శిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాలను స్వచ్ఛంద సంస్థలు భారీగా అందిస్తున్నాయి.అయితే, స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకులు.. దాతలు ఇస్తున్న సాయాన్ని తామే పంచుతామని నమ్మించి తీసుకుంటున్నారు. ఆ తరువాత వాటిని బాధితులకు ఇవ్వకుండా.. టీడీపీ కార్యకర్తలకు, తమ బంధువులు, స్నేహితులకే ఇచ్చుకుంటున్నారు. స్లిప్పులు ఇచ్చి మరీ టీడీపీ పార్టీ వారికే పంపిణీ చేయడంపై బోండా అనుచరులపై 62వ డివిజన్, హరిహరక్షేత్రం ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. బాధితులను వదిలేసి టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మానని గాయం.. తీరని నష్టంబోండా ఉమా కార్యాలయం వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులపై బోండా ఉమా అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరోసారి తమ కార్యాలయం దగ్గరకు రానివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. బోండా ఉమా, టీడీపీ కార్యకర్తల తీరుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినపుడు మాత్రమే మేం కనిపిస్తామా అంటూ మహిళలు దుమ్మెత్తిపోశారు. ఇంటింటికి తిరిగి ఓట్లడిగిన వాళ్లు ఇప్పుడెందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వరదల సమయంలో మమ్మల్ని గాలికి వదిలేశారు. వరద తగ్గిన తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోరా అంటూ టీడీపీ నేతలపై మహిళలు మండిపడ్డారు. -
Updates: భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు పలు జిల్లాల్లో స్కూల్స్‌కు సెలవు
AP And Telangana Floods News Latest Updates In Teluguపలు జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవు..భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ.రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు. విశాఖలో భారీ వర్షం.. విశాఖపట్నం..ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం.విశాఖ నగరంలో అత్యధికంగా వర్షపాతం.జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు.అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల వర్షాలతో నీట మునిగిన పంటలు.గరిష్ట నీటి మట్టానికి చేరుకున్న పెద్దేరు, కోణం, రైవాడ కళ్యాణపులోవ తాండవ, మేఘాద్రి గడ్డ రిజర్వేయర్లు.ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి.ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు..కృష్ణా..ఉప్పులూరు వద్ద బుడమేరు ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర రావు.కంకిపాడు - గన్నవరం మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలుబుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుందిఅధికారులు అప్రమత్తంగా ఉండాలిఅలసత్వం వహిస్తే సహించేది లేదు.మంతెన, తెన్నేరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత..విజయవాడప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్డేట్..ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4,28,322 క్యూసెక్కులు70 గేట్లు పూర్తిగా ఎత్తివేతవిశాఖపట్నం..గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండ చరియలు.రెండు ఇళ్ళు కూలిపోయే ప్రమాదం.ఇంట్లో వారిని ఖాళీ చేయిస్తున్న అధికారులు. కృష్ణాజిల్లా:గన్నవరం మండలం కేసరపల్లి వద్ద గత రాత్రి బుడమేరు కాలువలో చిక్కుకున్న కారుకారులో ప్రయాణిస్తున్న వ్యక్తి గల్లంతుపెడన మండలం హుస్సేన్ పాలెంకు చెందిన ఫణి కృష్ణగా గుర్తింపుసంఘటనా స్థలానికి చేరుకున్న గుడివాడ ఆర్డీవో పద్మావతిఫణి కృష్ణ కోసం గాలిస్తున్న అధికారులువిజయవాడ వరదల్లో భారీ ప్రాణ నష్టం45 మంది మృత్యువాత45 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వంఒక్క విజయవాడ నగరం, రూరల్ లోనే 25 మంది మృతిఎన్టీఆర్ జిల్లాలో వరదలకు 35.మంది మృతిఇంకా మరణాలు పెరిగే అవకాశం8 రోజులుగా వరద ముంపులోనే ప్రజలుప్రభుత్వం వరదలు సమాచారం ఉన్నా అప్రమత్తం చేయకపోవడం తో సంభవించిన మరణాలువిజయవాడకు బుడమేరు టెన్షన్గన్నవరం-కంకిపాడు రహదారిపైకి బుడమేరు వరదగన్నవరం-కంకిపాడు రోడ్డులో నిలిచిన రాకపోకలుబంగాళాఖాతంలో వాయుగుండంవాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం..ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశంవాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిబారీ వర్షాలు..ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరో రెండు రోజులపాటు కొనసాగనున్న భారీ వర్షాలుతీరం వెంబడి బలమైన ఈదురు గాలులుకొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలుకృష్ణానది వరద ఉధృతికాసేపట్లో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీశ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2.86, ఔట్ ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులునాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.99లక్షల క్యూసెక్కులుపులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.75 ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులుప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులువాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలిలోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థఖమ్మం చేరుకున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కఖమ్మం పట్టణంలోని స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎంప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీసిన భట్టిప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించిన డిప్యూటీ సీఎంమళ్లీ మొదలైన భారీ వర్షాలుఎన్టీఆర్ జిల్లా: నందిగామ నియోజకవర్గవ్యాప్తంగా మళ్లీ మొదలైన భారీ వర్షాలుపొంగిపొర్లుతున్న నందిగామ మున్నేరులోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులువర్షాలు మళ్లీ భారీగా పడటంతో ఆందోళన చెందుతున్న రైతన్నలుబిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో లోతట్టు ప్రాంత ప్రజలుఖమ్మం జిల్లాలో భారీ వర్షంమున్నేరు వాగుకు పొంచిఉన్న వరద ముప్పులోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులుమైక్ల ద్వారా ప్రజలకు పోలీసులు సూచనలుపరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపుఅధికారులను అప్రమత్తం చేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటికలెక్టర్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్న మంత్రులు కోస్తా జిల్లాల్లో కుండపోత వానవిశాఖ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడననేడు వాయుగుండంగా మారే అవకాశంఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్కొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలుమరో రెండు రోజులు కొనసాగనున్న వర్షాలుప్రకాశం బ్యారేజ్‌కు మళ్లీ పెరుగుతున్న వరదఎగువ నుంచి భారీగా కృష్ణానదికి వచ్చి చేరుతున్న వరదనందిగామ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులుభారీ వర్షాల నేపథ్యంలో తిరువూరు, నందిగామ, విజయవాడ రూరల్ మండలాల తహసీల్దార్లను, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజనలోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలుఓ వైపు వరద.. మరోవైపు వర్షాలతో భయపడుతున్న బెజవాడ ప్రజలుబుడమేరు గండ్లు పూడ్చినప్పటికీ భారీ వర్షంతో వరద ముంపు ప్రాంతాల్లో ఆందోళనవిజయవాడలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో బెజవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. 8 రోజులుగా నగర వాసులు వరద కష్టాలు పడుతున్నారు. ఇంకా వరద ముంపులోనే పలు కాలనీలు ఉన్నాయి.ఇదీ చదవండి: సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో తిరువూరులో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఏపీలో నేడు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎనిమిది జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణాకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. -
ఇసుకను మింగేస్తున్నారు..!
సాక్షి నెట్వర్క్: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు వద్ద భారీగా నిల్వ ఉంచిన ఇసుక గుట్ట నుంచి పెద్ద మొత్తంలో ఇసుక మాయమైందనే విమర్శలొస్తున్నాయి. గత ప్రభుత్వం నిల్వ చేసిన కొండలా ఉండే ఇసుక గుట్ట క్రమంగా కరిగిపోయింది. అమ్మింది కొంత.. అమ్ముకున్నది కొంత.. ఎగరేసుకుపోయింది మరికొంత.. అధికారులు చెబుతున్న లెక్కలకు.. కళ్లముందు కనిపిస్తున్న వాస్తవానికి పొంతన కుదరకపోవడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నది.కృష్ణానది, మున్నేరులకు వచ్చే వరదలు, భారీ వర్షాల సమయంలో ఇసుక కొరత రాకూడదనే సదుద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు వద్ద భారీగా ఇసుక నిల్వ చేసింది. గత నెల 9వ తేదీకి ముందు ఇక్కడ జిల్లా మైనింగ్ అధికారులు లెక్కలు వేసి 1,39,000ల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు ఇసుకను కొలతలు వేసి లిఖితపూర్వకంగా రాసి స్థానిక అధికారులకు అప్పగించారు.అనంతరం ఇక్కడ గత నెల 8వ తేదీన ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 44.346 మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది. అధికారుల లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఇంకా 84.654 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండాలి.కానీ వాస్తవంగా ఉన్న ఇసుక సుమారు 20వేల టన్నులు మాత్రమే ఉంటుందని అధికారులు తాజాగా అంచనాకు వచ్చారు. మిగిలిన 64.654 మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైందనేది ప్రశ్నార్థకం. ఇప్పటికే ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో.. ఏమాత్రం తేడా వచ్చినా అందుకు స్థానిక అధికారులదే బాధ్యత అని స్పష్టం చేయడంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు.లెక్క తేలేది ఎలా?మొదట్లో మైనింగ్ అధికారులు రెండు రోజుల పాటు స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుకను కొలతలు వేశారు. అలా మరో మూడు రోజులు లెక్కలు కట్టిన తర్వాతే ఇసుక నిల్వలను ప్రకటించారు. అయితే ఇప్పుడు వారి లెక్కలకు.. ఉన్న ఇసుకకు భారీగా తేడా రావడంతో.. ఇసుక ఏమైందో అర్థంకాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ఎవరినీ బలి తీసుకుంటుందోనన్న ఆందోళనతో స్థానిక అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టీడీపీ నేతతో చేతులు కలిపిన అధికారి?మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ పంచాయతీ అధికారి ఓ అధికారపార్టీ నాయకుడితో చేతులు కలిపి అక్రమార్జనకు పాల్పడ్డాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో లారీకి 20 టన్నుల ఇసుక మాత్రమే తరలించేందుకు ప్రభుత్వం అనుమతులివ్వగా.. ఆ అధికారి కాసులకు కక్కుర్తిపడి అదే లారీకి అదనంగా ఐదు బొచ్చలు ఇసుక అదనంగా నింపుతున్నాడు. ఒక బొచ్చ (2.50 మెట్రిక్ టన్నులు) రూ.700 చొప్పున ఒక లారీకి అదనంగా రూ.3,500 ఆ అధికారికి అందుతున్నాయని సమాచారం. -
విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగుచూసింది. అమ్మవారి అంతరాలయ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై అధికారులు స్పందించారు. రెండురోజుల క్రితం అంతరాలయాన్ని భక్తురాలు వీడియో తీసింది.తాను తీసిన విజువల్స్ సోషల్ మీడియాలో పెట్టడంతో భద్రతాపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ పరువుకు భంగం కలిగించేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు.. ఘటనపై పోలీస్ శాఖకి ఫిర్యాదు చేశారు. -
అంబేద్కర్‌పై ‘పచ్చ’మూకల ఉన్మాదం.. దళిత సంఘాల ఆందోళన
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంబేద్కర్ స్మృతివనం దగ్గర దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ వాదులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. గత రాత్రి జరిగిన దుశ్చర్య అంబేద్కర్ మహనీయుడి పై జరిగిన దాడిగానే చూస్తాం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన దాడేనని.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పరాకాష్టకు టీడీపీ దాడులు: మల్లాది విష్ణుఅంబేద్కర్ విగ్రహంపై దాడిని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ మాన్యుమెంట్‌పై వైఎస్ జగన్ పేరును తొలగించిన ప్రాంతాన్ని నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అంబేద్కర్‌పై దాడి హేయమైన చర్య అన్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: పుష్పశ్రీవాణిపార్వతీపురం మన్యం జిల్లా: డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరాయి. అంబేద్కర్ విగ్రహం పై దాడి చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగ మాత్రం అమల్లో ఉంటుందని అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండదని చెప్పినట్టుగా వీళ్లు తీరు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రూ. 440 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారులు, పోలీసులు సమక్షంలో అంబేద్కర్ విగ్రహం పై దాడి జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది’’ అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు.విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం.గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి.రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. -
కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత,లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070,112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,30,632, ఔట్ ఫ్లో 3,74,309 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.5056 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరదసూర్యాపేట జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,57,779, అవుట్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం: 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 167.94 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ: 31.89 టీఎంసీలుగా కొనసాగుతోంది. -
తూతూమంత్రంగా కాదు.. కఠినంగా వ్యవహరించండి: ఏపీ మహిళా కమిషన్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నూజివీడు బాధిత బాలికను ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి మంగళవారం పరామర్శించారు. నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన నాలుగేళ్ల బాలిక పై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి యత్నించిన సంగతి తెలిసిందే. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. అలాగే.. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందేలా చూస్తామని హామీచ్చారామె.‘‘ఊయలలో వేసిన నెలల బిడ్డను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. తూతూ మంత్రంగా కేసులు పెట్టడం వల్ల నిందితులు నెలరోజుల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. వరకట్న వేధింపులు , అత్యాచారాలు, దాడులు, ఫోక్సో కేసులు పెరిగిపోయాయి. మహిళలు బతకాలంటేనే భయపడిపోతున్నారు‘‘ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు.‘‘ప్రతీ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది. దిశ ద్వారా వచ్చిన కేసుల్లో కూడా త్వరగా శిక్ష పడేలా చేశాం. రమ్య హత్య కేసులో వేగంగా ఛార్జిషీట్ వేయించి.. నిందితుడికి శిక్ష పడేలా చేయగలిగాం. నెల్లూరులో విదేశీ యువతిని వేధించిన కేసులో దిశా యాప్ ద్వారా రక్షించగలిగాం. రాజకీయాలకు అతీతంగా ప్రతీ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది.. .. ఎస్పీలకు యాక్షన్ టేకెన్ కోసం పంపిస్తున్నాము. పోలీసులకు ఏం ఇబ్బందులున్నాయో తెలియడం లేదు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మహిళా కమిషన్ ప్రతీ మహిళకు భద్రత కల్పించేందుకు పనిచేస్తుంది. దిశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించాం‘‘ అని గజ్జల వెంకటలక్ష్మి చెప్పారు. -
ఎన్టీఆర్ జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు..
-
ఎన్టీఆర్ జిల్లాలో పచ్చ గూండాల అరాచకం
-
పచ్చ గూండాల అరాచకం.. అర్ధరాత్రి కర్రలతో దాడి
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్డీఆర్ జిల్లాలో టీడీపీ గుండాలు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడితో సహా మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని జగయ్యపేట ఆసుపత్రికి తరలించారు.కాగా, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని నవాబుపేటలో టీడీపీ గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వైఎస్సార్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు (@ బుల్లబ్బాయ్) సహా మరో ఐదుగురు దాడికి పాల్పడ్డారు. టిఫిన్ చేసేందుకు హోటల్ వద్దకు వెళ్లిన గింజుపల్లి శ్రీనివాసరావుపై ఒక్కసారిగా దాడి చేశారు. వారి వెంట తెచ్చుకున్న కర్రలతో శ్రీనివాసరావును తీవ్రంగా గాయపరిచారు.ఈ ఘటన సందర్భంగా హోటల్ వద్ద ఉన్న పలువురు టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ఆగకుండా కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు. అంతటితో ఆగకుండా శ్రీనివాసరావు కారును కూడా ధ్వంసం చేశారు. అనంతరం, స్థానికులు గాయపడిన వారిని జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావును మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించిన తెలుస్తోంది. అయితే, 2009లో శ్రీనివాసరావు తండ్రి వీరయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు ఉన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా: వేధింపులపై ఎదురుతిరిగారని దాడి చేశారు
ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండలం కంభంపాడులో 10వ తరగతి బాలికలను వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వేధించారు. ఎదురుతిరిగినందుకు బాలికపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజులుగా ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న సమయంలో కొంతమంది యువకులు వెకిలిచేష్టలతో బాలికను వేధిస్తున్నారు. వారు ఎదురుతిరిగినందుకు బాలికలపై దాడి చేశారు. ఇంట్లో వాళ్లకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. యువకుల వేధింపులు తాళలేక బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. యువకులను బాలికల తల్లిదండ్రులు ప్రశ్నించినగా వారిపై కూడా దాడి తెగపడ్డారు. దీంతో ఆ అకతాయి యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ట్యూషన్ వెళ్తున్న విద్యార్థినులపై ఆకతాయిల ఆగడాలు..
-
బండరాళ్ల కింద ముగ్గురు సజీవ సమాధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కంచికచర్ల/జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ శివారులోని ఓ క్వారీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు సోమవారం ఉదయం డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు దొర్లిపడటంతో వాటికింద చిక్కుకుపోయి దుర్మరణం పాలయ్యారు. మృతుల్ని బత్తుల దుర్గారావు (19), సున్నా బీబీనాయక్ (40), బాగేల్ రాందేవ్ (36)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ నాయకుడు చింతల రామ్మోహనరావుకు చెందిన పవన్ గ్రానైట్ మెటల్ వర్క్స్ రాతి క్వారీలో ఒడిశాకు చెందిన బీబీ నాయక్, బాగేల్ రాందేవ్, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బత్తుల దుర్గారావు బ్లాస్టింగ్ చేసిన బండరాళ్లను తొలగించేందుకు కొండపైకి ఎక్కారు.ఒడిశాకు చెందిన కుమారి బోలీ దిగువన ఉన్న బండరాళ్లను పగులకొట్టేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైన ఉన్న రాళ్లను తొలగించే క్రమంలో ఒక్కసారిగా భారీ బండరాళ్లు ముగ్గురిపైనా పడటంతో విగతజీవులుగా పడి ఉన్నారు. బోలీ అనే యువకుడు సురక్షితంగానే ఉన్నాడు. మృతదేహాలను 5 గంటలపాటు శ్రమించి జేసీబీల సాయంతో వెలికితీశారు. క్వారీ యజమాని చింతల రామ్మోహనరావు నిర్లక్ష్యమే కార్మికుల పాటి మృత్యుపాశంగా మారింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఆపకుండా పని చేయించటం ముగ్గురు కార్మికులను మృత్యు ఒడికి చేర్చాయి.ఘటనా స్ధలాన్ని జిల్లా మైనింగ్ ఏడీ వీరాస్వామి, నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ బి.రవికిరణ్, నందిగామ ఆర్డీఓ ఎ.రవీంద్రరావు, నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్, ఇంటెలిజెన్స్ సీఐ యువకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు పీవీఎస్ సుబ్రహ్మణ్యం, హేమలత, తహసీల్దార్ సుస్వాగతం పరిశీలించారు.సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలుప్రమాదం జరిగిన క్వారీలో మైనింగ్ సేఫ్టీ నిబంధనల్ని క్వారీ యజమాని తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా మైనింగ్ చేయడంతోనే అక్కడ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలో ప్రతి 6 మీటర్లకు బెంచ్ ఫార్మేషన్ చేసుకుని ఎప్పటికప్పుడు లూజును తీసివేయాల్సి ఉండగా.. అక్కడ బెంచ్ ఫార్మేషన్ చేయలేదని గుర్తించారు. మైనింగ్ సేఫ్టీకి సంబంధించి క్వారీలో ఓ మేనేజర్‌ను నియమించాల్సి ఉన్నా అలా చేయలేదు.రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో కొండ చరియలు విరగటంతోపాటు, అక్కడ ఉన్న లూజు జారి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా బోల్డర్లను డ్రిల్లింగ్ చేయటమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. కాగా.. క్వారీలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 801 సర్వే నంబరులో 99 లీజులు ఉన్నప్పటికీ ఏ క్వారీ యజమాని నిబంధనలు పాటించటం లేదు. క్వారీ యజమానులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోపాటు, అధికారులు సైతం మామూళ్లు తీసుకొని, నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండాపోయింది.మూడు కుటుంబాల్లో విషాదంమృతుల్లో ఒకరైన బీబీ నాయక్ 15 సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి వలస వచ్చి జి.కొండూరు మండలం చెవుటూరు బాపూజీ కాలనీలో భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. బాగేల్ రాందేవ్ సైతం ఒడిశా నుంచి 20 ఏళ్ల క్రితం వలస వచ్చి భార్య, కుమార్తెతో చెవు టూరు శివారులోని క్వారీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పొట్ట కూటి కోసం క్వారీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రమాదంలో మృతి చెందిన బత్తుల దుర్గారావు చిన్న వయసులోనే మృత్యువాత పడడంతో చెరువు మాధవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.క్వారీ యజమానిపై కేసు నమోదుక్వారీ యజమాని చింతల రామ్మోహనరావుపై కేసు నమోదు చేసినట్టు నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్ తెలిపారు. మృతుడు దుర్గారావు తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.8.50 లక్షల చొప్పున క్వారీ యజమాని అందజేశారు.నా కళ్లెదుటే మరణించారుబీబీ నాయక్, రాందేవ్, దుర్గారావు కొండపైకి వెళ్లి రాళ్లను తొలగించే క్రమంలో పైనుంచి భారీ బండరాళ్లు వారిపై పడ్డాయి. దీంతో రాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. నా కళ్లెదుటే ముగ్గురూ మరణించారు. – కుమారి బోలీ, సహ కార్మికుడుభద్రతా చర్యలు చేపట్టకపోవడమే కారణంసర్వే నంబర్ 801లో రెండు హెక్టార్ల రాతి క్వారీని చింతల రామ్మోహనరావు పదేళ్లపాటు లీజుకు పొందారు. మైనింగ్ ప్లాన్, సేప్టీ మెజర్మెంట్స్ లేకపోవటం, బెంచీలు ఏర్పాటు చేయకపోవటం, సిస్టమాటిక్ మెజర్మెంట్స్ లేకపోవటం వల్లే ప్రమాదం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.– వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్ -
ఎన్టీఆర్ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్..