సాక్షి, విజయవాడ: వినూత్న ఆలోచనకు ఏపీ ఫైబర్ నెట్ శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. కొత్త సినిమా రిలీజ్ రోజునే ఫైబర్ నెట్‌లో తిలకించే అవకాశముంటుందని తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్‌తో కొత్త సినిమా ప్రదర్శన సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకసారి సబ్ స్క్రైబ్ చేసుకుంటే 24 గంటలు కొత్త సినిమా చూసే అవకాశం కల్పించామన్నారు.
— AP Fiber (@FiberAp) May 30, 2023
‘‘ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనేదే మా లక్ష్యం. ఫైబర్ నెట్‌ను కూడా ఒక థియేటర్‌గానే చూడాలి. జూన్ 2న విశాఖలో ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ లాంఛనంగా ప్రారంభిస్తాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, నటీనటుల సమక్షంలో ప్రారంభిస్తాం. 55 వేల కిలోమీటర్ల మేర ఓఎఎఫ్.సీ కేబుల్ వేయాలనేది మా లక్ష్యం. 37 వేల కిలోమీటర్ల ఓఎఫ్.సీ కేబుల్ వేశాం. 7600 పై చిలుకు గ్రామ పంచాయతీలకు చేరువయ్యాం. పాఠశాలలకు నెట్ అందించడంలో ప్రథమ భాగంలో ఉన్నాం. గ్రామసచివాలయాలు, ఆర్బీకేలకు కనెక్టివిటీ కలిగి ఉన్నాం. 5 కంపెనీలతో సెటాప్ బాక్స్ లు తయారు చేయిస్తున్నాం. సెటాప్ బాక్స్ ల కొరతను అధిగమిస్తాం ’’ అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: అలర్ట్: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment